ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో బ్రహ్మముడి!

తెలుగు సీరియల్స్ లలో జీ తెలుగు, స్టార్ మా టీవీ సీరియల్స్ ని చూసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే ఇండియాలోని అన్ని సీరియల్స్ లలో మన తెలుగు సీరియల్ 'బ్రహ్మముడి' మొదటి స్థానంలో ఉంది. దీంతో బ్రహ్మముడి సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ న్యూస్ ని షేర్ చేశాడు. కావ్య పాత్రలో చేస్తున్న దీపిక రంగరాజు కూడా తన‌ ఇన్ స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని  షేర్ చేసింది. కాగా రెండవ స్థానంలో "అనుపమ" సీరియల్, మూడవ స్థానంలో "నాగపంచమి" సీరియల్ ఉంది. బ్రహ్మముడి సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 గంటలకు స్టార్ మా టీవీలో ప్రసారమవుతుంది. ఈ సీరియల్ లో రోజు రోజుకి కథలో ట్విస్ట్ లతో ఆసక్తికరంగా సాగుతుంది. అందుకే ఈ సీరియల్ కి తెలుగు రాష్ట్రాలలోనే కాదు అంతటా ఆదరణ ఎక్కువగా ఉంది. కారణం ఈ సీరియల్ లో ప్రతీ మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించేలా ఎమోషన్స్ ని చూపిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం యొక్క అవసరాలు, వాటి కోసం వారు చేసే అప్పులు, వాటిని తట్టుకోలేక వారు సర్దుకుపోయేతత్వాలు ఇలా అన్ని ఎమోషన్స్ ని కలిపి కనకం-కృష్ణమూర్తిల కుటుంబాన్ని చూపిస్తున్నారు. మరొకవైపు ‌ధనవంతులు సమాజం ఎలా ఉంటారు.. వారి  అటిట్యూడ్ ఎలా ఉంటుంది.. వారు మధ్యతరగతి వాళ్ళని ఎలా చూస్తారనేది దుగ్గిరాల కుటుంబాన్ని ప్రతిబింబించేలా చూపిస్తూ ఈ సీరియల్ ముందుకు సాగుతుంది. కనకం-కృష్ణమూర్తిలకు ముగ్గురు కూతుళ్ళు.. ఒకరు స్వప్న, మరొకరు కావ్య, ఇంకొకరు అప్పు.. కనకం వీళ్ళందరిని బాగా డబ్బున్నవాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేసి.. మేం పడే కష్టాలు మా పిల్లలు పడకూడదని ఆశపడుతుంటుంది. అలాగే పెద్ద కూతురు స్వప్న తన తల్లి బాటలోనే ఉండాలనుకుంటుంది. చేసుకుంటే బాగా డబ్బున్న వాడినే చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది. కృష్ణమూర్తి మాత్రం నీతిగా, నిజాయితీగా బ్రతకాలని.. ఉన్నంతంలో హుందాగా బ్రతకాలని వాళ్ళ కూతుళ్ళకి భార్య కనకంకి చెప్తుంటాడు. చివరి అమ్మాయి అప్పు మాత్రం చదువుకుంటూ, పార్ట్ టైం జాబ్ చేస్తూ తన ఖర్చులకు తను డబ్బులు సమకూర్చుకుంటూ ఎవరికీ భారంగా ఉండాలనుకుంటుంది.    అయితే తాజాగా జరుగుతున్న సీరియల్ ఎపిసోడ్ లలో కథ పూర్తిగా మలుపు తిరిగింది. దుగ్గిరాల కుటుంబంలోని అపర్ణ వాళ్ళ కొడుకు  రాజ్ కి కనకం కూతురు స్వప్న నచ్చి పెళ్ళిచేసుకుందామనేసరికి తను పెళ్ళిపీటల మీద నుండి లేచిపోతుంది. దాంతో రాజ్ మేనత్త రుద్రాణి కనకం రెండవ కూతురు కావ్యని పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టి రాజ్, కావ్యలకి పెళ్ళి చేస్తుంది. ఈ విషయం భరించలేని రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ చాలా కోపంగా ఉంటూ.. కావ్యని ఒక స్టోర్ రూమ్ లో ఉండమని చెప్తుంది. ఇక దుగ్గిరాల కుటుంబం యొక్క ఇంటిపెద్ద  సీతారామయ్య మాటకి కట్టుబడి కావ్యని ఏమీ అనలేకపోతుంటారు. స్వప్నని తీసుకెళ్ళింది రాహులేనని కావ్యకి తెలిసిపోతుంది. అయితే ఈ విషయాన్ని కావ్య నిరూపించడానికి తగిన ఆధారాలు సేకరించి అందరిముందు నిరూపిస్తుంది. ఆ తర్వాత కావ్య, రాహుల్ ల పెళ్ళి జరుగుతుంది. అయితే స్వప్న ప్రెగ్నెంట్ కాదనే విషయం కావ్యకి తెలిసిపోతుంది. కావ్య పెళ్ళి ఆపాలని చూస్తుంది. కానీ అప్పటికే రాహుల్-స్వప్నల పెళ్ళి జరుగుతుంది. ఇక స్వప్నని ఒంటరిగా గదిలోకి తీసుకెళ్ళిన కావ్య ఎందుకు మోసం చేసావని నిలదీస్తుంది. ఆ తర్వాత కావ్యని స్వప్న ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. కావ్య తన కుటుంబానికి అండగా ఉండాలని రాజ్ కి తెలియకయండా డిజైన్స్ వేస్తుంటుంది. మరి స్వప్న ప్రెగ్నెంట్ కాదనే విషయం ఎన్ని రోజులు దాయగలుగుతుంది? కావ్య డిజైన్స్ ని రాజ్ చూస్తే ఏమంటాడు? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సీరియల్ అత్యంత వీక్షకాదరణ పొందుతూ ఇండియాలోనే కూడా నెంబర్ వన్ స్థానాన్ని చేరుకుంది.  

డిజైన్స్ వేస్తూ దొరికిపోయిన  కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -154 లో... కావ్య తనని పట్టించుకోవడం లేదని స్వప్న చెప్పగానే.. కావ్యకి సపోర్ట్ చేస్తూ రాజ్ మాట్లాడడంతో అందరు ఆశ్చర్యపోతారు. స్వప్నని వాళ్ళ అత్తగారు పట్టించుకోవాలని ధాన్యలక్ష్మి అనగానే.. నేను ఎందుకు పట్టించుకోవాలి.. ఏరి కోరి దరిద్రాన్ని తీసుకొని వచ్చారు కదా అని రుద్రాణి కోపంగా మాట్లాడి వెళ్ళిపోతుంది.  మరొక వైపు అప్పుకి హెల్ప్ చెయ్యాలని కళ్యాణ్ ఫ్రెండ్స్ తో పిజ్జా ఆర్డర్ ఇప్పించి టిప్పు ఎక్కువ వచ్చేలా చేస్తాడు. దాంతో అప్పుకి కొంత డబ్బు సర్దుబాటు అవుతుంది. మరొకవైపు దుగ్గిరాల ఇంట్లో అందరు కలిసి భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ పై కూర్చొని ఉంటారు. ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఎవరికి వారు ఫోన్ చూస్తుంటారు. అది చూసిన ఇందిరా దేవి కోపంగా.. అందరు  ఏం చేస్తున్నారు. తినడానికి వచ్చారా ఫోన్ చూడడానికి వచ్చారా? భోజనం చేసేటప్పుడైనా అందరు కలిసి మాట్లాడుకోవచ్చు కదా. ఇక నుండి మీ అందరి ఫోన్ లు తినేముందు ఇక్కడ పెట్టాలని అందరి ఫోన్లు తీసుకుంటుంది. అప్పుడే అక్కడ ఉన్న రాజ్.. ఫోన్ ని కొందరు మంచికి వాడుకుంటారని కావ్యని ఉద్దేశించి అంటాడు.  ఎవరని ఇందిరాదేవి అడుగుతుంది. ఒక అమ్మాయి మనకు డిజైన్స్ ఫోన్ లో పంపిస్తుందని రాజ్ అనగానే.. ఎవరు ఆ అమ్మాయి అని ఇందిరాదేవి అడుగుతుంది. కావ్య వైపు చూస్తూ శిరీష అని చెప్తాడు. మరొక వైపు అప్పు ఇంటికి రాకపోవడంతో కనకం, కృష్ణమూర్తి లు కంగారు పడుతారు. అప్పుడే అప్పు ఇంటికి వస్తుంది. అమ్మ ఇదిగో డబ్బులు.. పిజ్జా డెలివరీ కి వచ్చినవి. మిగతా డబ్బులు రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తానని అప్పు అనగానే.. కనకం, కృష్ణమూర్తి ఇద్దరు ఎమోషనల్ అవుతారు. కావ్య తర్వాత మన ఇంటి బాధ్యత అప్పు తీసుకుందని కృష్ణమూర్తి అంటాడు. మరొకవైపు  రాజ్ నిద్రపోయాక కావ్య రాజ్ కి తెలియకుండా హాల్లో కి వెళ్లి డిజైన్స్ వేస్తుంది. రాజ్ నిద్రలేచి డిజైన్స్ వెయ్యడానికి వెళ్లిందా.. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటా అని కావ్య దగ్గరికి వస్తాడు రాజ్. కావ్య వేసే డిజైన్స్ వెనకాల నుండి చూస్తాడు. రాజ్ ని కావ్య చూస్తుంది. నాకు తెలియకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నావని కావ్యని అడుగుతాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే!   

