Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కల్వకుంట్ల కవితకు నైతిక విజయం.. ఇక దూకుడు మామూలుగా లేదుగా?
posted on: Feb 27, 2026 3:59PM
.webp)
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితకు డిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం నిస్సందేహంగా ఆమెకు నైతిక విజయం అని చెప్పవచ్చు. ఈ కేసులో తాను నిరపరాధినని తొలి నుంచీ కవిత చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పు ఆమె మాటలే వాస్తవమని నిరూపించింది. మద్యం కుంభకోణం కేసులో తనకు క్లీన్ చిట్ ఇస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించినందుకు కవిత కృతజ్ణతలు తెలిపారు.
కోర్టు తీర్పుపై మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత.. ఈ కేసులో తాను టార్గెట్ అయ్యానన్నారు. తాను రాజకీయ బాధితురాలినని, ఎవరిమీదో ఉన్న అక్కసుతో తనపై ఈ కేసు అన్యాయంగా బనాయించి జైలుకు పంపారని కవిత అన్నారు. ఆమె వ్యాఖ్యలు పరోక్షంగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై విమర్శలుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఢిల్లీ మద్యం కేసులో తాను రాజకీయ పావుగా మారానని చెప్పిన ఆమె.. అప్పుడే ఈ కేసు నుంచి తాను పులు కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
తాను కొత్త పార్టీ పెట్టడానికి సరిగ్గా నెలల ముందు వచ్చిన ఈ తీర్పు దేవుడి ఆశీర్వాదమని చెప్పారు. ఈ తీర్పుతో మరింత ఉత్సాహంగా ప్రజలలోకి వెడతానని చెప్పారు. ఈ కేసు విషయంలో తనకు ముందు నుంచి మద్దతు తెలిపి వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో అప్పట్లో ఈ కేసు విషయంలో తనకు బీఆర్ఎస్ నుంచి ఎటువంటి మద్దతూ అందలేదని విమర్శించారు. త్వరలోనే బీఆర్ఎస్ కు సంబంధించిన మరిన్ని విషయాలను వెల్లడిస్తానన్న కవిత.. ఇప్పటి వరకు తనపై అభాండాలు మోపి.. తనను ప్రజల మధ్య చులకన చేసిన రాష్ట్ర బీజపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
ఇక కేటీఆర్ పై కూడా కవిత ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మద్యంకేసు కారణంగానే గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ తీర్పు వెలువడిన తరువాత కేటీఆర్ చేసిన ట్వీట్ పై కవిత అసలు తనపై కేసు పెట్టిందే పార్టీ కోసమన్నారు. ఓటమికి నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదన్నారు. ఉద్యోగాలు, ఇళ్లు ఇవ్వకపోవటం, దోపిడీ దారులకు టికెట్లు ఇవ్వటం, అహంకారం కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న కవిత, బీఆర్ఎస్ ను ప్రజలే తిరస్కరించారనీ, ఆ విషయాన్ని ఇప్పటికైనా నిజాయితీగా అంగీకరించండని హితవు పలికారు.



.webp)


