బిగ్ బాస్ 7 కి వెళ్లి తప్పు చేసానని భోరున ఏడుస్తున్న ప్రియాంక

  బిగ్ బాస్ సీజన్  7 (bigg boss season 7) లో ఎవరు విన్ అయ్యారు ఎవరు హౌస్ నుంచి వెళ్లిపోయారు అనే కంటే ఎంత మంది కంటెస్ట్ లు   ప్రేక్షకుల మనసుని గెల్చుకున్నారు అనడం కరెక్ట్. ఎందుకంటే షో జరిగిన అన్ని రోజులు కూడా  షో లో పాల్గొన్న వాళ్లలో చాలా మందికి అభిమానులు ఏర్పడతారు. అలా అందరికంటే కొంచం ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్న కంటెస్ట్ ప్రియాంక జైన్ (priyanka jain) తాజాగా ఆమె బిగ్ బాస్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.  ప్రియాంక తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో ఏడుస్తూ ఒక వీడియో అప్ లోడ్ చేసింది. నేను బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి తప్పు చేసానని నేను హౌస్ లో ఉన్న టైం లో మా అమ్మ క్యాన్సర్ బారిన పడిందని చెప్పుకొచ్చింది. పైగా ఆ విషయం గురించి పూర్తి వివరణ కూడా ఇచ్చింది. మా అమ్మకి  పీరియడ్స్ టైం లో  బ్లీడింగ్ బాగా ఎక్కువ అయ్యింది హాస్పిటల్ కి వెళ్లాల్సి ఉన్నా కూడా అమ్మ వెళ్ళలేదు. వయసు పెరుగుతుండటం వలన వచ్చిన ప్రోబ్లేమేమో అని లైట్ తీసుకుంది. ఒక వేళ హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సి వస్తే టీవీ లో నన్ను మిస్ అవుతానని అమ్మ  వెళ్ళలేదు అని ఏడుస్తూ చెప్పుకొచ్చింది.   ఆ తర్వాత నేను  హౌస్ నుంచి బయటకి  రాగానే అమ్మ ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళాను. అప్పుడే అమ్మకి  క్యాన్సర్ మొదటి దశలో ఉందని అర్ధం అయ్యింది.అందుకే అమ్మకి పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అయ్యేదని    చెప్పింది. దాని తర్వాత  అమ్మకి  సర్జరీ  చేయించానని  సర్జరీ సక్సెస్ అయ్యిందనే విషయాన్ని కూడా ఆమె వెల్లడి చేసింది. ఈ విధంగా తనకి  బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక ప్రాబ్లమ్స్ పెరియాగాని కూడా ఆమె  చెప్పింది. ప్రియాంక కి సినిమాల ద్వారా రాని గుర్తింపు బిగ్ బాస్ ద్వారా వచ్చింది.  

నాలోనూ అమ్మ ఉంది...తేజస్విని మాదివాడ నాచురల్ పిక్

బిగ్ బాస్ బ్యూటీ విత్ బ్రెయిన్ తేజస్విని మాదివాడ గురించి అందరికీ తెలుసు.  " లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" మూవీలో గెస్ట్ రోల్‌తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ పాప తర్వాత "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయిన ఈ అమ్మడు.. మంచి రోల్స్ పోషించి ప్రేక్షకులకు దగ్గరైంది. ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ మూవీలో అందాలు ఆరబోసి నవదీప్ పక్కన బాగా  హైలైట్ అయ్యింది ఈ క్యూటీ బ్యూటీ. ఇక తేజస్విని సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది... తన ఇన్స్టాగ్రామ్ లో ఎన్నో రకాల ఫోటోషూట్ వీడియోస్, జిమ్ వర్కౌట్ వీడియోస్ వంటివి పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టింది. "నా మంచిలోనూ, నా చెడులోనూ నన్ను మీ కన్న తల్లిలా చూసుకుని, నాకు భోజనం ఇచ్చి, నన్ను అపురూపంగా చూసుకున్న అమ్మలందరికోసం ఈ పోస్ట్...మీ కోసం ఎప్పుడూ నేను కృతజ్ఞతతో ఉంటాను. నా మనసారా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. అమ్మలాంటి నాన్నల కోసం కూడా" అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక క్యూట్ కామెంట్ ని పోస్ట్ చేసింది. అలాగే మరో స్టేటస్ లో చక్కగా పొందిగ్గా చీర కట్టుకుని పూలు పెట్టుకుని పక్కన ఒక పాత టేప్ రికార్డర్ ని పెట్టుకుని ఆ పాత మధురంలా అనిపించేలా "మమ్మి ఇన్ మీ" అంటూ తనలోనూ అమ్మతనం ఉందనే విధంగా ఒక నాచురల్ పిక్ ని పోస్ట్ చేసింది. తేజస్విని ఎంత బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక షాప్ ఓపెనింగ్ ని వెళ్ళింది. ఇక టైం దొరికితే తన ఇంట్లోని క్యూట్ పుప్పి తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

Aata Sandeep:వన్ మిలియన్ వ్యూస్ దాటిన ఆట సందీప్, జ్యోతిరాజ్ డ్యాన్స్!

మూడు రోజుల క్రితం అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. దానికి యావత్ భారతదేశం నుండి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీ ఇలా అన్ని రంగాల నుండి జనాలు వెళ్ళారు. అయితే కొంతమంది అయోధ్యవరకు వెళ్లకుండా ఇక్కడ ఉన్న గుడికి వెళ్ళి పూజలు చేశారు. అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ ఆట సందీప్ మాత్రం త‌న డ్యాన్స్ తో రాముడిపై ఉన్న భక్తిని చాటుకున్నాడు. ఆట సందీప్ తన కెరీర్ లో ఎన్నో పాటలకి కొరియోగ్రఫీ చేశాడు. ఆట షో టైటిల్ గెలవడంతో ఆట సందీప్ అతని భార్య జ్యోతిరాజ్ ఇద్దరు ఫేమస్ అయ్యారు. ఇక కొన్నిరోజులు వీరిద్దరి కొరియోగ్రఫీ లైఫ్ కి బ్రేక్ పడింది. ఆట సందీప్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీ తో తన సెకెండ్ లైఫ్ ని స్టార్ట్ చేశాడు. ఇందులో ఎక్కువగా స్పై బ్యాచ్ లోని అమర్, శోభాశెట్టి, ప్రియాంక, తేజలతో ఎక్కువగా ఉండేవాడు.  ఆట సందీప్. ఆట సందీప్, అమర్ దీప్ తో కలిసి ఎన్నో గేమ్స్, టాస్క్ లలో ఫౌల్ చేశాడు. ఇక మొట్ట‌మొదటి హౌస్ మేట్ గా గెలిచి ఆరువారాల ఇమ్యూమిటీ పొంది నామినేషన్ లో లేడు. ఆ తర్వాత కెప్టెన్ గా గెలిచి మరో వారం నామినేషన్ లో మిస్ అయ్యాడు.‌ ఇక తొమ్మిదవ వారం టేస్టీ తేజ నామినేషన్ చేయడంతోనే ఎలిమినేషన్ అయి బయటకొచ్చాడు ఆట సందీప్.‌ తొమ్మిది వారాలు ఓ కంటెస్టెంట్ నామినేషన్ లో ఉండకుండా హౌస్ లో ఉండటం ప్రథమం అయితే బయటకు రావడం ఇదే తొలిసారి జరిగింది. ‌ఇక హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రియాంక జైన్, శోభాశెట్టి, అమర్ దీప్ లతో ఎక్కువ స్నేహంగా ఉన్న ఆటసందీప్.. ఆ తర్వాత ఎలిమినేషన్ అయి బయటకొచ్చాక‌ ఎవరు జెన్యున్ ప్లేయర్? ఎవరు గ్రూప్ గా ఆడుతున్నారో‌ తెలుసుకొని పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేశాడు. ఇక భోలే షావలి ఎలిమినేషన్ తర్వాత ఆటసందీప్, అతని భార్య జ్యోతిరాజ్ వాళ్ళింటికి వెళ్ళి మరీ కలిసారు. ఇక శుభశ్రీ, టేస్టీ తేజ కలిసి రీల్స్ తో‌ బిజీగా ఉంటున్నారు.  ఇక తాజాగా ఆట సందీప్ తన మూవీ 'షాట్ కట్ ' టీజర్ లాంఛ్ చేశాడు. ఈ లాంఛ్ ఈవెంట్ కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిని పిలవగా  శివాజీ, తేజ, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, అశ్వినిశ్రీ, భోలే షావలి అటెంట్ అయ్యారు. ఇక తాజాగా అయోధ్యలో జరిగిన బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ రోజున ఆటసందీప్ అతని భార్య జ్యోతిరాజ్ కలిసి రాముడి పాటకి డ్యాన్స్ చేశారు. అది ఇన్ స్ట్రాగ్రామ్ లోని తన పేజీలో పోస్ట్ చేశారు. కాగా ఈ డ్యాన్స్ మూడు రోజుల్లోనే వన్  మిలియన్ వ్యూస్ ని దాటింది. ఈ విషయాన్ని ఆట సందీప్ ప్రత్యేకించి మెన్షన్ చేశాడు.‌ దాంతో ఈ పాటకి ఆట సందీప్ డ్యాన్స్ బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు చేయగా.. ఫుల్ క్రేజ్ వచ్చేసింది.  

మాల్దీవ్స్ రిసార్ట్ లో బూతుల స్కిట్..

