Guppedantha Manasu:కళ్ళుతిరిగి పడిపోయిన వసుధార.. రిషిని కిడ్నాప్ చేసిందెవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -985  లో..  రిషి, చక్రపాణి ఉంటున్న ఇంటికి రాజీవ్ వస్తాడు. కానీ అతను వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంటుంది. మళ్ళీ తప్పించుకున్నావా రిషి అని రాజీవ్ అనుకుంటాడు. అప్పుడే రాజీవ్ కి శైలేంద్ర ఫోన్ చేసి.. వాడు దొరికాడా అని అడుగుతాడు. లేదు జస్ట్ మిస్ అంటాడు. ఇంకా కన్పించలేదా అంటు శైలేంద్ర కోప్పడుతుంటాడు. నీకు ఎండీ సీట్ మాత్రమే కానీ నాకు నా మరదలు పిల్ల కావాలి. రిషి ఉన్నా లేకున్న ఎండీ సీట్ సాధించుకోవచ్చు కానీ నా మరదలని మాత్రం రిషి ఉంటే పొందలేను. ఆ రిషిగాడిని వేసేసి కాల్ చేస్తానని రాజీవ్ అంటాడు. ఆ తర్వాత కాలేజీలో స్టూడెంట్స్ తమ డాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటారు. రిషి సర్ రావడానికి లేట్ అవుతుంది. అందుకే స్టూడెంట్స్ ని తమ అనుభవాలని షేర్ చేసుకోమని చెప్పండని లెక్చరర్ కి వసుధార చెప్తుంది. ఆ తర్వాత యూత్ ఫెస్ట్ ని వసుధార సక్సెస్ చేసిందని ఫణింద్ర వాళ్ళు మాట్లాడుకుంటారు. అప్పుడే వస్తున్న శైలేంద్రని ఫణింద్ర పిలిచి.. ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావ్? ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంటే బయట ఏం చేస్తున్నావని ఫణింద్ర అడుగుతాడు. రిషి వస్తున్నాడు అన్నారు కాదా వెల్ కమ్ చెబుదామని బయట ఉన్నానని శైలేంద్ర అంటాడు. కావాలనే శైలేంద్ర వసుధారతో మాట్లాడతాడు. రిషి ఎక్కడ వరకు వచ్చాడో కనుక్కో వసుధారా అని శైలేంద్ర అనగానే.. అవును వసుధార కనుక్కో అని ఫణీంద్ర కూడా అంటాడు. ఆ తర్వాత రిషికి వసుధార ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యడు. దాంతో వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. వాళ్ళ నాన్న ఫోన్  ఎవరో ఒక నర్సు లిఫ్ట్ చేసి.. ఈ ఫోన్ అతనికి గాయం అయిందని చెప్తుంది. మా నాన్నతో ఇంకొకరు ఉండాలని వసుధార అనగానే.. ఎవరు లేరు ఒక్కరే ఉన్నారని ఆ నర్సు చెప్పగానే వసుధార కళ్ళుతిరిగి కిందకి పడిపోతుంది. ఆ తర్వాత వసుధార కళ్ళు తెరిచి చూసేసరికి ఇంట్లో ఉంటుంది. తలకి కట్టుతో చక్రపాణి కూడా ఉంటాడు. అసలు ఏమైంది నాన్న అని వసుధార అడుగుతుంది. ఏమైందో నాకు తెలియదు ఇద్దరం బయలుదేరి వస్తుంటే.. ఎవరో నా తల వెనకాల కొట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని చక్రపాణి చెప్తాడు. ఈ పని శైలేంద్ర చేసాడని భావించిన వసుధార.. వెంటనే శైలేంద్ర దగ్గరకి వెళ్తుంది. రిషి సర్ ఎక్కడ అంటు కాలర్ పట్టుకొని అడుగుతుంది. తనపై చెయ్యి చేసుకుంటుంది. అనుపమ, మహేంద్ర ఇద్దరు ఆగమని చెప్పిన వసుధార వినదు. అంతలోనే దేవయాని, ఫణింద్రలు వచ్చి.. ఏం చేస్తున్నావ్ అని అడుగుతారు. వీడే రిషి సర్ ని ఏదో చేసాడని వసుధార అనగానే అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Krishna Mukunda Murari:తను మారిందని భవాని నమ్మకపోవడానికి కారణమేంటి?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -379 లో.. ముకుంద అన్న మాటలని భవాని గుర్తుకుచేసుకుంటుంది. అసలు ముకుంద నిజంగానే మారిందా.. నాకు ఎందుకో నమ్మాలనిపించడం లేదు. వాళ్ళ అన్నయ్య అంత పెద్ద మోసం చేస్తే చెల్లెలికి తెలియకుండా ఉంటుందా అని భవాని ఆలోచిస్తుంటుంది. అసలేం చెప్పి ఆదర్శ్ ని తీసుకొని వచ్చారు. ముకుంద మారకుంటే పరిస్థితి ఏంటి? ఈ తింగరి కృష్ణ అతి మంచితనంతో అందరి సంతోషం కోసం ట్రై చేస్తుందని భవాని అనుకుంటుంది. ఆ తర్వాత అప్పుడే రేవతి వచ్చి మరొక పంతులిని పిలిపించి ముహూర్తం చూడమని చెప్తాదామా అని అనగానే.‌. వద్దు ఎవరు చూస్తే ఏంటని భవాని అంటుంది. అయిన మీలో ఆదర్శ్ వచ్చినప్పుడు ఉన్న సంతోషం ఇప్పుడు లేదని రేవతి అడుగుతుంది. అదేం లేదంటూ భవాని కవర్ చేస్తుంది. మరి నువ్వు ఎలా ఉన్నావని రేవతిని భవాని అడుగుతుంది. చూస్తుంటే తెలియడం లేదా చాలా హ్యాపీగా ఉన్నాను. కృష్ణ మురారి ఇద్దరు ఒకటయ్యారు. ముకుంద మారింది ఆదర్శ్ ఇంటికి వచ్చాడు. ఇంకేంటని రేవతికి చెప్తుంది. కృష్ణ, మురారి ఇద్దరు ఆదర్శ్ ని తీసుకొని వచ్చి మంచి పని చేశారు అంటావా అని భవాని అంటుంది. ఎందుకలా అంటున్నావ్ అక్క అని రేవతి ఆశ్చర్యపడుతుండగా.. అదేం లేదని భవాని అంటుంది. ఆ తర్వాత రేవతి వెళ్తు.. అక్క అసలు ఎందుకు అలా అడిగింది.. ఇంకా ముకుంద మారిందని నమ్మడం లేదా అని అనుకుంటుంది. ఆ తర్వాత ఆదర్శ ఒంటరిగా కూర్చొని.. ముకుంద ఎందుకు అలా అబద్ధం చెప్పింది. నేను అంటే ఇష్టం లేకనా లేక నా మీద ఇంకా కోపం తగ్గలేదా.. నాపై ఇష్టం ఉండే కదా.. నన్ను రమ్మని చెప్పింది. నేను సడన్ గా చెయ్యి వేసేసరికి బయపడినట్లు ఉందని ఆదర్శ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఆదర్శ్ దగ్గరికి మధు వచ్చి.. డ్రింక్ చేద్దామని అంటాడు. దానికి సరే అని మధు, ఆదర్శ్ లు డ్రింక్ చేస్తుంటే అప్పుడే సుమలత వచ్చి.. నువ్వు చెడిపోయిందే కాకుండా ఆదర్శ్ ని కూడా చెడగొడుతున్నావా అని మధుని సరదాగా కొడుతుంది. ఆ తర్వాత మురారి రెడీ అవుతు.. ఇన్ని రోజుల తర్వాత ఆదర్శ్ డ్రింక్ చేద్దాం రమ్మని చెప్పాడని కృష్ణని పర్మిషన్ అడుగుదామని అనుకుంటాడు. కృష్ణని అడగ్గానే ఓకే చెప్తుంది. దాంతో మురారి హ్యాపీగా ఫీల్ అవుతు.. కృష్ణకి ముద్దుపెట్టి వెళ్ళిపోతాడు. కాసేపటికి ఆదర్శ్, మధు, మురారి, ప్రసాద్ లు కలిసి డ్రింక్ చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu:కాలేజీలో వాళ్ళిద్దరు మాట్లాడుకునేది సీతాకాంత్, మాణిక్యం చూడగలరా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -7 లో.. మాణిక్యం తన కుటుంబాన్ని తీసుకొని స్నేహితుడి కూతురు ఎంగేజ్ మెంట్ కి వస్తాడు. అక్కడ ఉన్న పెళ్లి కొడుకు.. మా బాస్ వచ్చే వరకు ఆగండి అని చెప్తాడు. ఆ బాస్ ఎవరో కాదు సీతాకాంత్. ఇంటి ముందు వరకు వచ్చి అక్కడ వాతావరణం చూసి వెనక్కి వెళ్లిపోతుంటే పెళ్లి కొడుకు బయటకు వచ్చి మీరు లోపలికి రాకుంటే నేను పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటానని అనడంతో సీతకాంత్ లోపలికి వెళ్తాడు. సీతాకాంత్ లోపలికి వెళ్తాడు కానీ అతను కూర్చొడానికి కూడా ప్లేస్ ఉండదు. దాంతో చిరాకు పడుతుంటాడు. మరొకవైపు మాణిక్యం అతని స్నేహితులు ఒక గదిలో డ్రింక్ చేస్తుంటారు. కిచెన్ లో రామలక్ష్మి మిర్చీలు చేస్తుంటుంది. మా బాస్ కీ కుర్చీ తీసుకొని రండి అనగానే..  సీతాకాంత్ ని రామలక్ష్మి చూడదు. వీళ్ళ బాస్ పని చెప్తానంటూ కుర్చీని విరగ్గొట్టి పంపిస్తుంది. దాంతో విరిగిన కుర్చీ పై కూర్చొని సీతాకాంత్ కిందపడిపోతాడు. ఆ తర్వాత నేను కింద కూర్చొని ఉంటానని సీతాకాంత్ కింద కూర్చుంటాడు. ఆ తర్వాత లడ్డులు సరిపోయేలా లెవ్వని ఒక ఆవిడ రామలక్ష్మికి చెప్తుంది. నేను సరిపెడతానంటూ ఉన్న లడ్డులని పిసుకుతుంటుంది. ఆలా చేయడం సీతాకాంత్ చూస్తాడు కానీ అది చేస్తున్నా రామలక్ష్మి మొహం కనిపించదు. అవి తీసుకొని వచ్చి నాకు ఇస్తారా ఏంటి అనుకుంటు ఉండగా.. అవే తీసుకొని వచ్చి సీతాకాంత్ కి ఇస్తారు. దాంతో సీతాకాంత్ తిననంటాడు.  తినాలని పెళ్లికొడుకు బలవంతం చేస్తాడు. ఆ తర్వాత పెళ్లి కూతురుని చూసి పాపం చిన్నపిల్ల.. వాడి ఏజ్ నలభై తన ఏజ్ ఇరవై అని మేనేజర్ చెప్పగానే.. ఇది నేను చూడలేనంటు సీతాకాంత్ బయటకు వెళ్ళిపోతాడు. అదే సమయంలో పెళ్లి కొడుకుని చూసి.. ఇది నేను చూడలేనంటు రామలక్ష్మి బయటకు వెళ్తుంది. మరుసటి రోజు సిరి కాలేజీకి వెళ్తుంది. ధనతో మాట్లాడలని సెక్యూరిటి వాళ్ళని టాబ్లెట్ తీసుకొని రా అంటూ పంపిస్తుంది. వాళ్ళకి సీతాకాంత్ ఫోన్ చేస్తాడు. బయటకు వచ్చామని చెప్పగానే సీతాకాంత్ కంగారుగా కాలేజీ వస్తాడు. సిరి, ధన ఇద్దరు మాట్లాడుకుంటు ఉంటారు. అదే సమయంలో మాణిక్యం కాలేజీకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

