ఆది బావ అంటూ ఆట పట్టించిన ఝాన్సీ, భూమిక.. ఎగరలేక బెడ్ రూమ్ లో సెటిలయ్యా!

  ఢీ డాన్స్ షో సంక్రాంతి సందర్భంగా సరికొత్తగా ముస్తాబై రాబోతోంది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. హోస్ట్ నందు ట్రెడిషనల్ లుక్ లో కనిపించాడు. "ఢీలో ప్రతీ ఎపిసోడ్ పండగలా ఉంటుంది. అలాంటిది పండగ రోజే ఎపిసోడ్ అంటే" అంటూ ప్రోగ్రాంని స్టార్ట్ చేసాడు.    ఇక కంటెస్టెంట్స్ అంతా కూడా అదిరిపోయే గెటప్స్ లో వచ్చారు. భూమిక ఐతే "బావ నేను హర్ట్ అయ్యా" అంటూ ఆదికి చెప్పింది. "ఎందుకురా" అన్నాడు. "నువ్వు కదా మన్మధుడు నాగార్జున అంటారేంటి" అన్నది భూమిక. ఇక ఆది తెగ సిగ్గుపడిపోయాడు. వెంటనే పక్కనే ఉన్న ఝాన్సీ "బావ నేను కూడా హర్ట్ అయ్యా" అంది. "దేనికి" అన్నాడు. " రాజకుమారుడు నువ్వైతే మహేష్ బాబును అంటారేంటి" అంది. అంతే ఆది సిగ్గులమొగ్గయ్యాడు.    ఇక నందు కూడా హర్ట్ అయ్యానంటూ "బొకడాగాడు పండు ఐతే నిన్ను అంటారేంటి" అంటూ కామెడీ చేసాడు. "బావ నేను నీ కోసం చెరుకు తెచ్చా" అంటూ ఝాన్సీ ఇచ్చింది. "ఆ సూళ్లూరుపేట ఈవెంట్ లో స్టేజి పక్కన కొన్నావా ఏంటి" అంటూ ఆది ఆమె పరువు తీసేసాడు.    "ది ఓజి ఆఫ్ తెలుగు ఇండిపెండెంట్ పాప్ మ్యూజిక్" అంటూ సింగర్ స్మితని, నోయెల్ ని స్టేజి మీద ఇన్వైట్ చేసాడు నందు. తర్వాత స్మిత "మసక మసక" సాంగ్ పాడింది. తర్వాత ఒక ఇంటరెస్టింగ్ సెగ్మెంట్ పెట్టారు. ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేస్తున్నారు దానికి సంబంధించి పిక్చర్స్ ఉన్నాయంటూ భూమిక, విజయ్ బిన్నీ మాస్టర్ పిక్స్ ని ప్లే చేసారు. "భూమిక గాలిపటాలు నువ్వు ఎగరేసావా మాష్టారా, ఐనా అక్కడ భూమికా ఉన్నా కూడా మాష్టర్ మాత్రం రెజీనా కోసం వెతుకుతున్నారు" అని ఆది అనేసరికి విజయ్ బిన్నీ మాష్టర్ షాకయ్యాడు.    తర్వాత ఆది పిక్చర్ ఉన్న గాలిపటం ఒక బెడ్ మీద ఉండేసరికి "నిన్ను గాలిలో ఎగరవయ్య అని గాలిపటం తీసుకుని వేస్తే బెడ్ రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా" అంటూ ఆదిని అడిగాడు నందు. "ఎగిరే ఓపిక లేక అక్కడే సెటిల్ అయ్యా" అని చెప్పాడు ఆది.  

