బిగ్ బాస్‌లో పొట్టి పొట్టి బట్టలు... దామిని షాకింగ్ ‌కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్-7 ఎన్నో ట్విస్ట్ లతో మరెన్నో టాస్క్ లతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండవ వారం షకీల ఎలిమినేట్ కాగా మూడవ వారం సింగర్ దామిణి ఎలిమినేట్ అయింది.  హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరేంటని బిగ్ బాస్ ప్రేక్షకులకు అర్థమైంది. అయితే ఇప్పుడు దామిణి ఒక ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. సీజన్-7 మొదలైందే ఉల్టా పల్టా థీమ్ తో.. అంటే సాధారణంగా ప్రతీ సీజన్ లో లాగా ఓటింగ్ లో చివరన ఉండేవాళ్ళని కాకుండా ఈ సారి ఉల్టా పల్టా చేసి.. టాప్ లో ఉండేవారిని ఎలిమినేట్ చేస్తారేమో అని అనుకున్నారంతా, కానీ ఓటింగ్ ప్రకారం టాప్ లో ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఉంటున్నారు. అయితే దామిణి ఎలిమినేషన్ అవ్వడానికి కారణం తను కంటెంట్ కోసం నటిస్తోందని ప్రేక్షకులకు అప్పటికే అర్థం అయింది. అయితే అప్పడు అమర్ దీప్ మరియు దామిణి చివరి రెండు స్థానాలలో ఉండగా..అందరు అమర్ దీప్ ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారంతా కానీ దామిణి ఎలిమిమేట్ అయింది. దామిణి‌ హౌస్ లో‌ ఇక్కడి ముచ్చట్లు అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్తూ గొడవలు పుట్టించేది‌. ఒక టాస్క్ లో ప్రిన్స్ యావర్ నోట్లో పేడ కొట్టి, జండు బామ్ పెట్టి, ముక్కులో గడ్డి దూర్చి పైశాచి ఆనందాన్ని పొందింది. దాంతో ప్రేక్షకుల దృష్టిలో కంప్లీట్ నెగెటివ్ ఇంపాక్ట్ తెచ్చుకుంది దామిణి. ఇక ఓటింగ్ లో జస్ట్ 2 శాతం ఓటింగ్ మాత్రమే దామిణికి పడటంతో తను లిస్ట్ లో అట్టడుగునకి చేరింది. ఇక తను నామినేషన్లలో చెప్పే పాయింట్లు కూడా చాలా‌ సిల్లీగా అనిపించాయి. అది దామిణి బయటకు రావడానికి మరింత కారణమయ్యాయి.‌ ఈ వచ్చేప్పుడు కూడా బిగ్ బాస్ హౌజ్ లోని కంటెస్టెంట్స్ కి కొన్ని సలహాలని ఇవ్వగా అవి కాస్త ఫేక్ అని తేలింది. శివాజీ కరెక్ట్ మాట్లాడిన తనేదో తప్పు అన్నట్టు మాట్లాడిన దామిణి మాటలని నమ్మడానికి కాసింతైన అవకాశం లేకుండా పోయింది. అయితే బిగ్ బాస్‌ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో మూడవ అత్యధిక రెమ్యునరేషన్  తీసుకున్న కంటెస్టెంట్ గా దామిణిని చెప్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా యాంకర్ శివతో ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఎక్స్ పోజింగ్ చేసావని కొందరు అంటున్నారని శివ అడుగగా.. నా బట్టలు నా ఇష్టం అని దామిణి అంది. హౌస్ లో ఎవరితో సరిగ్గా లేవని ఆడియన్స్ అన్నారని శివ అడుగగా.. నేను ఎలా ఉండాలో మీరెందుకు చెప్తారు ‌ నాకు నచ్చినట్టు నేనుంటాను. మీ కోసం నన్ను నేను మార్చుకోనని దామిణి అంది. బయటకొచ్చాక రాహుల్ సిప్లిగంజ్ ని ఎందుకు కలిసావని యాంకర్ శివ అడుగగా.. వాళ్ళిద్దరి కలిసి ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి కదా వాటి గురించి అడగడానికి వెళ్ళానని దామిణి అంది. వైల్డ్ కార్డ్ గా రతిక హౌస్ లోకి వెళ్లింది  కదా దానిపై మీ అభిప్రాయమేంటని అడుగగా.. లోపలికి పంపించాలని అనుకున్నారు పంపించారని దామిణి అంది. ఇలా బిగ్ బాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది దామిణి.  

విహారికకు రెడ్ రోజ్ ఇచ్చి ప్రొపోజ్ చేసిన ఆది..

ఈ వారం ఢీ షో ఆది కామెడీ డైలాగ్స్ తో బాగా ఎంటర్టైన్ చేసింది. ఆది ఎప్పుడూ ఎవరో ఒకరిని ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ ఈసారి ఒక అమ్మాయికి ప్రొపోజ్ చేసాడు. ఆ అమ్మాయి పేరు విహారిక ఇంతకు ముందు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీద ఆది అంటే ఇష్టం అని ఆ అమ్మాయి చెప్పింది. ఇక ఈ వారం ఢీ షోలో "ఆదిని ఎం చూసి ప్రేమించారు" అని శేఖర్ మాస్టర్ అడిగేసరికి "ఆది చాలా మంచోడు" అని చెప్పింది విహారిక. ఆతర్వాత ముద్దు కూడా పెట్టేసింది. "ఏదో పెద్దాయన అని ముద్దు పెట్టారా" అని శేఖర్ మాస్టర్ డైలాగ్ వేసేసరికి ఆది కొంచెం హర్ట్ అయ్యాడు.  "మా పెళ్ళికి మీరు అస్సలు రాకండి..మా పెళ్లి మేమె చేసుకుంటాం" అన్నాడు ఆది. "పెళ్లి పెద్దలుగా వస్తాం...ఐనా ఆది చాలా మంచోడు, చాలా మంచి మనసు, ఆది నవ్వితే చాలా అందంగా ఉంటాడు" అని శేఖర్ మాస్టర్ ఆదిని పొగిడేసరికి "వద్దు బాబోయ్ మీరు తేనే పూసిన కత్తి..మీరు నాకు గురించి ఇంత మంచి చెప్పాల్సిన అవసరమే లేదు..16 సీజన్స్ నుంచి చూస్తూనే ఉన్నా " అన్నాడు ఆది.. ఇక తన లవర్ విహారికను స్టేజి మీద రెడ్ రోజ్ ఇచ్చి సింగల్ లెగ్ మీద కూర్చుని ప్రొపోజ్ చేసాడు. ఇక విహారిక కూడా "ఐ లవ్ యు టూ" అని రివర్స్ లో చెప్పేసింది. తర్వాత "చూపే బంగారమాయెరా" సాంగ్ కి డాన్స్ చేసాడు ఆది. అది చూసిన శేఖర్ మాస్టర్ "మీ జంట చూడముచ్చటగా ఉంది" అన్నాడు ఇక ప్రదీప్ మధ్యలో వచ్చి "తప్పేముంది పెద్దాయన కూడా ఒక తోడు కోరుకుంటున్నాడు అందులో తప్పేముంది" అని కౌంటర్ వేసాడు.  

