'ఎటో వెళ్ళిపోయింది మనసు' సీరియల్ రేపే ప్రారంభం!

'ఎటో వెళ్ళిపోయింది మనసు' అనే పాట తెలుగు ప్రేక్షకులకుందరికి గుర్తుండే ఉంటుంది‌. 'నిన్నే పెళ్ళాడతా' సినిమాలో నాగార్జున, టబుల మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ ఇది. కొందరు దర్శక, నిర్మాతలు అలనాటి సినిమాలలోని హిట్ సాంగ్స్ ని, వాటిలో వచ్చే చరణాలని నేడు సినిమాలుగా, సీరియల్స్ గా తీసుకొస్తున్నారు. ఝుమ్మందినాదం, సీతాకోకచిలుక, కార్తీక దీపం, సత్యభామ, అవే కళ్ళు, మిస్సమ్మ, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, గుండె నిండా గుడిగంటలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సీరియల్స్ బుల్లితెర ధారావాహికలుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్నాయి. ఇప్పుడు అదే కోవలో స్టార్ మా టీవీలో కొత్త సీరియల్ రాబోతుంది. రేపు అనగా జనవరి 22న స్టార్ మా టీవీలో 'ఎటో వెళ్ళిపోయింది మనసు' సీరియల్ ప్రారంభం కానుంది. ఇందులో ప్రధాన పాత్రలుగా సీతాకాంత్, రక్ష నింబార్గి చేస్తున్నారు. భార్యామణి, అష్టా చెమ్మ సీరియల్స్ లలో నటించి సీతాకాంత్ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. రక్ష నింబార్గి కన్నడ భామ. బింగో అనే కన్నడ మూవీతో వెండితెరపై అరంగేట్రం చేస్తుంది. రక్ష నింబార్గి తెలుగులో చేస్తోన్న తొలి సీరియల్  ఎటో వెళ్ళిపోయింది మనసు.  కన్నడ, తమిళ్ నుండి వచ్చిన ఎంతోమంది హీరోయిన్ లు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ తెచ్చుకున్నారు. ప్రియాంక జైన్, పల్లవి గౌడ, రక్ష గౌడ, శోభాశెట్టి ‌ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సీరియల్స్ లలో కన్నడ భామల లిస్ట్ పెద్దగానే ఉంది. ఆ జాబితాలోకి ఇప్పుడు రక్ష నింబార్గి చేరింది. ఈ సీరియల్ నుంచి తాజాగా విడుదలైన ప్రోమోలో ఏం ఉందంటే.. సీతాకాంత్, రామలక్ష్మీల వివాహం కోసం ముహుర్తంతో ప్రోమో ఆసక్తిగా మొదలైంది. ఇక రామలక్ష్మి, సీతాకాంత్ మధ్యలో చాలానే ఏజ్ గ్యాప్ ఉంది. ఇప్పటికే ఏజ్ గ్యాప్ మీద 30 weds 21 వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ఈ కొత్త సీరియల్ రాబోతుంది. నీకు షేక్ హ్యాండ్ ఇవ్వడమంటేనే కంపరం.. అలాంటిది నీ చేతిలో చేయి వేసి నడవడమంటే అది ఇంపాజిబుల్ అని సీతాకాంత్ అనగా.. శానిటైజర్ స్మెల్ తో సంసారమో సైన్స్ ల్యాబో తెలియని నీతో లైఫ్ అంటేనే హర్రిబుల్ అని  రామలక్ష్మి అంటుంది‌‌. ఇలా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండగా మరి వీరిద్దరికి పెళ్ళి జరుగుతుందా? లేదా.. జరిగితే ఎలా కలిసి ఉంటారో తెలియాలంటే ఈ సీరియల్ ని చూడాల్సిందే.  తెలుగులో మొట్టమొదటి సీరియల్ చేస్తోన్న రక్ష నింబార్గి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి మరి.

నా పేరు తేజ.. కానీ అమర్ నాలో తేజుని కూడా చూసుకున్నాడు!

బిగ్ బాస్ సీజన్ 7 తో మోస్ట్ పాపులర్ అయినవారిలో పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్.. వీరితో పాటుగా సీరియల్ బ్యాచ్ లోని ప్రియాంక జైన్, శోభాశెట్టి, అమర్ దీప్ లకి కూడా ఎంతో కొంత  ఫ్యాన్ బేస్ వచ్చింది. అయితే హౌస్ లో కాస్త ఇంటలిజెన్స్ గా ఉండేవారిలో టేస్టీ తేజ ఒకడు. ఇక బిగ్ బాస్ తర్వాత ప్రియాంక జైన్, శోభాశెట్టి లతో కలిసి వ్లాగ్స్ చేసిన తేజ.. ఇప్పుడు అమర్ దీప్, తేజస్విని గౌడతో కలిసి వ్లాగ్ చేశాడు. టేస్టీ తేజ విత్ అమర్ దీప్ అనే క్యాప్షన్ తో ఓ వీడియోని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో సీరియల్ బ్యాచ్ తో ఎప్పుడు ఉండే టేస్టీ తేజ.. అందరితో ఫన్ చేస్తూ సరదాగా ఉండేవాడు. జబర్దస్త్ లో మూడొందలకు పైగా స్కిట్ లలో చేసి, ఆ తర్వాత ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ సొంతంగా టేస్టీ తేజ అనే యూట్యూబ్ ఛానెల్ ని రన్ చేస్తున్నాడు. ఇందులో తను ఏ వ్లాగ్ పోస్ట్ చేసిన అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది. అద్బుతాహార హోటల్ కి అమర్ దీప్ ని తీసుకెళ్ళిన టేస్టీ తేజ.. అక్కడ తనతో ఫుడ్ వ్లాగ్ ని చేశాడు.  ఇక్కడ వీడియో చేస్తే ఎవరైన అద్భుతమైన వ్యక్తితోనే చేయాలని ఇన్నిరోజులు ఆగానని అమర్ దీప్ తో టేస్టీ తేజ అనగా.. రేయ్ తిడుతున్నావా? పొగుడుతున్నావారా అని అమర్ దీప్ అన్నాడు. నీకు వెజ్ ఆ నాన్ వెజ్ ఆ అని టేస్టీ తేజ అడుగగా.. వెజ్ అని అమర్ అంటాడు. అలా అమర్ అనగానే.. నువ్వు నరరూప రాక్షసుడివి బ్రో అని తేజ అన్నాడు. మనిద్దరిం హౌస్ లో ఉన్న రోజులలో ది బెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయో అంటే.. అవి మనం ఇద్దరం బెడ్ మీద పడుకున్నవే అని అమర్ అన్నాడు. నా పేరు తేజ కానీ వాడు నాలో అప్పుడప్పుడు తేజుని చూసుకునేవాడు. నా భాద ఎవరితో చెప్పుకోవాలని తేజ అన్నాడు. మొదట అమర్ ని బ్రో అని పిలిచే వాడిని అలా గడుస్తూ ఉంటే ఒరేయ్ అరేయ్ అని కూడా వచ్చేదని అయినా తీసుకోగలిగాడు. నా కన్నా ఏజ్ లో పెద్దోడైన మంచోడని అమర్ దీప్ గురించి తేజ అన్నాడు. ఆ తర్వాత ఈ వ్లాగ్ లో తేజస్విని గౌడ యాడ్ అయింది. మా జర్నీలో ఇది అవ్వకుండా ఉంటే బాగుండేదని నీకు ఏమైనా అన్పించాయా అని తేజస్విని గౌడని తేజ అడుగగా.. తను ఆలోచిస్తుంటుంది. తను ఆలోచిస్తుంది కానీ మనకి చాలానే ఉన్నాయని అమర్ తో తేజ నవ్వుతూ అనేసాడు. తేజ అనేవాడు ఓ నిండు బెలూన్ లాంటివాడు. చూడటానికి అందంగా ఉంటాడు. అందంగా మాట్లాడతాడు. కానీ మంచివాడని తేజ గురించి అమర్ దీప్ అన్నాడు. ఇలా ఈ వ్లాగ్ లో బిగ్ బాస్ హౌస్ లో వారి మధ్య జరిగిన వాటిని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసుకున్నారు.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో కీలక మలుపు.. కొత్త క్యారెక్టర్ ఎంట్రీ!