చందమామతో శ్రీసత్య చేసిన వీడియో వైరల్!

చందమామతో ఫోటోషూట్ మాములుగా లేదుగా.. అవును నిజమే. అంజలి పవన్ కూతురు చందమామ చూడటానికి అచ్చం బాపుబొమ్మలా ఉంటుంది. ఆ పాప ఫోటోషూట్ ని ఇన్ స్ట్రాగ్రామ్ లో అప్లోడ్ చేస్తే మిలియన్లలో వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఆ పాపతో బిగ్ బాస్ భామ శ్రీసత్య ఓ ఫోటోషూట్ చేసింది‌. దానికి సంబంధించిన ఓ వీడియోని శ్రీసత్య తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. బిగ్‌బాస్‌ బ్యూటీల్లో అదిరిపోయే గ్లామర్ ఉన్న వాళ్లలో శ్రీసత్య ఒకరు. విజయవాడకు చెందిన శ్రీసత్య.. మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. 2015లో మిస్ విజయవాడగా టైటిల్ విజేతగా నిలిచింది. 'నేను శైలజ', ‘లవ్ స్కెచ్’, 'గోదారి నవ్వింది' వంటి సినిమాల్లో శ్రీసత్య నటించింది. ‘ముద్ద మందారం’ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు అర్జున్ కల్యాణ్‌ను తన వెనక తిప్పుకుంటూ శ్రీసత్య చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇక బయటకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకునే పనిలో పడింది శ్రీసత్య. క్యూట్ ఫొటోషూట్‌లతో నెటిజన్ల హృదయాలకు గాలం వేస్తుంది.  బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తన గ్లామర్ తో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ భామ..  అ తర్వాత మొదలైన 'బిబి జోడీ' డ్యాన్స్ షోలో మెహబూబ్ తో కలిసి ఎన్నో హాట్ డ్యాన్స్ పర్ఫామెన్స్ లు ఇచ్చింది. ఇక తాజాగా జీతెలుగులో మొదలైన 'సూపర్ జోడీ' డ్యాన్స్ షోలో  సాకేత్ తో కలిసి హాట్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసింది. ‌దీంతో శ్రీసత్య మరోసారి వార్తల్లోకి వచ్చేసింది.  బిగ్‌బాస్ భామల్లో చాలా మంది హాట్ షో మీదే ఎక్కువ కాన్సట్రేషన్ చేస్తుంటారు. కానీ శ్రీసత్య మాత్రం ట్రెడిషనల్ లుక్‌లో ఫొటోలు పెడుతూ క్లాసిక్ టచ్ ఇస్తుంది. ఈ మధ్య అయితే వరుసగా శారీ, లెహంగాలో ఈ బ్యూటీ పెట్టిన పిక్స్ బాగా వైరల్ అయ్యాయి. చందమామతో కలిసి కుందనుపు బొమ్మల్లా ఇద్దరు అలా నడిచొస్తుంటే  నెటిజన్లు ఫిధా అయ్యారంతే. చిన్న సినిమాలోని నా అమ్మ నీవేలా.. నా బొమ్మ నీవేలా అనే పాటకి రీల్ చేశారు. సేమ్ డ్రెస్ సేమ్ లుక్స్.. ఇద్దరు పిల్లల్లా అనిపించే ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో ముప్పై ఒక్క మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటింది. 

టేస్టీ తేజకి హార్ట్ ఎటాక్.. అసలేం జరిగిందంటే!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో ఎంతోమందికి పరిచయం అయిన వారిలో టేస్టీ తేజ ఒకడు. ఇతడు చేసే ఫుడ్ వ్లాగ్స్ లో ఫుడ్ టేస్ట్ కంటే సెలెబ్రిటీలు ఇతనికి వేసే పంచులే ఫేమస్ అయ్యాయి. తాజాగా రిలీజైన హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జాతో కలిసి చేసిన ఓ వ్లాగ్ లో టేస్టీ తేజకు పంచుల మీద పంచులు పడ్డాయి. అలా ఏ వ్లాగ్ చేసిన జెన్యున్ అండ్ నేచురల్ డైలాగ్స్ తో సినిమా ప్రేక్షకులకే కాదు ఇన్ స్ట్రాగ్రామ్ ట్రోలర్స్ కి కంటెంట్ ఇస్తుంటాడు టేస్టీ తేజ. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో సీరియల్ బ్యాచ్ అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టిలతో ఎక్కువ సమయం గడిపిన టేస్టీ తేజ.. ప్రస్తుతం వ్లాగ్స్ చేసుకుంటూ ఫేమస్ అవుతున్నాడు. ప్రియాంక జైన్ వాళ్ళ అమ్మకి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ అని తాజాగా ఓ వీడియోని షేర్ చేసింది. అది చూసి ఎంతోమంది తనకి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు తేజతో కలిసి ప్రియాంక జైన్, ఆమె భాయ్ ఫ్రెండ్ శివ్ కలిసి ఓ వీడియోని  బయటకు వదిలారు. అది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ తో పాపులర్ అయిన ప్రియాంక జైన్.. ఇటీవల బిగ్ బాస్ తెలుగు 7 లో సందడి చేసింది. ఇక ప్రియాంక హౌస్ లో ఎంటర్ అయ్యాక.. బీబీ వంటలక్కగా పేరుతెచ్చుకుంది. ఇంట్లోని వారందరికీ తన వంటలతో రుచిచూపించింది. అంతేనా శివంగిలా అన్ని గేమ్స్ లో ఆడుతూ... బిగ్ బాస్ షోలో టాప్ 5 కంటెస్టెంట్స్ లో చోటు దక్కించుకుంది. హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ప్రియాంక తన ఫ్రెండ్ అమర్ దీప్ తో కలిసి ఎక్కువగా ఉండేది. శోభాశెట్టి, ప్రియాంక, అమర్ దీప్ ల గ్రూప్ గేమ్ నచ్చక చాలామంది వీరిపై ట్రోల్స్ చేశారు. ప్రియాంక మీద టేస్టీ తేజ, శివ్ కలిసి ఫ్రాంక్ చేసారు. తేజ ఇంట్లో వంట చేస్తుండగా సడన్ గా గుండెనొప్పి వస్తున్నట్టుగా కిందపడిపోయాడు.‌ అలాగే కిందపడిపోవడంతో ప్రియాంక కంగారు పడింది. వెంటనే శివ్ ని అంబులెన్స్ కి ఫోన్ చేయమని అటుఇటు తిరగింది‌. తనకేం ఏం చేయాలో తెలియక కాళ్ళు చేతులు ఆగట్లేదని ప్రియాంక అంది. అలా కాసేపు ప్రియాంకని ఆటపట్టించాక ప్రాంక్ చేసామని చెప్పారు. దాంతో ప్రియాంక.‌. ఇలాంటి విషయాల్లో ప్రాంక్ చేస్తారా అంటూ సీరియస్ అయింది‌. ఇదంతా ప్రియాంక జైన్ తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.  

