వరద బాధతులకు ఆర్థిక సహాయం ప్రకటించిన తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్!

భారీ వర్షాలు, వరదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టంతో బాధపడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారికి అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సభ్యులు. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు తమ వంతు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో పాత్రికేయ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. నటుడు, నిర్మాత ప్రభాకర్  మాట్లాడుతూ.. "తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వరదల కారణంగా సర్వస్వం కోల్పోయారు. ఈ వరదలకు సంబంధించిన వార్తలు చూస్తున్నప్పుడు చాలా బాధగా అనిపించింది. వరద బాధితులను ఆదుకునేందుకు మన నాయకులు ఎంతో కష్టపడుతున్నారు. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా వంతు సహాయం చేయాలని అనుకున్నాం.  మా తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు గారితో మాట్లాడి సీరియల్స్ నిర్మించే ప్రతి ప్రొడ్యూసర్ తమకు చేతనైనంత విరాళం ఇవ్వాలని కోరాం. అందరూ సహృదయంతో స్పందించారు. తమకు వీలైనంత సాయం చేశారు. మేము గతంలో కరోనా టైమ్ లో కూడా సహాయ కార్యక్రమాలు చేశాం. ఇకపైనా సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ముందుకొస్తాం. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నాం." అన్నారు. శ్రీరామ్ మాట్లాడుతూ.. "వరదలతో మన తెలుగు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వారిని ఆదుకునేందుకు ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు మనం ఆ ప్రయత్నం పెద్ద ఎత్తున చేయగలమా అనే సందేహం కలిగింది. అయితే సహాయం అనేది ఎంత చిన్నదైనా సహాయమే అనిపించింది. ఒక్క కుటుంబాన్ని ఆదుకున్నా ఆదుకున్నట్లే అని మా ప్రెసిడెంట్ ప్రసాద్ రావు గారు అన్నారు. అలా ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కు మెసేజెస్ పంపాం. అందరూ రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు సీరియల్స్ ప్రొడ్యూస్ చేయని నిర్మాతలు కూడా తమ వంతు ఆర్థిక సహాయం ఇచ్చేందుకు ముందుకొచ్చారు." అన్నారు. తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సెక్రటరీ వినోద్ బాల మాట్లాడుతూ.. "తెలుగు ప్రజలు వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి టైమ్ లో మన అసోసియేషన్ ను ఎలాంటి సాయం చేయాలనే డిస్కషన్ వచ్చినప్పుడు మనం చేసేది సరిపోతుందా అనే సందేహాన్ని కొందరు వెలిబుచ్చారు. అయితే చినుకు చినుకు కలిస్తేనే ప్రవాహం అన్నట్లు మనం ఇచ్చే రూపాయి కూడా ఎవరో ఒకరికి చేరుతుందనే నిర్ణయం తీసుకున్నాం. అసోసియేషన్ లోని సభ్యులంతా స్పందించి ముందుకొచ్చారు. తమ వంతు విరాళం అందించినందుకు సంతోషంగా ఉంది. ఎలాంటి ప్రకృతి విపత్తులు ఎదురైనా మా వంతు అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నాం. మరికొంతమందికి సహాయం చేసేందుకు స్ఫూర్తిగా ఉంటుందనే ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించాం." అన్నారు.  తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు మాట్లాడుతూ.. "వరదల కారణంగా తెలుగు ప్రజలు కట్టుబట్టలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. వారిని చూస్తే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ స్పందిస్తారు. మా అసోసియేషన్ తరపున మేము కూడా మాకు వీలైనంత ఆర్థిక సాయం చేయాలని భావించాం. 260 మంది ప్రొడ్యూసర్స్ లో 60 మందే ఇప్పుడు యాక్టివ్ గా సీరియల్స్ చేస్తున్నారు. అయినా 5 వేల నుంచి 25 వేల వరకు మీకు తోచినంత విరాళం ఇవ్వాలని మా సభ్యులను కోరాం. వాళ్లంతా స్పందించారు. తోచినంత విరాళం ఇచ్చారు. ఈ డబ్బుకు మరికొంత మా అసోసియేషన్ ఫండ్ నుంచి యాడ్ చేసి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఎంత కలెక్ట్ అయితే అంత డబ్బు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు డొనేట్ చేస్తాం. ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ తీసుకుని ఆ చెక్ అందిస్తాం. 15 వేల మంది కార్మికులు టీవీ రంగంలో జీవనోపాధి పొందుతున్నారు. వారికి కరోనా టైమ్ లో రెండేళ్లు మా ప్రొడ్యూసర్స్ అంతా కలిసి అండగా నిలబడ్డాం. ఈ వరదల్లో కొందరు రాజకీయ నాయకులు బురద రాజకీయం చేస్తున్నారు. అలాంటివి మానుకోవాలని కోరుతున్నాం." అన్నారు.

బాల్స్ కోసం పృథ్వీతో గొడవకి దిగిన నిఖిల్.. చూస్తూ ఉండిపోయిన సోనియా!

  కెరటం, అంతులేని వీరులు, అఖండ.. ఏంటివని అనుకోకండి.‌ బిగ్ బాస్ సీజన్-8 లోని మూడు గ్రూప్ ల పేర్లు. హౌస్ లో మూడు టీమ్ లుగా డివైడ్ చేసి వారి మధ్య టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 8, Day 11 ప్రోమో వచ్చేసింది. ఇక ఈ సీజన్ లో అంతులేని ప్రైజ్ మనీని గెలుచుకునే అవకాశాన్ని ఇచ్చాడు బిగ్ బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో మొదటగా పూల్ టాస్క్(Pool Task ) ఇచ్చాడు. ఇక ఇందులో విష్ణుప్రియ మొదట స్విమ్మింగ్ పూల్ లోకి దూకింది‌. సెకెండ్ మణికంఠ దూకాడు. అయితే అందరు పరుగెత్తుకుంటూ వస్తున్నప్పుడు సోనియా పడిపోయింది. ఇక దానికి సోనియా ఎంత చేసిందో ఫుల్ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. ఇక మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. రెండో గేమ్ కలర్ బాల్స్(colour Balls).. ఇందులో నిఖిల్ , నబీల్, పృథ్వీ పోటీపడ్డారు. ఇక ముగ్గురి మధ్య పోటీ గట్టిగానే జరిగింది కాసేపటికి నబీల్ తాడుని వదిలేసినట్టు తెలుస్తుంది. ఇక పృథ్వీ, నిఖిల్ మధ్య బాల్స్ కోసం గట్టిగానే కుస్తీ జరిగినట్టుంది. బాల్స్ కోసం పృథ్వీతో నిఖిల్ గొడవ కు దిగగా.. అక్కడే ఉన్న సోనియా అలాగే చూస్తుండిపోయింది. ఎంతలా అంటే తను ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కానీ డైలామాలో ఉంది. ఎందుకంటే ఇద్దరికి తను బాగా క్లోజ్ అయ్యింది. ఒకరికి సపోర్ట్ చేస్తే మరొకరు హర్ట్ అవుతారు. మరి ఈ టాస్క్ లో ఎవరు గెలిచారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ ప్రోమోని చూసేయ్యండి.

బిగ్ బాస్ ఓటింగ్ పోల్స్ లో విష్ణుప్రియ టాప్.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే!

  బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ సెకెండ్ వీక్ టాస్క్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే వీరిలో నామినేషన్ లో ఉంది ఎనిమిది మంది. ఇక ఇప్పటి వరకు వీరిలో ఎవరికి ఎక్కువ ఓటింగ్ పడింది.. ఎవరు లీస్ట్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం... గత రెండు రోజుల నుండి సాగుతున్న ఓటింగ్ ప్రకారం.. విష్ణు ప్రియ 26 శాతం ఓటింగ్‌తో టాప్‌లో ఉంటే.. నిఖిల్ 24 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే గత వారం టాప్‌లో నిలిచిన మణికంఠ అనూహ్యంగా 15 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే రెండో వారంలో మణికంఠ నామినేషన్స్‌లో ఉండగా.. అతను శేఖర్ బాషా, నైనిక, పృథ్వీ, ఆదిత్య ఓం వీళ్లందరికంటే ఎక్కువ ఓట్లు సంపాదించగా ఇప్పుడు మణికంఠ 15 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. నైనిక 10 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. బాటమ్ లో ఎవరున్నారంటే.. పృథ్వీ, కిర్రాక్ సీత ఇద్దరు స్వల్ప తేడాతో ఉన్నారు. నువ్వు వెళ్తావా.. లేదంటే నన్ను వెళ్లమంటావా.. అన్నట్టుగా 6 శాతం ఓట్లతో సీత, పృథ్వీ పోటీపడుతున్నారు. అయితే పర్ఫామెన్స్ పరంగా చూస్తే.. రెండో వారంలో పృథ్వీ కంటే సీత చాలా బెటర్. అటు గేమ్‌ , ఇటు మాటకి మాట చెప్తూ కంటెంట్ ఇస్తూ తనేంటో ప్రూవ్ చేసుకుంటుంది. దీంతో పృథ్వీ కంటే ఎక్కువ ఓట్లు సీతకే పడే అవకాశం ఉంది. మరి బిగ్ బాస్ కూడా హౌస్ లో గర్ల్ వర్సెస్ బాయ్స్ సమానంగా ఉండేలా ప్లాన్ చేస్తే లీస్ట్ లో సీత ఉన్నా.. కూడా పృథ్వీనే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్క ప్రకారం చూస్తే పృథ్వీ ఈ వీక్ ఎలిమినేషన్ ఖాయమనిపిస్తోంది. మరి మీకేనపిస్తోందో కామెంట్ చేయండి.  

సోనియా కుళ్ళు.. నిఖిల్ కన్నీళ్ళు.. ఇదేం పత్తాపారం సామి!

  బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొ కంటెస్టెంట్ బిహేవియర్ కి బయట ఉన్న వాళ్ళకి మైండ్ పోతుంది. నిన్న మొన్నటిదాకా సోనియా, నిఖిల్ రాసుకొని తిరిగారు‌. నిన్నటి ఎపిసోడ్ లో దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారని చెప్పుకున్నారు.   అసలేం జరిగిందంటే.. హౌస్ లోని కంటెస్టెంట్స్ కి ఫుడ్ లేకుండా బిగ్ బాస్ అన్నీ లాగేసుకుంటే.. నిఖిల్ వాళ్ళకి ఫుడ్ లేదని సోనియా ఏడ్చేసింది. అయితే తను ఏడ్చిందానికి అసలు రీజన్ అదేనా అంటే కాదనే అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్, సోనియా మట్లాడింది టెలి కాస్ట్ చేశాడు బిగ్ బాస్. అందులో ఏం ఉందంటే.. నా వల్ల నీ గేమ్ డిస్టబ్ అవుతుందంటే నాతో నువ్వు ఉండకు.. నేను నీతో ఉండను అని సోనియాతో నిఖిల్ చెప్తాడు. ఆ తర్వాత హౌస్ లో ఫుడ్ కోసం ప్రతీ క్లాన్ నుండి ఒక్కొక్కరిని తీసుకొని గేమ్ ఆడించాడు‌ బిగ్ బాస్. ఈ టాస్క్ లల్లో గెలిచిన వారికే ఫుడ్ అని చెప్పడంతో అందరు పోటీపడి ఆడారు. ముందుగా యష్మీ టీమ్ గెలిచి రేషన్‌ను సొంతం చేసుకున్న వెంటనే సోనియా తెగ ఏడ్చేసింది. ఇంతకు గెలిచింది వాళ్ల టీమ్ ఏ అయినా సోనియా ఎందుకేడుస్తుందో ఎవరికి అర్థం కాలేదు. కానీ దానితో మనకేం సంబంధం ఓదార్పు ఇవ్వడమే ముఖ్యం అన్నట్లు వెంటనే సోనియాను దగ్గరికి తీసుకొని అభయ్ నవీన్ ఓదార్చాడు. ఇక సోనియా ఏడుస్తుందని తెలియగానే పరిగెత్తుకొని వచ్చాడు  సోనియా ప్రేమికుడు నిఖిల్. కానీ ఏం లేదు.. ఏం లేదు అంటూ నిఖిల్‌ని పక్కకి పంపేసి మరీ అభయ్ ఓదార్చాడు. ఇక తర్వాత నిఖిల్ కూడా కాసేపు ఓదార్చాడు.. తర్వాత పృథ్వీ కూడా సోనియాను ఓదార్చాడు. ఇలా ఎంతమంది ఓదార్చిన సోనియా కన్నీళ్ళు ఆగలేదు. ఆ తర్వాత  నిఖిల్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యాడు. మణికంఠ ఫుడ్ దొంగతనం చేద్దామని చెప్పిన నా వల్ల కాదని చెప్పేశాడు. మరి వీరి మధ్య ఏం జరుగుతుందో బిబి(Biggboss) ఆడియన్స్ కే తెలుస్తుంది.

అప్పుడు పల్లవి ప్రశాంత్.. ఇప్పుడు నిఖిల్!

  బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ నడుస్తోంది. అయితే అది అలాంటి ఇలాంటి లవ్ కాదు. వాడేసుకుని.. ఆడేసుకునే లవ్.. అర్థం కాలేదు కదా..మ్యాటర్ ఏంటంటే సీజన్ సెవెన్ లో పల్లవి ప్రశాంత్ మొదట రతికతో చిన్నగా లవ్ ట్రాక్ నడిపించాడు. అయితే అది పల్లవి ప్రశాంత్ ఆటని దెబ్బతీసింది. దాంతో అతను తొందరగా తన తప్పు తెలుసుకొని రతికని పక్కన పెట్టేసి గేమ్ మీద దృష్టి సారించి విజయం సాధించాడు. ఇక ఇప్పుడు అదే జరుగుతుంది. ఫస్ట్ వీక్ నామినేషన్ లో భాగంగా నిఖిల్ ని నామినేట్ చేసిన సోనియా ఆకులని చూసి అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకున్నారు‌. ఇక నిఖిల్ కాస్త స్ట్రాంగ్ గా ఉండేసరికి తనకి హెల్ప్ అవుతాడని తనతో చిన్నగా ప్రేమాయణం నడిపించింది సోనియా. చేతిలో చేయి వేసి మాట్లాడటం.. ఇద్దరే కూర్చుని కబుర్లు చెప్పుకోవడం.. ఇంకా సిగరెట్ మానేస్తే ఏది కావాలన్నా ఇస్తానని నిఖిల్ తో సోనియా చెప్పడం.. ఇదంతా చూసి నిఖిల్ తన ట్రాక్ లో వచ్చేశాడు‌. నిఖిల్ లో ఫస్ట్ వీక్ ఉన్నంత కాన్ఫిడెన్స్ ఈ వీక్ లేదనే చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే నిఖిల్ గేమ్ ని కన్ ఫ్యూజ్ చేయటానికే సోనియా ఇలా చేసిందా అని బిగ్ బాస్ అభిమానులు భావిస్తున్నారు. సెవెన్ లో‌ రతిక కూడా పల్లవి ప్రశాంత్ ని ఇలానే వాడుకోవాలని చూసింది. ఇప్పుడు  నిఖిల్ కూడా సోనియా ఖాతాలో బలి కానున్నాడా తెలియాల్సి ఉంది. అయితే సోనియా మాత్రం తను వేరేనంటూ చెప్పుకొచ్చింది. మొన్నటి ఎపిసోడ్ లో విష్ణుప్రియని పర్సనల్ గా తిట్టేసిన సోనియా.. నిఖిల్ తో అంత క్లోజ్ గా ఉంటే ఎవరేం అనుకోవడం లేదా అని ట్రోలర్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే నిఖిల్ తన గేమ్ ని స్టార్ట్ చేస్తాడా లేక సోనియా కోసం వీక్ అవుతాడా అనేది ముందు మందు చూడాలి మరి.  

