150 వైన్ షాపులకు ఏపీ మహిళ దరఖాస్తు..గడుపు పొడిగింపు

  తెలంగాణలో మద్యం దుకాణాల ఏర్పాటుకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో,  మద్యం షాపుల టెండర్ల గడువుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం టెండర్ల గడవును అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ నెల 23వ తేదీన జరగాల్సిన మద్యం షాపుల డ్రాను సైతం వాయిదా వేశారు.  శనివారం బంద్ కారణంగా బ్యాంకులు తెరుచుకోలేదు. దీంతో మద్యం దరఖాస్తులపై బంద్ ప్రభావం చూపిందనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువు పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది భారీగా ఈ దరఖాస్తులు తగ్గాయాని సమాచారం.అసలు అయితే శనివారం సాయంత్రంతో ఈ మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు ముగియాల్సి ఉంది. చివరి నిమిషంలో ఈ దరఖాస్తుల గడువు పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు.  మరోవైపు శనివారం భారీగా దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ ఒక్క రోజే 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 90 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.అదలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ దాదాపు 150 వైన్ షాపులకు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. అదీకూడా ఏపీకి సరిహద్దుల్లో ఉండే జిల్లాల్లోని మద్యం దుకాణాలకు ఆమె అధికంగా దరఖాస్తు చేసినట్టు ఒక ప్రచారం అయితే సాగుతోంది. సంగారెడ్డి జిల్లాల్లో 101 మద్యం దుకాణాలకు 4,190 దరఖాస్తులు రాగా.. మెదక్ జిల్లాలో 49 మద్యం దుకాణాలకు 1,369 టెండర్లు వచ్చాయి.

రవాణా శాఖ చెక్ పోస్ట్‌ల పై ఏసీబీ రైడ్స్

  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు ఏకకాలంలో మొత్తం ఆరు చోట్ల దాడులు నిర్వహించారు... ఈ ఆరు చెక్ పోస్ట్ లలో పెద్ద ఎత్తున అవినీతి అక్ర మాలు జరుగుతున్నట్లుగా ఫిర్యాదులు వెల్లు వెత్తడంతో ఏసీబీ  అధికారులు రంగం లోకి దిగి మొత్తం ఆరు చెక్ పోస్టులపై ఒకేసారి దాడులు నిర్వహించారు. 1)    మహబూబ్‌నగర్ జిల్లా లోని క్రిష్ణా చెక్ పోస్ట్. 2)    సంగారెడ్డి జిల్లా లోని జహీరాబాద్ చెక్ పోస్ట్.  3)    కామారెడ్డి జిల్లా లోని కామారెడ్డి, మద్నూర్ రెండు చెక్ పోస్ట్.  4)    భద్రాద్రి కొత్తగూడం జిల్లా లోని ఆశ్వరావు పేట చెక్ పోస్ట్.  5)    కొమరంభీమ్ జిల్లా లోని వాంకిడి చెక్ పోస్ట్ తో పాటు మరో చెక్ పోస్ట్ లో  సోదాలు నిర్వ హించారు... మొత్తం ఆరు చెక్ పోస్ట్ ల పై దాడులు కొనసాగుతున్నాయి. అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు ప్రవీణ్, రజినీ భాయి, తిరుపతి, కిరణ్ కుమార్, ఆఫ్రోజ్ లను అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ చెక్ పోస్ట్ లపై ఏకకాలంలో ఏసీబీ   దాడులు నిర్వహిం చడం ఇది రెండవ సారి.... కావడంతో  తీవ్ర సంచలనం రేపుతుంది. నిన్న అర్ధరాత్రి నుండి ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు ఈ దాడులు కొనసాగిస్తున్నారు.  

మూసాపేట్ మెట్రో స్టేషన్‌లో బుల్లెట్‌ కలకలం

  హైదరాబాద్ మూసాపేట్ మెట్రో స్టేషన్‌లో బుల్లెట్‌ కలకలం రేపింది. మెట్రోలో ప్రయాణించేందుకు వచ్చిన ఓ బాలుడు వద్ద బుల్లెట్ కనిపించండంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న కూకట్‌పల్లి పోలీసులు బుల్లెట్‌ను స్వాధీనం చేసుకొని, బాలుడిని విచారిస్తున్నారు.  బీహార్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్‌ అనే యువకుడు మూసాపేట ప్రగతినగర్‌లో ఉంటూ ఫ్యాబ్రికేషన్‌ వర్క్‌ చేస్తున్నాడు. శనివారం రాత్రి ఓ బ్యాగ్‌తో మెట్రోలో ప్రయాణానికి వచ్చాడు. సాధారణ స్కానింగ్‌ సమయంలో భద్రతా పరికరం బీప్‌ ఇవ్వడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అతడి సామాను క్షుణ్ణంగా పరిశీలించగా 9 ఎంఎం బుల్లెట్‌ బయటపడింది. వెంటనే ఈ విషయాన్ని కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. బుల్లెట్‌ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బీసీ బంద్‌లో దాడులకు పాల్పడిన 8 మంది అరెస్ట్