ఎవరితో పడితే వాళ్లతో డాన్స్ చేయడం ఇష్టం లేదు

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో ఆది బేస్డ్ ప్రోగ్రాంగా రాబోతోంది. "ఆది కల్యాణ మండపం" పేరుతో ఈ షో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక ఈ షోకి సిరి హన్మంత్, బేబీ మూవీ ఫేమ్ విరాజ్ అశ్విన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళు వీళ్ళ డాన్స్ తో మెస్మోరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక ఈ షోకి వచ్చిన సెలబ్రిటీస్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ ఫస్ట్ జాబ్స్ గురించి చెప్పుకొచ్చారు. అలాగే బ్యాక్ డ్రాప్ లో వాళ్ళ పిక్స్, వీడియోస్ కూడా ప్లే చేసి చూపించారు. ఇలా ఎవరికీ వాళ్ళు వాళ్ళ హిస్టరీ చెప్పుకున్నాక ఆది ఎంట్రీ ఇచ్చాడు. "ఇప్పుడు నేను ఈ బౌల్ లోంచి ఇద్దరి పేర్లు తీస్తాను. వాళ్ళు స్టేజి మీదకు వచ్చి ఒక రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మ్ చేయాలి" అని చెప్పాడు. "కావ్య, శ్రీకర్" అని ఆది పేర్లు చదివేసరికి మధ్యలో నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. "కాదు కాదు ఎవరి పార్టనర్ వాళ్ళతోనే డాన్స్ చేస్తేనే బెటర్ మేం కలిసి వస్తే ఇంకెవరితోనో డాన్స్ ఏమిటి" అన్నాడు. "ఎవరు పడితే వాళ్ళు అంటే నీ ఉద్దేశం ఏమిటి" అంటూ శ్రీకర్ నిఖిల్ మీద ఫైర్ అయ్యాడు. "నాతో వచ్చిన పార్టనర్ నాతో డాన్స్ చేయాలి వేరేవాళ్లతో కాదు" అని ఉద్దేశం అన్నాడు నిఖిల్. "కేవలం సాంగ్ కోసమే కదా. దానికి ఎందుకు సీరియస్ అవుతున్నావు" అన్నాడు శ్రీకర్. "ఇది కేవలం కంటెంట్ మాత్రమే" అని రష్మీ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. కానీ నిఖిల్ మాత్రం నో అని చెప్పేసాడు. "నిఖిల్ నీకేంటి ప్రాబ్లెమ్" అని శ్రీకర్ ని అడిగేసరికి నిఖిల్ వెళ్లి పూలదండలు తెచ్చి కావ్య మేడలో వేసేశాడు. కావ్య నిఖిల్ ని రింగ్ పెట్టేసింది. ఇదంతా ఏమిటా అన్నట్టుగా చూసి షాకయ్యాడు ఆది.

కొత్త కెప్టెన్‌గా శోభాశెట్టి... ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి కొత్తగా మారుతుంది. నిన్నంతా నామినేషన్ లో ఉన్నవారికి జరిగిన ఓటింగ్ లో శోభాశెట్టి, ప్రియాంక, టేస్టీ తేజ లీస్ట్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే గత అయిదు రోజుల నుండి సాగుతున్న కెప్టెన్సీ రేస్ ఎట్టకేలకు ముగిసింది. ఇందులో ఫీమేల్ కెప్టెన్ అయినట్టు తెలుస్తోంది. 'హాల్ ఆఫ్ ది బాల్' టాస్క్ లో గౌతమ్ టీమ్ కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచినట్టు ఇప్పటికే తెలిసింది. అయితే ఇప్పటికి జరిగి‌న టాస్క్ లలో చివరగా శోభాశెట్టి, టేస్టీ తేజ మధ్యలో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో శోభాశెట్టి గెలిచింది. దీంతో తొమ్మిదో వారం కొత్త కెప్టెన్ గా శోభాశెట్టి ఎన్నిక అయినట్టు తెలుస్తుంది. ఫస్ట్ లేడీ కెప్టెన్ గా శోభాశెట్టి ఎన్నికైంది. శోభాశెట్టితో మాట్లాడాలంటే భయపడుతున్న తోటి కంటెస్టెంట్స్ ఎలా భరిస్తారనేది చూడాలి. టేస్టీ తేజతో ఎప్పుడు ఒక ఫేక్ లవ్ ట్రాక్ నడిపిస్తున్న శోభాశెట్టి వాళ్ల  సీరియల్ బ్యాచ్ అయినటువంటి‌‌.. అమర్ దీప్, ప్రియంక జైన్ లకి ఫెయిర్ గా ఉంటుందా లేక అందరిని సపోర్టివ్ గా ఉంటుందా తెలియాలి. ఇక గతవారం ఎలిమినేషన్ లో లీస్ట్ లో ఉన్న శోభాశెట్టి ఈవారం కూడా ఉంది. టేస్టీ తేజ, శోభాశెట్టిల మధ్య తక్కువ ఓట్ల తేడాతో ఇద్దరు లీస్ట్ లో ఉన్నారు. అయితే నిన్న నమోదైన అనఫీషియల్ ఓటింగ్  పోల్స్ లో అశ్వినిశ్రీకి లీస్ట్ లో ఉండగా.. నేడు అత్యధిక ఓటింగ్ తో ప్రియాంక కంటే ఒక స్థానం పైకి వచ్చి, తన గ్రాఫ్ ని పెంచుకుంటుంది. ఇక హౌస్ లో ఎవరేం మాట్లాడినా వారి మీదకి నోరేసుకొని పడిపోయే శోభాశెట్టి కన్నింగ్ స్ట్రాటజీ, ఫౌల్ గేమ్ తో ప్రేక్షకులు విసుగుచెందినట్టుగా స్పష్టమవుతుంది. టేస్టీ తేజ, శోభా శెట్టి చేస్తున్న ఫేక్ లవ్ డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిందని ప్రేక్షకుల ఓటింగ్ ని బట్టి తెలుస్తుంది. మరి కొత్తగా కెప్టెన్ అయిన శోభాశెట్టి ఎలిమినేట్ అయితే హౌస్ లో కెప్టెన్ ఎవరనే దానిపైన చర్చ జరుగుతుంది. ప్రేక్షకుల ఓటింగ్ ని ప్రధానంగా తీసుకొని బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తారా లేక గతవారం చేసినట్టుగా మరో ఫేక్ ఎలిమినేషన్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారా ?

జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ పార్ట్ 2 ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో మంచి కలర్ ఫుల్, నటీ నటుల హంగామాతో మంచి మస్తీని అందించడానికి 5 వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆడియన్స్ ముందుకు రాబోతోంది. "అందమైన అమ్మాయిలను చూసిన తర్వాత నాకు షార్ట్ సర్క్యూట్ కొట్టింది" అన్నాడు.."మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు సీరియల్స్ చూస్తారా" అని ప్రదీప్ అడిగేసరికి "నీ మీద ఒట్టేసి నిన్ను చూస్తా" అని కామెడీ చేసాడు ఆర్జీవీ.  "మా జీ తెలుగు హీరోయిన్స్ ఇక్కడ ఉన్నారు" అని ఆర్జీవీతో యాంకర్ రష్మీ చెప్పేసరికి "నేను అందుకే వచ్చాను" అని ఆర్జీవీ అనడం ఆ తర్వాత స్టేజి మీదకు హీరోయిన్స్ అంతా ఒక్కొక్కరిగా వచ్చి షాక్ హ్యాండ్ ఇచ్చారు. "హైదరాబాద్ లో ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారా ఎప్పుడూ నాకు తెలీదు..తర్వాత ఎవర్ గ్రీన్ సుమ, రాజీవ్ కనకాల వచ్చారు.."మీ ఇద్దరి పెళ్లై పాతికేళ్ళు అయ్యిందా" అని ప్రదీప్ అనేసరికి " చెప్పు రాజా" అంది సుమ. "నువ్వే మాట్లాడు... మాట్లాడాక ఏమన్నా మిగిలుంటే నేను మాట్లాడతాను" అన్నాడు రాజీవ్ . తర్వాత ఇద్దరికీ పూల దండలు తేవడంతో ఇద్దరూ మళ్ళీ దండలు మార్చుకున్నారు" రాజా చెప్పు ఇప్పటికైనా నీకు అవకాశం ఉంది" అంది సుమ " ఇప్పుడు నువ్వు కాదన్నా గాని చేసేదేమీ లేదు" అని కౌంటర్ వేశారు రాజీవ్ కనకాల.. ఇక ఈ షోకి స్పెషల్ గా నాని వచ్చాడు. రాగానే " నా సినిమాల్లో ఎప్పుడూ ఒక మాట వినబడేది నాని అంటే మన కుర్రాడే అని..అదే టీవీ స్పేస్ లో ఎక్కువ వినిపించే పేరు ప్రదీప్" అని కాంప్లిమెంట్ ఇచ్చారు. తర్వాత నిరుపమ్ అండ్ టీమ్ నాన్న బ్యాక్ డ్రాప్ తో ఒక స్కిట్ చేసేసరికి నాని కళ్ళు చెమర్చాయి. ఇలా ఈ ఈవెంట్ ఆదివారం వచ్చి ఎంటర్టైన్ చేయబోతోంది.

