Kumari Aunty: కుమారి ఆంటీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తుందా?

ఓ సాధారణ మహిళని అసాధారణలో స్థాయి క్రేజ్ వచ్చేలా చేయాలంటే అది సోషల్ మీడియాకే సాధ్యమవుతుంది. తెలుగునాట సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పటికే ఎందరో ఫేమస్ అయ్యారు.‌ ఇక కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో కుమారి ఆంటీ పేరు మారుమోగిపోతోంది. హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే ఓ సాధారణ మహిళ కుమారి ఆంటీ. తనని నేడు సెలబ్రిటీ రేంజ్ కి తీసుకొచ్చారు. చిన్నా మీది మొత్తం 1000 అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా. కుమారి ఆంటీ డైలాగ్.. ఈ ఒక్క డైలాగ్ తో ఇన్ స్టాగ్రామ్ మొత్తం గత రెండు మూడు వారాలుగా ఒక్కటే మ్యూజిక్.. ఎక్కడ చూసిన కుమారి ఆంటీ రీల్స్, మీమ్స్.. ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది కుమారి ఆంటి. హైదారాబాద్ లోని ఇనార్బిట్ మాల్ దగ్గరలో ఫేమస్ హోటల్ ITC కోహినూర్ ఉంటుంది.  అ హోటల్ కి దగ్గరలో మధ్యాహ్నం టైమ్ లో చిన్న టెంట్ వేసుకొని.. ఫుల్ మీల్స్ తొంభై, భగారా రైస్ అరవై.. అంటూ భోజనం వడ్డిస్తుంది కుమారి ఆంటీ. సాధారణంగా రోడ్డు పక్కన డబ్బులు తీసుకొని భోజనం పెట్టేవాళ్ళు చాలామందే ఉంటారు.‌ కానీ కుమారి ఆంటీ ఏ ముహుర్తానా ఆ వెయ్యి, రెండు లివర్లు ఎక్స్ ట్రా అందో అక్కడి నుండి ఫుల్ ఫేమస్ అయింది. ఇక ఎక్కడెక్కడి నుండో తన దగ్గరికి భోజనం చేయడానికి వస్తున్నారంట. ఇక అది తెలుసుకొని ఆ ప్లేస్ లో ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు వచ్చి షాప్ క్లోజ్ చేపించారు. ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారిన కుమారి ఆంటీకి.. చిన్న సెలబ్రిటీల దగ్గరి నుండి సినిమా హీరోల వరకు తమ సపోర్ట్ అందించారు. వీళ్ళతో‌ పాటుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం తన మద్దతు తెలపడం విశేషం. ఆయన చొరవతోనే ఆ షాప్ మళ్ళీ ఓపెనయింది. ఓ ప్రైవేట్ ఛానెల్ వాళ్ళు కుమారీ ఆంటీని చేసిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన ప్రశ్నని సంధించారు. మీరు ఈటీవీలో ప్రసారం అవుతున్న ' శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకి వెళ్తున్నారంట కదా అని వారు అడుగగా.. అదేం లేదండి అని నవ్వుతూ సమాధానమిచ్చింది కుమారీ ఆంటీ. ఒకవేళ ఆ షోకి వెళ్తే డ్యాన్స్ చేస్తారా? స్కిట్ చేస్తారా అని అడుగగా.. ఏమో తెలియదని కుమారీ ఆంటీ అంది. మరి నిజంగానే ఆ షోకి కుమారి ఆంటీ వెళ్తుందా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ‌ఇదే నిజమైతే ఇక ఇన్ స్టాగ్రామ్ మీమర్స్ కి పండగే అని నెటిజన్లు భావిస్తున్నారు.

బీచ్ లో దివి యోగా.. వైరల్ గా మారిన ఆ ఫోటో!

ప్రణామం.. ప్రణామం.. ప్రభాత సూర్యుడికి ప్రణామం అంటూ సాగే పాట ఎంత ఫేమసో అందరి తెలిసిందే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ పాట ప్రతీ వేకువలో సూర్యోదయం చూడగానే గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ పాటకి ఎన్టీఆర్ నటన అంత బాగుంటుంది. ఇప్పుడు అదే సూర్యోదయాన్ని మరింత ఆకట్టుకోవడానికి దివి తన యోగా స్టిల్స్ ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. దివి వాద్య.. ఈ పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 లో ఛాన్స్ కొట్టేసి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామకి మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటుంది. ఈమె ఇండస్ట్రీకి మొదటగా ఒక మోడల్ గా పరిచయం అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో వెండి తెర పై మెరుపు తీగలా అలా వచ్చి ఇలా వెళ్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది.  అలా నక్క తోక తొక్కినట్లు వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది. దివి వాద్య ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో చేసి మెప్పించింది. ఆ తర్వాత 'భోళా శంకర్' మూవీలో నటించింది. అయితే దివి గతకొంత కాలం నుంచి తన ఇన్ స్టాగ్రామ్ లో  హాట్ ఫొటోస్ పెడుతూ యూత్ ని ఆకర్షిస్తోంది. అలా తను పోస్ట్ చేసిన ఆ ఫొటోస్ చూసిన కొందరు నెటిజన్లు.. నీ అందంతో చంపేస్తావా ఏంటిని కామెంట్స్ చేస్తున్నారు.  తాజాగా  బీచ్ దగ్గర దివి యోగా చేస్తు కొన్ని ఫోటోలు అప్లోడ్ చేయగా.. అందులో ఓ ఫోటో మాత్రం మరీ బోల్డ్ గా ఉంది. దాంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. దీనికి రకరకాల కామెంట్లు రాగా అందులో‌ పాజిటివ్ కంటే నెగెటివ్ కామెంట్లే ఎక్కువగా ఉన్నాయి. ఇలా తను ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ తో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తుంది. దివి త్వరలో కవర్ సాంగ్స్, మరికొన్ని వెబ్ సిరీస్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జీ-5లో విడుదలైన 'ఏటీఎమ్' వెబ్ సిరిస్ లో నటించిన దివి.. తన అందాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ భామని కొందరు నెటిజన్లు హీరోయిన్ మెటీరియల్ అని అంటున్నారు. మరి ఎవరైనా యంగ్ హీరో పక్కనైనా తనకి హీరోయిన్ గా ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాలి మరి.

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కి భారీ బందోబస్త్.. ఇదే కదా రైతు విజయం!

