యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం...

  బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని  లేదు. బుల్లితెర మీద శ్రీముఖి, రష్మీ హవానే కొనసాగుతోంది.  అలాంటి యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రష్మీ తాతయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఎంతో ఇష్టమైన తాతయ్య మరణన్ని తట్టుకోలేకపోతున్నానని  రష్మి  ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది. తన బామ్మ తలకు తాతయ్య నూనెతో మర్దన చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.. ‘మా తాత అచ్చమైన స్త్రీవాది. ఫైనల్ గా  ఆయన స్వర్గంలో మా బామ్మను కలుసుకున్నారు. ఆగస్టు 17 న మా తాతయ్య ఆనారోగ్యంతో మరణించారు. ఆయనకు తుది వీడ్కోలు పలికాం. మా బామ్మ తాతయ్యల మనసులు విడదీయలేనివి.  మా బామ్మ భౌతికంగా దూరమయ్యాక మా తాతయ్య చాలా బాధపడుతూనే ఉన్నారు.  ఏడాదిన్నర నుంచి ఆమె గురించిన జ్ఞాపకాలనే మాకు పదేపదే చెప్పేవాడు.  మా బామ్మ మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది’ అని రష్మీ ఒక హార్ట్ టచింగ్ లైన్స్ రాసింది.  రష్మీ షేర్ చేసిన  పోస్ట్ పై చూసి ఫాన్స్ , నెటిజన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటూ ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మీ  తన అందంతో వచ్చి రాని తెలుగుతో బాగా ఫేమస్ అయ్యింది. ఇక ఆ తర్వాత వెండితెరపై మెరవాలనుకుంది కానీ అదృష్టం కలిసి రాలేదు.

కొంపల్లో దూరతాడు కానీ కంటెంట్ లో దూరడు...

  జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో భలే ఫన్నీగా ఉంది. అందులో రాఘవ బులెట్ భాస్కర్ మీద పంచులు వర్షం కురిపించాడు. శుక్రవారం, శనివారం టీమ్స్ మధ్య డబ్బులు పెట్టే విషయంలో రాఘవ వెర్సెస్ బులెట్ భాస్కర్ అన్న రేంజ్ కి వచ్చేసరికి మధ్యలో రష్మీ మీడియేటర్ గా వ్యవహరించింది. "ముందు మీరు భాస్కర్ కి చెప్పండి. ఆయన నాలుగు కొంపల్లో దూరతాడు కానీ కంటెంట్ లో  దూరడు" అని ఘాటుగా కామెంట్ చేసేసరికి అందరూ నోరు నొక్కేసుకున్నారు. "ఐనా నీకెందుకవన్నీ పోన్లే పెద్దోడివి కదా అని రెస్పెక్ట్ ఇస్తుంటే ఇలా అంటున్నవ్. మా ఆవిడ అంటోంది డబ్బులు పోయినందుకు బాధగా లేదు కానీ నీ చేతుల్లో పరువు పోగొట్టుకుంటున్నందుకు దొబ్బుతుంది ఇంట్లో" అని రివర్స్ లో ఘాటుగా రిప్లై ఇచ్చాడు భాస్కర్. తర్వాత భాస్కర్ ఫైమాని చేసుకునే చేసుకునే స్కిట్ భాస్కర్ కి నరేష్ తండ్రిలా నటించాడు. సరే పులిని కంటావో, పందిని కంటావో చూసుకో అని కామెంట్ చేశారు. అక్కడ కూడా భాస్కర్ పరువు పోయింది. ఈ వారం ఎపిసోడ్ లో టోటల్ గా కమెడియన్స్ అంతా కూడా బులెట్ భాస్కర్ ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక నెటిజన్స్ ఐతే కొంతమంది పాత టీమ్ లీడర్స్ తీసుకురావాలని అంటుంటే కొందరు మాత్రం కొత్త వాళ్ళను తీసుకురండి అని పోస్టులు పెడుతున్నారు.

కోల్‌క‌తా ట్రైనీ డాక్టర్ ఘటన...అంత ఈజీగా చంపకూడదు!

  ఆట సందీప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆట అనే డాన్స్ షోనే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నంత గొప్ప కొరియోగ్రాఫర్. అలాంటి సందీప్ తన వైఫ్ జ్యోతి రాజ్ తో కలిసి సోషల్ మీడియాలో డాన్స్ ఎలా చేయాలి ఎలా చేయకూడదు అంటూ వీడియోస్ చేస్తూ రాని వారందరికీ డాన్స్ తన వీడియోస్ ద్వారా డాన్స్ నేర్పిస్తూ ఉంటారు. వీళ్ళు నీతోనే డాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక రీసెంట్ గా కోల్కతా ట్రైనీ డాక్టర్ విషయం ఎంతలా దేశాన్ని కుదిపేసిందో మనకు తెలుసు. చాలామంది కూడా భారతదేశంలో పుట్టినందుకు కూడా సిగ్గు పడుతున్నాం అంటూ చెప్తున్నారు.. అందులో చిన్మయి శ్రీపాదా కూడా ఇలాంటి ఎన్నో కామెంట్స్ ని కూడా చేసింది. ఇక ఇప్పుడు సందీప్ భార్య జ్యోతిరాజ్ కూడా ఒక వీడియోని రిలీజ్ చేసింది ఈ ఘటన మీద. "భారత్ మాతాకి జై. ఒక్కోసారి మనం భారతదేశంలో పుట్టినందుకు గర్వంగా ఉంటుంది. మన కట్టు, బొట్టు, మన ఎథిక్స్, మన దేవుళ్ళు, మన పూజలు, మన సంప్రదాయాలు, మన పురాణాలు, మన ఎమోషన్స్ ఇవన్నీ కూడా. కానీ ఒక స్త్రీని గౌరవించుకునే విషయంలో, ఒక స్త్రీని కాపాడుకునే విషయంలో, తప్పు చేసిన వారిని శిక్షించే విషయంలో ఇండియా చాలా వెనుకబడి ఉంది. హైలైట్ ఏంటంటే అతి కిరాతకంగా చిన్నపిల్లలను, ఆడపిల్లలను చంపేస్తున్నారు. ఐనా చంపిన వాళ్ళు బతికేవున్నారు. జైలుకు మాత్రమే వెళ్లారు. వాళ్లకు ఎలాంటి శిక్ష పడింది అన్నది ఇంతవరకు ఎవరికీ తెలీదు. ఈ దేశంలో ఎంతమంది అమ్మాయిలు చనిపోయారు. వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళను అంత ఈజీగా ఉరి తీసేసి చంపకూడదు. వాళ్లకు కచ్చితంగా నరకం చూపిస్తూ చంపాలి. " అంటూ జ్యోతి ఒక వీడియో మెసేజ్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.

వర్షంలో భర్తతో కలిసి అనసూయ ఆటలు...