రియల్ పోలీస్ ముందే నకరాలు చేసి హైపర్ ఆది

ఢీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి పొలిమేర 2 మూవీ టీం వచ్చింది. ఇక ఎప్పటిలాగే హైపర్ ఆది తన మార్క్ కామెడీతో ఎంట్రీ ఇచ్చాడు. స్టేజి మీదకు  పోలీస్ డ్రెస్ వేసుకుని లాఠీ పట్టుకుని వచ్చాడు. "హా అగ్ని" అనే సాయి కుమార్ డైలాగ్ చెప్పేసరికి హోస్ట్ ప్రదీప్ ఆది చుట్టూ తిరిగి "ఎక్కడంటుకుంది అగ్ని" అని కౌంటర్ వేసేసరికి " ఏయ్" అన్నాడు ఆది. "కంప్లైంట్స్ ఏమున్నా చెప్పండి నేను తీరుస్తా" అన్నాడు ఆది. "నిన్న నైట్ నా నిద్ర పోయింది" అని ప్రదీప్ చెప్పేసరికి "హమ్మో టెన్షన్" అన్నాడు. "సర్ మాకు పోయినా పెట్టుకుంటారా" అని శేఖర్ మాస్టర్ అడిగేసరికి "నీకు పోయినవి నేను పట్టుకోలేను" అని ఆది కామెడీ డైలాగ్ చెప్పి నవ్వించాడు. ఇక సెట్ బయట కూర్చున్న ఇద్దరు రియల్ పోలీసులను చూసి "మీరు కూడా అగ్ని ఏనా" అని ఆది అడిగేసరికి "ఆయన ఒరిజినల్ పోలీస్" అన్నాడు ప్రదీప్..ఆ మాటకు షాకై " మీ పేరేంటి సర్.. ఏ ఏరియా మీది " అని ఆది అడిగాడు.." వివేక్ రెడ్డి" అని ఆ పోలీస్ ఆన్సర్ చెప్పాడు. ఇక డాన్స్ విషయానికి వస్తే నలుగురు సెమి ఫైనలిస్టులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో అదరగొట్టారు. ఇక ఈ టీమ్స్ నుంచి ఒక టీమ్ ని ఎలిమినేట్ చేయాల్సిన టైం వచ్చేసరికి శేఖర్ మాస్టర్ ఒక టాస్క్ ఇచ్చాడు. "ఏ టీమ్ ఐతే ఫైనల్ కి వెళ్ళదు అనుకుంటారో వాళ్ళ ఫ్లాగ్ తీసి మీ పక్కన పెట్టుకోండి" అని చెప్పేసరికి అన్ని టీమ్స్ వాళ్ళ వాళ్ళ ఫ్లాగ్స్ ని వాళ్ళ పక్కనే పెట్టుకున్నారు. ఇక మెజారిటీ ఓట్లు ఎక్కువగా ఓరుగల్లు వీరులు టీమ్ కె పడ్డాయి అని అనౌన్స్ చేసాడు ప్రదీప్. ఇక గ్రీష్మ టీమ్ కూడా డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. ఐతే శేఖర్ మాస్టర్ అనవసరంగా ఎక్కువ అక్రోబాట్స్ చేసినట్టు అనిపించింది అంటూ కామెంట్ చేశారు. మరి ఏ టీం ఎలిమినేట్ అవుతుందో ఏ టీమ్స్ ఫైనల్స్ కి వెళ్తాయో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో తెలిసిపోతుంది.  

ఫెయిర్ గేమ్ ఆడాలంటూ శివాజీ వార్నింగ్.. గౌతమ్ కృష్ణకి ఎథిక్స్ లేవా?

బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ టాస్క్ లో కొనసాగుతున్నాయి. నిన్న జరిగిన టాస్క్ లో రతిక, అమర్ దీప్ ల‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. కాసేపటి దాకా ఇద్దరు గేమ్ గురించి గొడవ పడ్డారు. టాస్క్ లో ఎదవ డ్రామాలు, ఫౌల్ గేమ్ ఆడకూడదని తెలియదా అంటూ అమర్ దీప్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటంతో.. నా గేమ్ ఇంతే, నా స్ట్రాటజీ ఇంతే బాల్స్ కోసం ఏమైనా చేస్తా అన్నట్టుగా అమర్ దీప్ మాట్లాడాడు. ఆ తర్వాత టాస్క్ ముగిసిందని ఎవరి దగ్గర ఉన్న బాల్స్ వారు దాచుకోమని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత గౌతమ్, టేస్టీ తేజ కలిసి శివాజీ టీమ్ దగ్గర ఉన్న బాల్స్ ని తీసుకెళ్ళాలని చూస్తే.‌ నా దగ్గరి బాల్స్ జోలికి వస్తే తొక్క తీస్తా అని శివాజీ అన్నాడు. ఆ తర్వాత టేస్టీ తేజ వచ్చి.. అన్న ఇది గేమ్, బాల్స్ ని మీరు కాపాడుకోవాలని ఎందుకు చెప్తాడని అన్నాడు. ఫౌల్ గేమ్ ఆడొద్దు, ఫెయర్ గా ఆడండమని బిగ్ బాస్ చెప్పాడని శివాజీ చెప్పాడు. ఇక ఇలా అన్నాడని టేస్టీ తేజ వెళ్ళి గౌతమ్ కృష్ణకి చెప్పగా.. అతను శివాజీ దగ్గరకు వచ్చి మేం బాల్స్ తీసుకుంటాం‌. మీరు కాపాడుకోండని గౌతమ్ కృష్ణ అన్నాడు.  దొంగతనం అంటే దొంగతనం కాదన్నా, ఇది ఒక గేమ్. మీరు సీరియస్ గా తీసుకున్నారు. పెళ్ళిలో చెప్పులు దాచేస్తారు కదా అది గేమ్ దొంగతనం  కాదు కదా అని గౌతమ్ అనగా.‌. ఇది పరమ వరెస్ట్ లాజిక్. దీనికి నువ్వు చెప్పినదానికి అసలు సంబంధం ఉందా. మరి ఇది గేమ్ కదా? బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది ఎందుకని గౌతమ్ అడుగగా.. దొంగతనాలు చేయడానికా అని శివాజీ అన్నాడు. మీ తెలివితో పాటు, ఫిజికల్ గా కూడా ఆడమని  బిగ్ బాస్ ఎందుకు చెప్పాడని గౌతమ్ అన్నాడు. చెయ్యి ఉంది కదా అని చేయి కోస్తావా ఏంటి అని శివాజీ అడిగాడు. ఇది మా స్ట్రాటజీ అన్న అని గౌతమ్ అనగా.. రేయ్ నువ్వు డాక్టర్ వి , క్యారెక్టర్, ఎథిక్స్ ముఖ్యం ఫెయిర్ గేమ్ ఆడండి అంటూ శివాజీ అన్నాడు. నేను బాల్స్ ఉన్న సంచులని అక్కడే పెడతా ఎవరు తీసుకుంటారో తీసుకోండి అని శివాజీ చెప్పేసి వెళ్ళిపోయాడు.  

