Bigg Boss 8 Telugu: బేబక్క ఎలిమినేషన్ పక్కా.. టాప్ లో విష్ణుప్రియ!

బిగ్ బాస్ సీజన్ మొదలై నేటికి ఆరు రోజులు.. రేపే ఎలిమినేషన్ ఉండబోతుంది. దీంతో నామినేషన్ లిస్ట్ లో ఉన్నవాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. తొలివారం నామినేషన్స్‌లో విష్ణుప్రియ, శేఖర్ బాషా, సోనియా , బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వీ మొత్తం ఆరుగురు  కంటెస్టెంట్స్ ఉన్నారు. (Bigg boss 8 Telugu first week elimination) ఓటింగ్ లైన్స్ ముగిసే సమయానికి ఎవరెవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం.. విష్ణుప్రియ 28 శాతం ఓటింగ్ లో  మొదటి స్థానంలో ఉండగా.. మణికంఠ 26 శాతం ఓటింగ్ తో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక పృథ్వీకి 12 శాతం, సోనియా ఆకులకి 12 శాతం, శేఖర్ బాషాకి 10 శాతం ఓటింగ్ పడగా.. చివరగా బేబక్కకి 9 శాతం ఓటింగ్ సాధించారు. ఈ ఓటింగ్ పోల్ ని చూస్తే బేబక్క ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.  అయితే కొన్ని పోల్స్ లో శేఖర్ బాషా లీస్ట్ లో ఉన్నాడు.  బుధవారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు బిగ్ బాస్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. దాంతో నిన్నటితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ కానున్నాయి. అంటే.. కేవలం రెండురోజుల ఓటింగ్‌ని బట్టి ఎలిమినేషన్ చేపట్టడమనేది కంటెస్టెంట్స్‌కి అన్యాయం జరిగినట్టే. మరి గతంలో మాదిరిగా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఎత్తేస్తారో లేదా ఎలిమినేట్ చేసిపారేస్తారేమో చూడాలి మరి.

Bigg Boss 8 : చీప్ గా బిహేవ్ చేసిన చీఫ్ యష్మీ.. ప్రేరణ క్రూరత్వం!

బిగ్ బాస్ సీజన్-8 శుక్రవారం నాటి ఎపిసోడ్ లో ఎప్పటిలాగే ఇప్పుడు కూడా హౌస్ మేట్స్ రాజకీయలు మొదలయ్యాయి. అంతేకాకుండా రెండు మూడు గ్రూపుల్లాగా అయ్యారు. యష్మీ చీఫ్ గా ఉండి తమ టీమ్ ని గెలిపించింది. అందులో పృథ్వీ ఫౌల్ గేమ్ ఆడాడు అది వేరే విషయం. కాకపోతే యష్మీ నిఖిల్, నైనిక ముగ్గురు చీఫ్ లు కాబట్టి బిగ్ బాస్ కాన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. యష్మీ టీమ్ టాస్క్ లో గెలవడంతో బిగ్ బాస్ తనకి కొన్ని పవర్స్ ఇస్తాడు. ఆ పవర్ ఏంటంటే యష్మీ హౌస్ మేట్స్ కి పనులు అప్పగించే పవర్ వస్తుంది. (Bigg Boss 8 Telugu) యష్మీ తన టీమ్ కాకుండా మిగతా వాళ్ళకి వర్క్ అలాట్ చేస్తుంది. నైనిక టీమ్ లోని కిర్రాక్ సీత, నబీల్ , విష్ణుప్రియ, ఇంట్లో వర్క్ అలాట్ చేస్తుంది. ఆ తర్వాత యష్మీ టీమ్ అంత కూడా నైనిక టీమ్ వాళ్ళని ఒక ఆట ఆడుకుంటారు. ఇంట్లో పనులన్నీ వాళ్ళ చేతే చేయిస్తారు. ప్రేరణ మరొక కోణం నిన్న బయట పడింది. కిచెన్ లో జ్యూస్ గ్లాస్ లో పోసుకొని బాటిల్ ని డస్ట్ బిన్ లో వేస్తుంది. వాళ్ళున్నారు కదా చేయడానికి అని మళ్ళీ డస్ట్ బిన్ లోని బాటిల్ ని తీసి టేబుల్ పై పెట్టింది ప్రేరణ. అది చూసి సీత నవ్వుకుంటూనే డస్ట్ బిన్ లో వేసింది. ఆ తర్వాత ప్రేరణ, అభయ్ నవ్వుకుంటుంటారు. యష్మీ టీమ్ అంతా కలిసి బయట జ్యూస్ తాగుతూ పార్టీ చేసుకుంటారు. ప్రేరణ కావాలనే బయటకు గొడుగులు తీసి బయటవేస్తుంది వాళ్ళున్నారు కదా క్లీన్ చెయ్యడానికి అంటుంది. ఆ తర్వాత అభయ్ ఆమ్లెట్ వేసుకుంటున్నానని అంటాడు. దాంతో ఆ డిషెస్ మీరే తోముకోవాలని కిర్రాక్ సీత అంటుంది. అది మా డ్యూటీ కాదని అభయ్ అంటాడు. ఇక మేమ్ పని మనుషులులాగా కన్పిస్తున్నామా అని అభయ్ తో గొడవ పెట్టుకుంటుంది కిర్రాక్ సీత. మరోవైపు విష్ణుప్రియ తన బాధ చెప్పుకుంది‌. అసలు ఇదెక్కడి న్యాయం. పదిమంది చేసే పనంతా మమ్మల్ని చేయండంటూ ఆర్డర్లు వేయడమేంటి? నేను బిగ్‌బాస్‌కి వచ్చింది పనులు చేయడానికా అంటూ విష్ణు కాసేపు తిట్టుకుంది. ఏదో టైటిల్ గెలిచేద్దామనే ఫైర్‌తో లోపలికి వచ్చాను.. వీళ్ల వల్ల ఫైర్ అంతా ఆరిపోయింది. నేను అయితే ఒక్క పని కూడా చేయను.. నాగార్జున సర్ అడిగితే చెబుతా.. నేను ఏదో పర్సనాలిటీ డెవలెప్‌మెంట్ అనుకొని హౌస్‌లోకి వచ్చా కానీ ఇలా క్లీనింగ్ డెవలప్‌మెంట్ అవుతుందని అనుకోలేదు. బిగ్‌బాస్‌కి రావడం రాంగ్ డెసిషన్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. యష్మీ టీమ్ చేసే ఆగడాలకు నైనిక, విష్ణుప్రియ, కిర్రాక్ సీత ముగ్గురు ఆగమవుతున్నారు.