ఢీ సెలబ్రిటీ స్పెషల్ లో ఈ వారం అంతా బూతులే బూతులు వినిపించాయి. డాన్స్ షోలో టాస్కులు చేసి చాలా రోజులయ్యిందంటూ హైపర్ ఆది ఒక బూతు టాస్క్ ఐతే చేసి మంచి హాట్ డైలాగ్స్ తో రక్తి కట్టించి కాస్త ఫన్ క్రియేట్ చేసాడు. పిల్లలతో కలిసి ఈ స్కిట్ చూసిన వాళ్ళు మాత్రం కచ్చితంగా చెవులు, కళ్ళు మూసుకోవాల్సిందే అన్నట్టుగా ఉంది. ఆదికి ఒక వైఫ్ గా నటించిన  శ్రీప్రియ వచ్చి గోవా వెకేషన్ కి తీసుకెళ్లొచ్చుగా అని అడిగేసరికి నువ్వే కాదు వేరొకరి డెసిషన్ తీసుకోవాలంటూ మరో వైఫ్  మహేశ్వరిని పిలిచాడు ఆది. "ఏమే గోవాకి వెకేషన్ కి వెల్దామా అనేసరికి వద్దండి మాల్దీవ్స్ కి వెళదాం" అని గారంగా చెప్పింది. "ఓహ్ నువ్ ఆల్రెడీ గోవా వెళ్ళావా ఐతే మాల్దీవ్స్ వెళ్ళాక సాధారణంగా కోళ్లు గుడ్లు పెడతాయి..కానీ ఈసారి మంచంకోళ్లు గుడ్లు పెట్టబోతున్నాయి.. మన బెడ్డు గొడ్డులా అరుస్తుంది ...దుప్పట్లు చప్పట్లు కొడతాయి..ఈరోజు రూమంతా కామ్ అవుతుంది కానీ మనం కామ్ గా ఉండం కదా" అంటూ హాట్ ప్రాసలతో చెప్పిన డైలాగ్స్ కి శ్రీప్రియ, మహేశ్వరి ఫుల్లుగా నవ్వుకున్నారు. ఇక అదే మాల్దీవ్స్ రిసార్ట్ కి లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో పెళ్లి చేసుకున్న కుమార్ మాష్టర్, జెస్సి వచ్చారు. ఇక ఆది వాళ్ళ మీద కూడా బూతు డైలాగ్స్ వేసేశాడు.."మీరిద్దరూ మాల్దీవ్స్ కి ఎందుకొచ్చారు బుల్లి జెసిని, బుల్లి కుమార్ ని ఇవ్వడానికా...సరే కానీ మా ఆవిడ నిద్రపోవడానికి తలగడ లేదంటా" అని చెప్పి కుమార్ నెత్తి మీద ఉన్న విగ్ ని లాక్కుపోయాడు ఆది. దాంతో కుమార్ మాష్టర్ తల తిప్పేసుకున్నాడు. ఇలా వీళ్లంతా కలిసి ఒక బూతు స్కిట్ వేసి అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు.

Pallavi Gowda:పల్లవి గౌడకి ఓ అభిమాని లేఖ.. ఫిధా అయింది!

సినిమా హీరో, హీరోయిన్ లకి ఏ రేంజ్ లో అభిమానులుంటారో కొన్ని బుల్లితెర సీరియల్స్ లోని హీరో, హీరోయిన్ లకి అదే రేంజ్ లో అభిమానులుంటారు. వేద-యష్ ఆన్ స్క్రీన్ పర్ఫామెన్స్ కి ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. అలాగే బ్రహ్మముడి రాజ్-కావ్య, గుప్పెడంత మనసులోని రిషి-వసుధార, కృష్ణ ముకుంద మురారీలకి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. అయితే వీటితో పాటు త్రినయనికి, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కస్తూరికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు అంతే ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది నిండు నూరేళ్ళ సావాసం హీరోయిన్ పల్లవి గౌడ.  పసుపు కుంకుమ, సావిత్రి మొదలైన సీరియల్స్ లో నటించిన పల్లవి గౌడ అందరికి సుపరిచితమే.. అయితే కొన్ని సంవత్సరాలుగా రెస్ట్ తీసుకున్న పల్లవి గౌడ.. చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీగా చేసిన సీరియల్... 'నిండు నూరేళ్ళ సావాసం'. పల్లవి గౌడ కన్నడ నటి.. తెలుగులో పసుపు కుంకుమ, సావిత్రి సీరియల్స్ చేసిన తర్వాత కన్నడలో గాలిపాట, పరిణయ, శాంతం పాపం వంటి సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత తెలుగులో చదరంగం, సూర్యకాంతం సీరియల్స్ లో నటించింది పల్లవి గౌడ. అయితే సీరియల్స్ తో పాటు పలు కన్నడ సినిమాలలో నటించి‌న పల్లవి గౌడ.. రెండు రాష్ట్రాలు, అమ్మ ఆవకాయ అంజలి లాంటి తెలుగు వెబ్ సిరీస్ లలో నటించింది. అయితే చాలా గ్యాప్ తర్వాత 'నిండు నూరేళ్ళ సావాసం' తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది పల్లవి గౌడ. ఇక తన కొత్త సీరియల్ ఏమండోయ్ శ్రీవారు తాజాగా మొదలైంది. ఈ సీరియల్ ని చూసిన తన తెలుగు అభిమానులు వందాలది మెసెజ్ లు చేసారంట. ఇక  ఆ మెసెజ్ లన్నింటిని స్క్రీన్ షాట్ లు తీసి తన ఇన్ స్ట్రాగ్రామ్ ప్రొఫైల్ లో అప్లోడ్ చేస్తుంది.‌ అందులో ఓ అభిమాని రాసిన లేఖ తనకి చాలా నచ్చిందంటూ చెప్పుకొచ్చింది. పల్లవి పల్లవి నా పాటకు శృతిగానాలు నువ్వు వినిపిస్తావా.. నీ అందంతో పల్లవిని చరణంలాగా నా మనసుకి వినిపిస్తావా.. ఓ ఆగాధజలముల మధ్య నిన్ను చూసిన వేళ నన్ను నేను మరిచిన సివంగివి నువ్వు. నువ్వు నా మనుసు తాకే సివంగి నటన మరవకముందే మహానటి 'సావిత్రి' లాగా వచ్చిన మీ ప్రదర్శన 'చదరంగం' లా ఎత్తుకి పైఎత్తు వేసే 'అంచిక' ని చూపించింది. మునుపెన్నడూ చూడని మరో కొత్త కోణంలో మా ఆశలు ఆరని కార్తీక దీపంలా.. నిండు నూరేళ్ళు మీతో నా సావాసం అంటూ అమ్మ ప్రేమను ఆత్మరూపంలో చూపిస్తూ మా హృదయాల తాకిన ఈ అరుంధతిని చూసి తరింపమ అది కూడా మన జీ తెలుగులో.. అంటు  ఓ అభిమాని రాసిన ఈ లేఖ తన ఇన్ స్టాగ్రామ్ లో‌ పోస్ట్ చేసింది పల్లవి గౌడ. కాగా ఇది తనకి చాలా నచ్చిందంటూ థాంక్స్ చెప్పింది పల్లవి గౌడ.  

పట్టాలెక్కిన సూపర్ జోడి..రాగానే మీనాని ఆకాశానికెత్తేసిన రఘు మాస్టర్

అండ్ ఫైనల్లీ డాన్స్ ని ఇష్టపడే వారందరి కోసం మరో షో "సూపర్ జోడి" పట్టాలెక్కేసింది. ఈ నెల 28 వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో  గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది. ఆ ప్రోమో ఫుల్ కలర్ ఫుల్ గా రిలీజ్ అయింది.  ఒకప్పటి ఫేమస్ డేర్ అండ్ డాషింగ్ యాంకర్ ఉదయభాను ఈ షోని హోస్ట్ చేస్తోంది. ఇక ఈ షోకు ఎవర్ గ్రీన్ సొట్ట బుగ్గల సుందరి, చేప కళ్ళ చిన్నది నటి మీనా జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఆమెతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ మాస్టర్ రఘు, అందాల హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ కూడా జడ్జెస్ గా ఉన్నారు . "సూపర్ జోడి ఎంటర్టైన్మెంట్ తో మేం రెడీ" అని ఉదయభాను షో టాగ్ లైన్ చెప్తూ దేవకన్యలా దర్శనమిచ్చింది. వెంటనే "ఇక్కడికి వచ్చింది మీనా 2 . 0 " అంటూ తన ఇంట్రడక్షన్ ఇచ్చింది మీనా. "మీరు నవ్వితే బుగ్గలకు భలే సొట్టలు పడతాయి" అని ఉదయభాను అనేసరికి కళ్ళజోడు పెట్టుకుని క్యూట్ గా నవ్వుతూ మీనా "డాన్స్ సరిగా చేయకపోతే వాళ్లకు పడతాయి సొట్టలు" అంటూ నవ్వుతూ డైలాగ్ వేసింది. ఆమె డైలాగ్ కి "యు ఆర్ వెరీ నాటీ" అంది శ్రీదేవి. ఇక రఘుమాస్టర్ గ్రాండ్ ఎపిసోడ్ లోనే మీనాకి బిస్కెట్ వేసేసారు.."పక్షుల్లో అందమైనది మీనా..నాకు ఇష్టమైనది మీనా" అనేసరికి మీనా తెగ సిగ్గుమొగ్గలైపోయారు. ఈ షోలో ఎనిమిది జోడీలు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. డ్రామా జూనియర్స్, తెలుగు మీడియం ఐస్కూల్ వంటి షోలను అందించిన  జీ తెలుగు ఈ వారం నుంచి సూపర్ జోడి  షోతో మరింత ఎంటర్టైన్మెంట్ ని అందించడానికి రెడీగా రాబోతోంది.

