బిగ్ బాస్ ఫ్యామిలీ ట్రీ గురించి ఇమ్మానుయేల్ కామెంట్స్

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ ఆదివారం బిబి 9 స్పెషల్ థీమ్ తో రాబోతోంది. ఐతే ఇందులో బిగ్ బాస్ 9 లో ఉన్న హౌస్ మేట్స్ తో ఒక ఫ్యామిలీ ట్రీని రెడీ చేశారు. ఒక బోర్డు మీద హౌస్ మేట్స్ ఇమేజెస్ ని పేస్ట్ చేసారు.    ఇక ఈ ఫ్యామిలీ ట్రీలో ఎవరు ఏంటో ఇమ్మానుయేల్ కామెడీగా చెప్పుకొచ్చాడు. భరణి గారు నాన్న, సంజన అమ్మ. భరణి గారికి సంజన గారికి సంబంధం లేదు వేరే అని చెప్పుకొచ్చాడు ఇమ్మానుయేల్. తనూజ కూతురు, ఇమ్మానుయేల్ కొడుకు అని రాసాడు. వెంటనే హరి- అవినాష్ కలిసి తనూజ, ఇమ్మానుయేల్ అక్క తమ్ముళ్లు అవతారన్నమాటా అన్నారు. ఈ వృక్షంలో బావ డీమన్ పవన్, మరదలు రీతూ చౌదరి అని రాసాడు. "డీమన్ పవన్ నువ్వే బావంటరోయ్" అని శ్రీముఖి అనేసరికి రీతూ తెగ సిగ్గు పడిపోయింది. "బావా నాకు కావాలి పాలకోవా" అంటూ అడిగేసింది రీతూ. "అంటావ్ గా అనురా నేనున్నాగా నన్ను తిను అని" ఇమ్మానుయేల్ డీమన్ కి హింట్ ఇచ్చాడు.    ఇక ఫామిలీ ట్రీలో రాము రాథోడ్ అంటే ఇంట్లోంచి పారిపోయిన తమ్ముడు, కళ్యాణ్ పడాలా పక్కింటి కుర్రోడు అనేసరికి "మీ ఇంట్లో కూర్చుని లైన్ వేస్తాడా" అని హరి అడిగాడు. "ఈయనకు భరణి గారి ఇంటి మీదనే కన్ను" అంటూ ఇమ్మానుయేల్ చెప్పాడు.    తరువాత ప్రియాశెట్టి బాబాయ్ అంటుంది కాబట్టి రెండో కూతురు అని రాసాడు. "రెండో కూతురు అంటే టాప్ 5 వరకు రావాలి కదా" అని శ్రీముఖి అడిగింది. "ఫస్ట్ కూతురు తనూజ కోసం రెండో కూతురు వచ్చేసింది" అని చెప్పాడు ఇమ్మానుయేల్. ఇక ఈ ఫ్యామిలీ ట్రీలో ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఎవరో ఏంటో తెలియాలంటే ఆదివారం ప్రసారం అయ్యే ఈ షో చూడాల్సిందే.  

మా ఇంటి రెంట్ కూడా మా అక్కే కట్టేది.. అక్క నాకు అమ్మ ఐపోయింది!

  బిబి జోడి సీజన్ 2 కి సంబంధించి లేటెస్ట్ గా మరో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఆర్జే చైతు - కీర్తి భట్, సాయి శ్రీనివాస్ - నయని పావని జోడీస్ స్టేజి మీదకు వచ్చాయి. "సదా మేడం మ్యాచింగ్ మ్యాచింగ్ బ్లు బ్లూ" అంటూ సదాతో ఫన్ చేసాడు ఆర్జే చైతు. "మార్క్స్ లో ఏమీ తేడా రాదు" అంటూ సదా కౌంటర్ వేసింది. "శ్రీదేవి మేడం బ్లడ్ మేడం రెడ్డు" అనేసరికి "అయ్యో" అనేసింది. "మరి సర్ " అంటూ ప్రదీప్ శేఖర్ మాస్టర్ వైపు చూపించేసరికి "వద్దు బాబు వద్దు" అనేశాడు.    తర్వాత నయనిపావని - సాయి శ్రీనివాస్ కలిసి కాండిల్ థీమ్ తో చేసిన సాంగ్ కి జడ్జ్ సదా ఫిదా ఐపోయి "నాకు రెండు కాండిల్స్ లా అనిపించలేదు.. ఒక కాండిల్ పెర్ఫార్మ్ చేసినట్టు  అనిపించింది" అంటూ చెప్పింది.    తర్వాత హోస్ట్ ప్రదీప్ సాయి శ్రీనివాస్ ని ఒక ప్రశ్న అడిగాడు. "హాయ్ నీ లైఫ్ లో వెలుగునిచ్చి నిన్ను ఇలా సపోర్ట్ చేసే పర్సన్ ఎవరు" అని అడిగాడు. " మా అక్క మా నాన్న నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇంట్లో నేనెప్పుడూ డిపెండెంట్ నే. నిజానికి మా ఇంటి రెంట్ కూడా మా అక్కే కట్టేది. మా అక్క నాకు ఒకేసారి మదర్ ఐపోయింది. ఎనర్జిటిక్ గా కనిపించాలన్న, బాగా కనిపించాలి అన్నా బాగా మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. దానికి చాలా ఖర్చు కూడా అవుతుంది. చాలామందికి తెలీదు. సో ఈ ప్రాసెస్ లో ఏ ఒక్క క్వశ్చన్ అడక్కుండా చూసుకునేది. నా లాంటి అబ్బాయిలకు వెనకాల ఇంత స్ట్రాంగ్ గా ఉండేది ఇలాంటి ఆడవాళ్లే..వి లవ్ యు" అంటూ సడెన్ సర్ప్రైజ్ గా స్టేజి మీదకు వచ్చిన వాళ్ళ అక్కను చూసి షాకయ్యాడు.  