Brahmamudi : అబద్ధం చెప్పిన కళ్యాణ్.. హాస్పిటల్ నుండి వెళ్ళిపోయిన కావ్య!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -926 లో...... రాజ్ ని పోలీసులు అరెస్ట్ చెయ్యగానే కావ్య టెన్షన్ పడుతూ కింద పడిపోతుంది. వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. బీపీ ఎక్కువ ఉందని డాక్టర్ చెప్తుంది. మా ఆయనని పిలిపించండి అని డాక్టర్ తో కావ్య అంటుంది. డాక్టర్ బయటకు వెళ్లి పేషెంట్ సిచువేషన్ క్రిటికల్ గానే ఉందని చెప్తుంది. మరొకవైపు సుభాష్, కళ్యాణ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. బెయిల్ దొరకడానికి ఇంకా రెండు రోజులు పడుతుందట అని సుభాష్ అనగానే బెయిల్ ఏంటి నాన్న.. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలని రాజ్ అంటాడు. అన్నయ్య అక్కడ వదిన పరిస్థితి బాలేదని కళ్యాణ్ అనగానే రాజ్ టెన్షన్ పడతాడు. అప్పుడే సుభాష్ కి అప్పు ఫోన్ చేసి మావయ్య అక్క సిచువేషన్ బాలేదు. ఆపరేషన్ చెయ్యాలి అంటున్నారని చెప్తుంది. అదే విషయం రాజ్ కి సుభాష్ చెప్తాడు. రాజ్ మరింత టెన్షన్ పడతాడు. కావ్యకి త్వరగా ఆపరేషన్ చేయకపోతే తల్లి, బిడ్డ ఇద్దరికి ప్రమాదమేనని డాక్టర్ చెప్తుంది. మరోవైపు రాహుల్ వంక అప్పు చూసి.. మొన్న మీరు సూట్ కేసు తీసుకొని వచ్చారు కదా అందులో ఏముందని అనుమానంగా అడుగుతుంది. ఏంటి అప్పు అలా అడుగుతున్నావని రాహుల్ అంటాడు. నువ్వు అప్పుడు ఎందుకో టెన్షన్ పడ్డావని అప్పు అనగానే అప్పుపై స్వప్న కోప్పడుతుంది. తరువాయి భాగంలో కావ్యకి అన్నయ్య వస్తున్నాడని కళ్యాణ్ అబద్ధం చెప్తాడు. కళ్యాణ్ చెప్పింది అబద్ధమని కావ్యకి తెలిసి హాస్పిటల్ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : సుమిత్రకి నిజం చెప్పేసిన జ్యోత్స్న.. తనపై కోప్పడ్డ శివన్నారాయణ!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -563 లో..... సుమిత్ర గురించి దీప బాధపడుతుంటే కార్తీక్ వచ్చి దైర్యం చెప్తాడు. నేను అమ్మకి నిజం చెప్తాను.. జ్యోత్స్న కన్నకూతురు కాదని అని దీప అనగానే వద్దు ఇప్పుడు అత్తయ్య పరిస్థితి చూసావా ఈ టైమ్ లో వద్దని కార్తీక్ అంటాడు. మరొకవైపు జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. అసలు కార్తీక్ కి.. నువ్వు అసలైన వారసురాలివి కాదని తెలిసి ఉంటుందని పారిజాతం అనగానే జ్యోత్స్న భయపడుతుంది. నీకెలా తెలుసని జ్యోత్స్న అనగానే రోజు సాయంత్రం టైమ్ కి వెళ్ళేటోడు.. అలాంటిది నీపై దృష్టి పెట్టి ఇంటికి కాపలా ఉన్నాడని పారిజాతం అంటుంది. అసలు బావ ప్లాన్ ఏంటి అని జ్యోత్స్న అనుకుంటుంది. మరుసటిరోజు దీప, కార్తీక్ శివన్నారాయణ ఇంటికి బయల్దేరతారు. అత్త ముందు జాగ్రత్తగా ఉండమని దీపకి కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. మీరేంటి ఇక్కడ అని కార్తీక్ అనగానే నేనే రమ్మన్నాను.‌. వదినని చూడడానికి వెళ్తానని కాంచన అంటుంది. పెద్ద ప్లానే.. మీరు దీపని కార్ లో తీసుకొని వెళ్ళండి‌. నేను మిమ్మల్ని ఫాలో అవుతానని కార్తీక్ అంటాడు. అ తర్వాత మమ్మీకి నిజం చెప్పాలని అనుకుంటున్నా గ్రానీ.. తనకి బ్లడ్ కాన్సర్ అని చెప్పేస్తా.. భయంతో మమ్మీ ఉండదు. మనం సేఫ్ అని జ్యోత్స్న అనగానే పారిజాతం తన చెంపచెల్లుమనిపిస్తుంది. అలా చేయడం తప్పు అని పారిజాతం అంటుంది. అయిన పారిజాతాన్ని జ్యోత్స్న కన్విన్స్ చేస్తుంది. జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు సుమిత్ర దగ్గరికి వెళ్తారు. సుమిత్రకి జ్యోత్స్న టాబ్లెట్ ఇచ్చి తనతో మాట్లాడుతుంది‌. మమ్మీ నీకు బ్లడ్ కాన్సర్.. ఆ విషయం ఇంట్లో వాళ్ళు చెప్పలేకపోతున్నారని అంటుంది. కానీ సుమిత్ర అదేం వినకుండా పడుకుంటుంది. ఛీ ఇప్పటివరకు చెప్పింది అంతా వట్టిదేనా అని జ్యోత్స్న అనుకుంటుంది. అదంతా శివన్నారాయణ, దీప కార్తీక్, కాంచన వింటారు. కాసేపటికి జ్యోత్స్నపై అందరు కోప్పడుతారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య పెళ్ళిచూపులు క్యాన్సిల్.. వాళ్ళంతా హ్యాపీ!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -364 లో.....అమూల్యని చూడడానికి వచ్చిన అబ్బాయి కామాక్షి వంక చూస్తాడు. తనే పెళ్లి కూతురు అనుకుంటాడు. అమూల్య జ్యూస్ ఇవ్వమని వేదవతి అంటుంది. తను వద్దు ఆ అమ్మాయి ఇవ్వాలని కామాక్షిని చూపిస్తాడు వరుడు. ఎందుకంటే కాబోయ్ భార్య చేత తీసుకోవాలని వరుడు అనగానే అందరు షాక్ అవుతారు. ఏంటి బాబు నువ్వు అనేది.. కాబోయే భార్య ఏంటి.. ఆల్రెడీ తనకి పెళ్లి అయిందని భాగ్యం అంటుంది. దాంతో అబ్బాయి షాక్ అవుతాడు. తనని చూస్తే అసలు పెళ్లి కానట్లే ఉందని అబ్బాయి అనగానే.. నాకు పెళ్లి అయింది.. ఒక పాప కూడా ఉందని కామాక్షి అనగానే మా అబ్బాయి పొరపాటు పడ్డాడని అబ్బాయి పేరెంట్స్ అంటారు. మీ అమ్మాయి మాకు బాగా నచ్చిందని వాళ్ళు అనగానే మీరు ముందు ఇక్కడ నుండి వెళ్లిపోండి అని అబ్బాయి వాళ్ళని ఇంట్లో నుండి పంపిస్తాడు రామరాజు. అ తర్వాత భాగ్యం, ఆనందరావు, శ్రీవల్లి బయటకు వచ్చి పెళ్లిచూపులు క్యాన్సల్ అయ్యాయని  విశ్వకి చెప్తారు. అ తర్వాత అందరు డల్ గా ఉంటే తిరుపతి మాత్రం తన అతిలోకసుందరితో ఫోన్ మాట్లాడుతాడు. అందరు వచ్చి మామ.. నీ అతిలోకసుందరిని మాక్కూడా చూపించమని అనగానే ఫోన్ చేసి తిరుపతి తనని రప్పిస్తాడు. అతిలోకసుందరి వస్తుంది కానీ తన మొహం మాత్రం చూపించదు. అందరు తన మొహంపై ఉన్న కొంగు తియ్యాలని చూస్తారు కానీ తియలేరు. తిరుపతి మాత్రం తన మొహం చూసి షాక్ అవుతాడు. మరొకవైపు రామరాజు దగ్గరికి వేదవతి వస్తుంది. అలా జరిగినందుకు రామరాజు బాధపడతాడు. అ తర్వాత అమూల్య, విశ్వ రహస్యంగా మాట్లాడుకుంటారు‌‌. పెళ్లిచూపులు క్యాన్సల్ అయినందుకు హ్యాపీ అవుతుంది అమూల్య. అ తర్వాత ధీరజ్ ని ప్రేమ ఆటపట్టిస్తుంది. తనకి కావలసిన వస్తువులన్నీ దాచేస్తుంది. వాటి కోసం ధీరజ్ వెతుకుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