ఇది కదా రైతు కథ.. ఇదే కదా రైతు కల.. సామాన్యుడిగా మొదలైన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ప్రయాణం.. ఎంతోమంది రైతులకి స్పూర్తినిచ్చింది. ఎక్కడో పొలంలో పనిచేసుకునే రైతు.. ఓ సెలెబ్రిటీ హోదాని దక్కించుకున్నాడు.  ఓ ఇరవై మంది సెలబ్రిటీలున్న రియాలిటీ షోలో వారందరిని కాదని గెలుపుని సొంతం చేసుకున్న రైతుబిడ్డగా చరిత్ర సృష్ణించాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ సీజన్-7 మొదటి వారం నుండి చివరి వరకు ఆటల్లో మెరుపు వేగంతో దూసుకుపోతూ తగ్గేదేలే అన్న రైతుబిడ్డ ‌పల్లవి ప్రశాంత్ కి విశేష ఆదరణ లభించింది. బిగ్ బాస్ సీజన్-5 కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ నుండి అరియాన వరకు దాదాపు అందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రైతుబిడ్డకి సపోర్ట్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు. హౌస్ లోకి ఎంటర్ అయ్యాక ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ప్రశాంత్. సీరియల్ బ్యాచ్ అతడిని తక్కువ చేసి చూశారు. అయితే హౌస్ లోని ప్రతీ ఆటలో వందకి వంద శాతం ఎఫర్ట్ పెట్టి తనేంటో నిరూపించుకున్నాడు ప్రశాంత్.  చివరివరకు తగ్గేదేలా అంటు రెచ్చిపోయాడు. సెలెబ్రిటీలందరిని దాటేసి రైతుబిడ్డ సత్తా చాటుకున్నాడు. పల్లవి ప్రశాంత్ ని హౌస్ లోకి వెళ్ళనంతవరకు ఎంతోమంది ఎగతాళి చేశారు. వారందరికి తన గెలుపుతో‌ సమాధానం చెప్పాడు.  పల్లవి ప్రశాంత్ ది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామం. తండ్రి సత్తయ్య రైతు. డిగ్రీ వరకు చదువుకున్న ప్రశాంత్ కి కల్చరల్  యాక్టివిటీస్ అంటే మక్కువ. స్నేహితులతో కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి నెటిజన్లకి దగ్గరయ్యాడు. ఆ ఛానెల్ విషయంలో స్నేహితుల మధ్య వివాదం రావడంతో సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. కానీ వాళ్ళ నాన్న ఇచ్చిన ధైర్యంతో వ్యవసాయం చేయడం మొదలెట్టాడు. రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. ' అన్నా మల్లొచ్చినా..‌ మల్లొచ్చిన అంటే తగ్గేదేలే' అనే ఆ వీడియో ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీ ఇచ్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి, నీతిగా నిజాయితీగా ఆడి రైతుబిడ్డ తల్చుకుంటే ఏదైనా సాధించగలడని నిరూపించాడు. చివరికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ గెలిచాడు.  తాజాగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామానికి పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు. ‌అక్కడ జనాలు అతడిని చూడటానికి పోటీపడ్డారు. దాంతో అక్కడి లోకల్ పోలీసులు పల్లవి ప్రశాంత్ కి సెక్యూరిటీగా వచ్చారు. బిగ్ బాస్ తర్వాత పోలీసులు అరెస్టు చేయగా.. ఇప్పుడు  పోలీసులు సెక్యూరిటీగా రావడం నిజంగా గ్రేట్ అంటు పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‌కాగా ఇది ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు.. కానీ ఆఫీసులో ఏం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -12 లో.. సెక్యూరిటీ లేకుండా సిరి కాలేజీకి వెళ్తుండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ధనతో కబుర్లు చెప్తుంటుంది. మా అన్నయ్య అంటే నాకు ఇష్టమని సిరి చెప్తుంది. రెండు వేళ్ళు చూపించి ఒకటి నేను.. ఒకటి మీ అన్నయ్య ఎవరు ఇష్టమో ఒక వేలు పట్టుకో అని ధన అడుగగా.. కాసేపటికి సిరి రెండు వేళ్ళు పట్టుకొని నాకు ఇద్దరు ఇష్టమే అని చెప్తుంది. మీ అన్నయ్యకి నువ్వు ఇష్టమే కదా మన విషయం చెప్పు.. పెళ్లి చేసుకుందామని ధన అంటాడు. ఇప్పుడే వద్దు పెళ్లికి ఇద్దరు కాదు రెండు ఫ్యామిలీస్ ఉండాలని.. నీ ఫ్యామిలీ గురించి ఒక్కసారి కూడా చెప్పలేదు ఎందుకు మీ నాన్నకి బాషా అంత ప్లాష్ బ్యాక్ ఉందా అని సిరి అనగానే... ఏమని చెప్పాలి తాగి పడుకుంటాడని చెప్తే ఎం బాగుంటుందని ధన మనసులో అనుకుంటాడు. మరొక వైపు మాణిక్యం పడుకొని ఉంటాడు. మీకు లోన్స్ కావాలా అంటూ ఫోన్లు చేసి విసిగిస్తూ ఉండడంతో కావాలని కాల్ చేసిన అతన్ని ఇంటికి పిలుస్తాడు.. అతను వచ్చి మీకు కార్ ఉందా లోన్  ఇస్తామని అనగానే.. ఉంది అంటూ చిన్న పిల్లలు ఆడుకునే కార్ చూపిస్తాడు. మరి ఎందుకు అన్నావ్.. నా టైమ్ నా పని అంత చెడగొట్టావ్ అంటు అతనిపై మాణిక్యం విరుచుకుపడడంతో బయపడిన అతను.. ఇప్పుడేం చెయ్యలి అంటాడు. నా పని మొత్తం చెయ్యాలని మాణిక్యం చెప్తాడు. దాంతో ఏం చెయ్యలేక ఇంటి పని మొత్తం చేస్తాడు. మరొకవైపు నీకు ఆఫీస్ లో వాటా ఉంది అంటు శ్రీవల్లి బలవంతంగా సందీప్ ని ఆఫీస్ కి తీసుకొని వెళ్తుంది. ఎలా ఉండాలంటూ అంతా నేర్పిస్తుంది. వెళ్లి సీతాకాంత్ చైర్ లో కూర్చొమని చెప్పగానే సందీప్ కూర్చుంటాడు. పీఏ వచ్చి లేమ్మని అనడంతో శ్రీవల్లి అతని చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ వచ్చి ఆఫీస్ కి నువ్వు ఎప్పుడైనా రావచ్చు కానీ నీకు నువ్వుగా రావాలి ఒక అర్హత జ్ఞానం సంపాదించుకోని రావాలని సందీప్ కి సీతాకాంత్ చెప్తాడు. కాసేపటికి సందీప్ శ్రీవల్లి ఇంటికి వచ్చాక.. ఎందుకు ఆఫీస్ కి వెళ్లారంటూ సందీప్ వాళ్ళ అమ్మ తిడుతుంది. ఆ తర్వాత ధనకి సిరి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Krishna Mukunda Murari : ఆ కాంపిటీషన్ కి వెళ్ళమని చెప్పి‌న మురారి.. కృష్ణ కర్పూరం ఆరిపోయిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -384 లో.. వాళ్ళకి ఇప్పుడే ఫస్ట్ నైట్ వద్దని అంది. మనకి ముహూర్తం పెట్టుకోమని చెప్పింది కదా.. ఇంకెందుకు ఆలస్యమని మురారి అంటాడు.. వాళ్ళకోసమే ఇన్ని రోజులు ఆగాము.. వాళ్ళతో పాటు మాకు అంతే కానీ ఇప్పుడు మాకు వద్దని భవాని అత్తయ్యకి చెప్పానని కృష్ణ అనగానే.. మురారి డిస్సపాయింట్ అవుతాడు. పదిరోజుల తర్వాత కూడా పెద్దమ్మ వద్దని చెప్తే ఎలా అని మురారి అంటాడు. అదే ఆ లోపు ముకుంద పూర్తిగా మారిందని అత్తయ్యకి నమ్మకం కలిగించాలని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత అందులో ఏదైనా చేయాలని కృష్ణ అనగానే.. నా దగ్గర ఐడియా ఉంది. నా ఫ్రెండ్ బెస్ట్ కపుల్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాడు. మన ఇద్దరిని రమ్మని చెప్పాడు. మనతో పాటు ఆదర్శ్ ముకుందల పేర్లు ఇస్తే అందులో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే అందరికి ముకుంద మారిందో లేదో అనుమానం క్లియర్ అవుతుందని మురారి అనగానే.. కృష్ణ సరే అంటుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. కర్రీస్ లో సాల్ట్ వెయ్యడం మర్చిపోయావా కృష్ణ అని అందరు అంటారు. ఏంటి ఈ రోజే ఫస్ట్ టైమ్ వంట చేస్తున్నట్లు చేసావని భవాని అంటుంది. కృష్ణ కాదు వంట చేసింది నందు అని తెలుస్తుంది. కాసేపు మధు సరదాగా నందుని అటపట్టిస్తాడు. ఆ తర్వాత నేను ఒక విషయం చెప్పాలంటు మురారి చెప్తాడు. మా ఫ్రెండ్ కండక్ట్ చేస్తున్న బెస్ట్ కపుల్ కాంపిటీషన్ కి మీ నేమ్స్ ఇచ్చామని ఆదర్శ్ కి చెప్తాడు. మా పేర్లు ఎందుకు.. మీ పేర్లు ఇచ్చుకోండని ముకుంద అంటుంది. మా పేర్లు కూడా ఇచ్చుకున్నామని మురారి అంటాడు. నాకు ఇష్టం లేదని ముకుంద అనగానే అందరు షాక్ అవుతారు. ఎందుకంటే అందులో అడిగే ప్రశ్నలకి మేమ్ సమాధానాలు చెప్పలేమని ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉన్నారంటే ఏం చెప్తామని ఆది బాధపడుతాడని ఆదర్శ్ కూల్ అయ్యేలా‌ ముకుంద మాట్లాడుతుంది. అలా ఏం ఉండదని ఆదర్శ్, ముకుందలని మురారి కన్విన్స్ చేస్తాడు. ఆ తర్వాత కృష్ణ ఫ్రెండ్ ఫారెన్ వెళ్తుంది. సెండాఫ్ ఇవ్వడానికి వెళ్తాన్నానని మురారి అనగానే.. ముకుంద, ఆదర్శ్ లని కూడా తీసుకొని వెళ్ళండని నందు అంటుంది. నేను వెళ్ళనని ముకుంద అంటుంది. ముకుంద తన మాటలతో ఆదర్శ్ ని చెప్పినట్లు వినేలా చేసుకుంటుంది. ఆ తర్వాత ముకుందపై భవానికి డౌట్ వస్తుంది. చూద్దాం.. ఈ బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో ఎలా ఉంటుందో చూద్దామని భవాని అనుకుంటుంది. ఆ తర్వాత ఈ కాంపిటీషన్ నుండి ఎలా తప్పించుకోవాలని ముకుంద ఆలోచిస్తుంది. ఎందుకు వాళ్ళతో సరదాగా బయటకు వెళ్ళేవాళ్ళం కదా.. ఎందుకు వద్దన్నావని ముకుందని ఆదర్శ్ అడుగుతాడు. నాకు డస్ట్ ఎలర్జీ.. నైట్ టైమ్ ఎందుకని అలా అన్నానని ముకుంద కవర్ చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు బయటకు వెళ్తారు. తరువాయి భాగంలో కృష్ణ, మురారి గుడికి వెళ్తారు. దేవుడి ముందు కర్పూరం వెలిగించని పంతులు గారు చెప్పడంతో కృష్ణ వెలిగిస్తుంది. అది ఆరిపోతుంది. కృష్ణ టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu : కస్టడీ నుండి తప్పించుకున్న భద్ర.. వాడిని శైలేంద్ర చంపేస్తాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -990 లో.. భద్రని ముకుల్ కి అప్పగించిందని, వాడెక్కడ నిజం చెప్తాడోనని శైలేంద్ర టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే ధరణి నిద్ర లేచి.. ఏంటి ఇంకా పడుకోలేదు.. ఎందుకు టెన్షన్ పడుతున్నారంటు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే శైలెంద్రకి చిరాకు వస్తుంది. నాకు బయట టెన్షన్ కన్న నీ టెన్షన్ ఎక్కువ అయిందని శైలేంద్ర తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఈ వసుధార ఇందాక ఇక్కడే ఉండేది కదా.. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది కనీసం ఒక్కమాట కూడా చెప్పకుండా వెళ్తుందని అనుపమతో మహేంద్ర అంటుండగా.. అప్పుడే వసుధార వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని మహేంద్ర అడుగుతాడు. భద్ర గురించి వసుధార చెప్తుంది. నేను ఫస్ట్ నుండి చెప్తున్నా నా మాట ఎవరు విన్లేదు.. వాడు శైలేంద్ర మనిషి అని వసుధార చెప్తుంటే.. నువ్వు చెప్పేది నిజామా అని ఇద్దరు ఆశ్చర్యపోతారు. వాడి నిజస్వరూపం బయటపెట్టాలని కావాలనీ రిషి సర్ దొరికినట్లు ఫోన్ లో మాట్లాడుతు వెళ్ళాను వాడు అది విని శైలేంద్రకి చెప్పాడు. ఆ తర్వాత వాడు నన్ను ఫాలో అవుతు వచ్చాడు. ముకుల్ కి అప్పగించాను. కాసేపటి తర్వాత శైలేంద్ర కూడా వచ్చాడు.. వాడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పంపించానని వసుధార చెప్తుంది. ఇంట్రాగేషన్ లో రిషి సర్ గురించి కూడా తెలుస్తుందని వసుధార చెప్తుంది. ఆ తర్వాత భద్రని ముకుల్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. నీతో ఇలా చెయ్యమని చెప్పింది శైలేంద్ర కదా చెప్పమని ముకుల్ అడుగుతాడు. నీకు శైలేంద్ర ఎంత ఇస్తాను అన్నాడో అంత ఇస్తాను నిజం ఒప్పుకోమని ముకుల్ చెప్తాడు.. నాకు ఒక పూట టైమ్ కావాలి.. ఆలోచించుకోవాలని భద్ర అంటాడు. సరే రేపు ఉదయం వస్తానని ముకుల్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న కానిస్టేబుల్ తో భద్ర డీల్ మాట్లాడతాడు. నన్ను విడిపించు ఎంత కావాలన్నా ఇస్తాను ఇస్తానని శైలేంద్ర మెసేజ్ చేస్తాడు. మరుసటి రోజు ఉదయం ముకుల్ మహేంద్ర ఇంటికి వస్తాడు. భద్ర ఏమైనా రిషి గురించి చెప్పాడా అని అడుగుతారు. వీడియో డిలీట్ చేసింది వాడే అని ముకుల్ చెప్తాడు. ఆ తర్వాత భద్ర కస్టడి నుండి తప్పించుకున్నాడని ముకుల్ చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. కాసేపటికి శైలేంద్రకి ఎవరో ఫోన్ చేసి.. భద్ర తప్పించుకున్నాడని చెప్పగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ విషయం  శైలేంద్ర దేవయానికి చెప్తాడు. ఇప్పుడు తప్పించుకున్నాడు కానీ తర్వాత దొరికితే అని దేవయాని అనగానే.. మన గురించి తెలియదు.. భద్ర చెప్పడు.. అసలు ఉంటేనే కదా అని శైలేంద్ర అనగానే.. దేవయాని షాక్ అవుతుంది. వాళ్ళ మాటలన్నీ ధరణి వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : చెల్లిని అందంగా ముస్తాబు చేసిన అక్క.. బావకి నచ్చుతుందో లేదో!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -323 లో.. అప్పు తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి పాపని కిడ్నాప్ చేసి ఎక్కడ ఉంచారో కనుక్కోమని చెప్తుంది. ఆ తర్వాత కావ్య అందరికీ కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడే కొరియర్ బాయ్ ఇంటికి వస్తాడు. ఎవరు ఆర్డర్ చేశారని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత డెలివరీ బాయ్ తీసుకొని వచ్చిన కొరియర్స్ అన్ని చీరలు ఉంటాయి. ఇవన్నీ ఎవరు చేశారని చూస్తే దానిపై రుద్రాణి అని ఉంటుంది. నేనేం ఆర్డర్ చెయ్యలేదని రుద్రాణి అంటుంది. బిల్ డెబ్భై వేలు అయినవి ఆల్రెడీ పే చేశారంటూ డెలివరీ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. నేనే చేసాను మీ క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు కూడ పే చేశానని స్వప్న అనగానే అందరూ షాక్ అవుతారు.. కానీ నా కోసం ఆర్డర్ చెయ్యలేదు. కావ్య కోసం ఆర్డర్ చేశానని స్వప్న చెప్తుంది. నాకు కాకుండా నీకు కాకుండా ఆ కావ్యకి ఆర్డర్ చేసి పైగా నా డబ్బులు ఖర్చు పెడతావా అని రుద్రాణి అనగానే.. అవి మీ డబ్బులు ఎక్కడివి? ఇంట్లోవి కదా అని స్వప్న అంటుంది. అంత డబ్బులు పెట్టి నువ్వు ఎందుకు ఆర్డర్ పెట్టావ్ ? నేను కొనిచ్చే వాన్ని కదా అని రాజ్ అంటాడు. మా చెల్లిని ఎవరో అప్పలమ్మలాగా ఉంటావని కామెంట్ చేశారంట అందుకే తన కోసం ఇవ్వన్నీ ఆర్డర్ చేశాను. తనని మాడరన్ గా రెడీ చేస్తానని స్వప్న చెప్తుంది. రాజ్ ఏం సమాధానం చెప్పలేక ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. నా డబ్బులు ఖర్చు పెట్టిందని రుద్రాణి ఫీల్ అవుతుంటే.. ఖర్చు పెట్టింది నా కోడలు కోసమేగా నేను ఇస్తానని రుద్రాణికి అపర్ణ చెప్తుంది. కావ్య కోసం అంటే నా క్రెడిట్ కార్డ్స్ అన్ని ఇచ్చేవాన్ని అని సుభాష్ అంటాడు. ఇక ధాన్యలక్ష్మి, అనామిక ఇద్దరు కుళ్ళుకుంటారు.  ఆ తర్వాత అప్పు.. పాప దొరికిందా అంటూ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తూనే ఉంటుంది. ఒక స్కూల్ దగ్గర పాత ఇంటిలో రౌడీలు కన్పించారని‌ ఒక ఫ్రెండ్ చెప్పగ్గానే.. అప్పుతో పాటు ఆ పాప వాళ్ళ అమ్మ బయలుదేరి వెళ్తారు. ఆ తర్వాత కావ్యని‌ మోడరన్ గా రెడీ చేసి స్వప్న తీసుకొని వస్తుంది. అందరూ కావ్య బాగుందంటు పొగుడుతారు. నాకు నచ్చలేదంటు ధాన్యలక్ష్మి వెళ్తుంది. చాలా బాగా రెడీ చేసావని స్వప్నకి కావ్య చెప్తుంది. ఇలాగే ఆఫీస్ కి వెళ్ళని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత అప్పు వాళ్ళ పాప అమ్మ పాప ఉన్న దగ్గరికి వస్తారు. రౌడీలకి కనిపించకుండా పాపని చూస్తారు.  తరువాయి భాగంలో ఆఫీస్ కి వచ్చిన శ్వేతతో కావ్య మాట్లాడుతుంది. కావ్య మన ఫ్రెండ్ షిప్ ని తప్పుగా అర్థం చేసుకున్నట్లుందని శ్వేతా అనగానే.. నాకు ఆమె అంటే ఇష్టం లేదు.. త్వరలోనే విడిపోతా అనుకుంటున్నానని రాజ్ అంటాడు. నేను ఇప్పుడు వెళ్లి ఆమెకి మన గురించి క్లారిటీ ఇస్తానని శ్వేత చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అమ్మ వర్ధంతి ముందురోజు.. చెల్లి చేసిన పనికి షాకైన విష్ణుప్రియ!

