అభిమానిని భోజ‌నానికి ఇంటికి ఆహ్వానించిన ర‌వి!

యాంక‌ర్ ర‌వి బిగ్‌బాస్ సీజ‌న్ 5 లో టాప్ 5లో వుంటాడ‌ని అంతా ఊహించారు కానీ అనూహ్యంగా ఎలిమినేట్ కావడం చాలా మందిని షాక్ కు గురిచేసింది. ర‌వి ఏంటీ ఎలిమినేట్ కావ‌డం ఏంటీ? దీని వెన‌క పెద్ద కుట్ర జ‌రిగింద‌ని అత‌ని అభిమానులు పెద్ద ర‌చ్చ చేశారు. ఇక ఇదే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌ని, త‌న ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కామెంట్ లు చేసిన వారిపై ర‌వి పోలిస్ కంప్లైంట్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. Also Read: ఆది కోసం కొట్టుకున్న రోజా, ఆమ‌ని.. ఏంటిది? అప్ప‌టి నుంచి యాంక‌ర్ ర‌విని సోష‌ల్ మీడివ‌యా వేదిక‌గా కామెంట్ లు చేయ‌డానికి ఎవ‌రూ సాహ‌సించ‌డం లేదు. కానీ ఓ అభిమాని మాత్రం ర‌విని కామెంట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. యాంక‌ర్ ర‌వి త‌న ఫ్యామిలీకి అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. హౌస్ లో ర‌వి చివ‌రి వ‌ర‌కు ఉండ‌లేక‌పోయినా త‌న భార్య‌ నిత్య, పాప వియా ఎంట్రీ ఇవ్వ‌డం అత‌నికి బాగానే క‌లిసి వ‌చ్చింది. వీరి కార‌ణంగా అత‌నిపై వున్న నెగ‌టివ్ ఇమేజ్ పోయింది పాజిటివ్ గా మారింది. షో నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ద‌గ్గ‌రి నుంచి యాంక‌ర్ ర‌వి ఎక్కువ స‌మ‌యాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తున్నాడు. తాజాగా త‌న పాప వియా కోసం మ‌ట‌న్ వండాడు. దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేశాడు కూడా. అయితే దీనిపై చాలా మంది చాలా ర‌కాలుగా కామెంట్ లు చేశారు. కానీ ఓ లేడీ ఫ్యాన్ చేసిన కామెంట్ కి యాంక‌ర్ ర‌వి రియాక్ట్ అయ్యాడు. ర‌వి షేర్ చేసిన వీడియో చూసిన స‌ద‌రు లేడీ యాంక‌ర్‌.. అబ్బా నోరూరుతోందంటూ కామెంట్ చేస్తే యాంక‌ర్ ర‌వి మురిసిపోయి ఏకంగా ఫ్యాన్ ని ఇంటికే ఆహ్వానించ‌డం ఆక‌ట్టుకుంటోంది. ర‌వి ఊహించని విధంగా త‌న‌ని ఆహ్వానించ‌డంతో స‌ద‌రు లేడీ అభిమాని ఫిదా అయిపోయింది.

అన‌సూయ‌తో హైప‌ర్ ఆది ప‌దివేల పూజ.. ఏంట‌ది?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ `పుష్ప‌`. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధిస్తోంది. ఇందులో వెయ్యి రూపాయ‌ల పూజ అంటూ హీరో, అత‌ని అసిస్టెంట్ చేసే హంగామా న‌వ్వులు పూయించింది. ఇదే స్క్రిట్ ని జ‌బ‌ర్ద‌స్త్ షో లో చేస్తే... ఇదే అద‌నుగా భావించి హైప‌ర్ ఆది అన‌సూయ‌పై పంచ్ లేస్తే... ఎలా వుంటుందో జ‌బ‌ర్ద‌స్త్ షో చూడాల్సిందే. ఇందులో హైప‌ర్ ఆది.. ఆనసూయ‌తో చేసే ప‌దివేల పూజ ఏంట‌న్న‌ది స‌స్పెన్స్... ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ ... హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ఈ షో ప్ర‌తీ వారం న‌వ్వులు పూయిస్తోంది. రోజా, మ‌నో జ‌డ్జెస్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా హోస్ట్ గా అన‌సూయ వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజా ఎపిసోడ్ ఈ నెల 20న ప్ర‌సారం కాబోతోంది. రీసెంట్ గా ఈ షో లేటెస్ట్ ప్రోమోని నిర్వాహ‌కులు విడుద‌ల చేశారు. ఇదిప్పుడు నెట్టింట సంద‌డి చేస్తోంది. తాజా షోలో హైప‌ర్ ఆది వ‌న్ మ్యాన్ షో గా మారిపోయింది. `పుష్ప‌` థీమ్ ని స్కిట్ గా మార్చుకుని ఆది పుష్ప‌రాజ్ గా మారిపోయాడు. ఇక్క‌డ శ్రీ‌వ‌ల్లిగా అన‌సూయ‌ని ఊహించుకోవ‌డంతో స్క్రిట్ ఓ రేంజ్ లో పేలింది. స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా హైప‌ర్ ఆది .. అన‌సూయ‌పై పంచ్ లు వేయ‌డం అల‌వాటు. అదే అల‌వాటుతో తాజా ఎపిసోడ్ లోనూ అన‌సూయ‌పై పంచ్ లేశాడు. అన‌సూయ‌ని ఉద్దేశిస్తూ హైప‌ర్ ఆది వేసిన పంచ్ లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి. `పుష్ప‌`లోని క్యారెక్ట‌ర్ ల‌ని రీ క్రియేట్ చేస్తూ ఓ స్కిట్ చేశారు. ఇందులో హైప‌ర్ ఆది పుష్ప‌రాజ్ గా క‌నిపించాడు. రావ‌డం రావ‌డ‌మే అన‌సూయ‌పై పంచ్ లు వేయ‌డం మొద‌లు పెట్టాడు.  Also Read:  రష్మీ ఊ.. అంటే ఊహూ.. అంటారా? అన‌సూయ సూత్తాందిరా.. అరేయ్ న‌వ్వుతుండాదిరా... అని హైప‌ర్ ఆది అన‌గానే `పుష్ప‌`లో బ‌న్నీకి అసిస్టెంట్ గా న‌టించిన వ్య‌క్తి `అట్టుంట‌ది వెయ్యి రూపాల పూజంటే అంటాడు. వెంట‌నే ఆది ` నాకు తెలుసురా అమ్మి న‌న్ను ల‌వ్‌సేత్తాంద‌ని.. వెయ్యి రూపాయ‌ల పూజ కాదుగానీ.. ఒక ప‌దివేలు పోతే పోయిన‌యిగానీ పెద్ద పూజ ఏదైనా వుంటే ప్లాన్ చెయ్ రా.. అని హైప‌ర్ ఆది అన‌గానే అన‌సూయ హావ‌భావాలు చూడాలి స్పీచ్ లెస్‌... ఈ నెల 20న ప్ర‌సారం కానున్న ఈ ఎపిసెడ్ కు సంబంధింన తాజా ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. హైప‌ర్ ఆది, అన‌సూయ‌ల హంగామా చూడాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.  

