మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి : సీఎం రేవంత్ రెడ్డి

  తెలంగాణ పోలీసు శాఖ చర్యలతో మవోయిస్టు, ఉగ్రవాద చర్యలు తగ్గిపోయాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గోషామహాల్​‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్​ ఫ్లాగ్​ డే పరేడ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన  పోలీస్ అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు సీఎం నివాళులు అర్పించారు.  ఆజ్జాతంలో ఉన్న మవోయిస్టులు లోంగిపోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల కొందరు మవోయిస్టు అగ్రనేతలు కొందరు లొంగిపోయారని అలాగే మిగిలినవారు కుడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి తెలంగాణ పునర్నిర్మాణనికి తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు. పోలీస్ అంటేనే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని పేర్కొన్నారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారని సీఎం తెలిపారు.  మూడు రోజుల కింద నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం చెందారని గుర్తుచేశారు. భర్త ప్రమోద్ ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.  ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు పోలీస్ భద్రత సంక్షేమం నుండి రూ.16 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ వెల్ఫేర్ నుండి రూ.8 లక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి తెలిపారు  

ఆడబిడ్డలపై అఘాయిత్యం చేస్తే వాళ్లకు అదే ఆఖరి రోజు : సీఎం చంద్రబాబు

  ఏపీలో పోలీస్ శాఖను సాంకేతికంగా బలోపేతం చేస్తుమన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని 6 ఏపీఎస్పీ బెటాలియన్ లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థూపం వద్ద పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.  కల్తీ మద్యంపై సీఎం కీలక వ్యాఖ్యలు..ఎవడు ఎక్కడ తప్పుచేసినా, దోషి ఎక్కడున్నా, ఏ పార్టీ వాడైనా సరే యాక్షన్ తీసుకోవాలని స్పష్టంగా చెప్పాను రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కల్తీ మద్యం వల్లే చనిపోయారని దుష్ప్రచారం చేశారని పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి వారి ఆటలు సాగవు చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలే ఉండేవని కానీ ఈరోజు సోషల్ మీడియా వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు.  వాళ్లు ఏది అనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని ఆయన వాపోయారు. దీన్ని కొత్త ఛాలెంజ్ గా తీసుకోవాలి కొత్త ట్రెండ్స్ ను అరికట్టడానికి చొరవ తీసుకుని ముందుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తిలేదు. సీసీ కెమోరాలు, డ్రోన్లు, గూగుల్ టేకౌట్‌లను ఉపయెగించుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.  పోలీసు సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. పోలీసులు కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి పనిచేస్తున్నారంటూ పోలీసులను ప్రశంసించారు. ఈ ఏడాది విధినిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారని,. వారికి ఘన నివాళులు అర్పించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీసులు అంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది.  ఈ కార్యక్రమంలో  సీఎస్ విజయానంద్ , డీజీపీ హరీష్ కుమార్ గుప్తా  పాల్గొన్నారు.

