Guppedantha Manasu : కూపీలాగిన శైలేంద్ర.. మహేంద్రని కాపాడిన రిషి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1163 లో.... ఫణీంద్ర, శైలేంద్రలు మహేంద్ర దగ్గరికి వస్తారు. ఇలా వచ్చారేంటని మహేంద్ర అడుగుతాడు. ఆ తర్వాత రిషికి బయటకు రా అంటూ శైలేంద్ర సైగ చేస్తాడు. రిషి బయటకు రాగానే నువ్వు రిషివా రంగావా అని అడుగుతాడు. ఎందుకు అలా డౌట్ పడుతున్నారని రిషి అడుగగా.. నేను సరోజని కలిసాను.. నువ్వు  వసుధార నీ ఇంట్లో ఉన్న విషయం ఎందుకు నాతో చెప్పలేదు.. అయినా ఒకసారి ఫోటో చూపించి అడిగితే తెలియదన్నావ్ కదా.. ఎందుకు నాతో అబద్దం చెప్పావని శైలేంద్ర అడుగుతాడు. ఆ తర్వాత రిషి పాండు ఫోటో చూపించి.. వీడు ఆ మేడమ్ పై ఎటాక్ చేయబోతుంటే నేనే కాపాడాను.. వాళ్ళు నాపై ఎటాక్ చేస్తుంటే మేడమ్ కాపాడారు. అందుకే మేడమ్ ప్రాబ్లమ్ లో ఉందనుకొని చెప్పలేదని రిషి చెప్తాడు. మరి ఇక్కడికి వచ్చాక కూడా చెప్పాలి కదా అని శైలేంద్ర అనగానే.. మీరు నన్ను అడగలేదని రిషి అంటాడు. అయిన ప్రతిసారీ మీరు ఎందుకు నాపై డౌట్ పడుతున్నారు.. మీపై నేనెప్పుడైన డౌట్ పడుతున్నానా.. మేడమ్ గారు మీ గురించి చాలా చెప్పారు.. రిషి వాళ్ళ అమ్మపై ఎండీ సీట్ గురించి ఎటాక్ చేయించారట.. అయిన మిమ్మల్ని మంచివారని అనుకుంటున్నానని రిషి అంటాడు. ఇంకోసారి మీరు నాపై డౌట్ పడితే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతానని శైలేంద్రతో రిషి అంటాడు. ఆ తర్వాత వసుధార పిలుస్తుంటే రిషి వెళ్ళిపోతుంటాడు. అప్పుడే శైలేంద్ర ఫోన్ లో.. షూట్ మిస్ అవ్వద్దని అనడం రిషి వింటాడు. ఆ తర్వాత ఫణీంద్ర, శైలేంద్రలు వెళ్ళిపోదామని బయటకు వస్తారు. వాళ్లతో మహేంద్ర కూడా బయట వరకు వస్తాడు. శైలేంద్ర సైగ చెయ్యగానే రౌడీ షూట్ చేస్తాడు. వెంటనే రిషి మహేంద్రని పక్కకి లాగుతాడు. ఆ తర్వాత శైలేంద్ర డిస్సపాయింట్ అవుతాడు. ఏం తెలియనట్టు ఏమైంది బాబాయ్ అంటూ అడుగుతాడు. ఇలా జరిగిందేంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని ఫణీంద్ర అనగానే.. వద్దని శైలేంద్ర అంటాడు. నేను చూసుకుంటానని రిషి అనగానే.. సరేనని ఫణీంద్ర అంటాడు. శైలేంద్రని రిషి కోపంగా చూస్తుంటాడు. ఆ తర్వాత ఇది ఎవరు చేసారో నాకు తెలుసు అంటు వసుధార కోపంగా వెళ్తుంది. మరొకవైపు సరోజకి శైలేంద్ర ఫోన్ చేసి.. ఆ వసుధార మీ బావని నీకు దూరం చేస్తుందని, ఆ వసుధార సంగతి చెప్పు అడ్రెస్ పంపిస్తున్నానని శైలేంద్ర అనగానే.. సరేనని సరోజ అంటుంది. ఆ తర్వాత మా మావయ్య గారిపై ఎందుకు ఎటక్ చేసావని మనుని వసుధార అడుగుతుంది. నేను చెయ్యలేదు.. అయిన నేనెందుకు చేస్తానని మను అనగానే.. అతనే నీ కన్నతండ్రి అని చెప్పబోయి వసుధార ఆగిపోతుంది. ఇప్పుడు కూడా చెప్పట్లేదని మను అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కొత్తజంటకి అల్లరి మామ సపోర్ట్.. కావ్యకి దగ్గరవుతున్న రాజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -498 లో.. అప్పుని తీసుకొని కళ్యాణ్ తన ఇంటికి వరలక్ష్మి వ్రతానికి వస్తాడు. అప్పు ఈ ఇంటికి సరైన కోడలు కాదని నిరూపించే ప్రయత్నం చేస్తుంది ధాన్యలక్ష్మి. వరలక్ష్మి వ్రతం పూర్తి అవ్వగానే.. ముగ్గురు అక్కచెల్లెళ్ళు తమ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లకి భోజనం వడ్డీస్తుంది అప్పు. దాంతో నువ్వు వచ్చిన వాళ్ళని అవమానించడం కోసమే పిలిచావా.. ఫస్ట్ ఎవరైనా అన్నం పెడుతారా అని ధాన్యలక్ష్మి అంటుంది. మా చెల్లికి ఇలాంటివి తెలియదు అని కావ్య వడ్డీస్తుంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి వాయినం ఇస్తారు. వచ్చిన వాళ్లు వెళ్లేముందు ఈ అప్పు మాత్రం ఈ దుగ్గిరాల ఇంటికి కోడలు గా తగదని చెప్పి వెళ్తారు. ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ లు బయలుదేర్తామని రాజ్ కి చెప్తారు. ఏంటి రా మీరు ఇక్కడే ఉండండి అని రాజ్ అంటాడు. ఈ అద్దాల మేడలో ఎవరు రాయి విసిరిన పగిలేలా ఉంది.. అయినా మేమ్ వచ్చింది ఉండిపోవడానికి కాదు తాతయ్య, నానమ్మల మాట కాదనలేక వచ్చమని కళ్యాణ్ అంటాడు. ఈ ఒక్క రోజు వస్తే చూసారు కదా పరిస్థితి ఎలా ఉందో అన్నట్లుగా కళ్యాణ్ అంటాడు. వచ్చినందుకు నీకేం తక్కువ చేసానని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ మాట నువు అంటున్నావా.. వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ని అవమానించావని ధాన్యలక్ష్మితో ఇందిరాదేవి అంటుంది. అయిన వచ్చిన వాళ్ళు అన్నారు కదా.. ఆ అమ్మాయి ఈ ఇంటికి కరెక్ట్ కాదని అని ధాన్యలక్ష్మి అంటుంది. అసలు వాళ్ళని మీరు పిలిచారా అని స్వప్న, అపర్ణలని ఇందిరాదేవి అడుగుతుంది. లేదని అపర్ణ అనగానే అయితే మా చెల్లిని అవమానించిడానికి మీరే పిలిచారని ధాన్యలక్ష్మితో స్వప్న అంటుంది. ఆ విషయం నాకు ఎప్పుడో అర్థం అయిందని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ వాళ్లని ఇందిరాదేవి ఉండమని అంటుంటే.. ఎందుకు అమ్మ రోజు ఇలాగే నా కోడలు అవమానపడాలి అనుకుంటాన్నావా.. వద్దు వాళ్ళకి ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది.. ప్రేమ ఉంది.. వాళ్ళు ఎక్కడైనా హ్యాపీగా ఉంటారని ప్రకాష్ అంటాడు. వెళ్ళు మీరిద్దరు మళ్ళీ ఈ ఇంటికి తలెత్తుకొని వచ్చే రోజు వస్తుంది. అప్పుడు నిన్ను అనేవాళ్ళు తలదించుకుంటారని అప్పుతో  కావ్య చెప్తుంది. ఆ తర్వాత అప్పుని తీసుకొని కళ్యాణ్ వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో కావ్యని రాజ్ ప్రేమగా దగ్గరకి తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu Climax :  గుప్పెడంత మనసు సీరియల్ కి క్లైమాక్స్ ఇదా...

