దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫుట్ బాల్ అకాడమీ ఎక్కడో తెలుసా?

దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫుట్‌బాల్ అకాడమీని నగరంలో ఏర్పాటు కానుంది. దేశంలో మొదటిదే కాకుండా, భాగ్యనగరంలో ఏర్పాటు కానున్న మహిళా ఫుట్ బాల్ అడాకమీ ప్రపంచంలోనే రెంవడది కావడం విశేషం. ప్రస్తుతం హాంకాంగ్ లో మాత్రమే మహిళా ఫుట్ బాల్ అకాడమీ ఉంది. ఇక పోతే.. దేశంలో రెండవ పురుషుల ఫుట్ బాల్ అకాడమీ కూడా తెలంగాణలోనే ఏర్పాటు కానుంది.   ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' వేదికగా ఈ అకాడమీల ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  తెలంగాణ ప్రభుత్వం, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్), ఫిఫా సంయుక్తంగా ఈ ప్రకటన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.   ఇక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించనున్నారు.   సమ్మిట్‌కు హాజరయ్యే అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కార్పొరేట్ ప్రముఖులకు, అతిథులకు పోచంపల్లి శాలువా, చేర్యాల పెయింటింగ్స్, హైదరాబాద్ ముత్యాల ఆభరణాలు, అత్తరుతో పాటు మహువా లడ్డూలు, సకినాలు వంటి తెలంగాణ పిండివంటలతో కూడిన గిఫ్ట్ బాస్కెట్లను బహూకరించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది.   దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫుట్‌బాల్ అకాడమీని నగరంలో ఏర్పాటు కానుంది. దేశంలో మొదటిదే కాకుండా, భాగ్యనగరంలో ఏర్పాటు కానున్న మహిళా ఫుట్ బాల్ అడాకమీ ప్రపంచంలోనే రెంవడది కావడం విశేషం. ప్రస్తుతం హాంకాంగ్ లో మాత్రమే మహిళా ఫుట్ బాల్ అకాడమీ ఉంది. ఇక పోతే.. దేశంలో రెండవ పురుషుల ఫుట్ బాల్ అకాడమీ కూడా తెలంగాణలోనే ఏర్పాటు కానుంది.   ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' వేదికగా ఈ అకాడమీల ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  తెలంగాణ ప్రభుత్వం, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్), ఫిఫా సంయుక్తంగా ఈ ప్రకటన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.   ఇక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించనున్నారు.   సమ్మిట్‌కు హాజరయ్యే అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కార్పొరేట్ ప్రముఖులకు, అతిథులకు పోచంపల్లి శాలువా, చేర్యాల పెయింటింగ్స్, హైదరాబాద్ ముత్యాల ఆభరణాలు, అత్తరుతో పాటు మహువా లడ్డూలు, సకినాలు వంటి తెలంగాణ పిండివంటలతో కూడిన గిఫ్ట్ బాస్కెట్లను బహూకరించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది.  

వియ్ వాంట్ 99స్ వింటేజ్ బాబూ ఫ‌ర్ ఏపీ సేఫ్టీ!