బిగ్ బాస్ మణికంఠకి క్షమాపణలు చెప్పిన బ్రహ్మముడి కావ్య!

బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపిక రంగరాజు ఒక్కసారిగా వైరల్ అయ్యింది. దానికి కారణం బిగ్ బాస్ నాగ మణికంఠని కించపరిచేలా మట్లాడటమే.. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం. స్టార్ మాలో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షో వందో ఎపిసోడ్ ప్రోమోలో.. ఈ అమ్మాయి బదులు నేను ఉండి ఉంటే.. మస్త్ కంటెంట్ ఇచ్చేదాన్ని అని నీకు బిగ్ బాస్ 8‌లో ఎవర్ని చూస్తే అనిపించింది అని శ్రీముఖి ప్రశ్న కంప్లీట్ కాకుండా.. నిఖిల్.. నేను ట్రాన్స్‌పరెంట్‌గా ఉండలేనంటూ విగ్ తీసి.. మణికంఠను ఇమిటేట్ చేసి అతని ఎమోషన్‌ని దారుణంగా ట్రోల్ చేసింది బ్రహ్మముడి కావ్య. దాంతో అక్కడి వారంతా పగలబడి నవ్వారు.‌  బిగ్ బాస్ , ఆదివారం విత్ స్టార్ మా పరివారం రెండూ కూడా మా టీవీలోనే వస్తున్నాయి. తమ ప్రొడ్యూస్ చేస్తున్న షోలోని వారిపై తమే ట్రోల్ చేస్తే ఇంకా వేరే వాళ్లు ఎలా ట్రోల్స్ చేస్తారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దాంతో బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపిక తన తప్పేం లేదని పర్సనల్ గా ఓ వీడియోలో చెప్పింది. నేను షోకి వెళ్లినప్పుడు విగ్ తీసి చూపించాను. చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు.. చాలా కామెంట్స్ చేస్తున్నారు. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. నేను బిగ్ బాస్ హౌస్‌లో ఉండి ఉంటే.. ఎవరి ప్లేస్‌లో ఉంటే మంచి కంటెంట్ ఇచ్చేదాన్ని అన్నప్పుడు నాకు మణికంఠ విషయం గుర్తొచ్చింది. అతను విగ్ తీయడం గుర్తొచ్చింది. అప్పుడు నాకు సడెన్‌గా నేను కూడా బిగ్ బాస్ హౌస్‌లో ఉండి ఉంటే.. నేను కూడా ఇదే పని చేసేదాన్ని కదా అని అనిపించింది. ఎందుకంటే నేను కూడా విగ్స్ యూజ్ చేస్తాను కాబట్టి  సీరియల్‌లో కానీ.. బయట కానీ.. నాకు లుక్ క్రియేట్ చేయడానికి నాకు అంత జుట్టు లేదు. కాబట్టి విగ్స్ వాడుతున్నాను. కాబట్టి మణికంఠలా నేను కూడా విగ్ తీసేదాన్ని అని నాకు అనిపించింది. అందుకే శ్రీముఖి ఆ క్వచ్చన్ అడిగినప్పుడు అలా నా విగ్ తీసి చూపించాను.అంతేతప్ప.. మణికంఠని ట్రోల్ చేయడం కానీ.. ఎమోషనల్ డ్యామేజ్ చేయడం కానీ.. అతని ఎమోషన్స్‌తో ఆటలాడుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు. నాకు కరోనా తరువాత చాలా జుట్టు ఊడిపోయింది. కాబట్టి నేను విగ్స్ ఉపయోగిస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్‌లో కూడా నా విగ్ గురించి వీడియో పెట్టాను. అంతేతప్ప మణికంఠను ట్రోల్ చేయడానికి కాదు. విగ్ పెట్టుకునే వాళ్లని నేను ఎంకరేజ్ చేస్తున్నా. నేను అలా చేయడం వల్ల ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే నన్ను క్షమించండి అని చెప్పుకొచ్చింది దీపిక.

