Eto Vellipoyindhi Manasu : భర్తని కొంగున కట్టేసుకున్న భార్య.. అత్త చూసి షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -186 లో......రామలక్ష్మి నందినికి ఫోన్ చేసి అందరం కలిసి భోజనం చేద్దాం రమ్మని అంటుంది. దాంతో నందిని ఒకేసారి అని భోజనానికి వస్తుంది. అప్పుడే రామలక్ష్మి వాటర్ ఉండడంతో జారీ పడిపోతుంటే అప్పుడే సీతాకాంత్ పట్టుకుంటాడు. అప్పుడే నందిని వచ్చి.. వాళ్ళను చూస్తుంది. మీ మధ్యలో నేనేందుకని నందిని అంటుంది. మీరు మా వాళ్ళే అంటూ ముగ్గురికి రామలక్ష్మి భోజనం వడ్డీస్తుంది. సీతా వాలకం చూస్తుంటే రామలక్ష్మి అంటే ఇష్టం లేనట్లుంది అందుకే కదా నేను నా ప్రేమతో దగ్గర అవ్వాలనుకుంటున్నానని నందిని అనుకుంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి ప్లేస్ లో నందిని ఉన్నట్లు ఊహించుకుంటుంది. మరొకవైపు ఉప్పు ఎక్కువున్న వంటలన్ని శ్రీవల్లి, శ్రీలతలు వడ్డించుకుంటారు. ఈ రోజు సీతా బావ రామలక్ష్మిపై కోపడ్డే పని చేసానని శ్రీవల్లి అనగానే.. ఏంటని శ్రీలత అడుగుతుంది. తను తీసుకొని వెళ్లే బాక్స్‌లో ఉప్పు కారం కలిపిన అనగానే మంచి పని చేసావని శ్రీలత మెచ్చుకుంటుంది. ఆ తర్వాత శ్రీలత ఉప్పు కారం ఎక్కువున్నా భోజనం తిని ఇలా చేసావ్ ఏంటని కోప్పడుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఎక్కడికైనా బయటకు వెళదామని సీతాకాంత్ తో అనగానే తన ప్రేమ విషయం చెప్తుందని సరే అని అంటాడు. అప్పుడే నందినిని రామలక్ష్మి చూసి.. ఏంటి ఇక్కడున్నారని అడుగుతుంది. కార్ ట్రబుల్ ఇచ్చిందని నందిని అంటుంది. క్యాబ్ బుక్ చేస్తానని సీతాకాంత్ అనగానే.. వద్దు మనమే డ్రాప్ చేద్దామని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ముగ్గురు కార్ లో వెళ్తారు. ఆ తర్వాత ఇక్కడ వరకు వచ్చారు ఇంట్లోకి రండి అనగానే సీతాకాంత్ వద్దని అంటున్నా, రామలక్ష్మి వెళదామని అంటుంది. ఇంట్లోకి వెళ్లి రామలక్ష్మి ఇల్లు చూస్తుంటే.. సీతాకాంత్, నందినిలు ఇద్దరు‌ కలిసి దిగిన ఫోటో చూస్తుందేమోనని, ఆ ఫోటో ఉన్నా రూమ్ లోకి వెళ్తుంటే నందిని వద్దని చెప్తుంది. కానీ సీతాకాంత్ ఆ ఫోటో చూస్తాడు. ఆ తర్వాత కాఫీ తాగి అక్కడ నుండి వెళ్తారు. సీతా ఆ ఫోటో చూసి ఉంటే నన్ను తప్పుగా అర్థం చేసుకొనే వాడు అని నందిని అనుకుంటుంది. మరొకవైపు రామలక్ష్మి శ్రీలతతో.. నా భర్తని నా కొంగున కట్టేసుకుంటా అని విషయం గుర్తుచేసుకుని రామలక్ష్మి కార్ దిగగానే.. ఒక పని చెయ్యండి అంటు చెప్తుంది. తన కొంగుకి సీతాకాంత్ ని ముడివేసుకొని ఇంట్లోకి వెళ్తుంది. అలా వెళ్లడంతో శ్రీలత, శ్రీవల్లి ఇద్దరు షాక్ అవుతారు. ఇదేదో బాగుందని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : అమ్మ ఎవరని అనుపమని నిలదీసిన మను!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'( Guppedantha Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1164 లో.....మా మావయ్యపై ఎందుకు ఎటాక్ చేశారని మనుని  వసుధార అడుగుతుంది. నేనెందుకు చేస్తాను.. ఆ అవసరం నాకేంటని మను అంటాడు. మీరు శైలేంద్ర ద్వారా నిజం తెలుసుకున్నారని నాకు తెలుసని వసుధార అంటుంది. మావయ్య మీ కన్నతండ్రి అని నిజం తెలుసుకున్నారు అందుకే తనపై ఎటాక్ చేశారని వసుధార అంటుంది. నేను చెయ్యలేదని మను అంటాడు. మావయ్యపై కోపం పక్కన పెట్టి మీ మీ కన్నతల్లి ఎవరో తెలుసుకోండి. మీ కన్న తల్లి అనుపమ గారు కాదు.. మీ తల్లి గురించి ఆవిడకే తెలుసని వసుధార అంటుంది. మీరు అంటుంది ఏంటి? అనుపమ గారే నా కన్నతల్లి అని మను అంటాడు. ఇంకొకటి ఏంటంటే మహేంద్ర సర్ పై నేను ఎటాక్ చెయ్యలేదు అని క్లారిటీ ఇచ్చి మను వెళ్తాడు. ఆ తర్వాత దేవయానితో నేనే బాబాయ్ పై ఎటాక్ చేయించానని శైలేంద్ర చెప్పగానే.. అసలు ఎందుకు నాకు చెప్పకుండా చేస్తున్నావని దేవయాని కోప్పడుతుంది. బాబాయ్ ని వసుధారని ఆ తర్వాత ఆ రంగాగాన్ని వేసేసి ఎండీ అవ్వాలని అనుకున్నానని శైలంద్ర అంటాడు. ఆ తర్వాత ఫణీంద్ర వచ్చి మహేంద్ర పై ఎవరు ఎటాక్ చేసారో ఇకనుండి వాడిని కనిపెట్టే పనిలో ఉంటానని ఫణీంద్ర అనగానే దేవయాని, శైలేంద్రలు టెన్షన్ పడతారు. ఆ తర్వాత మను కోపంగా ఇంటికి వచ్చి.. అసలు నా కన్నతల్లి ఎవరు అంటూ అనుపమని నిలదీస్తాడు. అనుపమ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. మరొకవైపు ఎటాక్ చేసింది ఎవరో కనిపెడుతానంటూ వెళ్ళావ్.. ఏమైందని రిషి అడుగుతాడు. మను గారు అనుకున్న కానీ తను కాదంట అని వసుధార అంటుంది. ఎవరు చేసారో నాకు తెలుసు మా అన్నయ్య అని రిషి అంటాడు. అంత తెలిసి మౌనంగా ఉంటున్నారని వసుధార అంటుంది. తప్పు చేసిన వాళ్ళను వదిలి పెట్టనని రిషి అంటాడు. అప్పడే రాధమ్మని తీసుకొని సరోజ వస్తుంది. రంగా ఎలా ఉన్నావ్ మన ఇంటికి వెళదామని అంటుంది. అప్పుడే మహేంద్ర వచ్చి.. రంగా ఏంటి? అతను నా కొడుకు రిషి అని అంటాడు. నువ్వు రంగా అని చెప్పురా అని రాధమ్మ అంటుంది. నేను రంగా కాదు.. రిషి.. ఆయన కొడుకుని.. వసుధార భార్యని అని రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : అప్పు మాస్ వార్నింగ్.. రాజ్ ఆ పని చేయగలడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -499 లో...అప్పు, కళ్యాణ్ లని ధాన్యలక్ష్మి అవమానించిన విషయం రాజ్ గుర్తు చేసుకొని బాధపడతాడు.ఇంటికి తీసుకొని రావాలని ఆలోచించాను కానీ వచ్చాక వాళ్ళకి అవమానం జరగకుండా ఆపలేకపోయానని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు అప్పు, కళ్యాణ్ లు అటోలో రూమ్ కి వస్తారు. ఆటో దిగుతుంటే ఒకతను కళ్యాణ్ పక్కనుండే బైక్ స్పీడ్ గా వెళ్తుండడంతో అప్పు అతనిపై కోప్పడుతుంది. అతను కూడా అప్పుపై కోప్పడగా.. అప్పు మరింత కోపంగా అతన్ని కొడుతుంది. దాంతో అతను సారి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక్కడ ఇలా చేస్తున్నావ్ ఇంట్లో అంత అవమానిస్తుంటే సైలెంట్ గా ఉన్నావని కళ్యాణ్ అడుగగా.. నీకు మాట ఇచ్చాను కదా నిన్ను బాధపెట్టలేనని అప్పు అంటుంది. ఇంట్లో మా అమ్మ చేసిన దానికి నేను సారీ చెప్తున్నానని కళ్యాణ్ అనగానే అదంతా ఎప్పుడో మర్చిపోయిన అని అప్పు అంటుంది. అప్పుడే రాజ్ ఫోన్ చేసి.. నేను రప్పించి మిమ్మల్ని బాధపడేలా చేసాను సారీ అని చెప్తాడు. నేను ఏదో ఒకటి సాధించి ఆ ఇంటికి తిరిగి వస్తానని రాజ్ తో‌ కళ్యాణ్ చెప్తాడు.ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది.  మా తమ్ముడిని తీసుకొని వచ్చి ఇక్కడే ఉండేలా చేస్తానని రాజ్ ముందు కావ్యతో అన్న మాటలు గుర్తు చేసుకొని.. నీకు మంచి స్టఫ్ దొరికింది కదా అని రాజ్ అంటాడు. ఇక ఇద్దరి మధ్యలో ఎప్పటిలాగే గొడవ జరుగుతుంది. మరొకవైపు ఆ ధాన్యలక్ష్మి నా మాటలు విని కన్నకొడుకుని దూరం చేసుకుంది. ఇక ఎప్పటికి ఈ ఇంటికి రాకుండా చేసిందని హ్యాపీగా ఫీల్ అవుతూ రుద్రాణి, రాహుల్ లు డ్రింక్ చేస్తుంటారు. వాళ్ళని స్వప్న చూసి నా చెల్లిని రాకుండా చేసి ఇద్దరు పార్టీ చేసుకుంటారా.. మీ సంగతి చెప్తానని స్వప్న అనుకుంటుంది. మరొకవైపు ధాన్యలక్ష్మి దగ్గరికి అపర్ణ వచ్చి.. నీ కన్నకొడుకుని దూరం చేసుకున్నానని భాదపడుతున్నావా లేక పంతం నెగ్గించుకున్నానని గర్వపడుతున్నావా అని అపర్ణ అడుగుతుంది. నేను ఎప్పుడు ఆ అప్పుని నా కోడలుగా ఒప్పుకోలేనని ధాన్యలక్ష్మి చెప్పగానే అపర్ణ వెళ్ళిపోతుంది. కావ్యని కోడలు చేసుకొని నష్టపోయింది.. ఇప్పుడు నేను అలా నష్టపోవాలనుకుంటుందని ధాన్యలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత రుద్రాణి గదిలో బెలూన్ లు పెడుతుంది స్వప్న. అందులో లాఫింగ్ లిక్విడ్ వేసి పెడుతుంది. ఆ తర్వాత రుద్రాణి, రాహుల్ లు గదిలో కి వచ్చి ఆ బెలూన్ లు ఏంటని అనుకుంటారు. హ్యాపీ బర్త్డే మమ్మీ అని రాహుల్ ఒక బెలూన్ పగులగోడతాడు. దాంతో ఇద్దరు నవ్వుతూనే ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అమ్మాయిలు ఏడ్చుకుంటు మెసెజ్ లు పెట్టేవాళ్ళు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు(Guppedantha Manasu). ఈ సీరియల్ లో రిషి, వసుధారల‌ జోడీకి ఫ్యాన్ బేస్ గట్టిగా ఉంది‌. అదే విషయం చాలా సందర్భాలలో బహిర్గతమైంది.  మరికొన్ని రోజుల్లో ఈ సీరియల్ ముగుస్తుంది. రీసెంట్ గా దర్శకుడు కుమార్ పంతం 'క్లైమాక్స్ షూట్ డన్ ' అంటు కొన్ని ఫోటోలని కూడా షేర్ చేశాడు. అదే విషయాన్ని తెలియజేస్తూ ముఖేష్ గౌడ కొన్ని విషయాలని పంచుకున్నాడు. పెద్ద సక్సెస్ తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ ముగింపుని కూడా సక్సెస్‌గానే చూస్తున్నా. సక్సెస్ అనేది ఒకసారి వస్తుంది.. ఆ తర్వాత పోతుందని అంటారు. కానీ గుప్పెడంత మనసు సీరియల్ అలా కాదు.. ఎలా సక్సెస్‌తో మొదలైందో.. అదే సక్సెస్‌తో ఎండ్ అవుతుంది. ఇది చాలా గొప్ప విషయం. నేను కొన్నాళ్ల పాటు సీరియల్‌లో కనిపించకపోయేసరికి నాకోసం ఎంతో ఎదురుచూశారు. ఇది వాళ్లు నాపై చూపించే ప్రేమ. వాళ్ల సపోర్ట్ వల్లే నేను తిరిగి వచ్చాను. నేను అనుకోకుండా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ల పిలుపు వినే నేను తిరిగి వచ్చాను. నేను వాళ్లని చాలా మిస్ అయ్యాను ఆ టైంలో. ప్రేమను పోగొట్టుకోవడం కాదు కాదు.. ఆ ప్రేమ డబుల్ అయ్యింది. నేను ఉన్నప్పుడు ఒక గ్రాఫ్‌లో ఉండేది.. నేను లేకపోయినప్పుడు మరో గ్రాఫ్‌కి వెళ్లింది. నేను లేనని చాలా ఫీల్ అయ్యారు. ఏడ్చారు.. వాయిస్ మెసేజ్‌లు పెట్టారు. కొంతమంది అమ్మాయిలు అయితే ఏడ్చుకుంటూ వాయిస్ మెసేజ్‌లు పెట్టేవారు. వాళ్లని చూస్తుంటే బాధేసింది. వాళ్లే నా బలం.  తెలుగు ఆడియన్స్ ఒకసారి ఇష్టపడితే.. వాళ్లింటి బిడ్డలా చూసుకుంటారని అనడానికి నేనే సాక్ష్యం. నా ఇంట్లో కూడా నాకు ఇంత ప్రేమ దొకరలేదు. కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం నన్ను ఎంతో ప్రేమించారు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడ్ని. ఇంత ప్రేమ, ఇంత ఆదరణ నేను ఊహించలేదు. నేను మళ్లీ సీరియల్‌లోకి తిరిగి వచ్చానంటే వాళ్లు నాపై చూపించిన ప్రేమే కారణం. రిషిధార బంధానికి విడుదల అనేది ఉండదు..‌రిషిధార.. పేరుకి తగ్గట్టే ఎప్పటికీ ఆ బంధం ఉంటుంది.. వాళ్ల మధ్య గ్యాప్ ఉండదు.. హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. రిషిధారల మధ్య బాండింగ్ ఎప్పటికీ ఉంటుందనే మెసేజ్‌తో గుప్పెడంత మనసు సీరియల్‌ ఎండ్ అవుతుందంటు ముఖేష్ గౌడ చెప్పుకొచ్చాడు.

