రెండు కార్లు కొన్న ఆట సందీప్, జ్యోతిరాజ్ !

పూర్వకాలంలో పెద్దలు ఓ మాట చెప్పేవారు.. కష్టేఫలి.. అంటే నువ్వెంత కష్టపడితే అంత ఫలితం నీకొస్తుంది. అది అక్షరాల నిజమని ఆట సందీప్ అతని భార్య జ్యోతిరాజ్ తెలియజేసారు. పన్నెండు సంవత్సరాల ఆటసందీప్, జ్యోతిరాజ్ ల జీవిత ప్రయాణంలో తనకి ఇచ్చిన మొదటి కార్‌ ఇదేనని జ్యోతిరాజ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. హ్యాపీ మూమెంట్ ఇన్ మై లైఫ్.. మారుతి సుజూకి ఇగ్నైస్, థాంక్స్ టూ మై లవ్లీ హస్బెండ్ ఫర్‌ దిజ్ గిఫ్ట్. పన్నెండు సంవత్సరాల హార్డ్ వర్క్ ఇన్ ఇండస్ట్రీ.. నా బెటర్ హాఫ్ తో సక్సెస్ ఫుల్ గా కలిసి ఉన్నాను. స్మాల్ కార్ విత్ బిగ్ హార్ట్ అంటూ జ్యోతిరాజ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇందులో కార్ ని ఆటసందీప్ సర్ ప్రైజ్ గా జ్యోతికి ఇచ్చిన వీడియోని పోస్ట్ చేసింది. ఇక మరో కార్ మహేంద్ర XUV 700 కార్ ని ఆట సందీప్ తీసుకున్నాడు. ఇది ఆట సందీప్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. హర్డ్ వర్క్ నెవెర్ ఫెయిల్స్ .. దిజ్ ఈజ్ మై న్యూ కార్ అని ఆట సందీప్ ఈ పోస్ట్ కి క్యాప్షన్ కూడా ఇచ్చాడు.‌ అయితే ఈ రెండు కార్లు ఇద్దరు కలిసి ఒకే సారి తీసుకోవడం బాగుందంటూ వీరి డ్యాన్స్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక టేస్టి తేజ అయితే .. కంగ్రాట్యులేషన్స్ మాస్టారు.. టూ కార్స్ టూ పార్టీస్ కావాలని కామెంట్ చేశాడు.  ఆట సందీప్ నటించిన 'ది షాట్ కట్' మూవీ టీజర్ ని తాజగా లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత చేసిన తొలి మూవీ కాబట్టి ఈ సినిమా కథ మీద ఆసక్తి అందరిలో నెలకొంది.  స్పా బ్యాచ్ తో ఎక్కువగా ట్రావెల్ అయిన హౌస్ మేట్ ఆట సందీప్. ఆట సందీప్, అమర్ దీప్ తో కలిసి ఎన్నో గేమ్స్, టాస్క్ లలో ఫౌల్ చేశాడు. ఇక మొట్ట‌మొదటి హౌస్ మేట్ గా గెలిచి ఆరువారాల ఇమ్యూమిటీ పొంది నామినేషన్ లో లేడు. ఆ తర్వాత కెప్టెన్ గా గెలిచి మరో వారం నామినేషన్ లో మిస్ అయ్యాడు.‌ ఇక తొమ్మిదవ వారం టేస్టీ తేజ నామినేషన్ చేయడంతోనే ఎలిమినేషన్ అయి బయటకొచ్చాడు ఆట సందీప్.‌ తొమ్మిది వారాలు ఓ కంటెస్టెంట్ నామినేషన్ లో ఉండకుండా హౌస్ లో ఉండటం ప్రథమం అయితే బయటకు రావడం ఇదే తొలిసారి జరిగింది. ‌ఇక హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రియాంక జైన్, శోభాశెట్టి, అమర్ దీప్ లతో ఎక్కువ స్నేహంగా ఉన్న ఆటసందీప్.. ఆ తర్వాత ఎలిమినేషన్ అయి బయటకొచ్చాక‌ ఎవరు జెన్యున్ ప్లేయర్? ఎవరు గ్రూప్ గా ఆడుతున్నారో‌ తెలుసుకొని పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేశాడు. ఆట‌ సందీప్, జ్యోతిరాజ్ కలిసి అయోధ్య రాముడి కోసం చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ తాజాగా మిలియన్ మార్కుని కూడా దాటింది.  

మొత్తానికి రామలక్ష్మి, సీతాకాంత్ ఎదురుపడ్డారు.. ఆ పనిమనిషి ఇచ్చిన సలహా ఎలా మారనుందో!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -11 లో.. రామలక్ష్మి, సీతాకాంత్  ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఇంటికి వచ్చాక ఇద్దరు ఒకరినొకరు ఎక్కడో చూసానా అని ఆలోచిస్తుంటారు. ఎస్ ఆ రోజు నాపై కలర్స్ పోసింది ఆ అమ్మాయే కదా అని సీతాకాంత్ గుర్తుకుచేసుకుంటాడు.. అదే సమయంలో రామలక్ష్మి కూడా నేను పొరపాటున ఆ రోజు అతనిపై కలర్ చల్లాను కదా అని అనుకుంటుంది. ఆ తర్వాత ఇన్ని రోజులకి కన్పించావా రౌడీ బేబీ అని సీతాకాంత్ అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం సీతాకాంత్ హడావిడిగా రామలక్ష్మి కలర్స్ చల్లిన కార్ ని తీసుకొని బయల్దేరి ఒక చోటుకి వచ్చి తన పిఏ కీ కాల్ చేసి ఆ అమ్మాయి అడ్రస్ తెలిసిందా అని కనుక్కుంటాడు. తెలిసింది ఆ అమ్మాయి క్యాబ్ డ్రైవర్ అని అంటాడు. క్యాబ్ ఓనర్ నెంబర్ మీకు పంపిస్తానని పిఏ చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ క్యాబ్ ఓనర్ కి కాల్ చేసి.. నీ వెహికల్స్ అన్ని ఇక్కడ ఉండాలని చెప్పడంతో.. అతను సరే అని అన్ని క్యాబ్ డ్రైవర్స్ ని సీతాకాంత్ ఉన్నా చోటుకి రమ్మని చెప్తాడు. అలాగే రామలక్ష్మికి కూడా చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వస్తుంది. సర్ కి సారి అంట చెప్పమని క్యాబ్ ఓనర్ రామలక్ష్మితో చెప్తాడు. నేను ఎందుకు చెప్పాలంటూ రామలక్ష్మి పొగరుగా మాట్లాడుతుంది. నీ పేరేంటని రామలక్ష్మిని సీతాకాంత్ అడుగుతాడు. ముందు మీ పేరు చెప్పడం మర్యాదంటు సీతాకాంత్ తో తగ్గకుండా మాట్లాడుతుంది రామలక్ష్మి. నా కార్ పై ఆ రోజు కలర్ చల్లావ్.. ఇప్పుడు క్లీన్ చెయ్ అని సీతాకాంత్ చెప్తాడు. ఆ రోజు నుండి ఇలాగే ఉంచారా అని రామలక్ష్మి ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత నువ్వే చల్లావ్ కాబట్టి నువ్వే క్లీన్ చెయ్యాలని సీతాకాంత్ చెప్తాడు. దానిదేం ఉంది క్లీన్ చేస్తాను అంటు కార్ క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత వెళ్లిపోతు నేను కార్ పై మాత్రమే కలర్ చల్లలేదు.. మీపై కూడా చల్లాను రూల్ పాటించారా.. మరి మీ మొహాన్ని ఎందుకు మీరే క్లీన్ చేసుకున్నారంటూ సీతాకాంత్ మొహంపై వాటర్ కొట్టి వెళ్ళిపోతుంది. మరోవైపు సీతాకాంత్ వాళ్ళింట్లో మరో డిస్కషన్ సాగుతుంది. వాళ్ళ ఇంట్లో పనిచేసే పనిమనిషి మొదలెడుతుంది. మీకేం తక్కవ, పెద్ద సర్ తో పాటు మీ సర్ కి కూడా వాటా ఉంది కదా.. మీరెందుకు బిజినెస్ చేసుకోండి అంటు శ్రీవల్లితో పనిమనిషి అనగానే శ్రీవల్లి ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Krishna Mukunda Murari:ఆ ముహుర్తానికే వాళ్ళ శోభనం.. పది రోజులు ఆగాల్సిందే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -383 లో.. నువ్వు వాళ్లకి రింగ్స్ ఇచ్చి చాలా మంచి పని చేసావ్. నువ్వు నా భార్య అవ్వడం నా అదృష్టం. ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోకుండా అనవసరంగా ఇంట్లో నుండి వెళ్ళిపోయి బాధ పెట్టానని ఆదర్శ్ అంటు ఉంటాడు. అది విని ముకుంద తనని మోసం చేస్తున్నాననే ఫీలింగ్ వస్తుంది. నీ మనసులో నాకు చోటు ఇచ్చావ్ థాంక్స్ అని ముకుంద చెయ్యి పట్టుకొని ఆదర్శ్ చెప్తాడు. ఆ తర్వాత కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. మురారి వచ్చి ఏంటి హ్యాపీగా ఉన్నావని అడుగుతాడు. ముకుంద మీ చేత నా వేలికి ఉంగరం తొడిగించింది చాలా హ్యాపీగా ఉంది. ఎంత మార్పు అని కృష్ణ అనగానే.. అవునని మురారి అంటాడు. అసలు ఉంగరాలు ఎందుకు మార్చుకుంటారో కృష్ణకి మురారి చెప్తాడు. ఆ తర్వాత ముకుంద ఎందుకు ఆదర్శ్ రింగ్ తొడిగించుకోలేదని భవాని ఆలోచిస్తంటుంది. ఇంకా ముకుంద మారలేదు అనుకుంటుంది. అప్పుడే అక్కడికి రేవతి వచ్చి పది రోజుల వరకు ముహూర్తం లేవని చెప్పారు కదా.. అందుకే పెట్టుడు ముహూర్తం పెట్టి పిల్లలకి ఆ శోభనం జరిపిద్దామని భవానితో రేవతి అంటుంది. పది రోజులు ఆగితే ఏం అవుతుంది. అవసరమైతే కృష్ణ మురారీలకి జరిపించు.. ఆదర్శ్ ముకుందలకి వద్దని భవాని చెప్తుంది. ఎన్ని రోజులు ముకుంద నటిస్తు ఉంటుంది. శోభనం జరిపి అందరి జీవితాలు నాశనం చెయ్యలేనని భవాని తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత రేవతిని భవాని అక్కడ నుండి పంపిస్తుంది. ఆ తర్వాత రేవతి డల్ గా ఉండడంతో కృష్ణ, మురారి వచ్చి.. ఏమైందని అడుగుతారు. జరిగిన విషయం రేవతి వాళ్లకి చెప్తుంది. నేను వెళ్లి మాట్లాడుతానని కృష్ణ రేవతిని తీసుకొని భవాని దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చావని భవాని అడుగుతుంది. రేవతి అడిగిన దానికి అయితే వెళ్ళిపో.. పెట్టుడు ముహూర్తం పెట్టుకొని మీరు ఏర్పాట్లు చేసుకోండి కానీ ఆదర్శ్, ముకుందలకి ఇప్పుడే వద్దు. నేను వాళ్ళ గురించి అలోచించి మాట్లాడుతున్నానని భవాని చెప్తుంది. ఇన్ని రోజులు ఆగింది వాళ్ళ కోసమేగా వాళ్లకి మాకు ఒకేసారి అని భవానికి కృష్ణ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇదే విషయం మురారికి కృష్ణ చెప్తుంది.. తరువాయి భాగంలో  మా ఫ్రెండ్ వాళ్ళు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. అందుకు ఆదర్శ్, ముకుంద పేర్లు ఇచ్చామని మురారి అంటాడు. మీరు అందులో పాల్గొని అందరి అనుమానం క్లియర్ చెయ్యండని కృష్ణ అంటుంది. దాంతో ముకుంద షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