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఒక్కో ఎపిసోడ్ లో ఉన్న ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తూ దర్శకుడు క్లైమాక్స్ కి చేరుస్తున్నాడు. అసలు అటో ట్రైవర్ గా రంగా పాత్రలో రీఎంట్రీ ఇచ్చిన రిషి గతమేంటని సింపుల్ గా తేల్చేశాడు దర్శకుడు. రంగానే రిషి అని నమ్మిన వసుధార అతన్ని వెతుక్కుంటూ వెళ్లింది. అక్కడికి వెళ్ళాక రంగానే రిషి అని బలంగా నమ్మింది. చివరికి అదే నిజం అయ్యింది కూడా. కానీ.. శనివారం నాటి ఎపిసోడ్‌లో రంగాగా రిషి ఎందుకు నటించాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు. అసలు రంగాని రంగంలోకి దింపారు. రంగా వేరు.. రిషి వేరు అనే వివరణ ఇచ్చారు కానీ.. అసలు అందులో లాజిక్కే లేదు. ఏదో శుభం కార్డ్ వెయ్యాలి కాబట్టి హడావిడిగా క్లైమాక్స్‌లో కథని కన్ఫూజన్ గా చేసేశారు. మరోవైపు మను తండ్రి ఎవరు అనే ప్రశ్నకి సింపుల్ గా శైలేంద్రతో చెప్పించేశాడు.  రంగాని వెతుక్కుంటూ వసుధార అతని ఊరు వెళ్లినప్పుడు.. అతనికి ఒక ఫ్యామిలీ ఉంది.. నాన్నమ్మ ఉంది.. అక్కడే చదువుకున్నాడు.. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు.. చాలా మంది పిల్లల్ని చదివిస్తున్నాడంటు వసుధారకి చెప్పించారు. టీ కొట్టోడు దగ్గర నుంచి కాలేజ్ ప్రిన్సిపల్ కూడా రంగా గొప్పతనాన్ని చాటారు. రంగా ఆ ఊరిలోనే పుట్టిపెరిగినట్టుగా చూపించారు. వసుధార కూడా అనేక సందర్భాల్లో రంగా గురించి ఆ ఊరిలో అడిగినప్పుడు.. రంగా చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు అని చెప్పారు. ఇక సరోజ కూడా.. చిన్నప్పటి నుంచి బావపై ఆశలు పెట్టుకున్నగా చూపించారు. అతనికి మామయ్య కూడా ఉన్నాడు. పైగా తన తండ్రి చేసిన అప్పుల్ని రంగాని తీరుస్తున్నట్టుగా చూపించారు. రంగా చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని చెప్పేశారు. నా నాన్నమ్మ కోసం ఫ్యామిలీ కోసం తిరిగి వస్తుండగా.. ప్రమాదంలో ఉన్న రిషిని కాపాడతాడని.. ఆ ప్రయత్నంలోనే అతను కోమాలోకి పోయాడని.. ఆ ప్రమాదానికి కారణం తానే కావడంతో రిషి.. రంగాగా ఆ ఊరికి వెళ్లాడని సింపుల్‌గా తేల్చేశారు. చాలా ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయినా మనవడ్ని.. నాన్నమ్మ గుర్తుపట్డదా? మరదలు సరోజ ఎలా నమ్మేసింది? బుజ్జిగాడు అన్నా అన్నా అని ఎలా పిలుస్తున్నాడు? అసలు ఊరంతా అతన్ని రంగాగా ఎలా నమ్మారు? చిన్నప్పుడే ఊరు వదిలి వెళ్లినోడ్ని.. ఆ ఊరి జనం ఎలా గుర్తుపట్టాడు? ఆ ఊరితో రంగా అనుబంధం ఎలా ఏర్పరుచుకున్నాడు.. ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. మరి ఈ ప్రశ్నలన్నింటికి దర్శకుడు ఏ విధమైన ముగింపు ఇస్తాడో చూడాలి మరి.  

భర్తపై అలిగిన భార్య.. ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో  వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -184 లో... హాల్లో పడుకొని ఉన్న సీతాకాంత్ దగ్గరికి పెద్దాయన వచ్చి ఇక్కడ పడుకున్నావ్ ఏంటని అడుగుతాడు. రామలక్ష్మి నీకు ఏదో చెప్తాను అంది కదా అదే విషయం నీకు చెప్పాలని చాలా వెయిట్ చేసింది.. మరి ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వెళ్ళానని సీతాకాంత్ చెప్పగా.. నీ భార్య కంటే ఎక్కువనా అది అని పెద్దాయన కోప్పడతాడు. దాంతో రాత్రి రామలక్ష్మితో మాట్లాడింది గుర్తుచేసుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్ వెళ్తాడు. నాపై చాలా కోపంగా ఉన్నట్టు ఉందని అనుకుంటాడు. రామలక్ష్మి అని పిలవగానే.. అయ్యో వచ్చారా తలనొప్పి అన్నారు కదా తగ్గిందా అంటు వెటకారంగా మాట్లాడుతుంది. నువ్వు రాత్రి ఒక విషయం చెప్తానన్నావ్ ఏంటని అడుగుతాడు. నేను మర్చిపోయా గుర్తుకువచ్చినప్పుడు చెప్తానని కావాలనే రామలక్ష్మి అంటుంది. నేను అలా వెళ్లినందుకు సారీ అని సీతాకాంత్ చెప్తాడు. అయిన సీతాకాంత్ పై రామలక్ష్మి కోపంగా ఉంటుంది. ఆ తర్వాత పెద్దాయనకి రామలక్ష్మి టిఫిన్ పెడుతుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. అతనికి ప్లేట్ నిండుగా ఇడ్లీ చట్నీ వేస్తుంది. ఏంటి ఇలా చేసావని సీతాకాంత్ అడుగగా.. మీరు బిజీ కదా ఎప్పుడు వెళ్లిపోయేది తెలియదు కదా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. నువ్వు కాళ్ళు పట్టుకుంటావో.. చేతులు పట్టుకెంటావో నాకు తెలియదు.. నువ్వు రామలక్ష్మి అలక తీర్చాలని సీతకాంత్ తో పెద్దాయన అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్తాడు. రామలక్ష్మి ఫోటో చూస్తూ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను.. ఆ విషయం నీతో ఎలా చెప్పాలని సీతాకాంత్ అనుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి కూడా సీతాకాంత్ ఫోటో చూస్తూ మాట్లాడుకుంటుంది. ఇద్దరు ఒకేసారి మాట్లాడాలనుకొని ఒకేసారి ఫోన్ చేస్తారు. ఇద్దరికి ఫోన్ కల్వదు. ఆ తర్వాత నిన్ను బాధపెట్టాను సారీ అంటూ సీతాకాంత్ మెసేజ్ పెడతాడు. అది చూసి తనకి ఇష్టమైనవి వండుకొని తీసుకొని వెళ్తానని రామలక్ష్మి అనుకుటుంది. మరొకవైపు నందిని వస్తుంటే గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పాలని సందీప్ అనుకుంటాడు. కానీ నాకు అదంతా ఇష్టం ఉండదని నందిని అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి నందిని వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

దీపని మెచ్చుకున్న పారిజాతం.. శ్రీధర్ కి కావేరి ఫోన్.. జస్ట్ మిస్! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీకదీపం-2 (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్- 132లో.. పారిజాతం దగ్గరకు వచ్చిన దాసు.. జ్యోత్స్న ఎంతలా దిగజారిపోతుందోనని బాధపడతాడు. తన కళ్ల ముందే రోడ్డు మీద యాక్సిడెంట్‌ జరిగితే పట్టించుకోకుండా వెళ్లిందని ఎమోషనల్‌ అవుతాడు. తర్వాత తన కొడుకు యాక్సిడెంట్‌ వీడియో పారిజాతానికి చూపిస్తాడు. ఈ వీడియోలో ఉన్న కాశీ తన కొడుకని దాసు చెప్పడంతో పారిజాతం షాక్‌ అవుతుంది. మరోవైపు హాస్పిటల్‌ కు జ్యోత్స్న వెళ్లడంతో దీప ఆశ్యర్యపోతుంది. యాక్సిడెంట్ అయిన వీడు ప్రశాంతంగా ఉన్నాడు.. వీడిని కాపాడినట్టు బిల్డప్ ఇచ్చిన నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు.. కారు ఆపకుండా వెళ్లిపోయానని వాడు ఎవడో వీడియో తీసి సోషల్ మీడియాలో నన్ను ఛీ అనిపించాడని జ్యోత్స్న అనగానే.. ఇప్పుడు నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా అని దీప అంటుంది. నీతో గొడవ పెట్టుకుంటే ఊరుకుంటారా.. ఇక్కడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి.. ఈ వీడియో కూడా ఎవడో ఒకడు ఎడిట్ చేసి మానవత్వంతో యాక్సిడెంట్ అయిన అబ్బాయిని కాపాడిన మహిళ మీద మిస్‌ హైదరాబాద్‌ దౌర్జన్యం అని రాస్తారు. యాక్సిడెంట్ అయ్యింది వీడికి కానీ డ్యామేజ్ జరిగింది నాకు అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే కార్తీక్ రావడంతో జ్యోత్స్న మాట మారుస్తుంది. మరోవైపు మనవడిని తలుచుకుని పారిజాతం బాధపడుతుంది. జ్యోత్స్న ను మరీ ఇలా పెంచావేంటని పారిజాతాన్ని ప్రశ్నిస్తాడు దాస్. మనిషి ప్రాణం పోయిన పట్టించుకోనంత దుర్మార్గంగా పెరిగిందని అడుగుతాడు. ఇంతలో పారిజాతం దగ్గరకి జ్యోత్స్న వస్తుంది. ఎక్కడికి వచ్చావు పారు అని జ్యోత్స్న అడుగగా.. యాక్సిడెంట్ అయిన అబ్బాయిని చూసి వస్తానని పారిజాతం అంటుంది. వాడిని చూడాల్సిన అవసరమేంటని జ్యోత్స్న అనగానే. వాడు నీ అనేసి ఆగిపోతుంది. 