బిగ్ బాస్ లవ్ జోడి ఇప్పుడు సూపర్ జోడీగా...

బిగ్ బాస్ సీజన్ 5  లవ్ జోడి ఇప్పుడు సూపర్ జోడిగా మారి ఆడియన్స్ ముందర అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడానికి రాబోతున్నారు. వాళ్లెవరో కాదు మానస్ నాగులపల్లి- ప్రియాంక. సూపర్ జోడి నెక్స్ట్ వీక్ ప్రోమోని రీసెంట్ గా రిలీజ్ చేశారు. బిగ్ బాస్ మొత్తం కూడా ఈ ఇద్దరి లవ్ ట్రాక్ నడిచింది. మానస్ కోసం ఏదైనా చేసేలా కనిపించించేది ప్రియాంక.. మానస్ కి గేమ్స్ లో సపోర్ట్ చేస్తూ, మానస్ నే  కలవరిస్తూ ఉండేది. చాలా సార్లు ప్రియాంక మానస్ కి ఐ లవ్యూ కూడా చెప్పింది. ఐతే ఇదంతా వన్ సైడ్ మాత్రమే మానస్ దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. బిగ్ బాస్ తర్వాత ఎవరి దారి వాళ్ళదైపోయింది. కానీ మానస్ టాపిక్ వస్తే మాత్రం మెలికలు తిరిగిపోతూనే ఎమోషనల్ ఐపోతుంది పింకీ . ఐతే వీళ్ళ లవ్ ట్రాక్ గురించి మానస్ వాళ్ళ అమ్మ అప్పట్లో చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రియాంక మానస్ ని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోను అని చెప్పేసింది. కావాలంటే తగిన అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానని కూడా చెప్పారు. తర్వాత మానస్ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేసుకున్నాడు. ప్రియాంక మాత్రం ఒంటరిగా ఉండిపోయింది. అలాంటి ఆ జోడి ఇప్పుడు మళ్ళీ ఆడియన్సు ముందుకు రాబోతోంది. శివ-మానస్-ప్రియాంక జోడీగా చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రియాంక కళ్లలో మానస్ ని చూసిన ఆనందం తెలిసిపోతోంది. ప్రియాంక చేతులు పట్టుకున్న ఉదయభాను "మానస్ వచ్చాడన్న ఆనందంలో పింకీ చేతులు చల్లగా ఉన్నాయి ఐస్ గడ్డలాగా" అంది. ఆ కామెంట్ తో మానస్ ప్రియాంక పక్కకొచ్చి ఆమె భుజాన్ని పట్టుకునేసరికి "పెట్టుకోవద్దు మళ్ళీ వేడైపోతా" అంటూ ఒక హాట్ డైలాగ్ తో అందరికీ షాకిచ్చింది. "పింకీ చాలా పెయిన్ ఫుల్ జర్నీని ఇంత అందంగా తీసుకుని ఈ స్టేజిలో ఉందంటే నిజంగా హ్యాట్సాఫ్" అంటూ కితాబిచ్చారు రఘు మాష్టర్. ప్రియాంక తన జర్నీని తలుచుకుని స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకుంది.

రోహిణిని బర్రెతో పోల్చిన బులెట్ భాస్కర్

సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోకి రౌడీ రోహిణి, బులెట్ భాస్కర్, నాటీ నరేష్, వర్ష, ఇమ్మానుయేల్, తాగుబోతు రమేష్ వచ్చారు. ఈ వారం షోకి రిట్రో థీమ్ గెటప్స్ వచ్చి ఎంటర్టైన్ చేశారు. బులెట్ భాస్కర్ కొడుకుగా నటించాడు నాటీ నరేష్. "నాన్నగారు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను" అని నరేష్ చెప్పేసరికి "మావయ్యగారు ఆశీర్వదించండి" అంటూ రౌడీ రోహిణి భాస్కర్ కాళ్ళ మీదకు వంగింది. "పెళ్లి చూసుకున్నావా సంతకి వెళ్లి బర్రెను కొన్నావా" అనేసరికి నరేష్, రోహిణి షాకయ్యారు. "దాన్ని పెళ్లి చేసుకుంటే నా ఆస్తి నుంచి నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను" అని కండిషన్ పెట్టాడు భాస్కర్. "నేను మూటలు మోస్తాను, రాళ్లు కొడతాను, ఒళ్ళు వంచి చెమట చిందించి ఐదు రౌండ్లు" అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ ని నరేష్ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. "నాన్నగారు మీకు తెలియకుండా ఒక బాబును కూడా పుట్టించాం" అన్నాడు కామెడీగా. తర్వాత "ఊ అంటావా మావా"అనే సాంగ్ కి వర్ష, రోహిణి డాన్స్ చేసేసరికి "అది నడుమా, రుబ్బురోలా అలా తిప్పుతున్నావ్" అన్నాడు ఇమ్మానుయేల్. ఇక తాగుబోతు రమేష్ వర్షాని పటాయించాడు "ఈ చిత్రం చూసి" అనే  సాంగ్ కూడా పాడేశాడు ఆమె కోసం. "వర్షా నిన్ను ఎప్పటినుంచో ఒక విషయం అడుగుదామనుకుంటున్నా" అన్నాడు రమేష్. దాంతో వర్ష "అది కాదు ఇమ్ము" అని పిలిచేసరికి రమేష్ షాకైపోయాడు. "మొట్టమొదటిసారిగా ఒక అబ్బాయి చెయ్యి పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం" అంటూ తన తప్పును కవర్ చేసుకోవడానికి రమేష్ చేతుల్ని పొగిడేసింది అమ్మడు. "నాకు మాత్రం ఇవి అమ్మాయి చేతుల్లా అనిపించడం లేదే" అని రమేష్ అనేసరికి "నువ్వు పట్టుకున్నది కూడా అమ్మాయి చేతులు కాదు అబ్బాయి చేతులే" అంటూ పక్కనుంచి ఇమ్ము వర్షాని అబ్బాయితో పోల్చి పరువు తీశారు. ఇలా ఈవారం సుమ అడ్డా షో మంచిగా ఎంటర్టైన్ చేయబోతోంది.  

డైరెక్టర్స్ వెతక్కండి...హీరోయిన్ మెటీరియల్ శ్రీసత్య!

సూపర్ జోడి షోలో ఈ వారం పెర్ఫార్మెన్సెస్ ఇరగదీసారు ఒక్కో జోడి. ఇక ఈ వారం వచ్చిన నాలుగు జోడీల్లో సాంకేత్ - శ్రీ సత్య పెర్ఫార్మెన్స్ మాత్రం కూల్ వెదర్ లో సూపర్ హాట్ గా ఉంది. స్టేజి మీద అందరికీ చెమటలు పట్టించేశారు వీళ్ళ డాన్స్ తో. చివరికి శ్రీసత్య సాంకేత్ కి ముద్దు పెట్టేసరికి షాకైపోయింది జడ్జ్ మీనా. ఇక హోస్ట్ ఉదయ భాను వచ్చి "వింటర్ లో కూడా మిడ్ సమ్మర్ వచ్చేసిందబ్బా ..వ్వాట్  ఏ పెర్ఫార్మెన్స్ " అంటూ ఓ రేంజ్ లో వాళ్ళ డాన్స్ కి పొగిడేసింది. ఇక జడ్జ్  శ్రీదేవి కూడా "వన్ అండ్ ఓన్లీ హాట్ కపుల్ అని మీరు ప్రూవ్ చేశారు. సాంకేత్ మీ డాన్సింగ్ స్టైల్ చూసి ఏ అమ్మాయి ఐనా పడిపోతారు..మీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది" అని చెప్పింది. ఇక ఉదయభాను శ్రీసత్యని తెగ పొగిడేసింది "మీకు మీరే ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఐతే నేను ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. నాకు శ్రీ సత్యలో ఒక హీరోయిన్ కనిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్ సరిపోయే హీరోయిన్ మెటీరియల్ నాకు కనిపిస్తోంది. సాయి పల్లవి లాంటి డాన్సర్స్ కి కూడా కాంపిటీషన్ ఇచ్చే డాన్సర్ నాకు కనిపిస్తోంది. మీకు కనిపిస్తుందో లేదు కానీ నాకు కనిపిస్తోంది. ఎక్కడెక్కడో వెతక్కండి ఇక్కడో తెలుగు పిల్ల ఉందబ్బా..మీ డాన్స్ కూడా అద్దిరిపోయింది" అని చెప్పింది ఉదయభాను.. తర్వాత ఈ జోడికి బాగా తెలిసిన మరో జోడి యష్ మాష్టర్ ని తన వైఫ్ వర్షని ఇన్వైట్ చేసింది. "నేను కొరియోగ్రాఫర్ గా చేసేటప్పుడు నా గ్రూప్ లో సాంకేత్ పని చేసేవాడు..ఇప్పుడు ఇలా స్టేజి మీద కొరియోగ్రాఫర్ గా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది...వీళ్లిద్దరు ఇక్కడ చేసిన హాట్ పెర్ఫార్మెన్స్ తక్కువ ఆఫ్ స్క్రీన్ లో ఇంకా ఎక్కువగా చేస్తారు. రఘు మాస్టర్ మీరు నెక్స్ట్ టైం నుంచి మార్క్స్ వేయకండి. ఎందుకంటే ఇకముందు సాంకేత్ ఇలాంటి  సాంగ్స్ ఇంకా ఎక్కువగా  చేస్తాడు " అంటూ కాసేపు ఫన్ క్రియేట్ చేసి తన వైఫ్ వర్షతో కలిసి డాన్స్ చేసాడు యష్ మాస్టర్.