సంవత్సరం పూర్తి చేసుకున్న బ్రహ్మముడి సీరియల్!

  క్రికెట్ లో‌ సెంచరీ కొడితే బ్యాట్స్‌మెన్ తో పాటు టీమ్ అంతా ఎంత ఆనందిస్తారో.. సినిమాలు వంద రోజులు ఆడితే ఆ సినిమా ప్రొడ్యూసర్, దర్శకులు, నటీనటులు ఎంత హ్యాపీగా ఉంటారో అందరికి తెలిసిందే. అచ్చం అలాగే  ఓ సీరియల్ ఒక సంవత్సరం పూర్తి అయిందంటే ఆ సీరియల్ యూనిట్ కూడా అంతే హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు అదే జరిగింది. స్టార్ మా టీవీలో‌ ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి.. మొదలై సరిగ్గా సంవత్సరం అయింది. ఈ సీరియల్ లో కృష్ణమూర్తి-కనకం ఫ్యామిలీ ఉంటుంది. వీళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ ని గడుపుతారు. ఇక మరోవైపు దుగ్గిరాల కుటుంబం ఉంటుంది‌ వీళ్ళు రిచ్ లైఫ్ ని గడుపుతారు. అయితే కృష్ణమూర్తి-కనకం దంపతులకు ముగ్గురు కూతుళ్లు.. పెద్ద అమ్మాయి స్వప్న, రెండో అమ్మాయి కావ్య.. మూడవ అమ్మాయి అప్పు. కనకం తన పెద్ద కూతురికి పెద్దింటి సంబంధమే చేస్తానని చెప్పి గొప్ప కళలు కనమని చెప్తుంది. అలా తనని ఆశపెట్టిన కనకం ఎలాగైనా దుగ్గిరాల ఇంటికి తన కూతళ్ళని కోడల్లుగా చేయాలని భావిస్తుంది. అలా మొదట రాజ్ తో స్వప్న ఎంగేజ్ మెంట్ అవ్వగా.. రాజ్ వాళ్ళ అత్త కొడుకు రాహుల్ ఆ స్వప్నని లవ్ చేస్తున్నట్టు నటించి రాజ్ తో పెళ్లి జరగకుండా పెళ్ళిపీటల మీద నుండి లేపుకెళ్తాడు. దాంతో కనకం తన రెండో కూతురు కావ్యని రాజ్ తో పెళ్ళికి ఒప్పిస్తుంది. అలా కావ్య రాజ్ ల పెళ్ళి అవుతుంది. ఇక కొన్ని ఎపిసోడ్ ల తర్వాత స్వప్న రాహుల్ ల వివాహం జరుగుతుంది. ఇక కళ్యాణ్-అనామికల ప్రేమాయణం తర్వాత వాళ్ళిద్దరి పెళ్ళి జరుగుతుంది. అయితే కళ్యాణ్ ని అప్పు ప్రేమించిన విషయం కళ్యాణ్-అనామికల పెళ్ళి రోజు చెప్తుంది. దాంతో అప్పుని అసహ్యించుకుంటుంది కళ్యాణ్ వాళ్ళ అమ్మ ధాన్యలక్ష్మి. ఇక అప్పుతో పాటు కనకం, కృష్ణమూర్తిలని కావ్యని కూడా అసహ్యించుకుంటుంది. ఇక కావ్యని సాధిస్తుంటుంది ధాన్యలక్ష్మి. మరోవైపు శ్వేత అనే అమ్మాయిని రాజ్ ఎప్పుడు కలుస్తుంటాడు. అలా శ్వేతతో  రాజ్ ఉన్న ప్రతీసారీ కావ్యకి అడ్డంగా దొరికిపోతాడు. దాంతో కావ్య భాదపడుతుంది. మరోవైపు కొత్త కోడలు అనామికని రుద్రాణి తన ఎత్తుగడతో మారుస్తుంది.  అసలు రాజ్, శ్వేతల మధ్య బంధమేంటి? అనామిక నిజస్వరూపం తెలిసేనా.. ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సీరీయల్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక సీరియల్ మొదలై సరిగ్గా సంవత్సరం కావడంతో బ్రహ్మముడిలోని షర్మిత, మానస్, దీపిక రంగరాజు, నీప, కళ్యాణ్, సుప్రియ ఇలా అందరు కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని డైరెక్టర్ కుమార్ పంతంతో పాటుగా యూనిట్ అంత తమ ఇన్ స్ట్రాగ్రామ్ పేజీలలో షేర్ చేసారు. ప్రస్తుతం టీఆర్పీలో బ్రహ్మముడి నెంబర్ వన్ గా కొనసాగుతుంది.  