'హా.. నా' ఏంటి అని జ్యోత్స్న అనగానే.. ఏదో కవర్ చేస్తుంది. ఇక కాశీ దగ్గరికి వెళ్ళిన పారిజాతం.. నన్ను క్షమించురా మనవడా, యాక్సిడెంట్ అయింది నీకని తెలిస్తే రోడ్డు మీద అలా వదిలేసి వెళ్లిపోయే దాన్ని కాదని మనసులో అనుకుంటుంది. ఇక తనని చూసిన కార్తీక్ డౌట్ పడతాడు. దగ్గరుండి వీడిని సొంత మనిషిలా చూసుకుంటున్నావు.. నువ్వు చాలా గ్రేట్‌ కార్తీక్ అని పారిజాతం అనగానే. నేను కాదు చూసుకుంటుంది దీప. కాపాడింది కూడా దీపే అని అంటాడు. దాంతో చాలా మంచి పని చేశావు దీప అని పారిజాతం మెచ్చుకుంటుంది.  మరోవైపు స్వప్న గురించి ఆలోచిస్తూ శ్రీధర్ కి ఫోన్ చేస్తుంది కావేరి. అప్పుడు కాంచన ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. బేబీ ఎక్కడున్నావని కావేరి అనగానే. బేబి ఎవరు అని కాంచన అంటుంది. దాంతో వెంటనే కంగారుపడి కావేరి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత శ్రీధర్ వస్తాడు. బేబీ ఎవరని కాంచన అడగడంతో శ్రీధర్‌ ఫస్ట్‌ షాక్‌ అయి.. ఆ  తర్వాత ఎవరో నాకేం తెలుసని మాట మారుస్తాడు. ఎవరో అర్థం పర్థం లేని వాళ్ళు ఇలా ఫోన్ చేస్తారు. భార్యాభర్తల మధ్య అపార్థాలు సృష్టిస్తారని కవర్ చేస్తాడు. మరోవైపు ఇంటికొచ్చిన దీపను సుమిత్ర మెచ్చుకుంటుంది. జ్యోత్స్న మాత్రం వెటకారంగా దీపను తిడుతుంది. నువ్వే ఆ వీడియో తీయించి ఉంటావని దీపను అనుమానిస్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రిషి నటిస్తున్నాడనే నిజం తెలుసుకున్న శైలేంద్ర, దేవయాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-1162 లో.. సరోజ, శైలేంద్ర మాట్లాడుకుంటారు. మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారా అంటూ సరోజ నిలదీయడంతో.. శైలేంద్ర షాక్‌ అవుతాడు. నువ్వు చెప్పేది నిజమా అంటూ వాడు నిజంగా రిషినేనా అని అనుమానిస్తాడు. తర్వాత షాక్‌ నుంచి తేరుకుని మీ బావను మీ ఊరికి పంపించే బాధ్యత నాది అని చెప్తాడు. అయితే ఎండీ సీట్ కోసం స‌రోజ‌ను కూడా పావుగా వాడుకోవాలి అనుకుంటాడు శైలేంద్ర‌. వ‌సుధార‌పై స‌రోజ మ‌న‌సులో ద్వేషాన్ని నింపుతాడు. మీ బావ నీకు ద‌క్కాలంటే నేను చెప్పిన‌ట్లు చేయాలంటాడు శైలేంద్ర. మరోవైపు వ‌సుధార‌కు రిషి స‌ర్‌ప్రైజ్ ఇస్తాడు. వసుధారకు చెప్పకుండా చ‌క్ర‌పాణి ఇంటికి తీసుకెళ్తాడు. తండ్రిని చూసిన వ‌సుధార ఎమోష‌న‌ల్ అవుతుంది.  అదేంటి మామయ్య మీరు వసుధారను ఎలా ఉన్నావని కూడా అడగట్లేదని చక్రపాణితో రిషి అనగానే.. నీ ద‌గ్గ‌ర వ‌సుధార ఉన్న‌ప్పుడు ఇంకా ఎలా ఉన్నావని  అడ‌గాల్సిన ప‌నిలేదు బాబు అని చక్రపాణి అంటాడు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి శరీరమంతా గాయాలతో వస్తాడు. అతడిని చూసి ఎవరు సర్ ఇతను అని వసుధార అడుగగా.. ఇన్ని రోజులు నేను ఎవ‌రి పేరుతో బ‌య‌ట ‌తిరుగుతున్నానో అత‌డే ఇతను. అస‌లైన రంగా ఇత‌డే అని రిషి అంటాడు. రిషి మాటలకు వ‌సుధార షాక‌వుతుంది. అసలైన రంగాను బుజ్జి గుర్తుపడతాడు. అసలు ఏం జరిగిందని వసుధార అడుగగా.. రంగా ఓ మెకానిక్ అని,  తనపై కొంద‌రు ఎటాక్ చేస్తోండ‌గా..రంగా వారికి అడ్డుగా వెళ్లి త‌న ప్రాణాల మీదుకు తెచ్చుకున్నాడ‌ని జ‌రిగిన క‌థ మొత్తం రిషి చెప్తాడు. చిన్న‌ప్పుడే రంగా ఊరు వ‌దిలిపెట్టి వెళ్ల‌డంతో.. నేను రంగాను అని చెప్పినా ఎవ్వరూ అనుమానించలేదని రిషి చెప్తాడు. అమ్మ నాకు రాసిన లెటర్‌ ఇవ్వడానికి వచ్చి ఈ రంగా తన  ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడ‌ని, అమ్మ రాసిన లెటర్‌లో చాలా నిజాలు ఉన్నాయని చెప్తాడు రిషి.  మరోవైపు కొడుకును తిడుతుంది దేవయాని. నువ్వు చేసే ప‌నుల‌న్నీ ఇలాగే ఉంటాయి శైలేంద్ర. అస‌లు అత‌డు రంగానే కాద‌ని రిషి అని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నానని దేవయాని అనగానే.. అవును మామ్‌ కానీ వాడు రంగా అని నన్ను నమ్మించాడని శైలేంద్ర అంటాడు. వాడు రిషి కాబట్టే.. నువ్వు ఊరు వెళ్లిన‌ప్పుడు వ‌సుధార నీ కంట ప‌డ‌కుండా దాచిపెట్టాడు. ఇప్పుడు ఏ భ‌యం లేకుండా కాలేజీలో, ఇంట్లో తిరుగుతున్నాడు. వాడు రిషి కాక‌పోతే వ‌సుధార వాడితో ఎందుకు క‌లిసి ఉంటుంది అంటుంది. వసుధారతో స‌రోజ‌కు ఫోన్ చేయిస్తాడు రిషి. వ‌సుధార మాట విన‌గానే స‌రోజ ఫైర్ అవుతుంది. నిన్ను వ‌దిలేది లేద‌ని అంటుంది. నువ్వు, శైలేంద్ర క‌లిసే ఈ డ్రామా ఆడారంటూ కోపంగా తిడుతుంది. అయితే సరోజ మాటలతో  శైలేంద్ర‌, దేవయానిలకు తాను రిషిని అన్న విషయం తెలిసి ఉండొచ్చని రిషి అనుకుంటాడు. రిషి సార్‌ జగతి మేడం రాసిన లెటర్‌ చూపించి మీ అన్నయ్య కుట్రలను బయటపెట్టొచ్చు కదా? అని వసుధార అనగానే.. ఇన్ని చేసిన వాళ్ల‌కు ఆ లెట‌ర్ అబ‌ద్ధం అని నిరూపించ‌డం పెద్ద విష‌యం కాదు వసుధార అని రిషి అంటాడు. మరి ఎలా సర్‌ ఆ శైలేంద్ర కుట్రలను ఆపేది అని వసుధార అనగానే.. వాళ్ల నోటితోనే నిజాలన్నీ  బ‌య‌ట‌పెట్టిస్తాను. వాళ్ల నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డే టైమొచ్చిందని రిషి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మహేంద్ర దగ్గరికి వెళ్తారు. అదేసమయంలో శైలేంద్ర కూడా వస్తాడు. ఇక్కడెందుకున్నావని శైలేంద్రని రిషి అడగ్గా.. బాబాయ్ ఎలా ఉన్నాడో..అస‌లు ఉన్నాడో లేదో చూద్దామ‌ని వ‌చ్చాన‌ని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఒక్కటైన అక్కచెల్లెళ్ళు.. కొత్తకోడలికి అడుగడుగునా అవమానం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-497లో..  