యాక్సిడెంట్ అయ్యేలా ప్లాన్ చేసిన సందీప్.. వారికి ఏం జరగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -195 లో...రామలక్ష్మి, సీతాకాంత్ లు బయటకు వెళ్తున్నారనుకొని సందీప్ కార్ బ్రేక్ ఫెయిల్ చేస్తాడు. రామలక్ష్మి ఒక్కతే వెళ్తుంటే.. ఏంటి అన్నయ్య వెళ్లట్లేదా పర్లేదులే రామలక్ష్మి మిగలదనుకుంటాడు.  ఆ తర్వాత జర్మనీ కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తారన్నావ్ ఏంటి ఇంకా చెయ్యలేదని సీతాకాంత్ అంటాడు. పర్లేదులే చేస్తారులే ఇక్కడ మనం తప్ప ఎవరు లేరంటూ నందిని అంటుంది. మరొకవైపు సీత సర్ నా పక్కన ఉంటే నా ప్రేమ విషయం చెప్పేదాన్ని అని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత కాలం ఒక్కసారి వెనక్కి వెళ్తే బాగుండు.. మనం ఎంత సంతోషంగా ఉన్నామని నందిని అనగానే.. అది గతం అని సీతాకాంత్ అంటాడు. గతం అనకు నాకు అది మధుర జ్ఞాపకమని నందిని అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ అదంతా చిరాకుగా ఫీల్ అయ్యి బయటకు వస్తాడు.  మరొకవైపు రామలక్ష్మికి కార్ బ్రేక్ ఫెయిల్ అయిందని తెలుస్తుంది. అప్పుడే సీతాకాంత్ ఫోన్ చేస్తాడు కానీ ఫోన్ తీసుకునే లోపే ఫోన్ కింద పడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ వేరే కార్ లో వెళ్తాననుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి బ్రేక్ పని చెయ్యక ఒక చోట కార్ ఆక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత నా కార్ లో వెళ్ళమని సీతాకాంత్ తో‌ నందిని చెప్పగా.. అక్కర్లేదంటు సీతాకాంత్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లి రామలక్ష్మి కాఫీ తీసుకొని రా అంటూ పిలుస్తాడు. ఎంత పిలిచినా రామలక్ష్మి రాకపోయేసరికి అప్పుడే సీతాకాంత్ కిందకి వెళ్లి అందరిని అడుగుతాడు. నీతో మార్నింగ్ వెళ్ళింది ఇంటికి రాలేదని చెప్తారు. దాంతో సీతాకాంత్ కంగారుపడుతాడు. ఆ తర్వాత రామలక్ష్మి దెబ్బలతో ఇంటికి వస్తుంది. దాంతో కంగారుగా  ఏం జరిగిందని సీతాకాంత్ అడుగుతాడు. రామలక్ష్మిని గదిలోకి తీసుకొని వెళ్లి కట్టు కడతాడు. జరిగింది అడిగి తెలుసుకుంటాడు. రెస్ట్ తీసుకోమంటూ బయటకు వస్తాడు. రామలక్ష్మి, సీతాకాంత్ లు బయటకు వెళ్తుంటే.. నందిని వద్దన్న విషయం గుర్తుకు తెచ్చుకొని ఇదంతా కావాలని నందిని చేసి ఉంటుందని కోపంగా తన దగ్గరికి బయల్దేర్తాడు. ఆ తర్వాత శ్రీలత, శ్రీవల్లిలతో ఇదంతా మీరే చేశారని రామలక్ష్మి కోప్పడగా.. మేమ్ చెయ్యలేదని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam 2 : కార్తిక్, జ్యోత్స్నల పెళ్ళి.. ఏం నటిస్తున్నావే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (karthika Deepam 2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -143 లో... దీప దగ్గరికి నరసింహా రావడంతో.. ఎందుకు వచ్చావ్ అంటూ దీప, అనసూయలు కోప్పడతారు. నాకు ఇల్లు ఇవ్వు అంటూ అడుగుతాడు. నువ్వు మర్యాదగా వెళ్తావా వెళ్ళవా అంటూ అనసూయ లోపలికి వెళ్ళి కత్తిపీట తీసుకొని వస్తుంది. అప్పుడే  నర్సింహాను చూసి శౌర్య భయపడుతుంది. నర్సింహా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదంతా పై నుండి జ్యోత్స్న చూస్తుంది. నరసింహా వెళిపోతుంటే జ్యోష్న తనతో వెళ్లి మాట్లాడుతుంది. దీపపై నరసింహాకి కోపం వచ్చేలా రెచ్చగొడుతుంది. నీ పెళ్ళాం నిన్ను వదిలేసి ఇష్టం వచ్చినట్లు ఉంటుంటే.. ఏం చేస్తున్నావ్ .. చేతకాని వాడివి అంటూ జ్యోత్స్న అంటుంది. నరసింహ కోపంగా ఆ దీపని చంపేస్తా.. నాకు అడ్డు ఉండదు నీకూడా అడ్డు ఉండదు. మీరు ఒకే అనండి ఏం ప్రాబ్లెమ్ రాకుండా చూసుకోండని అనగానే జ్యోత్స్న సరే అంటుంది. ఆ తర్వాత శౌర్య భయపడుతుంటే దీప, అనసూయ దైర్యం చెప్తుంటారు. ఆ తర్వాత నరసింహా ఇంటికి వెళ్లి డ్రింక్ చేస్తూ శోభని ఆమ్లెట్ వేసుకొని రమ్మంటాడు. శోభ తనపై కోప్పడుతుంది. మరొకవైపు కార్తీక్, కాంచనలు సుమిత్ర ఇంటికి వెళ్తారు. అందరిని రమ్మన్నానవేంటని జ్యోత్స్నని సుమిత్ర అడుగుతుంది. అప్పుడే పంతులు వస్తాడు. ఎంగేజ్ మెంట్ వద్దు.. డైరెక్ట్ పెళ్లి ముహూర్తం అన్నాడు కదా బావ.. అందుకే పెళ్లి ముహూర్తం పెట్టడానికి పిలిపించా అని జ్యోత్స్న అంటుంది. రెండు రోజుల్లో ముహూర్తం పెట్టమని.. ఆల్రెడీ జ్యోత్స్న పంతులికి చెప్తుంది పంతులు రెండు రోజుల్లో ముహూర్తం ఉంది.. మళ్ళీ ఆరు నెలల తర్వాతే అని అంటాడు. దాంతో అన్ని రోజులు ఎందుకని డిస్కషన్ చేసుకొని రెండు రోజుల్లో పెళ్లి చేయాలని అనుకుంటారు. ఆ తర్వాత కార్తీక్ వెళ్తుంటే.. శౌర్య కన్పించి రాత్రి బూచోడు వచ్చాడని చెప్తుంది. దాంతో దీప దగ్గరికి కార్తీక్ వెళ్లి అడుగుతాడు. అత్తయ్య బుద్ది చెప్పింది.‌ ఇక రాడని దీప అంటుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి గుడ్ న్యూస్ చెప్పవా అని అడుగుతుంది. పెళ్లి గురించి అని జ్యోత్స్న అంటుంది. కాశీ, స్వప్పల పెళ్లి గురించి అయి ఉంటుందా అని దీప అనుకుంటుంది. మీ పెళ్లి గురించి అనుకుంటున్నావు కదా దీప అని జ్యోత్స్న అనుకుంటుంది. బావతో నాకు పెళ్లి రెండు రోజుల్లో అని జ్యోత్స్న చెప్పగానే.. అవునా మంచి మాట చెప్పావని దీప అనగానే.. ఏం నటిస్తున్నావని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : అత్తకి హార్ట్ ఎటాక్.. ఫోన్ చేసినా పట్టించుకోని కోడలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -508 లో.... కళ్యాణ్ కి బర్త్ డే కి అప్పు సర్ ప్రైజ్ ఇస్తుంది. కేక్ కట్ చేయించి తనకి కవితలు రాయడానికి యూజ్ అయ్యేలా గిఫ్ట్ ఇస్తుంది. దాన్ని చూసి కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇకనుండి నువ్వు కవితలు రాసుకోమని అప్పు అనగానే మనం బ్రతకాలంటే జాబ్ చెయ్యాలి అని కళ్యాణ్ అంటాడు. నేను చేస్తానని అప్పు అనగానే.. నేను ఉండగా నువ్వు చెయ్యడం ఏంటని కళ్యాణ్ అంటాడు. అంటే నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు రాసుకోమని అప్పు అంటుంది. మరుసటి రోజు అందరు హాల్లో కూర్చొని కాఫీ తాగుతుంటారు. అప్పుడే ధాన్యలక్ష్మి వచ్చి అందరు ఈ రోజు ఏంటో కూడా మర్చిపోయారని అంటుంది. తన మాటలకి అందరు నవ్వుకుంటారు. నువ్వే ఇప్పుడు లేట్ గా వచ్చావ్.. మేం ఈ రోజు గురించి మర్చిపోలేదు. కళ్యాణ్ బర్త్ డే కి ఎప్పుడు చేసే విధంగా గుడికి వెళ్లి అభిషేకం చేయించి ఆ తర్వాత అన్నదానం చేయిస్తున్నామని ఇందిరాదేవి అంటుంది. మీరు వెళ్ళండి అత్తయ్య నేను రాలేనని అపర్ణ అంటుంది. అత్తయ్య తో పాటు నేను కూడా ఉంటానని కావ్య అంటుంది. మరొకవైపు రాహుల్ రుద్రాణితో ఇంట్లో ఎవరు లేనప్పుడు అపర్ణ అత్తయ్యకి ఏమైనా అయితే కావ్య మీదకి వస్తుంది. కావ్యని రాజ్ క్షమించడు.. ఆ డిప్రెషన్ లో రాజ్ ఆఫీస్ కి రాడు.. ఇక ఆఫీస్ సొంతం అవుతుందమని రాహుల్ అంటాడు. ఇప్పుడు అత్తయ్య రోజు వేసుకునే టాబ్లెట్స్ ప్లేస్ లో ఈ టాబ్లెట్ పెట్టు బీపీ ఎక్కువై హార్ట్ ఎటాక్ వస్తుందని రాహుల్ అంటాడు. కావ్య ఉంటుంది కదా అని రుద్రాణి అనగానే.. కావ్య లేకుండా వేరే ప్లాన్ చేసానని రాహుల్ అంటాడు. ఇక రుద్రాణి టాబ్లెట్ మారుస్తుంది. ఆ తర్వాత అందరు గుడికి వెళ్తారు. మరొకవైపు అప్పు, కళ్యాణ్ లు గుడికి వెళ్తారు. నా గురించి ఇంట్లో వాళ్ళు మర్చిపోయారని కళ్యాణ్ అంటాడు. అప్పుడే దుగ్గిరాల కుటుంబం గుడికి రావడం అప్పు చూపిస్తుంది. దాంతో కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాహుల్ రుద్రాణిలు అప్పు, కళ్యాణ్ లని చూస్తారు. రాహుల్ ఆఫీస్ లో ఒకతనికి ఫోన్ చేసి ఆఫీస్ లో ఫ్రాడ్ జరుగుతుందని కావ్యకి చెప్పమంటాడు. ఆ తర్వాత కావ్య, అపర్ణలు సరదాగా మాట్లాడుకుంటారు.  తరువాయి భాగంలో అపర్ణ టాబ్లెట్ వేసుకుంటుంది. ఆఫీస్ లో ఫ్రాడ్ జరిగిందంటు కావ్యకి ఫోన్ రావడంతో ఆఫీస్ కి వెళ్తుంది. ఆ తర్వాత అపర్ణ కి హార్ట్ ఎటాక్ వస్తుంది. కావ్యకి ఫోన్ చేస్తుంది కానీ కావ్య లిఫ్ట్ చెయ్యదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సుధీర్ వెస్ట్ రష్మీ బెస్ట్..!