Eto Vellipoindhi Manasu:ఎటో వెళ్ళిపోయింది మనసులో కీలక మలుపు.. అసలు మాణిక్యం ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్ -3 లో.. రామలక్ష్మి నాన్న ఫుల్ గా తాగి వైన్స్ దగ్గరే పడిపోయి ఉంటాడు. అతన్ని తీసుకొని రావడానికి రామలక్ష్మి వెళ్తుంది. అక్కడ అందరు తనని అదోరకంగా చూస్తుంటారు. రామలక్ష్మి ఇబ్బంది పడుతునే లోపలికి వెళ్లి.. తన తండ్రిని తీసుకొని ఇంటికి వస్తుంది. మరొకవైపు ఇంట్లో చికెన్ ముక్క వండక నెలరోజులు అవుతుందంటూ రామలక్ష్మి చెల్లెలు పాట పాడుతుంది. అప్పుడే అక్కడికి రామలక్ష్మి తన తండ్రి (మాణిక్యం)ని తీసుకొని వస్తుంది. తన తల్లి తిట్టబోతుంటే వద్దని ఆపి భోజనం పెట్టమని చెప్తుంది. ఆ తర్వాత భోజనం చేసిన మాణిక్యాన్ని తీసుకొని వెళ్లి పడుకోపెడుతుంది రామలక్ష్మి. నీ తండ్రి ఒక తాగుబోతు వాడని అనుకుంటున్నావా? నేను ఒక్కప్పుడు హీరో లాగా ఉన్నాను.. కానీ ఒక ఫ్యామిలీ వల్ల నేను ఇలా మారాల్సి వచ్చిందని చెప్తాడు. తన తండ్రిని అలా చూసేసరికి రామలక్ష్మికి బాధేస్తుంది. సీతాకాంత్ తన తాతయ్య, తన తల్లి ముగ్గురు కలిసి ఒక పెద్ద ఫ్రేమ్ తో ఉన్న మాణిక్యం ఫోటో చూస్తూ వాళ్ళ ఫ్యామిలీకి చేసిన నమ్మక ద్రోహం గురించి మాట్లాడుకుంటారు. ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ఆ మాణిక్యం దొరకలేదు. ఇంకా వాడి వాళ్ళ మన కుటుంబానికి ఎలాంటి ప్రాబ్లమ్ ఉందోనని మాట్లాడుకుంటారు. ఇన్ని సంవత్సరాలైన వాడు చేసిన మోసం మర్చిపోలేకపోతున్నాం.. వాడు చేసిన నమ్మక ద్రోహం అలాంటిదంటూ మాణిక్యం గురించి మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయం మాణిక్యం దగ్గరికి తన భార్య వచ్చి.. రాత్రి మన కూతురికి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారని అడుగుతుంది. అలా చెప్తేనే కదా డబ్బులు ఇస్తుంది. నేను మోసగాడినని నాకు తెలుసంటు విలన్ లాగా మాణిక్యం మాట్లాడతాడు. ఆ తర్వాత రామలక్ష్మి తమ్ముడు ధనకి ఒక అమ్మయి సైట్ కొడుతుంటే మాణిక్యం పిలిచి తిడతాడు. ఆ తర్వాత ధన దగ్గరికి వెళ్లి.. నువ్వు ప్రేమించాల్సింది బస్తీ అమ్మయిని కాదు కోటిశ్వరురాలిని. నీకు నేను ఏం ఆస్తులు ఇవ్వలేదు. అందం మాత్రం ఇచ్చాను. మంచి డబ్బున్న అమ్మయిని లవ్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ చెల్లెలు కాలేజీకి వెళ్తుంటే తనకి సెక్యూరిటీ గా ఇద్దరు ఉంటారు. నాకు అలా సెక్యూరిటీ ఉంటే కాలేజీలో ఇబ్బందిగా ఉంటుంది. ప్లీజ్ వద్దని సీతాకాంత్ కి వెళ్లి చెప్తుంది. అయిన వినకుండా వాళ్ళని తనతో పాటు కాలేజీ పంపిస్తాడు. అలా తన విషయంలో చెయ్యడం కరెక్ట్ కాదేమోనని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు. ఇలా చేస్తున్నా కాబట్టే తనని కాపాడుకుంటున్నానని సీతాకాంత్ అంటాడు. ఈ కథలో మెయిన్ విలన్ మాణిక్యం. అతనికి సీతాకాంత్ కి సంబంధమేంటో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Krishna Mukunda Murari:కొడుకుని చూసి వెక్కివెక్కి ఏడ్చిన అమ్మ.. మోస్ట్ ఎమోషనల్ సీన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -375 లో.. ముకుందకి నిజంగానే ఆదర్శ్ రావడం ఇష్టమేనా అనే డౌట్ తో.. తన దగ్గరికి ఏదో ఒక రీజన్ తో మధు వచ్చి కనుక్కోవాలని వస్తాడు. కానీ ముకుందకి తనపై మధుకి డౌట్ వచ్చిన విషయం అర్థం అవుతుంది. ఆ తర్వాత ముకుంద వాళ్ళ నాన్న ఫోన్ చేసి.. తన బాగోగులు కనుక్కుంటాడు. ఆదర్శ్ వస్తున్నాడంట కృష్ణ మురారి లు తీసుకొని రావడానికి వెళ్లారని ముకుంద డల్ గా చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి దగ్గరి వరకు వచ్చారు అంటా అని అందరు చాల హ్యాపీగా ఫీల్ అవుతుంటే ముకుంద డల్ గా ఉందేంటని భవాని అనుకుంటుంది. ఆ తర్వాత తనపై డౌట్ వస్తుందని అనుకోని.. ఎక్కడ వరకు వచ్చారు అంటు ముకుంద కనుక్కుంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు కలిసి ఆదర్శ్ ని తీసుకొని ఇంటికి వస్తారు.  గ్రాంఢ్ గా వెల్ కమ్ చెప్తారు. అందరు ఆదర్శ్ దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతుంటే అతను మాత్రం భవాని దగ్గరికి వెళ్తాడు. ఇన్ని రోజులు నీకు ఈ ఇల్లు గుర్తుకు రాలేదా అంటూ భవాని తన ప్రేమని  వ్యక్తం చేస్తుంది. ఎవరో పిలిస్తే గాని నీకు రావాలనిపించలేదా అని భవాని అనగానే.. ఎందుకు రాలేదో నేను చెప్తాను. ఇక్కడ ఉండడం అవసరం లేదని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక్కడ ఒక మనసు తన కోసం చూస్తుందని వచ్చాడని మధు అనగానే.. అందరు నవ్వుతారు. నిజం చెప్పావ్ మధు అంటు ఆదర్శ్ ని ముకుంద ముందుకు కృష్ణ నెడుతూ.. ఇన్ని రోజులు దూరంగా ఉంది సరిపోదా? ఇప్పుడు కూడా దూరంగా ఉన్నావని ఆదర్శతో కృష్ణ అంటుంది. ఆదర్శ్ ముకుంద వంకే చూస్తుంటాడు. ముకుంద మాత్రం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ నుండి ఎలా బయటపడేదంటు టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత  ఫ్రెషప్ అయి వస్తామంటూ కృష్ణ మురారి ఇద్దరు వెళ్తారు. అందరు వెళ్ళండి నేను ఆదర్శ్ తో మాట్లాడాలని భవాని అంటుంది. నువ్వు నీ ఇష్టప్రకారం గానే వచ్చావా అని ఆదర్శ్ ని భవాని అడుగుతుంది. కృష్ణ నాకు జరిగింది మొత్తం చెప్పింది. ముకుంద మనసులో నేను ఉన్నానని తెలిసి వచ్చానని ఆదర్శ్ చెప్తాడు. ఆ తర్వాత ముకుంద దగ్గరికి ఆదర్శ్ వెళ్లి సారీ అని చెప్పగానే .. నాకు ఎందుకు సారి చెప్తున్నావని ముకుంద అడుగుతుంది. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నిన్ను అర్ధం చేసుకోకుండా ఆవేశంలో ఇంట్లో నుండి వెళ్ళిపోయానని ఆదర్శ్ అంటాడు. తరువాయి భాగంలో ఆదర్శ్ కి వడ్డించబోతుంటే ముకుంద వడ్డిస్తే చూడాలని ఉందని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu:ఆ ఫెస్ట్ కోసం రాత్రంతా కూర్చొని ప్రిపేర్ చేసిన వసుధార.. శైలేంద్ర ఏం చేయనున్నాడు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -981 లో.. శైలేంద్ర ఎలాగైనా యూత్ ఫెస్ట్ ని సక్సెస్ కానివ్వనంటు వసుధారతో అనగానే ఆ విషయం వెళ్లి అనుపమ, మహేంద్రలకి వసుధార చెప్తుంది. ఇన్నిరోజులు వాడు ఎలాంటి వాడో రిషికి చెప్పి ఉండాలిసింది.. జగతి బతికి ఉండేది.. రిషికి ఈ సిచువేషన్ వచ్చేది కాదని అనుపమ అంటుంది. ఎప్పటికప్పుడు వాడి నిజస్వరూపం బయట పెట్టాలని చూసాం కానీ ఏదో ఒక అడ్డు వచ్చేదని మహేంద్ర అంటాడు. వాడికి సరైన బుద్ది చెప్తాను. ఇప్పుడు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చానని వసుధార అంటుంది. ఆ తర్వాత కాలేజీలో ఇంత పెద్ద ఫెస్ట్ జరుగుతుంది. ఇప్పుడు వసుధార ఒక్కతే ఎంత ఇబ్బంది పడుతుందోనని దేవయాని, శైలేంద్రలతో ఫణీంద్ర అంటాడు. ఎండీ అని తనకి ఇంత పెద్ద బాధ్యత అప్పజెప్పారు కానీ ఈ బాధ్యత వేరే ఎవరికీ అయిన అప్పజెప్పితే బాగుండేదని దేవయాని అనగానే.. ఎవరికీ ఇవ్వాలి నీ కొడుకికా అని ఫణీంద్ర అంటాడు. అవును నా కొడుకుకే వాడికేం తక్కువ అని దేవయాని అనగానే.. ఇంత తెలివి తక్కువగా ఎలా ఆలోచిస్తావ్? అసలు వాడికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యడమే రాదు.. మొన్న కాలేజీ లో అందరు రిషి చనిపోయాడంటు స్టూడెంట్స్ గొడవకు దిగితే కాలేజీ మూసేద్దామని అన్నాడు. అదే వసుధార ప్రాబ్లమ్ ని నిమిషాల్లో సాల్వ్ చేసిందని అంటాడు. మీరు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా.. వాడి ట్యాలెంట్ చూపించేదని దేవయాని అంటుంది. ఆ తర్వాత ఆలోచించిన ఫణీంద్ర.. నీకేమైనా అలాంటి ఆశ ఉందా అని శైలేంద్రని అడుగుతాడు. అలాంటిదేం లేదని శైలేంద్ర అంటాడు. బోర్డు మెంబర్స్ కొంతమంది ఎండీగా వసుధారా అర్హురాలని అంటున్నారు. కొంతమంది కాదని అంటున్నారు. ఈ ఫెస్ట్ సక్సెస్ అయి వసుధారకి మంచి పేరు రావాలని ఫణింద్ర అంటాడు. ఆ తర్వాత మరుసటి రోజు జరగబోయే ఫెస్ట్ కి సంబంధించిన షెడ్యూల్ వసుధార రాత్రంతా మేల్కొని ప్రిపేర్ చేస్తుంటే.. అనుపమ వచ్చి ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది. ప్రోగ్రామ్ సెట్ చేస్తున్నాను చూడండి అని అనుపమకి చూపిస్తుంది. అసి చూసిన అనుపమ బాగుందని మెచ్చుకుంటుంది. ఫెస్ట్ ఎలాగైనా చెడగొట్టి.. వసుధార ఎండీగా పనికి రాదని అందరిచేత చెప్పించాలని శైలెంద్ర అనుకుంటాడు. అప్పుడే  ధరణి వచ్చి తన మాటలతో చిరాకు తెప్పిస్తుంది. ఫెస్ట్ ఫెయిల్ చెయ్యాలని మీరు ఆలోచిస్తున్నారంటు శైలెంద్రకి కోపం తెప్పిస్తుంది. మరుసటిరోజు ఉదయం వసుధార రెడీ అయి.. మీరు, అనుపమ రండి.. నేను వెళ్తానని మహేంద్రకి వసుధార చెప్పి.. జగతి ఫోటో దగ్గరికి వెళ్లి మొక్కుతుంది. మొదటిసారి ఇంత పెద్ద ఈవెంట్ చేయబోతున్నాను. బాగా జరగాలని మొక్కుకున్నానని మహేంద్రకి వసుధార చెప్తుండగా.. జగతి ఫోటో కిందకి పడిపోతుంది. దాంతో వసుధార, మహేంద్ర షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే  