  ఆ ప్ర‌భుత్వం  కేసులు పెడుతుంది- ఈ ప్ర‌భుత్వం కేసులు కొట్టేసుకుంటుంది.... ఇదీ ప్రెజంట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వినిపిస్తోన్న కామెంట్.. చంద్ర‌బాబు మీద మొన్న ఫైబ‌ర్ నెట్ కేసు ఉంటే దాన్ని కొట్టేశారు. అదంతా రాజ‌కీయ క‌క్ష  సాధింపులో భాగంగా.. పెట్టిన  కేసు. ఇందులో మ‌రేమీ లేద‌ని తేల్చేసింది సిఐడీ. దీనిపై కేబుల్ ఆప‌రేట‌ర్ల అసోసియేష‌న్ సైతం న్యాయం గెలిచిందంటూ  బాబుకూ, న్యాయ‌దేవ‌త‌కూ పాలాభిషేకాలు చేసింది.  తాజాగా చంద్ర‌బాబుపై మ‌రో కేసు కూడా  కొట్టివేయ‌బ‌డింది. అదెలాంటిదంటే, 2015-19 మ‌ధ్య కాలంలో.. రూ. 1300 కోట్ల రూపాయ‌ల మ‌ద్యం కేసు. అంటే గ‌తంలో జ‌గ‌న్ హ‌యాంలో పెట్టిన ఇలాంటి  కేసుల‌న్నీ తేలిపోనున్నాయ‌న్న‌మాట‌. ఈ లెక్క‌న చంద్ర‌బాబు క్లీన్ చిట్ తో పాత కేసుల  నుంచి దాదాపు బ‌య‌ట ప‌డిపోనున్నార‌న్న‌మాట‌. మ‌రి  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తిరిగి అధికారం చేప‌డితే ప‌రిస్థితేంటి??? అన్న ద‌గ్గ‌రే అంద‌రి ప్ర‌శ్న‌లు ఆగిపోతున్నాయి. అందుకే బాబు కూడా  ప‌దే ప‌దే మ‌ళ్లీ మీరు మ‌ళ్లీ వైకుంఠ పాళి ఆడొద్ద‌ని ఆంధ్ర ఓట‌రు జ‌నానికి నూరిపోస్తూ వ‌స్తున్నారు. కానీ గ్రౌండ్ లెవ‌ల్లో ప‌రిస్థితి కూట‌మి ప్ర‌భుత్వానికి చాలా  చాలా వ్య‌తిరేకంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. క‌నీసం టీటీడీ వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను సంపాదించ‌లేక పోతున్నామ‌ని  సోష‌ల్ మీడియా గోడ‌ల మీద ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న  త‌మ్ముళ్లూ, సైనికులు కోకొల్లుగా ఉన్నారు. వారి ఫ‌స్ట్రేష‌న్ ప్రెజంట్ అలా ఉంది మ‌రి. ఇటీవ‌ల ఒక ప్రైవేటు చానెల్.. ఆంధ్ర ఓట‌రు నాడి ఏమిటో ప‌సిక‌ట్టే య‌త్నం చేసింది. అయితే ఇందులో 2029లో జ‌గ‌న్ తిరిగి అధికారంలోకి రావ‌డానికే ఆస్కార‌మెక్కువ అన్న విష‌యం బ‌య‌ట ప‌డింది.  దీంతో వైసీపీ జ‌నానికి ఇది మ‌రింత కిక్ ఇచ్చింది. అయితే, ఇక్క‌డే మ‌నం మ‌ర‌చిపోరానిది వ‌దిలి  పెట్ట‌రానిదీ ఏంటంటే,, జ‌గ‌న్ గ‌త ప‌రిపాల‌న‌లో భాగంగా ఓట‌రు జ‌నం నెత్తిన సుమారు రెండున్న‌ర ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర కుమ్మ‌రించారు. ఇంత చేసి కూడా వైసీపీ గెల‌వ‌కుంటే ఇక జ‌గ‌న్ కూడా కొత్త రాజ‌కీయాల‌ను నేర్చుకోవ‌ల్సిందే అన్న కామెంట్లు వినిపించాయ్. కానీ, చంద్ర‌బాబు త‌న అనుభ‌వ‌మంతా రంగ‌రించారు. ఆపై ప‌వ‌న్ కూడా అగ్నికి వాయువు తోడైన‌ట్టు తోడ‌య్యారు. ఇందుకు క‌మ‌ల వ్యూహం సైతం ఫలించింది. దీంతో ప‌రిస్థితి పూర్తిగా  కంట్రోల్లోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో.. అంద‌రికీ తెలిసిందే.. 