Actor Sivaji : ఉప్మా ఛాలెంజ్ విసిరిన శివాజీ!

సెలెబ్రిటీలు స్టార్ట్ చేసిన ఛాలెంజ్ ని ఫ్యాన్స్ చేస్తుంటారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో ఎంతోమందికి దగ్గరైన శివాజీ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో అభిమానులకి సరికొత్త ఛాలెంజ్ విసిరాడు. 90's వెబ్ సిరీస్ లో వాళ్ళ అమ్మ రెగ్యులర్ గా ఉప్మా చేస్తుంటే పిల్లల ఎవరూ తినకుండా స్కూల్ కి వెళ్తారు. అది ఓ ఎమోషన్ అంటూ శివాజీ ఆ పిల్లలకి చెప్పడంతో అందరు ఉప్మాకి కనెక్ట్ అవుతారు.  బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో శివాజీ ఈజ్ నెంబర్ వన్ అని మొదటి నుండి ఎన్నో వార్తలు, మరెన్నో పేజ్ లలో చెప్పుకున్నారు. ఎందుకంటే శివాజీ ఫెయర్ ప్లే, తప్పు చేయకూడదని అందరిని గైడ్ చేసే విధానం, అమాయకుడైన యావర్, రైతుబిడ్డ ప్రశాంత్ పక్షాన నిల్చొని గ్రూప్ గా ఆడుతున్న స్పా బ్యాచ్ కి ఎదురునిలిచాడు. అందుకే శివాజీకి ఫ్యాన్ బేస్ మాములుగా లేదు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో టాప్-3 గా శివాజీ నిలిచాడు.  ప్రస్తుతం శివాజీ తన ఇంట్లో ఉండి కొత్తరకం వంటలతో నెటిజన్లకి సవాళ్ళు విసిరుతున్నాడు. ఆ వెబ్ సిరీస్ లో ఉప్మా అనేది మిడిల్ క్లాస్ వాళ్ళ ఎమోషన్ అంటు చెప్పగా అది ఇప్పుడు చేస్తున్నానని చూపించాడు శివాజీ. ఉప్మా చేయడం తేలికే కానీ దాన్ని రెగ్యులర్ గా తినాలంటేనే కాస్త ఇబ్బంది అని అందరు అనుకుంటారు. అలాంటివాళ్ళకి శివాజీ రుచికరమైన ఉప్మాని నేను చేస్తున్నాను.. మీరు చేసి నాకు ట్యాగ్ చేయండి అని శివాజీ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. అరేయ్ టేస్టీ తేజ నీకే చెప్తున్నా.. ఉప్మా చేసి చూపించు. నయని పావని నువ్వు కూడ చేయు అమ్మ, పల్లవి ప్రశాంత్ నువ్వు చేసి పంపించు.. అలాగే బిగ్ బాస్ హౌస్ మేట్స్ కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోని అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, బావలు, బామ్మర్దులు, అందరికి చెప్తున్నాను. మీరు ఉప్మా చేసి ఓ రెండు నిమిషాల్లో వీడియోగా చేసి నాకు ట్యాగ్ చేయండి అలాగే ఈటీవి విన్ కి ట్యాగ్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి అని శివాజీ చెప్పాడు. ఈ వీడియోకి తేజ కామెంట్ చేశాడు. నేను టేస్టీ తేజ అన్న.. చేయడం రాదు టేస్ట్ చేయడమే వచ్చు అని  టేస్టీ తేజ కామెంట్ చేశాడు.  నేను చేస్తాను కానీ నువ్వు టేస్ట్ చేయాలి అన్న అని నయని పావని కామెంట్ చేసింది. యావర్ కూడా స్పందించాడు. వీళ్ళే కాకుండా బిగ్ బాస్ అభిమానులు శివాజీ ఫాలోవర్స్ అందరు తెగ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది‌.  

ఆది..ఆది..నీదేది ? శ్రీప్రియ ఇన్ స్కందా ?

ఢీ సెలబ్రిటీ స్పెషల్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో రెట్రో థీమ్ ఇచ్చారు జడ్జెస్. సాత్విక్ చిరంజీవి ఎవర్ గ్రీన్ సాంగ్ "పట్టుకో పట్టుకో పగ్గమేసి పట్టుకో" అనే సాంగ్ కి మంచి స్వాగ్ తో స్టైలిష్ గా డాన్స్ చేసాడు. ఈ డాన్స్ కి శేఖర్ మాష్టర్ ఫిదా ఇపోయారు. చిరంజీవి చేసిన డాన్స్ గుర్తొచ్చింది అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక ఆది ఎప్పటిలా తన స్కిట్ తో రెడీ ఐపోయాడు. ప్రతీ వారం ఏదో ఒక కాన్సెప్ట్ తో ఎంట్రీ ఇస్తూ ఆటపట్టిస్తూ ఉంటాడు. ఈ రాబోయే వారంలో బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లో కనిపించే దొంగ గెటప్ లో వచ్చాడు. ఇక నందు ఆదిని చూసి ఏంటీ గెటప్ అనేసరికి "దొంగ" అని ఆది ఆన్సర్ ఇచ్చేసరికి ఏం అడగాలో అర్ధం కాక "ఎవరినీ" అంటూ సంబంధం లేని డైలాగ్ వేసాడు. దానికి ఆది నోరెళ్లబెట్టాడు. "స్టేజి మీద ఉన్న అందరి ఫోన్ లు కొట్టేసాను. ఫస్ట్ ఫోన్ ఎవరిదో తెలుసా శేఖర్ మాష్టర్ ది. ఇక అందులో నందిత, ప్రియమణి, పూర్ణ, ప్రణీత అని పేర్లు చెప్పేసరికి ప్రణీత ఈవిడ కాదు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రణీత..అయ్యా అయ్యా వద్దయ్యా చిన్న పిల్లయ్యా వదిలేయండయ్యా" అంటూ శేఖర్ మాష్టర్ ఆమెను ఏదో చేసేస్తున్నట్టు ఆది బతిమిలాడి వదిలేయమన్నట్టు ఫీల్ తెప్పించే డైలాగ్ వేసేసరికి శేఖర్ మాష్టర్ పగలబడి నవ్వాడు. తర్వాత వర్షిణి వచ్చి శ్రీదేవి హిట్ సాంగ్ "అందాలలో నవోనవోదయం" కి డాన్స్ చేసింది. ఆమె ఈ గెటప్ లో ఏంజెల్ లా ఉందంటూ శేఖర్ మాష్టర్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక కార్తీక దీపం చిన్నారి సహృద "ప్రియరాగాలే" సాంగ్ కి డాన్స్ చేసింది. "నువ్వు చేసే ప్రతీ మూమెంట్ లో ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది" అంటూ కితాబిచ్చారు శేఖర్ మాష్టర్. తర్వాత ఆది కొట్టేసిన సెల్స్ లోంచి శ్రీప్రియ సెల్ తీసి గూగుల్ లో ఏం సెర్చ్ చేసిందో చూడు అంటూ నందూకి చూపించాడు. "శ్రీప్రియ ఇన్ స్కందా అనగానే కింద చూడు ఎక్కడుంది నీ బొంద" అని వచ్చిందన్నారు. తర్వాత ఆది మీద కవిత చెప్పమంటూ నందు శ్వేతా నాయుడుని పిలిచాడు "ఆది ఆది" అని చెప్పేంతలో "ఆది ఆది నీదేది" అంటూ శేఖర్ మాష్టర్ కౌంటర్ కవిత చెప్పేసాడు. ఆ బూతుకు ఆది ఫేస్ ఎక్స్ప్రెషన్ మాములుగా లేదు. ఫైనల్ గా జెస్సి వచ్చి "కన్నుకొట్టరో" సాంగ్ కి డాన్స్ చేసేసరికి డాన్సర్స్ లో ఒకామె "చాలా క్యూట్ గా ఉంటారు కదా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది" అని కామెంట్ చేయడంతో అందరూ నవ్వేశారు. "జెస్సి డాన్స్ ఎక్స్ప్రెషన్స్ చూసేటప్పుడు నాకు ఒకటి అడగాలని అనిపిస్తుంది ..నీ మూతి మీద ఎవడు ? "అంటూ ఒక బూతు డైలాగ్ వేసాడు ఆది.

