Brahmamudi : కావ్య, అప్పుల శ్రీమంతం.. రుద్రాణిని గెంటేసిన దుగ్గిరాల కుటుంబం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -923 లో... కావ్య దగ్గరికి కనకం వచ్చి ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అప్పుడే ఇందిరాదేవి వస్తుంది. మీ వల్లే నా కూతురు ఈ రోజు ఇంత సంతోషంగా ఉందని ఇందిరాదేవితో కనకం అంటుంది. అదంతా దూరం నుండి రేఖ, రుద్రాణి చూస్తూ వీళ్ళందరు.. ఇక్కడే ఉన్నారు. ఈ మందు ఇప్పుడు కలపలేమని రేఖతో రుద్రాణి అంటుంది. అప్పు, కావ్య శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఇద్దరు శ్రీమంతం కుర్చీలో కూర్చుంటారు.  ముందుగా పుట్టింటి సారె పెట్టాలని కనకం అంటుంది. అలా కాదమ్మా ముందు తమ భర్తలు ఒడి నింపాలని పంతులు చెప్తాడు. దాంతో రాజ్, కళ్యాణ్ ఇద్దరు వెళ్లి అప్పు, కావ్యలని ఆశీరదిస్తారు. మరొకవైపు అందరు శ్రీమంతం హడావిడిలో ఉంటే కావ్య గదిలోకి రుద్రాణి వెళ్లి అక్కడ తను తాగే కశాయంలో పసరు మందు కలపబోతుంటే అప్పుడే కనకం వచ్చి ఆపుతుంది. ఏం చేస్తున్నావని కనకం అనగానే.. కావ్య ఇది మర్చిపోయింది అందుకేనని భయపడుతుంది. కనకం కోపంగా మాట్లాడేసరికి కనకాన్నే దబాయిస్తుంది రుద్రాణి. ఆ తర్వాత అందరు అప్పు, కావ్యలని ఆశీర్వదిస్తారు. అమ్మ ఎక్కడ అని కావ్య, అప్పు అనుకుంటారు. రుద్రాణి ఇద్దరిని ఆశీర్వదిస్తుంటే  వద్దని కనకం అంటుంది. రుద్రాణికి పసరు మందు ఇచ్చిన అతన్ని తీసుకొని కనకం ఎంట్రీ ఇస్తుంది. దాంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఈ రుద్రాణి, కావ్య కడుపులో బిడ్డని చంపాలని అనుకుంది. కశాయంలో పసరు మందు కలపబోతుంటే నేను ఆపాను.. పైగా నన్నే దబాయించింది డౌట్ వచ్చి వీడిని పట్టుకొని తీసుకొని వచ్చాను. ఆ పసరు మందు ఇచ్చింది వీడేనని కనకం అన్ని చెప్పేస్తుంది. అందరు షాక్ అవుతారు. ఇంకా తప్పుని కప్పిపుచ్చుకోవాలని రుద్రాణి ట్రై చేస్తుంటే.. ఇంత సాక్ష్యం కన్పిస్తుంది నువ్వు తప్పించుకోలేవని కనకం అంటుంది. తరువాయి భాగంలో రుద్రాణిని ఇంట్లో నుండి గెంటేస్తారు. రాహుల్, రేఖ ఇద్దరికి దుగ్గిరాల కుటుంబం నాశనం చెయ్యమని చెప్తుంది. మరొకవైపు నేను డెలివరీ అయ్యే టైమ్ కి మీరు నాతో పక్కన ఉండాలని రాజ్ దగ్గర కావ్య మాట తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్.. నిజం తెలిసి షాకైన శివన్నారాయణ!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -560 లో.. కార్తీక్, దీప ఇంటికి వస్తారు. వాళ్ళు రాగానే సుమిత్ర రిపోర్ట్స్ శివన్నారాయణ ఎదురుగా పెట్టి రిపోర్ట్స్ కార్ లో ఉన్నాయి.. కావాలనే అక్కడ పెట్టావ్ కదా. రిపోర్ట్స్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేశా.. డాక్టర్ హారిక అంట.. మీకు కార్తీక్ ఏం చెప్పలేదా తనని అడగండి అంటుంది. అసలు ఏమైంది ఎవరికి ప్రాబ్లమ్ అని కార్తీక్ ని శివన్నారాయణ నిలదీస్తాడు. మరొకవైపు జ్యోత్స్న చేసిన మోసాన్ని బయటపెట్టాలని శివన్నారాయణ దగ్గరికి శ్రీధర్ వస్తాడు. ఆ తర్వాత కార్తీక్ మా దగ్గర ఏదో దాస్తున్నావని శివన్నారాయణ కోప్పడతాడు. అప్పుడే సుమిత్ర వస్తుంది. ఆ రిపోర్ట్స్ లో ఏముంది మా అయనకి ఏమైందని సుమిత్ర అడుగుతుంది. ఎవరు ఎంత అడిగినా చెప్పకపోయేసరికి శివన్నారాయణకి కోపం వచ్చి కార్తీక్ ని కొడుతాడు. అప్పుడే శ్రీధర్ వస్తాడు. అసలు ఏమైందంటు సుమిత్ర దగ్గుతూ కిందపడిపోతుంది. వెంటనే డాక్టర్ ని పిలుస్తాడు. లోపల సుమిత్రకి డాక్టర్ ట్రీట్ మెంట్ ఇస్తుంటే బయట ఇప్పుడు అయిన నిజం చెప్పారా అని కార్తీక్ కాలర్ పట్టుకుంటాడు దశరథ్. అప్పుడే డాక్టర్ వచ్చి కార్తీక్ నిజం చెప్పడు.. అతని కాలర్ వదలమని చెప్తుంది. సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్.. ట్రీట్ మెంట్ చేస్తే తగ్గే స్టేజిలోనే ఉందని డాక్టర్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్సప్లాంటేషన్ చెయ్యాలి.. అలా చేస్తే సుమిత్ర గారు బతుకుతారు. సుమిత్ర గారి కూతురు ఎవరైనా ఉన్నారా అని డాక్టర్ అడుగుతుంది. దీపని చూసి ఇమేని చూడగానే సుమిత్ర కూతురు అనుకున్నానని డాక్టర్ అనగానే తన పక్కనున్న జ్యోత్స్న, సుమిత్ర కూతురు అని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్ననే సుమిత్రని బ్రతికిస్తుందని డాక్టర్ చెప్తుంది. సర్జరీ చెయ్యాలంటే  సుమిత్ర గారి కూతురిది అయితేనే మ్యాచ్ అవుతుందని డాక్టర్ చెప్పగానే నేను కూతురిని కాదు కదా అని జ్యోత్స్న భయపడుతుంది. ఇక నిజం తెలిసిపోతుందని పారిజాతం భయపడుతుంది. ఆ తర్వాత సుమిత్రకి నిజం చెప్పే దైర్యం చెప్పండి అని డాక్టర్ వెళ్ళిపోతుంది.  కార్తీక్ కి శివన్నారాయణ, దశరథ్ సారీ చెప్తారు. శ్రీధర్ ఫైల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : భాగ్యం, ఆనందరావు డ్రామా.. అమూల్య పెళ్ళిచూపులు జరుగుతాయా!