Karthika Deepam2: కార్తిక్ కి ప్రాణం పోసిన శౌర్య.. గుండెల్ని పిండేసే ఎపిసోడ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -147 లో... కార్తీక్ గురించి తెలిసి శౌర్య బాధపడుతుంది. నా కార్తీక్ కి ఏమైందంటూ ఏడుస్తుంటే.. దీప శౌర్యని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తుంది. దానికి కార్తీక్ బాబు అంటే ఇష్టమని తీసుకొని వెళ్తున్నావ్ కానీ దానికి ఉన్న జబ్బు గురించి నీకు తెలియదని అనసూయ అనుకుంటుంది. కార్తీక్ గురించి అందరు బాధపడుతుంటారు. బావ మాములుగా కావడానికి ఒక్క పర్సెంట్ ఛాన్స్ ఉంది కదా అని జ్యోత్స్న ఆశగా ఉంటుంది. అప్పుడే దీప శౌర్యని తీసుకొని దీప హాస్పిటల్ కి వస్తుంది‌. వాళ్ళని చూసి ఈ కాస్త కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని పారిజాతం అంటుంది. నేను కార్తీక్ ని చూడాలని శౌర్య అంటుంటే నిన్ను వెళ్లనివ్వనని పారిజాతం అంటుంది. దాంతో పారిజాతం చేతిని కోరికి మరి శౌర్య లోపలికి వెళ్తుంది. కోమాలోకి వెళ్తున్నాడని డాక్టర్ చెప్పగానే.. అందరు కార్తీక్ అంటూ పిలుస్తారు. ఎవరు పిలిచినా కార్తీక్ రియాక్ట్ కాడు.. శౌర్య వచ్చి కార్తీక్ అంటూ పిలవగానే మెల్లగా కదలడం చేస్తాడు. పాప పిలవగానే కదులుతున్నాడు.. తను స్పృహలోకి వస్తే ఇక ప్రాబ్లమ్ లేనట్టే నువ్వు పిలువు పాప అని డాక్టర్ అంటాడు. కార్తీక్.. కార్తీక్ అంటూ శౌర్య ఏడుస్తుంటే.. కార్తీక్ స్పృహలోకి వచ్చి రౌడీ అంటూ మాట్లాడతాడు. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాసేపటికి డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్తాడు. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్ళాక తన చుట్టూ అందరు ఉంటారు. దంతో మీరు ఇలా నన్ను జాలిగా చూస్తుంటే.. ఇబ్బందిగా ఉంది ప్లీజ్ ఇక్కడ నుండి అందరూ వెళ్లిపోండి నేనే వస్తానని కార్తీక్ అంటాడు. అందరు వెళ్ళిపోతారు. మీరేం మాట్లాడతారో నాకు తెలుసు.. అందుకే పంపించానని కార్తీక్ అనుకుంటాడు. అప్పుడే స్వప్న కాల్ చేసి.. మీ అడ్రెస్స్ పెట్టు.. దీప అంత చెప్పిందని అంటుంది. వద్దని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతంలు సుమిత్ర వాళ్ళ దగ్గరికి వెళ్లి పారిజాతం కొడుకు దాస్ తప్పు చేసాడని తాతయ్య పంపించాడు కదా.. తప్పు చేసిన వాళ్లకు ఇంట్లో స్థానం లేదన్నారు కదా మరి దీపకి ఎందుకు ఉందని సుమిత్రని అడుగుతుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆమెను చీరకొంగుతో చేతులు కట్టేసి.. ఏం చేశాడంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -198 లో.... సీతాకాంత్ మేనేజర్ దగ్గరికి నందిని వచ్చి సీతాకాంత్ కార్ కి డ్రైవర్ లేడన్న విషయం.. మీరు ఎందుకు పట్టించుకోలేదని అడుగుతుంది‌. రామలక్ష్మి గారు పెళ్లి చేసుకోకముందు సర్ కి డ్రైవర్ గా ఉన్నారు అంతే కాదు రామలక్ష్మి గారిది పర్ ఫెక్ట్ డ్రైవింగ్ అని మేనేజర్ చెప్తాడు. ఆ తర్వాత నందిని సీసీటీవీ ఫుటేజ్ కోసం సెక్యూరిటీ దగ్గరికి వెళ్తుంది. సీసీ టీవీ ఫుటేజ్ లో ఏం ఉండదు. ఆ తర్వాత రామలక్ష్మి డ్రైవింగ్ చేసిన కార్ రిపేర్ చేస్తున్న మెకానిక్ కి నందిని ఫోన్ చేసి కార్ కండిషన్ ఏంటని అడుగుతుంది. కార్ బాగుంది మేడమ్ కానీ ఎవరో కార్ బ్రేక్ కావాలనే కట్ చేశారని చెప్తాడు. ఆ తర్వాత నందిని కార్ పెట్టిన ప్లేస్ దగ్గరికి వచ్చి చూస్తుంది. అక్కడ వైర్ కట్ చేసే పరికరం దొరుకుతుంది. అది చూసి నిజమే ఎవరో కావాలనే ఇలా చేశారు.. సీతాని అలా చేయాలి అనుకున్నది ఎవరు? ఒకవేళ కార్ లో సీతా ఉంటే పరిస్థితేంటి? ఎలాగైనా కనుక్కోవాలని నందిని అనుకుంటుంది. మరొకవైపు స్వామి దగ్గరికి కావాలనే రామలక్ష్మి తీసుకొని వెళ్లిందా అని శ్రీలత ఆలోచిస్తుంది. అప్పుడే స్వామి దగ్గర ఉండే అతనికి శ్రీలత ఫోన్ చేసి సీతాకాంత్ వచ్చి ఏం మాట్లాడాడని అడుగుతుంది. వాళ్ళెప్పుడు కలకాలం పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలంటే మహా యాగం జరిపించాలని చెప్పాడని అతను చెప్తాడు. నేను విడగొట్టాలని ట్రై చేస్తుంటే మీరు కలిసి ఉండాలని పూజ చేస్తున్నారా అని శ్రీలత అనుకుంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి గదిలోకి వస్తుంది. గది అంతా చిందర వందరగా ఉండడం చూసి సర్దుతు ఉంటుంది. చేతికీ మళ్ళీ ఏదో తాకుతుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి.. ఏమైంది నిన్ను ఏ పని చెయ్యకూడదన్నాను కదా అని స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. అయిన రామలక్ష్మి వినదు. తన చీర కొంగుతో తన చేతులు కట్టేస్తాడు. నొప్పిగా ఉందంటే కట్టు విప్పుతాడు. నన్నే కట్టేస్తారా అంటూ రామలక్ష్మి అలిగి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కిందకి వచ్చి సీతాకాంత్ సర్ పై అలిగాను.. నేను ఇప్పుడు దాక్కుంటాను.. మీరు చెప్పకండి అని సిరి పెద్దాయనలతో రామలక్ష్మి చెప్పి సోఫా వెనకాల దాక్కుంటుంది. అప్పుడే రామలక్ష్మి అంటు సీతాకాంత్ కిందకి వస్తాడు. ఎక్కడికి వెళ్ళిందంటూ అడుగుతాడు. ఏమో మాకేం తెలుసు ఏమైందని సిరి అడుగుతుంది. కోప్పడ్డానని అలిగిందని అంటాడు. సిరి సైగ చేస్తూ రామలక్ష్మి వెనకలున్న విషయం చెప్తుంది. దంతో రామలక్ష్మిని వెళ్లి పట్టుకుంటాడు సీతాకాంత్. ఆ తర్వాత రామలక్ష్మి ఇంకా నా అలక తీరలేదంటూ పైకి వెళ్తుంది. అక్కడ సందీప్ శ్రీవల్లి, శ్రీలతలు రామలక్ష్మి గురించి మాట్లాడుకోవడం తను వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : ఇక సెలవంటూ వెళ్ళిపోయిన బ్రహ్మముడి కావ్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సిరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -512 లో.. రాజ్ ని రుద్రాణి రెచ్చగొడుతుంది. నీ వల్ల మా అమ్మ అలా అయింది.. తనకి ఏదైనా అయితే నిన్ను జీవితంలో క్షమించనని రాజ్ అనగానే ఏదైనా జరిగే వరకు ఈ దరిద్రాన్ని ఇంట్లో ఉండనిస్తావా.. ఇలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వొద్దని రుద్రాణి అనగానే.. ఏం మాట్లాడుతున్నావ్ రుద్రాణి.. తప్పు జరిగిందో పొరపాటు జరిగిందో.. కావ్య సంజాయిషీ ఇస్తుంది కదా అసలు వాడు ఆవేశంలో ఉంటే ఇలాంటి సలహాలు ఇస్తావని సుభాష్ కోప్పడతాడు. కావ్య తప్పు చేసింది కానీ రుద్రాణి మాటలు పట్టుకుని నువ్వు ఇలా ఆవేశపడడం కరెక్ట్ కాదు ఇంకా ఇలాంటివి జరగకుండా చూసుకుంటుందని ఇందిరాదేవి అంటుంది. అంత సింపుల్ గా ఎలా అంటున్నారని రాజ్ అంటాడు. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉండాలని రాజ్ అంటాడు. ఇదే మొదటి తప్పు అని కావ్యని క్షమించు.... కావ్య నీ దృష్టిలో మంచి అనుకున్నది.. వాడి దృష్టిలో చెడు అనుకుంటున్నాడు.. నువ్వు అయిన వాడిని క్షమించమని అడుగమని కావ్యతో ఇందిరాదేవి అనగానే.. నేనెందుకు అడగాలి.. అలా అడిగితే తప్పు చేసినట్టు అవుతుంది. నేను ఏ తప్పు చెయ్యలేదని కావ్య అంటుంది. ఇంతమందిలో తప్పు చేసావ్ జీవితంలో క్షమించను అంటుంటే నేను ఆత్మాభిమనం చంపుకుని క్షమించమని అడగాలా అని కావ్య అంటుంది. ఆడదానికి ఇంత అహంకారం ఎందుకని ధాన్యలక్ష్మి అంటుంది. ఈ క్షణమే దీన్ని బయటకు పంపిస్తానని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత నువ్వు ఎవరు నన్ను వెళ్లిపొమ్మనడానికి అని కావ్య రుద్రాణితో అంటుంది. నువ్వు చెప్తే నేనెందుకు వెళ్తాను. ఇప్పటికి నేను తప్పు చేసానని అయన అనుకుంటే వెళ్లిపోవడం న్యాయం, ధర్మం అనుకుంటే అప్పుడు ఆలోచిస్తాను.. వెళ్లిపొమ్మంటారా అని కావ్య అడుగుతుంది. అసలు బ్రతిమిలాడడం లేదంటు రాజ్ ని రుద్రాణి రెచ్చగొడుతుంది. ఇప్పుడు చెప్తున్నాను.. నువ్వు నా భార్యగా ఉండడానికి పనికి రావు.. ఈ ఇంటి కోడలిగా ఉండే అర్హత లేదు.. ఇంట్లోవాళ్ళ కోసం నిన్ను ఇన్ని రోజులు భరించానంతే తప్ప ప్రేమతో కాదని రాజ్ అనగానే కావ్య మనసు ముక్కలవుతుంది. ఇక మీ ప్రేమ కావాలి అని అడుక్కునే అవసరం నాకు లేదని కావ్య అంటుంది. తరువాయి భాగంలో ఈ ఇంట్లో నా పాత్ర ముగిసింది.. ఇక సెలవంటూ కావ్య ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కృష్ణ భగవాన్ కి ఏమయ్యింది..జబర్దస్త్ కొత్త జడ్జ్ గా శివాజీ