కృష్ణ ముకుంద మురారి.. ఈ సీరియల్ స్టార్ మాలో ప్రసారమవుతూ ఎంతగానో పాపులర్ అయింది. ఇందులో సీనియర్ ఆర్టిస్ట్ ప్రియా మెయిన్ రోల్ చేస్తుండటంతో మరింత ప్రేక్షకాదరణ పొందింది. విభిన్న కథతో ఈ సీరియల్ ముందుకు సాగుతూ మంచి ఆదరణ పొందుతుంది. ఈ సీరియల్ లో భవాని(ప్రియా) కొడుకు ఆదర్శ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి పేరే ముకుంద. భవానీతో పాటు తన తోటి కోడలుగా రేవతి ఉంది. రేవతి కొడుకు మురారి. అతను తన పెళ్ళికి ముందు ముకుందని ప్రేమించి ఉంటాడు. అయితే మురారి పెళ్ళి కృష్ణ అనే అమ్మాయితో జరుగుతుంది. మురారి, ముకుందలు ఒకరికొకరు ఇష్టపడ్డారు అనుకోని పరిస్థితుల వల్ల వారిద్దరి జీవితాలు తారుమరయ్యాయి. మురారి ముకుందల ప్రేమ విషయం తెలియని భవాని ఆదర్శ్-ముకుంద పెళ్లి చేసింది. ఆదర్శ్ కోసం మురారి తన ప్రేమని త్యాగం చేసాడు. కానీ ముకుంద అదే ఇంటికి కోడలు అవుతుంది. పెళ్లి తర్వాత ముకుంద ప్రేమ వ్యవహారం ఆదర్శ్ కి తెలిసి ఇంట్లో నుండి ఆర్మీకి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి తిరిగిరాలేదు. మధ్యలో అనుకోకుండా మురారి, కృష్ణలది అగ్రిమెంట్ మ్యారేజ్ అని అందరికి తెలుస్తుంది. అది ఇప్పుడు ఎన్నో క్లిష్ట పరిస్థితులని దాటుకొని పర్మినెంట్ మ్యారేజ్ అయింది. కృష్ణని పంపించి మురారి ప్రేమని పొందాలని, ఆదర్శ్ రాకూడదని ముకుంద కోరుకుంటుంది. కానీ కృష్ణ మాత్రం ఆదర్శ్ ని తీసుకొని వచ్చి ముకుంద జీవితం బాగుచెయ్యాలని చూస్తుంది. ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ లలో.. ముకుంద అడ్డదారుల్లో మురారిని సొంతం చేసుకోవాలని ట్రై చేస్తూనే ఉంది. కృష్ణ, మురారి మాత్రం ఎలాగైన ఆదర్శ్ ని తీసుకొని వస్తామంటు బయల్దేరి వెళ్లి ఆదర్శ్ ని కలుస్తారు. ఆదర్శ్ కి రూపం మారిన మురారి విషయం గురించి కృష్ణ చెప్తుంది. మురారి, ఆదర్శ్ ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఇన్ని రోజులుగా ఇంటికి దూరంగా ఉన్న ఆదర్శ్ ఇంటికి వస్తాడా? ముకుంద ప్రేమాయణం తెలిసిన ఆదర్శ్ తనని క్షమించి భార్యగా యాక్సెప్ట్ చేస్తాడా? ఆదర్శ్ ఇంటికి వస్తే ముకుంద ఎలా ఉండగలదు.. మురారిపై ఉన్న ముకుంద ప్రేమని త్యాగం చేయగలదా? ఇన్ని ట్విస్ట్ ల మధ్య ఈ కథ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇన్ని రోజులుగా కథలో ఆదర్శ్ లేడు. ఇప్పుడు రీఎంట్రీ ద్వారా కథ ఏ మలుపు తిరగనుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

స్టేజా నేనా తేలిపోవాలనుకున్నావ్.. మనిషి అంటే నీలా ఉండాలి!

జస్వంత్ జెస్సీ.. బిగ్ బాస్ సీజన్-5 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతగానో ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ లోకి జెస్సీ ఎంట్రీ ఇచ్చాక స్టేజ్ మీద నాగార్జున అతడిని ప్రేక్షకులకి పరిచయం చేశాడు. అతడొక ఫ్యాషన్ డిజైనర్, ర్యాంప్ వాకర్ అని చెప్పాడు. ర్యాంప్ వాకింగ్ లో ట్రైనింగ్ ఇస్తుంటారని చెబుతూ స్టేజ్ పైనే ర్యాంప్ వాకింగ్ చేయించారు. జెస్సీ అసలు పేరు జస్వంత్ పడాల. ఇతడు విజయవాడకు చెందిన వ్యక్తి. కానీ ఫ్యామిలీతో హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాడు. 29 ఏళ్ల జస్వంత్ కి మోడలింగ్, ఫ్యాషన్ ఇండస్ట్రీపై ఆసక్తి ఎక్కువ. నటించడమంటే మహా ఇష్టమట. అందుకే ముందుగా మోడలింగ్ లో ట్రైనింగ్ తీసుకొని.. బెంగుళూరులో చాలా ఫ్యాషన్ షోలలో పాల్గొన్నాడు. ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నాడు. మిస్టర్ ఏపీ ట్రెడిషనల్ ఐకాన్ గా ఎంపిక అయ్యాడు. ఆ తరువాత మోడల్ హంగ్ సీజన్ 2 విజేతగా నిలిచాడు. మోడలింగ్ ఇండస్ట్రీలో తప్పిస్తే జెస్సీ గురించి బయటివారికి పెద్దగా తెలియదు. అయితే 2018లో సూపర్ మోడల్ ఇండియా టైటిల్ ను గెలుచుకోవడం లైమ్ లైట్ లోకి వచ్చాడు. మోడలింగ్ రంగంలో ఎదుగుతూ.. 36 గంటలు ర్యాంప్ వాక్ చేయించిన రికార్డ్ సంపాదించాడు. కేవలం ఫ్యాషన్ షోలు మాత్రమే కాకుండా.. ర్యాంప్ వాకింగ్ లో ట్రైనింగ్ ఇస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో 2017లో సప్తమాత్రిక అని ఓ టీవీ సీరియల్ లో నటించాడు. ఆ తరువాత 'ఎంతమంచి వాడవురా' సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్- 5తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. జెస్సీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ తన గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. జెస్సీ చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయిన తనంతట తనే కష్టపడ్డాడు. వాళ్ల నాన్నకి బ్రెయిన్‌లో తేడా వచ్చి.. ఒక్కో పార్ట్ పడిపోయి మంచాన పడి చనిపోయారు. సరిగ్గా అదే టైమ్ లో జెస్సీ తన కెరియర్‌ని సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోయాడు. సరిగ్గా వాడి కెరియర్ మొదలయ్యే టైమ్ లోనే ఇలా అయ్యింది. అప్పుడే డౌన్ అయ్యాడు. ఇన్నాళ్లకు మళ్లీ బిగ్ బాస్ ప్లాట్ ఫామ్ దొరికింది. ఇదే లైఫ్ అనుకుని వచ్చాడని అంది. ప్రేక్షకులు వాడికి సపోర్ట్ చేయాలి. ఎవరి సపోర్ట్ లేకుండా ఇక్కడివరకు వచ్చాడని భావోద్వేగానికి గురయ్యింది జెస్సీ తల్లి. అయితే ఆ తర్వాత ఢీ షోలో కో డ్యాన్సర్ గా జాయిన్ అయ్యాడు.‌ కానీ ఎప్పుడు ఫైనల్ కి రాలేదు. కానీ ఈ సీజన్ సెలెబ్రిటీ స్పెషల్ లో భాగంగా.. వెంకీ సినిమాలోని.. మాతో పెట్టుకుంటే మడతడిపోద్దనే పాటకి నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇక ఢీ షోలో జడ్జులుగా చేస్తున్న శేఖర్ మాస్టర్, ప్రణీత, గణేష్ మాస్టర్ కలిసి జెస్సీ డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసి ఫిధా అయ్యారు. ఈ పర్టికులర్ పర్ఫామెన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నా అని ప్రణీత అనగా,స్టేజా నేనా తేలిపోవాలనుకున్నావ్.. మస్త్ అనిపించింది.. మనిషి అంటే నీలా ఉండాలని గణేష్ మాస్టర్ చెప్పడంతో జెస్సీ ఎమోషనల్ అయ్యాడు. కాగా ఇది ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. జెస్సీ కెరీర్‌లో ఈ పర్ఫామెన్స్  ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.

