Bigg Boss Thanuja:  బిగ్ సీజన్-9 రన్నరప్ తనూజ.. గోల్డెన్ ఛాన్స్ మిస్!

  బిగ్ బాస్ సీజన్-9 ముగిసింది. కామనర్ పవన్ కళ్యాణ్ పడాల విజేత కాగా, తనూజ రన్నరప్ గా నిలిచింది. పదిహేను వారాల బిగ్ బాస్ ఎట్టకేలకు ముగిసింది. నిన్నటి ఆదివారం ఎపిసోడ్ తో సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్  తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది.   ఇక ఈ సీజన్-9 లో సెలెబ్రిటీ కంటెస్టెంట్ గా ఫస్ట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది తనూజ. ఇక అప్పటి నుండి తన ఆటతీరుతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ముఖ్యంగా ప్రతీ తెలుగింట్లో ఉండే ఓ సంప్రదాయమైన అచ్చతెలుగు ఆడపిల్లలా అనిపించింది. ఎందుకంటే తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ మాట్లాటే విధానం కానీ అలా అనిపించింది. ‌ఇక గేమ్స్ పెరిగే కొద్దీ..‌ గొడవలు అవుతున్న కొద్దీ తనని హేట్ చేసేవాళ్ళు కూడా మొదలయ్యారు. అందుకే చివరి వరకు విన్నర్ పవన్ కళ్యాణ్ పడాలకి టఫ్ ఫైట్ ఇచ్చింది.   ఈ వీక్ మొదట్లో.. ఇమ్మాన్యుయేల్, సంజన, డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల, తనూజ టాప్-5 లో ఉన్నారు. దాంతో అందరు తనూజ విన్నర్.. కళ్యాణ్ పడాల రన్నర్ అని అనుకున్నారు. ‌కానీ ఓటింగ్ నాలుగో రోజు, అయిదో రోజు, చివరి రోజుకి వచ్చేసరికి లెక్కలన్నీ మారిపోయాయి. కామన్ మ్యాన్ కళ్యాణ్ కి ఆడియన్స్ భారీగా ఓట్లేశారు. దాంతో అతను విన్నర్ గా నిలిచాడు.   ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ లోకి వెళ్ళి టాప్-2 కి సూట్ కేస్ ఆఫర్ ఇవ్వగా తనూజ రిజెక్ట్ చేసింది. అయితే ఆ సూట్ కేస్ ఖరీదు.. ఇరవై లక్షలు.. అంటే మొత్తం ప్రైజ్ మనీ యాభై లక్షలు కాగా.. అందులో నుండి పదిహేను లక్షలు డీమాన్ పవన్ తీసుకున్నాడు. ఇక మిగిలింది ముప్పై అయిదు లక్షలు.. ఆ ప్రైజ్ మనీ నుండి ఇరవై లక్షలు ఆఫర్ చేశాడు నాగార్జున. ‌కానీ తనూజ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. దాంతో తను గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకొని రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  

Jayam serial: ప్రాణాపాయ స్థితిలో గంగ.. మినిస్టర్ మాటలతో రుద్ర ఎమోషనల్!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-147 లో.. రుద్ర చేస్తున్న ఫుడ్ ఫెస్టివల్ కి గెస్ట్ గా మినిస్టర్ వస్తాడు. ఫుడ్ టేస్ట్ చెయ్యాలని అనుకుంటాడు. అప్పుడే గంగ వచ్చి అందులో విషం ఉందని చెప్తుంది. ఎవరే నువ్వు అని పారు ముసుగు తీస్తుంది. గంగని చూసి అందరు షాక్ అవుతారు. నువ్వేంటి ఇక్కడ అని రుద్ర అడుగుతాడు. ఇలా వేషం మార్చుకొని మాయ చెయ్యడం నీకు అలవాటే కదా అని శకుంతల కోప్పడుతుంది.   ఆ తర్వాత ఇందులో విషం ఉందని గంగ అంటుంటే నీకెలా తెలుసు అని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. ఒక రౌడీ ఫోన్ మాట్లాడుతుంటే విన్నానని గంగ చెప్తుంది. ఆపు ఇక అని రుద్ర కోప్పడతాడు. మీరు నమ్మాలంటే ఏం చెయ్యాలని ఆ విషం ఉన్న ఫుడ్ ని గంగ తీసుకుంటుంది. కాసేపటికి కింద పడిపోతుంది వెంటనే గంగని రుద్ర హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు.    మరొకవైపు ఇషిక, పారు, వీరు డిజప్పాయింట్ అవుతారు. గంగని హాస్పిటల్ కీ తీసుకొని వెళ్ళాక తనకి ఏం కాకూడదని డాక్టర్ కి చెప్తాడు రుద్ర. గంగని ఆ సిచువేషన్ లో చూసి రుద్ర రిగ్రెట్ ఫీల్ అవుతాడు. గంగ మాటలు నమ్మాల్సింది, తప్పు చేశానని రుద్ర బాధపడతాడు. మరొకవైపు ఫుడ్ ఫెస్టివల్ లో ఫుడ్ లో పాయిజన్ గురించి మీడియా వాళ్ళు శకుంతలని అడుగుతారు. ఈ విషయం వదిలేయండి అని వీరు కవర్ చేస్తాడు.   ఆ తర్వాత గంగ బానే ఉంది కానీ విషం బాడీ లో స్ప్రెడ్ అయింది. తను మినీ కోమాలో ఉందని డాక్టర్ చెప్పగానే రుద్ర షాక్ అవుతాడు. గంగని చూసి రుద్ర బాధపడుతుంటే.. అప్పుడే మినిస్టర్ సూర్య ప్రతాప్ వస్తాడు. మీ పెద్దనాన్న అంతా చెప్పాడు. గంగ నీ భార్య అవ్వడం నీ అదృష్టం.. నమ్మకం కలిగించడానికి తన ప్రాణం పణంగా పెట్టింది. అలాంటి వాళ్ళని మిస్ చేసుకోవద్దు.. నేను మళ్ళీ వచ్చినప్పుడు మీరు కలిసి ఉండాలని, అతను చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigg Boss Sanjana Elimination: సంజన ఎలిమినేషన్.. నాలుగో స్థానంలో ఇమ్మాన్యుయేల్ అవుట్!

  బిగ్ బాస్ సీజన్-9 ముగింపుకి వచ్చేసింది. ‌నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లోకి యాంకర్ శ్రీముఖి, ప్రదీప్ వచ్చారు. హౌస్ లోని టాప్-5 కంటెస్టెంట్స్ తో సరదాగా కబుర్లు చెప్పారు.    బిబి జోడీ సీజన్-2 కి హౌస్ మేట్స్ నుండి రావాలని అడుగగా అందరు వస్తానని అన్నారు. ఇక హౌస్ మేట్స్ తో పిల్లులు ఎలా అరుస్తాయో చేసి చూపించమన్నాడు బిగ్ బాస్. తనూజ, కళ్యాణ్, సంజన పిల్లులుగా బాగా సౌండ్ చేశారు.    ఆ తర్వాత ఓ ఫన్ స్కిట్ చేపించాడు యాంకర్ ప్రదీప్. పుష్ప కేక్ డెలివరీ బాయ్ గా వచ్చాడు. చిట్టిబాబుగా కళ్యాణ్, భానుమతిగా తనూజ లవర్స్ లాగా , పుష్పగా ఇమ్మాన్యుయేల్ యాక్ట్ చేశారు. ఇది ఫుల్ ఫన్ గా ఉంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో యాంకర్ శ్రీముఖి, ప్రదీప్ వచ్చి ఎంటర్‌టైన్‌మెంట్ చేసి వెళ్లారు.   ఇదిలా ఉంటే.. సంజన ఐదో స్థానంలో, ఇమ్మాన్యుయేల్ నాల్గో స్థానంలో ఎలిమినేట్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే ఓటింగ్ ప్రకారం ఇమ్మాన్యుయేల్ మూడో స్థానంలో ఉండాలి కానీ నాల్గో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు. ఇది నిజంగా అన్ ఫెయిర్.. హౌస్ లో ఎక్కువగా టాస్క్ లు ఆడి గెలిచింది ఇమ్మాన్యుయేల్. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అతడి వల్లే ఎక్కువగా జనరేట్ అయింది. అతను రన్నరప్ గా కానీ టాప్-3 కి డిజర్వ్ అని ఆడియన్స్ అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.   