  జబర్దస్త్ షోకి కొత్త జడ్జ్ వచ్చాడు. అదేనండి కృష్ణ భగవాన్ ప్లేసులోకి హీరో శివాజీ వచ్చి కూర్చున్నాడు. ఈ వారం జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమో మొత్తం భలే ఫన్నీగా ఉంది. ఎందుకంటే ప్రతీ స్కిట్ లో శివాజీని టచ్ చేసే డైలాగ్స్ ఉన్నాయి.  కొన్ని రోజుల క్రితం వరకు  ఈ షోలో కమెడియన్ కృష్ణభగవాన్, ఇంద్రజ జడ్జిలుగా వ్యవహరించారు. ఐతే ఈ జబర్దస్త్ షో రూపు రేఖలు మార్చడంతో మొదట ఇంద్రజ ఇప్పుడు కృష్ణ భగవాన్ వెళ్లిపోయారు.   ఐతే ఇందులో శివాజీ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేసేశాడు. బులెట్ భాస్కర్ యాంకర్ రష్మీతో కలిసి డాన్స్ మంచి జోష్ తో వేసాడు. అదే ఫైమతో కలిసి చాలా స్లోగ చేసేసరికి శివాజీ అదే అడిగాడు. వెంటనే భాస్కర్ "పాలరాయికి, నాపరాయికి తేడా లేదా సర్" అని కౌంటర్ వేసాడు. దాంతో శివాజీ "నువ్వు మార్బుల్ అనుకుంటున్నావా" అన్నాడు. ఇక వెంకీ మంకీస్  స్కిట్ లో తన్మయ్ వేణుకు ముద్దులు, హగ్గులు ఇచ్చేసింది. వెంటనే షోకి కొత్తగా వచ్చిన జడ్జ్ శివాజీకి కూడా ముద్దులు, హగ్గులు ఇవ్వడానికి వెళ్లబోతుంటే "నేను నీ మొగుడినే" అన్నాడు వెంకీ. "నువ్వు నా ఒక్కదానికే మొగుడివి ఆయన ఆరుగురు టీమ్ లీడర్స్ కి మొగుడు" అనేసరికి శివాజీ పడీపడీ నవ్వాడు. చాలా ఏళ్ళ వరకు మూవీస్ కి గ్యాప్ ఇచ్చిన శివాజీ బిగ్  బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంకోపక్క #90s వెబ్ సిరీస్ చేసి ఇప్పుడు  జబర్దస్త్ జడ్జీగా వచ్చాడు. ఐతే ఇంతకు కృష్ణ భగవాన్ కి ఏమయ్యిందో అనే ఆందోళనలో ఉన్నారు ఆడియన్స్.

బిగ్ బాస్ అనేది వేస్ట్ షో... బేబక్క వీడియో వైరల్

  సోషల్ మీడియాలో బెజవాడ బేబక్క అంటే తెలియని వారుండరు. ఎందుకంటే కామెడీ పండించడంలో, సెటైర్స్ వేసి నవ్వించడంలో ఆమె తర్వాతే ఎవరైనా. జెంట్స్ లో కామెడీ యాంగిల్ కామన్ . కానీ లేడీస్ లో మాత్రం కొంచెం ఆ యాంగిల్ తక్కువగా ఉంటుంది. అలాంటి కామెడీ చేసే  కొందరిలో బెజవాడ బేబక్క ఎంతో ఫేమస్. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వారంలోనే ఎలిమినేట్ అయ్యి వచ్చేయడంతో ఆమె ఇంకా ఫేమస్ ఐపోయింది. దాంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది. ఆమె రీసెంట్ గా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. బిగ్ బాస్ వాళ్ళు మెరుపు తీగలా పని చేయమన్నారు అందుకే ఇలా వెళ్లి అలా ఆ హౌస్ నుంచి ఈ హౌస్ కి వచ్చేసాను అని చెప్పింది. అలాగే బయటకు వచ్చేసరికి 20 వేల మంది ఫాలోవర్లు కూడా పెరిగిపోయారని తెలిసి వాళ్లకు ఫ్లయింగ్ కిస్సులు కూడా ఇచ్చేసింది. ఎంత కాలం ఉన్నామన్నది కాదన్నయ్యా...ఎంత మంచిగా ఉన్నామన్నదే ముఖ్యం..హౌస్ లో అందరితో కలిసిపోయాను, మంచిగా అందరికీ వంట చేసి పెట్టాను. ఇలా బయటకు వచ్చేసాను. ఇక నుంచి మంచి వీడియోస్ తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అని చెప్పింది. దాంతో నెటిజన్స్ కూడా ఆమె వీడియో మీద కామెంట్స్ చేస్తున్నారు. "అదొక వేస్ట్ షో సిస్టర్.... మీరు ఫస్ట్ వచ్చి మంచి పని చేశారు..మీకు ఆ షో అసలు వేస్ట్. వచ్చావా అక్క నువ్వు లేవని కృష్ణమ్మ బాధతో పొంగిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో  ఉన్నంత చురుకు బిగ్ బాస్ లో లేకుండా పోయింది అక్క " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

నేను డాన్స్ చేస్తే గుర్రాలు కూడా విజిల్స్ వేస్తాయి

  శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ని వినాయక నిమజ్జనం వేడుకలను పురస్కరించుకుని డిజైన్ చేశారు. ఇందులో ఎన్నో సెగ్మెంట్స్ ని కూడా యాడ్ చేసారు. ప్రతీ ఏడాది మగవాళ్లే కదా వినాయక నిమజ్జనం  చేసేది కానీ ఈ ఏడాది మాత్రం ఆడవాళ్ళం చేస్తాం అంటూ లేడీస్ అంతా ఘాటుగా చెప్పేసారు. అలాగే  ఒకప్పుడు అనిత..అనితా అనే సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో..ఆ పాటని ప్రతీ లవర్  ఎంతలా ఆదరించారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ సింగర్ నాగరాజు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీదకు వచ్చి ఆ సాంగ్ ని మళ్ళీ పాడి వినిపించాడు. ఇక ఇంద్రజ ఐతే మాములుగా ఊగిపోలేదు. "ఇప్పటికీ నేను డాన్స్ చేస్తే కుర్రాళ్ళు విజిల్స్ వేస్తారు తెలుసా" అని చెప్పింది. ఇక రష్మీ కౌంటర్ వేసింది. "నేను డాన్స్ చేస్తే కుర్రాళ్ళు కాదు గుర్రాలు కూడా విజిల్స్ వేస్తాయి" అంటూ ఇద్దరూ కలిసి ఓ రేంజ్ లో డాన్స్ లు చేశారు. ఇక ఫైమా ఈ షోలో తన బలప్రదర్శన చూపించింది. ఆటో రాంప్రసాద్ ఆమె నెత్తి మీద ఒక గాజు సీసాను బద్దలా కొట్టాడు. అలాగే ఆమె చేతి మీద బల్బ్ ని పగలగొట్టాడు. ఇక ఫైమా ఐతే కుండల్ని బద్దలుకొట్టింది. ఇక రమ్యకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఢీ 17 విన్నర్ వర్షిణి రమ్యకృష్ణ గెటప్ లో వచ్చింది అలాగే ఆటో రాంప్రసాద్ రజనీకాంత్ గెటప్ లో వచ్చి నరసింహ మూవీలో ఒక బిట్ ని స్పూఫ్ గ చేసి చూపించాడు. ఇక ఇందులో క్యాష్ ప్రైజెస్ కూడా అనౌన్స్ చేసింది రష్మీ.  