  తెలంగాణలో నిన్న జరిగిన బీసీ బంద్‌లో దాడులకు పాల్పడిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారులు షాపులు మూసేయలేదని కొందరు దాడులకు పాల్పడ్డారు. అలాంటి వారిని గుర్తించిన పోలీసులు హైదారాబాద్‌లోని నల్లకుంట, కాచిగూడ, పోలీసు స్టేషన్‌లలో పలు సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం నిన్న బీసీ బంద్‌కు పిలుపునిచ్చిన బీసీ సంఘాలు. ఈ బంద్‌ పిలుపుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీతో పాటు అనేక రాజకీయ పార్టీలు, సంఘాలు మద్దతు తెలిపాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అయితే ఈ బంద్ సందర్భంగా పలు ప్రాంతాల్లో కొంత మంది నేతలు హద్దులు దాటి పలు షాపులు, పెట్రోల్ బంకులు, చిరువ్యాపారుల సముదాయాలపై దాడులు చేశారు.. 8 మంది బీసీ నేతలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అరెస్ట్‌లను రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యను ఖండించారు. అలాగే బీసీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సిడ్నీలో మంత్రి లోకేశ్‌‌కు ఘన స్వాగతం

  ఏపీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఈ రోజు ఉదయం సిడ్నీ విమానశ్రయంలో ఆస్ట్రేలియా తెలుగుదేశం బృందం  లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో అభిమానులు టీడీపీ జెండాలు చేబూని లోకేశ్ కు గ్రాండ్ వెల్కమ్ తెలిపారు. లోకేశ్ పర్యటన నేపథ్యంలో సిడ్నీలో పెద్ద ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేశ్ వారితో ఫోటోలు దిగారు.  బ్రిస్బేన్‌, కాన్‌బెర్రా, అడిలైడ్‌, మెల్‌బోర్న్‌ నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు లోకేశ్‌ను కలిశారు.  లోకేశ్‌ నేటి నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ‘స్పెషల్‌ విజిట్స్‌ ప్రోగ్రాం’లో పాల్గొనాల్సిందిగా ఆసీస్ ప్రభుత్వం తరఫున ఆ దేశ హై కమిషనర్‌ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీలను సందర్శించి అధునాతన బోధనా పద్ధతులను లోకేశ్ అధ్యయనం చేయనున్నారు.  నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో నారా లోకేశ్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్ బోర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో చర్చలు జరిపి రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరాతో లోకేశ్ సమావేశమవుతారు.