  అనసూయ ఏది చేసిన వింతగానే ఉంటుంది. ఆమె కామెంట్స్ కానీ ఆమె పోస్టులు కానీ అందరినీ తనవైపు తిప్పుకునేలానే ఉంటాయి. రీసెంట్ గా అనసూయ ఒక పోస్ట్ పెట్టింది. వర్షంలో తన భర్తతో కలిసి బాడ్మింటన్ ఆడుతూ కనిపించింది.   ఆమె షార్ట్ జీన్స్ లో టీ షర్ట్ లో కనిపించిన పిక్స్  సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  ఆమె స్టైలిష్ లుక్ లో అందరినీ మెస్మోరైజ్ చేస్తూ కనిపించింది. ఇలాంటి పిక్స్ పెట్టగానే ఎలాంటి కామెంట్స్ వస్తాయో అందరికీ తెలుసు కదా. అనసూయ కూడా అదే పెట్టింది. "వాళ్లేమంటారంటే ఈవిడేంటి ప్రతీ విషయాన్ని పోస్ట్ చేయాలా అని అంటారు. ఐతే నేను ఏమంటానంటే మా మధ్య ఇలాంటి విషయాలు కూడా జరుగుతాయని అందరికీ తెలియడం కోసం..మా మధ్య కూడా ఇలాంటి అందమైన క్షణాలు, నిజమైన ప్రేమ ఉన్నాయని చెప్పడం కోసం. ఇంకోటేంటంటే ఇలాంటి మెమోరీస్ దాచుకోవడం కోసం కూడా" అని పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే "ఇక్కడ వైరల్ ఫీవర్స్  బాగా ఎక్కువగా ఉన్నాయి. మీరేమో వర్షంలో బాడ్మింటన్ ఆడుతున్నారు." అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అనసూయ 'పుష్ప 2'తో పాటు, వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది.  అలాగే అనసూయ ఇతర భాషల చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అనసూయ తన కెరీర్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫామిలీ ఫొటోస్ ని తన ఇంట్లో పెంచుకునే పక్షుల ఫొటోస్ ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.

Karthika Deepam2 : పెళ్ళికి ఒప్పుకున్న కార్తీక్.. కాశీకి సాయం చేసిన దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -129 లో... సుమిత్ర వాళ్ళ ఇంట్లోకి కార్తీక్ వెళ్లి అందరిని పిలుస్తాడు. అందరు రాగానే.. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది ఒకరికి జీవితం ఇవ్వడానికి సంబంధించినదని అనగానే దీపకి జీవితం ఇస్తానని చెప్తూడేమోనని పారిజాతం, జ్యోత్స్నలు టెన్షన్ పడతారు. ఒకసారి ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయింది.. ఎంగేజ్ మెంట్ మనకి అచ్చి రాలేదని కార్తీక్ అంటాడు. ఇంకొకసారి చేసుకోవచ్చని పారిజాతం అంటుంది. అవసరం లేదు ఇక ఎంగేజ్ మెంట్ లేదు డైరెక్ట్ పెళ్లికి ముహూర్తం పెట్టండి అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడు ఇలా టెన్షన్ పెట్టి సర్ ప్రైజ్ ఇస్తావ్ అని పారిజాతం అంటుంది. నేను శౌర్యని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తానని కార్తీక్ వెళ్ళిపోతాడు. నేను గుడికి వెళ్తానంటూ దీప వెళ్ళిపోతుంది. మనం కూడ గుడికి వెళదామని పారిజాతం హడావిడి చేస్తుంది. రెడీ అయి వస్తానంటు జ్యోత్స్న అంటుంది. మరొక వైపు స్వప్న బాయ్ ఫ్రెండ్ కాశీ ఇంటర్వ్యూ కి వెళ్తుంటే.. అప్పుడే స్వప్న వస్తుంది. నీకు కచ్చితంగా జాబ్ వస్తుందని స్వప్న చెప్పగానే.. నాకు ఎదరు రా అని కాశీ అంటాడు. నేను ఎదరు వస్తే మంచి జరగదని స్వప్న అంటుంది. అయిన కాశీ వినకుండా రమ్మని అనగానే స్వప్న వస్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న పారిజాతం మాట్లాడుకుంటూ వస్తుంటారు. ఇప్పుడు మనం గుడికి వెళ్లడం లేదు.. నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నానని జ్యోత్స్న అంటుంది. అప్పుడే కాశీ పక్కన పడిపోయి ఉంటాడు. అక్కడున్నా వాళ్ళు జ్యోత్స్న కార్ ఆపుతారు. అయిన జ్యోత్స్న నాకేంటి అన్నట్లు వెళ్ళిపోతుంది. అప్పుడే దీప ఆటో లో వెళ్తుంటే పడిపోయి ఉన్న కాశీని ఆటోలో హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. అదంతా ఒకతను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతాడు. అ తర్వాత శౌర్యని తీసుకొని కార్తీక్ వస్తుంటే.. అప్పుడే కాశీని దీప తీసుకొని రావడం శౌర్య చూసి అమ్మ అంటూ కార్తీక్ కి చెప్తుంది. ఎవరతను అని కార్తీక్ అడుగగా.. ఎవరో తెలియదని చెప్తుంది. అతడిని చూసి డాక్టర్ ట్రీట్ మెంట్ చెయ్యను అంటాడు.‌ కార్తీక్ చేయమని చెప్పగానే సరేనని డాక్టర్ అంటాడు. మరొకవైపు జ్యోత్స్న తన ఫ్రెండ్స్ తో కలిసి కార్తీక్ పెళ్లికి ఒప్పుకున్నాడుంటూ చెప్తుంది. మరొకవైపు స్వప్న సోషల్ మీడియాలో... సాయం చెయ్యని మిస్ హైదరాబాద్ జ్యోత్స్న.. సాయం చేసిన సాటి మనిషి అంటూ కాశీ గురించి న్యూస్ రావడం చూస్తుంది. కాశీని వీడియోలో చూసి స్వప్న షాక్ అవుతుంది. వెంటనే దీపకి ఫోన్ చేసి.. నువ్వు అక్కడే ఉండు నేను వస్తున్నానని చెప్తుంది. ఆ తర్వాత శౌర్య గురించి కార్తీక్ ని దీప అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : ఆమె మనసులో మాట చెప్పగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -181 లో... రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్ వచ్చి.. నాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను అన్నావ్.. ఏంటి అది అని అడుగుతాడు. ముందు మీరు చెప్పండి మీ మనసులో మాట చెప్తాను అన్నారు కదా అని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి కళ్ళు మూసుకుంటుంది. సీతాకాంత్ తను తెచ్చిన రింగ్ ని పట్టుకొని రామలక్ష్మి కి ప్రపోజ్ చేస్తుంటే.. అప్పుడే నందిని వస్తుంది. తనని చూసిన సీతాకాంత్ షాక్ అవుతాడు. రామలక్ష్మి కళ్ళు తెరిచి ఏమైందని అడుగుతుంది. నందినిని చూసి మేడమ్ అని అనగానే.. అంటే నువ్వు చెప్పిన మేడం తనేనా అని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు. అవునని రామలక్ష్మి వెళ్లి నందినిని రిసీవ్ చేసుకుంటుంది. సీతాకాంత్ మాత్రం నందినిని షాకింగ్ గా చూస్తుంటాడు. హ్యాపీ బర్త్ డే సీతాకాంత్ అంటూ నందిని షేక్ హ్యాండ్ ఇస్తుంది. అందరికి ఒక విషయం చెప్పాలని అందరి ముందుకి వచ్చి.. సీతాకాంత్ చాలా గొప్పవారు తనతో కలిసి పార్టనర్ గా ఉండడం అనేది చాలా హ్యాపీగా ఉంది. దీనికి కారణం రామలక్ష్మి అని అందరి ముందు రామలక్ష్మికి నందిని థాంక్స్ చెప్తుంది. ఇక నాకు వర్క్ ఉంది అంటూ అక్కడ నుండి వెళ్లిపోతుంటుంది. మేడమ్ మాకు ఇచ్చిన మాటేంటి అని సందీప్ వెనకాలే వెళతాడు. అయినా సందీప్ ని పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. మరొకవైపు సుజాత వెళ్ళిపోతూ.... అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటున్నారు.. చాలా హ్యాపీగా ఉంది.. మీరు ఇంకా హ్యాపీగా ఉండాలంటే నీ కడుపు పండాలని రామలక్ష్మికి సుజాత చెప్తుంది. ఆ తర్వాత సీతా సర్ కన్పించడం లేదని రామలక్ష్మి చూస్తుంది. సీతా తన మనసులో మాట చెప్పడానికి సర్ ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటాడని పెద్దాయన అనుకుంటాడు. మరొకవైపు అ మేడమ్ ఇలా చేసిందని శ్రీలతతో సందీప్ అంటాడు. ముందు అ నందిని సీతకు ఏమవుతుందో తెలుసుకోవాలి.. ఎందుకంటే తను రాగానే సీతా చేంజ్ అయ్యాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదని శ్రీలత కి డౌట్ వస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి తన గదిలోకి వెళ్తుంది. ఈ రోజు ఎలాగైనా సీతా సర్ కి నా మనసులో మాట చెప్పి అయన సొంతం అవుతానని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : శైలేంద్రకు వసుధారతో సారీ చెప్పించిన రిషి...

