BB Jodi: ఫ్లవర్ బ్యాచ్ అనడంతో కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక!

  బిబి జోడి సీజన్ 2 ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఐతే ఈ వీక్ జోడీస్ మధ్యన హోస్ట్ ప్రదీప్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఫ్లవర్ అండ్ ఫైర్ అనే ఒక బోర్డుని పెట్టించాడు. "ఎవరు తమ తమ జోడీలకు గట్టి పోటీ ఇస్తారనుకుంటున్నారు ఎవరు ఇవ్వరు అనుకుంటున్నారు" అంటూ ఆ పిక్స్ ని ఆ బోర్డు మీద పెట్టమన్నాడు. దాంతో జోడీస్ అంతా వచ్చారు. అన్ని జోడీలకు గట్టి పోటీ ఇచ్చేది మానస్ అండ్ శ్రష్టి జోడి అంటూ వోట్ చేశారు. ఇక జోడీ కాదు ఫ్లవర్ బ్యాచ్ అంటూ ప్రియాంక సింగ్ - మణికంఠ జోడిని ఫ్లవర్ లో వాళ్ళ పిక్స్ ని పెట్టారు. దాంతో ప్రియాంక ఏడ్చేసింది.    ఇక జడ్జెస్ ప్రియాంక బాధను చూసి మోటివేట్ చేశారు. ఫ్లవర్ లో పిక్ పెట్టినంత మాత్రాన వాళ్లకు డాన్స్ రాదనీ కాదు ఫైర్ లో పిక్స్ పోస్ట్ చేసినంత మాత్రాన వాళ్ళు బెస్ట్ డాన్సర్స్ అని కాదు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే ఫ్లవర్ కాస్త ఫైర్ లా మారొచ్చు అదే కష్టపడకపోతే ఫైర్ లో ఉన్నవాళ్లు కూడా ఫ్లవర్ లా కూడా మారొచ్చు అంటూ జోడీస్ అందరికీ జడ్జెస్ బెస్ట్ విషెస్ చెప్పారు.    ప్రియాంక నువ్వు ఏడవాల్సిన పనే లేదు. కాన్ఫిడెంట్ గా ఉండు హ్యాపీగా ఉండు జర్నీ ఒక్కటే ఇంపార్టెంట్ అవుట్ కం ఏదైనా కానీ అంటూ సదా కూడా ప్రియాంకకు చెప్పింది. ఫైర్ జోడీగా మానస్ - శ్రష్టి వర్మ జోడికి మూడు ఓట్లు, ఫ్లవర్ జోడీగా ప్రియాంక సింగ్ - మణికంఠకు ఐదు ఓట్లు పడ్డాయి. దాంతో ప్రియాంక మొదట కొంచెం బాధపడినా తర్వాత సద, శేఖర్ మాష్టర్ మాటలకూ ఊరుకుంది.  

Jayam serial: తనపై పడ్డ నిందని అబద్ధమని గంగ నిరూపించుకుంటుందా?