రతిక పాప అలా‌ నిల్చుంది అంతే.. వైరల్ అయ్యిందిగా!

ఇన్ స్టాగ్రామ్ లో క్యూట్ పిక్స్ కంటే హాట్ పిక్స్ కే డిమాండ్ ఎక్కువ. పద్దతిగా చీరలు కట్టుకొని కొందరు సెలెబ్రిటీలు ఫోటోలు అప్లోడ్ చేస్తే వాటికి కనీసం వంద, రెండొందల లైకులు కూడా రావు. కానీ అదే ఓ నిక్కర్, జాకెట్ వస్తే ఎక్కడి లేని లైకులు, కామెంట్లు వచ్చి పడతాయి. నిన్న మొన్నటిదాకా పద్దతిగా ఫోటోలు పెట్టిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ రతికరోజ్.. ఇప్పుడు రూటు మార్చింది. హాట్ అండ్ బోల్డ్ ఫోటోషూట్ తో వైరల్ గా మారింది. 'పటాస్' షోలోకి వచ్చి స్టాండప్‌ కమెడియన్‌గా సందడి చేసిన రతిక.. తనదైన కామెడీతో అలరించింది. ఆ తర్వాత కూడా పలు షోలలో కనిపించి మంచి పేరును తెచ్చుకుంది. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది' అనే సినిమాతో వెండితెరపైకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 'మారూ', 'నారప్ప', 'అశోక వనంలో అర్జున కళ్యాణం', 'నేను స్టూడెంట్ సార్', 'భగవంత్ కేసరి' వంటి చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే కొన్నింట్లో హీరోయిన్‌గానూ మెప్పించింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో టైటిల్ ఫేవరెట్ గా ఎంట్రీ ఇచ్చిన రతిక మొదట్లో అందరికంటే ఎక్కువ తెలివిగల అమ్మాయిలా ఆడింది. ఆ తర్వాత హౌస్ లో రోజులు గడిచేకొద్దీ తన ఆటతీరు, మాటతీరు జనాలకి నీరసం తెప్పించాయి. అటు పల్లవి ప్రశాంత్, ఇటు ప్రిన్స్ యావర్ లతో లవ్ ట్రాక్ నడిపి బిగ్ బాస్ హౌస్ లో 'బేబీ' సినిమాని రిక్రియేట్ చేసింది. బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది రతిక. ముఖ్యంగా తన హాట్ ఫొటోలు, వీడియోలను ఇన్ స్ట్రాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ కుర్రకారును కవ్విస్తుంది. ఫలితంగా రతికరోజ్ నిత్యం ట్రెండింగ్ అవుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోతోంది. తాజాగా తన ఇన్ స్ట్రాగ్రామ్ లో వైట్ డ్రెస్ లో అలా నిల్చుంది అంతే.. కామెంట్లతో నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.

అండర్ వేర్ ఇచ్చి నవీన్ చంద్రకు ప్రపోజ్ చేసిన అమ్మాయి

సిల్వర్ స్క్రీన్ మీద "అందాల రాక్షసి" మూవీతో నవీన్ చంద్ర ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఈ మూవీ హిట్ కొట్టేసరికి అతనికి ఎంతో మంచి పేరు వచ్చింది. అలాగే లవర్ బాయ్ ఇమేజ్ తో ఎంతో మంది ఫాన్స్ ని కూడా  సంపాదించుకున్నాడు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో నవీన్ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. హీరోగానే చేయాలి అని కాకుండా ఏ పాత్రైనా చేయడానికి రెడీ అయిపోవడంతో నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నాడు నవీన్ చంద్ర. ఇక రీసెంట్ గా "మంత్ ఆఫ్ మధు" మూవీలో స్వాతితో కలిసి నటించాడు. అలాంటి నవీన్ చంద్రకి ఒక అమ్మాయి అండర్ వేర్ ఇచ్చి మరీ ప్రొపోజ్ చేసిందట. ఆ విషయాల గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.  హోస్ట్ రీతూ చౌదరి అడుగుతూ "వాచ్ ఇచ్చో, ఫ్లవర్స్ ఇచ్చో ప్రపోజ్ చేస్తారని తెలుసు కానీ మీకు ఎవరో అమ్మాయి అండర్ వేర్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేసిందట నిజమేనా ?" అనేసరికి "అండర్ వేర్ ఇస్తే పర్లేదు కానీ చాలా ఇచ్చారు. నేను అందాల రాక్షసి మూవీ హిట్ కొట్టాక కొంత అమౌంట్ కూడబెట్టుకుని నేను వైట్ కలర్ స్విఫ్ట్ కార్ కొనుక్కున్నాను. ఆ కార్ నాది అని తెలిసి లిప్ స్టిక్ తో కార్ మీద సూర్య అని రాసి ఫ్లవర్స్, అండర్ వేర్ ఇచ్చి , మోకాళ్ళకు పెట్టుకునే నీ-క్యాప్, ఇంకోటి కూడా ఇచ్చారు. దాన్ని చెప్పకూడదు కానీ మెడికల్ షాప్ లో దొరుకుతుంది" అంటూ ఇండైరెక్ట్ గా కండోమ్ అంటూ హింట్ ఇచ్చేసాడు. "ఇవన్నీ ఇవ్వడం వలన నేను ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. నాకు పురాతన ఆలయాలు అంటే చాలా ఇష్టం..అక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నాకు బాలయ్య అంటే చాలా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. ఇదివరకు బాగా స్మోక్ చేసేవాడిని కానీ ఇప్పటికి ఏడేళ్లయ్యింది ఆపేసి..మీరెవరూ కూడా స్మోక్ లాంటిది అస్సలు చేయొద్దు." అంటూ ఎన్నో విషయాలు చెప్పాడు నవీన్ చంద్ర.

ఆ దరిద్రులు చేసే నెగెటివ్ కామెంట్లను పట్టించుకోను!