Brahmamudi:ఆ అమ్మయి మీ అన్నయ్య జీవితంలోకి వచ్చేసింది.. తోటికోడళ్ళ మధ్య మొదలైన రచ్చ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 314 లో.. కావ్య ఒంటరిగా కూర్చొని రాజ్ వేరొక అమ్మాయితో క్లోజ్ ఉన్నదంతా గుర్తుకుచేసుకొని బాధపడుతుంటుంది. అప్పుడే రాజ్ కావ్య దగ్గరికి వచ్చి.. ఏమైంది హాస్పిటల్ కి వెళ్ళావంట.. ఇప్పుడు ఎలా ఉందని అడుగగానే... కావ్య మనసులో దుఃఖాన్ని ఆపుకొని బాగుందని చెప్తుంది. నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను బిజీగా ఉన్నానని రాజ్ అనగానే.. మీరు ఎంత బిజీగా ఉంటారో నేను ఉహించగలనని కావ్య చెప్పేసి అక్కడ నుండి వెళ్తుంది. ఇంట్లో రుద్రాణి పెట్టిన చిచ్చుతో వాళ్ళ తోటికోడళ్ళ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఇన్ని రోజులుగా ఎప్పుడైనా కళ్యాణ్, రాజ్ లని వేరు వేరుగా చూసానా అని సుభాష్ తో అపర్ణ అనగానే.. అసలేమైంది? ఎందుకు అంత కోపంగా ఉన్నావని సుభాష్ అడుగుతాడు. నేను కళ్యాణ్ కి ఒక పనిచెప్తే.. నీ తమ్ముడి భార్య నేను కళ్యాణ్ ని పని వాడిలాగా చూస్తున్నానని అంటుందని ఆవేశంగా మాట్లాడుతుంది. ధాన్యలక్ష్మి అన్న దాంట్లో తప్పు లేదనిపిస్తుంది. ఇన్ని రోజులు కళ్యాణ్ వేరు.. ఇప్పుడు వేరు.. వాడికి పెళ్లి అయింది కదా.. వాడి పెళ్ళాం ముందు వాడిని తక్కువ చెయ్యొద్దని తల్లిగా ధాన్యలక్ష్మి అనుకుంటుందని సుభాష్ అంటాడు. మీరు ఎన్నైనా చెప్పండి.. నాకు భయపడే ధాన్యలక్ష్మి.. ఇప్పుడు నాతోనే డైరెక్ట్ గా ఆ మాట అనేసరికి నేను తట్టుకోలేకపోతున్నానని అనేసి అపర్ణ కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకొకవైపు ధాన్యలక్ష్మి కూడా ప్రకాష్ తో మాట్లాడతుంది. మన కొడుకుని ఇంట్లో పనివాడిని చేశారు. మీ వదిన వాడికి పని చెప్తుందని అనగానే.. ప్రకాష్ కోపంగా ఇన్ని రోజులు చెప్పలేదా.. ఈ ఇంట్లో అందరు రాజ్ , కళ్యాణ్ లని సమానంగా చూస్తారని అనగానే ధాన్యలక్ష్మి కోపంగా వెళ్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి కళ్యాణ్ వచ్చి.. మీరు ఎందుకు డల్ గా ఉంటున్నారని అడుగుతాడు. ఏం లేదని కావ్య అంటుంది. మీరిప్పుడు ఎందుకు బాధపడుతున్నారో చెప్పకుంటే.. నా మీద ఒట్టే అనగానే కావ్య తన ఫోన్ లో రాజ్ శ్వేత ఫోటో చూపిస్తుంది. ఈ అమ్మయి శ్వేత.. అన్నయ్య క్లాస్ మేట్ అన్నయ్యని లవ్ చేసింది. అన్నయ్య చేసాడో లేదో తెలియదని కళ్యాణ్ అంటాడు. ఇప్పుడు ఈ అమ్మయి మళ్ళీ మీ అన్నయ్య జీవితంలోకి వచ్చిందని కావ్య అనగానే.. కళ్యాణ్ షాక్ అవుతాడు. అప్పుడే అనామిక వస్తుంది. ఏంటి ఏదో మాట్లాడుకుంటూ ఆగిపోయారని అడుగుతుంది. ఏం లేదంటు కావ్య అక్కడి నుండి వెళ్లిపోతుంది. నా గురించే మాట్లాడుకుంటున్నారా అని కళ్యాణ్ ని అనామిక అడుగుతుంది. లేదంటూ కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అనామిక దగ్గరకి రుద్రాణి వచ్చి.. వాళ్ళు చెప్పింది నమ్మావా.. వాళ్ళు నీ గురించే మాట్లాడుకుంటున్నారు. కావ్య ఎలాగైనా నీపై  కళ్యాణ్ కి ద్వేషం పెంచి.. అప్పుని ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటుందని ఉన్నవి లేనివి కావ్యపై కోపం కలిగేలా అనామికకి చెప్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరకి రాజ్ వచ్చి.. తిన్నావా అని అడుగుతాడు. తరువాయి భాగంలో కావ్య భోజనం చెయ్యలేదని తెలిసి రాజ్ భోజనం తీసుకొని వచ్చి.. కావ్య చేతులు కట్టేసి ప్రేమగా అన్నం తినిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

భోలే హీరో, అశ్వినిశ్రీ హీరోయిన్.. ఇక కొత్త సినిమా మొదలయ్యేనా!

భోలే అంటే హీరో.. కష్ట సమయంలో ప్రశాంత్ పక్కన నిల్చున్నాడు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ గెలుచుకున్న ప్రశాంత్ ని.. ట్రాఫిక్ వాయిలెన్స్ వల్ల పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెట్టగా అతనికి బెయిల్ వచ్చేలా చేసి అండగా ఉన్నాడు భోలే. ఇక ఇప్పుడు భోలే నిజంగానే హీరో అయ్యాడు.  కిక్ సినిమాలో పాటతో సినిమా లవర్స్ కి చేరువయ్యాడు భోలే. లవ్ ఫెయిల్యూర్ పాటలతో, కష్టపడ్డా.. పాలమ్మిన, పూలమ్మిన అనే పాటతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. తాజాగా శుభశ్రీ రాయగురుతో కలిసి చేసిన ఓ ప్రైవేట్ పాట ట్రెండింగ్ లో ఉంది‌. బిగ్ బాస్ హౌస్ లో భోలే, అశ్విని కలిసి మంచి ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చారు. అశ్విని శ్రీ తెలుగమ్మాయి. 1989  జూలై 12 న అశ్విని శ్రీ జన్మించింది. ఈమె హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. అయితే మొదటగా తను షార్ట్ ఫిల్మ్ లలో నటించింది. వాటితో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో సినిమాల్లోకి వచ్చింది. 2016 లో వెండితెరపై అరంగేట్రం చేసింది అశ్విని. సంపూర్ణేశ్ బాబు హీరోగా చేసిన "వినోదం 100 పర్సెంట్" అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఆ తర్వాత 2017 లో వచ్చిన "అమీర్ పేటలో", 2018 లో వచ్చిన " బిటెక్ బాబులు" , 2020 లో " నువ్వు నేను, ఒసేయ్ ఒరేయ్" వంటి సినిమాలల్లో నటించింది అశ్విని‌. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అశ్వినిశ్రీతో కలిసి ఎక్కువగా ఉన్న భోలే .. బయటకొచ్చాక శుభశ్రీతో కలిసి పాట చేయడంతో ఆ పాట కింద అందరు.. మీ హీరోయిన్ తో ఓ పాటని చేయొచ్చు కదా హీరో అంటు కామెంట్లు చేసారు. ఇక అదే విషయం గురించి వివరిస్తూ అశ్వినిశ్రీ ఓ వ్లాగ్ ని చేసింది. త్వరలో మా కాంబినేషన్ లో ఓ పాట వస్తుందంటు భోలే షావలి, అశ్వినిశ్రీ ఈ వ్లాగ్ లో చెప్పుకొచ్చారు.  ' భోలేతో బోలెడన్ని కబుర్లు' అంటూ చేసిన ఈ వ్లాగ్ లో చాలా విషయాలని షేర్ చేసారు. హౌస్ లో వారిమధ్య ఉన్న బాండింగ్ ని గుర్తుచేసుకున్నారు.  భోలే అయితే తను అందంగా ఉంటాడని చెప్పగా అశ్వినిశ్రీ నవ్వుకుంది. ఇక రోజుకి రెండు లీటర్లు నీళ్ళు తాగాలని , అది మనలోని అన్ వాంటెడ్ కొవ్వుని తీసేస్తుందని , బాడీలోని టాయిలెట్ ని ఫ్లష్ చేయడంలో వాటర్ అనేది యూజ్ అవుతుందని భోలే చెప్పాడు. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా చేయగలమంటూ హెల్త్ టిప్ ని ఇచ్చాడు భోలే. ఇక అశ్వినిశ్రీని హీరోయిన్ అంటు  భోలే అనగా త్వరలోనే మనం ఓ పాటని చేద్దామంటూ అశ్విని అంది. నువ్వు హీరోయిన్, నేను హీరో మనమిద్దరం కలిసి త్వరలోనే ఓ సినిమానే చేద్దామని భోలే షావలి అనగా అశ్వినిశ్రీ నవ్వుకుంది. ఇలా సరదాగా సాగిన ఈ వీడియోకి భోలే ఫ్యాన్స్, అశ్వినిశ్రీ ఫ్యాన్స్ కలిసి తెగ కామెంట్లు చేస్తున్నారు.‌ దాంతో ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.  

Priyanka Jain: అమ్మకి క్యాన్సర్ .. మేము చేసిన తప్పు మీరు చేయకండి!