కామెడీ స్టార్స్ ధ‌మాకా.. త‌గ్గేదేలే: నాగ‌బాబు

జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్  గ‌త కొన్నేళ్లుగా హాస్య ప్రియుల్ని న‌వ్విస్తూ అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్ కాస్త `ఎక్స్ ట్రా జ‌బ‌ర్వ‌స్త్‌`గా మారిపోయింది. ఎంట‌ర్‌టైన్ మ‌రింత డోస్ పెంచేసింది. అంతే కాకుండా `శ్రీ‌దేవి డ్రామా కంప‌నీ` కూడా కామెడీ స్కిట్ ల‌తో ఆక‌ట్టుకుంటోంది. తాజాగా వీటికి పోటీగా ఓంకార్  `స్టార్ మా` లో స్టార్ట్ చేసిన షో `కామెడీ స్టార్స్‌`. గ‌త కొన్ని నెల‌లుగా హాస్య ప్రియుల్ని ఆక‌ట్టుకుంటూ ప్ర‌తీ ఆదివారం విజ‌య‌వంతంగా దూసుకుపోతున్న ఈ కామెడీ షో ఇప్పుడు పేరు మారిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ షోలో  శేఖ‌ర్ మాస్ట‌ర్‌, న‌టి శ్రీ‌దేవి జ‌డ్జెస్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం జ‌రుగుతోంది. ఇక ఈ షోకు యాంక‌ర్ గా ప్ర‌స్తుతం శ్రీ‌ముఖి వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజాగా శ్రీ‌దేవిని త‌ప్పించి ఆ స్థానంలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు జ‌డ్జిగా వ‌చ్చేశారు. ఇక్క‌డి నుంచి కొన్ని కొత్త టీమ్ లు షో లోకి ఎంట్రీ ఇచ్చేశాయి. తాజాగా ఈ షోకు `కామెడీ స్టార్ ధ‌మాకా` అని పేరుని మార్చేశారు. ఈ షోలో కొత్త‌గా `ఎక్స్ ట్రా జ‌బర్ద‌స్త్`, ఢీ షోల్లో హైప‌ర్ ఆదికి జోడీగా క‌నిపించి ఆ త‌రువాత షో నుంచి అర్థాంత‌రంగా వెళ్లిపోయిన దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా కొత్త త‌ర‌హా కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన ఈ షో ఈ నెల 23 నుంచి ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు `స్టార్ మా`లో ప్ర‌సారం కాబోతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని రిలీజ్ చేశారు. వైర‌స్ ఇన్ని వేరియేష‌న్స్ తో వ‌స్తుంటే అంద‌రిని న‌వ్వించే కామెడీ స్టార్స్ ఇంకెన్ని వేరియేష‌న్స్ తో ఎంత అప్‌డేట్ గా ...ఎంత కొత్త‌గా వ‌స్త‌దో.. త‌గ్గేదే లే` అంటూ నాగ‌బాబు డైలాగ్ చెప్ప‌డం... ఇందులో స్కిట్ లు చేసే కంటెస్టెంట్ లు నానా హంగామా చేస్తున్న తీరు ఓ రేంజ్ లో ఈ షోని టాప్ లో నిల‌బెట్టేలా వున్నాయి.

అక్క‌డ స‌మంత.. ఇక్క‌డ విష్ణు ప్రియ‌..

బుల్లితెర‌పై హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న కామెడీ షో `శ్రీ‌దేవి డ్రామా కంప‌నీ`. గ‌త కొంత కాలంగా ఈ షో విభిన్న‌మైన కామెడీ స్కిట్ ల‌తో ఆక‌ట్టుకుంటూ రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న ఈ కామెడీ షో ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 1:00 గంట‌ల‌కు ప్రసారం అవుతోంది. ఈ షోలో సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను, హైప‌ర్ ఆది, ఆటో రాంప్ర‌సాద్ త‌మ‌దైన కామెడీ స్కిట్ ల‌తో హంగామా చేస్తున్నారు. ఇంద్ర‌జ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో తాజా ఎపిసోడ్ ని క‌నుమ స్పెష‌ల్ గా డిజైన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ షోలో గెట‌ప్ శ్రీ‌ను బెత్తంతో, సుడిగాలి సుధీర్‌ని ఓ రేంజ్ లో ఆడేసుకున్న తీరు న‌వ్వులు పూయిస్తోంది. ఇక ఈ స్పెష‌ల్ ఎపిసోడ్ కోసం హీరోయిన్ కామ్నా జ‌ఠ్మ‌లాని ప్ర‌త్యేక అథిగా ఎంట్రీ ఇవ్వ‌డం, సుడిగాలి సుధీర్ ఆమెకు బిస్కెట్ లు వేయ‌డం.. అది గ‌మ‌నించిన ఆటో రాంప్ర‌సాద్ పంచ్ లు వేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఇక్ ఇదే షోలో విష్ణు ప్రియ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ర‌చ్చ చేస్తోంది. ఊ అంటావా మావ‌.. ఊహూ అంటావా... అంటూ `పుష్ప‌`లో స‌మంత ఓ రేంజ్ లో హ‌ల్ చ‌ల్ చేసింది. ఆ పాట పాపుల‌ర్ కావ‌డంతో దాన్ని రీక్రియేట్ చేస్తూ చాలా మంది వీడియోలు చేస్తున్నారు. స్టేజ్ ల‌పై పెర్ఫామ్ చేస్తూ హీటెక్కిస్తున్నారు. ఇప్ప‌డు ఈ షోలో ఇదే పాట‌కు యాంక‌ర్ విష్ణ ప్రియ డ్యాన్స్ చేసి షోని హీటెక్కించింది. విష్ణ ప్రియ హోయ‌ల‌కు సుడిగాలి సుధీర్‌, హైప‌ర్ ఆది క్లీన్ బౌల్డ్ అయిపోవ‌డం న‌వ్వులు పూయిస్తోంది. ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న ఈ షో ఈ రోజు మ‌ధ్యాహ్నం ప్ర‌సారం కాబోతోంది.

బెడిసికొట్టిన లాస్య ప్లాన్‌! ప్రేమ్‌-శ్రుతి శోభ‌నం!!

  న‌టి క‌స్తూరి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సీరియ‌ల్ `ఇంటింటి గృహ‌ల‌క్ష్మి`. గ‌త కొన్ని వారాలుగా ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ రోజుకో మ‌లుపు తిరుగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోంది. ఈ శనివారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది. ప్రేమ్ - శృతిల‌ని బుక్ చేసి ఇంట్లో గొడ‌వ‌లు సృష్టించాల‌ని, తుల‌సికి మ‌నశ్శాంతి లేకుండా చేయాల‌ని లాస్య ప్లాన్ చేస్తుంది.. అయితే ఆ ప్లాన్ బెడికొట్టి ప్రేమ్ - శృతిల‌కు శోభ‌నం జ‌రిగేలా చేస్తుంది. అదేంటో.. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. పెళ్లి జ‌రిగినా కూడా ప్రేమ్ - శృతి వేరు వేరుగా వుంటుంటారు. త‌ల్లి తుల‌సి క‌ష్ట‌ప‌డుతుంటే శోభ‌నం అక్క‌ర్లేద‌ని, తుల‌సి సంతోషంగా వున్న‌ప్పుడే మ‌నం క‌ల‌వాల‌ని ప్రేమ్ - శృతి వేరు వేరుగా వుంటుంటారు. అయితే ఈ విష‌యం లాస్య చెవిన ప‌డుతుంది. దీన్ని అడ్డుపెట్టుకుని ఇంట్లో గొడ‌వ‌లు సృష్టించాల‌ని లాస్య ప్లాన్ చేస్తుంది. అయితే ఈ విష‌యం తెలుసుకున్న తుల‌సి .. ప్రేమ్ పై ఫైర‌వుతుంది. అత‌న్ని, శృతిని శోభ‌నానికి ఒప్పిస్తుంది. అంతా ఏర్పాట్లు చేస్తుంటారు. లాస్య త‌న జీవితంలో ఏదైనా మంచి ప‌ని చేసిందంటే అది ఇదే. త‌ను ఏ ఉద్దేశంతో చెప్పినా ప్రేమ్ - శృతిల‌కు మంచే జ‌రిగింద‌ని, ఈ హంగామా చూస్తే లాస్య కుళ్లుకుంటుంద‌ని అన‌సూయ అంటుంది. ఇక శృతిని ప‌ట్టుకుని ఒకే టికెట్ కు రెండు సినిమాలు అన్న‌ట్టు ఒకే పెళ్లి కానీ రెండు శోభ‌నాలు అంటూ ఆట‌ప‌ట్టిస్తుంది దివ్య‌. ఈ రోజు ప్రేమ్ - శృతి మ‌ధ్య శోభ‌నం గ‌దిలో ఏం జ‌రిగింద‌న్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