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -154 లో... గంగ బస్తీలో ఉండే శేఖర్, శకుంతల వాళ్ళ ఇంట్లోకి వస్తాడు. గంగకి ట్రైప్యాడ్ ఇచ్చింది నేనే అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏంటి అన్న అలా నా గురించి అబద్ధం చెప్తున్నావ్.. నన్ను నీ సొంత చెల్లిగా చూసావ్, ఇలా ఎలా అబద్ధం చెప్తున్నావని గంగ అడుగుతుంది. అతను నిజమే చెప్పాడు కదా మరి ఎందుకు అతన్ని భయపెడుతున్నావని ఇషిక అంటుంది.    ఆ తర్వాత శేఖర్ అక్కడ నుండి వెళ్ళిపోయాక గంగ అతని వెనకాలే వెళ్లి ఎందుకన్నా అబద్ధం చెప్పావని అడుగుతుంది. గంగ అతన్ని అబద్ధం చెప్పమని రిక్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు ఒకసారి వెళ్తే బెటర్ అని ఇషిక బయటకు వెళ్తుంది. ఎందుకు అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావని  గంగని ఇషిక అడుగుతుంది.    సూర్య, స్నేహ, వంశీ వచ్చి ఎవరో ఒకతను వచ్చి వదిన గురించి ఏదో చెప్తే నమ్మేస్తారా అంటారు. నేను చెప్పింది నిజమేనని చెప్పి శేఖర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. గంగ లోపలికి వచ్చి..  నేను ఏ తప్పు చెయ్యలేదు.. అతను ఎందుకు అలా చెప్పాడో ఇప్పటికి అర్థం అవ్వడం లేదని గంగ ఇంట్లో వాళ్ళతో అంటుంది.    సర్ నేను తప్పు చేసానంటే మీరు నమ్ముతున్నారా అని రుద్రతో గంగ అంటుంది. నోరు ముయ్ ముందు ఆ ఏడుపు ఆపు.. తప్పు చెయ్యనప్పుడు ఎందుకు అలా ఏడవడమని రుద్ర అనగానే అంటే తను ఏం తప్పు చెయ్యలేదని నమ్ముతున్నావా అని వీరు అనగానే అవును నమ్ముతున్నాను.. ఎందుకు అంటే షీ ఈజ్ మై వైఫ్ అని రుద్ర అంటాడు. మొదటి నుండి అన్ని చూస్తే గంగని ఎవరో టార్గెట్ చేసారని అర్థం అవుతుందని గంగ కి సపోర్ట్ గా రుద్ర మాట్లాడుతాడు.   తప్పు చేసినట్లు క్లియర్ గా కనిపిస్తుంది అయినా నీ మాటలు ఎందుకు నమ్మాలి. నీకు ఇరవై నాలుగు గంటలు టైమ్ ఇస్తున్న ఆలోపు నీపై పడ్డ నింద.. నిజం కాదని నిరూపించాలి లేదంటే ఇంట్లో ఉండవని శకుంతల అనగానే దానికి గంగ ఒప్పుకుంటుంది.    ఆ తర్వాత గంగ వచ్చి బాధపడుతుంటే రుద్ర వచ్చి మంచిగా థింక్ చెయ్ ఏదో ఒక దారి దొరుకుతుందని అంటాడు. గంగకి ఏం చేయాలో అర్థం కాదు. రుద్ర దగ్గరుండి గంగకి సలహా ఇస్తాడు. ఆ తర్వాత ఇషిక, వీరు, పారు ముగ్గురు మాట్లాడుకుంటారు. శేఖర్ ని ఎలా బ్లాక్ మెయిల్ చేసి రప్పించారో ఇషిక, వీరు కలిసి పారుకి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Podarillu: మూడు రోజులు‌ ముందుకొచ్చిన మహా పెళ్ళి.. పాపం చక్రి!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -16 లో... కన్నా, కేశవ ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి భూషణ్ ని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఒక కన్‌స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ లో ఉంచుతారు‌. అప్పుడే అక్కడికి మాధవ వచ్చి ఏం చేస్తున్నారురా.. అసలు ఇలాంటి పని మీకు వాడు ఎందుకు అప్పజెప్పాడని మాధవ భయపడతాడు.    మరొకవైపు భూషణ్ పేరెంట్స్ భూషణ్ గురించి భయపడుతారు. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ప్రతాప్ అడుగుతాడు. ఎవరు లేరని వాళ్ళు చెప్తారు. మరి ఎవరు అతన్ని కిడ్నాప్ చేసినట్లు.. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని భూషణ్ పేరెంట్స్ అనగానే వద్దని ప్రతాప్ అంటాడు. ఆది నువ్వు మన మనుషులని తీసుకొని వెళ్లి వెతికించమని ప్రతాప్ చెప్తాడు. మహా మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అదంతా చూసి చక్రి మురిసిపోతాడు. దూరం నుండి మహా, చక్రిని చూసి ఇదంతా చేసింది నువ్వేనా అని అడుగుతుంది. అవునండి అని చక్రి అనగానే మహా తనకి థాంక్స్ చెప్తుంది.    మరొకవైపు ఎవడ్రా మీరంతా.. ఏం కావాలో చెప్పండి ఇస్తాను నన్ను వదిలిపెట్టండి అని భూషణ్ అంటాడు. అయిన తన మాట ఎవరు లెక్కచేయ్యరు. చక్రికీ మాధవ ఫోన్ చేసి ఎందుకురా ఇలా చేస్తున్నావని అడుగుతాడు. మనం ఒక అమ్మాయికి సాయం చేస్తున్నామంతే అని చక్రి చెప్తాడు.   మరొకవైపు ఆది ఇంటికి తిరిగి వస్తాడు. భూషణ్ ఎక్కడ కనిపించలేదని చెప్తాడు. మీ వల్ల కాదంటే చెప్పండి అని భూషణ్ పేరెంట్స్ ప్రతాప్ తో అంటాడు. అప్పుడే రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అని చెప్పమని ఆదిత్యకి ప్రతాప్ చెప్తాడు. దాంతో మహా గదిలోకి వెళ్లి డాన్స్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా చక్రి కిటికీలో నుండి చూస్తాడు.    తరువాయి భాగంలో ఇక పెళ్లి ఆపండి నాన్న అని మహా అనగానే నోరు ముయ్ మూడు రోజుల్లో అతనితో పెళ్లి చేస్తానని ప్రతాప్ చెప్తాడు. నువ్వు చేసిన పనికి పెళ్లి ఇంకా ముందుకి అయిందని చక్రితో మహా అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu: రామరాజు నిర్ణయంతో ఇంట్లో వాళ్ళంతా షాక్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -354 లో.. ఆడపిల్లని ఎలా పెంచాలో చేతకాని వాళ్లు అంటున్నారు మీ వాళ్ళు.. అదే మాట నేను మీ వాళ్ళని మీకు ఆడపిల్లని పెంచడం చేతకాదు.. అందుకే మీ కూతురు ఎవడితోనో లేచిపోయింది అని నేనంటే మీ వాళ్ళ పరిస్థితి ఏంటని ధీరజ్ అనగానే ప్రేమ ఏడుస్తూ వెళ్ళిపోతుంది.   ఇక ఇంట్లో అంత జరిగాక అందరు బాధతో ఉంటారు. శ్రీవల్లి మాత్రం ఎవరికి తగ్గట్టు వాళ్ళకి పాటలు సెట్ చేస్తూ వింటూ ఎంజాయ్ చేస్తుంది. డాన్స్ చేస్తుంది. ప్రేమ ఏడుస్తుంటే నర్మద బయటకు చాప దిండు తీసుకొని వచ్చి పడుకోమని చెప్పి తన పక్కనే నర్మద కూడా పడుకుంటుంది.    మరుసటి రోజు శ్రీవల్లి ఉదయం నిద్రలేచి పూజ చేస్తుంది. బయటకు వచ్చేసరికి ప్రేమ, నర్మద ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతుంటే శ్రీవల్లి చూసి షాక్ అవుతుంది. వీళ్ళేంటి మళ్ళీ కలిసిపోయారా అనుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్లి ఇప్పుడే కదా పూజ చేసాను.. మళ్ళీ వాళ్ళు కలిసిపోయారు ఏంటని దేవుడిపై కోప్పడుతుంది.    విశ్వ నీకు కావాలనే అబద్ధం చెప్పాడని అనిపిస్తుంది ప్రేమ అని నర్మద అనగానే.. లేదు మా అన్నయ్యలో ఆ విషయంలో నిజాయతి కన్పించిందని ప్రేమ అంటుంది. అదంతా అబద్ధం అని నిరూపిస్తే అని నర్మద అనగానే.. వద్దు అక్క ఇక్కడితో వదిలేయ్ అని ప్రేమ కోపంగా లోపలికి వెళ్తుంది.   అదంతా శ్రీవల్లి చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్లి సారీ దేవుడా నేను కోప్పడ్డది మనసులో పెట్టుకోకు వాళ్ళు కలిసిపోలేదని శ్రీవల్లి అంటుంది.    ఆ తర్వాత ఇంట్లో అందరిని పిలవమని వేదవతికి రామరాజు చెప్తాడు. వేదవతి పిలవగానే ఇంట్లో అందరు వచ్చేస్తారు. నేను అమూల్యకి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నానని రామరాజు అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: కార్తీక్ కి నిజం చెప్పేసిన కాశీ.. జ్యోత్స్న షాక్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -553 లో.... జ్యోత్స్న గదిలోకి దీప వెళ్ళిందని పారిజాతం చెప్పగానే జ్యోత్స్నకి భయం వేసి తన గదిలోకి వెళ్తుంది. కానీ జ్యోత్స్న వచ్చేలోపే దీప వెళ్లి తన రూమ్ లో రికార్డర్ పెట్టి వెళ్తుంది. జ్యోత్స్న వచ్చి ఎవరు లేరు కదా.. బావ మాటల్లో ఏదో తేడా కనపడింది.. ఇదంతా ఏంటి.. నా గురించి బావకి తెలిసిందా అని జ్యోత్స్న భయంతో వైరాకి కాల్ చేస్తుంది. అప్పుడే ఫోన్ రికార్డింగ్ కనిపిస్తుంది. అది చూసి షాక్ అవుతుంది. వెంటనే ఫోన్ కట్ చేస్తుంది.   వైరా మళ్ళీ తిరిగి కాల్ చేస్తాడు. అప్పుడు జ్యోత్స్న రికార్డింగ్ అవుతున్న విషయం గమనించి వైరా ఎవరో తెలియనట్లుగా మాట్లాడుతుంది. మీరు నాకు ఎందుకు కాల్ చేశారు.. నేను ఇప్పుడు సీఈఓగా లేకపోవచ్చు కానీ ఎప్పుడు రెస్టారెంట్ ని పైనే ఉంచుతానని మాట్లాడుతుంది. ఆ మాటలకి వైరా షాక్ అవుతాడు. ఇలా హ్యాండ్ ఇచ్చింది ఏంటని అనుకుంటాడు.    ఆ తర్వాత దీప వెళ్లి ఫోన్ తీసుకొని బయటకు వస్తుంటే.. ఏంటి నా గదిలో నుండి వస్తున్నావని జ్యోత్స్న ఏం తెలియనట్లే మాట్లాడుతుంది. దీప అక్కడ నుండి వెళ్లి కార్తీక్ కి ఫోన్ ఇస్తుంది. ఇదంతా జ్యోత్స్న ఫోన్ రికార్డింగ్ చూసి మాట్లాడినట్లు అనిపిస్తుందని కార్తీక్ కి డౌట్ వస్తుంది.   ఆ తర్వాత కాశీ దగ్గరికి కార్తీక్ వెళ్లి ఒక మనిషి దగ్గరికి వెళ్ళాలి. తన పేరు వైరా అని కార్తీక్ అనగానే కాశీ భయపడుతాడు. కార్తీక్ తన చెంపచెల్లుమనిపిస్తాడు. ఇదంతా మా నాన్నపై కోపంతో చేసావ్.. ఇలా చెయ్యమని ఆఫర్ ఇచ్చింది జ్యోత్స్న కదా అని అనగానే అవునని కాశీ అంటాడు. నన్నేం చేయమంటావ్ నన్ను మనిషిగా కూడా మీరు ఎవరు చూడడం లేదని కాశీ అంటాడు. ఇప్పుడు మనం ఆ వైరా దగ్గరికి వెళ్ళాలని కార్తీక్ తనని తీసుకొని వెళ్తాడు.    మరొకవైపు దశరత్, సుమిత్ర గురించి బాధపడుతుంటే అమ్మగారికి ఏం కాదని దీప దైర్యం చెప్తుంటే ఒక క్షణం జ్యోత్స్న వచ్చిందనుకుంటాడు. నువ్వు నా కూతురు అయితే ఎంత బాగుండు అని దీపతో దశరథ్ అనగానే నేను మీ కూతురునే నాన్న అని తన మనసులో దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: బ్రహ్మముడి సీరియల్ లో  కొత్త లేడీ విలన్.. రుద్రాణి కూతురు ఎంట్రీ!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -916 లో... రాహుల్ చెప్పినట్లు సాండీ, రాజ్ దగ్గరికి వెళ్లి దొంగ బంగారం సప్లై చేస్తాను అంటే రాజ్ తనని తిట్టి పంపిస్తాడు. ఆ విషయం సాండి, రాహుల్ కి ఫోన్ చేసి చెప్తాడు. నువ్వు  రాజ్ దగ్గరికి వెళ్ళావ్ బయటకు వచ్చావ్.. ఆ ప్రూవ్స్ ఉంటే చాలని రాహుల్ అంటాడు.    మరొకవైపు కావ్యకి వచ్చిన కలకి ఇంట్లో జరిగిన సంఘటనకి అపర్ణ, ఇందిరాదేవి కంగారుపడుతారు. దాంతో ఇద్దరు కావ్యని తీసుకొని గుడికి వెళ్తారు. అక్కడ పంతులు ఏమైందని అడుగుతాడు. ఇల్లు తగలబడిపోయినట్లు కల వచ్చింది.. అంతే కాకుండా ఇంట్లో హారతి ఇస్తుంటే దీపం ఆరిపోయిందని అపర్ణ, కావ్య చెప్తారు. దాంతో పంతులు కొద్దీసేపు అలోచించి ప్రమాదం బయట నుండే వస్తుంది.. జాగ్రత్తగా ఉండండి అని పంతులు అనగానే ముగ్గురు భయపడుతారు. దానికి ఏదైనా పరిష్కారం ఉందా అని ఇందిరాదేవి అడుగుతుంది. మీరు ఎప్పుడు దేవతారాధన చెయ్యాలని పంతులు చెప్తాడు.    మరొకవైపు దుగ్గిరాల ఇంటికి అనుకోకుండా ఒక అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. తనకి ఎదురుగా రుద్రాణి వచ్చి.. ఏంటి రేఖ ఇంత సడన్ గా ఇంటికి వచ్చావని తనని అడుగుతుంది. మమ్మీ వచ్చి రాగానే ఏంటి ఈ ప్రశ్నలు అని చిరాకుగా లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత రాహుల్ దగ్గరికి స్వప్న వెళ్లి మీ చెల్లి అమెరికా నుండి వచ్చింది అనగానే ఇప్పుడు ఎందుకు వచ్చిందని తన దగ్గరికి వెళ్తాడు. రేఖ హాల్లో ఉండగా అందరు తనని ఎప్పుడు వచ్చావని పలకరిస్తారు. రాహుల్ మాత్రం మా మాట వినకుండా వెళ్లిపోయావ్ ఎందుకు వచ్చావని తనపై కోప్పడతాడు. ఇప్పుడు వచ్చింది కదా ఎందుకు గొడవ అని ఇందిరాదేవి అంటుంది.   ఆ తర్వాత ఇకనుండి రాజ్ ఆఫీస్ కి వెళ్లడానికి వీలు లేదు.. కావ్య కాలు కింద పెట్టకుండా చూసుకోవాలని ఇందిరాదేవి అనగానే అయితే ఆఫీస్ ఎవరు చూసుకుంటారని రాజ్ అంటాడు. ఇంకెవరు మీ డాడీ, బాబాయ్ చూసుకుంటారని అపర్ణ అంటుంది. అయితే సరే ఇప్పటినుండే కావ్యని కాలు కిందపెట్టకుండా చూసుకుంటానని కావ్య ని రాజ్ ఎత్తుకొని తీసుకొని వెళ్తుంటే.. రేఖ అలాగే చూస్తూ ఉంటుంది.    ఆ తర్వాత రేఖ, రుద్రాణి బయట మాట్లాడుకుంటారు. ఇంత సడన్ గా ఏంటి .. అక్కడ మార్క్ ని ప్రేమించాను.. అక్కడే సెటిల్ అవుతానన్నావని రుద్రాణి అడుగుతుంది. అనుకున్నాను కానీ బ్రేకప్ అయింది.. వాడికి డబ్బు లేదు.. నా మీద లవ్ లేదని తెలిసింది. ఇదంతా నీ వల్లే.. అప్పుడే బావని నాకు ఇచ్చి చేస్తే నేను అలా దేశాలు పట్టుకొని వెళ్లేదాన్ని కాదు కదా అని రేఖ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఆర్జీవీతో ఇంటర్వ్యూ.. రామానాయుడు స్టూడియోస్‌లో జరిగింది ఇదే!