164 సీట్ల‌తో కూట‌మి ప్ర‌భంజ‌నంలాంటి  విజ‌యాన్ని సొంతం చేసుకుంది. . ఒక్క‌సారి ఫ్లాష్ బ్యాక్ రీల్ తిప్పితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ చంద్ర‌బాబు రెండో సారి తిరిగి గెలిచింది కేవ‌లం 1999లో మాత్ర‌మే. ఆ టైంలో ఆయ‌న అడ్మినిస్ట్రేష‌న్ వ‌ర‌ల్డ్ వైడ్ ఫేమస్ కావ‌డం.. ఐటీ ద్వారా ఉమ్మ‌డి ఆంధ్ర పెద్ద ఎత్తున ల‌బ్ధి పొంద‌డం.. స‌త్యం వంటి మ‌న తెలుగు వారి ఐటీ  కంపెనీల‌కు ప్ర‌పంచ వ్యాప్త గుర్తింపు రావ‌డంతో బాబు ఒక మోడ్ర‌న్ ఫేస్ క‌ట్ ఆఫ్ ఏపీగా అవ‌త‌రించారు.. ఇది గుర్తించిన వైయ‌స్.. నాడు త‌న ఆత్మ‌లాంటి కేవీపీతో బాబు పోక‌డ చూస్తుంటే మ‌నం అధికారంలోకి రావ‌డం ఇక క‌ల్ల అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్టు చెబుతారు. క‌ట్ చేస్తే వైయ‌స్ పాద‌యాత్ర‌తో బాబు హ్యాట్రిక్ ఆశ‌ల‌న్నీ కొట్టుకుపోయాయి. అలిపిరి బ్లాస్టింగ్ వంటి సెంటిమెంట్లు కూడా ఏమంత క‌లిసి  రాలేదు. అంత‌గా వైయ‌స్ హ‌వా వీచిందానాడు.   ఆ త‌ర్వాత కూడా ఆయా పార్టీల‌తో జ‌త క‌డితే త‌ప్ప  బాబు గెలిచే  ప‌రిస్థితి లేదు అన్న కామెంట్లు వినిపించాయ్ ఆ మాట‌ను నిజం చేస్తూ బాబు, ఆయ‌న పార్టీ  కూడా సేమ్ టు సేమ్ పెర్ఫామెన్స్ చేస్తూ వ‌చ్చింది. ఇప్పుడు బాబు చివ‌రి అస్త్రంగా చేయాల్సిందేంటంటే.. త‌న‌కు తాను స్వ‌యంగా ఈ పిచ్చి కేసుల గోల నుంచి బ‌య‌ట పడాల‌న్నా.. ఏపీని జ‌గ‌న్ అనే ఒక మాయావి నుంచి ర‌క్షించాల‌న్నా.. తిరిగి బాబులో 1999 నాటి వింటేజ్ బాబు విశ్వ‌రూపం చూపించ‌గ‌ల‌గాలి. అప్పుడుగానీ ఇటు ఏపీ వాసుల‌కు జ‌గ‌న్ పీడ వ‌ద‌ల‌దు, అటు చంద్ర‌బాబు కేసుల గోల కూడా ఉండ‌దు.. జ‌గ‌న్ ఇక అట్నించి అటే వెళ్లిపోతే త‌ప్ప ఏపీకి ఈ కేసులు, అప్పుల గొడ‌వ త‌ప్ప‌దు. అలాంటి ప‌థ‌కం ర‌చించ‌డానికి కూడా చాలా చాలా ద‌గ్గ‌రి మార్గాలున్నాయ్. వాటి ప‌రిశీల‌న అన్వేష‌ణ చేయాల్సి ఉంది.. బాబు కోర్ క‌మిటీ. అయితే బాబు కేంద్రానికి త‌న వ‌ద్ద‌నున్న ఎంపీ సీట్ల భ‌రోసా ఇచ్చి, జ‌గ‌న్ అనే ఈ భూతాన్ని శాశ్వ‌తంగా రాజ‌కీయ భూస్తాపితం చేస్తే త‌ప్ప‌.. ఇవ‌న్నీ నెర‌వేరేలా లేవు. మ‌రి చూడాలి.. 2029 నాటికి చంద్ర‌బాబు చాణ‌క్యం ఎలా ఉండ‌నుందో.. ఈ ఒక్క‌టీ నెర‌వేరిపోతే.. ఇటు ఏపీ ఊపిరి పీల్చుకుంటుంది.. అటు చంద్ర‌బాబు కూడా న‌వ్యాంధ్ర రాజకీయచ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని అంటారు ప‌లువురు విశ్లేష‌కులు.