గోల్డెన్ బాల్ పవర్ తో కొత్త ట్విస్ట్.. ఈ టాస్క్ లో గెలిచిందెవరో తెలుసా?

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఉత్కంఠభరితంగా సాగుతుంది. కంటెస్టెంట్స్ తమ స్ట్రాటజీలతో ఆకట్టుకుంటున్నారు. తొమ్మిదవ వారం కంటెస్టెంట్స్ టాస్క్ లతో బిజీ అయిపోయారు. 'హాల్ ఆఫ్ ది బాల్' టాస్క్ లో వీర సింహాలు, గర్జించే పులలు పోటీ పడుతుండగా.. ఇందులో బిగ్ బాస్ ఒక గోల్డెన్ బాల్, ఒక బ్లాక్ బాల్ ఇచ్చాడు. ఇవి రెండు ఎవరికి వస్తాయో వారికి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయని బిగ్ బాస్ చెప్పిన సంగతి తెలిసిందే. పైపు నుంచి చిన్న చిన్న బాల్స్ రావడం.. రెండు టీమ్ లలోని వారు వాటిని పట్టుకొని వారి వారి సంచుల్లో దాచుకోవడం, వీలైనన్ని ఎక్కువ బాల్స్ ని దాచుకున్నవారే కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో ఉంటారని బిగ్ బాస్ చెప్పాడు. అయితే నిన్నటి టాస్క్ లో గోల్డెన్ బాల్ గౌతమ్ కృష్ణ టీమ్ కి వస్తుంది. దాంతో వాళ్ళలోని భోలే షావలిని అవతలి టీమ్ లోని అంబటి అర్జున్ తో స్వాప్ చేసుకునే అవకాశాన్ని పొందారు. ఇక ఇప్పుడు గౌతమ్ కృష్, అంబటి అర్జున్, యావర్, టేస్టీ తేజ, రతిక, శోభాశెట్టి, అశ్విని వీళ్ల టీమ్ లో ఉన్నారు.  మరొక గేమ్ లో అంబటి అర్జున్, అమర్ దీప్ ఒకవైపు, శోభాశెట్టి, గౌతమ్ కృష్ణ మరొకవైపు ఉండి గేమ్ ఆడగా ఇందులో అమర్ దీప్, అంబటి అర్జున్ లు గెలుస్తారు. ఆ తర్వాత పోస్ట్ ద్వారా గెలిచిన వీరికి ఒక లెటర్ వస్తుంది. ఇందులో గెలిచిన వీర సింహాల టీమ్ కి 500 బాల్స్ వచ్చాయి. ఆ తర్వాత టాస్క్ ముగిసింది. మీ దగ్గర ఉన్న బాల్స్ ని జాగ్రత్తగా చూసుకోండని బిగ్ బాస్ రెండు టీమ్ లకి చెప్పాడు.  

ఆమె చేసిన బిర్యానీ కోసం ఇంట్లోని వాళ్లంతా వచ్చారుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -304 లో.. మురారి ఏదో ఆలోచిస్తూ తల పట్టుకొని ఇబ్బంది పడుతుంటే అప్పుడే ముకుంద వచ్చి ఏమైందని అడుగుతుంది. ఎవరో ఒక అమ్మాయి గుర్తుకు వస్తుంది వాంతి వస్తుందని మురారి అంటాడు. అప్పుడే రేవతి భవాని, మధు ఇద్దరు మురారి దగ్గరికి వస్తారు. ఆ తర్వాత మురారి వాంతింగ్ చేసుకుంటుంటే ముకుంద చెయ్యి పడుతుంది. మురారి తన చేతిలో వాంతిగ్ చెయ్యడంతో ముకుంద పట్ల భవానికి సింపతి పెరుగుతుందని ముకుంద అనుకుంటుంది. నువ్వు వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకొని రా ముకుంద అని భవాని అనగానే ముకుంద వెళ్తుంది. సారి చేంజ్ చేసుకుంటే సింపతీ పోతుందని ఆలోచిస్తుంది. నువ్వు ఒంటరిగా అసలు ఉండకు మురారి నిన్ను నేను అసలు ఒంటరిగా ఉంచనని ముకుంద అంటుంది. నువ్వు మురారిని చూసుకో ముకుంద అని భవాని చెప్పగానే..  కృష్ణ గురించి రేవతి అలోచిస్తుంటుంది. మరొక వైపు కృష్ణ భవాని అన్న మాటలు గుర్తుకు చేసుకొని బాధపడుతుంది. అప్పుడే కృష్ణ దగ్గరికి మధు వస్తాడు. ఏంటి ఏసీపీ సర్ నీకు దక్కడని, నన్ను వెళ్ళిపోమని చెప్పడానికి వచ్చావా అని కృష్ణ అనగానే.. అవునని మధు అంటాడు. ఏంటి ఏసీపీ సర్ ని వదిలి పెట్టి వెళ్ళాల అని కృష్ణ కోపంగా అనగానే.. మధు లోపల జరిగిన విషయాన్ని కృష్ణకి చెప్తాడు. ఇక ముకుంద మురారి పక్కనే ఉండి చూసుకోమని భవాని పెద్దమ్మ చెప్పింది. ఇక వాళ్ళు దగ్గరగా ఉంటే వాళ్ళు ప్రేమలో పడి దగ్గర అవుతారని మధు చెప్తాడు. అదేం లేదు ఏసీపీ సర్ అలా ఏం చేయడని కృష్ణ స్ట్రాంగ్ గా చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి ముకుంద వస్తుంది. నువ్వు వెంటనే నీ బ్యాగ్ సర్దుకొని వెళ్ళు. మురారిని ఇక నేను దగ్గర వుండి చూసుకుంటానని ముకుంద అంటుంది. ఇక ఇద్దరి మధ్య కాసేపు మాటల  యుద్ధం జరుగుతుంది. మరొక వైపు మురారికి మంచి వైద్యం కోసం అమెరికా పంపిస్తున్నానని రేవతితో భవాని చెప్తుంది.. మురారితో పాటు ముకుంద కూడా వెళ్తుంది. ఆ తర్వాత మురారి వచ్చి బిర్యానీ స్మెల్ వస్తుందంటూ కిందకి వస్తాడు. చేసేది ఇక్కడ కాదు వేణి మేడమ్ అని మధు అంటాడు. పదండి అందరం వెళదామని మురారి అనగానే.. మురారి చెప్పాడు కాబట్టి భవానికి ఇష్టం లేకున్నా కృష్ణ బిర్యానీ చేసే దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత కృష్ణ అందరికి బిర్యానీ రెడీ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