  ఇంద్రజ ఒక్కప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఇంద్రజ తన అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి దూసుకుపోతుంది. ఇంద్రజ చాలా మూవీస్ లో సపోర్ట్ రోల్ కూడా చేసి ఆకట్టుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం స్టార్ కామెడీ షో అయిన జబర్దస్త్ కి జడ్జ్ గా చేస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంటోంది. ఇంద్రజ జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీలోను జడ్జ్ గా ఉంటుంది. అయితే మల్లెమాల యూట్యూబ్ ఛానెల్ లో తాజాగా ఇంద్రజకి సంబందించిన ఓ ప్రోమో రిలీజైంది. ఇందులో ఇంద్రజ కొన్ని సెన్సెషనల్  కామెంట్లు చేసింది. అది కూడా తన ప్రియ శిష్యుడు సుధీర్ మీద. 'చిట్ చాట్ విత్ ఇంద్రజ' అనే టైటిల్ తో రిలీజైన ఈ మినీ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. కారణం ఏంటంటే.. యాంకర్స్ లలో రష్మి, సుధీర్ లలో ఎవరు బాగా చేస్తారని అడగగా.. రష్మీ అని సమాధానమిచ్చింది ఇంద్రజ. ఎందుకంటే సుధీర్ ని అసలు యాంకర్ గా ఎప్పుడూ చూడలేదంట ఇంద్రజ. ఇక ఇప్పుడు ఇదే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా మారింది‌. ఈ ప్రోమో రిలీజైన కొన్ని గంటల్లోనే అత్యధిక వీక్షకాధరణ పొందుతోంది.  రాపిడ్ ఫైర్ లా కొన్ని ప్రశ్నలు అడిగితే ఇలా సమాధానం చెప్తారా అంటు సుధీర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సుధీర్ కి యాంకరింగ్ రాదా.. రష్మీ అసలు తెలుగు వచ్చా.. అంటూ ఇంద్రజపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సుధీర్ మిమ్మల్ని అమ్మలా చూసాడు కదా.. ఇలా ఎలా మాట్లాడతారంటు నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఇది ప్రోమోనే ఫూల్ ఎపిసోడ్ ఇంకా రాలేదు‌. అందులో సుధీర్ గురించి ఇంకా ఏం మాట్లాడిందో తెలియనుంది. అయితే ఇందులో హైపర్ ఆది తనపై వేసే పంచులు కూడా తనకి నచ్చవని అంది. కాగా ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.  

బిగ్ బాస్ నాగ మణికంఠపై సంచలన వ్యాఖ్యలు చేసిన అఖిల్ సార్థక్!

బిగ్ బాస్ సీజన్ లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొంతమంది మెచురిటి లేనివాళ్ళు కూడా ఉన్నారంటు కొంతమంది ఇప్పటికే తీవ్రంగా విమర్శిస్తున్నారు.. గతాన్ని చెప్పుకుంటూ సింపథీ గెయిన్ చేయాలని చూస్తున్నాడంటు నాగ మణికంఠపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు అఖిల్ సార్థక్. అఖిల్ సార్థక్ గురించి అందరికి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్-4 లో తనదైన అటిట్యూడ్ తో ఫినాలే వరకు వెళ్ళి.. చివరికి రన్నర్ గా నిలిచాడు. ఇక తాజాగా జరిగిన బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నామినేషన్ పై అఖిల్ స్పందించాడు. నాగ మణికంఠ పై తన అభిప్రాయం చెప్పాడు. ఫస్ట్ డే మణికంఠని అందరు నామినేట్ చేయగా.. తనని నామినేట్ చేసిన వారిపై వీర లెవల్ లో ఫైర్ అయ్యారు. ఇది గేమ్ కావొచ్చు. కానీ, ఇది లైఫ్ .. నేనేంటో నిరూపించుకోవడానికి ఇక్కడికి వచ్చా.. నన్ను ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ రావిపూడి అనిల్ బీబీ హౌస్ నుంచి తీసుకెళ్తు నీకు నచ్చిన హీరో ఎవరంటే.. మనోడు నాకు నేనే హీరో అంటూ ఇచ్చిన సమాధానం వేరే లెవల్. ఆ తరువాత శివుడిపై పాట పాడి భావోద్వేగానికి లోనయ్యాడు. కానీ చివరిలో అనిల్ రావిపూడి అది ప్రాంక్ అని చెబుతారు. ప్రాంక్ సమయంలో నాగ మణికంఠ ఓవరాక్షన్ తో మనోడిపై ఓవర్ అటెన్షన్ వచ్చిందనే చెప్పాలి. హౌస్ లో మణికంఠ ఆటతీరు చూసి సానుభూతి చూపాలో.. ట్రోల్ చేయాలో.. అర్థం కాక అటు నెటిజన్లు, బిబి లవర్స్ ఆశ్చర్యంలో ఉన్నారు. ఈ తరుణంలో నాగ మణికంఠ ఆటతీరుపై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన అటెన్షన్ సీకర్, ఈ విషయం నేను అనడం లేదు. తానే నిన్నటి షోలో అటెన్షన్ అంటే చాలా ఇష్టమని అన్నారు. దానికోసం ఏదైనా చేస్తాడని పిస్తుంది. బిగ్ బాస్ లో మన గతం గురించి చెప్పడానికి మనకు సమయం ఇస్తారు. కానీ, మణికంఠ ఫస్ట్ డే నుండే సింపథీ కార్డు వాడుతున్నారు. మళ్లీ నిఖిల్ కు బ్రేన్ తో ఆడాలి చెబుతున్నారు. తాను మాత్రం సింపథీ ప్లే చేస్తున్నాడు. బిగ్ బాస్ అన్ని చూస్తున్నాడు. ఫూల్స్ కాదు. దయచేసి సింపథీని చూసి ఓట్లు వేయకండి అని అఖిల్ సార్థక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.   

Biggboss 8 Telugu: ఏ టాస్క్ లో ఎవరు గెలిచారంటే!

  బిగ్ బాస్ సీజన్-8 లో నామినేషన్ ప్రక్రియ తర్వాత హౌస్ లో టాస్క్ లు మొదలయ్యాయి. ఇక మొత్తం కంటెస్టెంట్స్ ని మూడు టీమ్ లుగా విభజించాడు బిగ్ బాస్. నిఖిల్ , యష్మీ గౌడ, నైనిక ముగ్గురు చీఫ్ లని బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోమన్నాడు‌. ముందుగా ప్రేరణ కోసం నిఖిల్, యష్మీ పోడీపడగా.. యష్మీ టీమ్‌కి వెళ్లింది ప్రేరణ. ఆ తర్వాత ఆదిత్య, సీతలను నైనిక తన టీమ్‌లోకి తీసుకుంది. ఇక మణికంఠ కోసం కేవలం నిఖిల్ మాత్రమే నిలబడ్డాడు. దీంతో తన టీమ్‌లోకి వెళ్లాడు. అయితే విష్ణుప్రియ కోసం ఎవరూ లేచి నిలబడకపోవడంతో చివరికి నైనిక తన టీమ్‌లోకి తీసుకుంది. అభయ్ కోసం యష్మీ,నిఖిల్ పోటీ పడగా యష్మీ టీమ్‌లోకి వెళ్లాడు అభయ్. పృథ్వీ కోసం కూడా నిఖిల్, యష్మీ పోటీ పడి యష్మీ టీమ్‌లోకి వెళ్లేందుకు ఇష్టపడ్డాడు పృథ్వీ. ఇక అంతా పూర్తయ్యాక నిఖిల్ టీమ్‌లో తక్కువ మెంబర్స్ ఉండటం.. యష్మీ, నైనిక టీమ్‌లో ఈక్వెల్‌గా ఉండటంతో ముందు యష్మీ-నైనిక టీమ్‌కి ఓ పోటీ పెడతామంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు. ఆ తర్వాత నిఖిల్ దగ్గరికొచ్చి విష్ణు మాట్లాడింది. నేను మణికంఠ కంటే వీకా నన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదంటూ నిఖిల్‌ని అడిగింది. నిన్ను ఎవరైనా సెలక్ట్ చేస్తారు కానీ మణికంఠను ఎవరు సెలక్ట్ చేయరని నాకు తెలుసు.. అందుకే వాడి కోసం నిల్చున్నానంటూ నిఖిల్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. మరోవైపు టవల్స్ అన్నీ ఒకేలా ఉండటం.. తన టవల్ కూడా బ్లూ కలర్‌యే అవడంతో బై మిస్టేక్ ప్రేరణ టవల్ వాడేశాడు ఆదిత్య. దీంతో చూసుకోవాలి కదా అంటూ ప్రేరణ కాస్త గొడవ పెట్టింది. దీంతో బిగ్‌బాస్ కొత్త టవల్ పంపాడు. ఇంకోవైపు బాత్రూంలు నీటిగా ఉంచడం లేదంటూ సోనియా, యష్మీ, మణికంఠ సహా కొంతమంది మధ్య చిన్న గొడవ జరిగింది. నైనిక-యష్మీ టీమ్‌లకి బిగ్ బాస్ 'బాల్ పట్టు గోల్ కొట్టు' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ​గెలిచిన టీమ్‌.. నిఖిల్ టీమ్ నుంచి ఒకరిని తమ టీమ్‌లోకి తీసుకోవచ్చంటూ మెలిక పెట్టాడు.ఇక ఈ గేమ్ రెండు రౌండ్లలో జరిగింది. ముందుగా నైనిక టీమ్ నుంచి ఒక్కరు కూడా మొదటి రౌండ్‌లో గోల్ కొట్టలేకపోయారు. యష్మీ టీమ్ నుంచి మాత్రం అభయ్ ఒక గోల్ కొట్టాడు. ఇక రెండో రౌండ్‌లో కూడా నైనిక టీమ్ గోల్ కొట్టలేకపోయింది. దీంతో రెండో రౌండ్ ఆడకుండానే యష్మీ టీమ్ విన్ అయిపోయింది. మరి నిన్నటి ఎపిసోడ్ ఎలా అనిపించిందో‌ కామెంట్ చేయండి.