ఏం గుండెరా అది...ప‌ది కాలాల పాటు బ‌త‌కాలి

  మహేష్ బాబు తన మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పుట్టుకతో వచ్చే గుండె సమస్యలున్న పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలకు నిధులు అందిస్తున్నారు. ఈ ఫౌండేషన్ అవసరమైన పిల్లలకు సహాయం చేయడంపై దృష్టి పెడుతుంది. ప్ర‌స్తుతం ఈ శ‌స్త్ర చికిత్స‌లు ఐదు వేల‌కు చేరుకున్నాయంటే ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇది నిజంగానే ఒక గుండెలు గెలిచిన వీరుడి విజ‌య గాథ‌. అలాంటి వార్త ఎంత పెద్ద వార్త కావాలి? కానీ ఎక్క‌డా ఆ ఊసే ఉండ‌దు. ఎవ‌రూ కూడా దాని గురించి మాట్లాడ‌రు. ఆయ‌న కూడా దాని గురించి ఎక్క‌డా చెప్ప‌రు. అదే కొంద‌రు న‌టులు ఏ చిన్న సాయం చేసినా స‌రే.. అది ఇటు సోష‌ల్ మీడియా అటు మెయిన్ మీడియాలో ప్ర‌ధాన‌ వార్త‌గా నిల‌వాల్సిందే. కానీ మ‌హేష్ బాబుకు ఇలాంటి పీఆర్ అంటే ఏమంత ఇష్టం ఉండ‌దు. ఆప‌ద‌లో ఉన్నారు. ఆదుకుంటున్నాం ద‌ట్సాల్. ఇదీ మ‌హేష్ లైఫ్ స్టైల్.  దానికి తోడు వారు చిన్న పిల్ల‌లు ఇలాంటి భావి భార‌తం రేపు ఆరోగ్య‌క‌రంగా రూపు దిద్దుకుంటేనే కదా.. ఆపై దేశ భ‌విష్య‌త్ బ‌లంగా ఉండేది? అన్న ఆలోచ‌న ఆయ‌న‌ది.నిజానికి ఇలాంటి వారికి ప‌ద్మ‌శ్రీలు ఇవ్వాలి. ప‌ద్మ‌భూష‌న్ల‌తో స‌త్క‌రించాలి. వీరంతా గుప్తంగా తాము చేయాల్సిన ప‌నులు చేసేస్తుంటారు. క‌ర్ణాట‌క‌లో పునీత్ రాజ్ కుమార్ ఎలాగో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మ‌హేష్ కూడా అంతే.. అయితే యాక్టింగ్ లేదంటే ఇదిగో ఇలాంటి ప్ర‌జా సేవ‌. అలాగ‌ని ఇదేదీ ఆయ‌న రాజ‌కీయ సోపానం కోసం చేసే య‌త్నం కానే కాదు. ఆ మాల‌కొస్తే ఆయ‌న కుటుంబానికి రాజ‌కీయాలు కొత్త కానే కాదు. ఆ దిశ‌గా త‌న అభిమానుల చేత అరిపించుకోవ‌డం వంటివి అస్స‌లు చేయ‌రు. ఆయ‌న కూడా  పొలిటిక్స్ ప‌ట్ల ఎక్కువ‌గా మ‌క్కువ చూపించిన‌ట్టు క‌నిపించ‌రు.. ఈ స‌మాజం ఎంతో ఇచ్చింది. మ‌న‌మూ తిరిగి కొంత ఇచ్చేయాలి. లేకుంటే లావై పోతామ‌న్న కోణం మ‌హేష్ బాబుది. అందుకే ఇలా రివ‌ర్స్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నారీ సొసైటీకి.  శ్రీమంతుడు మ‌హేష్ బాబు కేవ‌లం ఈ గుండె ఆప‌రేష‌న్లే కాదు.. కొన్ని గ్రామాల ద‌త్త‌త కార్య‌క్ర‌మం కూడా చేప‌ట్టి ఆ దిశ‌గా కొంత స‌మాజ సేవ చేస్తున్నారు. ఈ గ్రామాలు ఏవ‌ని చూస్తే అది ఏపీలోని త‌న తండ్రి జ‌న్మ‌స్థ‌లం బుర్రిపాలెం, తెలంగాణ‌లోని మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని ఒక గ్రామం.. ద‌త్త‌త తీస్కుని అక్క‌డ త‌న వంతు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు మ‌హేష్ బాబు. అభిమానుల చేత ప్రిన్స్ అని సూప‌ర్ స్టార్ అని పిలిపించుకోవ‌డం కాదు.. నిజంగానే వారి కోసం త‌న వంతుగా అది కూడా ఎక్క‌డా ఏ హంగూ ఆర్బాటం లేకుండా.. మ‌హేష్ చేస్తున్న ఈ సేవ‌కు మ‌న‌మంతా క‌ల‌సి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే ఏమంటారు? ఐదు వేలకు పైగా గుండెల‌కు ఆప‌రేష‌న్లు చేయించిన మ‌హేష్ బాబు నిజంగానే ఒక రియ‌ల్ హీరో.. వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ అన్న‌ది ఆయ‌న అభిమానులంటోన్న మాట‌.  