ద ఫ్యామిలీ మేన్ బాబు

  చంద్ర‌బాబు 4. 0 అంటే అంద‌రూ అది ప‌రిపాల‌న‌లో అనుకుంటారు. కానీ, ఆయ‌న ప‌రిపాల‌న ఇప్పుడేంటి ఎప్పుడో అంత‌ర్జాతీయ స్థాయికి చేరిపోయింది. ఈ విషయంలో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలే లేవు. ఆయ‌న ఇప్పుడే కాదు ఎప్ప‌టి నుంచో.. అడ్మినిస్ట్రేష‌న్ లో బ్రాండెడ్ సీఎంగా ఉన్నారు. ఆ మాట‌కొస్తే.. సీఈవో ఆఫ్ ద స్టేట్ అనే బిరిదు ఆయ‌న‌కు తాను తొలి సారి సీఎం అయిన‌ప్ప‌టి నుంచీ ఉంది. బాబు మారింద‌ని చెబుతోంది.. ఆయ‌న యాటిట్యూడ్ కి సంబంధించిన‌ది. ఇటు కుటుంబం కావ‌చ్చు, అటు ప్ర‌జ‌ల మ‌ధ్య ఆయ‌న తీరు తెన్నులు కావ‌చ్చు.. వీటి విష‌యంలో విశేష‌మైన మార్పు రావ‌డ‌మే.. బాబు 4. 0 స్పెష‌ల్ మీరు భువ‌నేశ్వ‌రిగానీ, లోకేష్ గానీ మాట్లాడేట‌పుడు బాబు గురించి వారేమంటారో గుర్తించారా? నా బాల్యంలో కావ‌చ్చు నా ఎదుగుద‌లలో కావ‌చ్చు డాడీ పెద్ద‌గా ఉండేవారు కాద‌ని అంటారాయ‌న‌. ఒక పొలిటీషియ‌న్ గా మ‌రీ ముఖ్యంగా ఒక సీఎంగా ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు ఆల్వేస్ బిజీయే. ఇక నారా భువ‌నేశ్వ‌రీ మాత అన్న‌మాట‌ల‌ను బ‌ట్టీ చూస్తే త‌న మొత్తం ఫ్యామిలీ లైఫ్ లో బాబు తీసిచ్చింది ఒకే ఒక్క చీర‌గా చెప్పుకుని బాధ ప‌డ్డారామె.  లోకేష్ కొర‌త తీరేలా త‌న కేబినేట్లో మంత్రిని చేసి.. ఇక్క‌డ కావ‌చ్చు, ఏదైనా విదేశాల‌కు తీసుకెళ్ల‌డం కావ‌చ్చు.. చేస్తూ కొడుకు ముచ్చ‌ట తీర్చుతున్నారు. అంతెందుకు మొన్నటికి మొన్న మోడీ క‌ర్నులు జీఎస్టీ స‌భ‌లో కూడా త‌న త‌న‌యుడ్ని అది ప‌నిగా ద‌గ్గ‌ర‌కు తీస్కుని మోడీకి మొమెంటో ఇప్పించారు చంద్ర‌బాబు. అది క‌దా తండ్రి కొడుకుల వాత్స‌ల్యం అనిపించేశారు. ఈ మ‌ధ్య కాలంలో ఒక చేనేత వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌న శాల‌కు వెళ్లిన‌పుడు త‌న భార్య కోసం ప్ర‌త్యేకించీ ఒక చీర కొన్నారు చంద్ర‌బాబు. మా ఆవిడ నేనే చీర కొనివ్వ‌లేద‌ని కంప్ల‌యింట్ చేస్తోందీ.. ఆమె కోసం ఒక మంచి చీర ఇవ్వండ‌య్యా అంటూ అడిగి మ‌రీ ఆ లోటు తీర్చే య‌త్నం చేశారు. అలాంటి చంద్ర‌బాబుకు పండ‌గ‌లు ప‌బ్బాలు కూడా.. ఫ్యామిలీతో క‌ల‌సి ఉండేవి కావు. ఎప్పుడూ ఏదో ఒక బిజీ బిజీ. అలాంటిది ఇప్పుడు త‌న కుటుంబానికి కూడా కాస్త స‌మ‌యం కేటాయిస్తున్న దృశ్యానికి ఇదిగో ఇదే అస‌లైన సాక్ష్యం. గృహ‌మే క‌దా స్వ‌ర్గ సీమ అన్న‌ట్టుగా త‌న ఉండ‌వ‌ల్లి నివాసంలో స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రితో క‌ల‌సి ఆయ‌న దీపావ‌ళి వేడుక‌లు జ‌రుపుకోవ‌డం చాలా మంది దృష్టిని ఆక‌ర్షిస్తోంది. బాబు బొత్తిగా మారిపోయారోచ్ అంటూ ఒక‌టే కామెంట్లు పేలుతున్నాయ్ కొంద‌రి సోష‌ల్ మీడియా గోడల మీద‌. ఆ మాట‌కొస్తే.. బాబు ఫోర్ పాయింట్ ఓ అంటే ఇదేనంటూ కామెంట్ల‌తో హోరెత్తిస్తున్నారు కొంద‌రు నెటిజ‌న్లు.  

ఒక సీఎం.... జ‌నం మ‌ధ్య దీపావ‌ళి అంటే ఇదేనేమో!