Illu illalu pillalu: ఫ్రెండ్ ని నమ్మి మోసపోయిన సాగర్.. శ్రీవల్లికి చుక్కలే!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -347 లో.. ప్రేమ వాళ్ళ నాన్నని ఇంట్లో దింపడం ధీరజ్ కి శ్రీవల్లి చూపిస్తుంది. ప్రేమ ఇంట్లోకి వస్తు ధీరజ్ ని చూస్తుంది.    ఆ తర్వాత ధీరజ్ కోపంగా ఉంటాడు. శ్రీవల్లి వచ్చి అదేంటి ఇద్దరు గొడవ పెట్టుకుంటారనుకుంటే ఇలా సైలెంట్ గా ఉన్నారు. ఎలాగైనా గొడవ పెట్టాలని అనుకొని ధీరజ్ దగ్గరికి వస్తుంది. అదేంటో ప్రేమ అసలు అర్థం కాదు.. ఆ ఇంటికి ఈ ఇంటికి గొడవలు ఉన్నాయని తెలుసు కదా.. మళ్ళీ వాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళతో గొడవపడి మావయ్య గారి చొక్కా మళ్ళీ చింపేస్తారని శ్రీవల్లి చెప్తుంది. దాంతో ధీరజ్ కోపం మరింత ఎక్కువ అవుతుంది.   ఆ తర్వాత ధీరజ్ దగ్గరికి ప్రేమ వచ్చి ఒరేయ్ భోజనం చేద్దాం రా అని అంటుంది. ధీరజ్ సైలెంట్ గా ఉంటాడు. నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావో నాకు తెలుసు కానీ మీ నాన్నకి ఏదైనా ప్రాబ్లమ్ అయితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నేను అలాగే రియాక్ట్ అయ్యానని ప్రేమ చెప్తుంది.    మరొకవైపు సాగర్ తన ఫ్రెండ్ మాటలు నమ్మి షేర్ మార్కెట్ లో డబ్బులు పెడతాడు. అవి కూడా కస్టమర్ కి రామరాజు ఇవ్వమన్న డబ్బుల్లో నుండి లక్ష రూపాయలు తన ఫ్రెండ్ కి ఇస్తాడు. కస్టమర్ దగ్గరికి వెళ్లి నాన్న ఒక లక్ష పంపాడు మిగతావి తర్వాత ఇస్తానన్నాడు అని సాగర్ చెప్తాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ నుండి ఎలాంటి కాల్ రాదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో సాగర్ కి మోసపోయానని అర్థం అవుతుంది. అతను టెన్షన్ పడుతుంటే అప్పుడే నర్మద వచ్చి ఏమైందని అడుగుతుంది. ఏం లేదని చిరాకుపడతాడు. నేను రైస్ మిల్ లో పని చేస్తున్నానని ఫీల్ అవుతున్నావా అని సాగర్ అడుగగా నేను ఎందుకు ఫీల్ అవుతాను.. లవ్ చేసినప్పుడు నువ్వు రైస్ మిల్ లో పని చేస్తావని తెలుసు కదా ఎందుకు ఫీల్ అవుతానని ఎమోషనల్ అవుతుంది. సాగర్ ని హగ్ చేసుకొని బాధపడుతుంది. ఎవరు అన్నారని నర్మద అడుగుతుంది ఇంట్లో వాళ్ళు అని సాగర్ అంటాడు. ఇంట్లో వాళ్ళు అంటే ఖచ్చితంగా ఆ వల్లి అయి ఉంటుందని నర్మద అనుకుంటుంది.   మరుసటి రోజు నర్మద, ప్రేమ కలిసి శ్రీవల్లితో ఒక ఆట ఆడాలనుకుంటారు. నాకు సాగర్ మధ్యలో గొడవ పెట్టాలని చూసిందని నర్మద అంటుంది. ధీరజ్ కి నాకు గొడవ పెట్టాలని ట్రై చేసిందని ప్రేమ అంటుంది. ఇద్దరు కలిసి స్వీట్ చేసి అందరికి ఇస్తారు. ఈ రోజు శ్రీవల్లి అక్క ఇంటర్వ్యూకి వెళ్తుంది కదా అని అనగానే శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: హాస్పిటల్ లో సుమిత్ర.. పోలీస్ స్టేషన్ లో శ్రీధర్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -546 లో... కార్తీక్ దగ్గరకి దీప కంగారుగా వస్తుంది. నోటిలో నుండి బ్లడ్ ఎందుకు వస్తుందని అడుగుతుంది. ఏదైనా వ్యాధి ఉంటే వస్తుందని కార్తీక్ అనగానే మా అమ్మ నోట్లో నుండి రక్తం వచ్చిందని దీప అంటుంది. దాంతో కార్తీక్ షాక్ అవుతాడు. నాకు భయంగా ఉందని దీప టెన్షన్ పడుతుంటే.. నువ్వేం టెన్షన్ పడకు నోట్లో ఏదైనా పుండ్లు అయినా అలా అవుతుందని దీపకి చెప్తాడు కార్తీక్. కానీ కార్తీక్ కి కూడా టెన్షన్ అవుతుంది. పదా వెళ్లి మావయ్యని అడుగుదామని కార్తీక్ అంటాడు.    ఇద్దరు దశరథ్ దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతారు. ఏమోరా చాలా రోజుల నుండి నీరసంగా ఉంది అని అంటుందని దశరథ్ చెప్తాడు. మీరు అర్జెంట్ గా అత్తయ్యని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళండి అని కార్తీక్ అంటాడు. అప్పుడే సుమిత్ర వచ్చి నాకు ఏమైంది రా హాస్పిటల్ కి అంటున్నారని అడుగుతుంది. మా ఫ్రెండ్ ధరణి చెప్పిందా నీరసంగా ఉందని టెస్ట్ లు చేయించుకోమని అని సుమిత్ర అంటుంది. నాకు బాలేదు సుమిత్ర వెళ్లి టెస్ట్ లు చేయించుకుంటా వెళదామా అని దశరథ్ అంటాడు. అయ్యో ఏమైంది పదండి అని సుమిత్ర టెన్షన్ పడుతుంది. సుమిత్రని హాస్పిటల్ కి రమ్మంటే రాదని దశరథ్ అలా అబద్దం చెప్పి హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు.    హాస్పిటల్ కి వెళ్ళాక సుమిత్రకి టెస్ట్ లు చేయమని డాక్టర్ చెప్తాడు. నాకు కాదు మా అయనకి అని సుమిత్ర అంటుంది. ముందు నువ్వు చేయించుకో తర్వాత నేను అని దశరథ్ అంటాడు. సుమిత్ర వెళ్ళాక డాక్టర్ తో దశరథ్ మాట్లాడుతాడు. నేను ఫోన్ లో చెప్పాను కదా డాక్టర్ అని అంటాడు.   మరొకవైపు నువ్వు ఇచ్చిన ఐడియా వల్ల ఏమైందో చూడమని శ్రీధర్ ని పోలీసులు తీసుకొని వెళ్ళే వీడియో జ్యోత్స్న ఇంట్లో అందరికి చూపిస్తుంది. ఫుడ్ ట్రక్ అన్నారు. అందులో కల్తీ జరిగింది అని జ్యోత్స్న అంటుంది. అది చూసి కార్తీక్ షాక్ అవుతాడు. ఇదంతా అల్లుడు కావాలనే చేసాడు.. మీపై పగతోనే ఇదంతా అని శివన్నారాయణతో పారిజాతం అంటుంది. మా నాన్న అలాంటివాడు కాదని కార్తీక్ అంటాడు. మరి మీ అమ్మ ఎందుకు వదిలేసినట్లో అని పారిజాతం అంటుంది. ఆపండి అసలు ఇదంతా ఏంటని శివన్నారాయణ అంటాడు. ముందు మనం స్టేషన్ కి వెళదామని శివన్నారాయణని తీసుకొని కార్తీక్ వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: ఆ డైరెక్టర్ తో రాజ్ యాడ్ షూట్ చేస్తాడా?