సడన్‌గా ప‌వ‌న్‌పై కోమ‌టిరెడ్డి దాడి వెన‌క‌ మర్మం ఏంటో?

  ఏపీ ఉప  ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటు ఏపీలోని  వైసీపీ ఆపై తెలంగాణ‌లోని బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడ‌ర్ల  పాలిట  పంచ్ బ్యాగ్ అయ్యారా? అంటే అవున‌నే తెలుస్తోంది. అప్పుడెప్పుడో ప‌వ‌న్  రాజోలు ప‌ర్య‌ట‌న చేసిన‌పుడు.. అన్యాప‌దేశంగా ఒక మాట అనేశారు. అదేంటంటే ఏపీ,  తెలంగాణ విడిపోవ‌డానికి కార‌ణం కోన‌సీమ‌లోని ప‌చ్చ‌ద‌న‌మే అనేశారు. అందుకే ఇక్క‌డి కొబ్బ‌రి చెట్లు మోడువారిపోయాయ‌ని అనాలోచితంగా అనేశారాయ‌న‌.  త‌న చేతిలో మైకు ఉన్న‌ద‌న్న ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్టు లేరు. ఆపై అక్క‌డి  జ‌నాన్ని ఏదో ఊర‌డించ‌డానికి కూడా ఆయ‌నిలా అని  ఉంటారేమో తెలీదు. తాను ఉప  ముఖ్య‌మంత్రిన‌నీ..  ఇలాంటి మాట‌లు అనాలీ, అన‌కూడ‌ద‌న్న సోయ కూడా ప‌వ‌న్ కి ఆ టైంలో లేక పోయి ఉండొచ్చు. విచిత్ర‌మైన విష‌య‌మేంటంటే రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా ఎంతో పాపుల‌ర్ అయిన ప‌వ‌న్ అన్న విష‌యం ఒక్కోసారి  మ‌ర‌చి పోయే ప‌వన్ ఇంట్లో వాళ్ల ముందు మాట్లాడిన‌ట్టు ఆ ప్రాంత  ప్ర‌జ‌ల ముందు మాట్లాడేశారు. మ‌న కోన‌సీమ‌కు తెలంగాణ వాళ్ల న‌ర‌దిష్టి త‌గిలి ఉంటుంద‌ని.. అనేశారు. అందుకే ఆ చెట్లు అలా మోడు వారి పోయాయ‌ని తేల్చేశారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అయితే ఈ వియంలో ఫ‌స్ట్ రియాక్ట‌య్యింది మాత్రం బీఆర్ఎస్ మాజీ  మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. ఆపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. అటు పిమ్మ‌ట వైసీపీ మాజీ మంత్రి అంబ‌టి సైతం ఈ విష‌యంపై త‌న‌వైన సెటైరిక‌ల్ కామెంట్స్ చేశారు. ఇక ఎమ్మెల్సీ బ‌ల్మూరి, మంత్రి వాకిటి శ్రీహ‌రి త‌దిత‌ర మంత్రులు కూడా ప‌వ‌న్ని తిట్ట‌డంలో త‌లో నాలుక వేశారు. ఇక అంద‌రూ అయిపోయారు. ఇక్క‌డితో ఈ మొత్తం వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగిన‌ట్టేన‌ని భావించిన‌పుడు స‌డెన్ స‌ర్ ప్రైజ్ గా తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి రియాక్ట‌య్యారు. దొంగ‌లు ప‌డ్డ ఆర్నెల్ల త‌ర్వాత ఏంటీ మోత‌.. అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డింది. ఈ మ‌ధ్య కాలంలో కోమ‌టిరెడ్డికి మంత్రిమండ‌లిలో త‌గిన ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్టు కూడా క‌నిపించ‌డం లేదు. ఇందుకు రిల‌వెంట్ గా ఒక ఎగ్జాంపుల్ ని బ‌ట్టీ చూస్తే.. సీఎం రేవంత్ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి అయిన  కోమ‌టిరెడ్డికి ఎలాంటి  స‌మాచారం ఇవ్వ‌కుండానే జూబ్లీ ప్ర‌చారంలో.. సినిమా వారిపై వ‌రాల జ‌ల్లు కురిపించారు. .సంబంధిత మంత్రి అయిన కోమ‌టిరెడ్డి తో సంబంధం లేకుండా సినిమా వారంద‌రితో భేటీ  అయ్యారు కూడా. ఇంకా ఎన్నెన్నో వ‌రాల‌ను సినీ కార్మికుల‌పై కుమ్మ‌రించారు. దీంతో అంద‌రిలోనూ ఒక అనుమానం.. సంబంధిత మంత్రి. కోమటిరెడ్డి ఆఫ్ ప్రెజ‌న్స్ లో.. సీఎం ఈ త‌ర‌హా వ్య‌వ‌హార‌శైలి ఏంట‌న్న ప్రశ్న  త‌లెత్తింది. దీనంత‌టికీ  కార‌ణం కోమ‌టిరెడ్డి మంత్రి ప‌ద‌వి  ఊడిపోనుంద‌న్న మాట వినిపించింది. మ‌రి వీట‌న్నిటి న‌డుమ కోమ‌టిరెడ్డి త‌న ఉనికి కాపాడుకోవ‌డంలో భాగంగానే ప‌వ‌న్ పై ఈ కామెంట్లు చేశారా? అన్న అనుమానం వ‌స్తోంది. త‌న మంత్రిత్వానికి ప్ర‌మాదం ఉంద‌నో ఏమో ఇటీవ‌ల రేవంత్ రెడ్డి కోసం ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు కోమ‌టిరెడ్డి. వీట‌న్నిటిని బ‌ట్టీ చూస్తుంటే కోమ‌టిరెడ్డి ఏదో ట్ర‌బుల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు కొంద‌రు. అన్న వెంక‌ట‌రెడ్డి ప‌రిస్థితి ఇలా ఉందంటే త‌మ్ముడు రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారం  చూస్తే.. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని ఎప్ప‌టి నుంచో బుంగ‌మూతి పెట్టుకుని  కూర్చున్నారు. మ‌రి ఈ న‌ల్గొండ‌ బ్ర‌ద‌ర్స్ ఫ్యూచ‌రేంటి?  తెలియాల్సి ఉంది.