స్పెషల్ ఆఫీసర్ రాకతో కొత్త మలుపు.. టెన్షన్ లో వాళ్ళిద్దరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -910 లో.. అనుపమ దగ్గరికి వాళ్ళ పెద్దమ్మ వచ్చి మాట్లాడుతుంది. నువ్వు ఇలా బాధపడడం బాలేదు. నీ జీవితాన్ని ఎక్కడ ఆపేసావో అక్కడికి వెళ్ళు. వాళ్ళని తల్చుకొని బాధపడడం ఎందుకు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి అన్ని తెలుసుకోమని అనుపమకి వాళ్ళ పెద్దమ్మ సలహా ఇస్తుంది. ఆ తర్వాత మహేంద్రకి ఫోన్ చేసి అన్ని విషయాలు కనుక్కోవాలని అనుపమ అనుకుంటుంది. మరొక వైపు రిషి, వసుధార, మహేంద్ర కలిసి భోజనం చేస్తుంటారు. మహేంద్ర లో వచ్చిన మార్పు చూసి రిషి, వసుధార ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు.. ఆ తర్వాత మహేంద్రకి అనుపమ ఫోన్ చేస్తుంది. మహేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. అయిన అనుపమ మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటుంది. మహేంద్ర కట్ చేస్తూనే ఉంటాడు. నా భోజనం అయిపొయింది అంటు మహేంద్ర వెళ్లి పోతాడు.. ఆ తర్వాత డాడ్ ఎందుకు ఫోన్ వచ్చాక అలా అయిపోయారు. అనుపమ అని పేరు వచ్చింది కాదా ఫోన్ లో, తనేనా అరకులో కలిసిన ఆమె కదా అని రిషి అనగానే.. అవునని వసుధార అంటుంది. అయిన ఆవిడ డాడ్ కీ ఎందుకు కాల్ చేసింది. మరి డాడ్ ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నాడని రిషి అంటాడు.  తన నెంబర్ తీసుకొని కనుక్కోవాలని వసుధార అనగానే.. వద్దు డాడ్ తనంతట తాను చెప్పేవరకు ఓపిక పడదామని రిషి అంటాడు. ఆ తర్వాత వసుధార కాఫీ తీసుకొని మహేంద్ర దగ్గరికి వస్తుంది. రిషి ఎక్కడ అని అడుగుతాడు. వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడని వసుధార చెప్పగానే.. ఇప్పుడు అక్కడికి ఎందుకని మహేంద్ర అంటాడు.. ఆ తర్వాత వాళ్ళు చేసిన మోసాల గురించి మహేంద్ర గుర్తుకు చేసుకొని బాధపడుతాడు . అప్పుడే రిషి వెళ్తున్నానంటే నేను కూడా వస్తానని వసుధార అంటుంది. మామయ్య గురించి.. ఏం టెన్షన్ పడకండి మామయ్య గారు ఎక్కడికి వెళ్లారని వసుధార చెప్తుంది. ఆ తర్వాత రిషి, వసుధారని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత రిషి, దేవయాని దగ్గరికి వెళ్ళగానే దేవయాని లేని ప్రేమని నటిస్తుంటుంది. రిషి వసుధారలు రాగానే శైలేంద్ర, ఫణింద్రలు వచ్చి మాట్లాడతారు. మీకోక వ్యక్తిని పరిచయం చెయ్యాలని ఫణింద్రకి రిషి చెప్తాడు. అప్పుడే అతను రిషికి ఫోన్ చేసి వస్తాడు.. అతని పేరు ముకుల్.. అమ్మ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అని అతన్ని పరిచయం చేస్తాడు రిషి.  అతన్ని చూడగానే దేవాయని, శైలేంద్ర ఇద్దరు టెన్షన్ పడతారు. ఆ తర్వాత జగతి కేసు గురించి మాట్లాడుకుంటారు.‌  జగతిని రిషి కలుస్తున్నట్లు మాకు తప్ప ఎవరికీ తెలియదని రిషి అంటాడు. జగతి మేడమ్ ఫోన్ ట్రాప్ చేస్తే తెలుస్తుందని ఆఫీసర్ అంటాడు. ఆ  తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అక్కని కొట్టిన చెల్లి.. అసలు ఇద్దరిలో తప్పెవరిది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -243 లో.. స్వప్న ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలియగానే ఇక దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా రుద్రాణి, రాహుల్ ఇద్దరు కలిసి స్వప్నని ఇంట్లో నుండి బయటకు పంపేయాలని అంటారు. ఇక ఇంట్లో నుండి ఇప్పుడు బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి రాలేనని భావించిన స్వప్న మరొక నాటకం మొదలు పెడుతుంది. అంతా చేసి, ఇంత జరుగుతున్న సైలెంట్ గా ఉంటున్నావని కావ్యని స్వప్న అనగానే ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఇక రుద్రాణి మాత్రం ఈ దెబ్బతో ఇంట్లో నుండి ఇద్దరిని బయటకు పంపించెయ్యవచ్చని రుద్రాణి మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత నువ్వు చేసి ఆ తప్పు నా మీద నెట్టేస్తున్నవేంటని కావ్య అంటుంది. నీ తప్పు కాదని చెప్పడానికి తన మీదకి నెట్టి వేస్తున్నావా అని రాజ్ అంటాడు. నాకు ఈ అబద్దం చెప్పమని సలహా ఇచ్చింది కావ్య, ఇదంతా తనకి తెలియదని అమ్మపై ఒట్టు వెయ్ అనగానే కావ్య ఒట్టు వెయ్యలేకపోతుంది. దాంతో అందరూ కావ్య మోసం చేసిందని అనుకుంటారు. ఇంట్లో నుండి బయటకు పంపించెయ్యండని రుద్రాణి అనగానే.. నాతో పాటు మీ అబ్బాయిని కూడా బయటకు పంపించాలి. ఎందుకంటే నేను తప్పు చేశాను కానీ ఆ తప్పు జరగడానికి కారణం రాహుల్.. ఒక నా కడుపు విషయం అబద్ధం కానీ నన్ను డబ్బున్నవాడిని అని చెప్పి మోసం చేసి లేపుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నన్ను ఇంట్లో నుండి పంపిస్తే కోర్ట్ కి వెళ్తానని అనగానే అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత సీతారామయ్య, ఇందిరదేవి ఇద్దరు అక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపోతారు. ఆ తర్వాత సుభాష్ కలుగుజేసుకొని ఇంట్లో నుండి ఎవరు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అమ్మ, నాన్న మేం నిర్ణయం తీసుకుంటాం. అప్పటివరకు ఎవరేం మాట్లాడకండి అని రుద్రాణిపై సుభాష్ కోప్పడి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్వప్నని గదిలోకి తీసుకెళ్ళి చెంప చెల్లుమనిపిస్తుంది కావ్య. చేసిందంతా నువ్వు చేసి నా మీదకి తోస్తావేంటి.. నీలాగా ఉండడం నాకు చేత కాదని స్వప్న పొగరుగా మాట్లాడుతుంది. పెద్దవాళ్ళ అంటే గౌరవం లేదా అని స్వప్నని కావ్య తిడుతుంది. నాకు ఎవరితో సంబంధం లేదు. నేను ఎవరి గురించి పట్టించుకోను. నా సుఖం, సంతోషం మాత్రమే చూసుకుంటానని కావ్యతో స్వప్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పల్లవి ప్రశాంత్ అంటే అంత భయమా!

