తెలంగాణ మునిసి‘పోల్స్’ షెడ్యూల్ ఎప్పుడో తెలుసా?

Publish Date:Dec 30, 2025

తెలంగాణలో మునిసిల్  ఎన్నికలకు రేవంత్ సర్కార్ దాదాపుగా ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్, జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు ఇప్పట్ల కాదని విస్పష్టంగా చెప్పేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల తరువాత జడ్పీఎన్నికలు ఉంటాయని కుండబద్దలు కొట్టేశారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.  పరిషత్ ఎన్నికల కంటే ముందే ముమునిసిపోల్స్ పూర్తి చేయడానికి రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ఎన్నికల ఏర్పాట్లను కూడా వేగవంవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే  రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాల తయారీ , ప్రచురణకు సంబంధించి  షెడ్యూల్‌ను విడుదల చేసింది. కొత్తగా ఖరారు చేసిన వార్డుల ప్రకారం ఓటర్ల జాబితాలను జనవరి పదో తేదీలోపు ఖరారు చేసి ప్రకటించేదిశగా అడుగులు వేస్తున్నది.  పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లలో  వార్డుల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ అధికారులను ఆదేశించింది. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా ఆధారంగా ఈ విభజన ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ ,తుది జాబితా ప్రచురణ జనవరి పదో తేదీకి పూర్తి  కానున్నది.  ముందుగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించి, స్థానిక ప్రజల నుంచి సలహాలు, సూచనలు ,అభ్యంతరాలను స్వీకరిచిన తరువాత,  మార్పులు చేర్పులు చేసి నిర్దేశిత   గడువులోగా తుది ఓటరు జాబితాను వార్డుల వారీగా ప్రదర్శిస్తారు. వార్డుల విభజన , రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా దీనికి సమాంతరంగా సాగుతోంది. ముఖ్యంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా వార్డుల పునర్విభజన చేపట్టి, ఆ తర్వాతే ఓటర్లను ఆయా వార్డులకు కేటాయించనున్నారు. ఇక పాత విధానంలోనే రిజర్వేషన్ల అమలు ఉండనుంది.    

వైసీపీ వారికి అప్ప‌నంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు!?

Publish Date:Dec 30, 2025

వడ్డించేవాడు మనవాడైతే భోజనానికి చివరి పంక్తిలో కూర్చున్నా ఫరవాలేదన్నది సామెత. అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమిలో ఆ సామెతను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు తెలుగు తమ్ముళ్లు, కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు. ఇప్పుడు ఆ సామెతను వడ్డించేవాడు మనవాడే ఉన్న మొదటి మొదటి పంక్తిలో కూర్చున్నా లాభం లేని పరిస్థితి ఏర్పడిందని మార్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు. ఔను తిరుమలలో  వైకుంఠ ఏకాద‌శి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాల విషయంలో వైసీపీయులదే హవా అంటున్నారు. వైసీపీ లీడర్లకు ఉత్తర ద్వార దర్శనాలను తిరుమల అడిషనల్ ఈవో దగ్గరుండి మరీ చేయిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేస్తున్నారు.  తెలుగుదేశం కూటమి సర్కార్ లో కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన వారికి దక్కని వైకుంఠ ద్వార దర్శనాలు వైసీపీ నేతలకు మాత్రం అధికారులు దగ్గరుండి మరీ తీసుకువెళ్లి దర్శనం చేయించ డమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజ‌య‌వాడ  నుంచి వ‌చ్చిన‌దేవినేని అవినాష్‌, మ‌ల్లాది విష్ణుతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వంటి  వారు మంగళవారం (డిసెంబర్ 30)న తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. సరే  పెద్దిరెడ్డి అంటే లోక‌ల్. మరి మ‌ల్లాది, దేవినేని సైతం వైకుంఠ ద్వారా  ద‌ర్శ‌నాలు అల‌వోక‌గా ఎలా చేసుకోగలిగారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా వైసీపీ వారి మాటే ఇంకా తిరుమలలో చెల్లుబాటు అవుతోందనడానికి ఇంత కంటే నిరద్శనం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు.  ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరరావు వంటి వారు.. అధికారం కోల్పోయినా వైసీపీ వారి పనులు యథేచ్ఛగా నడుస్తున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు వాస్తవమేననడానికి  వైకుంఠ ఏకాదశి సందర్భంగా  వైసీపీయులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దగ్గరుండి మరీ ఉత్తరద్వార దర్శనాలను కల్పించడమే  నిదర్శనమని అంటున్నారు.  

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

నార్సిసిస్టులు.. వీళ్లను గుర్తించడానికి ఇవే సరైన మార్గాలు..!