యావర్ తో నా బంధం ఎప్పటికీ అపురూపమే....

రీసెంట్ బుల్లితెర నటీనటులకు పద్మ మోహన అవార్డ్స్ లభించిన విషయం తెలిసిందే. అలా అవార్డ్స్ దక్కిన అందరూ ఆ పిక్స్ ని తమ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకున్నారు. అలాగే బ్రహ్మముడి విలన్ గర్ల్ హమీద అలియాస్ స్వప్న కూడా ఆ అవార్డు ని అందుకున్న ఒక పిక్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. దాంతో పాటు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ యావర్ తో దిగిన ఫోటోని షేర్ చేసింది. ఆ పిక్స్ మీద బ్రదర్ అండ్ సిస్టర్ లవ్ అంటూ రాసుకుంది.  " నా సోదరుడు ప్రిన్స్ యావర్‌తో ఉన్న బంధం ఎంతో అపురూపమైనది. బిగ్‌బాస్ 7 నుంచి పద్మమోహన అవార్డ్స్ వరకూ యావర్‌తో గడిపిన క్షణాలను సెలబ్రేట్ చేసుకున్నాను. మా నవ్వులు, మేము షేర్ చేసుకున్న ఎన్నో సంగతులను ఎప్పటికీ మర్చిపోలేను." అంటూ హమీదా క్యాప్షన్ పెట్టుకుంది. నెటిజన్స్ వీళ్ళ రిలేషన్ కి ఫిదా ఐపోతున్నారు. "బిగ్ బాస్ సీజన్ లో జెన్యూన్ గా ఆడిన కంటెస్టెంట్ యావర్ ని సపోర్ట్ చేసావ్.. దాంతో నీ మీద ఇంకా గౌరవం పెరిగింది...నాకు ఇష్టమైన  ఫెవరేట్ బీబీ కంటెస్టెంట్స్ ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు." అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హమీదా  ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న స్వప్న రోల్ లో శ్రీకర్ కృష్ణకి జోడీగా నటిస్తోంది. బిగ్‌బాస్ సీజన్ -5లో పార్టిసిపేట్ చేసింది హమీద. ఎక్కువ రోజులు హౌస్‌లో లేకపోయినప్పటికీ హమీద మాత్రం మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక శ్రీకర్ కృష్ణ హమీద ఇద్దరూ కలిసి ఆఫ్ స్క్రీన్ లో చేసే రీల్స్ కి మంచి వ్యూస్ వస్తూ ఉంటాయి. బుల్లితెర మీద షోస్ లో, ఈవెంట్స్ లో రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంది. అలాగే ఇప్పుడు మూవీస్ లో మంచి రోల్స్ వస్తే చేయడానికి రెడీ ఉన్నట్లు పలు ఇంటర్వ్యూస్ లో చెప్పింది హమీద.  

Guppedantha Manasu:భద్రని పట్టించాను.. ఇక మిగిలింది నువ్వే!