Jyothirai : ఎవరితోనో అలా చేసి..ప్రూ చేసుకోవాల్సిన అవసరమేమీ లేదు!

  తెలుగు టీవీ సీరియళ్ళలో బాగా క్రేజ్ తెచ్చుకున్న సీరియల్ గుప్పెడంత మనసు( Guppedantha Manasu). ఈ సీరియల్ లో రిషి, వసుధారల జోడీ ఎంత ఫేమసో.. రిషి తల్లిగా చేసిన జగతి మేడమ్ పాత్ర కూడా అంతే ఫేమస్. జగతి పాత్రలో చేసిన జ్యోతిరాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్ తాజాగా ఓ ఫేక్ వీడియో లీక్ అంటు వైరల్ గా  మారింది. ఇక గత కొన్ని రోజులుగా తను బిగ్ బాస్ కి వెళ్తుందంటు వార్తలొస్తున్నాయి. వాటన్నింటికి సమధానాలని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. గుప్పెడంత మనసు సీరియల్‌తో తన అనుబంధం చాలా బలమైనదని, ఈ సీరియల్‌లో జగతి పాత్ర చేయడానికి చాలా మంది నిరాకరించారు. కానీ నేను ఓ ఛాలెంజింగ్‌గా తీసుకొని నా కంటే వయసులో పెద్ద తరహా పాత్రను పోషించాను. అది ఆడియన్స్‌కి కూడా బాగా నచ్చింది. ఒక సినిమా అంటే రెండు, మూడు నెలలు మాత్రమే షూటింగ్ ఉంటుంది. కానీ సీరియల్ షూటింగ్ అంటే కొన్నేళ్ల పాటు వాళ్లతో ప్రయాణించాలి. అలా గుప్పెడంత మనసు టీమ్ మొత్తం నా ఫ్యామిలీ అయిపోయింది. జగతి పాత్రను ఎంతలా అభిమానించారో అదే తరహాలో నా సినిమాలు, ప్రాజెక్టులను ఆడియన్స్ ఆదరించాలని కోరుతున్నానంటూ జ్యోతి రాయ్ చెప్పింది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నానంటూ చాన్నాళ్లుగా వస్తున్న వార్తలపై జ్యోతిరాయ్ స్పందించింది. నేను బిగ్‌బాస్‌లోకి రావడం లేదు.. అసలు ఈ న్యూస్ ఎవరు వైరల్ చేస్తున్నారే తెలీడం లేదు.. అయినా ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్లు నాతో పాటు చాలా మందిపై ఇలాంటి వార్తలు వేసి బతుకుతున్నారు. నేను అని కాదు వాళ్ల న్యూస్ కోసం ఎవరో ఒకరి బలి చేయాలి అంతే. ఇలాంటి గాసిప్స్‌ను నేను అసలు కేర్ చేయను. జనాలు దయచేసి ఏదైనా మా నోటి నుంచి వస్తేనే నమ్మండి. అది ఏ విషయమైనా సరే మేము చెబితేనే నమ్మండి. ఎందుకంటే ఈ యూట్యూబర్లు ఏమీ నా పేరెంట్స్, నా బ్రదర్స్ ఏమీ కాదు.. అయినా ఎవరి గురించి ఎవరూ మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అలా వాళ్లు ఎలా మాట్లాడతారు అసలు. కన్నడ బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వచ్చింది.. అది నిజమే. కానీ నాకు ఈ సెప్టెంబర్ నుంచి వరుసగా ప్రాజెక్టులు ఉన్నాయి. యాక్టింగ్ నా కెరీర్. అంతేకానీ ఒక నాలుగు గోడల మధ్యలో ఎవరితోనో గొడవ పెట్టుకొని, ఏదో మాట్లాడుతూ నన్ను నేను ప్రూ చేసుకోవాల్సిన అవసరమేమీ లేదు. నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్. గనుక నా మొదటి ప్రిఫరెన్స్ ఎప్పుడూ అదేనంటూ జ్యోతి క్లారిటీ ఇచ్చింది.  

