బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరు ఆదినా సుధీరా ? ఎంఎల్ఏగా ఆది ఆ జిల్లా నుంచి పోటీ

2025 కొన్ని రోజుల్లో బైబై చెప్పేయబోతోంది. డిసెంబర్ 31st రావడానికి ఎన్నో రోజులు లేదు. ఇక ఈ సందర్భంగా కం 2 ఢీ పార్టీ పేరుతో ఈటీవీ న్యూ ఇయర్ ఈవెంట్ జరపబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో జాఫర్ కనిపించాడు. లాస్ట్ లో ఆదిని, సుధీర్ ని కూర్చోబెట్టి కొన్ని ప్రశ్నలు వేసాడు. "ఆది ఒక్కోసారి షోలో వేసే పంచులు వలన అవతలి వారి మనోభావాలు దెబ్బతింటాయని తెలిసిన పట్టించుకోని పరిస్థితి ఉండదా" అని ఆదిని అడిగాడు. "అవన్నీ ఉండవండి మన దగ్గర" అని ఆన్సర్ ఇచ్చాడు. "ఎంఎల్ఏగా ఎప్పుడు ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు..ఆది నాకు ఆ సమాచారం ఉంది" అని అన్నాడు జాఫర్. జిల్లా పేరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తన మనసులో భావాన్ని పరోక్షంగా చెప్పిన ఆది అన్నాడు జాఫర్. ఐతే ఇంతకు ఏ జిల్లా అనే పేరు మాత్రం ప్రోమోలో వినిపించనివ్వలేదు. "ఈ మధ్య మీరు ఒక లవ్ స్టోరీ నుంచి బయటకు వచ్చారు. ఏంటి కావ్య రీజన్" అంటూ కావ్యని కూడా ఎన్కౌంటర్ చేసాడు.   ఇక ప్రోమో స్టార్టింగ్ లో బ్రేకింగ్ న్యూస్ అంటూ జాఫర్ వచ్చి "ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే టాపిక్ హూ ఈజ్ ది బెస్ట్ ఎంటర్టైనర్ ఆదినా సుధీర్ ఆ అని" అడిగాడు. ఈ ప్రశ్నకు నెటిజన్స్ ఐతే సుధీర్ పేరును ఎక్కువగా మెన్షన్ చేశారు. అలాగే కొంతమంది సుధీర్ ని కొంతమంది ఆదిని ఉద్దేశిస్తూ రిప్లైస్ ఇచ్చారు. అలాగే ఈ ఇద్దరి కంబినేషన్ కూడా బాగుంటుంది అంటూ కూడా చెప్పాడు. "సుధీర్ అన్న యాంకర్ గా ఉన్నా అభిమానిస్తాం, హీరోగా ఉన్నా అభిమానిస్తాం, కమెడియన్ గా ఉన్నాఅభిమానిస్తాం, మాకు కావాల్సింది కేవలం సుధీర్ అన్న మాత్రమే, ఆది అన్న  కామెడీ కింగ్' అంటూ నెటిజన్స్ వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు.

ఇన్నోసెంట్ మదర్స్ అంతరించిపోయారు..పెద్దాళ్ళను చంపేవాళ్లు మృగాలే

టేస్టీ తేజ ఒక జబర్దస్త్ కమెడియన్ గా అలాగే ఫుడ్ వ్లాగర్ అందరికీ పరిచయమే. అలాంటి తేజ ఒక ఇంటర్వ్యూలో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. '90s జనరేషన్ కదా అప్పటికి ఇప్పటికీ నువ్వు గమనించిన మార్పులు ఏంటి" అంటూ హోస్ట్ అడిగేసరికి "మార్పులు ఏమీ లేవు కానీ ఒక మార్పు గట్టిగా కనిపిస్తోంది. ఇన్నోసెంట్ మదర్స్ అంటారు కదా అది మన జనరేషన్ తోనే ఎండ్.  అప్పటిలో మమ్మీస్ అంతరించిపోయారు అనేవాళ్ళు కదా అలా మన జనరేషన్ తోనే ఇన్నోసెంట్ మదర్స్ అంతరించిపోయారు. ఇన్నోసెంట్ మదర్స్ లేరు ఇన్నోసెంట్ ఫాదర్స్ లేరు. అందరూ ముదుర్లు. మనమే ముదుర్లు అంటే మనకు పుట్టే వాళ్ళు కంచులే. మనం ఇప్పటివరకు మా పేరెంట్స్ ఇన్నోసెంట్ అని చెప్పుకునే వాళ్ళం. కానీ రేపటి పిల్లలు మాత్రం మా పేరెంట్స్ ముదుర్లు అని చెప్పుకుంటారు. ఇది మేజర్ డిఫరెన్స్ నేను గమనించింది. ఐతే కొన్నేళ్ల క్రితం నేను చూసింది పేరెంట్స్ ని ఇంట్లోంచి గెంటేయడం లేదంటే అనాధాశ్రమాల్లో వేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నెమ్మదిగా సెల్ఫ్ రియలైజేషన్ వచ్చింది. మమ్మల్ని కన్నారు పెంచారు కదా మేము చూడాలి కదా అనుకుంటున్నారు.  ఐతే ఆర్ధిక ఇబ్బందుల వలన అలా చేస్తున్నారు. కొంతమంది ఐతే పెద్దవాళ్ళు అడ్డుగా ఉంటున్నారని చంపేస్తున్నారు వాళ్ళను మృగాలు అనాలి. ఒకప్పుడు అవకాశాలు లేక అలా చేశారనుకుంటే ఇప్పడు అవకాశాలు పెరిగాయి. ఐనా కూడా చేస్తున్నారంటే ఏమీ చేయలేక లాస్ట్ ఆప్షన్ గా అలా చేస్తున్నారు అంటే అది దరిద్రం దారుణం ఇంకా వాళ్ళు మృగాలే." అని చెప్పాడు టేస్టీ తేజ.