బ్లడ్ గ్రూప్ లోనో, డిఎన్ఏలోనో నటన ఉండదు...నేర్చుకుంటే వస్తుంది

సుమ-రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి రీసెంట్ గా ఒక మూవీ కూడా చేసాడు. బబుల్ గం మూవీలో రోషన్ కనకాల నటనకు సంబందించిన ఎన్నో  విషయాల గురించి  చెప్పారు రాజీవ్ కనకాల. "చాలా మంది కొన్నేళ్ల పాటు చేస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ రోషన్ కి ఫస్ట్ మూవీకే వచ్చేసింది. యాక్టింగ్ అనేది డిఎన్ఏలో ఏమీ ఉండదు ...బ్లడ్ లో బ్లడ్ గ్రూప్ ఉంటుంది కానీ నటన ఎలా ఉంటుంది. నేనేవన్నీ నమ్మను.. నటన నేర్చుకుంటే, చూస్తే, తెలుసుకుంటే వస్తుంది. మా తాత ఈ ఫీల్డ్ కానే కాదు. ఆయన స్టేజి నాటకాలు వేసిన అనుభవం కూడా లేదు. నేను పుట్టిన దగ్గరనుంచి పెళ్ళైన రెండేళ్ల వరకు కూడా నాకు ఇల్లు, ఇన్స్టిట్యూట్ కూడా ఒకటే. కానీ రోషన్ కి మాత్రం చిన్నప్పుడే చాలా ఫ్రీడమ్, ఇండివిడ్యువాలిటీ వచ్చేసింది. బాబు బికాం చేసాడు..పాప 12 వ తరగతి చదువుతోంది. అమ్మ, నాన్న, సోదరి వరసగా నాకు దూరమైపోయేసరికి చాలా బాధేసింది. చాలామంది అనుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ లో ఎక్కువగా చేస్తాను అని.. కానీ సింహాద్రి, రామయ్య వస్తావయ్యా, బృందావనం, సుబ్బు  మూవీస్ లో నేను లేను. భవిష్యత్తులో మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేసేలా ఆలోచిస్తున్నాను. నాకు పెద్దగా వంట రాదు. కానీ ఆమ్లెట్ బాగా వేస్తా..పేపర్ దోశ కూడా చాలా బాగా వేస్తాను. పెళ్లంటే అండర్స్టాండింగ్...అందులో ఎన్నో అపార్థాలు కూడా వస్తాయి. పెళ్లి చేసుకున్న అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అనుకుంటే అసలు ఏ సమస్యలూ రావు. నాది లవ్ మ్యారేజ్ కాబట్టి నా పిల్లలు లవ్ మ్యారేజ్ అన్నా కూడా నాకు నో ప్రాబ్లమ్. రోషన్ కి మలయాళం వచ్చు..అక్కడ ఏ అమ్మాయి నచ్చినా పెళ్లి చేస్తాం...కొన్ని మూవీస్ రిలీజ్ కి రెడీగ ఉన్నాయి..వాటికి ఇంకా పేర్లు కూడా పెట్టలేదు " అని చెప్పాడు రాజీవ్ కనకాల.

Eto Vellipoyindhi Manasu : అన్న సంతకం ఫోర్జరీ చేసిన తమ్ముడు.. ఆమె నడిపే క్యాబ్ లో తాగుబోతులు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -5 లో.. సీతాకాంత్ కార్ పై రామలక్ష్మి కలర్ చల్లుతుంది. మళ్ళీ ఆ అమ్మాయే వచ్చి కార్ క్లీన్ చెయ్యాలని సీతాకాంత్ అనుకుంటాడు. అందుకే తన అడ్రస్ కనుక్కొని మరి వాళ్ళు ఉండే బస్తీకీ వెళ్తాడు. అక్కడ గల్లీలలో సీతాకాంత్ వెళ్తుంటే ఇబ్బంది పడుతుంటాడు. ఆ తర్వాత గల్లీలో ఇద్దరు ఆడవాళ్లు గొడవపడుతు ఉంటే వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తారు సీతాకాంత్ డ్రైవర్, అతని అసిస్టెంట్. వాళ్ళని ఆపబోయిన డ్రైవర్‌ని అందరు కలిసి కొడతారు. కాసేపటికి ఇప్పుడు మేమ్ ఎక్కడికి రాము అంటు.. వాళ్ళ సీతాకాంత్ ని వదిలి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సీతాకాంత్ ఒక్కడే వెళ్తుంటాడు. నీ కోసం ఎవరో వచ్చారంటూ బ్యాండ్ అతను.. రామలక్ష్మిని తీసుకొని వస్తుంటే అతనికి వేరే ఫోన్ వచ్చిందని తను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఒక్కతే.. ఎవరు వచ్చారంటూ వెళ్తుంది. ఇద్దరు పక్కపక్కన చూసుకోకుండా వెళ్తారు. కానీ ఇద్దరు ఏదో గుర్తుకు వచ్చినట్టు ఆగిపోతారు. ఆ తర్వాత ఎవరి దారిన వెళ్ళిపోతారు. కాసేపటికి సీతాకాంత్, రామలక్ష్మి ‌ఇద్దరు తమ ఇళ్ళకు వెళ్తారు. ఎందుకు అలా జరిగింది.. నాకు ఏదో జ్ఞాపకం వస్తుంది? ఎందుకు ఇలా అవుతుందంటూ అనుకుంటారు. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి బ్యాంకు మేనేజర్ వస్తాడు. మీ చెక్కు ఫోర్జరీ జరిగింది, అది మీ తమ్ముడు సందీప్ ఇచ్చాడని అనగానే.. లేదు నేనే ఇచ్చానని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ మాటలు వాళ్ళ అమ్మ వింటుంది. నీ చెల్లితో పాటు నీ తమ్ముడిని కూడ గారాబం చేస్తున్నావా.. వాడు చెక్కు విషయం లో తప్పు చేస్తే అలా ఎందుకు అంటున్నావని అనగానే.. వాడికి ఏం అవసరం ఉందో.. అయిన ఇప్పుడు నేను ఆ చెక్కు ఇవ్వలేదని తెలిస్తే నా తమ్ముడుని తప్పుగా అనుకుంటారు. అది నాకు ఇష్టం లేదని సీతాకాంత్ అంటాడు. వాడు వదిలేసిన నేను వదలనంటూ శ్రీలత వెళ్లి.. సందీప్ ని చెక్కు ఎందుకు ఫోర్జరీ చేసావంటు అడుగుతుంది. ఆ తర్వాత శ్రీవల్లి మధ్యలో కలుగుజేసుకొని మా అయనకి కూడా కొన్ని బాధ్యతలు అప్పజెప్పితే బాగుండేదని శ్రీవల్లి అనగానే.. మన కంపెనీలు ఎన్నున్నాయి? వాటి టర్నవర్ ఎంత అని శ్రీలత అడుగుతుంది. సందీప్ సైలెంట్ గా ఉంటాడు. సీతకాంత్ కి ఫోన్ చేసి అడుగగా.. అన్ని ఫాస్ట్ గా చెప్తాడు. నీకు వాడికి తేడా ఇదే అంటూ సీతాకాంత్ గురించి శ్రీలత గొప్పగా చెప్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి క్యాబ్ గడుపుతుంటుంది. కొంతమంది తాగుబోతులు రామలక్ష్మి క్యాబ్ బుక్ చేసుకొని అటపట్టిస్తుంటారు. ఇక రామలక్ష్మి పోలీస్ స్టేషన్ వచ్చిందని అనగానే వాళ్ళు పారిపోతారు. ఆ తర్వాత ఆ విషయం బాధపడుతు తన తల్లికి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : భర్తపై భార్య నిఘా.. ఇక డైరెక్ట్ ఆఫీస్ లోనే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 316 లో.. కావ్య, కళ్యాణ్ ఇద్దరు రాజ్ శ్వేతల స్నేహం ఎక్కడవరకు వెళ్లిందోనని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగా రాజ్ లేని టైమ్ లో అతని ఫోన్ చూస్తారు. అందులో వాళ్ళ ఛాటింగ్ చూసి కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు. ఏమైందని కావ్య అడుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు అంత దూరం వెళ్లినట్టు ఏం అనిపించట్లేదు.. ఇప్పుడే మనం ఒక నిర్ణయానికి రావద్దని కళ్యాణ్ అంటాడు. నువ్వు ఇక నుండి ఆఫీస్ కి వెళ్లి అన్నయ్య పక్కనే ఉండని కావ్యతో కళ్యాణ్ అనగానే.. ఏ ఇంట్లో ఉన్నాను.. మీరు ఏం మాట్లాడుతున్నారని కావ్య చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అప్పు మళ్ళీ డెలివరీ బాయ్ గా చేరడానికి రెడీ అయి వెళ్తుంటే.. వద్దు నువ్వు కష్టపడకు నువ్వు చదువుకోమని కనకం, కృష్ణమూర్తి ఇద్దరు చెప్తారు. కానీ నేను మీ హెల్ప్ చెయ్యాలి అనుకుంటున్నాను. నా చదువుకి తగ్గ ఉద్యోగం దొరికే వరకు నేను ఈ జాబ్ చేస్తానని అప్పు చెప్పేసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రాజ్ ఫోన్ కి శ్వేత కాల్ చేస్తుంది. అది కావ్య చుసి ఫోన్ తీసుకుంటుంది. అప్పుడే రాజ్ లాక్కొని కట్ చేస్తాడు. ఎవరని కావ్య కావాలనే అడుగుతుంది. క్లయింట్ అని రాజ్ చెప్పగానే.. అలా కట్ చేస్తే ఏం అనుకోదా మీ క్లయింట్ అని కావ్య కావాలనే అడుగుతుంది‌. రాజ్ ఎదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. ఆ తర్వాత కావ్య వెళ్ళిపోయాక.. శ్వేతకి రాజ్ ఫోన్ చేసి మాట్లాడతాడు.. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి కళ్యాణ్ వచ్చి గీజర్ పాడైంది అన్నారు కదు రిపేర్ అతన్ని ఎప్పుడు రమ్మంటారని అడుగుతాడు. ధాన్యలక్ష్మి అన్న మాటలు మనసులో పెట్టుకొని అపర్ణ వద్దని చెప్తుంది. మళ్ళీ తోడికోడళ్ల మధ్యలో చిన్నగా వార్ మొదలైయి ఏదైనా అడగాలి అనుకుంటే.. నీ కొడుకుని అడుగని ధాన్యలక్ష్మితో అపర్ణ అంటుంది. అధికారం మొత్తం నీ కొడుకు చేతిలో ఉంటే.. నా కొడుకుని ఏం అడగాలని ధటన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత వాళ్ళ గొడవ ఎక్కడ వరకు వెళ్తుందో అనుకొని ఇందిరాదేవి మధ్యలో కలుగుజేసుకొని.. ఇద్దరు కోడళ్లని బయటకు తీసుకొని వెళ్లి.. ఇవి మీ మాటలు కాదు.. చెప్పుడు మాటలని.. మీరు అవే విన్నారని అర్థమవుతుందంటు ఇద్దరికి నచ్చజెప్పుతుంది. తరువాయి భాగంలో నేను డిజైనర్ గా ఆఫీస్ లో జాయిన్ అవుదామని అనుకుంటున్నానని అపర్ణని కావ్య అడుగుతుంది. వద్దు ఇంట్లో కిచెనే నీకు సెట్ అవుతుందని ధాన్యలక్ష్మి అనగానే.. నా కోడలికి ఎం చెయ్యాలో నువ్వు చెప్పనవసరం లేదంటు అపర్ణ అంటుంది. కావ్య నువ్వు రేపటి నుండి ఆఫీస్ కి వెళ్ళని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Krishna Mukunda Murari : మిలటరీ ఆపరేషన్ కి భార్య పేరు పెట్టిన మొదటి భర్త అతనేనంట!