ష‌న్ను - దీప్తి బ్రేక‌ప్‌పై సిరి షాకింగ్ కామెంట్స్‌

  తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 5 ముగిసి దాదాపు నెల రోజుల కావ‌స్తోంది. అయినా దీని ప్ర‌కంపన‌లు ఇంకా వినిపిస్తూనే వున్నాయి. వీజే స‌న్నీ ఈ సీజ‌న్ విజేత‌గా నిలిస్తే, ర‌న్న‌ర‌ప్ గా ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ నిలిచారు. ఇదిలా వుంటే ఈ సీజ‌న్ లో ష‌న్ను - సిరిలు చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు.. హ‌గ్గులు, కిస్సుల‌తో వెగ‌టు పుట్టించే వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేశారు. వీక్ష‌కుల‌తో పాటు వారి పేరెంట్స్ కు కూడా వీరి చేష్ట‌లు చిరాకు తెప్పించాయి. దీంతో వీరి ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. Also read: దీప్తి-ష‌న్ను రిలేష‌న్‌షిప్‌పై గుడ్ న్యూస్ చెప్పిన ష‌ణ్ముఖ్ ఫాద‌ర్‌! సీజ‌న్ ముగిసిన త‌రువాత కూడా ష‌న్ను, సిరిల పై నెట్టింట జ‌రిగిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. దీంతో వీరి ల‌వ్ లైఫ్ కి డేంజ‌ర్ బెల్స్ మోగాయి. ప్ర‌ధానంగా సిరి వ‌ల్ల ష‌న్ను ల‌వ్ లైఫ్ డేంజ‌ర్ లో ప‌డింది. త‌న కార‌ణంగా ష‌న్నుకు దీప్తి బ్రేక‌ప్ చెప్పాల్సి వ‌చ్చింది. సిరిని టార్గెట్ చేసిన నెటిజ‌న్స్ ఆమెని ఆడుకోవ‌డం మొద‌లుపెట్టారు. దీంతో చాలా వ‌రకు డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయింది సిరి. త‌న వ‌ల్ల ష‌న్ను - దీప్తి విడిపోయారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని త‌ట్టుకోలేక సిరి సైలెంట్ అయిపోయింది.   Also read: ​బ్రేకప్ తర్వాత ఊహించని సర్ప్రైజ్.. దీప్తితో కలిసున్న ఫోటో షేర్ చేసిన షణ్ముఖ్! శ్రీ‌హాన్ కూడా సిరితో అటాచ్‌మెంట్ ని త‌గ్గించుకోవ‌డంతో సిరి మ‌రింత‌గా బాధ‌ప‌డ‌టం మొద‌లుపెట్టిందని ప్ర‌చారం మొద‌లైంది. అయితే సంక్రాంతి సంద‌ర్భంగా సిరి వైజాగ్ వెళ్లింది. అక్క‌డ సెల‌బ్రేష‌న్స్ లో పాల్గొంది. ఈ సంద‌ర్బంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించి షాకిచ్చింది. "హౌస్ నుంచి వ‌చ్చాక నాపై ట్రోలింగ్ జ‌రిగింది. అది చూసి డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయాను. ఆ త‌రువాత సెట్ట‌య్యాను. దీప్తి బ్రేక‌ప్ స్టేట‌స్ పెట్ట‌గానే మ‌ళ్లీ నాపై ట్రోలింగ్ మొద‌లైంది. బ్రేక‌ప్ చెప్పుకునేంత వీక్ ల‌వ్ వారిదని నేను అనుకోవ‌డం లేదు. అంతే కాకుండా 100 రోజుల జ‌ర్నీ కార‌ణంగా బ్రేక‌ప్ అయ్యిందంటే.. అది బిగ్ బాస్ వ‌ల్లే అయింద‌ని అస్స‌లు అనుకోను" అని చెప్పుకొచ్చింది సిరి.

నువ్వు చీపురు ప‌ట్టుకుంటే, చీపురుకే అందం వ‌స్త‌ది!

  బుల్లితెర‌పై కొత్త కొత్త జంట‌లు పాపుల‌ర్ అయిపోతున్నారు. జ‌బ‌ర్ద‌స్త్ తో ర‌ష్మీ, సుడిగాలి సుధీర్ పాపుల‌ర్ అయిపోతే `కామెడీ స్టార్స్` తో ఎక్స్‌ప్రెస్ హ‌రి - అషురెడ్డి క్రేజీ జంట‌గా పేరు తెచ్చుకున్నారు. ఓంకార్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ కామెడీ షోలో వీరిద్ద‌రు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఓ స్కిట్ లో ఏకంగా చెస్ట్ పై అషురెడ్డి పేరుని టాటూగా వేసుకుని షాకిచ్చాడు హ‌రి. త‌ను చేసిన ప‌నికి అషురెడ్డి కూడా ఒక్క‌సారిగా షాక్ కు గురైంది. Also read: రొమాన్స్‌లో నిండా మునిగిపోయిన మోనిత‌, ఆదిత్య! ఆ త‌రువాత వీరిద్ద‌రి జోడీ నెట్టింట వైర‌ల్ గా మారింది. అక్క‌డి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్ థింగ్ అంటూ జోరుగా వార్త‌లు రావ‌డం మొద‌లైంది. ఈ వార్త‌ల్ని నిజం చేస్తూ హ‌రికి అషురెడ్డి కాస్ట్లీ బైక్ ని గిఫ్ట్ గా ఇవ్వ‌డం.. ఇలా త‌న ఫ్యామిలీ వాళ్లే నాకు గిఫ్ట్ లు ఇవ్వ‌లేద‌ని హ‌రి ఎమోష‌న‌ల్ కావ‌డం.. వార్త‌ల్లో న‌లిగింది. వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ మొద‌లైందా? లేక అది కేవ‌లం ఫ్రెండ్షిప్పేనా? అనే విష‌యంలో ఇప్ప‌టికీ క్లారిటీ రావ‌డం లేదు. గ‌త కొన్ని వారాలుగా కామెడీ స్టార్స్ షో లో క‌నిపించ‌ని అషురెడ్డి సోష‌ల్ మీడియాలో మాత్రం వ‌రుస ఫొటో షూట్ ల‌తో ర‌చ్చ చేస్తోంది. తాజాగా ప‌ని మ‌నిషి గెట‌ప్‌లో పాత్ర‌లు క‌డుగుతూ, చీపురు ప‌ట్టుక‌ని ఊడుస్తున్న‌ట్టుగా ఫొటోల‌కు పోజులిచ్చింది. అయితే ఈ ఫొటోలు చూసిన హ‌రి.. ఆమెపై సెటైర్ వేశాడు. "ఆ రెండో పిక్చ‌ర్‌, 9 పిక్చ‌ర్ చాలా నేచుర‌ల్‌గా ఉన్నావ్‌, బాగా సూట్ అయ్యావ్ కూడా అషు. ఆ డైలాగ్ గుర్తువ‌చ్చింది.. పొనిడి గెట‌ప్‌లో అంత నాచుర‌ల్‌గా ఉన్నావ్ రా" అని కామెంట్ చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అషురెడ్డి "నువ్వు చీపురు ప‌ట్టుకుంటే చీపురుకే అందం వ‌స్త‌ది" అని కౌంట‌రిచ్చింది. 