చక్రి, మహాలని పట్టుకున్న భూషణ్.. జస్ట్ మిస్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -25 లో.....భూషణ్ తన ఫ్రెండ్ ని రమ్మని తన కార్ లో వెళ్ళిపోతాడు. మంచిపని చేసాడు లేదంటే మహా గురించి తప్పుగా మాట్లాడతాడా అని ఆదితో ప్రతాప్ అంటాడు. అతనికి ఇంకా మహాని పెళ్లి చేసుకోవాలని ఉందని ఆది అంటాడు. మరొకవైపు మహాని చక్రి తీసుకొని వెళ్తుంటే ఒక దగ్గర కార్ ఆగుతుంది. చక్రి కార్ దిగబోతుంటే ఇక్కడ ఎందుకు అపావు. నాకు భయంగా ఉంది. కావాలనే అపావు కదా అని మహా అంటుంది. లేదండి ఇంజన్ హీట్ అయిందని చక్రి చెప్తాడు. చక్రి బయట వైపు వెళ్లి మహాని తీసుకొని వెళ్తాడు. మహాకి భయం వేసి ఒక పెద్ద రాయి పట్టుకుంటుంది. చక్రి తన కోసం చలిమంట పెడతాడు. దాంతో అతన్ని తప్పుగా అర్ధం చేసుకున్నానని మహా రాయి పక్కకి విసిరేస్తుంది. అ తర్వాత తనకి ఆకలిగా ఉందని  మొక్కజొన్న కాల్చి ఇస్తాడు చక్రి. మహాకి నిద్ర వచ్చి తన భుజాలపై తల వాలుస్తుంది మహా. దాంతో చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనని పక్కన పడుకోపెట్టి దుప్పటి కప్పి తనని రాత్రంతా అలా చూస్తుంటాడు. మరుసటి రోజు ఉదయం మహా నిద్రలేచి కార్ దగ్గరికి వెళ్తుంది‌. ఆతర్వాత చక్రి, మహాని తీసుకొని సిటీకి బయల్దేరతాడు. అప్పుడే భూషణ్ వాళ్ళ కార్ చక్రి కార్ కి ఎదురుగా వచ్చి ఆగుతుంది. భూషణ్ కార్ దిగి.. మహా నా కార్ ఎక్కు అని తనపై కోప్పడుతాడు. నేను ఎక్కను మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోకుంటే మీ కార్ అద్దాలు పగులగొడతానని మహా అనగానే భూషణ్ వాళ్ళ ఫ్రెండ్ భయపడి భూషణ్ ని అక్కడ నుండి తీసుకొని వెళ్తాడు. ఇక చక్రి, మహా ఇద్దరు వెళ్తున్న కార్ ని భూషణ్, తన ఫ్రెండ్ తో కలిసి ఫాలో చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది. అ తర్వాత పారుకి హెల్ప్ చేసిన అకాడమీ మేనేజర్ కి ఇండైరెక్ట్ గా గంగ కౌంటర్ ఇస్తుంది. ఆ తర్వాత పారు ఇంకా తన ఫ్రెండ్స్ అందరు గంగ తాగాల్సింది మేమ్ ఎలా తాగామని అనుకుంటారు. ఈసారి ప్లాన్ చేస్తే పర్ ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటారు. మరొకవైపు శకుంతల దగ్గరికి ఇషిక, వీరు వచ్చి మీ మాట ఇంట్లో ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ రోజు గంగ, రుద్ర పూజ చెయ్యాలి. గంగ లేదని అన్నయ్య పూజ క్యాన్సిల్ చేసాడు. అన్నయ్య నీ  గురించి చాలా ఆలోచిస్తాడు కానీ రుద్ర బావ ఇలా ఆలోచిస్తే బాగుండు అని శకుంతలతో ఇషిక చెప్తుంది. గంగ వస్తుంది. పూజ జరుగుతుందని శకుంతల అంటుంది. మరొకవైపు క్యాంటీన్ లో గంగ ప్లేట్ లో అన్నం తీసుకొని వెళ్తుంటే పారు, ఇంకా తన ఫ్రెండ్స్ గంగ కిందపడేలా చేస్తారు. గంగని అవమానిస్తారు అయ్యో అన్నం లేదని పారు అంటుంటే.. మేం ఉన్న దాంట్లో సర్దుకుంటామని గంగ ఫ్రెండ్స్ గంగకి భోజనం షేర్ చేస్తారు. మరొకవైపు ఇప్పుడు పూజ చెయ్యాలి. పౌర్ణమి గడియ్యాలో అమ్మవారి పూజ జరగాలి. నువ్వు గంగ పూజలో కూర్చోవాలని శకుంతల తన నిర్ణయం చెప్తుంది. గంగని తీసుకొని వస్తానని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత పారుకి ఇషిక ఫోన్ చేస్తుంది. అకాడమీలో జరిగింది మొత్తం పారు చెప్తుంది. గంగని తీసుకొని రావడానికి రుద్ర బావ అక్కడికి వచ్చాడని పారుకి ఇషిక, వీరు చెప్తారు. బావ ఎలాగైనా గంగని తీసుకొని వస్తాడు. దాంతో అక్కడ గంగ లేదని మేడమ్ కి చెప్పి సస్పెండ్ చేపించమని వీరు చెప్తాడు. గంగని తీసుకొని రుద్ర బావ రాకుంటే అత్తయ్య గంగని ఎప్పటికి రానివ్వదని వీరు అంటాడు. ఆ తర్వాత రుద్ర అకాడమీ దగ్గరికి వెళ్లి గంగకి పేపర్ లో జరిగింది మొత్తం రాస్తాడు. ఇప్పుడు నేను వెళ్ళాలని గంగ తన ఫ్రెండ్స్ కి చెప్పగానే తన ఫ్రెండ్స్ అందరు గంగకి హెల్ప్ చేస్తారు. దాంతో గంగ గోడదూకి వెళ్తుంది. ఆ తర్వాత గంగని తీసుకొని రుద్ర వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

    నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.       అక్క, చెల్లి, అమ్మ లేకుండా..ఇక బంగారమ్స్ నేను నేను మస్త్ ఉన్నా...అసలే చాలా బిజీ లైఫ్ లో, చాలా అచీవ్ చేయాలి, మీమ్ పేజెస్ హ్యాండిల్ చేయడం కాకుండా..అప్సెట్ అవలేదు దేనికీ అవను కూడా. నా వెనక మాట్లాడుకునే జోకర్స్ కంటే నేను ముందే ఉన్నాను. నా మీద కంటెంట్ చేసుకునేవాళ్ళందరికీ మంచి జీవితం ఉండాలని కోరుకుంటున్నా" అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఫైనల్ గా #saavandiఅని కూడా పెట్టింది.  నైనిక ఒరిస్సా పిల్ల. హైదరాబాద్ వచ్చి సెటిల్ ఐన ఫామిలీ. నైనికాకు డాన్స్ అంటే పిచ్చితో డాన్సర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి దూసుకెళ్తోంది.          

శ్రీముఖి కన్నా ఎక్కువ సంపాదించేవాళ్ళు లేరమ్మా...వంటొచ్చిన వాళ్ళు కావాలి

      ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో సకుటుంబ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమయ్యారు..దానికి సంబందించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షో మొత్తంలో శ్రీముఖి పెళ్లి కాన్సెప్ట్ తోనే లింక్ ఐనట్టు తెలుస్తోంది. శ్రీముఖికి వాళ్ళ నానమ్మ ఈ షోకి వచ్చింది. ఇక శ్రీముఖి చిత్రంతో ఒక బోర్డుని స్టేజి మీద ఏర్పాటు చేసారు. ఇక హరి శ్రీముఖికి కావాల్సిన పెళ్లికొడుకులో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో, మీకు ఎలాంటి మనవడు కావాలో చెప్తే మేం రాస్తాం అంటూ నానమ్మని అడిగాడు. ఆమె చాలా కండిషన్స్ చెప్పింది. "బుద్ది, గుణం బాగుండాలి" అని చెప్పింది. "సంపాదన ఎంత ఉండాలి" అని అవినాష్ అడిగాడు. "శ్రీముఖి కంటే ఎక్కువనే ఉండాలి" అని చెప్పింది.        "శ్రీముఖి కన్నా ఎక్కువ సంపాదించేవాళ్ళు లేరమ్మా" అన్నాడు హరి. "ఆమె అడిగింది పెట్టాలి, ఆమెకు టమాటో ముక్కాలా కూర, రోటి పచ్చడి, చిక్కుడుకాయ, మామిడి పచ్చడి" అనేసరికి "ఎందుకు కర్రీ పాయింట్ పెట్టుకుంటుందా" అంటూ అవినాష్ అడిగాడు. "అంటే శ్రీముఖి అడిగిందల్లా వండి పెట్టాలంటారు అంతేనా" అని అడిగి బోర్డు మీద "వంట మనిషి కావాలి" అని రాసాడు. "ఒరేయ్ వంట మనిషి కాదురా వంట వచ్చిన మనిషి కావాలి" అని రాయాలి అని సరి చేసింది శ్రీముఖి. "సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావాలా బయట వాళ్ళు కావాలా" అని అవినాష్ అడిగాడు. "ఇప్పుడు హీరోలందరికీ పెళ్లిళ్లయిపోయాయి కదా" అని నానమ్మ అంటే "అవును హీరో రామ్ చరణ్, మహేష్ బాబుకు ఐపోయింది" అని శ్రీముఖి అనేసరికి హరి, అవినాష్ వామ్మో అంటూ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. "నానమ్మ ఈ గ్యాప్ లో బోర్డు మీద ఇంకో పాయింట్ రాసాడు. ఓవరాల్ గా అవినాష్ లా ఉండాలి" అని రాసేసరికి "నీలాంటోళ్ళు అసలు వద్దు" అని అవినాష్ ముఖమ్మీదే చెప్పేసింది నానమ్మ. దాంతో శ్రీముఖి నవ్వేసింది.  