30 ఏళ్ళు వచ్చాయి..ఇప్పుడు రిలేషన్ షిప్ ఏంటి..? పెళ్లి చేసుకుని పిల్లల్ని కను

బుల్లితెర మీద అష్షు రెడ్డి ఫుల్ ఫేమస్. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది. అలాంటి అష్షు వాళ్ళ అమ్మతో కలిసి ప్రాంక్ వీడియో చేసింది. అది కూడా తన పెళ్లి, లివిన్ రిలేషన్ మీద. "అమ్మా నాకు 30 ఏళ్ళు వచ్చేసాయి లివిన్ రిలేషన్ లో ఉండి అంతా సెట్ అయ్యాక పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా." అంది అష్షు. "సెట్ అవడం అంటే ఏంటి. సెట్ కాకపోతే ఎం చేస్తావ్.. ఒకవేళ పిల్లలు పుట్టేస్తే ఎం చేస్తావ్" అని అడిగింది అష్షు వాళ్ళ అమ్మ. "సెట్ అవకపోతే వదిలేస్తా. వేరే అతన్ని చూస్తా. ఒక వేళా పిల్లలు పుట్టేస్తే వాళ్ళు ఐదారు తరగతులకు వచ్చేవరకు వెయిట్ చేసి అప్పుడు వాళ్ళ కలిసి వెళ్లి మా ఆయన్ని చేసుకుంటా" అని చెప్పింది.   "నా పిల్లల్ని నువ్వే పెంచాలి. మా ఆయన్ని నువ్వేం అనడానికి వీల్లేదు. ఐనా నువ్వు నాన్నతో లివిన్ లో లేకుండా ఎలా పెళ్లి చేసేసుకున్నావ్" అని అష్షు అడిగింది. " నీ పిల్లల్ని నేను పెంచాలా. ఎవడు నువ్వు సెట్ చేసుకునేవాడు చూపించు" అంటూ ఫైర్ అయ్యింది. " నేను పెళ్లి చేసుకున్నాను అంటే అది నమ్మకం. ఏంటి ఈ చెత్త లివిన్ రిలేషన్ లు. అసలు ఎవరు ఇలా చెప్తున్నాడు నీకు" అంది. "ఎదవా అని మా ఆయన్ని అనకు. ఆయన చాల మంచోడు" అని అష్షు అనేసరికి "ఎంత మంచోడో ఇప్పుడే తెలిసిపోతోంది అంది వాళ్ళ అమ్మ. "ఒకళ్ళు ఉద్యోగానికి వెళ్ళండి ఇంకొకళ్ళు పిల్లల్ని చూసుకోండి" అని సలహా ఇచ్చేసరికి "ఎలా కుదురుతుంది ఇద్దరూ ఉద్యోగాలు చేయకపోతే ఇల్లు గడవదు. నువ్వే వచ్చే మాకు వంట చేయాలి పిల్లల్ని చూడాలి అన్నీ నువ్వే చేయాలి" అంది అష్షు.   దానికి వాళ్ళ అమ్మ ఫుల్ ఫైర్ అయ్యింది. "ఇప్పుడు మనిషి మీద మనిషికి నమ్మకాలు లేవు అమ్మ. ఇప్పుడు అందరూ అలాగే నమ్మించి మోసం చేస్తున్నారు. నువ్వే వెనకబడిపోతున్నావు.ఫారెనర్ లా ఆలోచింహాలి " అంది అష్షు. "ఎటు వెళుతోంది అశ్విని మన సమాజం" అంది వాళ్ళ అమ్మ. ఇవన్నీ విన్నాక వాళ్ళ అమ్మ లేచి అష్షుని కొట్టేసింది. ఇక అష్షు అది ప్రాంక్ అని చెప్పేసరికి కన్నీళ్లు పెట్టుకుంది. ఇలాంటి విషయాల్లో ప్రాంక్ చేస్తారా అని అడిగింది. ఫైనల్ గా అష్షు ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద ప్రాంక్స్ చేయను మా అమ్మ కాళ్ళ మీద క్షమాపణ అడిగేసాను అని చెప్పింది.

అరడజను సినిమాలు..టేస్టీ తేజ 2.0.. అదిరే అభి అన్న వల్లే ఈ స్థాయిలో ఉన్నాను

సోషల్ మీడియాలో ఏ మూవీ ప్రమోషన్ అయినా ముందుగా టేస్టీ తేజతో మొదలుపెట్టడం మూవీ యూనిట్స్‌కి ఆనవాయితీగా మారింది. అలాంటి టేస్టీ తేజ తన లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. "నువ్వు జబర్దస్త్ చేసావ్, యూట్యూబ్ చేసావ్, ఇన్స్టాగ్రామ్ చేసావ్, బిగ్ బాస్ చేసావ్ ఇవన్నీ కాకుండా ఇంకేదో చేస్తున్నావ్ ఏంటది" అని హోస్ట్ అడిగింది. "బిగ్ బాస్ 7 తర్వాత నాకు చాలా మూవీ ఆఫర్స్ వచ్చాయి. అవి కమిట్ అయ్యి చేద్దాం అనుకునేలోపు బిగ్ బాస్ 8 వచ్చింది. దాని వలన నాకు 4 సినిమాలు పోయాయి.   ఇక ఇప్పుడు శర్వానంద్, శ్రీ విష్ణు, ఆనంద్ దేవరకొండ, అమరదీప్ వీళ్లందరితో కలిసి సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో అప్ కింగ్ మూవీ ఉంది. ఆల్రెడీ 4 మూవీస్ షూటింగ్ ఐపోయాయి. ఇంకో రెండు చేయాలి. శర్వానంద్ తో నటించిన నారీనారీ నడుమ మురారి మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. శ్రీవిష్ణుతో వీడియో చేయడం వలన అది చూసి ఈ మూవీలో ఆఫర్ వచ్చింది. శ్రీవిష్ణు అన్న మూవీలో నటిస్తున్నా. ఆయన ఇంకో రెండు మూవీస్ లో కూడా నన్ను రిఫర్  చేసాడు. అమరదీప్ తన కొత్త మూవీలో కొత్తగా కనిపించబోతున్నాడు. లుక్స్ మార్చాడు, డాన్స్ ఇరగదీసాడు. ఈ మూవీలో నాకు ఛాన్స్ రావడానికి అమరదీప్ కారణం.   నా చిన్నప్పుడు చూసిన సినిమా టికెట్ బాల్కనీ 20 ఇప్పుడు 200 లు. నాతో పాటు అవి కూడా పెరిగాయి.  ఒక పెద్ద ఆపర్చ్యునిటీ వచ్చింది. అది ఐతే గనక టేస్టీ తేజ 2 . 0 అనుకున్నా. కానీ చిన్న మిస్ ఫైర్ అయ్యింది. మంచి ప్రాజెక్ట్, మంచి క్యారెక్టర్ అని తెలిసాక చాలా ఆశ పడ్డాను. కానీ పోయింది. పేరెంట్స్ సపోర్ట్ తర్వాత అదిరే అభి అన్న అవకాశం ఇవ్వడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను" అని ఎప్పటికీ గర్వంగా చెప్పుకుంటాను అన్నాడు టేస్టీ తేజ.  

Jayam serial: లక్ష్మీని కఠినంగా తిట్టేసిన శకుంతల.. వీరూకి టెన్షన్‌!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -150 లో.....గంగపై శకుంతలకి పాజిటివ్ ఒపీనియన్ వచ్చేలోపు గంగని ఇంకా నెగెటివ్ చెయ్యాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు. అసలు గంగనే విషం కలిపి తనే తిని సింపథీ కొట్టేసి మళ్ళీ ఈ ఇంట్లోకి రావడానికి ట్రై చేసిందని శకుంతలతో ఇషిక అనగానే శకుంతల అదంతా నమ్మేస్తుంది.   గంగని చూడడానికి వాళ్ళ అమ్మ వస్తుంది. దాంతో కూతురు తల్లి రోగం పేరు చెప్పి మోసం చెయ్యడం మళ్ళీ ఏం ఎరుగనట్లు ఇలా రావడం.. ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలని శకుంతల అంటుంది. దాంతో లక్ష్మీ బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అంత కఠినంగా లక్ష్మీతో మాట్లాడాలిసిన అవసరం ఏముంది శకుంతల.. నువ్వేనా ఇలా మాట్లాడిందని శకుంతలతో పెద్దసారు అంటాడు. నువ్వేనా స్థాయి చూసేదని పెద్దసారు అనగానే మీరు వాళ్ళ గురించి ప్రశ్నించడం నాకు నచ్చడం లేదని శకుంతల అంటుంది.   మరొకవైపు కొంచెం ఉంటే ప్రాబ్లమ్ లో పడేవాళ్ళం గంగ పైకి టాపిక్ వెళ్ళింది కాబట్టి అత్తయ్య కేసు గురించి ఏం మాట్లాడలేదని వీరు, ఇషిక అనుకుంటారు. అప్పుడే పారు ఫోన్ చేస్తుంది. ఇంట్లో జరిగిందంతా ఇషిక చెప్తుంది. ఆ తర్వాత శకుంతల అన్నమాటలు గంగ గుర్తుచేసుకొని బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu: విశ్వ, అమూల్యలని చూసేసిన నర్మద.. తను ఏం చేయనుంది?