 స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -361 లో..... తిరుపతి ఫోన్ లో తన అతిలోక సుందరితో మాట్లాడుతుంటే సాగర్, ధీరజ్,చందు వచ్చి వింటారు. నువ్వు ఒకసారి తనని కలుస్తానని అడుగు మావ అని ధీరజ్ అనగానే ఈ రోజు నిన్ను కలుస్తానని అంటాడు. తను ఈ రోజు సాయంత్రం కలవమని అడ్రెస్ చెప్తుంది. అ తర్వాత ధీరజ్ ఫోన్ చూస్తుంటే తనని డిస్టబ్ చెయ్యాలని ప్రేమ చాలా ట్రై చేస్తుంది. అ తర్వాత మావయ్య ధీరజ్ నాపై కోప్పడుతున్నాడు. పెళ్లివాళ్లకు కావలసిన స్వీట్ తీసుకొని వద్దామంటే వద్దని ధీరజ్ అంటున్నాడని కావాలనే రామరాజుకి చెప్తుంది ప్రేమ. ఒరేయ్ అమ్మాయిని తీసుకొని వెళ్ళు.. ఎందుకు వినడం లేదు అమ్మాయితో వెళ్లి స్వీట్ తీసుకొని రా అని రామరాజు అనగానే ఇక తప్పక ధీరజ్ వెళ్తాడు. మధ్యలో పెట్రోల్ అయిపోతే ప్రేమని దిగమని కోప్పడతాడు. దాంతో ప్రేమతో చెప్పమని అంటుంది ప్రేమ. ఇక ధీరజ్ కోపంగా తను బైక్ మీద ఉండగానే తోసుకొని వెళ్తాడు. పెట్రోల్ కొట్టిస్తాడు. ధీరజ్ కి తెలియకుండా తన జేబులో పర్సు తీస్తుంది ప్రేమ. తీరా పెట్రోల్ కి డబ్బులు ఇద్దమంటే పర్సు ప్రేమ చేతిలో ఉంటుంది. ఇక ధీరజ్ కి కోపం వచ్చి బైక్ అక్కడే వదిలేసి వెళ్తుంటే ప్రేమ అతనికి డబ్బు ఇచ్చి బైక్ వేసుకొని ధీరజ్ వెనకాల వెళ్తుంది. మావయ్య ధీరజ్ నాతో గోడవపడ్డాడని ఫోన్ లో చెప్పినట్లు ప్రేమ యాక్టింగ్ చెయ్యగానే ధీరజ్ వస్తాడు. ఏం చెయ్యలేక ప్రేమ బైక్ డ్రైవ్ చేస్తుంటే వెనకాల కూర్చుంటాడు ధీరజ్. మరొకవైపు అముల్యని చూడడానికి వచ్చేవాళ్ళకి ఎదురుగా మారువేషంలో భాగ్యం, ఆనందరావు వెళ్తారు. మీరు చూడాలని అనుకుంటున్న అమ్మాయి వేరొకరితో లవ్ లో ఉందని చెప్తారు. అ తర్వాత రామరాజు ఇంట్లో పెళ్లిచూపులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తారు. వాళ్ళు రారుగా అని శ్రీవల్లి అనుకుంటుంది. అంతలోనే పెళ్లిచూపులకి వచ్చే వాళ్ళు కార్ లో ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఈ సంక్రాంతికి ప్రదీప్ - సుధీర్ పెళ్లిళ్ల మీద పందేలు!

ఇంకొన్ని రోజుల్లో సంక్రాంతి పండగ రాబోతోంది. బుల్లితెరలో సందడి మొదలయ్యింది. రకరకాల షోస్ ని పండగ సందర్భంగా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. ఇక జీ తెలుగులో సంక్రాంతి అల్లుళ్ళు పండగకు వస్తున్నారు" పేరుతో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఒక షో ప్రసారం కాబోతోంది. దీనికి జడ్జెస్ గా ప్రదీప్-సుధీర్ ఉన్నారు.  "ప్రదీప్ ని సంక్రాంతికి అల్లుడిని చేసే బాధ్యత నాది" అంటూ హీరోయిన్ రోజా చెప్పింది. "సుధీర్ ని సంక్రాంతికి అల్లుడిని చేసే బాధ్యత నాది" అంటూ శేఖర్ మాష్టర్ చెప్పాడు. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అనుకున్నారు. ఇక పెళ్లి కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ప్రదీప్ - సుధీర్ ఇద్దరూ వచ్చి "పందేలేదో కోళ్ల మీద వేసుకోవాలి కానీ మా పెళ్లిళ్ల మీద వేసుకుంటారేమిటి" అంటూ ఇద్దరూ అడిగేసారు.  ఇక ఈ ఈవెంట్ కి కూడా జీ లిటిల్ చాంప్స్ షోలో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా ఉండే లిటిల్ సింగర్ వరుణవి కూడా వచ్చేసింది. దాంతో సుధీర్ వచ్చి "పండగ ఈవెంట్ లో కూడా అడుగు పెట్టేశావా" అని అన్నాడు. వెంటనే ఆ చిన్నారి "మనం అడుగు పెట్టాకే కదా పండగ మొదలయ్యేది" అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక ఈ షోకి మాస్ మహారాజ రవితేజ, కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు బుల్లితెర మీద కనిపించేవాళ్లంతా ఈ ఈవెంట్ కి వచ్చారు. "అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలుపెట్టి" అంటూ రవితేజ గురించి ఇంట్రడక్షన్ ని సుధీర్ ఇస్తూండేసరికి "మళ్ళీ మొదలు పెట్టాడురా బాబోయ్" అంటూ రవితేజ కామెడీగా అసహనం వ్యక్తం చేశారు. ఇక నెటిజన్స్ ఐతే సుధీర్ - ప్రదీప్ కాంబో చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. బెస్ట్ ఎంటర్టైనర్స్ అంతా కలిసి వచ్చారు. అబ్బా సూపర్ సుధీర్ ఉంటే చాలు. ఇంకా తోడుగా ప్రదీప్ రచ్చ రచ్చే..బొమ్మ అదుర్స్ కదు..టిఆర్పి పగిలిపోద్ది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గోవాలో బట్టల్లేకుండా క్లిప్స్ తీసిన రాంప్రసాద్!