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -909 లో... రాజ్ చేయబోయే యాడ్ ఫెయిల్ కావాలని రాహుల్ ప్లాన్ చేస్తాడు. దాంతో ఒక అతని దగ్గరికి వెళ్లి నీకు యాక్టింగ్ చేసే ఛాన్స్ ఇస్తున్నాను.. నువ్వు డైరెక్టర్ గా చెయ్యాలని రాహుల్ అనగానే అతను సరే అంటాడు. అతను హోటల్ లో పరోటా చేసే అతను.    మరొకవైపు కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. యాడ్ షూట్ చెయ్యాలి ప్లీజ్ కావ్య ఒప్పుకో అని రిక్వెస్ట్ చేస్తాడు. నేను చెయ్యనని కావ్య అంటుంది. వద్దన్నా బ్రతిమిలాడుతావు ఏంట్రా.. నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది.. అది మీ తాతయ్య నేను చేస్తామని ఇందిరాదేవి అంటుంది. ఇద్దరు కలిసి ఓల్డ్ స్టోరీని యాడ్ చేసి యాక్టింగ్ చేస్తారు. అది రాజ్ కి నచ్చదు.. అదంటే ఓల్డ్ గా ఉంది మేం చేసేది బాగుంటుందని అపర్ణ అంటుంది. అపర్ణ, సుభాష్ కలిసి వాళ్ళు ఒక యాడ్ యాక్టింగ్ చేస్తారు. అది కూడా రాజ్ కి నచ్చదు. అప్పుడే రాహుల్ మాట్లాడిన అతను డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తాడు. నా పేరు మణివర్మ అని చెప్తాడు. ఇద్దరు డైరెక్టర్ల పేర్లు పెట్టుకున్నావని కావ్య అడుగుతుంది. వాళ్ళు ఇద్దరు డిఫరెంట్ మూవీస్ తీసారు‌.. నేను వాళ్ళ ఇద్దరిని కలిపి తీస్తానని అతను అనగానే మిమ్మల్ని ఎక్కడ చూడలేదని కావ్య అడుగుతుంది. అంటే నేను చాలా బిజీగా ఉంటానని డైరెక్టర్ అంటాడు.    ఆ తర్వాత డైరెక్టర్ యాడ్ కి సంబంధించిన స్టోరీ చెప్తుంటే.. అది కావ్యకి నచ్చదు. బంగారం అంటే అమ్మడం, తాకట్టు పెట్టడం కాదు.. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ ఎమోషన్ అని కావ్య చెప్పగానే.. బాగా చెప్పావ్ యాడ్ కాన్సెప్ట్ కూడా నువ్వే చెప్పమని కావ్యతో ఇందిరాదేవి అంటుంది. సరే కానీ మోడల్ ఎక్కడ అని డైరెక్టర్ అడుగగా రాజ్, కావ్య వంక చూపిస్తాడు కానీ కావ్య అప్పుడే కింద ఏదో పడితే తీసుకుంటుంది. రాజ్ చూపించింది పనిమనిషి అనుకొని.. తన దగ్గరికి వెళ్లి డిస్కషన్ చేస్తాడు. దాంతో ఆవిడ పనిమనిషి‌.. మోడల్ నా భార్య అని రాజ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigg Boss 9 Winner Kalyan Padala: బిగ్ బాస్ సీజన్-9 విన్నర్ కళ్యాణ్ పడాల!

బిగ్ బాస్ సీజన్-9 మొదలై వంద రోజులు పూర్తయింది. నిన్నటి నూట నాలుగవ ఎపిసోడ్ లో సంజన , కళ్యాణ్ పడాల జర్నీ వీడియోలతో ఫుల్ ప్యాక్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆడియన్స్ కి అందింది. కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అసాధారణ ఆటతీరుతో విశేష ప్రేక్షకాదరణ పొందాడు. నిన్నటి వరకు సాగిన ఓటింగ్ లో కళ్యాణ్ మొదటి స్థానంలో ఉండగా‌‌..తనూజ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఇమ్మాన్యుయేల్ ఉన్నాడు. నాల్గవ స్థానంలో డీమాన్ పవన్ ఉండగా సంజన అయిదో స్థానంలో ఉంది. అయితే కొన్ని ఓటింగ్ పోల్స్ లో  మూడో స్థానంలో డీమాన్ పవన్ ఉన్నాడు. కానీ మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అయితే బిగ్ బాస్ అంటేనే ట్విస్ట్ లు టర్న్ లు.. అలాంటిది ఏది ముందే చెప్పలేం. కాబట్టి ఆదివారం రాత్రి వరకు సాగే ఈ ఫినాలే కోసం వెయిట్ చేయాల్సిందే. కళ్యాణ్ పడాల ఓ సైనికుడు.. అన్నింటికి మించి సామాన్యుడు. అతడికి హౌస్ లో ఎంట్రీ అయిన నుండే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. అయితే అమ్మాయిలని హగ్ చేసుకుంటాడు అనే రమ్య మోక్ష అన్నప్పుడు కుడా తను అవేం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు. డీమాన్ పవన్ , కళ్యాణ్ మధ్య సాగిన ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ లో.. బ్యాక్ పెయిన్ తో డీమాన్ పడిపోయాడు. అప్పుడు కూడా కళ్యాణ్ గేమ్ ఆడలేదు.. ఎందుకంటే అపోజిట్ లో ఉన్న డీమాన్ పవన్ లేచి ఆడతాడేమోనని వెయిట్ చేశాడు.  ఇది ఒక్కటి చాలు.. ఒక గేమర్ ఎలా ఉండాలో తెలియజేయడానికి. ఇమ్మాన్యుయేల్ తరుపున ఆడినప్పుడు ఓడిపోయాడు దాంతో కన్నీళ్ళు పెట్టుకున్నాడు కళ్యాణ్. ఒక నిజమైన ఎమోషన్ ని కళ్యాణ్ లో ప్రతీ ఒక్క ఆడియన్ చూశాడు. అందుకే అతడికి ఓటింగ్ భారీగా పడింది. తనూజకి కళ్యాణ్ కి మధ్య ఇరవై శాతం ఓటింగ్ తేడా ఉందంటే అతను ఎంతమంది ప్రేక్షకులని గెలిచాడో అర్థం చేసుకోవచ్చు. తనూజ వర్సెస్ కళ్యాణ్ మధ్య సాగిన పోటీలో ఎవరు గెలిచారనేది తెలియాలంటే మరో రోజు ఆగాల్సిందే.