అమ్మ ప్రేమని సృష్టిలో ఎవరో కొలవలేరు. అలాంటి అమ్మని ఉన్నప్పుడే బాగా చూసుకుందాం వెళ్ళాక‌ అమ్మతో దిగిన ఫోటోలని చూస్తూ జ్ఞాపకాల్లోకి వెళ్ళకుండా ఇప్పుడే హ్యాపీగా గడుపుదాం. ఇదే విషయాన్ని విష్ణుప్రియ ఓ వ్లాగ్ లో చెప్పుకొచ్చింది. విష్ణుప్రియ వాళ్ళ చెల్లి అంటే తనకి ఎంత ఇష్టమో తెలిపింది. ఓ డైమండ్ జ్యువలరీని విష్ణుప్రియకి గిఫ్ట్ గా ఇచ్చిందంట వాళ్ళ చెల్లి. అయితే ఇది వాళ్ళ అమ్మ వర్దంతి ముందు ఇచ్చిందంటూ చెప్పుకొచ్చింది విష్ణుప్రియ. మా అమ్మ తర్వాత చెల్లి అంటే ఇష్టమని తను ఇలా సర్ ప్రైజ్ చేస్తుందని అనుకోలేదంటు విష్ణుప్రియ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.  గత సంవత్సరం మా అమ్మ చనిపోయింది. తన రూపంలోనే ఈ గిఫ్ట్స్ వస్తున్నాయనుకుంటా అని విష్ణుప్రియ అంది. నా చిన్నతనం నుండి మా చెల్లికి నేనేమీ ఇవ్వలేదు. కానీ తను నాకోసం డైమండ్స్, జ్యువలరీ అన్నీ కోనిస్తుంది. తన చిన్నతనంలో ఏం కావాలో అవే ఇచ్చేదానిని .. కానీ తనేమో నాకు లగ్జరీ ఐటమ్స్ అన్నీ ఇస్తుంది. ఎలా ఉంది చెల్లి నీకు అని విష్ణుప్రియ అడుగగా.. ఐ ఆమ్ ఫ్రౌడ్ ఆఫ్ యూ అక్క అని తను అంది. ఇదంతా విష్ణుప్రియ తన యూట్యూబ్ ఛానెల్ లోని ఓ వ్లాగ్ లో చెప్పుకొచ్చింది. ‌అది ఇప్పుడు వైరల్ గా మారింది. బుల్లితెరపై యాంకర్ గా విష్ణు ప్రియ రాణించింది. సుధీర్ తో కలిసి చేసిన 'పోరా పోవే' షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంటుంది విష్ణుప్రియ. మానస్ తో కలిసి విష్ణుప్రియ చేసిన 'జరీ జరీ' ఫోక్ సాంగ్ ఫేమస్ అయింది. అయితే రీసెంట్ గా మానస్ తో కలిసి చేసిన మరొక ఆల్బమ్ సాంగ్ ' గంగులు' కూడా యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఇక 'దయ' వెబ్ సిరీస్ లో నటించిన విష్ణుప్రియకి సినిమా ఆఫర్లు బోలెడు వస్తున్నాయి. ‌కాగా విష్ణుప్రియ వాళ్ళ అమ్మని గుర్తుచేసుకొని చేసిన ఈ వ్లాగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