రుద్రాణికి వంట‌ల‌క్క స్ట్రాంగ్ వార్నింగ్‌

  బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతున్న ఈ సీరియ‌ల్ రేటింగ్ ప‌రంగానూ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ శుక్ర‌వారం 1249వ ఎపిసోడ్ లోకి ఎంట‌ర్ కాబోతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో చూద్దాం. త‌న‌ పిల్ల‌ల జోలికి రావ‌ద్దంటూ రుద్రాణికి వంట‌ల‌క్క స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. "నేను మీలాగే మీకంటే ఎక్కువే క‌ళ్లు ఉరిమి చూస్తూ పెద్ద‌గా అరుస్తూ అదే విష‌యాన్ని చెప్ప‌గ‌ల‌ను. కానీ మీకు నాకు తేడా వుంది క‌దా.. స‌రే కానీ ఈ కూర రుచి చూడండి" అంటూ రుద్రాణి ద‌గ్గ‌రికి గ‌రిటె తీసుకుని వెళుతుంది దీప‌. Also read: రుద్రాణి వంటింట్లో దీప.. ఏం జ‌రుగుతోంది? "కూర‌లో కారం త‌గ్గింది దీపా.. నేను కారం ఎక్కువ తింటాను లే.. నువ్వు కూర‌ల్లో కారం పెంచు దీపా.. పిల్ల‌లకు కాస్త పౌరుషం, రోషం పెరుగుద్ది.. నాద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి అవి ఎక్కువ‌గా వుండాలిగా అందుకే రుచి చూశాను." అంటుంది రుద్రాణి. "ఇంత చెప్పినా మీకు అర్థం కాలేదా రుద్రాణి గారూ.." అంటుంది దీప‌. "నువ్వు చెప్పేది నువ్వు చెప్పావ్‌.. నేను చేసేది నేను చేస్తాను మీకు రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి.. అదే అప్పు తీర్చే రోజులు.. చూద్దాం. అప్పు తీరుస్తారో.. లేక పిల్ల‌ల్ని.." అంటుంది రుద్రాణి. Also read: షాకింగ్ : మోనిత‌కు అడ్డంగా దొరికిన డాక్ట‌ర్ బాబు "అంత దాకా రానివ్వ‌ను లెండి రుద్రాణి గారు. నా పిల్ల‌ల జోలికి వ‌స్తే మాత్రం ఊరుకోను" అంటూ క్యారేజ్ స‌ద్దుకుని వెళ్లిపోతుంది. "ఏంట్రా ఇది.. ఏంటి దాని ధైర్యం.. ఈ అవ‌మానం నాకు గుర్తుండాలంటే ఆ వంట గ‌దిని మూసేయండి"అంటూ ప‌ని వాళ్ల‌కు చెబుతుంది రుద్రాణి. ఇంత‌కీ దీప ధైర్యం ఏంటీ? . రుద్రాణి త‌రువాత ఏం చేసింది?.. కార్తీక్ ఏం ఆలోచిస్తున్నాడు?.. మోనిత ఇంకా తాటికొండ‌లోనే వుందా? అన్న‌ది  చూడాల్సిందే. 

రష్మీ ఊ.. అంటే ఊహూ.. అంటారా?

  ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా ర‌ష్మీ గౌత‌మ్ ఏ స్థాయిలో పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే. ఆ స్టేజ్ పై ఆమె మెరుపులు మెరిపిస్తున్నారు. త‌నదైన మార్కు యాంక‌రింగ్ తో మెస్మ‌రైజ్ చేస్తున్నారు. ర‌ష్మీకి తోడు సుడిగాలి సుధీర్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అయితే గ‌త కొన్ని రోజులుగా సుడిగాలి సుధీర్ సినిమా షూటింగ్ ల కార‌ణంగా ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ లో క‌నిపించ‌డం లేదు. అయినా ర‌ష్మీ జోరు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.   Also read: ​సుధీర్‌, ర‌ష్మీ జోడీ లేకుంటే 'ఢీ' ప‌రిస్థితి? ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోలో భాగంగా సంక్రాంతి స్పెష‌ల్ ఎపిసోడ్ ల‌ని ప్లాన్ చేశారు. `అమ్మమ్మ గారి ఊరు` పేరుతో సంక్రాంతి వంట‌లు అంటూ కొత్త కామెడీ షోని సంక్రాంతి స్ప‌ష‌ల్ గా ప్లాన్ చేశారు. ఈ షోలో హైప‌ర్ ఆది, ప్ర‌దీప్‌, రోజా, ఆమ‌ని, ఆటో రాంప్ర‌సాద్‌, వ‌ర్ష‌, బాబూ మోహ‌న్‌, ర‌ష్మీ గౌత‌మ్‌, ఇమ్మానుయేల్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అన్న‌పూర్ణ‌మ్మ .. ఆది, ఆటో రాంప్ర‌సాద్‌, వ‌ర్ష‌ల‌పై వేసిన పంచ్‌లు ఓ రేంజ్ లో పేలి న‌వ్వులు కురిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ గా మారింది. Also read: ​దాని కోసం ర‌ష్మి-సుధీర్ క్రేజ్‌ను వాడుకోకండి.. జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ వార్నింగ్‌! ఈ ఎపిసోడ్ లో మ‌రో హైలైట్ ఏంటంటే ర‌ష్మీ గౌత‌మ్ `పుష్ప‌`లో స‌మంత చేసిన స్పెష‌ల్ సాంగ్ `ఊ అంటా మావ ఉఊ అంటావా` కు పెర్ఫార్మ్ చేయ‌డం. సమంత ఏ రేంజ్ లో హీటెక్కించిందో అదే స్థాయిలో ర‌ష్మీ గౌత‌మ్ త‌న హొయ‌ల‌తో హీటెక్కించింది. ఈ పాట‌కు ర‌ష్మీ డ్యాన్స్ చేస్తుంటే "ర‌ష్మీ చేస్తే ఎవ‌రైనా `ఊ` అనాల్సిందే" అంటూ పంచ్ వేశాడు హైప‌ర్ ఆది.  ర‌ష్మీ కైపెక్కించే చూపుల్తో ర‌చ్చ చేసిన ఈ డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ ఎపిసోడ్ ఈరోజు ఉద‌యం 9: 00 గంట‌ల‌కు ప్ర‌సారం అయ్యింది.

దీప్తి-ష‌న్ను రిలేష‌న్‌షిప్‌పై గుడ్ న్యూస్ చెప్పిన ష‌ణ్ముఖ్ ఫాద‌ర్‌!

  బిగ్‌ బాస్ సీజ‌న్ 5 ముగిసింది కానీ దాని వ‌ల్ల కొంత మంది జీవితాల్లో ఏర్ప‌డిన క‌ల‌త‌లు ఇంకా తీర‌డం లేదు. మ‌రీ ప్ర‌ధానంగా ఈ షో వ‌ల్ల పొందిన దానికంటే న‌ష్ట‌పోయింది షన్ను, దీప్తి. దీప్తికి నేరుగా షోతో సంబంధం లేకపోయినా ష‌న్ను కార‌ణంగా వార్త‌ల్లో నిలిచింది. ఈ ఇద్ద‌రూ గ‌త ఐదేళ్లుగా ప్రేమ‌లో మునిగితేలారు. అయితే ఇటీవ‌ల బిగ్‌బాస్ షో కార‌ణంగా వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింది. అది చివ‌రికి  బ్రేక‌ప్ చెప్పుకునేంత వ‌ర‌కు వెళ్లింది.   Also read: ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌కు మ‌ళ్లీ షాక్‌.. త‌గ్గేదేలే అంటున్న దీప్తి! దీనిపై ఇద్ద‌రూ సోష‌ల్‌ మీడియా వేదిక‌గా త‌మ బాధ‌ని వెలిబుచ్చిన విష‌యం తెలిసిందే. ష‌ణ్ముఖ్, దీప్తి సున‌య‌న మ‌ళ్లీ క‌లుస్తారా?.. క‌లిసే ఛాన్స్ వుందా? అంటే ష‌ణ్ముఖ్ ఫాద‌ర్ వుందంటూ గుడ్ న్యూస్ చెప్పారు. వాళ్లు క‌లుస్తార‌ని, అభిమానులు కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు ష‌ణ్ముఖ్ తండ్రి. "వాళ్లిద్ద‌రూ క‌లిసే వుంటారు. బ్రేక‌ప్ దీప్తి చెప్పింది కానీ ష‌ణ్ముఖ్ చెప్ప‌లేదుగా.. వ్య‌క్తిగ‌త విష‌యాలు మ‌నం మాట్లాడ‌కూడ‌దు. ఆ అమ్మాయికి ఏమ‌నిపించిందో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాళ్లు క‌ల‌వ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుందేమో కానీ వాళ్లు క‌లిసే వుంటారు. ఇది రెండు కుటుంబాల‌కు సంబంధించిన విష‌యం. అంతా శుభ‌మే జ‌రుగుతుంది. ఈ విష‌యంలో అభిమానులు అనుమానించాల్సిన అవ‌స‌ర‌మే లేదు" అని చెప్పుకొచ్చారు ష‌ణ్ముఖ్ ఫాద‌ర్‌. దీంతో ష‌న్ను, దీప్తి అభిమానులు హ‌ర్షాతిరేకాల‌ని వ్య‌క్తం చేస్తున్నారు.  Also read: ​బ్రేకప్ తర్వాత ఊహించని సర్ప్రైజ్.. దీప్తితో కలిసున్న ఫోటో షేర్ చేసిన షణ్ముఖ్! అయితే ష‌న్ను ప్ర‌వ‌ర్త‌న‌తో దీప్తి మ‌న‌సు విరిగిపోయింద‌నీ, అందుకే బ్రేక‌ప్ చెప్పింద‌నీ చాలామంది న‌మ్ముతున్నారు. మ‌రి త‌ను ష‌న్నును ఎలా క్ష‌మించి మ‌ళ్లీ అత‌నికి చేరువవుతుంది? అని ప్ర‌శ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. మ‌రి ష‌న్ను వాళ్ల నాన్న చెప్పిన‌ట్లు ఈ ఎక్స్ ల‌వ‌ర్స్ మ‌ళ్లీ క‌లుస్తారా? లెట‌జ్ వెయిట్ అండ్ సీ.