వీళ్ళిద్దరి మధ్యలో నరకం చూస్తున్నా : ఆదిరెడ్డి 

ఎవరా ఇద్దరు? ఏంటా కథ.‌. అసలు ఆదిరెడ్డికి నరకమా ఇదేందయ్యా ఇది అనేగా.. ఎస్ నిజమే ఆదిరెడ్డికి ఇంట్లో కష్టంగా ఉందంటూ చెప్పసాగాడు. ఆ విషయాన్ని కవిత నాగ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశారు. అదేంటో ఆ నరకమేంటో ఓసారి చూసేద్దాం... ఆదిరెడ్డి వాళ్ల చెల్లెలు, నాన్న, కవిత అందరు కలిసి ఒకే ఉంట్లో ఉంటారు. వారిమధ్య ఇప్పటివరకు ఏ గొడవ జరుగలేదు. తాజాగా ఓ వ్లాగ్ ను వారి యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయడంతో ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ సీజన్ 6 కి ముందు ప్రతీ ఎపిసోడ్ చూసి రివ్యూలు ఇచ్చిన అదిరెడ్డి.. కామన్ మ్యాన్ కేటగిరీలో సీజన్ సిక్స్ లో హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఎన్నో అంచనాల మధ్య కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టిన ఆదిరెడ్డికి బయట బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది. హౌస్ లో జెన్యున్ ప్లేయర్ అంటే ఆదిరెడ్డి అనేంతలా తన ఆటతీరుని కనబరిచేవాడు. అలాగే గీతురెడ్డితో స్నేహం అతనికి కాస్త కలిసొచ్చింది. తన స్ట్రాటజీలు ఇతర కంటెస్టెంట్స్ మీద చూపించే గీతు రాయల్.. ఆదిరెడ్డి మీద చూపించేది కాదు. అదొక ప్లస్ అవ్వగా.. ప్రతీ నామినేషన్ లో వ్యాలిడ్ రీజన్ లు చేప్తూ ఆడియన్స్ ఇలా అనుకుంటారు. ఇది కరెక్ట్.. మనం ఇలానే ఉండాలని అనుకుంటు మరింత ఫెయిర్ ప్లే గేమ్ ఆడాడు. ఇక సీజన్ సిక్స్ లో టాప్- 4 కంటెస్టెంట్స్ లలో ఒకడిగా ఉండి ఎలిమినేషన్ అయి బయటకొచ్చాడు ఆదిరెడ్డి.  కరోన టైమ్ లో ఆదిరెడ్డి చెల్లెలు నాగలక్ష్మి తన పెన్షన్ డబ్బుని సోను సూద్ కు పంపించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఆదిరెడ్డి వెళ్ళి అక్కడ కామన్ మ్యాన్ పవర్ చూపించాడు. హౌస్ లో ఆడే ప్రతీ టాస్క్ ప్రాణం పెట్టి ఆడేవాడు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ తర్వాత సీజన్ సెవెన్ కు రివ్యూ లు ఇచ్చి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చెల్లి నాగలక్ష్మి, భార్య కవితకు మధ్య గొడవ జరిగిందని దానివల్ల తను ఇబ్బంది పడుతున్నాడని చెప్పుకొచ్చాడు. ‌ఇలా ప్రతీ ఇంట్లో ఉంటుంది .. దయచేసి భర్తలను అర్థం చేస్కోండి అంటు ఆదిరెడ్డి ఈ వ్లాగ్ లో చెప్పాడు.  కవిత నాగ వ్లాగ్ అనే యూట్యూబ్ ఛానెల్ లో .. " వీళ్ళ ఇద్దరి మధ్యలో నరకం చేస్తున్నా " అనే టైటిల్ తో ఈ వ్లాగ్ ని అప్లోడ్ చేశారు. ఇకనుండి  నాగలక్ష్మి తన పెన్షన్ డబ్బులు తీసుకోవద్దని నేను చూసుకుంటానని చెప్పాను కదా అని ఆదిరెడ్డి చెప్పగా నాగలక్ష్మి వద్దని అంది. మరి ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనే క్వశ్చన్ వేసి నెటిజన్లని జవాబులు చెప్పమనగా ఈ వీడియోకి కామెంట్లతో పాటు అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది.

Krishna Mukunda Murari : భర్త కోసం ముకుంద తన ప్రేమను చంపుకోగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -372 లో.. అందరు భోజనం చెయ్యడానికి వచ్చి భవాని కోసం చూస్తుంటారు. అప్పుడే ముకుంద వచ్చి.. నేను వడ్డిస్తాను కూర్చోండని రేవతితో అంటుంది. అలా అనగానే ఏం అవసరం లేదంటూ చిరాకుగా అనేసరికి.. ప్లీజ్ అర్థం చేసుకోండి అత్తయ్య.. భవాని అత్తయ్యకు ఎదరుగా ఉంటే అసలు ఇక్కడ నుండి వెళ్లిపోతుందని ముకుంద అనగానే.. సరే అని రేవతి కూర్చుంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి వచ్చి మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్తారు. అప్పుడే భవాని కూడా వస్తుంది. ఆదర్శ్ ఆచూకి దొరికిందని అనగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఒక ముకుంద మాత్రం డల్ అయిపోతుంది. నువ్వు కూర్చొ ముకుంద నేను వడ్డిస్తానని కృష్ణ అంటుంది. మధు నువ్వు నా పక్కన వచ్చి కూర్చో అని భవాని కోపంగా అనగానే.. ముకుంద బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆదర్శ్ ఆచూకి దొరికింది అంటే చాల హ్యాపీగా ఉంది కానీ వాడు వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో అని భయంగా ఉందని భవాని అనగానే.. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య.. అంత నా బాధ్యత అని చెప్పాను కదా అని కృష్ణ అంటుంది. ఇప్పుడు మేం వెళ్తున్నాం. వచ్చేటప్పుడు ఆదర్శ్ ని తీసుకొని వస్తామంటు కృష్ణ, మురారి ఇద్దరు బయల్దేరి వెళ్తారు. ఆ తర్వాత కృష్ణ మురారి కలిసి వెళ్ళి మెహత గారిని కలుస్తారు. ఆదర్శ్ జాబ్ రీసైన్ చేసి అక్కడ దగ్గర ఊర్లో ఉన్నాడని చెప్తాడు. ఆ తర్వాత వెంటనే కృష్ణ మురారి కలిసి ఆదర్శ్ ఉన్న దగ్గరికి బయల్దేరి వెళ్తారు. మరొకవైపు ఆదర్శ్ వస్తే నా పరిస్థితి ఏంటని ముకుంద టెన్షన్ పడుతుంది. ఆదర్శ్ ని భర్త గా ఆక్సెప్ట్ చేస్తానని మురారికి మాట ఇచ్చాను. నా ప్రేమని చంపుకోవాలా అని తనలో తనే బాధపడుతుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి కలిసి కారులో కబుర్లు చెప్పుకుంటు వెళ్తారు. మధ్య మధ్యలో టీ భోజనాలు కానిస్తూ వెళ్తుంటారు. తరువాయి భాగంలో కృష్ణ, మురారి‌ ఇద్దరు ఆదర్శ్ దగ్గరికి వెళ్తారు. ఆదర్శ్ మాత్రం రూపం మారిన మురారిని గుర్తు పట్టడు. దాంతో కృష్ణ జరిగిందంతా చెప్పి మురారి ఇతనే అని చెప్పడంతో  మురారిని ఆదర్శ్ హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Arohi Rao : రాగం, తాళం, పల్లవి, శృతి.. ఏం చెప్పొద్దు!

ప్రస్తుతం గజిబిజి లైఫ్ లో ఎన్నో పనులు, మరెన్నో టెన్షన్ లు ఉంటున్నాయి. అందుకే  ప్రతీ ఒక్కరికి సంగీతం వినాలని, అలాంటి సంగీతం వింటే కాస్త మనసుకి హాయి కలుగుతుంది. అలాంటి హాయినిచ్చే పాటల కోసం చిన్న సెలెబ్రిటీల నుండి పెద్ద సెలబ్రిటీల వరకు.. కామన్ మ్యాన్ నుండి గొప్పోళ్ళ వరకు అందరు కొన్ని పాటలని తమ ఫేవరెట్ పాటలుగా వింటుంటారు. అయితే కొందరు తమకిష్టమైన సంగీతాన్ని నేర్చుకుంటారు.‌ ఇప్పుడు ఆ జాబితాలోకి బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ ఆరోహి చేరింది. ఆరోహి రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహి .. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది. తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహి రావు. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే అని చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహి రావు  చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహి.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహి.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదాగా గడిపింది. మొదట్లో కీర్తభట్ తో స్నేహంగా ఉన్న ఆరోహి, ఆ తర్వాత ఆర్జే సూర్య, ఇనయా సుల్తానాలతో కలిసి ఒక గ్రూప్ గా మారారు. హౌస్ లో కొన్నిరోజులు సూర్యతో లవ్ ట్రాక్ నడిపినట్లు కనిపించిన ఆరోహి.. అదంతా లవ్ కాదని వారిది స్నేహమే అని చాలాసార్లు చెప్పింది.  బిగ్ బాస్ తర్వాత తనకిష్టమైన యాంకరింగ్ రంగానికి మళ్ళీ వచ్చేసింది. ఇక రెగ్యులర్ గా ఇన్‌స్టా లో రీల్స్ చేస్తూ, ఫోటో షూట్ లతో రెచ్చిపోతుంది ఈ భామ. అయితే తాజాగా తను ఓ పాటని హమ్ చేస్తూ గిటార్ ప్లే చేయడం స్టార్ట్ చేసింది. తనకి నేయిల్స్ బాగా పెరిగాయని ముందు వీటిని తీసేయాలని లేదంటే ట్యూన్ సరిగ్గా రావడం లేదంటూ ఆరోహీ ఇబ్బంది పడుతుంది. ఇలా తను ఫస్ట్ ప్లే చేసిన‌ గిటార్ మ్యూజిక్ ప్లేని ఇన్ స్టాగ్రామ్ అభిమానులతో పంచుకుంది.‌‌ సరిగమపదని లతో పాటు తనకేం రావని.. రాగం, తాళం, పల్లవి, శృతి, లయ ఏం చెప్పొద్దని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది ఆరోహీ. అయితే ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తోంది. 