పాన్ ఇండియా ప్రమోషన్స్ లో 90s మౌళి ప్రశాంత్!

ఓ సినిమా బాగుంటే ఇతర భాషల్లోకి అనువదించి దానిని పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ చేస్తారు. కానీ ఈటీవి విన్ లో కొంతకాలం క్రితం తెలుగు భాషలో విడుదలైన #90's వెబ్ సిరీస్ ని పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్స్ చేస్తున్నాడు ఇందులో రఘు పాత్రలో నటించిన మౌళి తనూజ్ ప్రశాంత్. ఈ వెబ్ సిరీస్ లో చంద్రశేఖర్ పాత్రలో శివాజీ, రఘుగా మౌళీ తనూజ్ ప్రశాంత్, రాణీగా వాసుకీ ఆనంద్, ఆదిత్యగా రోహన్  ప్రధాన పాత్రల్లో నటించారు.‌ కాగా ఈ సిరీస్ ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే . వ దశకంలో టీవీలో ప్రసారమయ్యే చక్రవాకం, మొగలి రేకులు, ఆదివారం మాత్రమే వచ్చే సినిమా కోసం వారమంతా ఎదురుచూసే రోజులు ఇలా ఎన్నో జ్ఞాపకాలని మళ్ళీ ఈ జనరేషన్ లో అమ్మనాన్నలుగా ఉన్న #90 's వాళ్లకి చూపించారు దర్శకుడు ఆదిత్య హాసన్. ప్రతీ పాత్రని ఆ నేటివిటికి తగ్గట్టుగా, మాట్లాడే భాషలోను జాగ్రత్తలు తీసుకున్నాడు డైరెక్టర్. అయితే ఏ సీను ఎక్కువ కాకుండా ఎంత ఉంచాలో అంతే ఉంచారు మేకర్స్. ఓ మధ్యతరగతి కుటుంబంలో పండగనో, ఎవరైనా బంధువులు వస్తేనో చేసుకునే మటన్ కర్రీ దగ్గర నుండి డబ్బులు చాలక టీవీ కనెక్షన్ తీపించే సీన్, రెగ్యులర్ అమ్మ ఉప్మా చేసే సీన్లు ఇలా అన్నీ ఆ జనరేషన్ లో ఫేస్ చేసిన ఇష్యూలని చాలా క్లారిటీగా చూపించారు మేకర్స్. బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో సెకెండ్ ఇన్నింగ్స్‌ మొదలెట్టిన శివాజీ.. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు చేసిన వెబ్ సిరీస్ ఇది.  హౌస్ నుండి శివాజీ బయటకొచ్చాక ఈ వెబ్ సిరీస్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ఇది విజయాన్ని సొంతం చేసుకోవడంతో సక్సెస్ మీట్ లు ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ సిరీస్ లోని 'సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని' అనే పాటకి వచ్చే బిజిఎమ్ .. ఆ సీన్ లో ఆదిత్యగా చేసిన రోహన్ పాత్ర.. ప్రతీ ఒక్కరిని కదిలిస్తుంది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసిన ఈ సాంగే వినబడుతుంది. అయితే ఈ సిరీస్ లో రఘుగా చేసిన మౌళి తనూజ్ ప్రశాంత్.. ఇన్ స్టాగ్రామ్ లో తెగ ప్రమోషన్స్ చేస్తున్నాడు. సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా దేశంలోని నలువైపులా వెళ్ళి.. సిరీస్ ని చూడమని చెప్తున్నాడు. అయితే ఇది ఒక్క తెలుగులోనే రిలీజ్ అయింది. మిగతా భాషల్లోకి తర్జుమా చేసి రిలీజ్ చేస్తే మరింత హిట్ అయ్యే ఛాన్స్ ఉంది‌‌. సినిమాగా తీసుకొస్తే ఇంకా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది‌. అయితే ఇప్పుడు ఈ సిరీస్ ని పాన్ ఇండియా సిరీస్ గా చేసే పనిలో పడ్డాడు మౌళి.

Krishna Mukunda Murari:కృష్ణ ముకుంద మురారీలో కీలక మలుపు.. ముకుంద ఆ రింగ్ తొడుగుతుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -380 లో.. ఆదర్శ్, మురారి, ప్రసాద్, మధు కలిసి డ్రింక్ చేస్తుంటారు. అందులోకి ఆమ్లెట్ కోసం సుమలతని పిలిచి చేసి తీసుకొని రా అని అంటాడు. దాంతో‌ సుమలత తిట్టిన తిట్టు తిట్టకుండా అందరిని తిట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు తొండ విషయం కనుకోవాలని ఆదర్శ్ ని మధు అడుగుతాడు. మరొకపక్క ఆదర్శ్ ఎక్కడ అని ముకుంద వెతుక్కుంటూ వస్తుంటే డ్రింక్ చేస్తూ ఉండడం చూసి.. ఎక్కడ నిజం చెప్తాడోనని భయపడి కృష్ణ దగ్గరకి వెళ్లి.‌. వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు పెద్ద అత్తయ్య చూస్తే గొడవ అవుతుంది అని చెప్పి వాళ్ళ దగ్గరకి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ముకుందపై తొండ పడి అరిచింది అన్నారు కదా.. తొండ అయితే అటు పక్కోకో ఇటు పక్కకో వెళ్ళాలి అంతే గాని అక్కడే ఉండే గట్టిగా అరవడమేంటని డ్రింక్ చేస్తూ ఆదర్శ్ ని మధు అడుగుతాడు. అవును అది పాయింటే అని మురారి అంటాడు. అంటే ముకుంద తొండ పడి కాదు ఇంకేదో జరిగి అరిచిందని మీ డౌట్ కదా అని ఆదర్శ్ అంటూ నిజం చెప్పబోతుంటే.. అప్పుడే కృష్ణ ముకుంద అక్కడికి వస్తారు. మీరు ఇలా తాగితే పెద్దత్తయ్య తిడుతారని  ఆదర్శ్ ని ముకుంద అక్కడ నుండి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఆదర్శ్ గదిలోకీ వెళ్తు కిందకి పడిపోతుంటే.. అప్పుడే ముకుంద పట్టుకొని జాగ్రత్త ఆదర్శ్ అని చెప్తుంది. సారీ నీకు చిన్న చిన్న సరదాలు లేకుండా చేస్తున్నానని ముకుంద తన మనసులో అనుకుంటుంది. పెద్దత్తయ్యకి ఇలా తాగడం ఇష్టం ఉండదు.. మురారీకి అలవాటు లేదు. బయటకు వెళ్లి తాగి వస్తాడు. మధుని పట్టించుకోరు. మీరు ఇలా తాగితే అత్తయ్య బాధపడుతుందని ఆదర్శ్ కి ముకుంద సున్నితంగా చెప్తుంది. మీరు కావలనుకుంటే ఈ గదిలో డ్రింక్ చెయ్యండి. మీకు నేను కంపెనీ ఇస్తాను. ఏదో జ్యూస్ తాగుతు మాట్లాడుకుంటుందామని ముకుంద అనగానే ఆదర్శ్ చాల హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత అందరు భోజనం చెయ్యడానికి వస్తారు. వాళ్ళు డ్రింక్ చేసినట్లు భవానికి డౌట్ రాకుండా మేనేజ్ చేస్తారు. నేను డ్రింక్ చేసాను.. ఇలా చేస్తే ముకుంద, మీరు బాధపడుతారని, తను నాతో గొడవ పడింది. మీరంటే ముకుందకి చాలా ప్రేమ గౌరవమని ఆదర్శ్ చెప్తుంటాడు. ఒకరిపై ప్రేమ గౌరవం ఉందని ప్రత్యేకించి చెప్పలా అని అని మురారిని ముకుంద అడుగుతుంది. అవసరం లేదని మురారి అంటాడు. తరువాయి భాగంలో ఆదర్శ్, ముకుందలకి కృష్ణ రింగ్స్ తీసుకొని వస్తుంది. ఇద్దరు ఒకరికొకరు ఉంగరాలు మార్చుకోండి అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu:కాలేజీలో మాణిక్యాన్ని చూసి కంగుతిన్న సీతాకాంత్.. తన గతం అడిగిన రామలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -8 లో.. సిరి సెక్యూరిటీని పంపించి ధనతో కబుర్లు చెప్తుంటుంది. సెక్యూరిటీ తన చెల్లె సిరి దగ్గర లేరన్న విషయం తెలుసుకున్న సీతాకాంత్ హడావిడిగా కాలేజీకి వస్తాడు. అప్పుడే తన కొడుకు చదువుతున్న కాలేజీ ఎలా ఉందో చూడడానికి మాణిక్యం కూడా కాలేజీకి వస్తాడు. ఆ తర్వాత కాలేజీలో సిరి గురించి సీతాకాంత్ వెతుకుతుంటాడు.. సిరికి ధన చెప్పే కవితలు బోర్డుపై రాసి చూపిస్తు ఉంటాడు. సిరి కోసం వెతుకుతున్న సీతాకాంత్ కి మాణిక్యం కనపడడంతో షాక్ అవుతాడు. తన చెల్లె సిరిని ఏమైనా చేస్తాడేమోనని కంగారుపడుతాడు. అంతలోనే సీతాకాంత్ కి మాణిక్యం కన్పించడు. ధనని చూసి మాణిక్యం దగ్గరకి వస్తుంటే.. అప్పుడే రామలక్ష్మి వచ్చి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు. ఇక్కడికి రాకూడదని చెప్పి పక్కకి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత సిరి దగ్గరకి సీతాకాంత్ వచ్చి పక్కకి తీసుకొని వెళ్తాడు. అప్పుడే సెక్యూరిటీ వస్తారు. ఎందుకు వదిలేసి వెళ్లారంటూ వాళ్ళని సీతాకాంత్ కొడుతాడు. ఆ తర్వాత సిరిని ఇంటికి పంపిస్తుంటే.. నాకు ఎందుకు అన్నయ్య ఈ టార్చర్. నువ్వు ఇలా చేస్తే నేను కాలేజీ మానేస్తానని సిరి అంటుంది. అయిన వినకుండా సిరిని ఇంటికి పంపిస్తాడు సీతాకాంత్. ఆ తర్వాత నువ్వు ఎందుకు వచ్చావ్ కాలేజీకీ అని మాణిక్యాన్ని రామలక్ష్మి అడుగగా... నా కొడుకు చదివే కాలేజీ చూడడానికి వచ్చానని మాణిక్యం అంటాడు. ఈ కాలేజీ చూస్తుంటే డబ్బున్న అమ్మాయిలందరు ఈ కాలేజీలోనే చదువుతున్నట్టున్నారు. ఒక మంచి అమ్మాయిని చూసి లవ్ చెయ్ అని చెప్పగానే.. డబ్బులు చూసి నేను అలా లవ్ చేసే టైప్ కాదని ధన చెప్తాడు. ఆ తర్వాత మాణిక్యాన్ని  రామలక్ష్మి అక్కడ నుండి పంపించేస్తుంది. కాలేజీ ఫీజు ధనకి ఇచ్చి నాన్న చెప్పినట్టు కాకుండా బాగా చదువుకోమని రామలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ఉంటారు కానీ ఒకరికొకరు చూసుకోరు. ఆ తర్వాత ఇంటికి వెళ్తాడు సీతాకాంత్. చెల్లి సిరికి భోజనం పట్టుకొని తను ఉండే గదికి వెళ్తాడు. కానీ సిరి మాత్రం సీతాకాంత్  బాధపడేలా మాట్లాడుతుంది. సీతాకాంత్ బయటకు వచ్చి ఆలోచిస్తుంటే వాళ్ళ అమ్మ, తాతయ్య వచ్చి ఏమైందని అడుగుతారు. ఆ మాణిక్యం నాకు కన్పించడని‌ సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత మాణిక్యం దగ్గరకి రామలక్ష్మి వచ్చి.. అసలు ఏమైంది నువ్వు ఎందుకు ఇలా మారిపోయావని అడుగుతుంది. కానీ మాణిక్యం ఏం చెప్పడానికి ఇష్టపడడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