ఆర్జీవీ ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో ఫేమస్ ఐన సెలబ్రిటీ ఆరియానా. అలాంటి ఆరియానా తన లైఫ్ లో ఎన్నో కష్టాలు అనుభవించిందని చెప్పుకొచ్చింది. అలాగే కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను కూడా చెప్పింది. "నేను ఒక ఛానెల్ లో 7 వేలకు యాంకర్ గా జాయిన్ అయ్యా. ఐతే టైఫాయిడ్ రావడం వలన ఫస్ట్ రెమ్యూనరేషన్ 4 వేలే తీసుకున్నా. లైఫ్ లో ఏమవుతాను అన్నదాన్ని నా లైఫ్ లో నాకు నేను తిండి సంపాదించుకునే భాగ్యాన్ని ఆ దేవుడు కల్పించినందుకు చాల సంతోషంగా ఉంది. నాకు యూనివర్స్ ఎందుకో చాలాసార్లు సపోర్ట్ చేస్తుంది. ఐతే నేను జాయిన్ ఐన ఛానెల్ లో ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయాలన్నారు. ఐతే ఆర్జీవీ లేచి వెళ్ళిపోయాడట, ఆయనకు కోపం వచ్చిందట ఇలా అందరూ అనుకోవడం విన్నా. అప్పుడు ఒకటే అనుకున్న ఆర్జీవిని నేను ఇంటర్వ్యూ చేస్తే లేచి వెళ్లిపోకూడదు ఎలాగైనా ఆయన్ని కూర్చోబెట్టాలి, ఈ అమ్మాయి బాగా మాట్లాడింది అనుకోవాలి అనుకున్నా నా మైండ్ లో. ఒక వన్ ఇయర్ తర్వాత భైరవం మూవీకి సంబంధించి ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి రామానాయుడు స్టూడియోస్ కి రమ్మన్నారు. ఐతే అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి చిన్నపిల్లలా ఉంది నాలెడ్జ్ లేదనుకుంటా సన్నగా ఉంది ఆర్జీవీని డీల్ చేయలేదు అని నన్ను పంపేశారు. ఇంకో సారి కూడా అలాగే జరిగింది.  ఆ రోజు ఎలాగైనా ఆర్జీవీ గారిని ఇంటర్వ్యూ చేయాలనీ వెళ్ళా కానీ ఆయన ఆరోజు లేరు. మూడోసారి అవకాశం వచ్చింది పరిగెత్తుకుంటూ వెళ్ళా ఐతే నువ్వు డీల్ చేయలేవు నీ వల్ల కాదు అని పంపేశారు. మూడు సార్లు రిజెక్షన్ చూసేసరికి నా మీద నాకే కాన్ఫిడెన్స్ పోయింది. ఎందుకు ఈ విషయం గురించి ఇంత స్ట్రెస్ అంటూ నా మైండ్ లోంచి ఆ టాపిక్ నే తీసేసాను. కట్ చేస్తే లాక్ డౌన్ టైములో నేను రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని దుల్కర్ సల్మాన్ గారిని ఇంటర్వ్యూ చేశా. అప్పుడు ఆర్జీవీ గారు ఒక్కరే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆ టైంలో కాల్ వచ్చింది. ఆ రోజు ఫుల్ బద్దకంగా ఉన్నా. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే మూడ్ లో ఉన్నా. ఆర్జీవీ ఇంటర్వ్యూ చేయాలి మధ్యాహ్నం అన్నారు. నాకు చేయాలనీ లేదు... కానీ చేసాను. టైంకి రావాలని ఉంది అలా ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ వచ్చింది. తర్వాత బిగ్ బాస్ షో ఆఫర్ వచ్చింది. నాకు గుర్తింపు వచ్చింది. యూనివర్స్ నాకు బాగా సపోర్ట్ చేసింది." అని చెప్పుకొచ్చింది ఆరియానా. 