Guppedantha Manasu: భద్ర జస్ట్ మిస్.. దొంగలముఠాలో కొత్త విలన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -978 లో.. నాకు ఎలాగైనా రిషిని చూపించమని వసుధారని‌ మహేంద్ర రిక్వెస్ట్ చేస్తాడు. మావయ్య అర్థం చేసుకోండి.. రిషి సర్ బాగున్నారు. ఇప్పుడు మనం రిషి సర్ ని కాపాడుకోవాలని వసుధార ఎంత చెప్పిన వినకుండా రిషి దగ్గరకి వెళదామని మహేంద్ర అంటూ ఉంటాడు. రిషి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమోనని ఆతృతగా చాటు నుండి భద్ర వింటు ఉంటాడు. అప్పుడే అతనికి శైలేంద్ర ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ సౌండ్ విని ఎవరో ఉన్నారని వసుధార వెళ్లి చూసేలోగా భద్ర అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత చూసావా మన చుట్టు ఏదో జరుగుతుంది. అందుకే వసుధార రిషి గురించి చెప్పడం లేదని అనుపమ అంటుంది. ఆ తర్వాత శైలేంద్రతో భద్ర ఫోన్ లో మాట్లాడుతు.. మీకు కొంచెం కూడా సెన్స్ లేదు. కరెక్ట్ టైమ్ కి ఫోన్ చేశారు. వాళ్ళు రిషి గురించి మాట్లాడుకుంటున్నారు. మీరు ఫోన్ చెయ్యడం వల్ల వాళ్ళు నా ఫోన్ సౌండ్ విని వాళ్ళు డైవర్ట్ అలెర్ట్ అయ్యారు. లేదంటే రిషి ఎక్కడ ఉన్నాడో నాకు తెలిసేది. ఇప్పుడెలా తెలుసేదంటు శైలేంద్రపై భద్ర కోప్పడతాడు. భద్ర ఫోన్ కట్ చేసాక మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనుకుంటు వెనక్కి తిరిగేలోపు వసుధార, మహేంద్ర, అనుపమ ముగ్గురు అతని ముందు ఉంటారు. ఎవరితో మాట్లాడుతున్నావని మహేంద్ర అడుగుతాడు. వీళ్లు నా మాటలు విన్నారా అని భద్ర టెన్షన్ పడుతాడు కానీ వినలేదని తెలిసి ఎవరో కాల్ చేసి విసిగిస్తున్నారు అంటు కవర్ చేస్తాడు. కానీ వసుధారకి డౌట్ వచ్చి ఫోన్ లాక్కొని చూస్తే అది శైలేంద్ర నెంబర్ కాదని తెలుస్తుంది. రివర్స్ డ్రామా ప్లే చేస్తు నమ్మకం లేకపోతే నేను వెళ్తానంటు భద్ర అనగానే.. అదేం లేదు నువ్వు వెళ్లి పని చూసుకో అంటు అనుపమ పంపిస్తుంది. ఆ తర్వాత దేవయానికి రాజీవ్ ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ శైలేంద్ర లిఫ్ట్ చేస్తాడు. ఇద్దరు ఒకరికొకరు పరిచయం లేదు కాబట్టి కాసేపు నువ్వు ఎవరంటే? నువ్వు ఎవరంటూ కోపంగా మాట్లాడుకుంటారు. కాసేపటికి దేవయాని వచ్చి ఫోన్ తీసుకొని రాజీవ్ తో మాట్లాడుతుంది. ఈ రాజీవ్ ఎవడని కన్ఫ్యూషన్ లో శైలేంద్ర ఉంటాడు. రాజీవ్ దేవయానిని కలిసి మాట్లాడాలని, మీ అబ్బాయిని కూడా తీసుకొని రమ్మని చెప్తాడు. ఇక చక్రపాణికి వసుధార ఫోన్ చేసి రిషి బాగోగులు కనుక్కుంటుంది. ఆ తర్వాత దేవయాని, శైలేంద్ర కలిసి రాజీవ్ కోసం ఒక దగ్గర వెయిట్ చేస్తు ఉంటారు. అసలు ఈ రాజీవ్ ఎవరని దేవయానిని శైలేంద్ర అడుగుతాడు. వసుధార బావ రాజీవ్.  తనని ఇష్టపడ్డాడంటు అప్పుడు రాజీవ్ చేసిన కుట్రల గురించి మొత్తం శైలేంద్రకు దేవయాని చెప్తుంది. వసుధారపై ఇంత కథ నడించిందా? ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు.. అయినా ఇప్పుడు వీడిని మనం ఎందుకు కలుస్తున్నామని శైలేంద్ర అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

విడలేక మిమ్ము.. విడిపోతు ఉన్నా.. ఇంటింటి గృహలక్ష్మి కస్తూరి ఎమోషనల్

స్టార్ మాలో మరో సీరియల్ కి ఎండ్ కార్డు పడిపోయింది. దాదాపు నాలుగేళ్లు సాగిన "ఇంటింటి గృహలక్ష్మి" సీరియల్ టాటా వీడుకోలు అని చెప్పేసింది. మొత్తం 1158 ఎపిసోడ్స్‌‌తో హోమ్లీగా నడిచిన ఈ సీరియల్ ఐపోయేసరికి లీడ్ రోల్ యాక్టర్ కస్తూరి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక  ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.  "నాలుగేళ్ల నుంచి మా మీద మీరంతా చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు...నేను మిమ్మల్నందరినీ  చాలా మిస్ అవుతాను. మీతో కలిసి ఇంత అద్భుతమైన ప్రయాణం చేసే అవకాశం ఇచ్చిన స్టార్ మా ఛానల్‌కి కృతజ్ఞతలు. అలానే నాకు ఇంత మంచి రోల్  ఇచ్చిన ఇంటింటి గృహలక్ష్మి బృందానికి కూడా ధన్యవాదాలు. ఇక నా తోటి నటీనటులందరికీ థాంక్యూ సో మచ్. మిమ్మల్ని మళ్లీ సెట్స్‌లో చూసే అదృష్టం ఇక లేదు. ఇన్నాళ్లూ తులసిని మీ గృహాలక్ష్మిగా మీ కుటుంబ సభ్యురాలిగా ఆదరించిన తెలుగు ప్రజలకీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. త్వరలోనే మీ ముందుకు మళ్లీ వస్తాను. మర్చిపోలేని జ్ఞాపకాలతో, గుర్తుండిపోయే ఆదరాభిమానాలతో, అంతకుమించిన బాధతో సెలవు తీసుకుంటున్నా" అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది కస్తూరి.  ఇక ఈ పోస్ట్ తో నెటిజన్స్ కూడా కొంచెం బాధపడుతూ మెసేజెస్ చేశారు. "అంత సడెన్ గా సీరియల్ ని పూర్తిచేసేశారేమిటి మేడం, తులసి క్యారెక్టర్ ని చాలా మిస్సవుతాం..మిమ్మల్ని మరో ప్రాజెక్ట్ లో చూసే అవకాశం కోసం వెయిటింగ్...మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటో కూడా చెప్పండి" అంటున్నారు.  గృహలక్ష్మి సీరియల్ తులసి రోల్ ఉన్నంతవరకు బాగుంది కానీ తర్వాత సెకండ్ వైఫ్ ఎంట్రీ ఇచ్చేసరికి ఆడియన్స్ నుంచి చాలా వ్యతిరేకతను ఎదుర్కొంది కూడా...ఇలాంటి సీరియల్స్ ద్వారా సమాజానికి ఎం మెసేజ్ ఇస్తున్నారు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక తులసి అలియాస్ కస్తూరి తెలుగు, తమిళం, మలయాళం మూవీస్ లో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో గ్యాంగ్ వార్ , సోగ్గాడి పెళ్లాం, నిప్పు రవ్వ, గాడ్ ఫాదర్, చిలక్కొట్టుడు, రథయాత్ర, అన్నమయ్య, మా ఆయన బంగారం లాంటి మూవీస్ లో మంచి రోల్స్ లో నటించింది.