ఇన్ స్టాగ్రామ్ లో ఎందరో సెలెబ్రిటీలు తమ‌ పర్సనల్ ఫోటోలని షేర్ చేస్తుంటారు. టూర్స్, ట్రావెలింగ్ అంటూ వాళ్ళు వెళ్ళిన చోటల్లా దిగిన వాటిని మెమరీలా చూసుకోడానికి అలా వాళ్ళు చేస్తుంటే కొంతమంది నెటిజన్లు మాత్రం నెగెటివ్ కామెంట్లు చేస్తుంటారు. అలాంటివారిని ఉద్దేశించి బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ కొన్ని వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో 2.0 లో గ్రాంఢ్ గా ఎంట్రీ ఇచ్చిన అశ్వినిశ్రీ.. హౌస్ లో ఉన్నన్ని రోజులు తన పరిధిలో తను ఉంటూ ప్రేక్షకులకి ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చింది. నామినేషన్ లో భోలేని హీరో అనడంతో హౌస్ లో నవ్వులు పూసాయి. ఇక సీరియల్ బ్యాచ్ లోని ప్రియాంక. శోభాశెట్టిలతో వాదనలు హైలైట్ ఆఫ్ ది వీక్ గా నిలిచాయి. హౌస్ లో ఎక్కువగా భోలే షావలితో ఉన్న అశ్వినిశ్రీ.. ఓ నామినేషన్ లో ఎవరిని నామినేట్ చేయకుండా సెల్ఫ్ నామినేషన్ అయింది. దాంతో‌ తను ఎలిమినేషన్ అయింది. ‌బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసింది అశ్విని. అందులో తన క్రిస్మస్ సెలెబ్రేషన్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్, కజకిస్తాన్ టూర్ వ్లాగ్, భోలేతో బోల్డెన్ని కబుర్లు అంటు వ్లాగ్స్ చేయగా వాటికి విశేష స్పందన లభిస్తోంది.  అశ్వినిశ్రీ ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మి క్వశ్చనింగ్ మొదలెట్టింది‌. ఇందులో పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.  యావర్ అంటే నీకు క్రష్ ఆ అని ఒకరు అడుగగా.. లేదండి, యావర్ నాకు క్లోజ్ ఫ్రెండ్‌‌‌‌. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తను నేను బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నామని అశ్విని అంది. నేను కర్నాటక నుండి మీకు నేను పెద్ద ఫ్యాన్ .. మీరు హౌస్ లోకి ఎంట్రీ అయినప్పటి నుండి ప్రతీ ఎపిసోడ్ చూసాను మనం ఒకసారి కలుద్దామా అని ఒకరు అడుగగా‌‌‌.‌. భాష అర్థం కాదు కదా ఎలా మేనేజ్ చేశారు. థాంక్స్ సో మచ్ అని అశ్విని రిప్లై ఇచ్చింది. రాజమండ్రి వచ్చినప్పుడు కాస్త మెన్షన్ చేయండి.  మా బాధ మీకు తెలుసా అని ఒకరు అడుగగా.. ఓ థాంక్స్ ఐ లవ్ రాజమండ్రి. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తానని అశ్వినిశ్రీ రిప్లై ఇచ్చింది.  మీ పోస్ట్ లకి చాలా నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి కదా వాటి మీద మీ రియాక్షన్ ఏంటని అడుగగా.. ఏదైన పోస్ట్ చేసిన తర్వాత కామెంట్లని అస్సలు చదవను. ఎందుకంటే నాకంత టైమ్ ఉండదు. నెగెటివ్ కామెంట్లని పట్టించుకోను. కొంతమంది దరిద్రులు అలా నెగెటివ్ కామెంట్లు చేస్తుంటారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎలా పెంచారో తెలిసిపోతుంది. ఎంత బ్యాడ్ గా కామెంట్ చేసిన నేను అసలు చూడను... పట్డించుకోనని అశ్వినిశ్రీ అంది. మీ కార్ డ్రైవింగ్ కి ఏం అయిన ఖాళీ ఉంటే చెప్పండి మేడమ్. మనీ లేకుండా చేస్తాను. ఎందుకంటే నేను మీకు బిగ్ ఫ్యాన్ ని అని అడుగగా.. నో వే ఐ లవ్ డ్రైవింగ్ అని రిప్లై ఇచ్చింది.  ఇలా కొన్ని ప్రశ్నలకి సమాధానమిచ్చింది అశ్వినిశ్రీ. ఎప్పుడు హాట్ ఫోటోస్ తో  ట్రెండింగ్ లో ఉండే ఈ భామ‌ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. 

సోహైల్ కోసం సుమ, ప్రేమ్ రక్షిత్ అలా చేశారట

ఈ వారం సుమ అడ్డా ఎంటర్టైన్మెంట్ షోకి బూట్ కట్ బాలరాజు మూవీ టీమ్ వచ్చి ఎంటర్టైన్ చేసింది. ఇందులో సోహైల్ ని ఫస్ట్ టాస్క్ ఆడించింది సుమ. ఆ టైంలో సోహైల్ సుమ చేసిన ఒక మంచి పని గురించి చెప్పాడు. సందర్భం వచ్చింది కాబట్టి తన మనసులో మాట బయట పెట్టాలనుకున్నట్టు చెప్పుకొచ్చాడు.  "నా బూట్ కట్ బాలరాజు మూవీ ప్రమోషన్స్ కోసం నేను సుమక్క వాళ్ళ మేనేజర్ కి ఫోన్ చేసి నేను అంత డబ్బులు ఇచ్చుకోలేను కొంత తగ్గించమని అడిగాను. సరే అని అడిగి చెప్తాను అన్నారు. తర్వాత అక్క నాకు కాల్ చేసింది. అప్పుడు అక్కా.. నా దగ్గర అంత అమౌంట్ లేదు. కొంతే ఇద్దామనుకుంటున్నా ఎందుకంటే నేను ప్రొడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నా సినిమా..చాలా కష్టపడ్డాను అని అడిగాను. అరేయ్ నేను నీ దగ్గర డబ్బులు తీసుకోను నా కొడుకుకు నేను ఎంతగా ప్రమోషన్ చేసానో అదంతా నాకు తెలుసు. లైఫ్ లో ఎదిగి ఇంత పేరు సంపాదించుకున్నది ఎందుకు, మీలాంటి వాళ్లకు ఉపయోగపడాలి అని చెప్పి నాకు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఫ్రీగా చేసి పెడతాను అన్నారు. థాంక్యూ సో మచ్ అక్కా..ఈ విషయాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను...అలాగే ఈ సినిమాలో బూటుబూటు బూట్ కట్ బాలరాజు అనే సాంగ్ ని ప్రేమ్ రక్షిత్ మాష్టర్ ఫ్రీగా చేసి పెట్టారు. ఒక స్థాయికి వచ్చాక ఒకరికి ఉపయోగపడకపోతే ఇంకెందుకు అంటూ ఫ్రీగా చేశారు. ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా పెద్ద కాంపిటీషన్ నడుస్తోంది. మీరంతా అనుకుంటున్నట్టు మాది కలర్ ఫుల్ లైఫ్ కాదు..బ్లాక్ అండ్ వైట్ లైఫ్.. మీ సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్లగలుగుతాం..లేదంటే లేదు" అంటూ సుమా కాళ్లకు వంగి దణ్ణం పెట్టుకున్నాడు సోహైల్. బూట్ కట్ బాలరాజు ప్రమోషన్స్ లో భాగంగా ఈ షోలో ఈ టీం పార్టిసిపేట్ చేసింది.

Prince Yawar : బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ టైమ్ యావర్ ని కలిసాను!

తెలుగు టీవీలో ప్రసారమయ్యే టీవీ షోస్, రియాలిటీ షోస్ లలో బిగ్ బాస్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది.  ఎంతోమంది చిన్న చిన్న సెలెబ్రిటీల నుండి పెద్ద స్థాయికి వెళ్ళినవారున్నారు. బిగ్ బాస్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్నవారిలో యావర్ కూడా ఒకడు.  బిగ్ బాస్ సీజన్-7 మొదలవ్వడమే ఉల్టా పల్టాగా మొదలైంది‌. ఇందులో మొదటగా పదమూడు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా అందులో ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్ ముగ్గురు కలిసి స్పై బ్యాచ్ గా కలిసి ఉన్నారు.  హౌస్ లో ఉన్నన్ని రోజుల్లో యావర్ కి మొదట భాష ప్రాబ్లమ్ అవ్వగా.. మెల్లి మెల్లిగా శివాజీతో చేసిన స్నేహం అతడిలోని మంచివాడిని ప్రపంచానికి పరిచయం చేసింది. హౌస్ లో మొదటగా ఎవరేమన్నా అగ్రెసివ్ గా ఉండే యావర్ లో ప్రశాంత్, శివాజీ కలిసాక మార్పు మొదలైంది‌. ఏదైన మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడటం నేర్చుకున్నాడు. స్నేహంగా ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకున్నాడు యావర్. సీజన్ సెవెన్ ముగిసాక ప్రశాంత్ జైలులో ఉన్నప్పుడు తన మద్దతుని తెలిపి అండగా నిలిచాడు. ఆ తర్వాత శివాజీ, భోలే షావలి, ప్రశాంత్ లతో కలిసి విందు భోజనం చేశాడు యావర్. ఇక ఈ మధ్యే రిలీజైన 'గుంటూరు కారం' సినిమాలోని ' ఆ కుర్చీని మడతబెట్టి' సాంగ్ కి నయని పావనితో కలిసి యావర్ చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటింది‌. ఇక ఇప్పుడు తాజాగా తన ఫ్రెండ్ ఇమ్మాన్యుయల్ ని కలిసాడు యావర్.  జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో ఇమ్మాన్యుయల్ ఒకడు. బిగ్ బాస్ హౌస్ లో యావర్  ఉన్నప్పుడు అతడికి ఫ్రెండ్ గా స్టేజ్ మీదకి ఇమ్మాన్యుయల్ వచ్చాడు. ఇక ఇమ్మాన్యుయల్ తన యూట్యూబ్ ఛానెల్ లో 'బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ టైమ్ యావర్ ని కలిసాను' అనే వ్లాగ్ ని చేశాడు. 'గంగం గణేషా' సినిమాలో వీళ్ళిద్దరు కలిసి నటించారని, యావర్ కి భాష ప్రాబ్లమ్ కావడంతో అతడిని ఓ నిక్ నేమ్ తో పిలిచేవారిమని, అది బాగుందని డైరెక్టర్ ఆలోచించి దానిని సినిమాలో డైలాగ్ గా  వాడుకున్నాడని ఇమ్మాన్యుయల్ ఈ వ్లాగ్ లో చెప్పుకొచ్చాడు. ఇక తనకి బెస్ట్ ఫ్రెండ్ ఇమ్మాన్యుయలే అని చెబుతూ లవ్ యూ బ్రో అని చెప్పేసాడు యావర్.