కొత్త యాంకర్లను తొక్కేస్తున్న సుమ!

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. ఎందుకంటే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని ఈ ఎపిసోడ్ లో నిర్వహించారు. ఇక గెస్ట్ గా బ్రహ్మాజీ వచ్చారు. ఆయన కామెడీ అనుకుంటే ఆయనతో పాటు దీపికా కూడా ఫుల్ కామెడీ చేసింది..సుమ ఫుల్ హాట్ గా ఆన్సర్స్ ఇచ్చింది. ఇక కొన్ని ఇంటరెస్టింగ్ డైలాగ్స్ చూద్దాం. బ్రహ్మాజిని "మీకేం కావాలి"అని సుమా అడిగింది. "నాటు కోడి పులుసు" అన్నాడు. "అయ్యో కోడి పారిపోయిందండి" అని సుమ చెప్పింది. "మరి నార్మల్ కోడి" అని బ్రహ్మాజీ అన్నాడు. "నార్మల్ కోడితోనే పారిపోయింది" అని చెప్పింది సుమ. "మీకేం కావాలో చెప్పండి అది వండిపెడతాం" అంది సుమ. "రాజు గారి కోడి పలావ్" అన్నాడు. "అది ఎంఎల్ఏ గారు తినేశారు" అని చెప్పింది. "పోనీ ఎంఎల్ఏ దోశ" అనేసరికి "అది రాజు గారు తినేశారు" అంటూ డైలాగ్స్ తో ఆడుకుంది సుమ. బ్రహ్మాజీ షాకయ్యేసరికి "సారీ అంకుల్" అంటూ ఆటపట్టించింది. తర్వాత రాపిడ్ క్వశ్చన్స్ - కిల్లర్ కౌంటర్స్ పేరుతో ఒక సెగ్మెంట్ నడిచింది.  "పాపం కొత్త యాంకర్ లు, అప్-కమింగ్ యాంకర్ లు పైకొస్తుంటే మీరు తొక్కేస్తున్నారంట" అని బ్రహ్మాజీ అడిగాడు. "ఓకే నెక్స్ట్ క్వశ్చన్" అని ఆన్సర్ చెప్పకుండా దాటేసింది సుమ. "ఎందుకంటే బాగా కమర్షియల్ ఇపోయారు మీరు" అని అడిగాడు. "మీరు ఈ షోకి ఫ్రీగా వచ్చారా" అని కౌంటర్ వేసింది సుమ. "చాలా వేడిగా కోపంగా ఉన్నారు మీరు కొంచెం నవ్వొచ్చుగా" అనేసరికి సుమ నవ్వింది. "తొందరగా కేక్ చేయండమ్మా బ్రహ్మాజీ గారు పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళాలి" అంటూ మళ్ళీ కామెడీ డైలాగ్ వేసింది. "స్టవ్ లేకపోయినా వేడి పొగలు బుస్సుబుస్సుమని వస్తున్నాయి" అంటూ సుమ మీద కౌంటర్ వేసాడు బ్రహ్మాజీ. "ఫైర్ ఇంజిన్ కావాలి సర్" అంటూ మధ్యలో వచ్చి దీపికా అడిగేసరికి "వేరే లాంగ్వేజ్ కి పంపించేస్తే బెటరేమో" అన్నాడు. వెంటనే మానస్ "వేరే లాంగ్వేజ్ నుంచే ఇక్కడికి వచ్చింది" అని చెప్పాడు. దాంతో బ్రహ్మాజీ అవాక్కయ్యాడు. "మీరు కళ్లద్దాలు తీసేసిన, మీ విగ్గు తీసేసినా నాకిష్టమే" అంటూ దీపికా బ్రహ్మాజీని తెగ పొగిడేసింది. వెంటనే యాదమ్మ రాజు వచ్చి "సర్ ఐ లవ్ యు చెప్పేయండి ఐపోతుంది" అన్నాడు. బ్రహ్మాజీ వెంటనే " ఐ లవ్ యు" అనేశాడు. "ఐ లవ్ యు టూ" అంటూ దీపికా రివర్స్ లో ఆన్సర్ ఇచ్చేసరికి ఇంకో సారి అవాక్కయ్యాడు.

నీ పేమెంట్ మొత్తం కావాలి.. ఫస్ట్ డాన్స్ తర్వాత పెళ్లి.. అర్జున్ - శ్రీసత్య డీల్

  బిబి జోడి ఫుల్ జోష్ తో మంచి కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఫస్ట్ జోడిగా అర్జున్ కళ్యాణ్, శ్రీసత్య వచ్చారు. ఈ పేర్లు కాకుండా వీళ్లకు ఒక హ్యాష్ ఇచ్చాడు హోస్ట్ ప్రదీప్. అదే #aarya . ఐతే శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్ డాన్స్ కి జడ్జెస్ ఫిదా ఐపోయేసరికి ప్రదీప్ వీళ్లకు ఒక డమ్మీ ఫన్నీ బిబి జోడి మెమెంటో కూడా ఇచ్చేసాడు. ఐతే దీని వెనక ఒక రీజన్ కూడా చెప్పాడు. "ఈ షోలో పార్టిసిపేట్ చేయాలి అని అడిగినప్పుడు శ్రీసత్య నాకు పార్టనర్ ఐతే చాలు సర్ నేను ట్రోఫీ గెలిచినట్టే అన్నాడు" అని ప్రదీప్ చెప్పాడు. (BB Jodi)   "నీకు ఫోన్ వచ్చి నీ జోడి శ్రీసత్య అనగానే నీకేమనిపించింది నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి " అంటూ ప్రదీప్ అడిగాడు. "మొదట ఆశ్చర్యమేసింది తర్వాత ఆనందమేసింది తర్వాత భయం కూడా వేసింది" అన్నాడు. భయమెందుకు అని శేఖర్ మాష్టర్ అడిగాడు. మేడంతో అలా ఉంటది మరి అన్నాడు అర్జున్.    "నాకు ఒక్కటే అర్ధం కావట్లేదు ప్రదీప్ గారు. సత్య లేనిదే ఏం చేయను అంటున్నారు.. అర్జున్ తో నేను సీజన్ మొత్తం చేయాలంటే నాకు 3 కండిషన్స్ ఉన్నాయి. వాటికి ఓకే చెప్తే నేను కంటిన్యూ చేస్తా" అని చెప్పింది శ్రీసత్య. "ఫస్ట్ కండిషన్ ఇప్పటి నుంచి ఫైనల్స్ వరకు ఏదైతే పేమెంట్ ఉంటుందో గెలిస్తే ఒకవేళ ఆ పేమెంట్ కూడా ఇచ్చేస్తే అప్పుడు నేను చేస్తా" అంది. "సర్ నాకు ప్రేక్షకుల ఆదరణ జడ్జిల ప్రేమ ఉంటే చాలు సర్.. కప్పు ఉంటే చాలు సర్ డబ్బులు అవసరం లేదు" అన్నాడు అర్జున్.    ఇంతలో ప్రదీప్ "ఈ సీజన్ ఒక్కటే కాదు ఆయన ఎక్కడ ఏది పెర్ఫార్మ్ చేసినా సరే సీరియల్ కూడా చేస్తున్నాడు ఆ పేమెంట్" అన్నాడు. తర్వాత శేఖర్ మాష్టర్ "దారుణం ఈ షో వరకు ఓకే కానీ" అన్నాడు. ఇంతలో అర్జున్ సంతకం పెట్టేసాడు. అర్జున్ అంతా చదివి అగ్రిమెంట్ మీద సైన్ చేసావా డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అని కూడా అందులో ఉంది అన్నాడు ప్రదీప్. ఇంతలో సదా "అర్జున్ అవన్నీ కావాలంటే ఫస్ట్ పెళ్లి చేసుకోమంటూ" అంటూ సలహా ఇచ్చింది. "ఫస్ట్ డాన్స్ అవ్వనివ్వండి అప్పుడు పెళ్లి తర్వాత చూద్దాం" అంటూ శ్రీ సత్య చెప్పింది. దాంతో అర్జున్ కూడా ఆమె వైపు షాకింగ్ గా చూసాడు.    "సెకండ్ కండిషన్ ఏంటంటే నేను లేకపోతే ఏది చేయను అన్నావ్ కాబట్టి నువ్వు సీరియల్ మంచి హిట్ లో ఉంది కదా మరి నేను లేకుండా ఎందుకు చేస్తున్నావ్ . మీ హీరోయిన్ ని తీసేసి నన్ను పెట్టుకో" అంది. "ఆయన రైటర్ ని, ప్రొడ్యూసర్ ని ఒప్పించుకుంటాడు కానీ ముందు యాక్టింగ్ చేయాలి కదా సర్" అంటూ ప్రదీప్ పుల్ల పెట్టాడు. "డాన్స్ బాగా చేస్తుంది కాబట్టి బిబి జోడి అనుకున్నాం ఇప్పుడు యాక్టింగ్ కూడా బాగా చేసి చూపియ్ సీరియల్ లోకి తీసుకుంటాం" అన్నాడు అర్జున్.    "ఇక థర్డ్ కండిషన్ అద్భుతంగా ఉంటుంది. నా మీద అంత ఇష్టం ఉన్నోడు నా పేరును నుదురు మీద టాటూ వేయించుకోలేడా" అని అడిగింది శ్రీసత్య. తరువాత ఒక డ్రిల్లింగ్ మెషీన్ తో ఒకతను టాటూ వేస్తానంటూ వచ్చేసరికి అందరూ నవ్వేశారు.  