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -350 లో... శ్రీవల్లి టీచర్ గా జాయిన్ అయి  క్లాస్ కి వెళ్తుంది. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే శ్రీవల్లికి ఏం చేయాలో అర్థం కాదు.. ఏం చెప్పాలో తెలియక చిన్న రైమ్ చెప్తుంది. అది విన్న స్టూడెంట్స్.. మేడమ్ అది మేమ్ నర్సరీ లోనీ నేర్చుకున్నామని అంటారు. ఇంత తొందర ఏంట్రా అని వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి శ్రీవల్లి కళ్ళు తిరిగిపడిపోతుంది. తీరా కళ్ళుతిరిగి చూసేసరికి భాగ్యం, ఆనందరావుల దగ్గర ఉంటుంది. అమ్మడు నీకు జాబ్ వచ్చింది కదా నాకు సాలరీలో కొంచెం డబ్బులు ఇవ్వమని భాగ్యం అంటుంది. దాంతో వాళ్ళని కొట్టడానికి వాళ్ళ వెనకాల పరిగెడుతుంది.    అప్పుడే విశ్వ వచ్చి.. ఆ ధీరజ్ గాడు నన్ను అమూల్యని చూసాడనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. నేనొక ప్లాన్ చెప్తాను నువ్వు మీ చెల్లి ప్రేమ దగ్గరికి వెళ్ళు అని భాగ్యం ఏదో చెప్పేలోపే ప్రేమ దగ్గరికి విశ్వ బయల్దేరతాడు. ప్రేమ నీతో మాట్లాడాలని పక్కకి తీసుకొని వెళ్తాడు. అమూల్య నన్ను ఇష్టపడుతుంది. మన కుటుంబాల గురించి నీకు తెలియదని నచ్చజెప్పుతున్న కానీ తను వినట్లేదు కనీసం నువ్వు అయిన చెప్పు ప్రేమ అని విశ్వ అంటాడు.    అప్పుడే ధీరజ్ వచ్చి నా చెల్లిని ట్రాప్ చేసావంటూ విశ్వని కొడతాడు. ఒరేయ్ ధీరజ్ ఆగమని ధీరజ్ ని ప్రేమ కొడుతుంది. ఆ తర్వాత ప్రేమని ధీరజ్ కొడతాడు. అదంతా తెలిసి భాగ్యం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ ప్రేమ జంట మధ్య గొడవ మొదలయింది. ఇక నెక్స్ట్ ఆ నర్మద.....ఇక సీన్ కట్ చేస్తే నర్మదకి అమూల్య, విశ్వ కనపడాలని భాగ్యం ఉహించుకొని చెప్తుంది. నర్మదకి అమూల్య, విశ్వ కన్పిస్తారు అది చూసి సాగర్ కి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి త్వరగా రమ్మని సాగర్ కీ ఫోన్ లో చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: కాశీ వర్సెస్ స్వప్న.. వాళ్ళ నాన్న తప్పు చేయలేదని కార్తీక్ నిరూపిస్తాడా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -549 లో... నాన్న తప్పు చేశారంటే ఇక్కడ ఎవరు నమ్మరని కార్తీక్ కాన్ఫిడెంట్ గా చెప్తాడు. అది విని.. తాత నువ్వు మావయ్య తప్పు చెయ్యలేదని నమ్ముతున్నావా అని జ్యోత్స్న అడుగుతుంది. లేదని శివన్నారాయణ అంటాడు. అలాగని తప్పు చేసాడని అనుకోవడం లేదు.. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నానని శివన్నారాయణ అంటాడు.   మరొకవైపు కాశీ ఇంటికి వస్తాడు. ఇంట్లో నుండి వెళ్ళిపో మీ మావయ్య గురించి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా అని కావేరి తనపై కోప్పడుతుంది. నేను చేసింది కరెక్ట్ అందుకే ఆయన సైలెంట్ గా పోలీస్ లతో వెళ్ళిపోయాడని కాశీ అంటాడు. అయిన ఇప్పుడు ఆ జాబ్ కి రాజీనామా చేసాను. ఇంట్లో నుండి వెళ్ళమంటే చెప్పండి వెళ్ళిపోతానని కాశీ అనగానే.. నువ్వు ఉండాలి కాశీ.. మా డాడీ ఏ తప్పు చెయ్యలేదని నువ్వు వినాలని స్వప్న అంటుంది.    ఆ తర్వాత సుమిత్ర అమ్మ ఏమైనా ఫోన్ చేసిందా అని జ్యోత్స్నని దీప అడుగుతుంది. ఎందుకు మా అమ్మ గురించి అంత టెన్షన్ అని అప్పుడు కూడా దీపతో కోపంగా మాట్లాడుతుంది జ్యోత్స్న.    మరొకవైపు సుమిత్రకి టెస్ట్ చేసి డాక్టర్ లోపలికి రమ్మని దశరథ్ ని పిలుస్తాడు. తనతో పాటు సుమిత్ర కూడ లోపలకి వెళ్తుంది. మీరు రెండు రోజులు హాస్పిటల్ లో అడ్మిట్ కావాలని డాక్టర్ సుమిత్ర గురించి అనగానే నాకేం అయింది.. ఏం కాలేదు పదండి అని సుమిత్ర బయటకు వెళ్లిపోతుంది. ఏమైంది డాక్టర్ అని దశరథ్ డాక్టర్ ని అడుగుతాడు. తనకి మేజర్ ప్రాబ్లమ్ ఉన్నట్లు అనిపిస్తుంది. టెస్ట్ లకు పంపించాం.. ఆ రిపోర్ట్స్ తో పెద్ద డాక్టర్ వస్తాడు.. రిపోర్ట్స్ వచ్చాక కాల్ చేస్తామని డాక్టర్ చెప్తాడు.    ఆ తర్వాత సుమిత్ర, దశరథ్ ఇంటికి వెళ్తారు. దీప ఎదురుగా వచ్చి ఏమైంది అమ్మ అని అడుగుతుంటే.. పనిమనిషివి అమ్మగారు అనాలని పారిజాతం అంటుంది. ఆ తర్వాత రెస్టారెంట్ విషయంలో జరిగింది మొత్తం దశరథ్ కి శివన్నారాయణ చెప్తాడు. నా తండ్రి ఏ తప్పు చెయ్యలేదని నిరూపిస్తానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Podarillu: పెళ్ళి ఆగిపోతుందని మహాలక్ష్మికి నమ్మకాన్ని ఇచ్చిన చక్రి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు (Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-13లో.. మహా వాళ్లింట్లో చక్రి కారు తుడుస్తుంటాడు. అప్పుడే మహా వాళ్ళ అన్నయ్య వచ్చి.. యాదగిరిగుట్టకి వెళ్తున్నాం.. లోపల లగేజీ ఉంది తీసుకురమ్మని చెప్పగా అతను డిజప్పాయింట్ అవుతాడు. ఇక చక్రి లగేజీ తెస్తుంటే మహా వాళ్ళ నాన్న.. అతడిని ఆపి..‌ మా ఇంటికి డ్రైవర్ గా వస్తావా అని అడుగుతాడు. వస్తానని చక్రి చెప్తాడు.   