 స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం‌ నాటి ఎపిసోడ్- 377 లో.. ఆదర్శ్ ఇంటికి రావడంతో అందరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తుంటారు. అదర్శ్ తో వాళ్ళ అమ్మ భవాని ప్రేమగా మాట్లాడుతుంది. చెప్పు కన్నా ఈ సంవత్సరం ఏం చేశావని ఆదర్శ్ ని భవాని అడుగగా.. ఏం ఉంది అమ్మ అలా ఖాళీగా గడిచిపోయిందని ఆదర్శ్ అన్నాడు.  ఎందుకని జాబ్ కి రిజైన్ చేశావని భవాని అడుగగా.. ఇప్పుడు అవన్నీ ఎందుకు అమ్మ అని అదర్శ్ అంటాడు. రిస్క్ ఆపరేషన్స్ లో ఉంటానని ఆదర్శ్ అనగా  పైఅధికారులు వినకుండా అడ్మినిస్ట్రేషన్ కి మార్చారంట.. అక్కడ రిస్క్ ఏం ఉండదని, అది ఇష్టం లేదని రిజైన్ చేశాడని కృష్ణ చెప్తుంది. ఎప్పుడు రిస్క్ ఆపరేషన్స్ అంటూ వెళ్తే .. ఇంట్లో అమ్మ ఉందని అసలు గుర్తుందా అని భవాని అంటుంది‌. అలా అనకు అమ్మ అని ఆదర్శ్ అంటాడు. సరే రిస్క్ ఆపరేషన్స్ చేసావ్ సరే.. లాస్ట్ చేసిన ఆపరేషన్ ఏంటని మధు అడుగుతాడు. పాకిస్తాన్ బార్డర్ లో దుండగులు చొరబడకుండా నేను నాతో పాటు ముగ్గురు ఉన్నారు. వారిని బ్యాకప్ గా పెట్డి నేనొక్కడినే బార్డర్ దగ్గరికి వెళ్ళి పదే పది నిమిషాల్లో పదిమందిని చంపేసి వారిని పాకిస్తాన్ కి పంపించేశానని ఆదర్శ్ అనగానే.. ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా చప్పట్లు కొడతారు. ఇక కాసేపటికి ఆపరేషన్ పేరేంటని మధు అడుగగా.. ఆపరేషన్ ముకుంద అని ఆదర్శ్ అంటాడు.‌ఇక అది విని అందరు సర్ ప్రైజ్ గా ఫీల్ అవుతారు. భార్య పేరుని మిలటరీ ఆపరేషన్ కి పెట్టిన మొట్టమొదటి భర్తవి నువ్వేరా.. హ్యాట్సాఫ్ అని మురారి అంటాడు. ముకుందకి ఆదర్శ్ కి ఉన్న ప్రేమకి ఇదే నిదర్శనం అక్క.. ఇంకెందుకు ఆలస్యం. ముహుర్తాలు పెట్టిద్దామని భవానీతో రేవతి అనగానే..‌ భవాని సరేనని అంటుంది. మరుసటి రోజు ఉదయం.. భవాని హాల్లో కూర్చుంటుంది. అక్కడికి రేవతి వచ్చి కాఫీ ఇస్తుంది. కాఫీ తీసుకున్న భవానీ రేవతిని చూసి.. ఈ రోజు బాగున్నావని అంటుంది. ఇప్పుడు మీరు బాగున్నారు కాబట్టి నేను కూడా బాగా కన్పిస్తున్నానని రేవతి అంటుంది.   కృష్ణ, ముకుంద కలిసి తులసికోట చుట్టు తిరుగుతూ ఉంటారు. అది చూసి రేవతి సంతోషపడుతుంది. ఈ క్షణం ఇలా ఉంటే బాగుంటుందని రేవతి అనగా.. అలా ఎప్పుడు అనుకోకూడదని భవాని అంటుంది. కాసేపటికి కృష్ణ, ముకుంద పూజ చేసి హారతి ఇస్తుంటారు. భవానీ దగ్గరకి ముకుంద వచ్చి హారతి ఇస్తుండగా మొదటగా వద్దన్నట్టున్నా తర్వాత తీసుకుంటుంది. కృష్ణ తన హారతి కూడా తీసుకోమని అనగా.. మళ్లీ తింగరి పిల్ల అనిపించుకున్నావని భవానీ అంటుంది. ఆ తర్వాత పంతులు కోసం రేవతి, నందు ఎదురుచూస్తుంటారు. అప్పుడే మధు వచ్చి.. ఎందుకు అలా ఉన్నారు పెద్దమ్మ అని రేవతి అనగానే.. మహుర్తాలు పెట్టడానికి పంతులు గారు వస్తున్నాని చెప్పారు . అందుకే వెయిటింగ్ అని రేవతి, నందు అంటారు. తరువాయి భాగంలో ముకుంద బయట నిల్చొని  ఆలోచిస్తుంటుంది. అప్పుడే తన దగ్గరకి ఆదర్శ్ వచ్చి పట్టుకుంటాడు. దాంతో ముకుంద భయపడి అరిచేస్తుంది. అది విని ఇంట్లోని వారంతా  అక్కడికి వచ్చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedanatha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లో కీలక మలుపు.. ఇక బొమ్మ బ్లాక్ బస్టర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్- 983 లో.. శైలేంద్రకి వార్నింగ్ ఇస్తుంది వసుధార. అందరి ముందు నీ నిజస్వరూపం బయటపడటం కామన్. అన్ని ఆధారాలతో నీ నిజస్వరూపాన్ని రిషి సర్ ముందు బయటపెడతాను. నువ్వు జైలుకెళ్ళడం కాయం.. అయిపోయింది శైలేంద్ర.. ఈరోజు తాడో పేడో తేల్చుకుందాం.. నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావ్ శైలేంద్ర అని వసుధార వార్నింగ్ ఇస్తుంది. అంటే వసుధార నా వేలితో నా కన్నే పొడిచిందా అని శైలేంద్ర టెన్షన్ పడతాడు. ఆ తర్వాత రాజీవ్ కి శైలేంద్ర కాల్ చేసి.. నీ మరదలు మాములుది కాదు నాకే చెమటలు పట్టిస్తుందని, జరిగిందంతా చెప్తాడు‌. అందానికి అందం తెలివికి తెలివి ఉంది కాబట్టే నా మరదలి మీద మనసు పారేసుకున్నానుని రాజీవ్ అంటాడు. మీ మామ చక్రపాణిని పట్టుకోమని రాజీవ్ కి శైలేంద్ర చెప్తాడు. రిషి దగ్గర ఉన్న చక్రపాణి.. వాళ్ళ కూతురు కొడుకు సంతోషంగా ఉండాలని చూడు దేవుడా అని అనుకుంటారు. అప్పుడే చక్రపాణికి అతడి క్లోజ్ ఫ్రెండ్ స్వామినాథన్ ఫోన్ చేస్తాడు. అంటే రాజీవ్ గన్ పెట్టి ఫోన్ చేపిస్తాడు. బాగున్నావా అని మాములుగా మాట్లాడతాడు స్వామినాథన్. నా కూతురు పెళ్ళి కుదిరింది.‌.‌ మంచి సంబంధం‌‌.. మా అల్లుడు బంగారమని  ఒప్పుకున్నాను. పెళ్ళి కార్డ్ లు కూడా అచ్చు వేయించి అందరిని పిలుస్తున్నానని చక్రపాణికి స్వామినాథన్ అంటాడు. అవునా సరే మంచిదని చక్రపాణి అంటాడు. పాత అడ్రెస్ కి వెళితే అక్కడ ఉండట్లేదని తెలిసింది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావో చెప్పురా మనం కలుద్దామని స్వామినాథన్ అనగా.. నేను బయట వేరే పనిలో ఉన్నాను రా.‌ అయిన కార్డు ఎందుకు.. ఫోన్ లో చెప్పావు కదా సరిపోతుందని నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నానని, ఆ  తర్వాత ఒకరోజు కలవడానికి వస్తానురా అని స్వామినాథన్ తో  చక్రపాణి అంటాడు. ఇక ఆ తర్వాత స్వామినాథన్ కి చంపేస్తానని రాజీవ్  గట్టి వార్నింగ్ ఇస్తాడు.  కాలేజీలో ఉన్న వసుధార దగ్గరకు అనుపమ, మహేంద్ర వచ్చి.. ఏంటమ్మా నువ్వు చేసింది‌. రిషి వస్తాడని ఎందుకన్నావని ఇద్దరు అడుగుతారు. ఇంకెన్నాళ్ళు బయపడతాం.. ఇక మనం బయపడొద్దు.. రిషి సర్ రావాలి.. వాడి నిజస్వరూపం అందరికి తెలియాలని చెప్పాను. మా నాన్నకి కాల్ చేసి తీసుకురమ్మని చెప్పానని వసుధార అంటుంది.  బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా.. రిషి ఎప్పుడు వస్తాడోనని శైలేంద్ర వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడు బయటకు తీసుకొస్తే ఎలా మరి అని మహేంద్ర అడుగుతాడు. ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను మావయ్య.. ఫణీంద్ర సర్ కు ఈ రోజు నిజం తెలియాలని వసుధార అంటుంది. ఇక ఇంట్లో ఉన్న దేవయాని తన హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటుంది. అప్పుడే శైలేంద్ర కాల్ చేసి.. మన ప్లాన్ రివర్స్ అయింది‌. రిషిని కాలేజీకి తీసుకొస్తుందంట ఆ వసుధార.. నేనయ జైలుకెళ్ళడం కాయమని చెప్తుందని దేవయానితో అనగానే తను షాక్ అవుతుంది. ఇప్పుడేం చేద్దామని దేవయాని అనగానే.. అది తెలియకే నీకు కాల్ చేసానని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Rowdy Rohini: తికమక ఫ్యామిలీ అంటే మాదేనంటున్న రౌడీ రోహిణి!