చెప్పులు లేకుండా నేల మీద నడిచి, ఎండలో వర్కౌట్ చెయ్యి..దేవుడిని జపించు

విష్ణుప్రియ బుల్లితెర మీద హోస్ట్ గా చేస్తూ అప్పుడప్పుడు మూవీస్ లో కనిపిస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలాంటి విష్ణు ప్రియా రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఫాన్స్ తో చిట్ చాట్ చేసింది. అంతే కాదు ఒక పర్సన్ ని మోటివేట్ చేసింది. "యూట్యూబ్ నుంచి టీవీ వరకు మీ జర్నీ అద్భుతం..తలచుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది..అలా మీ జర్నీ సాగటానికి ఎలా మోటివేట్ అయ్యారు " అని అడిగేసరికి  "సున్నా నుంచి ప్రారంభించడం అద్భుతంగా అనిపిస్తుంది.  నచ్చిన రంగంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ సక్సెస్ ఐనప్పుడు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంతో  మంది ఆశీర్వాదాల వల్లే నేను ఇంతవరకు ఎదిగాను అనుకుంటున్నాను. నేను ఎంతో మందిని నవ్విస్తున్నాను. ఈరోజు నా జర్నీ చూసుకుని నాకు ఒక డ్రీం లానే అనిపిస్తుంది. " అని చెప్పింది. " నేను లైఫ్ లో చాలా కష్టాలు పడుతున్నాను. కొన్నిసార్లు నాకే  సందేహం వస్తుంది నేను లైఫ్ లో ఫెయిల్ అయ్యానా అని" " కష్టతరమైన దశలు ఎన్ని వచ్చినా అవి చాలా మంచి దశ అని అనుకోవాలి. ఎందుకంటే  కష్టం ఉన్నప్పుడే  జీవితం పదునుగా  మారుతుంది.  భవిష్యత్తులో ఎదుర్కోబోయే ఎన్నో యుద్ధాలకు నిన్ను సిద్ధం చేస్తుంది.. దృఢంగా ఉండేలా చేస్తుంది. నాకు కూడా ఒక్కోసారి ఇలాగే అనిపిస్తుంది..కానీ అప్పుడు నేను ఆ భగవంతుడి నామాన్ని జపించుకుంటాను.. మీ గమనం ఏమిటో ఎక్కడికో తెలుసుకోండి. ఒక్కసారి చెప్పులు లేకుండా నేల మీద నడవండి, ఎండలో వర్కౌట్ చేయండి..మీకు మీ దారి ఏంటనేది తెలుస్తుంది.. కష్టాలు ఒక భాగం మాత్రమే..దాని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోండి ...ఫీల్ అవకండి. " అంటూ అద్భుతమైన సలహా ఇచ్చింది.  "మీ కామెంట్ సెక్షన్ ని ఎందుకు క్లోజ్ చేశారు" అని అడిగేసరికి  "ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది.. నేను వారి అభిప్రాయాలను కొన్ని సార్లు ఆపలేని పరిస్థితి ఉంటుంది... కాబట్టి అలాంటి వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా కామెంట్ చేయకుండా ఉండేందుకే నేను కామెంట్ సెక్షన్ ని క్లోజ్ చేసాను" అని చెప్పింది విష్ణు ప్రియా.