ఆది కోసం కొట్టుకున్న రోజా, ఆమ‌ని.. ఏంటిది?

  జ‌బ‌ర్ద‌స్త్ షో బుల్లితెర హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ వేదిక‌పై క‌మెడియ‌న్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. స‌మ‌యం చిక్కితే స్టార్ పై కూడా అదిరిపోయే పంచ్ లు వేస్తూ అద‌ర‌గొట్టేస్తున్నారు. గ‌త కొన్నేళ్లుగా విజ‌య‌వంతంగా సాగుతున్న ఈ ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షో పండ‌గ స్పెష‌ల్ ప్రోగ్ర‌మ్స్ అంటూ కొత్త కొత్త కాన్సెప్ట్ ల‌తో స‌రికొత్త ఎపిసోడ్ ల‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సంక్రాంతి సంద‌ర్భంగా న‌టి అన్న‌పూర్ణ ప్ర‌ధానంగా `అమ్మ‌మ్మ‌గారి ఊరు` పేరుతో ప్ర‌త్యేక ఎపిసోడ్ ని చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షో లో హైప‌ర్ ఆది చేసిన అల్ల‌రి అంతా ఇంతా కాదు. ఈ క‌మెడియ‌న్ కోసం ఒక‌నాటి పాపుల‌ర్ హీరోయిన్ లు ఇద్ద‌రు గొడ‌వ‌కు దిగ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఆ ఇద్ద‌రు హీరోయిన్ లు మ‌రెవ‌రో కాదు రోజా, ఆమ‌ని. ఈ షోలో `శుభ‌ల‌గ్నం` స్కిట్ ని హైప‌ర్ ఆది, ఆమ‌ని, రోజా చేశారు. హైప‌ర్ గా పంచ్ ల మీద పంచ్ లు వేసే ఆదిని.. నాకంటే నాకంటూ ఈ ఇద్ద‌రు హీరోయిన్ లు కొట్టుకునేంత ప‌ని చేశారు. హైప‌ర్ ఆదిని ఆమ‌ని ద‌గ్గ‌రి నుంచి రోజా కొనేస్తుంది. అక్క‌డి నుంచి హైప‌ర్ ఆది.. రోజా పై ప్రేమ‌ని చూపించ‌డం మొద‌లుపెడ‌తాడు. దీంతో 'అదేంటీ నాద‌గ్గ‌ర వున్న‌ప్ప‌డు ఇంత ప్రేమ‌లేదే .. అయితే ఇత‌ను నాకే కావాలి' అంటుంది ఆమ‌ని, 'లేదు నాకే కావాల‌'ని రోజా అన‌డం మొద‌లుపెడుతుంది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డుస్తుంది. ఈ సీనంతా గ‌మ‌నించిన హైప‌ర్ ఆదీ .. 'మీరెప్పుడైనా అనుకున్నారా? నా కోసం ఇలా మీరిద్ద‌రు కొట్టుకోవాల్సి వ‌స్తుంద‌ని' అన‌డంతో షోలో న‌వ్వులు విరిసాయి. ఈ షోలో `బంగార్రాజు` హీరోయిన్ కృతిశెట్టి, డైరెక్ట‌ర్ క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల గెస్ట్ లు గా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ జ‌న‌వ‌రి 15న సంక్రాంతి సంద‌ర్భంగా ఉద‌యం 9:00 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది. 

రుద్రాణి వంటింట్లో దీప.. ఏం జ‌రుగుతోంది?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక‌ దీపం`. గ‌త కొన్ని వారాలుగా ట్విస్ట్ ల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ తాజాగా మ‌రో ట్విస్ట్ కు తెర‌లేపింది. సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల కార్‌ని ఫాలో అవుతూ మోనిత తాటికొండ గ్రామంలోకి ఎంట్రీ ఇస్తుంది. అక్క‌డ వారు ఆశ్ర‌మంలో చేర‌డాన్ని గ‌మ‌నించి ఇదే గ్రామంలో త‌న ప‌నిమ‌నిషి ప్రియ‌మ‌ణిని వెత‌క‌డం మొద‌లుపెడుతుంది. ఇదే క్ర‌మంలో కార్తీక్ ప‌ని చేస్తున్న హోట‌ల్ లోకి వెళుతుంది. ఈ గురువారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది. ఈ గురువారం 1248వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. హోట‌ల్ లోప‌లికి వ‌చ్చిన మోనిత‌ని చూసి కార్తీక్ షాక్ కు గురై దాక్కంటే మ‌రో స‌ర్వెంట్ అన్నిగాడు.. మోనిత సినిమా హీరోయిన్ లా వుంద‌ని తానే వెళ‌తాన‌ని త‌న ద‌గ్గ‌రికి వెళతాడు. మోనిత‌ని ప్ర‌శ్న‌ల‌తో వేధించ‌డం మొద‌లుపెడ‌తాడు. విసుక్కుంటూనే అప్పిగాడికి స‌మాధానాలు చెబుతుంది మోనిత‌. 'మీరు సినిమా యాక్ట‌రా?' అని అడిగితే 'నేను డాక్ట‌ర్ ని' అని చెబుతుంది. 'అయితే మీ భ‌ర్త కూడా డాక్ట‌రే' అంటాడు అప్ప‌గాడు. దీంతో మోనిత సంబ‌ర‌ప‌డిపోతుంది. Also Read: నాగిన్ డ్యాన్స్‌..కాజ‌ల్‌, యానీ ఇంత షాకిచ్చారేంటీ? క‌ట్ చేస్తే ... రుద్రాణి వంటింట్లో దీప ఎంట్రీ... `ఏంటీ రుద్రాణి గారు అంతా కుశ‌ల‌మా..? ఏం లేదు ఇంట్లో గ్యాస్ అయిపోయింది. వంట చేసుకుందాం అని కూర‌గాయ‌లు బియ్యం తెచ్చుకున్నాను. నేను వంట చాలా త్వ‌ర‌గా చేస్తాను` అంటుంది దీప న‌వ్వుతూ.. 'నువ్వేంటీ దీపా ఇక్క‌డా.. అయినా గ్యాస్ అయిపోతే నా ఇంట్లో నా కిచెన్ నువ్వు ఎలా వాడ‌తావ్‌' అని రుద్రాణి అరుస్తుంది. 'క‌రెక్ట్ పాయింట్ లోకి వ‌చ్చావ్‌.. నేనే వ‌స్తే మీకు ఇంత కోపం వ‌చ్చింది.. మ‌రి నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న పిల్ల‌ల జోలికి వ‌స్తే నాకు ఎంత కోపం రావాలి?' అంటూ దీప న‌వ్వుతూనే రుద్రాణికి షాకిస్తుంది.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

`ఇంటింటి గృహ‌ల‌క్ష్మి`: నందు, తుల‌సీ ఉగ్ర‌రూపం..