Jayam serial: శకుంతల ముందు గంగని ఇరికించడానికి వీరు కొత్త ప్లాన్!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -153 లో శకుంతల కింద పడిపోవడంతో తనని కాపాడానికి గంగ తన ఛాతిపై నొక్కుతూ ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ వస్తుంది.    శకుంతల దగ్గరికి గంగ వస్తుంటే.. ఎందుకు వస్తున్నావ్ గంగ.. అత్తయ్య ఆ పరిస్థితిలో ఉంటే తనని ఉక్కిరి బిక్కిరి చేసావని ఇషిక అంటుంది. ఎందుకు అలా అంటున్నారు.. తను అలా చేసింది కాబట్టి ఇప్పుడు ఇలా శకుంతల గారు బాగున్నారని డాక్టర్ చెప్తుంది. నాకు తెలిసిన వాళ్ళకి ఇలాగే జరిగితే అలా చేశారు అందుకే చేసానని గంగ అంటుంది. థాంక్స్ గంగ.. నువ్వు కాపాడింది ఇద్దరిని అని పెద్దసారు ఎమోషనల్ అవుతాడు.    మరొకవైపు, ఇక లాభం లేదు.. నేను మా ఆయన కలిసి వేరొక కాపురం పెడుతాం.. అనుకున్నది ఏం అవట్లేదు.. అందరు గంగ మాయలో పడిపోయారని వీరుతో ఇషిక అంటుంది‌. ఎందుకు అలా హోప్ వదిలేసుకుంటున్నావ్ వెయిట్ చెయ్ అని వీరు అంటాడు.    ఆ తర్వాత శకుంతల దగ్గరికి పెద్దసారు వస్తాడు. నువ్వు గంగని మొదట్లో ఎలా చూసావ్.. నిన్ను మాములు మనిషిని చేసిందే తను.  ఎందుకు తన పట్ల ఇలా మారావు కారణం తెలియదు కానీ గంగ చాలా మంచిది అని పెద్దసారు చెప్తాడు.   ఇంట్లో ఒక ఇషిక, వీరు తప్ప అందరూ గంగ గురించి పాజిటివ్ గా మాట్లాడుతారు. అప్పుడే పారు వస్తుంది. ఏంటి అందరు ఇలా ఉన్నారు. నాకు అర్ధం అయింది మీరు నా గురించి ఆలోచించకండి. గంగని కోడలుగా ఒప్పుకోండి అని పారు అంటుంది. పెద్దసారు గంగని పిలిచి శకుంతల దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్తాడు.    శకుంతల దగ్గర గంగ ఆశీర్వాదం తీసుకోవడానికి తన కాళ్లపై పడుతుంది. తనని ఆశీర్వదించబోతుండగా.. అప్పుడే గంగకి తెలిసిన అన్నయ్య వచ్చి.. గంగ నువ్వు లక్కీ అసలు నువ్వే ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టావని తెలిసినా ఏం అనట్లేదు.. నువ్వు రుద్ర సర్ తో ఫోటో తీస్తానంటే అది నేనే ఇచ్చాను కదా అని అతను అనగానే గంగ షాక్ అవుతుంది. ఏం అంటున్నావ్ అన్న అని అనగానే  అయ్యో ఇంట్లో తెలియదా సారీ గంగ చెప్పేసాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu Illalu Pillalu: వెక్కి వెక్కి ఏడ్చిన ప్రేమ.. ఆ విషయం చెప్పకుండా ఆగిపోయిన వేదవతి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-353 లో.. జరిగింది తల్చుకొని రామరాజు ఫ్యామిలీ అంతా భాదపడుతుంటారు. అప్పుడే ప్రేమ బయట నుండి ఏడుస్తూ వస్తుంది. పెద్దబావ అని ప్రేమ ఏదో చెప్పబోతుంటే .. ఆపమ్మా.. ఇందాక నువ్వు మాట్లాడిందంతా విన్నాను.. నువ్వేంటో అర్థమైంది.. మీ వాళ్లు తప్పు చేసినా సరే మీ వాళ్ళకే సపోర్ట్ చేస్తావని అర్థమైంది. ఇక నువ్వు సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా అంటాడు. ఇక తను సాగర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకుంటుంది. తను కూడా అలాగే అంటాడు. ‌   ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి.. మామయ్య.. నన్ను క్షమించు అని ప్రాధేయపడుతుంది. నువ్వు.. మీ నాన్న అన్నవన్నీ నిజమే.. ఆడపిల్లని సరిగ్గా పెంచడం చేతకాని ఓ తండ్రిని అమ్మ నేను అని రామరాజు అనగా.. అయ్యో మామయ్య అంటూ ప్రేమ అంటుంటే రామరాజు ఎమోషనల్ అవుతాడు. ఇక ఆ తర్వాత వేదవతి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతుంది ప్రేమ. నలుగురిలో ఈ ఇంటి ఆడపిల్ల పరువు తీసి నాకు కడుపు కోతని మిగిల్చావ్.. మా కూతిరిని ఎలా పెంచామో మాకు తెలుసు.. ఎంత పద్దతిగా పెంచామో మాకు తెలుసు.. ఆ వెదవ నా కూతరికి ఏదో మందుపెట్టాడు. మాయమాటలు చెప్పి మోసం చేశాడు. గుమ్మమే దాటని కూతురు వాడిని ప్రేమిస్తుందా.. నా కూతురు ఏ తప్పు చేయలేదని ప్రేమతో వేదవతి అంటుంది. ఆడపిల్లని ఎలా పెంచాలో మీ వాళ్ళకి తెలియదు కాబట్టే నువ్వు లేచిపోయావని నోటి దాటాక వచ్చింది.. కానీ వేదవతి ఆగిపోయింది వెంటనే.. ఇక తనని తిట్టి వేదవతి వెళ్తుంది. ‌ఇక ప్రేమ ఏడుస్తూ వెళ్లిపోయింది.    శ్రీవల్లి దొంగచాటుగా ఇంటి నుండి బయటకు వెళ్తుంది. అప్పుడే చెట్ల వెనుక దాక్కున్న భాగ్యం, ఆనందరావు పిలుస్తారు. మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ.. నువ్వు చెప్పినట్లే వేదవతి, నర్మద, ప్రేమ మధ్య గొడవలు మొదలయ్యాయని భాగ్యంతో శ్రీవల్లి  చెప్తుంది. ఇదే సరైన సమయం.. నువ్వు వాళ్ల మధ్య గొడవ పెంచమని చెప్తుంది. కాసేపు అందరు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ధీరజ్ దగ్గరకి ప్రేమ వెళ్ళి ఏడుస్తుంది‌. అత్త ఎలా అందో విన్నావా అంటూ ప్రేమ అనగానే.. చాలు ఆపేయ్ నీ నాటకం.. అక్కడ అలా నటించావ్.. ఇక్కడ ఇలా నటిస్తున్నావని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ ఏడ్చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: జ్యోత్స్న రూమ్ లో సీక్రెట్ కెమెరా.. కాశీతో కలిసి ఆమె ఆడే ఆటలు కార్తీక్ కనిపెడతాడా?