దయచేసి మా ఇంటికి, సెలూన్ కి రాకండి : ఆదిరెడ్డి

కొందరు సెలబ్రిటీలు ఫ్యాన్ బేస్ ని పెంచుకున్నాక ప్రాబ్లమ్స్ లో పడతారు. ఎంత అంటే వొరి బాబు మీ అభిమానానికో దండం రా సామి అనేంతలా సమస్యని ఎదుర్కుంటారు. ఎక్కడైన సరే అతి మంచి అనేది పనికిరాదని తాజాగా ఆదిరెడ్డి చెప్పిన ఓ వీడియో చూస్తే అర్థమవుతుంది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి ముందు ప్రతీ ఎపిసోడ్ చూసి రివ్యూలు ఇచ్చిన అదిరెడ్డి.. కామన్ మ్యాన్ కేటగిరీలో సీజన్ సిక్స్ లో హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఎన్నో అంచనాల మధ్య కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టిన ఆదిరెడ్డికి బయట బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది. హౌస్ లో జెన్యున్ ప్లేయర్ అంటే ఆదిరెడ్డి  తన ఆటతీరుని కనబరిచేవాడు.  ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి రెగ్యులర్ గా రివ్యూ ఇచ్చాడు. ప్రస్తుతం తాజాగా ఓ వీడియోని అందరికి షేర్ చేయమంటు చెప్పాడు. తనని కలవడానికి ఇంటికి, సెలూన్ కి వచ్చి ఆదిరెడ్డి ఎక్కడ.‌. ఎప్పుడొస్తాడు. కలిసి మాట్లాడలని చెప్తూ కొంతమంది నన్ను అభిమానించే ఫ్యాన్స్ వస్తున్నారంట. అది చాలా ఇబ్బందిగా ఉంది‌.‌ అయిన ఏదైన ప్రాబ్లమ్ ఉంటే ఇన్ స్ట్రాగ్రామ్ , యూట్యూబ్ లోనో అడగాలి కానీ ఇలా ఇంటికి రావడమేంటి. అలా వచ్చినవాళ్లవి నిజంగా సమస్యలా అంటే అదేం ఉండదు.. యూకే, యూఎస్ ఏ వెళ్ళాలని అంటున్నారు. నేనేమైనా గవర్నమెంటా లేక ఎమ్ఎల్ఏ నా.. ఏదైనా డబ్బు సహాయం కావాలంటే ఎవరికీ సాయంచేయని డబ్బున్న వాళ్ళని అడగాలి కదా‌.. నేను నాకు తోచినంతలో లేనివాళ్ళకి సహాయం చేస్తున్నా అంతే కానీ ఇలా ఇంటికి రావటం ఏం బాలేదు. అలా ఎవ్వరు చేయకండి అంటు ఆదిరెడ్డి వీడియో‌ని త‌న ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు. కాగా ఈ వీడియోకి చాలారకాల కామెంట్లు వస్తున్నాయి. మీరు చెప్పింది కరెక్ట్ బ్రో అని ఒకరు, కంప్లీట్లీ రాంగ్ స్టేట్ మెంట్ అంటు మరొకరు.. అతిమంచితనం పనికిరాదని ఒకరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. దయచేసి ఎవరు ఇంటి దగ్గరికి గానీ సెలూన్ దగ్గరకి గానీ రాకండి. ఏదైనా ఉంటే మెసేజ్ చేయండి అంటు ఈ వీడియోలో నొక్కి చెప్పాడు ఆదిరెడ్డి. అయితే కొన్ని రోజుల క్రితం ఆదిరెడ్డిని ఒకడు దారుణంగా మోసం చేశాడంటూ వీడియో వ్లాగ్ చేయగా అది వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా ఇది ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంది‌. ఏదైన సరే అతి అభిమానం కూడా మంచిది కాదని ఇలాంటివి జరిగినప్పుడే కొంతమందికి తెలుస్తోంది.   

సోహైల్ బిగ్ బాస్ కి రాడు..అసలు ఓటిటి సీజన్ ఉంటుందా ఉండదా ?  

  బిగ్ బాస్ ఇప్పటి వరకు ఏడు సీజన్లు పూర్తయ్యాయి. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ ఓటిటి సీజన్ 2 కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓటిటి వెర్షన్ కి కొంతమందిని మేకర్స్ వెళ్లి కలిశారు అనే వార్తలు కూడా వినిపించాయి. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఓటిటి సీజన్ కి సంబంధించి అఫీషియల్ పేజీ ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చింది. "బిగ్ బాస్ ఓటిటి సీజన్ కి సోహైల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా" అని అడిగితే "చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మంచిగా మూవీస్ తీసుకుంటున్నాడు..ఇప్పుడెందుకు వస్తాడు" అని ఆన్సర్ ఇచ్చారు. "ఇంతకు బిగ్ బాస్ ఎవరు" అని అడిగేసరికి "డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధ కృష్ణ" అని ఆన్సర్ ఇచ్చారు. రాధా కృష్ణ బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 నుండి వాయిస్‌ ఇస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ ఓటిటి సీజన్ ఇప్పుడు ఫిబ్రవరిలో ఉంటుందా లేదా అనే పెద్ద డౌట్ అందరిలో ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 లో జరిగిన రచ్చ ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అందులోనూ బిగ్ బాస్ షో టీవీ సీజన్ కి వస్తామని చెప్తున్నారు కానీ చాలామంది ఓటిటి సీజన్ కి రావడానికి ఎవరూ పెద్దగా ఇంటరెస్ట్ చూపించడం లేదు. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఓటిటి స్టార్ట్ అవుతుంది అని గత నెలలో హింట్ ఇచ్చారు. కానీ ఇప్పుడేమో ఇంకా దానికి సంబంధించిన అప్ డేట్స్ ఏమీ బయటకు రావడం లేదు. బిగ్ బాస్ ఓటిటి సీజన్ 1 లో బిందు మాధవి విన్నర్ అయ్యింది కానీ ఈ సీజన్ కి అనుకున్నంత రేటింగ్ ఐతే రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 కి అద్భుతమైన రేటింగ్ రావడంతో పాటు ఆడియన్స్ లో బిగ్ బాస్ అంటే ఆసక్తి పెరిగేలా చేసింది. కానీ తర్వాత సీజన్ నుంచి గొడవలు బాగా జరగడం స్టార్ట్ అయ్యాయి. అలాగే హోస్ట్ కూడా పెద్దగా ఆసక్తి లేకుండా ఎక్కువ కంటెంట్ ని ఆడియన్స్ కి ఇవ్వకుండా ఏదో మొక్కుబడిగా చేస్తూ వస్తున్నారు. దాంతో ఇన్ని సీజన్స్ నడిచాయి కానీ వాటికి పెద్దగా రేటింగ్ ఐతే రాలేదు. మరి ఓటిటి సీజన్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది.