  ఎప్పుడూ జెడ్ కేట‌గిరి భద్ర‌త లో ఉండే ఏపీ సీఎం చంద్ర‌బాబు ఒక్క‌సారిగా జ‌నం మ‌ధ్య‌లోకి వ‌స్తే ఎలా ఉంటుందంటే.. జ‌స్ట్ దీపావ‌ళి న‌డిచి.. వ‌చ్చిన‌ట్టే ఉంటుందంటే అతిశ‌యోక్తి కాదేమో. ఊహించ‌న‌వి విధంగా.. బాబు త‌మ ద‌గ్గ‌ర‌కి రావ‌డంతో ఒక్కొక్క‌రి క‌ళ్ల‌లో ఆనందం దీపావ‌ళి మ‌తాబుల్లో వెలిగిపోయి క‌నిపించాయి. ద‌స‌రా తొలి రోజు నుంచి దీపావ‌ళి వ‌ర‌కూ జీఎస్టీ త‌గ్గుద‌ల మీద అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది రాష్ట్ర ప్ర‌భుత్వం. అందులో భాగంగా.. చంద్ర‌బాబు వితౌట్ సెక్యూరిటీతో మార్కెట్ లో క‌ల‌య‌దిరిగారు. చంద్ర‌బాబు. బాబు త‌మ‌ను ప‌ల‌క‌రించ‌డంతో ఒక్కొక్క‌రూ పుల‌క‌రించిపోయార‌నే చెప్పాలి. ఒక స‌మ‌యంలో జై బాబు జై బాబు అంటూ కొంద‌రు నిన‌దించ‌డం క‌నిపించింది.  త‌న మ‌న‌వ‌డు దేవాన్ష్ కోసం టపాకాయ‌లు కొన్న చంద్ర‌బాబు.. ఆపై ఒక సీజ‌న‌ల్ వ్యాపారితో జీఎస్టీ గురించి కాసేపు ముచ్చ‌టించారు. ఆపై చాలా మందితో సెఫ్లీల‌కు పోజులిచ్చారు. అటు పిమ్మ‌ట త‌న కారు ఎక్కి ఆయ‌న వెళ్లిపోయిన దృశ్యం క‌నిపించింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేవు. హంగామాలు లేవు. జ‌నం పోగేయ‌టం వంటి కృత్రిమ విన్యాసాలు లేవు. అక్క‌డ జ‌నం ఎంత మంది ఉన్నారో అంద‌రితోనే మాటా మంతి క‌లిపారు. ఆపై వారి వారి వివ‌రాలు అడిగి తెలుసుకుని.. వారికి నిజ‌మైన దీవాళీ మ‌జా ఏంటో రుచి చూపించారు.  బాబు సార్ జ‌నం ముఖ్య‌మంత్రి అంతే అంటూ ఎవ‌రికి వారు ఉప్పొంగిపోయార‌నే చెప్పాలి. ఎంతైనా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌న ప‌రిచ‌యం చేసిన సీఎం క‌దా.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే జీఎస్టీ అవ‌గాహ‌న తీసుకురాలేరా? అన్న మాట కూడా వినిపించింది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. తిరుమల భక్తులు  ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుమల అధికారులు పేర్కొన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(సోమవారం) శ్రీవారిని 72,026 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,304 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.86 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు గడిచిన 11 నెలల్లో 2024 నవంబర్ 1 నుండి - 2025 అక్టోబర్ 16వ తేదీ వరకు  రికార్డు స్థాయిలో రూ 918.6 కోట్లు విరాళాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడాక టీటీడీకు క్రమంగా దాతలు పెరుగుతున్నాట్లు తెలుస్తోంది

గోవా తీరంలో ప్రధాని దీపావళి వేడుకలు

  గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతు దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ మన రక్షణ దళాల కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఉగ్రవాదం, మావోయిస్టులకు భారత్‌లో చోటు లేదని ప్రధాని అన్నారు. మావోయిస్టు రహిత దేశం దిశగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రధాని వెల్లడించారు. వారి ఏరివేతకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.  ఈ ఏడాది మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన 100కి పైగా జిల్లాలు ఆనందంగా దీపావళి వేడుకలు నిర్వహించుకుంటాయని పేర్కొన్నారు. మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులుగా మారారు. వారి హిట్టుకు ప్రతిస్పందిస్తూ ‘ఆపరేషన్ కగార్‌’ను ప్రారంభించామని పేర్కొన్నారు.  భద్రతా దళాల ధైర్యం కారణంగా దేశం ఒక ముఖ్యమైన మైలురాయిని దాటింది. 11 సంవత్సరాల క్రితం నక్సల్స్ 125 జిల్లాల్లో విస్తరించగా, ఇప్పుడు కేవలం 3 జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యారు.  మావోయిస్టుల రహితంగా దేశాన్ని మార్చడం మా లక్ష్యం. 100 కంటే ఎక్కువ జిల్లాల ప్రజలు మావోయిస్టుల ప్రభావం నుంచి విముక్తి పొందగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారు. వేలాది మంది మావోయిస్టులు సమాజంలో మిళితమై జనజీవనంలో భాగమవుతున్నారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు కనీస సౌకర్యాలు లేకుండా పరిస్థితిని నష్టపరిచారు. పాఠశాలలు, ఆసుపత్రులను ధ్వంసం చేసి, వైద్యులను హత్య చేసిన సంఘటనలు కూడా. ఇప్పుడు ఆ మారుమూల ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.  కొత్త పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పడుతూ చిన్నారులు కొత్త భవిష్యత్తును నిర్మిస్తున్నారు. ఈ విజయం మొత్తం భద్రతా దళాల కృషి ఫలితం. దేశంలోని అనేక జిల్లాల్లో ప్రజలు దీపావళిని తొలిసారిగా గర్వంగా, గౌరవంగా జరుపుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను మోదీ పేర్కొన్నారు.