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. "ఫామిలీ ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్" పేరుతో షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో స్టార్టింగ్ లో పంచ్ ప్రసాద్, వాళ్ళ వైఫ్ సునీత, రాంప్రసాద్ మధ్య జరిగిన కామెడీ కన్వర్జేషన్ వింటే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. "బాబాయ్ గా మొన్న మీ రీల్స్ చూసాను ఇంకొన్ని రీల్స్ చేయొచ్చుగా" అని రాంప్రసాద్ పంచ్ ప్రసాద్ ని అడిగాడు. "చేద్దామనుకున్నాను ఎక్కడా ఉత్తినే నీరసపడిపోతేనూ" అంటూ వాళ్ళావిడ సునీత మీద కౌంటర్లు వేసాడు పంచ్ ప్రసాద్. "అబ్బో సర్ శక్తిమాన్ 3 డి మరి" అని సునీత డైలాగ్ వేసేసరికి స్టేజి మీద ఉన్న అందరూ నవ్వేశారు. "చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్" అంటూ ప్రసాద్ మళ్ళీ సీరియస్ అయ్యాడు. "నువ్వు ఎక్కువ మాట్లాడకు. ఆరోగ్యశ్రీలో అన్ని పథకాలు అమలయ్యేది నీకే తెలుసా" అని రివర్స్ కౌంటర్ ఇచ్చేసింది. అంతే అందరూ నవ్వేశారు. ఇక తర్వాత సింగర్ లిప్సిక వచ్చి అదిరిపోయే సాంగ్స్ పాడి ఎంటర్టైన్ చేసింది. తర్వాత ఒక సెగ్మెంట్ చేశారు. పెద్ద పెద్ద రోలింగ్ డ్రమ్స్ మీద ఒక ఫ్లాట్ గా ఉన్న చెక్కతో చేసిన మ్యాట్ వేశారు. ఆ డ్రమ్స్ రోల్ అవుతూ ఉంటె అటు ఇటు ఆ మ్యాట్ మీద పండు "ఇటుక మీద ఇటుక" సాంగ్ ని చేసాడు. ముందు చేసిన పంచ్ ప్రసాద్ మాత్రం సరిగా చేయలేకపోయాడు.  అలాగే ఇంకో ఇంటరెస్టింగ్ సెగ్మెంట్ కూడా పెట్టారు.  ఒక ఎక్వేరియంలో వాటర్ పోసి ఒక నిమ్మకాయ వేసి ఆ తేలే నిమ్మకాయ మీద కాయిన్ ని బాలన్స్ చేయాలనీ చెప్పింది రష్మీ. సుహాసిని, ఆదర్శ్, పంచ్ ప్రసాద్, తాగుబోతు రమేష్ వంటి వాళ్లంతా ట్రై చేశారు. తర్వాత  వైరల్ వంటలక్క ధరణి - ఆదర్శ్ కలిసి "శుభలేఖ రాసుకున్న" సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక నాటీ నరేష్ వచ్చి "మొన్న గోవా వెళ్ళావ్ కదా ఏవన్నా ఫొటోస్ తీసావా" అంటూ నాటీ నరేష్ రాంప్రసాద్ ని అడిగాడు. "బట్టల్లేకుండా క్లిప్స్ తీసా కొన్ని" అంటూ రాంప్రసాద్ చెప్పాడు. "మరి చూపించవా.. నేనెవరికీ చెప్పా" అన్నాడు నరేష్. "అసలు బట్టల్లేకుండా క్లిప్స్ తీయడం చాలా కష్టం తెలుసా" అంటూ రాంప్రసాద్ బట్టలకు పెట్టుకునే క్లిప్స్ తీసి చూపించాడు అంతే నరేష్ పడీ పడీ నవ్వుకున్నాడు. "ఫామిలీ ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్"లో అంతా రకరకాల ఫోజులతో ఫొటోస్ దిగారు.

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే బిల్డింగ్ పై నుంచి తోసేస్తాం!

బుల్లితెర మీద హైపర్ ఆది కంటే అతను వేసే పంచులు ఫుల్ ఫేమస్ అవుతాయి. అలాంటి ఆది రీసెంట్ గా ఒక షోలో తన గురించి పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు. "పాలిటిక్స్ అన్నప్పుడే ఇలాంటివి ఉంటాయి. నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో నేను ఇవతల పక్క పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా మాట్లాడినందుకు ఒక 10 మంది సీనియర్స్ నన్ను పైకి తీసుకెళ్లి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే బిల్డింగ్ పై నుంచి తోసేస్తాం అన్నారు. కానీ ఇప్పటికీ ఆ సప్లిమెంట్స్ రాసుకుంటూ ఆ బిల్డింగ్ చుట్టూనే తిరుగుతున్నారు కానీ నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేసా. ఆ రోజుల్లో ఇలాంటి బెదిరింపులు చాలా ఉండేవి. ఆ తరవాత నా మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం ఫేక్ పోస్టులు పెట్టడం వంటివి అప్పట్లోనే స్టార్ట్ చేశారు కానీ ఈరోజు కూడా నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాను. నేను ఓన్లీ ఈ షోస్ మాత్రమే కాదు ప్యారలల్ గా పాలిటిక్స్ లో కూడా ఉంటున్నాను కదా అందుకే కొంతమంది నా మీద ఆ నెగటివిటీని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నేను వచ్చాక ఎన్ని మంచి షోస్ చేసాను ఎంత రేటింగ్ వచ్చింది అనేది మల్లెమాల వాళ్లకు, ఈటీవీ వాళ్లకు తెలుసు అందుకే నేను ఇంకా కంటిన్యూ అవుతున్నాను.  నా వ్యూయర్ షిప్ చెప్తుంది నేనేంటి అనేది. బాడీ షేమింగ్ అంటారు కానీ కోట శ్రీనివాస్ రావు గారు కొన్ని సినిమాల్లో బాబు మోహన్ గారిని ముళ్ళపంది, నల్లపెంకు అంటారు. అది వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్. ఆ కామెడీ అప్పుడు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ కూడా మేమంతా ఎవరి మీద ఎవరు కామెడీ చేయాలనుకున్నా అది ముందే వాళ్లకు చెప్పి అంతా ఓకే అనుకున్నాకే టెలికాస్ట్ వరకు వస్తుంది. ఇంత పద్దతిగా మాట్లాడేవాళ్ళు షిర్డీ సాయి బాబా సినిమాకు ఒక 100 కోట్ల కలెక్షన్ తీసుకురావచ్చు కదా అలాంటి సినిమాలకు ఎవరూ వెళ్ళరు. ఒక స్కిట్ లో అన్ని ఉంటాయి. సోషల్ మీడియా గురించి అస్సలు పట్టించుకోను. పాలిటిక్స్ లో నాకు నచ్చిన నాయకుడికి లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తాను" అని చెప్పాడు ఆది.