అల్లు అర్జున్ అంటే పిచ్చి..ఆయనతో కలిసి పని చేయాలనీ ఉంది

గుప్పెడంత మనసు సీరియల్ హీరోకి పుష్ప అంటే చాలా ఇష్టమంట..ఇష్టం మాత్రమే కాదు పిచ్చి అంట. పుష్ప అలియాస్ అల్లు అర్జున్ అంటే తనకు ఇన్స్పిరేషన్, పిచ్చి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు రిషి సర్ అలియాస్ ముకేశ్ గౌడ. "మా గుప్పెడంత మనసు షూటింగ్ జరిగే దగ్గర సారధి స్టూడియోస్ లో పుష్ప మూవీ క్లైమాక్స్ సీన్ షూటింగ్ జరుగుతోంది. నేను ఆ రోజు ఉదయం సీరియల్ షూటింగ్ కోసం నా లొకేషన్ కి వచ్చాను. అక్కడ నా కార్ దిగగానే ఎదురుగా  AA అనే పేరుతో ఒక క్యారవాన్ కనిపించింది. దాని చూడగానే నాకు ఏదో ఐపోయింది. ఇక్కడ అల్లు అర్జున్ ఉన్నారా అని షాక్ అయ్యా. ఐతే నాకు ఆయన్ని ఎలాగైనా చూడాలని అనిపించింది. నిజం చెప్పాలంటే ఆయనతో కలిసి పని చెయాలని ఉంది. ఆయన్ని చూసేసరికి నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. ఐతే ఆయన చుట్టూ ఎప్పుడూ బౌన్సర్లు ఉంటారు. దాంతో ఆయన బయటకు వచ్చే ఆప్షన్ ఐతే లేదు. ఇక నేను కూడా ఆయన్ని చూసే అవకాశం రాదు అనుకుని వెళ్ళిపోయాను. సీన్ షూట్ కోసం మేకప్ వేసుకుని రెడీ అయ్యాను. అలా షూటింగ్ కి నేను నా అసిస్టెంట్ వెళ్తున్నాం..అక్కడికి ఇంకా ఎవరూ వచ్చే అవకాశం కూడా లేదు. అదే టైములో క్యారవాన్ డోర్ ఓపెన్ అయ్యింది. అదే టైంకి అల్లు అర్జున్ కూడా సీన్ షూట్ కోసం రెడీ అవుతున్నారు. అంతే నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది ఆయనని అలా చూసేసరికి. అది ఒక మంచి మెమరీ లాగా నా మనసులో నాటుకుపోయింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా నాకు ఇన్స్పిరేషన్ గా ఉంటారు. తెలుగు ఇండస్ట్రీ గురించి యాక్టర్స్ గురించి చిన్నప్పుడు నాకు పెద్దగా తెలీదు. కానీ మెగాస్టార్ గురించి తర్వాత నేను చాల తెలుసుకున్న..ఆయన జీవితం గురించి తెలుసుకున్నాక ఆయనకు కూడా నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను" అని ఎన్నో విషయాలు చెప్పాడు ముకేశ్ గౌడా.  

ఇండియన్ ఐడల్ సీజన్ 3 నుంచి కేశవ్ రామ్ ఎలిమినేట్..

  ఇండియన్ ఐడల్ సీజన్ 3  ఆహా ఓటిటి ప్లాటుఫారం మీద సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఐతే ఇప్పుడు ఈ సీజన్ లో ఒక్కొక్కరిగా ఎలిమినేట్ ఐపోతున్నారు.   ఐతే ఇంతవరకు తన పాటలతో ఆకట్టుకున్న కేశవ్ రామ్ రీసెంట్ ఎపిసోడ్ లో  ఎలిమినేట్ అయ్యాడు. దాంతో కేశవ్ కి ఉన్న ఫాన్స్, ఆడియన్స్ షాక్ అయ్యారు.  కేశవ్ సాంగ్స్ అంటే పడిచచ్చిపోయే ఫాన్స్ చాలామంది ఉన్నారు. ఆయన గాత్రం మృదుమధురంగా ఉంటుంది.  కేశవ్‌కి ముందు,  కుశాల్ శర్మ, హరి ప్రియ, రాంజీ శ్రీపూర్ణిమ, శ్రీధృతి, అభిగ్న, సాయి వల్లభ ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల నుంచి వస్తున్నా ఓట్లు జడ్జ్ ల స్కోర్‌ ఆధారంగా ఈ  ఎలిమినేషన్స్  జరుగుతున్నాయి. రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్స్ లో కేశవ్ రామ్, శ్రీకీర్తి, స్కంద డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఐతే ఇందులో ఆడియన్స్ నుంచి ఎక్కువ ఓట్లు రావడంతో  స్కంద సేఫ్ జోన్ లోకి వెళ్ళాడు. అతి తక్కువ ఓట్లతో కేశవ్ ఎలిమినేట్ అయ్యాడు. దాంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. ఐతే సింగర్ కార్తీక్ సెప్టెంబర్ 28న తిరుపతిలో, నవంబర్ 9న హైదరాబాద్‌లో  జరగబోయే తన కాన్సర్ట్ లో పార్టిసిపేట్ చేయాలంటూ ఇన్వైట్ చేసాడు. ఇక ఈ షోకి  గెస్ట్ గా వచ్చి అల్లరి చేసిన హీరో నవీన్ పోలిశెట్టి కూడా కొన్ని ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పాడు  “నా ఫైటింగ్ డేస్ లో, సక్సెస్ కోసం చాలా రోజులు వెయిట్ చేశాను. యాక్టింగ్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ షోలో విజేతకు బాలీవుడ్ లో ఓ పెద్ద బ్యానర్ లో నటించే ఛాన్స్ వస్తుంది ..నా పర్ఫామెన్స్ బాగున్నప్పటికీ  నాలుగో రౌండ్‌లో ఎలిమినేట్ అయ్యాను. కేశవ్ ఎలిమినేషన్ చూడగానే నాకు ఆ రోజు గుర్తొచ్చింది. నా ఎలిమినేషన్ తర్వాత నేను చాలా నిరాశపడ్డాను. ఐతే ఆ షోలో విన్నర్ ఐన వ్యక్తి ఇంతవరకు సినిమా చేయలేదు. కానీ నేను హీరోని అయ్యా..  ప్రేక్షకుల నుంచి నాకు లభించిన ప్రేమ ఎంతో గొప్పది. కేశవ్ ని ఇన్స్పైర్ చేయడానికి ఈ విషయాలను చెప్పా" అన్నాడు నవీన్ పోలిశెట్టి.

రవితేజ వాళ్ళ అమ్మకు ముకేశ్ గౌడ అంటే చాలా ఇష్టం...

  గుప్పెడంత మనసు సీరియల్ కి ఆమె బిగ్ ఫ్యాన్ కూడా నెక్స్ట్ ఇయర్ ముకేశ్ రెండు సినిమాలు రిలీజ్ గుప్పెడంత మనసు సీరియల్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచి టాప్ రేటింగ్స్ తో దూసుకెళ్లి చివరికి ఎండ్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది. ఇక ఇందులో హీరో ముకేశ్ గౌడా నటన కానీ అతని ఆటిట్యూడ్ కానీ చాలా కూల్ ఉంటుంది అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉంటాడు.. దాంతో లేడీ ఫాన్స్ అంతా ఆయన నటనకు ఫిదా ఇపోయారు. ఇక ముకేశ్ గౌడ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పాడు. తెలుగు ఆడియన్స్ కి ఒక వ్యక్తి నచ్చితే గనక వాళ్ళ ఇంట్లో అబ్బాయికంటే ఎక్కువగా ఆదరిస్తారు అన్నాడు. అలా తెలుగు వాళ్ళ అభిమానాన్ని పొందడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నాడు. ఇక ముకేశ్ గౌడ నటించిన గీత శంకరం, ప్రియమైన నాన్నకు మూవీస్ రెండు కూడా 2025 లో రిలీజ్ అవుతాయని చెప్పాడు. ఇక టాలీవుడ్ లో మాస్ మహారాజ రవితేజ వాళ్లకు "గుప్పెడంత మనసు" సీరియల్ అంటే చాలా ఇష్టమని రవితేజ వాళ్ళ అసిస్టెంట్ ఒక సారి కాల్ చేసి వాళ్ళ అమ్మగారితో మాట్లాడించారని చెప్పాడు ముఖేష్ గౌడా. అలాగే ముకేశ్ గౌడ అంటే బ్రహ్మానందంకి కూడా ఎంతో ఇష్టం. గుప్పెడంత మనసు సీరియల్ కి కూడా ఆయన ఎంతో బిగ్ ఫ్యాన్ కూడా. ఆయన ఈ సీరియల్ షూటింగ్ సెట్ కి వచ్చి ముకేశ్ తో కలిసి ఫొటోస్ కూడా దిగారు.  ఐతే బిగ్ బాస్ వెళ్లే ఛాన్స్ లేదని చెప్పేసాడు. ఐతే మా టీవీ కొలాబరేషన్ లో పని చేసే అవకాశం రావొచ్చు అని చెప్పాడు. వెబ్ సిరీస్ లో కానీ ఇంకా ఎందులో ఐనా కానీ కనిపించే అవకాశం ఉందని కూడా చెప్పాడు. అలాగే ఆడియన్స్ కి కూడా ఒక మాట చెప్పాడు. తనను ఇప్పటి వరకు సొంత కొడుకులా చూసుకున్నారు...రాబోయే రోజుల్లో కూడా తనకు ఇలాగే  ప్రేమ, సపోర్ట్ కావాలని కోరుకున్నాడు.