బిగ్ బాస్ హౌస్ లో గతవారం  ఎలిమినేషన్ అయి బయటకొచ్చిన ఆట సందీప్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.  గత నాలుగు రోజుల నుండి సోషల్ మీడియాలో ఆట సందీప్ పోస్ట్ లతో ట్రెండింగ్ లో ఉన్నాడు.  హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో గేమ్ ఆడలేక వాళ్ళని పక్కన పెడుతున్నారని, అలా ఆడితే కిక్కేముంటుందని, నన్ను కూడా అలానే తప్పించారని మరొక పోస్ట్ ని పెట్టాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు పల్లవి ప్రశాంత్ గేమ్ ని  అర్థం చేసుకోకుండా సీరియల్ బ్యాచ్ తో కలిసి ఆడిన ఆట సందీప్.. ఇప్పుడు అతను గేమ్ బాగా ఆడతాడని, అతనికి అపోజిట్ గా ఉన్నవాళ్ళంతా తనని చూసి బయపడుతున్నారంటూ సపోర్ట్ చేస్తున్నాడు. టేస్టీ తేజ సిల్లీ నామినేషన్ లో బలైన ఆట సందీప్.. అతను ఒక ఫేక్ కంటెస్టెంట్ అంటు బహిరంగ మాట్లాడాడు. బిగ్ బాస్ సీజన్-7 లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంటెస్టెంట్ ఆట సందీప్. బిగ్ బాస్ సీజన్-7 లో మొట్టమొదటి హౌస్ మేట్ గా నిలిచిన ఆట సందీప్ ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఎలిమినేషన్ పై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతవారం జరిగిన నామినేషన్‌లో యావర్ , టేస్టీ తేజ కలిసి ఆట సందీప్ ని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక నామినేషన్‌లో ఉన్న ఆట సందీప్.. ఓటింగ్ విషయంలో లీస్ట్ లో ఉండటంతో బిగ్ బాస్ ఎలిమినేట్ చేసేశాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అసలు ఓటింగ్ లో లీస్ట్ లో ఉంది శోభాశెట్టి. కానీ బిగ్ బాస్ ఆడిన ఆటలో ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యాడని నెటిజన్లు భావిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే.. గత ఏడు వారాల నుండి హౌస్ నుండి ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. కాగా ఈ వారం కుడా శోభాశెట్టి ఎలిమినేషన్ అయితే హౌస్ లో కలరింగ్ తగ్గుతుందని భావించిన బిగ్ బాస్.. ఈ ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే హౌస్ లో ఆట సందీప్ చాలాసార్లు సంచాలకుడిగా చేశాడు. కానీ అన్నిసార్లు సీరియల్ బ్యాచ్ ని గెలిపించడానికి ఫౌల్స్ చేశాడని ప్రేక్షకులకి తెలిసిందే. అయితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కి ఆట సందీప్ చేయడంతో అతడి అభిమానులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.

శోభాశెట్టి ఎలిమినేషన్ ఫిక్స్.. పాటబిడ్డ భోలే అరుదైన రికార్డు!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి కొత్తగా మారుతుంది. నిన్నంతా నామినేషన్ లో ఉన్నవారికి జరిగిన ఓటింగ్ పోల్స్ లో  యావర్ మొదటి స్థానం, రెండవ స్థానంలో భోలే షావలి.. చివరి మూడు స్థానాలలో అశ్వినిశ్రీ, టేస్టీ తేజ, శోభాశెట్టి ఉండగా.. నేటి అనఫీషియల్ ఓటింగ్ పోల్ లో పాటబిడ్డ భోలే అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలోకి చేరుకున్నాడు. ఇక గతవారం ఎలిమినేషన్ లో లీస్ట్ లో ఉన్న శోభాశెట్టి ఈవారం కూడా ఉంది. టేస్టీ తేజ, శోభాశెట్టిల మధ్య తక్కువ ఓట్ల తేడాతో ఇద్దరు లీస్ట్ లో ఉన్నారు. అయితే నిన్న నమోదైన అనఫీషియల్ ఓటింగ్  పోల్స్ లో అశ్వినిశ్రీకి లీస్ట్ లో ఉండగా.. నేడు అత్యధిక ఓటింగ్ తో ప్రియాంక కంటే ఒక స్థానం పైకి వచ్చి, తన గ్రాఫ్ ని పెంచుకుంటుంది. ఇక హౌస్ లో ఎవరేం మాట్లాడినా వారి మీదకి నోరేసుకొని పడిపోయే శోభాశెట్టి కన్నింగ్ స్ట్రాటజీ, ఫౌల్ గేమ్ తో ప్రేక్షకులు విసుగుచెందినట్టుగా స్పష్టమవుతుంది. టేస్టీ తేజ, శోభా శెట్టి చేస్తున్న ఫేక్ లవ్ డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిందని ప్రేక్షకుల ఓటింగ్ ని బట్టి తెలుస్తుంది. హౌస్ లో భోలే ఎక్కడున్న పాటలు పాడుతూ, ఫెయిర్ గేమ్ ఆడుతూ అదరగొడుతున్నాడు. మొన్న పాడిన అమ్మ పాట ఇంకా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది‌. పాటబిడ్డ సీరియల్ బ్యాచ్ కి 'సరైనోడు' అంటూ ట్రోల్స్ ఊపందుకున్నాయి. అయితే మొదటివారం పెద్దగా ఆడకుండా, ఏదో ఏదో మాట్లాడుతున్నాడని రెండోవారమే ఎలిమినేట్  అయిపోతాడని అనుకున్నారంతా కానీ ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉండి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. మరి ఈ వారం శోభాశెట్టి, టేస్టీ తేజలలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి.  

ఫేమస్ కమెడియన్ అనుమానాస్పద మృతి... అనిత చౌదరి ఇంటరెస్టింగ్ పోస్ట్

తెలుగులో ఒకప్పుడు  టాప్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనితా చౌదరి గురించి అందరికీ తెలుసు. పలు షోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించాక  ఈ ఫీల్డ్ కి దూరమయ్యింది. చాలా కాలం తర్వాత ఉయ్యాల జంపాల, ఛత్రపతి మూవీస్ తో  సినిమాతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద మెరిసింది అనితా చౌదరి. అలాంటి అనిత జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది.  అలాంటామె రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టింది. " ఒంటరితనంతో, డిప్రెషన్ తో బాధపడుతున్న కూడా ఈ టెలివిజన్ ప్రపంచాన్ని ఎప్పుడూ మీ  నవ్వుతో , ఉత్సాహంతో,  ఆనందంతో అలరిస్తూనే ఉన్నారు..  అలాంటి వ్యక్తికి మరణం లేదనేది నా అభిప్రాయం.. మాథ్యూ పెర్రీ మీరు ఒక లెజెండ్, మీరు ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఎంతో   ప్రభావాన్ని చూపించారు. ఎంతో మందికి ఆనందం పంచారు..అలాంటి మీరు మీకు నచ్చిన చోటికి అదే ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోయారంటూ" అనిత చౌదరి పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకు విషయానికి వస్తే అమెరికాకు చెందిన ఫేమస్ యాక్టర్, కమెడియన్  మాథ్యూ పెర్రీ రీసెంట్ గా  అనుమానాస్పద రీతిలో తన ఇంట్లోని హాట్‌ టబ్‌లో అసప్మారక స్థితిలో మరణించి కనిపించారు.  1994 నుంచి 2004 వరకు వరుసగా 10 సీజన్లు "ఫ్రెండ్స్‌"  అనే పేరుతో రూపొందించిన ఈ సిరీస్ లో  చాండ్లర్‌ బింగ్‌ పాత్రలో నటించిన  ఫెర్రీకి మంచి గుర్తింపు వచ్చింది. న్యూయార్క్‌లోని ఆరుగురు ప్రముఖుల జీవితాలు వాళ్ళ  డేటింగ్‌ వాళ్ళ  కెరీర్‌ మెయిన్ థీమ్ గా వచ్చింది ఈ   ‘ఫ్రెండ్స్‌’ సిరీస్‌ . ఈ సిరిసీ ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులారిటీ దక్కించుకుంది.