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1159 లో.....అసలు ఆ మనుగాడు ఏం చేసినా భయపడట్లేదు.. వాడు అర్థం అవ్వడం లేదు.. ఏదోదో వాగేసాడు.. ఆగస్ట్ లో ఏదో ఒకటి చేస్తానని వార్నింగ్ ఇచ్చాడని శైలేంద్ర అనగానే.. అంటే వాడు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు అనుకుంటున్నావా.. తన తండ్రి ఎవరో తెలిసిన మరుక్షణం చంపేస్తాను అన్నవాడు ఏం చేయకుండా సైలెంట్ గా ఉంటున్నాడని ఆలోచిస్తున్నావా అని దేవయాని అంటుంది. ఎవరికైనా తండ్రి మీద ప్రేమ తప్ప కోపం ఉండదు.. అందరూ తండ్రి ఎవరు అనడం వల్ల వాడికి తండ్రి పై కోపం పెరిగింది కానీ మహేంద్ర అంటే ఇష్టం కాబట్టి ఏం చెయ్యలేకపోతున్నాడని దేవయాని అంటుంది. నువ్వే వాడిని టైమ్ దొరికినప్పుడల్లా ఇర్రిటేట్ చేయమని దేవయాని చెప్తుంది. దాంతో వాడు పెద్ద ముదరు అని శైలేంద్ర అంటాడు. మరొకవైపు అసలు నేను మను తండ్రి ఏంటి అసలు? ఎలా జరిగింది? నేను ఎప్పుడు అనుపమని మంచి స్నేహితురాలిలాగే చూసానని మహేంద్ర బాధపడతాడు. వసుధర అంత గట్టిగా చెప్తుందంటే అది నిజమే అయి ఉంటుందని మహేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత మనుకి మహేంద్ర ఫోన్ చేస్తాడు. మను మహేంద్ర కాల్ చూసి కోపంగా ఉంటాడు.. లిఫ్ట్ చెయ్యడు. ప్లీజ్ మను ఫోన్ లిఫ్ట్ చెయ్ నీతో మాట్లాడాలని మహేంద్ర మెసేజ్ చేస్తాడు. అయినా మను ఫోన్ లిఫ్ట్ చేయడు. ఆ తర్వాత అనుపమకి కూడా ఫోన్ చేస్తాడు.. తను లిఫ్ట్ చెయ్యదు. మహేంద్రకి రిషి కాల్ చేసి ఎక్కడున్నారు.. ఇంట్లో నుండి బయటకి రావద్దని చెప్తాడు. అసలు మీరేం చేస్తున్నారు నాకు అర్థం అవడం లేదు.. ఇంత పెద్ద విషయమని రిషితో వసుధార అంటుండగా.. అప్పుడే శైలంద్ర వచ్చి ఎంత పెద్ద విషయం అంటాడు. నీకు సెన్స్ లేదా ఎందుకు పర్మిషన్ లేకుండా వస్తావని శైలేంద్రపై వసుధార కోప్పడుతుంది. ఏంటి మా అన్నయ్య అంటే రెస్పెక్ట్ లేదా అలా తిడుతున్నావ్.. నువ్వు ఇప్పుడే మా అన్నయ్యకి సారి చెప్పాలని రిషి అనగానే మీరు ఎందుకు చెప్పమని అంటున్నారో నాకు తెలుసంటు శైలేంద్రకి వసుధార సారీ చెప్తుంది. అ తర్వాత రిషిని శైలేంద్ర పక్కకు తీసుకొని వస్తాడు. ఏంటి ఏదో పెద్ద విషయం అంటుంది.. ఏంటి రంగా అని శైలేంద్ర అడుగుతాడు. మను గురించి, మను ఎవరని రిషి అడుగుతాడు. మా బాబాయ్ దగ్గరకి కోపంగా మను ఏమైనా వచ్చాడా అని అడుగుతాడు. లేదని రిషి చెప్తాడు. మీరు ఎండీ పదవి కోసం చాలా తప్పులు చేశారంట కదా అని వసుధర మేడమ్ అంటున్నారని రిషి అంటాడు. అదేం లేదు అవన్నీ నీకనవసరమని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : వరలక్ష్మి వ్రతం కోసం కొత్త జంట వస్తారా...