Biggboss 8 Telugu:  యష్మీ కన్నింగ్ ప్లాన్.. నామినేషన్ లో ఉంది ఎవరెవరంటే!

  బిగ్ బాస్ హౌస్ లో సెకెండ్ వీక్ నామినేషన్ పూర్తయింది. ఇందులో మొత్తంగా ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు. నిఖిల్, ఆదిత్య ఓం, పృథ్వీ , విష్ణుప్రియ, కిర్రాక్ సీత , నాగ మణికంఠ, శేఖర్ బాషా, నైనిక, విష్ణుప్రియ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. కిర్రాక్ సీత, ప్రేరణ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ సెకెండ్ రోజు కూడా జరిగింది. ప్రతిదానికి డస్ట్ బిన్ డస్ట్ బిన్ అంటావ్ ఏంటి?? చిన్నదాన్ని పెద్దది చేస్తావ్ ఏంటని ప్రేరణ అడుగగా.. దానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తూ కరెక్ట్ పాయింట్ లాగింది సీత. మొన్న మీ టవల్‌ని పొరపాటుగా ఆదిత్య అన్న వాడుకున్నాడు. దానికి సారీ కూడా చెప్పాడు.. కానీ దాన్ని మీరు రచ్చ రచ్చ చేసి బిగ్ బాస్‌కి కంప్లైంట్ ఇచ్చారు.. కొత్త టవల్ తెప్పించుకున్నారు.. ఏ.. మీరు కూడా రచ్చ చేయకుండా.. ఆ టవల్‌ని ఉతుక్కుని వాడుకోలేకపోయారా? మీది ఇది పెద్ద ఇష్యూ అనిపించింది.. నాకు ఆ డస్ట్ బిన్ ఇష్యూ పెద్దగా అనిపించిందని అనేసరికి దెబ్బకి నోరు మూసేసింది ప్రేరణ. ఇక పృథ్వీని నబీల్, నైనిక నామినేట్ చేశారు. నిఖిల్ చీఫ్ గా ఫెయిల్ అయ్యావంటూ నబీల్ నామినేట్ చేశాడు. ఆదిత్య ఓంని అభినయ్ నవీన్ నామినేట్ చేసి.. అందరితో ఇంకా కలవాలని చెప్పి నామినేట్ చేశాడు.‌ ఇక నామినేషన్ లిస్ట్ లో ప్రేరణ ఉంది. కానీ విష్ణుప్రియ క్లైమాక్స్ లో ఆడ్ అయ్యింది. యష్మీకి ఉన్న స్పెషల్ పవర్ గురించి బిగ్ బాస్ చెప్పిన ఆ క్షణంలోనే తన బెస్ట్ ఫ్రెండ్ ప్రేరణను సేవ్ చేసింది యష్మీ. అలానే నామినేషన్లలో లేని విష్ణుప్రియను డైరెక్ట్‌గా నామినేట్ చేసింది. ఇక దీనికి రీజన్‌గా యష్మీ చెప్పిన విషయం వింటే బుర్రతిరిగిపోద్ది. వాళ్లు లక్సరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుండగా ఎవరైనా బాధపడుతున్నారని తెలిస్తే అది సరిగా ఎంజాయ్ చేయలేరట.. గేమ్‌పై కాన్సట్రేషన్ చేయలేరట.. ఈ కారణం చెప్పి విష్ణుప్రియని నామినేట్ చేసింది యష్మీ. దీంతో ఈ వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నామినేషన్ తో యష్మీ , ప్రేరణ, నిఖిల్, పృథ్వీ అంతా ఒక్కటే అని తెలుస్తోంది. మరి మీకేమనిపిస్తోందో కామెంట్ చేయండి.  

Karthika Deepam2 : నీలాంటి నష్టజాతకురాలిని చూడలేదు.. చావు బ్రతుకుల్లో కార్తీక్!