అప్పు త‌న‌ను అర్థం చేసుకోవ‌డం చూసి కావ్య ఎమోష‌న‌ల్ అవుతుంది. కోడ‌లు క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం చూసిన అప‌ర్ణ కంగారు ప‌డుతుంది. నువ్వు ఎవ‌రిని వ‌దిలిపెట్టి ఉండ‌లేవు క‌దా.. ఎప్ప‌టికైనా క‌ళ్యాణ్, అప్పుల‌ను ఇంట్లో అడుగుపెట్టేలా చేసేది నువ్వే అని కావ్య‌కు స‌ర్ధిచెబుతుంది. త‌న కోసం మాత్ర‌మే త‌ల్లి ధాన్య‌ల‌క్ష్మి షాపింగ్ చేసింద‌ని తెలిసి క‌ళ్యాణ్ బాధ‌ప‌డ‌తాడు. అమ్మ నా కోసం మాత్ర‌మే షాపింగ్‌ చేసి అప్పుని మ‌రిచిపోయింద‌ని, త‌న‌కు కోడ‌లు ఉంద‌ని కూడా గుర్తించ‌డం లేద‌ని బాధ‌ప‌డ‌తాడు. ధాన్య‌ల‌క్ష్మి మారిపోయింద‌ని క‌ళ్యాణ్‌కు స‌ర్ధిచెప్తుంది ఇందిరాదేవి. నిజంగా మారిపోయిందైతే చిన్న చీర విష‌యానికే అప్పును అంత‌గా అవ‌మానించేది కాద‌ని క‌ళ్యాణ్‌ బాధ‌ప‌డ‌తాడు. అప్పు చీర క‌ట్టుకొని కిందకొస్తుంది. ఎలాగైనా అప్పును అవ‌మానించాలని ధాన్య‌ల‌క్ష్మి భావిస్తుంది. అప్పు కంగారు ప‌డుతుంటంతో ఆ దుష్ట‌శ‌క్తుల‌ను చూసి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని స్వ‌ప్న‌, కావ్య అంటారు. అప్పు, కావ్య‌, స్వ‌ప్న సంబ‌రంగా మాట్లాడుకోవ‌డం చూసి రాజ్ ఆనంద‌ప‌డ‌తాడు. ఎప్పుడు ఇలాగే ఉంటే ప్ర‌తిరోజు పండగ‌లానే ఉంటుంద‌ని అప‌ర్ణ‌, ఇందిరాదేవి అనుకుంటారు. అంద‌రం ఒకే చోట ఉంటే ఈ సంతోషం ఇలాగే ఉంటుంద‌ని క‌ళ్యాణ్‌ కి రాజ్‌ చెప్తాడు.  పూజ‌కు అవ‌స‌ర‌మైన సామాగ్రి తీసుకురావ‌డానికి కిచెన్‌లోకి వ‌స్తుంది అప్పు. అక్క‌డే ధాన్య‌ల‌క్ష్మి ఉండ‌టంతో ఆమెను అత్త‌య్య అని పిలుస్తుంది. ఆ పిలుపు విని ధాన్య‌ల‌క్ష్మి ఫైర్ అవుతుంది. అప్పు చేత ముత్తయిదవులకి జ్యూస్ ఇప్పిస్తుంది ధాన్యలక్ష్మి. ఆ జ్యూస్ ఓ ముత్తయిదువుపై ప‌డేలా ధాన్య‌ల‌క్ష్మి, రుద్రాణి ప్లాన్ చేస్తారు. కాసేపటికి కావాల‌నే అప్పు ఇదంతా చేసింద‌ని ధాన్య‌ల‌క్ష్మి ఫైర్ అవుతుంది. ఇంటికి వ‌చ్చిన ముత్తయిదువుల‌ను ఎలా చూసుకోవాలో తెలియ‌దా, బొత్తిగా అడివిమ‌నిషిలా ఉన్నావ‌ని అవ‌మానిస్తుంది. మీ అమ్మ నిన్ను ఊరి మీదికి వ‌దిలేస్తే ఇలాంటి బుద్దులే వ‌స్తాయ‌ని ముత్తయిదువ‌లు కూడా అప్పును అవ‌మానిస్తారు. మీ ఇంటికి ఉన్న పేరును నీ కోడలు వీధిన ప‌డేసేలా క‌నిపిస్తుంద‌ని ధాన్య‌ల‌క్ష్మితో అంటారు. దాంతో మా క‌ళ్యాణ్ కూడా తొంద‌ర‌ప‌డి అప్పును పెళ్లిచేసుకొని మా కొంప ముంచాడ‌ని ధాన్య‌ల‌క్ష్మి అంటుంది. కావాల‌నే అప్పును రెచ్చ‌గొట్టి గొడ‌వ పెద్ద‌ది చేయాల‌ని ముత్తయిదువులు చూస్తారు. కానీ క‌ళ్యాణ్‌కు ఇచ్చిన మాట కోసం అప్పు మౌనంగా ఉంటుంది. భార్య‌కు త‌న క‌ళ్ల ముందే అవ‌మానం జ‌ర‌గ‌డం క‌ళ్యాణ్ స‌హించ‌లేక‌పోతాడు. అప్పుకు ఇందిరాదేవి స‌పోర్ట్ చేస్తుంది. ఇంటి గుట్టును ప‌దిమందికి ప్ర‌సాదంలా పంచుతున్నావ‌ని ధాన్య‌ల‌క్ష్మికి వార్నింగ్ ఇస్తుంది ఇందిరాదేవి. ఆవిడ గ్లాస్ స‌రిగ్గా ప‌ట్టుకోలేద‌ని, ఇందులో నీ త‌ప్పేం లేద‌ని అప్పుతో ఇందిరాదేవి అంటుంది. మీ అత్త క‌ళ్ల‌కు పొర‌లు క‌ప్పి ఉండ‌టంతో అది గుర్తించ‌లేద‌ని చెబుతుంది. ఆ త‌ర్వాత వ్ర‌తంలో ఎవ‌రి కొడుకు, కోడ‌లు వెనుక వాళ్ల అత్త‌గారు కూర్చోవాల‌ని చెబుతుంది. అప్పు, క‌ళ్యాణ్ వెనుక కూర్చోవ‌డానికి ధాన్య‌ల‌క్ష్మి అంగీక‌రించ‌దు. ప్ర‌కాశం వార్నింగ్ ఇవ్వ‌డంతో కూర్చుంటుంది. వ్ర‌తం ఎలాంటి గొడ‌వ‌లు లేకుండా పూర్త‌వ్వ‌డం చూసి ఇంట్లో వాళ్లు అంద‌రు ఆనంద‌ప‌డ‌తారు. ముత్తయిదువుల‌కు భోజ‌నం వ‌డ్డించే స‌మ‌యంలో అప్పులోని త‌ప్పుల‌ను ధాన్య‌ల‌క్ష్మి ఎత్తిచూపుతుంది. వారికి వ్ర‌తం భోజ‌నం పెడుతున్నావా...పిండం భోజ‌నం పెడుతున్నావా.. ఇంత చిన్న విష‌యం కూడా తెలియ‌దా అంటు ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఢీ షో లో అవు డాన్స్...ఆది చూస్తుంటే పడిపోతోంది 

  ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా హాట్ నెస్ ఓవర్ లోడెడ్ తో ఉంది. ఆది ఇందులో ఒక మెజీషియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా ఆది ఉంటే వచ్చే బూతులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య కుమార్ మాష్టర్ కూడా ఆదికి తోడయ్యాడు. కుమార్ మాష్టర్ ఒక తాడు ఇచ్చి దాన్ని నిలబెట్టమని చెప్పాడు. దాంతో హోస్ట్ నందు మ్యాజిక్ స్టిక్ తీసుకుని ఆ తాడును స్ట్రైట్ గా నిలబెట్టాడు. ఐతే కుమార్ మాష్టర్ మాత్రం ఆది అన్న నువ్వు చూస్తుంటే పడిపోతోంది అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేసాడు. ఇక డాన్సర్ మానసి జోషి ఐతే అద్భుతంగా డాన్స్ చేయడంతో పాటు ఆదికి మాస్ వార్నింగ్ ఇచ్చింది. "రేయ్ ఆది కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా" అంది. చూడబోతే ఆమె కళ్ళు కత్తుల కన్నా పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఇక చిట్టి మాష్టర్ డాన్సర్ రాము రాథోడ్ మాత్రం మ్యాజిక్ చేశారు. ఒక ఆవును తీసుకొచ్చి ఒక జానపద పాటను పాడుతూ డాన్స్ చేసి అందరినీ ఎమోషనల్ గా టచ్ చేశారు. "ఆవును తీసుకొచ్చి సాంగ్ లో పెట్టాలన్న ఆలోచన అవుట్ ఆఫ్ ది బాక్స్" అంటూ శేఖర్ మాష్టర్ చిట్టి మాష్టర్ ని పొగిడాడు. ఇక ఈ పాటకు అటు జనులూరితో ఇటు హన్సికతో కలిసి డాన్స్ చేశారు రాము రాథోడ్. ఈ సాంగ్ మాత్రం ఈ ఎపిసోడ్ లో హైలైట్ గ నిలిచింది. జానపదాలు వింటే ఎవరికైనా ఊపొస్తుంది. ఈ సాంగ్ విన్నాక రాము రాథోడ్ కి ఫ్యాన్ ఇపోయానని చెప్పాడు శేఖర్ మాష్టర్.

లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న పునర్నవి..

  పునర్నవి అంటే చాలు బిగ్ బాస్ ఇంట్లో రాహుల్‌ సిప్లిగంజ్ తో చేసిన అల్లరి గుర్తొస్తుంది. ఆమె చిన్న చిన్న పాత్రలు చేసి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక పునర్నవి ఫాలోయింగ్ పెరిగింది. బిగ్ బాస్ బ్యూటీగానే పునర్నవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ ఒక్కరికి ఫ్యాన్ అయ్యింది. బిగ్ బాస్ హిస్టరీలో రాహుల్ పునర్నవి జోడికి వచ్చినంత క్రేజ్ ఏ బిగ్ బాస్ సీజన్ లోనూ ఎవరికీ అంతగా రాలేదు. వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ని కూడా ప్రజలు, ఫాన్స్ యాక్సెప్ట్ చేశారు. అలాంటి పున్ను ఇప్పుడు కొన్ని త్రో బ్యాక్ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "జీవితం నాకు మంచి, చెడు, అందం, ఆనందం వంటి ఎన్నో దశలను ఇచ్చింది. ఇక్కడ ప్రతి దశలోనూ నేనున్నాను" అని పోస్ట్ పెట్టింది. పున్ను ఏంటంటే తనకు ఏదైతే నచ్చుతుందో అదే చేస్తుంది. ఇక ఆమె పిక్స్ చూస్తే ఆమె ముఖంలో ఆనందం ఆ బోల్డ్ నెస్ ఉట్టిపడుతూ ఉంటుంది. అలాంటి ఆమె పిట్టగోడ, ఉయ్యాల జంపాల, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి మూవీస్ లో కనిపించింది. బిగ్ బాస్ తరువాత ఆఫర్లు వచ్చినా ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది. మరి మళ్లీ పునర్నవి తెరపై ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి. ఇక నెటిజన్స్ ఐతే "టాలీవుడ్ ప్రిన్సెస్ మీ మూవీస్ ని మిస్ అవుతున్నాం. శివంగిలా , మోనార్క్ లా ఉన్నారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ పునర్నవి మాత్రం తన లైఫ్ ని తనకు నచ్చినట్టు బాగా ఎంజాయ్ చేస్తోందన్న విషయం తెలుస్తోంది.