అవినీతి కేసులను మూసేయించుకునేందుకు చంద్రబాబు ప్లాన్ : బొత్స

  తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించడానికి సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి  కేసులు మూసివేయిస్తున్నారంటూ మండిపడ్డారు.  ఆ ఆరోపణలపై నిష్పక్షపాతంగా వ్యహరించాల్సిన దర్యాప్తు అధికారులు కూడా పూర్తిగా కేసుల మూసివేతకు సహకరిస్తున్నారని బొత్స పేర్కొన్నారు . తనపై ఉన్న కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక ముఖ్యమంత్రి అడ్డదారులు తొక్కుతున్నారు. తద్వారా వ్యవస్థలను కలుషితం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు.  దేశంలో ఇంత బరితెగింపునకు దిగిన రాజకీయనాయకుడ్ని ఎక్కడ చూడం. తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకోవడం చంద్రబాబుకి అలవాటేని ఆరోపించారు. అదే ఒరవడి ఈసారి కూడా కొనసాగుతోంది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై గవర్నర్‌ తక్షణం చర్యలు తీసుకోవాలని. అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి. దర్యాప్తు సంస్థల స్వతంత్రతను కాపాడాలని బొత్స డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో ఆందోళన కలిగిస్తున్న కుక్క కాటు కేసులు