Publish Date:Dec 30, 2025

ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం కలిగి ఉంటారు.  వారి వ్యక్తిత్వానికి తగినట్టు వారు మాట్లాడుతుంటారు.  నచ్చినట్టే ఏ పని అయినా చేస్తుంటారు. అయితే సైకాలజీ ప్రకారం మనుషులను వివిధ వర్గాలుగా విభజిస్తారు.  వారిలో నార్సిసిస్టులు కూడా ముఖ్యమైనవారు.  నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు.  వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.  దీని వల్ల వారు గొప్ప వారు అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. నార్సిసిస్టులు తమ తప్పు ఎప్పటికీ ఒప్పుకోరు.  తమ తప్పును ఒప్పుకోకూడదు కాబట్టి,  తాము చేసింది కరెక్ట్ అని నిరూపించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం ఎవ్వరినైనా దోషులుగా నిలబెట్టడానికి వెనుకాడరు. ఈ నార్సిసిస్టులు మన చుట్టూనే ఉంటారు.  కానీ వీరిని అంత సులువుగా గుర్తించలేం.  మనం నార్సిసిస్టులతో మాట్లాడుతున్నాం అని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. తప్పుల తిరస్కారం..   నార్సిసిస్టులు తమ తప్పులను ఎప్పుడూ ఒప్పుకోరు.  వారిని ఏదైనా విషయంలో గట్టిగా అరిచినట్లయితే, వారు వెంటనే ఎందుకంత రియాక్ట్ అవుతున్నావ్ ఇదేమంత పెద్ద విషయమని అంటారు, లేదంటే నేను అలా ప్రవర్తించలేదు, నాకు అలాంటి హ్యాబిట్ లేదు అని అంటారు. తమ తప్పులు బయట పడకుండా ఉండటం కోసం ఎదుటివారిని  తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు. నిజంగా  జరిగిన సంఘటనలను కూడా తిరస్కరిస్తారు. టోటల్ గా  గందరగోళానికి గురిచేసి ఎదుటి వ్యక్తి తమ మీద తాము అనుమానించుకునే స్థాయికి తెస్తారు. ఎదుటి వ్యక్తిని కించపరచడం.. నార్సిసిస్టులు వారి తప్పులు లేదా వారి నిజాలు బయటపడినప్పుడు తమ తప్పు దాచుకోవడానికి  అవతలి వ్యక్తిపై దాడి చేస్తారు. తెలివి  లేని వ్యక్తులు గానూ,  డ్రామా ఆడే వారిగానూ ఎదుటి వ్యక్తులను నిందిస్తారు.  వారి వ్యక్తిత్వాన్నే కించపరిచి,  వారిని తక్కువ చేసి మాట్లాడతారు. సింపుల్ గా ఎదుటివారి  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం ద్వారా  తమను తాము రక్షించుకోవడానికి ట్రై చేస్తారు. కేవలం ఇది మాత్రమే కాదు.. గతంలో జరిగిన తప్పులను ప్రస్తావిస్తూ అన్నింటిని కలిపి ఎదుటి వారిని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు. తామే బాధితులుగా.. నార్సిసిస్టులు తరచుగా తమను తాము బాధితులుగా చిత్రీకరించుకుని  వారు చేసిన తప్పుల నుండి అందరినీ దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తారు. వారిని తప్పుగా అర్థం చేసుకున్నారని లేదా  వారి గురించి ఎదుటి వారే చెడుగా ప్రవర్తిస్తున్నారని  ఆరోపిస్తారు. దీని వల్ల వారి తప్పుల గురించి మాట్లాడటం మాని తాము తప్పు వ్యక్తులం కాదని నిరూపించుకోవడానికే ఎదుటి వ్యక్తులు ట్రై చేస్తారు. దీని వల్ల నార్సిసిస్టులు ఎదుటివారిని తప్పు చేసిన వ్యక్తులుగా నిలబెట్టి తాము తప్పించుకుంటారు. తక్కువ చేసి మాట్లాడటం.. ఎదుటి వ్యక్తులు  విచారం లేదా కోపాన్ని నార్సిసిస్టుల ముందు వ్యక్తం చేస్తే వారు దాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడతారు. చాలా ఓవర్ చేస్తున్నావ్ అనడం లేదా చాలా సెన్సిటివ్ అని చెప్పడం, ఇంత చిన్న  విషయానికి గొడవ చేయడం ఏంటి అని అనడం చేస్తారు. చివరికి తాము నిజంగా దైర్యం లేని వారిమేమో అని ఆలోచించే స్థాయికి వారు తీసుకొస్తారు. చివరికి తప్పు నాదేనేమో అని ఎదుటివారు అనుకునేలా చేస్తారు. తప్పులు వారివి.. నిందలు ఎదుటివారికి.. నార్సిసిస్టులు  తమ తప్పులకు ఎదుటివారిని బాధ్యులుగా  చేస్తారు. తాము సొంతంగా చేసే తప్పులు, పనులకు ఎదుటివారిని నిందిస్తారు.  వారు అబద్ధం  చెప్పి ఎదుటివారిని  అబద్ధాలకోరు అని అంటారు. వారు మోసం చేస్తూ  ఎదుటి వారిని అనుమానిస్తారు. ఎదుటి వారి బాధలు.. నార్సిసిస్టులకు జోకులు.. కొన్నిసార్లు ఎదుటివారికి బాధ  కలిగించే విషయాలను జోక్ లాగా మాట్లాడుతుంటారు. వారు మాట్లాడిన మాటలను ఎవరైనా ఖండిస్తే.. నేను జోక్ చేశాను దానికి కూడా ఇంత సీరియస్ అవ్వాలా అని తప్పించుకుంటారు.   పైన చెప్పుకున్న లక్షణాలన్నీ నార్సిసిస్టులలో ఉంటాయి. నార్సిసిస్ట్‌తో వాదించడానికి ప్రయ త్నించడం తరచుగా వ్యర్థం.  ఎందుకంటే వారు ఏమి చేసినా తమను తాము సరైనవారని నిరూపించుకుంటారు. కాబట్టి అలాంటి వారితో బోర్డర్ లైన్ పెట్టుకోవాలి. వారితో ఎక్కువ డిస్కస్ చేయకూడదు.  వారిలో ఏ విషయాలలో విబేదించకూడదు.  ఏదైనా ఇబ్బంది లేదా సమస్య అనిపిస్తే మెల్లిగా తప్పించుకుని వారికి దూరం వెళ్లాలి. అంతేకానీ వారితో గెలవాలని అనుకుంటే  మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
[

