2036 ఒలిపింక్ క్రీడల నిర్వహణకు భారత్ సిద్దం : ప్రధాని మోదీ
posted on Jan 4, 2026 4:24PM

2036 ఒలిపింక్ క్రీడల నిర్వహణకు భారత్ పూర్తిస్థాయిలో సన్నద్దమవుతోందని ప్రధాని మోదీ తెలిపారు. 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ పోటీల ప్రారంభోత్సవంలో ప్రధాని మాట్లాడారు. గత పదేళ్లలో ఫీపా అండర్-17, హాకీ వరల్డ్ కప్ వంటి 20కి పైగా అంతర్జాతీయ ఈవెండ్లను భారత్ విజయవంతంగా నిర్వహించిందని ప్రధాని గుర్తుచేశారు.
భారత్ అభివృద్ధి ప్రయాణాన్ని వాలీబాల్ ఆటతో ప్రధాని మోదీ పోల్చారు. ఏ విజయం అయినా ఒక్కరి వల్ల సాధ్యం కాదని, సమన్వయం, పరస్పర విశ్వాసం, జట్టు సంసిద్ధత ఉంటేనే విజయం సాధ్యమవుతుందని చెప్పారు. ఈ క్రీడలో ప్రతి ఒక్కరికి బాధ్యత, పాత్ర ఉంటుందని, అవన్నీ సమర్థంగా నిర్వర్తించినప్పుడే గెలుపు సాధ్యమవుతుందన్నారు.
జనవరి 4 నుంచి 11 వరకు జరగనున్న ఈ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌లో దేశవ్యాప్తంగా 58 జట్లకు చెందిన వెయ్యికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీలతో వారణాసి నగరం జాతీయ స్థాయి క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రబిందువుగా మారుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.