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక

  ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి కానుకగా ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులతో ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. నవంబర్ 1 నుంచి డీఏ జమ చేస్తామని ఇందుకు నెలకు రూ.160 కోట్లు ఖర్చు అవుతాయని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఉన్నా డీఏ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.  పోలీసులకు ఈఎల్‌.. ఒక ఇన్‌స్టాల్‌ మెంట్‌ రూ.105 కోట్లు ఇస్తాం. మరో రూ.105 కోట్లు జనవరిలో ఇస్తాం. 60 రోజుల్లోపు ఉద్యోగుల హెల్త్‌కు సంబంధించిన వ్యవస్థను స్ట్రీమ్‌లైన్‌ చేస్తాం. ఆర్టీసీ ఉద్యోగులకు ఒక ప్రమోషన్‌ పెండింగ్‌లో ఉందని సీఎం పేర్కొన్నారు .సీపీఎస్‌ అంశంపై చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంలో వయోపరిమితి లేదని స్ఫష్టం చేశారు. ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు  

మద్యం షాపులకు దరఖాస్తుల వెల్లువ

  తెలంగాణలో మద్యం షాపులకు రోజు రోజుకి దరఖాస్తుల వెల్లువ కొనసాగుతుంది. శనివారం చివరి రోజు కావడంతో సాయంత్రం నుంచి గంట గంటకు   దర ఖాస్తులు పెరు గుతూ వస్తున్నాయి. శుక్రవారం నాటికి 2620 మద్యం షాపులకు 50 వేల దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు దరఖాస్తులు 30 వేల నుంచి 40 వేల వరకు  పెరిగే అవకాశం ఉన్నట్లు  ఎక్సైజ్‌ శాఖ భావిస్తుంది.  గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది దరఖాస్తులు తగ్గిన ఆదాయం మాత్రం  పెరిగే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్‌ శాఖ అంచనాలు వేసుకుంటున్నారు.సెప్టెంబరు 27 నుంచి మొదలైనా దరఖాస్తుల స్వీకరణ తొలుతగా  మంది కొడిగా కొనసాగింది. కాని చివరి మూడు రోజు లుగా ముందస్తుగా అనుకున్న రీతిలో దరఖాస్తులు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. శనివారం రాత్రి వరకు గ్రాండ్‌ టోటల్‌గా 80 వేల నుంచి 90 వేలకు  పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా అధికా రులు అంచనాలు వేస్తున్నారు.  సాయంత్రం 5 గంటల లోపు వచ్చిన వారి టో కన్లు ఇచ్చి వారి  దరఖాస్తులను తీసుకుంటారు. ఏపీకి చెందిన ఓ మహిళ ఏకంగా 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసింది. ఇందుకోసం రూ.4 కోట్ల 50 లక్షలు చెల్లించింది. రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలకు ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే దరఖాస్తులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

తల్లిదండ్రులను చూసుకోకపోతే జీతం కట్ ...గ్రూప్‌-2 ఉద్యోగాలకు సీఎం హెచ్చరిక

  హైదరాబాద్‌ శిల్ప కళావేదికలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన  నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేవారు, ఉద్యోగులు తమ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని అదే జరగకపోతే వారి జీతంలో కోత విధించి తల్లిదండ్రులకు అందజేస్తామని తెలిపారు. ఇందుకోసం త్వరలోనే చట్టం తెస్తామని పేర్కొన్నారు. విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందని సీఎం పేర్కొన్నారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదని ముఖ్యమంత్రి విమర్శించారు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే మీకు ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవి ఆయన పేర్కొన్నారు. వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు తప్ప గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి స్ఫష్టం చేశారు. పదిహేనేళ్లుగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ జరగలేదు అంటే… ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందని సీఎం ప్రశ్నించారు. మిమ్మల్ని తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత టీజీపీఎస్సీ తీసుకుందన్నారు. ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్ అని ముఖ్యమంత్రి తెలిపారు. మీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దని నిస్సహాయులకు సహాయం చేయండి.. పేదలకు అండగా నిలవలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్‌ రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గోన్నారు.  