Guppedantha Manasu:వాడి నిజస్వరూపాన్ని బయటపెట్టిన వసుధార.. సాక్ష్యాలు లేవంటు సైలెంట్ గా తప్పుకుందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -986 లో.. శైలెంద్రనే రిషిని కిడ్నాప్ చేసాడని భావించిన వసుధార తన దగ్గరకి వెళ్లి కాలర్ పట్టుకొని నీలదీస్తుంది. రిషి సర్ ఎక్కడ అంటు చెయ్ చేసుకుంటుంది. అప్పుడే దేవయాని ఫణింద్ర ఇద్దరు అక్కడికి వస్తారు. ఏం చేస్తున్నావ్ నా కొడుకుని ఎందుకు కొడుతున్నావని దేవయాని అడుగుతుంది. రిషి సర్ ని కిడ్నాప్ చేసింది వీడే సర్ అని ఫణింద్రతో వసుధార చెప్తుంది. ఇన్ని రోజులు మీరు బాధపడుతారని నిజం దాచాం సర్ అని వసుధార అనగానే.. నేనేం బాధపడను ఇప్పుడు నాకు నిజం తెలియాలని ఫణీంద్ర అంటాడు. ఇన్ని రోజులు ఎండీ సీట్ కోసం వీడు చెయ్యని కుట్రలు లెవు.. రిషి సర్ పై,  నాపై ఎప్పుడు ఎటాక్ లు జరుపుతూనే ఉన్నాడు. జగతి మేడమ్ ని బెదిరించి ఆ రోజు మాతో అలా అబద్ధం చెప్పించాడు. జగతి మేడమ్ ని చంపించింది కూడా వీడే అని వసుధార చెప్తుంటే ఫణీంద్ర షాక్ అవుతాడు. రిషి సర్ ని కిడ్నాప్ చేసాడని వసుధార చెప్తుంటే అప్పుడు వీడు హాస్పిటల్ లో ఉన్నాడు కాదా అని ఫణింద్ర అంటాడు. వీడు హాస్పిటల్ లో ఉంటే వీనికి ఎంత మంది రౌడీలు తెలుసో మీకు తెలుసా సర్ చాలసార్లు రౌడీలకి డబ్బులు ఇస్తూ ఉంటే ధరణి మేడమ్ చూసారని వసుధార చెప్తుంది. ధరణి నువ్వు చూసావా అని ఫణీంద్ర అడుగుతాడు. అవును చూసానని ధరణి చెప్పగానే.. నేను ఎవరికి ఇచ్చానో చూసావా? డెలివరి బాయ్ కి ఇచ్చానో తెలుసా అని శైలేంద్ర కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. రిషి సర్ ని కాపాడుకొని నా ఇంటికి తెచ్చుకొని బాగా చూసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు కిడ్నాప్ చేసాడని వసుధార అనగానే.. అంటే రిషి ఇన్ని రోజులు నీ దగ్గరే ఉన్నాడా అని మళ్ళీ వసుధార పైకి శైలేంద్ర డైవర్ట్ చేస్తాడు. రిషి సర్ ని శైలేంద్రే కిడ్నాప్ చేసాడని నా దగ్గర సాక్ష్యం ఉందని వీడియో చూపించబోతే అందులో వీడియో ఉండదు. అప్పుడే ముకుల్ వచ్చి శైలేంద్ర తప్పు చేసాడని నిరూపించడానికి మన దగ్గర సాక్ష్యం లేదని ముకుల్ చెప్తాడు. ఏంటి వసుధార తప్పు చేసాడని అంటున్నావ్ వీడియో లేదని అంటున్నావ్ తప్పు చేసాడని తెలిస్తే.. నా కొడుకు అయిన సరే నేను వదిలిపెట్టను. సాక్ష్యం లేదు కాబట్టి తల దించుకొని వెళ్తున్నా.. లేదంటే నిన్ను జైలుకి పంపించేదాన్ని అని వసుధార అంటుంది. ఆ తర్వాత వసుధార, మహేంద్ర, అనుపమ, ముకుల్ ఇంటికి వెళ్లి.. ఆ వీడియో ఎవరు డిలీట్ చేశారో ఆలోచిస్తారు. అసలు ఇప్పుడు రిషి కన్పించకపోవడానికి కారణం శైలేంద్ర కాదని తెలిసిందని ముకుల్ చెప్తాడు. మరి ఎవరని అందరు ఆలోచిస్తుంటారు. మరొకవైపు వీడియో భళే డిలీట్ చేసావంటూ భద్రని శైలేంద్ర మెచ్చుకుంటాడు. కానీ ఇప్పుడు అసలు రిషిని కిడ్నాప్ చేసింది ఎవరని వాళ్ళు కూడా అనుకుంటారు. ఒకవేళ ఆ రాజీవ్ గాడు కిడ్నాప్ చేసి ఉంటాడా అని శైలెంద్ర మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi:భార్య చేతిలోకి ఆఫీస్ పగ్గాలు.. భర్తకి తలనొప్పిగా మారనుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -319 లో.. కళ్యాణ్ కవితలు రాస్తుంటే.. అనామిక వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతుంది. కవితలు రాస్తున్నానని కళ్యాణ్ చెప్పగానే.. ఇంట్లో అందరు ఆఫీస్ కి వెళ్తున్నారు ఒక్క నువ్వు తప్ప.. ఆ కావ్య కూడ వెళ్తుంది. ఇలా ఉంటే ఇంట్లో నాకు నీకు విలువ ఉంటుందా? నువ్వు కూడా ఆఫీస్ కి వెళ్ళాలని అనామిక చెప్తుంది. నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? నేను ఒక బోర్డు మెంబెర్ ని అని కళ్యాణ్ చెప్తాడు. మీ అమ్మ కూడా నీకు విలువ ఇవ్వట్లేదని బాధపడుతుంది కదా.. నాక్కూడా అలాగే ఉంటుంది కదా.. అని అనామిక చెప్తుంది. దాంతో సరే ఆలోచిస్తానని అనామికని పంపించి.. మళ్ళీ కవితలు రాస్తుంటాడు కళ్యాణ్. ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్లకుండా కావ్య బయటే ఉండడం చూసిన అపర్ణ.. కావ్యని పిలిచి ఎందుకు వెళ్ళలేదని అడుగుతుంది. క్యాబ్ కోసం వెయిటింగ్ అని కావ్య చెప్తుంది. అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి.. మీకు షేర్ ఆటో అలవాటే కదా.. అందులో వెళ్లకపోయావని చులకనగా మాట్లాడుతుంది. అది చూడలేని అపర్ణ.. ఈ ఇంటి వారసుడి భార్యవి నువ్వు.. నువ్వు క్యాబ్ లో వెళ్లడమేంటని తన కార్ కీస్ తీసుకొని వచ్చి.. కావ్యకి ఇచ్చి డ్రైవర్ బయట ఉన్నాడని చెప్తుంది. మంచి నిర్ణయం తీసుకున్నావని ఇందిరాదేవి అంటుంది. కావ్య ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. థాంక్స్ అని కావ్య చెప్పగానే.. నీపై ప్రేమతో ఇదంతా చెయ్యట్లేదు. నువ్వు ఇంటి పెద్దకోడలిగా ఆఫీస్ కి వెళ్తున్నావ్.. ఆ  గౌరవం కోసం చేస్తున్నానని అపర్ణ చెప్తుంది. దాని తర్వాత కావ్య వెళ్ళిపోతుంది. ధాన్యలక్ష్మి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కాసేపటికి ప్రకాష్ దగ్గరికి ధాన్యలక్ష్మి వెళ్లి.. ఆ కావ్య ఆఫీస్ కి వెళ్ళింది. మన కళ్యాణ్ కి వాల్యూ లేదని అంటుంటే అలా మాట్లాడకని ప్రకాష్ చివాట్లు పెడతాడు. మరొకవైపు అలసిపోయి వచ్చిన అప్పు.. తన ఫ్రెండ్ అన్న మాటలు గుర్తుకు చేసుకొని బాధపడుతుంది. ఆ తర్వాత రాజ్ ఆఫీస్ కి వెళ్లేసరికి స్టాఫ్ అంత కావ్యకి వెల్ కమ్ చెప్పడానికి రెడీగా ఉంటారు. దాంతో ఎవరు వస్తున్నారని రాజ్ అడుగుతాడు. అప్పుడే కావ్య హుందాగా కార్ లోనుండి దిగి వస్తుంటే.. రాజ్ షాక్ అవుతాడు. అందరు తనకి వెల్ కమ్ చెప్తారు. రాజ్ కోపంగా క్యాబిన్ లోకి వెళ్తాడు. సుభాష్ సర్ ఫోన్ చేసి ఇదంతా చేయమని చెప్పారు సర్.. మేడమ్ కి అపాయింట్మెంట్ లెటర్ కూడా మీ చేతితో ఇవ్వమన్నారు లేదంటే ఫోన్ చెయ్యమన్నారని తను చెప్తుంది. కాసేపటికి కావ్యకి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాడు రాజ్. తరువాయి భాగంలో రాజ్ కి శ్వేత ఫోన్ చేయడంతో హడావిడిగా వెళ్తాడు. కావ్య కూడ రాజ్ వెనకే వెళ్తుంది. అక్కడ రాజ్ , శ్వేత మాట్లాడుకోవడం చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అమ్మకానికి అమెజాన్ ఫారెస్టు...లక్ష్మిదేవి రావడానికి ఫ్రీ బస్సు!

ఎక్స్ట్రా జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమోలో పంచ్ డైలాగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఆటో రాంప్రసాద్, రోహిణి స్కిట్ లో డైలాగ్స్ మాములుగా లేవు...బాగా రిచ్ కిడ్ గా రోహిణి ఎంట్రీ ఇచ్చేసరికి ఆమెను పటాయించడానికి రాంప్రసాద్ వచ్చాడు. "బాగా డబ్బున్న వారిలా ఉన్నారు" అనేసరికి "మేము బంగారపు పళ్లెంలో తింటాం తెలుసా" అంది రోహిణి.."మేము డైరెక్ట్ గా బంగారాన్ని తినేస్తాం" అన్నాడు రాంప్రసాద్.."అరుగుతుందా" అని డౌట్ తో అడిగేసరికి "అరగకపోతే "కరిగించుకునైనా తాగేస్తాం" అంటూ బాగా డబ్బున్న వాడిలా పెద్ద బిల్డప్ ఇచ్చాడు. తర్వాత రోహిణిని కూర్చోబెట్టి "మీరు ప్రాపర్టీస్ కొంటూ ఉంటారా" అని అడిగాడు రాంప్రసాద్..."అవును కొంటుంటాం... ఏమయ్యింది" అనేసరికి.."అంటే ఏమీ లేదు మేము అమెజాన్ ఫారెస్ట్ ని అమ్మేద్దాం అనుకుంటున్నాం కొనుక్కుంటారేమో" అని అడిగాడు రాంప్రసాద్. దానికి రోహిణి షాకైపోయి "అమెజాన్ ఫారెస్ట్ మీదా" అంది .."అవును మా నాన్న పేరు జాన్, అందుకే అమ్మజాన్, అమ్మజాన్ అని పిలిచేసరికి అది కాస్తా అమెజాన్ ఐపోయింది" అన్నాడు ఫన్నీగా రామ్ ప్రసాద్. ఇక వీళ్ళ స్కిట్ ఇలా నవ్వించబోతుంటే..తర్వాత వచ్చిన రాకింగ్ రాకేష్ స్కిట్ లో తెలంగాణ ఫ్రీ బస్సు ఇష్యూ మీద పంచ్ పేల్చాడు రాకేష్. గడ్డం నవీన్, సత్యశ్రీ, జ్ఞానేశ్వర్ ముగ్గురూ కలిసి రాకేష్ పంతులుని పిలిచి "లక్ష్మి దేవి ఇంటికి వచ్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి" అని అడిగారు. దాంతో రాకేష్ రెచ్చిపోయి అదిగో వచ్చేసింది అంటూ ఆయన పరిగెత్తి మిగతా వాళ్ళను పెరిగెత్తించి చివరికి తల పట్టుకుని "లక్ష్మి దేవి రావడానికి ఇబ్బంది పడుతోంది" అన్నాడు రాకేష్.."ఎందుకు గురువు గారు ఫ్రీ బస్సులోనే కదా రమ్మన్నాము" అని కౌంటర్ వేశాడు జ్ఞానేశ్వర్.

అమ్మతోడు అద్భుతమైన మనిషివే నువ్వు : భోలే షావలి!