బిగ్ బాస్ హౌస్ లో మణికంఠ కపట డ్రామా...

  బిగ్ బాస్ సీజన్ మొదలయ్యి అప్పుడే నాలుగు రోజులు కంప్లీట్ అయ్యాయి. ఇక నాల్గో రోజు హౌస్ లో  ఏం జరిగిందో‌ ఓసారి చూసేద్దాం. ఉదయమే బిగ్ బాస్ మంచి జోష్ సాంగ్ తో‌ అందరిని నిద్ర లేపాడు. రాత్రి నామినేషన్ల టైమ్ లో విష్ణుప్రియ, మణికంఠ మధ్య చిన్న డిస్కషన్ అయిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి మణికంఠ తన భార్య గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. ఈ షో నుంచి బయటికెళ్లాక నా వైఫ్ యాక్సెప్ట్ చేయదు.. నా మిస్టేక్ కదా నెగెటివ్‌గా ఆలోచించే పర్సనాలిటీ నాది.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. లేదు తను అది అర్థం చేసుకుంటుందిలే అంటూ విష్ణుప్రియ కాసేపు సర్ది చెప్పింది. కానీ నా వల్ల వాళ్ల లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కదా అంటూ మణికంఠ మళ్లీ ఏడ్చేశాడు. మరోవైపు నైనికతో నిఖిల్ సరదాగా మాట్లాడాడు. చెప్పు మీ అబ్బాయి పేరు చెప్పమనగా నైనిక సిగ్గుపడింది. మణికంఠకి ప్రేరణ కాసేపు ధైర్యమిచ్చింది. ఆ తర్వాత ఆదిత్య కూడా మణికంఠ దగ్గరికొచ్చి మాట్లాడాడు. నా లోపల నీపై లవ్, కేరింగ్ తప్ప ఇంకేం లేదు.. హార్ట్ ఫెల్ట్‌గా నీకు కనెక్ట్ అయ్యాను మణి.. ఒకటి గుర్తుపెట్టుకో పబ్లిక్ నిన్ను కాపాడతారు.. అంతకంటే నేను చెప్పనంటూ ధైర్యం చెప్పి ఆదిత్య వెళ్లిపోయాడు. కానీ దీనికి కూడా మణికంఠ మళ్లీ ఏడుస్తూ ఈ రోజు నుంచి ఏడవొద్దని ఫిక్స్ అయ్యా అంటూ బిగ్‌బాస్‌తో అన్నాడు.  ఇక తర్వాత అందరిని కూర్చోబెట్టి నెక్స్ట్ ఏంటో చెప్పాడు బిగ్‌బాస్. ముగ్గురు చీఫ్‌లు ఉన్నారు కాబట్టి వీళ్లకి సైన్యం కూడా ఉండాలి. కనుక వీళ్ల ముగ్గురు తమ టీమ్‌లని రెడీ చేసుకుంటారంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అయితే నబీల్, శేఖర్, బేబక్కలకి బిగ్‌బాస్ ఓ ఆఫర్ ఇచ్చాడు. ఒక్క అడుగు దూరంలో చీఫ్‌లు అవ్వకుండా ఆగిపోయారు కాబట్టి వీళ్లు వాళ్లకి నచ్చిన చీఫ్ టీమ్‌లో చేరే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఆ తర్వాత ఒక్కో టీమ్ లోకి ఒక్కో కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకున్నారు.   

Karthika Deepam2:  చాటుగా ఆ మాటలు విన్న జ్యోత్స్న.. కార్తీక్ ఆ పెళ్లి జరిపిస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీకదీపం-2'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-142 లో.. తను దాస్ కూతరనే నిజం తెలిసిన జ్యోత్స్న దీర్ఘంగా ఆలోచిస్తుంటుంది. నాకు ఈ ఆస్తి కావాలి.. ఈ తల్లిదండ్రుల ప్రేమ కావాలంటూ జ్యోత్స్న.. తన ఇంటినే కళ్లారా చూసుకుంటు దీపకి డ్యాష్ ఇస్తుంది‌. దీప అప్పుడే అటుగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది. చూసుకోకుండా ఇద్దరు డ్యాష్ ఇచ్చుకుంటారు. ఏమైంది జ్యోత్స్నా.. వెనక్కి నడుస్తున్నావని దీప అంటుంది. వెంటనే జ్యోత్స్న కోపంగా.. ఇది నా ఇల్లు నేను ఎలాగైనా నడుస్తాను.. నువ్వు ఎందుకు చూసుకోలేదంటూ అరుస్తుంది. దాంతో దీప.. నేను బాగానే వస్తున్నాను.. నువ్వే వెనక్కి నడుస్తూ నా ప్లేస్‌లోకి వచ్చావని అంటుంది.  ఇక దీప ఇంటికి వచ్చేసరికి.. స్వప్న ఇంట్లో కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. నువ్వు ఎప్పుడొచ్చావ్ స్వప్న అని దీప అంటుంది. జ్యోత్స్నతో మాట్లాడుతున్నప్పుడే వచ్చాను.. నేను నీతో మాట్లాడాలి దీపా.. అన్నయ్యని కూడా ఇక్కడికే రమ్మన్నాను.. తను కూడా వచ్చాక ఇద్దరితో ఒకేసారి మాట్లాడతానంటుంది. దాంతో దీప.. అయ్యో కార్తీక్ బాబుని ఎందుకు ఇబ్బంది పెట్టడం.. నాతో చెప్పొచ్చు కదా అని అంటుంది. మీరిద్దరూ భలే ఉన్నారు కదా.. ఒకరిని ఇబ్బంది పెట్టకూడదని ఒకరు.. తెగ ఆలోచిస్తారంటుంది స్వప్న. మరోవైపు ఆ దీపని పంపించాలని జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ కారు వచ్చి దీప ఇంటి ముందు ఆగుతుంది. ఆ కారు శబ్దం విన్న జ్యోత్స్న.. బావను నేనే వెళ్లి పలకరిస్తాను.. కొన్ని రోజులు నేను కాస్త తగ్గి ప్రవర్తించడం మంచిదని మనసులో అనుకుంటూ కార్తీక్ కోసం వెళ్తుంది. అయితే దీప ఇంట్లోకి వెళ్తాడు కార్తీక్. నాకు చావు తప్ప మరో మార్గం లేదని నేను అనుకుంటుండగా.. నాకు ఓ నిజం తెలిసింది ఏంటంటే.. కాశీ స్వయంగా అన్నయ్యకు బావమరిది.. అది నాకు చాలా నమ్మకాన్ని కలిగించింది.. లేదంటే వెళ్లిపోయి చేసుకోవడం తప్ప మరో దారే లేదుమో అంటూ స్వప్న.. దీపతో మాట్లాడుతూ ఉండగా.. కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్లే మాట్లాడుకుంటున్నారు? ఉన్నట్టుండి దీప దగ్గరకు ఎందుకు వచ్చాడంటూ జ్యోత్స్న.. దీప ఇంటి వైపు వస్తుంది. కాసేపు నేను చెప్పేది వింటావా.. ఈ పెళ్లి అంత ఈజీగా జరగదని కార్తీక్ అంటాడు. ఆ మాటలే జ్యోత్స్న విని షాక్ అయి అక్కడే చాటుగా నిలబడిపోతుంది.  ఆల్రెడీ ఇంట్లో పెళ్లి మాటలు అయ్యాయి.. ఒకసారి పెద్దవాళ్లు ఒక నిర్ణయం తీసుకున్నాక వాళ్లు అనుకున్నదే జరగాలి అనుకుంటారు. కానీ అది జరగదు.. నువ్వు కోరుకున్నట్లే ఈ పెళ్లి జరుగుతుంది. కానీ నువ్వు నన్ను ఇబ్బంది పెట్టొద్దు.. ఏం చేయాలో నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు’ అంటాడు కార్తీక్. ఈ మాటలన్నీ స్వప్నకు కాకుండా దీపకు చెబుతున్నాను అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో దీప అందుకుంటుంది. ఆలోచించుకునేంత టైమ్ ఎక్కడుంది బాబు అని దీప అంటుంది. ఇదేంటి వీళ్లు ఏకంగా వీళ్ల పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారని జ్యోత్స్న షాక్ అవుతుంది.. నిలదీద్దామనుకుంటుంది కానీ డైరెక్ట్ అయ్యిపోతారని ఆగిపోతుంది. మరోవైపు శౌర్య సైకిల్ వి బ్రేక్ బోల్ట్ తీసేస్తుంది పారిజాతం. ఇక బ్రేక్స్ పడక పారిజాతాన్ని గుద్దేస్తుంది శౌర్య.‌ అప్పుడు శివన్నారయణ వచ్చి.. కొత్త సైకిల్ కి బ్రేకులు పడటం లేదేంటని గట్టిగా అడుగగా.. పారిజాతం తీసిన బోల్ట్ ని వెతికి తీసుకొచ్చి శౌర్య సైకిల్ కి బిగిస్తుంది. ఇంకెప్పుడు ఇలాంటివి చేయవద్దని పారిజాతంపై శివన్నారాయణ‌ మండిపడతాడు. తరువాయి భాగంలో దీపని పంపించెయ్యాలి. బావను సొంతం చేసుకోవాలి.. దీపని పంపించాలంటే ఎలా..‌నాకు ఎవరు సాయం చేస్తారనుకుంటూ జ్యోత్స్న అనుకుంటు ఉండగా నరసింహ ఎంట్రీ ఇస్తాడు. ఆ సమయానికి దీప తల నిమురుతూ ఉంటుంది అనసూయ. అది చూసి రగిలిపోతాడు నరసింహ. ఆ తర్వాత ఏం జరిగిందో‌ తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