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -552 లో... కార్తీక్ దగ్గరకు రాత్రి స్వప్న ఏడుస్తూ వస్తుంది. ఇంత రాత్రి ఎందుకు వచ్చావని కార్తీక్ కోప్పడతాడు. కాశీకి జాబ్ వచ్చిందని జరిగింది మొత్తం చెప్తుంది. నాన్న అరెస్ట్ కి కాశీకి ఏదో సంబంధం ఉందని అర్థం అవుతుందని స్వప్న అనగానే కార్తీక్, దీప షాక్ అవుతారు. అవన్నీ ఏం పట్టించుకోకు.. నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్తాడు. కాసేపటికి స్వప్నని కార్తీక్ వెంటతీసుకొని ఇంటికి వెళ్తాడు.   ఆ తర్వాత కార్తీక్ తో స్వప్న మాట్లాడుతుంటే.. కాశీ ఎంట్రీ ఇస్తాడు. జాబ్ వచ్చిందట చెప్పలేదని కార్తీక్ అడుగుతాడు. జాయిన్ అయ్యాక చెప్దాననుకున్న బావ అని కాశీ అంటాడు. మీ మావయ్యకి చెప్పవా అని కార్తీక్ అనగానే ఎలా చెప్పాలి.. స్టేషన్ లో ఉన్నాడు కదా అని కాశీ అనగానే.. వస్తాడు నువ్వు వెళ్ళేలోపు నీకు సెండాఫ్ ఇవ్వడానికి ఖచ్చితంగా వస్తాడు. ఎందుకు అంటే నాకు అసలు ఇదంతా ఎవరు చేసారో తెలిసింది. అన్ని బయటకు రప్పిస్తానని కార్తీక్ అనగానే కాశీ టెన్షన్ పడతాడు. ఇదంతా ఎవరు చేసారో తెలిస్తే అసలు వదులొద్దు అన్నయ్య అని స్వప్న అంటుంది. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్తాడు. వాళ్ళకి కాశీ పైన డౌట్ వస్తుంది. అసలు ఇదంతా వెనకాల ఉండి ఎవరు నడిపిస్తున్నారో కనుక్కోవాలనుకుంటారు.   మరొకవైపు ఇదంతా కాశీతో నేనే దగ్గర ఉండి చేయించానని పారిజాతంతో జ్యోత్స్న చెప్పగానే పారిజాతం భయపడుతుంది. కానీ కాశీతో జ్యోత్స్న ఫోన్ లో మాట్లాడగానే  పారిజాతం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్ ఏం జరగనట్లు వచ్చి.. ఇంట్లో పనులు చేసుకుంటాడు. జ్యోత్స్నకి డౌట్ వస్తుంది. మరొక వైపు జ్యోత్స్న ఉండే ప్లేస్ లో దీప ఫోన్ కెమెరా ఆన్ చేసి పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: అప్పుని అర్థం చేసుకున్న ధాన్యలక్ష్మి.. రాహుల్ వల్ల కొత్త చిక్కుల్లో రాజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-915 లో.. కావ్య ప్రెగ్నెంట్ అని తనని రాజ్ అపురూపంగా చూసుకుంటాడు. ఇక రాత్రి కావ్య, రాజ్ పడుకున్నాక.. కావ్యకి తమ ఇల్లు తగలబడి పోతున్నట్టు కల వస్తుంది. వెంటనే ఉలిక్కిపడి లేస్తుంది. దాంతో రాజ్ లేచి ఏమైందని అడుగుతాడు. మన ఇల్లు తగలడిపోయినట్టు నిజంగా అనిపించిందని కావ్య చెప్పగా.. అదంతా నీ ఇల్యూజన్ పడుకోమని రాజ్ చెప్తాడు.    మరోవైపు రాహుల్ తీవ్రంగా ఆలోచిస్తుంటే అతని దగ్గరికి రుద్రాణి వస్తుంది. ఏంట్రా మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావని రుద్రాణి అడుగగా.. ఒక మాస్టర్ ప్లాన్ వేశానని రాహుల్ అంటాడు.   మరుసటిరోజు ఉదయం కావ్య లేచి దేవుడికి పూజ చేస్తుంది. ఇక అపర్ణ, ఇందిరాదేవిలకి కావ్య హారతి ఇస్తుంది. ‌ఆ తర్వాత రాజ్ కి హారతి ఇస్తుంది కావ్య. అతను తీసుకునేటప్పుడు హారతి ఆగిపోతుంది. దీంతో అపర్ణ, కావ్య, ఇందిరాదేవి కంగారుపడతారు. అది అశుభమని అంటారు. రాజ్ ని ఇంటిపట్టునే ఉండమని అందరు అంటారు. కానీ అతడు వినడు.    మరోవైపు ఇంటిబయట అప్పు అటుఇటు తిరుగుతుంటుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి ఏం అయిందని అడుగుతాడు. హా అలసిపోతున్నానని అప్పు అనగా.. ఈ టైమ్ లో వాకింగ్ చాలా మంచిది అని చెప్తాడు. అప్పుడే ధాన్యలక్ష్మి పుస్తకాలు పట్టుకొని వస్తుంది. తనతో పాటు ప్రకాశ్ వస్తాడు. అప్పుని సివిల్స్ కి ప్రిపేర్ అవ్వమని ధాన్యలక్ష్మి చెప్తుంది. దాంతో ప్రకాశ్, కళ్యాణ్ షాక్ అవుతాడు. నువ్వేనా ధాన్యం ఇలా మాట్లాడేది అని ప్రకాశ్ అనగా.. నేనే అంటున్నా.. అప్పు నా మాటకి గౌరవమిచ్చి ఇంట్లోనే ఉంటున్నప్పుడు తనని నేను కూడా  అర్థం చేస్కోవాలి కదా.. అందుకే తను ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలని సివిల్స్ చదువమని చెప్తున్నానని ధాన్యలక్ష్మి అనగానే అందరు సంతోషిస్తారు. ఇక అప్పు వెళ్ళి ధాన్యలక్ష్మిని హగ్ చేసుకుంటుంది.   మరోవైపు బంగారం స్మగ్లింగ్ చేసే అతడికి రాహుల్ ఫోన్ చేస్తాడు. నువ్వు ఇంపోర్ట్ చేసుకునే బంగారం మొత్తం నేనే కొంటాను. అయితే నువ్వు చేయాల్సిందల్లా.. వెళ్ళి రాజ్ ని కలిసి ఈ ప్రపోజల్ చెప్పమని అతడితో రాహుల్ అనగానే.. రాజ్ గెంటేస్తాడని అతను అంటాడు. అదే మనకి కావాల్సిందని రాహుల్ అంటాడు. ఆ తర్వాత ప్లాన్ అంతా రుద్రాణికి వివరిస్తాడు రాహుల్.    మరుసటి రోజు బంగారం స్మగ్లింగ్ చేసే అతను రాజ్ దగ్గరికి వచ్చి అతని ప్రపోజల్ చెప్తాడు. అది విని బయటకి పోరా అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

చెఫ్ జీవన్ కి ముద్దు పెట్టేసిన దీపికా...