Podharillu : చక్రి సాయంతో మహా పెళ్ళి నుండి తెప్పించుకుంటుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -21 లో.... మహా అన్నమాటలకి భూషణ్ కోపంగా ఉంటాడు. భూషణ్ తో అలా మాట్లాడినందుకు మహాపై ప్రతాప్ చెయ్ చేసుకుంటాడు. నన్ను సైకో అంటుంది. ఇలా పెంచారేంటి అంకుల్ అని ప్రతాప్ తో భూషణ్ అనగానే దానికేం తెలియదు బాబు ఈ ఒక్కసారికి క్షమించండి అని ప్రతాప్ అనగానే.. మా అమ్మవాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని భూషణ్ అంటాడు. వద్దు బాబు చెప్పకండి అని మహా వాళ్ల అమ్మ అంటుంది. భూషణ్ వెళ్ళిపోయాక మహాతో మాట్లాడాలి వెళ్లి తీసుకొని రా అని ఆదిత్యని పంపిస్తాడు. అది వెళ్లి మహా నిన్ను డాడీ రమ్మంటున్నాడని చెప్తాడు. ఇంకా ఏమైనా అనేటివి ఉన్నాయా అని మహా కోపంగా మాట్లాడేసరికి హారిక నువ్వు తనని తీసుకొని రా అని ఆదిత్య చెప్పి వెళ్ళిపోతాడు. మహా కిందకి వస్తుంది. నువ్వు అల్లుడు గారితో ఇక బాగుండాలని‌ మహాతో వాళ్ళ నాన్న చెప్తాడు. వాడు నాకు ఇష్టం లేదని మహా అంటుంది. ఎందుకు ఇష్టం లేదు ఒక కారణం చెప్పమని అడుగుతాడు. నువ్వు ఇంకా ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని ప్రతాప్ అనగానే అందరు షాక్ అవుతారు. మీరు నా గురించి ఇలా మాట్లాడుతున్నారేంటి.. నేను ఎలాంటి దానినో మీకు తెలియదా అని మహా ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఏది ఏమైనా భూషణ్ తో నీ పెళ్లి జరుగుతుందని ప్రతాప్ చెప్తాడు. అదంతా చక్రి వింటాడు. మహా గురించి చక్రి ఆలోచిస్తాడు. అప్పుడే మహా కోపంగా వచ్చి నేను ఇంట్లో నుండి వెళ్ళిపోదామనుకుంటున్న.‌ నా మనసు ఏంటో అర్థం చేసుకొని చోట నేను ఉండను కమ్యూనిటి గురించి ఆలోచిస్తున్నారు కానీ కన్నకూతురు గురించి ఆలోచించడం లేదు అలాంటప్పుడు నేను ఎందుకు ఆలోచించాలి.. ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి నువ్వు హెల్ప్ చేస్తావా అని మహా అనగానే సరే అని చక్రి అంటాడు. మరుసటిరోజు ప్రతాప్ , తన భార్య కులదైవం గుడికి వెళ్తుంటే.. అల్లుడు గారు ఫోన్ చేస్తే బాగా మాట్లాడమని ప్రతాప్ కోపంగా చెప్తాడు. మహా అసలు వాళ్ల నాన్న వైపు కూడా చూడదు. ఆ తర్వాత మహా వాళ్ల అమ్మ కార్ దగ్గర వరకు వెళ్లి.. మళ్ళీ మహా దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. తరువాయి భాగంలో మహా ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు. వాళ్ళకి కూడా గంగ కరెక్ట్ గానే సమాధానం చెప్తుంది. మరొకవైపు రుద్ర బయట టీ స్టాల్ దగ్గర ఉంటాడు. అక్కడ ఒకతను రుద్రని గుర్తుపట్టి మాట్లాడుతాడు. మీ వల్లే నేను ఇలా ఉన్నాను సర్.. మీరు పోటీలో ఉంటే మాకు చాలా ఆసక్తిగా అనిపించేది.. మిమ్మల్ని ఎవరు బీట్ చెయ్యలేరు సర్ మీ పంచ్ పవరే వేరు అని రుద్ర గురించి అతను చాలా గొప్పగా చెప్తాడు. మరొకవైపు గంగ సెలక్షన్ లో పాల్గొనకుండా పారు ప్లాన్ చేస్తుంది. తనపై కూల్ డ్రింక్ పడేలా చేస్తుంది. దాంతో క్లీన్ చేసుకోవడానికి గంగ వెళ్తుంది. గంగ వెళ్ళగానే పారు బయట నుండి డోర్ పెడుతుంది. గంగ డోర్ తియ్యమని ఎంత అరిచినా ఎవరు డోర్ తియ్యరు. మరొక పక్క సెలక్షన్ కి టైమ్ అయిపోతుంది.  అప్పుడే సెక్యూరిటీ డోర్ తియ్యగా గంగ వచ్చి తన పేరు చెప్తుంది. ఏమైందని అక్కడున్న వాళ్ళు అడుగగా ఎవరో బయట నుండి గడియ పెట్టారని గంగ చెప్తుంది. తన పేరుని గంగ చెప్తుంది. దాంతో మైక్ లో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్ అని చెప్పగానే రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు గంగ, రుద్ర ఇద్దరు సెలక్షన్ ప్రాసెస్ కి వెళ్ళారని శకుంతలకి ఇషిక, వీరు చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది. మరుసటి రోజు శ్రీమంతంకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. రాజ్, కళ్యాణ్ ఇద్దరు కలిసి అప్పు, కావ్యలకి బంగారం గాజులు తీసుకొని వస్తారు. అవి చూసి అపర్ణ, ధాన్యాలక్ష్మి బాగున్నాయని చెప్తారు. కనకం మాత్రం శ్రీమంతం కోసం మట్టి గాజులు వాడాలి. లోపల బిడ్డకి మంచిది అని చెప్పగానే సరే తెప్పిస్తానని రాజ్ అంటాడు. మరొకవైపు కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి జుట్టుకి సామ్రాణి పడుతాడు. ఆ తర్వాత అప్పు దగ్గరికి కళ్యాణ్ వెళ్లి రెడీ చెయ్యాలా అని అడుగుతాడు. అప్పుడే ధాన్యాలక్ష్మి వచ్చి నువ్వేం అవసరం లేదు. నేను రెడీ చేస్తానని ధాన్యాలక్ష్మి అంటుంది. ధాన్యాలక్ష్మి తనపై చూపించే ప్రేమకి అప్పు ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత రేఖ, రుద్రాణి కలిసి కావ్య తాగే దాంట్లో పసరు మందు కలపాలని ట్రై చేస్తారు. కావ్య దగ్గరకి కనకం వచ్చి ఎంత అందంగా ఉన్నావే అని కూతురిని చూసి మురిసిపోతుంది. తరువాయి భాగంలో కావ్య, అప్పులకి శ్రీమంతం జరుగుతుంటే రుద్రాణి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటే వద్దని కనకం అపుతుంది. ఈ రుద్రాణి కావ్య కడుపులో బిడ్డని చంపాలని అనుకుందని పసరు మందు ఇచ్చిన అతన్ని కనకం తీసుకొని వస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : స్వప్న ఇచ్చిన పెన్ డ్రైవ్ చూసి శ్రీధర్ షాక్.. కార్తీక్ నిజం చెప్తాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -559 లో....