  హైదరాబాద్‌లో కుక్కకాటు ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రేబిస్ వ్యాధి ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసు కోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రేబిస్ వ్యాధి ప్రాణాంతకరమైనదని, కుక్కకాటు జరిగిన వెంటనే గాయం శుభ్రం చేయడమే కాకుండా ప్రి–ఎక్స్‌పోజర్ మరియు పోస్ట్–ఎక్స్‌పోజర్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో కుక్కకాటు కేసులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరిండెంట్ డా. రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది ఇప్పటివరకు కుక్క కాటు కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు వెల్లడించారు. 2023లో 27,172 కుక్కకాటు కేసులు నమోదు కాగా, రేబిస్ కారణంగా 13 మంది మరణించారు. 2024లో కేసులు 29,054కు పెరిగి, రేబిస్‌తో 26 మరణాలు చోటుచేసుకున్నాయి. 2025లో (నవంబర్ వరకు) 31,488 కుక్కకాటు కేసులు నమోదు కాగా, రేబిస్ కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కుక్కకాటు కేసుల్లో ప్రతి ఏడాది పెరుగుదల ఉండడం ఆందోళన కలిగిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. రేబిస్ వ్యాధి ఒకసారి సోకితే ప్రాణాంతకమని, అందువల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ప్రజలు చేయగల ముఖ్యమైన చర్య అని ఆయన వివరించారు. కుక్కకాటు జరిగిన వెంటనే కనీస నిర్లక్ష్యమూ ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరంలో పెరుగుతున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. ఒంటరిగా కనిపించే చిన్నపిల్లలు, మహిళలపై వీధి కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఇలా నగరంలో వాళ్ళు కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్ కుక్క కాటు కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నయని.... అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు చేశారు...  

తెలంగాణ గవర్నర్ అధికార నివాసానికి కొత్త పేరు

    తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌ కు పేరు మారింది. తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసమైన “రాజ్ భవన్, తెలంగాణ” కు ఇకపై “లోక్ భవన్, తెలంగాణ” అనే కొత్త పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది. లోక్ భవన్ పేరును అమల్లోకి తేవడం ద్వారా, దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న సమయంలో ప్రజాస్వామ్య విలువల బలాన్ని, ప్రజల ప్రాధాన్యతను మరింత స్పష్టం చేయాలని  ప్రభుత్వం  భావించింది.  సమాజంలో ప్రజాస్వామ్య విలువల పటిమను, జీవాంతకత్వాన్ని ప్రతిబింబించేందుకు ఈ మార్పు చేపట్టినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.వికసిత భారత్ వైపు ధైర్యంగా అడుగులు వేస్తున్న ఈ సమయంలో ప్రజలే కేంద్రబిందువని గుర్తుచేయడం ఈ నామకరణం వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా తెలుపబడింది.కొత్త పేరు “లోక్ భవన్, తెలంగాణ” ఇకపై అన్ని అధికారిక పత్రాలు, సూచనలు, రికార్డులు మరియు ప్రభుత్వ కమ్యూనికేషన్లలోనే ఉపయోగించబడుతుంది.