ప్రతీ ఒక్కరి జీవితంలో అమ్మనాన్న చాలా ముఖ్యమైన వాళ్ళు. వారే లేకుంటే.. సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది‌. మనకి ఓ స్టేజ్ వచ్చాక అమ్మనాన్నలని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకోవడానికి ఏమైనా చేయాలి.. ఎంత దూరమైన వెళ్ళాలి. ప్రియాంక జైన్ వాళ్ళ అమ్మకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అంట. ఆ విషయాన్ని యూట్యూబ్ ఛానెల్ లోని వ్లాగ్ ద్వారా తను తెలియజేసింది‌. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ప్రియాంక. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆటతీరుతో, మాటతీరుతో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.  హౌస్ లో ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ గా పేరుతెచ్చుకున్న అమర్, శోభాశెట్టి, ప్రియాంక.. ఎప్పుడు కలిసి ఉండేవారు. గేమ్ అయిన బయట అయిన గ్రూపిజం చేస్తు ఉండటంతో ప్రేక్షకులలో వీరిపట్ల నెగెటివిటి పెరిగిపోయింది. దాంతో శోభాశెట్టిని గ్రాంఢ్ ఫినాలే ముందు వారంలో బయటకు పంపించారు.  ఇక టాప్-5 లో ఒకరిగా ఉన్న ప్రియాంక జైన్.‌ అయిదవ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. నా కళ్ళకి సర్జరీ వళ్ళ మీ ముందుకు రాలేకపోతున్నానంటూ రీసెంట్ గా చేసిన వ్లాగ్ ఫుల్ వైరల్ అయింది.  ఓవైపు ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ లతో  తన అభిమానులకి దగ్గరగా ఉండగా మరోవైపు తన ప్రియుడు శివ్ తో కలిసి వ్లాగ్స్ చేస్తుంది.  ' అమ్మకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ మేము చేసిన తప్పు మీరు చేయకండి ' అంటూ మరో వ్లాగ్ ని తాజాగా అప్లోడ్ చేసింది. ఇందులో  ఏం చెప్పిందంటే.. ప్రియాంక హౌస్ లో ఉన్నప్పుడే తెలిసిందంట కానీ శివ్ బిగ్ బాస్ చూస్తూ బిజీగా ఉన్నాడు. ప్రియంక వాళ్ళ అమ్మను హాస్పిటల్ కి తీసుకెళ్తానని శివ్ అడిగిన తను రాకుండా  పర్లేదని చెప్పిందని  అన్నాడు. ఇక బిగ్ బాస్ తర్వాత రీసెంట్ గా ప్రియాంక, ఆమె తమ్ముడు కలిసి హాస్పిటల్ కి తీసుకెళ్ళి చెకప్ చేస్తే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అని తెలిసిందంట‌‌. అది తెలిసి అంతా షాక్ అయ్యారంట‌. మేము ఒక రెండు మూడు నెలల ముందే చూపిస్తే బాగుండేదంటూ ఈ వీడియోలో ప్రియాంక, శివ్ లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు క్రిటికల్ కాంప్లెక్స్ రూమ్ లో ఉంచారని రేపు ఆపరేషన్ తర్వాత తెలుస్తుందని డాక్టర్స్ చెప్పారంటూ ప్రియాంక ఏడుస్తూ చెప్పింది. ఇలా ప్రియాంక జైన్ ఎమోషనల్ అవ్వడంతో తన అభిమానులతో పాటు బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. దాంతో ఈ వ్లాగ్ ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది.  

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కీర్తీ!

కొన్ని నెలల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకొని వైరల్ అయిన ఓ జంటని నెటిజన్లు పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నలతో విసిగిస్తున్నారు. అదెవరో కాదు కీర్తిభట్. బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ కీర్తిభట్‌ ఎంగేజ్మెంట్ జరిగింది.  బిగ్ బాస్ సీజన్ సిక్స్ అంటే అందరికి గుర్తొచ్చే పేర్లు రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, గీతు రాయల్, ఆదిరెడ్డి,  కీర్తిభట్, ఫైమా, అర్జున్ కళ్యాణ్.. ఇలా చెప్పుకుంటు పోతే పెద్ద లిస్టే అవుతుంది. హౌస్ లో ఉన్నప్పుడు  కీర్తిభట్ చెప్పిన తన రియల్ లైఫ్ స్టోరీ ఎందరినో ప్రభావితం చేసింది.  దాంతో కీర్తిభట్ ని ప్రేక్షకులు టాప్-5 లో ఉంచారు.  అలా ఇరు రాష్ట్రాలలో తెలుగింటి ఆడపడచులా మారింది‌. ఇక ఆ తర్వాత మధురానగరిలో అనే సీరియల్ లో లీడ్ రోల్ చేసింది కీర్తిభట్. ఇక తన ప్రతీ విషయం ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫోటోలతో, యూట్యూబ్ లో వ్లాగ్స్ తో తెలియజేస్తుంది. మొన్నటికి మొన్న కులుమనాలిలో షూటింగ్ కోసం వెళ్ళిన కీర్తిభట్ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరోసారీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ భామ.  ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మి క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది. నైస్ హెయిర్ కట్ అక్క, చిన్న కుక్కపిల్లలాగా ఉన్నావని ఒకరు చెప్పగా.‌. థాంక్స్ అండ్ లవ్ యూ అని చెప్పింది కీర్తి. మ్యారేజ్ ఎప్పుడు అక్క అని ఒకరు అనగా.. టైమ్ ఉంది అంటు సమాధానమిచ్చింది. ఇక మరొకరు పెళ్ళి డేట్ చెప్పండి అక్క అని అడుగగా.. ఇద్ధరం ఒక కమిట్ మెంట్ పెట్టుకున్నాం. అది అయిపోగానే పెళ్ళి అని కీర్తిభట్ చెప్పింది. హాయ్ అక్క‌‌.. గ్రేట్ ఇన్సిపిరేషన్ ఫర్ మెనీ.‌ హ్యాట్సాఫ్ లవ్ యూ అక్క అని ఒకరు చెప్పగా.. థాంక్ యూ సో మచ్  అని  వీడియో చేసి చెప్పింది. బిగ్ బాస్ తర్వాత ఎవరినైన కలిసారా అనగా.. లేదని చెప్పింది. నిఖిల్ కావ్య గురించి చెప్పండి అని అనగా‌‌ .. వాళ్ళు క్యూట్ కపుల్ అని అంది. అనాధాశ్రమమం పెట్టారా? బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చెప్పారు కదా అని ఒకరు అడుగగా.. చేసినవన్నీ చెప్పడానికి నాకు ఇష్టం ఉండదని కీర్తి రిప్లై ఇచ్చింది. ఏంటి ఈ మధ్య ఫ్రెండ్స్ ఎవరినీ కలవడం లేదు.. ఆరోహీ, వాసంతి? అని ఒకరు అడుగగా.. అందరు వాళ్ళ వాళ్ళ లైఫ్ లో బిజీ అయిపోయారు కదా.. నేను కూడా బిజీ అయ్యాను. సీరియల్ షూటింగ్, ట్రావెలింగ్, సినిమా షూటింగ్ ఉంది. అందుకే టైమ్ లేదు. ఫ్రీగా ఉన్నప్పుడు అందరం మెసెజ్ చేసుకుంటామని కీర్తిభట్ అంది. మీ డాడ్ అండ్ మీరు ఎక్కువగా కలిసి ఉండే ప్లేస్ ఏంటి అని ఒకరు అడుగగా.. మంగళూరు అని రిప్లై ఇచ్చింది. ఇలా కొన్ని ప్రశ్నలకి సమాధానాలచ్చింది కీర్తిభట్.  

నాకు చేతబడి చేస్తే నీకు మందు పెడతా ...!

మందుపెట్టుడు అంటే తెలుసా.. చెట్లకి మందుపెడితే పండ్లు కాస్తాయి.. మనుషులకి మందుపెడితే ఏం చెప్పినా చేస్తారు. పొలిమేర సినిమా చూసి ఎంతోమందికి మంత్రాలు, చేతబడి అంటే తెలియనివాళ్ళకి కూడా ఓ ఐడియా వచ్చేసింది. అయితే ఇవి మంచికంటే ఎక్కువగా చెడుకే వాడతారు. అరియానా గ్లోరీ మాత్రం సరదా సరదాగా మందు పెడతదంట. ఆర్జీవీతో కలిసి చేసిన ఓ ఇంటర్వూ అరియానా కెరీర్ నే మార్చేసింది. యాంకర్‌గా కెరీయర్‌ ప్రారంభించి బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయిన అరియాన గ్లోరీ అందరికీ పరిచయమే. తన ఫోటోలను ఎప్పుడూ  సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ. ఒక్కోసారి తనపై ఎన్ని కామెంట్లు వచ్చిన వాటిని లెక్కచేయకుండా.. తనకు నచ్చింది ఓపెన్‌గా మాట్లాడటంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది. బిగ్ బాస్ సీజన్‌-4 లో హౌస్ లోకి వెళ్ళి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. అవినాష్, సోహెల్, అరియానాల కాంబినేషన్ లో జోక్స్ కి బాగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. అరియానా గ్లోరీ తాజాగా తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆస్క్ మి క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది. హాయ్ ఫ్రెండ్స్ వాట్ డూయింగ్ అని పెట్టగా .. నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. వాటిల్లో కొన్నింటికి అరియానా సమాధానమిచ్చింది. చీరలో ఓ ఫోటో అప్లోడ్ చేయండి అని ఒకరు అడుగగా.. తను చీరలో దిగిన ఫోటోని అప్లోడ్ చేసింది. థింకింగ్ ఎబోట్ యూ అని ఒకరు అడుగగా.. సీరియస్లీ, నేను కూడా.. బై ద వే ఎవరు మీరు? అని రిప్లై ఇచ్చింది‌. థింకింగ్ ఎబోట్ యూ అని ఆర్జే చైతు అడుగగా.. ఎక్కువ థింక్ చేయకని చెప్పి చైతుకి ట్యాగ్ చేసింది. నువ్వు నా సోల్ మేట్ అవ్వాలని నీకు చేతబడి చేస్తున్నానని ఒకరు అడుగగా.. బ్రో.. అసలు నాకు బ్రో అని పిలిచే ఆలోచననే లేదు.  సోల్ మేట్ అని చేతబడి చేస్తున్నానని అన్నావ్ కదా.. సీరియస్లీ .. అయితే నేను నీకు మందుపెడతా అని వీడియోలో చెప్పింది.  తేజు అక్క గురించి మీ మాటల్లో అని ఒకరు అడుగగా.. మా నెవెర్ ఎండింగ్ కన్వర్సేషన్.. అమర్ తేజు అండ్ అరియానా అంతే.. అని తేజస్వినితో ఇరవై ఏడు నిమిషాలు మాట్లాడిన స్క్రీన్ షాట్ పెట్టింది. జై బాలయ్య అని ఒకసారి అనరా అని ఒకరు అడుగగా.. హే నేను కూడా బాలయ్య బాబు ఫ్యాన్ అని చెప్పి జై బాలయ్య అంటు అరిచేసింది. అనూజ అక్క గురించి చెప్పమని ఒకరు అడుగగా.‌ షీ ఈజ్ క్యూట్, అవినాష్ ఈజ్ లక్కీ అని రిప్లై ఇచ్చింది. ఇలా కొన్ని ప్రశ్నలకి సమాధానాలిచ్చింది అరియానా. కాగా ఇప్పుడు ఇది ట్రెండింగ్ లో ఉంది.  