కొన్ని సందర్భాల్లో మనుషుల మధ్య వ్యత్యాసం ఇట్టే బయటపడుతుంది. ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరి మెంటాలిటీ ఒకేలా ఉండదు. అదే అమ్మవాళ్ళ జనరేషన్ కి ఈ జనరేషన్ కి తేడా.. రోహిణి వాళ్ల అమ్మ గురించి చెప్తూ ఓ వ్లాగ్ లో వివరించింది. తన ఫ్రెండ్ లహరి వాళ్ళ కొడుకు బారసాలకి ఫ్యామిలీతో వెళ్ళిన రోహిణి.. అక్కడ ఫ్రెండ్స్ తో‌ కలిసి ఎంజాయ్ చేసింది. కొన్నిరోజుల క్రితం కియా కార్ కొన్నట్టుగా ఓ వ్లాగ్ చేయగా ఆ వీడియోకి విశేష స్పందన లభిస్తోంది.  ఇక రోహిణి ఏం చేసిన కాస్త డిఫరెంట్ గా చేస్తోంది. వాళ్ళ అమ్మతో జరిగిన ఓ సంభాషనని వ్లాగ్ గా చేసి చెప్పింది. ఏంటమ్మా కిచెన్ లో జడ వేసుకుంటున్నావని అడుగగా.. ఇక్కడ అద్దం ఉందని చేసుకుంటానని రోహిణి వాళ్ళ అమ్మ అంది. అయ్యో అమ్మ డ్రెస్సింగ్ టేబుల్ కి అంత పెద్ద అద్దం ఉండగా ఇక్కడ ఎందుకని అడిగింది రోహిణి. నేనంతే అని వాళ్ళ అమ్మ అంది‌. ఇక బయటకు వెళ్ళేప్పుడు రెడీ అయ్యాక కనకాంబరాల పూలు అల్లుకుందని రోహిణి చూపించింది. వీటి గురించి నీకు తెలియదంటూ రోహిణి వాళ్ళ అమ్మ అనేసింది. అయ్యో ఏంటో ఏమో అందరి ఫ్యామిలీ వేరు.. మా ఫ్యామిలీ వేరు. తికమక ఫ్యామిలీ అంటే మాదేనేమో అంటు రోహిణి అంది. ఇదంతా యూట్యూబ్ లోని తన ఛానెల్ లో అప్లోడ్ చేసింది. కాగా ఈ వీడియోకి విశేష ఆదరణ లభిస్తోంది. సీరియ‌ల్స్‌, షోస్‌, ప్రోగ్రామ్స్ లలో మెప్పించ‌టం ద్వారా గుర్తింపు సంపాదించుకుంటోన్న లేడీ ఆర్టిస్టుల్లో రోహిణి ఒక‌రు. ఒక టీమ్ మెంబర్ గా జ‌బ‌ర్ద‌స్త్‌లోనూ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టీమ్ లీడర్ గా మారిందంటే తన కామెడీ టైమింగ్ తో పంచులతో ఎంతలా మెప్పిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చేతినిండా అవ‌కాశాల‌తో రోహిణి ఫుల్ బిజీగా ఉంటోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసింది రోహిణి‌. ఇందులో తన కామెడీకి బాగానే మార్కులు పడ్డాయి. దాంతో తనకి ఆఫర్లు వరుసగా వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వరుసగా మూడవ కార్ కూడా కొంది. అయితే తన ఫ్యామిలీతో పాటు రీల్స్, వీడియోలు చేస్తూ ‌ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటుంది రోహిణి.

సర్వీస్ చేయాలన్న ఆలోచన ఉన్నవాళ్ళతో కొలాబరేట్ అవుతాం!

టాలీవుడ్ ఇండస్ట్రీలో "బావ" మూవీతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రణీత అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది"లో ఎంతో క్యూట్ గా కనిపించి మెప్పించింది. ఇక ఈ మూవీ తర్వాత ప్రణీతను ఆడియన్స్ బాపుబొమ్మ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. అలాంటి ప్రణీత ఇప్పుడు ఢీ సెలబ్రిటీ స్పెషల్ డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఆమె నెటిజన్స్ తో చాట్ చేసింది. "ప్రణీత ఫౌండేషన్ గురించి కొంచెం చెప్పండి.." అని ఒక నెటిజన్ అడిగేసరికి "ఏదైనా క్రైసిస్ టైములో మేము ప్రజలకు సహాయం చేయడానికి ముందుంటాం.  మాలాంటి ఆలోచనలు ఉండి ముందుకెళ్లాలి అనుకునే వాళ్ళతో మేము  కొలాబరేట్ కావడానికి చూస్తున్నాం" అని చెప్పింది. "మీ ఆయన ఎప్పుడైనా వంట చేస్తారా ?" " అయ్యయో లేదండి. ఆయన అంత బాగా వంట చేయలేరు అందుకే మేము ఆర్డర్ చేసి తెప్పించుకుంటాం" అని చెప్పింది. "ఢీ షో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తోంది మీకు" "చాలా ఫన్ గా ఉంది. నందు, శేఖర్ మాష్టర్, ఆది అన్న, ఇంకా కంటెస్టెంట్స్ అందరితో మంచి ఫన్ గా ఉంది" అని చెప్పింది. ఇకపోతే ప్రణీత కరోనా టైంలో ఎంతో మందికి ఫుడ్ డొనేట్ చేసింది తన ఫౌండేషన్ ద్వారా. పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయిన ప్రణీత ఒక పాప పుట్టాక మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అప్పుడప్పుడు గ్లామర్ పిక్స్ అవీ షేర్ చేస్తూ ఉంటుంది. తన లేటెస్ట్ అప్ డేట్స్ ని ఫోటో షూట్స్ ని తన వెకేషన్స్ ని తన పాపతో గడిపిన మూమెంట్స్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేస్తూ ఉంటుంది ప్రణీత.

శ్రీముఖి మీద కవిత చెప్పిన వెంకీ...మడిచి జేబులో పెట్టుకోండన్న రాహుల్ సిప్లి!