నేను రమ్మని అడుక్కోవాలా ఏంటి...ఫ్రెండ్ కాదన్నాడుగా

  బిగ్ బాస్ సీజన్ 4 లో సయ్యద్ సోహైల్, అఖిల్ సార్థక్ ఎంత మంచి ఫ్రెండ్సో మనకు తెలుసు. అలాంటి వాళ్ళ మధ్య కొన్ని డిస్టర్బెన్స్ లు ఎందుకొచ్చాయో కానీ ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అఖిల్ సార్థక్  సోహైల్ ఇక తన ఫ్రెండ్ కాదన్నట్టుగా కామెంట్ చేసాడు. ఇప్పుడు సోహైల్ కూడా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆ మాటలను తిప్పికొట్టాడు. బూట్ కట్ బాలరాజు మూవీ ప్రొమోషన్స్ కి రమ్మని తన బిగ్ బాస్ సీజన్ ఫ్రెండ్స్ ని అడిగితే హారిక వచ్చే పరిస్థితిలో లేదని మెసేజ్ ఇచ్చిందని చెప్పాడు. ఇక అఖిల్ తాను  రావాలని అనుకోవడం లేదన్నట్టుగా ఒక మెసేజ్ పెట్టాడని చెప్పాడు. "నేను అఖిల్ ఒక కాలేజ్ ఫంక్షన్ లో కలిసాం తర్వాత లంచ్ కి ఎటైనా వెళదాం అన్నాను కానీ కుదరదు ఇంటికెళ్లాలని చెప్పి తన రూమ్ కి వెళ్ళాడు. నేను ఎన్ని సార్లో ఫోన్స్ చేసాను. కట్ చేసాడు. దానికి నేనేం చేయాలి...రారారా అని నేనేమన్నా అడుక్కోవాలా ఏమిటి..నా సైడ్ నుంచి నేను బాగున్నా..తన పర్సనల్ డిస్టర్బెన్స్ వలన అదంతా నా మీద పెట్టుకున్నాడో ఇంకేమన్నా జరిగిందో తెలీదు..కాబట్టి ఎవరి స్పేస్ లో వాళ్ళం ఉన్నాం" అని చెప్పాడు. గతంలో ఒక ఇంటర్వ్యూలో తనకు సోహైల్ కి మధ్య ఒకప్పుడు ఫ్రెండ్ షిప్ ఉండేదని కానీ ఇప్పుడు అది లేదని ..లేని దాన్ని చెప్పుకోవడం ఎందుకు అంటూ కామెంట్ చేసాడు. "ఎవరి కెరీర్స్ తో వాళ్ళం బిజీగా ఉన్నాం. ఎప్పుడూ ఒకరితోనే ఫ్రెండ్ షిప్ కంటిన్యూ కావాలని లేదుగా. ప్రయారిటీస్ బట్టి కూడా రిలేషన్స్ మారతాయి. సోహైల్ ఫ్రెండ్ అందులో ఎలాంటి డౌట్ లేదు" అంటూ అఖిల్ కామెంట్ చేసాడు.

శ్రీముఖి చేసిన మొదటి వ్లాగ్ ఇదే!

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ కి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇక ప్రస్తుతం ఇన్ స్ట్రాగ్రామ్ లో 90's వెబ్ సిరీస్ రీల్స్,  కుమారీ ఆంటీ వ్లాగ్స్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. కాగా గత కొన్ని నెలలుగా యూట్యూబ్ లో వ్లాగ్స్ చేయకుండా ఉన్న శ్రీముఖి .. ఈ సంవత్సరం కొత్త వ్లాగ్ తో ముందుకొచ్చింది.  శ్రీముఖి.. టెలివిజన్ రంగంలో యాంకరింగ్ తో తన సత్తా చాటుతుంది. టీవిరంగంలోనే కాకుండా సినిమాలల్లో కూడా నటిస్తుంది శ్రీముఖి. బిగ్ బాస్ సీజన్-3 లో రన్నరప్ గా నిలిచింది. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమాల్లో వరుస ఆఫర్స్ తో బిజీ అయింది శ్రీముఖి. జులాయి సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లెలు పాత్రలో కనిపించిన శ్రీముఖి.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిబి జోడీలో యాంకర్ గా చేసిన శ్రీముఖి పలు టీవి షోస్ , ఆడియో ఫంక్షన్స్ తో గుర్తింపు తెచ్చుకుంటుంది. అయితే తన హాట్ ఫోటోస్ ని ఈ మధ్య తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి. అయితే తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని అటు యూట్యూబ్ లో వ్లాగ్ లుగా చేసి అప్లోడ్ చేస్తుంది.  ఈ సంవత్సరంలో సెలబ్రిటీలంతా తమ వ్లాగ్స్ తో యూట్యూబ్ లో  ట్రెండింగ్ లో ఉంటే.. శ్రీముఖి మాత్రం ఇప్పటికి కళ్ళు తెరిచింది. తన బిజీ షెడ్యూల్ లో ఓ రెండు రోజులు తన తమ్ముడు సుశ్రుత్, ఫ్రెండ్స్ తో కలిసి అలా ఓ ట్రిప్ కి వెళ్ళింది. అది ట్రీ పామ్ అంట.. అక్కడ ట్రీ చుట్టూ రెసార్ట్ చేశారని.. చూడటానికి ఓ మినీ లగ్జరీ హోటల్ లా ఉందంటు శ్రీముఖి ఈ వీడియోలో చెప్పింది. అయితే ఈ ట్రిప్ లో ఆర్జే చైతు, ముక్కు అవినాష్ కూడా జతవ్వడంతో మరింత వినోదాత్మకంగా గడిచిందని శ్రీముఖి అంది‌. కాగా ఈ సంవత్సరంలో శ్రీముఖి చేసిన‌ మొదటి వ్లాగ్ ఇదే కావడంతో యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.  

ఏదో అనుకున్నా కానీ మీరు మామూలు ఆటగాడు కాదు

ఢీ సెలబ్రిటీ స్పెషల్ నెక్స్ట్ వీక్ ప్రోమో కిక్కెక్కించే డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో రాబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ వారం షో ప్రాపర్టీ రౌండ్. ఇక చూస్కోండి ఒక్కొక్కళ్ళు దుమ్ము దులిపేసారు. సునంద మాల ఐతే బాబోయ్ అది డాన్స్ ఆ ఇంకేమన్నానా అన్నట్టుగా స్టేజిని షేక్ చేసి పారేసింది. స్టైలిష్ స్టార్ పెర్ఫార్మెన్స్ లా ఉంది అంటూ జడ్జ్ ప్రణీత చెప్పేసింది. "హెవీగా డాన్స్ చేస్తావ్ కానీ మంచి గ్రేస్ తో క్యూట్ గా చేస్తావ్ ..నీ డాన్స్ ప్రొఫెషనల్ డాన్సర్ లా ఉంటుంది" అన్నారు శేఖర్ మాస్టర్. తర్వాత శ్రీప్రియ చేట ప్రాపర్టీతో వచ్చి డాన్స్ ఇరగదీసేసింది. "శ్రీప్రియ చేట చిరిగిపోయింది" అన్నాడు శేఖర్ మాస్టర్. తర్వాత ఆయనే  స్టేజి మీదకు వచ్చి మెడలో పూలదండలేసుకుని అక్కడున్న లేడీస్ తో కలిసి చేసిన మాస్ డాన్స్ కి అందరూ విజిల్స్ వేశారు. "మా సీనియర్ డాన్సర్స్ వాళ్ళు.  సుమతి, కోకిల, మంజు, కూకట్పల్లి స్వప్న" అంటూ తనతో డాన్స్ చేసిన వాళ్ళను శేఖర్ మాస్టర్ ఇంట్రడ్యూస్ చేసేసరికి ఆది మధ్యలో వచ్చాడు. "మగాళ్ల పేర్లు ఎప్పుడన్నా గుర్తున్నాయా అండి మీకు" అని అడిగాడు. ఆది డైలాగ్ కి సైలెంట్ గా ఉన్న ప్రణీత కూడా వయలెంట్ డైలాగ్ వేసింది " అందరూ సరదాగా అంటున్నారేమో జోక్స్ వేస్తున్నారు అనుకున్నా కానీ ఇప్పుడు నాకు నిజంగానే డౌట్ వస్తోంది మీమీద " అనేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఒక సీనియర్ లేడీ డాన్సర్ "మాతో సర్ కి ఉన్న బాండింగ్ వేరే" అని ఆదితో అనేసరికి "నేను కూడా అదే అంటున్నా" అంటూ కౌంటర్ వేసాడు. ఇక ఫైనల్ లో ఆదర్శ్ హౌస్ కీపింగ్ ప్రాపర్టీస్ తో చేసిన డాన్స్ కి ఆ స్టెప్స్ కి శేఖర్ మాస్టర్ ఫిదా ఐపోయి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇలాంటి స్టెప్స్ ఇంతకు ముందు చూడలేదంటూ ఆదర్శ్ కి కితాబిచ్చారు. ఈ ప్రోమోని చూసిన నెటిజన్స్ అంతా కూడా ఆదర్శ్ ని తెగ పొగిడేస్తున్నారు.

ప్రెట్టి గర్ల్ కాదు సెక్సీ గర్ల్ అంట

సోషల్ మీడియాకే సెగలు పుట్టిస్తోంది గుప్పెడంత మనసు జగతి మేడం. ఆమె పిక్స్ మాములుగా లేవు. రీసెంట్ గా రిలీజ్ చేసిన పిక్స్ చూస్తే షాకవ్వాల్సిందే.. బ్లడ్ స్టైన్స్ ఉన్న బాత్ టబ్ లో ఫోజ్ చూస్తే ఎవ్వరికైనా గుండె జల్లుమనాల్సిందే.  గుప్పెడంత మనసులో ఎంత ట్రెడిషనల్ గా పద్దతిగా చీరలో కనిపించిందో ఇక ఇప్పుడు మంచి హాట్ కేక్ ల ఫాన్స్ ని ఊరిస్తోంది. ఈమె ప్రెట్టి గర్ల్ పేరుతో ఒక వెబ్ సిరీస్ చేస్తోంది.  ఆ మూవీలోని పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఒక కామెంట్ పెట్టింది. "అతి త్వరలో భయంకరమైన, విచిత్రమైన, గ్లామర్ డోస్డ్ బ్లడ్ బాత్ థ్రిల్లర్ కోసం వెయిట్ చేయండి. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇంకా 3 షెడ్యూల్స్ మిగిలి ఉన్నాయి. ఈ సిరీస్ మంచి టైంలో బయటికి వచ్చి హిట్ కొట్టడం ఖాయం.  కొంచెం ఓపిక పట్టండి. ఈ విధమైన లైవ్లీ మల్టీలేయర్డ్ క్యారెక్టరైజేషన్ కోసం నన్ను ఎంపిక చేసుకున్నందుకు నా టీమ్‌కి ధన్యవాదాలు. నన్ను నేను డిఫరెంట్‌గా చూపించుకోవానికి ఈ ఛాలెంజింగ్ రోల్ ని యాక్సెప్ట్ చేసాను. ఆ రోల్ చూసాక మీరంతా నన్ను కచ్చితంగా ఇష్టపడతారు" అంటూ తన మాటలతో ఈ మూవీ మీద మంచి హైప్ ని క్రియేట్ చేసేసింది ఈ నాటీ బ్యూటీ. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ ఫుల్ హాట్ కామెంట్స్ తో ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీని నింపేశారు. " ప్రెట్టి గర్ల్ కాదు సెక్సీ గర్ల్...జగతి మేడం మిమ్మల్ని ఇలా అస్సలు చూడలేకపోతున్నాం...బోల్డ్ అండ్ బ్యూటిఫుల్...హాట్ బాంబ్, మైండ్ బ్లోయింగ్...పోత పోసిన బంగారు బొమ్మ...స్టన్నింగ్ బ్యూటీ...లస్టీ అండ్ సెక్సియెస్ట్ లేడీ పిక్స్ కోసం ఇంకా సినిమా కోసం వెయిటింగ్ ఇక్కడ...మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకోవడమే నా లైఫ్ టైం అచీవ్మెంట్" అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. జగతి మేడం తన మూవీకి సంబంధించి ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేయక్కర్లేకుండానే తన పిక్స్ తో ఆల్రెడీ ప్రమోట్ చేసేస్తోంది. సోషల్ మీడియాలో జ్యోతి తనకు ఎవరూ ఎదురు లేరన్నట్టుగా దూసుకుపోతోంది.