Jayam serial: బెస్ట్ ఆర్గనైజ్ అవార్డ్ సొంతం చేసుకున్న పెద్దసారు.. పారు ప్లాన్ అదే!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -157 లో.. పెద్దసారుకి ఎవరో ఒకతను ఫోన్ చేసి ఫుడ్ ఫెస్టివల్ మీరు ఆర్గనైజ్ చేశారు కదా.. దానికి గాను మీకు బెస్ట్ ఆర్గనైజ్ అవార్డ్ వచ్చిందని చెప్పడంతో పెద్దసారు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంట్లో అందరిని పిలిచి ఆ విషయం చెప్తాడు. అప్పుడే రుద్ర వస్తుంటే అందరు కంగ్రాట్స్ అని చెప్తారు. మీ వల్లే సక్సెస్ అయింది.. మినిస్టర్ గారికి దగ్గర ఉండి మరి అన్ని ఎక్స్ ప్లెయిన్ చేసావ్.. గంగ తన ప్రాణాలు అడ్డుపెట్టి మినిస్టర్ ని కాపాడిందని పెద్దసారు అంటాడు.    ఇషిక, వీరు మీక్కూడా స్పెషల్ థాంక్స్ అని పెద్దసారు చెప్పగానే.. చేసింది ఇషిక, వీరు అయితే వాళ్ళని పొగడడం ఎందుకని శకుంతల అంటుంది. అప్పుడే పారు ఎంట్రీ ఇస్తుంది. వచ్చావా ఇంకా రాలేదేంటి అనుకున్నానని పెద్దసారు అంటాడు. ఒక గుడ్ న్యూ స్ చెప్పడానికి వచ్చాను. నేను రాబోయే ఛాంపియన్ షిప్ లో పార్టీసిపేట్ చేస్తున్నానని పారు చెప్తుంది. నేనే ఎలాగూ గెలుస్తానని పారు పొగరుగా మాట్లాడుతుంటే.. తన పొగరుని తగ్గించడానికి నేను నిన్ను ఓడిస్తానని గంగ చెప్తుంది. ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ రోజే రుద్ర, గంగల శోభనం అని పెద్దసారు చెప్తాడు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయమని ఇందుమతికి పెద్దసారు చెప్తాడు.   ఆ తర్వాత రుద్ర గదిలో ఉండగా గంగ లోపలికి వెళ్తుంది. నిన్ను ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసు కదా అని రుద్ర అనగానే తెలుసు సర్ మీ లక్ష్యం నా ద్వారా నెరవేరాలని కోరుకుంటున్నారు.. నాకు తెలుసని గంగ చాప తీసుకొని వచ్చి నేలపై పడుకుంటుంది. థాంక్స్ గంగ అని రుద్ర అంటాడు.    అప్పుడే రుద్రకి పారు ఫోన్ చేసి.. నువ్వు లేకుండా నేను ఉండను చనిపోతున్నానని ఫోన్ కట్ చేస్తుంది. రుద్ర టెన్షన్ గా మళ్ళీ కాల్ చేస్తాడు. అప్పుడు పారు తన ఫ్రెండ్ ని మాట్లాడమని చెప్తుంది. సర్ పారు డిప్రెషన్ లో ఉందని సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. మీరు ఎక్కడున్నా ఇక్కడికి రండి అని ఆమె అనగానే వస్తున్నానని రుద్ర అంటాడు. ఆమె సిటీ హోటల్ అని తను ఉండే అడ్రెస్ చెప్తుంది. రుద్ర కంగారుగా బయల్దేరతాడు. పారు తన ఫ్రెండ్ కలిసి రుద్రని ట్రాప్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Podarillu: మహా పెళ్ళికి సర్వం సిద్ధం చేసిన నాన్న ప్రతాప్.. చక్రి ఏం చేయనున్నాడు?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-19 లో.. మహాని పెళ్ళికూతురిగా ముస్తాబు చేసి తీసుకొస్తారు. తనని చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ చీరలో లక్షణంగా అచ్చం మహాలక్ష్మిలాగే ఉన్నావమ్మా అని మహా వాళ్ళ అమ్మ అనగానే అవునని వాళ్ళ నాన్న ప్రతాప్ అంటాడు. అందుకే తను బాగుండాలని మంచి సంబంధం తీసుకొచ్చారు వాళ్ళ నాన్న అని మహా వాళ్ళ అమ్మ అంటుంది. అయినా ఏం లాభం తనకి ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారని మహా వాళ్ళ వదిన హారిక అంటుంది. అంత నిష్టూరంగా ఏం మాట్లాడకమ్మా తను అక్కడ బాగుంటుందని మహా వాళ్ళ అమ్మ అంటుంది. ‌తను వెళ్ళిపోతే వెలితిగా ఉంటుందని బాధపడుతుంటాడు మహా వాళ్ళ నాన్న ప్రతాప్.    ఇక మహాకి సాయం చేయాలనుకుంటాడు చక్రి. ఇక కాసేపటికి మహా బయటకి వచ్చి చక్రితో మాట్లాడుతుంది.మొన్న రిజిస్టర్ మ్యారేజ్ చెడగొట్టినట్టు ఇది కూడా ఆపేస్తానని చక్రి అనగానే అది అవ్వదు.. ఆల్రెడీ ఇల్లంతా ముస్తాబు అయింది. మనం ఏం చేయలేమని మహా అంటుంది. ఇక అప్పుడే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకే అయిందని కంపెనీ నుండి కాల్ వస్తుంది కానీ తను రిజెక్ట్ చేస్తుంది. చక్రి ఎంత నచ్చజెప్పాలని చూసిన మహా వినదు.    మరోవైపు పెద్దోడు మాధవని కలవడానికి గతంలో పెళ్ళిచూపులు జరిగిన అమ్మాయి వస్తుంది. మీరు మా ఫ్యామిలీ అందరికి నచ్చారు. అయితే మా వాళ్ళు మిమ్మల్ని ఇంటి నుండి బయటకి రావాలని అంటున్నారు. మా ఇంట్లో కాదు బయట రూమ్ తీసుకొని ఉందాం.. మీరు నాకు నచ్చారని మాధవతో ఆ అమ్మాయి అంటుంది. కానీ మాధవ మాత్రం అలా రానని చెప్తాడు. నాకు మా నాన్న, తమ్ముళ్ళు, ఆ ఇల్లు ముఖ్యం.. మీరు స్పష్టంగా మాట్లాడారు.. మా గురించి అందరికి తెలుసు.‌ నేను మేస్త్రీని.. ఒక ఇల్లు ధృడంగా ఉండాలంటే పునాది గట్టిగా ఉండాలి.. నా కుటుంబాన్ని నన్ను అర్థం చేసుకుంటేనే నేను పెళ్ళి చేసుకుంటానని మాధవ అంటాడు.    ఇక చక్రి కార్ లో కూర్చొని ఆలోచిస్తుంటాడు. అప్పుడే కన్నా, కేశవ, మాధవ ముగ్గురు కలిసి చక్రికి కాల్  చేస్తారు. ఆ అమ్మాయి పెళ్ళి ఆగిపోయిందా.. ఏం అయిందని అడుగుతారు. అతడిని కిడ్నాప్ చేయడం వల్ల.. ఎవరో పెళ్ళి ఆపాలని చూస్తున్నారని ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి అర్థం అయింది అందుకే పెళ్ళిని మూడు రోజుల ముందుకు జరిపారని చక్రి చెప్తాడు. దాంతో ముగ్గురు డిస్సప్పాయింట్ అవుతారు. అప్పుడు అబ్బాయిని కిడ్నాప్ చేసినట్టుగా ఇప్పుడు పెళ్ళికూతురిని కిడ్నాప్ చేస్తే పెళ్ళి ఆగిపోతుంది కదా అని కన్నా, కేశవ అనగానే.. అవేం వద్దురా చక్రి, వాళ్ల మాటలు నమ్మకు.. వాళ్ళు అసలే రౌడీలలా ఉన్నారు.. వద్దని చెప్పి ఫోన్ కాల్ కట్ చేస్తాడు. ఇక చక్రి ఆలోచనల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu: తన కుటుంబం జోలికి రావొద్దని విశ్వకి వార్నింగ్ ఇచ్చిన ప్రేమ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (illu illalu pillalu )'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-357 లో.. నిజం తెలుసుకున్న ప్రేమ.. విశ్వ దగ్గరికి కోపంగా వెళ్తుంది.    ఇక అటు సేనాపతి కుటుంబం, ఇటు రామరాజు కుటుంబం అంతా బయటకు వస్తారు . విశ్వని ఇష్టమొచ్చినట్టు తిడుతుంది ప్రేమ. నా దగ్గర అబద్ధం చెప్పి, కన్నీళ్ళు పెట్టుకొని నటించి అమూల్యే నిన్ను ప్రేమించిందని చెప్తావా అని విశ్వని కొడుతూ అరుస్తుంటుంది.    ఇక అది సేనాపతి ఆపుతుంటే నువ్వు మాట్లాడకు.. నీతో కూడా మాట్లాడతా అని ప్రేమ అంటుంది. నిన్ను నమ్మి దేవుడి లాంటి మామయ్యకి ఎదురుతిరిగాను.. మావాళ్ళదే తప్పు అని నేను మాట్లాడాను.. నీ కన్నీళ్ళు నమ్మాను కదరా.. అయినా చెల్లెలిని ఎలా మోసం చేయాలనిపించిందిరా.. ఒక ఆడపిల్ల జీవితాన్ని నడిరోడ్డున వేసి ఏం సాధించావ్ రా అని విశ్వని ప్రేమ తిడుతుంది.    ఇక ఆ తర్వాత ప్రేమ వాళ్ళ అత్త భద్రవతికి వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా నేను ఇంటికి తిరిగి రావాలనే అయితే అది ఎప్పటికి జరుగదు.. నువ్వు ఎంత చేసినా ఏం చేసినా ధీరజ్ నా ప్రాణం.. నేను వాడిని వదిలి రాను.. ఒకవేళ నిజంగా వాడిని నన్ను విడదీసి రప్పించాలని చూస్తే.. నా ప్రాణాలు వదిలేస్తానని ప్రేమ అంటుంది. ఇదే నా కుటుంబం.. నా కుటుంబం జోలికి వస్తే ఊరుకోనని.. విశ్వ, సేనాపతి, భద్రవతిలకి ప్రేమ వార్నింగ్ ఇస్తుంది. ఇక అందరు ఎక్కడివారు అక్కడ ఇంట్లోకి వెళ్ళిపోతారు.    ఇక నర్మదకి థాంక్స్ చెప్తుంది ప్రేమ. ధీరజ్ తో మాట్లాడాలని ప్రేమ చూస్తే.. అతను పట్టించుకోకుండా కోపంతో ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇక శ్రీవల్లి తను చేసిన తప్పుకి ఏడుస్తుంది‌. నోర్ మూస్కొని ఉంటే అన్నీ బాగుంటాయని తనని తానే తిట్టుకుంటుంది శ్రీవల్లి. ఇక ఇంట్లోకి వెళ్ళిన ప్రేమ.. తన అన్న విశ్వ కన్నీళ్ళు పెట్టుకున్నాడని, దాని వెనుక కుట్ర తనకి తెలియదని, తనని క్షమించమని రామరాజుని అడుగుతుంది. మరి ప్రేమని రామరాజు క్షమిస్తాడా..  వేదవతి మేనకోడలు ప్రేమని అర్థం చేసుకుంటుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: జ్యోత్స్నకి పారిజాతం వార్నింగ్.. కాంచన రిపోర్ట్స్ లో ఏం ఉందంటే..?