ఓ వైపు నందుకు జాబ్ వ‌చ్చేసింద‌ని ఇంట్లో వాళ్లంతా సంబ‌రాల్లో మునిగితేలుతుంటే లాస్య నుంచి ఊమించ‌ని ప్ర‌తిఘ‌ట‌న ఎదురౌతుంది. నందుని త‌న నుంచి దూరం చేయ‌డానికి కుట్ర చేస్తున్నార‌ని ఊహించుకున్న లాస్య‌.. తుల‌సిపై ప‌గ సాధించాల‌ని ప్లాన్ చేస్తుంది. స‌రైన అద‌ను కోసం ఎదురుచూస్తున్న లాస్య‌కు ప్రేమ్ - శృతిల రూపంలో బ్ర‌హ్మాస్త్రం ల‌భిస్తుంది. అదేంట‌న్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. షేర్ మార్కెట్ లో డ‌బ్బులు పెట్టి కోట్లు సంపాదించేయ‌డానికి తుల‌సి పెద్ద కుమారుడు అభి నిర్ణయించుకుంటాడు. తన మిత్రుడికి ఫోన్ చేసి తానూ షేర్ మార్కెట్ లో డ‌బ్బులు పెడ‌తాన‌ని చెబుతాడు. అయితే షేర్ మార్కెట్ అనేది ల‌క్ ని బ‌ట్టి వుంటుంద‌ని వ‌స్తే ఒకేసారి కోట్లు వ‌స్తాయి. లేదంటే పెట్టిన డ‌బ్బులు పోతాయి. తీరా డ‌బ్బులు పోతే త‌న‌ని బాధ్య‌త కాద‌ని అందులో ఉన్న రిస్క్ ని అభికి వివ‌రిస్తాడు అత‌ని మిత్రుడు. అయితే అబి మాత్రం చేతులు కాల్చుకోవ‌డానికే రెడీ అవుతాడు. Also Read: ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌కు మ‌ళ్లీ షాక్‌.. త‌గ్గేదేలే అంటున్న దీప్తి! క‌ట్ చేస్తే... పెళ్లైనా కాపురం చేయ‌డం లేద‌ని వేరుగా వుంటున్నార‌ని ఇంట్లో వాళ్ల‌కి తెలిసిపోతుంద‌ని, ఆ త‌రువాత మ‌న ప‌రిస్థితి ఏంట‌ని శృతి.. ప్రేమ‌తో అంటుంది. అది లాస్య చెవిన ప‌డుతుంది. `వీళ్ల‌కి పెళ్లి అయినా కాపురం చేయ‌డం లేదా? ఇన్నాళ్లూ ఎంత బిల్డ‌ప్ ఇచ్చారు? ఆ విష‌యం నేను బ‌య‌ట‌పెడ‌తాను క‌దా నాకు బ్ర‌హ్మాస్త్రం దొరికింది ఇక ఇద్ద‌రిని ఉతికి ఆరేస్తాను? అని సంబ‌ర‌ప‌డిపోతుంది లాస్య‌. శృతి అన్న మాట‌లు తుల‌సి చెవిన ప‌డితే ఏం జ‌రిగింది? ... లాస్య మాట‌ల‌కు నందు రియాక్ష‌న్ ఏంటీ? ఎలాంటి  ఉగ్ర రూపం దాల్చారు అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

తాగుబోతు ర‌మేష్‌కు రంగ‌మ్మ‌త్త జ‌బ‌ర్ద‌స్త్ పంచ్‌!

బుల్లితెర కామెడీ షో  జ‌బ‌ర్ద‌స్త్. ఈ షోతో చాలా మంది పాపుల‌ర్ అయ్యారు. సుడిగాలి సుధీర్, ర‌ష్మి గౌత‌మ్ జంట గురించి అయితే ఇక చెప్పాల్సిన ప‌ని లేదు. వీరిద్ద‌రు ఈ షో కార‌ణంగా సెల‌బ్రిటీలుగా మారిపోయారు. ఇదే షోలో హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన అన‌సూయ కూడా స్టార్ గా మారిపోయింది. సినిమాల్లో న‌టిస్తూనే మ‌రో ప‌క్క జ‌బ‌ర్ద‌స్త్ షోలోనూ కంటిన్యూ అవుతోంది. తాజాగా సంక్రాంతి ఫెస్టివ‌ల్ కోసం ప్ర‌త్యేక ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఈ షోలో యంగ్ డైరెక్ట‌ర్ మారుతి గెస్ట్ గా హాజ‌ర‌య్యారు.  రోజా, సింగ‌ర్ మ‌నో న్యాయ‌నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట ఆక‌ట్టుకుంటోంది. ప్రోమో స్టార్టింగ్ లో అన‌సూయ‌, మారుతి డ్యాన్స్ చేస్తూ హుషారుగా క‌నిపించారు. ఆ త‌రువాత హైప‌ర్ ఆది త‌న టీమ్ తో ఎంట్రీ ఇచ్చి హ‌ల్ చ‌ల్ చేశాడు. త‌న టీమ్ మెంబ‌ర్స్ పై హైప‌ర్ ఆది వేసిన పంచ్ లు న‌వ్వులు కురిపించాయి. నా కోసం అభిమానులు క్యూ క‌డుతున్నార‌ని ఓ కంటెస్టెంట్ అన‌గానే "ఇప్పుడే పునుగుల కోసం గంట‌న్న‌ర క్యూలో నిల‌బ‌డ్డావ్. అలాంటి నీకోసం అభిమానులు క్యూ క‌డుతున్నారా?" అని హైప‌ర్ ఆది పంచ్ వేయ‌డంతో అక్క‌డ న‌వ్వులు విరిశాయి. ఆ వెంట‌నే తాగుబోతు ర‌మేష్ ఎంట్రీ ఇచ్చాడు. హుషారుగా డ్యాన్స్ చేస్తూ తాగుబోతు ర‌మేష్ స్టేజ్ పైకి వ‌చ్చేశాడు. వెంట‌నే అత‌న్ని గ‌మ‌నించిన మారుతి "ర‌మేష్ నువ్వు ఎంత ఫ్రెష్ గా రెడీ అయిన వ‌చ్చినా ఇప్పుడే బార్ నుంచి వ‌చ్చిన‌ట్టుగా వుంటావు" అని పంచ్ వేశాడు. వెంట‌నే అందుకున్న అన‌సూయ "మీరు కాబ‌ట్టి అనేశారు మేమైతే అలా అన‌లేం క‌దా?" అంటూ జోక్ పేల్చింది. ఈ పంచ్ ప‌డ‌గానే రోజా, మారుతి, తాగుబోతు ర‌మేష్‌, మ‌నో గొల్లున న‌వ్వేశారు. ఈ రోజు రాత్రి ప్ర‌సారం కానున్న ఈ షో ప్రోమో నెట్టింట వైర‌ల్ గా మారింది. 

