రాజ‌నందిని ఎంట్రీ 

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న డైలీ సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. మ‌రాఠీ సీరియ‌ల్ `తులా ఫ‌టేరే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. ఇప్ప‌టికి ఎనిమిది భాష‌ల్లో ఈ సీరియ‌ల్ రీమేక్ అయి విజ‌య‌వంతంగా ప్రసారం అవుతోంది. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో స‌రికొత్త కాన్సెప్ట్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. `బొమ్మ‌రిల్లు` వెంక‌ట్ శ్రీ‌రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించి నిర్మించారు. వ‌ర్ష హెచ్ కె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించించింది. Also Read: రుద్రాణికి కార్తీక్ ఎవ‌రో తెలిసిపోతుందా? ఈ సీరియ‌ల్ లోని ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, రామ్ జ‌గ‌న్‌, విశ్వ‌మోహ‌న్‌, అనూష సంతోష్, రాధాకృష్ణ‌, జ‌య‌ల‌లిత‌, వ‌ర్ష‌, క‌ర‌ణ్‌, ఉమాదేవి, మ‌ధుశ్రీ‌, జ్యోతిరెడ్డి, సందీప్ న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ శుక్ర‌వారం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించే అంకానికి చేర‌బోతోంది. రాజ‌నందిని ఆత్మ త‌న‌ని ఆదేశించ‌డంతో ఆర్య‌ని, త‌న‌ని కాపాడుకోవ‌డానికి అను ప‌డ‌రాని పాట్లు ప‌డుతుంటుంది. ఈ క్ర‌మంలో జ‌రిగే ప‌రిణామాల కార‌ణంగా ఆర్య ముందు దోషిగా నిలుస్తుండ‌టంతో అనుని ఏదైనా మాన‌సిక వైద్యునికి చూపించాల‌ని ఆర్య వర్ధ‌న్ నిర్ణ‌యించుకుంటాడు. Also Read: చ‌లికాలంలో వేడిపుట్టిస్తున్న పూజ! ఆ వెంట‌నే ఆ నిర్ణ‌యాన్ని అమ‌లు చేస్తాడు కూడా. ఇందులో భాగంగా ఓ మాన‌సిక వైద్యుని ద‌గ్గ‌రికి అనుని తీసుకెళ‌తాడు. త‌న‌ని పిచ్చిదానిగా ఆర్య భావిస్తున్నాడ‌ని తెలిసి అను కుమిలి కుమిలి ఏడుస్తుంది. మ‌న‌సులోనే బాధ‌ప‌డుతుంది. అయితే త‌న కూతురిని మాన‌సిక వైద్యుని వ‌ద్ద‌కు తీసుకొచ్చార‌ని గ్ర‌హించిన అను తండ్రి సుబ్ర‌హ్మ‌ణ్యం ఇది నిజం కాకూడ‌ద‌ని ప‌రుగు ప‌రుగున ఆసుప‌త్రికి వ‌స్తాడు. అయితే త‌న తండ్రి రాక‌ను గ‌మ‌నించిన అను అత‌ని కంట ప‌డ‌కుండా అక్క‌డి నుంచి ఆర్య‌తో క‌లిసి వెళ్లిపోతుంది. Also Read: టూర్ లో శ్రీ‌హాన్‌.. హోమ్ ఐసోలేష‌న్‌లో సిరి.. ఇదే క్ర‌మంలో గుడిలోకి ముసుగుతో ఓ మ‌హిళ ఎంట్రీ ఇస్తుంది. ఆర్చ‌న చేయ‌మ‌ని పూజారికి కొబ్బ‌రి కాయ పూలున్న పాత్ర‌ని అంద‌జేస్తుంది. దీంతో అమ్మా మీ పేరేంట‌ని పూజారి అడ‌గ‌డంతో త‌న పేరు రాజ‌నంద‌ని అని చెప్పి త‌న ముఖం చూపిస్తుంది. దీంతో ఒక్క సారిగా పూజారి షాక్ కు గుర‌వుతాడు. ఇంత‌కీ అనుకు క‌నిపించిన రాజ‌నందిని నిజ‌మైతే మ‌రి గుడిలో అర్చ‌న కోసం వ‌చ్చిన ఈ రాజ‌నందిని ఎవ‌రు? అన్న‌ది తెలియాలంటే శుక్ర‌వారం ఎపిసోడ్ ఖ‌చ్చితంగా చూడాల్సిందే.   

సురేఖావాణి కూతురు షాకిచ్చింది

వెండితెర‌పై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌లో న‌టిస్తూ బిజీగా వున్నారు సురేఖావాణి. సినిమాల్లో హోమ్ లీగా క‌నిపించే సురేఖా వాణి సోష‌ల్ మీడియాలో మాత్రం మోడ్ర‌న్ డ్రెస్సుల్లో కూతురు సుప్రీత‌తో పోటీ ప‌డుతూవుంటుంది. ఈ ఇద్ద‌రూ క‌లిసి సోష‌ల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. గ్లామ‌ర్ ఫొటోలు, డ‌బుస్మాష్ వీడియోల‌తో నానా హంగామా చేస్తుంటారు. వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మామూలుగా లేదు. సుప్రీత గురించి కూడా ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న‌కు సోష‌ల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. చిట్టిపొట్టి డ్రెస్సుల్లో వీరు చేసిన వీడిఓలో నెట్టింట వైర‌ల్ అవ‌డ‌మే కాకుండా నెటిజ‌న్ లు ట్రోల్ చేసిన సంద‌ర్భాలు కూడా చాలానే వున్నాయి. నెట్టింట ఓ రేంజ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న సురేఖావాణి, సుప్రీత గ‌త కొంత కాలంగా త‌మ‌కు న‌చ్చిన ఫొటోలు, వీడియోల‌ని సేర్ చేస్తూ అభిమానుల్ని అల‌రిస్తున్నారు. Also read: ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌ను క‌లిపేందుకు ర‌జ‌నీ విఫ‌ల‌య‌త్నం! త‌ల్లి సురేఖ‌ని మించి సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే సుప్రీత తాజాగా షాకింగ్ అప్ డేట్ ఇచ్చింది. త‌న‌కు కాబోయే జీవిత భాగ‌స్వామిని నెటిజ‌న్ ల‌కు ప‌రిచ‌యం చేసింది. ఓ వ్య‌క్తితో తాను స‌న్నిహితంగా వున్న ఓ ఫొటోని షేర్ చేస్తూ `అత‌ని ప్రేమ‌కు ఓకే చెప్పేశాను` అంటూ ఇన్ స్టా లో ఓ పోస్ట్ పెట్టింది. ప్ర‌స్తుతం సుప్రీత షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.  

స్టోర్ రూమ్ లో బందీగా మ‌ల‌బార్ మాలిని!