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -146 లో... కార్తీక్ ని నరసింహా కత్తితో పొడిచాడని తెలియగానే.. అందరు హాస్పిటల్ కి వస్తారు. డాక్టర్ బయటకు వచ్చి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది బ్లడ్ చాలా పోయింది.. సేమ్ గ్రూప్ అయితే బ్లడ్ ఇవ్వండి అని డాక్టర్ చెప్తాడు. జ్యోత్స్న నీది కార్తీక్ ది సేమ్ గ్రూప్ కదా అని అనగానే.. నేను డ్రింక్ చేసి ఉన్నా.. ఆ విషయం తెలిస్తే, ఆ చెంప ఈ చెంప వాయిస్తారని జ్యోత్స్న అనుకొని మొన్నే.. మా ఫ్రెండ్ కి బ్లడ్ ఇచ్చానని చెప్తుంది. ఆ తర్వాత నాది అదే బ్లడ్ నేను ఇస్తానని దీప అంటుంది. సరేనని అనగానే లోపలికి వెళ్లి బ్లడ్ ఇస్తుంది. మరొకవైపు అసలు నువ్వు ఏ బ్లడ్ ఇవ్వలేదు.. కదా ఎందుకు అబద్దం చెప్పావని జ్యోత్స్నని పారిజాతం అడుగుతుంది. అవును నేను డ్రింక్ చేసానని జ్యోత్స్న అంటుంది. నీలాంటి నష్టజాతకురాలిని చూడలేదు. ఈ ఇంటికి అసలు వారసురాలు కాదని నీకు తెలుసు.. అసలు వారసురాలు బ్రతికే ఉందని తెలుసు.. ఇక రెండు రోజుల్లో పెళ్లి ఎలా జరిగుతుంది. బ్లడ్ నువ్వు ఇచ్చి ఉంటే సింపథీ ఉండేది. ఇప్పుడు బ్లడ్ ఇచ్చి దీప దేవత అయిందని జ్యోత్స్నని పారిజాతం తిడుతుంది. ఆ తర్వాత కాంచన దీపకి థాంక్స్ చెప్తుంది. ఎందుకు థాంక్స్ చెప్తున్నావ్.. అసలు దీనికి కారణం ఆ దీప అని శ్రీధర్ అంటాడు. అసలు ఈవిడ గనుక లేకుంటే ఇంత దూరం వచ్చేది కాదు‌ కదా.. ఎవరు ఈ దీప, నరసింహా అని శ్రీధర్ అంటాడు. శ్రీధర్ అన్న మాటలకి దీప ఏడుస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళు దీప అని సుమిత్ర పంపిస్తుంది. దీప ఇంటికి వెళ్లి అనసూయకి జరిగింది చెప్తుంది. అప్పుడే శౌర్య కూడా వింటుంది. ఏమైంది కార్తీక్ కి అని శౌర్య ఏడుస్తుంది. నేను కార్తీక్ ని చూడాలంటూ శౌర్య ఏడుస్తుంటే.. ఇక దీన్ని ఆపలేమంటు శౌర్యని తీసుకొని దీప హాస్పిటల్ కి వెళ్తుంది. దాని గురించి అసలు నిజం నీకు తెలియదని అనసూయ అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : మహాయాగాన్ని సీతాకాంత్ పూర్తిచేయగలడా.. ఆమె కనిపెట్టేసిందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -197 లో....రామలక్ష్మికి ఆక్సిడెంట్ చేయించింది నువ్వేనా అని నందినిని హారిక అడుగుతుంది. నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా.. నేను అంత ఘోరంగా ఆలోచిస్తే ఇప్పుడే సీతాని సొంతం చేసుకునేదాన్ని కానీ నేను సీతాని ఇష్టంగా తను కూడా నన్ను ఇష్టంగా ప్రేమించలని అనుకుంటున్నానని నందిని బాధపడుతుంది. అసలు ఆ ఆక్సిడెంట్ ఎలా అయింది. ఎవరు చేసారో కనిపెట్టి సీతాకీ నేనేం తప్పు చెయ్యలేదని నిరూపించాలని నందిని అనుకుంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి పెద్దాయన వచ్చి.. అసలు రామలక్ష్మి ఆక్సిడెంట్ ఎలా అయిందని అడుగుతాడు. సీతకాంత్ పెద్దాయనని పక్కకి తీసుకొని వెళ్లి నందిని గురించి చెప్తాడు. నందిని కావాలనే ఇలా చేసింది. నన్ను రామలక్ష్మిని దూరం చెయ్యాలని అనుకుంటుంది. ఒక్కప్పుడు లవ్ చేసింది రిజెక్ట్ చేశాను.. తను అనుకున్నది సాధించడానికి ఎంత దూరం అయినా వెళ్తుందని సీతాకాంత్ అంటాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటని పెద్దాయన అడుగుతాడు. త్వరలోనే వేరే పెట్టుబడి పెట్టె కంపెనీస్ రప్పించి నందినితో ఉన్న కంపెనీ రిలేషన్ ఆపేస్తానని సీతాకాంత్ అంటాడు. మరొకవైపు రామలక్ష్మి నిద్ర లేచి అసలు అత్తయ్య ఈ పని చేసి ఉండకపోవచ్చు.. తను చెస్తే తన కళ్లలో భయం కలిగేదని రామలక్ష్మి అనుకుంటుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి గుడికి వెళదామని రామలక్ష్మితో అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు గుడికి వెళ్తారు. స్వామి దగ్గరికి వెళ్తారు. నువ్వు మొక్కు తీర్చుకోమని  రామలక్ష్మిని సీతాకాంత్ పంపిస్తాడు. జరుగుతున్న సిచువేషన్ గురించి సీతాకాంత్ స్వామికి చెప్తాడు. మీరు మహాయాగం చెయ్యాలని చెప్తాడు. ఏ పరిస్థితిలోనైనా ఆ యాగం ఆగకుండా చూసుకోండని స్వామి చెప్పగానే సీతాకాంత్ సరే అంటాడు. ఆ విషయం రామలక్ష్మికి చెప్పగా తను కూడ సరే అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. యాగం గురించి ఇంట్లో చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : నీ తప్పు వల్ల మా అమ్మ ప్రాణాలతో పోరాడుతుంది!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -511 లో.. కళ్యాణ్ హాస్పిటల్ కి వస్తాడు. అమ్మకి ఏం కాదురా.. రేపు మనతో మాట్లాడుతుందని రాజ్ ఎమోషనల్ గా మాట్లాడతాడు. నాకు అన్నయ్యని చూస్తుంటే భయమేస్తుంది. మీరు అన్నయ్యని తీసుకొని ఇంటికి వెళ్ళండి పెద్దనాన్న.. నేను పెద్దమ్మ దగ్గర ఉంటానని కళ్యాణ్ అంటాడు. వాడిప్పుడు వచ్చే సిచువేషన్ లో లేడని సుభాష్ అంటాడు. అన్నయ్య పెద్దనాన్నని తీసుకొని ఇంటికి వెళ్ళు.. తనకి టెన్షన్ గా ఉందట.. పెద్దమ్మ గురించి కాదు పెద్దనాన్న గురించి కూడా ఆలోచించమని రాజ్ తో కళ్యాణ్ అనగానే.. నువ్వు ఇక్కడే ఉండు డాడ్ ని దింపేసి వస్తానని అంటాడు. మరొకవైపు అందరు ఇంట్లో అపర్ణ గురించి బాధపడుతుంటారు. రుద్రాణి, రాహుల్ లు ఇదే కరెక్ట్ టైమ్.. ఇప్పుడే కావ్యని అందరి దృష్టిలో బ్యాడ్ చెయ్యాలని రాహుల్ అంటాడు. చేస్తాను రాజ్ చేతే కావ్యని గెంటేలా చేస్తానని రుద్రాణి అంటుంది. అప్పుడే రాజ్, సుభాష్ లు ఇంటికి వస్తారు. అపర్ణ ఎలా ఉందని ఇందిరాదేవి అడుగుతుంది . చూసారా కదా అంటు రాజ్ కోప్పడతాడు. ఎవరినో నమ్మి తప్పు చేసానని రాజ్ అనగానే.‌. తప్పు నువ్వు చెయ్యలేదు. ఈ కావ్య చేసిందంటు రాజ్ ని రెచ్చగొట్టేలా రుద్రాణి మాట్లాడుతుంది. రుద్రాణి గారు టైమ్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాకండి అని కావ్య అంటుంది. అందరికి మాట్లాడే ఛాన్స్ ఎందుకు ఇస్తున్నావ్.. అసలు అపర్ణని వదిలి ఎక్కడికి వెళ్ళావని ఇందిరాదేవి అడుగుతుంది. ఎవరో ఒకతను కంపెనీలో ఫ్రాడ్ జరుగుతుంది. అది కూడా రాహుల్ చేస్తున్నాడు.. మీరు రాకపోతే కంపెనీ పరువు పోతుందన్నారు.. అందుకే వెళ్ళాను.. అత్తయ్య గారు వెళ్ళమంటేనే వెళ్ళానని కావ్య అంటుంది. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది. అది ఫేక్ కాల్ అని కావ్య చెప్తుంది. ఎంత బాగా కథ అల్లావని రుద్రాణి అంటుంది. రుద్రాణికి కావ్య సమాధానం చెప్తుంటే షటప్ అని రాజ్ కావ్యపైకి అరుస్తాడు. నీకెందుకు కంపెనీ? ఏం అయితే నీకెందుకంటూ కావ్యపై రాజ్ విరుచుకుపడతాడు. నువ్వు తప్పు చేసావ్.. నీ తప్పు వల్ల మా అమ్మ ప్రాణాలతో పోరాడుతుంది. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే మాత్రం.. నిన్ను జీవితంలో మాత్రం క్షమించనని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

Kirrak seetha : ప్రేరణ నోరు మూయించిన కిర్రాక్ సీత!

బిగ్ బాస్ హౌస్ లో సెకెండ్ వీక్ నామినేషన్ ఇంకా పూర్తి కాలేదు. నిన్నటి ఎపిసోడ్ లో సగమే చూపించగా.. నేడు సెకెండ్ డే నామినేషన్ కి సంబంధించిన ప్రోమోని వదిలారు.  ఇక రెండో రోజు కూడా ఈ నామినేషన్స్ హీట్ కొనసాగుతుంది. మణికంఠను పృథ్వీ నామినేట్ చేశాడు. నిఖిల్ టీమ్ లో ఉంటూ.. నైనికతో తన టీమ్ లో చేర్చుకోమని అడగడం.. గోతులు తవ్వుతున్నట్టుగా అనిపించిందని మణికంఠని పృథ్వీ నామినేట్ చేశాడు. ఆ తర్వాత నిఖిల్‌ని ప్రేరణ నామినేట్ చేసింది. ప్రతిదానికి డస్ట్ బిన్ డస్ట్ బిన్ అంటావేంటి.. చిన్నదాన్ని పెద్దది చేస్తావేంటని ప్రేరణ అడుగగా.. మొన్న మీ టవల్‌ని పొరపాటుగా ఆదిత్య అన్న వాడుకున్నాడు. దానికి సారీ కూడా చెప్పాడు.. కానీ దాన్ని నువ్వు రచ్చ రచ్చ చేసి బిగ్ బాస్‌కి కంప్లైంట్ ఇచ్చావు.. కొత్త టవల్ తెప్పించుకున్నావు.. నువ్వు కూడా రచ్చ చేయకుండా ఆ టవల్‌ని ఉతుక్కుని వాడుకోలేకపోయారా.. మీకు ఇది పెద్ద ఇష్యూ అనిపించింది.. నాకు ఆ డస్ట్ బిన్ ఇష్యూ పెద్దగా అనిపించిందని కిర్రాక్ సీత అనేసరికి ప్రేరణకి నోట మాట రాలేదనే చెప్పాలి.  వందమంది నా ముందుకొచ్చి ఇది తప్పు అని చెప్తే.. నాకు అది రైట్ అనిపిస్తే అది రైటే అని చెప్తానంటు సీత స్ట్రాంగ్ గా చెప్పేసింది. ఇక నిఖిల్ ని నబీల్ ఆఫ్రీది నామినేట్ చేసాడు. ఛీఫ్ గా నువ్వు ఫెయిల్ అయ్యావంటూ నబీల్ నామినేట్ చేయగా.. నేను ఎంత చీఫ్ అయినా వాళ్ల పర్సనల్స్ వాళ్లకి ఉంటాయి. ఈరోజు సోనియాతో వచ్చింది.. రేపు ఇంకొకరితో వస్తుంది.. ఐ డోన్ట్ కేర్ అని నిఖిల్ అన్నాడు. ఈ ప్రోమోని బట్టి చూస్తే ఈ వారం మొత్తం ఏడుగురు దాకా నామినేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రోమో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.  

సిగరెట్ మానేస్తే నీ కోరిక తీరుస్తా.... హౌస్ లో ప్రేమజంట ఎవరంటే!

  బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ పదమూడు మంది. వీరిలో నిఖిల్, ప్రేరణ, యష్మీ , పృథ్వీ కన్నడ బ్యాచ్.. వీరందరు బయటే కలిసి మాట్లాడుకున్నారని లోపల ఉన్నవాళ్ళకి అర్థమయింది . అందుకే సీత మొన్న నామినేషన్ లో అదే మాట అంది. సీత హౌస్ లో ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కాబట్టి తనకి అర్థమవుతుంది. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్ లో యష్మీ ఛీఫ్ గా ఉన్నప్పుడు ప్రేరణని ఎవరో నామినేట్ చేస్తే తనని సేవ్ చేసింది. ఇక ఈ వారం నామినేషన్ లో ప్రేరణని సీత నామినేట్ చేయగా యష్మీ కి ఉన్న స్పెషల్ పవర్ యూజ్ చేసి తనని కాపాడిందంటూ  ఇన్ స్టాగ్రామ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక సోనియా కమాండింగ్ స్ట్రాటజీని వాడుతూ హౌస్ లోని వాళ్ళని మాట్లాడకుండా చేస్తుంది. నామినేషన్ లో సీత, విష్ణుప్రియలని మాట్లాడకుండా చేస్తూ తన మాటనే నెగ్గేలా చేసుకుంటుంది. ఇక నిన్నటి నామినేషన్ లో విష్ణుప్రియని పర్సనల్ గా అంటు ఎమోషనల్ డ్యామేజ్ చేసింది. గత సీజన్ లో శోభాశెట్టి, రతిక కూడా వ్యాలిడ్ పాయింట్ లేకపోయిన అవతలి వాళ్ళని తమ మాటలతో డిఫెండ్ చేసుకునేవారు. దానివల్ల అవతలివాళ్ళకి మాట్లాడే అవకాసం ఉండేది కాదు. ఇప్పుడు సోనియా కూడా అదే ఫాలో అవుతుంది. ఇక హౌస్ లో నిఖిల్ తో లవ్ ట్రాక్ నడిపిస్తోంది సోనియా. నిన్నటి ఎపిసోడ్ లో .. ' నిఖిల్ నువ్వు సిగరెట్లు మానేస్తే నీకు ఏం అడిగినా  ఇస్తాను' అని సోనియా అంది. ఇక చేతిలో చేయి వేసి, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఏదో ఏదో మాట్లాడుతుంది సోనియా. అంటే హౌస్ లో లీడర్ గా ఉన్నాడు కాబట్టి అతని మాట అందరు వింటారని, ఒకవే

నీకు ఫ్యామిలీ లేదేమో నాకు ఉందంటూ విష్ణుప్రియపై నోరుజారిన సోనియా!

  బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నామినేషన్ ల హవా సాగింది‌. ఇందులో కిర్రాక్ సీత, సోనియా మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరుగగా.. శేఖర్ బాషాకు ఆదిత్య ఓం కి మధ్య కోల్డ్ వార్ సాగింది. ఇక ప్రతీది పాయింట్ టూ  పాయింట్ మాట్లాడే అభయ్ నవీన్ మొదటిసారి రాంగ్ పర్సన్ ని నామినేట్ చేసాడని, తను చెప్పిన రీజన్ కూడా వ్యాలిడ్ లేదని స్పష్టమవుతుంది. ఆదిత్య ఓం ఎమోషనల్ అయ్యాడు. మన పర్ స్పెక్టివ్ సెంటిమెంట్ స్టార్ మణికంఠ ఎప్పటిలాగే ల్యాగ్ నామినేషన్ చేయగా.. ప్రేరణ, కిర్రాక్ సీత మధ్య ఇంకా ఆ చెత్తబుట్ట టాపిక్కే సాగుతుంది. ఇంకా హౌస్ లో నామినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే విష్ణుప్రియ మాట్లాడిన ప్రతీది వ్యాలిడ్ అనిపించింది‌. కానీ సోనియా ఆకుల నోరుజారింది. అసలేం జరిగిందంటే సోనియాను విష్ణుప్రియ నామినేట్ చేసింది. లాస్ట్ వీక్ జరిగిన నిఖిల్ ఇష్యూ గురించి రెయిజ్ చేస్తూ నేను అన్న దానికి సారీ చెప్పా.. కానీ నాపైన అడల్ట్రీ అనే ముద్ర వేశారు మీరు.. దానికి నాకు సారీ చెప్పలేదంటూ విష్ణుప్రియ అడిగింది. నీకు అది కామెడీ ఏమో కానీ నాకు కాదు.. మన ఇద్దరి మధ్య ఆ ర్యాపో లేదు.. నాకు అది అడల్ట్రీనే అంటూ సోనియా చెప్పింది. అసలు మీ దృష్టిలో నేను ఏం అడల్ట్రీ (18 ప్లస్) జోక్స్ వేశా అంటూ విష్ణుప్రియ అడిగితే.. మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేంత గొప్పదాన్ని కాదని‌ సోనియా అంది. మీరు ఒకళ్లే తెలివైనోళ్లు కాదు.. పిల్ల బచ్చా జోకులేసుకునే దాన్ని అడల్ట్రీ అని ఎట్లా అంటారంటూ విష్ణుప్రియ అనేసరికి బరాబర్ ఇప్పుడు కూడా అంటా అంటు మరోసారి సోనియా అదే మాట అంది. నీకు ఫ్యామిలీ లేదేమో నాకు ఉంది. నన్ను చూస్తారంటూ విష్ణుప్రియని హేళన చేసింది సోనియా. ఇక ఈ మాటలని ట్విట్టర్ లో హాష్ ట్యాగ్ విష్ణుప్రియ పేరుతో ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. నామినేషన్ కరెక్ట్ పాయింట్ మాట్లాడిన విష్ణుప్రియని ఇలా నోటికొచ్చినట్టు మాట్లడటమేంటని సోనియాపై మండిపడుతున్నారు నెటిజన్లు.