మహా వాళ్ళ ఫ్యామిలీ అంతా కార్ లో వెళ్తుంటారు. దారిలో మహాకి ఇష్టమైన స్వీట్ కొనడానికి స్వీట్ షాప్ దగ్గర ఆపమంటాడు వాళ్ల నాన్న. నాకేం వద్దని  మహా అంటుంది. అయినా వినకుండా వాళ్ళంతా కార్ దిగి వెళ్తారు. ‌ఇక అదే సమయంలో చక్రి తనతో మాట్లాడతాడు. మీరేం టెన్షన్ పడకండి నేను పెళ్ళి జరగకుండా చూస్తానని మహాకి చక్రి నమ్మకంగా చెప్తాడు. నీకెందుకు.. మా నాన్నకి తెలిస్తే నిన్ను చంపేస్తాడని చక్రితో మహా అంటుంది.  ఆ తర్వాత అందరు వెళ్తారు.   ఇక రాత్రి అందరు భోజనం చేస్తుంటారు. రేయ్ ఆది రిజిస్టర్ మ్యారేజ్ కి ఎవరెవరిని పిలుద్దామని మహా వాళ్ళ నాన్న అడుగుతాడు. తింటున్న మహా వెంటనే కోపంగా లేచి నిల్చుంటుంది. ఏమైందమ్మా కూర నచ్చలేదా అని మహా వాళ్ళ నాన్న అడుగగా.. కూర నచ్చకపోతే పచ్చడి వేసుకొని తినొచ్చు.. కానీ భర్తే నచ్చకపోతే జీవితాంతం భరించాల్సిందేగా అని మహా అంటుంది. నువ్వు అతడిని నెగెటివ్ గా చూడటం మానెయ్యాలి.. అతను బాగా చూసుకుంటాడని మహాని వాళ్ళ‌ నాన్న కన్విన్స్ చేస్తాడు. దాంతో మహా కోపంగా వెళ్ళిపోతుంది.   మరోవైపు చక్రి బయట ఉంటాడు. వీళ్ళు అన్నం పెడతారా.. బయటకు వెళ్ళి తినేసి రావాలా అని చక్రి ఆకలితో అటు ఇటు తిరుగుతుంటాడు. ఇంతలో మహా బాధతో బయటకు వచ్చి కూర్చుంటుంది. ఇక తన దగ్గరకి చక్రి వచ్చి.. నేను బయటకి వెళ్ళి తిని రావాలా.. పెడతారా లేదా అని అడుగుతాడు. తినలేదా అని మహా అడుగుతుంది. లేదని చక్రి అనగానే మహా లోపలికి వెళ్లి అన్నం , చాపల పులుసు, చాపల ఫ్రై తీసుకొని వస్తుంది. ఇక అది తింటూ మహాకి సపోర్ట్ గా మాట్లాడతాడు. నీ రిజిస్టర్ మ్యారేజ్ అవ్వకుండా నేను చూసుకుంటా.. మీరు నా కోసం ఇంత చేశారు.. నేను ఇది చేయలేనా అంటూ మహాకి నమ్మకం కలిగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: అప్పు విషయంలో ధాన్యలక్ష్మి మంచిగా మారుతుందా?

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -912 లో... అప్పు తనకి తెలియకుండా కేసు ఇన్వెస్టిగేషన్ చేసిందని ధాన్యలక్ష్మి కోపంగా ఉంటుంది. సారీ అత్తయ్య నేను చేసింది తప్పేనని ధాన్యలక్ష్మితో అప్పు అంటుంది. నేను క్షమించను.. నన్ను ఇంత మోసం చేస్తారా ఇక నువ్వు ఎప్పుడు పోలీస్ జాబ్ చెయ్యడానికి వీలు లేదని ధాన్యలక్ష్మి చెప్పగానే అప్పు బాధపడుతుంది.    అప్పు తన గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. అప్పుడే తన దగ్గరికి కావ్య, రాజ్ వెళ్లి నువ్వు ఆ కేసు గురించి నిర్ణయం తీసుకోవడంలో మా వంతు పాత్ర కూడా ఉంది. అందుకే ఈ ప్రాబ్లమ్ ని మేమే సాల్వ్ చేస్తామని అప్పుతో రాజ్ చెప్తాడు.    ఆ తర్వాత రాజ్ యాడ్ గురించి ప్రమోషన్ చేస్తున్న విషయం ఇంట్లో చెప్తాడు. ఎప్పుడు ఇలా ప్రమోషన్ చెయ్యలేదు కదా ఈసారి ఏంటని సీతారామయ్య అడుగుతాడు. మేం కేరళ వెళ్లడం వల్ల ఆఫీస్ లో కొంత నష్టం వచ్చింది. అందుకేనని కావ్య చెప్తుంది. అలా ప్రమోషన్ కి బదులు రాహుల్ లాగా క్లయింట్ కి డిస్కౌంట్ ఇస్తే సరిపోతుంది కదా అని స్వప్న అనగానే అలా ఏం వద్దని రాజ్ చెప్తాడు. అలా చేస్తే రాహుల్ ని ఫాలో అయినట్లు ఉంటుందని అనుకుంటున్నాడని రుద్రాణి అంటుంది. అదేం కాదు రాహుల్ లా ఒకసారి చేస్తే ప్రతిసారీ అలాగే చెయ్యాలి  లేదంటే నమ్మకం పోతుందని రాజ్ అంటాడు.    మరొకవైపు ధాన్యలక్ష్మి, అప్పుకి టిఫిన్ ఇస్తుంది. ఇది అయిన నేను చెప్పినట్టు చేస్తావా లేక నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఆ రోజు నేను వచ్చినప్పుడు బెడ్ పై పడుకుంది ఎవరని ధాన్యలక్ష్మి అడుగగా మావయ్య అని అప్పు చెప్తుంది. ఇందులో ఆయన భాగం కూడా ఉందా అని ధాన్యలక్ష్మి అంటుంది. అదంతా రాజ్, కావ్య, ఇందిరాదేవి విని ముగ్గురు కలిసి ఒక ప్లాన్ చేస్తారు.   ఎప్పుడూ అన్నదానం జరిపించే పంతులు ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తాడు. అతనికి డబ్బులు ఇచ్చి ఈ నెల అన్నదానం చెయ్యమని చెప్తుంటే.. వద్దని ఇందిరాదేవి ఆపుతుంది. ఎందుకు అత్తయ్య నేను చేసేది మంచి పనే కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వు చేసేది మంచి పని అయితే మాత్రం నాకు నచ్చనవసరం లేదా అని ఇందిరాదేవి అంటుంది. అవసరం లేదని ధాన్యలక్ష్మి అనగానే నీ కోడలు విషయంలో అలా ఎందుకు ఆలోచించడం లేదు.. తను చేసింది మంచి పనే కదా అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు. ఇందులో దాచడం ఏముంది దాని మామ, అమ్మ కలిసి కావాలనే చెడగొడుతున్నారని నారాయణ అంటాడు. బావ ఇలా ప్రతీది క్యాన్సిల్ అవుతుందంటే మనిద్దరికే రాసి పెట్టి ఉన్నట్టుందని మాధవతో గాయత్రి అనగానే ముందు వెళ్లి మీ వాళ్ళని ఒప్పించమని గాయత్రిని నారాయణ కోప్పడతాడు. మరొకవైపు ప్రతాప్, భూషణ్ ఇంటికి వస్తాడు. మహా ఎలా వుంది అని ఆదిని అడుగుతాడు భూషణ్. మహా పెళ్ళి అంటే ఇష్టం లేదంటుందని అతను చెప్తాడు. ఆ తర్వాత ప్రతాప్ తన కూతురు మహా దగ్గరికి వెళ్తాడు. ఎప్పటిలాగానే నాకు పెళ్లి ఇష్టం లేదు నాన్న అని చెప్తుంది