జబర్దస్త్ తన్మయ్ తండ్రి కన్నుమూత...కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్

జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్ తో అందరినీ కడపుబ్బా నవ్వించే తన్మయ్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. అలాంటి ఆమె ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తనకు ఎంతో ఇష్టమైన  తన తండ్రి మరణించడంతో ఆమె అల్లాడిపోయింది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది.  తన తండ్రి చనిపోయిన విషయాన్ని తన్మయి సోషల్ మీడియాలో షేర్ చేసింది.  ఇక తన తండ్రి పాడేను ఆమె  మోసింది..అలాగే అంత్యక్రియలు నిర్వహించింది. ‘ మా నాన్నే నా హీరో.. నాన్న ఓ ఎమోషన్.. మిస్ యూ నాన్నా.. నా మనసులో ఎప్పటికీ నువ్వు ఉంటావ్.. కొడుకునైనా, కూతురినైనా నేను మీ బిడ్డనే’ అంటూ తన్మయి షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ విషయంలో బాధపడుతున్న తన్మయ్ కి ధైర్యం చెప్తున్నారు. రిప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన్మయి తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కామెంట్స్ పెట్టారు. తన్మయ్  అబ్బాయిగా పుట్టినా అమ్మాయిగా మారిపోయింది.  ఆ తర్వాత జబర్దస్త్ షోతో  మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో తను వేసే లేడీ గెటప్పులు ఆడియెన్స్ ను బాగా అలరించాయి. దీంతో పాటు అప్పుడప్పుడూ శ్రీదేవీ డ్రామా కంపెనీలో కూడా సందడి చేస్తూ ఉంది.  ఆమెకు ఇన్ స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగా కూడా ఉంది. అలాంటి తన్మయ్ ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయింది.  