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, ఆనంద్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. శుక్ర‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌బోతోంది. పార్ట‌న‌ర్ ఇచ్చే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎక్క‌డ ర‌ద్ద‌వుతుందోన‌ని య‌ష్ త‌న‌తో కొంత సేపు భార్య‌గా న‌టించ‌మ‌ని వేద‌ని కోర‌తాడు. దీంతో ఖుషీ కోసం వేద స‌రే అంటుంది. ఇద్ద‌రు క‌లిసి భోగిమంట‌ల్లో పిడ‌క‌లు వేస్తున్న దృశ్యాన్ని చూసిన వేద సోద‌రి త‌ల్లి పండితారాధ్యుల సులోచ‌నకు చెబుతుంది. దీంతో ఆగ్ర‌హించిన వేద త‌ల్లి సులోచ‌న అస‌లు త‌న వేద‌కు పెళ్లే కాలేద‌ని, య‌ష్ కు త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని య‌ష్ ని అడ్డంగా బుక్ చేస్తుంది. క‌ట్ చేస్తే.. శుక్ర‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌నుంద‌ని తెలుస్తోంది. Also read: సుకుమార్ దర్శకత్వంలో ధనుష్! అంత మంది ముందు య‌ష్ ని బుక్ చేసింద‌ని అత‌ని త‌ల్లి మ‌ల‌బార్ మాలిని .. వేద త‌ల్లి పండితారాధ్యుల సులోచ‌న‌పై ప‌గ ప‌డుతుంది. త‌న‌కు ఎలాగైనా బుద్ధి చెప్పాల‌ని ఎద‌రుచూస్తూ వుండ‌గా మాలినికి ఎదురుప‌డుతుంది సులోచ‌న. దీంతో ఛాన్స్ దొరికింద‌ని వేద త‌ల్లిని దారుణంగా అవ‌మానిస్తుంది. అయితే త‌న‌కూ స‌మ‌యం దొరుకుతుంద‌ని ఎదురుచూసిన వేద త‌ల్లి.. మ‌ల‌బార్ మాలిని స్టోర్ రూమ్ లోకి వెళ్ల‌డం గ‌మ‌నించి త‌ను లోనికి వెళ్ల‌గానే త‌లుపులు మూసి గ‌డియ వేస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? మ‌ల‌బార్ మాలిని ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొంది? ఆ విష‌యం తెలిసి య‌ష్ .. వేద‌తో గొడ‌వ‌కు దిగాడా? అన్న‌ది తెలియాలంటే శుక్ర‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే.

మోనిత క్రూర‌త్వం.. ఆనంద‌రావు ప‌రిస్థితేంటీ?

గ‌త కొన్ని వారాలుగా బుల్లితెర ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. ప‌రిటాల నిరుప‌మ్‌, ప్రేమి విశ్వ‌నాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ డైలీ సీరియ‌ల్ టాప్ రేటింగ్ తో కొన‌సాగుతూ ప్ర‌తీ ఎపిసోడ్ ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపుల‌తో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఈ గురువారం 1254వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ రోజు మోనిత మ‌ళ్లీ త‌న క్రూర‌త్వాన్ని బ‌య‌ట పెట్ట‌బోతోందా?.. త‌న వ‌ల్ల ఎవ‌రికి ప్ర‌మాదం జ‌ర‌గ‌బోతోందన్న‌ది ఈ రోజు హైలైట్ గా నిల‌వ‌బోతోంది. ఇంటికి వ‌చ్చిన దీప.. సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల గురించి ఆలోచిస్తూ వుంటుంది. 'అస‌లు ఏమ‌య్యింది?.. మ‌మ్మ‌ల్ని వెతుక్కుంటూ వ‌చ్చారా? లేక ఏదో జ‌రిగే వ‌చ్చారా?' అని మ‌న‌సులో దీప కంగారు ప‌డుతూ వుంటుంది. ఇదిలా వుంటే కార్తీక్ ఆశ్ర‌మానికి వెళ్లి అక్క‌డ ప‌ని చేస్తున్న ఓ వ్య‌క్తిని `ఇద్ద‌రు పెద్ద‌వాళ్లు వ‌చ్చారు క‌దా.. వాళ్లు ఎందుకు ఇక్క‌డికి వ‌చ్చారు? .. ఆ పెద్దాయ‌న‌కి ఏం స‌మ‌స్య వ‌చ్చింది?' అని ఆరాతీస్తాడు. 'మీకు వాళ్లు తెలుసా?.. మీరు వాళ్ల‌కి తెలుసా?' అంటూ అత‌ను ప్ర‌శ్న‌లు వేస్తాడు. దీంతో కార్తీక్ స‌మాధానం చెప్ప‌లేక అక్క‌డి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. Also Read: ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌ను క‌లిపేందుకు ర‌జ‌నీ విఫ‌ల‌య‌త్నం! క‌ట్ చేస్తే.. 'కార్తీక్ ఎలా వ‌స్తాడు? ఆనంద‌రావు అంకుల్ ని ఆశ్ర‌మంలో ఎందుకు జాయిన్ చేశారు.. ఒక వేళ ఆనంద‌రావు అంకుల్ టపా క‌ట్టేస్తే కార్తీక్ ఎక్క‌డున్నా వ‌చ్చేస్తాడు క‌దా..` అంటూ మోనిత క్రూరంగా ఆలోచించ‌డం మొద‌లుపెడుతుంది. సారీ అంకుల్ అనుకుంటూనే 'నిజ‌మే క‌దా ఆనందరావు అంకుల్ పోతే కార్తీక్ ఎక్క‌డున్నా వ‌చ్చి తీర‌తాడు. అప్పుడే నేను ఆ ఇంటి కోడ‌ల్నే కాబ‌ట్టి నేను అక్క‌డే వుంటాను. కార్తీక్ ని ప‌ట్టుకోవ‌చ్చు..' అని మోనిత త‌న క్రూర‌మైన ఆలోచ‌న‌ల‌కు ప‌దును పెట్ట‌డం మొద‌లుపెడుతుంది.ఇంత‌కీ మోనిత ఏం ఆలోచించింది. ఆనంద‌రావు ప‌రిస్థితేంటీ? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

`జ‌బ‌ర్ద‌స్త్` నుంచి వ‌ల‌స‌లు మొద‌ల‌య్యాయా?

బుల్లితెర కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. దీనికి కొన‌సాగింపుగా `ఎక్స్ట్రా జ‌బ‌ర్ద‌స్త్` షోని కూడా ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ షోలో హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్‌, గెట‌ప్ శ్రీ‌ను, ఆటో రాంప్ర‌సాద్, శాంతి స్వ‌రూప్ వంటి వారు స్కిట్ లు చేస్తూ న‌వ్విస్తున్నారు. ఈ షోతో వీరంతా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అయితే ఇందులో స్కిట్ లు చేసిన మిగ‌తా వారంతా పోయి కొత్త వారు ఎంట‌ర‌య్యారు. ఇమ్మానుయేల్‌, వ‌ర్ష వంటి వారు కొత్త‌గా వ‌చ్చి చేర‌డంతో పాత వారికి ప‌నిలేకుండా పోయింది. దీంతో గ‌తంలో ఈ వేదిక‌పై న‌వ్వించిన వారంతా తెర‌మ‌రుగ‌య్యారు. ఇప్పుడు వారికి నాగ‌బాబు, శేఖ‌ర్ మాస్ట‌ర్ జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న `కామెడీ స్టార్స్ ధ‌మాకా` అడ్డాగా మార‌బోతోంది. `జ‌బ‌ర్ద‌స్త్‌`, `ఎక్స్ట్రా జ‌బ‌ర్ద‌స్త్` షోల‌లో ఆక‌ట్టుకుని హైప‌ర్ ఆది టీమ్ కు అండ‌గా నిలిచిన అభి కొత్త‌గా `కామెడీ స్టార్స్ ధ‌మాకా` లోకి ఎంట్రీ ఇచ్చాడు. త‌న టీమ్ తో కొత్త త‌ర‌హా స్కిట్ ల‌తో హంగామా చేస్తున్నాడు. ఇత‌ని త‌ర‌హాలోనే `జ‌బ‌ర్ద‌స్త్‌`, `ఎక్స్ట్రా జ‌బ‌ర్ద‌స్త్` షో నుంచి బ‌య‌టికి వ‌చ్చిన అప్పారావు, రాజ‌మౌళి, జీవ‌న్ `కామెడీ స్టార్స్ ధ‌మాకా` లోకి ఎంట్రీ ఇచ్చేశారు. వీరంద‌రి రాక‌తో `కామెడీ స్టార్స్ ధ‌మాకా` ని స‌రికొత్త‌గా ప్లాన్ చేసిన మేక‌ర్స్ ఈ నెల 23 నుంచి ప్ర‌త్యేకంగా మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్రారంభించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన తాజా ప్రోమో ఆక‌ట్టుకుంటోంది. ఈ షో కు సంబంధించిన మ‌రో విశేషం ఏంటంటే  `కామెడీ స్టార్స్` కి యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన శ్రీ‌ముఖి ని ప‌క్క‌న పెట్టేసి `కామెడీ స్టార్స్ ధ‌మాకా` కోసం దీపిక పిల్లిని రంగంలోకి దించేశారు. దీంతో ఈ షో ఓ రేంజ్ లో `జ‌బ‌ర్ద‌స్త్‌`, `ఎక్స్ట్రా జ‌బ‌ర్ద‌స్త్` స్టార్స్ తో హోరెత్తించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.  