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -494 లో.....కావ్య తను అన్నమాటలు ఎక్కడ ఇంట్లో వాళ్లకు చెప్తుందోనని కావ్యని రాజ్ బయటకు తీసుకొని వస్తాడు. నువ్వు ఏదో సరదాకీ అన్నావనుకున్న కానీ ఇలా చేస్తావనుకోలేదు వెళ్లి అందరికి టిఫిన్ చెయ్ అని చెప్తాడు. అయినా కావ్య వినకుండా ఎందుకు అలా అన్నారు.. మీ ఆస్తులుకి ఆశపడ్డనా అంటు రాజ్ తో వాదిస్తుంది. మరొకవైపు ఉన్నా డబ్బులతో బట్టలు కొనేసాం.. ఇప్పుడు ఎలా అంటూ అప్పు, కళ్యాణ్ లు ఆలోచిస్తుంటే.. అప్పుడే ఒకతను వచ్చి మీరు షాపింగ్ చేశారు కదా మీకు లక్కీ డ్రాలో అయిదు లక్షలు వచ్చాయని వస్తాడు. నేను ఇప్పుడే షాపింగ్ చేసాను ఇప్పుడే ఎలా వచ్చాయని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత అతని చెవిలో ఉన్న బ్లూ టూత్ కనెక్ట్ తీసుకొని అన్నయ్య ఇదంతా నువ్వే చేసావ్ అని తెలుసు.. లోపలికి రా అంటాడు. రాజ్ లోపలికి వస్తాడు. నువ్వు ఇలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నా డబ్బులు ఇస్తే తీసుకోవని రాజ్ అంటాడు. అంటే భార్యని కూడా పోషించుకోలేని అసమర్తుడివి అనుకున్నావా అని కళ్యాణ్ అనగానే.. రాజ్ డిస్సపాయింట్ అవుతాడు. ఆ తర్వాత కావ్య భోజనం చేస్తుంటే.. అపర్ణ వచ్చి మాట్లాడుతుంది. అప్పుడే స్వప్న వచ్చి.. ఈ రోజు మనం హాస్పిటల్ కి వెళ్ళాలి కదా అని అంటుంది. దాంతో కావ్య భోజనం ఆపేసి స్వప్న తో వెళ్తుంది. మరొకవైపు రాజ్ డల్ గా ఉండటంతో ఇందిరాదేవి వచ్చి రాజ్ తో మాట్లాడుతుంది. కళ్యాణ్ అక్కడ ఇబ్బంది పడుతుంటే చూడలేకపోతున్నాను.. డబ్బులు ఇస్తే వద్దని అంటున్నాడని రాజ్ చెప్తాడు. ఈ ఇంట్లో పెళ్లి అయిన వాళ్లతో వరలక్ష్మి వ్రతం చేయడం ఆనవాయితి కాబట్టి స్వప్న, కావ్యలతో పాటు అప్పుతో కూడా చేయించాలి. అందుకే రేపు వాళ్లకు రమ్మని చెప్పాలని ఇందిరాదేవి అనగానే.. రాజ్ సరే అంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాసేపటికి నేను చాలా హ్యాపీగా ఉన్నానని కావ్యతో రాజ్ అంటాడు. మరుసటి రోజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం కాబట్టి అప్పు కళ్యాణ్ లని కూడా పిలవాలని ఇందిరదేవి అంటుంది. తరువాయి భాగంలో ఇందిరాదేవి, సీతారామయ్యలు అప్పు, కళ్యాణ్ ల దగ్గరకి వెళ్లి పూజకి రమ్మని పిలుస్తారు. ఆ తర్వాత అప్పు ఈ ఇంటికి కరెక్ట్ కొడలు కాదని నిరూపిస్తానని రుద్రాణితో ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సింగర్స్‌కు ఇది మంచి అవకాశం...డోంట్ మిస్

జీ తెలుగులో సరిగమప కొత్త సీజన్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. గడిచిన  15 సీజన్లలో ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సరిగమప. ‘సరిగమప సీజన్‌ 16‌- ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ఈ ఆదివారం అంటే ఆగస్ట్ 25 న హైదరాబాద్లో ఆడిషన్స్ నిర్వహిస్తోంది. 15 నుంచి 30 సంవత్సరాల వయసున్న గాయనీ గాయకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ ఆడిషన్స్  ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. హైదరాబాద్లోని హిందూ మహిళా జూనియర్ కళాశాల, హిందూ పబ్లిక్ స్కూల్ దగ్గర, గోకుల్ థియేటర్ ఎదురుగా, సనత్ నగర్లో ఆడిషన్స్ జరగనున్నాయి. జీ తెలుగు సరిగమప సీజన్ 16 ఆడిషన్స్ కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9154670067 నెంబర్కు కాల్ చేసి సంప్రదించవచ్చు. ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు  ఆగస్టు 30 వరకు డిజిటల్ ఆడిషన్స్ ద్వారా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. పాట పాడిన వీడియోలను 9154670067 నెంబర్కి వాట్సాప్ లేదా ztsaregamapa@zee.com ఈమెయిల్ ద్వారా పంపవచ్చు.    

రౌడీ రోహిణి ప్రెగ్నెంట్ ... బాబును కూడా కన్నది.

  బుల్లితెర మీద లేడీ కమెడియన్స్ లో రౌడీ రోహిణి ఫుల్ ఫేమస్. అసలు రోహిణి షో స్టేజి మీదకు వచ్చిందంటే చాలు ఆడియన్స్ పడీ పడీ నవ్వాల్సిందే. ఇక ఇప్పుడు రోహిణి గర్భిణీ ఐన న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకు రోహిణి గర్భిణీ అయ్యిందా చూద్దాం. రాబోయే జబర్దస్త్ ప్రోమోలో రోహిణి గర్భిణీగా నటించింది. అందులో కమెడియన్ సన్నీ భర్తగా నటించాడు. ఐతే 9 నెలలతో గర్భంతో రోహిణి నొప్పులు పడుతుంటే పక్కనే సన్నీ కూడా పడుతూ ఉన్నాడు. "నాకంటే నొప్పులు మొదలయ్యాయి. నీకేమయ్యింది. నొప్పులు పడుతున్నావ్ " అని అడిగింది రోహిణి. "నీకు నెలలు నిండాయి . నాకు సంవత్సరాలే నిండాయి కదే" అన్నాడు కామెడీగా సన్నీ. ఈ గ్యాప్ లో రోహిణికి బాబు  కూడా పుట్టేస్తుంది.  ఇంతలో పక్కింట్లోంచి ఆటో రాంప్రసాద్ తన బిడ్డను తీసుకుని వచ్చాడు. "ఇంతకు మీ బాబుకు ఎం పెట్టారు" అని రోహిణిని అడిగాడు. "రాజు" అని పెట్టాను అని చెప్పేసరికి "అదేం పేరండి చూడండి మా పాపకు ఎం పేరు పెట్టానో గుడుగుడు గుంజం" అన్నాడు ఆ పేరుకు షాక్ అయ్యింది రోహిణి. "నా మాట విని అప్పడప్పడ తాండ్ర"| అని పెట్టండి అని రాంప్రసాద్ సలహా ఇచ్చాడు. రోహిణి కూడా అదేదో గొప్ప పేరన్నట్టు నామకరణం చేసి పిలవడం స్టార్ట్ చేసింది. అలా ఈ జబర్దస్త్ ఎపిసోడ్ రోహిణి గర్భిణీ అయ్యింది బాబును కూడా కన్నది.  

ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న తేజస్విని  గౌడ... 