నకిలీ మద్యం కేసులో సూత్రధారులకు చుక్కలు చూపిస్తాం : మంత్రి కొల్లు

  నకిలీ మద్యం కేసు దర్యాప్తును సిట్ వేగవంతం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం నాణ్యత లేని, హానికరం కాని పదార్థాలు ఉపయోగించినట్లు తేలిందని మంత్రి పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో సూత్రధారులు, పాత్రధారులకు చుక్కలు చూపిస్తామని మంత్రి తెలిపారు. మాజీ మంత్రి పేర్ని నానికి మతిచేడి ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని మండిపడ్డారు. రూ.99 బ్రాండ్లు నిలిపివేశామనడం చెప్పడం ఆయన ఆజ్జానానికి నిదర్మనమన్నారు. జనార్థన్ రావు తన ఇంటికి వచ్చినట్లు జోగి రమేశ్ అంగీకరించారని మంత్రి కొల్లు అన్నారు. వాస్తవాలు బయటకు వస్తుంటే జగన్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది కేసు విషయంలో చాలా సీరియస్ గా ఉన్నామని పేర్కొన్నారు.  ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ప్రతి మద్యం సీసాను స్కాన్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. డిజిటల్ పేమెంట్లు ఎవరి హయాంలో లేకుండా చేశారో ప్రజల్ని అడిగితే చెబుతారన్నారు. ఇండెంట్ ప్రకారమే మద్యం సరఫరా చేస్తారనే కనీస జ్ఞానం లేదా?అని ప్రశ్నించారు. గత ఐదేళ్లు కల్తీ మద్యం అమ్మిందెవరో ప్రజలు గుర్తించే వైసీపీని తరిమికొట్టారని తెలిపారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం ఘటనల విచారణ పారదర్శకంగా జరుగుతోందని వెల్లడించారు. సిట్ విచారణను కూడా తప్పుదోవ పట్టించేలా వైసీపీ సోషల్ మీడియా కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోలోగ్రామ్, ట్రాక్ అండ్ ట్రేస్ విధానం 2014-19లోనే తీసుకొచ్చామని గుర్తు చేశారు.

నిండు గర్భిణిని గొడ్డలితో నరికి చంపిన కసాయి మామ

  కులవివక్ష మళ్లీ క్రూరరూపం దాల్చింది. ఓ గర్భిణీ ప్రాణాన్ని కూడా క్షమించని అమానుష ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కడుపులో ఎనిమిది నెలల బిడ్డ ఉన్న కోడలిని, కులం పేరుతో ఓ మామ గొడ్డలితో దారుణంగా నరికి చంపేశాడు. వివరాల్లోకి వెళితే దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన శేఖర్ (బీసీ కులం) అదే గ్రామానికి చెందిన రాణి (ఎస్టీ కులం)ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈ కులాంతర వివాహం శేఖర్ తండ్రి సత్తయ్యకు అస్సలు నచ్చలేదు. కుమారుడు తన కులం కాని అమ్మాయిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక, కోపం పీక్‌కి చేరింది. ఇదిలా ఉండగా, రాణి ఎనిమిది నెలల గర్భిణీ అయ్యింది. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న ఆనందంలో శేఖర్-రాణి దంపతులు ఉన్నారు. అయితే ఈ సంతోషం సత్తయ్యకు నచ్చలేదు. క్రోధంతో రగిలిన అతడు, గర్భిణీ కోడలిపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రాణి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనతో గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సత్తయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

అధికారులు అలసత్వం వహిస్తే సహించం : సీఎం రేవంత్

  ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగ అధిపతులను హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు.  ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదని ముఖ్యమంత్రి  అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అలసత్వం వీడాలని అన్నారు. ఎవరికివారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దని, అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ముందుగా ప్రాధాన్యమివ్వాలని సీఎం పేర్కొన్నారు. శనివారం ఉదయం సీఎం నివాసంలో సీఎంవో కార్యదర్శులు, సీఎస్ రామకృష్ణారావుతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పని చేయాలని చెప్పారు.  అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా ఫైలు ఆగిపోవడానికి, పనులు ఆగిపోవడానికి వీల్లేదని హెచ్చరించారు.  కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఏయే పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే, కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందో, వాటికి ముందుగా ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇకపై సీఎస్ తో పాటు సీఎంవో అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని, తానే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు.  