Eto Vellipoyindhi Manasu :  నన్ను మోసం చేశాడు.. తనని నా ప్రేమతో మార్చుకుంటాను!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -183 లో.. నందిని దగ్గరకి సీతాకాంత్ వెళ్తాడు. ఇన్ని రోజులకి నన్ను వెతుకుంటూ వచ్చావా అని నందిని ఎక్సయిట్మెంట్ అవుతుంది. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి నా జీవితం లోకి వచ్చావని సీతాకాంత్ అడుగుతాడు. నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను.. నువ్వు మాట తప్పి పెళ్లి చేసుకున్నావ్ కానీ నేను అలా కాదని నందిని అంటుంది. అంటే నువు ఇంకా పెళ్లి చేసుకోలేదా అని సీతాకాంత్ అడుగుతాడు. చేసుకులేదని నందిని అంటుంది. నేను అనుకుని పరిస్థితిలో రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నానని చెప్తాడు. ఇప్పుడు నీ జీవితంలోకి రాలేదు.. ఈ రకంగా అయిన నీకు సాయం చేసే అవకాశం వచ్చింది.. ఇప్పుడు అదంతా ఏం లేదని నందిని అంటుంది. అ తర్వాత సీతాకాంత్ వెళ్ళిపోయాక నందిని తన గదిలో సీతాకాంత్ తో కలిసి ఉన్న ఫోటోని చూస్తూ.. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఇంతకంటే ఎక్కువ ఎవరు ప్రేమిస్తారు.. అది నీకెందుకు అర్థం కావడం లేదని అని నందిని అంటుంది. అప్పుడే నందిని పిఏ హరిక వచ్చి.. నీతో ఉన్న చనువుతో అడుగుతున్నాను.. నువ్వు చేసేది కరెక్ట్ అంటావ్. సీతాకాంత్ పెళ్లి చేసుకొని తన భార్యతో హ్యాపీగా ఉన్నాడు. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు అతని జీవితంలోకి వచ్చావని అడుగుతుంది.. నేను చేసేది కరెక్ట్ ఎందుకు అంటే సీతా పెళ్లి చేసుకోనని చెప్పాడు కానీ మోసం చేసాడు.  మాట తప్పాడు. తన పెళ్లి అనుకోని పరిస్థితిలో జరిగింది అంటున్నాడు కదా.. వాళ్ళు కుటుంబం కోసం చేసుకున్నారు. అది బిజినెస్ అవుతుంది తప్ప అందులో ప్రేమ ఎక్కడ ఉందని నందిని అంటుంది. ఒకవేళ మనసు మారి నాతో ప్రేమలో పాడుతాడేమో.. అందుకే నా ప్రేమతో తనని నా వైపు మార్చుకుంటానని నందిని అంటుంది. మరోవైపు రామలక్ష్మి తన గదిలో సీతాకాంత్ కోసం ఎదురుచూసి , ఫోన్ ట్రై చేస్తుంది. ఇక పెద్దాయన దగ్గరికి వెళ్లి ఇంకా సీతాకాంత్ రాలేదని చెప్పగా.. టెన్షన్ పడకు, వస్తాడని పెద్దాయన అంటాడు. రామలక్ష్మి తన గదిలో శోభనానికి పూలతో బెడ్ నీట్ గా డెకరేట్ చేస్తుంది. అది చూసిన శ్రీవల్లి షాక్ అయి వెంటనే శ్రీలతని తీసుకొచ్చి చూపిస్తుంది. కాసేపటికి సీతాకాంత్ వస్తాడు. అతను రాగానే రామలక్ష్మి పరుగున వస్తుంది. వచ్చారా? ఫోన్ చేస్తే కలవట్లేదు.. పదండి భోజనం వడ్డిస్తానని రామలక్ష్మి అనగానే.. నాకు కాస్త తలనొప్పిగా ఉందని సీతాకాంత్ అంటాడు. ట్యాబ్లెట్  తీసుకొస్తానని రామలక్ష్మి అనగానే..వద్దని సీతాకాంత్ అంటాడు. మరి గదిలోకి రండి పడుకోండి అని రామలక్ష్మి అనగానే .. కాసేపు ఇక్కడే ఉంటా.. నీకు నిద్రొస్తే పడుకోమని సీతాకాంత్ అనగానే రామలక్ష్మి కోపంగా గదిలోకి వెళ్తుంది. ఇక పూలతో అలకరించిన వాటిని అన్నింటిని తీసి పడేసి.. ఓ‌ చాప తోసుకొని దానిపై పడుకుంటుంది. అదంతా చాటుగా శ్రీలత, శ్రీవల్లి చూసి సంతోషిస్తారు.‌ ఇక మరుసటి రోజు ఉదయం పెద్దాయన సోఫాలో‌ ఉన్న సీతాకాంత్ ని చూస్తాడు. సీతాకాంత్ లేచి గుడ్ మార్నింగ్ అని చెప్పగా.. నీకేమైంది ఇక్కడ పడుకున్నావని పెద్దాయన అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : స్వప్న ప్రేమ విషయం తెలుసుకున్న కార్తీక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-131 లో..యాక్సిడెంట్ అయిన కాశీని జ్యోత్స్న వదిలేసి వెళ్లిపోవడం  దీప కాపాడటం విషయం కార్తీక్ ఇంట్లో చెప్తాడు. ఇద్దరిలో ప్రాణం విలువ ఎవరికీ తెలుసని అడుగుతాడు. దానికి సుమిత్ర దీపకే తెలుసని అంటుంది. దశరథ్ కూడా కార్తీక్‌ని నువ్వు చెప్పిన మాటలు కరెక్ట్‌ని జ్యోత్స్నకి మానవత్వం గురించి చెప్తాడు. పారిజాతానికి శివనారాయణ తిడతాడు. నువ్వు కూడా పక్కనే ఉన్నావ్ కదా చెప్పలేదా అని అడుగుతాడు. నీకే పద్ధతులు తెలీవని జ్యోత్స్నకి నువ్వేం చెప్తావని తిడతాడు. ఇక కార్తీక్ దీప హాస్పిటల్‌లో ఉందని తాను కూడా వెళ్తానని అంటాడు. సుమిత్ర కూడాఅత్త మీద కోప్పడుతుంది. మీరు పక్కనే ఉంటే దాని పెళ్లి అవుతుందో లేదో అంటుంది. పారిజాతం మనసులో నిన్ను ఇలా తయారు చేసి తప్పు చేశానే నిన్ను ఎలా మార్చాలా అని ఆలోచిస్తుంది. హాస్పిటల్లో కాశీకి స్ఫృహ వస్తుంది. నర్సు దీపకి విషయం చెప్తుంది. దీప వెళ్తుంటే స్వప్న కూడా వస్తుంది. స్వప్న కాశీని చూడ్డానికి వెళ్తానంటే దీప ఆపి నీకు అతను ఎలా తెలుసని అతని గురించి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది. దానికి స్వప్న తాను కాశీ ప్రేమించుకున్నామని చెప్తుంది. కాశీ నా కోసమే వైజాగ్ నుండి హైదరాబాద్ కి వచ్చాడని స్వప్న ఏడుస్తూ చెప్పగా.. మరి మీ విషయం ఇంట్లో తెలుసా అని దీప అడుగుతుంది. తెలీదు కానీ నేను ఎవరి కోసం కాశీని వదులుకోను. కాశీ. కాశీ అని స్వప్న కాశీ దగ్గరకు వెళ్లి గట్టిగా ఏడుస్తుంది. ఇక కాసేపటికి హాస్పిటల్ కి కార్తీక్ వస్తాడు. అక్కడ స్వప్న, కాశీ చేతులని పట్టుకోవడం చూసిన కార్తీక్.. నువ్వెంటి ఇక్కడ అని అడుగుతాడు. దీప నీతో ఏం చెప్పలేదా బాస్ అని స్వప్న అనగానే.. మీతో బయట చెప్పాలనుకున్నది ఇదే బాబు గారు అని దీప అంటుంది. ఈ ప్రేమ విషయం మీ నాన్నకి తెలుసా అని కార్తీక్ అడుగుతాడు. తెలీదు బాస్ కాశీ జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. తనకి జాబ్ వచ్చిన తర్వాత మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలి అనుకున్నాం. ఈ రోజు తనకి ఇంటర్వ్యూ ఉంది. నేను దగ్గరుండి ఎదురొచ్చి పంపించా. ఈ రోజు తనకి ఈ యాక్సిడెంట్ అవ్వకపోయి ఉంటే జాబ్ వచ్చుండేది. మా మమ్మీడాడీకి కాశీని పరిచయం చేసేదాన్ని అని స్వప్న ఏడుస్తుంటే.. ఏడ్వకు, మొత్తం నేను చూసుకుంటానని కార్తీక్ అంటాడు. స్వప్న ఎవరినో లవ్ చేస్తుందని అనుమానంతో ఉన్న కావేరి స్వప్నని పిలుస్తుంది. ఇక పారిజాతం కొడుకు దాస్ హాస్పిటల్‌లోకి వచ్చి.. కాశీ తన కొడుకని చూడ్డానికి వస్తాడు. నర్స్ రెస్ట్ తీసుకుంటున్నాడని తర్వాత రమ్మని చెప్తుంది. ఇక జ్యోత్స్న, పారిజాతం హాస్పిటల్‌కి వస్తారు. పారిజాతం దాసుని చూసి దాసు ఇక్కడున్నాడేంటని అనుకుంటుంది. దాస్ దగ్గరకు వెళ్లి ఏమైందని అడుగగా.. దాసు యాక్సిడెంట్ వీడియో చూపించి కాశీ తన కొడుకని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu : శైలేంద్రని కలవనున్న సరోజ.. క్లైమాక్స్ ఎలా ఉందంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1161 లో..   మీ అన్నయ్య గురించి మీకు పూర్తిగా తెలియదు? అని వసుధార అంటే.. అవును వసుధార.. రిషి అనేవాడికి మా అన్నయ్య గురించి పూర్తిగా తెలియదు.. కానీ రంగాకి అన్నయ్య నిజస్వరూపం మొత్తం తెలుసని అంటాడు. ఆ మాటతో వసుధార ఆశ్చర్యంగా చూస్తుంది. దాంతో రిషి.. ఏంటి వసుధారా.. కన్ఫ్యూజన్‌గా ఉందా?? చెప్పాను కదా.. నిన్ను కొన్నిరోజులు కన్ఫ్యూజన్‌లో ఉంచుతానని.. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా.. నేను రిషిలా చేయలేని పనులు రంగాగా చేయగలను కాబట్టే ఇంకా ఆ పాత్ర పోషిస్తున్నాను. ఇప్పుడు కూడా ఆ పాత్రలో నేను చక్కబెట్టాల్సిన పనులు చాలానే ఉన్నాయి. అవి రంగాగానే చేస్తానని అంటాడు. ఇంకెన్నాళ్లు సర్.. ఈ ముసుగు అని వసుధార అంటే.. కథ ముగింపుకి వచ్చేసరికి క్యారెక్టర్లు బయటపడతాయి కదా.. ఆ సమయం దగ్గరలోనే ఉంది.. చూస్తూనే ఉండమని రిషి అంటాడు. ఇక రిషి చూడమన్నాడు కాబట్టి.. వసుధార అలా శూన్యంలోకి చూస్తుంటుంది. నేను చూడమన్నది శూన్యంలోకి కాదు వసుధారా.. ఆ నక్షత్రాలను చూడమని వసుధారకి చుక్కలు చూపిస్తాడు వసుధార. మరోవైపు బుజ్జిని సరోజ కలుస్తుంది. ఆ వసుధార మా బావని తీసుకెళ్ళిందా అని సరోజ అడుగగా.. లేదు రంగానే వసుధారని తీసుకెళ్ళాడని బుజ్జి చెప్తాడు.