  బిగ్ బాస్ న్యూ సీజన్ నెక్స్ట్ మంత్ నుంచి టెలికాస్ట్ కాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే కంటెస్టెంట్స్ ని కూడా బిగ్ బాస్ టీమ్ కలుస్తోంది అని కూడా అంటున్నారు. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ లోకి తేజస్విని గౌడ వెళ్తుంది అనే టాక్ కొద్ది రోజుల నుంచి వినిపిస్తోంది. ఐతే బిగ్ బాస్ హౌస్ లోకి తేజు పేరు ఇంకా కంఫర్మ్ కాలేదు అనే విషయం బిగ్ బాస్ లేటెస్ట్ అప్ డేట్స్ ఇన్స్టా పేజీలో రీసెంట్ గా పోస్ట్ ఐతే పెట్టారు. ఎందుకంటే తేజస్విని గౌడ బిగ్ బాస్ వాళ్ళు చెప్పిన అమౌంట్ కంటే ఇంకా కొంచెం ఎక్కువగా అడిగిందని సో ప్రస్తుతానికి అమౌంట్ విషయంలో చర్చలు జరుగుతున్నాయి.. ఒకవేళ బిగ్ బాస్ టీమ్ ఆమె అడిగిన రెమ్యూనరేషన్ కి ఓకే అంటే ఆమె బిగ్ బాస్ లోకి వస్తుంది లేదంటే ఆమె ఈ బిగ్ బాస్ ఆఫర్ ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆమె పేరు ప్రస్తుతానికి ఇంకా కంఫర్మ్ కాలేదని తెలుస్తోంది. ఐతే ప్రస్తుతానికి సింగర్ సాకేత్, జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్య రావు, నటి యాష్మి గౌడా, నటుడు  ఇంద్రనీల్, ఇంకా నటి సన కంఫర్మ్ ఐనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఐతే మరి కామన్ మ్యాన్ క్యాటిగరీలో ఎవరిని తీసుకుంటున్నారనే విషయం ప్రస్తుతానికి ఎలాంటి విషయమూ తెలీదు. ఐతే కొంతమంది ఈ సీజన్ తీసుకోరు అని ఎందుకంటే లాస్ట్ సీజన్ లో పల్లవి ప్రశాంత్ కారణం అంటూ చెప్తున్నారు. ఇంకొంతమంది కామన్ మాన్ ని ఎవరో ఒకరిని లాస్ట్ మినిట్ లో తీసుకొస్తారు అని కూడా అంటున్నారు. చూడాలి.

