ఉమేష్‌ చేతబడి పూజలు నిజమేనా ?

రాష్ట్రంలో మంత్రుల అక్రమాస్తులు, ఐఏఎస్‌ల అధికారదుర్వినియోగం, ఐపియస్‌ల పదవీ కాంక్ష, గాలిబెయిలు కేసపులో న్యాయమూర్తులు కటకటాలు ఇందంతా చూస్తుంటే ఏ మైంది ఈ రాష్ట్రానికి అనిపించక మానదు. సగటు మానవుడు పట్టించుకోనట్టు ఒక వేళ పట్టించుకున్నా చేసేదిఏమీ లెదన్నట్లూ నిట్టురుస్తూ బ్రతుకు బండిని లాగటానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. అవినీతి మంత్రులకు, అధికారులకు న్యాయ సహాయం చేసే రాష్ట్రముఖ్యమంత్రి ప్రజలకు మాత్రం నడ్డివిరిచే  పన్నులు విధించేశారు.


 

ఈ అస్తవ్యస్త ప్రభుత్వంలో మరో మచ్చ రాష్ట్రడిజిపికి మరో సీనియర్‌ సస్పెండెడ్‌ పోలీసాఫీసరు ఉమేష్‌కుమార్‌ చేతబడి పూజలు చేయించారని వార్తలు. ఎప్పటికీ తగ్గని రోగంతో డిజిపి దినేష్‌రెడ్డి నాశనం అయిపోవాలని, ఇప్పటికే తిరుగమనంలో ఉన్న మనం ఈ వార్తలతో ఎక్కడికి ప్రయాణిస్తున్నామో తెలియని అంధకారంలోకి నెట్టివేయబడుతున్నాం. ప్రజలకు స్వచ్చమైన పరిపాలన అందించవలసిన అధికారులు, రాజకీయవేత్తలు, మేధోసంపన్నులు అధికార దాహంతో బరితెగించి రాష్ట్రానికి దిశా దశాలేకుండా చేస్తున్నారనటానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి. మేధస్సుతో ఉషస్సుని నింపాల్సిన జగతిలో స్వప్రయోజనాలకోసం చదువుకున్న వారుకూడా చదువులేని వారికి తీసిపోని విధంగా దేనికైనా తెగించడం సిగ్గుచేటు.