Brahmamudi : ఆ విషయం తెలిసి కావ్య మనసు ముక్కలైంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -311 లో.. శ్వేతకి ఇంట్లో ఎవరో ఉన్నారనే డౌట్ వస్తుంది. దాంతో భయంభయంగా ఉంటుంది. డోర్ తీస్తూ కర్రతో కొట్టాలని ప్రయత్నం చేస్తుంది. వెంటనే శ్వేత.. నేను అంటు రాజ్ వస్తాడు. ఆ తర్వాత ఇంట్లో ఎవరో ఉన్నారు. నా చుట్టు ఏదో జరుగుతుందంటూ రాజ్ తో శ్వేత చెప్తుంది. టీవీ దానంతట అదే ఆన్ అయిందని శ్వేత చెప్తుంది. నువ్వు రిమైండర్ పెట్టుకున్నావు అందుకే ఆన్ అయిందని రాజ్ చెప్తాడు. ఆ తర్వాత కావ్యకి ఆఫీస్ స్టాఫ్ లోని ఒకమ్మాయి ఫోన్ చేసి.. సర్ ఇంకా ఆఫీస్ కి రాలేదని చెప్తుంది. బయల్దేరి చాలా టైమ్ అవుతుందని కావ్య చెప్తుంది. డిజైన్స్ కావాలి.. లేదంటే సర్ ని తిడుతారని ఆమె అనగానే.. నేను వేస్తాను పంపించని కావ్య చెప్తుంది. మరొకవైపు శ్వేత భయపడుతు ఈ ఫ్లవర్ వాజ్ కిందకి పడిపోయింది. ఇంక ఈ స్టాండ్ లో ఉండాల్సిన కత్తి కింద ఉందంటూ చెప్పగానే.. నువ్వేం టెన్షన్ పడకు అన్నీ కనుక్కుందామని శ్వేతకి రాజ్ దైర్యం చెప్తాడు. అలా శ్వేతతో రాజ్ మాట్లాడుతుంటే.. ఎవరో వాళ్ళకి తెలియకుండా వీడియో తీస్తారు. ఆ తర్వాత కావ్య డిజైన్స్ వేస్తి శృతికి పంపిస్తుంది. అప్పుడే రాజ్, శ్వేత ఇద్దరు మాట్లాడుకుంటున్న వీడియోని ఎవరో అజ్ఞాతవ్యక్తి వీడియో తీసి కావ్యకి పంపిస్తాడు. కావ్య ఆ వీడియోని చూసి షాక్ అవుతుంది. అదే గుర్తుచేసుకుంటు ఏడుస్తు ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కళ్యాణ్ కవితలు రాస్తుంటే.. అనామిక కాఫీ తీసుకొని వస్తుంది. నువ్వు ఇలాగే రాస్తూ ఉంటావా? ఆఫీస్ కి వెళ్ళవా అని అడుగుతుంది. అన్నయ్య బిజీగా ఉన్నప్పుడు వెళ్తానని కళ్యాణ్ అంటాడు. ఆ పిచ్చి రాతలు రాస్తు ఉంటాడని రాహుల్ అంటాడు. అందరు నేను రాసే కవితలు పిచ్చి రాతలు అంటూ ఉంటారు కానీ నువ్వు మాత్రమే నా కవితలు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావని కళ్యాణ్ అనగానే.. నువ్వు ఇలా రాస్తు కూర్చొని ఉంటే ఈ ఇంట్లో నాకేం విలువ ఉంటుందని మనసులో అనామిక అనుకోని వెళ్తు ఉంటే.. రుద్రాణి ఆపి నీ బాధ నాకు అర్థం అయింది. రాజ్ ఒక్కడే ఆఫీస్ చూసుకుంటున్నాడు. కళ్యాణ్, రాహుల్ ఇద్దరికి అసలు సంబంధం లేదని అనామికని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఇక మీద ఇలా ఉండకూడదు. ఆఫీస్ వ్యవహారాల్లో వీళ్ళు కూడా ఉండాలి. నేను చెప్పినట్టు మా అత్తయ్య ధాన్యలక్ష్మి దగ్గరకి వెళ్ళి మాట్లాడమని, ఆ తర్వాత నేను చూసుకుంటానని రుద్రాణికి అనామిక చెప్తుంది. ఆ తర్వాత రాజ్ ఇంటికి వస్తాడు. హాల్లో కూర్చొని ఉన్న ధాన్యలక్ష్మితో.. రుద్రాణి చూసావా రాజ్ ని అందరు పొగుడుతున్నారు. కళ్యాణ్ కూడా అలా ఆఫీస్ బాధ్యతలు చూసుకోవాలి. అనామికకి కూడా అలాగే ఉందని ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. గదిలోకి వెళ్లిన రాజ్ కి కావ్య డిజైన్స్ ఇస్తుంది కానీ ఎక్కడికి వెళ్లారంటూ ఏం అడుగదు. ఆ తర్వాత ఆఫీస్ లో ఆమెకి రాజ్ కాల్ చేసి.. ఇంటికి ఫోన్ చేసి ఆఫీస్ కి రాలేదని చెప్పావా అని అడుగుతాడు. చెప్పానని అనగానే తనని రాజ్ తిడతాడు. అయినా నన్ను కావ్య ఏం అడగలేదని రాజ్ అనుకుంటాడు. తరువాయి భాగంలో శ్వేతకి గాయం అయితే రాజ్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. అక్కడ వాళ్ళని కావ్య చూస్తుంది. ఇద్దరు నర్సులు వాళ్ళు కాబోయ్ భార్యభర్తలంట అని వాళ్ళ మాటలు వినగానే.. కావ్య మనసు ముక్కలు అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

90’s వెబ్ సిరీస్ గురించి శివాజీ ఎమోషనల్ స్పీచ్.!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో గుర్తింపు తెచ్చుకున్న వారిలో శివాజీ ఒకడు. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలవడానికి కూడా ఫ్రధాన కారణం శివాజీనే అని అందరికి తెలుసు. తాజాగా ఈటీవీ విన్ లో విడుదలైన #90' s వెబ్ సిరీస్ లో నటించిన శివాజీ.. ఈ సిరీస్ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసుకున్నాడు. శివాజీ ఒకప్పుడు సినిమాలు చేసి కొంత బ్రేక్ తీసుకున్నాడు. మాస్టర్ సినిమాలో చిరంజీవితో పాటు చేసాడు.  ఆ తర్వాత ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ కి ఫ్రెండ్ పాత్రని చేసి అప్పట్లోనే ట్రెండ్ సృష్టించాడు. ఇక ఆ తర్వాత తాజ్ మహల్‌ లాంటి ప్రేమకథలు కూడా చేసాడు. ఇక నీలకంఠ దర్శకత్వంలో    'మిస్సమ్మ' సినిమా చేసి విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఆ తర్వాత కొన్ని అడపాదడపా సినిమాలు చేసిన అవి పెద్దగా ఆడలేదు. దాంతో కాస్త విరామం తీసుకొని మళ్ళీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీతో సెకెండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేశాడు. హౌస్ లో ప్రశాంత్, యావర్ లకి ఇంట్లోని ఓ పెద్దన్నలాగా అండగా ఉండి వారికి సరైన సమయంలో సరైన సూచనలిస్తూ టాప్-5 లో ఉండేలా చేశాడు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇంత సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం శివాజీ, ప్రశాంత్, యావర్ అని అనడంలో అతిశయోక్తి లేదు. బిగ్ బాస్ కి ముందు #90's అనే వెబ్ సిరీస్ చేసాడు శివాజీ. ఇందులో వాసుకీ, మౌళి, ఆదిత్య ప్రధాన పాత్రలలో నటించి మెప్పించారు. అయితే ఈ సీరీస్ లో ఇంట్లో అందరి కన్నా చిన్నవాడి పాత్రలో ఆదిత్య ఆకట్టున్నాడు. అందరి ఇంట్లో చిన్నవాళ్ళు చూపించే గడుసుతనం, అల్లరి, చిలిపిపనులు, యాక్టింగ్ అన్నీ కూడా బాగా చేశాడు. ఈ సీరీస్ తో ఈ బుడ్డోడికి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక  శివాజీ నిన్నటి సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఈ సీరీస్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం డైరెక్టర్ ఆదిత్య అని చెప్పాడు. మౌళి, వాసుకి, ఆదిత్య ఇలా ప్రతీ ఒక్కరు తమ పాత్రలకి న్యాయం చేశారు. ప్రతీ సీన్ చాలా సహజంగా ఉండేలా కెమెరామెన్, టెక్నికల్ విభాగం వారు జాగ్రత్తపడ్డారంటూ.. ఈ సిరీస్ సక్సెస్ ని యూనిట్ మొత్తానికి ఇచ్చేశాడు శివాజీ. ఈ సిరీస్ సక్సెస్ మీట్ ని శివాజీ తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోకి అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది.