పెళ్లి డేట్ ఫిక్స్.. ప్రియాంకతో హనీమూన్ నెవర్ ఎండింగ్!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఆడపులిలా చెలరేగి టాప్ లో నిలిచిన ప్రియాంక ఎట్టకేలకు తన పెళ్ళి డేట్ ని ఫిక్స్ చేసింది. ఎన్నో వీడియోలలో పెళ్ళి ఇక ఉంటుందంటు ఊరిస్తున్న ప్రియాంక, శివ్ కుమార్.. ఎట్టకేలకు ఈ సస్పెన్స్ కి తెర తీసారు.  నిజాలు చెప్పేశారు. ప్రియాంక, శివ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని తెలియజేసారు. మీ రిలేషన్ పై వచ్చే నెగెటివ్ కామెంట్ల గురించి ఏం చెప్తారని ప్రియాంకని అడుగగా.. మా రిలేషన్ గురించి మాకు క్లారిటీ ఉంది. బయట మాపై వచ్చే కామెంట్లను పట్టించుకోం. పట్టించుకుంటే హ్యాపీగా ఉండలేం. కానీ ప్రతి కామెంట్‌లను తీసుకుంటాం.. బ్యాడ్ కామెంట్స్‌ని వదిలేస్తాం. బిగ్ బాస్ నుంచి నేను నెగిటివిటీ లేకుండా బయటకు వచ్చా. క్రిటిక్స్ లేకుండా ఏ మూవీ సక్సెస్ అవ్వదు. నా బిగ్ బాస్ జర్నీ కూడా అంతే. కావాలని నెగిటివ్ చేస్తారు. వాటిని నేను పట్టించుకోనని ప్రియాంక అంది. ఇక పెళ్ళి డేట్ ఎప్పుడని అడుగగా.. చేసుకుంటాం.. కచ్చితంగా ఈ సంవత్సరం చేసేసుకుంటామని శివ్ అన్నాడు. పెళ్లి అయ్యాక.. హనీమూన్ గుర్తిండిపోయేట్టు చేసుకుంటాం. ఒక్కసారి మాత్రమే హనీమూన్ చేసుకోం. ప్రియాంకని ప్రతీ ఒక్క దేశం తీసుకుని వెళ్లి హనీమూన్ చేసుకుంటాను. మాది నెవర్ ఎండింగ్ హనీమూన్ అంటు బోల్డ్ కామెంట్స్ చేశాడు శివ్ కుమార్. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ప్రియాంక. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆటతీరుతో, మాటతీరుతో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.  హౌస్ లో ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ గా పేరుతెచ్చుకున్న అమర్, శోభాశెట్టి, ప్రియాంక.. ఎప్పుడు కలిసి ఉండేవారు. గేమ్ అయిన బయట అయిన గ్రూపిజం చేస్తు ఉండటంతో ప్రేక్షకులలో వీరిపట్ల నెగెటివిటి పెరిగిపోయింది. దాంతో శోభాశెట్టిని గ్రాంఢ్ ఫినాలే ముందు వారంలో బయటకు పంపించారు.  ఇక టాప్-5 లో ఒకరిగా ఉన్న ప్రియాంక జైన్.‌ అయిదవ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది.  శివ్ కుమార్, ప్రియాంక జైన్ ఇద్దరు కలిసి ' మౌనరాగం' సీరియల్ నుండి సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే.                                           

ఎగ్జిబిషన్ కి మెట్రో ట్రైన్ లో ప్రయాణం.. మా పాప మిస్ అయింది!

మనం ఏదైన ఎగ్జిబిషన్ కి ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం . ఎందుకంటే ఎగ్జిబిషన్ కి ఎక్కడెక్కడి నుండో చాలామంది వస్తుంటారు. వారిలో మనవాళ్ళు ఎవరు తప్పిపోయిన మళ్లీ కలవడం కష్టమే. అయితే సూపర్ ఫాస్ట్ గా అభివృద్ధి జరిగే నగరాలలో సూపర్ ఫాస్ట్ ప్రయాణాల కోసం మెట్రో లు మొదలయ్యాయి. మెట్రో ట్రైన్ లో రోజు కొన్ని లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వారిలో ఒక్కరు మిస్ అయిన మళ్లీ దొరకడం కష్టమే.‌ అచ్చం అలాగే జరిగింది. హరిత జాకీ వాళ్ళ అమ్మాయి మెట్రో ట్రైన్ లో మిస్ అయింది. హరిత జాకీ.. టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తూ పాపులారిటీ సంపాదించుకున్న నటి. చెన్నై లో పుట్టి పెరిగిన హరిత.. తన పదిహేనవ ఏటనే సినిమాలలో నటించింది. అయితే తనకి సీరియల్స్ తో మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. అగస్ట్ 14, 2001లో హరిత జాకీని పెళ్ళి చేసుకుంది. వాళ్ళిద్దరు దూరదర్శన్ లో వచ్చే కార్యక్రమాలలో కలిసి నటించేవారు. ఆ తర్వాత ఈటీవిలో ప్రసారమైన 'సంఘర్షణ' సీరియల్ లో తొలిసారి తన భర్త జాకీతో‌ కలిసి నటించింది. అప్పటి నుండి చాలా సీరియల్స్ లలో ఇద్దరు కలిసి నటించారు. అయితే జీ తెలుగులో ప్రసారమైన 'కలవారి కోడళ్ళు' సీరియల్ లో తను చేసిన నటనకి గాను అవార్డ్ కూడా వచ్చింది. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ టాప్ మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ గా ఉంది. అయితే జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'ముద్ద మందారం' లో తనకి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం పద్మావతి కళ్యాణం అనే సీరియల్ లో తను నటిస్తుంది.  హరిత అండ్ జాకీ ఇద్దరు కలిసి రెగ్యులర్ గా రీల్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే హరిత తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్ లుగా చేస్తూ అప్లోడ్ చేస్తుంటుంది. అయితే తాజాగా మరో వ్లాగ్ ని అప్లోడ్ చేసింది. మెట్రో ట్రైన్ లో ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్న హరిత జాకీలకి అనుకోని షాక్ ఎదురైంది. ఓ ఎగ్జిబిషన్ కి వెళ్తుండగా వాళ్ళ పాప ట్రైన్ ఎక్కేలోపే డోర్స్ అన్నీ క్లోజ్ అయ్యాయంట. ఇక తర్వాతి స్టాప్ లో హరిత అండ్ జాకీ వాళ్ళ అమ్మాయి కోసం ఎదురు చూడగా..‌ కాసేపటికి తను మరో ట్రైన్ లో వచ్చేసింది. వాళ్ళంతా మెట్రో ట్రైన్ లో ఎక్కడం ఇదే తొలిసారి అంట.‌ అందుకే ఇలా జరిగిందంటే తమ అనుభవాలని పంచుకున్నారు. అయితే ఫ్యామిలీతో కలిసి వెళ్ళేముందు జాగ్రత్తగా ఉండాలని హరిత జాకీ తమ సబ్ స్క్రైబర్స్ కి తెలియజేసింది. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.  

అతనిచ్చిన డబ్బులతోనే కుమారి ఆంటీ షాప్.. ఆర్జే చైతు ఇంటర్వ్యూలో నమ్మలేని నిజాలు!

