Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...‘గుప్పెడంత మనసు’ నుంచి వెళ్లిపోయిన దేవయాని!
posted on: Feb 15, 2023 9:11AM
.webp)
గుప్పెడంత మనసు సీరియల్ టాప్ వన్ ప్లేస్ లో సెట్ ఐపోయింది. ఈ సీరియల్ లో అందరివీ అద్భుతమైన పాత్రలు. అందులో దేవయాని పాత్ర మాత్రం సూపర్ గా ఉంటుంది. లేడీ విలన్ రోల్ లో మిర్చి మాధవి ఫుల్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. కానీ ఇప్పుడు ఇక మీదట ఈ సీరియల్ నుంచిఈ రోల్ నుంచి ఆమె తప్పుకుంటోంది. ఐతే ఆమె ఈ సీరియల్ నుంచి వెళ్ళిపోతోందన్న విషయం తెలిసిన ఫాన్స్ మాత్రం చాలా బాధపడుతున్నారు. కార్తీక దీపంలో మోనిత రోల్ ఎంతగా ఆడియన్స్ లోకి వెళ్ళిపోయి క్లిక్ అయ్యిందో...ఈ గుప్పెడంత మనసు సీరియల్ లో దేవయాని క్యారెక్టర్ కూడా అంతే స్పీడ్ తో ఆడియన్స్ కి కనెక్ట్ ఐపోయింది. ఇప్పుడున్న సీరియల్స్ లో లేడీ విలన్ రోల్స్ కి వీళ్ళు పెట్టింది పేరు. దేవయాని అలియాస్ మిర్చి మాధవి యూకేకి వెళ్ళిపోతోందంటూ ఈ సీరియల్ టీమ్ లో కొంత మంది ఇన్స్టాగ్రామ్ పేజీలో పిక్స్ పెట్టారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో దేవయానికి ఆ సీరియల్ యాక్టర్స్ అంతా సెండాఫ్ చెప్పిన వీడియో, ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆమె చివరి ఎపిసోడ్ షూటింగ్ పూర్తయ్యింది. దేవయాని సీరియల్ నుంచి తప్పుకునేసరికి రిషి అలియాస్ ముఖేష్ గౌడ పెద్దమ్మా అంటూ ఎమోషనల్ అయ్యాడు. ధరణి పాత్రలో నటించిన సీతామహాలక్ష్మి లవ్ యూ, మిస్ యూ అంటూ పోస్టులు పెట్టింది. ఇక ఆమె నటనకి ఎంతో మంది ఫాన్స్ కూడా ఉన్నారు. నెటిజన్లు కూడా మిస్ యూ దేవయాని మేడం అంటూ కామెంట్ చేశారు. ఈ సీరియల్ లో ఆల్రెడీ రిషి ఫ్రెండ్ గా నటించి గౌతమ్ అలియాస్ కిరణ్ కాంత్ బ్రహ్మముడి సీరియల్ కి షిఫ్ట్ ఐపోయాడు. ఇప్పుడు దేవయాని రోల్ కూడా ఆగిపోయింది. ఐతే ఈమె ప్లేస్ ని ఎవరితో రీప్లేస్ చేస్తారో వాళ్ళు ఇంతా బాగా సీన్ పండిస్తారో తెలియదు. మాధవి మిర్చి మూవీలో అద్భుతంగా నటిచడం కాదు ఆడియన్స్ మనసుల్లో జీవించేసింది. అందుకే అప్పటినుంచి ఆమెకు మిర్చి మాధవి అనే పేరు ఫిక్స్ ఐపోయింది. 100 % లవ్, శతమానం భవతి, గద్దలకొండ గణేష్ వంటి మూవీస్ లో ఈమె నటించింది.
ఇక బుల్లితెర విషయానికి వస్తే త్రిశూలం సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చి కథలో రాజకుమారి, చిన్నారి, కంటే కూతుర్నే కనాలి సీరియల్స్ తో మంచి పేరు సంపాదించుకుంది.