Sanjana Bigg Boss Journey: ఎంటర్‌టైన్‌మెంట్ కా మా సంజన.. దిజ్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డు!

ఇది ఫినాలే కాదు.. కానీ అంతకు మించి అన్నట్టుగా నిన్నటి శుక్రవారం నాటి ఎపిసోడ్ సాగింది. మొదటగా పవన్ కళ్యాణ్ పడాల జర్నీ వీడియో ప్లే చేయగా ఆ తక్కువ సంజన జర్నీ వీడియో ప్లే చేశాడు బిగ్ బాస్. సీజన్-9 మొదలైన కొన్ని రోజుల్లోనే ఏంట్రా బాబు ఈ సీజన్-9 ఇంత సప్పగా సాగుతోందని ఆడియన్స్ అనుకుంటున్న సమయంలో సంజన గుడ్డు దొంతనం చేసింది.. దాంతో హౌస్ లో గొడవలు షురు అయ్యాయి. ఇక అందరి మధ్య గొడవలు ముదిరాయి. ఇక ఆ తర్వాత సంజన చేసిన ప్రతీ పని మిగిలిన హౌస్ మేట్స్ కి పెద్దగా కనిపించేది కానీ సంజన మాత్రం కంటెంట్ ఇస్తూ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గకుండా చూసింది. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్, సంజన కలిసి నిజమైన కొడుకు, తల్లి లాగా ఉన్నారు. బిగ్ బాస్ కూడా సంజన జర్నీ వీడియోలో ఎక్కువ భాగం వాళ్ళిద్దరి బాండింగ్ చూపించాడు.  ఇక సంజన గురించి కొన్ని మాటలు చెప్పాడు బిగ్ బాస్.  వంటగదిలో ఉన్నా.. బెడ్‌రూమ్‌లో కబుర్లు చెప్తున్నా.. సంజన ఎక్కడుంటే అక్కడ ఏదో జరగబోతుందని ఆసక్తిని ప్రేక్షకుల్లో కల్పించారు.. సంజన సైలెన్సర్‌గా, సంజూ బాబాగా, మమ్మీగా, ఎవరికీ అర్థం కాని గేమర్‌గా వివిధ పాత్రల్లో ప్రతి నిమిషం వినోదాన్ని పంచడానికి ప్రయత్నించారు.. ఆటలో మిగతావారు మీకన్నా బలంగా ఉన్నా‌. వారికి మిగతావారి మద్దతున్నా.. మీరు ఎప్పుడూ అధైర్యపడలేదు.. ఎవరి మీదో ఆధారపడి ఆడటానికి మీరు ఈ ఇంట్లోకి రాలేదు.. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ఇక్కడి వరకూ తీసుకొచ్చింది.. ఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలి వ్యక్తి ఎవరైనా సరే వెనక్కి తగ్గని మొండి ధైర్యం మీ సొంతం అంటూ బిగ్ బాస్ భారీగా ఎలవేషన్ ఇచ్చాడు. నిజానికి సంజన చాలా ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. అయితే అది ఎక్కువగా ఫన్ వే లో చూపించలేదు బిగ్ బాస్. కానీ ఇమ్మాన్యుయేల్, సంజనల బాండింగ్ బాగుంది. హౌస్ లో టాప్-5 కి సంజన అర్హురాలా కాదా కామెంట్ చేయండి.

Kalyan Padala Bigg Boss Journey: గూస్ బంప్స్ తెప్పించిన కళ్యాణ్ పడాల జర్నీ వీడియో!

 రైట్ సోల్డర్ ఇన్ రైట్ ప్లేస్ అంటూ నాగార్జున చెప్పిన మాటలతో మొదలైన కళ్యాణ్ పడాల జర్నీ వీడియో నెక్స్ట్ లెవెల్ అంతే. ఇది జర్నీ వీడియోలా లేదు.. డైరెక్ట్ సీజన్-9 విన్నర్ ఇతనే అని అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్టుగా ఉంది. బిగ్ బాస్ సీజన్-9 ముగింపుకి వచ్చేసింది. మరో రెండు రోజుల్లో ఈ సీజన్-9 ముగుస్తుంది. ఆదివారం ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. ఇమ్మాన్యుయేల్, సంజన, డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల, తనూజ టాప్-5 లో ఉన్నారు. ఇక వీరిలో ఎవరు విజేత అవుతారో తెలియాలంటే ఆదివారం రాత్రి వరకు ఆగాల్సిందే. అయితే నిన్నటి(శుక్రవారం) నాటి ఎపిసోడ్ లో కళ్యాణ్ పడాల జర్నీ వీడియో చూపించాడు బిగ్ బాస్. ముందుగా  కళ్యాణ్ గురించి బిగ్ బాస్ చెప్పాడు.. మీది ఒక సామాన్యుడి కథ కానీ సామాన్యమైన కథ కాదు.. జీరో దగ్గర మొదలైన కథ కానీ జీరో దగ్గర ముగిసిపోని కథ.. కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కొన్ని కోట్ల మంది ప్రేమని పొందే అవకాశం లభిస్తుంది.. దాన్ని మీరు అగ్నిపరీక్షని దాటి సొంతం చేసుకున్నారు .. ఇప్పుడు వారి ప్రేమని పొంది ఈ స్థానంలో నిలిచి మీ ప్రయాణానికి గొప్ప అర్థాన్నిచ్చారని బిగ్ బాస్ చెప్తుంటే కళ్యాణ్ అయితే విజిల్స్.. కేకలు వేశాడు. ఇక చివరగా బిగ్ బాస్ ఓ మాట చెప్పాడు. లోటుపాట్లన్నీ సరిచేసుకొని చివరి కెప్టెన్‌గా నిలవడమే కాకుండా మొదటి ఫైనలిస్టుగా నిలిచి ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు.. లక్ష్మణ్ రావ్ లక్ష్మిల కొడుకు కళ్యాణ్ అనే మాట ఇప్పటివరకూ.. కానీ వీళ్లు కళ్యాణ్ తల్లిదండ్రులు అనే గౌరవాన్ని కాలర్ ఎగరేసే గర్వాన్ని ఇప్పుడు వారికి మీరు అందించారు.. గొప్ప కలలు కనేందుకు వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతోమంది కామనర్స్‌కి దిక్సూచిగా నిలిచి స్ఫూర్తినిచ్చారని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఆ తర్వాత జర్నీ వీడియోలో కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు నీవే నీవే అని పాట వేయగా, శ్రీజ, ప్రియా, డీమాన్ పవన్ లతో గొడవలు, ఆటలు అన్నింటికి మహర్షి సినిమాలోని చోటి‌ చోటి చోటి బాతే అని పాట వేశాడు. తనూజతో లవ్ సాంగ్ వేశాడు. ఇక చివరగా సైనిక పాటతో గూస్ బంప్స్ తెప్పించాడు బిగ్ బాస్. మొత్తంగా ఈ జర్నీ వీడియోతో పవన్ కళ్యాణ్ పడాల సీజన్-9 (Bigg Boss 9 Telugu winner) విన్నర్ అనే విషయం బిగ్ బాస్ మామ చెప్పేశాడు. 