Karthika Deepam2 : డాక్టర్ బాబు అనుకుంటున్నావా.. నీ లైఫ్ లో బేబీ ఉందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -133 లో..... దీప దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. చాలా కంగ్రాట్స్ దీప అని జ్యోత్స్న అనగానే ఎందుకని దీప అడుగుతుంది. నేను ఎంతో ఇష్టపడిన వాళ్ళతో నన్ను తిట్టిస్తున్నావని జ్యోత్స్న అంటుంది. కష్టంలో ఉన్నవాళ్లు అందరు నీకే ఎదరవుతారు అదేంటో.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నావ్ కదా.. అసలు ఆ వీడియో నువ్వే కావాలని తీయించావ్ .. ఎంతిచ్చావని జ్యోత్స్న అనగానే నువ్వు ఏదో మైండ్ లో పెట్టుకొని ఇలా చేస్తున్నావ్.. ఇలా ఆలోచిస్తే నువ్వు ఇష్టపడేవాళ్ళు దూరం అవుతారని దీప అంటుంది. మరొకవైపు స్వప్న ఫోన్ లో స్వప్న-కాశీ ఉన్న ఫోటోని కావేరి చూస్తుంది. అప్పుడే స్వప్న వచ్చి.. ఏంటి అని అడుగుతుంది. ఇదేంటి ఎవరైనా ప్రేమిస్తున్నావా అని అడిగితే.. లేదన్నావ్ ఇదేంటని స్వప్నపై కావేరి కోప్పడుతుంది. తన చెంప చెల్లుమనిపిస్తుంది. డాడ్ కీ చెప్తానని కావేరి అనగానే వద్దని స్వప్న రిక్వెస్ట్ చేస్తుంది. స్వప్న వాళ్ళ ప్రేమ గురించి మొత్తం చెప్తుంది దీప. అతన్ని సేవ్ చేసిందని చెప్తుంది.. అతని గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలి.. నా జీవితం లాగా నా కూతురు జీవితం కాకూడదని కావేరి ఆలోచిస్తుంది. మరొకవైపు శౌర్య టాబ్లెట్స్ వేసుకున్నానని కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. కార్తీక్ బాబు చాలా బిజీ ఉంటాడు.. నువ్వు అలా డిస్టబ్ చెయ్యకూడదు.. అయిన ఆ బాబుని అనాలి నీ వయసు ఎక్కడ? ఆయన వయసు ఎక్కడ? అయన ఏమైనా డాక్టర్ బాబు అనుకుంటున్నావా .. కార్తీక్ బాబు అని దీప అంటుంది. ఆ మాటలన్నీ కార్తీక్ విని నవ్వుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ దీపకి ఫోన్ చేసి.. శౌర్య నా ఫ్రెండ్ నన్ను డిస్టబ్ చెయ్యడమంటూ ఏముండదని మాట్లాడతాడు.ఆ తర్వాత కార్తీక్ బీరువా దగ్గరికి వెళ్లి అందులో నుండి ఒక చైన్ తీసి.. ఎక్కడున్నావ్ నన్ను చిన్నప్పుడు కాపాడావని నీ సాయం మర్చిపోలేను.. నీకు సాయం చెయ్యాలనుకుంటానని కార్తీక్ అనుకుంటాడు. ఆ చైన్ దీప ది చిన్నప్పుడు కార్తీక్ ని కాపాడేటప్పుడు ఆ చైన్ అనుకోకుండా కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం కార్తీక్ రెస్టారెంట్ గురించి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతాడు. ఇవి కూడా పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావంటూ స్వప్న, కాశీల ప్రేమ విషయం గురించి గుర్తుచేసుకుంటాడు. ఇప్పుడు ఇదొక టెన్షన్ అని అనుకుంటాడు. అప్పుడే కాంచన వచ్చి బేబీ అని ఎవరిని అంటారని అడుగుతుంది. లవర్ ని అంటారు.. ఈ మధ్య భార్య కూడా అంటుంది.. అలా అని చెప్తాడు.. మీ నాన్న ఫోన్ కి ఒకావిడ ఫోన్ చేసి బేబీ అంటుంది అనగానే కావేరి అయి ఉంటుందని కార్తీక్ అనుకుంటాడు.. నీకు నాన్నపై డౌట్ ఉందా అని కార్తీక్ అడుగగా.. లేదని కాంచన అంటుంది. అప్పుడే కాంచన చైన్ చూపించి.. ఇది ఎవరిదిరా జ్యోత్స్న అయితే ఇలాంటివి వెయ్యదు.. నీ లైఫ్ లో కూడా ఒక బేబీ ఉందా ఏంటని కాంచన అనగానే.. ఉందని కార్తీక్ అంటాడు. పదేళ్లప్పుడు నేను కోనేటిలో పడిపోతే ఒకమ్మాయి సేవ్ చేసిందని తెలుసు కదా.. ఆ అమ్మాయిది.. అప్పుడు నా దగ్గరికి ఎలా వచ్చిందో కూడా తెలియదని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : భర్త కోసం ప్రేమగా వండి తీసుకొచ్చిన భార్య.. ఆమెతో అలా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -185 లో.....నందిని సీతాకాంత్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఏంటి అలా చూస్తున్నావ్ పార్టనర్.. మనుషులని మనసులని బాగా స్టడీ చేసిన దాన్ని.. ఇక నుండి మనం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి..  గతాన్ని కాదు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటేనే మనం ముందుకి వెళ్ళగలుగుతాం.. అప్పుడే కంపెనీ సక్సెస్ అవుతుందని నందిని అంటుంది. ఆ తర్వాత మేనేజర్ వచ్చి ఫైల్ పై సంతకం పెట్టమంటాడు. నందిని మేడమ్ కూడ పెట్టాలని మేనేజర్ అంటాడు. దాంతో నందిని కూడా సంతకం పెడుతుంది. ఇద్దరి సంతకలు పక్కపక్కన ఉండడం చూసి నందిని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు సీతాకాంత్ కి నచ్చిన వంటలు చేసి క్యారెజ్ తీసుకొని వెళ్ళాలని రామలక్ష్మి కిచెన్ లో వంట చేస్తుంది. అదంతా శ్రీవల్లి చూసి.. రాత్రి జరిగింది మర్చిపోయి ప్రేమగా వంట చేస్తున్నావా.. చెప్తానని శ్రీవల్లి అనుకుంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి వంట పూర్తి చేసి వెళ్తుంది. శ్రీవల్లి వచ్చి వాళ్ళకి వేరే గిన్నెలో వండినివి తీసుకొని.. మిగతా వాటిలో ఉప్పు వేస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి వస్తుంది. ఏంటి ఇక్కడ ఉన్నావని అడుగగా జ్యూస్ కోసం వచ్చానని చెప్పి వెళ్ళిపోతుంది. రామలక్ష్మికి డౌట్ వచ్చి కర్రీ టేస్ట్ చూస్తుంది. ఉప్పుగా ఉండడంతో తను తీసుకున్న కర్రీని సీతాకాంత్ కి బాక్స్ కట్టి.. ఉప్పు ఉన్న వాటిని అక్కడ పెడుతుంది. ఆ తర్వాత క్యారేజ్ తీసుకొని రామలక్ష్మి వెళ్తుంటే.. రాత్రి జరిగింది మర్చిపోయి వెళ్తున్నావా అంటూ శ్రీలత మాట్లాడుతుంది. దానికి తగ్గ కౌంటర్ వేసి రామలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు సందీప్ పర్మిషన్ అడగకుండా నందిని క్యాబిన్ కి వెళ్తాడు. దాంతో నందిని తనపై కోప్పడుతుంది. మేడమ్ నేను చెప్పింది ఒకే అన్నారు.. అలా చేశారని సందీప్ అనగానే.. ఏం చెయ్యాలో నాకు తెలుసు.. చేసేవరకు చూస్తా ఉండమని రూడ్ గా మాట్లాడుతుంది. దాంతో సరేనని సందీప్ వెళ్ళిపోతాడు. మరొకవైపు సీతాకాంత్ క్యారేజ్ తీసుకొని రామలక్ష్మి ఆఫీస్ కి వస్తుంది. నందిని కూడా ఆఫీస్ లో ఉందని తెలిసి.. తనకు ఫోన్ చేసి క్యారేజ్ తెచ్చాను.. ముగ్గురం కలిసి భోజనం చేద్దామని అంటుంది. దానికి నందిని సరే అంటుంది. మన మధ్యలో తనేందుకని సీతాకంత్ అంటాడు. తను మనకి చాలా హెల్ప్ చేసిందని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu : కూపీలాగిన శైలేంద్ర.. మహేంద్రని కాపాడిన రిషి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1163 లో.... ఫణీంద్ర, శైలేంద్రలు మహేంద్ర దగ్గరికి వస్తారు. ఇలా వచ్చారేంటని మహేంద్ర అడుగుతాడు. ఆ తర్వాత రిషికి బయటకు రా అంటూ శైలేంద్ర సైగ చేస్తాడు. రిషి బయటకు రాగానే నువ్వు రిషివా రంగావా అని అడుగుతాడు. ఎందుకు అలా డౌట్ పడుతున్నారని రిషి అడుగగా.. నేను సరోజని కలిసాను.. నువ్వు  వసుధార నీ ఇంట్లో ఉన్న విషయం ఎందుకు నాతో చెప్పలేదు.. అయినా ఒకసారి ఫోటో చూపించి అడిగితే తెలియదన్నావ్ కదా.. ఎందుకు నాతో అబద్దం చెప్పావని శైలేంద్ర అడుగుతాడు. ఆ తర్వాత రిషి పాండు ఫోటో చూపించి.. వీడు ఆ మేడమ్ పై ఎటాక్ చేయబోతుంటే నేనే కాపాడాను.. వాళ్ళు నాపై ఎటాక్ చేస్తుంటే మేడమ్ కాపాడారు. అందుకే మేడమ్ ప్రాబ్లమ్ లో ఉందనుకొని చెప్పలేదని రిషి చెప్తాడు. మరి ఇక్కడికి వచ్చాక కూడా చెప్పాలి కదా అని శైలేంద్ర అనగానే.. మీరు నన్ను అడగలేదని రిషి అంటాడు. అయిన ప్రతిసారీ మీరు ఎందుకు నాపై డౌట్ పడుతున్నారు.. మీపై నేనెప్పుడైన డౌట్ పడుతున్నానా.. మేడమ్ గారు మీ గురించి చాలా చెప్పారు.. రిషి వాళ్ళ అమ్మపై ఎండీ సీట్ గురించి ఎటాక్ చేయించారట.. అయిన మిమ్మల్ని మంచివారని అనుకుంటున్నానని రిషి అంటాడు. ఇంకోసారి మీరు నాపై డౌట్ పడితే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతానని శైలేంద్రతో రిషి అంటాడు. ఆ తర్వాత వసుధార పిలుస్తుంటే రిషి వెళ్ళిపోతుంటాడు. అప్పుడే శైలేంద్ర ఫోన్ లో.. షూట్ మిస్ అవ్వద్దని అనడం రిషి వింటాడు. ఆ తర్వాత ఫణీంద్ర, శైలేంద్రలు వెళ్ళిపోదామని బయటకు వస్తారు. వాళ్లతో మహేంద్ర కూడా బయట వరకు వస్తాడు. శైలేంద్ర సైగ చెయ్యగానే రౌడీ షూట్ చేస్తాడు. వెంటనే రిషి మహేంద్రని పక్కకి లాగుతాడు. ఆ తర్వాత శైలేంద్ర డిస్సపాయింట్ అవుతాడు. ఏం తెలియనట్టు ఏమైంది బాబాయ్ అంటూ అడుగుతాడు. ఇలా జరిగిందేంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని ఫణీంద్ర అనగానే.. వద్దని శైలేంద్ర అంటాడు. నేను చూసుకుంటానని రిషి అనగానే.. సరేనని ఫణీంద్ర అంటాడు. శైలేంద్రని రిషి కోపంగా చూస్తుంటాడు. ఆ తర్వాత ఇది ఎవరు చేసారో నాకు తెలుసు అంటు వసుధార కోపంగా వెళ్తుంది. మరొకవైపు సరోజకి శైలేంద్ర ఫోన్ చేసి.. ఆ వసుధార మీ బావని నీకు దూరం చేస్తుందని, ఆ వసుధార సంగతి చెప్పు అడ్రెస్ పంపిస్తున్నానని శైలేంద్ర అనగానే.. సరేనని సరోజ అంటుంది. ఆ తర్వాత మా మావయ్య గారిపై ఎందుకు ఎటక్ చేసావని మనుని వసుధార అడుగుతుంది. నేను చెయ్యలేదు.. అయిన నేనెందుకు చేస్తానని మను అనగానే.. అతనే నీ కన్నతండ్రి అని చెప్పబోయి వసుధార ఆగిపోతుంది. ఇప్పుడు కూడా చెప్పట్లేదని మను అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కొత్తజంటకి అల్లరి మామ సపోర్ట్.. కావ్యకి దగ్గరవుతున్న రాజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -498 లో.. అప్పుని తీసుకొని కళ్యాణ్ తన ఇంటికి వరలక్ష్మి వ్రతానికి వస్తాడు. అప్పు ఈ ఇంటికి సరైన కోడలు కాదని నిరూపించే ప్రయత్నం చేస్తుంది ధాన్యలక్ష్మి. వరలక్ష్మి వ్రతం పూర్తి అవ్వగానే.. ముగ్గురు అక్కచెల్లెళ్ళు తమ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లకి భోజనం వడ్డీస్తుంది అప్పు. దాంతో నువ్వు వచ్చిన వాళ్ళని అవమానించడం కోసమే పిలిచావా.. ఫస్ట్ ఎవరైనా అన్నం పెడుతారా అని ధాన్యలక్ష్మి అంటుంది. మా చెల్లికి ఇలాంటివి తెలియదు అని కావ్య వడ్డీస్తుంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి వాయినం ఇస్తారు. వచ్చిన వాళ్లు వెళ్లేముందు ఈ అప్పు మాత్రం ఈ దుగ్గిరాల ఇంటికి కోడలు గా తగదని చెప్పి వెళ్తారు. ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ లు బయలుదేర్తామని రాజ్ కి చెప్తారు. ఏంటి రా మీరు ఇక్కడే ఉండండి అని రాజ్ అంటాడు. ఈ అద్దాల మేడలో ఎవరు రాయి విసిరిన పగిలేలా ఉంది.. అయినా మేమ్ వచ్చింది ఉండిపోవడానికి కాదు తాతయ్య, నానమ్మల మాట కాదనలేక వచ్చమని కళ్యాణ్ అంటాడు. ఈ ఒక్క రోజు వస్తే చూసారు కదా పరిస్థితి ఎలా ఉందో అన్నట్లుగా కళ్యాణ్ అంటాడు. వచ్చినందుకు నీకేం తక్కువ చేసానని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ మాట నువు అంటున్నావా.. వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ని అవమానించావని ధాన్యలక్ష్మితో ఇందిరాదేవి అంటుంది. అయిన వచ్చిన వాళ్ళు అన్నారు కదా.. ఆ అమ్మాయి ఈ ఇంటికి కరెక్ట్ కాదని అని ధాన్యలక్ష్మి అంటుంది. అసలు వాళ్ళని మీరు పిలిచారా అని స్వప్న, అపర్ణలని ఇందిరాదేవి అడుగుతుంది. లేదని అపర్ణ అనగానే అయితే మా చెల్లిని అవమానించిడానికి మీరే పిలిచారని ధాన్యలక్ష్మితో స్వప్న అంటుంది. ఆ విషయం నాకు ఎప్పుడో అర్థం అయిందని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ వాళ్లని ఇందిరాదేవి ఉండమని అంటుంటే.. ఎందుకు అమ్మ రోజు ఇలాగే నా కోడలు అవమానపడాలి అనుకుంటాన్నావా.. వద్దు వాళ్ళకి ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది.. ప్రేమ ఉంది.. వాళ్ళు ఎక్కడైనా హ్యాపీగా ఉంటారని ప్రకాష్ అంటాడు. వెళ్ళు మీరిద్దరు మళ్ళీ ఈ ఇంటికి తలెత్తుకొని వచ్చే రోజు వస్తుంది. అప్పుడు నిన్ను అనేవాళ్ళు తలదించుకుంటారని అప్పుతో  కావ్య చెప్తుంది. ఆ తర్వాత అప్పుని తీసుకొని కళ్యాణ్ వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో కావ్యని రాజ్ ప్రేమగా దగ్గరకి తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu Climax :  గుప్పెడంత మనసు సీరియల్ కి క్లైమాక్స్ ఇదా...