Karthika Deepam2 : మీ పెళ్ళి చేసే వెళ్తాను.. కార్తీక్ ఆ విషయం చెప్పగలడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -128 లో.... దీప దగ్గరకి జ్యోత్స్న వచ్చి తను బాధపడేలా మాట్లాడుతుంటుంది. ముందు ఇక్కడనుండి వెళ్ళిపోమంటూ సుమిత్ర కోప్పడుతుంది. చూడు జ్యోత్స్న నా వల్ల మీ పెళ్లి ఆగిపోతుందని భయపడుతున్నావేమో కానీ అలా జరగదు.. మీ పెళ్లి చూడడానికి వచ్చాను.. చూశాకే వెళ్తాను. నీ పెళ్లి చెయ్యడం మీ అమ్మ నాన్న బాధ్యతే కాదు నాది కూడా అని జ్యోత్స్నకి దీప చెప్పి వెళ్లిపోతుంది. అ తర్వాత సుమిత్ర కోపంగా వెళ్ళిపోతుంది. నువ్వు ఏం చేసిన నన్ను అంటున్నారే మనవరాలా అని పారిజాతం జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. మరొకవైపు స్వప్న లవర్ తో కలిసి బయటకు వస్తుంది. ఇంట్లో మన మ్యాటర్ చెప్పావా అని అతను స్వప్నని అడుగుతాడు. లేదు రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నావ్ కదా జాబ్ వచ్చాక చెప్తాను.. మా అన్నయ్య ఉన్నాడు తానే ఒప్పిస్తాడని స్వప్న అనగానే.. ఏంటి నీకు అన్నయ్య కూడ ఉన్నాడా అని అతను అడుగుతాడు. అంటే సొంత అన్నయ్య కాదు నేను అలా అన్నయ్య అనుకుంటున్నా బాస్ అని కూడ పిలుస్తాను.. పేరు కార్తీక్.. నీకు జాబ్ వచ్చాక అమ్మ, నాన్నలకి అతన్ని పిలిచి విషయం చెప్తానని స్వప్న అంటుంది.అ తర్వాత కార్తీక్ బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని కాంచన అడుగుతుంది. శౌర్యని ఈ రోజు చెకప్ కి తీసుకొని వెళ్ళాలి అని కార్తీక్ అనగానే శ్రీధర్ కోప్పడతాడు. వాళ్ళ అమ్మ ఉంది కదా తను తీసుకొని వెళ్తుందని అంటాడు. ఈ ఒక్క సారి నేను తీసుకొని వెళ్తానని కార్తీక్ అంటాడు. అయిన శ్రీధర్ అర్థం చేసుకోకుండా కాంచనకి ఆలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడంటూ కోప్పడతాడు. మరొకవైపు మనమే ఎప్పుడు ఆ దీప గురించి ఓవర్ గా ఆలోచిస్తున్నావేమోనని తను నా పెళ్లి చేసాక వెళ్తాను అంటుంది.. మనమే తనని తప్పుగా అపార్థం తీసుకున్నామని పారిజాతంతో జ్యోత్స్న అనగానే.. అప్పుడే దీప దగ్గరికి కార్తీక్ రావడం చూసిన పారిజాతం.. జ్యోత్స్నకి చూపిస్తుంది. దాంతో జ్యోత్స్న కోపంగా ఉంటుంది. మరొకవైపు శౌర్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాను అంటాడు. మీ వాళ్ళ ఇప్పుడు మేం చాలా హ్యాపీగా ఉన్నాము.. మీరు కూడా మీ పెళ్లి గురించి ఆలోచించండి అని కార్తీక్ కి దీప చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్ అందరికి ఒక విషయం చెప్తానంటూ పిలుస్తాడు. సుమిత్ర వాళ్ళు అందరు వస్తారు. ఏం చెప్తాడో ఏంటో అని దీప, జ్యోత్స్న లు టెన్షన్ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : అత్తింటి వాళ్ళు ఇచ్చి‌న గిఫ్ట్ చూసి అల్లుడు ఫిధా.. భార్య గిఫ్ట్ ఏంటంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -180 లో....సీతాకాంత్ కేక్ కటింగ్ దగ్గరికి వస్తాడు. చూసావా అన్నయ్య.. నీ ఇష్టానికి తగ్గట్టు ఎలా వదిన ఏర్పాట్లు చేసిందోనని సిరి అనగానే.. సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఎంతైనా భర్త మీద ప్రేమ అలాంటిది కదా అని పెద్దాయన అంటాడు. వచ్చినవాళ్ళు మీరిద్దరి కాంబినేషన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటారు. అ తర్వాత అన్నయ్య పక్కకి వెళ్ళు అమ్మ అని సందీప్ అంటాడు. ఎందుకు అవమానపడేందుకా.. అది పక్కనే ఉంది కదా అని శ్రీలత అంటుంది. రామలక్ష్మి నాపై పంతంతో ఏదైనా చేస్తుందని అంటుంది. అప్పుడే శ్రీలతని సీతాకాంత్.. అంత దూరంగా ఉన్నావేంటి అమ్మ.. వచ్చి నా పక్కన ఉండమని అంటాడు. పర్లేదు అని శ్రీలత అనగానే.. అత్తయ్య గారిని నేను పిలుచుకొని వస్తానని రామలక్ష్మి వస్తుంది. అత్తయ్య రండి మీరు తన పక్కన ఉండాలి.. సొంతతల్లి కాకున్నా సవతి తల్లి అయిన కూడా బాగా చూసుకున్నారని రామలక్ష్మి ఇండైరెక్ట్ గా తన కపట ప్రేమ గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ కేక్ కట్ చేసి శ్రీలతకి తినిపిస్తుంటే.. ఎప్పుడు అమ్మకేనా ఈ సారి నీ భార్యకి తినిపించమని పెద్దాయన అనగానే.. రామలక్ష్మికి సీతాకాంత్ తినిపిస్తుంటాడు. ఎవరికైనా తల్లి ఫస్ట్ తనకి తినిపించండని రామలక్ష్మి అనగానే.. సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత కేక్ తినిపించక.. అందరు గిఫ్ట్స్ ఇస్తుంటారు. శ్రీలత దగ్గర సీతాకాంత్ ఆశీర్వాదం తీసుకుంటాడు. సీతాకాంత్ కోసం సుజాత గిఫ్ట్ తీసుకొని వస్తుంది. కానీ అది అతని రేంజ్ కి తక్కువ అవుతుందని ఇవ్వకుండా ఉంటుంద. అప్పుడే రామలక్ష్మి రావడంతో బావ కోసం గిఫ్ట్ తెచ్చాము.. అమ్మ ఇవ్వట్లేదని పింకీ చెప్తుంది. అ తర్వాత సీతాకాంత్ ని రామలక్ష్మి పిలిచి.. మా అమ్మ వాళ్ళు ఏదో గిఫ్ట్ తెచ్చారు మీ స్థాయికి సరిపోదని ఇవ్వట్లేదని అనగానే పర్లేదు అత్తయ్య ఇవ్వండని సీతాకాంత్ అనగానే.. సుజాత గోల్డ్ చైన్ ఇస్తుంది. అది చూసి అది గోల్డ్ ఏనా.. అది మా ఇంట్లో పనిమనిషి కూడ వెయ్యదంటూ సుజాతని శ్రీవల్లి అవమానిస్తుంటే.. సీతాకాంత్ తనపై కోప్పడుతాడు. గిఫ్ట్ నాకు బాగా నచ్చిందని సీతాకాంత్ అంటాడు. నీ పుట్టింటి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ నీ చేతులతో సీతాకాంత్ మెడలో వేయమని పెద్దాయన అనగానే.. రామలక్ష్మి వేస్తుంది. ఆ తర్వాత పెద్దాయన.. నీ మనసులో మాట రామలక్ష్మికి వెళ్ళి చెప్పమని అంటాడు. సీతాకాంత్ తన కోసం తీసుకొని వచ్చిన రింగ్ తీసుకొని రామలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. అందరూ గిఫ్ట్ ఇస్తున్నారు. నువ్వు ఇంకా ఇవ్వలేదని సీతాకాంత్ అంటాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : నిజం ఒప్పుకున్న అనుపమ.. అంత తప్పు ఏం చేసింది!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1158 లో.....రిషి, వసుధారలు అనుపమ దగ్గరికి బయలుదేరుతుంటే.. అప్పుడే మహేంద్ర వచ్చి నేను వస్తానని అంటాడు. ముందు రిషి సరే అంటాడు. ఆ తర్వాత వసుధార మావయ్య వద్దని అనగానే సరే డాడ్ మీరు వద్దని చెప్తాడు. వసుధార నా దగ్గర ఏదో విషయం దాస్తుంది.. అది కనిపెట్టాలని మహేంద్ర అనుకుంటాడు. మరొకవైపు మనుకి శైలేంద్ర ఫోన్ చేసి.. తమ్ముడు అంటూ మాట్లాడేసరికి మనుకి కోపం వస్తుంది. నిన్ను కలవాలి రాలేదంటే మీ అమ్మకి ఫోన్ చేసి నన్ను కిడ్నాప్ చేసి విషయం తెలుసుకున్నావని చెప్తానని శైలేంద్ర అనగానే కోపంగా మను బయలుదేర్తాడు.  మను కోపంగా వెళ్లడం అనుపమ చూస్తుంది. ఆ తర్వాత అనుపమ దగ్గరికి వసుధార, రిషిలు వస్తారు. మను ఎక్కడికి వెళ్ళాడో అడుగగా.. తెలియదని అనుపమ చెప్తుంది. కాఫీ తీసుకొని వస్తానని అనుపమ వెళ్ళగానే.. నేను వస్తానంటూ వసుధార కూడ కిచెన్ లోకి వెళ్తుంది. మేడమ్ నేనొక నిర్ణయం తీసుకున్నాను.. మీ సమక్షంలో రిషి సర్ కీ నిజం చెప్పాలని తీసుకొని వచ్చానని వసుధార అనగానే అనుపమ టెన్షన్ పడుతుంది. మరొకవైపు శైలేంద్రని కలిసిన మను తనపై కోప్పడుతాడు. ఇక ఇప్పుడు నువ్వు చెయ్యాలి అనుకుంటున్నావు అదే.. మా బాబాయ్ నీ కన్నతండ్రి అని తెలిసింది కదా అని శైలేంద్ర అంటాడు. అంటే ఆస్తిలో వాటా అడగాలి అనుకుంటున్నావా అని శైలేంద్ర అనగానే.. నేను అలా ఆస్తుల కోసం పదవి కోసం మనుషులని బాధపెట్టే రకం కాదని మను అంటాడు. నువ్వు ఇలా వాళ్లకు చెప్తాను.. వీళ్లకి చెప్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తే బాగుండదు.. ఎవరికి అయినా చెప్పుకో నాకు అవసరం లేదు. ఆగస్టు లోగా నేను చెయ్యాలిసింది నేను చేస్తానని శైలేంద్రకి మను వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అ తర్వాత రిషి కిచెన్ దగ్గరికి వస్తాడు. ఇన్నిరోజలుగా మేడమ్ మను తండ్రి గురించి చెప్పట్లేదు కదా అని వసుధార అనగానే మీరు ఇంతలా చెప్పకుండా ఉంటున్నారంటే చెప్పేది అయి ఉండదేమో.. అతను మంచివాడు కాదేమోనని రిషి అనగానే.. సర్ మీరు అలా అనకండి మను తండ్రి మావయ్యనే అని వసుధార అంటుంది. దాంతో రిషి షాక్ అవుతాడు. అప్పుడే మహేంద్ర వచ్చి అ మాట విని షాక్ అవుతాడు. మీరు ఇదే దాచారా ఇంకేదైనా ఉందా అని రిషి అంటాడు. వసుధర చెప్పేది నిజమేనా అని అనుపమని రిషి అడుగుతాడు. నిజమే.. నేనే తప్పు చేసాను. నన్ను ఇంకేం అడగకండి అని అనుపమ వెళిపోతుంది. ఆ మాటలు వింటూ మహేంద్ర ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : భర్తపై రివెంజ్ తీసుకున్న భార్య.. ఆ ఇద్దరు ఎలా ఉన్నారంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -493 లో.....కళ్యాణ్ ఇంటికి రాగానే అప్పు భోజనం వడ్డీస్తుంది. అది తిని బాగుందని కళ్యాణ్ చెప్తాడు. ఏంటి బాగుందా అని అప్పు తింటుంది. అది తిని ఇది బాగుంది అంటావేంటని అప్పు అంటుంది. అంటే ఎక్కడ బాలేదంటే ఇవన్నీ ఎత్తేస్తావేమోనని కళ్యాణ్ అంటాడు. అంటే నేను కోపిష్టి దాన్ని అంటున్నావా అని అప్పు అంటుంది. అ తర్వాత రెండు రోజుల్లో వంట నేర్చుకుంటా అని అప్పు అంటుంది. నా దగ్గరున్నా ఆరు వేలల్లో మూడు వేలతో సరుకులు కొనుకొస్తానని కళ్యాణ్ అంటాడు. ఇక నుండి ఇలా మనం పిలుచుకోవద్దు. నేను నిన్ను పొట్టి అని పిలుస్తానని కళ్యాణ్ అనగా... నిన్ను కూచి అంటానని అప్పు అంటుంది. ఆ తర్వాత బంటి ఆకలి అంటూ కనకం దగ్గరికి వస్తాడు. అక్కడ ఉందంటూ కనకం చిరాకు పడుతుంటే.. అప్పు, కళ్యాణ్ లని నేనే నా రూమ్ లో ఉండమని చెప్పాను. వాళ్లు అక్కడే ఉన్నారని చెప్పగానే కనకం, కృష్ణమూర్తిలు హ్యాపీగా ఫీల్ అవుతారు.అ తర్వాత రాజ్ కి  కావ్య కాఫీ తీసుకొని వచ్చి..  కాఫీ కీ డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. రాత్రి ఏమన్నారు ఆస్తుల కోసం కళ్యాణ్ ని రావద్దని అనుకుంటున్నానని అన్నారు కదా.. మీరు ఏం రాసిచ్చారు.. అందుకే నేను చేసే పనికి ఇక నుండి వెల కడుతానని కావ్య అంటుంది. ఏంటి రివెంజ్ ఆ అని రాజ్ అంటాడు. కావ్య వెళ్లిపోతుంటే నీకు కావలిసింది డబ్బులు కదా ఇస్తానంటూ వంద రూపాయలు ఇచ్చి.. కావ్య తెచ్చిన టీ తాగుతాడు. మరొకవైపు అప్పుకి కళ్యాణ్ బట్టలు కొనుకుని వస్తాడు. మిగతా మూడు వేలు ఇవ్వు వాటితో సరుకులు తెస్తానని కళ్యాణ్ అనగానే.. మిగతా మూడు వేలతో నేను నీకు బట్టలు తీసుకున్నా అని అప్పు అంటుంది. మరొకవైపు రాజ్ కిందకి వస్తుంటాడు. అప్పుడే ఇందిరాదేవి కాఫీ తీసుకొని రమ్మని అంటుంది. దానికి డబ్బులు కావాలనగానే కావ్యని వచ్చి రాజ్ ఆపుతాడు. అప్పుడే అపర్ణ వచ్చి టీ కావాలి అనగానే.. తనతో కూడ కావ్య అలాగే అంటుంది. ఎక్కడ రాత్రి అన్న మాటలు కావ్య చెప్తుందో కావ్యని బయటకు తీసుకొని వెళ్లి.. నువ్వు ఎదో సరదాగా అంటున్నావనుకున్న అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో ఇంట్లో పూజ చెయ్యాలని ఇందిరాదేవి అంటుంది. మరొకవైపు ఆ అప్పు ఇంటికి వచ్చాక అది ఈ ఇంటికి కరెక్ట్ కోడలు కాదని తెలిసేలా చేస్తానని రుద్రాణితో ధాన్యలక్ష్మి అంటుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బ్రహ్మముడి కావ్య  సైంటిస్ట్ అన్న విషయం తెలుసా?