బాల సదన్‌లో రెహమాన్‌పై మరో కేసు నమోదు

  హైదరాబాద్ సైదాబాద్ బాలసదన్‌లో  ఓ చిన్నారి బాలుడిని లైంగిక వేధింపులకు గురిచేసిన రెహమాన్‌పై మరో కేసు నమోదు అయింది... బాలసదన్ లో పనిచేస్తున్న రెహమాన్ అందులో ఉన్న చిన్నారి బాలుడు పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలుడిని ఇంటికి పంపించాడు. ఇంటికి వెళ్లిన బాలుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బాలుడి తల్లిదండ్రులు అతని హాస్పిటల్ కి తీసుకువెళ్లగా అతనిపై లైంగిక దాడి జరిగినట్లుగా తెలుసుకొని తల్లిదండ్రులు షాక్ గురయ్యారు.  అనంతరం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రెహమాన్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే రెహమాన్ చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సైదాబాద్ పోలీసులు తాజాగా రెహమాన్ పై మరో కేసు నమోదు చేశారు. హోమ్ లో ఉన్న 8 మంది చిన్నారులపై కూడా రెహమాన్ లైంగిక దాడి చేశాడని మరో ముగ్గురు చిన్నారులను వేధింపులకు గురి చేసినట్లుగా తెలిసింది. కామంతో రగిలిపో తున్న రెహమాన్ హోమ్ లో ఉన్న అభం శుభం తెలియని చిన్నారులను తీసుకువెళ్లి లైంగిక వాంఛ తీర్చుకు నేవాడు. ఈ విధంగా రెహమాన్ 8 మంది చిన్నారులను భయభ్రాంతులకు గురిచేసి రాత్రి సమయంలో వారిని బాత్రూం లోకి తీసుకువెళ్లి... లైంగిక దాడి చేసి వికృతి కోరికలు తీర్చుకునేవాడు.  మరో ముగ్గురు చిన్నారులను వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటనలు వెలుగులోకి రావడంతో పోలీసులు రహమాన్ ఫైన ఫోక్సో యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే రెండు కేసులు నమోదు కాగా ఇప్పుడు తాజాగా మరో కేసు నమోదు కావడంతో రెహమాన్‌పై కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది... చిల్డ్రన్స్ హోమ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ హోమ్ కి చెందిన 8 మంది చిన్నారులపై రెహమాన్ లైంగిక దాడి చేశాడని... మరో ముగ్గురిని తనకు సహకరించాలంటూ వేధింపు లకు గురి చేసాడని తెలిపారు.  

ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం

  ఢిల్లీలోని ఎంపీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్లమెంటు భవనం 200 మీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో ఎంపీలు నివసిస్తున్నారు. ఈ అపార్ట్‌మెంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో సమాచరం అందుకున్నా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అందులోకి తెచ్చాయి.  అగ్నిప్రమాదం గురించి మధ్యాహ్నం 1:20 గంటలకు తమకు సమాచారం అందినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మూడో అంతస్తులో ఒకరికి కాలిన గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

దర్శనం మొగులయ్యకు కేటీఆర్ భరోసా

  పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్యకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మొగులయ్య ఈరోజు కేటీఆర్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆరోగ్యంపై కేటీఆర్ ఆరా… కంటి చికిత్స హామీ మొగులయ్య ఆరోగ్యం, యోగక్షేమాల గురించి కేటీఆర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా మొగులయ్య తన కంటిచూపు మందగించిందని, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్, మొగులయ్యకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌లో పూర్తి చికిత్సను అందించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. మొగులయ్య ఇంటి స్థలం సమస్యపై కలెక్టర్‌కు కేటీఆర్ ఫోన్ అనంతరం మొగులయ్య, గత ప్రభుత్వం తనకు హయత్ నగర్ మండలంలో కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో కొంతమంది వ్యక్తుల నుండి ఎదురవుతున్న ఇబ్బందులు, కోర్టు కేసుల వివరాలను కేటీఆర్‌కు వివరించారు. గత ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన భూమిని తనకు ఉచితంగా అందిస్తే దీన్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని మొగులాయి అన్నారు.  తాను కట్టుకున్న గోడలను ఇంటిని కూడా కులగోట్టారని, కోర్టు కేసులు వేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కాపాడాలని కేటీఆర్ కి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో అనేకసార్లు కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లిన తనకు పరిష్కారం దొరకలేదని, తనకు అండగా నిలవాలని కోరారు.  దీనిపై తక్షణమే స్పందించిన కేటీఆర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. మొగులయ్యకు గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేటాయించిన భూమి విషయంలో కొందరు వ్యక్తులు కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కలెక్టర్‌కు తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, మొగులయ్యకు న్యాయం చేయాలని కోరారు.  అలాగే, మొగులయ్య ఆ స్థలంలో కట్టుకున్న గదిని కూడా కొంతమంది కూల్చివేసిన పరిస్థితి ఉందని మొగులయ్య చెప్పారని పేర్కొన్నారు. మొగులయ్య భూమికి, ఆయన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్‌కు మాజీ మంత్రి సూచించారు. అవసరమైతే, మొగులయ్యకు ఎదురవుతున్న న్యాయపరమైన కేసులను ఎదుర్కొనేందుకు కూడా సహాయం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్‌కు మొగులయ్య కృతజ్ఞతలు ఈ సందర్భంగా మొగులయ్య కేటీఆర్‌తో మాట్లాడుతూ, ఒకప్పుడు లింగాల అడవుల్లో 12 మెట్ల కిన్నెర వాయించుకునే తనకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేమతోనే గుర్తింపు దక్కిందని తెలిపారు. బీఆర్‌ఎస్ అధినేత  తనను గుర్తించి ఉగాది పురస్కారం ఇచ్చి గౌరవించడం వల్లనే తన కళ ప్రపంచం దృష్టికి చేరిందని, తదనంతరం పద్మశ్రీ అవార్డు కూడా దక్కిందని పేర్కొన్నారు. కేసీఆర్ తమ కుటుంబం కోసం చేసిన సహాయానికి, తమ కష్టాలన్నీ తీర్చినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. తన ఇంటి స్థలం వివాదాన్ని పరిష్కరించి, కోర్టు కేసుల విషయంలో సహాయం చేయాలని మొగులయ్య కేటీఆర్‌ను విజ్ఞప్తి చేశారు.