ష‌ణ్ముఖ్ మ‌ళ్లీ మొద‌లు పెట్టాడోచ్‌

యూట్యూబ్ స్టార్ ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ కు యూట్యూబ్ లో మంచి క్రేజ్ వున్న విష‌యం తెలిసిందే. ఆ క్రేజే అత‌న్ని బిగ్‌బాస్ సీజ‌న్ 5 లోకి ఎంట‌ర‌య్యేలా చేసింది. అయితే స్టార్టింగ్ నుంచి ష‌న్ను నే టైటిల్ ఫేవ‌రేట్ అంటూ ప్ర‌చారం జ‌రిగింది. చివ‌రి వ‌ర‌కు హౌస్ లో వున్నా విజేత‌గా నిల‌వాల్సిన ష‌న్ను చివ‌రికి సిరి కార‌ణంగా ర‌న్న‌ర‌ప్ గా నిల‌వాల్సి వ‌చ్చింది. చేజేతులా బిగ్‌బాస్ టైటిల్ ని జార‌విడుకున్నాడ‌ని, ఇందుకు సిరి చేసిన అతే కార‌ణ‌మ‌ని అంతా ఆమెపై దుమ్మెత్తిపోశారు. నెట్టింట ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. Also Read: 'ఆచార్య‌'కి కాజ‌ల్ సెంటిమెంట్! హౌస్ లో సిరి వ‌ల్ల ఎదురుదెబ్బ‌లు, అవ‌మానాలు ఎదుర్కొన్న ష‌న్ను బ‌య‌టికి వ‌చ్చాక త‌న ప్రియురాలు దీప్తి ఇచ్చిన బ్రేక‌ప్ షాక్ కు అత‌నికి దిమ్మ‌దిరిగిపోయింది. దీంతో కొన్ని రోజుల పాటు షాక్ లోకి వెళ్లిపోయాడు. ఏం జ‌రుగుతోందో తెలియ‌ని స్థితికి చేరిపోయాడు. తాజాగా ఇవ‌న్నింటి నుంచి బ‌య‌ట‌ప‌డి మ‌ళ్లీ త‌న అడ్డాకు వ‌చ్చేస్తున్నాన‌ని మూడు రోజుల క్రిత‌మే ఇందుకు సంబంధించిన ముహూర్తాన్ని పెట్టేసుకున్నాడు ష‌న్ను.   త‌న కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చేశాడు. మ‌ళ్లీ యూట్యూబ్ లో కొత్త వెబ్ సిరీస్ చేస్తున్నాడు. అదే `ఏజెంట్ ఆనంద్ సంతోష్‌`. దీనికి సంబంధించిన అప్ డేట్ ని అందించాడు. టైటిల్ ఇదే అంటూ ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశాడు. `యూట్యూబ్ లో నా నెక్స్ట్ వెబ్ సిరీస్ ...`ఏజెంట్ ఆనంద్ సంతోష్‌` సిరీస్ చూసినంత సేపు నా పేరు మీ మొహంలో ఉంట‌ది. బిగ్‌బాస్ త‌రువాత ఏ ఆఫ‌ర్ వ‌చ్చినా ముందు ఒక యూట్యూబ్ సిరీసే చేయాల‌ని ఉంది. మీరు నాకు ఇచ్చిన ప్రేమ‌కు గుర్తుగా చేయాల‌ని అనుకున్నాను. న‌వ్విస్తాం, టెన్ష‌న్స్ అన్ని మ‌రిచిపోయేలా న‌వ్విస్తాం` అని ష‌న్ను ఈ సంద‌ర్భంగా పోస్ట్ చేశాడు. సాఫ్ట్ వేర్ డెవ‌లాప‌ర్, సూర్య వెబ్ సిరీస్ లు అందించిన సంస్థ  `ఏజెంట్ ఆనంద్ సంతోష్‌` సిరీస్ ని నిర్మిస్తోంది.  

యష్‌.. వేదల‌ మ‌ధ్య ఏం జ‌రుగుతోంది?

బుల్లితెర వీక్ష‌కుల్ని స‌రికొత్త ధారావాహిక `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం` విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. యంగ్ డైరెక్ట‌ర్ స‌రికొత్త క‌థ‌తో రూపొందిస్తున్న ఈ సీరియ‌ల్ రెండు భిన్న‌మైన వ్య‌క్తుల మ‌ధ్య ఓ పాప కోసం మొద‌ల‌య్యే ప్రేమ‌క‌థ‌గా సాగుతోంది. ఖుషీ సంతోషం కోసం య‌శోధ‌ర్ భార్య‌గా నాట‌కం ఆడ‌టానికి వేద అంగీక‌రిస్తుంది. య‌ష్ త‌న‌కు కాంట్రాక్ట్ ఇచ్చే పార్ట్న‌ర్ దంప‌తులు త‌న భార్య వేద అని అపార్థం చేసుకోవ‌డంతో త‌న కాంట్రాక్ట్ కోసం అదే నిజ‌మ‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తాడు. Also Read:  తుల‌సికి ఏం జ‌ర‌గ‌బోతోంది? ఈ లోగా సంక్రాంతి సంబ‌రాల కోసం మీ ఇంటికే వ‌చ్చేస్తాన‌ని య‌ష్ పార్ట్న‌ర్ త‌న భార్య‌తో స‌హా య‌ష్ ఇంటికి వ‌చ్చేస్తాడు. అక్క‌డ వేద.. య‌ష్ భార్య‌గా మ‌ళ్లీ న‌టించ‌డానికి య‌ష్, అత‌ని సోద‌రుడు య‌శ్వంత్ ఒప్పిస్తారు. అయితే ఇదంతా గ‌మ‌నించిన వేద సోద‌రి త‌న త‌ల్లికి చెబుతుంది. దీంతో త‌న కూతురిని అమాయ‌కురాలిని చేసి ఆడుకుంటున్నార‌ని ఆగ్ర‌హించి వేద త‌ల్లి య‌ష్ ని అత‌ని పార్ట్న‌ర్ ఫ్యామిలీ ముందే నిల‌దీస్తుంది. త‌న కూతురికి అస‌లు పెళ్లే కాలేద‌ని, య‌ష్ కు, మాకు ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పి అత‌న్ని అడ్డంగా బుక్ చేస్తుంది. Also Read:  ఇన్‌స్టాలో భ‌ర్త‌ను అన్‌ఫాలో అయిన శ్రీ‌జ‌.. ఆ ఇద్ద‌రూ విడిపోతున్న‌ట్లే! అయితే జ‌రిగిన దాంట్లో య‌ష్ త‌ప్పు లేద‌ని, త‌నిచ్చే కాంట్రాక్ట్ ఎక్క‌డ ర‌ద్ద‌వుతుందోన‌న్న భ‌యంతోనే ఇలా చేశార‌ని య‌ష్ పార్ట్న‌ర్ గ్రహిస్తాడు. ఈ సంద‌ర్భంగా వేద‌ని అభినందించి య‌ష్ కు కాంట్రాక్ట్ అప్ప‌గిస్తాడు. ఆ త‌రువాత వేద తో గాలిప‌టాలు ఎగ‌రేయాల‌ని య‌ష్ కోరుకుంటాడు. ఇందుకు య‌శ్వంత్ పిలిచేద్దాం అంటాడు. వేద రాద‌ని, త‌ను ఎందుకొస్తుంద‌ని వాదిస్తాడు య‌ష్‌... ఇంత‌కీ య‌ష్‌, ఖుషీల‌తో క‌లిసి గాలిప‌టాలు ఎగ‌రేయ‌డానికి వేద వ‌చ్చిందా?.. వ‌స్తే య‌ష్‌, వేద‌ల మ‌ధ్య ఏం జ‌రిగింది? .. ఎలాంటి సంఘ‌ట‌న‌కు దారి తీసింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.    

అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్.. వెంకీ మామ హోస్ట్ గా ఆహాలో కొత్త షో!

ప్రస్తుతం పెద్ద పెద్ద స్టార్స్ ఓటీటీలో సందడి చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ హోస్ట్ గా వ్యవహరించని నటసింహం బాలకృష్ణ సైతం ఓటీటీ వేదిక ఆహా కోసం హోస్ట్ గా మారి 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోతో అలరిస్తున్నారు. బాలయ్య ఎనర్జీకి, కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. బాలయ్య హోస్ట్ గా టాక్ షో చేస్తే బాగుంటుందని ఆలోచించి, అన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న అల్లు అరవింద్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉత్సాహంతో అల్లు అర్జున్ మరో సీనియర్ హీరోని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు అందరూ ముద్దుగా వెంకీ మామ అని పిలుచుకునే విక్టరీ వెంకటేష్. వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా తనదైన కామెడీ టైమింగ్ తో నవ్విస్తుంటాడు వెంకీ మామ. ఇప్పటికే పలు సినిమా వేడుకల్లో ఆయన కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాలయ్యతో అన్ స్టాపబుల్ షో చేసి హిట్ కొట్టినట్లుగానే వెంకీతోనూ ఓ మంచి షో చేసి హిట్ కొట్టాలని అల్లు అరవింద్ భావిస్తున్నారట. వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. దీనిని దృష్టిలో అందరికీ కనెక్ట్ అయ్యేలా ఓ షోని ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే హోస్ట్ గా వెంకీ మామ అదరగొడతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రుద్రాణికి కార్తీక్ ఎవ‌రో తెలిసిపోతుందా?

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన అంకానికి చేరింది. కార్తీక్‌, దీప‌ల‌ని వెతుక్కుంటూ ఆనంద‌రావు,సౌంద‌ర్య తాటికొండ లోని ప్ర‌కృతి వైద్య‌శాల‌లో చేరిన విష‌యం తెలిసిందే. అక్క‌డే వుంటూ కార్తిక్‌, దీప‌ల గురించి సౌంద‌ర్య ఆరాతీస్తూ వుంటుంది. అయితే వారు తాటికొండ‌లోనే వున్నార‌ని ఆల‌స్యంగా తెలుసుకుని షాక్ కు గుర‌వుతుంది. ఈ బుధ‌వారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ లో రుద్రాణి చెంప చెల్లుమనిపించింది ఎవ‌రో తెలుసుకోవాల‌ని ఆశ్ర‌మానికి వ‌చ్చిన దీప అక్క‌డ సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల‌ని చాటుగా చూసి షాక్ కు గుర‌వుతుంది. అక్క‌డి నుంచి వెంట‌నే బ‌య‌టికి వెళ్లిపోతుంది. ఇదే సంద‌ర్భంలో కార్తీక్ గురించి రుద్రాణికి ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. ఇక ఇంటికి వెళ్లిన దీప దిగాలుగా క‌నిపిస్తూ సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల గురించి ఆలోచిస్తూ వుంటుంది. అది గ‌మ‌నించిన కార్తీక్ `ఏంటీ దీపా ఇలా దిగాలుగా వున్నావ్‌` అంటాడు. Also Read:  ర‌వితేజ‌తో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ రొమాన్స్! దీంతో అస‌లు విష‌యం చెప్పేస్తుంది. తాను అత్తయ్య‌, మావ‌య్య‌ల‌ని చూశాన‌ని చెబుతుంది. దీంతో కార్తీక్ ఒక్క‌సారిగా షాక్ అవుతాడు. వెంట‌నే నువ్వూ చూశావా? అంటాడు కార్తీక్‌. దీంతో అదేంటీ నువ్వూ చూశావా? అంటున్నారు మీరు చూశారా? అని అడుగుతుంది దీప‌. చూశాను దీపా.. ఎవ‌రూ లేని అనాథ‌ల్లా ఇద్ద‌రూ ప్ర‌కృతి వైద్య‌శాల‌లో వుంటున్నారు. నా గురించే బాధ‌ప‌డుతున్నారు. అంటాడు కార్తీక్‌.. క‌ట్ చేస్తే పిల్ల‌లు హిమ‌, శౌర్య .. రుద్రాణిని చూసి భ‌య‌ప‌డిపోతుంటారు. సౌంద‌ర్య‌ని చూసి వెంట‌నే నాన‌మ్మా అంటూ ఆమె ద‌గ్గ‌రికి వెళ‌తారు. దీంతో కార్తీక్ .. సౌంద‌ర్య కొడుక‌ని రుద్రాణికి తెలిసిపోతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? క‌థ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌బోతోందన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