స్టార్ మాలో బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఇక ఇందులో కావ్య, రాజ్ లవ్ ట్రాక్ చాల బాగుంది. ఇక బయట కూడా ఈ హిట్ జోడి అప్పుడప్పుడు షోస్, ఈవెంట్స్ లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అలాగే కావ్య అలియాస్ దీపికా రంగరాజు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. వీడియోస్, రీల్స్ చేస్తూ ఉంటుంది. బ్రహ్మముడి సీరియల్ వాళ్లందరితో కలిసి ఈ వీడియోస్ చేస్తుంది. అలాంటి కావ్య రీసెంట్ గా ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియో భలే ఫన్నీగా ఉంది. సీరియల్ లో ధన్య లక్ష్మి - కావ్య కూర్చుని ఉంటారు. కావ్య అడిగే ప్రశ్నలకు ధాన్యలక్ష్మి జవాబులు ఇస్తూ ఉంటుంది. "అక్క ఆర్ట్ వేసేవాళ్లను ఏమంటారు అంటే ఆర్టిస్ట్ అని చెప్పింది. హెయిర్ స్టైల్ చేసేవాళ్లను ఏమంటారు ..హెయిర్ స్టైలిస్ట్, శారీ డ్రేప్ చేసేవాళ్లను..శారీ డ్రెపిస్టు..అని ఇలా కాన్వర్జేషన్ జరిగింది. ఐతే నేను సూపర్ గా సైన్ చేస్తాను. ఐతే నేను సైంటిస్టు" అని చెప్పుకుంది కావ్య. దానికి ధాన్యలక్ష్మికి నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. ఇంతలో సీరియల్ లో ఇంద్రాణి వచ్చి ఇద్దరి చెవులు మెలేసి సరదాగా ఆటపట్టించి "నువ్వు సైంటిస్టా, నువ్వు శారీ డ్రెపిస్టా..వావ్ సిల్లీ" అనేసి వెళ్ళిపోయింది. ఇక నెటిజన్స్ ఐతే మేము కూడా సైంటిస్టులమే అంటూ ఫన్నీగా ఆటపట్టిస్తు కామెంట్స్ చేస్తున్నారు. కార్తీక దీపం సీరియల్ ఇపోయాకా ఆ ప్లేస్ లో ఈ బ్రహ్మముడి సీరియల్ ఎంట్రీ ఇచ్చింది. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టే మంచి రేటింగ్ సంపాదించుకుంటోంది.

ఎవరి మొగుడు వాళ్లకు మహేష్ బాబు...

ప్రపంచంలో ఉన్న ప్రతీ భార్య ఏమనుకుంటుంది అంటే తన భర్తను తాను తప్ప మిగతా అమ్మాయిలంతా అన్నయ్య అనో తమ్ముడు అనో అనుకోవాలని అనుకుంటుంది. అందుకే మన ఇళ్లల్లో చూస్తే సాధారణంగా మీ అన్నయ్య, మీ తమ్ముడు అంటూ వరసలు కలిపించేసి మిగతా లేడీస్ తో అలాగే మాట్లాడించేస్తారు. ఇప్పుడు ఆట సందీప్ భార్య జ్యోతి కూడా అదే కాన్సెప్ట్ తో ఇప్పుడు ఒక వీడియోని పోస్ట్ చేసింది. "హలో అందమైన అమ్మాయిలూ...రాఖీ పండగ సందర్భంగా ప్రపంచంలో ఉన్న అందమైన అమ్మాయిలంతా మా ఇంటికి వచ్చి సందీప్ గారికి  రాఖీ కట్టొచ్చు. కింద మా ఇంటి అడ్రెస్స్ ఇచ్చాను..కాబట్టి వచ్చి రాఖీ కట్టేయండి  " అని చెప్పేసరికి సందీప్ కాసేపు జ్యోతితో పరాచికాలు ఆడి దణ్ణం పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఐతే ఒక నెటిజన్ ఐతే "మీ ఆయన అందగాడు అని ఫీల్ అవుతున్నాడు..అంత సీన్ లేదని చెప్పు " అని కామెంట్ పెట్టారు. దానికి రిప్లైగా "ఎవరి హజ్బెండ్ వాళ్లకు మహేష్ బాబే నువ్వు..ముయ్" అని చెప్పారు. ఇక మరో లేడీ నెటిజన్ కొంటెగా కామెంట్ చేసింది "ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్క అందమైన అమ్మాయికి సందీప్ గారు బావగారు అవుతారు జ్యోతక్క" అని చెప్పింది. బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఎలిమినేట్ అయిన సందీప్ పేరిట చాలా రికార్డులే ఉన్నాయి. తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో 8 వారాల పాటు  నామినేషన్స్‌లోకి రాకుండా ఉన్న తొలి కంటెస్టెంట్ . అంతేకాదు తొలి హౌస్ మేట్‌గా ఐదు వారాలు ఇమ్యూనిటీ పొందుకున్న కంటెస్టెంట్ . ‘నీతోనే డాన్స్’ విజేతగా నిలిచాడు సందీప్ మాష్టర్.