ఆ మాణిక్యాన్ని సీతాకాంత్ చూడగలడా.. రామలక్ష్మి పెళ్ళి జరిగేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  'ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -6లో.. రామలక్ష్మి భోజనం చేయబోతు ఆగిపోతుంది. కొంతమంది తాగుబోతులు తన మీద చెయ్యి వేస్తూ అల్లరి చేసిన విషయం గుర్తుకు చేసుకొని బాధపడుతుంటే.. ఏమైందని వాళ్ళ అమ్మ అడుగుతుంది. దాంతో ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్తుంది. తన బాధ చూడలేక వాళ్ళ అమ్మ బాధపడుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో అవి సహజం. దానికే ఏడవాల అని మాణిక్యం అంటాడు. నీకెందుకు క్యాబ్? ఏదైనా సూపర్ మార్కెట్ చూసుకోమని ధన అంటాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ కోపంగా.. మీకోసం కష్టపడి సంపాదిస్తుంటే మీకేం తెలుస్తుందని వాళ్లపై అరుస్తుంది. ఇక నిన్ను ఎవరు పట్టించుకోరు.. నేనే ఏదో ఒకటి చేసి నీకు కష్టం లేకుండా చూడాలి. మీ నాన్నకి బుద్ధి వచ్చేలా నీ బతుకుని దారిలో పెడతానని వాళ్ళ అమ్మ అంటుంది. మరొకవైపు సిరి తన అన్నయ్య సీతాకాంత్ దగ్గరికి వచ్చి.. నువ్వు ఇంతవరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అన్నయ్య అని అడుగుతుంది. మనం చాలా కష్టాల్లో ఉన్నాం. మీరు చిన్నగా ఉన్నారు జీరో నుండి మొదలై ఇప్పటి వరకు సాధించాను. ఈ బాధ్యతలో పెళ్లి అనే ఆలోచన రాలేదని సీతాకాంత్ అంటాడు. అతను వెళ్ళిపోయాక మాకోసం ఇంత చేస్తావ్ కదా.. నీకు పెళ్లి చేస్తాం.. నాకు కాబోయే వదినమ్మ ఎక్కడుందో వెతుకుతానని సిరి అనుకుంటుంది. ఆ తర్వాత మాణిక్యానికి తెలియకుండా రామలక్ష్మి వాళ్ళ అమ్మ రామలక్ష్మికి పెళ్లి చూపులు అరెంజ్ చేస్తుంది. అబ్బాయి వాళ్ళు వచ్చి.. మాకు అమ్మాయి నచ్చిందని చెప్తారు. అప్పుడే మాణిక్యం వచ్చి వాళ్ళ ముందే తాగుతు వాళ్ళని బయటకు గెంటేస్తాడు. ఏం చేస్తున్నారని అతని భార్య అడుగుతుంది. నా కూతురికి పెళ్లి చెయ్యను.. ఇప్పటికీ.. ఎప్పటికి అని స్వార్థంగా మాట్లాడతాడు. దానికి పెళ్లి చేస్తే మీకు కష్టం చేసి డబ్బులు ఎవరిస్తారు అనే కదా అని అతని భార్య తిడుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి తన అమ్మ ఒడిలో పడుకొని బాధపడుతుంది. మరుసటిరోజు మాణిక్యం తన ఫ్యామిలినీ తీసుకొని తన స్నేహితుడి కూతురి ఎంగేజ్ మెంట్ కి వెళ్తాడు. అక్కడ పెళ్లి కొడుకు ని చూసి రామలక్ష్మి తన చెల్లెలు నవ్వుకుంటారు కానీ మాణిక్యం మాత్రం మంచి అల్లుడిని తీసుకొని వచ్చావని అంటాడు. ఆ తర్వాత మా సర్ వచ్చేవరకు ఆగండి అని పెళ్లి కొడుకు అంటాడు.  ఆ సర్ ఎవరో కాదు సీతాకాంత్.. అతను వచ్చి వాళ్ళ ఇంటి ముందు వరకు వస్తాడు. ఆ పెళ్ళికి వచ్చిన మాణిక్యాన్ని సీతాకాంత్ చూస్తాడా? రామలక్ష్మి, సీతాకాంత్ ఒకరినొకరు చూసుకోగలరా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Krishna Mukunda Murari : ముహుర్తాలు లేవని చెప్పిన పంతులు.. ఆదర్శ్ ఆ నిజాన్ని అందరికీ చెప్పేస్తాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -378 లో... కృష్ణ, మురారి ఇద్దరు పై నుండి కిందకి వస్తుంటే నందు వాళ్ళని చూసి నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావని కృష్ణ అడుగుతుంది. ఇందాక నీ గురించి మధు ఒకటి అన్నాడు. అది గుర్తుకు వచ్చి నవ్వుతున్నానని నందు చెప్తుంది. ఏమన్నావని మధుని కృష్ణ అడుగుతుంది. ఈ ప్రపంచంలో కృష్ణ లాగా ఎవరు ఉండలేరని అన్నానని మధు చెప్తాడు. అవును ఈ తింగరిలాగా ఎవరు ఉండలేరు.. ఉండరని మురారి కూడా అంటాడు. నేను కూడా సీరియస్ గా ఉంటానని కృష్ణ అంటుంది. కాసేపు నువ్వు భవాని పెద్దమ్మలాగా ఉండని అనగానే ఉంటానని కృష్ణ సీరియస్ ఫేస్ పెట్టి కూర్చొని ఉంటుంది. అప్పుడే భవాని వచ్చి.. కృష్ణ కాఫీ తీసుకొని రమ్మని చెప్తుంది. అయిన తను సీరియస్ గా ఉంటుంది. ఏంటి అలా ఉన్నావని కృష్ణని అడిగినా సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. ఏమైంది కృష్ణని ఎవరైనా ఏమైనా అన్నారా  అని భవాని అడుగుతుంది. ఏం లేదు పెద్దమ్మ కృష్ణ మీలాగా సీరియస్ గా ఉంటానని ఛాలెంజ్ చేసిందని మురారి చెప్పగానే.. అంటే నేను అలా ఉంటానా.. ఒకరిలాగా ఉండడం ఎందుకు. నువ్వు నీలా ఉండు.. నువ్వు ఎప్పటికి తింగరివే కానీ. వెళ్లి కాఫీ తీసుకొని రా అని కృష్ణకి భవాని చెప్తుంది. ఆ తర్వాత పంతులు గారు వచ్చి ముహూర్తం పది రోజుల వరకు బాలేదని చెప్తాడు. పది రోజులు టైమ్ ఉంది. ఈ లోపు ఏదైనా ప్లాన్ చెయ్యొచ్చని ముకుంద అనుకుంటుంది. దానిదేముంది ఇన్ని రోజులు ఆగాం.. పది రోజులు ఆగలేమా అని భవాని అంటుంది. ఆ తర్వాత పంతులికి మధు డబ్బులు ఇచ్చి పంపిస్తుంటే ముహూర్తాలు ఉన్నాయి కదా.. భవాని గారు ఎందుకు ఇలా చెప్పమన్నారని పంతులు అనుకుంటాడు. ఆ తర్వాత ఆదర్శ్ గురించి ముకుంద ఆలోచిస్తుంటే.. ఆదర్శ్ వెనకాల నుండి వచ్చి ముకుందపై చెయ్యి వేస్తాడు. దాంతో ముకుంద భయపడి గట్టిగా అరుస్తుంది.  ఆ అరుపుకి అందరు బయటకు వచ్చి.. ఏమైందని అడుగుతారు. ఇప్పుడు నాపై చెయ్యి వేస్తే అరిసానని చెప్తే ఆదర్శ్ అంటే ఇష్టం లేదా అని అత్తయ్య కన్ఫమ్ అయిపోతుందని ముకుంద అలోచించి.. మేమ్ ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే పై నుండి తొండ పడిందని ముకుంద అందరికి చెప్తుంది. అందరు వెళ్ళిపోయాక సారీ అలా చెప్పినందకని ఆదర్శ్ కి ముకుంద సారీ చెప్తుంది. అలా చెప్పి మంచి పని చేసావని ఆదర్శ్ అంటాడు. నీకు ఎలా చెప్పాలి నా ప్రేమ మురారికి తప్ప ఎవరికీ లేదని.. నేను అందరిని మోసం చేస్తున్నానని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. తరువాయి భాగంలో ఆదర్శ్, ప్రసాద్ మురారి, మధు కలిసి డ్రింక్ చేస్తుంటారు. అసలు తొండపడితే ముకుంద అంత గట్టిగా అరుస్తుందా అని మధు అనగానే.. ఎక్కడ ఆదర్శ్ చెప్పేస్తాడేమోనని కృష్ణ దగ్గరకి ముకుంద వెళ్లి అందరు డ్రింక్ చేస్తున్నారని చెప్పి.. వాళ్ళ దగ్గరకి‌ కృష్ణని తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu : రిషి కోసం కాపుకాసిన ఆ దుండగలు.. ఆ ఐడియా తనదేనంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -984 లో.. ఆ రిషి ఫెస్ట్ కి వస్తున్నాడు మమ్మీ. నువ్వు కూడా ఇక్కడికి రా.. టెన్షన్ గా ఉందని దేవయానిని శైలేంద్ర రమ్మని చెప్తుండగా.. అప్పుడే మహేంద్ర వచ్చి ఫోన్ లాక్కొని రండి వదిన గారు.. రిషి వస్తున్నాడంటు వెటకారంగా మాట్లాడతాడు. రిషి వస్తున్నాడు ఈ రోజు శైలెంద్ర చేసిన కుట్రలు, మోసాలు బయటపడుతాయి. వాడిని పోలీసులు తీసుకొని వెళ్తుంటే మీరు చూడాలని మహేంద్ర అంటాడు. దేవయానికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఆ తర్వాత ఈ రోజు నీ ముసుగు తొలగిపోతుంది. నీ నిజస్వరూపం బయటపడుతుంది. ఎంత నటిస్తావ్ రా.. ఎన్ని షేడ్స్ ఉన్నాయిరా నీలో.. మీ నాన్న ముందు అమాయకుడిలా.. రిషి ముందు మంచోడిలా.. మా ముందు క్రూరుడిలాగా ఉన్నావ్. ఇక నీ ఆటలు సాగవని శైలేంద్రకి మహేంద్ర వార్నింగ్ ఇస్తాడు. కాలేజీలో జరిగే ఫెస్ట్ కి అతిధిగా మినిస్టర్ వస్తాడు. అతనికి వసుధార, మహేంద్ర, ఫణింద్ర కలిసి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్తారు. ఆ తర్వాత రిషి వస్తున్నాడట కదా అని వసుధారని  మినిస్టర్ అడుగుతాడు. అవునని వసుధార చెప్పగానే చాలా సంతోషంగా ఉంది.. రిషి లాంటి గొప్ప మనిషి వస్తేనే ఈ ఫెస్ట్ కి కంప్లీట్ నెస్ వస్తుందని మినిస్టర్ అంటాడు. ఆ తర్వాత చక్రపాణికి వసుధార ఫోన్ చేసి.. రిషి సర్ ఏం చేస్తున్నారు.. వస్తున్నారా అని అడుగుతుంది. వస్తున్నాం కానీ ఇప్పుడు రిషి సర్ అక్కడికి ఎందుకని చక్రపాణి అడుగుతాడు. ఇప్పుడు రావాలి తన సామ్రాజ్యంలో అడుగుపెట్టాలి. తన స్టూడెంట్స్తో మాట్లాడాలని వసుధార చెప్తు.. మీరు రిషి సర్ ని తీసుకొని రండి అని చెప్తుంది. ఆ తర్వాత రాజీవ్ కి శైలేంద్ర ఫోన్ చేసి.. రిషి వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కున్నావా అని అడుగుతాడు. మీరు టెన్షన్ పడకండి. నేను తెలుసుకుంటానని రాజీవ్ అంటాడు. ఆ తర్వాత కాలేజీలో మినిస్టర్ గారికి సన్మానం చేస్తారు. అతను రిషి, వసుధారల గురించి గొప్పగా మాట్లాడుతాడు. రిషి ఎక్కడ వరకు వచ్చాడని వసుధారని మహేంద్ర అడుగుతుంటే అది శైలేంద్ర విని భద్రకి ఫోన్ చేసి.. రిషి వాళ్ళు ఎక్కడైన కన్పించారా అని అడుగుతాడు. లేదు వెయిట్ చేస్తున్నానని భద్ర అంటాడు. ఆ తర్వాత ఇక అన్ని నిజాలు తెలిస్తే శైలేంద్ర పరిస్థితేంటని దేవయాని భయపడుతుంది. అప్పుడే దేవయాని దగ్గరికి ధరణి  వచ్చి.. రిషి వస్తే అన్ని నిజలు తెలిస్తే మీ పరిస్థితేంటని ఆలోచిస్తున్నార అని అడుగుతుంది. వాడికి అసలు ఆ రిషి వస్తున్నాడని ఫ్లెక్సీ వేయించమని ఐడియా ఇచ్చింది ఎవరోనని దేవయాని అనగానే.. నేనే ఇచ్చానంటు ధరణి అంటుంది. ఆ తర్వాత ధరణి హ్యాపీగా.. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటు పాట పాడుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: అత్తని ఆడుకున్న కోడలు.. వంటింటి నుండి కావ్య ఆఫీస్ కి వెళ్ళగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -317 లో.. తోటికోడళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటు ఉంటే అది చూడలేని ఇందిరాదేవి.. అందరి ముందు కాకుండా బయటకు తీసుకొని వెళ్లి మందలిస్తుంది. ఎవరో చెప్పుడు మాటలు విని మీరు ఇలా అవుతున్నారు. ఈ ఇంట్లో ఎవరు ఎవరిని తక్కువగా చూడడం లేదు. అది గుర్తు పెట్టుకొని మసులుకోండి. ఇలా గొడవపెట్టుకొని మీ కోడళ్ళకి ఏం నేర్పాలని అనుకుంటున్నారు. ఇక మీదట మీరు గొడవపడితే బాగుండదంటు అపర్ణ, ధాన్యలక్ష్మిలకి వార్నింగ్ ఇస్తుంది ఇందిరాదేవి. ఆ తర్వాత అక్క సారీ అని ధాన్యలక్ష్మి చెప్పగానే.. నేను ఎవరి జోలికి పోను అంటు కోపంగా అపర్ణ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కాసేపటికి టాబ్లెట్స్ తీసుకొని రమ్మని రుద్రాణికి స్వప్న చెప్పగానే.. తను టాబ్లెట్స్ తీసుకొని వస్తుంది. వాటిని చూసి స్వప్న ఫోటో తీసుకొని ఒక వీడియో రికార్డు చేస్తుంది. నా పేరు స్వప్న వీళ్ళు నా అత్త, నా భర్త. కడుపుతో ఉన్న నాకు టాబ్లెట్ తీసుకొని రమ్మని చెప్తే వీళ్ళు ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ తీసుకొని వచ్చి.. నన్ను చంపాలని చూస్తున్నారని చెప్పి వీడియో రికార్డు చేస్తుంది. ఇది ఇంట్లో వాళ్లకి చూపిస్తాను. పోలీసులకి, మీడియావాళ్లకి చూపిస్తానని చెప్పగానే.. రాహుల్ రుద్రాణి ఇద్దరు భయపడి.. నేను చూసుకోకుండా తీసుకొని వచ్చానని రాహుల్ అంటాడు. ఇంకోసారి ఇలా జరగదని స్వప్న కిందకి వెళ్లి ఇంట్లో వాళ్లకి చెప్పకుండా రుద్రాణి, రాహుల్ ఇద్దరు రిక్వెస్ట్ చేస్తారు. సరే ఈ ఒక్కసారి క్షమిస్తున్న అంటు స్వప్న చెప్తుంది. ఆ తర్వాత  ఏం టిఫిన్ చేయాలని అపర్ణని కావ్య అడుగగా.. పెసరట్టు చేయమని అపర్ణ చెప్తుంది. అప్పుడే ధాన్యలక్ష్మి వచ్చి ప్రకాష్ తో మాట్లాడుతుంది. ఇక నుండి మన టిఫిన్ నేనే ప్రిపేర్ చేస్తానని ధాన్యలక్ష్మి అనగానే ప్రకాష్ భయపడుతు.. నువ్వా? వద్దని అంటాడు. నేను చేస్తానని ధాన్యలక్ష్మి చెప్తుంది. నువ్వు వెళ్లి పెసరట్టు చెయ్ ఇష్టం ఉన్నవాళ్ళు తింటారని కావ్యకి అపర్ణ చెప్తుంది. అదంతా పైనుండి చూస్తున్న రాజ్, కళ్యాణ్  ఇద్దరు.. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారని అనుకుంటారు. మా అమ్మ ఏం చేసినా.. నేను వదిన చేసిన టిఫినే తింటానని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత టిఫిన్ రెడీ చేస్తున్న కావ్య దగ్గరికి కళ్యాణ్ వచ్చి.. ఇప్పుడు మీకు ఒక మంచి ఛాన్స్. ఇప్పుడు అమ్మ, పెద్దమ్మ గొడవ పెట్టుకుంటున్నారు కదా.. ఇదే అవకాశంగా తీసుకొని ఇప్పుడు నువ్వు ఆఫీస్ కి వెళ్లొచ్చా అని అడుగమని అంటాడు. దానికి కావ్య వద్దని అంటుంది. మీకేం తెలియదంటు ధాన్యలక్ష్మికి వినపడేలా  కావ్య, కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. మీరు రేపటి నుండి ఆఫీస్ కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారా అని కళ్యాణ్ అంటాడు. అవును, ఫిక్స్ అయ్యాను. ఎన్ని రోజులు వంటింటికి పరిమితమై ఉంటాను.. ఇంట్లో వాళ్ళు ఏం అన్నా వెళ్తానని కావ్య అంటుంది. నా కొడుకుని అమాయకుడిని చేసి ఈ కావ్య ఆఫీస్ కి వెళ్తుందా? ఎలా వెళ్తుందో నేను చూస్తానని ధాన్యలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సీరియల్స్ చేసుకుంటాం బిగ్ బాస్ వద్దు!