షాకింగ్ : మోనిత‌కు అడ్డంగా దొరికిన డాక్ట‌ర్ బాబు

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న పాపుల‌ర్ సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొన్ని వారాలుగా ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ తాజాగా ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతూ మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సౌంద‌ర్య‌, ఆనంద‌రావు తాటికొండ గ్రామంలోని ప్ర‌కృతి వైద్యాల‌యంలో చేర‌డంతో వారినే అనుస‌రిస్తూ వెళ్లిన మోనిత అదే గ్రామంలో వున్న ప్రియ‌మ‌ణిని వెత‌క‌డం మొద‌లుపెడుతుంది. ప్రియ‌మ‌ణి ఫొటో చూపిస్తూ త‌న కోసం ఆరా తీస్తుంటుంది. 1247వ ఎపిసోడ్ ఈ రోజు ప్ర‌సారం కాబోతోంది. మ‌రి ఈ రోజు హైలైట్స్ ఏంటో చూద్దాం. సౌంద‌ర్య‌, ఆనంద‌రావు వెళ్లిపోవ‌డంతో ఒంట‌రి వాళ్లం అయిపోయిన‌ట్లుగా వుంద‌ని, కుటుంబం ఇలా చిన్నాభిన్నంగా మారింద‌ని ఆదిత్య‌, శ్రావ్య బాధ‌ప‌డుతుంటారు. ఇదిలా వుంటే సౌంద‌ర్య‌ ప్ర‌కృతి వైద్య‌శాల‌లో ఒంట‌రిగా కూర్చుని మ‌హేష్ కి కాల్ చేసి అన్ని ఊర్లు తిరుగుతున్నావా బాబు` అంటుంది. వెతుకుతున్నాన‌మ్మా.. అన్నీ వెతుకుతున్నాను... ఈ సారి నాకు కాస్త పేమెంట్ పెంచండ‌మ్మా నాకు క‌ష్ట‌మ‌వుతోంది.. ఈ సారి ఇంటికి వ‌చ్చి డ‌బ్బులు తీసుకుంటాను అంటాడు మ‌హేష్‌. అయితే ఇప్పుడు మేము ఆ ఇంటిలో లేమ‌ని, ఆశ్ర‌మంలో జాయిన్ అయ్యామ‌ని చెబుతుంది సౌంద‌ర్య‌. క‌ట్ చేస్తే .. హోట‌ల్ ఓన‌ర్ `బాబు పార్సిల్ క‌ట్టారా.. ఆ సైకిల్ మీద వెళ్లి పార్సిల్ ఇవ్వు` అంటాడు. దానికి వేడి వేడిగా క‌డ‌తాను సార్‌` అని స‌మాధానం చెబుతాడు కార్తీక్‌. ఇంత‌లో మోనిత లోప‌లికి వ‌స్తుంది. అప్ప‌టికి కార్తీక్ వంట చేసే ద‌గ్గ‌రికి వెళ‌తాడు. ఇంత‌లో మోనిత లోప‌లికి వ‌చ్చి కూర్చుంటుంది. అది గ‌మ‌నించిన ఓన‌ర్ `అరేయ్ అప్పిగా.. క‌ష్ట‌మ‌ర్ వ‌చ్చారు చూడే` అని అరుస్తాడు. నువ్వు జూనియ‌ర్ వి వెళ్లు అని అప్పిగాడు కార్తీక్ ని వెళ్ల‌మంటాడు.  కార్తీక్ వెళుతుంటే మోనిత‌ని గ‌మ‌నించిన అప్పిగాడు `సినిమా హీరోయిన్ లా వుందే` అని మ‌న‌సులో అనుకుని కార్తీక్ ని ఆపేసి త‌ను వెళ‌తాడు. ఇంత‌కీ వ‌చ్చింది ఎవ‌రని కార్తిక్ తొంగి చూస్తే మోనిత క‌నిపిస్తుంది. మోనిత కూడా కార్తీక్ ని చూడ‌టంతో త‌ను అడ్డంగా దొరికిపోతాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

తాటికొండ‌లో మోనిత‌, సౌంద‌ర్య‌, ఆనందరావు!

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న పాపుల‌ర్ సీరియ‌ల్ `కార్తీక దీపం`. ప్రేమీ విశ్వ‌నాథ్‌, ప‌రిటాల నిరుప‌మ్ దంప‌తులుగా న‌టిస్తున్న ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపుల‌తో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. ఈ మంగ‌ళ‌వారం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించ‌బోతోంది. దీప, డాక్ట‌ర్ బాబు త‌న పిల్ల‌ల‌తో క‌లిసి తాటికొండ గ్రామంలో త‌ల‌దాచుకుంటుంటారు. అక్క‌డికే ఒక‌వైపు మోనిత‌.. మ‌రోవైపు సౌంద‌ర్య, ఆనంద‌రావులు వ‌స్తే ఏం జ‌రిగింది? అన్న‌ది ఈ రోజు ఆస‌క్తిక‌ర అంశం. ఈ మంగ‌ళ‌వారం 1246వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. దీప‌, కార్తీక్ ల‌ని వెతుక్కుంటూ సౌంద‌ర్య‌, ఆనంద‌రావు కారులో బ‌య‌లుదేర‌తారు. 'శ్రావ్య‌, ఆదిత్య‌ల‌కు అప్ప‌గింత‌లు పెట్టి మావ‌య్య‌, ఆంటీ ఎక్క‌డికి వెళుతున్నారు? .. ఫాలో అయితే పోలా?' అంటూ మోనిత కారులో ఫాలో అవుతుంది. క‌ట్ చేస్తే కార్తీక్.. బాబుతో ఆడుకుంటూ 'ఏంట్రా ప‌డుకో' అంటాడు. వెంట‌నే దీప 'ఏమండీ త‌న‌ని అరే ఒరే అన‌కండి.. ఆనంద్ అంటే మావ‌య్య‌గారి పేరుగా` అంటుంది. కార్తీక్ కి గ‌తంలో మోనిత అన్న మాట‌లు గుర్తొస్తాయి. క‌ట్ చేస్తే కారులో సౌంద‌ర్య‌, ఆనంద‌రావు తాడికొండ గ్రామంలోకి వెళ్తారు. వెన‌కే వ‌స్తున్న మోనిత షాకై 'ఏంటీ ఇది ప్రియ‌మ‌ణి ఊరు క‌దా?  కొంప‌దీసి త‌ను పార్టీ మార్చీ వీరికి స‌హ‌క‌రించ‌డం లేదు కదా?' అని అనుమానిస్తుంది. అయితే సౌంద‌ర్య‌, ఆనంద‌రావు  వ‌చ్చింది ఆ గ్రామంలోని ప్ర‌కృతి వైద్య‌శాల‌లో చేర‌డానిక‌ని తెలిసి మోనిత ఊపిరి పీల్చుకుంటుంది. 'ఎందుకో ఒకందుకు ఈ ఊరికైతే వ‌చ్చాను. ప్రియ‌మ‌ణి ఎక్క‌డుందో వెత‌కాలి' అని త‌న కోసం వెతుకులాట మొద‌లుపెడుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

బాలయ్య 'అన్ స్టాపబుల్' ఎనర్జీ.. నువ్వు 'రౌడీ' అయితే నేను 'రౌడీ ఇన్ స్పెక్టర్'!