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -556 లో... జ్యోత్స్న వల్లే కాశీ స్టేషన్ కి వెళ్ళాడని పారిజాతానికి కోపం వస్తుంది. దాంతో జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది పారిజాతం. గర్వం తలకి ఎక్కితే పర్వాలేదు కానీ ఒళ్ళంతా విషంలాగా మారిందని తనపై కోప్పడుతుంది పారిజాతం‌. అసలు ఇందులో కాశీని కావాలనే ఇరికించింది బావ. కాశీని పోలీసులు అరెస్ట్ చేయకుండా బావ చేయొచ్చు.. వాళ్లని ఆపొచ్చు కానీ బావ అలా చెయ్యలేదని పారిజాతాన్ని జ్యోత్స్న డైవర్ట్ చేస్తుంది.   ఆ తర్వాత శ్రీధర్ భోజనానికి వస్తున్నాడని అనసూయ అన్ని రెడీ చేస్తుంది. శ్రీధర్ గారు రావడం ఒక్కటే లేటు అని కాంచనతో అనసూయ అంటుంది. నాతో మీ నాన్నగారు అంటావ్.. దీపతో మావయ్యగారు అంటావ్.. మా అమ్మతో మాత్రం శ్రీధర్ గారు అని ఎందుకు అంటావని కార్తీక్ అంటాడు‌. ఏం అంటార్ దీప అని కార్తీక్ అనగానే.. మీ ఆయన అనాలని దీప చెప్తుంది. పిల్లల కోసం పారుని పెళ్లి చేసుకున్నాడు తాత. నా కోసం నువ్వు నాన్నతో భార్యగా ఉండలేవా అని కార్తీక్ అంటాడు.    అప్పుడే శ్రీధర్, కావేరి, స్వప్న ఎంట్రీ ఇస్తారు. సారీ పెద్దమ్మ ఇన్ని ప్రాబ్లెమ్స్ కి కారణం నేనే అని స్వప్న అనగానే నువ్వు ఏం చేసావని కాంచన అడుగుతుంది. కాశీని పెళ్లి చేసుకున్నాను కదా.. ముఖ్యంగా నా వల్ల దీప వదిన ఎక్కువ బాధపడిందని స్వప్న అంటుంది.   మరొకవైపు సుమిత్రకి కాళ్ళునొప్పులు ఉన్నాయని దశరథ్ కాళ్ళు మసాజ్ చేస్తాడు. అప్పుడే డాక్టర్ ఫోన్ చేస్తాడు. దాంతో దశరథ్ పక్కకి వెళ్లి మాట్లాడుతాడు. రేపు వచ్చి రిపోర్ట్స్ తీసుకోండి అలాగే డాక్టర్ మీతో మాట్లాడతారని చెప్పగానే ఏమైందో ఏమోనని దశరథ్ కి ఇంకా టెన్షన్ అవుతుంది.    మరొకవైపు అందరు భోజనం చేస్తుంటారు. అసలు కాశీ అలా అవ్వడానికి కారణం మీరేనని శ్రీధర్ తో కాంచన అంటుంది. మీరు మావయ్యగా వాడి మీద అధికారం చెలాయించాలనుకున్నారు.. వాడికి ఎలా ఉంటుందని కాంచన కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: విషం కలిపిన పసరు మందుని తాగిన కావ్య.. రుద్రాణి ప్లాన్ సక్సెస్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-919 లో... రాజ్ బావ నాకు కావాలని రేఖ అనగానే దానికి రాహుల్ ఒప్పుకొని కావ్య కడుపులో బిడ్డని లేకుండా చేయాలని చెప్తాడు. రేఖని ఆ ఇంటికి కోడలుగా చెయ్యాలని రాహుల్ ప్లాన్ చెయ్యగా.. చాలా థాంక్స్ అన్నయ్య అని రేఖ అంటుంది. మీరు ఇద్దరు ఒకే అంటే చేసేదేముంది నా కూతురు ఈ ఇంటికి కోడలు అవుతుంది.. అంతకంటే ఏముందని రుద్రాణి అంటుంది.    మరొకవైపు ఇద్దరు అక్కాచెల్లెలు అప్పు, కావ్య కడుపుతో కూర్చొలేక నిల్చొలేక ఇబ్బందిపడుతారు. దాంతో అప్పు, కావ్య ఇద్దరు తమ భర్తల దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇలా రెస్ట్ తీసుకొమ్మంటే మాకు ఇబ్బందిగా ఉందని అంటారు.    ఇక రాత్రి రుద్రాణికి పసరు మందు వైద్యుడు ఫోన్ చేసి మీరు చెప్పిన మందు తీసుకొని వచ్చానని చెప్పగానే సరే ఉండు వస్తున్నానని రుద్రాణి వెళ్తుంది. అప్పుడే తనకి ప్రకాష్ ఎదురుపడుతాడు. దాంతో రుద్రాణి భయపడుతుంది. కానీ ప్రకాష్ నిద్రలో నడుస్తాడు అది చూసి రుద్రాణి రిలాక్స్ అవుతుంది. ఇక రుద్రాణి బయటకు వెళ్లి పసరు మందు తీసుకొని వస్తుంది.    మరుసటి రోజు ప్రకాష్, సుభాష్ ఆఫీస్ కి వెళ్ళడానికి త్వరగా టిఫిన్ చేస్తుంటారు. దాంతో రాజ్ వచ్చి ఎవరు ఈ రోజు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్తాడు.   మరొకవైపు రాజ్ గదిలోకి రుద్రాణి, రేఖ వెళ్లి పసరు మందు తను తాగే ఆయుర్వేద మందులో కలుపుతారు. ఈ దెబ్బతో కావ్య బిడ్డ ఉండదని రుద్రాణి, రేఖ అనుకుంటారు.    ఆ తర్వాత ఏదో ఎంటర్‌టైన్మెంట్ ప్రోగ్రామ్ అన్నావ్ రాజ్ ఎక్కడ అని ప్రకాష్ అనగానే.. రాజ్, కళ్యాణ్ కలిసి కొన్ని చీటీలు రాసి అందులో ఏది వస్తే అది చెయ్యాలని చెప్తారు.    తరువాయి భాగంలో కావ్యకి రాజ్ ఆయుర్వేద మందు ఇస్తాడు. అది కావ్య తాగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