భార్యకి మనసులో‌ మాట చెప్పగలడా.. ఆస్తుల కోసం అంతకు తెగించాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -194 లో..... ఫోటో షూట్ కి నందిని పంపిన సూట్ ని సీతాకాంత్ వేసుకొని రావడంతో తను చాల హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసావా ఇప్పటికైనా నా ప్రేమని నమ్ముతావా అని హారికతో అంటుంది.ఆ తర్వాత రామలక్ష్మి పెద్దాయన మాట్లాడుకుంటుంటే.. అప్పుడే మేనేజర్ వచ్చి అందరికి స్వీట్ ఇస్తుంటాడు. ఏంటి స్పెషల్ అని రామలక్ష్మి అడుగుతుంది. నందిని మేడం కి స్పెషల్ డే అంట అందుకే స్వీట్ ఇవ్వమన్నారని చెప్తాడు. ఆ తర్వాత నందిని హారికకి స్వీట్ ఇస్తూ.. ఎప్పుడు నువ్వు నా మంచి కోరుకుంటావ్.. అందుకే నా హ్యాపీ నెస్ ని నేను షేర్ చేసుకుంటున్నానని నందిని అంటుంది. ఇప్పుడు వెళ్లి సీతతో షేర్ చేసుకుంటామని నందిని స్వీట్ తీసుకొని వెళ్లి సీతాకాంత్ కి ఇస్తుంది. ఏంటి ఇప్పుడు స్వీట్ అనుకుంటున్నావా నాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉందని నందిని అంటుంది. నీ ఆనందంనికి కారణమని సీతా అడుగుతాడు. దానికి కారణం నువ్వే ఆ‌విషయం నాకు తెలుసు అని నందిని అంటుంది. కంపెనీలో అందరికి ఒక నెల బోనస్ ఇస్తానని నందిని అనగానే.. నేను కోల్పోయిన సంతోషం నాకు వచ్చింది అందుకే ఈ సంతోషం అని నందిని అంటుంది. ఆ తర్వాత నందిని సీతాకాంత్ కి థాంక్స్ చెప్పి వెళ్తుంది. మేడమ్ మీకెందుకు థాంక్స్ చెప్పిందని రామలక్ష్మి అంటుంది. అదే నాకు అర్థం అవడం లేదని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఫోటో షూట్ జరిగుతుంటే సీతాకాంత్ చెయ్యి పట్టుకుంటంది నందిని. దాంతో సీతాకంత్ చిరాకుగా వచ్చి.. రామలక్ష్మి నువ్వు వెళ్లి తనతో ఫోటో షూట్ చేయించు.. నువ్వు నాకు భార్యవి నాలో సగం.. ఇంకా యూనిట్ కి నీ పేరే కాబట్టి ప్రమోషన్ లాగా ఉంటుందని సీతాకాంత్ అనగానే.. సరేనని నందిని తో రామలక్ష్మి ఫోటో షూట్ చేయించుకుంటుంది. నందిని డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత పెద్దాయన సీతాకాంత్ ని పిలిచి.. రాత్రి రామలక్ష్మికి నీ మనసులో మాట చెప్పావా అని అడుగుతాడు.‌ లేదని సీతాకాంత్ అనగానే.‌. ఇప్పుడు తీసుకొని వెళ్ళి చెప్పమని పెద్దాయన సలహా ఇస్తాడు.రామలక్ష్మిని తీసుకొని సీతాకాంత్ బయటకు వెళ్తుంటారు. ఆ మాటలు సందీప్ వింటాడు. ఆ తర్వాత నందిని ఎదరుపడి ఎక్కడికి అంటుంది. మొక్కు తీర్చుకోవడానికి అని రామలక్ష్మి అనగానే.. ఇప్పుడు మీటింగ్ ఉంది సీతకాంత్ ఉండాలి.. నువ్వు వెళ్ళమని అంటుంది.‌ లేదు వెళ్తానని సీతాకాంత్ అనగానే మీటింగ్ కదా ఉండండి అని రామలక్ష్మి అంటుంది. రామలక్ష్మి ఒక్కతే వెళ్తుంది.‌ ఆ తర్వాత ఆస్తులు కంపెనీ సొంతం చేసుకోవాలని సందీప్ భావిస్తాడు. అన్నయ్య రామలక్ష్మి బయటకు వెళ్తున్నారు కదా అని కార్ బ్రేకులు ఫెయిల్ చేస్తాడు సందీప్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahamamudi : ఊహకందని ట్విస్ట్ లతో సాగుతున్న బ్రహ్మముడి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -507 లో......రాహుల్ ఏ తప్పు చెయ్యలేదని పోలీసులు రాహుల్ ని మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తారు. దాంతో రుద్రాణి రెచ్చిపోతు.. నా కొడుకు ఏ తప్పు చెయ్యలేదు విడిపించండని చెప్పినా కూడా ఎవరు నమ్మలేదు.. అసలు పట్టించుకోలేదని అందరిని కలిపి రుద్రాణి తిడుతుంటే.. ఆపండి రుద్రాణి గారు బయటకు వచ్చినంత మాత్రాన ఏ తప్పు చెయ్యలేదని కాదు.. తప్పు చేసాడని నేను నిరూపస్తానని కావ్య అనగానే రాహుల్ షటప్ అని గట్టిగా అరుస్తాడు. ఇప్పటి వరకు చేసిన ఫేక్ అలిగేషన్ లు చాలని కావ్యపై రాజ్ కోప్పడుతాడు. సారీ అత్త అని రుద్రాణికి రాజ్ చెప్తాడు. సారీ రాహుల్ అనగానే.. నన్ను అందరు ఒక దోషిలాగా చూసారు.. అత్తయ్య నన్ను కొట్టింది.. ఇక ఇంత జరిగాక నేను ఆఫీస్ కి వెళ్ళనని రాహుల్ కోపంగా వెళ్ళిపోతాడు. కంపెనీకీ పట్టిన దరిద్రం పోయింది.. నువ్వు అనవసరంగా ఫీల్ కాకు రాజ్ అని స్వప్న అంటుంది. ఆ తర్వాత సీతారామయ్య రాజ్ ని పిలిపిస్తాడు. నాకు ఎందుకో ఈ కుటుంబం ముక్కలు అవుతుందనిపిస్తుంది. ఆ రోజు ధాన్యలక్ష్మి ఆస్తులు ముక్కలు చెయ్యాలన్నప్పుడు నాకు బాధేసిందని సీతారామయ్య అనగానే.. మీరేం టెన్షన్ పడకండి తాతయ్య.. కుటుంబం ముక్కలు కాకుండా నేను చూసుకుంటానని సీతారామయ్యకి రాజ్ మాటిస్తాడు. ఆ తర్వాత ఇదంతా నువ్వే చేసావ్ కదరా.. అసలు ఎలా తప్పించుకున్నావని రాహుల్ ని రుద్రాణి అడుగుతుంది. ఇలాంటి సిచువేషన్ వస్తే ఏం చెయ్యాలో ముందే ఒకడిని సెటిల్ చేశా.. వాడు ఇప్పుడు నేనే చేసానంటూ వచ్చాడని రాహుల్ అనగానే.. ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావని రుద్రాణి మురిసిపోతుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది. ఇక నుండి నువ్వేం చేసిన నాకు చెప్పు.. నీవల్ల ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారని కావ్యకి రాజ్ చెప్తాడు. మరొకవైపు కళ్యాణ్ నిద్రపోతు అప్పు పక్కన లేకపోవడం గమనిస్తాడు. దాంతో కళ్యాణ్ టెన్షన్ పడుతాడు. అప్పుడే అప్పు పిజ్జా డెలివరీ చేసి వస్తుంది. ఇలా రాత్రి చెప్పకుండా వెళ్తావా అంటు కోప్పడతాడు.  ఆ తర్వాత కళ్యాణ్ ని అప్పు కళ్ళు మూసుకోమని చెప్పి.. కేక్ తీసుకొని వచ్చి ఆతనికి సర్ ప్రైజ్ ఇస్తుంది. బర్త్ డే కీ గిఫ్ట్ కూడా ఇస్తుంది. అది అతను కవితలు రాసేందుకు ఉపయోగపడుతుందని చెప్తుంది. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని అప్పుని హగ్ చేసుకుంటాడు కళ్యాణ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ తెలుగు రివ్యూ.. కంటెస్టెంట్స్ ఎవరెలా ఉన్నారంటే!