వాళ్ళ గురించి భవానికి నిజం చెప్పేస్తానని చెప్పిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -215 లో..  మా అమ్మని చూడటానికి వెళ్తున్నానని భవానితో ముకుంద చెప్పగా.. సరేనని అంటుంది. అప్పుడే అక్కడ ఉన్న రేవతికి ముకుంద మీద డౌట్ వస్తుంది. మురారి, కృష్ణ ఇద్దరు షాపింగ్ కి వెళ్తారు. అక్కడ కృష్ణ కోసం చీరలు తీసుకోమని మురారి చెప్తే.. తను మాత్రం ఇంట్లో అందరికి బట్టలు తీసుకోవాలని మురారితో చెప్పి తీసుకుంటుంది. అయితే ‌ఎలాగైనా  కృష్ణకి ఎలాగైనా తన ప్రేమ విషయం చెప్పాలని మురారి ఒక బంగారు ఉంగరం తీసుకుంటాడు. అయితే కృష్ణని కళ్ళు మూసుకోమని చెప్తాడు మురారి. తను కళ్ళు మూసుకోగానే ఉంగరం తీసి మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేయాలని మురారి చూస్తుండగా.. అప్పుడే కృష్ణ వాళ్ళ సీనియర్ డాక్టర్ పరిమళ వస్తుంది. దాంతో తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు మురారి. ఆ తర్వాత పరిమళ వాళ్ళిద్దరితో మాట్లాడి వెళ్తుంది.  కృష్ణ, మురారి కలిసి చీరలు సెలెక్ట్ చేస్తుంటారు. అయితే ఎంతకీ ఆ చీరల షాపింగ్ అవ్వకపోయేసరికి విసిగిపోయిన మురారి.. మీరెందుకు చీరల కోసం ఇంత టైం తీసుకుంటారని మురారి అంటాడు. మేం ఏ చీర కొన్నా దానికి మ్యాచింగ్  బ్లౌజ్ ఉండాలని, వాటికి మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ చెవిపోగులు.. ఇలా అన్నీ ఉండాలని మొత్తం వివరిస్తుంది కృష్ణ. ఆ తర్వాత ఓహో అని మురారి అనుకుంటాడు.  ఆ తర్వాత మురారి, కృష్ణల కోసం ముకుంద కార్ లో వస్తుంటుంది. అది గమనించిన రేవతి.. తన కార్ కి ఎదురుగా వెళ్లి ఆపేస్తుంది. ఎందుకు ముకుంద ఇలా చేస్తున్నావని  రేవతి అడుగుతుంది. అది కాదు అత్తయ్య మా అమ్మని చూడటానికి వెళ్తున్నా అని ముకుంద అనగానే.. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసని, నేను పెద్ద అత్తయ్యని కాదని రేవతి అంటుంది. నా కొడుకు కోడలిని వీడదీయాలని ఎందుకు ఇలా చేస్తున్నావని ముకుంద రేవతిని అడుగుతుంది. మీరు నాకు అడ్డురాకండి. ఎందుకంటే నేను భవాని అత్తయ్యకి నిజం చెప్పేస్తాను‌. కృష్ణ, మురారీలది అగ్రిమెంట్ మ్యారేజ్ అని, పెళ్లికి ముందు మురారి నన్ను ప్రేమించి మోసం చేశాడని చెప్తానని రేవతితో చెప్తుంది‌ ముకుంద. దాంతో రేవతి అలానే షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రిషిపై ఎటాక్ గురించి వాళ్ళకి చెప్పేసిన వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -821 లో.. రిషిని అటాక్ చెయ్యమని శైలేంద్ర ఒక రౌడీని రిషి దగ్గరికి పంపిస్తాడు. రిషి హాల్లో కూర్చొని ఫోన్ చూస్తుంటాడు. రౌడీ కత్తి పట్టుకొని రిషి వెనకాల నుండి వచ్చి పొడుస్తుండగా.. అది చూసిన వసుధార వచ్చి రిషిని నెట్టివేస్తుంది. "సర్ మీకేం కాలేదు కదా" అని వసుధార అడుగుతుంది. లేదు నువ్వు ఒకే కదా అని రిషి అడుగుతాడు. రౌడీ ని పట్టుకోవాలని రిషి వెనకాలే వెళ్తాడు. రౌడీ తప్పించుకుంటాడు. ఇలా రౌడీ వచ్చి అటాక్ చేసినట్లు ఏంజిల్, విశ్వనాథ్ గారికి చెప్పొద్దు తెలిస్తే కంగారుపడుతారని వసుధార, సెక్యూరిటికి చెప్తాడు రిషి. ఆ తర్వాత వసుధార జరిగిన అటాక్ గురించి ఆలోచిస్తుంటుంది. ఇన్ని రోజులుగా లేనిది రిషి సర్ పై అటాక్ ఏంటి జగతి మేడం మహేంద్ర సర్ మా దగ్గరికి  వచ్చిన విషయం శైలేంద్రకి తెలిసిపోయిందా అని వసుధార అనుకొని మహేంద్రకి కాల్ చేస్తుంది. మహేంద్రకి ఫోన్ చేసి సర్ మీరు వచ్చిన విషయం ఎవరికైనా తెలుసా అని వసుధార అడుగుతుంది. లేదు జగతికి నాకు తప్ప ఎవరికీ తెలియదని మహేంద్ర అంటాడు. ఇక వసుధార రిషి పై జరిగిన అటాక్ గురించి మహేంద్రకి చెప్పగానే కంగారుపడుతాడు. మేం ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పకండని మహేంద్రతో వసుధార అంటుంది. ఆ తర్వాత వసుధార ఫోన్ కట్ చేసాక రిషి వస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నారు మేడమ్. మీ మేడమ్ తోనా అని రిషి అడుగుతాడు. మళ్ళీ ఏం చెయ్యబోతున్నారు. ఇప్పటివరకు చేసింది చాలని రిషి ఆవేశపడతాడు. సర్ మీరు మా గురించి తప్పుగా అనుకుంటున్నారు. మేం మీ గురించి అలా చేశామని, ఆ విషయం ఇప్పుడు మేం చెప్తే, మీరు ఇలా కవర్ చేస్తున్నారా అని అంటారు కాబట్టి చెప్పట్లేదు. మీ అంతటా మీరే తెలుసుకున్న రోజు ఇలా మాట్లాడరని వసుధార అంటుంది. నేను మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకోవటం లేదు.‌ నన్ను ఇందులో ఇన్వాల్వ్ చెయ్యొద్దని చెప్పి రిషి వెళ్ళిపోతాడు. మీరు చేస్తారు.. నాకు నమ్మకం ఉందని అని వసుధార అనుకుంటుంది. మరొకవైపు దేవయాని, శైలేంద్రకు ఫోన్ చేసి.. రిషి ఉంటే DBST కాలేజీ నీది కాదు. రిషి రాకుండా చూడని చెప్తుంది. మరొకవైపు రిషిపై అటాక్ గురించి వసుధార చెప్పినదంతా జగతికి చెప్తాడు మహేంద్ర. జగతి షాక్ అవుతుంది. ఈ అటాక్ శైలేంద్ర చేయించి ఉంటాడా అని మహేంద్ర అనగానే.. బాబాయ్ అంటూ శైలేంద్ర పిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ట్రెండింగ్ లో   7 Days Of Love వెబ్ సిరీస్!

యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న తెలుగు వెబ్ సిరీస్  7 Days of Love... ప్రవళిక దామెర్ల, అర్జున్ కళ్యాణ్ లీడ్ రోల్స్ లో చేసిన ఈ సిరీస్ యూత్ ని ఆకర్షించేలా తీసాడు డైరెక్టర్ హేమ సాయి. అభి పాత్రలో ఆర్జే సూర్య నటించగా,  ప్రియ పాత్రలో లోక్షిత  నటించింది. హేమ సాయి రాసుకున్న ఈ కథని తనే డైరెక్ట్ చేశాడు. అభి(ఆర్జే సూర్య) ఒక డబ్బున్న కుర్రాడు. అతనితో వర్ష(ప్రవళిక) లవ్ లో ఉంటుంది. అయితే కొన్ని రోజులుగా అభి, వర్ష(ప్రవళిక) నుండి కిస్, రొమాన్స్ కావలనుకుంటున్నాడని గ్రహించిన వర్ష(ప్రవళిక).. ఒకరోజు తనని కిస్ చేయడానికి చూసిన అభి చెంపమీద కొట్టేస్తుంది. అభికి తనమీద ఉంది ప్రేమ కాదని అది వేరే అని తెలుసుకున్న వర్షకి మగాళ్ళంటేనే అసూయ, కోపం కలుగుతాయి. దాంతో రోడ్డు మీద బాల్ కోసం వచ్చిన వంశీ(అర్జున్ కళ్యాణ్) ని తిట్టేస్తుంది. అయితే అంతకముందు నుండి వర్షని వన్ సైడ్ నుండి లవ్ చేస్తుంటాడు వంశీ. వర్ష కోపంగా ఉండటం గమనించిన వంశీ.. అదేంటో తెలుసుకోవాలని తన ఫ్రెండ్ ప్రియకి కాల్ చేస్తాడు. వర్ష, ప్రియ(లోక్షిత) తో కలిసి ఒకే రూమ్ లో ఉంటారు. దాంతో ప్రియని రిక్వెస్ట్ చేస్తాడు వంశీ‌. ప్రియ కూడా తన రిక్వెస్ట్ ని వర్షతో చెప్పి, ఇతని ప్రేమను చూడు చాలు, నువ్వు ప్రేమించాల్సిన అవసరం లేదని చెప్పి కన్విన్స్ చేస్తుంది. ఆ తర్వాత వర్ష, వంశీతో కలిసి ఉండటానికి ఒప్పుకుంటుంది. అయితే తను ఏడు రోజుల్లో అమెరికా వెళ్తున్నట్లుగా చెప్తుంది. కావాలంటే ఈ వారం రోజుల్లో లవ్ చేసుకో అని వర్ష చెప్పడంతో వంశీ షాక్ అవుతాడు. మరి ఆ ఏడు రోజుల్లో ఏం జరిగింది? వర్షని వంశీ లవ్ లో పడేలా చేశాడా? లేదా తెలియాలంటే యూట్యూబ్ లోని ఈ వెబ్ సిరీస్ ని చూడాల్సిందే. ఇన్ఫినిటమ్ మీడియా ద్వారా ప్రొడ్యూస్ చేసిన ఈ వెబ్ సిరీస్ కి బండారు వందన నిర్మాత. కాగా  ఈ సిరీస్ లోని కొన్ని డైలాగ్స్ యూత్ ని అట్రాక్ట్ చేస్తాయి. ఎప్పుడు ఒక ఫ్రెష్ లవ్ స్టోరీలను చూడాలనుకునేవారు ఈ సిరీస్ ని చూసేయొచ్చు. ఈ సిరీస్ మొత్తంగా ఏడు ఎపిసోడ్‌ లుగా ఉంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషాల వరకు ఉంది. క్యారెక్టర్స్ మధ్య కథ కొత్తగా సాగుతుంది. మ్యూజిక్ కూడా బాగుంది. డైలాగ్స్ ఈ వెబ్ సిరీస్ కి ఆయువుపట్టుగా నిలిచాయి‌. " ఈ సొసైటీ ఎప్పుడు ఏ విషయాన్ని అయినా ఒక సైడ్ నుండే డిసైడ్ చేసేస్తుంది",  " రేపు ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఈ రోజే ఫుల్ గా ఎంజాయ్ చేయాలి" లాంటి డైలాగ్స్ అందరికి బాగా కనెక్ట్ అవుతాయి.  

ఏంటి సర్ ఈ ఓవరాక్షన్.. మారవా అర్జున్ ఇంక!

బిగ్ బాస్ 6 లో 'బ్యూటీ క్వీన్' అని శ్రీసత్యని చెప్తారు. ఆ తర్వాత వాసంతి కృష్ణన్ అని చెప్తారు.‌ వీరిద్దరికి దగ్గర వచ్చిన అర్జున్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్తీసత్య వెంటే ఉంటూ తన లవ్ కోసం చాలా ప్రయత్నించి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చేశాడు. కొన్ని రోజుల క్రితం శ్రీసత్య పుట్టినరోజుని బిగ్ బాస్ ఫెండ్స్ అందరూ కలిసి గ్రాంఢ్ గా సెలబ్రేట్ చేశారు‌. కంటెస్టెంట్స్ దాదాపుగా అందరు వచ్చి సందడి చేశారు. బిబి జోడీ డాన్స్ షోలో శ్రీసత్యతో కలిసి మెహబూబ్ డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే మెహబూబ్ ఈ సెలబ్రేషన్స్ లో తన డ్యాన్స్ స్టెప్స్ తో ఫుల్ జోష్ గా కనిపించాడు. శ్రీసత్య కూడా చిందులు వేసింది. ఈ సెలబ్రేషన్స్ లో రాజ్, గీతూ రాయల్, ఆదిరెడ్డి, అర్జున్ కళ్యాణ్, ఫైమా, రేవంత్, యాంకర్ శివ ఇలా చాలా మంది హాజరయ్యారు. అందరూ సరదాగా గడుపుతూ శ్రీసత్యతో సందడి చేశారు. అయితే ఈ సెలబ్రేషన్స్ లో అందరి దృష్డి అర్జున్ కళ్యాణ్ మీదే ఉంది. అతనితో శ్రీసత్య ఎలా ఉంటుందా అని ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే శ్రీసత్య మాత్రం అందరితో ఉన్నట్టే మాములుగా ఉంది. అయితే గీతు రాయల్.. ఈ సెలబ్రేషన్స్ లో యాక్టివ్ గా ఉండి అందరిలో మంచి జోష్ ని నింపింది. శ్రీసత్య పుట్టిన రోజు వేడుకల్లో కలిసిన బిగ్ బాస్-6 కంటెస్టెంట్స్.. అందరూ సరదగా ఎంజాయ్ చేశారు‌. అయితే బిగ్ బాస్ తర్వాత ఎవరి బిజీ లైఫ్ వాళ్ళు గడుపుతున్నారు. రేవంత్ కొత్త ఆల్బమ్స్ కోసం బిజీ అయ్యాడు. శ్రీహాన్ యాక్టింగ్ లో బిజీ, ఆదిరెడ్డి ఎప్పటిలాగే వ్లాగ్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. అయితే వాసంతి కృష్ణన్, అర్జున్ కళ్యాణ్ కలిసి ఒక సినిమాలో కూడా నటించారు. అయితే బిబి జోడీలో వీళ్ళిద్దరి డ్యాన్స్ పర్ఫామెన్స్ మాత్రం అదుర్స్ అనే చెప్పాలి.  ఆయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో అర్జున్ కళ్యాణ్ , వాసంతి కృష్ణన్ లతో కలిసి ఒక వీడీయోని శ్రీసత్య పోస్ట్ చేసింది. " ఓ మై గాడ్ శ్రీసత్య ఇన్ స్టాగ్రామ్ స్టాటస్ లో వాసంతి, ఇంకా అర్జున్ కళ్యాణ్ " అని అర్జున్ కళ్యాణ్ అనగా.. " ఏంటి సర్ ఈ ఓవరాక్షన్.. మారడు.. నువ్వు మారవా ఇంకా" అని అర్జున్ కళ్యాణ్ ని అనేసింది శ్రీసత్య. ఇది శ్రీసత్య తన స్టాటస్ లో పోస్ట్ చేసింది శ్రీసత్య.  