హోస్టింగ్ నేను చేస్తే బాగుంటుందన్నారు.. ప్రదీప్ చేంజ్ అవలేదన్న నిధి!

  బిబి జోడి సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. "ఇక నుంచి మీ సండే నైట్స్ ఇంకాస్త ఎంటర్టైనింగ్ గా మారబోతున్నాయి. ఎందుకంటే మా బిబి జోడి సీజన్ 2 లో ధమాకా జోడీలు దుమ్ము దులపడానికి సిద్ధంగా ఉన్నారు" అంటూ ప్రదీప్ చెప్పుకొచ్చాడు.    "ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లు వస్తుంటాయి" అంటూ ప్రదీప్ మానస్ జోడీకి చెప్తుండగా మణికంఠ మధ్యలో వచ్చి "హోస్టింగ్ నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు" అంటూ మణికంఠ చెప్పాడు. "నువ్వు వేరే వాళ్ళ అకౌంట్ లో కామెంట్స్ చదివి ఉంటావ్" అన్నాడు ప్రదీప్. "మీరింత బాగా డాన్స్ చేస్తారని తెలీదు. మా దాంట్లో ఐటెం సాంగ్ ఉంది చేస్తారంటే " అంటూ ధనరాజ్ ఒక విషయం చెప్పేసరికి మానస్ "వ్వావ్" అన్నాడు. జడ్జ్ శ్రీదేవి అతని ఎక్స్ప్రెషన్ చూసి "ఒకసారి మళ్ళీ చూపించండి ఆ ఎక్స్ప్రెషన్" అని అడిగింది. "వ్వావ్ చాలా ఉంది ధమాకా జోడీస్ కి" అని కౌంటర్ ఇచ్చింది.    తర్వాత స్టేజి మీదకు రాజా సాబ్ ముగ్గురు హీరోయిన్స్ వచ్చారు. "కొత్త సంవత్సరం జాతకంలో మంచి కలర్ ఫుల్ గా ఉంటుంది అంటే ఏంటో అనుకున్నాను" అంటూ బాగా ఫ్లర్ట్ చేసాడు. "ప్రదీప్ గారు మీరేం చేంజ్ అవలేదు కదా " అంటూ నిధి అగర్వాల్ ప్రదీప్ మీద డైలాగ్ వేసింది. "అస్సలు చేంజ్ అవలేదు" అంటూ శేఖర్ మాష్టర్ కోరస్ ఇచ్చాడు. "కానీ మీరు అందరికీ సేమ్ థింగ్ చెప్తారు" అంటూ నిధి మళ్ళీ ప్రదీప్ మీద కౌంటర్ వేసింది.    తర్వాత "బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్" థీమ్ మీద మానస్ - స్రష్టి వర్మ చేసిన డాన్స్ కి జడ్జెస్ ఫిదా ఇపోయారు. జడ్జ్ శ్రీదేవి గోల్డెన్ రోజ్ ఇచ్చింది. ఈ థీమ్ కి పక్కా న్యాయం చేశారు అంటూ శేఖర్ మాష్టర్ చెప్పాడు.  

Jayam serial: వీరూనే అదంతా చేశాడని తెలుసుకున్న గంగ.. ఏం చేయనుంది?