  బిగ్ బాస్ ఆదిలోనే హంసపాదం అన్నట్లు ఆదివారం కంటెస్టెంట్స్ మొహాలు చూసే సగం మంది ప్రేక్షకులకు గుండె ఆగినంత పనైంది. ఇక గత నెల రోజుల నుండి ఏ పాన్ ఇండియా మూవీకి లేనంత హైప్ క్రియేట్ చేస్తూ వచ్చారు మన బిగ్ బాస్ పెద్దలు. కానీ కంటెస్టెంట్ ఎంపిక లో ఫెయిల్ అయ్యారన్న విషయం స్పష్టంగా కన్పిస్తుంది. ఇంట్లోకి పంపిర్రో లేదో గ్యాప్ ఇవ్వకుండా.. ఎవరికి వారే స్క్రీన్ స్పేస్ కోసం ఎగబట్టారు. ప్రతి సీజన్లో ఒక ఎమోషనల్ స్టార్ ఉన్నట్లే ఇప్పుడు కూడా మన పర్ స్పెక్టివ్  ఎమోషనల్ స్టార్ నాగ మణికంఠ ఉండనే ఉన్నాడు. ఇక రతికని తలపించే స్లాగ్ ల్యాగ్ లతో కెమెరాకి ఫోకస్ చేస్తూ మన RGV బ్యూటీ సోనియా తనదైన కమాండింగ్ తో దూసుకెళ్తుంది. అంతో.. ఇంతో హౌస్ లో యాక్టీవ్ గా ఉందంటే నిఖిల్. యశ్మీ గౌడ అంటే మరో శోభాశెట్టిలా ఉంది. గౌతమ్ ఓమ్ హౌస్ లో మరొక పెద్దన్న అవుతాడనుకుంటే నిద్ర మత్తులో ఉన్నట్లు నాకేం సంబంధం లేదన్నట్లే ఉంటున్నాడు.. రాత్రి జరిగిన ఎపిసోడ్ లో జనాల నుండి సింపథీ గెయిన్ చెయ్యడానికి మణికంఠ చేస్తున్నాడనిపిస్తుంది. అయితే షోలో  ఎక్కువ శాతం మణికంఠనే ఉన్నాడు. బెబక్క ఇప్పుడు శాంతమూర్తిలాగే రియాక్ట్ అవుతుంది. ఇక మునుముందు కరాటే కళ్యాని లాంటి వాళ్ళు పూనుకుంటారేమో చూడాలి. బేబక్క కిచెన్ లో ఉన్నంత వరకు సేఫ్ అని భావించినట్టుంది.  శేఖర్ బాషాని హ్యాండిల్ చెయ్యడం హౌస్ మేట్స్ కి కష్టమే. ఓవర్ యాక్టింగ్ కాకుండా ఓకే పర్లేదు అన్నట్లున్నాడు. కిర్రాక్ సీత నావంతు వచ్చినప్పుడు నేను మాట్లాడుతా.. నన్ను గెలికితే ఊరుకోను అన్నట్లు ఉంటుంది. అభయ్ ఇప్పటివరకు అందరి దృష్టిలో పాజిటివ్ గా ఉండడంతో ఒక్క నామినేషన్ కూడా పడలేదు. అలా ఉండడం అతని రియాలిటీనో ఫేకో చూడాలి మరి. పృథ్వీరాజ్, నబిల్ ఆఫ్రిదీలు ఇంకా ఓపెనప్ అవలేదు. వాళ్ళిద్దరు ఉన్నవాళ్ళతో కలవలేకపోతున్నారు‌. ఇక ఈసారి జబర్దస్త్ నుండి కమెడియన్ ని ఎవరిని తీసుకోలేదు. బహుశా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తీసుకుంటారేమో చూడాలి. హౌస్ లో కామెడీ కూడా ఉండాలి కదా అని విష్ణుప్రియని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆమె ఎంట్రీతో ఆ లోటు అయితే ప్రేక్షకులకు లేదు. ఇప్పటికే విష్ణుప్రియ బయట ట్రోల్స్ తో ట్రెండింగ్ లో ఉంటుంది.  

మొదటివారం నామినేషన్ లో ఎవరున్నారంటే!

  బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. హౌస్ మేట్స్ మధ్య సాగిన హీటెడ్ కంటెస్టెంట్స్ మధ్య అరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు. వాళ్ళెవరో ఓసారి చూసేద్దాం..  సోనియా నామినేషన్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా మారింది. సోనియా మాట్లాడితే అవతలి వాళ్ళు సరిగ్గా డిఫెండ్ చేయలేకపపోతున్నారు. ఇక కిర్రాక్ సీత హౌస్ లో ఏం జరిగిందని వ్యాలిడ్ పాయింట్లతో నామినేట్ చేసింది. అలాగే అభయ్ నవీన్ కూడా హౌస్ లో ఎలా ఉండాలి.. పర్సనల్ విషయాలు ఇక్కడ అంత అవసరం లేదంటు చెప్పడంతో హౌస్ మేట్స్ క్లాప్స్ కొట్టారు. మణికంఠ తన మొదటి నామినేషన్ విష్ణుప్రియకి వేశాడు. లాంచింగ్ ఎపిసోడ్ అయిన రోజు తనలో ఫెమినిటీ ఉందంటూ విష్ణుప్రియ చెప్పడం తనకి నచ్చలేదని.. దాని వల్ల తనని బయట అందరూ ట్రోల్ చేసే అవకాశం ఉందంటూ మణికంఠ చెప్పాడు. ఇక ఈ విషయంలో విష్ణుప్రియ మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ నిన్ను చెక్ చేయడానికే ఈ థ్రీ డేస్ నీతో క్లోజ్‌గా ఉన్నానంటూ మణికంఠ తన అసలు రంగు బయటపెట్టాడు. "నువ్వు జెన్యూన్ అనుకున్నా కానీ నువ్వు నన్ను చెక్ చేయడానికి వచ్చావ్.. నేను నిన్ను చాలా నమ్మాను " అంటు విష్ణుప్రియ ఏడ్చింది. ఇక తర్వాత తన రెండో నామినేషన్ శేఖర్ బాషాకి వేశాడు మణికంఠ. వీళ్లిద్దరి మధ్య డిస్కషన్ నడుస్తుంటే ఎవడికి లేదయ్యా ఫ్లాష్ బ్యాక్.. ఓ వచ్చి ఏడ్చేసి.. దాన్ని నుంచి సింపథీ తెచ్చేసుకొని.. పాలిటిక్స్ క్రియేట్ చేస్తున్నావంటు శేఖర్ బాషా ఫైర్ అయ్యాడు. ఇక వీరిద్దరిలో శేఖర్ బాషాను సేవ్ చేసి విష్ణును నామినేట్ చేసింది యష్మీ.  ఆ తర్వాత పృథ్వీ తన నామినేషన్ ప్రక్రియని మొదలెట్టాడు. బేబక్కను మొదటిగా నామినేట్ చేయగా తర్వాత మణికంఠను నామినేట్ చేశాడు. నాకు పిరికివాళ్లు నచ్చరు.. దేనికైనా ఇలా ఏడ్చే వాళ్లు అసలే నచ్చరు.. నువ్వు సింపథీ గేమ్ ఆడుతున్నావ్.. నువ్వు ఓ నెగెటివ్ పర్సన్ అంటు పృథ్వీ నామినేట్ చేశాడు. ఇక వీరిలో మణికంఠను నామినేట్ చేసి బేబక్కను సేవ్ చేసింది నైనిక. ఇక హౌసగ లో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సోనియా,  బేబక్క, ,శేఖర్ బాషా, విష్ణు ప్రియ, పృథ్వీ, మణికంఠ మొత్తంగా ఈ వారం ఆరుగురు నామినేషన్లో ఉన్నారు.

మణికంఠని ఏకిపారేసిన అభయ్ నవీన్.. ‌హౌస్ మేట్స్ క్లాప్స్!