ట్రెండింగ్ లో అంటే శంకర్ కూడా.. అరియానాకి ప్లస్ అవ్వనుందా!

ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలకి క్రేజ్ ఎంతుందో.. వెబ్ సిరీస్ లకి కూడా అంతే క్రేజ్ ఉంది. స్టార్ హీరో హీరోయిన్ లు సైతం ప్రస్తుతం కొత్త వెబ్ సిరీస్ లతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు.  ఈ మధ్య కాలంలో రీలీజైన 90' వెబ్ సిరీస్ ఎంతోమందికి కనెక్ట్ అయింది. ఇందులోని ప్రతీపాత్ర అందరికి నచ్చేయడంతో ఓటీటీ వేదికపై ఈ వెబ్ సిరీస్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు అదేకోవలోకి అరియానా చేసిన ఓ వెబ్ సిరీస్ చేరుకుంది. అరియానా ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న బ్యూటీ. ఈ బ్యూటీ కూడా ఓ వెబ్ సిరీస్ చేసింది. దాంతో రెగ్యులర్ గా షూట్స్ తో బిజీగా ఉంటుంది. అయితే తాజాగా యూట్యూబ్ లో "అంటే శంకర్ కూడా "అనే వెబ్ సిరీస్ విడుదలైంది. దీనికి అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది.  యూట్యూబ్ లో కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లని జనాలు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. " అంటే శంకర్ కూడా " వెబ్ సిరీస్ లోని కథ యూత్ ని అట్రాక్ట్ చేయడంతో ప్రస్తుతం ట్రెండింగ్ లో నడుస్తోంది. దాంతో ఈ అరియానాకి మరింత హైప్ వచ్చేసింది. తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసింది. ఈ సీజన్ లో అమర్ దీప్ కి సపోర్ట్ చేసిన ఈ భామ.. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అరియానాపై చేసిన ట్రోల్స్, కామెంట్లతో ఆ మధ్య ఏడ్చేసింది. ఎప్పుడు పొట్టి డ్రెస్సులు, బికీనీలతో  అందాల ఆరబోత చేసే ఈ భామ.. ఇప్పుడు మరో కంటెంట్ తో ప్రేక్షకులకి దగ్గరైంది. అరియానా తన ఫోటోలను రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఒక్కోసారి తనపై ఎన్ని కామెంట్లు వచ్చిన వాటిని లెక్కచేయకుండా.. తనకు నచ్చింది ఓపెన్‌గా మాట్లాడటంలో ఆమె ఎప్పుడు ముందుంటుంది. మొదట ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు పొందిన అరియానా.. బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్‌ అయ్యింది. చలాకీతనం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను అరియానా  సొంతం చేసుకుంది. అమర్ దీప్ తో కలిసి చేసిన ఇంటర్వ్యూ కూడా ఈ మధ్య ట్రెండింగ్ లో ఉంది. అంటే శంకరానికి హిట్ టాక్ పొందుతోంది. మరి ఇది అరియానాకి మరిన్ని అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. "అంటే శంకర్ కూడా" వెబ్ సిరీస్ అరియానా కెరీర్ కి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి మరి.  

కొత్త బంధాలతో రతికరోజ్.. ఆ ఇద్దరు ఎవరంటే!

రతికరోజ్.. బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అటు పల్లవి ప్రశాంత్ తో ఇటు ప్రిన్స్ యావర్ తో లవ్ ట్రాక్ నడిపి బిగ్ బాస్ అభిమానులకి 'బేబీ' సినిమా చూపించేసింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి రెండువారాల్లో రతిక ఆట చూసి ఈసారి టాప్-5 లో గ్యారెంటీగా ఉంటుందనుకున్నారు. హౌస్ లో సీక్రెట్ రూమ్ కి రతికని పిలిచి ఉడతా ఉడతా ఊచ్ పాట ప్లే చేసి ఎన్నిసార్లు ఉడతా అని వచ్చిందో బిగ్ బాస్ చెప్పమన్నప్పుడు .. సరిగ్గా లెక్కవేసి  చెప్పినందుకు నాగార్జునతో పాటు ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇంత ఇంటలిజెన్స్ గేమ్ ప్లేయర్ బిగ్ బాస్ సెవెన్ లో ఉందా అని అనుకున్నారంతా.. కానీ ఆ తర్వాత ప్రశాంత్ కలిపిన పులిహోర సరిగ్గా రాకపోయేసరికి అభిమానులు తెగ ద్వేషించారు. ఇక ప్రశాంత్ తో గొడవ జరిగిన నాటి నుండి యావర్ ని అమర్ అని అనడం.. ఒకే ప్లేట్ లో కలిసి తినడం చూసి అంతా మరో బకరా రెడీ అని ట్రోల్స్ చేశారు. అయితే తన నేచర్ ని చూసి ఇంత కన్నింగ్, ఫ్లిప్పింగ్ ఎవరు లేరని అర్థమైపోయింది. సోషల్ మీడియాలోని నెటిజన్లు ఒకకానొక దశలో తను రతిక పాప కాదు డీజే టిల్లు సినిమాలోని రాధిక పాప అని కూడా అన్నారు. అలా తనకి నెగెటివ్ టాక్ వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో రెండు సార్లు ఎలిమినేషన్ అయి .. రెండు సార్లు లోపలికి వెళ్ళిన ఒకే ఒక కంటెస్టెంట్ రతికరోజ్. తను మొదట ఎలిమినేషన్ అయినప్పుడు సీరియల్ బ్యాచ్ తో క్లోజ్ గా ఉంది. సెకెండ్ టైమ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు శివాజీ కాళ్ళు మొక్కి మరీ.. ఇక నుండి బాగుంటానని చెప్పింది. ఆ తర్వాత ప్రశాంత్ ని అక్కని పిలవకని చెప్పడం అదంతా కంటెంట్ కోసమే చేస్తుందని అందరు గ్రహించడంతో తన గేమ్ హౌస్ లోని కంటెస్టెంట్స్ కూడా అర్థమైంది. ఇక సీజన్ ముగిసాక బయట ట్రావెల్ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉంటుంది రతిక. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో టేస్టీ తేజ, అమర్ దీప్ లతో కలిసి దిగిన కొన్ని ఫోటోలని షేర్ చేసింది. " మంచి పనులని లైఫ్ లోకి రానివ్వాలి.‌ ఇది కొత్త ఆరంభం " అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. కాగా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ ఫోటోలని చూసిన అమర్ దీప్ ఫ్యాన్స్, ప్రశాంత్ ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తూ ట్రోలింగ్ మొదలెట్టారు.

దీపిక పిల్లిపై విరుచుకుపడుతున్న ఫ్యాన్స్!

ఇప్పుడంతా ఇన్ స్టాగ్రామ్ హవా నడుస్తుంది‌. కొందరు సెలబ్రిటీలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే.. మీరు ఉన్నారా? పోయారా అని అడుగేస్తున్నారు. ఇంకాస్త పెద్ద సెలబ్రిటీలు అయితే తమ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతుంటారు. సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టవ్ గా ఉంటే తమ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉన్నట్లు ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు దీపిక పిల్లికి అదే పరిస్థితి ఎదురైంది. దీపిక పిల్లి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ. ఇప్పుడు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కన్పించడం లేదు. అయితే తను ఎందుకు కన్పించడం లేదో ఎవరికీ తెలియదు. అయితే తాజాగా తన ఫ్యాన్స్ తో ముచ్చటించింది దీపిక. ఒక అభిమాని అయితే రెచ్చిపోయి ఆపుకోలేక అడిగేశాడు. " ఎక్కడికి పోయావ్ పాప? పత్తా, జాడా లేకుండా పోయావ్.. నీకు ఫ్యాన్స్ ఉన్నారని మర్చిపోయావా? వాళ్లకి ఫీలింగ్స్ ఉంటాయని మర్చిపోయావా" అని అడుగగా.. దానికి దీపిక ఫన్నీగా రిప్లై ఇచ్చింది. "ఢీ" షోలో యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది దీపిక. ‌అంతకముందు టిక్ టాక్ వీడియోలలో ఆకట్టుకున్న దీపిక. సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్ పెంచుకుంది. 'వాంటెడ్ పండుగాడు' సినిమాతో వెండితెరపై కనువిందు చేసింది ఈ బ్యూటీ. ఆ మధ్య ఆహాలో ' కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్' పేరుతో మొదలైన స్టాండప్ కామెడీకి తను యాంకర్ గా చేసింది. గ్లామర్ రోల్ కి ఏమాత్రం తీసిపోనంటూ దీపిక రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్స్ చేస్తూనే ఉంటుంది. అయితే ఈ మధ్య ఎక్కువగా ఇన్ స్టాగ్రామ్ లో తను కన్పించకపోయేసరికి ఓ అభిమాని ఎమోషనల్ గా మెసెజ్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది.  

నయని పావనికి న్యాయం జరిగింది!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికి తెలిసిందే.‌ ఈ సీజన్ హిట్ అవ్వడానికి హోస్ట్ నాగార్జున ఓ కారణం అయితే ఇందులోని కంటెస్టెంట్స్ మరో కారణం. హౌస్ లోకి వచ్చిన వారిలో కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి ఫ్యాన్ బేస్ బాగుంది. ఇక శివాజీ, కార్తీక దీపం మోనిత అలియాస్ శోభాశెట్టి, జానకి కలగనలేదు‌ సీరియల్ ఫేమ్ అమర్ దీప్, ప్రియాంక జైన్ , ఇలా చెప్పుకుంటూ పోతే అందరు ఫేమస్ అవ్వడంతో ఈ సీజన్ హిట్ అయింది.  భోలే షావలి, అంబటి అర్జున్, అశ్వినిశ్రీ, పూజామూర్తి, నయని పావని వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు. వీరిలో సోషల్ మీడియాలో హాట్ ఫోటోస్ తో ట్రెండింగ్ లో ఉండేవారిలో అశ్వినిశ్రీ, నయని పావని ఇద్దరు ముందువరుసలో ఉన్నారు. బాస్ 2.0 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ హైదరాబాద్  అమ్మాయి నయని పావని. ఈ అమ్మడు పెద్దగా పరిచయం లేని పేరే. కొన్ని వెబ్ సిరీస్ లలో నటించినా అంత ఫాలోయింగ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది. ఢీ-14 షో కి వచ్చిన నయని.. కమెడియన్ హైపర్ ఆదితో కలిసి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది.  టిక్ టాక్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది నయని. తను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే... నయనీకీ డాన్స్, షాపింగ్ అంటే ఇష్టమంట. నయని కలహం, మధురం అనే వెబ్ సిరీస్ లలో నటించింది. అదేవిధంగా  సూర్యకాంతం మూవీలో హీరోయిన్ కి స్నేహితురాలిగా నటించింది నయని. సోషల్ మీడియా లో రెగ్యులర్ గా ఫోటలతో, రీల్స్ తో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది. ఇప్పటికే తనకి ఇన్ స్ట్రాగ్రామ్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉండగా, బిగ్ బాస్ ఎంట్రీ ద్వారా మరింత ఫేమ్ సంపాదించుకోవాలని వెళ్ళింది. 2.0 లో ఎంట్రీ ఇచ్చిన నయని.. లోపల ఉన్నవాళ్ళ ఆటతీరుకి, బయట ప్రేక్షకుల స్పందననలని అన్నింటిని అనాలసిస్ చేసి వెళ్లింది. భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చిన ఈ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ నయని.. హౌజ్ లోకి వెళ్ళి వారం రోజుల్లో‌ బయటకి వచ్చేసింది కానీ ఎంతో ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. శివాజీని నాన్న అని పిలవడం..‌ నయని ఎలిమినేషన్ అప్పుడు శివాజీ ఎమోషనల్ అవ్వడం ఇవన్నీ అప్పట్లో హైలైట్ గా నిలిచాయి. ఇక సీజన్ ముగిసాక స్పై బ్యాచ్ తో నయని పావని రాపో‌ చూస్తే ది బెస్ట్ కంటెస్టెంట్స్ ఇన్ ‌సీజన్ సెవెన్ అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీకీ నయని పావని సెలెక్ట్ అయిందనే వార్త జోరందుకుంది. ఇక  ఇప్పటికే భోలే షావలి కన్ఫమ్ అవ్వగా,‌ తాజాగా నయని పావని సెలెక్ట్ అయినట్టు తెలుస్తోంది. ‌తన ఎలిమినేషన్ తో అన్యాయం జరిగిందని భావించిన నెటిజన్లు ఇప్పుడు తను సెలెక్ట్ అవ్వడంతో న్యాయం జరిగిందని అంటున్నారు. ఇక బిగ్ బాస్ ఓటీటీలో స్పై బ్యాచ్ నుండి ఇద్దరు‌ రావడంతో ఈ సీజన్ పై మరింత‌ ఆసక్తి పెరిగింది.  

దేవరలో గుప్పెడంత మనసు బ్యూటీ!

జ్యోతి రాయ్.. ఈ పేరు విని ఉండకపోవచ్చు గానీ జగతి మేడం అంటే తెలియని వారు ఉండరు. స్టార్ మాటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే "గుప్పెడంత మనసు" ప్రేక్షకులకు జగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో అందరిని మెప్పిస్తూ, ఒక తల్లిగా కొడుకుపై చూపించే ప్రేమని వ్యక్తపరచడంలో జగతి పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. జ్యోతి రాయ్ కన్నడ నటి.. కన్నడలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జీ తెలుగులో ప్రసారమైన 'కన్యాదానం' సీరియల్ లో నిరుపమ్ పరిటాలతో కలిసి మొదటిసారి జ్యోతిరాయ్ నటించింది. ఆ తర్వాత  'గుప్పెడంత మనసు' సీరియల్ లో ప్రస్తుతం నటిస్తుంది. గత కొంతకాలం నుండి గుప్పెడంత మనసు సీరియల్ టాప్ రేటింగ్ లో ఉంటు వస్తుంది. జ్యోతిరాయ్ అలియాస్ జగతి.. అలనాటి నటుడు సాయి కిరణ్ కి భార్యగా గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తన అందంతో పాటు హావభావాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది జగతి. జ్యోతి రాయ్ ఒకవైపు ఈ సీరియల్ మరొక పక్క ఒక వెబ్ సిరీస్ తో బిజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ పాన్ ఇండియా మూవీ 'దేవర'లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'దేవర'. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో జ్యోతి రాయ్ నటిస్తున్నట్లు సమాచారం. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది.  

సింగర్ దామిణి ప్రేమలేఖ బయటకొచ్చేసింది!

  బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మోస్ట్  వాల్యుబుల్ కంటెస్టెంట్స్ కొంతమంది ఉన్నారు. కొందరు తమ మాటతీరుతో ఫేమస్ అయితే మరికొందరు తమ ఆటతీరుతో ఫేమస్ అయ్యారు. అందులో దామిణి బట్ల ఒకరు. సింగర్ గా హౌస్ లోకి అడుగుపెట్టి తన ప్రవర్తనతో కంటెస్టెంట్స్ చేత బ్యాడ్ అనిపించుకుంది. సీజన్ సెవెన్ లో మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండవ వారం షకీల ఎలిమినేట్ కాగా మూడవ వారం సింగర్ దామిణి ఎలిమినేట్ అయింది.సీజన్-7 మొదలైందే ఉల్టా పల్టా థీమ్ తో.. అంటే సాధారణంగా ప్రతీ సీజన్ లో లాగా ఓటింగ్ లో చివరన ఉండేవాళ్ళని కాకుండా ఈ సారి ఉల్టా పల్టా చేసి.. టాప్ లో ఉండేవారిని ఎలిమినేట్ చేస్తారేమో అని అనుకున్నారంతా, కానీ ఆ వారం లీస్ట్ లో ఉన్న దామిణిని ఎలిమినేషన్ చేశారు. అతిగా ఆవేశపడేవాళ్లు, అనవసరంగా వాదిస్తూ సాగదీసేవాళ్లు, తమ డప్పు తామే కొట్టుకునేవాళ్లు, కేవలం డైలాగులకే పరిమితమయ్యేవాళ్లు, వెనకాల గోతులు తవ్వేవాళ్లు, కిచెన్‌కే పరిమితమై ఆడటమే మర్చిపోయేవాళ్లు.. ఇలా ప్రతిసీజన్‌లోనూ ఇలాంటి వాళ్లు కనిపిస్తూనే ఉంటారు. ఈ సీజన్‌లో అలాంటివారున్నారు. అయితే మిగతావాళ్ల సంగతి ఎలా ఉన్నా కిచెన్‌కే పరిమితమైనవాళ్లు మాత్రం హౌస్‌లో ఎక్కువ వారాలు ఉన్న దాఖలాలు లేవు. అందుకేనేమో దామిణి త్వరగా బయటకొచ్చేసింది. బూతులు మాట్లాడితే నచ్చదని చిరాకుపడ్డ దామిని తాను మాత్రం ఇంగ్లీష్‌లో తెగ బూతులు మాట్లాడింది. ఇక్కడ ఆమెపై విమర్శలు వచ్చాయి. పాటలతో మెప్పించిన సింగర్‌ ఆటలో, మాటలో మెప్పించలేకపోయింది. ఓ టాస్క్‌లో అయితే ప్రిన్స్‌ను వీర లెవల్లో టార్చర్‌ పెట్టింది. పేడ ముఖాన కొట్టడమే కాకుండా, తన నోటిలో కూడా వేసింది. ఇది టాస్కే అయినప్పటికీ గ్యాప్‌ ఇవ్వకుండా నోటిలో పేడ కొట్టడం అస్సలు కరెక్ట్‌ కాదన్న కామెంట్లు వినిపించాయి. అలా వింత ప్రవర్తన నెటిజన్లకి తీవ్రంగా ఇబ్బంది కల్గించాయి. అందుకే ఆడియన్స్ తనని తొందరగా బయటకు తీసుకొచ్చేశారు. హౌస్ నుండి బయటకొచ్చాక సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ అప్పుడప్పుడు కలుస్తున్నా దామిణి మాత్రం తన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో బిజీగా ఉంటుంది. తాజాగా తన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ఒకటి స్పాటిఫై ఆప్ లో అందుబాటులో ఉందంటూ చెప్పుకొచ్చింది దామిణి. ఇన్ స్టాగ్రామ్ లో తన సాంగ్ ఆల్బమ్ " ప్రేమలేఖ" లింక్ ని షేర్ చేసిన దామిణి.. ఇలా ఆడియోతో పాటు వీడియోకి కూడా మీ సపోర్ట్ కావాలని ఆడియన్స్ కోరింది. కాగా ఇప్పుడు ఈ పాట ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Brahmamudi:అర్థరాత్రి ఆమె గదిలోకి దూరింది ఎవరు.. ఆపదలో ఉన్న శ్వేతని రాజ్ కాపాడగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -310 లో.. కావ్య అర్థరాత్రి వరకు ఇంట్లో పని చేస్తుంటుంది. అప్పుడే స్వప్న వచ్చి.. నువ్వు ఈ ఇంటికి కోడలివా? పనిమనిషివా ఎందుకు ఇలా చాకిరి చేస్తున్నావ్? ఈ ఇంటి కోడలు అన్న విషయం అందరు మర్చిపోయి.. నిన్ను ఒక పని మనిషిని చేశారు. దానికి తోడు అందరూ నిన్ను తిట్టేవాల్లే.. అలాంటప్పుడు ఎందుకు ఇన్ని పనులు చెయ్యడమని కావ్యని స్వప్న అంటుంది. మన కుటుంబం కోసం నేను చేస్తున్నాను ఇందులో తప్పేముందని కావ్య అంటుంది. నువ్వు ఎదరుతిరుగు.. అన్ని మాటలు పడుతుంటావ్. నీ మంచి గురించి చేప్తున్నానంటు కావ్యకి స్వప్న సపోర్ట్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత కనకం ఇంటికి శుభలేక పట్టుకొని ఒక ఆవిడ వస్తుంది. అబ్బాయేం చేస్తాడని కనకం అడిగినందుకు. మీ అల్లుల్లలాగా కోటీశ్వరులు కాదు చిన్న జాబ్. అయిన నీ అంత తెలివి తేటలు లెవ్వు. నువ్వు నీకున్న తెలివితో వాళ్లపై ఉసిగొలిపి అల్లుళ్లని చేసుకున్నావ్. అంతే కాకుండా అప్పుని కూడా ఆ ఇంట్లో కోడలిని చేద్దామని అనుకున్నావ్ అంట కదా.. అందరిముందు ఆ విషయం తెలిసి గొడవ అయిందట కదా అని ఆవిడా అనగానే.. కనకం, కృష్ణమూర్తి ఇద్దరు బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతారు. అక్కడే ఉన్న అన్నపూర్ణ ఆవిడని తిట్టి పంపిస్తుంది. అదే సమయంలో ఆవిడ అన్న మాటలన్నీ అప్పు విని బాధపడుతుంది. మరొకవైపు కావ్య గదిలోకి వచ్చేసరికి రాజ్ పడుకుంటాడు. ఇంత త్వరగా పడుకున్నాడు ఏంటని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత భోజనం తీసుకొని అన్నపూర్ణ అప్పు దగ్గరికి వెళ్తుంది. ఇందాక వచ్చిన ఆవిడా ఎందుకు అలా మాట్లాడుతుందంటు అప్పు బాధపడుతుంది. రాజ్ ఫోన్ అలారం అవుతుంది. దాంతో రాజ్, కావ్య ఇద్దరు నిద్ర లేస్తారు. రాజ్ ఆఫీస్ కీ రెడీ అవుతాడు. ఎందుకు ఇంత రాత్రి అని కావ్య అడుగుతుంది. డిజైన్స్ రేపే వాళ్లకి ఇవ్వాలి. ఇప్పుడు నేను వెళ్లి ఫైనల్ చెయ్యాలి టీం అందరు ఆఫీస్ కీ వస్తున్నారని రాజ్ రెడీ అయి వెళ్తాడు. ఆ తర్వాత శ్వేతా పడుకొని ఉండగా వాళ్ళ ఇంట్లోకి ఒక వ్యక్తి వెళ్తాడు. ఏదో సౌండ్ వచ్చిందని శ్వేత రూమ్ లో నుండి బయటకు వస్తుంది. శ్వేతకి అతను కన్పించడు. ఎవరు లేరని శ్వేత లోపలికి వెళ్తుంది. అప్పుడే శ్వేతకి రాజ్ ఫోన్ చేసి మాట్లాడుతాడు. నాకు భయంగా ఉంది.‌ ఇంట్లో ఎవరో ఉన్నారనిపిస్తుందని రాజ్ తో శ్వేత అనగానే.. మరి నేను రావాలా అని రాజ్ అంటాడు. వద్దని శ్వేత అంటుంది. ఆ తర్వాత ఫోన్ కట్ చేసాక మళ్ళీ ఎవరో ఉన్నట్లు అనిపించి.. శ్వేత భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.  

నా హీరోకి ఏ దేవుడు సూపర్ పవర్స్ ఇవ్వలేదు.. కష్టపడి తెచ్చుకున్నాడు

  బుల్లితెర మీద పలు ఈవెంట్స్ లో సందడి చేసే అష్షు రెడ్డి, గుప్పెడంత మనసు సీరియల్ తో హిట్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న జగతి మేడం అలియాస్ జ్యోతి రాయ్ సుకు పూర్వజ్ డైరెక్ట్ చేసిన  “ఏ మాస్టర్ పీస్” మూవీలో కనిపించబోతున్నారు. "శుక్ర, మాటరాని మౌనమిది" వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత  సుకు అరవింద్ కృష్ణ , అషు రెడ్డి లీడ్ రోల్స్ తో ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. అలాంటి సుకు పూర్వజ్ ఇప్పుడు తన మూవీ గురించి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఇలా పోస్ట్ చేసుకున్నాడు.   "ఏ మాస్టర్ పీస్ మూవీలో నా హీరోకి ఏ దేవుడు కూడా సూపర్ పవర్స్ ఇవ్వనే ఇవ్వడు..హీరోకి ఉన్న పవర్స్ అన్ని కూడా కష్టపడి సంపాదించుకున్నవే..ఆ పవర్స్ ని ఎలా సంపాదించుకున్నాడనే సబ్జెక్టు ఈ స్టోరీ. కొంచెం టైం వెయిట్ చేయండి. ఈ ఇయర్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాం" అంటూ పెట్టిన పోస్ట్ ని జ్యోతి రాయ్, అషూ రెడ్డి కూడా వాళ్ళ వాళ్ళ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు. అలాగే జ్యోతి రాయ్ కూడా మరో ఇన్స్టా స్టేటస్ పెట్టింది. "ఫేజ్ 1 శివమ్ : ఇన్ హౌస్ సీక్రెట్స్ అండ్ ది రైజ్ ఆఫ్ ఏ.. టీజర్ త్వరలో రాబోతోంది...ఈ మూవీ పనులన్నీ పూర్తయ్యాయి.. పాన్ ఇండియా లెవెల్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది" అని చెప్పింది. ఇక గుప్పెడంత మనసు సీరియల్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న జ్యోతి రాయ్ "దేవర" మూవీలో స్తానం సంపాదించింది.