బూట్ కట్ బాలరాజు సినిమా ప్రీ రిలీజ్ లో పాల్గొన్నాడు భోలే షావలి. ఈ సినిమాలో భోలే పాట పాడాడంట అదే విషయాన్ని భోలే స్ఫీచ్ లో చెప్పాడు. సో హెల్ నుండి‌ వచ్చాడు. ఇప్పుడు సో హెవెన్ గా మారుతున్నాడు. వేదికముందు ఉన్న ఎంతో మంది ప్రముఖులకు నా కళాభివందనాలని భోలే షావలి చెప్పాడు. భోలే పాడిన ఆ పాటని దేవ్ పవర్ రాసాడని చాలా పవర్ ఫుల్ గా రాసాడాని చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ సీజన్-1  నుండి సీజన్-7 వరకు ఉన్న ప్రతీ ఒక్కరు నీకు సపోర్ట్ గా ఉంటారు. అమ్మతోడు అద్భుతమైన మనిషివే నువ్వు.. చాలామంచి మనసున్న వ్యక్తి సోహెల్. ఆయన తర్వాత ఆ పేరు నాకొచ్చిందంటూ భోలే షావలి అన్నాడు. మరి హీరోగా ఎప్పుడు చేస్తున్నారని యాంకర్ సుమ అడుగగా.. భోలే అంటే హీరో.. హీరో అంటే భోలే.. మీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు అంటూ పాట పాడాడు‌. సుమగారి నోటి వెంట నన్ను హీరో అనడం ఎంత కమ్మగా ఉందోనని భోలే షావలి అన్నాడు. బూట్ కట్ బాలరాజు సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని భోలే షావలి అన్నాడు.  ఇక హీరో సోహెల్ మాట్లాడతూ.. భోలే అన్నకి షూటింగ్ ఉన్నా నేను పిలిచానని నాకోసం వచ్చాడు‌. థాంక్స్ సో మచ్ అన్న అని అన్నాడు. ఓ సినిమా ఫంక్షన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ ని గెస్ట్ గా పిలవడం.. మరో‌ బిగ్ బాస్ కంటెస్టెంట్ హీరోగా ఉండటంతో తెలుగు బిగ్ బాస్ అభిమానులకి కన్నులపండుగలా అనిపించింది. ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.  ఎవరికి ఉండే ఫ్యాన్ బేస్ వారికుంటారనేది మరోసారీ నిరూపించాడు భోలే షావలి. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అంబటి అర్జున్, నయని పావని, పూజామూర్తి, అశ్వినిశ్రీలతో పాటు భోలే షావలి వచ్చాడు. వచ్చీ రాగానే నామినేషన్ లో సీరీయల్ బ్యాచ్ పై విరుచుకుపడ్డాడు భోలే. వాళ్ళు చేసే గ్రూపిజం గురించి వారితో ధైర్యంగా చెప్పి ఇన్ స్ట్రాగ్రామ్ లో ట్రోల్స్ చేసే పేజీలకు కంటెంట్ ఇచ్చాడు. పాటబిడ్డ పేరుకి న్యాయం చేసాడు భోలే షావలి. సీజన్ విజేతగా నిలిచిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ జైలుకెళ్ళినప్పుడు లాయర్లతో వెళ్లి బెయిల్ వచ్చేలా చేసి తనకి సపోర్ట్ గా నిలిచాడు భోలే షావలి. దీంతో రియల్ హీరో అని విమర్శకుల చేత అనిపించుకున్నాడు. భోలే పాటలు యూట్యూబ్ లో ఎంత ఫేమసో అందరికి తెలిసిందే.

వ్యూస్ కోసం చేసే ఫేక్ వీడియోలని నమ్మకండి : హిమజ

ఫేక్ న్యూస్ అనేది డిజిటల్ మీడియాలో కామన్ గా మారింది. దీనివల్ల కొంతమంది మానసికంగా బాధపడుతున్నారు. వారికి సంబంధం లేని విషయాల్లో చేర్చి వ్యూస్ తెచ్చుకుంటున్నారు. ఇదే విషయాన్ని బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ తెలియజేసింది.  సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ క్రమంగా ఫేమస్ అయ్యింది నటి హిమజ. నటిగా మంచి పేరు తెచ్చుకొని కొన్ని సీరియళ్లలోను నటించింది. వీటితో పాటు పలు టీవీ షోలు కూడా చేసింది హిమజ. అయితే, బిగ్‍బాస్ ద్వారా ఆమె చాలా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కూడా చాలా చిత్రాల్లో నటించింది. హిమజ వాళ్ళ నాన్న చంద్రశేఖర్ రెడ్డి సినిమాలకి మాటలు, పాటలు రాసేవాడు. అలా తను మాటలు, పాటలు రాసిన 'సర్వాంతర్యామి' అనే టెలీఫిల్మ్ లో తొలిసారి నటించింది హిమజ. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో‌ నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై అడపాదడపా సీరియల్స్ లో నటించిన హిమజ.. హీరో రామ్, హీరోయిన్ రాశిఖన్నా నటించిన 'శివమ్' చిత్రంలో హీరోయిన్ కి స్నేహితురాలి పాత్రలో తొలిసారిగా వెండితెరకు కనిపించింది. ఆ తర్వాత నేను శైలజ, చందమామ రావే, జనతా గ్యారేజ్, ధృవ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలలో చేసింది. అయితే ఇప్పుడు సినిమాలలో బిజీగా ఉంటోంది హిమజ. తనకి ఖాళీ సమయం దొరికినప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, పోస్ట్ లు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. నిన్న మొన్నటిదాకా విదేశాలలో ట్రావెల్ చేసి వచ్చి‌న హిమజ. అయితే తాజాగా ఇన్ స్ట్రాగ్రామ్ లో తనపై వస్తున్న రూమర్స్ గురించి హిమజ స్పందించింది. తన ఫ్రెండ్స్ కాల్ చేసి నీ గురించి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుందని చెప్పారంట. అదేంటంటే గత కొన్ని రోజులుగా రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్ గురించి వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. అయితే అందులో బిగ్ బాస్ నటులు కొందరు ఉన్నారంటూ హిమజ ఫోటోని పెట్టి యూట్యూబ్ లలో వీడియోలు చేస్తున్నారంట. ఇలా ఎన్నోసార్లు చెప్పాను. బిగ్ బాస్ షో ముగిసాక నేను నాతోటి కంటెస్టెంట్స్ కొందరం కలిసి ఓ ఈవెంట్ కి వెళ్ళాం. అంతమాత్రాన మాకు అతనికి రిలేషన్ ఉన్నట్టేనా.. నేను అతడిని బ్రదర్ లా భావించి రాఖీ కూడా కట్టాను. ఇలాంటివి ఎవరు నమ్మరు. కానీ వందలో ఇరవై శాతం మంది నమ్ముతారు. వారివల్ల మాకు ఇబ్బంది అని హిమజ చెప్పుకొచ్చింది. ఇలాంటివాటిని దయచేసి ఎంకరేజ్ చేయకండి అంటూ హిమజ తన ఇన్ స్టాగ్రామ్ లోని వీడియోలో చెప్పింది. కాగా ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