అమ్మోరులో నాగార్జునలా ఉన్నావ్..సర్పంచ్ దోశ ఉంది

జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో  రాకెట్ రాఘవ, వాళ్ళ అబ్బాయి మురారి ఇద్దరూ కలిసి మంచి ఫన్నీ  స్కిట్ చేశారు. అందులో వాళ్ళు వేసిన పంచులు భలే ఫన్నీగా ఉన్నాయి. సోగ్గాడే చిన్ని నాయన మూవీలో అక్కినేని నాగార్జున, అఖిల్ గెటప్స్ లో వైట్ అండ్ వైట్ డ్రెస్ తో చేతిలో కర్రతో కనిపించారు. "నేను ఎవరో తెలుసా సోగ్గాడే చిన్ని నాయనా..అని రాఘవ అనేసరికి ...మరి నేనేమిటి మీ పెద్దనాయననా" అన్నాడు రాఘవ కొడుకు మురారి. దానికి షాకయ్యాడు రాఘవ. "నేను ఈ గెటప్ లో ఎలా ఉన్నాను... మాస్ మూవీలో నాగార్జున గారిలా ఉన్నానా, మన్మధుడు సినిమాలో నాగార్జున గారిలా ఉన్నానా" అని అడిగేసరికి "అమ్మోరులో నాగార్జున గారిలా ఉన్నావ్" అన్నాడు మురారి. " ఆ సినిమాలో నాగార్జున గారు లేరు కదరా అని రాఘవ అనేసరికి నువ్వు కూడా అలా లేవు కదా నాన్న" అన్నాడు మురారి. తర్వాత నాటీ నరేష్ స్కిట్ లో ఒక కమెడియన్ "ఎంఎల్ఏ దోశ ఏమన్నా ఉందా అనేసరికి సర్పంచ్ దోశ ఉంది" అన్నాడు నరేష్... అదేంటి అని అడిగేసరికి ఎంఎల్ఏ ఓడిపోయి సర్పంచ్ అయ్యాడు కాబట్టి" అన్నాడు నరేష్. ఇక సద్దాం ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో స్కిట్ చేశారు. "శత్రువులు మనమీద పగ బట్టారు...తప్పనిసరిగా బాంబులు కావాలి..బాంబులు తయారు చేయడానికి మనకు ఏం కావాలిరా" అనేసరికి మిగతా వాళ్లంతా "సెనగపప్పు, మినప్పప్పు,  గట్టిపప్పు" అని చెప్పేసరికి వాళ్ళను కొట్టాడు సద్దాం...ఫైనల్ గా వెంకీ మంకీస్- తాగుబోతు రమేష్ స్కిట్ లో వెంకీ రమేష్ కి కంగ్రాట్స్ చెప్పి "నువ్వు మళ్ళీ మావయ్య కాబోతున్నావ్..ఇంతకు నీ విషయం ఏమిటి మా చెల్లి కాయా, పండా అని అడిగేసరికి పుచ్చురా" అని ఫ్రస్ట్రేషన్ ఫేస్ తో చెప్పాడు తాగుబోతు రమేష్. ఇలా ఈ వారం స్కిట్స్ అన్నీ కూడా ఎంటర్టైన్ చేయడానికి 27 వ తేదీన ఈ ఎపిసోడ్ రాబోతోంది.  

ఆ రూంలోనే ఒకప్పటి స్టార్ సెలబ్రిటీస్...ఇప్పుడు శ్రీముఖి

నీతోనే డాన్స్ షో జడ్జ్ తరుణ్ మాష్టర్ కొత్తగా స్టార్ట్ చేసిన తన యూట్యూబ్ ఛానల్ కోసం కొన్ని వారాల ముందు రాధా, సదా క్యారవాన్, మేకప్ రూమ్ టూరు చేసి చూపించారు. ఇప్పుడు "చిట్ చాట్ విత్ శ్రీముఖి" పేరుతో ఆమె రూమ్, మేకప్ కిట్, అలాగే ఆమె హెయిర్ స్టైలిస్ట్ ప్రసన్న  అన్ని కూడా చూపించారు. శ్రీముఖికి క్యారవాన్ లేదు కానీ అన్నపూర్ణ స్టూడియోస్ లో సొంత మేకప్ రూమ్ ఉంది అని చెప్పారు.  ఈ స్టూడియోలో సెలబ్రిటీస్ అందరికీ మేకప్ రూమ్స్ కట్టించారు అప్పట్లో. అలా శ్రీముఖికి కూడా ఇక్కడ ఒక స్పెషల్ రూమ్ ఉంది. అది తనకు ఎంతో లక్కీ రూమ్ కూడా అన్నారు తరుణ్ మాష్టర్. శ్రీముఖికి ఈ రూమ్ అంటే చాలా ఇష్టం కూడా. ఇదివరకు చాలా మంది సెలబ్రిటీస్ తమ క్యారవాన్ వచ్చే ముందు ఈ రూమ్ లోనే మేకప్ అవీ వేసుకునేవారు. నాగేశ్వరావు, ఎన్టీఆర్ , శోభన్ బాబు, కృష్ణ గారు వీళ్లంతా క్యారవాన్ సిస్టం రాక ముందు ఈ రూంలోనే కూర్చుని మేకప్ వేసుకునేవారని చెప్పారు. ఇంతలో మేకప్ లేకుండా శ్రీముఖి తన కార్ లో వచ్చింది. మేకప్ లేకుండా చాలా బాగుంది అని తరుణ్ మాష్టర్ ఆమెను పొగిడేశారు. అదుర్స్ షో నుంచి శ్రీముఖి చాలా స్ట్రగుల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు టాప్ యాంకర్ ప్లేస్ కి వచ్చేసింది. అప్పుడు అంత స్ట్రగుల్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఆమె తన పేరెంట్స్ ని చాల హ్యాపీగా ఉంచగలుగుతోంది అన్నారు తరుణ్ మాష్టర్. మేకప్ లేకపోతేనే చాలా బాగుంది కదా...జయప్రద, జయసుధ వీళ్లందరినీ డామినేట్ చేస్తూ ఉంది శ్రీముఖి అందం. సదా, రాధ మేకప్ వేస్తే బాగుంటారు కానీ శ్రీముఖి మేకప్ లేకుండానే బాగుంటారు. శ్రీముఖి ఎప్పుడూ ఖాళీగా కూర్చోదు ఏదో ఒక ప్రోగ్రాం, ఈవెంట్  చేస్తూనే ఉంటుంది అని చెప్పారు తరుణ్ మాష్టర్. ఇక ఈ వీడియోస్ మాత్రమే కాకుండా  "ఎన్టీఆర్ గారు, చిరు గారు, బాలకృష్ణ గారు, నాగేశ్వరావు గారితో నా జర్నీ గురించి కూడా వ్లగ్స్ చేస్తాను. ఎందుకంటే చిరు గారు, బాలకృష్ణ గారు స్ట్రగుల్ ఐన డేస్ ని నేను దగ్గరుండి చూసాను. వాళ్ళే కాదు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫిలిం, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ ఫిలింకి ఎంత కష్టపడ్డారు..అప్పటి నుంచి ఇప్పటికి ఎలా పైకి వచ్చారు..ఆ జర్నీ మొత్తాన్ని కూడా నా ఛానల్ లో చూపిస్తాను. శేఖర్ మాష్టర్ కూడా అంతే కష్టపడి పైకి వచ్చారు. ఆయనది కూడా నా ఛానెల్ లో చూపిస్తాను" అన్నారు తరుణ్ మాష్టర్.    