స్టార్ మా టీవీలో ప్రసరమావుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -989 లో.. కాలేజీలో జరిగిన దాని గురించి అనుపమ, మహేంద్ర, వసుధార ఇద్దరు మాట్లాడుకుంటారు. ఒకసారి నువ్వు ఎండీగా కరెక్ట్ అంటారు. ఒక్కసారి కాదని అంటారు. ఏంటి వాళ్ళని మహేంద్ర అనగానే.. వాళ్ళని శైలేంద్ర అలా మాట్లాడిస్తున్నాడని  వసుధార అంటుంది. వాడు మాట్లాడిస్తే మాట్లాడతారా.. నీ గురించి వాళ్లకి తెలియదా అని మహేంద్ర అంటాడు. నా గురించి తెలిసిన వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారంటే వాళ్ళ మైండ్ శైలేంద్ర ఎంత పొల్యూట్ చేశాడో అర్థం అవుతుందని వసుధార అంటుంది. ఆ తర్వాత అసలు రిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ అని మహేంద్ర అంటాడు. నన్ను క్షమించండి, నా వల్లే ఇలా జరిగిందని చక్రపాణి అనగానే.. మీరు రిషిని కంటికి రెప్పలా కాపాడారు. శత్రువులు వెనకాల నుండి దాడి చేస్తే మీరేం చేస్తారని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత వసుధార ఫోన్ మాట్లాడుతు.. రిషి సర్ దొరికారా అంటూ కార్ లో ఒక్కతే వెళ్తుంది. అది విన్న భద్ర.. శైలేంద్ర కి ఫోన్ చేసి రిషి ఎక్కడో ఉన్నాడంట వసుధార వెళ్లింది. ఇక ఆలస్యం చెయ్యను. ఆ వసుధార, రిషి ఇద్దరిని లేపేస్తానని భద్ర చెప్తాడు. మీరు అక్కడకు రండి నేను లొకేషన్ పంపిస్తానని శైలేంద్రకి భద్ర చెప్పి.. వసుధార వెనకాలే ఫాలో అయి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుధార ఒక దగ్గర ఆగి.. నడుస్తు వెళ్తుంది. భద్ర కూడా వెళ్తు ఉంటాడు. ఎక్కడకి వెళ్ళింది ఇటే వచ్చింది కదా అనుకుంటుండగా వసుధార ఎదరుగా వస్తుంది. నాకు తెలుసురా నువ్వు శైలేంద్ర మనిషివే అని అని వసుధార అనగానే.. ఇప్పుడు తెలిసి ఏం చేస్తావని భద్ర అంటాడు. అప్పుడే అక్కడికి ముకుల్ వస్తాడు. తను ఏం చెయ్యాలో అదే చేస్తుందని ముకుల్ అంటాడు. వెంటనే ముకుల్ కాని స్టేబుల్స్ ని భద్ర దగ్గరికి పంపిస్తాడు. భద్ర పారిపోకుండా కాని స్టేబుల్స్ ఉంటారు. నాకు తెలుసు ఇదంతా కావాలనే చేసానని వసుధార చెప్తుంది. నువ్వే రౌడీలని పెట్టి.. నువ్వే కాపాడి.. మావయ్య గారికి ఎదరుపడి ఇదంతా చేసావ్ కాదా అని వసుధార అనగానే నాకేం తెలియదని భద్ర అంటాడు. ఆ తర్వాత ఇక నీ పర్ఫామెన్స్ ఆపురా అని వసుధార అంటుంది. నీ చేత ఎలా నిజలు ఎలా బయటపెట్టించాలో నాకు తెలుసంటూ భద్రని అరెస్ట్ చేసి ముకుల్ తీసుకొని వెళ్తుంటే.. నన్ను ఇంత వరకు పోలీసులు అరెస్ట్ చెయ్యలేదు.. నీ సంగతి చెప్తాను అంటు వసుధారకి భద్ర వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత భద్ర రమ్మన్నాడని శైలేంద్ర లొకేషన్ కి వస్తాడు. వసుధార తప్ప అక్కడ ఎవరు ఉండరు. ఏంటి భద్ర కోసం వెతుకుతున్నావా అని శైలేంద్రని వసుధార అనగానే.. ఏం తెలియనట్టు శైలేంద్ర యాక్ట్ చేస్తుంటాడు. నాకు అంతా తెలుసు భద్రని ఆల్రెడీ ముకుల్ కి పట్టించాను. ఇన్ని రోజులు సాక్ష్యం లేక తప్పించుకున్నావ్ కదా.. ఇక అలా ఉండదని శైలెంద్రకి వసుధార మాస్ వార్నింగ్  ఇస్తుంటే శైలేంద్ర టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi:నువ్వు నా మిస్సెస్ గా అన్ పర్ ఫెక్ట్.. కావ్య అప్పలమ్మ అంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -322 లో.. నన్ను మీరు ఏ రోజు భార్యగా చుడలేదు. ఎందుకని మీకు  నేనేం తక్కువ చేసానని కావ్య ఏడుస్తూ రాజ్ ని నిలదీస్తుంది. నిన్ను భార్యగా ఒప్పుకోకపోవడానికి చాలా కారణాలున్నాయని రాజ్ అంటాడు. వాటిని రాసి చూపిస్తాను చూడంటూ బోర్డు దగ్గరికి వెళ్తాడు. రాజ్  కి కావ్య గురించి ఏం రాయాలో అర్థం కాదు. ఆ తర్వాత వంద కారణాలు అన్నారు. ఏంటి ఒక్కటి కూడా రాయడం లేదని కావ్య అనగానే.. ఇదిగో ఇదే అడ్డదిడ్డంగా వాదిస్తూ ఉంటావని ఒకటి రాస్తాడు. నీ మాటే నెగ్గాలని ఇంకొకటి రాస్తాడు. ఇక రాజ్ కీ ఏం రాయాలో తెలియక.. ఇలా అప్పలమ్మలా రెడీ అవుతావు.. అలా రెడీ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. నా భార్య అంటే ఎలా ఉండాలి. ఎక్కడికి వెళ్ళిన ఇలా వెళ్ళాగలనా.. భార్యంటే భర్త స్టేటస్ పెంచేలా ఉండాలి. నువ్వు నా భార్యగా అన్ ఫిట్ అని కావ్యని  రాజ్ చులకన చేసి మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కావ్య ఆఫీస్ లో వర్క్ చేస్తుందా అని సుభాష్ ని అపర్ణ అడుగుతుంది. తనకేంటి అలాంటి డిజైనర్ ఎక్కడ ఉండదంటూ సుభాష్, ప్రకాష్ ఇద్దరు పొగుడుతుంటే.. ధాన్యలక్ష్మి అది వినలేక వెళ్ళిపోబోతుంటుంది. తను అలా వెళ్ళడం చూసిన ప్రకాష్.. ఎందుకు వెళ్తున్నావని అడిగుతాడు. అలా అడగడంతో ప్రకాష్ ని అందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి. దాంతో అందరి ముందు నీ భర్తతో అలాగేనే ప్రవర్తించేదంటు ధాన్యలక్ష్మిని ఇందిరాదేవి తిడుతుంది. ఆ తర్వాత అక్కడికి కళ్యాణ్ వచ్చి.. తన గురించి ఎవరు పట్టించుకోవడం లేదు అన్నట్లు మాట్లాడేసరికి అపర్ణ.. పంతులికి ఫోన్ చేసి శోభనం ముహూర్తం చూడమని చెప్పిందని ఇందిరాదేవి అనగానే.. కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా కొడుకు గురించి ఎవరు పట్టించుకోనవసరం లేదంటూ ధాన్యలక్ష్మి అంటుంది. మంచిది నా కొడుకు కోడలు గురించి పట్టించుకుంటానంటు.. కావ్యకి నగలు చేయించాలి.. డిజైన్స్ కావ్యని వెయ్యమని చెప్పండని సుభాష్ కి అపర్ణ చెప్తుంది. నా కోడలికి కూడా చేయించాలని ప్రకాష్ కి ధాన్యలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత అప్పు డెలివరీ ఇవ్వడానికి ఒక ఇంటికి వెళ్తుంది. అక్కడ ఒక ఆవిడని, తన కూతురిని కిడ్నాప్ చేసి డబ్బులు కావాలని ఒకడు బ్లాక్ మెయిల్ చేస్తుంటే.. ఏమైందని ఆవిడని అడిగి తెలుసుకుంటుంది. మరొకవైపు కావ్య నోటికి ప్లాస్టర్ వేసుకొని రాజ్ దగ్గరికి వస్తుంది. రాత్రి ఎక్కువ వాగుతుందని బోర్డు పై రాజ్ రాసాడు కాబట్టి తనకి మంచి భార్య అనిపించుకోవాలని ఉంటుంది. తను రాసినవి చేస్తానని చెప్తుంది.. ఆ తర్వాత అనామికకి వాళ్ళ అమ్మ శోభనం చెడగొట్టుకునే ప్లాన్ ఇస్తుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో వాళ్ళని కిడ్నాప్ చేసిన వాళ్ళని పట్టుకోవాలని అప్పు తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి వెతకమని చెప్తుంది. తరువాయి భాగంలో నా చెల్లిని ఎవరో అప్పలమ్మ అన్నారంట అని కావ్యని స్వప్న బాగా రెడీ చేసి ఆఫీస్ కి పంపిస్తుంది. కావ్యని చూసి రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

వామ్మో మీ డామినేషన్.. మగవాళ్ళకి మెంటల్ ఎక్కుతుంది!

ఇదేందయ్యా ఇది నేనెప్పుడూ సూడలా.. ఎస్ ఓ మనిషి మాస్క్ తో ఉన్నాడా? నిజంగా ఉన్నాడా ఎలా తెలుసుకుంటాం. అతని ప్రవర్తన, అతను మనతో మాట్లాడే మాటలు.. చేసే పనులు అన్నీ చూసుకొని మనం అతనిపై ఓ అంచనాకి వస్తాం. అలా బిగ్ బాస్ హౌస్ లో ఓ వందరోజులు ఉన్న మనిషిని దాదాపు కొన్ని కోట్ల మంది చూసారు. వారందరికి హౌస్ లో ఎవరేంటో తెలిసిపోతుంది. కొందరు బయటకొచ్చాక నేను మంచిదాన్ని నన్ను నెగెటివ్ గా చూపించారని అనుకుంటున్నారంటూ ఓ ఇంటర్వూలో ప్రియాంక అంది. ప్రియాంక జైన్ టాప్-5  కంటెస్టెంట్ గా నిలిచింది. పొట్టిపిల్ల గట్టిపిల్లగా హౌస్ లో శివంగిలా ఆడిన ప్రియాంక తన సత్తా చాటుకుంది. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ప్రియాంక. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆటతీరుతో, మాటతీరుతో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.  హౌస్ లో ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ గా పేరుతెచ్చుకున్న అమర్, శోభాశెట్టి, ప్రియాంక.. ఎప్పుడు కలిసి ఉండేవారు. గేమ్ అయిన బయట అయిన గ్రూపిజం చేస్తు ఉండటంతో ప్రేక్షకులలో వీరిపట్ల నెగెటివిటి పెరిగిపోయింది. దాంతో శోభాశెట్టిని గ్రాంఢ్ ఫినాలే ముందు వారంలో బయటకు పంపించారు.  ఇక టాప్-5 లో ఒకరిగా ఉన్న ప్రియాంక జైన్.‌ అయిదవ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. ప్రస్తుతం తను ఓ ఇంటర్వూలో పాల్గొని హౌస్ లో జరిగిన కొన్ని విషయాలని షేర్ చేసింది. స్పా బ్యాచ్ బయట ఎందుకు కలవట్లేదని క్వశ్చన్ అడుగగా..  ఎప్పుడో ఒకసారి మేము కలుస్తాం. హౌస్ లో మంచి ఫ్రెండ్స్ అయ్యామని ప్రియాంక అంది. శివాజీ గారి గురించి చెప్పండని అడుగగా.. శివాజీ గారు చాణక్య అంతే.. ఆయన మాస్క్ తో ఉన్న  మాస్టర్ మైండ్. హౌస్ లో బయటపడలేదు.. ఇంకెప్పుడు బయటపడడని అంది. టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ఓకేనా అనగా.. ఒకే .. మొదట అతనిది యాక్టింగ్ అనిపించింది వెళ్ళే కొద్దీ అతడితో స్నేహం కుదిరింది. మంచివాడు వాడు విన్నర్ గా అర్హుడే అని ప్రియాంక జైన్ అంది. అమర్ దీప్ తో మీ ఫ్రెండ్ షిప్ గురించి చెప్పండి అని అడుగగా.. తను నాకు జానకి కలనలేదు సీరియల్ తో పరిచయం. మేం షూటింగ్ లోనే కలుస్తాం.. మాట్లాడుకుంటాం అంతేకానీ ఎక్కువగా కలవమని అంది. ఇలా హౌస్ లోని కంటెస్టెంట్స్ ఎవరెలా ఉన్నారో.. ఎవరేంటో చెప్పిన ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అయితే ఈ వీడియోకి నెగెటివ్ కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. " మీరేంటో బిబి హౌస్ లో చూపించారు అక్క. మళ్ళీ నీ కోసం మీరెన్ని చెప్పినా నమ్మము అక్క.. వామ్మో మీ డామినేషన్ మగవాళ్ళకి మెంటల్ ఎక్కుతుంది " అని ఓ నెటిజన్ చేసిన కామెంట్ హైలైట్ గా నిలిచింది.  