ఎన్ని విజిల్స్ వస్తే పప్పు ఉడికినట్టు...వరుణ్ తేజ్ ని అడిగిన ఉదయభాను

జీ తెలుగులో సూపర్ జోడి షో మంచి హాట్ అండ్ స్వీట్ పెర్ఫార్మెన్సెస్ తో స్టార్ట్ ఐపోయింది. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ లో మున్నా - హర్షల, మేఘన - మహేష్, కరం- డాలీ, సంకేత్-శ్రీసత్య అనే నాలుగు జంటలు వచ్చి పెర్ఫార్మ్ చేశాయి. ఇక ఫస్ట్ ఎపిసోడ్ కే కొత్త పెళ్ళికొడుకు మెగా ఇంటి వారసుడు వరుణ్ తేజ్ ని షోకి సెలబ్రిటీ లుక్ కోసం, టైటిల్ లోగోని చూపించడం కోసం  ఇన్వైట్ చేశారు మేకర్స్. ఇక హోస్ట్ ఉదయభాను ఆయన లవ్ స్టోరీతో పాటు ఇంకొన్ని ప్రశ్నలు కూడా అడిగింది. "నేను లావణ్య మొదట ఫ్రెండ్స్ గా స్టార్ట్ అయ్యాం తర్వాత కొంత మెచ్యూరిటీ వచ్చాక పెళ్లి చేసుకోవడం ఒక బెస్ట్ స్టెప్ అనిపించింది. ఇద్దరం కలిసి ఫామిలీస్ కి చెప్పాం వాళ్ళు కూడా ఓకే అన్నారు. నా ప్రకారం మెగా ఫామిలీ సూపర్ జోడి ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి- సురేఖ గారు." అని చెప్పాడు. "మరి రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు ఫామిలీ మ్యాన్ అయ్యారు కదా ఎంత వరకు ఫామిలీ మ్యాన్ అయ్యారో తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా...కుక్కర్ ఎన్ని విజిల్స్ వస్తే పప్పు ఉడికినట్టు" అని అడిగింది దానికి "మూడు విజిల్స్ అనుకుంటున్నా" అని వరుణ్ తేజ్ అనేసరికి జడ్జి మీనా గారిని అడుగుదాం ఈ విషయం అంది ఉదయభాను. "పప్పుకి ఒక్క విజిల్ వస్తే సరిపోతుందనుకుంటా ఎందుకంటే పప్పు కొంచెమే వేస్తాం కదా" అంది మీనా "పోనీ కప్పు పప్పులో ఎన్ని నీళ్లు పోయాలో తెలుసా" అని ఉదయ భాను అడిగేసరికి "పోయి కుక్కర్ ని అడగండి" అంది జడ్జి శ్రీదేవి ఫన్నీగా . తర్వాత వరుణ్ తేజ్ తో కలిసి చిరంజీవి మూవీ సాంగ్ కి స్టెప్స్ వేసింది మీనా. అలాగే వరుణ్ తేజ్ నటించిన "ఆపరేషన్ వాలెంటైన్" మూవీ టీజర్ వేసి చూపించారు. అలాగే ఈ మూవీలో సాంగ్ పాడిన కునాల్ ని కూడా ఈ షోకి ఇన్వైట్ చేశారు. ఇక సూపర్ జోడి టైటిల్ ని రివీల్ చేసి కంటెస్టెంట్స్ కి విషెస్ చెప్పారు వరుణ్ తేజ్.

రోహిణిని చూస్తే మూడ్ రావట్లేదు..మగాడినన్న ఫీలింగ్ అప్పుడే గుర్తొచ్చింది

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం షోలో బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటుందో నామినేషన్స్ ప్రక్రియ ఎలా ఉంటాయో చేసి చూపించారు సీరియల్ యాక్టర్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్. ఇక ఫస్ట్ రౌండ్ లో నాగ పంచమి సీరియల్ హీరో పృద్వి శెట్టితో కలిసి రోహిణిని డాన్స్ చేయమని చెప్పింది శ్రీముఖి. రోహిణి తెగ డాన్స్ వేసింది కానీ పృద్వి మాత్రం దూరంగా ఉంటూ వచ్చాడు. "ఏదో బొమ్మను పట్టుకుని డాన్స్ చేస్తున్నట్టు ఉంది అరేయ్ అవినాష్ నువ్వు రారా డాన్స్ చేద్దాం అనేసరికి ఆమ్మో నాకు మూడ్ లేదండి" అని డైలాగ్ వేసేసేసరికి తెగ ఫీలైపోయింది రోహిణి.. తర్వాత షోలో బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ సెగ్మెంట్ ని చేయమంటూ టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. నాగపంచమి సీరియల్ హీరో పృద్వి శెట్టి శోభా శెట్టిని నామినేట్ చేసాడు. "శోభా చాలా డల్ గా ఉందని నామినేట్ చేసాను ఇలా ఉంటే ఆడియన్స్ కి చాలా బోర్ కొడుతోంది కదా..శోభా శెట్టి అస్సలు నచ్చడం లేదు పంపించేయండి అన్నాడు పృద్వి. సరే నేను డల్ గా ఉన్నా.. నీ పాయింట్ ఓకే కానీ నువ్వేం చేసావ్ రోహిణి వచ్చి నీతో డాన్స్ వేస్తే నువ్వేసావా..లేదు కదా అని అడిగింది. రోహిణి నాకు నచ్చట్లేదు అందుకే డాన్స్ చేయలేదు అన్నాడు షోకి ఎందుకొచ్చా అంది శోభా డబ్బు కోసం అన్నాడు. మరి డబ్బులకు న్యాయం చేస్తున్నావా అంటే చెయ్యట్లేదు అన్నాడు. మారేందుకు షో నుంచి నువ్వే వెళ్ళిపో అంది శోభా నేను వెళ్ళను" అన్నాడు.. ఇక ఫైనల్ గా మ్యాజిక్ సెగ్మెంట్ లో శ్రీముఖికి లవ్ ప్రొపోజ్ చేసాడు రవికృష్ణ. " సీరియస్లి నేను మగాడినన్న ఫీలింగ్ గుర్తొచ్చింది నిన్ను చూసాకే..ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసాక యూత్ అనే  ఇంకేదో ఫీలింగ్ కూడా వస్తుందని అప్పుడే అర్ధమయ్యింది. నేను బతికున్నంత వరకు ఆ ఫీలింగ్ పోదు" అంటూ ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాడు. తీరా ఆ గిఫ్ట్ బాగ్ లో   చూసేసరికి అందులో అప్పటి వరకు రవికృష్ణ చేతికున్న వాచ్ అతనికి తెలియకుండా హుడీ అనే మెంటలిస్ట్,  మెజీషియన్ మేజిక్ చేసి ఆ గిఫ్ట్ బాగ్ లో పెట్టించి  అతని చేతే  ఆమెకు ఇచ్చేలా చేసాడు. ఇక అతను మేజిక్ కి అందరూ ఫిదా ఇపోయారు.

నెగెటివ్ కామెంట్లు చేసేవారికి గౌతమ్ కృష్ణ స్ట్రాంగ్ కౌంటర్!

జీవితంలో ఏది ఒకరి సొంతం కాదు. నటించేవాళ్ళకి తమ పక్కన ఉన్నది చిన్న ఆర్టిస్ట్ అయిన తక్కువ చూడకడదు. అదే విషయాన్ని బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ చెప్పాడు. అసలేం జరిగిందంటే.. డాక్టర్ బాబు , నయని పావని కలిసి ' తెలియదే' అనే కవర్ సాంగ్ కి డ్యాన్స్ చేశారు.‌ అయితే ఇదే పాటకి యావర్ తో కలిసి నయని పావని నాలుగు రోజుల క్రితం ఓ పర్ఫామెన్స్ చేసి తన ఇమ్ స్ట్రాగ్రామ్ లో అప్లోడ్ చేసింది‌. ఇక నిన్న గౌతమ్ కృష్ణతో అదే పాటకి కలిసి పర్ఫామెన్స్ చేసింది.  నయని పావని, యావర్ ల పర్ఫామెన్స్ బాగుందని కొన్ని వేల కామెంట్లు రాగా.. ఇప్పుడేమో నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి. యావర్ ని ఎందుకు వదిలేశావ్? యావర్ తో చేసిన వీడియో ఎందుకు డిలీట్ చేశావ్? ఈ అశ్వగంధ 3.0 తో ఎందుకు చేశావ్? అంటు కామెంట్లు వస్తున్నాయి. అలాంటి కొన్ని కామెంట్లకి నయని పావని ఘాటుగా సమాధానమిచ్చింది.  నేను చేసిన ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ని ప్రమోట్ చేసుకుంటున్నానని నయని పావని రిప్లై ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో పది వారాల పాటు ఉన్న గౌతమ్ కృష్ణ.. తన ఆట తను ఆడకుండా సీరియల్ బ్యాచ్ చెప్పినట్లు చేశేవాడు. ఆ తర్వాత ఎలిమినేషన్ అంటూ సీక్రెట్ రూమ్ కి పంపించి మళ్ళీ 2.0 గా తిరిగి హౌస్ లోకి వచ్చాడు. ఆ తర్వాత శివాజీని టార్గెట్ చేయడంతో ప్రేక్షకులలో తీవ్ర నెగటివిటిని సొంతం చేసుకున్నాడు. దాంతో ఎలిమినేట్ అయ్యాడు. ఇక బయటకొచ్చాక శుభశ్రీ రాయగురు, ప్రియాంకతో కలిసి వ్లాగ్స్ చేయగా ఇప్పుడు నయని పావనితో కలిసి ఓ కవర్ సాంగ్ చేశాడు. దానికి పాజిటివ్ కామెంట్లతో పాటు నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. నెగెటివ్ కామెంట్లు చేసేవారందరికి ఓ కామెంట్ పెట్టాడు గౌతమ్ కృష్ణ.. అందులో ఏం చెప్పాడంటే.. మచ్చా అందరికి ఒక విషయం చెప్తా.. బేసిక్ గా నేను నెగెటివిటికి ఎక్కువ రియాక్ట్ కాను బట్ అక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆమె నాకు ఒక మంచి స్నేహితురాలు. మేమంతా యాక్టర్స్ మనిషితోనైనా బొమ్మతోనైన అదేరకంగా పీల్ అయ్యి యాక్ట్ చేస్తాం. ఇల దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తప్పు మచ్చా. నేను ఏదైన అంటే తీసుకోగలుగుతా కానీ అందరు అలా తీసుకోరు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అందరు మనుషులే.. ఎవరి లైఫ్ వాళ్ళిష్టం. అర్థం చేస్కోండి. మీరేమన్నా కానీ ఒకరి క్యారెక్టర్ మారిపోదు. మేము మంచి స్నేహితులం. నెగెటివ్ గా మాట్లాడేవాళ్ళు మీ లైఫ్ ని మీరు సరిగ్గా చూసుకుంటే ఇంకా బాగుపడతారు. జై హింద్ అని గౌతమ్ కృష్ణ కామెంట్ చేశాడు. దీంతో యావర్ ఫ్యాన్స్ కి గౌతమ్ కృష్ణకి మధ్య చిచ్చు మొదలైనట్టుగా తెలుస్తోంది. మరి బిగ్ బాస్ హౌస్ లో లాగా బయట కూడా ఒకరినొకరు దూషించుకుంటారా.. ఈ ఇష్యూ ఎక్కడి వరకు సాగుతుందో చూడాలి మరి.  