మాయాబజార్ లా మారిన కావ్య, రాజ్ కథ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -153 లో.. స్వప్న చేసే పనుల గురించి వాళ్ళ అమ్మ కనకంకి చెప్పాలని రుద్రాణి అనగానే... వద్దు స్వప్నని జాగ్రత్తగా చూసుకోవడం అత్తింటి వారీగా మన బాధ్యత అని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. అసలు ఈ ఇంట్లో ఏది జరిగిన మన వల్లే అన్నట్లుగా చూస్తున్నారని రాహుల్ తో రుద్రాణి అంటుంది. దీనికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని రుద్రాణి అనుకుంటుంది. మరొకవైపు అప్పుకి కళ్యాణ్ హెల్ప్ చెయ్యాలని.. బేకరి ఓనర్ దగ్గరికి వచ్చి.. అప్పుకి పిజ్జా ఆర్డర్ డెలివరీ ఇప్పిస్తాడు. మరొక వైపు రాజ్ తన గదిలో చూసిన డిజైన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సేమ్ డిజైన్స్ నా గదిలో దొరికాయంటే కావ్య తప్ప వేరే వాళ్ళు వేసే ఛాన్స్ లేదని రాజ్ అనుకుంటాడు. అప్పుడే శృతి డిజైన్స్ తీసుకొని వచ్చి రాజ్ కి చూపిస్తుంది. ఇవి ఆ కావ్య వేసిన డిజైన్స్ అని నాకు తెలుసు అని మనసులో అనుకుంటాడు. ఇంత బాగా వేసిన ఆ అమ్మయిని అభినందించాలి, ఒకసారి ఆ అమ్మాయికి ఫోన్ చెయమని శృతితో రాజ్ అనగానే శృతి టెన్షన్ పడుతుంది. వెంటనే ఫోన్ తీసుకొని కావ్య పేరుని శిరీష అని ఎడిట్ చేస్తుంది. ఆ తర్వాత కావ్యకి శృతి ఫోన్ చేసి శిరీష.. నీతో సర్ మాట్లాడుతాడట అని శృతి చెప్పగానే కావ్య టెన్షన్ పడుతుంది. ఫోన్ ఇచ్చి నువ్వు వెళ్ళు, నేను మాట్లాడడం అయిపోయాకా పిలుస్తా అని రాజ్ అనగానే శృతి వెళ్ళిపోతుంది. మాట్లాడేది కావ్య అని తెలిసిన రాజ్.. "చాలా బాగా వేశారండి డిజైన్స్. మా ఆవిడ ఉంది.. తనకి చుక్కల ముగ్గు తప్ప ఏది రాదు" అని కావాలనే రాజ్ మాట్లాడతాడు. అలా వేరేవాళ్ళ ముందు మీ భార్య గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదని కావ్య అంటుంది. నా భర్త అలాంటోడు, ఇలాంటోడని కావ్య కూడా కావాలనే మాట్లాడుతుంది. ఆ తర్వాత నువ్వు బయటపడనప్పుడు నేను ఎందుకు బయటపడతా...డిజైన్స్ ఎవరు వేస్తున్నారో బయట పెడతా అని రాజ్ తనలో తాను అనుకుంటాడు. మరొకవైపు స్వప్న కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. అందరూ కంగారుపడతారు. డాక్టర్ కి ఫోన్ చేస్తారు. మరొక వైపు కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి అప్పు వస్తుంది‌. పిజ్జా తీసుకొని డబ్బులు ఎక్కువ ఇవ్వు అని చెప్తాడు. కళ్యాణ్ ఫ్రెండ్ పిజ్జా తీసుకొని డబ్బులు ఎక్కువ ఇస్తుంటే అప్పు తీసుకోకుండా వెళ్ళిపోతుంది. మరొక వైపు డాక్టర్ వచ్చి స్వప్నని చూసి నీరసం వల్లే ఇలా అయిందని చెప్తుంది. నాకు కావలిసింది చేసి పెట్టట్లేదని కావ్యని స్వప్న అంటుంది. ఎప్పుడు నీకు నచ్చినవి చేస్తుంది కదా కావ్య అని రాజ్ తనకి సపోర్ట్ గా మాట్లాడుతాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రిషిని చంపమని రౌడీని పంపించిన శైలేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -820 లో.. జగతి, మహేంద్ర ఇంటికి వెళ్ళడానికి బయల్దేర్తారు. 'మీరు రిషిని వసుధారని మీ ఇంటి మనుషులలాగా చూస్తున్నారు. మీరు చాలా గొప్పవాళ్ళ'ని విశ్వనాథ్ ని జగతి పొగుడుతుంది. 'ముఖ్యంగా నీకు థాంక్స్ ఏంజిల్.. రిషి ని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు' అని జగతి అనగానే.. 'రిషి నా ఫ్రెండ్. తనని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత' అని ఏంజిల్ అంటుంది. 'అయినా, రిషి గురించి మీరు నాకు థాంక్స్ ఎందుకు చెప్తున్నార'ని ఏంజిల్ అంటుంది. అప్పుడు వసుధార కవర్ చేస్తూ 'రిషి సర్ లాంటి గొప్పవాళ్ళ గురించి ఎవరైనా అలాగే చెప్తార'ని అంటుంది.  ఆ తర్వాత  జగతి  వెళ్తు  వసుధార దగ్గరికి వస్తుంది. మీరు ఇద్దరు మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు చేపట్టాలని జగతి అంటుంది. మహేంద్ర కూడా వసుధారతో మిషన్ ఎడ్యుకేషన్ కి హెల్ప్ చేయమని అంటాడు. మీరు ఏది అనుకుంటున్నారో అది నిజం అవుద్దని వసు అంటుంది. జగతి, మహేంద్ర లు వెళ్తుంటే.. రిషి ఎదురు వస్తాడు. వెళ్ళొస్తాం రిషి అని  జగతి, మహేంద్ర చెప్పినా రిషి సైలెంట్ గా ఉంటాడు.. మరొక వైపు విష్ కాలేజీ లెక్చరర్స్ కలిసి రిషి, వసుధారల గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఇన్ని సంవత్సరాల నుండి కాలేజీ లో వర్క్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా మనకి సన్మానం లాంటివి లేదు. నిన్న కాక మొన్న వచ్చిన వాళ్లకి సన్మానం అని ఒక సర్ అనగానే.. అవును సర్ వాళ్ళ ఇద్దరికి సపోర్ట్ గా కాలేజీ చైర్మన్ ఉన్నాడు. పైగా ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరు ఆ చైర్మన్ ని బుట్టలో వేసుకున్నారు. పైగా ఆ ఏంజిల్ కి రిషి సర్ ఫ్రెండ్. అందుకే వాళ్లకి సపోర్ట్ అని మేడం అంటుంది. రిషి సర్ వసుధార మేడం ఇద్దరి మధ్య ఏదో ఉందని సర్ అనగానే.. అవును ఇద్దరు వయసులో ఉన్నారు. ఉంటే తప్పేముందని ఒజ మేడం అంటుంది. వాళ్ళ మాటలు విన్న పాండియన్ కోపంగా వాళ్ళ దగ్గరికి వచ్చి.. మీరు వాళ్ళు గురించి అలా తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎప్పుడు చదువు కోసం, స్టూడెంట్స్ జీవితాలు బాగు చేయడం కోసం ఆలోచిస్తారు. మీరు ఇంకొకసారి వాళ్ళ ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడితే కొద్దిసేపు నాలో పాత పాండియన్ బయటకు వస్తాడని పాండియన్ ఆ లెక్చరర్స్ కి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. మరొక వైపు బాల్కనీ లో రిషి కూర్చొని అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారని ఆలోచిస్తుంటాడు. పైన బాల్కనీలో వసుధార కూర్చొని పేపర్ పై VR అని రాస్తుంది. ఆ పేపర్  కింద కూర్చొని ఉన్న రిషి పై పడుతుంది. అది చుసిన రిషి చింపేస్తుండగా.. వద్దని వసుధార అంటుంది. రిషి ఆపేస్తాడు. మరొక వైపు రిషిని చంపాలని ఒక రౌడీని శైలేంద్ర పంపిస్తాడు. రిషి హాల్లో ఫోన్ చూస్తుంటాడు. అప్పుడే రౌడీ వెనకాల నుండి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కృష్ణకి స్కూటీ గిఫ్ట్ ఇచ్చిన మురారి.. షాపింగ్ కి తీసుకెళ్ళమన్న భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -214 లో.. కృష్ణ బెస్ట్ జూనియర్ డాక్టర్ గా అవార్డు వచ్చినందుకు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. 'ప్రొద్దున పెద్ద అత్తయ్య లాగా చేసి ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు ఈ అవార్డు తెచ్చుకొని తన విలువని పెంచుకుంది. నేను ఇలాగే ఉంటే నా విలువ తగ్గిపోతుంద'ని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ తన గదిలోకి వెళ్లి.. తన అమ్మ నాన్న ఫొటోస్ చూస్తూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడే మురారి వచ్చి కృష్ణతో మాట్లాడుతుంటాడు. కృష్ణ, మురారి త్వరగా కిందకి రండి అని భవాని పిలుస్తుంది. అత్తయ్య ఎప్పుడు కబురు పంపుతుంది. ఫస్ట్ టైం పిలిచింది వెళదాం పదండి ఏసీపీ సర్ అని మురారితో కృష్ణ అంటుంది. ఆ తర్వాత భవాని దగ్గరికి కృష్ణ, మురారి ఇద్దరు వస్తారు. కృష్ణ నీ కళ్ళు ఏంటి ఎర్రగా ఉన్నాయ్.. ఎందుకు ఏడుస్తున్నావని భవాని అంటుంది. ఏం లేదు పెద్దమ్మ కృష్ణ వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడింది, అందుకే అలా అని మురారి చెప్తాడు. ఆ విషయం వదిలేయండి మీరు ఎందుకు పిలిచారని భవానిని కృష్ణ అడుగుతుంది. మీరు ఇప్పుడు షాపింగ్ కి వెళ్ళండి. కృష్ణకి ఏమైనా కొనివ్వు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశానని మురారికి భవాని చెప్తుంది. మరి నువ్వు నీ భార్యకి ఏం గిఫ్ట్ ఇవ్వలేదా అని మురారిని రేవతి అడుగుతుంది. ఇచ్చాను మమ్మీ కృష్ణకి కాదు అది అందరికి సర్ ప్రైజ్ అంటూ కృష్ణ కళ్ళు మూసుకోని బయటకు తీసుకొని వెళ్తాడు మురారి.  కృష్ణ కి గిఫ్ట్ గా స్కూటీ ఇస్తాడు మురారి. అది చూసిన కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మురారిని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత భవానిని కృష్ణ స్కూటీ పై తీసుకొని వెళ్తుంది. కాసేపటికి మురారితో కలిసి కృష్ణ షాపింగ్ కి వెళ్తుంది. మరొకవైపు మధుని అలేఖ్య కొడుతుంటే.. ముకుంద వచ్చి ఏమైందని అడుగుతుంది. ఎం లేదు కృష్ణకి షాపింగ్ అని లక్ష రూపాయలు ఇచ్చింది భవాని అత్తయ్య. మనకు ఒక పది వెయ్యిలు తెమ్మని అడిగితే వెళ్లట్లేదని అలేఖ్య చెప్పగానే.. ఏంటి వాళ్ళు షాపింగ్ కి వెళ్ళారా? ఇద్దరు వాళ్ళ లవ్ ని చెప్పుకుంటారేమో వెంటనే వెళ్లి ఆపాలని ముకుంద బయల్దేరి వెళ్తుండగా.. తనని చూసిన భవాని.. ముకుంద ఎక్కడికి అని అడుగుతుంది. అత్తయ్య మా అమ్మని చూడడానికని చెప్పి ముకుంద వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

యూట్యూబ్ స్టార్ పెళ్ళి కొడుకు అయ్యాడు!