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రతీ వారం ఎంతో ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది.  రేపు ప్రసారం కాబోయే ప్రోమోని రిలీజ్ అయ్యింది. ఇందులో సీరియల్ స్టార్స్ వెర్సెస్ బిగ్ బాస్ స్టార్స్ మధ్య కాంపిటీషన్ పెట్టింది శ్రీముఖి. ఇక సుహాసిని, ప్రేరణ, నాగపంచమి సీరియల్ హీరో పృద్వి  శెట్టి వచ్చారు. ఇక శ్రీముఖి ఒక ప్రశ్న వేసింది "ప్రేరణా ఎప్పుడైనా బిగ్ బాస్ కి వెళ్లాలనిపించిందా" అని. "అనిపిస్తుంది..ఛాన్స్ వస్తే వెళ్తా" అంది ప్రేరణ. "బిగ్ బాస్ కి వెళ్తావా వెళ్ళవా" అంటూ సుహాసినిని అడిగింది "వెళ్తానో లేదో తెలీదు, కానీ వెళ్లాలని ఉంది, వెళ్ళకూడదు అని కూడా ఉంది" అని ట్విస్టింగ్ ఆన్సర్ చెప్పింది. "పృద్వి నీకు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లాలని ఉందా" అని అడిగింది శ్రీముఖి. "నాకు బిగ్ బాస్ ని హోస్ట్ చేయాలని ఉంది" అని చెప్పాడు. ఆ ఆన్సర్ కి అందరూ షాకయ్యారు. "నాగార్జున గారు మీ సీటుకే బొక్కేట్టాడండి" అంటూ శ్రీముఖి లైవ్ లో నాగార్జునకు వినిపించేలా అరిచి మరీ చెప్పింది. తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ స్టేజి మీదకు వచ్చారు. "బిగ్ బాస్ హౌస్ ఆ సీరియల్స్ ఆ" అని శోభా శెట్టిని అడిగింది శ్రీముఖి... "సీరియల్సే" అని బిగ్ బాస్ వద్దు అన్నట్టుగా దణ్ణం పెట్టి చెప్పింది. "సీరియల్సా బిగ్ బాసా" అని అంబటి అర్జున్ ని అడిగేసరికి "రెండు కావాలి" అని కైపుగా చెప్పాడు..."ఎప్పుడూ రెండే రెండే అంటే ఎలారా అయ్యేది" అంది శ్రీముఖి నవ్వుతూ. ఇక ఈ షోలో అందరూ వాళ్ళ వాళ్ళ ఫేసెస్ ని బొమ్మలుగా గీసి చూపించారు. ఇక చివరిలో ఒక మ్యాజిక్ షో జరిగింది. రవికృష్ణ ఒక చిన్న బ్యాగ్ ఇచ్చి శ్రీముఖికి లవ్ ప్రొపోజ్ చేసాడు. ఐతే ఆ బాగ్ లో ఏముందో చూడాలి అంటూ మేజిక్ చేసిన వ్యక్తి అడిగాడు. శ్రీముఖి బాగ్ లో చూసేసరికి అప్పటివరకు రవికృష్ణ చేతికి ఉన్న వాచ్ ఆ బాగ్ లో కనిపించడంతో ఆ మేజిక్ కి అందరూ ఫిదా ఇపోయారు.