దాన్ని కనిపెట్టాలి.. మనం వెళ్లి శైలేంద్రని కలిస్తే అన్నీ తెలుస్తాయి. ముందు నేను వెళ్లి శైలేంద్రని కలవాలని సరోజ బయల్దేరుతుంది. కాసేపటికి బుజ్జి దగ్గరకి రిషి వస్తాడు. నానమ్మ నీపై బెంగపెట్టుకుందన్నా.. మందులు కూడా వేసుకోవడం లేదు. ఆ సరోజ అయితే ఆరాలు తీస్తుంది.. అంతా నువ్వు చెప్పినట్టే చేశా కానీ.. ఆ సరోజ శైలేంద్రని కలుస్తుంది అని చెప్తాడు బుజ్జిగాడు. దాంతో రిషి.. సరోజ వెళ్లి ఆ శైలేంద్రని కలవాలి.. కలిసేట్టు నువ్వు చెయ్ అని రిషి అంటాడు. అయితే వీళ్ల మాటల్ని వసుధార చాటుగా వింటూ ఉంటుంది. రిషి సర్ ఏం చేయబోతున్నారు? ఎందుకు శైలేంద్రని సరోజ కలిసేట్టు చేస్తున్నారని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఇంతలో బుజ్జిగాడు.. రిషి వైపు అనుమానంగా చూసి.. అన్నా నువ్వు రంగావి కాదు కదా అని అడుగుతాడు.  నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదురా.. ఎక్కువ ఊహించుకోకు. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడొద్దని రిషి అంటాడు. మాట్లాడొద్దని అంటున్నావంటే.. అదే నిజం కదా.. ముసల్ది నీపై ప్రాణం పెట్టుకుంది అన్నా.. ప్లీజ్ అన్నా.. నిజం చెప్పు.. నేను ఎవరికీ నిజం చెప్పనని బుజ్జి రిక్వెస్ట్ చేయగా.. నేను తరువాత మాట్లాడతాను.. నానమ్మ జాగ్రత్త అని సమాధానం దాటవేస్తాడు. ఇతను రిషి అయితే మా రంగా ఎక్కడున్నాడని బుజ్జి ఆలోచనలో పడతాడు. ఎక్కువ ఆలోచించకురా బుజ్జి.. నువ్వు ప్రశాంతంగా వెళ్లమని బుజ్జిని అక్కడ నుంచి పంపించేస్తాడు రిషి. అయితే అసలు రిషినా? రంగానా? అని అనుమానంలో వసుధార ఉండిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కొత్తకోడలికి అవమానం.. అప్పుకి కళ్యాణ్ సపోర్ట్ గా ఉండగలడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ).ఈ సీరియల్  శుక్రవారం నాటి ఎపిసోడ్ -496 లో.. కళ్యాణ్ గది బయట నిల్చొని ఆలోచిస్తుంటే అప్పు తన దగ్గరికి వస్తుంది. అక్కడ మా అమ్మ, రుద్రాణి అత్తయ్య నిన్ను అవమానిస్తారని కళ్యాణ్ అంటాడు.  వాళ్లు ఏం అన్న నేను ఒక్క మాట ఎదురు చెప్పనని అప్పు అంటుంది. నీ గురించి నాకు తెలియదా.. నువ్వు ఎక్కడ ఊరుకుంటావ్. నువ్వు మా అమ్మను అన్న నాకే బాధ. అమ్మ నిన్ను అన్న నాకే బాధ అని కళ్యాణ్ అంటాడు. తాతయ్య వాళ్లు వచ్చి పిలిచాక కూడా వెళ్లకుంటే మర్యాదగా ఉండదు. వాళ్లు ఎన్ని మాట్లాడిన సరే నేను నోరు ఎత్తనని కల్యాణ్ చేతిలో చేయి వేసి ప్రామిస్ చేస్తుంది. మరుసటి రోజు కావ్య పూజకు అంతా రెడీ చేస్తుంటుంది. కాసేపటికి కళ్యాణ్, అప్పులు ఆటోలో‌ వస్తారు. ఇక ఇందిరాదేవి గుమ్మం బయటే ఆపి.. ధాన్యలక్ష్మిని ఇద్దరికి హారతి ఇవ్వమంటుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మి తన మాటలతో అప్పుని అవమానిస్తారు. ఈమెనా నీ కోడలు. సాంప్రదాయం ప్రకారం చీర కట్టుకుని రాకుండా ఇలా వచ్చిందేంటి. ఇలాంటిది నీ కొడుకు ఎలా నచ్చింది ధాన్యలక్ష్మి. నీ కోడలు ఎలా ఉంటుందా అని చూద్దామని వచ్చాం. ఇలా రావడమేంటని. నీ కోడుకు ఎలా మెచ్చాడని అప్పుని ముత్తయిదువులు తలో మాట అంటారు. ఏంటిది ఆదిలోనే హంసపాదం అన్నట్లు రాగానే ఇలా అవమానిస్తున్నారు అని రాజ్ అనుకుంటాడు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అమ్మా. వెళ్లి సాంప్రదాయబద్ధంగా వ్రతం చేసుకుని సంబరాలు చేసుకో. ఇలా జరుగుతుందనే నేను రానని చెప్పాను. ఇప్పుడు నీకు అర్థమైందా అన్నయ్య నేను ఇంటికి ఎందుకు రాను అన్నానోనని కళ్యాణ్ అంటాడు. రేయ్ ఆగురా. గుమ్మం వరకు వచ్చి వెళ్తానంటావ్. ఇది నీ ఇల్లురా అని రాజ్ అంటాడు. కట్టుబట్టలతో బయటకెళ్లిన జంట పట్టుబట్టలతో రావాలని ఎలా అనుకుంటున్నారు. దానికున్నవి ఏవో అవి వేసుకుని వచ్చింది. ఇంట్లో చీరలకు కొదవ. కొత్త కోడలికి అమ్మమ్మ గారు చీరలు కొన్నారు. అవి కట్టుకుంటుంది. కవిగారు అసలు ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అందులో మీ అమ్మ, అత్తయ్య లాంటి వాళ్లు ఉంటారు. అడుగు ముందుకే వేయండి. ఈ ముత్తయిదువుల్లోనే అలాంటి వాళ్లు ఉన్నారు. చాదస్తపు రేఖను దాటుతున్నానని ముందుకు రండి అని చెప్పిన కావ్య అక్క స్వప్నను పిలిచి వాళ్లకు హారతి తెమ్మని చెబుతుంది. గుమ్మం ముందే అవమానిద్దామనుకున్నా. కావ్య చాలా తెలివిగా తీసుకొచ్చిందని ధాన్యలక్ష్మి అంటే.. ఇంట్లో అందరి సపోర్ట్ ఉండగా ఏం చేస్తావని రుద్రాణి అంటుంది. అడుగడుగునా అవమానించి జీవితంలో ఇంట్లోకి రాకుండా చేస్తాను అని ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. నువ్ ఎంతకైనా తెగించావ్. జీవితంలో కల్యాణ్ అప్పులు రాకపోతే చాలు అని రుద్రాణి అనుకుంటుంది. చీర కట్టుకోవాల్సిందే అని అప్పుకు నచ్చజెబుతుంది స్వప్న. ఎలా ఉన్నావే అప్పు అని కావ్య అడుగుతుంది. ఇన్నిరోజులు పట్టిందా ఈ మాట అడగటానికి అని అప్పు అనగానే కావ్య హగ్ చేసుకుంటుంది. ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటారు. ఇక స్వప్న ఫీల్ అవుతూ మీరిద్దరు ఒక్కటేనే అని చెప్తుంది.  ఇక అక్కచెల్లెళ్ళు సరదగా మాట్లాడుకుంటారు. కాసేపటికి ముత్తయిదువలకు అప్పు జ్యూస్ ఇస్తుంది. కావాలనే తనే తనపై మీద పోసుకుని కనీసం నీకు జ్యూస్ ఇవ్వడం కూడా తెలియదా అని ఒకామె అంటుంది. ఇంటికి వచ్చినవాళ్లను ఎలా చూసుకోవాలో నీకు తెలియదా. బొత్తిగా అడవి మనిషిలా ఉన్నావే అని ధాన్యలక్ష్మి అంటుంది. మీ అమ్మ నిన్ను ఊరిమీదకు వదిలేస్తే ఇలాంటి బుద్ధులే వస్తాయని ముత్తయిదువు అంటుంది. నేనేం కావాలని చేయలేదు ఆంటీ అని అప్పు అంటుంది. చాల్లే ఆపు. ఇంటికి పూజకని పిలిస్తే ఇలాగేనా అవమానించేదని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పెళ్ళైనా పర్లేదు నాకు ఓకే అంటున్న...నాని గారు

కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వీకెండ్ తో ఈ షోకి ఎండ్ కార్డు పడబోతోంది. ఇప్పుడు దీని ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ వీకెండ్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ గా "సరిపోదా శనివారం" ప్రొమోషన్స్ కోసం నేచురల్ స్టార్ ఎంట్రీ ఇచ్చాడు. "దసరా" మూవీ స్టెప్స్ అలరించాడు. ఇక నాని రావడమే తమిళ 'బిగ్ బాస్' ఫేమ్, ఆయేషా ఖాన్ ఎగురుకుంటూ వచ్చి హగ్ చేసేసుకుంది. వెంటనే శ్రీముఖి “హలో ఆయనకు పెళ్లైంది” అని అయేషాకు చెప్పింది.. “ఇట్స్ ఓకే పర్లేదండి” అని ఆయేషా చెప్పేసరికి నాని కూడా “అయితే,  ఇట్స్ ఓకే..నాక్కూడా పర్లేదు” అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి అందరూ ఫుల్ ఖుషీ ఇపోయారు. ఇక బ్రాహాముడి కావ్య ఎంట్రీ ఇచ్చింది. "నాని గారు అమ్మాయిలు ఎలా అంటే పానీ లేకుండా ఉంటారు కానీ నానిని చూడకుండా ఉండలేరు" అని బాగా హడావిడి చేసింది. "నాని గారు మీరు దసరా మూవీలో నటించారు కానీ మీరు వచ్చిన ఈ రోజు మాకు దీపావళినే" అని చెప్పింది కావ్య.  ఇక ప్రేరణ ఐతే "నాని గారిని చూస్తుంటే గుండె కంట్రోల్ లో ఉండడం లేదు...ఇంక డౌట్స్ ఎం వస్తాయి.." అని అన్నది. "మీ ఆయన్ని గుర్తుచేసుకో" అంది శ్రీముఖి. "నాని గారు ఉన్నప్పుడు మా ఆయన్ని గుర్తుచేసుకోను" అంది ప్రేరణ. ఇక నాని ఐతే "మీ పెళ్లి గుర్తుపెట్టుకోకపోయినా నా పెళ్లిని గుర్తుపెట్టుకోండి" అన్నాడు కామెడీగా. ఇలా ఈ వారంతో ఈ గేమ్ షో ఎండ్ కాబోతోంది.  ఈ గేమ్ షోలో గెలిచిన టీమ్ కు రూ. 20 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు నిర్వాహకులు.