'చక్రవాకం' సీరియల్ గురించి  దాదాపు అందరికి తెలిసిందే. ఒకప్పుడు తెలుగు సీరియల్స్ లో చరిత్ర సృష్టించిన సీరియల్. అందులో నటించిన ఇంద్రనీల్ అందరికి సుపరిచితమే.  ఈ సీరియల్ లో ఇంద్ర నీల్ కి  ప్రశంసలు అందాయి. ఇంద్రనీల్ కి లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువగనే ఉండేవారు. అయితే ఇంద్రనీల్, మేఘన రామి పెళ్ళి చేసుకున్నారు. కాగా వీరిద్దరికి ఒక యూట్యూబ్ లో 'నీలిమేఘాలలో' అనే ఛానెల్ కూడా ఉంది. ఇందులో వీరిద్దరు కలిసి రెగ్యులర్ గా వ్లాగ్ లు చేస్తుంటారు. అందులో  రకరకాల వంటలతో పాటు , డ్రెస్సింగ్, చీరలకి సంబంధించిన వ్లాగ్ లు.. ఇవే కాకుండా చాలా రకాల వ్లాగ్ లు చేస్తూ అప్డేట్ చేస్తుంటారు. కాగా వీరికి అత్యధిక ఫ్యాన్ బేస్ కూడా ఉంది‌. దాంతో వీళ్ళిద్దరు కలిసి ఏ వ్లాగ్ ని తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసినా అత్యధిక వీక్షకాధరణ పొందుతుంది. అయితే తాజాగా ఇంద్రనీల్,  మేఘన రామి ఇద్దరు చాలా సీరియల్స్ లో నటించారు. కాగా మేఘన రామి ఇప్పుడు జీ తెలుగులో ప్రసారమవుతున్న 'రాధమ్మ కూతురు' సీరియల్ లో  ముఖ్య పాత్రని పోషిస్తుంది. కాగా ఇంద్రనీల్, మేఘన రామి కలిసి తాజాగా తమ 'నీలిమేఘాలలో' యూట్యూబ్ ఛానెల్ లో ఒక వ్లాగ్ ని అప్లోడ్ చేశారు. "యూట్యూబ్ స్టార్ పెళ్ళి కొడుకు అయ్యాడు" అనే ఒక వ్లాగ్ ని ఇంద్రనీల్, మేఘన రామి ఇద్దరు  తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశారు. ఆ పెళ్ళిలో వాళ్ళు ఏం చేశారు అంటూ వివరిస్తూ చేసిన ఈ వీడియోకి అత్యధిక వీక్షకాధరణ లభిస్తుంది. అయితే ఇంద్రనీల్, మేఘన రామి గారి ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సీరియల్ చేయొచ్చు కదా అని ఒకరు, బాగుందంటూ మరొకరు కామెంట్లు చేస్తున్నారు. కాగా చక్రవాకం సీరియల్ అభిమానులు ఇప్పటికీ వీరిని మర్చిపోలేదంటే వీరి ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది. కాగా ఇంద్రనీల్, మేఘన రామిల యూట్యూబ్ ఛానెల్ 'నీలిమేఘాలలో' కి నాలుగు లక్షలకి పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.  

శ్రీముఖి పెళ్లయ్యాకే మానస్ పెళ్లి.. సిరిసిరిమువ్వ ఏం పాపం చేసింది

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్" లేటెస్ట్ ప్రోమోకి సీరియల్ యాక్టర్స్ వచ్చేసారు. ఓల్డ్ ఈజ్ "గోల్డ్ అనే థీమ్" తో ఈ షో ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్.  కోయిలమ్మ సీరియల్ నుంచి మానస్ - తేజస్విని గౌడ, అగ్నిసాక్షి నుంచి అంబటి అర్జున్- ఐశ్వర్య, మౌనరాగం నుంచి శివ్-ప్రియాంక, మనసిచ్చి చూడు నుంచి  మహేష్-కీర్తి భట్, లక్ష్మి కళ్యాణం నుంచి ప్రియతమ్-హర్షిత, గోరింటాకు నుంచి నిఖిల్- కావ్య  సీరియల్స్ లో హీరోహీరోయిన్స్ వచ్చారు. ఈ సీరియల్స్ అన్ని కూడా సక్సెస్ ఫుల్ రేటింగ్ తో పూర్తైపోయిన సీరియల్స్.   అగ్ని సాక్షి సీరియల్ లో నటించిన అంబటి అర్జున్- ఐశ్వర్యని పిలిచింది శ్రీముఖి..ఆ సీరియల్ లో వాళ్ళ పేర్లు గౌరీ-శంకర్.."గౌరీ నువ్వు శంకర్ ని మిస్ అవుతున్నావా" అని శ్రీముఖి అడిగింది. "చాలాచాలా మిస్ అయ్యాను" అని చెప్పేసరికి "ఈ మాట మీ ఆయన గనక విన్నాడనుకో" అన్నాడు శంకర్. కోయిలమ్మ సీరియల్ నుంచి మానస్ - తేజస్విని గౌడను పిలిచింది శ్రీముఖి. సీరియల్ లో వీళ్ళ పేర్లు అమర్- చిన్ని.."కానీ మా అమర్ కి మాత్రం ఇంకా పెళ్ళవలేదు" అని శ్రీముఖి అనేసరికి "నీకు పెళ్లయ్యాక నాకు పెళ్లవుతుంది" అని చెప్పాడు. "సీరియల్ లో అమర్ రియల్ లైఫ్ లో కూడా అమర్" అలా ఎలా కుదిరింది అని తేజుని అడిగేసరికి ఏమో తెలీదు అని చెప్పింది. "ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు..అప్పుడు ఓల్డ్ లో గోల్డ్ గా బతికిన నన్ను వదిలేశారు..మా సిరిసిరిమువ్వ సీరియల్ ఏం పాపం చేసింది" అని అమరదీప్ చౌదరి అడిగేసరికి "మీ మువ్వ రాలేదు" అని అంది శ్రీముఖి. తర్వాత వీళ్లందరితో  గేమ్స్ ఆడించింది. ఇక హీరోయిన్స్ కి హీరోస్ అంత చేతులకు గోరింటాకు పెట్టారు.  

తన అమెరికా ట్రిప్ ని ఒక్క నిమిషంలో చూపించిన యాంకర్ రవి!

బుల్లితెర టీవీ యాంకర్స్ లో యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని పంచ్ లకి, మాటలకీ ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే ఉంది. రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో అతను చేసే పోస్ట్ లు వైరల్ అవుతుంటాయి. యాంకర్ రవి ఎక్కడికి వెళ్ళిన తన ఇన్ స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తుంటాడు. అందులో మొన్న శ్రీలంకకి సముద్రం మీదుగా వెళ్ళాడు. దాని గురించి వీడియో రూపంలో తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్ అయింది. అయితే తాజాగా తన అమెరికాకి ఒక షూట్ నిమిత్తం వెళ్ళాడు. అయితే వెళ్ళేముందు తను ఎయిర్ పోర్ట్ లో ఒక లుంగీ లా ఉండే డ్రెస్ ని ధరించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. దానికి నెగెటివ్ కామెంట్స్ రావడంతో వాటికి ఘాటుగా రిప్లై ఇచ్చాడు రవి. అమెరికాకి వెళ్ళి వస్తున్నట్టుగా ఒక వీడియోని చేశాడు రవి. ఏదో మిస్ అయినట్లు తన చేతిని అలా ఇంటివరకు తీసుకొచ్చి తన భార్యని పట్టుకొని హగ్ చేసుకున్నాడు‌. ఇదంతా వీడియోలా చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు రవి. కాగా ఈ పోస్ట్ కి వదినని మిస్ అవుతున్నట్టుగా కవర్ చేయడానికే కదా అన్న ఈ వీడియో అని ఒకరు కామెంట్ చేయగా అది వైరల్ అయింది. అయితే ఇప్పుడు పదిహేను రోజుల పాటు అమెరికాకి  వెళ్ళి వచ్చిన ఫోటోలన్నీ కలిపి.. " My 15 Days U.S trip in 1.30mints " అనే టైటిల్ తో పోస్ట్ చేశాడు. కాగా ఈ ట్రిప్ లో తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరికీ థాంక్స్ చెప్పాడు. అక్కడ అమెరికాలో దిగిన ఫోటోలన్నీ కలిపి షార్ట్ వీడియోగా చేశాడు రవి. దీంతో ఇప్పుడు రవి చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.  

మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్స్ లో కృష్ణకి మొదటి స్థానం!

తెలుగు టీవీ సీరియల్స్ లో బెస్ట్ యాక్టర్ గా 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ లోని కృష్ణ సెలెక్ట్ అయింది. స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ లో టీఆర్పీలో మొదటి స్థానంలో బ్రహ్మముడి ఉండగా.. మూడవ స్థానంలో 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్  ఉంది. తాజాగా 'మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్స్ ' ర్యాంకింగ్స్ ని రిలీజ్ చేసింది ఓఆర్ మ్యాక్స్ సంస్థ.. ఈ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో కృష్ణ ముకుంద మురారి సీరియల్ లోని కృష్ణ ఉండగా రెండవ స్థానంలో త్రినయని సీరియల్ లోని నయని ఉంది. కాగా గుప్పెడంత మనసు సీరియల్ లోని వసుధార మూడవ స్థానంలో, రిషి నాల్గవ స్థానంలో ఉన్నారు. అయితే 'మల్లి.. నిండు జాబిల్లి' సీరియల్ లోని మల్లికి అయిదవ స్థానం దక్కింది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ రోజు రోజుకి మరింత ఆసక్తికరంగా మారుతుంది‌.‌ కారణం కృష్ణ, మురారి ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమించుకుంటారు. కానీ ఎవరి మనసులో ఏం ఉందో చెప్పుకోకుండా, తమలో తామే సందిగ్ధంలో ఉంటున్నారు. కాగా ఇదే సరైన సమయం అని భావించిన ముకుంద వాళ్ళిద్దరి మధ్య ఎలాగైనా దూరం పెంచాలని చూస్తుంది. నిన్న మొన్నటిదాకా భవానికి భయపడిన కృష్ణ.. తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ లలో భవానికి దగ్గరవుతుంది. అలా కృష్ణ మారడానికి కారణం ఉంది. గత వారం మురారిని జాబ్ కి వెళ్ళకూడదని కృష్ణ చెప్పడంతో.. తనకి ఆ జాబ్ ఎంత అవసరమో వివరించింది భవాని. దాంతో అప్పటిదాకా భవాని అంటే భయం ఉన్న కృష్ణ.‌. ఆ తర్వాత తన మాటలకి ఫిధా అయింది. ఆ తర్వాత తనని ఎలా ఇంప్రెస్ చేయాలని చూస్తుంది కృష్ణ. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ లలో భవానిలాగా కృష్ణ రెడీ అయి భవానీతో పాటు ఇంట్లో వాళ్ళందరిని ఇంప్రెస్ చేసింది. దాంతో భవానికి కూడా కృష్ణపై పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. ఈ రకంగా కృష్ణ ముకుంద సీరియల్ లో ప్రతివారం ఒక ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతుంది. దాంతో ఈ సీరియల్ ని చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇప్పుడు కృష్ణ మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్స్ లో మొదటి స్థానాన్ని పొందింది.  

బెస్ట్ జూనియర్ డాక్టర్ గా కృష్ణని వరించిన అవార్డు.. అసూయతో ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -213 లో.. గీతికతో ముకుంద ఫోన్ లో మాట్లాడుతుండగా తనేదో ఐడియా చెప్తుంది. అది విని చాలా బాగుందని గీతికతో ముకుంద అంటుంది. భవాని అత్తయ్యకి కృష్ణ, మురారీల అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి ఇప్పుడే చెప్పకూడదు. వాళ్ళు బాగా క్లోజ్ అయ్యాక చెప్తే.. ఇప్పటివరకు నన్ను మోసం చేసి నా ముందు నటించారా అని వాళ్ళని తిడుతుందని ముకుంద అనుకుంటుంది. మరొకవైపు కృష్ణ, మురారిలు హాస్పిటల్ కి వెళ్తారు. కృష్ణ దగ్గర ఒక నర్సు వచ్చి.. ఏంటి కృష్ణ ఇలా చేసావ్. నీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారని నర్సు అనగానే.. నేనేం చేశానని కృష్ణ టెన్షన్ పడుతుంది. కృష్ణ ఏం చేసిందని మురారి అడుగుతాడు. ఏమో కృష్ణ చేసిన పనికి లోపల అందరూ కోపంగా ఉన్నారని నర్సు చెప్తుంది. ఏసీపీ సర్ మీరు ఇక్కడే ఉండడని చెప్పి కృష్ణ లోపలికి వెళ్తుంది. కృష్ణ వెళ్లేసరికి.. పరిమళ మేడం కృష్ణను కోప్పడినట్లు యాక్ట్ చేస్తుంది.అక్కడే గౌతమ్ కూడా ఉంటాడు. ఏంటి కృష్ణ హాస్పిటల్ కి ఇంత మంచి పేరు తీసుకొచ్చావని గౌతమ్ అనగానే.. అసలు ఏమైందని కృష్ణ అడుగుతుంది. బెస్ట్ జూనియర్ డాక్టర్ గా నీకు ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిందని గౌతమ్ చెప్పగానే.. కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయం ఇంట్లో వాళ్లకి చెప్తానని గౌతమ్, పరిమళలకు కృష్ణ చెప్తుంది. కృష్ణ ఏం చేసిందని కార్ దగ్గర మురారి టెన్షన్ పడతాడు. అప్పుడే కృష్ణ వచ్చి సంతోషంతో మురారిని హగ్ చేసుకుంటుంది. తనకి వచ్చిన అవార్డు గురించి చెప్పి కృష్ణ తన హ్యాపీనెస్ ని మురారీతో షేర్ చేసుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు ఇంటికి వస్తారు. ఈ గుడ్ న్యూస్ ని డైరెక్ట్ గా చెప్పకుండా.. ఏదైనా డ్రామా చేద్దామా అని కృష్ణ అంటుంది. అవసరం లేదని మురారి అంటాడు. కృష్ణ లోపలికి వెళ్లి భవాని ఆశీర్వాదం తీసుకొని తనకు అవార్డు వచ్చిన విషయం చెప్తుంది. కంగ్రాట్స్ అంటూ రేవతి చెప్తుంది. ఆ తర్వాత ఇంట్లో అందరికి స్వీట్స్  చేయమని రేవతితో భవాని చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ ఇంట్లో అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. కృష్ణని అందరు పొగుడుతుంటే ముకుంద చూడలేకపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు అగాల్సిందే.  

పేద విద్యార్థుల కల కోసం రిషి ఆ ప్రపోజల్ ని ఒప్పుకుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -819లో.. మన కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలను రిషి, వసుధార ఇద్దరు చూసుకోవాలని మహేంద్ర, జగతి ఒక ప్రపోజల్ పెట్టారని విశ్వనాథ్ చెప్తాడు. దానికి మీరేమంటారని వసుధార, రిషి ఇద్దరిని అడుగుతాడు విశ్వనాథ్. ఆ ప్రపోజల్ విన్న రిషి, వసుధార ఆశ్చర్యంగా చూస్తారు. నాకు ఒకే సర్ కానీ రిషి సర్ అభిప్రాయం కూడా కావాలి కదా అని వసుధార అనగానే.. నువ్వు ఏమంటావని రిషిని విశ్వనాథ్ అడుగుతాడు. వాళ్ళ కాలేజీ లెక్చరర్స్ ఉన్నారు కదా మన కాలేజీ వాళ్లే ఎందుకని రిషి అంటాడు. ఆ ప్రాజెక్ట్స్ చేసే అర్హతలు మీకు ఉన్నాయేమో అందుకే ఈ ప్రపోజల్ పెట్టారని విశ్వనాథ్ అంటాడు. నేను ఒకసారి ఆ ప్రపోజల్ తెచ్చిన వాళ్ళతో మాట్లాడిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటానని రిషి అంటాడు. ఆ తర్వాత వసుధార, రిషి, జగతి, మహేంద్ర అందరూ కలిసి మాట్లాడుకుంటారు. మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చారు. ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదా ఎలా ఉన్నాడో చూసి పోదామని వచ్చారా అని రిషి కోపంగా మాట్లాడతాడు. అది కాదు రిషి అని జగతి, మహేంద్ర చెప్పే ప్రయత్నం చేసినా రిషి వినిపించుకోడు. ఈ మోసగాడి దగ్గరికి ఎందుకు వచ్చారు. నేను మోసగాడినని అందరికి తెలిసేలా చేసి ఎందుకు వచ్చారంటూ రిషి ఆవేశపడుతాడు. రిషి నేను చేసింది తప్పు.. ఒప్పుకుంటున్నా నన్ను క్షమించు. నువ్వు లేక కాలేజీ ఉనికి లేదు. మిషన్ ఎడ్యుకేషన్ ఆగిపోయింది. మా కోసం కాదు పేద విద్యార్థుల కోసం.. నీ కల కోసమైనా ఈ బాధ్యతలు మళ్ళీ చేపట్టమని రిషితో జగతి అంటుంది. ఏం నిర్ణయం తీసుకోవాలి అన్న నాకు టైమ్ కావాలని చెప్పేసి రిషి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి సర్ ఇంకా పాత గాయం మర్చిపోలేదు. కానీ స్టూడెంట్స్ కోసం మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు చెప్పడతాడని వసుధార అంటుంది. వసు అని జగతి ఏదో మాట్లాడుతుండగా..  నాకు మీకు మధ్య ఏ బంధం లేదు. నాకు నా బంధం మీ వల్ల దూరం అయింది. మీకు మీ బంధం దూరం అయిందా? మా బంధం కలిసినప్పుడు మీ బంధం కలుస్తుంది. అప్పుడు మన బంధం కలుస్తుందని జగతితో వసుధార చెప్పేసి వెళ్ళిపోతుంది.  ఆ తర్వాత ఇక వెళతామని విశ్వనాథ్ తో మహేంద్ర చెప్తాడు. లోపలికి వచ్చి పద జగతి వెళదామని మహేంద్ర అంటాడు. "లేదు మహేంద్ర.. రిషి దగ్గరే కొన్ని రోజులు ఉండాలని ఉంది" అని జగతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే .  