సుమిత్ర గురించి కార్తీక్ ఆలోచిస్తుంటే అప్పుడే దీప వస్తుంది. ఏంటి బావ అలా ఉన్నావ్.. అమ్మ గురించి ఏదైనా దాస్తున్నావా అని అడుగుతుంది. అదేం లేదని కార్తీక్ అంటాడు. అప్పుడే శ్రీధర్ ఫోన్ చేసి జ్యోత్స్న ఫ్రాడ్ చేసిందని నిరూపించే ఫైల్స్ లేవు అలాగే సిస్టమ్ లో డాటా కూడా లేదని శ్రీధర్ చెప్తుంటే ఎందుకు నాన్న అంత నెగ్లెట్ గా ఉన్నావని శ్రీధర్ పై కార్తీక్ కోప్పడతాడు. అప్పుడే కాంచన వచ్చి మళ్ళీ ఏమైందని అడుగుతుంది. నాన్న చిన్న తప్పు చేసాడని చెప్తాడు. మళ్ళీ ఆయన ఎందుకు ఆఫీస్ కి వెళ్ళడని కాంచన అడుగుతుంది. తాతనే చెప్పాడని కార్తీక్ అంటాడు. మరుసటి రోజు స్వప్న కబోర్డు లో ఉన్న కాశీ షర్ట్స్ చూసి బాధపడుతుంది. షర్ట్స్ అన్ని తీస్తుంటే అందులో ఫైల్స్ పెన్డ్రైవ్ ఉంటుంది. అది చూసి నాన్నకి‌ కాశీ ఇవ్వడం మర్చిపోయాడేమోనని శ్రీధర్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఏంటి అండి ఇంత త్వరగా రెడి అయ్యారని శ్రీధర్ తో కావేరి అంటుంది. స్టేషన్ కి వెళ్ళాలి కాశీ దగ్గరికి అనగానే అప్పుడే స్వప్న ఫైల్స్ తీసుకొని వచ్చి ఇస్తుంది. అది చూసి శ్రీధర్ షాక్ అవుతాడు. అల్లుడు నన్ను మోసం చేసాడు. ఇదంతా చేసింది వైరా కాదు జ్యోత్స్న అని శ్రీధర్ అంటాడు. అవ్వన్నీ ఫైల్స్ తీసుకొని ఇవన్నీ ఎవరికి చూపించాలో నాకు తెలుసు అక్కడికే వెళ్తున్నానని శ్రీధర్ అక్కడ నుండి బయల్దేరతాడు. మరొకవైపు సుమిత్ర గురించి  కాంచన, దీపలకి చెప్పాలని కార్తీక్ అనుకుంటాడు కానీ చెప్పలేకపోతాడు. ఏంటి బావ ఏదో చెప్పాలని అనుకుంటున్నావ్.. చెప్పకపోతే బిడ్డపై ఒట్టే అని దీప అనగానే.. అత్తకి చిన్న హెల్త్ ప్రాబ్లమ్ ఉందని చెప్తాడు. చిన్న ప్రాబ్లమ్ అయితే నువ్వు ఇలా ఉండవని దీప అంటుంది. మనకి టైమ్ అవుతుంది పదా అని దీపని తీసుకొని శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు కార్తీక్. వచ్చావా ఇదేంటో తెలుసా సుమిత్ర రిపోర్ట్స్ అని శివన్నారాయణ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. కార్ లో మర్చిపోయావ్. హాస్పిటల్ కి ఫోన్ చేసి డాక్టర్ తో మాట్లాడాను. అసలు విషయం చెప్పారనగానే కార్తీక్ టెన్షన్ పడుతాడు. నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అనగానే కార్తీక్ ఇంకా టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : శ్రీవల్లికి షాకిచ్చిన విశ్వ.. అమూల్య పెళ్ళిచూపులు జరుగుతాయా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -360 లో.....ఇంట్లో గోడవ జరిగింది కదా.. ఆ మూడ్ నుండి బయటకి రావడానికి శ్రీవల్లి అందరిని హాల్లోకి పిలుస్తుంది. అందరం సరదాగా అంత్యాక్షరి ఆడుకుందామని అంటుంది. దాంతో ఎందుకు ఇప్పుడు అదంతా అని వేదవతి అంటుంది. అయిన వినకుండా స్లిప్స్ లో అక్షరం రాసి ఒక దాంట్లో వేసి తిరుపతికి ఇస్తుంది. అందులో తిరుపతి ఒక్కొకటిగా తీస్తాడు. మొదట శ్రీవల్లి ఆ తర్వాత నర్మద, ప్రేమ వాళ్ళకి వస్తుంది. రామరాజు కూడా ఒక పాట పాడుతాడు. అలా ఇల్లంతా సందడిగా మారుతుంది. అప్పుడే భాగ్యం, ఆనందరావు ఇద్దరు వస్తారు. మీరు ఎందుకు వచ్చారని శ్రీవల్లి వాళ్లపై కోప్పడుతుంది. వాళ్ళని బయటికి తీసుకొని వెళ్లి ఎందుకు వచ్చారని అడుగుతుంది. దాంతో విశ్వ నుండి ఇద్దరు తప్పించుకోబోతుంటే వాళ్ళకి ఎదురుగా విశ్వ వస్తాడు. మీరు అమూల్య పెళ్లిచూపులు ఆపకుంటే మిమ్మల్ని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన విషయం ఇద్దరు శ్రీవల్లికి చెప్తారు. అలా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే ఇంటి పైనుండి విశ్వ చూస్తాడు. అతడిని చూసి వాళ్లు ఇంకా భయపడుతారు. మరొకవైపు అమూల్యకి పెళ్లిచూపులని వేదవతి కంగారుపడుతూ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఆ తర్వాత తిరుపతి తన అతిలోక సుందరితో ఫోన్ మాట్లాడుతుంటే సాగర్,చందు, ధీరజ్ వచ్చి.. మావ నిన్ను చూస్తుంటే ఎక్కడో బోర్లా పడుతావపిస్తుందని తనని ఆటపట్టిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శివుడిని ధ్యానిస్తూ ఆవుకు అరటిపళ్ళు తినిపిస్తున్న గుప్పెడంత మనసు జగతి మేడం

  జ్యోతి పూర్వాజ్ గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అందులో రిషి రోల్ కి తల్లిగా జగతి మేడంగా బాగా పేరు తెచ్చుకుంది. హాట్ ఫొటోస్ తో ఆడియన్స్ ముందు కనిపించే జ్యోతి రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇంటరెస్టింగ్ అండ్ డివైన్ ఫొటోస్ తో కనిపించింది.    శివాలయానికి వెళ్లిన జ్యోతి శివుడిని ఆరాధిస్తూ ఆయన ధ్యానంలో మునిగితేలుతోంది. అలాగే అక్కడే ఉన్న గోశాలలో ఆవులకు అరటిపళ్ళు తినిపిస్తూ ఉన్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.    ఇక నెటిజన్స్ ఆమె పెట్టె ప్రతీ పోస్ట్ కి నెగటివ్ గా కామెంట్స్ చేసేవాళ్ళు కానీ ఈ పిక్స్ దగ్గర మాత్రం ఎలాంటి బాడ్ కామెంట్స్ పెట్టలేదు. "బాహ్యప్రపంచానికి దూరంగా, మనస్సుకు దగ్గరగా..హ్యాపీ జనవరి మేడం గారు..ఇదే అసలైన నువ్వు" అంటూ కొంతమంది కామెంట్స్ పెట్టారు.    ప్రస్తుతానికి జ్యోతి పూర్వాజ్ బుల్లితెర బ్రేక్ ఇచ్చింది. "కిల్లర్" అనే మూవీలో ఆమె ఒక ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించబోతోంది. గుప్పెడంత మనసు సీరియల్ తో ఆమె నటనకు మంచి మార్క్స్ పడ్డాయి. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇక్కడ తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన నటీమణుల్లో ఈమె కూడా ఒకరు.   https://www.instagram.com/p/DTCqX-MgSeP/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==  

యాంకర్ అనసూయ నా బిగ్ ఇన్​స్పిరేషన్