సూపర్ సింగర్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో పాత ప్లే బ్యాక్ సింగర్స్ అంతా వచ్చారు. ఇక వాళ్ళను చూసేసరికి హోస్ట్ శ్రీముఖి ఆనందం అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా.. ‘కుర్చీ మడతపెట్టి’ అనే పాటే  వినిపిస్తోంది. స్టేజి మీదకు వచ్చిన ప్లే బ్యాక్ సింగర్ సాహితితో ఈ పాట పాడించింది శ్రీముఖి.. ఒక్క కుర్చీనే కాదు, మంచాన్ని,  సోఫాని మడతపెడితే సాహితిలా ఉంటుంది అంటూ ఫన్నీ కౌంటర్ వేసింది..తర్వాత కంటెస్టెంట్ వెంకటేష్ వచ్చి శ్రీముఖి మీద అద్దిరిపోయే కవిత చెప్పి రెడ్ రోజ్ ఇచ్చేసాడు. "శ్రీముఖి..ఎప్పుడో పడిపోయా నీ మాటకి..అందుకే నేను వెయ్యి సార్లు తలుచుకుంటా రోజుకి...నువ్వు ఓకే అంటే వెళదాం సికారుకు" అంటూ ఫన్నీ కవిత చెప్పేసరికి శ్రీముఖి ఫేస్ వెలిగిపోయింది. ఇక అక్కడితో ఆగలేదు వెంకీ..వెంటనే రెడ్ రోజ్ తీసుకుని మోకాళ్ళ మీద కూర్చుని ఇచ్చాడు. ఇక శ్రీముఖి ఆ పువ్వు తీసుకుని వెంకీ బుగ్గ మీద అలా సుతారంగా తాకించింది. ఇక అసలు హంగామా అంతా ఫైనల్ లో మొదలయ్యింది. "ఇక స్కోర్స్ విషయానికి వస్తే ఏ వివాదాలు లేవు" అని అనంత శ్రీరామ్ అనేసరికి "శ్వేతా గారు 7 ఇచ్చారు..అంటే మంగ్లీ, రాహుల్ కాదా " అంది శ్రీముఖి. " ఆమె అక్కడ ఎలా పెర్ఫార్మ్ చేసింది అనేది ఇంపార్టెంట్ ..ఊరికే  రాలేదు.. మీరు అలా అనడం తప్పు’ అంటూ అనంత శ్రీరామ్‌పై ఫైర్ అయ్యింది మంగ్లీ. దీంతో అనంత శ్రీరామ్.. ‘నేను అన్న మాటని వెనక్కి తీసుకోవట్లేదు" అని ఇంకా గట్టిగా బెట్టు చేసాడు.  దాంతో రాహుల్ సిప్లిగంజ్‌కి మండిపోయింది. ‘మడిచి జేబులో పెట్టుకోండి అన్న మాటను..నేను బెస్ట్ అని చెప్పట్లేదు కానీ నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా" అని చెప్తున్నా..అంటూ కౌంటర్ ఇచ్చాడు రాహుల్ సిప్లిగంజ్. 

అమ్మాయిల కోసం మీ ప్రాణాలివ్వకండి...

ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం షో ఈవారం ఫుల్ ఎనర్జిటిక్ గా సాగింది. ఈ షోకి ఆది పినిశెట్టి, సందీప్ కిషన్ వచ్చారు. హోస్ట్ మంచు మనోజ్ వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్... ఇక ఈ షోలో ఈ ఇద్దరినీ ఆడియన్స్ కొన్ని ప్రశ్నలు వేశారు. "సందీప్ కిషన్ మీరు మైకేల్ మూవీలో ఒక డైలాగ్ చెప్పారు అమ్మాయి కోసం కాకపోతే ఎందుకూ ఈ లైఫ్ అని.. మరి అలాంటి ఎవరైనా అమ్మాయి మీ లైఫ్ లో ఉందా" అని అడిగాడు. "ఏ అమ్మాయి కోసమైతే నేను ప్రాణం ఇవ్వను..మీరు కూడా ఇవ్వకండి" అని సలహా ఇచ్చాడు. తర్వాత ఆది పినిశెట్టికి మరి అభిమాని ఒక ప్రశ్న అడిగాడు. "మీ వైఫ్ నిక్కీ గారి గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే" "నేను ఇంట్రావర్ట్ ని ఆమె చాలా బబ్లీగా, ఎనర్జిటిక్ గా ఉంటుంది." అని చెప్పాడు. ఇంతలో సందీప్ కిషన్ మాట్లాడుతూ పెళ్లి ముందే స్కాం చేసాడు ఆది. ఎంగేజ్మెంట్ టైంలో వీడియో కాల్ చేసి నిక్కీ ఫోటోకి రెడ్ పెన్ తో బొట్టు పెట్టి పెళ్లయిపోయింది.. అనుకోని పరిస్థితిలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసరికి నాకు ఏడుపొచ్చేసింది. ఇటు చూస్తే ఆది బెస్ట్ ఫ్రెండ్ అటు చూస్తే నా చెల్లి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఇలాంటి ప్రాంక్ వీడియోతో నన్ను భయపెట్టేసాడు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే అంతే సంగతులు.." అన్నాడు .."ఇంట్లో అంత పెద్ద లెజెండరీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ని పెట్టుకుని ఫస్ట్ మూవీ ఏమిటి తేజా గారితో చేసావ్..ప్రొడక్షన్ దాసరి గారు " అని మంచు మనోజ్ ఆది పినిశెట్టిని అడిగాడు "ఇదంతా ప్లాన్ చేసి జరిగిన విషయం కాదు. ఒక వారం రోజుల్లో షూటింగ్ ఉందని చెప్పి ఇంట్లో వాళ్ళు తోశారు కానీ నేను అప్పటికి ప్రిపేర్ అయ్యి లేను. ఇంజనీరింగ్ చేసి పైలట్ అవుదామని అనుకున్నా..కానీ యాక్టర్ ని కావాల్సి వచ్చింది" అని చెప్పాడు ఆది. ఆది పినిశెట్టి ఒక విచిత్రం అనే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సందీప్ కిషన్ ప్రస్థానం మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు.