ఫ్యామిలి నంబర్ 1 గేమ్ షోకి తీన్మార్ యాంకర్ రాధ అలియాస్ ధరణి ప్రియా

జీ తెలుగులో త్వరలో ఫ్యామిలి నంబర్ 1 పేరుతో ఒక ఫామిలీ గేమ్ షోని త్వరలో ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలో షో గురించి ఆడియన్స్ లో ఒక  ఇంటరెస్ట్ ని క్రియేట్ చేయడం కోసం ఒక్కో ప్రోమోని రిలీజ్ చేస్తూ వస్తోంది..మొన్న కమెడియన్ ధన్ రాజ్ అండ్ ఫామిలీతో ప్రోమో రిలీజ్ చేస్తే ఈరోజు యాంకర్ ధరణి ప్రియాతో ఉన్న ప్రోమోని రిలీజ్ చేసింది. ధరణి ప్రియా ఒడిలో ఒక పాపతో అలా నిద్రపోతూ ఉంటే ఆమె భర్త వచ్చి ఆ పాపను, తనను చూసుకున్నట్టుగా ఈ ప్రోమోని చేశారు. "జీవిత లక్ష్యం సాధించాలంటే ఎంతో కష్టపడాలి..అది ఒకరికి ఒకరు తోడుగా ఉంటేనే సాధ్యమవుతుంది" అనే మాటలతో ఈ ప్రోమో చూపించారు. ఇక ఈ ప్రోమోలో కనిపించిన ధరణి ప్రియా గురించి తెలుసుకోవాలి అంటే ఒక ఛానల్ లో తీన్మార్ న్యూస్ చదివే సావిత్రి అలియాస్ శివజ్యోతి వెళ్ళిపోయాక యాంకర్ రాధ వచ్చింది. ఆమె అసలు పేరు ధరణి ప్రియా. ఐతే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆమె రాధగానే తెలుసు. తెలంగాణ యాసలో తీన్మార్ వార్తలు చదువుతూ అందరిని ఆకట్టుకుంది రాధ . ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మాత్రం 2015లో మోహిత్‌ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. యాంకరింగ్ మీద ఇంట్రస్ట్‌తో జెమిని మ్యూజిక్‌లో యాంకర్‌గా కెరియర్ స్టార్ట్ చేసింది రాధ అలియాస్ ధరణి ప్రియా. రంగస్థలం, డాన్స్ షోలో కంటెస్టెంట్‌ గా కూడా  చేసింది యాంకర్ రాధ. అంతేకాదు కొన్ని  షార్ట్ ఫిల్మ్స్ నటించింది కూడా. అలాగే  దువ్వాడ జగన్నాథం, బాలక్రిష్ణుడు, నేలటిక్కెట్ వంటి మూవీస్ లో కూడా చిన్న చిన్న పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అప్ డేట్స్ ని ఫాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ఈమె కూడా ఈ ఫ్యామిలీ నంబర్ వన్ గేమ్ షోలో కనిపించబోతోంది.

తృటిలో తప్పించుకున్న కావ్య.. అడ్డంగా దొరికిపోయిన స్వప్న! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -152 లో.. ఇంట్లో కబోడ్ లో కనిపించిన కావ్య వేసిన డిజైన్స్ చూసిన రాజ్ షాక్ అవుతాడు. తన లాప్టాప్ లో ఉన్నవి, కావ్య వేసినవి సేమ్ ఉండడంతో.. శృతికి రాజ్ ఫోన్ చేస్తాడు. ఫ్రీ లాన్సర్ గా వర్క్ చేస్తున్న అమ్మాయి పేరేంటని రాజ్ అడగగానే.. శృతి టెన్షన్ పడుతూ కావ్య పేరు చెప్పకుండా శిరీష అని చెప్తుంది. ఆ తర్వాత రాజ్ కి శృతి అబద్ధం చెప్పిందని అర్ధం అవుతుంది. కావాలనే శృతి చేత కావ్య అబద్ధం చెప్పిస్తుందని రాజ్ అనుకొని ఎలాగైనా నిజమేంటో తెలుసుకోవాలనుకుంటాడు.  మరొకవైపు కనకం ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేస్తుంటారు. అన్నపూర్ణ తనకు సపరేట్ ప్లేట్ తెచ్చుకోవడం చూసిన కనకం.. ఏంటని అడుగుతుంది. నాకు డాక్టర్ టీబీ లక్షణాలు ఉన్నాయని చెప్పాడు కదా అది అంటూ వ్యాధి కదా అందుకే నాకు సపరేట్ ప్లేట్ అని అన్నపూర్ణ అనగానే.. కనకం కోప్పడుతుంది. అవన్నీ ఒక్కప్పుడు ఇప్పుడు కాదని అప్పు తను తినే భోజనాన్ని అన్నపూర్ణకి తినిపిస్తుంది. అప్పు ఆలా ప్రేమగా భోజనం తినిపిస్తుంటే అన్నపూర్ణ ఎమోషనల్ అవుతుంది. మరొక వైపు రాజ్ పడుకున్నాక కావ్య బాల్కనీ లోకి వెళ్లి డిజైన్స్ వేస్తుంది. రాజ్ నిద్ర నుండి లేస్తాడు. కావ్య డిజైన్స్ వేస్తూ ఉంటుంది. ఎలాగైనా ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని కావ్య దగ్గరికి వెళ్తాడు. కావ్య చేతిలో ఉన్న పేపర్స్ తీసుకొని చూస్తాడు. అందులో డిజైన్స్ ఏం ఉండవు. ఏం చేస్తున్నావని కావ్యని రాజ్ అడుగుతాడు. నా ముందే ఎవరో అమ్మాయి డిజైన్స్ బాగా వేశారని పొగిడారు కదా నేను అలా డిజైన్స్ ట్రై చేస్తున్నా అని పేపర్ పై ఒక డిజైన్ వేస్తుంది. అది చూసిన రాజ్ దీన్ని ఎవరన్నా డిజైన్ అంటారా అని అంటాడు. కావాలని నా ముందు దొరికిపోతా అని ఇలా వేసావ్ కదా ఎలాగైనా ఆ డిజైన్స్ వేసేది నువ్వే అని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటా అని రాజ్ తన మనసులో అనుకుంటాడు. మరొక వైపు స్వప్న బయట స్కిప్పింగ్ చేస్తుంటుంది. అది చూసిన కావ్య కోపంగా స్వప్న దగ్గరికి వస్తుంది. అప్పుడే బయట నుండి ఇందిరాదేవి, సీతరామయ్య వస్తు స్వప్నని చూసి కోప్పడతారు. ప్రెగ్నెంట్ ఎవరైనా ఇలా చేస్తారా అని కోపంగా అరిచేసరికి ఇంట్లో అందరూ బయటకు వస్తారు. నీకు తెలియకుంటే ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకోవాలని స్వప్నతో ధాన్యలక్ష్మి అంటుంది. అందరూ కోప్పడుతుంటే.. చాలు ఇక ఇంకోసారి ఇలా చెయ్యనని స్వప్న అంటుంది. ఈ స్వప్న చేస్తున్న పనులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలని రుద్రాణి అనగానే.. ఏమని చెప్తావ్.. చెప్పి వాళ్ళని బాధపెట్టడం ఎందుకు. తనని జాగ్రత్తగా అత్తింటి వారే చూసుకోవాలని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.