డియర్ ప్రదీప్...సుధీర్ బావాయనమః ...బ్యాచిలర్ హోస్ట్స్ కి లవ్ లెటర్స్

      బుల్లితెర మీద సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. షోస్, ఈవెంట్స్ కంటే ముందు ప్రోమోస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక జీ తెలుగులో "సంక్రాంతి అల్లుడు పండగకి వస్తున్నారు" షోకి సంబందించిన మరో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కావ్య, భూమిక, ఆనాల సుష్మిత వీళ్ళు ప్రదీప్ కి, సుధీర్ కి లవ్ లెటర్స్ రాసి ఇంప్రెస్ చేశారు. ఎవరెవరు ఎం రాసారంటే "ఓం సుధీర్ బావాయనమః నీ అందం పాలపుంత, నీ స్పర్శ తాకితే పులకింత" అంటూ ప్రదీప్ సుధీర్ కి సుష్మిత రాసిన లేఖ చదువుతూనే ఆమెను కొరికేసేలా చూస్తూ ఉన్నాడు. ఇక సుధీర్ ప్రదీప్ చూపులకు బ్రేక్ వేసాడు. "గాలి ఓ గాలి నింగి ఓ నింగి సుధీర్ కి నేను అర్ధాంగి" అంటూ కావ్య సుధీర్ కి రాసిన లెటర్ ని ప్రదీప్ చదివి వినిపించాడు.      తర్వాత సుధీర్ - కావ్య కలిసి సాంగ్ కి డాన్స్ చేశారు. తర్వాత ప్రదీప్ కి భూమి రాసిన లవ్ లెటర్ ని సుధీర్ చదివి వినిపించాడు. "డియర్ ప్రదీప్.. ఈ లోకంలో మగాళ్ళెంతమందున్నా నా మనసు మాత్రం నిన్నే మొగుడు అని పిలవమంటోంది..ఈ ప్రాణం నీ సొంతం. ఇట్లు నీ భూమిక మాచిరాజు" అని చదివేలోపు భూమిక మోకాళ్ళ మీద కూర్చుని ప్రదీప్ కి ప్రొపోజ్ చేసేసింది.      

బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ టైం డాన్స్ చేసిన కళ్యాణ్,తనూజ

      బిగ్ బాస్ సీజన్ 9 ఐపోయాక విన్నర్ కళ్యాణ్ పడాల, రన్నరప్ గా నిలిచిన తనూజ మొదటిసారి స్టార్ మాలో సంక్రాంతి వేడుకలో సందడి చేయడానికి రాబోతున్నారు. "మా సంక్రాంతి వేడుక" పేరుతో ఆ ప్రోమో రిలీజ్ అయ్యింది. వీళ్ళిద్దరూ కలిసి "ఛాంపియన్" మూవీలోని సూపర్ డూపర్ హిట్ ఐన "గిరగిరగిర" సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక ఈ ఈవెంట్ లో "సీరియల్ సూపర్ స్టార్స్, బిబి బ్లాస్టర్స్, వీకెండ్ ఎంటర్టైనర్స్ ఆర్ యు రెడీ..ఆడియన్స్ ఏంటి మరి సంగతి..ఇరగదీద్దాం ఈ సంక్రాంతి" అంటూ శ్రీముఖి గట్టిగా ఇంట్రో ఇచ్చింది. ప్రభాకర్, నిరుపమ్ పరిటాలను చూసిన హరి "వీళ్ళిద్దరినీ పెట్టి నెక్స్ట్ సంక్రాంతికి సినిమా తీస్తే వంద కోట్లుకి వెయ్యి కోట్లు వస్తాయి సర్" అన్నాడు. "ఈ ఇద్దరూ ఫాదర్ క్యారెక్టర్స్ కి ఓకే మరి హీరో ఎక్కడా" అంటూ సెటైర్స్ వేసాడు అవినాష్. తర్వాత నిఖిల్ ని చూసిన శ్రీముఖి "ఈ అబ్బాయిని పెట్టుకుని మంచి బ్రేకప్ స్టోరీ చేశారనుకోండి థియేటర్ లో కటింగ్లే  కటింగ్లు " అంటూ చెప్పింది.      తర్వాత కళ్యాణ్ పడాల, ఇమ్మానుయేల్, డెమోన్ పవన్ ని పెడితే  మంచి టైటిల్ ఉంది మన  దగ్గర  అన్నాడు హరి. ఏంటది అన్నారంతా. "అన్నయ్యకు ఆశీస్సులు, తమ్ముళ్లకు సూటుకేసులు అని అన్నాడు హరి. ఇక బిగ్ లవ్ స్టోరీ పేరుతో రాహుల్ సిప్లిగంజ్ తన వైఫ్ గురించి చెప్పుకొచ్చారు. "అసలు ఈ కలయిక ఎప్పుడు మొదలయ్యింది" అని శ్రీముఖి అడిగింది. "నిన్ను నన్ను నాగ్ సర్ రెండు చేతులు పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు కదా తర్వాత నీ చెయ్యి ఒకళ్ళ చేతిలో పెట్టాడు నా చేతిని ఈమె చేతిలో పెట్టాడు" అని చెప్పాడు. తర్వాత కళ్యాణ్ - తనూజ డాన్స్ చేస్తూ వచ్చేసరికి "మీకెవ్వరికీ ఎవరి దిష్టి తగలకూడదమ్మా" అన్నాడు ఇమ్మానుయేల్. "ఫస్ట్ నీ దృష్టే తగిలేలా ఉంది" అంటూ ఇమ్మానుయేల్ కి కౌంటర్ వేసాడు హరి.  