ఉదయనిధి స్టాలిన్‌పై సౌందరరాజన్ ఫైర్... ఎందుకంటే?

  తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇవాళ డిప్యూటీ సీఎం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వేదికపైకి వచ్చినప్పుడు కొందరు నాకు పుష్పగుచ్ఛాలు, పుస్తకాలు ఇచ్చారు. అయితే దీపావళి శుభాకాంక్షలు చెప్పడం కోసం కొందరు సంకోచించారు. ‘చెబితే వీడు ఎక్కడ కోపపడతాడేమో?’ అని అనుకుని ఉండొచ్చు. అందుకే నమ్మకం ఉన్నవారికి మాత్రమే శుభాకాంక్షలు చెబుతున్నా’’ అని ఆయన అన్నారు. హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న వారికి దీపావళి శుభాకాంక్షలు' అని చెప్పడంపై  బీజేపీ నేత, మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉదయనిధి స్టాలిన్ 'హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న వారికి దీపావళి శుభాకాంక్షలు' అని చెప్పడంపై ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. ఆయన శుభాకాంక్షలు తెలిపిన తీరును ఆమె ఖండించారు. డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ అని అందరికీ తెలుసని ఆమె మండిపడ్డారు.ఇతర మతాల పండుగల సమయంలో వారికి శుభాకాంక్షలు చెప్పేటప్పుడు కేవలం విశ్వాసం ఉన్నవారికే అని ఆ పార్టీ నేతలు ఎప్పుడూ చెప్పలేదని ఆమె అన్నారు.  హిందూ మతం విషయానికి వచ్చేసరికి వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.హిందుత్వంపై ఉదయనిధి స్టాలిన్‌కు ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని ఆమె అన్నారు. డీఎంకే పార్టీ హిందువులపై వివక్ష చూపుతోందని ఆరోపించారు.

ఆస్ట్రేలియా బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లతో మంత్రి లోకేష్ భేటీ

  ఏపీలో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. హెచ్ఎస్ బీసీ బ్యాంక్ సీఈవో ఆంటోనీ షా నేతృత్వంలోని సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ బృందంతో మంత్రి నారా లోకేష్ సిడ్నీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... విజనరీ ముఖ్యమంత్రి పెట్టుబడిదారులకు ఊతమిచ్చే పారిశ్రామిక విధానాలను ప్రకటించారని, దీంతో కేవలం 16 నెలల్లోనే ఏపీకి రూ.10లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.  రాష్ట్రంలో 1,051 కి.మీ.ల సువిశాల తీరప్రాంతంతో పాటు రోడ్లు, అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ తో ఎంవోయూ చేసుకున్నాక ఆ పరిశ్రమను మాదిగా భావించి అవసరమైన అన్ని అనుమతులు, ప్రోత్సహకాలు అందిస్తామని లోకేష్ తెలిపారు. ఆంధ్రపదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం భారీ పెట్టుబడులతో డేటా సిటీగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ఏపీలో నెలకొన్న పరిశ్రమల అనుకూల వాతావరణం, అమలుచేస్తున్న సులభతర వాణిజ్య విధానాలను తెలుసుకునేందుకు వచ్చే నెల 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్టనర్ షిప్ సమ్మిట్ కు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.  ఈ భేటీలో అమెజాన్ పబ్లిక్ పాలసీ (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆగ్నేయాసియా) డైరెక్టర్ మైఖేల్ కూలే, సిస్కో వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ ఎక్స్ పీరియన్స్ - ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) జెట్టి మురళి, రిచర్డ్ వాట్సన్ (ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రధాన భాగస్వామి), గ్రెయిన్ కార్ప్ సీఈవో రాబర్ట్ స్పర్వే, హెచ్ సీఎల్ టెక్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గీతేష్ అగర్వాల్, జై పటేల్ (హెడ్, కెపీఎంజీ ఇండియా బిజినెస్ ప్రాక్టీస్), మాస్టర్ కార్డ్ వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ అండ్ గవర్నమెంట్ రిలేషన్స్ ) శ్రీమతి టాన్యా స్టోయానాఫ్, ది యూనివర్సిటీ ఆఫ్ మెల్ బోర్న్ వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ & గవర్నమెంట్ రిలేషన్స్ ) ముత్తుపాండ్యన్ అశోక్ కుమార్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ డిప్యూటీ డీన్ (రీసెర్చ్ & ఇన్నోవేషన్) ప్రొఫెసర్ మైఖేల్ బ్లూమెన్ స్టీ తదితరులు పాల్గొన్నారు.

