Home

»

Latest News

Vishnu Vinyasam: నో లిప్ లాక్.. శ్రీ విష్ణు అయితే మాత్రం 

Feb 27, 2026

 

-విష్ణు విన్యాసంతో థియేటర్స్ లో సందడి చేస్తున్న నయన్ సారిక 
-ఆ రోల్స్ కే ఇంపార్టెన్స్
-లిప్ లాక్ పై తన అభిప్రాయం ఏంటి! 
-తెలుగు వన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఏం చెప్పింది 

 

వెండితెరపై తనదైన ముద్ర వేయడానికి ఈ రోజు 'విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam)చిత్రం థియేటర్స్ లోకి వచ్చేసింది. చిత్ర కథానాయిక నయన్ సారిక(Nayan sarika)మరియు దర్శకుడు యదునాథ్ మారుతీ రావు(Yadunaath maruthi rao)తమ సినీ ప్రయాణం మరియు సినిమా విశేషాలని తెలుగు వన్ తో పంచుకున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం.
 

ఏడేళ్ల నిరీక్షణ ఒక కొత్త దర్శకుడి కల
దర్శకుడు యదునాథ్ మారుతీ రావుకి ఏడేళ్ల సుదీర్ఘ సినిమా ప్రయాణం ఉంది. గతంలో 'డీజే టిల్లు', 'కృష్ణ అండ్ హిజ్ లీలా' వంటి విజయవంతమైన చిత్రాలకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం మారుతీ రావు సొంతం. ఈ కథని హీరో విష్ణు గారికి వినిపించినప్పుడు, ఆయన ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. డెబ్యూ డైరెక్టర్ అని కూడా చూడకుండా మారుతీ రావు పై శ్రీవిష్ణు(Sree Vishnu) నమ్మకం ఉంచాడు. ఊహాజనిత కథే కాకుండా, ఒంగోలులో ఉండే తన స్నేహితుడు నాగరాజు జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా విష్ణు విన్యాసం కథని రూపొందించడం విశేషం. 
 
గ్లామర్ కంటే పెర్ ఫార్మెన్స్ కే మొగ్గు

వరుసగా రెండు హిట్స్ అందుకున్న నయన్ సారిక, విష్ణు ఇప్పుడు విష్ణు విన్యాసంలో  'మనీషా' అనే అత్యంత బలమైన క్యారక్టర్ లో కనిపిస్తున్నారు. సాధారణ మధ్యతరగతి బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చిన నయన్, అనుకోకుండా మోడలింగ్ మరియు యాక్టింగ్ వైపు అడుగులు వేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.మూవీలో కేవలం గ్లామర్ క్యారక్టర్ మాత్రమే కాదు. పెర్ఫార్మెన్స్ కి ఎక్కువ స్కోప్ ఉన్న స్ట్రాంగ్ క్యారెక్టర్. ఆ తరహా పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్  క్యారెక్టర్స్ కే ప్రాధాన్యత ఇస్తాను. లిప్ లాక్ సీన్స్ లేదా అతిగా ఎక్స్ పోజింగ్ చేయడానికి నేను చాలా దూరం. విష్ణు విన్యాసంలో కూడా ఒక లిప్ లాక్ సీన్ ఉన్నప్పుడు నిర్మొహమాటంగా నో అని   డైరెక్టర్ కి చెప్పేసాను. గ్లామర్, వల్గారిటీ కి మధ్య ఉండే సన్నని గీతని దాటకూడదనేది నా  స్పష్టమైన అభిప్రాయం. ఒకవేళ నటిని కాకపోయి ఉంటే  లాయర్ అయ్యేదాన్నని నయన్ సారిక చెప్ప్పుకొచ్చింది.

Also read: Vishnu Vinyasam: విష్ణు విన్యాసం హైలెట్స్ ఇవే.. ప్రేక్షకులు చెప్తుంది నిజమేనా! 

క్లీన్ కామెడీ.. అద్భుతమైన క్లైమాక్స్ ట్విస్ట్'విష్ణు విన్యాసం' కేవలం నవ్వుల కోసమే కాకుండా, ఒక మంచి ఎమోషనల్ రైడ్ లా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతోంది. ముఖ్యంగా ఎక్కడా బూతులు లేని క్లీన్ కామెడీ ఉంటుందని, ఆడియన్స్ అందరూ హాయిగా నవ్వుకుంటూ థియేటర్ నుండి బయటకు వస్తారు. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ప్రేక్షకుల మైండ్ లో రోజులు తరబడి ఉండిపోతుందట.

 

  

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com