వేద త‌ల్లి కార‌ణంగా అడ్డంగా బుక్కైన య‌శోధ‌ర్‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్న ధారావాహిక `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్‌, మిన్ను నైనిక‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, ఆనంద్‌, శ్రీ‌ధ‌ర్ జీడిగుంట ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గ‌త కొన్ని వారాలుగా `స్టార్ మా` లో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. బిజినెస్ మెన్ అభిమ‌న్యు - మాళ‌విక‌ (య‌శోధ‌ర్ మాజీ భార్య‌) కార‌ణంగా చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు తిరుగుతున్న ఈ సీరియ‌ల్ బుధ‌వారం మ‌రింత ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌ల‌తో ట్విస్ట్ ఇవ్వ‌బోతోంది. త‌న బిజినెస్ పార్ట్న‌ర్ వేద‌ని య‌ష్ భార్య‌గా అనుకుంటారు. కానీ ఆ విష‌యం తెలియ‌కుండా య‌ష్ మేజ్ చేస్తాడు. ఎలాగైనా త‌న‌కు కాంట్రాక్ట్ ద‌క్కాల‌ని వేద‌ని త‌న భార్య‌గా న‌టించ‌మ‌ని కోర‌తాడే య‌ష్‌. ఖుషీ కోసం త‌ను కాద‌న‌లేక‌పోతుంది. అయితే సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్ కోసం య‌ష్ ఇంటికి త‌న భార్య‌తో క‌లిసి వ‌చ్చిన బిజినెస్ పార్ట్న‌ర్ (రాజా శ్రీ‌ధ‌ర్‌) కు వేద నిజంగా య‌ష్ భార్య కాద‌ని, కాంట్రాక్ట్ కోస‌మే య‌ష్ - వేద‌తో క‌లిసి త‌న ముందు నాట‌కం ఆడుతున్నాడ‌ని వేద త‌ల్లి ద్వారా తెలుస్తుంది. Also read:  'బంగార్రాజు' విజయం వెనుక సీఎం జగన్ ఉన్నారు! త‌న కూతురు వేద‌కు అస‌లు పెళ్లే కాలేద‌ని, త‌న కూతురుకు య‌ష్ భ‌ర్త కాద‌ని. కాంట్రాక్ట్ కోస‌మే త‌న కూతురిని అమాయ‌కురాలిని చేసి నాట‌కం ఆడుతున్నాడ‌ని య‌ష్ ని అడ్డంగా బుక్ చేస్తుంది. దీంతో ఆగ్ర‌హించిన బిజినెస్ పార్ట్న‌ర్ (రాజా శ్రీ‌ధ‌ర్‌) ...య‌ష్ కు ఇవ్వాల‌నుకున్న కాంట్రాక్ట్ పేప‌ర్స్ ని చించేయాల‌నుకుంటాడు. త‌న కాంట్రాక్ట్ ని ర‌ద్దు చేయాల‌నుకుంటాడు. ఆవేశంతో ఊగిపోతూ య‌ష్ పై సీరియ‌స్ అవుతాడు. అయితే అప్పుడు వేద ఏంచేసింది? .. య‌ష్ కు అండ‌గా నిలిచిందా? .. త‌న ప్ర‌వ‌ర్త‌న బిజినెస్ పార్ట్న‌ర్ (రాజా శ్రీ‌ధ‌ర్‌)లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

టూర్ లో శ్రీ‌హాన్‌.. హోమ్ ఐసోలేష‌న్‌లో సిరి..

బిగ్‌బాస్ సీజ‌న్ 5 కార‌ణంగా రెండు ప్రేమ జంట‌ల్లో క‌ల‌క‌లం మొద‌లైంది. ఈ షో పుణ్య‌మా అని న‌లుగురు ప్రేమికులు విర‌హ వేద‌న‌ని అనుభ‌విస్తున్నారు. ఈ షో కార‌ణంగా ష‌న్ను - దీప్తి సున‌య‌న మ‌ధ్య దూరం పెరిగింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా దీప్తి - ష‌న్నుకు బ్రేక‌ప్ చెప్పేసింది కూడా. ఇప్పుడు వీరిద్ద‌రు క‌లుస్తారా? .. లేదా అని వీరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ జంట బ్రేక‌ప్ ప్ర‌భావం మ‌రో జంట పై ప‌డింది. అదే శ్రీ‌హాన్ - సిరి. Also Read: ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య మ‌ధ్య‌ ల‌వ్ స్టోరీ ఎలా మొద‌లైందో తెలుసా? గ‌త కొన్ని రోజులుగా వీరిద్ద మ‌ధ్య కూడా దూరం పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక శ్రీ‌హాన్ -సిరి క‌లుసుకున్న సంద‌ర్భాలు లేవు. సోష‌ల్ మీడియా వేదిక‌గా క‌లిసి ఫొటోల‌ని పంచుకున్నదీ లేదు. సిరి బ‌ర్త్ డే సంద‌ర్భంగా శ్రీ‌హాన్ విష్ చేస్తూ పోస్ట్ పెడితే దానికి సిరి నుండి ఎలాంటి రిప్లై రాక‌పోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య దూరం మొద‌లైంద‌ని అర్థ‌మైంది. దీంతో శ్రీ‌హాన్ - సిరి కూడా విడిపోతున్నారంటూ ప్ర‌చారం మొద‌లైంది. Also Read:  ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య ఎందుకు విడిపోయారు? ఇదిలా వుంటే తాజాగా సిరి వైర‌స్ బారిన ప‌డింది. గ‌త కొన్ని రోజులుగా ఇంటి ప‌ట్టునే వుంటూ చికిత్స తీసుకుంటోంది. బిగ్‌బాస్ కార‌ణంగా సిరికి దూరంగా వుంటున్న శ్రీ‌హాన్ ఇప్పుడు ఒంట‌రిగా నార్త్ టూర్ కి వెళ్ల‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సిరి ఇలా వుంటే శ్రీ‌హాన్ నార్త్ టూర్ కి వెళ్ల‌డం ఏంట‌ని అంతా అంటున్నారు. సిరి కార‌ణంగా హ‌ర్ట్ అయిన శ్రీ‌హాన్ త‌న‌ని దూరం పెడుతున్నాడ‌ని, త‌న‌కు కోవిడ్ అని తెలిసినా త‌ను నార్త్ టూర్ కి వెళ్ల‌డం వారిద్ద‌రి మ‌ధ్య పెరుగుతున్న దూరాన్ని తెలియ‌జేస్తోంద‌ని నెటిజ‌న్ లు కామెంట్  చేస్తున్నారు.   

శ్రీదేవి నాకు పిన్ని అవుతుంది.. కానీ?

'అమ్మాయి కాపురం' సినిమాతో వెండితెరకు పరిచయమైన మహేశ్వరి.. 'గులాబి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి అలరించింది. ఇదిలా ఉంటే అతిలోక సుందరి శ్రీదేవికి మహేశ్వరి బంధువు అనే సంగతి తెలిసిందే. అయితే వీరి బంధుత్వం గురించి చర్చలు జరుగుతుంటాయి. శ్రీదేవికి మహేశ్వరి చెల్లెలు అవుతుందని కొందరు, మేనకోడలు అవుతుందని మరికొందరు అంటుంటారు. శ్రీదేవితో తనకున్న బంధుత్వంపై తాజాగా మహేశ్వరి క్లారిటీ ఇచ్చింది. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షోకి మహేశ్వరి గెస్ట్ గా వచ్చింది. జనవరి 24 న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో పలు ఆసక్తికర విషయాలని పంచుకుంది. శ్రీదేవికి మహేశ్వరి ఏమవుతారు అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది అని ఆలీ అడగగా.. శ్రీదేవి తనకు చిన్నమ్మ(పిన్ని) అవుతారని, కానీ తనకు అక్క అని పిలవడం అలవాటు అని మహేశ్వరి తెలిపింది. శ్రీదేవి ఇప్పుడు లేదంటే నమ్మబుద్ధి కావడంలేదని చెప్పింది. 'గులాబి' సినిమా అంత హిట్ అవుతుందని షూటింగ్ టైంలో అనుకోలేదని మహేశ్వరి తెలిపింది. 'మేఘాలలో తేలిపొమ్మన్నది' షూటింగ్ టైంలో లోయలో పడిపోయామని, అదృష్టం కొద్దీ ప్రమాదం నుండి తప్పించుకున్నామని పేర్కొంది. షూటింగ్స్ లో తాను తక్కువగా మాట్లాడతానని అందరూ తనకి పొగరని పొరపడేవాళ్లు అనే మహేశ్వరి చెప్పుకొచ్చింది.

ఆర్జీవీ ట్వీట్ తో ష‌న్నుకు కౌంట‌రిచ్చిందా?