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం : డీజీపీ

  కానిస్టేబుల్ హత్య కేసు  ప్రమోద్‌ కేసులో నిందితుడు షేక్ రియాజ్  ఎన్కౌంటర్ పై స్పందించిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పదించారు. తప్పించుకొని పారిపోతూ పోలీసులపై మరోసారి దాడికి తెగబడిన రియాజ్ ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారని డీజీపీ పేర్కొన్నారు. పోలీసుల దగ్గరున్న వెపన్ తీసుకొని కాల్పులకి ప్రయ త్నించాడు. మరోసారి కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు చేశారు. పోలీసు జరిపిన ఎదురుకాల్పులో రియాజ్ చనిపోయాడని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు.  నిన్న రియాజ్ ని పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ఆసిఫ్ పై దాడి చేశాడు. ఇవాళ మరొక కానిస్టేబుల్ ని గాయపరిచి పారిపో యేందుకు యత్నిం చాడు. బాత్రూం కోసం వెళ్లి తిరిగి వస్తూ దాడికి తెగబడిన రియాజ్ పోలీసుల దగ్గరున్న వెపన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులపై వేపంతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే మరో కానిస్టేబుల్ రియాజ్ పై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని డిజిపి శివధర్ రెడ్డి వెల్లడించారు. కరడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన  పోలీస్ కానిస్టేబుల్, అమరుడు ఎంపల్లి ప్రమోద్ కుమార్ కు పోలీసు శాఖ తరుపున ఘన నివాళులు  అర్పించారమని పోలీస్ బాస్ పేర్కొన్నారు. తెలంగాణ లో లా అండ్ ఆర్డర్ ను పూర్తి స్థాయిలో కాపాడేందుకు తెలంగాణ పోలీసు శాఖ నిబద్దతతో ఉంది. ఎలాంటి తీవ్ర నేరస్తులను అయినా కఠినంగా అణచివేస్తామని డీజీపీ తెలిపారు. భర్త ప్రమోద్ ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం, పోలీసు శాఖ పూర్తి స్తాయిలో అండగా ఉంటామని పేర్కొన్నారు.  GO Rt No. 411 ప్రకారం ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీ తో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, GO 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు, అలాగే పోలీస్ భద్రత సంక్షేమం నుండి రూ.16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుండి రూ.8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటాం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పో యిన వారికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరుపున నా నివాళి అర్పిస్తు న్నానని తెలంగాణ డీజీపీ బీ.శివధర్ రెడ్డి వెల్లడించారు.

సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్స్‌ వ్యవస్థాపకుడు మోహనరావు కన్నుమూత

  చందన బ్రదర్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు  చందన మోహనరావు (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలో ఇవాళ ఉదయం మరణించారు. ఆయన మృతి పట్ల రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు సంతాపం తెలిపారు. వ్యాపార రంగంలో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ.. మోహనరావు అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో.. నాణ్యమైన వస్త్రాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయన వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. సీఎంఆర్ మాల్స్‌ వస్త్రాలు, జ్యువెలరీ వంటి పలు విభాగాల్లో విస్తృతంగా స్థాపించబడింది. సాధారణ వినియోగదారుల నుండి ప్రముఖుల వరకు అందరికీ ఇష్టమైన బ్రాండ్‌గా అవి నిలిచాయి.

కానిస్టేబుల్ హత్య చేసిన నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్

  నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ మృతి చెందినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.  రెండు రోజుల క్రితం నిజామాబాద్‌ పట్టణంలో కానిస్టేబుల్‌ ప్రమోద్‌పై దాడి చేసిన రియాజ్‌ అక్కడి నుంచి పారిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందించారు. అనంతరం రియాజ్‌ను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రౌడీ షీటర్‌ రియాజ్‌ ఆదివారం మధ్యాహ్నం సారంగపూర్‌ అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు. ఆ సమయంలో పోలీసులను చూసి పారిపోయే క్రమంలో రియాజ్‌ను పట్టుకునేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆ వ్యక్తిపై రియాజ్‌ దాడి చేయగా తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతరం పోలీసులు రియాజ్‌ను అదుపులోకి తీసుకొని నిందితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ రోజు ఉదయం రియాజ్‌ నాలుగు రకాల ఎక్స్‌రేలు తీసినట్లు అధికారులు తెలిపారు. అయితే చికిత్స సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ తుపాకీ లాక్కొని పారిపోవడానికి రియాజ్‌ ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతనిపై కాల్పులు జరపగా రియాజ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రియాజ్‌ జరిపిన కాల్పుల్లో ఏఆర్‌ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.  