దుబాయ్ లో ఇక్కడికి పోతే ప్రపంచం మొత్తం చూడొచ్చు!

ప్రపంచం మొత్తం చూడాలంటే అన్ని దేశాలు తిరగాల్సిన పని లేదు. ఎస్ నిజమే దుబాయ్ లోని ఒకే ఒక్క ప్లేస్ కి వెళ్తే చాలంట. అన్నీ చూడొచ్చని జ్యోతక్క‌ అలియాస్ శివజ్యోతి తన యూట్యూబ్ ఛానెల్ లోని వ్లాగ్ లో చెప్పుకొచ్చింది. దుబాయ్ అంటే చాలు చాలా కాస్టీ కార్లు, కాస్టీ బిల్డింగ్స్, కాస్ట్లీ లొకేషన్స్ , తక్కువ ఖరీదైన బంగారం.. దుబాయ్ అత్తరు.. ఇవన్నీ గుర్తొస్తాయి.‌ కానీ  అసలు దుబాయ్ లో ఏం ఉన్నాయో తెలియాలంటే జ్యోతక్క వ్లాగ్ చూడాల్సిందేనంట. అక్కడికి తన భర్తతో‌ కలిసి వెళ్ళింది శివజ్యోతి. అక్కడ మొదట ' మిరాకిల్ గార్డెన్' కి వెళ్ళిన శివ జ్యోతి.. ఆ తర్వాత ' గ్లోబల్ విలేజ్' అనే ప్లేస్ కి వెళ్ళింది. అక్కడ అన్ని దేశాలకి సంబంధించిన ఫేమస్ ప్లేస్ లు, ఫేమస్ ఫుడ్ స్టాల్స్ ఇలా అన్నీ ఒకేదగ్గర ఉంటాయంట. ఇవన్నింటిని చూపించి‌.. ఒక్కసారి ఇక్కడికి వస్తే అన్ని దేశాలని ఒకేసారి చూసే ఫీలింగ్ వస్తుందని చెప్పింది.  తను చేసిన వ్లాగ్స్ లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. కుమారి ఆంటీతో చేసిన వ్లాగ్, అత్తగారి ఇల్లు, పెద్దమ్మతల్లికి యాటను కోసినం లాంటి జనాదరణ పొందిన వ్లాగ్స్ బోలెడున్నాయి. శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి.. అందరికి సుపరిచితమే. అందరిని కలుపుకుపోయే శివజ్యోతి మాటతీరుని చూసి ఇష్టపడని వారంటు ఎవరూ ఉండరు. బిగ్ బాస్ ద్వారా కోట్లాది ప్రేక్షకులకు దగ్గర అయింది శివజ్యోతి. బిగ్ బాస్ తో సెలబ్రిటీ లిస్ట్ లో చేరింది. తీన్మార్ సావిత్రిగా ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసిన శివజ్యోతి.. తన మాట తీరు తో అందరిని ఆకట్టుకుంది. తెలంగాణ యాసతో పాటు తను మాట్లాడే తీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా చేసింది. దాంతో వల్ల మంచి క్రేజ్ సంపాదించుకుంది శివజ్యోతి.. అంతే కాకుండా బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చి హోస్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది బిగ్ బాస్ 3 లో మోస్ట్ ఎమోషనల్ గా శివజ్యోతి ని చెప్తారు... బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతి కి కెరీర్ కి బ్రేక్ పడింది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ని గడుపుతుంది. శివజ్యోతి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి ప్రేక్షకులకు తన పర్సనల్ లైఫ్ తో పాటు ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉంటోంది.

బాబోయ్ బ్యాంకాక్ కి ఓ దండం!  

ఏదైన సరే మన దేశంలో మన ఊళ్ళో మన ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ ఇంకెక్కడా ఉండదు. ఎక్కడికెళ్ళిన ఏదో వెలితి ఉంటుంది‌. ఇప్పుడు కాదు ఎప్పుడు అయిన అంతే. పటాస్ ప్రవీణ్ రీసెంట్‌గా బ్యాంకాక్ వెళ్ళాడు.  బజర్దస్త్ అనేది ఎంతోమంది కనుమరుగయిపోయిన వారికి, అప్‌కమింగ్ కమెడియన్లకు ఛాన్స్ ఇచ్చింది. అలాంటి వారిలో ఒకరు పటాస్ ప్రవీణ్. ముందుగా పటాస్ అనే స్టాండప్ కామెడీ షోతో పరిచయమయిన ప్రవీణ్.. తన ఐడెంటిటీనే పటాస్ ప్రవీణ్‌గా మార్చుకున్నాడు. బ్యాంకాక్ లో అన్ని టూరిజం లోకేషన్స్ చూసిన ప్రవీణ్ బాగా ఎంజాయ్ చేశాడు. అయితే అన్నీ చూడటానికి బాగున్నాయి కానీ తినడానికి ఏమీ బాలేవంట. అదే మన ఇండియాలో దొరికే రైస్, కర్రీస్ ఏమీ లేవంట.. ఎటు చూసిన పాములు, తేళ్ళు, కప్పలే కన్పిస్తున్నాయంట. తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియోని అప్లోడ్ చేసి తన భాదని పంచుకున్నాడు పటాస్ ప్రవీణ్. బయట ఏం తినేలా లేవు. సూపర్ మార్కెట్ కి వెళ్లి ఏవో తెచ్చిన.. అవి చూస్తే తినబుద్ది కావట్లేదు. ఇవేంటో అర్థం కాదు. నా బాధ ఎవలకి చెప్పుకోవాలో తెలియదు. ఏది తినాలన్న నరకం కన్పిస్తుంది. కడుపల ఎలుకలు ఉరుకుతున్నాయి నాకైతే.. ఎంతైన మన ఇంటికి కాడ మనం ముద్దుగా వండుకొని తింటే ఎంత బాగుంటుంది. లాస్ట్ కి ఏం తినలేక జామకాయ ముక్కని కారంలో ముంచుకొని తింటున్నా అని ప్రవీణ్ ఇందులో చెప్పాడు. బాబోయ్ బ్యాంకాక్ దండం అనే క్యాప్షన్ తో చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫేమ్ పటాస్ ఫైమాతో కొన్నిరోజులు ప్రేమలో ఉన్న ప్రవీణ్.. కొన్ని రోజులకి ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత.. పల్లెటూరి పిల్ల పట్నం పిలగాడు,  ప్రవీణ్ గాడి ఊరి ప్రేమకథ అనే వెబ్ సిరీస్ లతో ఆకట్టుకున్నాడు ప్రవీణ్. 