Health

]

హెల్త్ ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగితే మ్యాజిక్కే!

Publish Date:Dec 30, 2025

భారతీయుల వంటింట్లో బోలెడు దినుసులు ఉంటాయి.  వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు మెరుగ్గా ఉంటాయి.  అటు మౌత్ ఫ్రెషనర్ గా, ఇటు వంటల్లో రుచిని పెంచడానికి ఉపయోగించే దినుసుల్లో సోంపు అగ్ర స్థానంలో ఉంటుంది.  సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు  వైద్యులు,  ఆహార నిపుణులు.  అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? సోంపు నీరు ఎలా తయారు చేసుకుని తాగాలి? ఇవన్నీ తెలుసుకుంటే సోంపుతో కలిగే బెనిఫిట్స్  ను అందరూ పొందవచ్చు. సోంపు నీటి ప్రాధాన్యత..  సోంపు నీటిని శక్తివంతమైన,  ఆరోగ్యకరమైన పానీయంగా ఉపయోగిస్తున్నారు. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.  తరచుగా సోంపును మౌత్ ఫ్రెషనర్‌గా మాత్రమే ఉపయోగిస్తుంటారు.  కానీ సోంపు దీని కంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనేక వ్యాధులను నయం చేయడంలో శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది. సోంపు నీరు ఎలా తయారు చేయాలి? సోంపును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇది కడుపు సంబంధిత వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది,  జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. సోంపు నీరు ప్రయోజనాలు..  ఉదయం ఖాళీ కడుపుతో సోంపు నీటిని తాగితే, శరీరంలో అనేక సానుకూల మార్పులు కలుగుతాయి. సోంపు నీరు బరువు తగ్గడానికి  సహాయపడుతుంది.  ఇది శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. సోంపు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు సంబంద వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇది యాసిడ్ కారణంగా  ఏర్పడే ఎసిడిటీ,  యాసిడ్ రిప్లక్స్ వంటి ఉదర సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కడుపు చికాకును తగ్గిస్తుంది,  కడుపును మంటను తగ్గించి కడుపును శాంతపరుస్తుంది. ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కుంటున్న అతి ఆకలి సమస్యకు సోంపు చెక్ పెడుతుందట.   కడుపు నిండినప్పటికీ పదే పదే  ఆహారం  తినాలని అనిపించడం, ఆకలి వేయడం వంటి లక్షణాలు ఆరోగ్యానికి హానికరం. సోంపు నీరు తాగడం వల్ల అనవసరంగా అతిగా ఆకలి వేయడం అనే సమస్య తగ్గుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే సొంపు నీరు తాగడం వల్ల  శరీరం డిటాక్స్ అవుతుంది.  ఇది  కడుపుకు సంబంధించిన అనేక వ్యాధులు,  సమస్యలను తగ్గిస్తుంది. సోంపు నీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే సోంపులో ఉండే పొటాషియం,  మెగ్నీషియం వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. సొంపు నీరు మహిళలకు ఋతుస్రావ సమయంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.  పాలిచ్చే స్త్రీలలో పాలు పెరగడానికి కూడా సహాయపడుతుంది. -రూప