Jayam serial: బెడిసికొట్టిన పారు ప్లాన్.. గంగకి కాంప్లిమెంట్!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -163 లో... రుద్ర గదిలో ఉండగా శకుంతల తాళం వేస్తుంది. పెద్దమ్మ చేస్తుంది తప్పని చెప్పు పెద్ద నాన్న అని వంశీ, సూర్య పెద్దసారుతో అంటారు. నేను చెప్పను ఎందుకంటే ఎవరు నేను చెప్పింది వినట్లేదని పెద్దసారు కోప్పడతాడు. ఆ తర్వాత పెద్దసారు వెనకాల డోర్ నుండి పైకి తాడు విసురుతుంటే వంశీ, సూర్య వస్తారు. పెద్దసారు హెల్ప్ చేస్తారు. దాంతో రుద్ర తాడు సాయంతో కిందకి దిగి గంగ దగ్గరికి వెళ్తాడు.   మరొకవైపు పారు ప్లాన్ లో భాగంగా గంగతో మంచిగా ఉన్నట్లు యాక్టింగ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంది పారు. ఇక పారు సైగ చెయ్యగానే తన ఫ్రెండ్ బేరర్ దగ్గరికి వెళ్లి ఇది జ్యూస్ లో కలపండి కానీ ఒక అమ్మాయికి ఇవ్వండి అని గంగని చూపిస్తుంది. అ తర్వాత బేరర్ తీసుకొని వెళ్లి జ్యూస్ ఇవ్వగానే గంగ అది తాగి మత్తుగా డ్యాన్స్ చేస్తుంది. దాంతో అది పారు వీడియో తీసి వీరుకి పంపిస్తుంది. పారు ఇంకా అక్కడ ఇంచార్జ్ కి పంపి అది మేడమ్ కి చూపించి మేడమ్ ని తీసుకొని రా.. వాళ్లు వచ్చి గంగని సస్పెండ్ చేస్తారని పారు చెప్పగానే అతను సరే అంటాడు.   వీరు అకాడమీ మేడమ్ కి ఫోన్ చేసి మీ అకాడమీ పక్కన వాళ్ళు సాండ్స్ వస్తున్నాయ్.. డిస్టబెన్స్ అని కంప్లైంట్ ఇచ్చారని ఫోన్ చేసి మాట్లాడుతాడు. దాంతో మేడమ్ వెంటనే గంగ వాళ్ల రూమ్ వైపు వస్తుంది. మేడమ్ వచ్చేసరికి గదిలో పారు ఫ్రెండ్స్ మత్తుగా డ్యాన్స్ చేస్తుంటారు. గంగ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. దాంతో పారు ఫ్రెండ్స్ పై మేడమ్ కోప్పడుతుంది. గంగ వాళ్లు చేసే ప్రాక్టీస్ అండ్ డెడికేషన్ చూసి మెచ్చుకుంటుంది.   మరొకవైపు శకుంతలకి గంగ వీడియో చూపిస్తాడు వీరు. అకాడమీకి గంగని పంపిస్తే ఇలా చేస్తుందని శకుంతల కోప్పడుతుంది. అప్పుడే రుద్ర వస్తాడు. అదంతా అబద్ధమని పారు చేసిన కుట్ర గురించి మొత్తం చెప్తాడు. అక్కడ బేరర్ గా మత్తు తీసుకుంది రుద్రనే.. ఇక పారు ప్లాన్ ని ముందే గంగకి చెప్తాడు రుద్ర . దాంతో పారుని నమ్మించడానికి గంగ మత్తులో ఉన్నట్లు యాక్టింగ్ చేసిందని శకుంతలతో రుద్ర చెప్తాడు. అయినా నేను వద్దన్నా ఎలా వెళ్ళావ్.. ఎవరు తాళం తీశారని శకుంతల అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Podarillu: మహా, చక్రిలని ఫాలో చేస్తున్న ప్రతాప్ రౌడీలు.. భూషణ్ పట్టుకుంటాడా?

  స్టార్ట్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -24 లో... మహా లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అది చదివిన మహా వాళ్ళ నాన్న ప్రతాప్ తీవ్ర మనోవేదనకి గురి అవుతాడు.    ఇక అప్పుడే ఆది వచ్చి.. నాన్న మన కార్లు అన్నీ ఉన్నాయి.. మన డ్రైవర్ చక్రి కనపడటం లేదు.. వాడి ఫోన్ కూడా కలవడం లేదని చెప్తాడు. దాంతో అందరు టెన్షన్ పడతారు. అప్పుడే భూషణ్ వస్తాడు. ఏం జరిగింది మహా ఎక్కడ అని అడుగుతాడు. ఇక భూషణ్ పెద్దపెద్దగా అరుస్తాడు. అప్పుడే మహా వాళ్ళ అమ్మ చేతిలోని లెటర్ చూసి ఇవ్వమని అడుగుతాడు. అది తీసుకొని చదివిన భూషణ్ షాక్ అవుతాడు.   ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నారని ప్రతాప్ ని భూషణ్ అడుగుతాడు. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళరు.. మనం వెతుకుదామని ఆదితో ప్రతాప్ అనగానే.. నేనేం చేయాలి.. మీతో పాటే వస్తానని భూషణ్ అంటాడు. ఇక ప్రతాప్, భూషణ్, ఆది కలిసి మహాని వెతకడానికి బయల్దేరి వెళ్తారు.    కారులో వెళ్తుంటే మహా ఆ డ్రైవర్ చక్రిగాడితో లేచిపోయిందని భూషణ్ అంటాడు.  జాగ్రత్తగా మాట్లాడండి.. నోరు అదుపులో పెట్టుకోమని భూషణ్ తో ప్రతాప్, ఆది అంటారు. మహాని తీసుకొస్తా అని ప్రతాప్ అంటాడు. ఇంటి ముందున్న సీసీటీవి ఫూటేజ్ చూడగా అందులో చక్రితో కలిసి బ్యాగ్ తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది. ఇక అది చూసిన ప్రతాప్, ఆదితో పాటు భూషణ్ షాక్ అవుతాడు.   ఇక తమ షాప్ ల ముందున్న సెక్యూరిటీకి కాల్ చేస్తాడు ప్రతాప్.. మా అమ్మాయి ఏదైనా కారులో వెళ్తే నాకు చెప్పు అని సెక్యూరిటీతో ప్రతాప్ చెప్పగానే అతను సరేనంటాడు. మరోవైపు కారులో ఉన్న భూషణ్ నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. దాంతో ప్రతాప్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. తర్వాత రౌడీలని కాల్ చేస్తాడు ప్రతాప్.    ఇక కాసేపటికి చక్రి, మహాల కార్ కి అడ్డంగా ప్రతాప్ పంపిన రౌడీలు వస్తారు. వారిని తప్పించుకొని చక్రి కార్ ని పక్కకి నడుపుతాడు. ఇక చక్రి, మహా కార్ లో ఫాస్ట్ గా వెళ్తుంటే వెనకాల రౌడీలు ఫాలో చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu: కామాక్షిని పెళ్ళికూతురు అనుకున్న వరుడు.. అందరు షాక్!