బిగ్ బాస్ అంటే వంటల షోనా..అక్కడికి వెళ్లి వంటలు చేయాలా

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా స్ట్రీట్ ఫుడ్ కుమార్ ఆంటీ గురించిన టాకే నడుస్తోంది. రీసెంట్ గా ఆమె పుట్టిన ఊరు గుడివాడలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు తప్ప తనకు ఎలాంటి ఆస్తి లేదని చెప్పిన కామెంట్స్ వలన తన ఫుడ్ బిజినెస్ పై వేటు పడిందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. దాంతో ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగిస్తున్నారన్న నెపంతో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఐతే ఇదంతా సోషల్ మీడియాలో రావడం నెటిజన్స్ అంతా కూడా కుమార్ ఆంటీకి సపోర్ట్ గా వీడియోస్, పిక్స్, కంటెంట్ పోస్ట్ చేస్తూ సపోర్ట్ చేయడాన్ని  రేవంత్ సర్కార్ గమనించింది. దాంతి ఆమె బిజినెస్ కి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఆమె మీద కేసు అదీ ఏమీ పెట్టొద్దంటూ త్వరలో తానూ కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ ని విజిట్ చేస్తానంటూ ట్వీట్ చేశారు. ఇక ఈమె ఆనందం మాములుగా లేదు.   ఇక్కడి వరకు ఒక ఎత్తు ఐతే  ఇప్పుడు కొత్త టాక్ నడుస్తోంది. సోషల్ మీడియా సెలెబ్రిటీస్ ని బిగ్ బాస్ గాలం వేసి పట్టుకుంటుందన్న విషయం తెలిసిందే కదా. అలా రాబోయే బిగ్ బాస్ సీజన్ 8 కి ఆమె వెళ్తుంది అంటూ ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఐతే బిగ్ బాస్ అంటే ఏంటో కూడా కుమారి ఆంటీకి తెలీదు. "బిగ్ బాస్ కంటెస్టెంట్ గా  మిమ్మల్ని హౌస్ లోకి పంపిస్తే ఏం చేస్తారు" అని అడిగేసరికి "అంటే అదేమన్నా వంటల ప్రోగ్రామ..అందులో వంటలు చేస్తారా..నేను వెళ్లి అక్కడ  వంటలు చేయాలా ?" అని అడిగింది..దీని బట్టి కుమారి ఆంటీకి బిగ్ బాస్ షో అంటే ఏంటో కూడా తెలీదని విషయం తెలుస్తోంది. తనకు బిగ్ బాస్ షో అంటే తనకు తెలీదని కేవలం నాలుగు సీరియల్స్ మాత్రమే చూస్తానని అలాగే తన భర్త పెట్టే న్యూస్ ఛానెల్స్ ని మాత్రమే చూస్తానని చెప్పింది. అలాగే  ఆ నాలుగు సీరియల్స్ కూడా భోజనం చేసేటప్పుడు మాత్రమే చూస్తానని వేరే ఏవీ చూసే అవకాశం ఉండదు.. పనే సరిపోతుంది అని మరో ఇంటర్వ్యూలో చెప్పింది కుమారి ఆంటీ. కుమారి ఆంటీ చాలా తక్కువగా ధరకే ఫుడ్ అందిస్తూ ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది.

చిత్రలహరి మూవీలో ఆఫర్ శేఖర్ మాస్టర్ వల్ల వచ్చింది

  ఢీ షో ద్వారా ఎంతోమంది డాన్స్ మాస్టర్లు ఫేమస్ ఐనా కూడా యష్ మాష్టర్ పేరు మాత్రమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చి శేఖర్ మాస్టర్  పక్కనే డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జ్‌గా దుమ్ములేపాడు యష్  మాస్టర్. అలాగే యష్ మాస్టర్ మూడు సార్లు ఢీ టైటిల్ విన్ అయ్యాడు. అలాగే ధమాకా మూవీలో రవితేజకు ఒక సాంగ్ కూడా కోరియోగ్రఫీ చేసాడు. అలాంటి యష్ మాస్టర్ సాయి ధరమ్ తేజ్ నటించిన "చిత్రలహరి" మూవీలోని "గ్లాస్మేట్స్" అనే సాంగ్ ఆఫర్  శేఖర్  మాస్టర్ వల్ల వచ్చిందంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. శేఖర్ మాస్టర్ గురించి ఒక విషయం చెప్పాలి "సాయి ధరమ్ తేజ్ గారి సాంగ్ ఒకటి శేఖర్  మాస్టర్ కంపోజ్ చేస్తూ ఆ రిహార్సల్స్ లో ఉన్నారు..అదే టైములో ఒకరోజు నేను ఫోన్  చేసి సర్ ఇలా నేను షూట్ కి రావొచ్చా, చూడొచ్చా అని అడిగితే రమ్మని పిలిచారు. బ్రేక్ లో శేఖర్ మాస్టర్, సాయి ధరమ్ తేజ్ గారు లొకేషన్ లో నిలబడ్డారు నేను చాలా దూరంలో నిలబడ్డాను. శేఖర్  మాస్టర్ అప్పుడు నన్ను పిలిచి తేజ్ గారికి పరిచయం చేశారు. ఎవరైనా ఆ స్టేజిలో ఉన్నప్పుడు ఏమని పరిచయం చేస్తారు బాగా చేస్తారు అని సరిపెడతారు అంతే కదా కానీ శేఖర్ మాస్టర్ అలా అనలేదు నాకంటే బాగా చేస్తాడు యష్ అని చెప్పారు. మంచి కొరియోగ్రాఫర్ ఒక సారి మీరు కూడా చూడండి అని పరిచయం చేశారు. నాకంటే బాగా చేస్తారు అని ఎవరూ అస్సలు చెప్పరు కానీ శేఖర్ మాష్టర్ అలా నా గురించి చెప్పేసరికి నాలో నాకే తెలియని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. శేఖర్  మాస్టర్ పరిచయం చేసిన వారం రోజులలోపే తేజ్ గారు నన్ను పిలిచి గ్లాస్ మేట్స్ సాంగ్ ఆఫర్ ఇచ్చారు. శేఖర్ మాస్టర్ ఎప్పుడూ డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే చాలు." అన్నాడు. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్స్ లో "ఆకాశం దాటి వస్తావా" అనే మూవీలో హీరోగా యష్ నటించాడు. ఆ మూవీ త్వరలో రిలీజ్ కాబోతోందన్నాడు. ఢీ స్టేజి మీదకు కోరియోగ్రఫీ చేయమని ఒకవేళ పిలిస్తే కచ్చితంగా వెళ్తా..అదే తనకు చాలా ఇష్టమైన పని అని అన్నాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో చైతన్య మాస్టర్ ని, అలాగే తన దగ్గర అసిస్టెంట్ గా కెరీర్ స్టార్ట్ చేసి చివరికి బ్లడ్ కాన్సర్ తో మరణించిన కేవల్ ని కూడా తలుచుకుని బాధపడ్డాడు. అలాగే లైఫ్ లో ఎప్పుడూ ప్లాన్ ఏ , ప్లాన్ బి ఉండాలి. సక్సెస్ ఐతే ఓకే కాకపొతే లైఫ్ ని ఎండ్ చేసుకోకుండా ప్లాన్ బితో లైఫ్ లో ముందుకెళ్లాలి అని ఒక పాయింట్ ని చెప్పాడు యష్  మాస్టర్.  

సూపర్ జోడి షో పెట్టింది మా కోసం కాదు రఘు మాస్టర్  కోసం

సూపర్ జోడి నెక్స్ట్ వీక్ లాంఛ్ 2 ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ లాంఛ్ ఎపిసోడ్ కి సందీప్ కిషన్ ఎంట్రీ ఇచ్చారు. ఇక సందీప్ కిషన్ రావడంతోనే తన చిన్నప్పటి క్రష్ మీనా అని చెప్పాడు. తర్వాత దిలీప్-యాష్మి జోడి మంచి హాట్ పెర్ఫార్మెన్స్ తో డాన్స్ చేశారు అది కూడా ముత్తు మూవీ నుంచి థిలాన థిలాన సాంగ్ కి డాన్స్ చేసేసరికి మీనా ఫిదా ఐపోయింది. ఇక దిలీప్ తన హార్ట్ మీద మీనా అని రాసుకుని ఆమెను ఇంప్రెస్ చేసాడు.  తర్వాత రిచర్డ్-పల్లవి- నిసర్గ డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. రిచర్డ్ కి అసలు జోడీని నేనంటే నేను అంటూ ఇద్దరమ్మాయిలు  కొట్టుకునేసరికి మీనాకు అల్లరి మొగుడు మూవీ డేస్ గుర్తొచ్చాయని చెప్పి నవ్వేసింది.   రిచర్డ్ కోసం పల్లవి- నిసర్గ పోటీ పడేసరికి సందీప్ కిషన్ వెళ్లి భయ్యా ఇదేదో నేర్పిస్తే బుక్ పబ్లిష్ చేసి అందరికీ ఇస్తాం అని డైలాగ్ వేసాడు. తర్వాత అంజనా-సంతోష్ వచ్చి మంచి హాట్ డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. ఇక అంజనా రఘు  మాస్టర్ ని చూసి ఫిదా ఐపోయిన విషయం చెప్పింది. "ఫుల్ కర్లీ హెయిర్ తో బాగా డాన్స్ చేస్తోంది ఎవరా అని చూసేసరికి రఘు  మాస్టర్.. అప్పుడు  అలా తనకు  క్రష్ అయ్యారు" అని చెప్పింది. ఆ డైలాగ్ కి రఘు  మాస్టర్  తెగ సిగ్గుపడిపోయాడు. "ఇంతవరకు  డార్లింగ్ నిన్ను ఇంతలా సిగ్గు పడగా చూసిందే లేదు. జడ్జ్ చైర్ లో మొదలైన సిగ్గు స్టేజి మీదకు వచ్చేవరకు కంటిన్యూ అయ్యింది " అంటూ కామెంట్ చేసాడు. "ఈ అంజనా చాలా అందంగా ఉంటుంది" అని చెప్పాడు రఘు  మాస్టర్.  ఆ మాటలకు యాంకర్ శివ నిలబడి "సూపర్ జోడి షో పెట్టింది మా కోసం కాదు రఘు  మాస్టర్ కోసం" అనేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత కృష్ణ  మాస్టర్- తనూజ వచ్చి డాన్స్ చేశారు. ఇక తనూజాతో కలిసి సీరియల్ నటి హరిత వచ్చింది. తనూజాకు దిష్టి తగలకుండా ఉండడం కోసం దిష్టి తియ్యడానికి వచ్చానని చెప్పి తనూజ కాలికి నల్ల తాడు కట్టి అరికాలిలో కాటుక చుక్క పెట్టి హారతి ఇచ్చి మరీ దిష్టి తీసింది. "థ్యాంక్స్ టు అమ్మ. తనూ కోసం రండి అంటే అన్నీ పక్కన పెట్టేసి నా కోసం వచ్చారు" అంటూ తనూజ్ చాలా ఎమోషనల్ అయ్యింది.  