గంట వరకు ఇంద్రజతో లిఫ్ట్ లో గేమ్ ఆడిన నరేష్... పవిత్ర మిసింగ్!

  శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ ని కృష్ణ జన్మాష్టమి స్పెషల్ గా తీర్చిదిద్దారు. ఇక ఈ షోకి నిజంగానే కృష్ణుడిని పట్టుకొచ్చారు అదేనండి సీనియర్ నటుడు, విజయ నిర్మల సుపుత్రుడు నరేష్. ఐతే ఏ షోకైనా నరేష్ తో కలిసి పవిత్ర ఎంట్రీ ఇస్తుంది కానీ ఈ షోలో సింగల్ గా వచ్చాడు నరేష్. వీరాంజనేయులు విహార యాత్ర మూవీ టీమ్ వచ్చింది. ఇక షోలో నరేష్ చేసిన అల్లరి పనులు మాములుగా లేవు సుమీ..షోకి రావడం రావడమే ఇంద్రజని కూడా పడగొట్టే పనిలో పడ్డాడు. నరేష్ తమ్ముడు మహేష్ బాబు నటించిన పోకిరి మూవీలో లిఫ్ట్ సీన్ ని నరేష్, ఇంద్రజ కలిసి రిక్రియేట్ చేశారు. ఇంద్రజ, నరేష్ లిఫ్ట్ లో ఎక్కేసరికి లిఫ్ట్ ఆగిపోతుంది. గంట వరకు లిఫ్ట్ లోనే ఉండాల్సి వస్తుంది అని చెప్తారు. దాంతో ఇంద్రజ తెగ ఫీలైనట్టు నటించింది. ఇక తర్వాత ఇంద్రజ అడిగింది "ఎవరినైనా లవ్ చేస్తున్నారా అని..మరి నువ్వు" అని రివర్స్ లో అడిగాడు నరేష్. "నచ్చినోళ్ళు ఇంకా దొరకలేదు" అని చెప్పింది " ఎం కావాలేంటి" అని అడిగాడు నరేష్. "బాగా చదువుకుని పెద్ద జాబ్ చేస్తూ మంచివాడిగా ఉండాలి" అని చెప్పింది. ఇక నరేష్ "ఛీ" అన్నాడు. ఇంద్రజ వేసుకొచ్చిన సెంట్ స్మెల్ పీలుస్తూ ఆమె మీదకు వెళ్తుండేసరికి ఇంద్రజ తల దించేసుకుంది. "సెంట్ స్మెల్ బాగుంది" అన్నాడు. "అది హెయిర్ స్ప్రే..నా దగ్గర ఇంకా టు త్రి ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి " అని ఆన్సర్ ఇచ్చింది ఇంద్రజ. "ఒకటిస్తారా..ఒకటిస్తారా" అని అదేపనిగా అడిగాడు నరేష్. అలా ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ, నరేష్ కలిసి ఆడియన్స్ ని అలరించబోతున్నారు.  

Karthika Deepam2 : వీడియో చూసిన కార్తీక్...ఇంట్లోవాళ్ళంతా దీపపై ఫైర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -130 లో...  స్వప్న ప్రియుడు కాశీకి యాక్సిడెంట్ అయితే.. జోత్స్న పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. అదే దారిన వస్తున్న దీప.. కాశీ ప్రాణాలను కాపాడుతుంది. హాస్పిటల్‌లో చేర్పిస్తుంది. అదే హాస్పిటల్ కి శౌర్యని తీసుకొస్తాడు కార్తీక్‌. కాశీ దగ్గర ఉన్న ఫోన్‌తో దాసుకి ఫోన్ చేస్తాడు కార్తీక్. అయితే తన కొడుక్కి యాక్సిడెంట్ అయ్యిందని తెలియగానే కంగారుగా హాస్పిటల్‌కి వస్తాడు. దీపే తన కొడుకుని కాపాడిందని తెలియడంతో.. జన్మజన్మలకు నీకు రుణపడి ఉంటానంటూ దాస్ ఎమోషనల్ అవుతాడు. మరోవైపు దీప సాయం చేసిన వీడియో వైరల్ కావడంతో.. నర్స్ ద్వారా ఆ వీడియో చూస్తాడు కార్తీక్. పక్కనే ఉన్న దాసు.. ఆ వీడియో చూడటంతో.. తన కూతురు ఇంత క్రూరంగా పెరిగిందేంటని బాధపడుతుంటాడు. కాసేపటికి దీప, కార్తీక్‌ల సంబాషణలో కార్తీక్ అని దీప పిలిచేసరికి నా మేనల్లుడు కూడా ఇంతే ఉండొచ్చని దాస్ అనుకుంటాడు. ఇంతలో వైరల్ అవుతున్న వీడియో చూసిన జోత్స్న.. దీన్ని ఖచ్చితంగా బావ చూసి ఉంటాడు. నా లెక్క ప్రకారం.. దీప హాస్పిటల్‌లో ఉంది కాబట్టి అక్కడే ఉండి ఉంటాడని కార్తీక్‌కి ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. కానీ అది పట్టించుకోడు కార్తీక్మ చెప్పు జోత్స్నా అని అని కార్తీక్ అనడంతో.. తన కూతురు జోత్స్నతోనే కార్తీక్ మాట్లాడుతున్నాడని కనిపెట్టేస్తాడు దాసు. అంటే కార్తీక్.. నా మేనల్లుడు అని లోలోపల సంతోషపడతాడు. నా కూతురు జాలిలేనిదానిలా పెరిగితే.. నా మేనల్లుడు మాత్రం నలుగురుకి సాయం చేస్తున్నాడు అని అనుకుంటాడు. నా సొంత రక్తం పరాయిది అయ్యింది.. పరాయి మనిషి బంధువు అయ్యింది. విధిరాత అంతే ఇదేనేమో.. కొందరికి మంచితనం పుట్టుకతో వస్తే.. కొందరికి పెంపకంతో వస్తుంది. నన్ను చూస్తుంటే నా సొంతమనిషిని చూసినట్టే ఉందమ్మా అని దీప గురించి అనుకుంటాడు దాసు. నా వాళ్లందర్నీ కాలం నా దగ్గరకు తీసుకొచ్చి పరిచయం చేస్తుంది. తెలియకుండానే నా కూతుర్ని కలిశాను.. తెలియకుండా నా మేనల్లుడ్ని కలిశాను. అలాగే తెలియకుండానే మా అమ్మ దూరం చేసిన దశరథ్ అన్నయ్య కూతుర్ని కూడా కలుస్తానా? అని అనుకుంటాడు దాసు. ఇక జోత్స్న వీడియో చూసిన కార్తీక్.. ఇంటికి వెళ్లి మరీ అందరి ముందు క్లాస్ పీకుతాడు. తనని తిడుతూ దీపని పొగుడుతుంటే జోత్స్న మరింత కోపంగా ఉంటుంది. ఇక సుమిత్ర వాళ్ళు కూడా దీపకే ఓటేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu : తండ్రిని చంపటానికి ఆవేశంతో వెళ్తున్న మను

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1160 లో..  రిషి సర్‌కి మను తండ్రి ఎవరో తెలిసినా కూడా ఎందుకు రియాక్ట్ కావడం లేదు? ఇంత సీరియస్ విషయాన్ని అంత కూల్‌గా ఎలా తీసుకుంటున్నారు? రిషి సర్ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. ఆయన నా దగ్గర ఏదో దాస్తున్నారు? అసలు అదేంటో కనిపెట్టాలని వసుధార అనుకుంటుంది. మరోవైపు మనుకి మెసేజ్‌లు పెడుతూనే ఉంటాడు మహేంద్ర. ఎందుకు మను ఫోన్ తీయడం లేదు.. నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకుంటున్నానంటూ మహేంద్ర మెసేజ్ పెట్టగానే.. అది చూసిన మను ఫోన్‌ని విసిరికొట్టబోతుంటాడు. అప్పుడే మనుకి అనుపమ జ్యూస్ తీసుకొని వస్తుంది. దానిని విసిరిగొట్టేసి.. ఈ ఇంటికి ఎవరైన వచ్చారా అంటు మను అడగ్గానే.. రిషి, వసుధారలు వచ్చారని చెప్తుంది. రిషికి చెప్పారా? నా తండ్రి ఎవరోనని మను అడుగుతాడు. అవును.. నేను చెప్పాల్సి వచ్చిందని అనుపమ అంటుంది. ఏం చెప్పావని మను అడిగితే.. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానమంటూ  అనుపమ చెప్తుంది. ఇక ఏం చెప్పావంటు మను నిలదీయగా.. మహేంద్ర నీ కన్నతండ్రి అని చెప్పానని అనుపమ అంటుంది. మరి రిషి ఏమన్నాడని మను అడుగగా.. తనేం మాట్లాడలేదు, నేను ఆ నిజం చెప్పిన తరువాత నా మొహం వాళ్లకి చూపించలేక రూమ్‌లోకి వెళ్లిపోయానని అనుపమ అంటుంది‌. మళ్లీ అడుగుతున్నాను.. మా నాన్న ఇక్కడికి వచ్చాడా? అని మను అడుగుతాడు. దాంతో అనుపమకి కోపం తన్నుకొస్తుంది. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు.. మీ నాన్న ఇక్కడికి రాలేదు రాలేదు.. రాలేదుని అనుపమ అంటుంది. నన్ను నిజం తెలుసుకోమంటారా అని మను అడుగుతాడు. వెళ్లి ఆయనతోనే మాట్లాడి డైరెక్ట్‌గా తెలుసుకుంటానని గన్ చూపిస్తాడు. గన్ పట్టుకుని మను ఆవేశంగా వెళ్తుంటే.. అనుపమ ఆపుతుంది.. ప్లీజ్ మను నువ్వు వెళ్లొద్దని అంటుంది. లేదమ్మా.. ఈ ఆగస్టు నెల అయిపోయేలోగా.. ఈ గన్‌లో బుల్లెట్స్ ఖాళీ అవుతాయి. ఇది మాత్రం పక్కా అని మను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : భార్యతో శోభనం.. సీతాకాంత్ గతంలో ఆ అమ్మాయితో అలా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -182 లో..... ఈ రోజు ఎలాగైనా సీతా సర్ తో నా మనసులో మాట చెప్పి తన సొంతం అవ్వాలని రామలక్ష్మి అనుకుంటుంది. సీతాకాంత్ గదిలోకి రావడం రామలక్ష్మి తన మనసులో మాట చెప్తుంది. సీతాకాంత్ కూడా తన ప్రేమ గురించి చెప్తాడు. ఆ తర్వాత రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. రామలక్ష్మి డోర్ వేసి పాల గ్లాస్ సీతాకాంత్ కి ఇచ్చినట్లు రామలక్ష్మి ఉహించుకుంటుంది. ఇంకా సీతా సర్ రావడం లేదేంటని రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. సీతాకాంత్ కి ఫోన్ చేస్తుంది కానీ అతను లిఫ్ట్ చెయ్యడు. మరొకవైపు సీతాకాంత్ నందిని పార్టీలో అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. నందిని కూడా తన గతాన్ని గుర్తుకుచేసుకుంటుంది. గతంలో సీతాకాంత్ కోసం నందిని వెయిట్ చేస్తుంది. ఈ రోజు ఎలాగైనా డాడ్ ని ఒప్పించి సీతాకాంత్ కి జాబ్ ఇప్పించాలని అనుకుంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ నందిని వాళ్ళ డాడ్ దగ్గరికి వస్తాడు. అతను జాబ్ ఇస్తాడు. దాంతో నందిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీతాకాంత్ తో నందిని ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి నందిని వచ్చి బయటకు వెళదామని అంటుంది. లేదు వర్క్ ఉందని సీతా అనగానే నేను మా డాడ్ తో మాట్లాడతానంటూ తన వెంట తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత నందిని వాళ్ళ డాడ్ నందిని రాగానే.. ఈ సీతాకాంత్ ఫోటోని గదిలో ఎందుకు ఉందని అడుగుతాడు. నేను సీతాకాంత్ ని ప్రేమిస్తున్నానని నందిని చెప్పగానే.. నువ్వు అతన్ని ప్రేమించడమేంటని కోప్పడతాడు. అతన్ని పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోతానని నందిని అనగానే.. అలా అనొద్దు నీకంటే మాకూ ఏది ఎక్కువ కాదని నందిని వాళ్ళ నాన్న అంటాడు. అ తర్వాత నందిని సీతాకాంత్ కి ప్రపోజ్ చేస్తుంది. నా జీవితంలో పెళ్లి అనేది ఉండదని చెప్తాడు. నేను కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటానని నందిని అంటుంది. సీతాకాంత్ జాబ్ కి రిజైన్ చేసి వెళ్లిపోతాడు. గతంలో జరిగింది నందిని గుర్తు చేసుకుంటుంది. మరొకవైపు సీతాకాంత్ గురించి రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ నందిని ఇంటికి వెళ్ళగానే.. నా సీత నా కోసం వచ్చాడంటూ ఎక్సైట్మెంట్ అవుతుంది. కూర్చోమని నందిని అనగానే.. సీతాకాంత్ కూర్చుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కొత్తజంటని ఆహ్వానించిన సీతారామయ్య.. ధాన్యలక్ష్మి ఏం చేయనుంది!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -495 లో.. ఇందిరాదేవి ఇంట్లో వాళ్లందరిని పిలిచి వరలక్ష్మి వ్రతం గురించి చెబుతుంది. కొత్తజంట అయిన కళ్యాణ్‌, అప్పులతో వ్రతం చేయించాలనుకున్నట్లు ఇందిరాదేవి చెప్పడంతో.. అందరు షాక్‌ అవుతారు. మీ ఇంకో చెల్లి రావడం మీ చెల్లికి ఇష్టం లేనట్టుందని కావ్యతో రాజ్ అంటాడు. మధ్యలో నన్నెందుకు లాగుతున్నారు. వాళ్లు ఇంటికి రావడానికి నేనే కారణమని ఎవరైనా అంటే అని కావ్య అనగానే.. వాళ్ల దుమ్ము దులిపేయ్ అని అపర్ణ చెప్తుంది.   సరే అందరం కలుస్తున్నాం.. వాళ్ల అమ్మ నాన్నలను కూడా పిలుద్దామని ప్రకాశం అంటాడు. అయితే వాళ్లంతా ఎందుకని ధాన్యలక్ష్మి ప్రశ్నిస్తుంది.అందరూ గొడవ పడుతుంటే ఇంతలో సీతారామయ్య నేను చిట్టి వెళ్లి వాళ్లను పిలుచుకొస్తాం. అంటాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. మీరు మనవడి కోసం ఒక మెట్టు దిగి పిలవడం నాకు చాలా సంతోషంగా ఉందని ధాన్యలక్ష్మి అంటుంది. ధాన్యలక్ష్మీ మాటలకు రుద్రాణి షాక్‌ అవుతుంది. తర్వాత కనకానికి ఫోన్‌ చేస్తుంది కావ్య. ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నామని మూడు జంటలతో వ్రతం చేయించాలని అమ్మమ్మ తాతయ్య నిర్ణయం తీసుకున్నారని మీరు కూడా రావాలని చెప్తుంది. ఇప్పటి వరకు జరిగిందే చాలదన్నట్లు మళ్లీ మేమెందుకే అని కనకం అంటుంటే అపర్ణ ఫోన్ తీసుకుని రేపు మీకు లక్ష పనులు ఉన్నా  వ్రతానికి రావాలని చెప్తుంది. మరోవైపు కళ్యాణ్, అప్పుల దగ్గరికి సీతారామయ్య, ఇందిరాదేవి వస్తారు‌. ఇక కొత్తజంట వారి ఆశీర్వాదం తీసుకుంటారు. మీ ఆత్మగౌరవాన్ని మేము గౌరవిస్తాం. మిమ్మల్ని శాశ్వతంగా తీసుకెళ్లడానికి ఒప్పించేందుకు మేము రాలేదు. రేపు శ్రావణ శుక్రవారం, వ్రతం చేయిస్తున్నాం. మీరు ఇద్దరు ఇంటికి  రావాలని ఇందిరాదేవి అనగానే.. వ్రతమా.. అప్పుతోనా. తనకు అది సూట్ కాదు. కావ్య వదినతో చేయించండని కళ్యాణ్ అంటాడు. ఇక సీతారామయ్య రిక్వెస్ట్ చేయగానే.. కళ్యాణ్, అప్పులు సరేనంటారు. ఇక రాజ్ తన గదిలో ఫుల్ మాస్ పెట్టి డ్యాన్స్ చేస్తుంటే.. అప్పుడే కావ్య వస్తుంది. ఏమైందని కావ్య అడుగగా.. రేపు వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేశావా అని రాజ్‌ అడుగుతాడు. కాసేపు ఇద్దరు గొడవపడతారు. కళ్యాణ్‌ వాళ్లు ఇంటికి రావడం నీకు ఇష్టం లేదు కదా అని రాజ్ అనగానే.. నాకెందుకు ఇష్టం లేదు. మా చెల్లి కూడా వస్తుంది కదా అని కావ్య అనగానే.. ఈ నటించడం చిన్నపిల్లల దగ్గర నటించు. అయినా నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా. రేపు పూజ కోసం మాత్రమే కళ్యాణ్ వాళ్లు రావట్లేదు. వచ్చేవాళ్లు తిరిగి వెళ్లరని రాజ్ అంటాడు. కవిగారు ఎలా ఒప్పుకుంటారని కావ్య అనగానే.. అది నీ మట్టి బుర్రకి అర్థం కాదని చెప్పి పడుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.