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -156 లో... శేఖర్ నిజం చెప్పాలని గంగ యాక్టింగ్ చేస్తుంది. దాంతో శేఖర్ నిజం చెప్తాడు. అదంతా రుద్ర వింటాడు. అసలు నీతో ఇదంతా ఎవరు చేస్తున్నారన్నా అని గంగ అనగానే శేఖర్ పారిపోతాడు. శేఖర్ కి ఎదురుగా రుద్ర వచ్చి ఆపుతాడు. గంగ, శ్రీనన్న వస్తారు. గంగ చెంప రుద్ర చెల్లుమనిపిస్తాడు. అసలు నువ్వు ఇలా ఎందుకు యాక్టింగ్ చేసావ్.. ఇంకా ఇంట్లో నుండి లెటర్ రాసి పెట్టి వచ్చావ్.. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని గంగపై రుద్ర కోప్పడతాడు.   ఆ తర్వాత శేఖర్ ని రుద్ర బెదిరించగా జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో నిన్ను కాంటాక్ట్ అయిన నెంబర్ ఇవ్వమని రుద్ర అనగానే అతను నెంబర్ ఇస్తాడు. రుద్ర అతనికి ఫోన్ చేస్తాడు ఫోన్ స్విచాఫ్ వస్తుంది. అత్తయ్య ముందు శేఖరన్నా నువ్వు నిజం చెప్పాలని తనని ఇంటికి తీసుకొని వెళ్తారు... గంగని చూసి ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గంగ చెంపపై వేలిముద్ర చూసి ఎవరు కొట్టారని పెద్దసారు అడుగుతాడు. నేనే కొట్టాను నిజం చెప్పించడానికి చనిపోయినట్లు యాక్టింగ్ చేసింది అందుకే కొట్టానని రుద్ర చెప్తాడు. శేఖర్ రాగానే వీరు టెన్షన్ పడతాడు. శేఖర్ ఇంట్లో వాళ్ళకి జరిగింది మొత్తం చెప్తాడు. నన్ను బ్లాక్ మెయిల్ చేసిన అతను కూడా వీరు సర్ లాగే పొడవు ఉంటారని శేఖర్ చెప్తాడు.   ఆ తర్వాత గంగ చెంపపై ఉన్న నొప్పికి ఇబ్బంది పడుతుంటే రుద్ర వచ్చి కూల్ బ్యాగ్ ఇచ్చి పెట్టుకోమ్మంటాడు. అనుకోకుండా రుద్ర వెళ్లిపోతుంటే గంగపై పడుతాడు. గంగ రొమాంటిక్ గా ఫీల్ అవుతుంది. సారీ గంగ నిన్ను కొట్టినందుకు అని చెప్పి వెళ్లిపోతుంటే గంగ సిగ్గుపడుతుంది. మరొకవైపు ఆ శేఖర్ గాడు లాస్ట్ మినిట్ లో ఇలా చేసాడని ఇషిక, వీరు డిజప్పాయింట్ అవుతారు.    ఆ తర్వాత వీరు దగ్గరికి గంగ వచ్చి ఇదంతా నువ్వే చేసావని నాకు తెలుసు అన్నయ్య అని గంగ అనగానే వీరు షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Podarillu: సూపర్ ట్విస్ట్.. మహా పెళ్ళికి ఏర్పాట్లు!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -18 లో... భూషణ్ వెళ్లిపోతుంటే.. మహ అప్పుడే లోపలికి వెళ్తుంది. ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటారు. ఏంటి అప్పుడే వదిలేశారా అని మహా అంటుంది. ఏంటి అసలు నన్ను కిడ్నాప్ చేశారన్న బాధ కన్పించడం లేదని భూషణ్ అనగానే..  మహా బాధగా ఉన్నట్లు యాక్టింగ్ చేస్తుంది. ఈ పెళ్లి ఆగకూడదని నేనొక నిర్ణయం తీసుకున్నానని భూషణ్ చెప్పి వెళ్లిపోతాడు.   ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే ఇదే కరెక్ట్ టైమ్ వాడితో నా పెళ్లి ఆపించాలని మహా అనుకొని.. నాన్న వాడితో పెళ్లి ఇష్టం లేదు. అందుకే ఆగిపోయింది.. ఇకనైనా ఆపేయండి అని మహా అంటుంది. చాలు ఆపు అంటూ ప్రతాప్ తనపై సీరియస్ అవుతాడు. ఇలా ఆగకూడదు అనే నీ పెళ్లి మూడు రోజుల్లో చేస్తున్నానని ప్రతాప్ అనగానే మహా షాక్ అవుతుంది.    మరొకవైపు మాధవకి తను పెళ్లి చూపులకి వెళ్లిన అమ్మాయి ఫోన్ చేసి కలిసి మాట్లాడాలని అంటుంది. దానికి మాధవ సరే అంటాడు. ఆ తర్వాత చక్రి దగ్గరికి మహా వచ్చి నీ వల్ల పెళ్లి మూడు రోజుల్లో ఫిక్స్ అయిందని కోప్పడుతుంది.   మరుసటిరోజు మహా నిద్ర లేచేసరికి పెళ్లి పనులు జరుగుతుంటాయి. ఎవరి హడావిడిలో వాళ్ళుంటారు. అదంతా చూసి మహా షాక్ అవుతుంది. ఇంకా రెండు రోజులే టైమ్ ఉంది. ఈ పెళ్లి ఎలా ఆపాలని చక్రి టెన్షన్ పడతాడు.    తరువాయి భాగంలో చక్రి తన అన్నయ్య మాధవకి ఫోన్ చేసి మహా గురించి చెప్తాడు. ఆ తర్వాత ఇంతక ముందు అబ్బాయి లేకపోతే పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు అమ్మాయి లేకపోతే పెళ్లి ఆగుతుంది కదా అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu: అమూల్య నుండి నిజం రాబట్టిన నర్మద.. కుమిలిపోయిన ప్రేమ!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -356 లో.. వేదవతి వంటిట్లో బాధపడుతుంది. అప్పుడే అక్కడికి నర్మద వచ్చి.. మిమ్మల్ని వాళ్ళు అలా అనడం తప్పే అయితే.. ప్రేమ అలా‌ వాళ్ళకి సపోర్ట్ చేసిందని.. తను లేచిపోయి వచ్చిందని అనడం కూడా మీరు చేసిన తప్పే.‌. తన అన్న చెప్పిన మాటలు నమ్మి ప్రేమ మోసపోయిందని నేను నిరూపిస్తానని నర్మద చెప్పి బయటకు వస్తుంది.    అక్కడ బయట ప్రేమ ఉంటుంది. తను చెప్పిన మాటలన్నీ విని ఎమోషనల్ అవుతుంది ప్రేమ. ఇక అమూల్య ఎందుకు అలా చెప్పిందో తనతో నిజం చెప్పించాలని ప్రేమతో నర్మద అంటుంది.    ఇక నర్మద ఇంటిబయట వైపుకి వెళ్తుంది. అక్కడ బట్టలు ఆరేస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. ‌ఇక తన దగ్గరకి వెళ్ళి.. అక్క అని నర్మద పిలుస్తుంది. దాంతో వల్లి షాక్ అవుతుంది. నన్నేనా అని ఆశ్చర్యపోతుంది.‌ ఇక వెంటనే తన ప్లాన్ అమలు చేస్తుంది నర్మద. అక్క నీకు ఉన్నన్ని తెలివితేటలు ఎవరికి లేవు.‌ నువ్వు నాకు సాయం చేయాలని నర్మద అంటుంది. ఏంటని అడుగుతుంది శ్రీవల్లి. మా ఫ్రెండ్ ఒక అతడిని ప్రేమించిందని.. తనే మొదటగా ప్రేమించిందా, వాడు తనని ట్రాప్ చేశాడా ఎలా తెలుసుకోవాలని శ్రీవల్లిని నర్మద అడుగుతుంది. ముల్లుని ముల్లుతోనే తీయాలి.‌ ప్రేమని ప్రేమతోనే బయటకు తీసుకురావాలని శ్రీవల్లి ఓ ఐడియా చెప్తుంది. ఇక ఆ ప్లాన్ కి శ్రీవల్లికి థాంక్స్ చెప్పి వెళ్లిపోతుంది నర్మద.    అమూల్య దగ్గరికి వెళ్లిన నర్మద తనకి సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడుతుంది. విశ్వని నువ్వు మొదటగా ప్రేమించావా.. విశ్వ నిన్ను ప్రేమించాడా అని అమూల్యని నర్మద అడుగుతుంది.  తనే నా వెంట పడ్డాడు. గిఫ్ట్ లు ఇచ్చాడని అమూల్య చెప్తుంది. ‌అమూల్య మాటలన్నీ వెనకాల నుండి ప్రేమ వింటుంది. ఇక ప్రేమ తన తప్పు తెలుసుకొని బయటకు వచ్చి కుమలి కుమిలి ఏడుస్తుంది‌.   మరోవైపు శ్రీవల్లి వాళ్ళ అమ్మ భాగ్యంకి ఫోన్ చేస్తుంది. అమ్మా నేను ఓ గొప్ప పని చేశాను.. నన్ను పొగుడు అని శ్రీవల్లి అంటుంది. ముందు విషయం చెప్పమని భాగ్యం అనగానే నర్మద మాట్లాడిన మాటలన్నీ చెప్తుంది. అది విన్న భాగ్యం.. ఓసి పిచ్చి మొద్దు.‌ నిన్ను పొగిడినట్టుగా పొగిడి అమూల్య నుండి నిజం రాబట్టడానికి నీ దగ్గర ఐడియా తీసుకుందని శ్రీవల్లితో భాగ్యం అంటుంది. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో‌ తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అందరి మీద కవితలు చెప్పిన వరుణవి...ఎంటర్టైన్మెంట్ లో సుధీర్ మావ షేర్!