రామ్ గోపాల్ వ‌ర్మ వివాదాస్ప‌ద ట్వీట్ ల‌తో ప్ర‌తీ ఒక్క‌రినీ గిల్లుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న పెట్టిన‌, పెడుతున్న ట్వీట్ లు వివాదాల్ని సృష్టిస్తున్నాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఆయ‌న పెట్టిన ట్వీట్ల‌ని కొంత మంది త‌మ‌కు న‌చ్చిన‌ట్టుగా వాడుకుంటూ కొంత మందికి కౌంట‌ర్లుగా కూడా ఉప‌యోగించుకుంటున్నారు. నిన్న రాత్రి, ఈ రోజు ఉద‌యం వ‌ర్మ పెట్టిన ట్వీట్ లు నెట్టింట వైర‌ల్ గా మారిన విష‌యం తెలిసిందే. బ‌న్నీని మెగాస్టార్ గా అభివ‌ర్ణిస్తూ మెగాస్టార్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే తాజాగా వ‌ర్మ చేసిన ఓ పోస్ట్ ని త‌న‌కు అనుకూలంగా మార్చుకుంది దీప్తి సున‌య‌న‌. `మ‌నుషులంతా కూడా అబ‌ద్దాల‌నే ఇష్ట‌ప‌డుతున్నారు. ఎందుకంటే అవి నిజాల‌కంటే ఎంతో కంఫ‌ర్ట్ గా వుంటాయి. నిజం బ‌ట్ట‌లు విప్పి అంద‌రినీ న‌గ్నంగా నిల‌బెడుతుంది. అబ‌ద్దాలు వాటిని క‌వ‌ర్ చేస్తుంటాయి` అంటూ మ‌నుషుల మ‌న‌స్త‌త్వంపై ఫిలాస‌ఫీక‌ల్ గా వ‌ర్మ ట్వీట్ చేశాడు. అదే ట్వీట్ ని దీప్తి సున‌య‌న త‌న ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసింది. ఈ పోస్ట్ సున‌య‌న ష‌న్నుని ఉద్దేశించి త‌న ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసిన‌ట్టుగా వుంద‌ని, ష‌న్నుకి కావాల‌నే కౌంట‌ర్ ఇవ్వాల‌న్న ఉద్దేశంతోనే సున‌య‌న ఇలా చేసింద‌ని నెటిజ‌న్ లు సెటైర్లు వేస్తున్నారు. కానీ ష‌న్ను మాత్రం దీప్తితో క‌లిసిపోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. అత‌ని ఫాద‌ర్ కూడా దీప్తి, ష‌న్ను క‌లుస్తార‌ని చెబుతున్నారు.   

తుల‌సికి ఏం జ‌ర‌గ‌బోతోంది?

న‌టి క‌స్తూరి న‌టిస్తున్న సీరియ‌ల్ `ఇంటింటి గృహ‌ల‌క్ష్మి`. ఇందులో క‌స్తూరి తుల‌సిగా న‌టిస్తోంది. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ ఈ మంగ‌ళ‌వారం స‌రికొత్త మలుపు తిర‌గ‌బోతోంది. గ‌త కొంత కాలంగా స‌మ‌స్య‌ల సుడిగుండంలో విహ‌రిస్తూ ఉక్క‌రిబిక్కిరి అవుతున్న తుల‌సి ఆ రోజు ఎపిసోడ్‌లో డాక్ట‌ర్ ని ఎందుకు క‌ల‌వాల్సి వ‌చ్చింది?.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం. తుల‌సి ఇంట్లో గొడ‌వ‌లు సృష్టించ‌డానికి లాస్య తీసుకొచ్చిన ప‌ని మ‌నిషిని త‌ను వ‌చ్చిన విష‌యం ప‌సిగ‌ట్టిన ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఇంటి నుంచి పంపించేస్తారు.  ఆ త‌రువాత తుల‌సి వ‌ల్లే నందూ త‌న‌ని దూరం పెడుతున్నాడ‌ని, ఎలాగైనా త‌న‌ని ఇంటి నుంచి పంపించివేసి తన‌కు బ‌లంగా వున్న కుటుంబాన్ని దూరం చేయాల‌ని లాస్య ప్లాన్ చేస్తూ వుంటుంది. ఇదిలా వుంటే డ‌బ్బు సంపాదించాల‌నే వ‌క్ర బుద్ధితో అభి షేర్ మార్కెట్ లో డ‌బ్బులు పెట్టి కోట్లు సంపాదించాల‌ని డిసైడ్ అవుతాడు. Also read: దీప్తి-ష‌న్ను రిలేష‌న్‌షిప్‌పై గుడ్ న్యూస్ చెప్పిన ష‌ణ్ముఖ్ ఫాద‌ర్‌! క‌ట్ చేస్తే... తుల‌సి డాక్ట‌ర్ ని కల‌వాల‌ని హాస్పిట‌ల్ కి వెళుతుంది. క్యాన్స‌ర్ అన్ని రోగాల లాంటిది కాదు. మ‌నం దూరం పెట్టాల‌ని చూసినా అది ద‌గ్గ‌ర‌వుతూనే వుంటుంది. ఈ విష‌యాలు మీతో చెప్పాల్సిన‌వి కాదు. ప్రేమ్ ని పిలిచించండి చెప్తానని అన‌డంతో చావు అంచుల వ‌ర‌కూ వెళ్లిన దాన్ని నాకు చావు అంటే భ‌యం లేదు డాక్ట‌ర్ గారు చెప్పండి అని తులిసి అన‌డంతో .. ప్ర‌స్తుతానికి అయితే ప‌ర్లేదు. ఒక ఏడాది త‌రువాత ఎలా ఉంటుందో ఏమౌతుందో చెప్ప‌లేం. అప‌రేష‌న్ స‌క్సెస్ అని చెప్పాం అంత వ‌ర‌కూ ఓకే బ‌ట్ క్యాన్స‌ర్ అనేది ప్ర‌మాద‌క‌ర శ‌త్రువు.. అంటుంది డాక్ట‌ర్‌. ఇంత‌కీ డాక్ట‌ర్ తుల‌సికి ఏం చెప్పింది? ఆ త‌రువాత తుల‌సి ప‌రిస్థితి ఏంటీ?  అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

ఆదిత్య రావ‌డం దేవి గ‌మ‌నించిందా?