కానీ అతను వినిపించుకోడు. మరుసటి రోజు అంకుల్ పెళ్లి అయ్యాక వీసా అప్లై చేస్తే ఎక్కువ టైమ్ పడుతుంది. ముందే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకొని వీసా అప్లై చేసుకోవాలనుకుంటున్నా.. పెళ్లి మీరు అన్న టైమ్ కి చేసుకుంటానని భూషణ్ అనగానే ప్రతాప్ మొదట వద్దని అన్నా తర్వాత ఒప్పుకుంటాడు. నేను ప్రిపేర్ గా లేనని మహా అంటుంది. అయిన ఎవరు వినరు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో కావాలని భూషణ్ అడుగుతాడు. షాపింగ్ కీ వచ్చాను అవన్నీ వెంట తీసుకొని వస్తానా అని మహా కోపంగా మాట్లాడుతుంది. కూల్ మహా ఇక్కడ కూడా ఫోటో తీసుకోవచ్చని హారిక అంటుంది. నాకు తెలిసిన ఫోన్ షాప్ ఉందని చక్రి ఎంట్రీ ఇస్తాడు. తనని తీసుకొని వెళ్ళమని హారిక చెప్తుంది. మహాని తీసుకొని చక్రి వెళ్తాడు. దారిలో తన మాటలతో మహాని చక్రి ఇర్రిటేట్ చేస్తాడు. మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా మేడమ్ అని అడుగుతాడు. అదంతా నీకు ఎందుకని మహా అంటుంది. వాళ్ళు అయిన అర్థం చేసుకోలేదు వీడు అర్థం చేసుకున్నాడని మహా అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam Serial: శకుంతల మనసు మార్చాలని చూస్తున్న ఇషిక, వీరు.. గంగ ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -149 లో.....గంగ ప్రాణాలకి తెగించి మరి కుటుంబ పరువు కాపాడిందని పెద్దసారు అంటాడు. అప్పుడే గంగని తీసుకొని రుద్ర వస్తాడు. దాంతో పెద్దసారు హ్యాపీగా ఫీల్ అవుతు.. ఈ ఇంటి కోడలు వస్తుంది దిష్టి తియ్యండి అని ప్రీతీకి చెప్పగా ప్రీతీ నువ్వు కడుపుతో ఉన్నావ్. నువ్వు తియ్యకని శకుంతల ఆపుతుంది. అయితే ఇందుమతి నువ్వు తియ్ అని పెద్దసారు అంటాడు. తను శకుంతలకి భయపడుతుంది. మీరు ఎవరు తీయకండి అని పెద్దసారు వెళ్లి గంగకి దిష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత రుద్ర, గంగ పక్కనే ఉండి తన బాగోగులు చూసుకుంటాడు. తనకి దగ్గర ఉండి టిఫిన్ తినిపిస్తాడు. నేను తింటుంటే ఎవరైనా చూస్తే నాకు దిష్టి తగులుతుందని గంగ అంటుంది. మరి చూడకుండా ఎలా తినిపిస్తారని రుద్ర అంటాడు. అంటే మీరు కాదు అక్కడ అని డోర్ దగ్గరున్న ఇషికని చూపిస్తుంది. ఇషిక లోపలికి వచ్చి గంగకి ఏమైనా అవసరమో అడగడానికి వచ్చానని కవర్ చేస్తుంది. మరొకవైపు వీరుకి స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది. ఫుడ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేసింది మీరే కదా ఒకసారి స్టేషన్ కి రావాలని చెప్తారు. దాంతో వీరు టెన్షన్ పడతాడు. అప్పుడే గంగ వచ్చి ఆ ఫుడ్ ఫెస్టివల్ లో పాయిజన్ పోసింది నువ్వే అని వీరుని అనగానే షాక్ అవుతాడు. తొందరలోనే నీ నిజస్వరూపం భయటపెడుతానని వీరుకి గంగ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. ఈ ఇంట్లో గంగ ప్లేస్ పర్మినెంట్ అయ్యేలా ఉంది. శకుంతల అత్తయ్య మనసు మారక ముందే తన మనసులో విషం నింపాలని ఇద్దరు అనుకుంటారు. ఇద్దరు శకుంతల దగ్గరికి వెళ్తారు. గంగ అలా చేసిందంటే తన నిజాయతీని చూపెట్టాలనుకుంటుందేమోనని గంగకి పాజిటివ్ గా శకుంతల మాట్లాడగానే ఇద్దరు షాక్ అవుతారు. అసలు గంగ ఎందుకు వచ్చింది మారువేశంలో వచ్చి తనే ఫుడ్ లో విషం కలిపి కావాలనే డోస్ తక్కువ వేసుకుని తనే ఫుడ్ తిందని ఇషిక చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది. మేడమ్ లోపలికి వచ్చి కాఫీ తాగి వెళ్ళండి అని ఆవిడ అనగానే అప్పు కాదనలేక వెళ్తుంది. లోపల రేణుక భర్తతో ఆవిడ ఉన్న ఫోటో చూసి అప్పు షాక్ అవుతుంది. అతను ఎవరని అప్పు అడుగగా నా భర్త అని చెప్తుంది. పెళ్ళి జరిగి ఎన్ని నెలలు అవుతుందని అప్పు అడుగగా ఆరు నెలలవుతుంది. నా మొదట భర్త చనిపోయాడు‌ నన్ను నా పాపని బాగా చూసుకుంటాడని మళ్ళీ తనని పెళ్లి చేసుకున్నానని ఆవిడ చెప్పగానే అంటే భర్త లేని వాళ్లని టార్గెట్ చేసి పిల్లలను ఏం చేస్తున్నాడని అప్పుకి డౌట్ వచ్చి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి ఆ రేణుక భర్తని స్టేషన్ కి తీసుకొని రండి అని వెళ్ళిపోతుంది. మరొకవైపు చేసిన యాడ్ షూట్ వస్తుంది. అది ప్లే చేసుకొని అందరు చూస్తారు. యాడ్ బాగా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంట్రా యాడ్ ఫెయిల్ అవుతుందన్నావ్.. మరి ఇదేంటని రాహుల్ తో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రేణుక భర్త అశోక్ ని ఇంటరాగేషన్ చేస్తుంది. అశోక్ భయపడి నిజం చెప్తాడు. నేను చిన్న పిల్లలని వేరే వాళ్ళకి అమ్మేస్తాను.. వాళ్ళ ఆర్గాన్స్ తీసుకుంటారు.. అందుకే రేణుక కూతురిని కిడ్నాప్ చేసాను.. ఆపరేషన్ కి టైమ్ పడుతుందంటే నా దగ్గర దాచానని అశోక్ చెప్పగానే అప్పు అతన్ని కొడుతుంది. ఆ తర్వాత రేణుక వస్తుంది. తనకి వాళ్ళ పాపని అప్పగిస్తుంది. మీడియా వాళ్ళు వస్తారు. నా పాప దొరికిందంటే కారణం అపూర్వ మేడమ్ అని రేణుక చెప్తుంది. అది న్యూస్ లో రావడం రుద్రాణి చూసి ఇంట్లో వాళ్ళకి చూపిస్తుంది. అప్పుడే అప్పు,కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. నన్ను ఇంత మోసం చేస్తారా.. ఇక అప్పు ఉద్యోగం చెయ్యడానికి వీలు లేదని ధాన్యలక్ష్మి తెగేసి చెప్తుంది. తరువాయి భాగంలో రాజ్, కావ్య కలిసి ధాన్యలక్ష్మికి అప్పుపై ఉన్న కోపాన్ని పోగొట్టేలా చెయ్యాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: జ్యోత్స్నకి కాశీ హెల్ప్.. శివన్నారాయణ మాటతో వాళ్ళిద్దరూ షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -548 లో.....కాశీ స్టేషన్ నుండి బయటకు వచ్చి.. వైరాకి ఫోన్ చేస్తాడు. మీరు చెప్పినట్టే చెప్పాను కానీ మావయ్యకి బెయిల్ రాదట.. మా బావ టెన్షన్ పడుతున్నాడని కాశీ అనగానే శ్రీధర్ మీ మావయ్యనా.. కార్తీక్ నీ బావనా అని వైరా షాక్ అవుతాడు. వెంటనే నాకెందుకు చెప్పలేదని అంటాడు. చెప్పే అవసరం రాలేదని కాశీ అంటాడు. సరే నువ్వు ఏం తప్పు చెయ్యలేదు భయపడకు అని కాశీకి ధైర్యం చెప్తాడు వైరా. అప్పుడే కాశీ దగ్గరికి కార్తీక్ వస్తాడు. పర్ ఫెక్ట్ గా మా నాన్నమాటలు ఎందుకు రికార్డు చేసావని కార్తీక్ అడుగుతాడు. నా దంట్లో ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ ఉందని కాశీ అనగానే అయితే ఇప్పుడు మాట్లాడిన కాల్ రికార్డు చూపించమని కార్తీక్ అడుగుతాడు. డిలీట్ చేసానని చెప్తూ కాశీ భయపడుతాడు. కొడుకు దూరంగా ఉన్నాడని అల్లుడిలో కొడుకుని చూసుకుందామనుకొని తన దగ్గర పెట్టుకున్నాడని కార్తీక్ అంటాడు. నేను జాబ్ కి రిజైన్ చెయ్యాలి అనుకుంటున్నానని లెటర్ ఇస్తాడు కాశీ. ఆఫీస్ లో ఇవ్వమని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ కి కాంచన ఫోన్ చేసి శ్రీధర్ గురించి టెన్షన్ పడుతుంది. నాన్న తప్పు చేసాడంటే నువ్వు నమ్ముతున్నావా అని కార్తీక్ అడుగుతాడు. లేదని కాంచన అంటుంది. నేను నాన్నని బయటకు తీసుకొని వస్తానని కార్తీక్  అంటాడు. మరొకవైపు జ్యోత్స్న తప్పుడు లెక్కల ఫైల్స్ అన్ని కాశీ తీసుకుంటాడు. అప్పుడే జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. అక్క ఇన్ని రోజులకి ఒక పెద్ద హెల్ప్ చేసావ్.. నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను.. తప్పుడు లెక్కల ఫైల్స్ అన్నీ నేను తీసుకున్న కలిసినప్పుడు ఇస్తానని చెప్పగానే థాంక్స్ తమ్ముడు.. ఇక నుండి నువ్వు నా సొంత తమ్ముడు అని జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్, శివన్నారాయణ ఇంటికి వస్తారు. కార్తీక్ దగ్గరికి దీప వచ్చి మాట్లాడుతుంది. ఏంటి బావ అన్నీ ఒకేసారి.. ఇంకా అమ్మ వాళ్ళు హాస్పిటల్ నుండి రాలేదు.. మావయ్య గారు స్టేషన్ లో అని బాధపడుతుంది. కాశీ గురించి చెప్తే ఇంకా బాధపడుతావని చెప్పట్లేదని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత రెస్టారెంట్ నుండి మేనేజర్ వచ్చి ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి ఫుడ్ లో కల్తీ జరిగిందని ఫైన్ వేశారని చెప్తాడు. దాంతో అంతటికి కారణం శ్రీధర్ అని పారిజాతం, జ్యోత్స్న తిడుతారు. మీరు ఏమనుకున్నా పట్టించుకోను.. మా నాన్న తప్పు చెయ్యలేదని నమ్మాల్సిన వాళ్ళు నమ్మితే చాలని కార్తీక్ అనగానే తాత నువ్వు, మావయ్య తప్పు చెయ్యలేదని నమ్ముతున్నావా అని జ్యోత్స్న అనగానే లేదని శివన్నారాయణ అంటాడు. దాంతో కార్తీక్, దీప షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు. కాసేపటికి ప్రేమ, నర్మద లోపలికి వస్తారు. షీ ఈజ్ అప్పాయింటెడ్ అని ప్రిన్సిపల్ అనగానే ప్రేమ, నర్మద షాక్ అవుతారు. అసలు జరిగింది ఏంటంటే భాగ్యం, ఆనందరావు కలిసి ఇంగ్లీష్ టీచర్ ని తీసుకొని వచ్చి కిటికీ దగ్గర ఉంచి బ్లూ టుత్ ద్వారా ప్రిన్సిపల్ అడిగే క్వశ్చన్స్ కి ఇంగ్లీష్ టీచర్ సమాధానం చెప్తుంటే శ్రీవల్లి అతను చెప్పినట్లు మాట్లాడుతుంది. ఆ తర్వాత అసలు ఎలా తీసుకున్నారని ప్రేమ, నర్మద అనుకుంటారు. అప్పుడే కిటికీ లో నుండి భాగ్యం వాళ్ళని చూస్తారు. దాంతో వాళ్లకి మొత్తం అర్థమవుతుంది. నువ్వు ఏం చేసావ్ అర్థం అయింది అక్క.. కానీ ఈ రోజు ఒక్కరోజు టార్చర్ ఉండేది కానీ సెలెక్ట్ అయ్యావ్ కాబట్టి ఇక రోజు టార్చరే అని ప్రేమ, నర్మద అంటారు. మరొకవైపు తిరుపతి తన డ్రీమ్ గర్ల్ ని ఉహించుకొని డాన్స్ చేస్తుంటే ధీరజ్ వస్తాడు. ఈ వయసులో ఇదేంటని అంటాడు. నా ప్రేమ నీకు అర్థం కాదని తిరుపతి అంటాడు. ధీరజ్ అటుగా వెళ్తుంటే అమూల్య, విశ్వ మాట్లాడుకోవడం చూసి ధీరజ్ షాక్ అవుతాడు. ధీరజ్ దగ్గరికి వెళ్లేసరికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరొకవైపు శ్రీవల్లి క్లాస్ కి వెళ్తుంది. తనకి ఏం చెయ్యాలో అర్థం కాదు.. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే శ్రీవల్లికి ఇంకా భయం వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శివాజీ కామెంట్స్ పై చిన్మయి ఫైర్..కాలికి మెట్టెలు పెట్టుకో..!

ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  హీరో శివాజీ రీసెంట్ గా హీరోయిన్ ల వస్త్రాల గురించి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు శివాజీ కామెంట్స్ మీద చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయ్యారు. ఆమె ఒక పోస్ట్ పెట్టారు. "తెలుగు నటుడు శివాజీ 'దరిద్రపు ముండా' వంటి పదాలను ఉపయోగిస్తూ హీరోయిన్ లు తమ సామానులు కవర్ చేసుకోవడానికి చీరలు ధరించాలి అంటూ  అనవసరమైన సలహా ఇవ్వడం ఏమిటి. నటుడు శివాజీ ఒక అద్భుతమైన చిత్రంలో విలన్‌గా నటించాడు మరియు చివరికి  హీరోగా మారాడు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇవన్నీ ప్రొఫెషనల్ ప్రదేశాలు..అక్కడ ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా. ఆయన జీన్స్,  హూడీలు వేసుకోకుండా ధోతీలు మాత్రమే కట్టుకుని భారతీయ సంస్కృతిని అనుసరించాలి కదా. బొట్టు పెట్టుకోవాలి అలాగే అతనికి వివాహం అయ్యుంటే పెళ్లి ఐనందుకు గుర్తుగా కంకణం, కాలికి మెట్టెలు ధరించాలి కదా. ఇక్కడ మహిళల్ని ఎంతో ఘోరంగా చూస్తున్నారో" అంటూ ఆమె పెట్టిన ఒక వ్యంగ్యాత్మక ఘాటైన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  https://twitter.com/Chinmayi/status/2003308949257470105

Podharillu: మహాని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పిన భూషణ్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -11 లో....మహా దృష్టిలో పడడానికి చక్రి చాలా కష్టపడుతాడు. అన్ని రకాల షర్ట్స్ వేసుకొని వచ్చి మరి ఇంప్రెస్ చెయ్యాలని చూస్తే కనీసం తన వంక చూడను కూడా చూడదు మహా. హారిక ఒక చీర సెలక్ట్ చేస్తే రెడ్ కలర్ అంటే నచ్చదు వాడికి అని భూషణ్ వాళ్ళ అమ్మ అనగానే మంచి పాయింట్ దొరికిందని వెళ్లి నాకు ఈ రెడ్ కలర్ చీర బాగా నచ్చిందని మహా అంటుంది. ఇది మా వాడికి నచ్చదని వాళ్ళ అమ్మ అంటుంది. పర్లేదులే అమ్మ కట్టుకునేది తనే కదా.. తన ఇష్టం అనగానే మహా షాక్ అవుతుంది. మరొకవైపు మాధవ మేస్త్రి పనికి వెళ్తాడు. అక్కడ అందరు నీ పెళ్లి ఫిక్స్ అయిందా అని అడుగుతుంటే మాధవ ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు వాళ్ళ చెల్లి, అన్న దగ్గరికి నారాయణ వెళ్తాడు. నా కొడుకుకి వచ్చిన సంబంధం కాన్సిల్ చేస్తారా అని గొడవకి దిగుతాడు. మాధవకి విషయం తెలిసి వెళ్లి నారాయణని తీసుకొని వస్తాడు. ఆ తర్వాత నిన్నటి నుండి పెళ్లి అంటున్నారు ఎవరికి అని ఆదిని చక్రి అడుగుతాడు. నా చెల్లికి అని ఆది చెప్తాడు. హారిక అనుకొని కంగ్రాట్స్ చెప్తాడు. అయ్యో నాకు పెళ్లి అయింది. ఆయనే నా భర్త అని హారిక చెప్తుంది. మహాని చూపించి తనే నా చెల్లి.. ఈ పెళ్లి తనకే అని అనగానే చక్రి షాక్ అవుతాడు. ఆ తర్వాత భూషణ్ తో నువ్వు మాట్లాడమని మహాకి చెప్తుంది హారిక. భూషణ్ దగ్గరికి ఆది వెళ్లి బావ మీరు ఇద్దరు అలా బయటకు వెళ్లి ప్రశాంతంగా మాట్లాడుకొండి అని చెప్తాడు. మహా, భూషణ్ ని చక్రి బయటకు తీసుకొని వెళ్తాడు. నాకు జాబ్ చెయ్యాలని ఉందని తన డ్రీమ్స్ అన్ని మహా చెప్తుంటే.. అవసరం లేదు నాకు నచ్చింది చేస్తూ ఇంట్లో ఉంటే చాలని భూషణ్ కోప్పడతాడు. తరువాయి భాగంలో వీసాకీ అప్లై చెయ్యాలంటే మహాని ముందు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని భూషణ్ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: గంగ కోసం ఆ పని చేసిన రుద్ర.. వీరుపై శకుంతల ఫైర్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -148 లో.. గంగని నమ్మనందుకు రెగ్రీట్ గా ఫీల్ అవుతాడు రుద్ర. గంగ త్వరగా కోలుకోవాలని దేవుడికి మొక్కుకుంటాడు. మరొకవైపు వీరు ఫుడ్ ఫెస్టివల్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు నువ్వు చేసుకున్నావ్ ఇంత పెద్ద తప్పు ఎలా జరిగిందని వీరుపై శకుంతల కోప్పడుతుంది. మరొకవైపు రాత్రంతా నిద్రపోకుండా రుద్ర, గంగ పక్కనే ఉంటాడు. గంగ స్పృహలోకి రాగానే రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా కోసం మీరు ఇంత చేశారు చాలా థాంక్స్ అని గంగ అంటుంది. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నువ్వు అందులో విషం ఉందని నిరూపించడానికి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవాలా అని రుద్ర అంటాడు. మరి నాకు వేరే దారి కన్పించలేదు సర్ అని గంగ అంటుంది. ఆ తర్వాత గంగకు అన్ని టెస్ట్ లు చేసి డిశ్చార్జ్ చెయ్యడానికి రుద్రకి ఫామ్ ఇస్తారు. అందులో పేషెంట్ కి ఉన్న సంబంధం ఏంటని ఉంటుంది. అక్కడ రుద్ర ఆలోచిస్తాడు. మీరు సర్, నేను ఎంప్లాయి కదా అని గంగ అంటుంది కానీ రుద్ర హస్బెండ్ అని రాస్తాడు. అలా ఎందుకు రాసారని గంగ అనగానే.. ఏ నీ భర్తని కాదా అని రుద్ర అంటాడు. అంటే మీరు ఏం చెప్పినా అడ్డుచెప్పొద్దా అని గంగ అంటుంది. ఆ తర్వాత వదినని మన ఇంటికి తీసుకొని వెళదామని వంశీ అనగానే.. వద్దు మా ఇంటికి వెళతానని గంగ అంటుంది. అవసరం లేదు మన ఇంటికి తీసుకొని వెళదామని రుద్ర అంటాడు. మరుసటిరోజు ఉదయం రాత్రంతా నిద్ర మానుకొని గంగ కోసం లక్ష్మీ చూస్తుంది. అప్పుడే శ్రీను వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. పోనీలే గంగని ఇప్పటికైనా తన ఇంటికి తీసుకొని వెళ్లారని లక్ష్మీ అనుకుంటుంది. మరొకవైపు గంగ గురించి శకుంతల తప్పుగా మాట్లాడుతుంటే గంగ మన కోసం త్యాగం చేసింది. అది గుర్తించకుండా ఇలా అంటావేంటని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: యాడ్ పూర్తిచేసిన రాజ్.. అప్పుని డ్యూటీ చేయవద్దని చెప్పిన ధాన్యలక్ష్మి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -910 లో..... స్వరాజ్ జ్యువలరీ డిజైన్స్ ప్రమోషన్ షూట్ కోసం డైరెక్టర్ ని పిలుస్తాడు రాజ్. డైరెక్టర్ గా వచ్చింది రాహుల్ పంపిన అతనే.. అతనెవరో కాదు పరోటాలు చేయడంలో స్పెషలిస్ట్. యాడ్ షూట్ చెయ్యమంటే కిచెన్ లో పనిమనిషి పరోటా చేస్తుంటే పరోటా చెయ్యడం అలా కాదని పరోటా చేస్తుంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. వాడు డైరెక్టర్ కాదు పరోటా స్పెషలిస్ట్ లాగా ఉన్నాడు.. డైరెక్టర్ కాదని ప్రకాష్ అంటాడు. ఎవడ్రా నువ్వు అని అతన్ని బెదిరిస్తాడు. ఏదో డబ్బులకి కక్కుర్తి పడ్డానని అతను పారిపోతాడు. అయిపోయింది అంతా అయిపోయింది ఇక టైమ్ లేదని రాజ్ డిస్సపాయింట్ అవుతాడు. అప్పుడే కావ్య వచ్చి మీకు ఎలా యాడ్ చెయ్యాలో ఆలోచన ఉంది.. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు.. ఇద్దరు కలిసి యాడ్ పూర్తి చెయ్యండి అని కావ్య అనగానే నాకేం తెలియదని రాజ్ అంటాడు. సర్ నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎక్స్పీరియన్స్ ఉంది. నన్ను నమ్మండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అసిస్టెంట్ డైరెక్టర్ అనగానే రాజ్ సరే అంటాడు. ఇక అందరు కలిసి షూట్ కి రెడి అవుతారు. సీతారామయ్య, ఇందిరాదేవి ఒక జంటగా సుభాష్, అపర్ణ ఒక జంటగా, ధాన్యాలక్ష్మి, ప్రకాష్ ఒక జంటగా, కావ్య రాజ్ ఒక జంటగా.. కళ్యాణ్ సింగిల్ గా వచ్చి యాడ్ పూర్తి చేస్తారు. దాంతో రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనం అనుకున్నది ఏంటి.. అయ్యేది ఏంటని రాహుల్ తో రుద్రాణి అంటుంది. అదేం లేదు మమ్మీ ఈ యాడ్ సక్సెస్ కాదు.. వాళ్ళకి దాని గురించి ఏం తెలియదు కదా అని రాహుల్ అంటాడు. మరొకవైపు త్వరగా యాడ్ పంపించండని డైరెక్టర్ కి రాజ్ ఫోన్ చేసి చెప్తాడు. తరువాయి భాగంలో పాప విషయంలో అప్పు కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి సక్సెస్ అవుతుంది. అది న్యూస్ లో రావడం చూసి ధాన్యలక్ష్మి షాక్ అవుతుంది. ఇక అప్పు ఉద్యోగం చెయ్యనవసరం లేదని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: శ్రీధర్ జైలుకి వెళ్ళడానికి కారణం కాశీనే.. కార్తీక్ షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -547 లో....శ్రీధర్ ని పోలీసులు అరెస్ట్ చేసిన వీడియో కాంచనకి పారిజాతం పంపిస్తుంది. అది చూసి కాంచన షాక్ అవుతుంది. కాంచనకి పారిజాతం ఫోన్ చేస్తుంది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్లున్నావ్.. నువ్వు నీ తండ్రి కడుపున ఎందుకు పుట్టావే.. ఆయన పరువు తియ్యడానికి పుట్టావ్.. నీ కోడలు ఇచ్చిన సలహా వల్ల ఇదంతా జరిగిందని పారిజాతం ఇష్టమొచ్చినట్లు తిడుతుంటే తనపై కాంచన కోప్పడుతుంది. మరొకవైపు దీప దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. దీప గురించి తప్పుగా మాట్లాడుతుంది. అప్పుడే పారిజాతం ఎంట్రీ ఇస్తుంది. బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటారు. నువ్వు ఇంట్లో అడుగుపెట్టగానే శ్రీధర్, కాంచన దూరం అయ్యారు. ఇప్పుడు తన కడుపులో బిడ్డ ఉందని తెలిసింది శ్రీధర్ స్టేషన్ కీ వెళ్ళాడు అని పారిజాతం అంటుంది. నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడొద్దని దీప కోప్పడుతుంది. ఆ తర్వాత వైరాకి జ్యోత్స్న ఫోన్ చేసి ప్లాన్ ఎక్కడికి వచ్చిందని అడుగుతుంది. ఒకే అయిందని వైరా చెప్తాడు. నేను సీఈఓ కాగానే ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ మీకే అని జ్యోత్స్న తనకి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఒరేయ్ వైరా ఒకసారి నేను సీఈఓ అవనివ్వు ఆ తర్వాత నీతో నాకేంటి రా అని జ్యోత్స్న కన్నింగ్ గా ఆలోచిస్తుంది. మరొకవైపు శ్రీధర్ ని బెయిల్ పై విడిపించడానికి శివనారాయణ, కార్తీక్ ఇద్దరు లాయర్ ని తీసుకొని వెళ్తారు. బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని ఇన్‌స్పెక్టర్ చెప్తాడు. ఆయన ఫుడ్ పాడైందని చెప్పినా వినకుండా డిస్టిబ్యూట్ చెయ్యమని చెప్పారట.. అందుకు సంబంధించిన ఆడియో అని ఇన్‌స్పెక్టర్ వినిపిస్తాడు. అందులో సర్ ఫుడ్ మిగిలిపోయిందని కాశీ అంటాడు. డిస్టిబ్యూట్ చెయ్యండి అని శ్రీధర్ చెప్తాడు. ఆ ఆడియో ఎవరు పంపారని కార్తీక్ అనగానే అప్పుడే కాశీ వస్తాడు. తనే అని ఇన్‌స్పెక్టర్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. వైరా గారు చెప్పినట్లు మాట్లాడానని కాశీ అనుకుంటాడు. అసలు ఏమైందని కార్తీక్ అడుగుతాడు. నేను జరుగింది చెప్పాను బావ అని కార్తీక్ అంటాడు. విన్నారుగా అయనే ఫుడ్ డిస్టిబ్యూట్ చెయ్యమని చెప్పారని తన పిఏనే ఒప్పుకున్నాడు అని ఇన్‌స్పెక్టర్ చెప్తాడు. లాయర్ వెళ్ళిపోతాడు. ఒరేయ్ నువ్వు కాశీని ఏం అనకు తనని దారిలో పెట్టాలని చూస్తే తనకే శత్రువు అయ్యానని కార్తీక్ కి చెప్తూ శ్రీధర్ బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.