  బుల్లితెర మీద యాంకర్ గా వైరల్ వంటలక్కగా ఫేమస్ ఐన ధరణి ప్రియా గురించి అందరికీ తెలుసు. ఆమె కొన్ని షోస్ లో చేస్తూ ఉంటుంది. కొన్ని షోస్ ని హోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి ధరణి ఒక చిట్ చాట్ లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలను చెప్పుకొచ్చింది.    "నేను పక్కా హైద్రాబాదీ పిల్లను. ఘట్ కేసర్ మాది. బిటెక్ చదివే టైములో కాలేజీ డేస్ లాంటి షోస్ ఉండేవి కదా. కాలేజ్ కి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల షోస్, చిట్ చాట్స్ జరిగేవి, కొన్ని గేమ్స్ లాంటివి కండక్ట్ చేసేవాళ్ళు. నేను డాన్స్ లో నంబర్ 1 కాబట్టి అంటే అనుకుంటూ ఉంటాను అలా నా డాన్స్ చూసిన ఒక ప్రోగ్రాం ప్రొడ్యూసర్ మీరు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. మీరు యాంకర్ గా ట్రై చేయొచ్చు అన్నారు.    ఇక వచ్చింది నా టైం అనుకుని నా కెరీర్ ని స్టార్ట్ చేసాను. ఒక లోకల్ ఛానల్ లో వీడియో జాకీగా ఎంట్రీ ఇచ్చాను. షూటింగ్ ఐపోయాక ఇంటికి వెళ్లి మా ఆయన భుజం మీద తలపెట్టి పడుకోవాలని అనుకుంటాను. అప్పుడు ఆ పని చేయి ఈ పని చెయ్యి అంటూ ఇరిటేట్ చేస్తాడు. నాకు కోపం తెప్పించడానికి రీజన్స్ వెతుకుతాడు అదే నాకు నచ్చదు. కెమెరాకి దూరంగా ఉండొద్దు అనే రిజల్యూషన్ ని ఈ ఇయర్ తీసుకున్నాను. ఇది నా టైం కాబట్టి నేను కెమెరాకు దూరంగా ఉండకూడదు, చాలామంది మెప్పు పొందాలి  అనుకుంటున్నాను.    ఆఫ్ స్క్రీన్ కానీ ఆన్ స్క్రీన్ కానీ యాంకర్ అనసూయ నా బిగ్ ఇన్స్పిరేషన్ . చాలా సపోర్ట్ చేసింది. తన కజిన్ కావడం నిజంగా గర్వంగా ఉంటుంది. 2 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాక ఇప్పుడు వైరల్ వంటలక్క షోతో మళ్ళీ ఆడియన్స్ ముందుకు వచ్చాను.  శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆదర్శ్ తో కలిసి "శుభలేఖ రాసుకున్న" సాంగ్ కి డాన్స్ చేసాను. మా పెయిర్ కి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆదర్శ్ నాకు డాన్స్ లో బెస్ట్ కో-స్టార్. నా డ్రీం రోల్ బెస్ట్ యాంకర్ గా చేస్తూ ఉండాలి..డబ్బు కన్నా మనిషే గొప్ప. డబ్బు ఈరోజు కాకపోతే రేపు సంపాదించొచ్చు కానీ మనిషిని సంపాదించలేము" అంటూ చెప్పుకొచ్చింది ధరణి ప్రియా.  

లాక్ డౌన్ టైములో సాయి శ్రీనివాస్ మూవీ రిలీజ్ కాలేదు.. నిజంగా బ్యాడ్ లక్!

  బిబి జోడి సీజన్ 2 ఈ వారం శనివారం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఈ షోలో సాయిశ్రీనివాస్ - నయనిపావని జోడి పెర్ఫార్మ్ చేసాక శ్రీనివాస్ వాళ్ళ సిస్టర్ అంబికా స్టేజి మీదకు వచ్చి ఒక టీ కప్ తీసుకొచ్చి గిఫ్ట్ చేసింది. ఇలాంటి ఆపర్చునిటీ తన బ్రదర్ కి ఇలా దొరకడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. రోజు ఈ కప్ లో కాఫీ తాగుతూ ఎలా కష్టపడాలి అని ఆలోచించాలి ఫైనల్ గా ఎలా బిబి జోడి కప్ తీసుకోవాలి అని ఆలోచించు అంటూ విష్ చేసింది.    తర్వాత శేఖర్ మాష్టర్ కూడా ఒక విషయాన్నీ చెప్పారు. "కరెక్ట్ గా లాక్ డౌన్ టైములో సాయి ఒక మూవీ చేసాడు. నా ఫ్రెండ్ అజయ్ మంచి కొరియోగ్రాఫర్. సాయి బాడ్ లక్ అజయ్ బాడ్ లక్ ఏంటంటే లాక్ డౌన్ వచ్చింది. ఆ టైములో మూవీని ఇక్కడ రిలీజ్ చేయలేకపోయారు. దాన్ని యూఎస్ లో రిలీజ్ చేశారు. నిజంగా అలాంటి మూవీ ఇప్పుడు వస్తే డెఫినెట్ గా నువ్వు చేతికి అందవు సాయి. మంచి పొజిషన్ లో ఉంటావు. చెప్తున్నా ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్స్ చూసి నీకు అవకాశం ఇస్తే గనక నీకు నువ్వు డెఫినెట్ గా ప్రూవ్ చేసుకోగలవు ఆ టాలెంట్ నీలో ఉంది" అని చెప్పారు.    ఇక నయని పావని కూడా ఒక విషయాన్నీ చెప్పుకొచ్చింది. "నాకు ఒక అక్క ఉంది. మా అక్క కూడా అంతే. తన లైఫ్ తనకు అస్సలు చూసుకోకుండా నేనేం చేయాలి నేనేం చేస్తే బాగుంటుంది అనేదే ఆలోచిస్తుంది. నేను ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం తనే. నా పేరు పావని. మా అక్క పేరు నయని. నేను మా అక్క పేరుని పెట్టుకున్నాను. నీ పేరు ఎప్పుడు నా లైఫ్ లోకి వచ్చిందో అప్పుడు నాకు అన్నీ వచ్చాయి .నాకు మా అక్క లక్కీ చార్మ్" అంటూ చెప్పింది.  

Jayam serial: గంగని సెలెక్షన్స్ నుండి దూరం చేయాలని చూస్తున్న ఇషిక, పారు!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -159 లో... ఈ రోజు ఛాంపియన్ షిప్ సెలక్షన్ జరుగుతుంది. అందులో సెలక్ట్ అయితే వాళ్లే కోచింగ్ ఇస్తారని గంగతో రుద్ర చెప్తాడు. ఎందుకు సర్ మీరు ఆల్రెడీ నన్ను ప్రాక్టీస్ చేపిస్తున్నారు కదా అని గంగ అంటుంది. అవును కానీ అందులో సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అని రుద్ర చెప్తాడు. మనం త్వరగా వెళ్ళాలి వెళ్లి అప్లికేషన్ ఫిల్ చెయ్యాలని రుద్ర అనగానే గంగ సరే అంటుంది. అదంతా ఇషిక వింటుంది. గంగని బయటకి వెళ్లకుండా లాక్ చెయ్యాలని ఇషిక అనుకుంటుంది.    గంగ హడావిడిగా కిచెన్ లో ఉన్న వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తుంది. మళ్ళీ ఇషిక వచ్చి అంత వర్క్ అయితే పూజకి సంబంధించిన వర్క్ చేద్దామని గంగతో అంటుంది. ఇప్పుడా అని గంగ అనగానే మళ్ళీ అత్తయ్య కోప్పడుతుందని ఇషిక అనగానే గంగ సరే అంటుంది.    ఆ తర్వాత గంగని వెళ్లకుండా ఆపాలని అనుకుంటుంది. అత్తయ్య అన్ని పనులు నేను చేసానని శకుంతలతో ఇషిక అనగానే నువ్వే అన్ని పనులు ఎందుకు చేస్తున్నావని శకుంతల అంటుంది. నేను చేస్తానని ప్రీతీ అనగానే నువ్వు రెస్ట్ తీసుకోమని శకుంతల చెప్తుంది. నేను చేస్తానని ప్రమీల అనగానే ఒక్కదానివే ఏం చేస్తావ్ ఉందిగా ఆ గంగ.. తనని చేయమని చెప్పండి అని శకుంతల చెప్తుంది.    తరువాయి భాగంలో గంగ, రుద్ర సెలక్షన్ దగ్గరికి వెళ్తారు. పారు వస్తుంది. పారు కావాలనే గంగ మీద ఏదో పడేలా చేస్తుంది. దాంతో గంగ క్లీన్ చేసుకోవడానికి వెళ్తుంది. పారు వెళ్లి డోర్ లాక్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu: శ్రీవల్లిపై వేదవతి ఫైర్.. ప్రేమని ధీరజ్ క్షమిస్తాడా?