నువ్వు నాకు దేవుడు ఇచ్చిన వరం రా పొట్టి ఫెలో..

"సూపర్ జోడి" డ్యాన్స్ షో ప్రోమో మంచి కలర్ ఫుల్ గా రిలీజ్ అయ్యింది.కొంతకాలం క్రితం  జెమినీలో ప్రసారమైన 'కిర్రాక్ కామెడీ' షోకి యాంకర్‌గా చేసిన డాలి గురించి తెలుగు ఆడియన్స్ అందరికీ తెలుసు. అలాంటి డాలి ఈ షోలో పార్టిసిపేట్ చేసింది..సింగల్ గా కాదు జంటగా. అలాగే ఈ షోలో తన లవ్ ఎఫైర్ గురించి  స్టేజి మీద బయట పెట్టింది. నటుడు, వీజే కరమ్‌తో  ప్రేమలో ఉన్నట్లు చెప్పింది. వీరిద్దరూ కలిసి చాలా షోస్లో చేశారు. ఇప్పుడు  'సూపర్ జోడి' షోలో పార్టిసిపేట్ చేశారు. యాంకర్ డాలీ-కరమ్ ఇద్దరినీ 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ హీరోయిన్ వర్ష పరిచయం చేసింది.  డాలీ-కరమ్ ఇద్దరూ రెచ్చిపోయి మరీ రొమాంటిక్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. "డాలీ నా  లైఫ్‌లోకి వచ్చాక  నా లైఫ్ చాలా బాగుంది" అంటూ కరమ్ తన అభిప్రాయం చెప్పాడు. " నా ఫ్రెండ్ డాలీ ఎప్పుడు ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెడుతుందా అని ఎదురుచూశాను.. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది" అంటూ  వర్ష చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి తన ప్రేమను చెప్పింది డాలీ. "వర్షాలు..మేము కలవాలి అని నాకంటే ఎక్కువగా నువ్వే ఆలోచించావు. నాకు నీలాంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టం ...ఇక కరమ్ బేబీ ఫైనల్లీ అనుకున్నది జరగింది.. మన కొత్త జర్నీని స్టార్ట్ చేద్దాం.. కన్నా.. నా జీవితంలో ఎప్పుడూ ఊహించని బెస్ట్ గిఫ్ట్ నువ్వే. నా పైన నువ్వు చూపించే ప్రేమని చూస్తే  నీ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. నువ్వు నాకు దేవుడు ఇచ్చిన వరం రా పొట్టి ఫెలో " అని క్యూట్ గా తన లవ్ ని చెప్పింది . వీళ్ళ లవ్ మేటర్ తెలిసేసరికి  ఈ జంటకి అందరూ విషెస్ చెబుతున్నారు. ప్రేమ ఎంత మధురం హీరోయిన్ వర్ష, కరమ్, డాలీ కలిసి జాలీగా ఫారెన్ ట్రిప్స్ వెళ్తూ ఉంటారు. ఇక ఈ షోలో  మొత్తం 8 సెలబ్రెటీ జోడీలు ఈషోలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందాల నటి  మీనా, శ్రీదేవి విజయ్‌కుమార్, రఘు మాస్టర్ ఈ షోకి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.  

Bhole Shavali : పల్లవి ప్రశాంత్ కోసం పాట పాడిన భోలే షావలి.. నెట్టింట వైరల్!