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఒక్కో ఎపిసోడ్ లో ఉన్న ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తూ దర్శకుడు క్లైమాక్స్ కి చేరుస్తున్నాడు. అసలు అటో ట్రైవర్ గా రంగా పాత్రలో రీఎంట్రీ ఇచ్చిన రిషి గతమేంటని సింపుల్ గా తేల్చేశాడు దర్శకుడు. రంగానే రిషి అని నమ్మిన వసుధార అతన్ని వెతుక్కుంటూ వెళ్లింది. అక్కడికి వెళ్ళాక రంగానే రిషి అని బలంగా నమ్మింది. చివరికి అదే నిజం అయ్యింది కూడా. కానీ.. శనివారం నాటి ఎపిసోడ్‌లో రంగాగా రిషి ఎందుకు నటించాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు. అసలు రంగాని రంగంలోకి దింపారు. రంగా వేరు.. రిషి వేరు అనే వివరణ ఇచ్చారు కానీ.. అసలు అందులో లాజిక్కే లేదు. ఏదో శుభం కార్డ్ వెయ్యాలి కాబట్టి హడావిడిగా క్లైమాక్స్‌లో కథని కన్ఫూజన్ గా చేసేశారు. మరోవైపు మను తండ్రి ఎవరు అనే ప్రశ్నకి సింపుల్ గా శైలేంద్రతో చెప్పించేశాడు.  రంగాని వెతుక్కుంటూ వసుధార అతని ఊరు వెళ్లినప్పుడు.. అతనికి ఒక ఫ్యామిలీ ఉంది.. నాన్నమ్మ ఉంది.. అక్కడే చదువుకున్నాడు.. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు.. చాలా మంది పిల్లల్ని చదివిస్తున్నాడంటు వసుధారకి చెప్పించారు. టీ కొట్టోడు దగ్గర నుంచి కాలేజ్ ప్రిన్సిపల్ కూడా రంగా గొప్పతనాన్ని చాటారు. రంగా ఆ ఊరిలోనే పుట్టిపెరిగినట్టుగా చూపించారు. వసుధార కూడా అనేక సందర్భాల్లో రంగా గురించి ఆ ఊరిలో అడిగినప్పుడు.. రంగా చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు అని చెప్పారు. ఇక సరోజ కూడా.. చిన్నప్పటి నుంచి బావపై ఆశలు పెట్టుకున్నగా చూపించారు. అతనికి మామయ్య కూడా ఉన్నాడు. పైగా తన తండ్రి చేసిన అప్పుల్ని రంగాని తీరుస్తున్నట్టుగా చూపించారు. రంగా చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని చెప్పేశారు. నా నాన్నమ్మ కోసం ఫ్యామిలీ కోసం తిరిగి వస్తుండగా.. ప్రమాదంలో ఉన్న రిషిని కాపాడతాడని.. ఆ ప్రయత్నంలోనే అతను కోమాలోకి పోయాడని.. ఆ ప్రమాదానికి కారణం తానే కావడంతో రిషి.. రంగాగా ఆ ఊరికి వెళ్లాడని సింపుల్‌గా తేల్చేశారు. చాలా ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయినా మనవడ్ని.. నాన్నమ్మ గుర్తుపట్డదా? మరదలు సరోజ ఎలా నమ్మేసింది? బుజ్జిగాడు అన్నా అన్నా అని ఎలా పిలుస్తున్నాడు? అసలు ఊరంతా అతన్ని రంగాగా ఎలా నమ్మారు? చిన్నప్పుడే ఊరు వదిలి వెళ్లినోడ్ని.. ఆ ఊరి జనం ఎలా గుర్తుపట్టాడు? ఆ ఊరితో రంగా అనుబంధం ఎలా ఏర్పరుచుకున్నాడు.. ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. మరి ఈ ప్రశ్నలన్నింటికి దర్శకుడు ఏ విధమైన ముగింపు ఇస్తాడో చూడాలి మరి.  

భర్తపై అలిగిన భార్య.. ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో  వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -184 లో... హాల్లో పడుకొని ఉన్న సీతాకాంత్ దగ్గరికి పెద్దాయన వచ్చి ఇక్కడ పడుకున్నావ్ ఏంటని అడుగుతాడు. రామలక్ష్మి నీకు ఏదో చెప్తాను అంది కదా అదే విషయం నీకు చెప్పాలని చాలా వెయిట్ చేసింది.. మరి ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వెళ్ళానని సీతాకాంత్ చెప్పగా.. నీ భార్య కంటే ఎక్కువనా అది అని పెద్దాయన కోప్పడతాడు. దాంతో రాత్రి రామలక్ష్మితో మాట్లాడింది గుర్తుచేసుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్ వెళ్తాడు. నాపై చాలా కోపంగా ఉన్నట్టు ఉందని అనుకుంటాడు. రామలక్ష్మి అని పిలవగానే.. అయ్యో వచ్చారా తలనొప్పి అన్నారు కదా తగ్గిందా అంటు వెటకారంగా మాట్లాడుతుంది. నువ్వు రాత్రి ఒక విషయం చెప్తానన్నావ్ ఏంటని అడుగుతాడు. నేను మర్చిపోయా గుర్తుకువచ్చినప్పుడు చెప్తానని కావాలనే రామలక్ష్మి అంటుంది. నేను అలా వెళ్లినందుకు సారీ అని సీతాకాంత్ చెప్తాడు. అయిన సీతాకాంత్ పై రామలక్ష్మి కోపంగా ఉంటుంది. ఆ తర్వాత పెద్దాయనకి రామలక్ష్మి టిఫిన్ పెడుతుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. అతనికి ప్లేట్ నిండుగా ఇడ్లీ చట్నీ వేస్తుంది. ఏంటి ఇలా చేసావని సీతాకాంత్ అడుగగా.. మీరు బిజీ కదా ఎప్పుడు వెళ్లిపోయేది తెలియదు కదా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. నువ్వు కాళ్ళు పట్టుకుంటావో.. చేతులు పట్టుకెంటావో నాకు తెలియదు.. నువ్వు రామలక్ష్మి అలక తీర్చాలని సీతకాంత్ తో పెద్దాయన అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్తాడు. రామలక్ష్మి ఫోటో చూస్తూ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను.. ఆ విషయం నీతో ఎలా చెప్పాలని సీతాకాంత్ అనుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి కూడా సీతాకాంత్ ఫోటో చూస్తూ మాట్లాడుకుంటుంది. ఇద్దరు ఒకేసారి మాట్లాడాలనుకొని ఒకేసారి ఫోన్ చేస్తారు. ఇద్దరికి ఫోన్ కల్వదు. ఆ తర్వాత నిన్ను బాధపెట్టాను సారీ అంటూ సీతాకాంత్ మెసేజ్ పెడతాడు. అది చూసి తనకి ఇష్టమైనవి వండుకొని తీసుకొని వెళ్తానని రామలక్ష్మి అనుకుటుంది. మరొకవైపు నందిని వస్తుంటే గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పాలని సందీప్ అనుకుంటాడు. కానీ నాకు అదంతా ఇష్టం ఉండదని నందిని అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి నందిని వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