Eto Vellipoyindhi Manasu:సీతాకాంత్ రోల్ మోడల్ అతనేనంట.. ఇదేం ట్విస్ట్ రా మామ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏటో వెళ్ళిపోయింది మనసు'. మూవీ రేంజ్ లో హైప్ ని క్రియేట్ చేస్తూ ఈ సీరియల్ గ్రాంఢ్ గా గా మొదలైంది. ఈ సీరియల్ ఎపిసోడ్ -2 లో.. రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరివి విభిన్న అభిరుచులు గలవారు. రమాకాంత్ కి 90' s లో ఉన్న అలవాట్లు, కట్టుబాట్లు ఉంటాయి. ఇంకా ఫ్యామిలి ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే ఫార్ములాను నమ్ముతుంటాడు. రామలక్షి నూతన పోకడలంటే ఇష్టం. తనకన్నా ఎక్కువ ఏజ్ గలవారంటే అసలు నచ్చరు. అప్పట్లో ఒకరితో ఒకరికి సంబంధం ఉండేది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన చేతిలో ఉందని నమ్ముతూ.. ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటూ ట్రెండ్ ని ఫాలో అవుతుంటుది. తనకి ఉన్నంతలో ఇతరులకు సాయం చేసే మనసత్వం. మరొకవైపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య పెద్ద బిజినెస్ మెన్స్ తో మీటింగ్ లో మాట్లాడుతు.. తన మనవడి గురించి గొప్పగా చెప్తుంటాడు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. మీటింగ్ మొదలవుతుందని అనుకునేలోపు.. అప్పుడే అతనికి ఫోన్ వస్తుంది. మీటింగ్ వదిలేసి ఇంటికి హడావిడిగా వెళ్తాడు సీతాకాంత్. తీరా చూస్తే అతని చెల్లెలికి కాలు బెనుకుతుంది. దానికే‌ హడావిడి చేస్తు ఇంటికి డాక్టర్స్ ని రప్పించి మరీ ట్రీట్ మెంట్ ఇస్తాడు. అంత పెద్ద మీటింగ్ వదిలి వచ్చావా అని తన చెల్లి అడుగుతుంది. నాకు ఫ్యామిలీ ఫస్ట్,  ఆ తర్వాతే బిసినెస్ అని చెప్తాడు‌ ఆ మాట తన తల్లి వింటుంది. తన సొంత కొడుకు కాకున్న సీతాకాంత్ అంటే తనకి చాలా ఇష్టం. సీతాకాంత్ ని పెద్ద కొడుకులాగా చూస్తుంది. తన ఇంకొక కొడుకు కోడలిని పిలవగానే వాళ్ళు భయంతో పరుగెత్తుకొని వస్తారు. తన కోడలు మాత్రం.. సవతి కొడుకుని ప్రేమగా చూసినట్లు సొంత కొడుకుని అలా చూడదని ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత బెస్ట్ బిజినెస్ అవార్డు వచ్చినందుకు సీతాకాంత్ కి తన తల్లి డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇస్తుంది. అది చూసి చిన్న కొడుకు, కోడలు ఈర్షపడతారు. నాకు చిన్న చాక్లెట్ ఇచ్చిన అమ్మ.. ప్రేమతో ఇస్తే నాకు అదే గొప్పదని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత తిరిగి మీటింగ్ కి వెళ్తాడు. అక్కడ ఎందుకు వెళ్ళాలిసి వచ్చిందో చెప్తాడు. మీటింగ్ లో మాట్లాడుతు..  నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే కారణం ఒకరు.. అతను నా ఫ్రెండ్ కాదు ఫ్యామిలీ కాదు.. బట్ నా లైఫ్ చేంజర్ అని, అతని ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని రోజు అతని ఫోటో చూస్తానని సీతాకాంత్ చెప్తాడు. మరొకవైపు అది నేనే.. అన్నింటికి కారణం నేనే అని రామలక్ష్మి నాన్న అనుకుంటు ఉంటాడు. అసలు సీతాకాంత్ , రామలక్ష్మి వాళ్ళ నాన్నకి మధ్య గల సంబంధమేంటో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