  సరిగమప లిటిల్ చాంప్స్ లో వరుణవి స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. ఇక ఈ వారం ఆమె వేసుకొచ్చిన డ్రెస్ చూసి సుధీర్ హ్యాపీగా ఫీలవుతూ "నేను ఇచ్చిన డ్రెస్ వేసుకున్నావ్ ఈ డ్రెస్ లో చాల అందంగా ఉన్నావ్. మా అమ్మ చాల హ్యాపీగా ఫీలవుతుంది" అని అన్నాడు. "ఐతే నేను ఈ డ్రెస్ లో బుట్టబొమ్మలా ఉన్నానని చెప్పు. మీ అమ్మగారు ఈ డ్రెస్ మాత్రమే కాదు ఇంతమంచి యాంకర్ ని ఇంతమందికి గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పు" అంది వరుణవి.   ఇంతలా పొగుడుతావని అనుకోలేదు అని సుధీర్ అనేసరికి ఇచ్చే గిఫ్టులను బట్టే నేను చెప్పే మాటలుంటాయి. నీ కోసం ఒక కవిత రాసాను..అనగనగా ఒక సుధీర్, నీకుంది చానా డేర్, పిల్లలంటే చానా కేర్, అతను వచ్చేశాడంటే పోతుంది బోర్, ఎంటర్టైన్మెంట్ లో మా సుధీర్ మావ ఒక షేర్ " అంటూ చెప్పింది.    "చాలు ఈ జీవితానికి ఇది చాలు" అన్నాడు సుధీర్. "నాకు చాలదు ఇంకో రెండు డ్రెస్సులు కుట్టించు" అంది. "సరే కుట్టిస్తాను డ్రెస్సులు..కవిత నా కోసమే రాసావా జడ్జెస్ కోసం రాయలేదా" అని అడిగాడు. "నాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సిన వాళ్ళ గురించి చెప్పకపోతే ఎలా..కాకినాడలో కాజా ఫేమస్, సరిగమపలో శైలజమ్మ ఫేమస్..పట్టాల మీద నడిచేది రైలు..ఈ షోని నడిపించేది మా శైలు..శైలజ అమ్మమ్మను ముద్దుగా శైలు" అని పిలుస్తానని చెప్పింది.   "ప్రశాంతంగా ఉండాలంటే వెళ్ళాలి గుడి.. మనం ప్రశాంతంగా నవ్వాలంటే ఉండాలి అనిల్ రావిపూడి...మావ అని నేను ఎందుకు అంటానంటే మా దేవుడు నువ్వేనయ్యో మా కోసం పుట్టావయ్యో" అని చెప్పింది.   ఇక అనంత శ్రీరామ్ పెద్ద రైటర్ కదా నేనేం రాయలేదు అని చెప్పేసింది. 'అదేంటమ్మా ఎదో ఒకటి రాయి" అంటూ అనంత్ అడిగేసరికి "మీ అంత గొప్పగా రాయలేను మీరే ఏదో ఒకటి రాసుకోండి" అనేసింది వరుణవి.  

Karthika Deepam 2: జ్యోత్స్నకి కార్తీక్ వార్నింగ్.. కాశీ కోసం పారిజాతం తపన!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -555 లో... కార్తీక్, జ్యోత్స్న స్టేషన్ కి బయల్దేరతారు. కార్తీక్ మధ్యలో కార్ ఆపుతాడు. జ్యోత్స్నని దిగమని చెప్తాడు. ఏంటి బావ ఇక్కడ అపావని జ్యోత్స్న అడుగుతుంది. దీనంతంటికి కారణం జ్యోత్స్ననే అని కార్తీక్ ఇండైరెక్ట్ గా మాట్లాడుతాడు. నువ్వు ఏం అంటున్నావో నాకు అర్థం అయింది బావ కానీ శివన్నారాయణకి ఏకైక వారసురాలిని నేను.. ఇలా నా రెస్టారెంట్ గురించి ఎందుకు చేసుకుంటానని జ్యోత్స్న అంటుంది.   నువ్వు అని ఎవరు చెప్పారని కార్తీక్ అనగానే జ్యోత్స్న ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. అంటే నువ్వు అలా ఫీల్ అవ్వడం లేదుగా అని కార్తీక్ అంటాడు. నేను అనుకోకపోవడం ఏంటని జ్యోత్స్న అంటుంది. నాకు కాశీ అంత చెప్పాడు.. వైరా, కాశీ ఫోన్ రికార్డింగ్ చూస్తే నీ పరిస్థితి ఏంటి మళ్ళీ అత్తకి లేనిపోని టెన్షన్ ఎందుకని వదిలేస్తున్న ఇక మీదుట అసలు ఊరుకోనని జ్యోత్స్నకి కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు.    ఆ తర్వాత ఇద్దరు స్టేషన్ కి వెళ్తారు. శ్రీధర్ ని స్టేషన్ నుండి వదిలేస్తారు. వైరా, కాశీని సెల్లో వేస్తారు. నిన్ను నా కొడుకు అనుకుని దగ్గర ఉంచుకుని అన్నీ నేర్పించి నీ చేత సొంతంగా రెస్టారెంట్ పెట్టిద్దామనుకున్న కానీ ఇలా వెన్నుపోటు పొడుస్తావనుకోలేదని కాశీతో శ్రీధర్ చెప్తూ ఎమోషనల్ అవుతాడు.   ఆ తర్వాత శివన్నారాయణ దగ్గరికి శ్రీధర్ వెళ్లి మావయ్య గారు నన్ను క్షమించండి అని అంటాడు. నువ్వు ఏం తప్పు చెయ్యలేదు మన సంస్థని కాపాడడానికి కార్తీక్ ఉన్నాడుగా అని శివన్నారాయణ మురిసిపోతాడు. కాశీని తీసుకొని రాలేదని పారిజాతం కోప్పడుతుంది. మీకు ఒక్కరికే తనపై బాధ్యత ఉన్నట్లు మాట్లాడకండి అని పారిజాతంపై దీప కోప్పడుతుంది. అనవసరంగా కాశీనీ ఇందులో లాగింది ఈ జ్యోత్స్ననే.. దీని సంగతి చెప్తానని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: అప్పుకి డౌట్.. రేఖ, రాహుల్, రుద్రాణి కుట్ర ఫలిస్తుందా?

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -918 లో... రేఖకి రాజ్ పాస్తా ఆర్డర్ చేసి ఇవ్వడం కావ్య చూసి కోపంగా లోపలికి వెళ్తుంది. ఆ విషయం ఇందిరాదేవికి చెప్పగానే రాజ్ ఎలాంటి వాడో తెలుసు కదా అని ఇందిరాదేవి అంటుంది. తెలుసు కానీ అతన్ని ఆటపట్టిస్తానని కావ్య చెప్తుంది.    మరొకవైపు సాండి డబ్బున్న సూట్ కేసుని రాహుల్ కి ఇస్తాడు. ఇది ఎలాగైనా రాజ్ కార్ లో పెట్టాలని అనుకుంటాడు. ఆ తర్వాత కావ్యకి రాజ్ భోజనం తీసుకొని వచ్చి తినమంటాడు. వద్దని తను అలుగుతుంది. వెళ్లి మీ రేఖకి తినిపించండి అని కావ్య అలుగుతుంటే బుజ్జగించి భోజనం తినిపిస్తాడు రాజ్. అదంతా రేఖ చూస్తుంది.    ఆ తర్వాత రాహుల్ సూట్ కేసు పట్టుకొని రాజ్ కార్ దగ్గరికి వస్తాడు. అప్పుడే అప్పు వచ్చి.. ఏంటి రాహుల్ అలా రాజ్ కార్ వంక చూస్తున్నావని అడుగుతుంది. ఏం లేదని రాహుల్ కంగారుపడతాడు. ఆ సూట్ కేసు ఏంటి.. నీకు ఎందుకు చెమటలు పడుతున్నాయని అప్పు అడుగుతుంది. అప్పుడ్ స్వప్న వచ్చి ఏంటి నా భర్త ఏమైనా క్రిమినల్ అనుకుంటున్నావా.. ఎందుకు అలా క్వశ్చన్ చేస్తున్నావని అంటుంది. అదేం లేదు అక్క అని అప్పు అంటుంది. నా ఫ్రెండ్ ఫారెన్ వెళ్తూ సూట్ కేసు ఇంట్లో ఇమ్మన్నాడు. నేను ప్రొద్దున ఇద్దామని ఇంటికి తీసుకొని వచ్చానని రాహుల్ చెప్తాడు. కానీ రాహుల్ పై అప్పుకి డౌట్ వస్తుంది.    ఆ తర్వాత కత్తితో రేఖ చేయి కోసుకోబోతుంటే రాజ్ వచ్చి వద్దని ప్రేమగా మాట్లాడతాడు. మరొకవైపు నాకు రాహుల్ పై డౌట్ ఉందని కళ్యాణ్ తో అప్పు చెప్తుంది. అదంతా ఏం పట్టించుకోకు రాహుల్ మారిపోయాడని కళ్యాణ్ చెప్తాడు.   ఆ తర్వాత రుద్రాణి దగ్గరికి రేఖ వెళ్లి.. అసలు నాకేం కావాలో పట్టించుకోవడం లేదని కోప్పడుతుంది. సరే చెప్పు నీకు ఏం కావాలోనని రుద్రాణి అనగానే నాకు బావ కావాలి.. తన ప్రేమ కావాలి అని రేఖ అనగానే రుద్రాణి షాక్ అవుతుంది. అది జరగదని రుద్రాణి అనగానే ఎందుకు జరగదు.. జరుగుతుందని రాహుల్ ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు కావ్య కడుపు లో బిడ్డ లేకుండా చేస్తే మరొక బిడ్డని కనడానికి కావ్యకి ఎలాగు ఛాన్స్ లేదని డాక్టర్ చెప్పారు. సో ఇప్పుడు ఆ బిడ్డని లేకుండా చేస్తే ఇంటికి వారసత్వం కావాలి కాబట్టి రాజ్ కి కావ్య దగ్గరుండి మరి మళ్ళీ పెళ్లి చేస్తుందని రాహుల్ చెప్తాడు. దాంతో రేఖ, రుద్రాణి సరే అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