  గ‌త ఎపిసోడ్ లో మాధ‌వ వెళ్ల‌గానే ఇంటికి వ‌చ్చిన ఆదిత్యతో రాధ మీరు ఎవ‌రు అస‌లు? దేవిపై మీకున్న హ‌క్కు ఏంటీ? అని నిల‌దీయ‌డంతో పాటు దేవితో కూడా `మీరు నా కోసం రావ‌ద్దు సారు` అని చెప్పించి షాకిస్తుంది. దాంతో ఆదిత్య గుండెలు ప‌గిలేలా ఏడుస్తాడు. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది. ఈ రోజు 44వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో.. ఏం జ‌ర‌గ‌బోతోంద‌న్న‌ది ఒక‌సారి చూద్దాం. Also Read: బెడిసికొట్టిన లాస్య ప్లాన్‌! ప్రేమ్‌-శ్రుతి శోభ‌నం!! ఆదిత్య బాధ‌ప‌డ‌టం గ‌మ‌నించిన రాధ కూడా లోలోన కుమిలిపోతుంది. త‌న అంత‌రాత్మే త‌న‌కు క‌నిపించి ఆదిత్య‌ని ఎందుకు ఇలా బాధ‌పెడుతున్నావ్‌` అని నిల‌దీస్తే .. `నిజం తెలిస్తే నా చెల్ల‌ల బ‌తుకు ఆగ‌మ‌యితాది` అని ఏడుస్తుంది. ఇక సీన్ క‌ట్ చేస్తే.. మ‌రునాడు ఉద‌యాన్నే భోగి మంట‌లు వేసిన దేవుడ‌మ్మ కుటుంబం ఆదిత్య‌తో క‌లిసి సంబ‌రాలు చేసుకుంటారు. అప్పుడు కూడా ఆదిత్య దేవి గురించే బాధ‌ప‌డుతూ వుంటాడు. అక్క‌డ భోగి మంట‌లు అయ్యాక ఆదిత్య చాటుగా మాధ‌వ ఇంటికి వ‌చ్చి .. దూరం నుంచి దేవిని చూసుకుని మురిసిపోతాడు. కానీ దేవికి ఆదిత్య వ‌చ్చిన విష‌యం తెలిసిపోతుంది. ఇక్క‌డే ఎక్క‌డో వున్నాడ‌ని వెతుకుతూ వుంటుంది.   క‌ట్ చేస్తే... ఇక కాసేప‌టికి మాధ‌వ పిల్ల‌ల‌కి కొత్త బ‌ట్ట‌లు తెచ్చి.. పిల్ల‌ల‌కి వేయ‌మ‌ని రాధ‌కు ఇస్తాడు. చిన్మ‌య్ వేసుకుంటుంది కానీ దేవి మాత్రం తాను వేసుకోన‌ని ఖ‌రాకండీగా చెప్పేస్తుంది. దాంతో రామ్మూర్తి `పండ‌గ పూట కొత్త బ‌ట్ట‌లు వేసుకోకుండా చేశావ్ క‌ద‌రా.. ఇప్పుడు నీకు సంతోష‌మా? అని తిడ‌తాడు. కానీ మాధ‌వ మాత్రం `అంద‌రి మంచి కోస‌మే నేను అలా చేశాన‌ని చెబుతాడు. క‌ట్ చేస్తే ఆదిత్య ఇంట్లో కూర్చుని దేవి గురించి ఆలోచిస్తుంటాడు. అది గ‌మ‌నించిన స‌త్య ఏం చేసింది? ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

అద్దాలు తుడిచి క‌డుపు నింపుకున్న క‌మెడియ‌న్‌

సినీ ప‌రిశ్ర‌మ ఓ రంగుల ప్ర‌పంచం. ఇందులో కల‌ర్ ఫుల్ జీవితాలే కాదు.. కారు చీక‌ట్లో దుర్భ‌ర జీవితాన్ని అనుభవించి ఆ త‌రువాత అదృష్టం, కాలం, క‌ష్టం క‌లిసిరావ‌డంతో మంచి స్థాయికి వెళ్లిన వాళ్లు ఇండ‌స్ట్రీలో చాలా మంది వున్నారు. కోటి ఆశ‌ల‌తో సినీ రంగంలోకి ప్ర‌వేశించాల‌ని ఇళ్లు వ‌దిలి, పుట్టిన ఊరు విడిచి భాగ్య‌న‌గరానికి వ‌చ్చిన ఎంతో మంది తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొని ఆ త‌రువాత కృషితో పైకొచ్చిన పేరు తెచ్చుకున్న వారే. అలాంటి వ్య‌క్తుల్లో నేనూ ఒక‌డిని అంటున్నారు క‌మెడియ‌న్ స‌త్య‌.   మంచి టైమింగ్ తో పంచ్ లు వేసే స‌త్య కెరీర్ తొలినాళ్లలో దుర్భ‌ర జీవితాన్ని ఎదుర్కొన్నార‌ట‌. సినిమాల మీద మ‌క్కువ‌తో ఇంజ‌నీరింగ్ ను స‌గంలోనే ఆపేసి హైద‌రాబాద్ బాట ప‌ట్టిన స‌త్య వ‌చ్చే ముందు త‌న తండ్రి ఇచ్చిన 10 వేల‌తో వ‌చ్చార‌ట‌. ఆ డ‌బ్బులు అయిపోయిన త‌రువాత స‌త్య‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ట‌. డ‌బ్బుల కోసం ఓ ఆసుప‌త్రిలో అద్దాలు తుడిచార‌ట‌. దానికి ఆయ‌న‌కు రోజుకి రెండు వంద‌లు ఇచ్చేవార‌ట‌. Also read: సిక్స్ కొట్ట‌బోతున్న పూజా హెగ్డే! త‌ను ప‌నిచేసిన చోటే ఇద్ద‌రు జూనియ‌ర్ ఆర్టిస్ట్ లు ప‌రిచ‌యం అయ్యార‌ట‌. వారితో క‌లిసి షూటింగ్ చూడ్డానికి వెళితే అక్క‌డ కొంత మంది ఐదు వంద‌లు తీసుకుని షూటింగ్ చూడ‌టానికి పంపించార‌ట‌. ఆ స‌మ‌యంలో మ‌రి కొంద‌రు జూనియ‌ర్ ఆర్టిస్టులు ప‌రిచ‌యం అయ్యార‌ట‌. ఓ సారి ఓ జూనియ‌ర్ ఆర్టిస్ట్ స‌త్య ద‌గ్గ‌ర వున్న డ‌బ్బులు కొట్టేశాడ‌ట‌. చివ‌ర‌కు డ‌బ్బులు లేక‌పోతే మూడు రోజుల పాటు నీళ్లు తాగి ఆక‌లి తీర్చుకున్నార‌ట స‌త్య‌. త‌ర్వాత త‌న ఇబ్బందులను త‌ల్లికి ఫోన్లో వివ‌రించార‌ట‌. చివ‌రకు తెలిసిన వాళ్ల స్నేహితుల ద్వారా `ద్రోణ‌` సినిమాకు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో చేర‌డ‌ట స‌త్య‌. అలా కొన్ని రోజులు ద‌ర్శ‌కత్వ శాఖ‌లో ప‌నిచేసిన త‌రువాత న‌టుడిగా మారారు స‌త్య‌. ప్ర‌స్తుతం క‌మెడియ‌న్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు.   

ప్ర‌మాదంలో జాన‌కి.. ఏం జ‌రగ‌బోతోంది?