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -359 లో.. ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి ప్రేమగా శాలువా కప్పినట్లు ఉహించుకుంటుంది.    మరొకవైపు భాగ్యం, ఆనందరావుల దగ్గరికి శ్రీవల్లి వెళ్తుంది. మీ వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ అని కోపంతో వాళ్ళకి చల్లటి నీళ్లు మీద పోసుకోమని పనిష్మెంట్ ఇస్తుంది. దాంతో చలికి వణుకుతూ ఇలా చెయ్యడం కరెక్ట్ కాదని భాగ్యం అంటున్న కొద్దీ ఇద్దరిపై శ్రీవల్లి చల్లటి నీళ్లు పోస్తుంది. ఎలాగూ ఆ విశ్వగాడు వదిలేలా లేడు కాబట్టి ఈ పెళ్లి క్యాన్సల్ చేయించాలని శ్రీవల్లితో భాగ్యం చెప్తుంది.    మరొకవైపు ధీరజ్ కి ప్రేమ సారీ చెప్తుంది. పేపర్ పై సారీ అని రాసి పెడుతుంది‌. అది చూసినా కూడా ధీరజ్ చూడనట్లు ఉంటాడు. ప్రేమ కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. అయిన ధీరజ్ తీసుకోడు.   దాంతో నర్మదకి చెప్పుకొని ప్రేమ బాధపడుతుంది. నువ్వేం బాధపడకు.. ధీరజ్ బాగా హర్ట్ అయినట్లున్నాడని నర్మద అంటుంది. అసలు అమూల్యకి మా అన్నయ్య అంటే ఇష్టం లేదు.. ఎవరో కావాలని ఇదంతా చేశారని ఇద్దరు అనుకుంటారు. అదంతా శ్రీవల్లి విని వాళ్ళని డైవర్ట్ చెయ్యాలని వాళ్ళ మధ్యలోకి వెళ్తుంది. ఏంటి అక్కా టాపిక్ డైవర్ట్ చేస్తున్నావ్.. నాకు నీపై డౌట్ వస్తుందని ప్రేమ అంటుంది. దాంతో శ్రీవల్లి ఏదో ఒకటి చేసి టాపిక్ డైవర్ట్ చేస్తుంది.    ఆ తర్వాత ఇంట్లో అందరిని పిలిచి ఇల్లంతా డల్ గా ఉంది అంత్యాక్షరి ఆడుకుందామని శ్రీవల్లి అంటుంది. నిన్న అంత గొడవ అయింది.. అదే బాధలో ఉంటే ఇప్పుడు వచ్చి ఏంటి ఇది అని శ్రీవల్లిపై వేదవతి కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: అటు స్వప్న ఎమోషనల్.. ఇటు కార్తీక్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -558 లో.... శ్రీధర్ కి స్వప్న టాబ్లెట్ తీసుకొని వచ్చి ఇస్తుంది. స్వప్న కాంచనతో అన్న మాటలు శ్రీధర్ గుర్తు చేసుకుంటాడు. మీ నాన్న కాశీ విషయంలో తప్పు చేసాడనుకుంటున్నావా అని స్వప్నని శ్రీధర్ అడుగుతాడు. ఒక మావయ్యగా అల్లుడు జీవితం బాగుండాలని అనుకున్నారని స్వప్న చెప్తుంది. శ్రీధర్ కాళ్లపై పడుకొని తనలో ఉన్న బాధని చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతుంది స్వప్న. స్వప్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. అదంతా దూరం నుండి చూస్తున్న కావేరి ఏడుస్తుంది.   మరొకవైపు హాస్పిటల్ నుండి కార్తీక్, దశరథ్ ఇంటికి వస్తారు. వాళ్ళకి ఎదురుగా దీప వెళ్లి ఏమైందని అడుగుతుంది. ఏం పర్లేదు అమ్మ రిపోర్ట్స్ లో ఏం ప్రాబ్లమ్ లేదని దీపతో దశరథ్ చెప్పి లోపలికి వెళ్తాడు. ఏమైంది బావ అని దీప అడుగుతుంది. కార్తీక్ నిజం చెప్పలేక బాధ బయటకి కనిపించకుండా కవర్ చేస్తూ ఏం లేదని చెప్తాడు.    కార్తీక్ ఇంట్లోకి వెళ్ళగానే మీ మావయ్యకి ఎలా ఉంది రిపోర్ట్స్ లో ఏం వచ్చిందని సుమిత్ర అడుగుతుంది. రిపోర్ట్స్ ఏంటని శివన్నారాయణ అడుగుతాడు. అయ్యో మర్చిపోయి అన్నానురా.. నాకు బాలేదని చెప్తానని కార్తీక్ తో సుమిత్ర చెప్తుంది. బాలేంది నీకే అత్త అని కార్తీక్ మనసులో అనుకుంటాడు.    ఏం లేదు తాత నార్మల్ టెస్ట్ లు చేస్తారు కదా.. అవే ఏం లేదు.. అత్తకి బ్లడ్ తక్కువ ఉందట మావయ్యకి విటమిన్ డి తక్కువ అంట అని కార్తీక్ చెప్తాడు. అయితే రిపోర్ట్స్ ఇవ్వు చూస్తానని శివన్నారాయణ అనగానే ఆల్రెడీ డాక్టర్ చూసి చెప్పిందని కార్తీక్ అంటాడు.    ఒరేయ్ కార్తీక్ నువ్వు కూర్చొరా అని సుమిత్ర లోపలికి వెళ్లి పాయసం తీసుకొని వచ్చి కార్తీక్ కి తినిపిస్తుంది. నీకు పాయసం అంటే ఇష్టం కదా మళ్ళీ తినిపించే ఛాన్స్ వస్తుందో రాదో.. ఎందుకంటే నీకు పిల్లలు పుడితే నీకు తినిపించలేం కదా అని సుమిత్ర అంటుంది. దాంతో కార్తీక్ బాధపడతాడు. బావ ఎందుకు బాధపడుతున్నాడని దీప అనుకుంటుంది. హ్యాపీగా ఉండాల్సిన బావ డల్ గా ఉన్నాడేంటని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: అప్పు, కావ్యల శ్రీమంతం కోసం ఏర్పాట్లు.. చీర తెచ్చిన కళ్యాణ్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -921 లో..... రాజ్ కార్ లో డబ్బున్న సూట్ కేసు పెట్టాలని రాహుల్, రుద్రాణి ప్లాన్ చేస్తారు. ఈ డబ్బు రాజ్ కార్ లో దొరికితే పోలీసులు తనని అరెస్ట్ చేస్తారని రుద్రాణి అనగానే బావని అరెస్ట్ చేస్తారా.. వద్దు నాకు కాబోయే భర్త అరెస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదని  రేఖ అంటుంది. వాడు ఇప్పుడే నీ భర్త అయినట్లు మాట్లాడుతున్నావ్ ఏంటని రాహుల్ అంటాడు. రాహులేమో రాజ్ అరెస్ట్ కావాలని అంటుంటే.. వద్దని రేఖ అంటుంది. ఇద్దరికి రుద్రాణి సర్ది చెప్తుంది.    