కష్టపడ్డా పాలమ్మిన పూలమ్మిన పాటతో యూట్యూబ్ లో సెన్సెషనల్ క్రియేట్ చేశాడు భోలే షావలి.  పాటబిడ్డగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీ ఇచ్చాడు‌ భోలే  షావలి. ఎవరి అంచనాలకి అందకుండా ఎంట్రీ ఇచ్చిన భోలే షావలి హౌస్ లో ది బెస్ట్ కంటెస్టెంట్ అనిపించుకున్నాడు. ఎవరికి ఉండే ఫ్యాన్ బేస్ వారికుంటారనేది మరోసారీ నిరూపించాడు భోలే షావలి. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అంబటి అర్జున్, నయని పావని, పూజామూర్తి, అశ్వినిశ్రీలతో పాటు భోలే షావలి వచ్చాడు. వచ్చీ రాగానే నామినేషన్ లో సీరీయల్ బ్యాచ్ పై విరుచుకుపడ్డాడు భోలే. వాళ్ళు చేసే గ్రూపిజం గురించి వారితో ధైర్యంగా చెప్పి ఇన్ స్ట్రాగ్రామ్ లో ట్రోల్స్ చేసే పేజీలకు కంటెంట్ ఇచ్చాడు. పాటబిడ్డ పేరుకి న్యాయం చేసాడు భోలే షావలి. సీజన్ విజేతగా నిలిచిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ జైలుకెళ్ళినప్పుడు లాయర్లతో వెళ్లి బెయిల్ వచ్చేలా చేసి తనకి సపోర్ట్ గా నిలిచాడు భోలే షావలి. దీంతో రియల్ హీరో అని విమర్శకుల చేత అనిపించుకున్నాడు.  జైలునుండి ప్రశాంత్ బయటకొచ్చాక అతడిని తన ఇంటికి తీసుకెళ్ళి విందుని ఏర్పాటు చేశాడు భోలే షావలి. ఇప్పుడు తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పల్లవి ప్రశాంత్ ని ఉద్దేశించి ఓ పాటని పాడి తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ ఆ పాట ఏంటంటే.. రాదురా ఏ విజయం నీకోసం నాకోసం.. ఎక్కడికి పోదురా నువ్వు చేసిన కష్టం.. ఎప్పటికైనా అది నీకు సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది. సదాశయంతో సాగర ముందుకు అంటూ భోలే పాడిన ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. పల్లవి ప్రశాంత్ తో కలిసి ఈ వీడియోని ట్యాగ్ చేసాడు  భోలే షావలి. కాగా దీనికి అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది.

దుబాయ్ లోని ఎత్తైన బిల్డింగ్ నుండి దూకేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

ఆకాశం ఎత్తు నుండి ఒక్కసారిగా పడిపోతే కొందరి ప్రాణాలు గాల్లోనే పోతాయి. అంత భయమేస్తుంది. ఓ నలభై అడుగుల ఎత్తు అంటేనే వామ్మో అని కొందరు బయపడుతుంటారు. అలాంటిది 1300 ఫీట్ల ఎత్తు నుండి దూకేస్తే ఇంకెంత భయమేస్తుంది. కానీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ దామిని భట్ల ఆ సాహసాన్ని చేసింది. తన యూట్యూబ్ ఛానెల్ లో దీనికి సంబంధించిన వ్లాగ్ ని షేర్ చేసి, తన అనుభావాలని పంచుకుంది. 'లవ్ ఇన్ లండన్' సినిమాలోని ' నీ కోసం' పాటతో  ప్రేమికులకు దగ్గరైన దామిణి. 'బహుబలి- ది బిగినింగ్' లో పచ్చ బొట్టేసిన పాటతో ఎంతోమందికి దగ్గరైంది. రాజమండ్రి దగ్గర తాడేపల్లి గూడెంలో జన్మించిన దామినికి కర్నాటక సంగీతం అంటే మక్కువతో అది నేర్చుకుంది. ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారమయిన ' సరిగమప' షోలో గాయకురాలిగా తన కెరీర్ ప్రారంభించింది. స్టేజి షోలు, ప్రైవేట్ ఆల్బమ్స్, ప్రైవేట్ బ్యాండ్, సినిమాల్లో సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. కొండపొలం సినిమాలోని ధమ్ ధమ్ పాటకు బెస్ట్ లిరిక్స్ నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాట పాడింది దామినీనే. బిగ్ బాస్ హౌస్ లో సింగర్ గా ఎంట్రీ ఇచ్చి తనకి నచ్చినట్టుగా ఉండటంతో తొందరగా బయటకొచ్చేసింది. అతిగా ఆవేశపడేవాళ్లు, అనవసరంగా వాదిస్తూ సాగదీసేవాళ్లు, తమ డప్పు తామే కొట్టుకునేవాళ్లు, కేవలం డైలాగులకే పరిమితమయ్యేవాళ్లు, వెనకాల గోతులు తవ్వేవాళ్లు, కిచెన్‌కే పరిమితమై ఆడటమే మర్చిపోయేవాళ్లు.. ఇలా ప్రతిసీజన్‌లోనూ ఇలాంటి వాళ్లు కనిపిస్తూనే ఉంటారు. ఈ సీజన్‌లో అలాంటివారున్నారు. అయితే మిగతావాళ్ల సంగతి ఎలా ఉన్నా కిచెన్‌కే పరిమితమైనవాళ్లు మాత్రం హౌస్‌లో ఎక్కువ వారాలు ఉన్న దాఖలాలు లేవు. అందుకేనేమో దామిని త్వరగా బయటకొచ్చేసింది. ఇక తాజాగా తన మ్యూజిక్ ఆల్బమ్ వీడియోని రిలీజ్ చేసి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. కాగా ఇప్పుడు దుబాయ్ లో అతిపెద్ద బిల్డింగ్ నుండి జంప్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. పదమూడు వందల ఎత్తు నుండి జంప్ చేసి ఆ అనుభవాలని తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది. కొన్ని సార్లు లైఫ్ ని అద్భుతంగా మల్చుకోవడానికి కొన్ని డబ్బులు ఖర్చుపెట్టాలని, అవే మనకి మెమరీస్ గా ఉంటాయని.. లైఫ్ లో అందంతో పాటు కొంత రిస్క్ కూడా‌ తీసుకోవాలని దామిని చెప్పుకొచ్చింది. ‌కాగా ఈ వ్లాగ్ కి ఇప్పుడు అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది.

భూమి తల్లి శపిస్తోంది...ఇకనైనా మన ఆరోగ్యం కాపాడుకుందాం

ఒకప్పుడు మనమంతా పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళం...పంటలు పండించుకుని ఎలాంటి పురుగుమందులు వాడకుండా ఆర్గానిక్ ఫుడ్ ని తినేవాళ్ళం..అందుకే మన తాతలు, బామ్మలు 90 ఏళ్ళు వచ్చినా కూడా నడుములు ఒంగకుండా, కళ్ళజోడులు పెట్టుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఒక్క మందుబిళ్ల కూడా వేసుకోకుండా ఏళ్లకేళ్లు బతికారు. కానీ తర్వాత తరం మారింది. గడిచిన ఈ ఇరవై ఇళ్లల్లో పంటలు, పొలాలు, రైతులు, ప్రజలు, తిండి, తిప్పలు, విధానాలు, రోగాలు ఇలా అన్నిట్లో భయంకరమైన మార్పులు వచ్చాయి.. ఆర్గానిక్ ఫుడ్ కాస్తా పోయి విషం తినాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే పుట్టిన వాళ్లకు చూపు లేకుండా, క్యాన్సర్స్ తో, రకరకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ తో బతుకుతున్నారు చాలా మంది. ఇలాగే ఇంకొన్నేళ్లు ఉంటే మనుషుల మీద కొత్త కొత్త రోగాలు దాడి చేసి మరణాల రేట్ పెరిగిపోయే అవకాశం చాలా కనిపిస్తోంది. అలాంటి ఎంతోమందికి ఆర్గానిక్ ఫుడ్ గురించి అవగాహన కల్పించేందుకు చాలామంది ఈ మధ్యకాలంలో ముందుకొస్తున్నారు. ఇప్పుడు యాంకర్ ఉదయభాను కూడా తన పొలంలో ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. అలాగే పంటలకు పెస్టిసైడ్స్ కాకుండా గో-ఆధారిత జీవామృతాన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా తన యూట్యూబ్ వీడియోస్ లో చూపిస్తోంది.  జీవామృతంలో ఆర్గానిక్ బెల్లం మాత్రమే వేయాలని ఒకవేళ అది దొరకని పక్షంలో మాగిపోయిన పళ్ళను ఐనా ఉపయోగించవచ్చని చెప్పింది. అలా  జీవామృతాన్ని తయారు చేసి చూపించింది. ఇక ఈ ఇన్స్పిరేషనల్ వీడియో చూసి నెటిజన్స్ కూడా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.  "హాయ్ భానుగారు నేను కూడా రైతు బిడ్డనే కానీ పొలం పనులు ఎప్పుడు చేయాలేదు మీ వీడియో చూసాక నేను ఏం తప్పు చేశానో తెలిసింది..జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తోంది..." అంటున్నారు. ఇదే కదా మనందరి ఆరోగ్యం, భావితరాల భవిష్యత్తు అంటూ ఉదయభాను చెప్పిన ఇన్స్పిరేషనల్ వర్డ్స్ కి అందరూ ఫిదా అవుతున్నారు.