  బిగ్ బాస్ సీజన్-8 లో రోజుకో గొడవ‌, కంటెస్టెంట్స్ లోని రోజుకో కొత్త యాంగిల్ బయటకొస్తుంది. ఇక ఇప్పటికే హౌస్ లో కన్నడ డామినేషన్ అంటూ బయట జనాలు ఫీల్ అవుతున్నారు.  అభయ్ మొదటిగా మణికంఠను నామినేట్ చేశాడు. నీకు సారీ చెబుదామని వచ్చిన ఆదిత్య అన్నపై నువ్వు కోపపడ్డావ్.. ఒకసారి అయితే ఒకే కానీ మళ్లీ మళ్లీ అదే రిపీట్ చేశావ్ అంటూ తన పాయింట్ చెప్పాడు. అలానే నువ్వు హైపర్ అవుతున్నావ్.. ఎమోషనల్‌గా హై ఉన్నావ్.. అంటూ అభయ్ అన్నాడు. దీనికి నా బిహేవియర్ అలాంటిది అంటూ ఏదో కవర్ చేసుకోబోయాడు మణికంఠ. దీంతో ఎవడి ఫ్లాష్ బ్యాక్ లు ఇక్కడ అవసరం లేదు.. ఇక్కడ గేమ్ గురించి, హౌస్‌లో ఉన్న తీరు గురించే మాట్లాడతామంటూ అభయ్ అన్నాడు. దీనికి యష్మీ సహా కొంతమంది క్లాప్స్ కొట్టారు. దీంతో నేను అన్‌ఫిట్ అయితే నేనే వెళ్లిపోతా అంటూ మణికంఠ చెప్పాడు. ఇక తన రెండో నామినేషన్ బేబక్కకి వేశాడు అభయ్. ఇక వీరిద్దరిలో మణికంఠను నామినేట్ చేసింది యష్మీ. ఇక అభయ్ నవీన్ పాయింట్ ని మిగతా హౌస్ మేట్స్ వ్యాలిడ్ పాయింట్లుగా కన్సిడర్ చేసి ఫుల్ క్లాప్స్ కొట్టారు. మరి అభయ్ నవీన్ నామినేషన్ లో చెప్పిన పాయింట్లు కరెక్టేనా మీ పర్ స్పెక్టివ్ ఏంటి కామెంట్ చేయండి.

విష్ణుప్రియ నామినేషన్ డొల్ల... మణికంఠ సింపథీ కార్డు!

  బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ల పరంపర నిన్నటితో ముగిసింది. ఇక హౌస్ లో కొంతమంది ఫేవరెటిజం చూపిస్తున్నారని సోనియా, కిర్రాక్ సీత తమ నామినేషన్ లో చెప్పగా నిన్న విష్ణు ప్రియ, మణికంఠ నామినేషన్ ఆసక్తిగా సాగింది. శేఖర్ బాషా కాస్త లేజీగా ఉన్నారంటూ విష్ణు ప్రియ నామినేట్ చేసింది. అలానే కుక్కర్ విషయంలో బేబక్క తప్పు లేకుండా గొడవ పెట్టుకున్నావంటూ సోనియాను నామినేట్ చేసింది. దీనికి కాసేపు సోనియా గొడవ పెట్టుకుంది. ఇక తనతో వాదించి వేస్ట్ అనుకున్న విష్ణు సర్లే అని వదిలేసింది. ఇక వీరిలో శేఖర్‌‌ను నామినేట్ చేస్తూ యష్మీ డెసిషన్ తీసుకుంది. ఆ తర్వాత ప్రేరణ తన నామినేషన్ చెప్పడానికి వచ్చేసింది. మణికంఠ పెద్దగా ఎవరితోనూ కలవడం లేదు.. గొడవ పెట్టుకునేంత కాన్సట్రేషన్ అందరితో కలవడానికి పెట్టుకుంటే బావుండేదంటూ ప్రేరణ నామినేట్ చేసింది. అలానే ఇంకొన్ని పాయింట్లు కూడా చెబుతుంటే మణికంఠ తన కన్నీటి పర్యంతం మొదలెట్టాడు. నేను ఒక్కో పాయింట్‌కి ఆన్సర్ చేస్తా అండి.. నాకు అంత జ్ఞాపకశక్తి లేదండి.. నా పేరామీటర్ అయిపోయింది.. 7వ తరగతి నుంచి నానా కష్టాలు పడ్డా, నాన్నను పోగొట్టుకున్నాను.. స్టేప్ ఫాదర్ చేత అవమానాలు పడ్డా.. అమ్మ చనిపోయింది.. అమ్మ శవాన్ని కాల్చడానికి కట్టెల కోసం అడుక్కున్నా.. నా భార్య దూరమైంది.. నా కూతుర్ని దూరం చేస్తుందంటూ తన బాధలన్ని చెప్పుకుంటు.. ఏం తెలుసని క్లాప్స్ కొడుతున్నారంటూ మణికంఠ ఏడ్చేశాడు.  ఇక తన ఎమోషనల్ ప్లాష్ బ్యాక్ విని ప్రేరణ, యష్మీ, నైనిక, విష్ణుప్రియ అందరూ ఎమోషనల్ అయిపోయారు. ముఖ్యంగా చీఫ్‌ యష్మీ అయితే సీట్లో కూర్చొని వెక్కివెక్కి ఏడ్చేసింది.  ఇక ఆ తర్వాత ఇంత ఎమోషనల్ డ్యామేజ్ అవసరం లేదంటూ యష్మీ చెప్పుకొచ్చింది. మరి మణికంఠ నామినేషన్ లో మాట్లాడింది కరెక్టేనా.. అతని సింపథీ కార్డు ఫలిస్తుందా లేదా కామెంట్ చేయండి.  

Karthika Deepam2 : ఆస్తిపై కన్నేసిన జ్యోత్స్న.. పారిజాతానికి చెమటలు పట్టించిన దాస్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(Karthika Deepam2 ).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -141 లో .. పారిజాతం జ్యోత్సని లోపలికి పంపిస్తుంది. ఈ నిజం నాకు మాత్రమే తెలుసు.. నీకెలా తెలుసని పారిజాతం జ్యోత్స్నని అడుగుతుంది. నువ్వు అదంతా చెయ్యడం.. నేను చూసానని దాస్ అంటాడు. సుమిత్ర వదిన బిడ్డని మార్చడం చంపమని సైదులుకి ఇవ్వడం వాడు సాక్ష్యం లేకుండా వాడిని చంపించిడం అంత నా ముందే జరిగింది. నీకు తెలియని ఇంకో విషయం చెప్పనా.. సుమిత్ర వదిన కూతురిని సైదులు చంపలేదు బస్టాండ్ లో వదిలేస్తే ఒకతను తీసుకొని వెళ్ళాడు. ఆ బిడ్డ బ్రతికే ఉందని దాస్ చెప్పగానే.. పారిజాతానికి చెమటలు పడుతాయి. దాస్ ఈ విషయం ఇక్కడితో మర్చిపోరా అని పారిజాతం అంటుంది. నేను మర్చిపోను మొదలు పెట్టింది ముగించడానికి కాదు.. ఇన్ని కోట్లకి ఏకైక వారసురాలు ఆ బిడ్డ ఎక్కడ ఉందో కనిపెడతాను. తనతో నిజం చెప్తానని  దాస్ అంటాడు. దాంతో పారిజాతం ఇంకా టెన్షన్ పడుతుంది. వాడు అసలైన వారసురాలిని పట్టుకొని నిజం చెప్పేకంటే ముందు నేను రెండు పనులు చెయ్యాలి. ఒకటి కార్తీక్ జ్యోత్స్నల పెళ్లి.. రెండోది దీపని ఇంట్లో నుండి వెళ్లగొట్టడమని పారిజాతం అనుకుంటుంది. మరొకవైపు కార్తీక్ కి స్వప్న ఫోన్ చేసి మాట్లాడాలని అంటుంది. నేను దీపని తీసుకొని వస్తానని కార్తీక్ కి‌ స్వప్న చెప్తుంది. ఇప్పుడు దీప ఎందుకని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత నువ్వు అప్పుడు రెస్టారెంట్ లో కొట్టినప్పుడు నాపై ఎందుకు కోప్పడ్డావో.. కాశీని తిడితే నన్ను ఎందుకు తిట్టావో అర్ధం అయింది. దాస్ నా నాన్న కాశీ నా తమ్ముడు అని జ్యోత్స్న అంటుంది. కానీ నాకు వాళ్ళ లాంటి జీవితం వద్దు. నాకు ఇలాగే కావాలి. నేను ఈ ఆస్తిని వదులుకోలేను.. ఈ నిజం ఎవరికి తెలియద్దు అసలైన వారసురాలు బ్రతికే ఉందని అంటున్నారంటే తనకి నిజం తెలిసే లోపు.. నాకు కార్తీక్ భార్యగా స్థానం మాత్రం ఉంటుంది. లేకపోతే పనిమనిషి కూతురుగా మిగిలి పోతానని జ్యోత్స్న అంటుంది. నువ్వు సెటిల్ అయ్యాక.. మీ నాన్న కాశీలకు కొంచెం సెటిల్ చెయ్ అనగానే.. నో ఇప్పుడు వాళ్ళు ఏదో నా పేరెంట్స్ అని లేని ప్రేమని చూపించలేను. నువ్వు నాకు ఇలాంటి జీవితం ఇచ్చావ్ కాబట్టి నీ కోసం ఇస్తానని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న ఇల్లంతా చూసుకుంటూ వచ్చి హాల్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే సుమిత్ర జ్యూస్ తీసుకొని వస్తుంది. నేను మీ కూతురుని కాదని తెలిస్తే ఈ ప్రేమ ఉంటుందా అనుకుంటుంది. ఆ తర్వాత దశరథ్ ఈ కార్ నచ్చిందా అంటూ అడుగుతాడు. బాగుందని జ్యోత్స్న అంటుంది అయితే ఆర్డర్ పెడతానని అంటాడు. నేను మీ కూతురు కాదని తెలిస్తే కారు కూడా ఎక్కనివ్వరు.. నాకు ఈ ఆస్తి, బావ ఇంకా మీరు కూడా నాకు పేరెంట్స్గా కావాలని జ్యోత్స్న స్వార్థంగా ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఏది ఏమైనా కూడా ఈ ఆస్థికి నేనే వారసురాలని జ్యోత్స్న అనుకుంటు వస్తుండగా.. వెనకాల వస్తున్న దీపకి డాష్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సీతకి నాపై ప్రేమ...సందీప్, శ్రీలతల ప్లాన్.. 