అన్న మీది మొత్తం 1000 అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా. కుమారి ఆంటీ డైలాగ్.. ఈ ఒక్క డైలాగ్ తో ఇన్ స్టాగ్రామ్ మొత్తం గత రెండు మూడు వారాలుగా ఒక్కటే మ్యూజిక్.. ఎక్కడ చూసిన కుమారి ఆంటీ రీల్స్, మీమ్స్.. ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది కుమారి ఆంటి. హైదారాబాద్ లోని ఇనార్బిట్ మాల్ దగ్గరలో గల ఫేమస్ హోటల్ ITC కోహినూర్ ఉంటుంది.  అ హోటల్ కి దగ్గరలో మధ్యాహ్నం టైమ్ లో చిన్న టెంట్ వేసుకొని.. ఫుల్ మీల్స్ తొంభై, భగారా రైస్ అరవై.. అంటూ భోజనం వడ్డిస్తుంది కుమారి ఆంటీ. సాధారణంగా రోడ్డు పక్కన డబ్బులు తీసుకొని భోజనం పెట్టేవాళ్ళు చాలామందే ఉంటారు.‌ కానీ కుమారి ఆంటీ ఏ ముహుర్తానా ఆ వెయ్యి, రెండు లివర్లు ఎక్స్ ట్రా అందో అక్కడి నుండి ఫుల్ ఫేమస్ అయింది. ఇక ఎక్కడెక్కడి నుండో తన దగ్గరికి భోజనం చేయడానికి వస్తున్నారంట. ఇక అది తెలుసుకొని ఆ ప్లేస్ లో ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు వచ్చి షాప్ క్లోజ్ చేపించారు. అయితే తను మళ్లీ షాప్ ఓపెన్ చేయాలని అక్కడ నిత్యం అన్నం తినేవాళ్ళు మీడియాని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారిన కుమారి ఆంటీకి.. చిన్న సెలబ్రిటీల దగ్గరి నుండి సినిమా హీరోల వరకు తమ సపోర్ట్ అందిస్తున్నారు. వీళ్ళతో‌ పాటుగా తెలంగాణ సీఎమ్ రేవంత్ రెడ్డి సైతం తన మద్దతుని తెలుపుతున్నట్టు బయట టాక్ నడుస్తోంది. అయితే కుమారి ఆంటీ షాప్ క్లోజ్ చేయడం గురించి తెలుసుకోవడానికి మీడియా ఛానెల్స్ పోటీ పడుతున్నాయి. ఆర్జే చైతు తనని ఇంటర్వ్యూ చేశాడు. ఆర్జే చైతు.. విజయవాడలో పుట్టి పెరిగాడు. రేడియో జాకీగా జాబ్ వచ్చింది.  ఆ తర్వాత బిగ్ బాస్ లో‌ అరంగేట్రం చేశాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చాక ఆర్జే చైతుకి ఫుల్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది‌.‌ ఇక సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేశాడు. ఇమ్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా రీల్స్, ఫోటోలతో ఫుల్ బిజీగా ఉండే చైతూ.. తాజాగా కుమారి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశాడు.‌ ఇందులో తను కొన్ని విషయాలని పంచుకుంది. సింగర్‌ హేమచంద్ర వాళ్ళింట్లో‌ కుమారి ఆంటీ మొదట వంటమనిషిగా చేసేదంట. ఆ తర్వాత హేమచంద్ర తనకి ఓ ముప్పై వేలు ఇవ్వగా.. తను అక్కడ షాప్ పెట్టిందంట. మీకు హోటల్స్ నుండి ఆఫర్లు రాలేదా అని అడుగగా.. చాలా వచ్చాయి కానీ మా ఆయన వద్దన్నాడు. మనం చేసుకుంటే ఉన్నదాంట్లో హ్యాపీగా ఉంటాం .‌ ఒకరికింద చేయడానికి ‌మన సొంతంగా పని చేస్తూ లైఫ్ ని హ్యాపీగా చూసుకుంటే చాలదా అని అన్నారు అందుకే మేం వెళ్ళలేదని కుమారి ఆంటీ అంది.  షాప్ క్లోజ్ చేసినప్పుడు మీరెలా ఫీల్ అయ్యారని అడుగగా.. చాలా భాదగా అనిపించింది. ‌కానీ ఏం చేస్తాం‌. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు.‌ కానీ అక్కడికి తినడానికి వచ్చేవాళ్ళంతా బాగా ఫీల్ అయ్యారని కుమారి ఆంటీ అంది. మీరు ఆడవాళ్ళకి ఏం అయినా చెప్పాలనుకుంటున్నారా అని అడుగగా.. ఇంట్లో‌ ప్రతీ భర్త, భార్యకి, ప్రతీ భార్య భర్తకి మధ్య అన్యోన్యత ఉంటే.. ఇంట్లో అందరూ కలిసి పనిచేస్తే సంతోషంగా ఉండొచ్చని కుమారి ఆంటీ అంది.‌ ఇలా కొన్ని విషయాలని పంచుకుంది  కుమారి ఆంటీ. కాగా ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.   

ఇరవై ఏళ్ళ వయసులో కరుణ ఫోటో..‌ ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్!

ఇన్ స్టాగ్రామ్ లో మూడు, నాలుగు రోజులకొకసారి కొత్త ట్రెండింగ్ వస్తుంటుంది. నిన్న మొన్నటి దాకా పాత పాటలు కూడా ఎవరైనా వింటారా..‌నేను వింటాగా అంటూ పాత సినిమాలలోని హిట్ పాటలన్నింటిని సెలెబ్రిటీలు తమ‌ ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసారు. ఇప్పుడేమో‌ మరో ట్రెండ్ వచ్చేసింది. అదేంటంటే ఇరవై ఏళ్ళ వయసులో మీరెలా ఉన్నారో తెలుసుకోండి అంటూ తమ ఫోటోలని షేర్ చేసే కొత్త ట్రెండింగ్ మొదలైంది. అప్పుడెప్పుడో వచ్చిన 'మొగలి రేకుల' నుంచి నేటి 'వైదేహి పరిణయం' వరకు ఎన్నో సీరియల్స్‌లో నటించింది కరుణ భూషణ్. మొగలి రేకులు, శ్రావణ సమీరాలు, అభిషేకం, వైదేహి పరిణయం.. ఇలా ఎన్నో సీరియల్స్‌లో తన అద్భుతమైన నటనతో మెప్పించింది కరుణ భూషణ్. ప్రస్తుతం బిజీగా ఉన్న బుల్లితెర తెలుగు యాక్టర్స్‌లో కరుణ కూడా ఉంది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ ఫోటోని షేర్ చేసింది. ఇరవై ఏళ్ళ వయసులో ఉన్న ఫోటోని షేర్ చేసి ట్రెండింగ్ ని ఫాలో అయింది ఈ భామ.‌ అయితే తన ఫ్యాన్స్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.  కరుణ ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఇలా అంది.. నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాను. 30 సినిమాల్లో యాక్ట్ చేసాను. ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ హీరోస్ అందరితో నేను నటించాను. "ఆహా" మూవీ ద్వారా నేను స్క్రీన్ మీద కనిపించాను. ఆ తర్వాత ఎన్నో మూవీస్ లో యాక్ట్ చేసాను. చిరంజీవి గారితో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ మూవీలో కూడా కనిపించాను. నా భర్త ఒక డైరెక్టర్‌. 2007లో తొలిసారి తను నాకు ప్రపోజ్‌ చేశాడు. ఐ లవ్యూ అని చెప్పలేదు.. పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. నేను ఆ మాటకు షాకయ్యాను. మా రిలేషన్‌ ఎలా సాగుతుందా అని అనుకున్నాను. కానీ అలా సాగిపోయింది. కొన్ని రోజులకి మేం విడిపోయామని కరుణ అంది. ఇక ఈ మధ్యకాలంలో కరుణ కొడుకు తనేదైనా హాట్ సారీ కట్టుకున్నా.‌ హాట్ గా కనిపించినా .. యూ లుకింగ్ హాట్ అని కాంప్లిమెంట్ ఇస్తాడని చెప్పడంతో అప్పట్లో అది వైరల్ గా మారింది. దాంతో మరీ ఇంత దారుణంగా ఎలా అవుతున్నారండి అంటు తెగ కామెంట్లు వచ్చాయి‌. అయితే ఇటువంటి కామెంట్లని తను పట్టించుకోకపోవడమే తన ఆనందానికి కారణమని చాలాసార్లు చెప్పింది కరుణ. అయితే తాజగా ఇన్ స్టాగ్రామ్ లో సాగే ఇరవై ఏళ్ళ ఫోటో షేరింగ్ లో భాగంగా కరుణ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.  

