ప్రణబ్‌ కు 25 బెంజ్‌ కార్లు

రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ప్రణబ్‌ ముఖర్జీ ప్రయాణించిన బెంజికారు గురించి మీకు తెలుసా... ఆయన ఇంతకు ముందుబుల్లెట్‌ప్రూఫ్‌ అంబాసిడర్‌ కారులో తిరిగేవారు. ఇప్పటి ఈ బ్లాక్‌ కారు స్వాన్‌కీ మెర్సిడెస్‌ బెంజ్‌కార్‌ లో మోడల్‌ బ్లాక్‌ యస్‌ పుల్‌మ్యాన్‌ లగ్జరీకారు. దీని ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాల ఆరు కోట్లు. దీని టైరు రేటే మూడు నుండి 5 లక్షల వరకు ఉంటుంది. బెంజ్‌ వేగం గంటకు 300 కి.మీ .ఈ కారు  పెట్రోలు ట్యాంకు కెపాసిటీ 90 లీటర్లు.  దీనిలో ఉన్న సౌకర్యం ఏమంటే ఇది ఎంత స్పీడుగా వెళుతున్నా ఏమాత్రం కుదుపులు వుండకుండా దీనికి స్పెషల్‌ షాక్‌ ఎబ్జార్భర్స్‌  ఉంటాయి. ఈ బెంజ్‌ కారుకి ప్రమాదకరమైన హ్యాండ్‌ గ్రేనేడ్స్‌ని , బాంబు దాడులను తట్టుకునే శక్తి ఉంది. 


 

దీని బాడీని అత్యంత శక్తివంతంగా తయారు చేశారుమరి. దీని బరువు 3 టన్నులు. ఈ కారు కోసం వాడిన స్టీలు పఠిష్టమైనది. ఇది నూనెపోసిన రోడ్లమీద కూడా రయ్యిన దూసుకుపోగలదు. ఈ కారులో సీట్లు ఎదురెదురుగా కూర్చుంటానికి వీలుగా ఉంటాయి. దీనివల్ల ఫారిన్‌ డెలిగేట్స్‌ వచ్చినప్పుడు గాని ముఖ్యవ్యక్తులతో గాని కారులోనే కూర్చుని మీటింగు పెట్టుకునే వీలు ఉంటుంది. దీనిలో టివి తోపాటు అత్యాధునిక టెక్నాలజీ అంతా దానిలో  ఉంటుంది. ఎసి మామూలే.కారుకు అమర్చిన స్పెషల్‌ గ్లాసువల్ల సౌండు ఫ్రూఫ్‌గా పనిచేస్తుంది. కాబట్టి మొదటిపౌరుడికి ఏకాగ్రతకు భంగం వాటిల్లదు. ఇలాంటి కార్లు సుమారు 25 కార్లు ఇండియన్‌ ప్రెసిడెంట్‌ కి ఎల్లప్పుడు అందుబాటులో వుంటాయి.