సుజాత ఇలా షాక్ ఇస్తుందనుకోలేదు!

కొన్ని విషయాలు  తెలియకుండా జరిగిపోతాయి. అవి జరిగాక అయ్యో ఇప్పుడెలా అని అనుకుంటాం‌. అలా అనుకోకుండా జరిగేవాటినే షాకింగ్ విషయాలని అంటాం. ఇప్పుడదే జరిగింది. జబర్దస్త్ రాకింగ్ రాకేష్ వాళ్ళ భార్య జోర్దార్ సుజాత అతనికి షాక్ ఇచ్చింది. అసలేం జరిగింది.. ఏంటా షాక్ ఓసారి చూసేద్దాం. సుజాతకి ఒకరి దగ్గరి నుండి కాల్ వస్తుంది. ఆ ఫోన్ మాట్లాడిన సుజాత..  కాస్త సంతోషంగా మాట్లాడతుంది‌. రాకేష్ ని పిలిచి ఓ గుడ్ న్యూస్ అని అంటుంది సుజాత. ఏంటా గుడ్ న్యూస్ అనగా.. అమ్మ వస్తుందంట.. ఓ నాలుగు రోజులు ఇక్కడే ఉంటుందంట అని సుజాత అనేసరికి.. ఒక్కసారిగా ఆలోచిస్తాడు రాకేష్.  షూటింగ్ ఉందని చెప్పు.. నాలుగు రోజులు కాదు కాదు వారం రోజులు.. అసలు హైదరాబాద్ లోనే ఉండట్లేదని చెప్పేయ్ అని సుజాతతో రాకేష్ అంటాడు. అవునా ఎందుకని సుజాత అడుగగా.. అలాగే చెప్పని రాకేష్ అంటాడు. ఆ తర్వాత సుజాత కాల్ చేస్తుంది. హలో అత్తమ్మ మేము అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్తున్నాం. నాలుగు రోజులు అవుతుందో తెలియదు. పది రోజులు అవుతుందో తెలియదు. ఎప్పుడొస్తామో తెలియదని సుజాత అంటుంది. అది విని రాకేష్ షాక్ అవుతాడు. ఇదంతా 'చంటబ్బాయ్' యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశాడు రాకింగ్ రాకేష్. రాకేష్ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ లో రాకేష్ కూడా ఒకరు. నార్మల్ గా కామెడీ చేసే స్టేజి నుంచి ఎదుగుతూ వచ్చి ఇప్పుడు టీం లీడర్ అయ్యాడు. తన కామెడీ పంచులు, డైలాగులతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. రీసెంట్ గా జోర్దార్ సుజాతను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసాక రాకేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. జబర్దస్త్‌ స్టేజి మీద  ఈ జోడీకి ఎంతో క్రేజ్‌ ఉంది.

సింగర్ గీతా మాధురి సీమంతం...వైరల్ అవుతున్న పిక్స్

టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గీతామాధురి మరో సారి అమ్మ కాబోతోంది. త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆల్రెడీ గీతా-నందు జంటకు దాక్షాయనిప్రకృతి అనే కూతురు ఉంది. ఫిబ్రవరిలో దాక్షాయనికి తోడుగా ఓ బుజ్జాయి రాబోతోందని  డిసెంబర్‌లో చెప్పింది గీతా మాధురి. తాజాగా ఆమెకు సీమంతం జరిగింది. కుటుంబ సభ్యులు, గీత ఫ్రెండ్స్, వెల్ విషర్స్ మధ్య ఈ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. అందమైన పట్టు చీరలో మెరిసిపోయింది గీతా మాధురి. సీమంతం చేసే వేదికను కూడా అందంగా ముస్తాబు చేసారు. ప్రస్తుతం  ఈ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సెకండ్ సీజన్‌లో గీతా మాధురి రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. గీత, నందుది లవ్ మ్యారేజ్ అన్న విషయం అందరికీ తెలుసు  2014లో వీళ్ళ మ్యారేజ్ కూడా పెద్దల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. నందు కూడా మూవీస్ లో, వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఢీ షోకి హోస్ట్ గా చేస్తున్నారు అలాగే క్రికెట్ కామెంటేటర్ గా ఉన్నారు. రీసెంట్ గా నందు నటించిన మ్యాన్షన్‌ 24, వధువు వెబ్‌ సిరీస్‌ లు మంచి  రెస్పాన్స్‌ వచ్చింది. నందు ఎలివేట్ అయ్యే రోల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే  నందు తాను మరో సారి తండ్రి కాబోతుండడంతో ఎంతో సంతోషంగా  ఉన్నాడు. అలాగే  ఆహా ప్లాట్ఫారం పై రీసెంట్ గా డగౌట్ అనే గేమ్ షోకి హోస్ట్ గా కూడా చేసాడు. ఈ మధ్య కాలంలో గీతా, నందు డివోర్స్ తీసుకుంటున్నారంటూ ఫేక్ న్యూస్ వైరల్ అయ్యింది. అసలే ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక డివోర్స్ ఎలా తీసుకుంటాం అంటూ ఇద్దరూ ఆ న్యూస్ ని నమ్మొద్దు అని క్లారిటీ ఇచ్చారు. వధువు వెబ్ సిరీస్ లో నందు కీ రోల్ ప్లే చేశారు. ఫస్ట్ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు అసలు నందు రోల్ ఎలా మలుపు తిరగబోతోంది అనే విషయమై సెకండ్ సిరీస్ కోసం ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి ఆనందకర సమయంలో  నందుకు, గీతకి విషెస్ చెప్తున్నారు నెటిజన్స్.

ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజ వాడినన్ని బీప్స్ ఎవరూ వాడలేదు

ఉస్తాద్ ఈ వారం షోకి మాస్ మహారాజ రవితేజ ఎంట్రీ ఇచ్చారు. ఇక రావడంతోనే "అన్నా మీరు హోస్టింగ్ చేస్తే చూడాలని ఉంది" అని మనోజ్ అనేసరికి రవితేజ ఒక నవ్వు నవ్వేశారు. "మీరు హోస్టింగ్ చేస్తే అవతలోడు గోస్టింగ్ ఐపోతాడేమో అని ఆన్సర్ ఇచ్చాడు మనోజ్. తర్వాత కృష్ణ మూవీలో "నీ సోకుమాడ" సాంగ్ వేసి "అన్నా మీ రియల్ లైఫ్ లో ఇలా తిడుతూ ఎవరినైనా ప్రొపోజ్ చేశారా" అని మనోజ్ అడిగేసరికి లేదన్నారు రవితేజ. "పోనీ మీకెవరన్న ప్రొపోజ్ చేశారా" అంటే "వదిలేయ్ అవన్నీ అన్నట్టుగా" సైగలు చేసి చూపించారు. "నేను ఒక విషయం విన్నాను ఇండస్ట్రీలో మీరు వాడినని బీప్స్ ఇంకెవరూ వాడరంట" అనేసరికి " అందరూ వాడతారు కానీ నేను కొంచెం ఎక్కువ ఓపెన్ గా వాడతాను" అంతే అన్నాడు రవితేజ. "అవును నన్ను బీప్ అంటున్నావ్.. నీకు తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ లో కలిపి కదా బీప్స్ ఉంటాయి. నీకేదో బీప్స్ లేనట్టు బుద్ధిమంతుడివి ఐనట్టు..నువ్వు అడగడం నేను పక్కకు రా చెప్తాననడం" అంటూ కామెడీ చేసాడు. "తెలుగు వాళ్ళతో మాట్లాడే టప్పుడు తమిళ్ లో బీప్ లో తిడతాను తమిళ్ వాళ్ళని తెలుగు బీప్ లో తిడతాను..వాళ్లకు అర్ధం కాదు కదా" అన్నాడు మనోజ్. "ఏది జరిగిన పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండడమే" అని చెప్పాడు రవితేజ. తర్వాత కొంతమంది స్టూడెంట్స్ రవితేజని కొన్ని ప్రశ్నలు వేశారు. వాటికీ ఆన్సర్స్ కూడా ఇచ్చారు. "నేను అన్ని మీమ్స్ ట్రోల్స్ ఎంజాయ్ చేస్తాను..నేను మూవీస్ చూసా కానీ థియేటర్ లో ఎగరడాలు, డాన్స్లు చేయడాలు, డబ్బులు విసరడాలు ఏమీ చేయలేదు. ఫస్ట్ డే మార్నింగ్ షో చూసేయాల్సిందే. నేను ఒకళ్ళకు టాక్ చెప్పాలి కానీ నాకు ఒకళ్ళు నాకు  టాక్ చెప్పడం కాదు.. మోక్షద, మహాధన్ ఇద్దరూ సిట్యుయేషన్ బట్టి రియాక్ట్ అవుతారు. మహాధన్ నాకంటే పిచ్చ క్లారిటీగా ఉన్నాడు. వాడి వయసుకు మెచ్యురిటీకి  సంబంధమే లేదు. వాడి లెక్కలు వాడికున్నాయి. సినిమా ఎంటర్టైన్మెంట్ మాత్రం కొన్ని మూవీస్ ఇన్స్పిరేషనల్ గా ఎంతో మంచి చేసేవి కూడా ఉంటాయి" అని చెప్పాడు రవితేజ.