మరొకవైపు కావ్య, అప్పు వాకింగ్ చేస్తూ.. ఆయాసపడుతారు. అప్పుడే కనకం పంతులు గారిని తీసుకొని వస్తుంది. కావ్య,అప్పు వాళ్ళ అమ్మ రావడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. నా కూతుళ్ళని శ్రీమంతం కోసం తీసుకొని వెళ్ళడానికి వచ్చానని కనకం అనగానే నా కోడళ్ళు నా ఇంట్లోనే ఉండాలని అపర్ణ అంటుంది. ఆ శ్రీమంతం ఏదో ఇక్కడే జరిపిద్దామని ఇందిరాదేవి అనగానే కనకం కూడా సరే అంటుంది.    ఆ తర్వాత  రాజ్, కళ్యాణ్ కలిసి శ్రీమంతం కోసం ఏర్పాట్లు చేస్తారు. ఏం అవసరం ఉంటాయో అన్నీ లిస్ట్ చేస్తారు. తమ భార్యలకి బంగారు గాజులు తీసుకొని రావాలని ఇద్దరు అనుకుంటారు. అప్పుడే కావ్య, అప్పు వస్తారు. అంతలోనే కనకం వస్తుంది. అల్లుడు గారు మేమ్ కష్టపడి కూతుళ్ల శ్రీమంతం కోసం డబ్బు దాచుకున్నాం.. ఆ డబ్బుతో శ్రీమంతం జరిపించండి అని రాజ్ ని కనకం రిక్వెస్ట్ చేస్తుంది. సరే అత్తయ్య మీరు బాధపడకూడదని తీసుకుంటున్నానని రాజ్ డబ్బు తీసుకుంటాడు.   అత్తయ్యని హ్యాపీగా ఉంచావ్.. కానీ ఈ శ్రీమంతం ఎలా చేస్తారో అన్న డౌట్ అయితే ఉందని కావ్య అనగానే అప్పుడే రేఖ ఎంట్రీ ఇచ్చి నేను దగ్గరుండి ఆర్గనైజ్ చేస్తాను.. ఫారెన్ లో చాలా చేసానని రేఖ అనగానే వద్దు నువ్వు ఆర్గనైజ్ చేసింది పబ్ లో.. ఇలాంటివి కాదు నేను చూసుకుంటానని రాజ్ అంటాడు.    మరొకవైపు అప్పు కోసం కళ్యాణ్ చీర తీసుకొని వస్తాడు. అప్పుడే అప్పు వాళ్ళ అమ్మ తెచ్చిన చీర తీసుకొని వస్తుంది. అప్పు రాగానే కళ్యాణ్ చీర దాస్తాడు. ఏమైందని అప్పు అడుగుతుంది. నేను చీర తీసుకొని వచ్చాను. నువ్వు ఏది కట్టుకోవాలో కన్ఫ్యూజన్ అవద్దు.. మీ అమ్మ తెచ్చిన చీర కట్టుకో ఎందుకంటే మీ అమ్మ ప్రేమతో తీసుకొని వచ్చింది కదా అని కళ్యాణ్ అనగానే కళ్యాణ్ ని అప్పు హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Jayam serial : పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా రుద్రని కాపాడిన గంగ!

      జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -158 లో ......రుద్ర హడావిడిగా వెళ్తాడు. గంగ గదిలో ఉండగా అప్పుడే ఇషిక వస్తుంది. ఇప్పుడు రుద్ర బావ పారు దగ్గరికి వెళ్ళాడు. తనకి ఇంకా రుద్ర బావపై ప్రేమ ఉంది. ఇప్పుడు తనవైపుకి తిప్పుకుంటుందని ఇషిక అంటుంది. దాంతో గంగలో టెన్షన్ మొదలవుతుంది. రుద్ర వెనకాలే గంగ వెళ్తుంది. రుద్ర వెళ్తుంటే మధ్యలో కార్ ఆగిపోతుంది. రుద్ర కంటే ముందే గంగ హోటల్ కి వెళ్తుంది.       అక్కడ పారు ఎక్కడుందో కనుక్కొని లోపలికి వెళ్తుంది. మరొకవైపు ప్రమీల, ప్రీతి అందరు సరదాగా మాట్లాడుకుంటుంటే శోభనం గదిలో గంగ, రుద్ర బావ లేరు.. హడావిడిగా ఒకరి తర్వాత ఒకరు బయటకి వెళ్లారని ఇషిక చెప్తుంది. మరొకవైపు గంగ లోపలికి రావడం చూసి పారు తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి రుద్ర వచ్చాడు. లాక్ చేయమని చెప్తుంది. ఆల్రెడీ పారు ఉన్న గదిలో గంగ ఉంటుంది. రుద్ర వస్తున్నాడని కర్టెన్ చాటున దాక్కుంటుంది. మరొకవైపు పారు పోలీసులకి ఫోన్ చేస్తుంది. రుద్ర లోపలికి వచ్చి పారు అని పిలుస్తుంటే బయట నుండి తన ఫ్రెండ్ వచ్చి ఇందాకే పారు వెళ్ళిపోయింది. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. నేను చాలా హా్ట్ అంటూ దగ్గరికి వస్తుంటే రుద్ర తోసేస్తాడు. దాంతో బ్లౌజ్ చింపుకొని హెల్ప్ అంటూ అరుస్తుంది. డోర్ తియ్యగానే పోలీసులు ఉంటారు. నన్ను బలవంతం చెయ్యబోయడని చెప్పగానే రుద్రని అరెస్ట్ చేయమని ఇన్‌స్పెక్టర్ చెప్తాడు. ఆగండి అని లోపల నుండి గంగ వచ్చి.. నా భర్త ఏ తప్పు చెయ్యలేదని చెప్తుంది.       ఎలా నమ్మాలని ఇన్స్‌పెక్టర్ అనగానే గంగ రూమ్ లో జరిగింది వీడియో తీసింది చూపిస్తుంది. దాంతో ఆ అమ్మాయిపై ఇన్‌స్పెక్టర్ కోప్పడి స్టేషన్ కి రమ్మంటాడు. నా భర్తకి సారీ చెప్పమని గంగ అనగానే ఆమె రుద్రకి సారీ చెప్తుంది. పారు భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. ఈ పాటికీ రుద్రని అరెస్ట్ చేసి ఉంటారని అనుకుంటారు. మరొకవైపు రుద్ర గంగ ఎక్కడికి వెళ్లారని ఇంట్లో అందరు టెన్షన్ పడుతారు. రుద్ర, గంగ ఇంటికి వస్తారు. ఇంటి బయటే ఉంటారు. జరిగింది ఏది ఇంట్లో చెప్పకండి అని గంగ అంటుంది. అసలు నువ్వు అక్కడికి ఎలా వచ్చావ్.. నేను పారుతో మాట్లాడినప్పుడు డౌట్ పడి వచ్చావా అని రుద్ర అంటుంటే.. విన్న మాట నిజమే కానీ డౌట్ తో కాదు మీకు ఏదో ప్రాబ్లమ్ వస్తుందేమోనని గంగ అంటుంది. ఇక కాసేపటికి ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.