చెఫ్ మంత్ర కుకింగ్ షో ప్రతీ వారం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం కూడా కంటెస్టెంట్స్ జడ్జెస్ అంతా కూడా ఫేమస్ మూవీ రోల్స్ గెటప్స్ లో వచ్చారు. ఇక ఈ షోకి శంబాలా మూవీ టీమ్ వచ్చింది. ఆది కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసాడు. ఇక సుమా ఐతే ఈ షోలో లేలేత లవ్ స్టోరీ నడుస్తోందని అది కూడా దీపికా-జీవన్ మధ్య అని చెప్పేసరికి "శృంగార వీర" అనే సాంగ్ పాడుతూ వచ్చి దీపికా జీవన్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టేసింది. ఏదైనా అందరూ కలిసి దీపికను రెచ్చ్చగొట్టారు అంటూ జీవన్ అన్నాడు. "ఏదో మేమందరం ఇక్కడ ఉండి జీవన్ ని కాపాడుతున్నాం కానీ లేదంటే జీవన్ కి ఈపాటికి నలుగురు పిల్లలు ఉండేవారు" అంటూ సుమ కామెడీ చేసింది. ఇక అందరూ కుకింగ్ చేస్తూ ఉండగా హీరో ఆది వెళ్లి "మీకు జీవన్ గారిలో ఎం నచ్చిందండి" అంటూ దీపికను అడిగాడు. "వయసైనా ఆయన గుండు మాత్రం అలానే ఉంది చూసారా ఆ గుండు నచ్చింది. ఆయన స్టైల్ నచ్చింది. ఆయన నడిచేటప్పుడు వెనక ఆయన తిప్పే నడుము నచ్చింది." అని చెప్పింది దీపికా. వెంటనే ఆది "కాదన్నా నీలో ఇంత రొమాన్స్ ఉందా" అంటూ జీవన్ ని అడిగాడు. " సర్ ఆయనలో ఉన్నది రొమాన్స్ మాత్రమే వేరేం లేదు" అంటూ దీపికా క్లారిటీ ఇచ్చింది. తర్వాత "మీసాల బావా" అంటూ జీవన్ కోసం పాట కూడా పాడింది. ఇక జీవన్ దణ్ణం పెట్టేసి నా కొంపలంటుకుపోతావ్ నన్ను వదిలేయ్ అంటూ నవ్వాడు.

Podharillu: భూషణ్ కిడ్నాప్.. మహాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చక్రి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -15 లో... ప్రతాప్ దగ్గరికి భూషణ్ వస్తాడు. ఈ డాక్యుమెంట్స్ పై మహా సంతకం పెట్టాలని అంటాడు. మహాకీ ఇష్టం లేకున్నా డాక్యుమెంట్స్ పై సంతకం చేస్తుంది. చక్రి వంక రిజిస్ట్రేషన్ ఆపుతాడని ఆశగా చూస్తుంది. భూషణ్ వెళ్ళిపోతున్నాడు.. కొంచెం అక్కడ వరకు వెళ్ళమని ప్రతాప్ అంటాడు. మహా నీ డ్రెస్ సెన్స్ నచ్చలేదు.. సో నువ్వు చేంజ్ చేసుకోవాలనగానే మహా కోపంగా సరే అంటుంది. భూషణ్ వెళ్తుంటే చక్రి కాలు అడ్డుపెడుతాడు. దాంతో భూషణ్ పడబోతాడు.. చూసుకోవాలి కదా అని చక్రిపై భూషణ్ కోప్పడుతాడు. దాంతో మహా నువ్వుకుంటుంది. చూసారా పెళ్లి కొడుకుని ఎలా చేసానో అని చక్రి అనగానే పెళ్లిని ఆపాలి పెళ్లి కొడుకుని కాదని మహా అంటుంది. ఆ తర్వాత మాధవ, కేశవ, కన్నా దగ్గరికి చక్రి వచ్చి భూషణ్, మహా ఫోటో చూపించి బంగారం లాంటి అమ్మాయిని వాడికి ఇచ్చి చేస్తున్నారని చక్రి చెప్తాడు. ఆ తర్వాత మాధవని అక్కడ నుండి పంపించి.. కన్నా, కేశవకి భూషణ్ ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చెప్తాడు చక్రి. మరొకవైపు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అంకుల్ అని భూషణ్, ప్రతాప్ కి ఫోన్ చేసి చెప్తాడు. మహా అయిష్టంగా రెడీ అవుతుంది.  ఆ తర్వాత భూషణ్ వాళ్ళ పేరెంట్స్ ప్రతాప్ దగ్గరికి వచ్చి భూషణ్ ని ఎవరో కిడ్నాప్ చేశారని‌‌.. భూషణ్ దారిలో ఆగి పూలదండలు తీసుకొని రావడానికి వెళ్తుంటే.. కొంతమంది వచ్చి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్లారని వాళ్ళు చెప్పగానే అందరు షాక్ అవుతారు. మహా మాత్రం మనసు లో హ్యాపీగా ఫీల్ అవుతుంది. హమ్మయ్య మహా దగ్గర మాట నిలబెట్టుకున్నానని చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: ఒక్కసారిగా కుప్పకూలిన శకుంతల.. గంగ వల్లే బ్రతికిందిగా

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -152 లో......రుద్రకి వీరు ఫోన్ చేస్తాడు. బావ ఎక్కడ ఉన్నావని అడిగేలోపు స్నేహ ఫోన్ లాక్కొని అన్నయ్య గుడి నుండే వస్తున్నారా త్వరగా రండి అని అంటుంది. దాంతో స్నేహ కవర్ చేసిందని రుద్ర, గంగ అర్ధం చేసుకొని వస్తున్నామని అంటాడు. ఆ లోపు వీరు ఫోన్ తీసుకొని బావ మీ కోసం వెయిట్ చేస్తున్నాం.. త్వరగా రమ్మని రుద్రకి వీరు చెప్తాడు. ఆ తర్వాత రుద్ర, గంగ వస్తారు. రుద్ర బయట నుండే స్వామిని చూస్తాడు. రుద్ర వెనక్కి వెళ్తుంటే బావ లోపలికి రా అని వీరు పిలుస్తాడు. బయటే షూస్ విప్పమని గంగకి చెప్తాడు. ఇద్దరు లోపలికి రాగానే ఇలాగేనే గుడికి వెళ్ళేది బాగా పద్ధతులు నేర్పుతున్నావని శకుంతలని స్వామి అంటాడు. ఈ వస్త్రాధరణతోనేనా ఆశీర్వచణం ఇచ్చేదని స్వామి కోప్పడతాడు. ఆ తర్వాత గంగ, రుద్ర బట్టలు మార్చుకొని వస్తారు. ఇద్దరిని ఆశీర్వదిస్తాడు. వాళ్లకు కొంచెం పద్ధతి గురించి చెప్పండి అని శకుంతల అనగానే.. వాళ్ళకి కాదు నీకు చెప్పాలని స్వామి అంటాడు. వాళ్ళది పద్దతి ప్రకారం పెళ్లి జరగలేదు.. కులదేవత గుడికి తీసుకొని వెళ్ళలేదని స్వామి, శకుంతలపై కోప్పడతాడు. రేపు గుడికి తీసుకొని వెళ్ళు.. నువ్వు నూట ఒక్క ప్రదక్షిణలు చెయ్ అని స్వామి అనగానే.. నేను చేస్తాను అని రుద్ర అంటాడు. లేదు తనే చెయ్యాలని స్వామి చెప్తాడు. స్వామి వెళ్ళిపోయాక ఇదంతా గంగ వళ్లే అని ఇషిక, వీరు అంటుంటే శకుంతల కిందపడిపోతుంది. దాంతో గంగ వచ్చి శకుంతల ఛాతిపై నొక్కుతు లేపే ప్రయత్నం చేస్తుంది. ఆ లోపు డాక్టర్ వస్తాడు. గంగ నీ వల్లే ఇదంతా తనే బాలేదు అంటే అత్తయ్యని కుదిపేశావని ఇషిక కోప్పడుతుంది. తను అలా చెయ్యడం వల్లే ఈవిడ ఇలా ఉంది. అలా చేసి మంచి పని చేసిందని డాక్టర్ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే .

Brahmamudi: మళ్ళీ నెంబర్ వన్ స్థానంలోకి స్వరాజ్ కంపెనీ.. రాహుల్, రుద్రాణిలు షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -914 లో..... అందరు హాల్లో ఉండగా అక్కడికి ధాన్యలక్ష్మి వస్తుంది. నా కోడలితో మాట్లాడాలని ధాన్యలక్ష్మి అనగానే అంటే మమ్మల్ని ఇక్కడ నుండి వెళ్లిపొమ్మంటావా అని ఇందిరాదేవి అడుగుతుంది. లేదు నేను చెప్పేది అందరు వినాలని ధాన్యలక్ష్మి అంటుంది.  సారీ అత్తయ్య మీ మాట వినకుండా మిమ్మల్ని బాధపెట్టాను.. ఇక అలా ఎప్పుడు చెయ్యను.. మీరు కోరుకున్నట్లుగానే పోలీస్ ఉద్యోగం మానేస్తానని అప్పు అంటుంది. నా కోడలి విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని  నేను మార్చుకుంటున్నాను.. తనకి తన వృత్తి అంటే చాలా ఇష్టం అందుకే తను జాబ్ చేసుకోవచ్చు కానీ ఒక కండిషన్ డెలివరీ అయ్యేవరకు మాత్రం వెళ్లొద్దని ధాన్యలక్ష్మి అనగానే.. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా థాంక్స్ అత్తయ్య బిడ్డని కని మీ చేతిలో పెట్టేవరకు ఇంట్లో నుండి బయటకు వెళ్ళనని అప్పు చేప్తుంది. ఇక ప్రాబ్లమ్ సాల్వ్ ఇక కంపెనీ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయితే సంతోషమని సుభాష్ అంటాడు. నాన్న ఒక్క నెల రోజుల్లో సేల్స్ పెరిగి మళ్ళీ కంపెనీని నెంబర్ వన్ పొజిషన్ లో నిలబెడతామని రాజ్ చెప్తాడు. కొన్ని నెలల తర్వాత కావ్య పొట్ట పెరిగిందని టేప్ తో కొలుస్తూ రాజ్ మురిసిపోతాడు. కావ్యని వాకింగ్ చేపిస్తూ ఉంటాడు. మరొకవైపు అప్పుని దగ్గరుండి మరి తన బాగోగులు చూసుకుంటాడు కళ్యాణ్. కావ్య డిజైన్స్ వేస్తుంటుంది. ఇద్దరు కలిసి మళ్ళీ కంపెనీని నెంబర్ వన్ చేస్తారు. రాహుల్ క్లయింట్స్ మొత్తం రాజ్ వైపు కి షిఫ్ట్ అవుతారు. రాజ్, కావ్య స్వీట్ తీసుకొని వచ్చి ఇంట్లో అందరికి చెప్తారు. మళ్ళీ కంపెనీ మొదటి స్థానంలోకి వచ్చిందని రాజ్ చెప్పగానే ఒక రుద్రాణి, రాహుల్ తప్ప అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కంగ్రాట్స్ రాజ్ అని రాహుల్ చెప్తాడు. ఎప్పుడు ఎథిక్స్ వాల్యూస్ ఫాలో అవుతే నెంబర్ వన్ ఉంటారని సుభాష్ అనగానే అంటే రాహుల్ అవేం ఫాలో అవడం లేదా అని స్వప్న అంటుంది. అలా కాదని కావ్య సర్ది చెప్పుతుంది. తరువాయి భాగంలో రాజ్, కావ్యలకి మళ్ళీ ప్రాబ్లమ్ క్రియేట్ చెయ్యాలని రాహుల్ , రుద్రాణి ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు స్వప్న భోజనం టేబుల్ పై పెట్టి కాశీకి తినమని చెప్పి వెళ్ళిపోతుంది. భార్యగా ఎలా ఉండాలో దీప అక్కని చూసి నేర్చుకోమని కాశీ అనగానే బాధ్యతగా ఎలా ఉండాలో మా అన్నయ్యని చూసి నేర్చుకోమని స్వప్న అంటుంది. ఆ తర్వాత కాశీ కోపంగా వైరాకి ఫోన్ చేసి నాకు జాబ్ ఇస్తానన్నారని అడుగుతాడు. ఇచ్చాను ముందు బోనస్ గా అయిదు లక్షలు పంపిస్తున్నానని వైరా చెప్తాడు. మరొకవైపు సుమిత్ర గురించి దీప బాధపడుతుంది. అప్పుడే కార్తీక్, కాంచన వస్తారు. మావయ్య బయటకు వచ్చాడా అని దీప అనగానే వచ్చాడని శౌర్య ముందు అబద్ధం చెప్తాడు కార్తీక్. శౌర్య వెళ్ళిపోయాక రాలేదని కార్తీక్ చెప్పగానే దీప బాధపడుతుంది ఎందుకు బాధపడ్డాం.. నీ ఐడియా వళ్లే కదా అయనకి ఆ పరిస్థితి వచ్చిందని కాంచన అనగానే దీప షాక్ అవుతుంది‌. ఇవి నా మాటలు కాదు.. మా పిన్ని ఫోన్ చేసి తిడుతుందని కాంచన అంటుంది. మరొకవైపు తన అకౌంట్ లో డబ్బులు క్రెడిట్ అయ్యాయని స్వప్నకి కాశీ చూపిస్తాడు. స్వప్న అది చూసి షాక్ అవుతుంది. జనరల్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. ఒక్క రోజులో అయిదు లక్షలు సంపాదించానని కాశీ పొగరుగా చెప్తాడు. మనం త్వరలో ఇల్లు తీసుకుంటున్నాం.. వెళ్లిపోతున్నాం ఇన్ని రోజులు మీ వాళ్ళు ఫుడ్ పెట్టినందుకు ఎంత కావాలో చెప్పమను ఇస్తానని కాశీ అనగానే స్వప్న షాక్ అవుతుంది.. ఆ తర్వాత కార్తీక్, దీపల దగ్గరికి స్వప్న వెళ్లి జరిగింది అంత చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : కూతురు చేసిన పనికి ఎమోషనల్ అయిన రామరాజు.. ప్రేమ షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -352 లో.. అమూల్య, విశ్వ ప్రేమ విషయం ఇంట్లో తెలిసి అందరు బాధపడుతారు. కొడుకులే అనుకున్నాను.. కూతురు కూడా.. నా గుండెలపై తన్నింది. నీకు ఏం లోపం చేశానమ్మ వాళ్లు మన శత్రువులు అని తెలుసు.. ఎన్నిసార్లు వాళ్ళు నన్ను అవమానించారు.. అది గుర్తు కి రాలేదా తల్లి అని రామరాజు ఎమోషనల్ అవుతాడు. దీనికి కారణం ఆ విశ్వగాడు చెల్లి ని ట్రాప్ చేసాడని ముగ్గురు అన్నతమ్ముళ్లు విశ్వపై గొడవకి వెళ్తారు. విశ్వని కొడుతుంటే తప్పు మా అన్నయ్యది కాదు అమూల్యది అని ప్రేమ చెప్పగానే అందరు షాక్ అవుతారు. అవును అమూల్యనే అన్నయ్య వెంటపడిందని ప్రేమ చెప్తుంది. చెప్పవే ముందు ఎవరు ప్రేమించారని అమూల్యని వేదవతి అడుగగా నేనే ప్రేమించానని చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. గతంలో ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు.. నువ్వే ముందు ప్రేమించానని చెప్పమని అమూల్యని ప్రేపర్ చేస్తాడు విశ్వ. దాంతో అమూల్య అలా చెప్తుంది.అమూల్య అలా చెప్పగానే వేదవతి తనని తిడుతుంది. రామరాజుకి తల తీసేసినట్లు అవుతుంది. ఒరేయ్ ఏం పెంపకంరా అని సేనాపతి అంటుంటే అవమానంతో అందరు ఇంట్లోకి వెళ్తారు. ప్లాన్ సక్సెస్ అయింది త్వరలోనే అంత సెట్ చేస్తానని భద్రవతి, సేనాపతిలతో విశ్వ చెప్తాడు. మరొకవైపు నర్మద దగ్గరికి ప్రేమ వస్తుంది. అక్క ఆ సిచువేషన్ లో అందరు విశ్వనే తప్పు చేసాడనుకుంటున్నారు అందుకే అలా అన్నాను సారీ అని చెప్తుంది. అయిన నర్మద సైలెంట్ గా ఉంటుంది. దాంతో ప్రేమ బాధపడుతుంది. అదంతా చూసి హమ్మయ్య ఇద్దరు మాట్లాడుకోవడం లేదని శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.