శంకర్ దాదా మూవీ డైలాగ్స్ తో అలరించిన అనిల్ రావిపూడి

  సరిగమప లిటిల్ చాంప్స్ ప్రతీ వారం పిల్లల పాటలతో పాటు అనిల్ రావిపూడి, అనంత్ శ్రీరామ్ డైలాగ్స్ తో ఆడియన్స్ ఫుల్ ఛిల్ల్ అవుతున్నారు. ఈ వారం వాళ్ళు శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీలో చిరంజీవి వాకింగ్ మూవ్మెంట్ ని స్పూఫ్ గా చేశారు. ఫన్నీ డైలాగ్స్ లో అలరించారు.    "లింగం అంకుల్ స్వీట్ పొటాటోలో స్వీట్ ఉంటుంది కానీ బాటిల్ గార్డ్ లో బాటిల్ ఉండదు అని అర్ధం " అంటూ అనిల్ రావిపూడి చెప్పిన డైలాగ్ కి అనంత శ్రీరామ్ ఫుల్ ఫ్రస్ట్రేట్ ఐపోయాడు. నెత్తి మీద హాట్ ప్యాక్ పెట్టుకుని పిచ్చిపిచ్చిగా నవ్వుతూ ఉన్నాడు. సుధీర్ ఆయన నవ్వును చూసి "ఏమైందన్న" అని అడిగాడు. "దాన్ని లాఫింగ్ సైకో ఫోబియా" అంటారు అని చెప్పాడు అనిల్ రావిపూడి.  "పానీపూరి లో పానీ ఉంటుంది కానీ బటర్ ఫ్లైలో బటర్ ఉండదు" అంటూ ఇంకో డైలాగ్ వేసాడు. ఈ డైలాగ్స్ ని అనంత శ్రీరామ్ ఒక రకంగా డాన్స్ చేసేసరికి "ఏమన్నా పట్టుకుందా ఏమిటి గట్లా తిరుగుతుండు" అని సుధీర్ అడిగాడు. దానికి అనిల్ రావిపూడి "దాన్ని డ్యాన్సో స్కెరో ఫోబియా" అంటూ చెప్పేసరికి ఆడియన్స్ అంతా నవ్వేశారు. "అంటే ఏంటన్నా" అని సుధీర్ అడిగేసరికి "నాకు తెలిసినవే రెండు ముక్కలు నన్ను మళ్ళీ మళ్ళీ అడక్కురా" అన్నాడు అనిల్ రావిపూడి.    ఇక ఈ షోకి "సహకుటుంబానాం" మూవీ టీమ్, అలాగే "నయనం" టీమ్ వచ్చారు. హీరో వరుణ్ సందేశ్ పాటలు పాడి జడ్జెస్ ని ఇంప్రెస్ చేశారు.  

బిబి 9 ప్రెస్ మీట్ లో హౌస్ మేట్స్ మధ్య గొడవ.. ఆ విషయాన్ని రివీల్ చేయనన్న భరణి!

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ ఆదివారం కొత్త థీమ్ తో రాబోతోంది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అదే బిబి 9 ప్రెస్ మీట్. "భరణి గారు ఎవరినైనా ఒక్కళ్లను చూసి ఏం నటిస్తున్నావురా అని అనిపించిన ఏదన్నా కంటెస్టెంట్ ఉన్నారా" అంటూ శ్రీముఖి భరణిని అడిగింది. "100 % అక్కడ అందరూ నటిస్తూనే ఉంటారు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అంతా ఎక్కడో ఒక చోట నటించాల్సి వస్తుంది." అని చెప్పాడు భరణి. "అంటే అందులో మీరు కూడా ఉన్నారు. అంటే మీరు కూడా నటించారా" అంటూ అవినాష్ రివర్స్ లో క్వశ్చన్ చేసాడు. ఐతే భరణి ఫుల్ ఫైర్ అవుతూ "సుమన్ అన్న దగ్గర నేను ఎక్కడ నటించాల్సి రాలేదు" అని చెప్పాడు. "ఎవరి దగ్గర నటించాల్సి వచ్చింది" అని శ్రీముఖి మళ్ళీ అడిగింది. "అదా.. ఆ విషయాన్నీ నేను రివీల్ చేయను" అన్నాడు. "అంటే మీరు భయపడుతున్నారా" అని అడిగింది శ్రీముఖి. ఎవరికీ అని అడిగాడు భరణి.    ఇక తర్వాత రీతూ చౌదరిని "ఇమ్మానుయేల్ మీకు మంచి ఫ్రెండ్ కదా.. సడన్ గా ఇమ్మానుయేల్ ని వదిలేసి వెళ్లిపోయారు" అంటూ అవినాష్, శ్రీముఖి అడిగారు. "ఇమ్మానుయేల్ ని నేను వదిలేయలేదు. అతనే నన్ను వదిలేసి కళ్యాణ్ దగ్గరకు వెళ్ళిపోయాడు" అంటూ రీతూ చౌదరి తన వెర్షన్ చెప్పింది. " అంటే మీరు వదిలేసి డెమోన్ దగ్గరకు వెళ్లలేదా. అంటే మీరు ఇమ్మానుయేల్ కప్పు గెలవకూడదు అనుకున్నారా " అని అవినాష్ మళ్ళీ ఘాటైన ప్రశ్న అడిగాడు. "నాకు హౌస్ లో ఎవరైతే బ్యాక్ బోన్ లా ఉన్నారో.. ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో.. ఎవరైతే నాతో  ఎమోషనల్ గా ఉన్నారో వాళ్లే గెలవాలని కోరుకున్నా" అంటూ రీతూ కూడా గట్టిగా ఆన్సర్ ఇచ్చింది.  

15 ఇయర్స్ అయ్యిందా పెళ్ళై.. డాక్టర్ బాబుని ఆడుకున్న రవితేజ!