`స్టార్ మా`లో ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `జాన‌కి క‌ల‌గ‌న‌లేదు`. న‌టి రాశి తొలిసారి బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చిన సీరియ‌ల్ ఇది కావ‌డం, ఇందులో ఆమె అత్త‌గా న‌టిస్తుండ‌టంతో ఈ సీరియ‌ల్ పై మ‌హిళా ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. గ‌త కొన్ని వారాలుగా ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్‌ ఈ మంగ‌ళ‌వారం స‌రికొత్త మ‌లుపు తిర‌గ‌బోతోంది. ఈ రోజు 218వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ సంద‌ర్‌భంగా ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోనున్నాయి? .. ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌బోతోంది అన్న‌ది ఒక‌సారి చూద్దాం.   మొత్తానికి రామాకి నిజం తెలుస్తుంది. జాన‌కి కొండ‌బాబుని కొట్ట‌డానికి కార‌ణం త‌న ప్రేమ విష‌య‌మే అని అన్న‌య్య రామాతో చెబుతుంది వెన్నెల‌. ఈ విష‌యం తెలియ‌క జాన‌కిని రాశి ఇంట్లోంచి, రామా జీవితంలోకి వెళ్లిపోమ‌ని బ‌య‌టికి గెంటేస్తుంది. దీంతో జాన‌కి బ‌స్ స్టాప్‌లో కూర్చుని త‌న భ‌ర్త‌కు నిజం చెప్ప‌లేక‌పోయాన‌ని మ‌ద‌న‌ప‌డుతూ వుంటుంది. భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య దాప‌రికాలుఉండ‌కూడ‌ద‌ని అనుకున్నాం. కానీ ఈ రోజు వెన్నెల విష‌యంలో త‌న భ‌ర్త ద‌గ్గ‌ర నిజం దాచాల్సి వ‌చ్చింది. న‌న్ను క్ష‌మించండి రామాగారూ అంటూ క‌న్నీళ్లు పెట్టుకుంటుంది జాన‌కి.   Also Read:  రుద్రాణి వంటింట్లో దీప.. ఏం జ‌రుగుతోంది? క‌ట్ చేస్తే.. క‌న్న‌బాబు ప‌గ‌తో క‌గిలిపోతుంటాడు. కార్పొరేట‌ర్ సునంద దేవి అత‌న్ని ఆపే ప్ర‌య‌త్నం చేస్తూ వుంటుంది. జానికి త‌న‌ని కొట్టి అవ‌మానించింద‌ని, త‌న‌పై కేసు పెట్టి జైల్లో వేయిద్ద‌మ‌నుకుంటే సునంద‌దేవి కేసు వెన‌క్కి తీసుకోమంటోంద‌ని ర‌గిలిపోతుంటాడు. ఇదిలా వుంటే జాన‌కి బ‌య‌లుదేరిన బ‌స్ కాసేప‌టికే లోయ‌లో ప‌డిపోయింద‌నే వార్త టీవీలో చూసి షాక్ అవుతాడు రామా. ప్ర‌మాదంలో ప‌ది మంది చ‌నిపోయార‌ని, అందులో జాన‌కి కూడా వుంద‌ని టీవీలో బ్రేకింగ్ రావ‌డంతో రామా మ‌రింత షాక్ కు గుర‌వుతాడు. ఇంత‌కీ ఆ ప్ర‌మాదంలో జాన‌కి వుందా? .. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

రుద్రాణి చెంప ప‌గ‌ల‌గొట్టిన సౌంద‌ర్య‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొన్ని నెల‌లుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్న ఈ సీరియ‌ల్ చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో సాగుతోంది. డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క ఇళ్లు వ‌దిలి, ఊరు వ‌దిలి తాడికొండ గ్రామం చేరిన విష‌యం తెలిసిందే. అక్క‌డ ఈ జంట‌కు రుద్రాణి రూపంలో క‌ష్టాలు మొద‌ల‌వుతాయి. అయితే అలాంటి రుద్రాణికి ఈ మంగ‌ళ‌వారం ఎపిసోడ్ లో అదిరిపోయే షాక్ అగిలింది. ఏంట‌ది.. సౌంద‌ర్య ఎలా ఎంట‌రైంది? అన్న‌ది ఒక సారి చూద్దాం. ఈ రోజు 1252వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. రుద్రాణి త‌న మ‌నుషుల‌తో `రేయ్ రిజిస్ట్రేష‌న్ కి టైమ్ అవుతోంది.. బ‌య‌లుదేర‌దాం ప‌దండి` అంటుంది. అబ్బులు కారు తీస్తాడు. డ్రైవ్ చేస్తూ అక్క‌డా ప‌క్క ఆశ్ర‌మంలో మా ఆవిడ‌కు మందులు తీసుకోవాలి అక్కా ప్లీట్ .. వెంట‌నే వస్తాను` అంటాడు. స‌రే అంటుంది రుద్రాణి. దాంతో కారు ఆశ్ర‌మం ముందు ఆగుతుంది. లోప‌లికి వెళ్లిన అబ్బులు సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల‌తో క‌లిసి ధ్యానంలో వున్న గురువుని మందులు ఇవ్వ‌మ‌ని విసిగిస్తుంటాడు. సౌంద‌ర్యకు కోపం వ‌చ్చేస్తుంది. దాంతో అబ్బులుపై అరుస్తుంది. ఇంత‌లో రుద్రాణిలోనికి ఎంట్రీ ఇస్తుంది. ఈ క్ర‌మంలో రుద్రాణి, సౌంద‌ర్య మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతుంది. అయితే ఈ క్ర‌మంలోనే మాట మాట పెరిగి రుద్రాణి చెంప ప‌గ‌ల‌గొడుతుంది సౌంద‌ర్య. దీంతో షాక్ కు గురైన రుద్రాణి అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. ఈ విష‌యం ఊళ్లో తెలియ‌డంతో రుద్రాణి చెంప ప‌గుల గొట్టింది ఎవ‌రా చూసి పోదామ‌ని దీప ఆశ్ర‌మానికి వ‌స్తుంది. అక్క‌డ త‌ను ఎవ‌రిని చూసింది? .. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.    

సీనియ‌ర్ న‌టి కూడా 'ఊ' అంటావా.. అంటోంది!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన చిత్రం `పుష్ప ది రైజ్‌`. సుకుమార్ తెర‌కెక్కించిన ఈ మూవీ వర‌ల్డ్ వైడ్‌గా వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా హిందీ వెర్ష‌న్ ఉత్త‌రాదిలో వ‌సూళ్ల ప‌రంగా దుమ్ము దులిపేస్తోంది. ఊహించ‌ని స్థాయిలో ఆక్క‌డి ప్రేక్ష‌కులు `పుష్ప‌`కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇక ఇందులో క్రేజీ స్టార్ స‌మంత చేసిన `ఊ అంటావా మావ ఊహూ అంటావా...` ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే. ఇప్పుడు ఈ పాట‌కు చిన్నాపెద్దా అంతా చిందులేస్తూ ర‌చ్చ చేస్తున్నారు. టీవీ ఆర్టిస్ట్ ల‌తో పాటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు కూడా ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ వైర‌ల్ అవుతున్నారు. Also read:  'రావ‌ణాసుర‌'తో సెప్టెంబ‌ర్ నెల‌ క‌లిసొచ్చేనా!? ఇటీవ‌ల బుల్లితెర సెన్సేష‌న్స్ ర‌ష్మి గౌత‌మ్‌, విష్ణు ప్రియ‌, యూట్యూబ్ స్టార్ అషురెడ్డి ఈ పాట‌ని రీక్రియేట్ చేసి ఓ రేంజ్ లో ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని మ‌ర్చిపోక ముందే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌గ‌తి ఈ పాట‌కు చిందులేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. భాగ్య‌రాజా న‌టించిన `గౌర‌మ్మ నీ మొగుడెవ‌ర‌మ్మ‌` చిత్రంతో డేరింగ్‌ హీరోయిన్ పాపుల‌ర్ అయిన ప్ర‌గ‌తి గ‌త కొంత కాలంగా త‌ల్లి, అత్త పాత్ర‌లు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.   న‌టిగా బిజీగా వుంటున్నా టైమ్ దొరికితే వ‌ర్క‌వుట్ ల‌తో జిమ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారామె. గ‌తంలో `మాస్ట‌ర్‌` టైటిల్ సాంగ్ కి జిమ్ లో చిందేసి ర‌చ్చ చేసిన ప్ర‌గ‌తి తాజాగా స‌మంత చేసిన `ఊ అంటావా మావ‌.. పాట‌కు అదిరిపోయే స్టెప్పులేసి షాకిచ్చింది. జిమ్ లో వ‌ర్క‌వుట్ లు చేస్తూ ఖాలీ స‌మ‌యం చిక్క‌డంతో `ఊ అంటావా.. పాట‌కు అదిరిపోయే స్టెప్పులేసి హంగామా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.