గుప్పెడంత మనసు సీరియల్ కి శుభం కార్డు?

కొన్ని సీరియల్స్ కి ఉండే ఫ్యాన్ బేస్ మరికొన్ని సీరియల్స్ కి ఉండరు. 'కార్తీకదీపం' సీరియల్ లో డాక్టర్ బాబు వంటలక్క, 'ఎన్నెన్నో జన్మలబంధం' సీరియల్ లో వేద , యష్ ల ఆన్ స్క్రీన్ జంటకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది‌. మళ్ళీ అదే రేంజ్ లో 'గుప్పెడంత మనసు'  సీరియల్ లోని రిషి, వసుధారలకే అంత ఫ్యాన్ బేస్ ఉంది. స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ లో.. డిబిఎస్టీ కాలేజీలో ఒక స్టూడెంట్ గా వసుధార జాయిన్ అవుతుంది‌.‌ ఆ తర్వాత కాలేజీ టాపర్ గా నిలుస్తుంది. అప్పుడే తను రిషికి నచ్చేస్తుంది. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే వీరిద్దరు ఎప్పుడు గొడవపడుతూ ప్రేమతో ఉంటారు. దాంతో వీరిద్దరిని ఈ సీరియల్ ఫ్యాన్స్ 'రిషీధార' అని పిలుచుకుంటారు. అయితే మొదట్లో రాజీవ్ వీరిద్దరి ప్రేమకు అడ్డుగా వచ్చాడు. ఇక కొన్ని నెలల క్రితం దేవయాని-ఫణీంద్రల కొడుకు శైలేంద్ర అడ్డుగా వచ్చాడు. శైలేంద్రకి డీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవిని దక్కించుకోవాలని ఆశ ఉండటంతో దానికి అడ్డుగా ఉన్న రిషిని రౌడీలతో కిడ్నాప్ చేపించి కొట్టిస్తాడు. ఇక ఆ రౌడీలనుండి తప్పించుకున్న రిషి ఓ దగ్గర గాయాలతో పడి ఉంటాడు. అది చూసిన ఇద్దరు ముసలివాళ్ళు రిషిని కాపడతారు. ఇక వసుధార, అనుపమ, మహేంద్ర, ముకుల్ అందరు కలిసి రిషి కోసం వెతుకుంటారు. ఆ టైమ్ లో రిషి మెలుకువలోకి వచ్చి వసుధారకి కాల్ చేసి.‌. నేను బ్రతికే ఉన్నానని చెప్తాడు. రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పాక వసుధార వెళ్ళి తీసుకొని వస్తుంది. ఒక సీక్రెట్ ప్లేస్ లో వాళ్ళ నాన్న చక్రపాణిని కాపాల పెట్టి వైద్యం చూపిస్తుంటుంది. అయితే రాజీవ్, భద్ర, శైలేంద్ర కలిసి రిషి కోసం తీవ్రంగా గాలిస్తుంటారు. అయితే అదే సమయంలో కాలేజీలో యూత్ ఫెస్టివల్ జరుగుతుంది. ‌కాలేజీలోని స్టూడెంట్స్ అంతా రిషి రావాలని కోరడంతో.. వసుధార వాళ్ళ నాన్న చక్రపాణికి ఫోన్ చేసి రిషిని తీసుకొని రమ్మంటుంది. అలా‌ రిషిని చక్రపాణి తీసుకొని వస్తుంటే ఎవరో తన మీద కొట్టి పడేస్తారు. అదే విషయం వసుధారకి చెప్పగా తను కళ్ళు తిరిగి పడిపోతుంది‌. ఆ తర్వాత యూత్ ఫెస్టివల్ కి వచ్చిన మినిస్టర్.. వసుధార ఎండీగా వచ్చినప్పటి నుండే ఇదంతా జరుగుతుందని అంటాడు. అయితే రిషి గత కొన్ని ఎపిసోడ్ లుగా కన్పించడం లేదు. ఇదే విషయాన్ని ఈ సీరియల్ ఫ్యాన్స్ ఇన్ స్ట్రాగ్రామ్ ఫ్యాన్ పేజీలలో చెప్తూ వస్తున్నారు. మరి రిషి పాత్ర ముగిసిందా? లేక అతని స్థానంలో ఇంకొకరు వస్తారా? లేక ఈ సీరియల్ నే ముగిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.  

సపోర్ట్ చేయకపోతే ఎంతో మంది ఇళయరాజాలు ఇళ్లల్లోనే ఉండిపోతారు

స్టార్ మాలో  ప్రసారమవుతున్న సూపర్ సింగర్ షో ప్రతీ వారం ఒక్కో కాన్సెప్ట్ తో అలరిస్తూ వస్తోంది. ఇక రాబోయే వారం కాన్సెప్ట్ గా ‘లెజెండ్స్ ఆఫ్ మ్యూజిక్" అనే రౌండ్ ని అనౌన్స్ చేశారు. దీంతో కంటెస్టెంట్ సింగర్స్ అంతా తమ సాంగ్స్ తో అదరగొట్టారు. ఈ వారం ప్రోమో చూస్తే మంచి కలర్ ఫుల్ లుక్ లో అదిరిపోయింది. స్టార్టింగ్ లో  ‘పరువం వానగా’ అంటూ జడ్జ్, సింగర్ శ్వేతా మోహన్ పాడి వినిపించి స్టేజి మీద ఉన్న అందరినీ మరో లోకంలోకి తీసుకెళ్లిపోయారు. తర్వాత కంటెస్టెంట్ ప్రవస్తి "ఆడ జన్మకు ఎన్ని శోకాలో" అంటూ అద్భుతంగా పాడింది.  ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నందుకు శ్వేతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. ఈ సాంగ్ పాడడం వెనక ఒక కారణం ఉంది అని శ్రీముఖి చెప్పేసరికి ప్రవస్తి ఏడ్చేసింది. " నాలుగైదేళ్ల ముందు వరకు నా జీవితం చాలా బాగుంది తర్వాత మా నాన్న జాబ్ వదిలేశారు. దాంతో మేము ఆర్థికంగా చితికిపోయాం. అమ్మకు రెండు సార్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇంకోసారి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఆమె ఇక బతకదు అని డాక్టర్స్ చెప్పారు. ఇక నేను తెచ్చే డబ్బుతోనే ఇల్లు గడుస్తోంది" అంటూ తన పెయిన్ గురించి చెప్పి అందరినీ ఏడిపించేసింది." ఇక ఫైనల్ లో కంటెస్టెంట్ తరుణీ "నరుడా ఓ నరుడా" అనే సాంగ్ పాడింది. తన తండ్రికి ఇష్టం లేకుండా పాటలు పాడటానికి వచ్చానని తరుణీ స్టార్టింగ్ లోని చెప్పింది. ఇక శ్రీముఖి తరుణీ వాళ్ళ నాన్నను స్టేజి మీదకు తీసుకొచ్చి సర్ప్రైజ్ చేసింది. తరుణీ వాళ్ళ నాన్నను చూసి ఏడ్చేసింది. "మా పాప నాకు ఇంత పేరు తెస్తుందని  తెలీదు." అని అన్నాడు తరుణీ వాళ్ళ నాన్న.  తరుణీ వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. ఇక ఆ ఇన్సిడెంట్ చూసిన శ్రీముఖి తన లైఫ్ లో జరిగిన విషయం చెప్పింది "తాను యాంకర్ కావడం తన డాడ్ కి ఇష్టం లేదని కానీ తన మదర్ సపోర్ట్ చేసింది..ఇలాంటి అమ్మలందరికీ థ్యాంక్యూ." అని చెప్పింది. "ఒక కళ మీద ఆసక్తి ఉన్నప్పుడు సపోర్ట్ చేయకపోతే ఎంతో మంది ఇళయరాజాలు ఇళ్లల్లోనే ఉండిపోతారు. తరుణీ వాళ్ళ అమ్మలా సపోర్ట్ చేస్తే ఎంతో మంది ఏఆర్.రెహ్మాన్ లు శిఖరాల మీద ఉంటారు" అంటూ అద్భుతమైన డైలాగ్ చెప్పారు అనంత శ్రీరామ్.  