  స్టార్ట్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -363 లో.. అమూల్యకి పెళ్లిచూపులు జరుగుతుంటే నాక్కూడా పెళ్లిచూపులు జరిగి ఉంటే ఎలా ఉంటుందోనని ప్రేమ ఉహించుకుంటుంది. తన పుట్టింటికి ధీరజ్ ఫ్యామిలీతో వచ్చినట్లుగా, ధీరజ్ అన్ని ప్రశ్నలు అడుగుతుంటే ప్రేమ వెటకారంగా సమాధానం చెప్పినట్లు ఉహించుకొని నవ్వుకుంటుంది. ప్రేమ అలా నవ్వడం చూసి ఏమైందని నర్మద అడుగుతుంది. మాకు పెళ్లిచూపులు జరగలేదు కదా.. అందుకే ఒకసారి పెళ్లిచూపులు జరిగితే ఎలా ఉంటుందో ఉహించుకున్నాను.. అందులో ధీరజ్ నన్ను పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడుతున్నాడని నర్మదతో ప్రేమ చెప్తుంటే ధీరజ్ వింటాడు.    మరొకవైపు కామాక్షి కోపంగా ఇంటికి వస్తుంది. తన కోసం భాగ్యం వాళ్ళు ఎదురుచూస్తారు. తను రాగానే నిన్నుపిలవకుండా నీ చెల్లికి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తున్నారు. ముందు వెళ్లి మీ అమ్మ దగ్గర తేల్చుకోమని శ్రీవల్లి అంటుంది. దాంతో కామాక్షి కోపంగా వేదవతి దగ్గరికి వెళ్తుంది. నాకు తెలియకుండా ఇలా ఎందుకు చేశారని అడుగుతుంది. ఇలా వచ్చి అక్క కట్నం.. ఆడపడుచు కట్నం.. అంటే బాగుండదు కదా.. అందుకేనని వేదవతి అంటుంది. నేను ఇక ఈ ఇంట్లో అడుగుపెట్టనని కోపంగా కామాక్షి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.   కామాక్షి బయటకు వెళ్తుంటే అలా వెళ్తే నువ్వు కట్నాలు చాలా మిస్ అవుతావని భాగ్యం అనగానే మళ్ళీ వెనక్కి వెళ్తుంది. అమూల్య నిన్ను రెడీ చేస్తానని కామాక్షి అంటుంది. తను రెడీ అయింది కానీ నిన్ను రెడీ చేస్తానని కామాక్షిని భాగ్యం అందంగా రెడీ చేస్తుంది. హాల్లోకీ అమూల్య, కామాక్షి, శ్రీవల్లి ఇలా ముగ్గురు వస్తుంటే.. అబ్బాయి కామాక్షిని పెళ్లి కూతురు అనుకుంటాడు. అమూల్య కూల్ డ్రింక్ ఇవ్వమని వేదవతి చెప్తుంటే.. వద్దు తనే ఇవ్వాలి.. కాబోయ్ పెళ్లికూతురు ఇస్తే బాగుంటుందని అబ్బాయి కామాక్షిని ఉద్దేశించి అంటుంటే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: సుమిత్రకి క్యాన్సర్.. జ్యోత్స్న సొంత కూతురు కాదని తెలుస్తుందా?

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -562 లో... దీపని తీసుకొని శ్రీధర్ ఇంటికి వస్తాడు. కార్తీక్ ఎక్కడ? దీపని మీరు తీసుకొని వచ్చారేంటి? అని కాంచన అడుగుతుంది.  దీప ఏడుస్తుంటే కాంచనకి భయం వేసి.. ఏమైంది దీప ఎవరు ఏమన్నారని కాంచన అడుగుతుంది. పంతులు గారు చెప్పిన గండం వచ్చింది అత్తయ్య.. అది సుమిత్ర అమ్మని చుట్టుముట్టిందని దీప ఏడుస్తుంది. సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్ అని శ్రీధర్ చెప్పగానే అనసూయ, కాంచన షాక్ అవుతారు. ట్రీట్ మెంట్ ఉందని డాక్టర్ చెప్పారని శ్రీధర్ చెప్తాడు.   దీప ఏడుస్తుంటుంది. దీపకి సుమిత్ర వదిన అంటే ఎంత ఇష్టం సొంతకూతురు కాకపోయినా ఎంత బాధపడుతుందని కాంచన అంటుంది. నాకే బాధగా అనిపిస్తుంది అంటే రోజు సుమిత్ర అమ్మ దగ్గర ఉండే దీపకి ఇంకెంతలా ఉంటుందని అనసూయ అంటుంది. కాంచన నువ్వే మీ అన్నయ్యకి ధైర్యం చెప్పాలి. దీప నువ్వు బాధపడకు నీ కడుపులో బిడ్డ ఉంది.. తనపై ఆ ప్రభావం చూపకూడదని  శ్రీధర్ చెప్తాడు. కాంచన నువ్వు దీపకి అర్ధమయ్యేలా చెప్పమని శ్రీధర్ చెప్పి వెళ్ళిపోతాడు.    మరొకవైపు డాక్టర్ మాటలు గుర్తుచేసుకొని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. నేను ఇక్కడే ఉంటే ఖచ్చితంగా నేను వారసురాలిని కాదని తెలుస్తుంది. నేను ఇక్కడ ఉండకూడదని జ్యోత్స్న బట్టలు సర్దుకొని బయటకు వెళ్లిపోతుంటే..కార్తీక్ ఎదురుగా వస్తాడు. తనని చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఏంటి మేడమ్ ఎక్కడికి వెళ్తున్నారు.. మీరు వెళ్తున్నట్లు కనీసం మీ డాడీ, తాతయ్యలకు అయినా చెప్పారా అని కార్తీక్ అడుగుతాడు. జ్యోత్స్న టెన్షన్ పడుతుంది.    అప్పుడే దశరథ్, శివన్నారాయణ వస్తారు. బావ నన్ను ఇలా ఇరికించాడేంటని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. తల్లి ఆ స్థితిలో ఉంటే కూతురు ఎవరైనా ఇలా చేస్తుందా.. అసలు నువ్వు కూతురివేనా అని శివన్నారాయణ అంటాడు. మేమ్ అంటే మీకు ఇష్టం లేదా జ్యోత్స్న అని దశరథ్ అంటాడు. అప్పుడే పారిజాతం వస్తుంది. జ్యోత్స్న నిర్ణయంలో నీ పాత్ర కూడా ఉందా అని శివన్నారాయణ అడుగుతాడు. నీ మనవరాలు ఇంట్లో నుండి వెళ్ళిపోతుందట అని శివన్నారాయణ అనగానే పారిజాతం కూడా షాక్ అవుతుంది. తాత నాకు అమ్మ పరిస్థితి చూసి భయం వేసి వెళ్తున్నానని చెప్తుంది. దాంతో శివన్నారాయణ తనపై కోప్పడతాడు. ఇక జ్యోత్స్న లోపలికి వెళ్తుంది.    జ్యోత్స్న ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ అదో ప్రాబ్లమ్.. వెళ్లకుండా ఆపేలే చేసావ్.. థాంక్స్ రా కార్తీక్ అని దశరథ్ అంటాడు. కాసేపటికి కార్తీక్ ఇంటికి వెళ్తాడు. బాధపడుతున్న దీపకి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: రాజ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు.. డెలివరీకి కావ్య ఒప్పుకుంటుందా?