Podharillu: మాహా పెళ్ళి అని తెలిసి చక్రి షాక్.. మాధవకి వచ్చి‌న సంబంధం క్యాన్సిల్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -10 లో.....మాధవని చూడడానికి వచ్చిన అమ్మయి వాళ్ళకి ఇల్లు, స్థలం చూపిస్తాడు. అంత బాగానే ఉంది నాకు నీ పద్ధతి నచ్చింది కానీ ఇంత మంది అబ్బాయిలున్న ఇంట్లోకి అమ్మయిని ఇవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంది.. నువ్వు వేరొక ఇల్లు తీసుకొని ఉంటావా అని అమ్మయి తండ్రి అనగానే అలా అయితేనే మీ కూతురిని ఇస్తానంటే నాకు మీ కూతురు అవసరం లేదని మాధవ చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక అసలు వాళ్ళు నీతో ఏం మాట్లాడారు అన్నయ్య అని కన్నా అడుగుతాడు. ఏం లేదని మాధవ చెప్తాడు. మరొకవైపు నాకు పద్ధతులు తెలియవట.. వాడు అన్ని మాటలు అంటుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నావని మహా ఏడుస్తుంది. నాకు అడగాలని అనిపించింది కానీ అడగలేక పోయానని ఆది అనగానే వాళ్ళ అన్నయ్యని మహా హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఇక ఆ తర్వాత అందరు షాపింగ్ కి బయల్దేరతారు. మరొకవైపు మాధవ గురించి ఊళ్ళో వాళ్ళని  అమ్మాయి వాళ్ళు కనుక్కుంటారు. అప్పుడే మాధవ వాళ్ళ పెద్దనాన్న మాధవ కుటుంబం గురించి తప్పు గా మాట్లాడతాడు. అదంతా కేశవ, మాధవ విని వాళ్ళ పెద్దనాన్నపై గొడవకి దిగుతారు. అదంతా అమ్మాయి వాళ్ళు చూసి ఎంతో పద్ధతి గల కుటుంబం అనుకున్నాం.. ఈ సంబంధం వద్దని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. మరొకవైపు షాపింగ్ మాల్ లోపలికి మహా వాళ్ళు వెళ్తారు. చక్రి కూడా వెళ్తాడు‌‌ వాళ్ళ వెనకాలే ఉంటాడు. మహాకి వాటర్ తీసుకొని వెళ్లి ఇస్తాడు. నువ్వేంటి ఇక్కడ అని భూషణ్ అడుగుతాడు. నేను ఎక్కడికి వెళ్లిన ఇంతే సర్ అని చక్రి అంటాడు. మహాకి ఏ చీరలు నచ్చవు.. మహా చీరలు వేసుకొని చూస్తుంటే మిర్రర్ నుండి చక్రి బాలేదని చెప్తాడు. మహా మళ్ళీ వెళ్లి నాకూ ఏం నచ్చడం లేదని హారికకి చెప్తుంది. తరువాయి భాగంలో మహాకి పెళ్లి అని తెలిసి చక్రి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది.  మరొకవైపు  ఫుడ్ ఫెస్టివల్ కి మినిస్టర్ సూర్య ప్రతాప్ వస్తాడు. తనని అందరు ఆహ్వానిస్తారు. వీరూని చూసి ఈ మధ్య రాజకీయాల్లో బాగా వినిపిస్తున్నావని మినిస్టర్ అనగానే అవును ఆయన తర్వాత తన లెగసీనీ కంటిన్యూ చేస్తాడని వీరు గురించి మినిస్టర్ కి చెప్తుంది శకుంతల. తనకంటే రుద్ర కంటిన్యూ చేస్తే బాగుంటుందని మినిస్టర్ అనగానే వీరుకి కోపం వస్తుంది. అప్పుడే రుద్ర వస్తాడు. మీ వైఫ్ ఛాంపియన్ ఎక్కడ అని అడుగుతాడు. తను ప్రాక్టీస్ లో ఉందని అక్కడున్న వాళ్లు కవర్ చేస్తారు. ఆ తర్వాత గంగ కిందపడిపోతుంది అప్పుడే రుద్ర వచ్చి.. లేమ్మా చూసుకోవాలి కదా అని అంటాడు. అప్పుడే వంశీ, సూర్య వస్తారు. ఆవిడని చూస్తుంటే గంగని చూసినట్లు అనిపిస్తుందని వంశీ అంటాడు. అదొక తింగరిది.. ఇక్కడ ఉంటే ఈ ఫుడ్ అంతా ఒక్కతే తినేదని రుద్ర అంటుంటే గంగకి కోపం వస్తుంది. ఆ తర్వాత వీరు మనుషులు ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చి వంటల్లో విషం కలుపుతారు. గంగ చూసి ఏం చేస్తున్నారని అడుగుతుంది. అతను ఏదో కవర్ చేస్తాడు. అతనిపై గంగకి డౌట్ వస్తుంది. అతను ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతాడు. స్టాల్ లో ఉన్న ఫుడ్ లో విషం కలిపామని అతను ఫోన్ లో చెప్పడం గంగ విని షాక్ అవుతుంది. మరొకవైపు సూర్య ప్రతాప్ అన్ని ఫుడ్ స్టాల్ తిరుగుతూ ఫుడ్ టేస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు. నువ్వు మనం చేయబోయే యాడ్ కి మోడల్ గా చెయ్యొచ్చు కదా అని రాజ్ అడుగుతాడు. నాకు ఇష్టం ఉండదు పైగా వాటి గురించి నాకేం తెలియదని కావ్య ఒప్పుకోదు. మరొకవైపు రేణుక, తన భర్తని స్టేషన్ కి పిలిపిస్తుంది అప్పు. మీరు నా దగ్గర అన్నీ చెప్పారా అని అడుగుతుంది. మీ కూతురు DNA కి, మీ ఆయన DNA కి మ్యాచ్ అవ్వడం లేదని అప్పు కోప్పడుతుంది. అంటే ఆయన నా రెండో భర్త పాపకి సొంత నాన్న కాదని రేణుక అంటుంది. మరి ఆ విషయం ముందే చెప్పాలి కదా అని అప్పు అనగానే.. అంటే రెండో భర్త అన్న విషయం ఎవరికి చెప్పద్దన్నాడు అని రేణుక అంటుంది. మీరు పాప గురించి కనుక్కొమ్మంటే నా భర్తని అనుమానిస్తున్నారని రేణుక అంటుంది. అదేం లేదని అప్పు అంటుంది. త్వరగా నా కూతురు గురించి కనుక్కోమని రేణుక రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే రాహుల్ వచ్చి ఏంటి రాహుల్ యాడ్ షూట్ అయిందా అని అడుగుతాడు. లేదు లాస్ట్ మినిట్ లో మోడల్ హ్యాండ్ ఇచ్చిందని రాజ్ చెప్తాడు. అయ్యో ఇప్పుడు ఎలా అని రాహుల్ అనగానే రాజ్ కి ఇలాంటి విషయాల్లో అనుభవం చాలానే ఉంది.. ఒకరు చెప్పనవసరం లేదని రుద్రాణి అంటుంది. మరి ఇప్పుడు మోడల్ దొరికిందా అని ఇందిరాదేవి అడుగుతుంది‌. దొరికింది కానీ ఒప్పుకోవడం లేదని రాజ్ అనగానే ఎవరని అడుగుతాడు. ఇంకెవరు మీ మనవరాలు అని రాజ్ అంటాడు. కావ్య అయితే బాగుంటుందని  అపర్ణ, ఇందిరాదేవి అంటారు. నాకు ఇష్టం లేదని కావ్య అంటుంది. ఎందుకు తనని అంతలా బ్రతిమిలాడుతున్నారని ధాన్యలక్ష్మి అంటుంది. నేను మోడల్ ని తీసుకొని వస్తానని ధాన్యలక్ష్మి లోపలికి వెళ్లి తనే అన్ని నగలు వేసుకొని వచ్చి మోడల్ గా స్టిల్స్ ఇస్తుంటే వద్దని ఇంట్లో వాళ్ళు భయపడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు. వెంటనే మీరు మా రెస్టారెంట్ కి రండి.. జనరల్ మేనేజర్ ని చేస్తానని వైరా అనగానే కాశీ షాక్ అవుతాడు. నేను మా సీఈఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని కాశీ అంటాడు. నువ్వు మంచి పొజిషన్ లో ఉండి నిన్ను అవమానించిన వాళ్ళకి సమాధానం చెప్పాలని కాశీని రెచ్చగొట్టేలా వైరా మాట్లాడతాడు. మరొకవైపు కార్తీక్ దీప వస్తుంటే దారిలో జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ కనిపిస్తాయి. ఫుడ్ ప్రజలకి పంచడం చూసి దీప హ్యాపీ గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత జ్యోత్స్నకి వైరా ఫోన్ చేస్తాడు. ఒకసారి కాశీతో మాట్లాడమని ఫోన్ ఇస్తాడు. కాశీ ఇది మంచి ఛాన్స్ ఎవరి దగ్గరో పని చెయ్యాల్సిన అవసరం లేదు.. నీకంటూ సొంత ఇల్లు, జాబ్, కార్ ఇలాంటి అవకాశం రాదని చెప్తుంది. వైరాకి కాశీ ఒకే చెప్తాడు. మరొకవైపు శ్రీధర్ ఫుడ్ ట్రక్స్ గురించి మీడియాతో మాట్లాడుతాడు. వాళ్ళు గొప్పగా మాట్లాడుతుంటే శ్రీధర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే పోలీసులతో కాశీ వస్తాడు. మీరు డిస్టిబ్యూట్ చేసిన ఫుడ్ లో కల్తీ అయి అందరు అస్వస్థతకి గురై అయ్యారు.. ఏంటని అడిగితే మీ పిఏ మీ దగ్గరికి తీసుకొని వచ్చాడు. మీరు స్టేషన్ కి రండి అని శ్రీధర్ ని‌ పోలీసులు తీసుకొని వెళ్తారు.  ఆ తర్వాత దీప ఇల్లు తుడుస్తుంటే అప్పుడే సుమిత్ర వచ్చి తన చేతిలో చీపురు లాక్కొని నువ్వు కూర్చొ నేను చేస్తానని అంటుంది. దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. సుమిత్ర దగ్గుతు ఉంటే ఏమైందని దశరథ్ వస్తాడు. ఇద్దరు కలిసి సింక్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. సుమిత్ర దగ్గుతుంటే బ్లడ్ పడుతుంది. అది సుమిత్ర చూడకముందే దశరత్ వాటర్ పోస్తాడు. అది చూసి దీప షాక్ అవుతుంది. సుమిత్రని లోపలికి పంపిస్తారు. ఈ విషయం మళ్ళీ సుమిత్రతో అనకు అని దశరథ్ అంటాడు. మా అమ్మకి ఏమైందని దీప టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: అమూల్యకి వార్నింగ్ ఇచ్చిన చందు.. శ్రీవల్లి ఫిట్టింగ్ పెట్టిందిగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -346 లో..... సాగర్, నర్మద మధ్య గొడవ పెట్టాలని శ్రీవల్లి అనుకుంటుంది. పాపం సాగర్ నువ్వు రైస్ మిల్ లో పనిచేస్తున్నావని నర్మద చాలా ఫీల్ అవుతుంది. నాతో చాలాసార్లు చెప్పుకొని బాధపడింది. మళ్ళీ నేను అన్నట్లు తనతో చెప్పకండి ఎందుకంటే మళ్ళీ మా మధ్యలో గొడవలు వస్తాయని శ్రీవల్లి అనగానే అప్పటికే సాగర్ కి కోపం వస్తుంది. మరొకవైపు అమూల్య కోసం విశ్వ వెయిట్ చేస్తాడు కానీ అమూల్యని చందు కాలేజీకి తీసుకొని వస్తాడు. అమూల్య నాన్న గురించి తెలుసు కదా తలదించుకొని వచ్చామా.. వెళ్ళామా అన్నట్లు ఉండాలి.. కుటుంబం తలదించుకునే పరిస్థితి తీసుకొని రావద్దని చందు వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు నీ వయసు అలాంటిది అట్రాక్షన్ ఉంటుంది.. జాగ్రత్త అని చందు వెళ్ళిపోతాడు. అదంతా విశ్వ చూసి అమూల్య దగ్గరికి వచ్చి ఏంటి మీ అన్నయ్య కోపంగా మాట్లాడుతున్నాడని అడుగుతాడు. మనపై డౌట్ వచ్చినట్లు ఉందని అమూల్య చెప్పగానే.. నువ్వు ముందు కాలేజీకి వెళ్ళమని అమూల్య ని పంపిస్తాడు. శ్రీవల్లికి విశ్వ ఫోన్ చేసి మీ ఆయనకి డౌట్ వచ్చిందని అంటాడు. డౌట్ కాదు మిమ్మల్ని పార్క్ లో చూసాడని శ్రీవల్లి అంటుంది. ఇక ఆలస్యం చెయ్యను లేపుకెళ్లి పెళ్లి చేసుకుంటా.. నువ్వు హెల్ప్ చెయ్యాలని అనగానే ఒరేయ్ బండోడా ఏం మాట్లాడుతున్నావ్ రా అని విశ్వపై శ్రీవల్లి కోప్పడుతుంది.  మరొకవైపు సేనాపతి ఇంకా ఇంటికి రాలేదని రేవతి టెన్షన్ పడుతుంది. ఆ విషయం తెలిసి ప్రేమ స్కూటీ తీసుకొని వెళ్లి వాళ్ళ నాన్నని వెతుకుతుంది‌ ఒక దగ్గర తాగేసి ఉంటే తనని ఆటోలో ఇంటికి తీసుకొని వస్తుంది. అది శ్రీవల్లి చూసి ధీరజ్ కి చెప్తుంది. ప్రేమ, వాళ్ళ నాన్నని లోపలికి తీసుకొని వెళ్తుంటే.. ధీరజ్ చూసి షాక్ అవుతాడు. పాపం ప్రేమ ఇక్కడున్నా తన మనసు అంత వాళ్ళింట్లోనే ఉంటుందని శ్రీవల్లి అంటుంది. తరువాయి భాగంలో రేయ్ ధీరజ్.. రా భోజనం చేద్దామని ప్రేమ అంటుంది. ధీరజ్ సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Demon Pavan BB Journey video : గూస్ బంప్స్ తెప్పించిన డీమాన్ పవన్ జర్నీ వీడియో.. మొత్తం రీతూతోనే!