'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోతో నటసింహం బాలకృష్ణ ఎనర్జీ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు తెలిసింది. ఆయన కామెడీ టైమింగ్ కి, అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అందుకే ఆహాలో ప్రసారమవుతున్న 'అన్ స్టాపబుల్' షోకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటిదాకా విడుదలైన అన్ని ఎపిసోడ్స్ కి సూపర్ రెస్పాన్స్ రాగా.. తాజాగా తొమ్మిదో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. 'లైగర్' మూవీ టీమ్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, ఛార్మి పాల్గొన్న ఈ ఎపిసోడ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. సంక్రాంతి సందర్భంగా టెలికాస్ట్ కానున్న ఈ ఎపిసోడ్ లో బాలయ్య పంచెకట్టులో కనిపిస్తున్నారు. ప్రోమోలో 'మాటల గన్.. మన జగన్ కి స్వాగతం' అని పూరిని బాలయ్య ఆహ్వానించగా.. పూరి రావడం ఆలస్యం కావడంతో.. బాలయ్య ఆయన్ని ఇమిటేట్ చేసి నవ్వించారు. ఏంటి జగ్గూ లేట్ అయిందేంటి? అని అడిగిన బాలయ్య.. వెంటనే వెళ్లి గెస్ట్ సోఫాలో కూర్చొని 'ఏం చేయమంటారు సార్.. ఇద్దరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్' అంటూ పూరిని ఇమిటేట్ చేశారు. అదే సమయంలో ఎంటర్ అయిన పూరి బాలయ్యని హగ్ చేసుకొని తన అభిమానాన్ని చాటుకున్నారు. తాను ఎప్పటికీ మర్చిపోలేని పూరి దర్శకత్వంలో వచ్చిన 'పైసా వసూల్' మూవీలో తేడా సింగ్ అని బాలయ్య తెలిపారు. 'మామా ఏక్ పెగ్ లా' అంటూ తనదైన శైలిలో జోకులేసి నవ్వించారు బాలయ్య. అంతేకాదు నీకు స్పానిష్ ల్యాంగ్వేజ్ ఇష్టం కదా అంటూ బాలయ్య నోటికొచ్చిన పదాలు మాట్లాడగా.. ఇది స్పానిష్ కాదంటూ పూరి చెప్పడం నవ్వులు పూయించింది. ఇక ప్రోమోలో బాలయ్య పంచె పైకి కట్టి విజయ్ తో బాక్సింగ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే అర్జున్ రెడ్డికి సమరసింహా రెడ్డి స్వాగతం అన్న బాలయ్య.. నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్స్పెక్టర్ అని అన్నారు. ఛార్మిపై కూడా తనదైన శైలిలో పంచ్ లు పేల్చారు బాలయ్య. 'అల్లరి పిడుగు' సినిమా టైంలో అల్లరిగా ఉండేదానివి, ఇప్పుడు పిడుగులా తయారయ్యావ్ అని ఛార్మిని బాలయ్య అన్నారు. అలాగే ముగ్గురు గెస్ట్ లకు కొబ్బరి బోండాలు స్వయంగా కొట్టి ఇచ్చిన బాలయ్య.. ఈ సైడ్ బిజినెస్ ఏదో బాగుందే అని నవ్వించారు. ఇక కొబ్బరి బోండం తీసుకున్న ఛార్మి బ్యాంకాక్ లో అయితే ఇందులో వోడ్కా కలిపిస్తారని అనగా.. అన్ని చేశాకే ఇక్కడికొచ్చి కూర్చున్నాం అని బాలయ్య తన టైమింగ్ తో అదరగొట్టారు. జనవరి 14 నుంచి ఆహాలో ప్రసారం కానున్న ఎపిసోడ్ కి గత ఎపిసోడ్స్ కి మించిన రెస్పాన్స్ రావడం ఖాయమనిపిస్తోంది.

రొమాన్స్‌లో నిండా మునిగిపోయిన మోనిత‌, ఆదిత్య!

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. ఇందులో మోనిత పాత్ర‌లో శోభాశెట్టి త‌న‌దైన న‌ట‌న‌తో విల‌న్ గా ఆక‌ట్టుకుంటూ మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇదే సీరియ‌ల్ లో డాక్ట‌ర్ బాబు సోద‌రుడిగా ఆదిత్య పాత్ర‌లో న‌టించిన య‌శ్వంత్ కూడా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఇందులో శోభాశెట్టి, య‌శ్వంత్ వ‌దినా మ‌రుదులుగా న‌టించారు.   క‌ట్ చేస్లే ఈ ఇద్ద‌రు క‌లిసి రొమాన్స్ చేస్తుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. విష‌యం తెలిసిన వాళ్లంతా 'ఏంటీ డాక్ట‌ర్ బాబు.. ఏం జ‌రుగుతోంది?' అంటూ కామెంట్ లు చేస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే... మోనిత‌గా న‌టిస్తున్న శోభా శెట్టి, ఆదిత్య‌గా న‌టిస్తున్న య‌శ్వంత్ ఆఫ్ స్క్రీన్ లో మంచి ఫ్రెండ్స్‌. యూట్యూబ్ ఛాన‌ల్ లో ఇద్ద‌రు జంట‌గా క‌నిపించిన సంద‌ర్భాలున్నాయి. ఈ ఇద్ద‌రు క‌లిసి ఓ మ్యూజిక్ ఆల్బ‌మ్ కోసం వ‌ర్షంలో త‌డుస్తూ రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టించ‌డం, శోభా శెట్టికి య‌శ్వంత్ ముద్దు పెట్ట‌డం హాట్ టాపిక్ గా మారింది. వీరిద్ద‌రూ క‌లిసి `బుజ్జి బంగారం` అనే ఓ ప్రైవేట్ ఆల్బ‌మ్ లో న‌టించారు. శోభా శెట్టి న‌టించి ప్రొడ్యూస్ చేసింది. దీనికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ , సెకండ్ లుక్ పోస్ట‌ర్ లు ఇప్ప‌టికే నెట్టింట సంద‌డి చేశాయి. తాజాగా ఈ ఆల్బ‌మ్ నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్ ని విడుద‌ల చేశారు. ఇందులో ఇద్ద‌రి మ‌ధ్య రొమాన్స్, కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పండింది. ఈ వీడియోలో య‌శ్వంత్‌.. శోభా శెట్టిపై ముద్దుల వ‌ర్షం కురిపించాడు. దీంతో ఇప్పుడు ఈ జంట నెట్టింట వైర‌ల్ గా మారింది. 

ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌కు మ‌ళ్లీ షాక్‌.. త‌గ్గేదేలే అంటున్న దీప్తి!

దీప్తి సున‌య‌న‌, ష‌ణ్ముఖ్  జ‌స్వంత్ బ్రేక‌ప్ వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన విష‌యం తెలిసిందే. బిగ్‌ బాస్ సీజ‌న్ 5 వీరి మ‌ద్య అగాధాన్ని ఏర్ప‌రిచింది. సిరితో ష‌న్ను అతి క్లోజ్‌గా వుండ‌టం దీప్తితో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌కు న‌చ్చ‌లేద‌ని, ఈ అతిని వ‌దిలించుకోమ‌ని ఆమెకు చెప్ప‌డం వ‌ల్లే ష‌న్నుకు దీప్తి బ్రేక‌ప్ చెప్పేసింద‌ని సోష‌ల్‌ మీడియాలో కామెంట్ లు వినిపిస్తున్నాయి. Also Read: బ్రేకప్ తర్వాత ఊహించని సర్ప్రైజ్.. దీప్తితో కలిసున్న ఫోటో షేర్ చేసిన షణ్ముఖ్! తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో దీప్తి, ష‌న్ను ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టుగా విడిపోయారు. అయితే ఆమెకు ద‌గ్గ‌ర కావాల‌ని ష‌న్ను మ‌ళ్లీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. దీప్తి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ష‌న్ను త‌న‌తో క‌లిసి పంచుకున్న ఓ పాత ఫొటోని షేర్ చేసి దీప్తిని స‌ర్‌ప్రైజ్ చేయాల‌ని ప్లాన్ చేశాడు. కానీ దీప్తి మాత్రం అత‌న్ని పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్టు లేదు. అత‌ని పోస్ట్ పై ఆమె ఎలాంటి కామెంట్ చేయ‌లేదు స‌రికదా త‌గ్గేదే లే అన్న‌ట్టుగా ష‌న్నుని బ్లాక్ చేసింది కూడా. ప్ర‌స్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కేరీర్ కోసం ఆలోచిస్తున్నాన‌ని, షూటింగ్ చేసి చాలా రోజుల‌వుతోంద‌ని, త్వ‌ర‌లోనే కెమెరా ముందుకు వ‌స్తాన‌ని రీసెంట్ గా పోస్ట్ చేసిన ష‌ణ్ముఖ్ ఉన్న‌ట్టుండి దీప్తిని ప్ర‌స‌న్నం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంటే, కొంత మంది మాత్రం ష‌న్ను చేస్తున్న పనులు న‌చ్చ‌క సెటైర్లు వేస్తున్నారు. 'చేసిందంతా చేసి చేతుల కాలాక ఇప్పుడు ఆకులు ప‌ట్టుకుంటున్నావేంటి?' అని కౌంట‌ర్లు ఇస్తున్నారు.