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-925 లో.. తన కడుపులో బిడ్డపై రుద్రాణి చేసిన కుట్ర గురించి తల్చుకొని కావ్య బాధపడుతుంది. అప్పుడే రాజ్ వచ్చి.. ఇప్పుడు అది ఎందుకు ఆలోచిస్తున్నావు మర్చిపోమని దైర్యం చెప్తాడు. మీరు డెలివరి టైమ్ లో నా పక్కన ఉంటానని మాటివ్వండి అని కావ్య అనగానే రాజ్ మాటిస్తాడు.    మరొకవైపు ఉదయం అందరు హాల్లో దిగులుగా కూర్చొని ఉంటారు. ధాన్యలక్ష్మి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తే వద్దు తాగాలని లేదని ఇద్దరు అంటారు. అమ్మమ్మా మా అమ్మ చేసిన తప్పుకు ఇంకా కోపం పోలేదంటే తన పిల్లలం ఇక్కడే ఉన్నాం కొట్టండి తిట్టండి పడతామని రాహుల్ అంటాడు. ఆ తర్వాత ప్రకాష్ వచ్చి ఏంటి ప్రొద్దున నుండి రుద్రాణి కన్పించడం లేదని అడుగుతాడు. బాబాయ్ ఇలా జరిగింది మర్చిపోవడం నీకు అదృష్టం అని ప్రకాష్ తో రాజ్ అంటాడు.    ఆ తర్వాత ఇంటికి పోలీసులు వస్తారు. మీరు దొంగ బంగారం సప్లై చేస్తున్నారని తెలిసి సాండి అనే అతను మీ ఆఫీస్ కి వచ్చి డీలింగ్ పెట్టుకున్నాడని తెలిసిందని ఇన్‌స్పెక్టర్ అంటాడు. వాడు ఆఫీస్ కి వచ్చి ఆఫర్ ఇచ్చింది నిజమే కానీ దానికి నేను ఒప్పుకోలేదని రాజ్ అంటాడు. దాంతో సాండిని పిలిపిస్తారు. రాజ్ తనతో ఒప్పందం కుదుర్చుకున్నాడని సాండి చెప్పగానే అబద్ధం అని రాజ్ అంటాడు. మీ ఇంట్లో దొంగ బంగారం ఉన్నట్లు సమాచారం అని ఇన్‌స్పెక్టర్ అంటాడు. పోలీసులు ఇంట్లో సెర్చ్ చేస్తారు. కానీ ఇంట్లో ఏం ఉండదు.    అయితే రాజ్ కార్ లో సూట్ కేసు దొరుకుతుంది. ఆ సూట్ కేసుని రాత్రి రాజ్ కార్ లో పెడతాడు రాహుల్. సాండికి ఫోన్ చేసి పోలీసులకి దొరికిపోమని చెప్తాడు. ఇక రాజ్ కార్ లో సూట్ కేసు చూసి.. ఇప్పుడు ఏమంటారని రాజ్ తో ఇన్‌స్పెక్టర్ అంటాడు. అదెలా వచ్చిందో నాకు తెలియదని రాజ్ చెప్తాడు. దాంతో రాజ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కావ్య బాధపడుతుంది.    తరువాయి భాగంలో కావ్యకి నొప్పులు రావడంతో హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. మా ఆయన వస్తేనే నేను ఆపరేషన్ చేయించుకుంటానని కావ్య అంటుంది. రాజ్ కి బెయిల్ రావడానికి రెండు రోజులు పడుతుందన్నారని ఇంట్లో వాళ్ళు అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నేనంత మర్యాదస్తుడిని కానమ్మా.. ఆయన పైన నేను కింద!

సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం పేరుతో సంక్రాంతి రోజు ప్రసారం కావడానికి సిద్ధంగా ఉన్న ఈవెంట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమోలో నాగబాబు, అనిల్ రావిపూడి, కృష్ణ భగవాన్, మాస్ మహారాజ రవితేజ వంటి వాళ్లంతా ఎంట్రీ ఇచ్చారు. ఈ ప్రోమోలో కొన్ని ఇంటరెస్టింగ్ సెటైర్స్ కౌంటర్స్ ఫన్నీగా ఉన్నాయి. "ఇప్పటి వరకు సంక్రాంతి పండగ ఇక నాన్న గారు వచ్చాక సంక్రాంతికే పండగ" అంటూ ఆది నాగబాబు గురించి చెప్పేసరికి "అరేయ్ సంక్రాంతి వచ్చిన నువ్వు మాత్రం ఇంటికి దండగేరా" అనేసరికి ఆది బాగా నవ్వుకున్నాడు. ఇంతలో కావ్య వచ్చి "మావయ్య గారు నన్ను ఆశీర్వదించండి" అంటూ వెళ్లి నాగబాబు కాళ్లకు దణ్ణం పెట్టుకుంటూ ఉండగా ఆది వచ్చి "నాన్న గారు ఖాళీగా ఉన్నా కలిపి ఆశీర్వదించేయండి" అంటూ ఆయన కళ్ళకు దణ్ణం పెట్టుకున్నాడు. తర్వాత కొత్త పెళ్లి జంట సాండ్రా-మహేష్ కి సంబందించిన సెలెబ్రేషన్స్ చేశారు. భోజనం కూడా పెట్టారు. "ఎన్నాళ్ళయింది పెళ్ళై మీకు" అంటూ అనిల్ రావిపూడి అడిగేసరికి "నెలన్నర" అని చెప్పాడు మహేష్. "అంతేనా అందుకు ఇలా చేశారు" అంటూ చెప్పాడు. సాండ్రా మహేష్ కి యాపిల్ ఇచ్చి "ఇది తిను ముందు" అంది. వెంటనే ఆది వచ్చి "యాపిల్ తిను డాక్టర్ బాబుకు దూరంగా ఉండొచ్చు" అంటూ కౌంటర్ వేసాడు. దానికి డాక్టర్ బాబు పడీపడీ నవ్వాడు. "కృష్ణ భగవాన్ గారు మీ అత్తయ్యగారు మావయ్య గారు మీ పెళ్ళైన కొత్తల్లో వాళ్ళు చేసిన మర్యాదలు ఏంటి" అని సుమ అడిగింది. "నేను మర్యాదలు పుచ్చుకునేంత మర్యాదస్తుడిని కానమ్మా" అని చెప్పాడు. దానికి ఆది కిలకిలా నవ్వాడు. తర్వాత రవితేజ వచ్చారు. "సింధూరం నుంచి చూస్తున్నా రవిని.అతనొక అమేజింగ్ హీరో " అంటూ నాగబాబు చెప్పారు. "మీరు సింధూరం దగ్గర నుంచి చూసారు నేను రూంలోంచి చూసాను." అంటూ కృష్ణ భగవాన్ చెప్పారు. "కృష్ణబాబు ఏంటంటే కింద రూమ్ లో ఉండేవాళ్ళు నేను వైవిఎస్ చౌదరి పై రూమ్ లో ఉండేవాళ్ళము." అని రవితేజ చెప్పారు. "అందుకే ఆయన పైనున్నాడు నేను కింద ఉన్నా" అంటూ కృష్ణ భగవాన్ సెటైర్ వేశారు.