హీరో పెర్‌ఫార్మెన్స్‌కి మంచి స్కోప్‌ లేదు..అందుకే సీరియల్ నుంచి తప్పుకుంటున్న

జెమినీ టీవీలో ప్రసారమవుతున్న "అను అనే నేను" సీరియల్ లో హీరో ఆకాష్ మెయిన్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు ఆకాష్ ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు. డాక్టర్ వెంకటేష్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఆకాష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2001లో వచ్చిన ‘ఆనందం’ మూవీ ద్వారా తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయం అయ్యారు. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో హీరో ఆకాష్  బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. రేఖ హీరోయిన్‌గా నటించింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ‘ఆనందం’ మూవీకి ఆడియన్స్  బ్రహ్మరథం పట్టారు. ఐతే ఇప్పుడు ఈ అను అనే నేను సీరియల్ నుంచి ఆకాష్ తప్పుకోవడం పై ఒక వీడియోని రిలీజ్ చేశారు. "అను అనే నేను సీరియల్ లో  హీరోగా నటించే అవకాశం ఇచ్చిన జెమినీ టీవీకి  ధన్యవాదాలు. కానీ, నేను పోషించిన హీరో పాత్రలో పెర్‌ఫార్మెన్స్‌కి మంచి స్కోప్‌ లేకపోవడమే కాకుండా ఈ రోల్ లో నటించడానికి పెద్దా ఆసక్తి కూడా ఉండడం లేదు. అందుకే సీరియల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ  టీమ్ గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను." అంటూ ఒక పోస్ట్ పెట్టారు. మరి ఆకాష్ ప్లేస్ ఎవరిని రీప్లేస్ చేస్తారో చూడాలి. ఆనందం తర్వాత  ఆకాష్ తెలుగు, తమిళ భాషల్లో  50పైగా సినిమాల్లో నటించారు. ‘అందాల రాముడు’, ‘నవ వసంతం’, ‘గోరింటాకు’, ‘నమో వెంకటేశ’ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు ఆకాష్. హీరోగా, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆయన ఫెయిల్ అయ్యారు.  

అషు రెడ్డికి ఆర్జీవీ కారు గిఫ్ట్‌... పూజ చేసిన వేణుస్వామి!

  బిగ్ బాస్ ద్వారా అలాగే ఆర్జీవీ ఇంటర్వ్యూస్ ద్వారా ఫుల్ పాపులరైన సోషల్ మీడియా స్టార్స్ లో  అషు రెడ్డి ఒకరు. బిగ్ బాస్ తెలుగు 3లోకి అడుగు పెట్టిన అషు తన అందంతో, ఆటతో ఆకట్టుకుంది. రాహుల్ సిప్లిగంజ్‌తో చనువుగా ఉంటూ కవ్విస్తూ ఇంకా హైలైట్ అయింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక  చల్ మోహన్ రంగ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, పోకస్ వంటి మూవీస్ లో నటించింది. సోషల్ మీడియాలో క్లిక్ ఇంతగా మూవీస్ లో క్లిక్ అవలేదు ఆషు.అలాంటి అష్షు ఈమధ్య కాలంలో ఫుల్ డైటింగ్ చేస్తూ జిమ్ చేస్తూ మంచి ఫిజిక్ తో అందరినీ ఆకర్షిస్తోంది. ఇక రీసెంట్ గా ఒక కార్ కూడా కొనేసింది. ఇక రచ్చ రవి ఆషుకి విషెస్ చెప్పాడు. " నా మనసుకు బాగా నచ్చిన నా స్నేహమా .. నీ ఎదుగుదల నాకెప్పుడు ఆనందాన్నిస్తుంది..నువ్వు అనుకున్న ప్రతి గమ్యాన్ని చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... నా తరఫున నా శ్రేయోభిలాషులందరి తరఫున నీ కొత్త కారుకు శుభాకాంక్షలు... నువ్వు తలపెట్టే ప్రతి పనికి దీవెనలు.. లవ్ యు రా అషు రెడ్డి...!!! " అని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. సుమారు 65 లక్షలు ఖరీదు చేసే  రేంజ్ రోవర్‌ను కనుగోలు చేసి  పాపులర్  జ్యోతిష్కుడు వేణు స్వామితో పూజలు చేయించింది. ఇక నెటిజన్స్ అంతా విషెస్ చెప్పడంతో పాటు ఆర్జీవి గిఫ్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత వెటకారంగా కామెంట్ చేసిన అష్షు మాత్రం ఆ కామెంట్స్ ని పెద్దగా పట్టించుకోదు..తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. ఇక వేణు స్వామితో పూజల అనంతరం ఆ వీడియోని పోస్ట్ చేసి  ‘మనల్ని అనుసరించే వాళ్లు మన సలహాలని పాటిస్తూ ముందుకు వెళ్లే వాళ్లని చూస్తే ఆ ఆనందం’ అంటూ టాగ్ లైన్ పెట్టింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

లాస్ట్ ఏడిచింది అప్పుడే...

బుల్లితెర మీద ప్రసారమయ్యే ప్రముఖ కామెడీ షోస్ లో ఎక్కువగా జబర్దస్త్  షో సూపర్ ఫేమస్ అయింది.  ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమై వారి టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. అందులో రౌడీ రోహిణి, పటాస్ ఫైమా కూడా ఉన్నారు. ఫైమా నెమ్మదిగా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ ఎదుగుతూ వస్తోంది. అలాంటి ఫైమా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా "ఏమన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే అడగండి" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చేసరికి "నువ్వు ఫైనల్ గా ఎప్పుడు ఏడ్చావ్" అని అడిగారొక నెటిజన్ "అక్టోబర్ 25 న" అని చెప్పింది. "అబ్రాడ్ వెళ్ళావ్ కదా అక్క..ఎలా ఉంది" అనేసరికి " చాలాబాగుంది కానీ ఫుడ్ బాలేదు" అన్నట్టు చెప్పింది. "మీ హౌస్ కి మొత్తం ఎంత ఖర్చు అయింది" అని అడిగేసరికి "14 లక్షలు పెట్టి కొన్నాను. 15 లక్షలు పెట్టి మోడిఫై చేయించాను" అని చెప్పింది. "అక్టోబర్ 25 న ఎందుకు ఏడ్చావ్ అక్కా" అని ఇంకో నెటిజన్ అడిగేసరికి "నాన్నకు యాక్సిడెంట్ అయ్యింది" అని చెప్పింది.  ఫైమా పటాస్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత జబర్దస్త్ లో మెరిసి మురిపిస్తోంది.  జబర్దస్త్ లో చేసే సమయంలోనే ప్రవీణ్ కి, ఫైమాకి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కుదిరింది. ఇక వీరి మధ్య ఉన్న రిలేషన్  చూసిన ప్రతి ఒక్కరు వీరు లవర్స్ అని అనుకునేవాళ్లు. కానీ తర్వాత ఫైమా బిగ్ బాస్ కి వెళ్లిపోవడంతో వాళ్ళ రిలేషన్ కి అక్కడ ఫుల్ స్టాప్ పడిపోయింది. ఐతే పటాస్ ప్రవీణ్ తన ప్రేమను  ఫైమాకు చెప్పాడు కానీ ఫైమా మాత్రం రిజెక్ట్ చేసి ఎప్పటికీ ఫ్రెండ్స్ లా ఉందాం అని చెప్పింది ఫైమా. ఐతే ఫైమా ప్రవీణ్ లవ్ బ్రేకప్ అవ్వడానికి కారణం ఆ ఓ కమెడియన్ అనే రూమర్ కూడా ఉంది.

నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేస్తాడా!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. నిన్న మొన్నటి దాకా హీటెడ్ నామినేషన్లు కొనసాగిన విషయం తెలిసిందే‌. అయితే నిన్నటి నుండి హౌస్ లో టాస్క్ లు మొదలయ్యాయి. టాస్క్ ల కంటే శోభాశెట్టి, టేస్టీ తేజ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  హౌస్ లో ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా ప్రవర్తిస్తుంటారని, ఒక్కొక్కరి స్ట్రాటజీ ఒక్కోలా ఉంటుందని అందరికి తెలిసిందే. అయితే ఇందులో శోభాశెట్టి చేసే అతి అంతా ఇంతా కాదు. ఆడ మగ అనే తేడా లేకుండా తోటి హౌస్ మేట్స్ తో అడ్డదిడ్డంగా మాట్లాడుతూ బిగ్ బాస్‌ సీజన్ 7 లోనే  'ది వరస్ట్ కంటెస్టెంట్‌' గా నిలిచింది శోభాశెట్టి. దీనికి తగ్గట్టు తేజాతో లవ్ ట్రాక్ ఒకటి. కావాలని బలవంతంగా వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపించాలని చూస్తున్నారు బిగ్ బాస్. ఇక తేజా అయితే.. ఆల్రెడీ శోభాశెట్టికి ఇండైరెక్ట్ గా ఐ లవ్యూ చెప్పేశాడు. ఏంటే.. ఒసేయ్.. అదే.. ఇదే.. అంటూ తేజా మాట్లాడే మాటలు చూస్తుంటే జనాలకి వీళ్ళేందో, వీళ్ళ అతి ఏందో అనిపిస్తుంది. నిజంగానే శోభాని పెళ్లాన్ని పిలిచినట్టే పిలుస్తున్నాడు తేజా. ఆడాళ్లని మహారాణులుగా చూసుకోవాలని బిగ్ బాస్ టాస్క్ ఇస్తే.. వీళ్లిద్దరూ జీవించేశారు. హౌస్‌‌లో ఉన్న ఆడాళ్లందర్నీ మహారాణుల్లా చూసుకోమని, వాళ్లకి బ్రేక్ ఫాస్ట్ తినిపించాలని బిగ్ బాస్ చెప్తే.. శోభా తనని ఎత్తుకొని తీసుకెళ్ళమని తేజకి చెప్తుంది. టాస్క్ కదా అని తేజ ఎత్తుకుని బాత్ రూంలోకి తీసుకుని వెళ్లి పళ్లు తోమించాడు. ఆ తర్వాత తెగ సేవలు చేసేశాడు. ఇది చూసిన ఎవరికైన ఏందిరా సామి మాకు ఈ కర్మ అని అనుకుంటారు. శోభాశెట్టి గ్యాప్ దొరికితే చాలు తేజాతో హగ్ లు , క్లోజ్ గా కూర్చొని మాట్లాడుకోవడాలు చేస్తూనే.. నీతో ఇలా క్లోజ్ గా ఉండటం చూసి నా బాయ్ ఫ్రెండ్ ఏమైనా అనుకుంటాడా?  అతనికి చాలా మెచురిటీ ఉంది. నన్ను అర్థం చేసుకుంటాడు. ఒకవేళ నన్ను అర్థం చేసుకోలేకపోతే నేను తీసుకోలేనురా తేజ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. అలాంటిదేమీ కాదులే నీలా నువ్వు ఉండు అంటు తేజ ధైర్యం చెప్పాడు. ఇక గతవారం ఎలిమినేషన్ జస్ట్ లో మిస్ అయిన శోభాశెట్టి.. ఈ వీక్ కూడా నామినేషన్ లో ఉండటంతో తనకి లోలోపల భయం మొదలైంది. అందుకే ఇలా ఏడిస్తే ప్రేక్షకులు కరిగి ఓట్లు వేస్తారనే సింపథీ డ్రామాని మొదలుపెట్టిందని నెటిజన్లు ‌భావిస్తున్నారు.

వీర సింహాలు వర్సెస్ గర్జించే పులులు.. పల్లవి ప్రశాంత్ అవుట్!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఉత్కంఠభరితంగా మొదలవుతుంది. సోమవారం మంగళవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో యావర్, భోలే షావలి, అమర్ దీప్, టేస్టీ తేజ, శోభాశెట్టి, ప్రియాంక జైన్, అశ్వినిశ్రీ, అంబటి అర్జున్ ఇలా మొత్తంగా ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు. ఇక తొమ్మిదవ వారం టాస్క్ లని మొదలుపెట్టాడు బిగ్ బాస్. అయితే టాస్క్ లు మొదలయ్యే మందు హౌస్ లోని కంటెస్టెంట్స్ మధ్య జరిగిన కొన్ని మాటలని బిగ్ బాస్ ప్రేక్షకులకి చూపించాడు. అశ్వినిని యావర్ అనవసరంగా నామినేట్ చేశాడంటు తన వాదనని పెంచుతుంటే, అది నా పాయింట్ అని యావర్ అన్నాడు. ఇక శోభాశెట్టి కూడా యావర్ అనవసరంగా పిచ్చోడు అని అన్నానంటూ చెప్పుకుంటూ బాధపడుతుంటుంది. శివాజీ ఒక్కొక్కరికి హౌస్ లో ఎలా ఉండాలో చెప్తున్నాడు. నామినేషన్ అనేది ఒక ప్రక్రియ. మన ఫోకస్ గేమ్, టాస్క్ లు బాగా ఆడాలి. ఫెయిర్ గేమ్ ఆడాలి. జనాలు మన ఫెయర్ గేమ్ నే చూస్తారు. గొడవలు పెట్టుకుంటే మన గ్రాఫ్ కిందపడిపోతుందని యావర్, ప్రశాంత్ లతో శివాజీ చెప్పాడు. ఇక అశ్వినిశ్రీ తన మనసులోని విషయాలని సీరియల్ బ్యాచ్ ప్రియాంక, అమర్ దీప్ లతో పంచుకుంటుంది. ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో టాస్క్ మొదలైంది. ఇందులో హౌస్ మేట్స్ ని టైగర్స్ మరియు లయన్స్ అని రెండు టీమ్ లుగా విభజించిస్తాడు బిగ్ బాస్. ఒక పైప్ ఉంది. బజర్ మొదలవ్వగానే అందులో నుండి రకరకాల బాల్స్ పడుతుంటాయి. వాటిని కంటెస్టెంట్స్ కి ఇచ్చిన గోధుమ రంగు గల గోనెసంచిలో వేసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక శివాజీ తన ఒంటి చేత్తో సూపర్ ఫాస్ట్ గా గేమ్ ఆడుతున్నాడు. అయితే దీనికి ముందు బెలూన్స్ ఊది అక్కడి టైర్స్ లో పెట్టాలని చెప్పగా అందులో యావర్, టేస్టీ తేజ, శోభా శెట్టి ఉన్న లయన్స్ టీమ్ గెలిచింది.  ఆ తర్వాత బాల్స్ ఛాలెంజ్ లో గెలిచిన జట్టుకి కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం లభిస్తుందని, ఇందులో ఒక పవర్ బాక్స్ ఉంటుందని అది మీకు యూజ్ అవుతుందని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి చెప్పాడు. అయుతే ఈ గేమ్ లో గెలిచిన శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, యావర్, భోలే షావలి, రతిక అందరు కలిసి ఏకాభిప్రాయంతో అపోజిట్ టీమ్ లో ఉన్న పల్లవి ప్రశాంత్ ని కెప్టెన్సీ రేస్ నుండి తప్పించారు. ఆ తర్వాత డెడ్ బోర్డ్ ని బిగ్ బాస్ పంపించగా అది చూస్తూ పల్లవి ప్రశాంత్ ఏడ్చేశాడు. ఇక హౌస్ మేట్స్ అంతా ఓదార్చారు. ఆ తర్వాత శివాజీ వచ్చి డెడ్ బోర్డ్ ని ప్రశాంత్ మెడలో వేశాడు. పల్లవి ప్రశాంత్ ని గేమ్ నుండి తీసినందుకు భోలే షావలి ఎమోషనల్ అయ్యాడు.