దీపావళి వేడుకల్లో సీఎం చంద్రబాబు దంపతులు

  విశాఖపట్నానికి గూగుల్ ఏఐ డాటా సెంటర్ రావడాన్ని జీర్ణించుకోలేని కొందరు మూర్ఖులు రాజకీయ కక్షతో అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, అటువంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏర్పాటు వల్ల 12 దేశాలకు సేవలు అందుతాయన్నారు. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల, విదేశాల్లో పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి కూడా ఇదే కావడం గర్వకారణమన్నారు.  హైదరాబాద్‌ అభివృద్ధి వల్ల దేశంలో అత్యధిక తలసరి ఆదాయం అక్కడి నుంచే వస్తోందని, ఇప్పుడు ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీని ఏఐకి చిరునామాగా మారుస్తామని స్పష్టం చేశారు. ఏఐ వల్ల రాబోయే పదేళ్లలో ఊహించని అభివృద్ధి రాష్ట్రంలో జరగుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారుకావాలని... ప్రపంచంలోనే తెలివైన వారికి చిరునామాగా ఏపీ ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.  విజయవాడ పున్నమి ఘాట్‌లో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో సతీసమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అనాథ పిల్లలతో కలిసి క్రాకర్ షోను వీక్షించారు. అనంతరం సభను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాక్షసుణ్ని ప్రజలు ఓటుతో తరిమేశారు ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పట్టి పీడించిన రాక్షసుణ్ని ప్రజలు ఓటు ఆయుధంతో తరిమేశారని, ఎన్డీఏ కూటమిని 94 శాతం స్ట్రైక్ రేటుతో గెలిపించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందించింది. రాష్ట్రంలో మళ్లీ వైకుంఠపాళి వద్దు. డబుల్ ఇంజన్ సర్కారుతో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందుతోంది. 2019-24 మధ్య ప్రజలెవరూ సంతోషంగా పండుగలే జరుపుకోలేదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రజలంతా సుఖంగా ఉన్నారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవాలు దసరాతో ప్రారంభించి దీపావళి వరకూ నిర్వహిస్తున్నాం. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. జీఎస్టీ వల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.15 వేలు ఆదా అవుతోంది. దీపావళి పండుగ ఒక సందేశం ఇస్తుంది. నరకాసురుడు సమాజాన్ని అతలాకుతలం చేస్తే శ్రీ కృష్ణుడు ఆ రాక్షుసుణ్ణి వధించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు. అదే దీపావళిగా జరుపుకుంటున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.  ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాం ‘15 నెలల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం. తల్లికి వందనం, పింఛన్లు, స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2 , అన్న క్యాంటీన్లు, అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి హామీలన్నీ అమలు చేశాం. ఎన్ని ఇబ్బందులున్నా ఉద్యోగులకు దీపావళి సందర్భంగా ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించాం. పోలీస్ సోదరులకు ఒక సరెండర్ లీవ్ ఇస్తున్నాం.  ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నాం. 4వ తరగతి ఉద్యోగుల గౌరవం పెంచేలా రీ డిజిగ్నేట్ చేస్తాం. ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్య సహా ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తున్నాం. తెలుగుజాతి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 25 ఏళ్లు పూర్తిచేసుకున్నారు.  మోదీ సారధ్యంలో మనదేశం 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది. 2047 నాటికి దేశంలోనే ఏపీ నెంబర్ వన్‌గా నిలుస్తుంది. ’అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పున్నమి ఘాట్‌లో నిర్వహించిన క్రాకర్ షోను అనాథ పిల్లలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు వీక్షించారు. బీసెంట్ రోడ్డులో సీఎం దీపావళీ వేడుకలకు హజరయ్యే ముందు బీసెంట్ రోడ్డులో సీఎం చంద్రబాబు పర్యటించారు. పలువురు చిరు, వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా వస్తువుల ధరల తగ్గుదలను గురించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు.  చింతలపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తాను ప్రమిదలు, జ్యూట్ బ్యాగులు విక్రయిస్తానని తెలిపారు. ఆయనకున్న సమస్యలను గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. మరో వీధి వ్యాపారి యక్కలి బాలకృష్ణతో మాట్లాడారు. చదలవాడ వెంకటకృష్ణారావు అనే చెప్పుల షాపు యజమానితో మాట్లాడారు. వ్యాపారం నడుస్తున్న తీరు, చెప్పులపై జీఎస్టీ ఏ మేరకు తగ్గింది, విక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు. బట్టల షాపునకు వెళ్లి అందులో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోన్న గొడవర్తి లక్ష్మీ అనే మహిళతో ముఖ్యమంత్రి మాట్లాడారు.  అనంతరం కిరాణా షాపు వద్దకు వెళ్లి నిర్వాహకుడు బొడ్డు శ్రీనివాస్‌తో చంద్రబాబు ముచ్చటించారు. నిత్యవసర వస్తువులపై జీఎస్టీ తగ్గింపు ఎంత వరకు ఉందని, ధరల వ్యత్యాసం గతానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏ మేరకు ఉన్నాయనే అంశాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసెంట్ రోడ్‌కు వచ్చిన పలువురు కొనుగోలు దారులనూ సీఎం పలకరించారు. వారితో ఫోటోలు దిగి ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ ఆగ్రోస్‌ ఛైర్మన్‌ మాలేపాటి సుబ్బనాయుడు కన్నుమూత