Brahmamudi: ఇందిరాదేవి ముందు కావ్య బయటపెట్టిన నిజం.. వాట్సప్ ఛాట్ చూసి షాకైన కళ్యాణ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -315 లో.. రాజ్ వేరేక అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్నాడని కావ్య బాధపడుతూ భోజనం చెయ్యకుండా వచ్చి పడుకుంటుంది. అప్పుడే రాజ్ వచ్చి.. ఏమైంది ఎందుకు అలా ఉంటున్నావ్? తిన్నావా అని అడుగుతాడు. కడుపు నిండా దుఃఖం ఉంది. భోజనానికి ఖాళీ లేదని కావ్య బాధపడుతు రాజ్ తో అనగానే.. నువ్వు ఇలా తినకుండా పడుకొని ఉంటే నాకెలా ఉంటుందని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ వెళ్లి కావ్యకి భోజనం తీసుకొని వచ్చి తినమని చెప్తాడు. నాకు వద్దని కావ్య అనగానే.. నీకెలా తినిపించాలో నాకు తెలుసంటూ కావ్య చేతులని తన చీరతోనే కట్టి భోజనం తినిపిస్తాడు. కావ్య మాత్రం రాజ్ ప్రేమగా తినిపిస్తుంది పట్టించుకోకుండా వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉన్న విషయాలే గుర్తుకు చేసుకొని బాధపడుతుంది. ఆ తర్వాత రాజ్ కి శ్వేత ఫోన్ చెయ్యడంతో కంగారుగా నాకు ఇంపార్టెంట్ కాల్ వస్తుందని బయటకు వెళ్లి మాట్లాడతాడు. కావ్యకి రాజ్ ప్రవర్తన ఇంకా బాధేస్తుంది. కావ్య తన బాధ  కృష్ణడితో చెప్పుకుంటుంది. అప్పుడే కావ్య దగ్గరికి ఇందిరాదేవి వచ్చి.. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఏమైంద‌ని అడుగుతుంది. భార్యని భర్త దూరం పెడుతు వేరొక అమ్మాయిని ఇష్టం పడుతున్నాడని కావ్య అనగానే.. అంటే రాజ్ గురించి అంటున్నావా అని ఇందిరాదేవి అడుగుతుంది. లేదు నా స్నేహితురాలు నన్ను సలహా ఇవ్వమని అడిగింది. మీరైతే ఏం సలహా ఇస్తారని కావ్య అడుగుతుంది. నీ స్నేహితురాలిది అనుమానం అయి ఉండొచ్చు.. మన కళ్ళతో చూసినది కూడా కొన్నిసార్లు అబద్దమై ఉంటుంది. ముందు తన భర్తకి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకునే అంత ఇష్టం ఉందో? లేదో కనుక్కోమను అని ఇందిరాదేవి చెప్తుంది. దాంతో నాకు సమాధానం దొరికిందని కావ్య అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం.. మీ అన్నయ్య, ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి. మనమే తప్పుగా అనుకుంటున్నామా అన్న విషయం కనుక్కోవాలని  కళ్యాణ్ తో కావ్య చెప్తుంది. ముందు మనం అన్నయ్య ఫోన్ లో వాళ్ళ చాట్ లిస్ట్ చదవాలని కళ్యాణ్ అంటాడు. కానీ కావ్య వేరేవాళ్ళ ఫోన్ ముట్టుకోవడం పద్ధతి కాదని అనగానే.. కళ్యాణ్ వెళ్లి రాజ్ ఫోన్ తీసుకొని వస్తాడు. అందులో ఉన్నా చాటింగ్ చూసి కళ్యాణ్ షాక్ అవుతాడు. తరువాయి భాగంలో అపర్ణ ధటన్యలక్ష్మీలకి గొడవ మొదలవుతుంది. తనని నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చింది. తనకి కూడా గుర్తింపు ఉండాలి కదా అని అపర్ణతో ధాన్యలక్ష్మి అనగానే.. ఆ విషయం నాకు కాదు. నీ కొడుకు చెప్పని అపర్ణ అంటుంది. అధికారం అంత నీ కొడుకు చేతిలో ఉంటే నా కొడుకుకి ఏం చెప్పాలని ధాన్యలక్ష్మి అనగానే అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu: కాలేజీ ఫెస్ట్ లో ఆ బ్యానర్‌ చూసి షాక్ అయ్యారు.. మరి రిషి వస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -982 లో.. ఎండీగా మొదటిసారిగా కాలేజీ ఫెస్ట్ జరిపిస్తున్నానని వసుధార భావించి జగతి ఫోటో దగ్గరికి వెళ్లి మొక్కుకొని.. త్వరగా రండి అని మహేంద్రకి చెప్పి వెళ్తుంది. వసుధార వెళ్ళగానే జగతి ఫోటో కిందకి పడిపోతుంది. అది చూసి మహేంద్ర ఏం జరుగుతుందో? ఏంటోనని భయపడుతాడు. ఆ తర్వాత వసుధార కాలేజీకి వెళ్లి స్టుడెంట్స్ తో మాట్లాడుతూ లోపలికి వెళ్తుంటుంది. అప్పుడే స్టార్టింగ్ లో వెల్కమ్ బ్యాక్ అంటు రిషి ఫ్లెక్స్ లు ఉంటాయి. అవి చూసి వసుధార షాక్ అవుతుంది. స్టుడెంట్స్ వసుధారని రిషి సర్ వస్తున్నారట కదా మేడమ్.. చాలా హ్యాపీగా ఉందని అనేసరికి వసుధారకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఆ తర్వాత వసుధార దగ్గరికి శైలెంద్ర వస్తాడు. ఇదంతా నువ్వే చేసావ్ కదా అని వసుధార అడుగగానే.. అవును ఫెస్ట్ ని సక్సెస్ చేస్తానంటూ ఛాలెంజ్ విసిరావు కదా.. అందుకే అని శైలెంద్ర అంటాడు. ప్లీజ్ ఈ ప్లెక్సీ లు తీయుంచు రిషి సర్ ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేరని వసుధార అంటుంది. ఈ విషయం ఆల్రెడీ మినిస్టర్ గారి దగ్గర వరకు వెళ్ళిందని శైలేంద్ర అంటాడు. వసుధారకి ఏం చెయ్యాలో అర్ధం కాదు. ఆ తర్వాత వసుధార లోపలికి వెళ్తుంది. స్టూడెంట్స్ ఫాకల్టీ అందరు రిషి సర్ వస్తున్నాడు. మాకు చాల హ్యాపీగా ఉందంటూ చెప్తుంటే.. వసుధారకి ఏం  చెప్పాలో అర్ధం కాదు. ఆ తర్వాత అనుపమ, మహేంద్ర కాలేజీకి వస్తారు. అక్కడ ఉన్న ఫ్లెక్సీ చూసి వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఎవరు పెట్టారని మహేంద్ర ఒక స్టుడెంట్ ని పిలిచి అడుగుతాడు. వసుధరా మేడమ్ అని స్టూడెంట్ చెప్పగానే.. వసుధార మనకి చెప్పకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకుంది. ఇప్పుడు రిషి ఎలా వస్తాడని వసు దగ్గరకి వెళ్లి అడుగుతారు. నేను చెయ్యలేదు.. అదంతా శైలెంద్ర పనే అని వసుధార చెప్పగానే.. వాడు మనల్ని తెలివిగా కరెక్ట్ టైమ్ చూసి ఇరికించాడని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత అక్కడికి ఫణీంద్ర వచ్చి.. నాకు తెలుసు వసుధార.. నువ్వు రిషిని తీసుకొని వస్తావంటు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. మినిస్టర్ గారు వస్తున్నారంటు మహేంద్రని ఫణీంద్ర తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు ఏం  చేస్తావని వసుధారని అనుపమ అడుగుతుంది. నన్ను కాసేపు వదిలెయ్యండి. నేను అలోచించుకోవాలని వసుధార అనగానే అనుపమ వెళ్లిపోతుంది. ఆ తర్వాత వసుధార దగ్గరికి శైలేంద్ర వచ్చి.. ఇప్పుడు నువ్వు రిషి ని తీసుకొని రాలేవు. స్టూడెంట్స్ అందరు గొడవ చేస్తారు. ఫెస్ట్ ఫెయిల్ అవుతుంది. అందుకే ఈ ప్లాన్ చేశానని శైలేంద్ర అనగానే రిషి సర్ ని తీసుకొని వస్తాను. ఇక నువ్వు బయపెట్టడం.. నేను భయపడడం వద్దు. ఈ రోజుతో అన్ని క్లోజ్ .. రిషి సర్ వస్తారు. నీ నిజస్వరూపం అందరి ముందు బయటపెడతానని వసుధార అనగానే.. శైలేంద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Krishna Mukunda Murari: అతను వెనకాల నుండి వచ్చి ఆమెపై చెయ్యి వేసాడు.. ఒక్కసారిగా అరిచేసింది!

స్టార్ మా టీవీలో  ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -376 లో.. ఆదర్శ్ ముకుంద దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. సారీ అని ఆదర్శ్ చెప్పగానే ఎందుకని ముకుంద అడుగుతుంది. నిన్ను అపార్థం చేసుకొని ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాను కద.. అలోచించి ఉంటే బాగుండేదని ఆదర్శ్ అంటాడు. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను.. ఆ విషయం మురారికి చెప్పాను. నీ ఫోటో చూడగానే మురారి తన ప్రేమని త్యాగం చేసి.. నిన్ను పెళ్లికి ఒప్పించి మన ఇద్దరి పెళ్లి చేసాడని ఆదర్శ్ తన ప్రేమ గురించి ముకుందకి చెప్తాడు. నిన్ను మర్చిపోలేక ఇన్ని రోజులు నరకం అనుభవించాను కానీ నువ్వు నాకోసం ఎదరు చూస్తున్నావని తెలిసి వచ్చానని ఆదర్శ్ చెప్తుంటే.. ముకుంద మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. జర్నీ చేసావ్ కదా టైడ్ అయ్యావ్.. ఫ్రెషఫ్ అయి రా అని ముకుంద చెప్పగానే ఆదర్శ్ వెళ్తాడు. ఆ తర్వాత తనపై ఆదర్శ్ చూపించే ప్రేమని ముకుంద చూసి భయపడుతుంది. అదేసమయంలో కృష్ణ దగ్గరికి మురారి వచ్చి.. నువ్వు చాలా గ్రేట్.. నాకు ఏసీపీగా కంటే కృష్ణ మొగుడు అనే ప్రౌడ్ గా ఉందని మురారి చెప్తాడు. ఆదర్శ్ వచ్చాకే శోభనం అన్నావ్ కదా అని రొమాంటిక్ గా కృష్ణ దగ్గరకి వస్తుంటే.. ముహూర్తం పెట్టాకే అంటు మురారి చెంపపై కృష్ణ ముద్దు పెట్టి వెళ్లిపోతుంది. అందరు భోజనం చెయ్యడానికి వస్తారు. మాటల్లో తింగరి అని కృష్ణని రేవతి అంటుంటే.. నేను ఇప్పుడు తింగరిని కాదు. ఇప్పుడు నేను పెద్ద పెద్ద పనులు చేసానని కృష్ణ అంటుంది. అప్పుడే వస్తున్న భవాని చూసి.. నువ్వు ఎప్పుడు తింగరివే అంటుంది. అలా అనగానే అందరు నవ్వుకుంటారు. ఆ తర్వాత కృష్ణ అంటు మురారి గట్టిగా అరుస్తుంటాడు. అక్కడ అందరు ఉండడం చూసి ఆగిపోతాడు. ఏంటి ఎదో చెప్పబోయ్యవని మురారిని అందరు అడుగుతారు. కృష్ణకి సంబంధించిన తింగరి పని చెప్పగానే అందరు నవ్వుకుంటరు. ఆ తర్వాత ఆదర్శ్ కి  భవాని భోజనం వడ్డీస్తుంటుంది. అది చూసి ముకుంద వడ్డీస్తే నాకు చూడాలని ఉందని కృష్ణ అంటుంది. కానీ అదేం పట్టించుకోకుండా ఆదర్శ్ కి భవాని భోజనం వడ్డీస్తూ, ప్రేమగా తినిపిస్తుంది. తరువాయి భాగంలో.. నా ప్రేమని ఎలా మర్చిపోవాలని ముకుంద అనుకుంటు ఉండగా.. వెనకాల నుండి ఆదర్శ్ వచ్చి ముకుందపై చెయ్యి వేస్తాడు. దాంతో ముకుంద భయపడుతు అరుస్తుంటే అందరూ వస్తారు. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