స్వచ్ భారత్‌లో అనుకోని అతిథి...చిన్నారుల ఆనందం

  రాష్ట్ర వ్యాప్తంగా మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రహసనంలా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ శనివారం నాడు జరిగిన కార్యక్రమం వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రత్యేకంగా చేస్తున్న నేపథ్యంలో  కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటనలో ఆసక్తికర సంఘటన జరిగింది.  శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలసి పాల్గొన్నారు. నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలంలో పర్యటిస్తున్న సమయంలో నౌతల కూడలి లో చిన్నారులు చేస్తున్న స్వచ్ఛంద్ర కార్యక్రమం కేంద్ర మంత్రి దృష్టిని ఆకర్షించింది.  వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నినదిస్తూ.. సైకిళ్లలతో చిన్నారులు ర్యాలీ చేపట్టడం అక్కడి వారిని ఆలోచింపజేసింది. ఈ నేపథ్యంలో తన కాన్వాయ్ ను ఆపి చిన్నారులతో ముచ్చటించారు. మంచి కార్యక్రమం చేస్తున్నారంటూ కితాబిచ్చారు. ప్రతీ ఒక్క చిన్నారి మొక్కలను కూడా నాటాలని కోరారు.  సమాజ హితం కోసం చిన్నారులు చేస్తున్న ఈ కార్యక్రమంలో అనుకోని అతిథిగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రావడంతో ఆ చిన్నారులు ఉబ్బితబ్బిబ్బి అవుతున్నారు.

భారత్‌ క్షిపణిలకు పాక్ తప్పించుకోలేదు : రాజ్‌నాథ్‌ సింగ్‌

   భారత సైన్యం అమ్ములపొదిలో మరిన్ని బ్రహ్మోస్‌ క్షిపణులు చేరాయి. ఉత్తర్‌ప్రదేశ్‌  రాజధాని లఖ్‌నవూలో బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ యూనిట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సందర్శించారు. ఇక్కడ తొలి విడత బ్రహ్మోస్‌ క్షిపణులను ఉత్పత్తి చేశారు. వీటిని రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి అప్పగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్  కేవలం ట్రైలర్ మాత్రమేనని పాకిస్తాన్ హెచ్చరించారు.  దాయాదులు దుస్పాహసాని తెగబడితే ఊహించని ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. భారత్‌ సైన్యం పరాక్రమం అప్రతిహతం. మనకు ఉన్న ఆధునిక క్షిపణి సామర్థ్యాల ముందు శత్రువులు తప్పించుకోలేరని  రక్షణ మంత్రి  అన్నారు.ఇదే సందర్బంగా బ్రహ్మోస్ బృందం ఒక నెలలోనే రెండు దేశాలతో రూ.4 వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. “తొలిసారి విదేశీ నిపుణులు లఖ్‌నవూకు రానున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ యూనిట్ టర్నోవర్ రూ.3 వేల కోట్లు దాటుతుంది. ప్రతి ఏటా రూ.5 వేల కోట్ల మేర జీఎస్టీ వసూలు అవుతుంది” అని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