వరుణవి బాధ్యతలు తీసుకున్న చిరంజీవి

జీ తెలుగులో ప్రసారమవుతున్న లిటిల్ చాంప్స్ షోలో వరుణవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ చిన్నారి "అనిల్ మావా నన్ను ఒకసారి చిరు మామ దగ్గరకు తీసుకెళ్ళావా" అని అడిగింది. అంతే సెట్ లోంచి ఫోన్ చేసి మెగా అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసి వరుణవిని తీసుకెళ్లారు. "చూస్తుంటే నువ్వు పీకాక్ లా ఉన్నావ్" అంటూ ఆ చిన్నారికి చిరు కాంప్లిమెంట్ ఇచ్చారు. "చిరు సర్ మీకొకటి చెప్పాలనుకుంటున్నా..రికార్డుల్లో మీ సినిమాలు ఉండడం కాదు , మీ సినిమాలపైనే రికార్డులు ఉంటుంది" అని చెప్పింది. తర్వాత మీసాల పిల్ల సాంగ్ పాడి చిరును మెస్మోరైజ్ చేసింది. "చాలా అల్లరిది" అంటూ మెచ్చుకున్నారు చిరు. "ఈ పాప విషయంలో ఏ విధమైన సహాయసహకారాలైనా సరే నేను బాధ్యత తీసుకుంటాను" అంటూ ప్రామిస్ చేశారు.  "నేను నీకు చాక్లెట్ ఇస్తాను తింటావా..చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చుపోతాయి అంటావు కదా ఎక్కడో విన్నాను" అన్నారు చిరంజీవి. తర్వాత చాక్లెట్ ని స్వయంగా ఆ చిన్నారికి చిరుని తినిపించారు. "నాకు ఎం ఇవ్వకండి మీ ఆశీర్వాదాలు చాలు" అని చెప్పింది. "దొండకాయ్ బెండకాయ్ చిరు మామ నా గుండెకాయ్" అంటూ చెప్పింది వరుణవి. దాంతో చిరు రెగ్యులర్ గా వరుణవి చెప్పే డైలాగ్ ని ఆయన చెప్పారు. "థ్యాంక్యూ సో మచ్ అండ్ గాడ్ బ్లేస్ యు" అన్నారు. ఇక మెగాస్టార్ నటించిన "మన సంకర వరప్రసాద్" మూవీ ఈ నెల 12 న రిలీజ్ కాబోతోంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు. ఎవడ్రా నిన్ను పెళ్లి చేసుకునేదంటూ నోటికి వచ్చినట్లు మహా తిడుతుంది. భూషణ్ కి కార్ సౌండ్ వినిపిస్తుంది. ఎక్కడున్నావని అతను అడుగగా ఎక్కడుంటే ఏంటి రాగాల్లో తేలుతున్నానని ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే భూషణ్ ఆదికి ఫోన్ చేసి మీ చెల్లి నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతుంది అసలు తను ఇంట్లో లేదని చెప్తాడు. వెళ్లి చూసి నాకు ఫోన్ చెయ్ అని భూషణ్ చెప్పగానే ఆది, హారిక ఇద్దరు కలిసి మహా దగ్గరికి వెళ్తారు. వెళ్లి చూస్తే అక్కడ మహా ఉండదు. ఆది ఇంట్లో అంత వెతుక్కుంటూ ఉంటాడు. వాళ్ల అమ్మనాన్నని నిద్ర లేపుతాడు. హారికకి మహా గదిలో లెటర్ దొరుకుతుంది. అది చదివి హారిక షాక్ అవుతుంది. వెంటనే అ లెటర్ తీసుకొని వెళ్లి ఆదికి ఇస్తుంది. ఆ తర్వాత ప్రతాప్ ఆ లెటర్ తీసుకొని చదివి.. లేదు అలా ఎప్పటికి మహా చెయ్యదని తనే స్వయంగా మహా గదిలో వెతుకుతాడు కానీ ఉండదు. ఆ తర్వాత భూషణ్ ఫోన్ చేస్తుంటే ఆది లిఫ్ట్ చెయ్యడు. ఆ తర్వాత ఆది సీసీటీవీ చూస్తే .. అది ఆఫ్ లో ఉంటుంది. ఇంటిముందుకి వెళ్లి డ్రైవర్ చక్రి ఉన్నాడేమో చూస్తాడు కానీ చక్రి కూడా ఉండకపోయేసరికి ఆది ఇంట్లోకి వచ్చి ప్రతాప్ కి చెప్తాడు. తరువాయి భాగంలో మహా, చక్రిలని వెతకడానికి ప్రతాప్ రౌడీలతో మాట్లాడతాడు. చక్రి, మహా కార్ కి అడ్డుగా రౌడీలు వస్తారు . ఒకవైపు ప్రతాప్, ఆది, భూషణ్ వస్తుంటారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు. అది గంగ పక్కనున్న ఆవిడ చూసి గంగకి చదివి వినిపిస్తుంది. అందులో రుద్ర ఏం రాసాడంటే.. నేను రుద్రని నువ్వు అకాడమీలో ఏదైనా ఇబ్బంది పడుతున్నావో అని భయంగా ఉందని ఆలోచిస్తున్నానని రుద్ర రాస్తాడు. అది గంగ చదువుతుంది. మళ్ళీ తనకి రిప్లై గా ఒక పేపర్ పై నేను బాగానే ఉన్నాను సర్ అని రాసి బయట వైపు విసిరేస్తుంది. అది రుద్ర చదువుతాడు. అలా కొద్దీసేపు గంగ, రుద్ర పేపర్స్ అటువైపు ఇటువైపు విసురుతూ విసురుతుంటారు. అదంతా అకాడమీ బిల్డింగ్ నుండి పారు చూసి.. ఈ గంగని ఈ రాత్రికే సస్పెండ్ చేసేలా చేస్తానని అనుకుంటుంది. ఆ తర్వాత రుద్ర మళ్ళీ ఇంటికి వెళ్తాడు. మళ్ళీ ఒక్కడివే వచ్చావా అని శకుంతల కోప్పడుతుంది. రుద్ర గదిలోకి వెళ్ళగానే శకుంతల బయట నుండి లాక్ వేస్తుంది. రుద్ర బయటకి వెళ్తే అకాడమీ ముందు వాచ్ మెన్ లా ఉంటాడు. అలా చేస్తే ఈ ఇంటి పరువుపోతుందని శకుంతల చాలా కఠినంగా ప్రవర్తిస్తుంది. ఇంట్లో ఎవరు చెప్పిన శకుంతల వినదు. మరొకవైపు గంగ వాళ్ల రూమ్ లో ఫ్యాన్ కూడా తిరగదు. కానీ పారు వాళ్ల గదిలో ఏసీ, టీవీ ఉంటుంది. పారు వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. దాంతో గంగ వాళ్ళ రూమ్ మేట్స్ వెళ్ళి చూస్తారు. అదేంటి మన రూమ్ లో ఫ్యాన్ కూడా రావడం లేదు కానీ వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారని గంగతో తన రూమ్ మేట్స్  అంటారు. మనం కూడా ఎంజాయ్ చేద్దాం అంత్యాక్షరీ ఆడుదామని గంగ తన ఫ్రెండ్స్ తో చెప్తుంది. అలా గఃగ తన రూమ్ మేట్స్ అందరు సరదాగా ఉంటే పారు వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంజాయ్ చెయ్యడం చూడలేకపోతుంది. ఈ రోజు రాత్రికి గంగని ఎలాగైనా సస్పెండ్ చేపిస్తానని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.