బిగ్ బాస్ ఈ సీజన్ లోకి కామనర్స్ కి ఛాన్స్ ఇచ్చారు. ఆ కామనర్స్ లో ఇద్దరు టాప్-5 లో ఉన్నారు. వాళ్లలో డీమాన్ ఒకడు.. ఒక సామాన్య ఇంటి నుండి అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన అటతో మంచి పాజిటివిటి తెచ్చుకొని టాప్-5 లో అడుగుపెట్టాడు. డీమాన్ పవన్ గురించి బిగ్ బాస్ ఎలివేషన్ ఇచ్చి చెప్తుంటే గుస్ బంప్స్ వచ్చాయి. కాసేపటికి డీమాన్ పవన్ ని బిగ్ బాస్ గార్డన్ ఏరియాకి పిలిచి తన జర్నీ వీడియో ప్లే చేశాడు. బిగ్ బాస్ గ్రాంఢ్ లాంచ్ రోజు నుండి మొదలు నుండి నిన్నటి వరకు సాగిన అతని ప్రయాణామ్ని ఈ జర్నీ వీడియోలో చూపించాడు. ఇందులో ఎక్కువగా రీతూతో ఉన్న మెమరీస్ ఉన్నాయి. డీమాన్ కెప్టెన్ అవ్వడం.. అది రద్దు అవడం మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ కెప్టెన్ అవ్వడం అదంతా మంచి ఎలివేషన్ ఇచ్చి ఎడిట్ చేశాడు. రీతూతో ఉన్న షాట్స్ అన్నిటింకి లవ్ సాంగ్ ప్లే చేశాడు. అవన్నీ చూస్తూ పవన్ ఎమోషనల్ అయి ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ హౌస్ లోకి ఎంట్రీ అవ్వడం. రీతూతో తప్పుగా బెహేవ్ చేసినప్పుడు నాగార్జున రెడ్ కార్డ్ ఇచ్చి వెళ్ళమని చెప్పడం.. అదంతా చూసి పవన్ ఏడుస్తాడు. జర్నీ వీడియో మొత్తం చూసి డీమాన్ పవన్ ఏడుస్తాడు. చాలా బాగుంది బిగ్ బాస్ నేను ఇలా ఉంటానని ఊహించలేదు.. చాలా నేర్చుకున్నా.. నాకు బిగ్ బాస్ అవకాశం అనేది పునర్జన్మ అని పవన్ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత తనకి నచ్చిన ఫొటోస్ అన్నీ తీసుకొని హౌస్ లోకి వెళ్తాడు. తన ఫ్రెండ్స్ తో హ్యాపీ నెస్ ని షేర్ చేసుకుంటాడు. ఎంట్రీ నుండి మొత్తం రీతూకి నీకు లవ్ సాంగ్స్ వేసినట్లున్నారని డీమాన్ పవన్ తో తనూజ అంటుంది. మరి డీమాన్ పవన్ జర్నీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Thanuja BB Journey video: జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయిన తనూజ.. మొత్తం కళ్యాణ్ తోనే!

బిగ్ బాస్ సీజన్ చివరి దశకి చేరుకుంది. ఇప్పటివరకు ప్రయాణం ఒక లెక్క.. ఫినాలే వీక్ జర్నీ వీడియో ఒక లెక్క అన్నట్లుగా ఎడిటింగ్ చేశారు. ఎమోషనల్, కామెడీ కోపం అన్నీ కలిపి బిగ్ బాస్ ఇరగదీశాడని చెప్పాలి. ఇక ఫినాలే వీక్ లో ఇప్పటివరకు ఇమ్మాన్యుయేల్ జర్నీ వీడియో పూర్తి కాగా ఆ తర్వాత తనూజ వంతు వచ్చింది. బిగ్ బాస్ తనూజ గురించి గొప్పగా చెప్పాడు. లేడీ ఫైటర్.. అన్నింట్లో మీ పర్ఫామెన్స్ ఉందని బిగ్ బాస్ చెప్పాడు. తనూజ జర్నీ వీడియో ప్లే చెయ్యగా అది చూస్తూ తనూజ ఎమోషనల్ అవుతుంది. తనూజకి సంబంధించిన ప్రతీ ఒక్కటీ జర్నీ వీడియోలో ప్లే చేశారు. భరణితో కలిసి ఉన్నప్పటివి అన్నీ కలిపి నాన్న బాండింగ్ బాగా చూపించారు. దానితో పాటు కళ్యాణ్ తో బాండింగ్ చూపిస్తూ లవ్ సాంగ్ కూడా ప్లే చేశారు. గేమ్ లో తను ఫైర్ తో ఆడింది చూసి తనూజ మురిసిపోయింది. జర్నీ వీడియో మొత్తం చూసి తనూజ ఎమోషనల్ అయింది. చాలా థాంక్స్ బిగ్ బాస్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి చాలా థాంక్స్ అని తనూజ చెప్పింది. బిగ్ బాస్ ని అడిగి తనకి సంబంధించిన ఫొటోస్ తీసుకొని హౌస్ లోపలికి వెళ్ళింది. ఒరేయ్ మా నాన్నతో కన్నా నీతోనే ఎక్కువగా ఉన్నానురా.. అసలు ఎక్స్ పెక్ట్ చెయ్యలేదని కళ్యాణ్ తో తనూజ చెప్తుంది. నేనేం తప్పు చేసినా తనూజ నా వెనకాలే ఉంటుంది.. నన్ను కరెక్ట్ చెయ్యడానికి అన్నావ్.. అది వేరే లెవెల్ అసలు. నువ్వు మొన్న గొడవ అయినప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు లేచి కింద కూర్చొని ఉన్నావ్.. అది బాగా చూపించారని తనూజ చెప్పింది. తనూజ జర్నీ వీడియో చూసి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. 