దీపని మెచ్చుకున్న పారిజాతం.. శ్రీధర్ కి కావేరి ఫోన్.. జస్ట్ మిస్! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీకదీపం-2 (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్- 132లో.. పారిజాతం దగ్గరకు వచ్చిన దాసు.. జ్యోత్స్న ఎంతలా దిగజారిపోతుందోనని బాధపడతాడు. తన కళ్ల ముందే రోడ్డు మీద యాక్సిడెంట్‌ జరిగితే పట్టించుకోకుండా వెళ్లిందని ఎమోషనల్‌ అవుతాడు. తర్వాత తన కొడుకు యాక్సిడెంట్‌ వీడియో పారిజాతానికి చూపిస్తాడు. ఈ వీడియోలో ఉన్న కాశీ తన కొడుకని దాసు చెప్పడంతో పారిజాతం షాక్‌ అవుతుంది. మరోవైపు హాస్పిటల్‌ కు జ్యోత్స్న వెళ్లడంతో దీప ఆశ్యర్యపోతుంది. యాక్సిడెంట్ అయిన వీడు ప్రశాంతంగా ఉన్నాడు.. వీడిని కాపాడినట్టు బిల్డప్ ఇచ్చిన నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు.. కారు ఆపకుండా వెళ్లిపోయానని వాడు ఎవడో వీడియో తీసి సోషల్ మీడియాలో నన్ను ఛీ అనిపించాడని జ్యోత్స్న అనగానే.. ఇప్పుడు నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా అని దీప అంటుంది. నీతో గొడవ పెట్టుకుంటే ఊరుకుంటారా.. ఇక్కడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి.. ఈ వీడియో కూడా ఎవడో ఒకడు ఎడిట్ చేసి మానవత్వంతో యాక్సిడెంట్ అయిన అబ్బాయిని కాపాడిన మహిళ మీద మిస్‌ హైదరాబాద్‌ దౌర్జన్యం అని రాస్తారు. యాక్సిడెంట్ అయ్యింది వీడికి కానీ డ్యామేజ్ జరిగింది నాకు అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే కార్తీక్ రావడంతో జ్యోత్స్న మాట మారుస్తుంది. మరోవైపు మనవడిని తలుచుకుని పారిజాతం బాధపడుతుంది. జ్యోత్స్న ను మరీ ఇలా పెంచావేంటని పారిజాతాన్ని ప్రశ్నిస్తాడు దాస్. మనిషి ప్రాణం పోయిన పట్టించుకోనంత దుర్మార్గంగా పెరిగిందని అడుగుతాడు. ఇంతలో పారిజాతం దగ్గరకి జ్యోత్స్న వస్తుంది. ఎక్కడికి వచ్చావు పారు అని జ్యోత్స్న అడుగగా.. యాక్సిడెంట్ అయిన అబ్బాయిని చూసి వస్తానని పారిజాతం అంటుంది. వాడిని చూడాల్సిన అవసరమేంటని జ్యోత్స్న అనగానే. వాడు నీ అనేసి ఆగిపోతుంది. 'హా.. నా' ఏంటి అని జ్యోత్స్న అనగానే.. ఏదో కవర్ చేస్తుంది. ఇక కాశీ దగ్గరికి వెళ్ళిన పారిజాతం.. నన్ను క్షమించురా మనవడా, యాక్సిడెంట్ అయింది నీకని తెలిస్తే రోడ్డు మీద అలా వదిలేసి వెళ్లిపోయే దాన్ని కాదని మనసులో అనుకుంటుంది. ఇక తనని చూసిన కార్తీక్ డౌట్ పడతాడు. దగ్గరుండి వీడిని సొంత మనిషిలా చూసుకుంటున్నావు.. నువ్వు చాలా గ్రేట్‌ కార్తీక్ అని పారిజాతం అనగానే. నేను కాదు చూసుకుంటుంది దీప. కాపాడింది కూడా దీపే అని అంటాడు. దాంతో చాలా మంచి పని చేశావు దీప అని పారిజాతం మెచ్చుకుంటుంది.  మరోవైపు స్వప్న గురించి ఆలోచిస్తూ శ్రీధర్ కి ఫోన్ చేస్తుంది కావేరి. అప్పుడు కాంచన ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. బేబీ ఎక్కడున్నావని కావేరి అనగానే. బేబి ఎవరు అని కాంచన అంటుంది. దాంతో వెంటనే కంగారుపడి కావేరి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత శ్రీధర్ వస్తాడు. బేబీ ఎవరని కాంచన అడగడంతో శ్రీధర్‌ ఫస్ట్‌ షాక్‌ అయి.. ఆ  తర్వాత ఎవరో నాకేం తెలుసని మాట మారుస్తాడు. ఎవరో అర్థం పర్థం లేని వాళ్ళు ఇలా ఫోన్ చేస్తారు. భార్యాభర్తల మధ్య అపార్థాలు సృష్టిస్తారని కవర్ చేస్తాడు. మరోవైపు ఇంటికొచ్చిన దీపను సుమిత్ర మెచ్చుకుంటుంది. జ్యోత్స్న మాత్రం వెటకారంగా దీపను తిడుతుంది. నువ్వే ఆ వీడియో తీయించి ఉంటావని దీపను అనుమానిస్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రిషి నటిస్తున్నాడనే నిజం తెలుసుకున్న శైలేంద్ర, దేవయాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-1162 లో.. సరోజ, శైలేంద్ర మాట్లాడుకుంటారు. మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారా అంటూ సరోజ నిలదీయడంతో.. శైలేంద్ర షాక్‌ అవుతాడు. నువ్వు చెప్పేది నిజమా అంటూ వాడు నిజంగా రిషినేనా అని అనుమానిస్తాడు. తర్వాత షాక్‌ నుంచి తేరుకుని మీ బావను మీ ఊరికి పంపించే బాధ్యత నాది అని చెప్తాడు. అయితే ఎండీ సీట్ కోసం స‌రోజ‌ను కూడా పావుగా వాడుకోవాలి అనుకుంటాడు శైలేంద్ర‌. వ‌సుధార‌పై స‌రోజ మ‌న‌సులో ద్వేషాన్ని నింపుతాడు. మీ బావ నీకు ద‌క్కాలంటే నేను చెప్పిన‌ట్లు చేయాలంటాడు శైలేంద్ర. మరోవైపు వ‌సుధార‌కు రిషి స‌ర్‌ప్రైజ్ ఇస్తాడు. వసుధారకు చెప్పకుండా చ‌క్ర‌పాణి ఇంటికి తీసుకెళ్తాడు. తండ్రిని చూసిన వ‌సుధార ఎమోష‌న‌ల్ అవుతుంది.  అదేంటి మామయ్య మీరు వసుధారను ఎలా ఉన్నావని కూడా అడగట్లేదని చక్రపాణితో రిషి అనగానే.. నీ ద‌గ్గ‌ర వ‌సుధార ఉన్న‌ప్పుడు ఇంకా ఎలా ఉన్నావని  అడ‌గాల్సిన ప‌నిలేదు బాబు అని చక్రపాణి అంటాడు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి శరీరమంతా గాయాలతో వస్తాడు. అతడిని చూసి ఎవరు సర్ ఇతను అని వసుధార అడుగగా.. ఇన్ని రోజులు నేను ఎవ‌రి పేరుతో బ‌య‌ట ‌తిరుగుతున్నానో అత‌డే ఇతను. అస‌లైన రంగా ఇత‌డే అని రిషి అంటాడు. రిషి మాటలకు వ‌సుధార షాక‌వుతుంది. అసలైన రంగాను బుజ్జి గుర్తుపడతాడు. అసలు ఏం జరిగిందని వసుధార అడుగగా.. రంగా ఓ మెకానిక్ అని,  తనపై కొంద‌రు ఎటాక్ చేస్తోండ‌గా..రంగా వారికి అడ్డుగా వెళ్లి త‌న ప్రాణాల మీదుకు తెచ్చుకున్నాడ‌ని జ‌రిగిన క‌థ మొత్తం రిషి చెప్తాడు. చిన్న‌ప్పుడే రంగా ఊరు వ‌దిలిపెట్టి వెళ్ల‌డంతో.. నేను రంగాను అని చెప్పినా ఎవ్వరూ అనుమానించలేదని రిషి చెప్తాడు. అమ్మ నాకు రాసిన లెటర్‌ ఇవ్వడానికి వచ్చి ఈ రంగా తన  ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడ‌ని, అమ్మ రాసిన లెటర్‌లో చాలా నిజాలు ఉన్నాయని చెప్తాడు రిషి.  మరోవైపు కొడుకును తిడుతుంది దేవయాని. నువ్వు చేసే ప‌నుల‌న్నీ ఇలాగే ఉంటాయి శైలేంద్ర. అస‌లు అత‌డు రంగానే కాద‌ని రిషి అని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నానని దేవయాని అనగానే.. అవును మామ్‌ కానీ వాడు రంగా అని నన్ను నమ్మించాడని శైలేంద్ర అంటాడు. వాడు రిషి కాబట్టే.. నువ్వు ఊరు వెళ్లిన‌ప్పుడు వ‌సుధార నీ కంట ప‌డ‌కుండా దాచిపెట్టాడు. ఇప్పుడు ఏ భ‌యం లేకుండా కాలేజీలో, ఇంట్లో తిరుగుతున్నాడు. వాడు రిషి కాక‌పోతే వ‌సుధార వాడితో ఎందుకు క‌లిసి ఉంటుంది అంటుంది. వసుధారతో స‌రోజ‌కు ఫోన్ చేయిస్తాడు రిషి. వ‌సుధార మాట విన‌గానే స‌రోజ ఫైర్ అవుతుంది. నిన్ను వ‌దిలేది లేద‌ని అంటుంది. నువ్వు, శైలేంద్ర క‌లిసే ఈ డ్రామా ఆడారంటూ కోపంగా తిడుతుంది. అయితే సరోజ మాటలతో  శైలేంద్ర‌, దేవయానిలకు తాను రిషిని అన్న విషయం తెలిసి ఉండొచ్చని రిషి అనుకుంటాడు. రిషి సార్‌ జగతి మేడం రాసిన లెటర్‌ చూపించి మీ అన్నయ్య కుట్రలను బయటపెట్టొచ్చు కదా? అని వసుధార అనగానే.. ఇన్ని చేసిన వాళ్ల‌కు ఆ లెట‌ర్ అబ‌ద్ధం అని నిరూపించ‌డం పెద్ద విష‌యం కాదు వసుధార అని రిషి అంటాడు. మరి ఎలా సర్‌ ఆ శైలేంద్ర కుట్రలను ఆపేది అని వసుధార అనగానే.. వాళ్ల నోటితోనే నిజాలన్నీ  బ‌య‌ట‌పెట్టిస్తాను. వాళ్ల నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డే టైమొచ్చిందని రిషి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మహేంద్ర దగ్గరికి వెళ్తారు. అదేసమయంలో శైలేంద్ర కూడా వస్తాడు. ఇక్కడెందుకున్నావని శైలేంద్రని రిషి అడగ్గా.. బాబాయ్ ఎలా ఉన్నాడో..అస‌లు ఉన్నాడో లేదో చూద్దామ‌ని వ‌చ్చాన‌ని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఒక్కటైన అక్కచెల్లెళ్ళు.. కొత్తకోడలికి అడుగడుగునా అవమానం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-497లో..  అప్పు త‌న‌ను అర్థం చేసుకోవ‌డం చూసి కావ్య ఎమోష‌న‌ల్ అవుతుంది. కోడ‌లు క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం చూసిన అప‌ర్ణ కంగారు ప‌డుతుంది. నువ్వు ఎవ‌రిని వ‌దిలిపెట్టి ఉండ‌లేవు క‌దా.. ఎప్ప‌టికైనా క‌ళ్యాణ్, అప్పుల‌ను ఇంట్లో అడుగుపెట్టేలా చేసేది నువ్వే అని కావ్య‌కు స‌ర్ధిచెబుతుంది. త‌న కోసం మాత్ర‌మే త‌ల్లి ధాన్య‌ల‌క్ష్మి షాపింగ్ చేసింద‌ని తెలిసి క‌ళ్యాణ్ బాధ‌ప‌డ‌తాడు. అమ్మ నా కోసం మాత్ర‌మే షాపింగ్‌ చేసి అప్పుని మ‌రిచిపోయింద‌ని, త‌న‌కు కోడ‌లు ఉంద‌ని కూడా గుర్తించ‌డం లేద‌ని బాధ‌ప‌డ‌తాడు. ధాన్య‌ల‌క్ష్మి మారిపోయింద‌ని క‌ళ్యాణ్‌కు స‌ర్ధిచెప్తుంది ఇందిరాదేవి. నిజంగా మారిపోయిందైతే చిన్న చీర విష‌యానికే అప్పును అంత‌గా అవ‌మానించేది కాద‌ని క‌ళ్యాణ్‌ బాధ‌ప‌డ‌తాడు. అప్పు చీర క‌ట్టుకొని కిందకొస్తుంది. ఎలాగైనా అప్పును అవ‌మానించాలని ధాన్య‌ల‌క్ష్మి భావిస్తుంది. అప్పు కంగారు ప‌డుతుంటంతో ఆ దుష్ట‌శ‌క్తుల‌ను చూసి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని స్వ‌ప్న‌, కావ్య అంటారు. అప్పు, కావ్య‌, స్వ‌ప్న సంబ‌రంగా మాట్లాడుకోవ‌డం చూసి రాజ్ ఆనంద‌ప‌డ‌తాడు. ఎప్పుడు ఇలాగే ఉంటే ప్ర‌తిరోజు పండగ‌లానే ఉంటుంద‌ని అప‌ర్ణ‌, ఇందిరాదేవి అనుకుంటారు. అంద‌రం ఒకే చోట ఉంటే ఈ సంతోషం ఇలాగే ఉంటుంద‌ని క‌ళ్యాణ్‌ కి రాజ్‌ చెప్తాడు.  పూజ‌కు అవ‌స‌ర‌మైన సామాగ్రి తీసుకురావ‌డానికి కిచెన్‌లోకి వ‌స్తుంది అప్పు. అక్క‌డే ధాన్య‌ల‌క్ష్మి ఉండ‌టంతో ఆమెను అత్త‌య్య అని పిలుస్తుంది. ఆ పిలుపు విని ధాన్య‌ల‌క్ష్మి ఫైర్ అవుతుంది. అప్పు చేత ముత్తయిదవులకి జ్యూస్ ఇప్పిస్తుంది ధాన్యలక్ష్మి. ఆ జ్యూస్ ఓ ముత్తయిదువుపై ప‌డేలా ధాన్య‌ల‌క్ష్మి, రుద్రాణి ప్లాన్ చేస్తారు. కాసేపటికి కావాల‌నే అప్పు ఇదంతా చేసింద‌ని ధాన్య‌ల‌క్ష్మి ఫైర్ అవుతుంది. ఇంటికి వ‌చ్చిన ముత్తయిదువుల‌ను ఎలా చూసుకోవాలో తెలియ‌దా, బొత్తిగా అడివిమ‌నిషిలా ఉన్నావ‌ని అవ‌మానిస్తుంది. మీ అమ్మ నిన్ను ఊరి మీదికి వ‌దిలేస్తే ఇలాంటి బుద్దులే వ‌స్తాయ‌ని ముత్తయిదువ‌లు కూడా అప్పును అవ‌మానిస్తారు. మీ ఇంటికి ఉన్న పేరును నీ కోడలు వీధిన ప‌డేసేలా క‌నిపిస్తుంద‌ని ధాన్య‌ల‌క్ష్మితో అంటారు. దాంతో మా క‌ళ్యాణ్ కూడా తొంద‌ర‌ప‌డి అప్పును పెళ్లిచేసుకొని మా కొంప ముంచాడ‌ని ధాన్య‌ల‌క్ష్మి అంటుంది. కావాల‌నే అప్పును రెచ్చ‌గొట్టి గొడ‌వ పెద్ద‌ది చేయాల‌ని ముత్తయిదువులు చూస్తారు. కానీ క‌ళ్యాణ్‌కు ఇచ్చిన మాట కోసం అప్పు మౌనంగా ఉంటుంది. భార్య‌కు త‌న క‌ళ్ల ముందే అవ‌మానం జ‌ర‌గ‌డం క‌ళ్యాణ్ స‌హించ‌లేక‌పోతాడు. అప్పుకు ఇందిరాదేవి స‌పోర్ట్ చేస్తుంది. ఇంటి గుట్టును ప‌దిమందికి ప్ర‌సాదంలా పంచుతున్నావ‌ని ధాన్య‌ల‌క్ష్మికి వార్నింగ్ ఇస్తుంది ఇందిరాదేవి. ఆవిడ గ్లాస్ స‌రిగ్గా ప‌ట్టుకోలేద‌ని, ఇందులో నీ త‌ప్పేం లేద‌ని అప్పుతో ఇందిరాదేవి అంటుంది. మీ అత్త క‌ళ్ల‌కు పొర‌లు క‌ప్పి ఉండ‌టంతో అది గుర్తించ‌లేద‌ని చెబుతుంది. ఆ త‌ర్వాత వ్ర‌తంలో ఎవ‌రి కొడుకు, కోడ‌లు వెనుక వాళ్ల అత్త‌గారు కూర్చోవాల‌ని చెబుతుంది. అప్పు, క‌ళ్యాణ్ వెనుక కూర్చోవ‌డానికి ధాన్య‌ల‌క్ష్మి అంగీక‌రించ‌దు. ప్ర‌కాశం వార్నింగ్ ఇవ్వ‌డంతో కూర్చుంటుంది. వ్ర‌తం ఎలాంటి గొడ‌వ‌లు లేకుండా పూర్త‌వ్వ‌డం చూసి ఇంట్లో వాళ్లు అంద‌రు ఆనంద‌ప‌డ‌తారు. ముత్తయిదువుల‌కు భోజ‌నం వ‌డ్డించే స‌మ‌యంలో అప్పులోని త‌ప్పుల‌ను ధాన్య‌ల‌క్ష్మి ఎత్తిచూపుతుంది. వారికి వ్ర‌తం భోజ‌నం పెడుతున్నావా...పిండం భోజ‌నం పెడుతున్నావా.. ఇంత చిన్న విష‌యం కూడా తెలియ‌దా అంటు ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఢీ షో లో అవు డాన్స్...ఆది చూస్తుంటే పడిపోతోంది 

  ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా హాట్ నెస్ ఓవర్ లోడెడ్ తో ఉంది. ఆది ఇందులో ఒక మెజీషియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా ఆది ఉంటే వచ్చే బూతులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య కుమార్ మాష్టర్ కూడా ఆదికి తోడయ్యాడు. కుమార్ మాష్టర్ ఒక తాడు ఇచ్చి దాన్ని నిలబెట్టమని చెప్పాడు. దాంతో హోస్ట్ నందు మ్యాజిక్ స్టిక్ తీసుకుని ఆ తాడును స్ట్రైట్ గా నిలబెట్టాడు. ఐతే కుమార్ మాష్టర్ మాత్రం ఆది అన్న నువ్వు చూస్తుంటే పడిపోతోంది అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేసాడు. ఇక డాన్సర్ మానసి జోషి ఐతే అద్భుతంగా డాన్స్ చేయడంతో పాటు ఆదికి మాస్ వార్నింగ్ ఇచ్చింది. "రేయ్ ఆది కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా" అంది. చూడబోతే ఆమె కళ్ళు కత్తుల కన్నా పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఇక చిట్టి మాష్టర్ డాన్సర్ రాము రాథోడ్ మాత్రం మ్యాజిక్ చేశారు. ఒక ఆవును తీసుకొచ్చి ఒక జానపద పాటను పాడుతూ డాన్స్ చేసి అందరినీ ఎమోషనల్ గా టచ్ చేశారు. "ఆవును తీసుకొచ్చి సాంగ్ లో పెట్టాలన్న ఆలోచన అవుట్ ఆఫ్ ది బాక్స్" అంటూ శేఖర్ మాష్టర్ చిట్టి మాష్టర్ ని పొగిడాడు. ఇక ఈ పాటకు అటు జనులూరితో ఇటు హన్సికతో కలిసి డాన్స్ చేశారు రాము రాథోడ్. ఈ సాంగ్ మాత్రం ఈ ఎపిసోడ్ లో హైలైట్ గ నిలిచింది. జానపదాలు వింటే ఎవరికైనా ఊపొస్తుంది. ఈ సాంగ్ విన్నాక రాము రాథోడ్ కి ఫ్యాన్ ఇపోయానని చెప్పాడు శేఖర్ మాష్టర్.