యాదమ్మ రాజును కేటరింగ్ బాయ్ గా చేసేసిన స్టెల్లా

యాదమ్మ రాజు-స్టెల్లాకు బుల్లితెర మీద, సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు యాదమ్మ రాజు బర్త్ డే వేడుకలను స్టెల్లా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది. యాదమ్మ రాజు కోట్ వేసుకుని ఈ సెలెబ్రేషన్స్ లో కనిపించాడు. పుట్టిన రోజు అని చెప్పి  కేటరింగ్ బాయ్ ని చేసేసింది తన భార్య అంటూ ఫీల్ అయ్యాడు. ఇక తర్వాత రౌడీ రోహిణి, పవిత్ర వచ్చి నిజంగా కేటరింగ్ బాయ్ ని చేసేసి కావాల్సిన ఫుడ్ తెమ్మంటూ యాదమ్మ రాజును ఆట పట్టించారు. ఇక రాజు బర్త్ డే ఫంక్షన్ కి హిమజ,  రోహిణి, సద్దాం, పవిత్ర, జ్ఞానేశ్వర్, టేస్టీ తేజ, జబర్దస్త్ ఇమ్మానుయేల్, బాబు వచ్చారు. లేడీస్ అంతా కలిసి తీన్ మార్ ఆడారు, డిజెతో దంచి కొట్టారు. అలాగే అందరికి డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. యాదమ్మరాజు జబర్ధస్త్, ఎక్స్ట్రా జబర్ధస్త్ షోలతో ఫుల్ పాపులర్ అయ్యాడు. అప్పట్లో పటాస్ కామెడీ షో కూడా అంతే క్రేజ్ తెచ్చుకుంది.  పటాస్ లో స్టూడెంట్ గా షోలో అడుగుపెట్టిన రాజు ఒక్క జోక్ తో  హైలెట్ అయ్యాడు.. రాజు బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ బాగుండడంతో  పటాస్ షోలో కామెడీ చేసే అవకాశం లభించింది. ప్రస్తుతం కమెడియన్స్ గా పేరుతెచ్చుకున్న సద్దాం, నూకరాజు, ఫైమా, ఇమ్మాన్యూయల్.. వాళ్లంతా కూడా పటాస్ షో నుంచి వచ్చిన వారే.  ‘అదిరింది’ షోతో క్రేజ్ తెచ్చుకున్నాడు యాదమ్మ రాజు. స్టేజీ మీద యాదమ్మ రాజు, సద్దాం కాంబినేషన్ లో చేసిన కామెడీ స్కిట్ లు మంచి హిట్ అయ్యాయి. ఇక జబర్దస్త్ కమెడియన్స్ అందరికీ మూవీస్ లో కూడా మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.  యాదమ్మరాజు కూడా కొన్ని మూవీస్ లో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు యాదమ్మ రాజు బర్త్ డే సెలెబ్రేషన్స్ లో నెటిజన్స్ , ఫాన్స్, బుల్లితెర నటులంతా విషెస్ చెప్పరు.

తమన్నాతో రెచ్చిపోయి డాన్స్ చేసిన అవినాష్..

శ్రీముఖి వీకెండ్స్ వస్తే ఫుల్ ఛిల్ అవుతూ ఉంటుంది. వారం మొత్తం షూటింగ్స్ అని మీటింగ్స్ అని ఫుల్ హడావుడిగా రెస్ట్ లేకుండా పని చేస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యింది శ్రీముఖి. ఫార్గో ట్రీ హౌస్ కి వెళ్లి అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసింది. ఒక్కతే వెళ్లకుండా వెంట ఆర్జే చైతు, అవినాష్, తమన్నా సింహాద్రిని కూడా వెంటబెట్టుకుని వెళ్ళింది. ఇక శ్రీముఖితో తన తమ్ముడు సుశృత్ కూడా వెళ్ళాడు. ఎన్నో నెలల నుంచి రెస్ట్ లేకుండా పని చేస్తూ ఇల్లు, షూటింగ్స్ అని తిరగడం సరిపోతోంది కాబట్టి కొంచెం రెస్ట్ కోసం అన్నట్టుగా ఒక ఫార్మ్ స్టేకి వెళ్లాలని తన తమ్ముడు పట్టుబట్టేసరికి ఇక వెళ్లక తప్పింది కాదు అంటూ చెప్పింది శ్రీముఖి. అలాగే 2024 లో ఇదే తన ఫస్ట్ వ్లాగ్ అని చెప్పింది. ఇక వీళ్లంతా కార్ లో కూర్చున్నాక సరదాగా ఫన్నీగా జోక్స్ వేసుకుని నవ్వుకున్నారు. ఇక ఆ ఫార్మ్ హౌస్ కి వెళ్ళాక శ్రీముఖి ఎలా యాంకరింగ్ చేస్తుంది అనే విషయాన్ని ఒక స్టాండప్ కామెడీ  చేసి చెప్పాడు అవినాష్. ఇక అక్కడ సాయంత్రమయ్యి చీకటి పడేసరికి అవినాష్ తన విశ్వ రూపాన్ని చూపించాడు. కార్ లో వెళ్ళేటప్పుడు తమన్నా సింహాద్రితో సరసాలాడాడు. అలాగే ఫార్మ్ హౌస్ కి వెళ్ళాక అక్కడైతే హాట్ సాంగ్స్ పెట్టుకుని తమన్నాతో ఇరగదీసి స్టెప్స్ తో హాట్ హాట్ గా డాన్స్ చేసాడు. చల్లటి వాతావరణంలో  తమన్నా, అవినాష్ గ్రిల్ల్డ్ చికెన్ తిన్నారు. ఇలా వీళ్లంతా ఫార్మ్ హౌస్ లో ఫుల్ ఛిల్ల్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి,  బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అవినాష్, బిగ్ బాస్ నాన్-స్టాప్ కంటెస్టెంట్ ఆర్జే చైతుతో కలిసి శ్రీముఖి ఈ ట్రిప్ ని ఎంజాయ్ చేసింది. తమన్నా సింహాద్రితో శ్రీముఖికి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. అలాగే అవినాష్ తో కూడా అంతే బెస్ట్ ఫ్రెండ్ షిప్ ఉంది. శ్రీముఖి ఎక్కడికి వెళ్లినా ఏ షో చేసిన అందులో కచ్చితంగా అవినాష్ ఉండాల్సిందే. అవినాష్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి కారణం కూడా శ్రీముఖినే అని అవినాష్ ఎన్నో సార్లు చెప్పాడు.    

వైజాగ్ చేపల పులుసు బ్రాంచ్ ఓపెన్ చేసిన శివాజీ..బాలకృష్ణ, ఖుష్భూ

  జబర్దస్త్ కమెడియన్ ఆర్పి నిర్వహిస్తున్న నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వైజాగ్ బ్రాంచ్ ని రీసెంట్ గా రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేశారు బిగ్ బాస్ సీజన్ 7 లోని  బిగ్ మోటివేటర్ శివాజీ. తర్వాత ప్రెస్ మీట్ లో  శివాజీ మాట్లాడారు. "హలో వైజాగ్ .. కిర్రాక్ ఆర్పీ ఇంతింతై వటుడింతై అన్నట్టు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాండ్ ని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తున్నాడు. వైజాగ్ లో మూడు బ్రాంచీలు ఓపెన్ చేసాడు. ఆర్కే బీచ్ లో ఉన్న స్టార్ డ్రైవ్ ఇది. వైజాగ్ అంటే ఫుడ్ , బీచ్, సినిమా మాత్రమే ఉంటాయి. ఈ బ్రాంచెస్ మూడు కూడా సూపర్ సక్సెస్ కావాలని బాహుబలి 2 లా ఈ  బిజినెస్ విస్తరించాలని విష్ చేస్తున్నా...హైదరాబాద్ లో ఈ బ్రాంచ్  ఎలా సక్సెస్ అయ్యిందో వైజాగ్ లో కూడా అలాగే  సక్సెస్ అవుతుంది అని మనసారా కోరుకుంటున్నా" అన్నారు. తర్వాత ఆర్పీ మాట్లాడుతూ " మణికొండ, అమీర్పేట్ లో పెట్టిన బ్రాంచెస్ అన్నీ సక్సెస్ అయ్యాయి. అలాగే బాలకృష్ణ గారు, ఖుష్బూ గారు సెలెబ్రిటీస్ అంతా ఆదివారం కానీ ఇతర రోజుల్లో కానీ వాళ్లకు కావలసినప్పుడు కుండల్లో వండించుకుని తీసుకెళ్తారు. కాజాగూడలో, తిరుపతిలో ఐదు బ్రాంచీలు సక్సెస్ అయ్యాయి. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిది కూడా వైజాగ్...మా చేపల పులుసు నాణ్యతగా ఉంటుంది. రేట్లు కూడా కర్రీకి తగ్గట్టే ఉంటాయి మరి ఎందుకంటే నేను కూడా లాస్ కాలేను కదా. ఈ చేప అన్ని ప్రాంతాల్లో దొరకదు." అని చెప్పాడు. ఒకప్పుడు జబర్దస్త్ షో నుంచి నాగబాబు వెళ్ళిపోయాక ఆయనతో పాటు కిరాక్ ఆర్పీ కూడా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్ లో నటించాడు. ఇక రెస్టారెంట్ బిజినెస్ లో అడుగుపెట్టి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఓ రెస్టారెంట్ ఓపెన్ చేసాడు ఆర్పీ. అలా ఈ చేపల పులుసు ఫుల్ ఫేమస్ అయ్యేసరికి చిన్నా , పెద్దా సెలబ్రిటీస్ అంతా కూడా క్యూ కడుతున్నారు. ఇప్పుడు వైజాగ్ బ్రాంచ్ ని బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న శివాజితో ఓపెన్ చేయించాడు. ఇక అక్కడికి వచ్చిన అభిమానులు శివాజీ బిగ్ బాస్ లో ఉన్నప్పటి ఫోటో లామినేషన్ ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని తెలిపారు.