ఈటీవీ అంటే సుమ...సుమ అంటే ఈటీవీ 

  ఈటీవీ బలగం ప్రోమో పార్ట్ 2  భలే ఫన్నీగా ఉంది. ఇక ఈ షోలో బుల్లితెర నటులు ఈటీవీలో పని చేసిన వారంతా వచ్చారు. అలాగే జ్యోతిష్యం చెప్పే పంతుళ్లు కూడా వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసారు. సుడిగాలి సుధీర్, సోనియా సింగ్ ఈ షోకి యాంకర్స్ గా ఉన్నారు. ఈ ఎపిసోడ్ కి ఇంద్రజ ఎంట్రీ ఇచ్చేసరికి సుధీర్ వెళ్లి ఆప్యాయంగా అమ్మా అని పిలిచాడు. దానికి ఆది కౌంటర్ వేసాడు. "ప్రతీ సోమవారం నుంచి ప్రతీ శుక్రవారం వరకు రాత్రి 7  గంటలకు అమ్మ ప్రేమ కొడుకు కోమా" కొత్త సీరియల్ స్టార్ట్ కాబోతోంది అని చెప్పాడు. ఇక ఆ డైలాగ్ కి ఇంద్రజ, భావన పడీపడీ నవ్వేశారు. ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా నేచురల్ స్టార్ట్ నాని వచ్చాడు. సుధీర్ మీద సినిమా కమెడియన్ పెద్ద కౌంటర్ వేసాడు.. "అవార్డులు వచ్చేసరికి నీకు ఇళ్ళు మార్చడం ఎక్కువైపోయింది" అంటూ యాంకర్ సోనియా సింగ్ ని టార్గెట్ చేస్తూ సుధీర్ కి పంచ్ ఇచ్చాడు. ఆ మాటకు సుధీర్ షాక్ అయ్యాడు. ఈ ప్రోమోకి నెటిజన్స్ ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ షోలో సుమ కనిపించలేదు. ఈటీవీ అంటే సుమ. సుమ అంటే ఈటీవీ అన్న విషయం తెలిసిందే.  దాంతో నెటిజన్స్ ఫీలవుతున్నారు." ఈటీవీకి బలమే సుదీర్ గారు. అసలు ఇలాంటి ఈవెంట్స్ కి  యాంకర్ గా సుమ గారు అయితేనే బాగుంటుంది..  సుమ గారు అయితేనే యండిల్ చెయ్యగలరు..  ఈటీవీ సంస్థ గురించి చెప్పాలి అన్నా, రామోజీరావు గారి గురించి చెప్పాలి అన్న సుమ గారు అయితేనే కరెక్టుగా చెయ్యగలరు " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

Karthika Deepam2 : పారిజాతంకి బుద్ధి చెప్పిన జ్యోత్స్న...

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -127 లో.. దీపకి కార్తీక్ ఫోన్ చేసి శౌర్య ఆరోగ్యం గురించి అడుగుతాడు. ఆ తర్వాత కోర్టులో జరిగిన దాని గురించి మీ నాన్న ఏమైనా అన్నారా అని దీప అడుగగా.. అదేం లేదు.. కానీ జ్యోత్స్న ఏదైనా గొడవ చేసిందా అని కార్తీక్ అంటాడు‌. అలా అడగ్గానే దీప పలకకుండా ఉండిపోతుంది. తర్వాత ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు. మరోవైపు దాసు గురించి పారిజాతం ఆలోచిస్తుంది. జ్యోత్స్నకు ఎలాగైనా బుద్ధి చెప్పి, ఎలాగైనా దాస్ కి సారి చెప్పించాలని అనుకుంటుంది. అప్పుడే ఎదురుగా జ్యోత్స్న ఉంటుంది. తాతకు నువ్వు రెండో భార్య అని తెలుసు.. మరి దాసు ఎక్కడ నుంచి వచ్చాడని జ్యోత్స్న అడుగగా.. ఇది మీ తాతయ్యకే కాదు నాకు రెండో పెళ్లి. మీ తాతయ్యను పెళ్లి చేసుకోవడానికి ముందే నాకు దాసు కొడుకు. మీ నాన్న చెప్పాడు కదా బాబాయ్ అవుతాడని ఇంకోసారి కనిపిస్తే అలాగే పిలువమని పారిజాతం అంటుంది. నువ్వే చెప్పావ్ కదా మనిషిని బట్టి విలువ ఇవ్వాలని. రెస్టారెంట్ లో నేను కొట్టింది నీ కొడుకునే అని నీకు తెలుసు నాకు అక్కడే ఎందుకు చెప్పలేదు. అయిన కుటుంబమే దూరం పెట్టిన ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం తనకు  లేదంటుంది  జ్యోత్స్న . నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. వాడు వీడు అంటావేంటని పారిజాతం అనగా.. నేను ఇలా మాట్లాడటానికి కారణం నువ్వే. అలాంటి వాళ్ళకు విలువ ఇవ్వకూడదని చెప్పింది నువ్వే. ఇప్పుడు నువ్వే ఇవ్వమని అంటున్నావని జ్యోత్స్న కోపంగా అంటుంది. మరోవైపు దీపతో దశరథ, సుమిత్ర మాట్లాడతారు. మా ఇంటికి వచ్చినప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూనే ఉన్నావు.  ఇప్పుడు నీ జీవితం, నీ కూతురు జీవితం నీ చేతుల్లోనే ఉందని దీపతో సుమిత్ర అంటుంది. ఇప్పుడు నీకేం సాయం కావాలో చెప్పు దీప చేస్తాం. నువ్వు సొంతంగా వ్యాపారం పెట్టుకుంటానంటే చెప్పు సాయం చేస్తాం. లేదంటే మా రెస్టారెంట్ లో పని చేస్తావా?  నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావని దీపని దశరథ్ అడుగుతాడు.. మీ అమ్మానాన్న అడిగితే ఇలాగే ఆలోచిస్తావా దీప అని సుమిత్ర అడుగుతుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. దీపతో వెటకారంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.