Eto Vellipoyindhi Manasu :‌ కాలేజీలో సీక్రెట్ లవ్.. సీతాకాంత్ రామలక్ష్మిల బంధమేంటో తెలుసుకోగలరా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏటో వెళ్లి పోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -4 లో.. సీతాకాంత్ తన చెల్లెలు సిరిపై ఉన్న ప్రేమతో తనకి శత్రువు వల్ల ఇబ్బంది కలగకూడదని కాలేజీకీ సైతం తనతో సెక్యూరిటీస్ ని పంపిస్తాడు. దాంతో సిరి కోపంగా వెళ్లిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఎవరి గురించో ఆలోచించి.. సిరి యొక్క చిన్న చిన్న ఆనందం మిస్ చేస్తున్నావని వాళ్ళ తాతయ్య అంటాడు. నా చెల్లిని కాపాడుకుంటున్నానని సీతాకాంత్ అంటాడు. నువ్వు ఒక ఎమోషనల్ ఫూల్ వి అని వాళ్ళ తాతయ్య అనగానే.. అవును నేనొక ఫ్యామిలీ ఎమోషనల్ ఫూల్ ని అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత సిరి కాలేజీకి వెళ్తుంది ధన కూడా అదే కాలేజీ. తన ఫ్రెండ్స్ సిరి గురించి మాట్లాడుతుంటే.. మీకు వేరే పనే లేదా అంటూ వాళ్ళని క్యాంటీన్ కి తీసుకొని వెళ్తాడు. అసలు ట్విస్ట్ ఏంటి అంటే ధన, సిరి ఇద్దరు లవర్స్. ఆ విషయం వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడ తెలియకుండా లవ్ చేసుకుంటారు. వాళ్ళు క్యాంటీన్ లో కూర్చొని ఎవరికి కన్పించకుండా తాము తింటున్న ఫుడ్ ని షేర్ చేసుకుంటారు. సిరి చేతిని ధన పట్టుకొని ఉండగా.. ధన ఫ్రెండ్ చూసి.. వీళ్ళు ఇంత సీక్రెట్ గా లవ్ చేసుకుంటున్నారా అని ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత సీతాకాంత్ కార్ పై ఉన్నా కలర్ చూసి వాష్ చెయ్యకుండా ఉంటే బావగారు తిడుతారని సీతాకాంత్ తమ్ముడి భార్య అంటుంది. పని వాళ్ళకి చెప్పి క్లీన్ చేపిస్తుండగా డ్రైవర్ వచ్చి.. వద్దని చెప్తాడు. ఎందుకని అడుగగా.. ఒక అమ్మయి ఇలా సర్ కార్ పై కలర్ చల్లింది.‌ ఆ అమ్మయి వచ్చే క్లీన్ చెయ్యాలని డ్రైవర్ చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ మరదలు కావాలనే.. ఎవరో అమ్మయి అంట అంటు వాళ్ళ అత్తయ్యకి వినపడేలా అంటుంది. దాంతో ఆవిడ వెళ్లి సీతాకాంత్ ని విషయమేంటని అడుగుతుంది. అవునని చెప్తాడు. అక్కడే ఉన్న వాళ్ళ తాతయ్య.. నువ్వేంటి.. అంత జరిగితే ఏం అనకపోవడమేంటని అడుగుతాడు. నాకేం అర్థం కాలేదు.. వింతగా అనిపించిందని అతని అనుభూతిని వాళ్ళ తాతయ్యతో సీతాకాంత్ చెప్తాడు. అదే సమయంలో రామలక్ష్మి తన చెల్లెలితో డ్రెస్ కి ఉన్నా కలర్ గురించి చెప్తు.. అప్పుడు తన అనుభూతిని చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ బరత్ దగ్గర ఉన్నా బ్యాండ్ వాళ్ళ దగ్గరకి వెళ్లి వాళ్ళ ద్వారా రామలక్ష్మి అడ్రస్ తెలుసుకొని  వాళ్ళింటికి వెళ్తాడు. అనుకోకుండా రామలక్ష్మి, సీతాకాంత్ లు పక్కన నుండి వెళ్తూ ఆగిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

టీఆర్పీలో బ్రహ్మముడి సీరియల్ నెంబర్ వన్!

స్టార్ మా టీవీ సీరియళ్ళలో అత్యధిక టీఆర్పీ పొందుతున్న సీరియల్ గా 'బ్రహ్మముడి' నిలిచింది. రెండవ స్థానంలో 'నాగపంచమి', మూడవ స్థానంలో 'కృష్ణ ముకుంద మురారి' ఉండగా.. నాల్గవ స్థానంలో 'నువ్వు నేను ప్రేమ' ఉంది.  ఆ తర్వాత అయిదవ స్థానంలో కొత్త సీరియల్ 'గుండెనిండా గుడిగంటలు' ఉంది. గత కొన్ని నెలలుగా స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే అన్ని సీరియల్స్ లో 'బ్రహ్మముడి' అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తుంది. దీనికి కారణం కథ బాగుండటం ఒకటైతే.. ఆన్ స్క్రీన్ పై రాజ్-కావ్యల మధ్య బాండింగ్ ఉంది. అలాగే దుగ్గిరాల ఇంట్లో సాగే ఎమోషనల్ సీక్వెన్స్ సీన్స్, అక్కచెల్లెళ్ళ మధ్య సాగే గొడవలు.. ఇవన్నీ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అవుతున్నాయి. కనకం, కృష్ణమూర్తిల మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్.. తెలుగింటి ప్రేక్షకులకు దగ్గరగా ఉంది. బొమ్మలకి రంగులు వేసుకుంటూ కృష్ణమూర్తి కనకం ఇద్దరు తమ ఇద్దరు కూతుళ్ళు కావ్య, స్వప్నలని చదివించి దుగ్గిరాల ఇంటి కోడళ్ళుగా చేశారు.  కావ్యని దుగ్గిరాల ఇంట్లో మొదట అందరు ద్వేషించేచారు. ఇక కొన్ని ఎపిసోడ్ ల ముందు వరకు కావ్యని ధాన్యలక్ష్మీ, ఇందిరాదేవీ, సీతారామయ్య, సుభాష్, కళ్యాణ్ లు ఇష్టపడగా.. తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ లలో అనామిక-కళ్యాణ్ ల పెళ్ళి జరిగింది. ఇక ఒక ప్లాన్ ప్రకారం దుగ్గిరాల ఇంట్లోకి అడుగుపెట్టిన అనామిక.. కావ్య మీద ఇంట్లోని వాళ్ళందరికి ఉన్న మంచి అభిప్రాయం పోగొట్టి తను మంచి కోడలిని అనిపించుకోవాలని తాపత్రయపడుతుంది. ఇక రాహుల్ వాళ్ళ అమ్మ రుద్రాణి ఇదే మంచి ఛాన్స్ అని భావించి అనామికని తనవైపు తిప్పుకుంది. ఇంట్లో కవితలు రాసుకుంటూ కూర్చుండే కళ్యాణ్ ని చూసిన తన భార్య అనామికకి నచ్చట్లేదు. ఆ విషయాన్ని అత్త ధాన్యలక్ష్మీతో చెప్పింది. అదే విషయాన్ని అపర్ణతో ధాన్యలక్ష్మి చెప్పింది. అధికారమంతా రాజ్ చేతిలో ఉంటే నా కొడుకు ఏం చేస్తాడు? వాడికి ఆపీస్ భాద్యతలు అప్పగించమని అక్క అపర్ణకి మొదటిసారి ధాన్యలక్ష్మీ ఎదురుతిరిగింది. ఇదంతా విని ఇంట్లో వాళ్ళంతా షాక్ అయ్యారు. అసలేం జరుగుతుంది.. ఎన్నడు అపర్ణని చూసి ఒక్క మాట కూడా మాట్లాడని ధాన్యలక్ష్మి ఇలా అడిగిందేంటని అందరు అనుకుంటుండగా ఎపిసోడ్ ముగిసింది. మరి ఆ తర్వాతి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో‌ అనే క్యూరియాసిటిని పెంచారు మేకర్స్. ఇలా ఈ సీరియల్ కథ మిగతా సీరియల్స్ కంటే భిన్నంగా ఉండటంతో అత్యధిక టీఆర్పీ పొందుతుంది.

ఇంట్లో గొడవ అవుతుంటే వీడియో తీసింది.. ఆ తర్వాత  ఏం జరిగిందంటే!