Eto Vellipoindhi Manasu:కలెక్టర్ చదవాలనుకున్న రామలక్ష్మి కల.. ఆ అజ్ఞాతవాసి వల్లే సాధ్యమా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -10 లో.. రామలక్ష్మి దగ్గరికి వాళ్ళ మేడమ్ వచ్చి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది చూసావా అని అడుగుతుంది. చూసానని రామలక్ష్మి చెప్పగానే.. ఇకనుండి ఇలా రెండు గంటలు మాత్రమే చదివితే కుదరదు. టైమ్ ఎక్కువ లేదు. రోజుకి 18 గంటలు చదవా‌లి. ఇక క్యాబ్ మానెయ్ అని మేడమ్ చెప్తుంది. లేదు మేడమ్ ఫ్యామిలీ ని నేనే పోషించలని రామలక్ష్మి చెప్తుంది. అలా అయితే ఎలా నీ గోల్ ని నువ్వు చేరుకోవాలి సక్సెస్ కావాలంటే కంప్రమైజ్ కావద్దని మేడమ్ చెప్తుంది. కాలేజీలో ఫీజు కట్టాలని రామలక్ష్మికి మేడమ్ చెప్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఇంటికి వచ్చి మేడమ్ చెప్పిన దాని గురించే ఆలోచిస్తుంటుంది. ఏమైంది అలా ఉన్నావని వాళ్ళ అమ్మ అడుగుతుంది. మేడమ్ చెప్పిన విషయం చెప్తుంది. మరి ఇప్పుడు ఎలా ఫీజు కడతావని అంటుంది. వెంటనే మాణిక్యం దగ్గరికి వెళ్లి.. ఇకనుండి మన కూతురు ఏం పని చెయ్యదు.. చదువుకుంటుంది ఇక నువ్వే వెళ్లి పని చెయ్యాలని చెప్పగా.. నేను చెయ్యను అవసరమైతే దాన్ని చదువు మానెయ్యమను అని మాణిక్యం అంటాడు. ఆ మాటలు విన్న రామలక్ష్మి బాధపడుతుంది. ఆ తర్వాత మాణిక్యం దగ్గరికి వచ్చి.. కలెక్టర్ అనేది నా జీవిత ఆశయం. నేను కలెక్టర్ అవ్వాలనుకునేది. మీ కోసం మీకు సమాజంలో గుర్తింపు కోసం.. నేను చదువు మానుకోను. నేను చేసే వర్క్ మానుకోను బాధ్యత మర్చిపోనని రామలక్ష్మి తన నాన్నకి చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ బయటకు వెళ్తుంటే డ్రైవర్ ఒక అమ్మయితో మాట్లాడుతుంటాడు. ఆ అమ్మాయి ఏడుస్తుంటుంది. అది చూసి ఏమైందని సీతాకాంత్ అడుగుతాడు. ఆ అమ్మాయి మా బస్తీలో ఉంటుంది. కాలేజీ ఫీజు కట్టాలని డ్రైవర్ చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ ఆ అమ్మాయిని పిలిచి తను చదివే కాలేజీకి తీసుకొని వెళ్లి ఫీజు నేను కడుతానని చెప్తాడు.. ఇక్కడ చదువుకునే వాళ్ళందరు బయట పార్ట్ టైమ్ చేస్తూ చదువుకుంటున్న వాల్లేనని తెలిసిన సీతాకాంత్.. అందరికి ఫీజు నేను కడుతాను. ఈ విషయం అందరి స్టూడెంట్స్ కి మెసేజ్ పాస్ చేయించండని చెప్తాడు. అలా రామలక్ష్మికి కూడా ఫీ పే చేసినట్లు మెసేజ్ రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎవరో ఒకతను ఇదంతా చేసాడని తెలుసుకున్న రామలక్ష్మి.. థాంక్స్ చెప్పాలని వెళ్ళేలోపే సీతాకాంత్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రామలక్ష్మి తన క్యాబ్ లో కొంతమంది చిన్నారులని ఒక ప్రోగ్రామ్ దగ్గరికి తీసుకొని వస్తుంది. అక్కడ ప్రోగ్రామ్ లో మంటలు అంటుకుంటాయి. రామలక్ష్మి వెళ్లి కాపాడుతుంది. అలాగే అటుగా వెళ్తున్న సీతాకాంత్ ఆగి చిన్నారులని కాపాడతాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు ఒకరినొకరు చూసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Krishna Mukunda Murari:మారిపోయిన ముకుంద మనసులో ఏం ఉందో కృష్ణ కనిపెట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -382 లో.. మధు ఏదో స్క్రిప్ట్ రాస్తంటాడు. తన దగ్గరకి నందు వచ్చి అటపట్టిస్తుంటుంది. అప్పుడే కృష్ణ వచ్చి.. అందరిని హాల్లోకి పిలుస్తుంది. ఏంటని రేవతి అడుగుతుంది. మీకు అందరికి ఒక సర్ ప్రైజ్ అని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత వెళ్లి.. రెండు రింగ్స్ తీసుకొని వచ్చి నేను ముకుంద ఆదర్శ్ లా పెళ్లి చూడలేదు కదా.. అందుకే ఇప్పుడు వీళ్ళు రింగ్స్ మార్చుకుంటారని కృష్ణ అనగానే ముకుంద షాక్ అవుతుంది. ముకుందకి ఇంట్రస్ట్ గా లేనట్టు ఉందని మధు అంటాడు. కృష్ణ ఇద్దరికి రింగ్స్ ఇస్తుంది. ముకుందకి ఆదర్శ్ రింగ్ తొడగబోతుంటే.. ముకుంద తన చెయ్యి వెనక్కి తీసుకుంటుంది. నేను చెప్పాను కదా తనకి ఇష్టం లేదని మధు అంటాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ముకుంద అనుకుంటుంది. నువ్వు ఆపు.. ప్రతిసారీ ఇష్టం లేదని అంటావని మధుపై ముకుంద కోప్పడుతుంది. మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది చూస్తే అలాగే అనిపిస్తుందని  మధు అనగానే.. వేరే కారణం ఉండొచ్చు కదా.. మా కోసం కృష్ణ ఈ రింగ్స్ తీసుకొని వచ్చింది కానీ అభిమానంతో నేను ఈ రింగ్స్  కృష్ణ, మురారిలకి ఇస్తున్నాను.  వాళ్ళు ఇప్పుడు రింగ్స్ మార్చుకుంటారని ముకుంద అంటుంది. వెంటనే కావాలంటే వాళ్ళకి వేరే తెప్పిస్తాం కానీ మీరు ఇవి మార్చుకోండి అని మధు అంటాడు. కానీ ముకుంద తెలివిగా ఆదర్శ చేత రింగ్ తొడిగించుకోకుండా తప్పించుకుంటుంది. నేను తప్పుగా మాట్లాడితే.. పెద్దత్తయ్య ఏదో ఒకటి అనేవారు కదా ఏం అనట్లేదంటే.. నేను చెప్పింది కరెక్ట్ అనే కదా అని ముకుంద అంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారీలు ఆ రింగ్ మార్చుకుంటారు. కానీ మధుకి మాత్రం ముకుందకి ఇదంతా ఇష్టం లేకనే ఇలా చేసిందని అనుకుంటాడు. ఆ తర్వాత ముకుంద చాలా మారిపోయిందని కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు నేను కృష్ణని మోసం చెయ్యలేక ఆదర్శ్ కి న్యాయం చెయలేకపోతున్నానని ముకుంద అనుకుంటుంది. అప్పుడే తన దగ్గరికి ఆదర్శ్ వస్తాడు. సారీ నిన్ను హర్ట్ చేశానని ముకుంద అనగానే.. లేదు నువ్వు చాలా మంచి పని చేసావ్.. నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకడం నా అదృష్టమని ఆదర్శ్ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అది చూసి ముకుంద తనని మోసం చేస్తున్నానని ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో రేవతి డల్ గా ఉంటుంది. అప్పుడే కృష్ణ, మురారి ఇద్దరు రేవతి దగ్గరికి వచ్చి.. ఏమైందని అడుగుతారు. శోభనం  ముహూర్తం పెట్టిద్దాం అక్క అని  అడిగితే.. ఇప్పుడే ఆదర్శ్, ముకుందలకి వద్దు కావాలంటే కృష్ణ మురారిలకి పెట్టుకోమని భవాని అక్క అంటుందని వాళ్ళకి రేవతి చెప్తుంది. ఆ తర్వాత రేవతి, కృష్ణ ఇద్దరు వెళ్లి నిజంగా ముకుంద మారిపోయిందని భవానికి చెప్తారు. వాళ్ళు ఎప్పటికి సంతోషంగా ఉండాలని నేను వాళ్ళకి ఇప్పుడు శోభనం వద్దని అంటున్నా కావాలంటే.. మీకు ముహూర్తం పెట్టించమను అని భవాని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే