LATEST NEWS
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరి బంధువులు అయిన వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసుల రెడ్డిల మధ్య విభేదాలు మరో సారి బయటపడ్డాయి. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన శుక్రవారం (ఫిబ్రవరి 27) మీడియాతో మాట్లాడుతూ.. వైవీ సుబ్బారెడ్డి జైలుకెడితే సంతోషించే వారిలో మొదటి వ్యక్తిని తానేనని అన్నారు. వైవీ తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంలో ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదు కానీ, మిగిలిన వ్యవహారాల్లో మాత్రం ఆయన బాగానే సంపాపదించారని పేర్కొన్నారు.  ఒంగోలు నియోజకవర్గం నుంచి తాను ఇంత వరకూ ఏడు సార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలిచానన్నబాలినేని, ఆ ఓడిపోయిన రెండు సందర్భాలలోనూ కూటమి చాలా బలంగా ఉందని గుర్తు చేశారు. 2024 ఎన్నికల తరువాత తాను జనసేనలో చేరానన్నారు.  జనసేనలో ఉన్న తనపై పలు ఆరోపణలు చేయడంతో సీఎం చంద్రబాబును విచారణ జరిపించాలని కోరానన్నారు. అలాగే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో డ్వాక్రా గ్రూపుల్లో నగదు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీలో డ్వాక్రా మహిళల నగదు కాజేసిన వారి పేర్లు బయటపెట్టాలన్నారు. తన కొడుకుపై అసత్య ఆరోపణలు చేసి తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితకు డిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం నిస్సందేహంగా ఆమెకు నైతిక విజయం అని చెప్పవచ్చు. ఈ కేసులో తాను నిరపరాధినని తొలి నుంచీ కవిత చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పు ఆమె మాటలే వాస్తవమని నిరూపించింది. మద్యం కుంభకోణం కేసులో తనకు క్లీన్ చిట్ ఇస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించినందుకు కవిత కృతజ్ణతలు తెలిపారు. కోర్టు తీర్పుపై మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత..   ఈ కేసులో తాను టార్గెట్ అయ్యాన‌న్నారు. తాను రాజ‌కీయ బాధితురాలిన‌ని,  ఎవరిమీదో ఉన్న అక్కసుతో తనపై ఈ కేసు అన్యాయంగా బనాయించి జైలుకు పంపారని కవిత అన్నారు. ఆమె వ్యాఖ్యలు పరోక్షంగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై విమర్శలుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఢిల్లీ మద్యం కేసులో తాను రాజకీయ పావుగా మారానని చెప్పిన ఆమె.. అప్పుడే ఈ కేసు నుంచి తాను పులు కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తాను కొత్త పార్టీ పెట్టడానికి సరిగ్గా నెలల ముందు వచ్చిన ఈ తీర్పు దేవుడి ఆశీర్వాదమని చెప్పారు. ఈ తీర్పుతో మరింత ఉత్సాహంగా ప్రజలలోకి వెడతానని చెప్పారు.  ఈ కేసు విష‌యంలో త‌న‌కు ముందు నుంచి మ‌ద్ద‌తు తెలిపి వారికి ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు. అదే సమయంలో అప్పట్లో ఈ కేసు విషయంలో తనకు బీఆర్ఎస్ నుంచి ఎటువంటి మద్దతూ అందలేదని విమర్శించారు.  త్వరలోనే బీఆర్ఎస్ కు  సంబంధించిన మ‌రిన్ని విష‌యాల‌ను వెల్ల‌డిస్తానన్న కవిత.. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌పై అభాండాలు మోపి.. త‌న‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య చుల‌క‌న చేసిన రాష్ట్ర బీజ‌పీ నాయ‌కులు ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతార‌ని నిలదీశారు.   ఇక కేటీఆర్ పై కూడా కవిత ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మద్యంకేసు కారణంగానే గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ తీర్పు వెలువడిన తరువాత కేటీఆర్ చేసిన ట్వీట్ పై కవిత  అసలు తనపై   కేసు పెట్టిందే పార్టీ కోసమన్నారు.  ఓటమికి నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదన్నారు.   ఉద్యోగాలు, ఇళ్లు ఇవ్వకపోవటం, దోపిడీ దారులకు టికెట్లు ఇవ్వటం, అహంకారం కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న కవిత,  బీఆర్ఎస్ ను ప్రజలే తిరస్కరించారనీ, ఆ విషయాన్ని ఇప్పటికైనా నిజాయితీగా అంగీకరించండని హితవు పలికారు.   
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామం సంభవించింది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ సీఎం పన్నిర్ తెల్వం డీఎంకే గూటికి చేరారు.  గతంలో డీఎంకే ప్రత్యర్థి అన్నాడీఎంకేలో అత్యంత కీలకంగా వ్యవహరించిన పన్నిర్ సెల్వం డీఎంకే గూటికి చేరడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పన్నీర్ సెల్వం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత  నమ్మకస్తుడిగా గుర్తింపు పొందారు.  జయలలిత కోర్టు తీర్పుల కారణంగా సీఎంగా రాజీనామా చేయాల్సి వచ్చిన ప్రతిసారీ తన వారసుడిగా పన్నీర్ సెల్వంను సీఎం కుర్చిలో కూర్జోపెట్టడం రివాజు. అటువంటి పన్నిర్ సెల్వం జయలలిత మరణం తరువాత డీఎంకేలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అటువంటి పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో డీఎంకే తీర్ధం పుచ్చుకున్నారు.  శుక్రవారం (ఫిబ్రవరి 27) ఉదయం డీఎంకే ప్రధాన కార్యలయంలో  తన కుమారుడు రవీంద్రన్‌తో కలిసి డీఎంకే గూటికి చేరారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం డీఎంకేను తల్లిగా అభివర్ణించారు. "అరిగ్నర్ అన్నా, కలైంజ్ఞర్ కరుణానిధి నిర్దేశించిన మార్గంలో పయనిస్తూ స్టాలిన్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని పొగడ్తల వర్షం కురిపించారు.  
ALSO ON TELUGUONE N E W S
సరికొత్త చరిత్రను లిఖించిన తెలుగువన్ 10 బిలియన్ వ్యూస్ తో అత్యంత అరుదైన ఘనత సొంతం భారతదేశపు తొలి యూట్యూబ్ ఛానెళ్లలో ఒకటిగా 'తెలుగువన్' పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ. వైవిధ్యమైన కంటెంట్ తో రెండు దశాబ్దాలుగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్న 'తెలుగువన్', ఇప్పటికే ఎన్నో మైలురాళ్లను అందుకుంది. తాజాగా మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. 1000 కోట్ల వ్యూస్ (10 బిలియన్ వ్యూస్)ను సాధించి, యూట్యూబ్ చరిత్రలో అత్యంత అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. శ్రీ కంఠంనేని రవిశంకర్ గారి మస్తిష్కం నుంచి పుట్టింది 'తెలుగువన్'. ఇంటర్నెట్ గురించి పెద్దగా ఎవరికి సమయంలోనే, భవిష్యత్ అంతా డిజిటల్ యుగమే అని ముందుచూపుతో ఆలోచించి.. డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు కంఠంనేని రవిశంకర్. ఈ క్రమంలోనే వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ ప్రపంచవేదికపై తెలుగువారిని నెం.1 గా నిలపాలనే లక్ష్యంతో 'తెలుగువన్' యూట్యూబ్ ఛానల్ ను స్థాపించారు. ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా గొప్ప సామ్రాజ్యంలా ఎదిగిందీ ఛానల్.  రెండు దశాబ్దాలుగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ, కోట్లాది కుటుంబాలలో భాగమైన 'తెలుగువన్'.. ఇప్పుడు 1000 కోట్ల వ్యూస్ తో సరికొత్త చరిత్రను లిఖించింది.  ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్న సందర్భంగా 'తెలుగువన్' అధినేత కంఠంనేని రవిశంకర్ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ, రెండు దశాబ్దాలుగా తరగని ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులను మరింతగా అలరిస్తూ, మరిన్ని మైలురాళ్ళను అందుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.  
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉస్తాద్ కొత్త పోస్టర్ త్వరలోనే పవర్‌ప్యాక్డ్ గ్లింప్స్‌ 'గబ్బర్ సింగ్' తరువాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustaad Bhagat Singh). తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోస్టర్ లో పవన్ కళ్యాణ్ హ్యాట్ ధరించి స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కొత్త పోస్టర్ తో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ టీమ్, ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ బిగ్ అప్డేట్ ఇచ్చింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పవర్‌ప్యాక్డ్ 40 సెకన్ల గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక వీడియో ద్వారా సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో చూపించడంతో పాటు.. ఇందులోని ఇంటెన్సిటీని, మాస్ ఎలిమెంట్స్‌ను చూపించనున్నారట. ఈ గ్లింప్స్‌ ఫ్యాన్స్ కి ట్రీట్ లా ఉంటుందని మూవీ టీమ్ పేర్కొంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఇప్పటికే ‘దేఖ్ లేంగే సాలా’, ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటలు విడుదలయ్యాయి. త్వరలో మూడో పాట విడుదలయ్యే అవకాశముంది.  'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి రాబోయే గ్లింప్స్‌, థర్డ్ సింగిల్ ఆకట్టుకుంటే.. సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. Also Read: వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ స్టోరీ ఇదే.!
Pan-India superstar Prabhas has teamed up with cult director Sandeep Reddy Vanga for one of the most anticipated films in recent years, Spirit. This collaboration promises a high-octane action spectacle, featuring Prabhas in his first-ever role as a police officer. The makers previously set the tone with a powerful sound teaser and a striking first-look poster of Prabhas that resonated across the country. Continuing the momentum, the team has now unveiled a stunning first look for Vivek Oberoi. The poster features a dark, purple-dominated aesthetic where Oberoi appears as a formidable antagonist. Dressed in a sharp purple suit, smoking a cigar and wielding a sword, his presence is being described as menacing and demonic This reveal sets the stage for an intense face-off between Prabhas’s lawman and Oberoi’s villainous character. The film also stars Triptii Dimri as the leading lady, alongside the introduction of Aishwarya Desai. True to his reputation, Sandeep Reddy Vanga has crafted a visual world filled with intrigue and volatile characters.  This project marks a departure for Prabhas, placing him in a gritty, high-stakes drama unlike anything in his previous filmography. Jointly produced by Bhadrakali Pictures and T-Series, Spirit is scheduled for a grand release in Indian and international markets on March 5, 2027. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  -విష్ణు విన్యాసంతో థియేటర్స్ లో సందడి చేస్తున్న నయన్ సారిక  -ఆ రోల్స్ కే ఇంపార్టెన్స్ -లిప్ లాక్ పై తన అభిప్రాయం ఏంటి!  -తెలుగు వన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఏం చెప్పింది    వెండితెరపై తనదైన ముద్ర వేయడానికి ఈ రోజు 'విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam)చిత్రం థియేటర్స్ లోకి వచ్చేసింది. చిత్ర కథానాయిక నయన్ సారిక(Nayan sarika)మరియు దర్శకుడు యదునాథ్ మారుతీ రావు(Yadunaath maruthi rao)తమ సినీ ప్రయాణం మరియు సినిమా విశేషాలని తెలుగు వన్ తో పంచుకున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం.   ఏడేళ్ల నిరీక్షణ ఒక కొత్త దర్శకుడి కల దర్శకుడు యదునాథ్ మారుతీ రావుకి ఏడేళ్ల సుదీర్ఘ సినిమా ప్రయాణం ఉంది. గతంలో 'డీజే టిల్లు', 'కృష్ణ అండ్ హిజ్ లీలా' వంటి విజయవంతమైన చిత్రాలకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం మారుతీ రావు సొంతం. ఈ కథని హీరో విష్ణు గారికి వినిపించినప్పుడు, ఆయన ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. డెబ్యూ డైరెక్టర్ అని కూడా చూడకుండా మారుతీ రావు పై శ్రీవిష్ణు(Sree Vishnu) నమ్మకం ఉంచాడు. ఊహాజనిత కథే కాకుండా, ఒంగోలులో ఉండే తన స్నేహితుడు నాగరాజు జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా విష్ణు విన్యాసం కథని రూపొందించడం విశేషం.    గ్లామర్ కంటే పెర్ ఫార్మెన్స్ కే మొగ్గు వరుసగా రెండు హిట్స్ అందుకున్న నయన్ సారిక, విష్ణు ఇప్పుడు విష్ణు విన్యాసంలో  'మనీషా' అనే అత్యంత బలమైన క్యారక్టర్ లో కనిపిస్తున్నారు. సాధారణ మధ్యతరగతి బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చిన నయన్, అనుకోకుండా మోడలింగ్ మరియు యాక్టింగ్ వైపు అడుగులు వేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.మూవీలో కేవలం గ్లామర్ క్యారక్టర్ మాత్రమే కాదు. పెర్ఫార్మెన్స్ కి ఎక్కువ స్కోప్ ఉన్న స్ట్రాంగ్ క్యారెక్టర్. ఆ తరహా పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్  క్యారెక్టర్స్ కే ప్రాధాన్యత ఇస్తాను. లిప్ లాక్ సీన్స్ లేదా అతిగా ఎక్స్ పోజింగ్ చేయడానికి నేను చాలా దూరం. విష్ణు విన్యాసంలో కూడా ఒక లిప్ లాక్ సీన్ ఉన్నప్పుడు నిర్మొహమాటంగా నో అని   డైరెక్టర్ కి చెప్పేసాను. గ్లామర్, వల్గారిటీ కి మధ్య ఉండే సన్నని గీతని దాటకూడదనేది నా  స్పష్టమైన అభిప్రాయం. ఒకవేళ నటిని కాకపోయి ఉంటే  లాయర్ అయ్యేదాన్నని నయన్ సారిక చెప్ప్పుకొచ్చింది. Also read: Vishnu Vinyasam: విష్ణు విన్యాసం హైలెట్స్ ఇవే.. ప్రేక్షకులు చెప్తుంది నిజమేనా!  క్లీన్ కామెడీ.. అద్భుతమైన క్లైమాక్స్ ట్విస్ట్'విష్ణు విన్యాసం' కేవలం నవ్వుల కోసమే కాకుండా, ఒక మంచి ఎమోషనల్ రైడ్ లా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతోంది. ముఖ్యంగా ఎక్కడా బూతులు లేని క్లీన్ కామెడీ ఉంటుందని, ఆడియన్స్ అందరూ హాయిగా నవ్వుకుంటూ థియేటర్ నుండి బయటకు వస్తారు. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ప్రేక్షకుల మైండ్ లో రోజులు తరబడి ఉండిపోతుందట.     
దగ్గుబాటి, నందమూరి మల్టీస్టారర్ అదిరిపోయే స్టోరీతో అనిల్ రావిపూడి  వచ్చే సంక్రాంతికి డబుల్ ట్రీట్ 2025 సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం', 2026 సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్‌ గారు'తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. 2027 సంక్రాంతికి హ్యాట్రిక్ కి సిద్ధమవుతున్నాడు. (Anil Ravipudi) అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ మల్టీస్టారర్ కావడం విశేషం. ఇందులో వెంకటేష్(Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటిస్తున్నారు. "మొదటి వందకోట్ల బొమ్మ కొట్టిన హీరో వెంకటేష్ గారితో, మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్ గారితో కలిసి.. 2027 మొదటి పండగకి మీ ముందుకు వస్తున్నాం." అంటూ తాజాగా రావిపూడి తన కొత్త సినిమాని ప్రకటించాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'పటాస్'తోనే అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత వీరి కలయికలో సినిమా రాలేదు. మరోవైపు వెంకటేష్ తో 'ఎఫ్-2', 'ఎఫ్-3', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు చేశాడు. అలాంటిది ఇప్పుడు ఆ ఇద్దరితో కలిసి సినిమా చేస్తున్నట్టు అనిల్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. నిజానికి వెంకటేష్, కార్తీతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అలాంటిది అనూహ్యంగా కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్ట్ లోకి రావడం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ సినిమా స్టోరీ గురించి కూడా ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఇందులో 'బావ-బావమరిది' మధ్య సాగే ఆసక్తికరమైన ప్రయాణాన్ని చూడబోతున్నమాట. బావ-బావమరిది మధ్య ఉండే సరదా కాన్ఫ్లిక్ట్‌లను చాలా ఎంటర్టైనింగ్‌గా చూపించబోతున్నారట. బావగా వెంకటేష్, బావమరిదిగా కళ్యాణ్ రామ్.. వచ్చే సంక్రాంతికి వినోదాల విందుని అందించడం ఖాయమని తెలుస్తోంది. Also Read: అన్‌ప్లగ్‌డ్‌ వెడ్డింగ్ అంటే ఏంటి? విజయ్-రష్మిక ఎందుకలా చేశారు?  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
వేగంగా మారుతున్న  జీవనశైలి,  డిజిటల్ యుగంలో పేరెంటింగ్ పద్ధతులు కూడా మారుతున్నాయి. అలాంటి ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు చాలా చర్చించబడుతోంది. అదే రివర్స్ పేరెంటింగ్. దీనిని చైనా వంటి దేశాల నుండి అమెరికా వరకు తల్లిదండ్రులు ఫాలో అవుతున్నారట. రివర్స్ పేరెంటింగ్ అనే పదం కొత్తగా అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం చాలా కుటుంబాలలో స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు పేరెంటింగ్ నిపుణులు. అసలు రివర్స్ పేరెంటింగ్ అంటే ఏమిటి? దీని వల్ల కుటుంబంలో మంచి జరుగుుతుందా? లేక చెడు జరుగుతుందా? పూర్తీగా తెలుసుకుంటే.. రివర్స్ పేరెంటింగ్ అంటే ఏమిటి? సాధారణంగా పేరెంటింగ్ లో పిల్లలకు తల్లిదండ్రులు మార్గ నిర్దేశకత్వం చేస్తుంటారు. కానీ రివర్స్ పేరెంటింగ్ లో ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేస్తాడు.  పిల్లలు తల్లిదండ్రులకు అన్నీ వివరిస్తారు.  లేదా నిర్ణయం తీసుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. ఇందులో రెండు విధాలు ఉన్నాయట.. ఎమోషనల్ క్యారెక్టర్స్ చేంజ్..  పిల్లవాడు తల్లిదండ్రుల ఎమోషనల్ కేరింగ్ ను తాను తీసుకుంటాడు. ఇది ఎమోషనల్ క్యారెక్టర్స్ చేంజ్ అని పిలవబడుతోంది. డిజిటల్ లేదా లైఫ్ స్టైల్ మార్గదర్శకత్వం..  పిల్లవాడు తల్లిదండ్రులకు టెక్నాలజీ, సోషల్ మీడియా, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మొదలైన వాటి గురించి నేర్పించడం జరుగుతుంది. దీన్ని డిజిటల్ లేదా లైఫ్ స్టైల్ మార్గదర్శకత్వం అని అంటున్నారు. రివర్స్ పేరెంటింగ్ లో.. పిల్లవాడు తల్లిదండ్రుల మధ్య గొడవలను పరిష్కరిస్తాడు.  ఆర్థిక నిర్ణయాలపై  తన సలహా ఇస్తుంటాడు.  డిజిటల్ ప్రపంచం నేటి పిల్లలకు బాగా పరిచయం. కానీ తల్లిదండ్రులకు డిజిటల్ ప్రపంచం పరిచయం ఉండకపోవచ్చు.  అలాంటి వారికి పిల్లలు అర్థమయ్యేలా చెబుతారు. రివర్స్ పెరెంటింగ్ లో పిల్లలు వారి బాధ్యతను సమతుల్యంగా ఉండేలా చూసుకుంటే అది బానే ఉంటుంది. కానీ పిల్లలు తమ బాల్యాన్ని పణంగా పెట్టి రివర్స్ పేరెంటింగ్ లో మాత్రమే నిండిపోతే అది వారికి,  వారి భవిష్యత్తుకు సమస్యగా మారుతుందని పేరెంటింగ్ నిపుణులు చెబుతున్నారు. రివర్స్ పేరెంటింగ్ ప్రయోజనాలు.. బాధ్యత.. పిల్లలు పెద్దల పాత్రను పోషించినప్పుడు లేదా బాధ్యతలను స్వీకరించినప్పుడు వారు త్వరగా పరిణతి చెందుతారు. బలమైన భావోద్వేగ బంధం.. ఒకరి బాధ్యతలను ఒకరు అర్థం చేసుకోవడం వల్ల తల్లిదండ్రులు,  పిల్లల మధ్య అవగాహన పెరుగుతుంది. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం.. పిల్లలు టెక్నాలజీని సులువుగా నేర్చుకుంటారు,  వారి కుటుంబంలో కూడా వాటిని నేర్పడం వల్ల పిల్లలు  తల్లిదండ్రులతో  డిజిటల్‌గా కనెక్ట్ అవ్వగలుగుతారు. ఇది  అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రివర్స్ పేరెంటింగ్ నష్టాలు.. చిన్న వయసులోనే అధిక బాధ్యత పిల్లలలో ఒత్తిడిని పెంచుతుంది. బాల్యం కోల్పోవడం ఆటలాడే వయసులో బాధ్యతలు స్వీకరించడం భావోద్వేగ వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. పాత్ర గందరగోళం బాధ్యత,  హోదాలో మార్పులు కుటుంబంలో అధికారం,  బాధ్యత యొక్క సరిహద్దులను అస్పష్టం చేస్తాయి.                                            *రూపశ్రీ
  పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం కాదు; అది రెండు కుటుంబాల కలయిక, రెండు జీవితాల మేళవింపు. కానీ నేటి కాలంలో సంబంధం చూసేటప్పుడు మనం కేవలం ఆస్తులు, అంతస్తులు లేదా బాహ్య పరిస్థితులకే ప్రాధాన్యత ఇస్తూ, ఆ బంధంలో ఉండే అసలైన ఆప్యాయతను, మానవత్వాన్ని మర్చిపోతున్నామా? ముఖ్యంగా అవతలి కుటుంబంలో ఏదైనా చిన్న సమస్య ఉంటే, దాన్ని పెద్దదిగా చేసి చూస్తూ మంచి సంబంధాలను చేజార్చుకుంటున్నారా? ఈ వెబ్‌సైట్ కంటెంట్ ద్వారా పెళ్లి విషయంలో మన ఆలోచనా దృక్పథం ఎలా ఉండాలో తెలుసుకుందాం. మనం ఎందుకు ఆలోచించాలి?  ఒక కుటుంబంలో శారీరక వికలాంగులు (Physically Challenged) ఉన్నారని లేదా వృద్ధులు ఎక్కువగా ఉన్నారని సంబంధం వదులుకోవడం సరైనదేనా? మనం ఆలోచించాల్సిన కొన్ని ముఖ్య విషయాలు: • బాధ్యత బరువు కాదు, ఒక అందమైన బంధం: ఒక కుటుంబంలో బాధ్యతలు పంచుకోవడంలో ఒక రకమైన తృప్తి ఉంటుంది. అది ఒక "బ్యూటిఫుల్ రెస్పాన్సిబిలిటీ" అవుతుందే కానీ బరువు (Burden) కాదు. బాధ్యతలను బరువు అనుకుంటే, కాళ్ళు చేతులు బాగున్న వారిని చూసుకోవడం కూడా బరువే అవుతుంది. • మానవత్వం ముఖ్యం: మనం కూడా సమాజంలో ఒక భాగమే. ఒక కుటుంబంలో భాగమైనప్పుడు అక్కడి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం మానవత్వానికి నిదర్శనం. • ప్రేమ మాత్రమే ఆశిస్తారు: ఎదుటి కుటుంబం మీ ఆస్తులను లేదా సంపాదనను అడగదు; వారు కేవలం మీ నుంచి కొంచెం ప్రేమను మాత్రమే ఆశిస్తారు. అందరూ కలిసి ఉండటంలోనే అసలైన సంతోషం ఉంది. ఏం చేయకూడదు? (What Not To Do - సంకుచిత ఆలోచనలకు స్వస్తి చెప్పండి) చాలా మంది పెళ్లి విషయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అవి ఏమిటంటే: • ఒక చిన్న కారణంతో సంబంధం వదులుకోవద్దు: కుటుంబంలో ఎవరైనా శారీరక ఇబ్బందులతో ఉన్నారని లేదా తల్లి/తండ్రి లేరని (Single Parent) నిర్దాక్షిణ్యంగా సంబంధం వద్దు అనడం సరికాదు. ఈ "నారో థింకింగ్" (Narrow Thinking) మారాలి. • నెగిటివిటీని పెంచుకోవద్దు: పెళ్లికి ముందే "ఆడబిడ్డ ఉంటే ఇబ్బంది పెడుతుందేమో", "బాధ్యతలన్నీ మా అమ్మాయి మీద పడతాయేమో" అనే భయంతో నెగిటివిటీని పెంచుకోవద్దు. • అతి తక్కువ లేదా అతి ఎక్కువ సమయం: సంబంధం కుదిరిన వెంటనే ఏమీ ఆలోచించకుండా పెళ్లి చేసేయడం (Spot Decisions) ఎంత తప్పో, నెలల తరబడి కమ్యూనికేషన్ గ్యాప్ పెంచుకుంటూ నిర్ణయం తీసుకోకపోవడం కూడా అంతే తప్పు. ఎలాంటి అడుగులు వేయాలి? (How to Proceed - సరైన మార్గం) మంచి సంబంధాన్ని ఎంచుకోవడానికి ఈ క్రింది పద్ధతులను పాటించండి: 1. సరైన సమయం కేటాయించండి (Decent Time): అవతలి కుటుంబం గురించి ఎంక్వైరీ చేసుకోవడానికి, పిల్లలు మాట్లాడుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలి. 2. ఓపెన్ కమ్యూనికేషన్: ఆస్తుల దగ్గర నుంచి కుటుంబ పరిస్థితుల వరకు ప్రతి విషయం గురించి ఓపెన్‌గా మాట్లాడుకోవాలి. 3. కొన్నిసార్లు కలవండి: పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి కనీసం 2 నుండి 4 సార్లు కలుసుకోవాలి. మొదటి మీటింగ్‌లో పర్సనాలిటీ, వైబ్స్ నచ్చితే, రెండోసారి కలవాలని అనిపించడమే ఒక పాజిటివ్ సైన్. 4. పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యం: పెళ్లికి ముందే ఒక మనిషి గురించి 100% తెలుసుకోవడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. పెళ్లి తర్వాత కూడా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రక్రియ (Learning Process) కొనసాగుతూనే ఉంటుంది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: ఒక కుటుంబంలో వికలాంగులు ఉంటే మా అమ్మాయిని ఇవ్వడం ఆ బాధ్యత అంతా ఆమె మీద పడటం కాదా?  జవాబు: ఈ రోజుల్లో ఎవరూ పూర్తిగా ఇతరులపై ఆధారపడటం లేదు. రోజువారీ పనుల కోసం మనుషులను పెట్టుకునే సౌకర్యాలు ఉన్నాయి. ఒక కుటుంబంలో భాగమైనప్పుడు ప్రేమతో బాధ్యతను పంచుకోవడం వల్ల బంధం బలపడుతుంది కానీ అది బరువు అవ్వదు. ప్రశ్న: పెళ్లికి ముందు అబ్బాయి లేదా అమ్మాయి గురించి పూర్తిగా ఎలా తెలుసుకోవాలి?  జవాబు: పెళ్లికి ముందే మనిషి గురించి పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాదు. మనుషులు మెచ్యూరిటీతో మారుతూ ఉంటారు. కొన్ని ప్రాథమిక విషయాలు చర్చించుకుని, కుటుంబం మంచిదని అనిపించినప్పుడు ముందుకు వెళ్లాలి. మిగిలిన విషయాల్లో పెళ్లి తర్వాత సర్దుకుపోవాల్సి ఉంటుంది (Adjust and move on). ప్రశ్న: తల్లి లేదా తండ్రి లేని సంబంధాలను ఎందుకు వద్దు అంటున్నారు?  జవాబు: ఇది కేవలం సంకుచిత ఆలోచన మాత్రమే. అబ్బాయికి లేదా అమ్మాయికి తల్లి/తండ్రి లేనప్పుడు, మీరు ఆ ప్లేస్‌ను భర్తీ చేసే అవకాశం ఉంటుంది. వారి నుంచి ప్రేమను పొందడం, వారికి ప్రేమను ఇవ్వడం వల్ల జీవితం సంతోషంగా ఉంటుంది. జీవితంలో పెళ్లి అనేది ఒక పెద్ద మలుపు. భయంతోనో, సంకుచిత భావాలతోనో కాకుండా, ప్రేమతో మరియు నమ్మకంతో అడుగు వేయండి. బంధాలను బాధ్యతలుగా కాకుండా, వరాలుగా భావించండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు పూర్తి చర్చ కోసం మా యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి: పెళ్లి మరియు సంబంధాల గురించి మరింత లోతైన అవగాహన కోసం "Naveena Column" యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మేము ఇటువంటి ఎన్నో సామాజిక అంశాల మీద చర్చలు జరుపుతాము.Click Here For More Details  NaveenaColumn    
ఏ బంధం అయినా నిలబడటానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందులో భార్యాభర్తల బంధం మరీ సున్నితమైనది. కానీ ఆ బంధాన్ని ఎంత దృఢంగా మార్చుకుంటారు అనేదే ఇక్కడ ముఖ్యం.  భార్యాభర్తల బంధం బలంగా మారడానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్ల ఎలాంటి పరిస్థితిని అయినా సులభంగా దాటవచ్చు. అయితే పరస్పర అవగాహన కోసం  కొన్ని చిట్కాలు పాటించాలి.  అవేంటో తెలుసుకుంటే.. బార్యాభర్తల బంధం.. భార్యాభర్తల మధ్య సంబంధం చాలా విలువైనది. కానీ పరస్పర అవగాహన లేకపోవడం వల్ల, ఆ సంబంధం తెగిపోయే అంచుకు చేరుకుంటుంది. బయట ఎంత మంది వ్యక్తులు ఉన్నా, జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా.. జీవితాంతం కలిసి ఉండేది భార్యాభర్తలే.. కానీ దురదృష్ట వశాత్తు చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా..  ఒకరినొకరు అర్థం చేసుకోకుండా, ఇతరుల కారణంగా గొడవ పడుతూ ఉంటారు.  ఇది బంధాలను దెబ్బతీస్తుంది. పరస్పర  అవగాహన పెరగాలంటే.. భార్యాభర్తలు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా వినాలి,  ఒకరితో ఒకరు విశాల హృదయంతో మాట్లాడుకోవాలి. ఇలా మాట్లాడుకున్నప్పుడే ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది.  అదే బంధం బలంగా మారడానికి సహాయపడుతుంది. భార్యాభర్తల మధ్య ఏదైనా అపార్థం ఉంటే, కూర్చుని దాన్ని పరిష్కరించుకోవాలి.  ప్రతిరోజూ ఒకరికొకరు కొంత సమయం కేటాయించుకోవాలి.  ఇద్దరు ఒకరి సమస్యను ఒకరు చెప్పుకోవాలి.  వాటికి తగిన పరిష్కారాన్ని ఇద్దరూ కలిసి మాట్లాడుకుని నిర్ణయించుకోవాలి.  అప్పుడు ఇద్దరినీ ఎలాంటి సమస్య ఇబ్బంది పెట్టవు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఇద్దరిలో ఎవరైనా తప్పు చేస్తే  క్షమాపణ చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు.  అలాగే భార్యాభర్తలలో ఎవరైనా తప్పు చేసి క్షమాపణ చెప్పినప్పుడు, వారిని క్షమించడం ఎదుటి వ్యక్తి కర్తవ్యం.  అప్పుడే ఇద్దరూ బాగుంటారు.  బంధం బలంగా మారుతుంది.   భార్యాభర్తల బంధానికి నమ్మకం పునాది అయితే.. గౌరవం అంతకు మించి బలమైనది. ఒకరినొకరు నమ్మాలి,  నమ్మకం లేకపోతే ఇద్దరి మధ్య అనుమాన పూరిత ప్రవర్తన మిగులుతుంది.  అంతేకాదు.. బాగస్వామితో నిజాయితీగా ఉండాలి. ఏ విషయాన్ని అయినా చర్చించాలి,  చెప్పుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య బందం బలంగా మారుతుంది.                                      *రూపశ్రీ.           
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరి బంధువులు అయిన వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసుల రెడ్డిల మధ్య విభేదాలు మరో సారి బయటపడ్డాయి. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన శుక్రవారం (ఫిబ్రవరి 27) మీడియాతో మాట్లాడుతూ.. వైవీ సుబ్బారెడ్డి జైలుకెడితే సంతోషించే వారిలో మొదటి వ్యక్తిని తానేనని అన్నారు. వైవీ తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంలో ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదు కానీ, మిగిలిన వ్యవహారాల్లో మాత్రం ఆయన బాగానే సంపాపదించారని పేర్కొన్నారు.  ఒంగోలు నియోజకవర్గం నుంచి తాను ఇంత వరకూ ఏడు సార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలిచానన్నబాలినేని, ఆ ఓడిపోయిన రెండు సందర్భాలలోనూ కూటమి చాలా బలంగా ఉందని గుర్తు చేశారు. 2024 ఎన్నికల తరువాత తాను జనసేనలో చేరానన్నారు.  జనసేనలో ఉన్న తనపై పలు ఆరోపణలు చేయడంతో సీఎం చంద్రబాబును విచారణ జరిపించాలని కోరానన్నారు. అలాగే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో డ్వాక్రా గ్రూపుల్లో నగదు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీలో డ్వాక్రా మహిళల నగదు కాజేసిన వారి పేర్లు బయటపెట్టాలన్నారు. తన కొడుకుపై అసత్య ఆరోపణలు చేసి తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితకు డిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం నిస్సందేహంగా ఆమెకు నైతిక విజయం అని చెప్పవచ్చు. ఈ కేసులో తాను నిరపరాధినని తొలి నుంచీ కవిత చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పు ఆమె మాటలే వాస్తవమని నిరూపించింది. మద్యం కుంభకోణం కేసులో తనకు క్లీన్ చిట్ ఇస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించినందుకు కవిత కృతజ్ణతలు తెలిపారు. కోర్టు తీర్పుపై మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత..   ఈ కేసులో తాను టార్గెట్ అయ్యాన‌న్నారు. తాను రాజ‌కీయ బాధితురాలిన‌ని,  ఎవరిమీదో ఉన్న అక్కసుతో తనపై ఈ కేసు అన్యాయంగా బనాయించి జైలుకు పంపారని కవిత అన్నారు. ఆమె వ్యాఖ్యలు పరోక్షంగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై విమర్శలుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఢిల్లీ మద్యం కేసులో తాను రాజకీయ పావుగా మారానని చెప్పిన ఆమె.. అప్పుడే ఈ కేసు నుంచి తాను పులు కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తాను కొత్త పార్టీ పెట్టడానికి సరిగ్గా నెలల ముందు వచ్చిన ఈ తీర్పు దేవుడి ఆశీర్వాదమని చెప్పారు. ఈ తీర్పుతో మరింత ఉత్సాహంగా ప్రజలలోకి వెడతానని చెప్పారు.  ఈ కేసు విష‌యంలో త‌న‌కు ముందు నుంచి మ‌ద్ద‌తు తెలిపి వారికి ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు. అదే సమయంలో అప్పట్లో ఈ కేసు విషయంలో తనకు బీఆర్ఎస్ నుంచి ఎటువంటి మద్దతూ అందలేదని విమర్శించారు.  త్వరలోనే బీఆర్ఎస్ కు  సంబంధించిన మ‌రిన్ని విష‌యాల‌ను వెల్ల‌డిస్తానన్న కవిత.. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌పై అభాండాలు మోపి.. త‌న‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య చుల‌క‌న చేసిన రాష్ట్ర బీజ‌పీ నాయ‌కులు ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతార‌ని నిలదీశారు.   ఇక కేటీఆర్ పై కూడా కవిత ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మద్యంకేసు కారణంగానే గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ తీర్పు వెలువడిన తరువాత కేటీఆర్ చేసిన ట్వీట్ పై కవిత  అసలు తనపై   కేసు పెట్టిందే పార్టీ కోసమన్నారు.  ఓటమికి నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదన్నారు.   ఉద్యోగాలు, ఇళ్లు ఇవ్వకపోవటం, దోపిడీ దారులకు టికెట్లు ఇవ్వటం, అహంకారం కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న కవిత,  బీఆర్ఎస్ ను ప్రజలే తిరస్కరించారనీ, ఆ విషయాన్ని ఇప్పటికైనా నిజాయితీగా అంగీకరించండని హితవు పలికారు.   
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామం సంభవించింది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ సీఎం పన్నిర్ తెల్వం డీఎంకే గూటికి చేరారు.  గతంలో డీఎంకే ప్రత్యర్థి అన్నాడీఎంకేలో అత్యంత కీలకంగా వ్యవహరించిన పన్నిర్ సెల్వం డీఎంకే గూటికి చేరడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పన్నీర్ సెల్వం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత  నమ్మకస్తుడిగా గుర్తింపు పొందారు.  జయలలిత కోర్టు తీర్పుల కారణంగా సీఎంగా రాజీనామా చేయాల్సి వచ్చిన ప్రతిసారీ తన వారసుడిగా పన్నీర్ సెల్వంను సీఎం కుర్చిలో కూర్జోపెట్టడం రివాజు. అటువంటి పన్నిర్ సెల్వం జయలలిత మరణం తరువాత డీఎంకేలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అటువంటి పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో డీఎంకే తీర్ధం పుచ్చుకున్నారు.  శుక్రవారం (ఫిబ్రవరి 27) ఉదయం డీఎంకే ప్రధాన కార్యలయంలో  తన కుమారుడు రవీంద్రన్‌తో కలిసి డీఎంకే గూటికి చేరారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం డీఎంకేను తల్లిగా అభివర్ణించారు. "అరిగ్నర్ అన్నా, కలైంజ్ఞర్ కరుణానిధి నిర్దేశించిన మార్గంలో పయనిస్తూ స్టాలిన్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని పొగడ్తల వర్షం కురిపించారు.  
  డిటాక్స్ డ్రింక్స్ ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అయ్యాయి.  శరీరాన్ని శుద్ది చేయడంలో డిటాక్స్ డ్రింక్స్ చాలా బాగా పనిచేస్తాయని చెబుతారు.  ఈ డిటాక్స్ డ్రింక్స్ లో ఎన్నెన్నో పానీయాలు పరిచయం చేస్తూనే ఉన్నారు. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ లేదా షాట్ నుండి.. కాకరకాయ,  నిమ్మరసం,  ఉసిరి వంటి ఎన్నో పదార్థాలతో డిటాక్స్ డ్రింక్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి కాలేయాన్ని శుద్ది చేస్తాయని,  శరీరంలో టాక్సిన్లు తొలగిస్తాయని చెబుతారు.  కానీ దీని గురించి వైద్యులు చెబుతున్న విషయం వేరే ఉంది.  మానవ శరీరం ఫ్లష్ చేయాల్సిన,  మూసుకుపోయిన పైపు లాంటిది కాదని, స్వీయ-నియంత్రణ జీవరసాయన వ్యవస్థ ఈ శరీరానికి స్వతహాగా ఉన్న లక్షణం అని అంటున్నారు. డిటాక్స్ డ్రింక్స్ ను గుడ్డిగా తీసుకునే ముందు వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు. డీటాక్స్ పానీయాలు అవసరమా? శరీర భాగాలు 24 గంటలూ  పని చేస్తుంటాయి.  కాబట్టి  ఎలాంటి డిటాక్స్ జ్యూస్ లు  అవసరం లేదని వైద్యులు అంటున్నారు. కాలేయం.. ఇది మందులు, ఆల్కహాల్, హార్మోన్లు,  జీవక్రియ వ్యర్థాలను శరీరం విసర్జించగల రూపంలోకి విచ్ఛిన్నం చేస్తుంది. మూత్రపిండాలు.. మూత్రపిండాలు రోజుకు సుమారు 150-180 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. అవి యూరియా, క్రియాటినిన్,  అదనపు ఉప్పు వంటి టాక్సిన్లను నిరంతరం తొలగిస్తాయి. ఈ అవయవాలు సరిగ్గా పనిచేస్తుంటే ఎలాంటి డీటాక్స్ జ్యూస్ అవసరం లేదని,  అవి సరిగ్గా పనిచేయకపోతే,  ఏ డిటాక్స్ జ్యూస్ కూడా వాటిని సరిచేయలేదని వైద్యులు చెబుతున్నారు. డిటాక్స్ జ్యూస్ లు హాని కలిగిస్తాయా? మూత్రపిండాల వ్యాధి.. దుంపలు, టమోటాలలో పొటాషియం అధికంగా ఉంటుంది. అధిక పొటాషియం స్థాయిలు హృదయ స్పందనలకు క్రమరహితంగా మారి, ప్రమాదకరంగా మారేందుకు కారణమవుతాయి. రాళ్లు.. బీట్‌రూట్,  పాలకూర రసంలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. ఇది రాళ్ల సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది . డయాబెటిస్.. జ్యూస్ రూపంలో  తీసుకోవడం వల్ల పండ్లు,  కూరగాయల నుండి ఫైబర్ తొలగిపోతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది . కాలేయ వ్యాధి.. కూరగాయల రసం ప్యాటీ లివర్  లేదా ఫైబ్రోసిస్‌ను నయం చేస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ దీనికి  ఎటువంటి ఆధారాలు లేవు. హైపోనాట్రేమియా.. ద్రవాలు మాత్రమే తీసుకునే ఆహారం శరీరంలో సోడియం స్థాయిలను తగ్గిస్తుంది. సైన్స్ ఏం చెబుతోందంటే.. డీటాక్స్ జ్యూస్‌లు బరువు తగ్గడానికి లేదా అవయవాలను శుభ్రపరచడానికి సహాయపడతాయని నిరూపించడానికి ఎటువంటి క్లినికల్ ఆధారాలు లేవు. డీటాక్సిఫికేషన్ ప్రక్రియ వల్ల కాకుండా, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం, తక్కువ కేలరీలు తీసుకోవడం,  హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. శరీరం శుభ్రంగా ఉండాలంటే ఇవి చేయాలి.. శరీరానికి ఫైబర్ అందేలా పండ్లు,  కూరగాయలను పూర్తిగా తినాలి. పుష్కలంగా నీరు త్రాగాలి,  మద్యపానం మానుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం,  మంచి నిద్ర పొందాలి. డయాబెటిస్, బిపి, కొలెస్ట్రాల్ లను అదుపులో ఉంచుకోవాలి.                                      *రూపశ్రీ.
- డయాబెటిస్ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? - కళ్ళపై డయాబెటిస్ ప్రభావం (Diabetic Retinopathy) - కిడ్నీలపై షుగర్ ప్రభావం (Diabetic Nephropathy) - గుండెపై షుగర్ ప్రభావం (Heart Disease) - పాదాలపై ప్రభావం (Diabetic Foot) - డయాబెటిస్ నియంత్రణ చిట్కాలు & జాగ్రత్తలు చక్కెరను నిర్లక్ష్యం చేస్తే సంభవించే దీర్ఘకాలిక సమస్యలు, ప్రారంభ లక్షణాలు, అలాగే నియంత్రణ కోసం అనుసరించాల్సిన ఆరోగ్య చిట్కాలు, మధుమేహ లక్షణాలు & ముందస్తు హెచ్చరిక సంకేతాలు, చక్కెర వల్ల దెబ్బతిన్న ప్రధాన అవయవాలు మరియు వాటిని ఎలా నివారించాలి అనే అంశాల గురించి తెలుగువన్ Health యూట్యూబ్ ఛానల్‌కి  Dr NG Sastry (Medical Director sr. Diadetologist) ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం..  మధుమేహం (డయాబెటిస్)... నేడు ప్రతి ఇంట్లోనూ వినిపిస్తున్న పేరు. ఈ పేరు వినగానే చాలా మంది గుండెల్లో ఒక రకమైన ఆందోళన, భయం మొదలవుతుంది. "ఇక జీవితాంతం మందులు వాడాలా?", "నా అవయవాలు దెబ్బతింటాయా?" అన్న ప్రశ్నలు వేధిస్తుంటాయి. కానీ గుర్తుంచుకోండి, మధుమేహం అనేది అంతం కాదు, అది కేవలం మీ జీవనశైలిని మార్చుకోమని మీ శరీరం ఇచ్చే ఒక హెచ్చరిక మాత్రమే. సరైన అవగాహన, క్రమశిక్షణ ఉంటే డయాబెటిస్‌ను నియంత్రించడమే కాకుండా, కాంప్లికేషన్స్ లేని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. మనం డయాబెటిస్‌ను ఎందుకు నియంత్రించుకోవాలి? (Why Should We?) డయాబెటిస్ అనేది కేవలం రక్తంలో చక్కెర స్థాయి పెరగడం మాత్రమే కాదు, ఇది ప్రధానంగా రక్తనాళాల వ్యాధి. మన శరీరంలో రక్తనాళాలు లేని చోటు లేదు, అందుకే ఇది శరీరం అంతటా ప్రభావం చూపుతుంది. • అవయవాల రక్షణ: డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే అది కళ్లు, కిడ్నీలు, గుండె మరియు పాదాలను దెబ్బతీస్తుంది. • దీర్ఘకాలిక ఆరోగ్యం: రక్తంలో చక్కెర స్థాయిలను (HbA1c) 6.5 నుండి 7 లోపు ఉంచుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే కిడ్నీ మరియు గుండె సమస్యలను నివారించవచ్చు. • జీవన నాణ్యత: ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కంటి చూపు కోల్పోవడం (రెటినోపతి) లేదా పాదాలను తొలగించాల్సిన పరిస్థితి (ఆంప్యుటేషన్) రాకుండా చూసుకోవచ్చు. ఏమి చేయకూడదు? (What NOT to Do) చాలా మంది తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి: • నిర్లక్ష్యం వద్దు: HbA1c స్థాయిలు 9 లేదా 10 ఉన్నా "నాకు బాగానే ఉంది కదా" అని నిర్లక్ష్యం చేయకండి. ఇది లోలోపల అవయవాలను దెబ్బతీస్తుంది. • మందులను ఆపకండి: డయాబెటిస్ మందులు వాడితే కిడ్నీలు పాడవుతాయని చాలా మంది భయపడతారు. కానీ వాస్తవానికి మెట్‌ఫార్మిన్ వంటి మందులు కిడ్నీలను, గుండెను రక్షిస్తాయి. డాక్టర్ సలహా లేకుండా మందులు మానేయడం అత్యంత ప్రమాదకరం. • పాదాల నొప్పిని తక్కువ అంచనా వేయకండి: నడుస్తున్నప్పుడు పిక్కలు పట్టేయడం లేదా నొప్పి రావడం వంటివి రక్త ప్రసరణ తగ్గుతుందనడానికి సంకేతాలు. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా? (How-to Guide) 1. క్రమం తప్పకుండా పరీక్షలు: సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా కంటి పరీక్ష (డయాబెటిక్ రెటినోపతి కోసం) మరియు కిడ్నీ పనితీరు తెలుసుకోవడానికి 'మైక్రో ఆల్బుమినూరియా' పరీక్ష చేయించుకోవాలి. 2. లక్ష్యాలను నిర్దేశించుకోండి: మీ రక్తపోటు (BP) 130/80 లోపు, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ 100 కంటే తక్కువగా (వీలైతే 70 లోపు) ఉండేలా చూసుకోండి. 3. వ్యాయామం: రోజూ వ్యాయామం చేయండి. అయితే, పాదాల్లో నరాల సమస్య (Neuropathy) ఉన్నవారు నడక కంటే సైక్లింగ్ చేయడం ఉత్తమం, దీనివల్ల పాదాలపై ఒత్తిడి పడదు. 4. సరైన ఆహారం: ఆహారంలో ప్రోటీన్ల విషయంలో జాగ్రత్త వహించాలి. కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు ప్రోటీన్ తగ్గించాలి, కానీ పాదాలపై పుండ్లు ఉన్నప్పుడు అవి త్వరగా మానడానికి ప్రోటీన్ అవసరం అవుతుంది. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్రశ్న 1: డయాబెటిస్ మందులు కిడ్నీలను దెబ్బతీస్తాయా?  జవాబు: లేదు. నిజానికి డయాబెటిస్ కంట్రోల్‌లో లేకపోవడం వల్లనే కిడ్నీ సమస్యలు వస్తాయి. మెట్‌ఫార్మిన్ మరియు కొత్తగా వచ్చిన SGLT2 ఇన్హిబిటర్స్ వంటి మందులు కిడ్నీలకు రక్షణగా నిలుస్తాయి. ప్రశ్న 2: కిడ్నీ సమస్యలను ముందే గుర్తించవచ్చా?  జవాబు: అవును. 'యూరిన్ ఆల్బుమిన్ క్రియేటినిన్ రేషియో' వంటి పరీక్షల ద్వారా కిడ్నీ సమస్యలను 4-5 ఏళ్ల ముందే గుర్తించవచ్చు. ప్రారంభ దశలో వీటిని మందుల ద్వారా నయం చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రశ్న 3: గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి?  జవాబు: మొదట డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి (HbA1c 6.5-7). బ్లడ్ ప్రెషర్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను డాక్టర్ సూచించిన పరిమితిలో ఉంచుకుంటూ, క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్ చేయాలి. ముగింపు (Outro) మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. డయాబెటిస్ ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఎవరిపైనా ఆధారపడకుండా సంతోషంగా జీవించవచ్చు. భయం వదిలేయండి, అవగాహన పెంచుకోండి. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఈ రోజే అడుగు వేయండి! మరిన్ని ఆరోగ్య రహస్యాల కోసం.. మీకు ఆరోగ్య సమస్యలపై ఇంకా లోతైన అవగాహన కావాలా? నిపుణులైన డాక్టర్ల సలహాలు, సూచనల కోసం మా TeluguOne Health YouTube ఛానల్ ను ఇప్పుడే సందర్శించండి. ఆరోగ్యమే మహాభాగ్యం - సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి! 👉 TeluguOne Health
నేటికాలంలో అబ్బాయిలను ఇబ్బంది పెడుతున్న సమస్య బట్టతల.  తల మీద జుట్టు బాగా రాలిపోయి తల చర్మం బయటికి కనిపిస్తూ ఉంటే దాన్ని బట్టతల అని అంటారు.  బట్టతల వచ్చాక ఆ ప్రాంతంలో ఇక వెంట్రుకలు తిరిగి పెరగవు.  ఒకప్పుడు బట్టతల పెద్దవారికి మాత్రమే వచ్చేది.  కానీ నేటికాలంలో మాత్రం అది పూర్తీగా విభిన్నంగా ఉంది.  చిన్న వయసులోనే బట్టతలతో ఇబ్బంది పడేవారు ఉన్నారు. అయితే బట్టతల రావడానికి శరీరంలో కొన్ని లోపాలు కారణం అవుతాయి.  అవేంటో తెలుసుకుంటే.. జుట్టు నిర్మాణం.. జుట్టు నిర్మాణం ప్రధానంగా ప్రోటీన్ తో రూపొందించబడి ఉంటుంది. ఆహారం సరిగా లేకపోయినా,  సరైన ఆహారం తీసుకోకపోయినా, ఎక్కువ కాలం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోయినా క్రమంగా జుట్టు పలుచబడి,  రాలిపోవడానికి దారితీస్తుంది. ఇది ఎక్కువ కాలం సాగితే బట్టతలగా మారే అవకాశం ఉంటుంది. పురుషుల్లో బట్టతల.. పురుషుల్లో బట్టతల అనేది జన్యుశాస్త్రం,  హార్మోన్ల మార్పుల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.  తండ్రి లేదా తాత వంటి వారికి బట్టతల ఉంటే.. కాలక్రమేణా పిల్లలకు బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి సమస్యలు.. ఒత్తిడి,  నిద్ర సమస్యలు ఉన్నవారిలో కూడా బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది.  ఒత్తిడి,  ఆందోళన కారణంగా  ఒత్తిడి హార్మోన్ పెరిగి జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంది. అలాగే శరీరంలో పోషకాలు లోపించినప్పుడు కూడా బట్టతలకు దారితీస్తుంది. విటమిన్స్.. ప్రోటీన్ మాత్రమే కాకుండా జుట్టు పెరుగుదలలో విటమిన్-డి,  ఐరన్, జింక్, బయోటిన్ అని పిలువబడే విటమిన్-బి17 కూడా కీలకపాత్ర పోషిస్తాయి.  ఇవి లోపించడం వల్ల కూడా బట్టతల వచ్చే అవకాశం  ఉంటుంది. మగాళ్లకే కాదు.. బట్టతల అనేది మగాళ్లకు మాత్రమే వచ్చే సమస్య అనుకుంటే పొరపాటు.  ఇది ఆడవాళ్లకు కూడా వస్తుంది.  ఆడవాళ్లలో జుట్టు పలుచబడి,  తలమీద చర్మం బయటకు కనిపిస్తూ,  తల వెంట్రుకల మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.   దీన్ని ఆడవాళ్లలో బట్టతలగా పరిగణిస్తారు.                                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.