  కొత్త ఏడాది వచ్చిందంటే చాలు సంక్రాంతి కూడా వచ్చేసినట్టే. సంక్రాంతి వస్తుందంటే చాలు బుల్లితెర మొత్తం కొత్త కొత్త షోస్, ఈవెంట్స్ తో కళకళలాడిపోతుంది. ఈ నేపథ్యంలో ఈటీవీలో "సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం" టైటిల్ తో ఒక ఎపిసోడ్ రాబోతోంది. యాంకర్ సుమ ఈ షోని నిర్వహించబోతున్నారు. "ఈటీవీలో ఈ పండగ మీ ఇంటి పండగలా ఉండబోతోంది. పందెం కోళ్ల లాంటి పవర్ఫుల్ పెర్ఫార్మెన్సులతో ఈ సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం" అంటూ చెప్పారు.    ఇందులో ఆది ఫైర్ స్టార్మ్ పెర్ఫార్మెన్స్ కూడా ఉండబోతోంది. బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ మూవీ జానీలో సాంగ్ ప్లే అవుతుంటే ఆయన లేటెస్ట్ మూవీ ఓజిలోని వాషి యో వాషి అంటూ డైలాగ్ చెప్పేసరికి నాగబాబు కూడా పగలబడి నవ్వేశారు.    తర్వాత మాస్ మహారాజ రవితేజ వచ్చారు. "భార్యను ఇంప్రెస్ చేయడానికి భర్త ఎలాంటి గిఫ్ట్ లు ఇస్తే బాగుంటుంది" అంటూ కార్తీక దీపం డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల రవితేజను అడిగాడు. "ఎన్నాళ్ళయింది పెళ్ళై నీకు" అని రవితేజ అడిగారు. 15 ఇయర్స్ అని చెప్పాడు నిరుపమ్. " 15 ఇయర్స్ అయ్యిందా. ఇంకా గిఫ్ట్ ల గురించి మాట్లాడుతున్నాడేమిటి ?" అంటూ రివర్స్ లో అడిగేసరికి అక్కడే ఉన్న అనిల్ రావిపూడి "అంతేగా అంతేగా" అంటూ ఫన్నీ డైలాగ్ వేసాడు. ఇక ఈ ప్రోగ్రాం సంక్రాంతి రోజు ఉదయం 10 గంటలకు ఈటీవీలో ప్రసారం కాబోతోంది.  

అమరదీప్ జోడికి గోల్డెన్ రోజ్...లైఫ్ లో కొత్తగా ఇంకో స్టెప్ వేయబోతున్న శేఖర్ మాస్టర్!

  బిబి జోడి సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో జడ్జెస్ మంచి కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "బిబి జోడి సీజన్ 2 లో అసలైన ఆట ఈ వారం నుంచి మొదలు కాబోతోంది. ఇక్కడున్న జోడీస్ లో ఫైర్ ఉంది ఇంకొంతమంది జోడీస్ దగ్గర పవర్ అస్త్ర ఉంది. ఆటలో ఎనీ టైం ట్విస్ట్ ఇచ్చే పవర్ మా జడ్జెస్ దగ్గర ఉంది" అంటూ ప్రదీప్ చెప్పాడు.    ఇక శేఖర్ మాస్టర్ హెయిర్ స్టైల్ కూడా మార్చేశారు ఈ సీజన్ లో. ఒక పిలక వచ్చేసరికి "వావ్ పిలక మొత్తం అసలు మారిపోయారు సర్ మీరు" అంటూ ఫన్నీ డైలాగ్ వేసాడు. "ఈ కొత్త సంవత్సరం నుంచి కొత్త స్టెప్ వేయబోతున్నా" అని చెప్పారు శేఖర్ మాస్టర్. "మాస్టర్ ఇప్పటికే బోల్డన్ని స్టెప్పులేశారు" అంటూ స్టెప్పులేసి చూపించాడు ప్రదీప్. "ఆ స్టెప్పులు కాదబ్బా లైఫ్ లో ఇంకొక ముందుకు వేరే" అన్నాడు. "క్యూరియాసిటీ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు చెప్పకపోతే అక్కడ కూర్చోలేము" అంటూ శ్రీదేవి అసలు విషయం చెప్పాలంటూ అడిగేసింది.    ఇక ఈ వీక్ ఎపిసోడ్ లో "బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్" అనే థీమ్ తో డాన్స్ చేయాలంటూ చెప్పాడు. ఆ తర్వాత అమరదీప్ - నైనికా వచ్చి డాన్స్ చేశారు. దానికి శ్రీదేవి గోల్డెన్ రోజ్ ఇచ్చింది. శేఖర్ మాస్టర్ లేచి కాలర్ ఎగరేసాడు.  

Jayam serial: గంగ డ్రామా హిట్టు.. నిజం చెప్పేసిన శేఖర్!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -155 లో... రుద్ర నిద్ర లేచేసరికి గంగ గదిలో ఉండదు. ఆ శేఖర్ ని కలవడానికి వెళ్లి ఉంటుంది. ఒకసారి శ్రీనుకి ఫోన్ చేద్దాం అనుకునే లోపు టేబుల్ పై లెటర్ కనిపిస్తుంది. అందులో గంగ.. నేను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించే దారి కనిపించడం లేదు సర్.. అందుకే నేను ఉండను.. మీ కులదైవం దగ్గరికి వెళ్లిపోతున్నానని రాస్తుంది. అది చూసి రుద్ర ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తాడు. అసలు నా కుటుంబానికి ఎవరి దిష్టి తగిలిందని పెద్దసారు బాధపడతాడు. గంగ కోసం రుద్ర తన కుల దైవం గుడికి బయల్దేరతాడు.    మరొకవైపు జరిగింది అంతా పారుకి చెప్తారు. గంగ ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని ఇషిక చెప్పగానే పారు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే వీరుకి శేఖర్ ఫోన్ చేసి మాట్లాడుతాడు. నువ్వు గంగకి వ్యతిరేకంగా చెప్పడంతో తను ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.. ఇక తను ఈ లోకంలో ఉండదు. నువ్వు కూడా ఇక నాకు కాల్ చెయ్యకు.. నీతో అవసరం అయిపోయిందని వీరు అనగానే శేఖర్ షాక్ అవుతాడు. గంగకి ఏమైందని టెన్షన్ పడుతాడు.    మరొకవైపు గంగ ఏడుస్తూ గుడిలో కత్తితో తొందరగా పొడుచుకుంటుంది. అప్పుడే శేఖర్ అక్కడికి వస్తాడు. రుద్ర కూడ వస్తాడు. మరొకవైపు పారు శకుంతల దగ్గరికి వెళ్తుంది. అయ్యో పాపం గంగ ఎంత పనికి చేసింది. వాళ్ళ అమ్మనాన్నకి చెప్పారా.. ఒకవేళ గంగ చనిపోతే వాళ్ళ నాన్న అసలే మూర్ఖుడు.. మీరే కావాలని చేశారని అంటాడు. అందుకే చెప్పండి అని పారు అనగానే పెద్దసారు కోప్పడతాడు. గంగతోనే రుద్ర ఇంటికి వస్తాడని పెద్దసారు చెప్తాడు.   మరొకవైపు ఎంత పని చేసావ్ గంగ.. నేను అబద్ధం చెప్పాను.. నా వల్లే ఇదంతా అని శేఖర్ ఏడుస్తుంటే రుద్ర వింటాడు. అప్పుడే గంగ లేస్తుంది.. ఇదంతా నాటకం అన్నా.. నీ నుండి నిజం చెప్పించండానికి అని గంగ అనగానే శేఖర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.