Podharillu: డ్రైవర్ గా చక్రి.. మేనబావకి పెళ్ళిచూపులని గాయత్రీ ఎమోషనల్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -09 లో.... గాయత్రి, మాధవ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. మరొకవైపు భూషణ్ పేపర్ చదువుతు చిరాకు పడుతాడుమ ఇక్కడ పేపర్ ఓపెన్ చేస్తే చాలు ఇలాంటి న్యూస్ లు వస్తాయి.. అందుకే నాకు ఇక్కడ ఉండాలనిపించదని చిరాకు పడుతాడు. అప్పుడే ఆదికి వాళ్ళ నాన్న ఫోన్ చేసి.. మీకు ఒక డ్రైవర్ ని ఏర్పాటు చేసానని చెప్తాడు. అదే విషయం భూషణ్ కి కూడా చెప్తాడు. అప్పుడే చక్రి ఎంట్రీ ఇస్తాడు. అతన్ని చూసి భూషణ్ కోప్పడుతాడు. వీడు ఇక్కడ ఉన్నాడంటే ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుందని చక్రి అనుకుంటాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని భూషణ్ కోప్పడుతాడు. డ్రైవర్ గా వచ్చానని చక్రి అనగానే అంటే డాడీ పంపింది ఇతన్నే అనుకుంటానని ఆది అంటాడు. వీడు నాకు ఇష్టం లేదని భూషణ్ అంటాడు. అప్పుడే మహా వస్తుంది. ఈ అమ్మాయి కోసం అయిన ఇక్కడే ఉండాలని.. సారీ సర్ నిన్న నా మిస్టేక్ అని భూషణ్ ఇగో సాటిస్ఫాక్షన్ అయ్యేలా మాట్లాడుతాడు. దాంతో భూషణ్ ఒప్పుకుంటాడు. వాడిది తప్పు అయినా అతనికి తప్పు అనేలా చేసాడని మహా అనుకుంటుంది. ఆ తర్వాత అందరు టిఫిన్ చేస్తారు. మహా చేత్తో తింటుంటే ఎందుకలా తింటున్నావ్.. కెనడాలో అలా తింటే నవ్వుకుంటారని భూషణ్ అనగానే మహాకి ఇంకా కోపం వస్తుంది. మరొకవైపు మాధవకి పెళ్ళిచూపులు అవుతుంటాయి. చూసుకోవడానికి అమ్మాయి వాళ్ళు వస్తారు. ఇల్లు ఇదేనా అని మాట్లాడుతారు. పెళ్లి ఫిక్స్ అయితే రిపేర్ చేయించడం ఎంతసేపు అని నారాయణ అంటాడు.  ఆమ్మో బావ పెళ్లి ఫిక్స్ అయ్యేలా ఉందని కిటికీలో నుండి చూస్తూ గాయత్రి అనుకుంటుంది. అది కేశవ చూసి గాయత్రీ అక్కడ ఉంది.. కన్నా తనని పంపించు అని చెప్తాడు. కన్నా వెళ్లి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పి తనని పంపిస్తాడు. గాయత్రి బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: ఫుడ్ ఫెస్టివల్ లో‌ గంగపై శకుంతలకు అనుమానం.. దొరికిపోతుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -145 లో .......లక్ష్మీ దగ్గరికి రుద్ర వచ్చి మందులు ఇస్తాడు. ప్రొద్దున పెద్దయ్య గారు వచ్చారు గంగ ని తీసుకొని వెళ్ళడానికి కానీ తను రానని చెప్పిందని లక్ష్మీ చెప్తుంది. మందులు వద్దని లక్ష్మీ అంటుంది. మీ అమ్మాయి మీకు మందులు కొనడం కోసం పని కోసం వెతుక్కుంటూ కష్టపడుతుంది. నేను తన గురించి అలోచించడం లేదు.. కేవలం మీ ఆరోగ్యం కోసం మాత్రమే ఆలోచిస్తున్నానని టాబ్లెట్స్ ఇచ్చి వెళ్తాడు. అప్పుడే గంగ వస్తుంది. రుద్ర ఎదురుపడుతాడు. గంగ పడిపోతుంటే రుద్ర పట్టుకుంటాడు. ఇక గంగతో ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. గంగ లోపలికి వెళ్లి రుద్ర సర్ ఎందుకు వచ్చాడని అడుగుతుంది. మందులు తీసుకొని వచ్చాడని లక్ష్మీ చెప్పాగానే డబ్బులు ఇస్తే తీసుకోలేదు అందుకే మందులు తీసుకొని వచ్చాడేమో మందులు ఇచ్చేసి వస్తానని గంగ అనగానే.. మొండి మొగుడు పెంకి పెళ్ళాం అసలు వినరని లక్ష్మీ అనుకుంటుంది. మరొకవైపు ఫుడ్ ఫెస్టివల్ కి వీరు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. పారు కూడా వస్తుంది. అందరు ఉన్నారు గంగ ఉంటే బాగుండేదని పెద్దసారు అనగానే ఆ గంగ గురించి మాట్లాడొద్దన్నాను కదా అని శకుంతల కోప్పడుతుంది. మరొక వైపు రుద్ర వచ్చి ఫుడ్ ఫెస్టివల్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి చూసుకుంటాడు. ఫుడ్ ఫెస్టివల్ కి గంగ, శ్రీను మారు వేషంలో వస్తారు. గంగ కర్చీఫ్ కింద పడేసినట్లు చేసి పెద్దసారు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. గంగ మారువేషం లో వచ్చిన విషయం ఇషిక, వీరు, పారుకి అర్థం అవుతుంది. గంగని చూసి ఎవరు మీరు అని శకుంతల అడుగుతుంది. వంటలు చెయ్యడానికి వచ్చామని గంగ చెప్తుంది. మరి ఆ ముసుగు ఏంటని శకుంతల అనగానే.. నా చెల్లికి పెళ్లి అయింది.. మూడు నెలలు వరకు ఎవరికి మొహం చూపించకూడదని శ్రీను అంటాడు. ఇక్కడికి పెద్ద పెద్దోళ్ళు వస్తారు అలా ఉండొద్దని శకుంతల అనగానే వదిలేయండి ఆంటీ వాళ్ళ ఆచారం అంట అని పారు అంటుంది. ఆ తర్వాత రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: మోడల్ ని రాకుండా చేసిన రాహుల్.. రాజ్ నిర్ణయం అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -907 లో.....రాహుల్ మనిషి కావ్య డిజైన్స్ వేసిందనుకోని తన క్యాబిన్ కి వెళ్లి తీసుకుంటాడు. కావ్య, రాజ్ వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. నాకు తెలుసురా నిన్ను ఇలా బయటకు రప్పించడానికే ఈ ప్లాన్ అని కావ్య అంటుంది. అతన్ని పోలీసులకి పట్టించమని మేనేజర్ కి చెప్తాడు రాజ్. ఇప్పుడు అర్థం అయిందా నేను ఎందుకు ఇలా చేసానోనని కావ్య అంటుంది కానీ భళే ప్లాన్ చేసావని రాజ్ అనగానే ఎంతైనా మీ భార్య ని కదా అని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య డిజైన్స్ వేస్తుంది. అవి చూసి ఇంతకన్నా శృతి మంచిగా వేస్తుందని రాజ్ అనగానే కావ్య అలిగి వెళ్తుంటే బుజ్జగిస్తాడు రాజ్. నువ్వు ఈ రోజు డిజైన్స్ వేస్తావని రేపు షూట్ కోసం మోడల్ ని కూడా పిలిచానని రాజ్ అంటాడు. దాంతో కావ్య డిజైన్స్ వెయ్యడం స్టార్ట్ చేస్తుంది. అదంతా రాహుల్ వింటాడు. మరుసటిరోజు రాజ్ షూట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసి శృతిని మోడల్ కి ఫోన్ చెయ్యమని చెప్తాడు. దాంతో మోడల్ కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ విషయం రాజ్ కి చెప్తుంది శృతి. ఇప్పుడు మళ్ళీ కొత్త మోడల్ ఎక్కడ దొరకాలని టెన్షన్ పడుతాడు. మరొకవైపు రాజ్ కి వచ్చే మోడల్ ని రాహుల్ తన ఆఫీస్ కి రప్పించుకుంటాడు. షూట్ క్యాన్సిల్ చేసుకున్నందుకు తనకి పది లక్షలు ఇస్తాడు రాహుల్. ఆ తర్వాత రాజ్ చాలా మోడల్స్ కోసం ట్రై చేస్తాడు. అందరు అందుబాటులో లేమని చెప్తారు. ఇంటికి వచ్చి రాజ్ టెన్షన్ పడుతూ అందరికి కాల్ చేస్తాడు. తరువాయి భాగంలో రాజ్ మోడల్ లేకుంటే ఎలా అని రాహుల్ అంటాడు. రాజ్ కి ఏమైనా తెలివి లేదా సెట్ చేసి ఉంటాడులే అని రుద్రాణి అనగానే కావ్య మోడల్ గా చేస్తుందని రాజ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.