  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ ఆగ్రోస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మాలేపాటి సుబ్బనాయుడు కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో 10 రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని చెప్పారు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటని తెలిపారు. కావలి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి సుబ్బనాయుడు ఎంతో కృషి చేశారన్నారు.  నిబద్ధత, అంకితభావం కలిగిన నాయకుడిని కోల్పోయామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సుబ్బనాయుడు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. సుబ్బనాయుడు మృతిపట్ల మంత్రులు నారా లోకేశ్‌, నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీకి తీరని లోటు అని పేర్కొన్నారు. దగదర్తిలో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  

తిరుమలలో భక్తుల రద్దీ... ఆర్జిత సేవలు రద్దు

  దీపావళి పండుగ వేళ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్మనానికి 18 గంటలు వరకు సమయం పడుతోంది. ఇదిలా ఉంటే ఆదివారం స్వామి వారిని 84,017 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 30,097 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.  తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.97కోట్లు అని టీటీడీ స్పష్టం చేసింది. మరోవైపు టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18గంటల సమయం పడుతుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.   

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

  తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల ప్రజా పాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజల జీవితాల్లో ప్రజా ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు.  చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు.  దీపాల కాంతులతో ప్రతి ఇంటింటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి హాని కలిగించకుండా చిన్నా పెద్దలందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ప్రమాదాలకు తావు లేకుండా  తగిన జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.  

రియాజ్ ఎన్‌కౌంటర్‌పై క్లారిటీ ఇచ్చిన నిజామాబాద్ సీపీ

  నిజామాబాద్‌లో రెండు రోజుల క్రితం  కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన నిందితుడని రియాజ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీపీ చైతన్య ఖండించారు. రియాజ్ మరో వ్యక్తిపై దాడి చేసి పారిపోతుండగా పట్టుకున్నామని  నిందితుడిపై ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు నిజామాబాద్‌ పోలీసు కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. అందులో..‘నిజామాబాద్‌ టౌన్‌ 6 పోలిస్‌స్టేషన్‌ పరిధిలోని సారంగపూర్‌ ప్రాంతంలో ఆసిఫ్‌ అనే వ్యక్తిపై రియాజ్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించాడు.  ఆ సమయంలో జరిగిన పెనుగులాటలో ఆసిఫ్‌,రియాజ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు రియాజ్‌ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం,అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు’ పేర్కొన్నారు. నిజామాబాద్‌లో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని డీజీపీ ఆదేశించారు. దీంతో బృందాలు ఏర్పడి గాలించిన పోలీసులు ఎట్టకేలకు ఇవాళ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఎమ్మెల్యేల వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలి : సీఎం రేవంత్‌

  రాష్ట్రాల శాసనసభలకు పోటీ చేసే వయో పరిమితిని 25 నుంచి 21 ఏళ్ల తగ్గించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని సంస్మరణ కమిటీ చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి  పాల్గొని ప్రసంగించారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కి ఈ సందర్భంగా సద్భావనా అవార్డును బహూకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశ పరిపాలనా యంత్రాంగంలో 21 ఏళ్లకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయసును 21 ఏళ్లకు ఎందుకు తగ్గించరాదని ప్రశ్నించారు. ప్రభుత్వాలను నిర్ణయించే అధికారం యువతకు ఉండాలన్న సంకల్పంతో రాజీవ్ గాంధీ  ఓటు హక్కు వయ పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తు చేశారు. అదే క్రమంలో ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడటానికి రాజీవ్ గాంధీ త్యాగాలను గుర్తు చేస్తూ, గడిచిన 35 ఏళ్లుగా క్రమం తప్పకుండా సద్భావనా యాత్ర సంస్మరణ కార్యక్రమాన్ని జరుపుతున్న నిర్వాహకులకు ముఖ్యమంత్రి  అభినందనలు తెలిపారు.  