అనంత్ శ్రీరామ్ పై ఫైర్ ఐన మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్!

సూపర్ సింగర్ షోలో అనంత శ్రీరామ్ మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్ ఈగోని హర్ట్ చేస్తూ కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈవారం శనివారం ఎపిసోడ్ ఫుల్ కూల్ గా జరిగితే ఆదివారం ఎపిసోడ్ లో కాస్త రచ్చ జరిగింది. లేడీ కంటెస్టెంట్ అక్షయసాయి పాడిన సాంగ్ ని విన్న జడ్జి అనంత శ్రీరామ్ మాట్లాడుతూ " ఎక్స్ప్రెషన్ ప్రకారం తప్పు పట్టడానికి ఏమీ లేదు..కానీ టెక్నికల్ గా కొన్ని మిస్టేక్స్ చేసావు...నీ పక్కన ఉన్న ప్లే బ్యాక్ సింగర్ హరిణి గారిని చూసి ఇంకా బాగా పాడడానికి ట్రై చెయ్యి" అని ఆమెకు సలహా ఇచ్చారు. ఇక స్కోర్స్ విషయానికి వస్తే ఏ వివాదాలు లేవు అన్నారు. మరి శ్వేతా గారు 7 మార్క్స్ ఇచ్చారు అని శ్రీముఖి అనేసరికి " సంగీతం మీద శ్వేతా గారికి పూర్తి సాధికారత ఉంది కాబట్టి" అని ఆన్సర్ ఇచ్చేసరికి "ఐతే మంగ్లీ, రాహుల్ కి సంగీతం మీద సాధికారత లేదా" అని రివర్స్ లో అడిగింది శ్రీముఖి. " ధైర్యంగా చెప్పాలి అంటే శ్వేతా గారితో పోలిస్తే వీళ్లద్దరికీ అంత లేదు" అని చెప్పారు అనంత శ్రీరామ్. దాంతో మంగ్లీ, రాహుల్ ఇద్దరూ ఫైర్ అయ్యారు. "ఇది మ్యూజిక్ నాలెడ్జి గురించి కాదు. స్టేజి మీద ఎలా పెర్ఫార్మ్ చేసింది అనేది ముఖ్యం. ఈ వేదిక మీదకు నేర్చుకోకుండా రాలేదు సర్...మీరు అలా మాట్లాడకూడదు..దాన్ని కించపరచడం అంటారు" అని మంగ్లీ, రాహుల్ గట్టిగానే ఆన్సర్ ఇచ్చారు.."టాలెంట్ అంతా  నిరూపించాలి అంటే పరీక్ష పెట్టాలి" అన్నాడు అనంత శ్రీరామ్ " పరీక్షలు మీ ఇంట్లో పెట్టుకోండి. అసలు దీనికి పరీక్ష ఎందుకు అది పరంపర...నేను, రాహుల్ ఇండిపెండెంట్ గా  నేర్చుకుని, ప్రాక్టీస్ చేసి వచ్చాము.." అని చెప్పారు ఇద్దరూ. ఇక ఫైనల్ గా మార్కుల విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అని ఆ కౌంటర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టారు అనంత శ్రీరామ్.

Brahmamudi:డిజైనర్ గా కావ్య కొత్త జాబ్.. మరి రాజ్ పరిస్థితేంటి?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -318 లో...‌ అప్పుకి తన ఫ్రెండ్ డెలివరీ బాయ్ గా చెయ్యడానికి జాబ్ ఇప్పిస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావ్.. మంచి ఛాన్స్ మిస్ అయ్యావ్.. కళ్యాణ్ కి భార్య అయి ఉంటే నువ్వు ఆ ఇంటికి మహారాణి అయ్యేదని చివరి నిమిషంలో నువ్వు అనుకున్నది జరగలేదంటూ ఎగతాళి చేసినట్టుగా మాట్లాడేసరికి అప్పుకి కోపం వస్తుంది. నువ్వు జాబ్ ఇప్పించావ్ కాబట్టి నిన్నేం అనట్లేదు లేదంటే వేరెలా ఉండేది.. డబ్బులు చూసి ఆస్తులు చూసి ఆశపడేదాన్ని కాదు తన ఫ్రెండ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అప్పు. మరొకవైపు కావ్య చేసిన టిఫిన్ తినకుండా ధాన్యలక్ష్మి బ్రెడ్ ని మాడ్చి తీసుకొని వచ్చి ప్రకాష్ కి అనామికకి పెడుతుంది. అది చూసి నేను తిననని కావ్య చేసిన టిఫిన్ పెట్టమని చెప్తాడు. ఆ తర్వాత కావ్య ఆఫీస్ కి వెళ్తానని పెద్దమ్మకి చెప్పు అని కళ్యాణ్ సైగ చేస్తాడు. దాంతో కావ్య అత్తయ్య గారు మీరు అనుమతి ఇస్తే ఈ రోజు నుండి మన ఆఫీస్ లో డిజైనర్ గా జాయిన్ అవుదామని అనుకుంటున్నానని కావ్య అనగానే.. అవసరం లేదు ఇంట్లో అందరికి టైమ్ కి భోజనం పెడితే చాలు.. అదే నీకు కరెక్ట్. అయిన మా అక్క ఇది వరకే వద్దని చెప్పింది కాదా అని ధాన్యలక్ష్మి అంటుంది. నా కోడలు ఎక్కడ ఉండాలో చెప్పడానికి నువ్వెవరని ధాన్యలక్ష్మికి అపర్ణ ఘాటుగా సమాధానమిస్తుంది. నువ్వు నీ కోడలు ఎప్పుడైన ఇంటి ముందు ముగ్గు అయిన వేసారా.. నా కొడలు వేసిన డిజైన్స్ వల్లనే ఫారెన్ కాంటాక్ట్ వచ్చిందని కావ్య గురించి అపర్ణ గొప్పగా చెప్తుంది. ఆ తర్వాత కావ్య నువ్వు రేపటి నుండి ఆఫీస్ కి వెళ్ళు అని అపర్ణ చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతుంటే ధాన్యలక్ష్మి, అనామిక మాత్రం మొహం మాడుస్తారు. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వెళ్లి.. ఆఫీస్ కి వస్తున్నా అని ఇండైరెక్ట్ గా చెప్తుంది. నన్ను అత్తయ్య గారే వెళ్లామన్నారని కావ్య చెప్తుంది. నువ్వు ఏమైనా కల కన్నావా అంటు.. కావ్య చెప్పింది నమ్మకుండా ఆఫీస్ కి రెడీ అయి కిందకి వస్తాడు. అది చూసి నువ్వు ఒక్కడివే వస్తున్నావ్? కావ్య ఎక్కడ అని అపర్ణ అడుగుతుంది. వెంటనే.. వస్తున్నానని కావ్య వస్తుంది. నువ్వు ఒప్పుకోవడమేంటి అమ్మ అని అపర్ణని రాజ్ అడుగుతాడు. ఒప్పుకోవాలిసి వచ్చిందని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత రాజ్ , కావ్య బయటకు వస్తారు. కావ్య ఆఫీస్ కి వస్తుందని తెలిసిన రాజ్ చిరాకుగా ఉంటాడు. కావ్యని వదిలేసి రాజ్ ఒక్కడే కార్ లో వెళ్ళిపోతాడు. నేను ఎప్పుడు వస్తానన్న వద్దు అనేవారు కాదు.. ఇప్పుడు ఇలా చేస్తున్నారని కావ్య అనుకుంటుంది. తరువాయి భాగంలో క్యాబ్ కోసం వెయిటింగ్ అని అపర్ణకి కావ్య చెప్తుంది. నువ్వు క్యాబ్ లో వెళ్లడమేంటి? ఈ ఇంటికి పెద్ద కోడలివి నా కార్ లో వెళ్ళని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత కావ్యకి వెల్ కమ్ చెప్పాడానికి ఆఫీస్ లోని ఎంప్లాయిస్ రెడీగా ఉంటారు. రాజ్ వాళ్లని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.