‌కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో అదిరిపోయే ట్విస్ట్.. ఆదర్శ్ రావడం ముకుందకు ఇష్టమేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -374 లో.. కృష్ణ మురారి లు ఆదర్శ్ ని తీసుకొని రావడానికి వెళ్తారు. ఆదర్శ్ కి జరిగింది మొత్తం చెప్తారు. కానీ ఆదర్శ్ మాత్రం మొదట ఇంటికి రావడానికి ఇష్టపడడు. ఆ తర్వాత కృష్ణ ఇప్పుడు ముకుంద మారిపోయిందని, నీకోసం ప్రేమ గా ఎదురుచూస్తుంటుందని కన్విన్స్ చెయ్యడంతో ఆదర్శ్ ఇంటికి రావడానికి ఒప్పుకుంటాడు. కానీ ఒక కండిషన్ అంటు ఇంటికి వచ్చాక ఏం జరిగిన మీదే బాధ్యత అని ఆదర్శ్ అనగానే కృష్ణ సరేనని అంటుంది. ఆ తర్వాత వాళ్ళు రావడానికి ముందు ఇంట్లో జరిగిన గొడవ గురించి ఆదర్శ్ కి కృష్ణ చెప్తుంది.‌ మరొకవైపు కృష్ణ మురారీలకి ఎంత ట్రై చేసిన ఫోన్ కలవకపోవడంతో.. ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారు. ఒక పక్క ముకుంద.. కృష్ణ, మురారీలు ఆదర్శ్ ని కలిసారా తీసుకొని వస్తున్నారా అని భయపడుతుంది. ఆ తర్వాత మురారి తన చిన్నతనంలో చేసిన అల్లరి గురించి ఆదర్శ్ , మురారీలు కలిసి కృష్ణకి చెప్తాడు. అలా సరదాగా వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుకుచేసుకుంటు కృష్ణకి చెప్తారు. ముకుంద నీ కోసం వెయిట్ చేస్తుందని కృష్ణ అనగానే.. నాకెందుకో మీరు భ్రమ పడుతున్నారని అనిపిస్తుందని ఆదర్శ్ అంటాడు. అలా ఏం కాదు నిజమే.. ముకుంద మారిందని ఇద్దరు చెప్తారు. ఆ తర్వాత భవానికి కృష్ణ కాల్ చేసి ఆదర్శ్ ని కలిసామని.. రేపు ఇంటికి తీసుకొని వస్తున్నామని చెప్పగానే భవానీతో పాటుగా‌ ఇంట్లో వాళ్ళు చాల సంబరపడిపోతారు. ముకుంద మాత్రం టెన్షన్ పడుతుంది. మధు గమనిస్తున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు నటిస్తు ఉంటుంది. ఆ తర్వాత ఆదర్శ్ కి గ్రాంఢ్ గా వెల్ కమ్ చెప్పాలని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. ముకుంద డల్ గా ఉండడంతో.. ఆదర్శ్ రావడం ముకుందకి ఇష్టం లేదని మధు అనుకుంటాడు. ఆ తర్వాత ఆదర్శ్ వస్తే ఇప్పుడు నేనేం చెయ్యాలి.. ప్రేమించిన వాడు పక్కన ఉంటే.. వేరేవాళ్ళతో ఎలా ఉంటాను. నేను మారిపోయానని ఎంత ఆశగా ఆదర్శ్ వస్తున్నాడో? మళ్ళీ మురారి ప్రేమ కోసం ట్రై చెయ్యాలా అంటూ ముకుంద సతమతమవుతుంటే మధు వస్తాడు. ఏమైంది అలా ఉన్నావని అడుగగా.. ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. కానీ మధుకి మాత్రం డౌట్ వస్తుంది. ఆదర్శ్ వచ్చాక ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో.. దానికి కూడ కృష్ణ బాధ్యత తీసుకుంది. అప్పుడు కూడా కృష్ణ మాటలు పడాల్సి వస్తుందని మధు అనుకుంటాడు. తరువాయి భాగంలో కృష్ణ, మురారి‌ ఇద్దరు ఆదర్శ్ ని తీసుకొని ఇంటికి రావడంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu:కాలేజీలో ఫెస్ట్ ని అట్టర్ ఫ్లాప్ చేస్తానన్న శైలేంద్ర.. వసుధార ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -980 లో.. కాలేజీ బోర్డు మెంబర్స్ అందరు కాలేజీలో ఈ సంవత్సరం యూత్ ఫెస్ట్ జరుపాలని మీటింగ్ లో చెప్తారు. ఇప్పుడు ఎందుకు తర్వాత కండక్ట్ చేద్దామని వసుధార అనగానే.. లేదు మేడమ్.. ఎప్పుడు ఇదే టైమ్ కి ఫెస్ట్ జరుగుతుందని మెంబర్స్ అంటారు. ఆ తర్వాత ఫణీంద్ర కలుగజేసుకుని.. అవును ఇప్పుడు కాలేజీలో ఫెస్ట్ నిర్వహిస్తే.. వేరే కాలేజీ వాళ్ళు ఇక్కడికి వస్తారు.. మన కాలేజీ గురించి పబ్లిసిటీ జరుగుతుంది. ఒకరకంగా ప్రమోషన్ లాగా అవుతుంది. ఇప్పుడు చేస్తే బెటర్ అని అంటాడు. ఆ తర్వాత వసుధార కూడా ఫెస్ట్ కి ఒప్పుకుంటుంది. గెస్ట్ గా మినిస్టర్ గారిని పిలుద్దామని ఫణింద్ర చెప్తాడు. దానికి అందరూ ఒకే చెప్తారు. ఆ తర్వాత వసుధార తన కాబిన్ కీ వచ్చి.. జగతి మేడమ్ ని గుర్తుకు చేసుకుంటుంది. అప్పుడే మహేంద్ర వచ్చి.. నువ్వు ఇప్పుడు ఎంత స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నవ్ కదా.. నాకు తెలుసని మహేంద్ర అంటాడు. నాకు రిషి సర్ కోలుకున్నాక ఇది జరపాలని ఉండే కానీ అందరు చెప్పింది కూడ కరెక్ట్ అని వసుధార అంటుంది. ఆ తర్వాత వసుధార గురించి శైలేంద్ర ఆలోచిస్తు.. ఎన్ని ప్లాన్ లు చేసిన మళ్ళీ నాది నాకే రివర్స్ అవుతున్నాయేంటి?  ప్రతీసారీ ఆ వసుధారనే గెలుస్తుంది. ఇక అలా ఉండదు. ఇప్పుడు నాకు తోడు ఆ రాజీవ్ దొరికాడు. వాడికి ఆ వసుధార కావాలి, నాకు తాను కూర్చొని ఉన్న ఎండీ సీట్ కావాలని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత రాజీవ్ మాస్క్ పెట్టుకొని డెలివరీ బాయ్ లాగా వసుధార ఇంటికి వస్తాడు. డోర్ కొట్టగానే వసుధార బయటకు వస్తుంది. నేనేం ఆర్డర్ చెయ్యలేదని వసుధార అనగానే ఇంట్లో వాళ్ళు చేశారేమోనని రాజీవ్ అంటాడు. సరే అని వసుధార ఆర్డర్ తీసుకుంటుంది. అలా ఎదో వంకతో వసుధార చెయ్యిని టచ్ చేస్తాడుమ ఆ తర్వాత రాజీవ్ తిరిగి వెళ్లిపోతుంటే వసుధార ఆగమని చెప్తుంది. నిన్ను ఎక్కడో చూసినట్టు ఉంది.. మాస్క్ తీయమని అనగానే రాజీవ్ భయపడుతాడు. ఎదో ఒకటి కవర్ చేసి అక్కడ నుండి బయటపడతాడు. మరుసటి రోజు ఉదయం వసుధార స్టూడెంట్స్ కి ఫెస్ట్ కి సంబందించిన బాధ్యతలు అప్పజెప్పుతుంది. అలా స్టూడెంట్స్ తో మాట్లాడుతున్న వసుధారని శైలేంద్ర చూసి.. వసుధార వస్తుండగా ఇంత హుషారుగా కన్పిస్తున్నావ్.. ఈ  ఫెస్ట్ అట్టర్ ప్లాప్ అవుతుందని తనకి కోపం వచ్చేలా మాట్లాడతాడు. దానికి తగ్గట్టు వసుధార కూడ శైలేంద్రకి కౌంటర్ వేస్తుంటుంది. ఆ తర్వాత వసుధార, శైలేంద్ర మాటలన్ని మహేంద్ర, అనుపమలకి చెప్తుంది. వాడు మనం ఏం అనడం లేదని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడని మహేంద్ర అంటాడు. మీరు ఫణింద్ర, రిషీలకి వాడి గురించి చెప్పాలిసిందని అనుపమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi:అనామిక, రుద్రాణీల ప్లాన్ సక్సెస్.. ఇక రణరంగమే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -313 లో... కావ్యకి బాగోలేదని స్వప్న హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. అదే టైమ్ కి శ్వేతకి గాయం కావడంతో రాజ్ హాస్పిటల్ కి తీసుకొని వస్తాడు. అక్కడ ఉన్న సిస్టర్స్ రాజ్ శ్వేతలని కాబోయే భార్య భర్తలని అనుకోవడం కావ్య విని బాధపడుతుంది. ఆ తర్వాత కావ్య రిపోర్ట్స్ వచ్చాయంటు స్వప్న వస్తుంది. మరొకవైపు ధాన్యలక్ష్మి దగ్గరికి ఇందిరాదేవి వెళ్ళి.. వంట చెయ్ ఈ రోజు కావ్యకి బాలేదని చెప్తుంది. అప్పుడే అటుగా వెళ్తున్న కళ్యాణ్ తో.. నా గదిలో గీజర్ పాడైంది చూసుకోమని ఇందిరాదేవి చెప్తుంది. అదంతా విన్న రుద్రాణి.. ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది. చూసావా ఈ ఇంట్లో నీ కొడుకు స్థానమని అంటుండగా కళ్యాణ్ ని అపర్ణ పిలిచి.. గుడికి వెళ్ళాలి డ్రైవర్స్ లేరు తీసుకొని వెళ్తావా? నువ్వు ఖాళీగా ఉంటావని అడుగుతున్నానని అపర్ణ అనగానే కళ్యాణ్ సరే పెద్దమ్మ అంటాడు. ఆ మాటలు అన్ని రుద్రాణి, ధాన్యలక్ష్మి వింటారు.‌ చూసావ్  కదా కళ్యాణ్ ఇంట్లో సర్వెంట్ అయిపోయాడు. అనామికకి కూడా కొన్ని రోజులు అయితే పనులు చెప్తారు. కావ్య అంటే ఎవరికి ఇష్టం లేకున్నా రాజ్ భార్య కాబట్టి అందరు తనకి విలువ ఇస్తారని రుద్రాణి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. దాంతో ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత కావ్య ఇంటికి వస్తుంది. ఏమన్నారు డాక్టర్ అని ఇందిరాదేవి అడుగుతుంది. కళ్ళు తిరుగుతున్నాయి కాసేపు పడుకుంటానని ఇందిరాదేవితో కావ్య చెప్పి వెళ్లిపోతుంది. ఏదో టెన్షన్ పడుతుందని స్వప్న అనగానే.. ఇంట్లో అందరు తనఫై విరుచుకుపడడటమే కదా.. టెన్షన్ ఉండదా అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ కి సంబంధించిన జ్ఞాపకాలన్ని అప్పు మంటలో వేస్తుంది. ఇక నుండి అన్ని మర్చిపోయా హ్యాపీగా ఉంటాను.. నా ఫ్యామిలీ గురించి తప్ప ఎవరి గురించి అలోచించనని అప్పు అనగానే ఇంట్లో వాళ్ళు సంబరపడతారు. ఆ తర్వాత కావ్య కాకుండా అనామిక భోజనం వడ్డీస్తుంటే.. రాజ్ వచ్చి కావ్యకి ఏమైందని అడుగుతాడు. నీకు తెలియదా కావ్యకి బాలేదని ఇందిరాదేవి చెప్తుంది. నీకు ఫోన్ చేసింది నువ్వు బిజీగా ఉన్నావని స్వప్న హాస్పిటల్ కీ తీసుకొని వెళ్ళిందని ఇందిరాదేవి చెప్తుంది. అవును చేసిందని.. తను చిరాకు పడ్డ విషయం గుర్తుకు చేసుకుంటాడు. ఆ తర్వాత నాకు ఆకలిగా లేదంటూ రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రుద్రాణి కావాలనే గీజర్ పాడైంది కదా.. ఇప్పుడు వేడి వాటర్ ఎలా అనగానే.. కళ్యాణ్ చేయించలేదు.. ఇంత బాధ్యత లేకపోతే ఎలా అని అపర్ణ అంటుంది. ఏంటి అక్క కళ్యాణ్ ఎలా కన్పిస్తున్నాడు.. ఏమైనా సెర్వెంటా? పెళ్ళానికి బాగోలేకపోతే పట్టించుకోలేనంత బిజీగా రాజ్ ఉంటే.. నా కొడుకు మాత్రం ఇలా పనులు చెయ్యాలా? ఇన్ని రోజులు ఓపిక పట్టానని ధాన్యలక్ష్మి అనగానే.. అలా మాటలు వదిలెయ్యాకని ఇందిరాదేవి అంటుంది. మనసులో ఇంత పెట్టుకొని బయటకు అక్క అని ఎలా మాట్లాడుతున్నావ్? ఇక నుండి ఎవరు ఏ పనులు చెయ్యకండని అపర్ణ కోపంగా అనేసి వెళ్లిపోతుంది. రుద్రాణి, అనామిక ఇద్దరు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత అనామిక తన అమ్మకి ఫోన్ చేసి జరిగింది చెప్పి.. కళ్యాణ్ నేను చెప్పింది వినేలా చేసుకుంటాను. ఇంట్లో తోడికోడళ్ళకి గొడవలు పెట్టానని చెప్తుండగా కళ్యాణ్ వస్తాడు . మాట్లాడింది విన్నాడేమోనని భయపడుతుంది కానీ తను ఆ మాటలేం వినడు. కళ్యాణ్ రొమాంటిక్ గా దగ్గరికి వస్తుంటే.. మళ్ళీ పెద్దలు ముహూర్తం పెట్టాకే శోభనమని చెప్పి అనామిక వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.