బీఆర్‌ఎస్ పార్టీ ఓటమికి ఆచట్టమే కారణం : సీఎం రేవంత్‌

  బీఆర్‌ఎస్ ఓటమికి ధరణి చట్టమే కారణమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు లైసెన్స్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజా ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ చట్టాన్ని తొలిగించి భూభారతి తీసుకోచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. భూమి మీద ఆధిపత్యం కోసం గతంలో యుద్ధాలు జరిగాయని, సర్వేలో తప్పులు చేస్తే ప్రజలు తిరగబడే అవకాశం ఉందని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి సీఎం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్షాళన చేశామని స్పష్టం చేశారు. సంవత్సరంలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మేం ఉద్యోగాలు ఇస్తుంటే.. కోర్టులో కేసులు వేసి అపాలని చూస్తున్నారు. కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్నాం. త్వరలోనే గ్రూప్‌-3, గ్రూప్‌-4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తాం. లైసెన్స్‌ పొందిన సర్వేయర్లంతా బాధ్యతా యుతంగా వ్యవహరించి, రైతులకు సాయం చేయాలి’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 

ఆ ఇద్దరు విప్లవ ద్రోహులు...మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

  మావోయిస్టు ఉద్యమంలో వరుస లొంగుబాట్లపై ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఇటీవల తమ అనుచరులతో కలిసి లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్‌ సోను, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న అలియాస్‌ రూపేశ్‌లను పార్టీ “విప్లవ ద్రోహులు”గా పేర్కొన్నాది. కేంద్ర కమిటీతో ఎలాంటి చర్చ లేకుండా ప్రభుత్వానికి లొంగిపోయారని, ఈ చర్య పార్టీ విప్లవ సిద్ధాంతాలకు విరుద్ధమని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖలో పేర్కొన్నారు. వారు విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్చిన్నకారులుగా, శత్రువులకు సహకరించే వ్యక్తులుగా మారారని, అందువల్ల వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అంతేకాక, “వారికి తగిన శిక్ష విధించాలి” అని విప్లవ ప్రజలకు పిలుపునిచ్చారు. మల్లోజుల, ఆశన్న లు పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా ద్రోహం చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ చర్య విప్లవోద్యమానికి తీవ్ర నష్టం కలిగించిందని పార్టీ అభిప్రాయపడింది. మావోయిస్టు లేఖలో 2011 తర్వాత ఉద్యమం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను కూడా ప్రస్తావించారు. 2018 నాటికి ఉద్యమం తాత్కాలిక వెనుకంజకు చేరిందని, అప్పటి నుంచి మల్లోజుల రాజకీయ బలహీనతలు బయటపడుతున్నాయని తెలిపారు. 2020 డిసెంబర్‌లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో మల్లోజుల సమర్పించిన ఆత్మవిమర్శాత్మక పత్రాన్ని కమిటీ తిరస్కరించినట్లు గుర్తుచేశారు. తర్వాత పార్టీ ఆయనలోని తప్పుడు రాజకీయ ధోరణులను సరిదిద్దడానికి ప్రయత్నించినప్పటికీ, 2025 మేలో ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణం తర్వాత మల్లోజులలోని సైద్ధాంతిక బలహీనతలు మరింతగా పెరిగి, చివరికి ప్రభుత్వానికి లొంగిపోయే దశకు తీసుకెళ్లాయని లేఖలో అభయ్ వివరించారు. అలాగే, 2018లో ఒకసారి పార్టీ తాత్కాలిక వెనుకంజ వేసింది. అప్పటి నుంచి మల్లోజుల బలహీనతలు బయటపడ్డాయి. 2020 కేంద్ర కమిటీ సమావేశంలో మల్లోజుల తప్పుడు భావజాలాన్ని లేవనెత్తారు. ఆయుధాలను వదిలిపెట్టడంపై మల్లోజుల వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు.  ఇప్పుడు లొంగిపోతున్న వ్యవహారం.. పార్టీకి తాత్కాలిక నష్టం మాత్రమే అని పేర్కొన్నారు. విప్లవ ఉద్యమం తిరిగి  పుంజుకుంటుందని తెలిపారు. మావోయిజం తిరిగి పురోగమనం కోసం కృషి చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదామని లేఖలో పేర్కొన్నారు