ప్రతీ ఒక్కరి ఇంట్లో గొడవలు కామన్. అక్కచెల్లెళ్ళ గొడవ, అన్నాతమ్ముళ్ళ గొడవ జరుగుతుంది. అయితే ఇంట్లో అమ్మ తిట్టే తిట్లు అందరు ఫేస్ చేసినవే. అవన్నీ ఓ వయసొచ్చాక మెమరీలా ఉంటాయి. అయితే అనుకోకుండా జరిగిన గొడవని రీతు చౌదరి ఓ వ్లాగ్ ని చేసింది. కొన్ని రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి ప్యారిస్ కి వెళ్ళిన రీతూ చౌదరి.. అక్కడ అసలు విషయం చెప్పింది. తన బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదంటు విష్ణుప్రియే తన ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అంటు చెప్పుకొచ్చింది. అయితో తాజాగా చేసిన " ప్యారిస్ లో విష్ణుకి నాకు గొడవ అయింది " అనే వ్లాగ్ చేసింది. ఇప్పుడేమో "  మా ఇంట్లో గొడవ అవుతుంటే ఎవరికి తెలియకుండా వీడియో తీసాను" అనే వ్లాగ్ ని తన యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది. ఇందులో రీతూ చౌదరి వాళ్ళ అమ్మ ఇంట్లో చికెన్ కర్రీ చేస్తుంటే రీతూ మధ్యలోకి వెళ్ళి కావాలని గొడవ జరగాలని కారం బాగా వేసింది. దాంతో వాళ్ళ అమ్మకి తనకి గొడవ జరిగింది. అలాగే వాళ్ళింటికి బంధువులు రావడంతో వారికి పెట్టకుండా తనే ముందు తినేస్తుందని తనకి మర్యాదలు తెలియవని రీతూ వాళ్ళ అమ్మ సరదాగా అనేసింది.  రీతు చౌదరి దావత్ అనే ఓ షోకి యాంకర్ గా చేస్తుంది. అయితే ఈ దావత్ షోలో ఎపిసోడ్ నెంబర్-5  లో సోహెల్ గెస్ట్ గా వచ్చాడు. ఇందులో రీతు చౌదరి అడిగిన కొన్ని బోల్డ్ ప్రశ్నలకి ‌సోహెల్ ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఇన్ స్ట్రాగ్రామ్ లలో రీల్స్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే రీతు చౌదరి వాళ్ళ నాన్న చనిపోయాక తను చేసిన ఓ వీడియో అప్పట్లో వైరల్ గా మారగా.. ఈ దావత్ షోకి యాంకర్ గా తను అడిగే ప్రశ్నలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందం, అభినయం, ఇతర టాలెంట్లతో కొంతమంది సెలెబ్రిటీలు ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫేమ్ రీతూ చౌదరి ఒకరు. ఎప్పుడు ఏదో హాట్ ఫోటో షూట్ తో రీతూ చౌదరి వార్తల్లో నిలుస్తుంది.  

Ambati Arjun:వహ్వా అనిపించేలా అంబటి సురేఖ మెటర్నిటీ ఫోటోషూట్!

భార్యభర్తలిద్దరికి తమ పిల్లలంటే ఎంతో ఇష్టం ఉంటుంది‌. ఎంతలా అంటే తమ కడుపు నిండా పోయిన పిల్లల కడపునిండా తినాలని ఆలోచిస్తుంటారు. అలాగే ఏ తల్లి అయిన తమ పిల్లల్ని కడుపులో ఉన్నప్పటి నుండే ప్రేమించడం ప్రారంభిస్తుంది. అందుకే ప్రెగ్నెన్సి టైమ్ లో తల్లి ఎంతగానో మురిసిపోతుంది. దానిని ఓ జ్ఞాపకంలా ఉంచడానికి అంబటి అర్జున్ తన భార్యతో కలిసి మెటర్నిటి ఫోటో షూట్ చేశాడు‌. ప్రస్తుతం మార్కెట్ లోకి ఎన్నోరకాల ఫోటోషూట్ లు వచ్చాయి. అప్పుడే పుట్టిన బాబు నుండి మొదలుకొని బాబు పుట్టినరోజు ఫోటోషూట్, అన్నప్రాసన ఫోటో షూట్, స్కూలింగ్ ఫోటో షూట్, వాకింగ్ ఫోటో షూట్.. పెళ్ళి షూట్, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. అయితే మెటర్నిటి ఫోటోషూట్ ఈ మధ్య ట్రెండింగ్ లోకి వచ్చేసింది. విదేశాలలో కొన్ని సంవత్సరాల క్రితం మొదలైన ఈ మెటర్నిటి ఫోటోషూట్ కల్చర్ ఇప్పుడు ఇండియాకి వచ్చేసింది‌. అక్కడ విదేశాలలో పొట్ట మొత్తం కనపడేలా వీడియోలు, ఫోటోలతో సెలెబ్రేట్ చేసుకుంటారు‌. ఇక ఇప్పుడు అదే ఇక్కడ మొదలైంది. బిగ్ బాస్ సీజన్‌ సెవెన్ కంటెస్టెంట్ అంబటి అర్జున్ తన భార్య కోసం మెటర్నిటి ఫోటోషూట్ చేపించాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో‌ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్ళిన కంటెస్టెంట్ అంబటి అర్జున్.  హౌస్ లోకి వెళ్ళిన మొదటి వారం నామినేషన్ లోనే అతని మనస్తత్వం అందరికి అర్థమైంది. తన ఫ్రెండ్ అమర్ దీప్ ని నామినేషన్ చేసి అతడికి షాకిచ్చాడు. ఆ తర్వాత గేమ్ లో‌ గానీ హౌస్ లో గానీ ఏ హౌస్ మేట్ అయిన తప్పు చేస్తే అది అప్పుడు చెప్పకుండ నామినేషన్ లో చెప్పేవాడు. నేను తప్పు చేయను..‌ నా ముందు తప్పు చేస్తే నేను ఊరుకోను అన్న ధోరణిలో‌ అంబటి అర్జున్ ఉండేవాడు. ఇక ఫ్యామిలీ వీక్ లో ప్రెగ్నెంట్ తో ఉన్న అంబటి సురేఖ హౌస్ లోకి వచ్చింది. దాంతో హౌస్ అంతా కలసి తనకి శ్రీమంతపు వేడుక చేశారు.‌ ఇక బిగ్ బాస్ సీజన్ ముగిసాక స్టేజ్ మీద నాగార్జునతో‌ అంబటి అర్జున్‌ మరియు తన భార్య అంబటి సురేఖ కలిసి దిగిన ఫోటోలే బిగ్ బాస్ జ్ఞాపకాలంటూ షేర్ చేసాడు.‌ కొన్ని రోజుల క్రితం వీరికి పాప పుట్టింది‌. ఇప్పుడేమో అంబటి సురేఖ ప్రెగ్నెన్సీతో‌ ఉన్నప్పుడు చేసిన మెటర్నిటి ఫోటోషూట్ ని తన ఇ‌న్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు అర్జున్.  అచ్చ తెలుగు సంప్రదాయాలకి ప్రతీకగా  ఈ ఫోటోషూట్ ఉంది. అందుకే ఇప్పుడు వైరల్ గా మారింది.  

బాతుటబ్బులో హాలీవుడ్ హీరోయిన్ లా పింకీ..ఆర్జీవీ కూడా ఐస్ లా మెల్ట్ అవ్వాల్సిందే

జబర్దస్త్ లో, బిగ్ బాస్ లో అందాల అమ్మడు ప్రియాంక సింగ్ సంపాదించుకున్న ఫేమ్ అంతా ఇంతా కాదు. పింకీ సోషల్ మీడియాని కూడా షేక్ చేసేస్తూ ఉంటుంది. హాట్ ఫోటో షూట్స్ తో కిర్రాక్ పిక్స్ తో యూత్ కి నిద్ర లేకుండా జాగారం చేయించడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అలాంటి ప్రియాంక ఇప్పుడు ఒక బ్లాస్ట్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూస్తే ఆర్జీవీ కూడా ఐస్ లా మెల్ట్ అవ్వాల్సిందే అన్నట్టుగా ఉంది పింక స్ట్రక్చర్...బాతు టబ్బు షవరులో రెడ్  వైన్ గ్లాస్ తో మత్తెక్కించే కళ్ళతో హాలీవుడ్ హీరోయిన్ రేంజ్ లో పాప కూల్ వెదర్ లో హాట్ గా ఫోజులిచ్చింది.  "నేనేం ఏం చేసినా తప్పుగా అంటున్నారు..ఇదే నా పని అండి..నేను ఇదే చేయగలను. మీరు  మీ జాబ్స్ ఎలా చేస్తారో నేను కూడా అంతే. ఇది ఒక ప్రైవేట్ సాంగ్ కి సంబంధించిన షూటింగ్. త్వరలో మీ ముందుకు రాబోతోంది. మీరంతా చూస్తారని ఆశిస్తున్నాను ...మీరేమనుకున్న సరే  అందరికి  సమాధానాలు ఇవ్వలేకపోతున్నా. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను" అని కామెంట్ పెట్టింది.  బిగ్‌బాస్‌లోకి వెళ్లిన పింకీ తన ఆట తీరుతో ఆడియన్స్ మనసులు గెలుచుకుంది. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా  పేరు తెచ్చుకుంది.  మానస్ నాగులపల్లి అంటే చాలా ఇష్టం కానీ అతను మాత్రం ఆమెను అస్సలు పట్టించుకోలేదు. ఇక నెటిజన్స్ ఐతే "కళ్ళు చెదిరే అందం...హాట్ బ్యూటీ...హాలీవుడ్ నటిలా ఉన్నారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.