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -193 లో.....నందిని తను పంపించిన సూట్ వేసుకొని వస్తాడని ఎదరుచూస్తుంది. హారికని కుడా తన వెంట ఉండమని చెప్తుంది. ఎంత సేపు ఇలా వెయిట్ చెయ్యాలి నాకు వర్క్ ఉందని హారిక అంటుంది. అయినా నేనే కంపెనీ చైర్మన్ ని చెప్తున్నాను.. అయిన ఇబ్బంది ఏంటని నందిని అంటుంది. సీతాకంత్ నువ్వు పంపిన సూట్ వేసుకుంటాడనుకుంటున్నావా తన భార్య అంటే ఇష్టం లేనిదే అతను తనతో ఉంటున్నాడా అని హారిక అంటుంది. నేను అంటేనే ఇష్టం ఖచ్చితంగా సూట్ వేసుకొని వస్తాడని నందిని కాన్ఫిడెన్స్ గా చెప్తుంది. ఒకవేళ వేసుకొని రాకుంటే వదిలేస్తావా అని హరిక అంటుంది. మరొకవైపు అందరు టిఫిన్ చేస్తుంటారు. శ్రీలత తినకుండా సైలెంట్ గా ఉంటుంది. తినండి అత్తయ్య అని శ్రీవల్లి అంటుంది. అది ఉండగా నన్ను ఎక్కడ తిననిస్తుందని శ్రీలత అంటుంది. అయిన పర్లేదు తినండి అని శ్రీవల్లి అనగానే.. శ్రీలత తినడానికి ఇడ్లీ పెట్టుకుంటుంటే అత్తయ్య అని రామలక్ష్మి అంటుంది. దాంతో శ్రీలత తినకుండా ఆగిపోతుంది. ఏంటి రామలక్ష్మి మా అమ్మని తిననివ్వడం లేదని సీతాకాంత్ అంటాడు. మీ అమ్మకి పూజభంగం అవుతుందని రామలక్ష్మి అనగానే.. అవునని శ్రీలత అంటుంది. ఆ తర్వాత వదిన.. ఎప్పుడు అన్నయ్య పక్కన కాదు మమల్ని కూడా పట్టించుకోమని సిరి అంటుంది. సీతాకాంత్ పక్కనే రామలక్ష్మి ఉండడం వల్లే కంపెనీ లాభంలో వెళ్తుందని పెద్దాయన అంటాడు. అవును రామలక్ష్మి కృషి చాలా ఉంది అందుకే యూనిట్ కీ తన పేరు పెడుతున్నానని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి కన్నా పెద్ద జాబ్ నీదే అయిన మిమ్మల్ని కాకుండా దాన్ని పొగుడుతూన్నారని సందీప్ తో శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత శ్రీవల్లి కోపంగా కావాలనే సీతాకాంత్ సూట్ పై సాంబార్ పడేస్తుంది. దాంతో చేంజ్ చేసుకుంటానని గదిలోకి వెళ్తాడు సీతాకాంత్. అప్పుడే రామలక్ష్మి నందిని పంపిన సూట్ ఇస్తుంది. పాపం రామలక్ష్మి తెచ్చిన సూట్.. ఇక లేట్ చెయ్యకూడదు.. ఇప్పుడే వేసుకుంటానని సూట్ వేసుకుంటాడు. మరొకవైపు  సందీప్, శ్రీవల్లిలు చాటుగా ఇడ్లీ తింటున్న శ్రీలత దగ్గరికి వస్తారు. ఆ తర్వాత వాళ్ళని అలాగే వదిలేస్తే ఆస్తిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అందుకే వాళ్ళని లేపేయ్యాలని శ్రీవల్లితో సందీప్ అంటాడు. మరొకవైపు సీతాకాంత్ సూట్ వేసుకొని రావడం చూసి నందిని హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసావా ఇప్పటికైనా సీతకి నాపై ప్రేమ ఉందని నమ్ముతావా అంటూ నందిని తన హ్యాపీనెస్ ని హారికతో షేర్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : ఒంటరిగా ఉన్న అపర్ణపై ఆ ఇద్దరి మాస్టర్ ప్లాన్ అదేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -506 లో.. రాహుల్ ని విడిపించమని ఇందిరాదేవి, సీతారామయ్యల దగ్గరకి వెళ్లి రిక్వెస్ట్ చేస్తుంది రుద్రాణి. రాహుల్ తప్పు చేసాడు.. అనుభవించనియ్ అన్నట్లు వాళ్ళు మాట్లాడతారు. ఈ విషయంలో మేమ్ ఏం చెయ్యాలేము.. ఎవరైనా చేస్తానన్న అడ్డుపడే వారిలో మేమ్ ముందుంటామని ఇందిరాదేవి అంటుంది. దాంతో రుద్రాణి డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తుంది. వాడు చిన్న తప్పు చేసినప్పుడు మందలిస్తే ఇంతదాకా వచ్చేవాడు కాదని రాజ్ అంటాడు. నా కొడుకు నిర్దోషి.. కోర్ట్ శిక్ష వెయ్యదని రుద్రాణి అంటుంది. కనీసం స్వప్న మొహం చూసి అయిన విడిపించమని రుద్రాణి అనగానే.. ఇప్పుడు ఏ అస్త్రం ప్రయోగిస్తున్నావంటూ అపర్ణ అక్కడికి వస్తుంది. నా కొడుకుని పోలీసులు తీసుకొని వెళ్తుంటే.. ఏం చేసావ్ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడవంటూ రుద్రాణిని అపర్ణ కోప్పడుతుంది. రాజ్ ని అపర్ణ తన వెంట తీసుకొని వెళ్తుంది. దాంతో రుద్రాణి కోపంగా ఇల్లు ముక్కలు చేస్తానంటూ ఆవేశపడుతుంది. ఆ తర్వాత రుద్రాణి స్వప్న దగ్గరికి వచ్చి నీ భర్త అక్కడ స్టేషన్ లో ఉంటే.. ఏం పట్టనట్లు మంచిగా బిర్యానీ తింటున్నావని అడుగుతుంది. నువ్వు ఉన్నావ్ కాబట్టి బిర్యానీ హాఫ్ తిన్నా లేకుంటే మొత్తం నేనే తినేదాన్ని అంటూ స్వప్న అంటుంది. మరుసటి రోజు ఉదయం మళ్ళీ పోలీసులు రాహుల్ ని తీసుకొని వస్తారు. ఏంటి ఇంటరాగేషన్ కా అని స్వప్న అంటుంది. రాహుల్ ఏ తప్పు చెయ్యలేదని తెలిసింది ఇతని పేరుతో వేరొకరు చేశారని తెలిసింది. అందుకే తీసుకొని వచ్చామని ఇన్‌స్పెక్టర్ అంటాడు. ఆ తర్వాత ఇక రుద్రాణి రెచ్చిపోయి.. నిన్న నా కొడుకు తప్పు చెయ్యలేదు అంటే ఎవరు నమ్మలేదు. అందరికి రిక్వెస్ట్ చేసాను.. ఎవరు రియాక్ట్ అవ్వలేదని రుద్రాణి అందరిని తిడుతుంది. ఆ తర్వాత కర్తవ్యం విజయశాంతిలాగా ఏదో సాధించాను అనుకున్నావని కావ్యని రుద్రాణి అంటుంది. బయటకి వచ్చాడని తప్పు చెయ్యలేదనుకోకు ఎలాగైనా దీన్ని గురించి కనుక్కుంటానని కావ్య ఛాలెంజ్ చేస్తుంది. ఆపమంటు కావ్యపై రాజ్ కోప్పడతాడు. తరువాయి భాగంలో అందరు గుడికి వెళ్ళాలనుకుంటారు. నేను రాలేనని అపర్ణ అంటుంది. నేను అత్తయ్యతో ఉంటానని కావ్య అంటుంది. ఆ తర్వాత ఇప్పుడు అత్తయ్యకి ఏదైనా అయితే అది కచ్చితంగా కావ్య మీదకి వస్తుందని రాహుల్ , రుద్రాణి ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.