ఉమేష్ చంద్ర హత్యలో ఆశన్న కుట్ర పథకం

అది 1999 సెప్టెంబ‌ర్ 4. స్థలం ఎస్సార్ న‌గ‌ర్ జంక్ష‌న్. ఎప్ప‌టిలాగానే ఐపీఎస్ ఉమేశ్ చంద్ర‌.. త‌న మారుతీ వ్యాన్ లో  డ్యూటీకి బ‌య‌లుదేరారు. ఇంత‌లో అనుకోని ఒక దాడి.   ఎప్ప‌టి నుంచో కాపు కాచిన న‌క్స‌ల్స్ యాక్ష‌న్ టీమ్.. ఒక్క‌సారిగా కాల్పుల మోత మోగించింది. డ్రైవ‌ర్, ఉమేష్ పీఏ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోగా.. ఆయుధం లేని ఉమేష్ చంద్ర‌.. వెంట‌నే కారు బ‌య‌ట‌కొచ్చి.. న‌క్సల్స్ ని ప‌ట్టుకుందామ‌ని ప్ర‌య‌త్నించారు. క‌ట్ చేస్తే ఆయ‌న ద‌గ్గ‌ర ఆయుధం లేద‌ని గుర్తించిన న‌క్స‌ల్స్.. వెంట‌నే ఆయ‌న మీదకు ఎదురు దాడికి తెగ‌బ‌డ్డారు. దీంతో వెన‌క్కు త‌గ్గిన ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వచ్చి కాల్పులు జ‌రిపారు. దీంతో ఉమేష్ చంద్ర‌  మ‌ర‌ణించారు. ఈ మొత్తం యాక్ష‌న్ ప్లాన్ వెన‌క కీల‌క సూత్ర‌ధారి మ‌రెవ‌రో కాదు.. శుక్ర‌వారం (అక్టోబర్ 17) లొంగిపోయిన ఆశ‌న్న‌. వీళ్లు మొత్తం మూడు యాక్ష‌న్ టీములుగా ఏర్ప‌డి.. మూడు నెల‌ల పాటు రెక్కీ నిర్వ‌హించి.. ఈ దాడికి పాల్ప‌డ్డారు. అదెంత‌గా అంటే, ఏకంగా ఉమేష్ చంద్ర ఇంట్లోకి కూర‌గాయ‌ల వాళ్ల రూపంలో ఇత‌ర‌త్రా ప‌నివాళ్ల రూపంలో చొర‌బ‌డేంత‌. క‌ట్ చేస్తే ఆయ‌న క‌ద‌లిక‌లేంటి? ఏయే స‌మ‌యాల్లో నిరాయుధంగా వెళ్తుంటారు. ఏ రూట్లో వెళ్తుంటారు వంటి అనుపానుల‌న్నీ ప‌సిగ‌ట్టిన మరీ ఉమేష్ చంద్రను హతం చేశారు. ఈ మొత్తం వ్యవహారం అంతా ఆశ‌న్న నాయ‌క‌త్వంలోనే జరిగింది. కార‌ణ‌మేంట‌ని చూస్తే ఉమేష్ చంద్ర‌కు క‌డ‌ప పులి అన్న పేరుండేది. అంతే కాదు.. ఆయ‌న న‌క్సల్స్ ప్ర‌భావిత ప్రాంతాలైన వ‌రంగ‌ల్, క‌రీంన‌గ‌ర్ ప్రాంతాల్లో పోలీసు ఉన్న‌తాధికారిగా ప‌ని చేశారు. న‌క్స‌ల్స్ పై ఉక్కు పాదం మోపారు. ఇది మ‌న‌సులో పెట్టుకున్న న‌క్స‌లైట్లు ఆయ‌న్న హ‌త‌మార్చ‌డానికి చేసిన పథక రచన సూత్రధారి ఆశన్నే.  అయితే ఆశ‌న్న కూడా ఆనాడే పోలీస్ ఎన్ కౌంట‌ర్లో చ‌నిపోయి ఉండేవాడు. అప్ప‌టికీ పోలీసు ఇన్ఫార్మ‌ర్ల ద్వారా ఈ దాడిలో పాల్గొన్న యాక్ష‌న్ టీమ్ స‌భ్యులు వెళ్తున్న ఆటోను అట‌కాయించిన పోలీసులు. వారిని కాల్చి చంపేశారు. అయితే వెన‌కే బైక్ పై మ‌రొక‌రితో వ‌స్తున్న ఆశ‌న్న ఇది గుర్తించి.. అటు నుంచి అటే ప‌రారయ్యాడు. దీంతో ఇన్నాళ్ల పాటు పోలీసుల‌కు చిక్క‌కుండా, అజ్ణాతంలో గడిపిన ఆశన్ని ఇప్పుడు ఆయుధాలు అప్పగించి సరెండర్ అయ్యారు.  ఇదీ ఉమేష్ చంద్ర మ‌ర‌ణానికి ఆశ‌న్న‌కూ ఉన్న సంబంధం.