గంజాయి డాన్‌ నీతుబాయి ఇంటిపై పోలీసుల దాడి

  నానక్ రాంగూడలో నివాసం ఉంటున్న నీతుబాయి గంజాయి వ్యాపారం చేయడంలో కింగ్... ఇప్పటికే ఈ లేడీ డాన్ ను పోలీసులు పట్టుకొని జైల్లో పెట్టారు. అయినా కూడా వీరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు.. మళ్లీ గంజాయి వ్యాపారాన్ని యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు... అంతే కాదండోయ్ ఈ లేడీ డాన్ కుటుంబ సభ్యులు గంజాయితో పాటు మద్యం కూడా విక్రయాలు చేస్తూ... డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే పోలీసులు గంజాయి విక్రయాలు చేసే ప్రాంతాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే నానక్‌ రాంగూడలో ఉన్న లేడీ డాన్ నీతూ బాయ్ ఇంట్లో గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం రావడంతో ఎస్టీఎఫ్‌ బీ-టీమ్‌ పోలీసులు వెళ్ళి ప్రత్యేక దాడులు నిర్వహించారు. టీమ్‌ లీడర్‌ ప్రదీప్‌రావు, సీఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు సిబ్బందితో కలిసి నీతు బాయి ఇంటిపై ఆకస్మిక సోదాలు చేశారు.  ఈ దాడుల్లో 786 గ్రాముల గంజాయి, 110 బీరు బాటిల్స్, బ్రీజర్‌, ఒక బైక్‌, అలాగే గంజాయి విక్రయాల ద్వారా వచ్చిన రూ. 60,890 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గోవింద్, దుర్గెష్, నీతుబాయి కుమారుడు దుర్గ ప్రసాద్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరు ఒరిస్సా నుండి గంజాయిని వివిధ పద్ధతుల్లో హైదరాబాదుకు తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని టీమ్‌ లీడర్‌ ప్రదీప్‌రావు తెలిపారు. పట్టుబడిన నిందితులు, స్వాధీనం చేసిన గంజాయి, మద్యం, నగదును షేర్లింగంపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌ అధికారులకు అప్పగించి నట్లు పోలీసులు వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోట : సీఎం రేవంత్‌

  ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పాల్వంచలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో ఆకలి కేకలు చూసి ఎడ్యుకేషన్ ఇరిగేషన్ పెట్టాలని అప్పటి ప్రధాని నెహ్రు వారి వల్లనే సాధ్యమైందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు శ్రీశైలం, ఎస్సారెస్పీ మొదలగు అన్ని నెహ్రు ప్రారంభించనవేని రేవంత్ స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కీలక శాఖల్లో ఉండటం వల్లనే ఇక్కడ అభివృద్ధి వేగంగా అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు.  సర్పంచ్‌లు మంచి వ్యక్తిని ఎన్నుకొండి అభివృద్ధి చేసే వాళ్లనే సర్పంచ్ లను చేయండని సీఎం పిలుపునిచ్చారు. భట్టి, తుమ్మల, పొంగులేటి ఏది అడిగినా ఇచ్చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి పడింది ఇక్కడే అని స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం మీరంతా ఓట్లేసి గెలిపిస్తేనే.. ప్రజలకు మంచి పాలన అందిస్తున్నాం. మంచి ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, ఫ్రీ కరెంట్‌, రేషన్‌ కార్డులు వస్తాయి. గ్రామాల్లో సర్పంచ్‌లు కూడా మంచోళ్లు ఉండాలి. మంత్రులతో కలిసి పనిచేసే మంచి సర్పంచి మీ ఊళ్లో లేకపోతే.. గ్రామాలు దెబ్బతింటాయిని సీఎం రేవంత్ తెలిపారు.   

ఇక పీఎంవో పేరు సేవాతీర్థ్‌‌గా మార్పు

  కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎంవో( ఆఫీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్) పేరును సేవాతీర్థ్‌గా మారుస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దశాబ్దాలుగా సౌత్‌బ్లాక్‌లోని పీఎంవో నుంచి ప్రధానులు విధులు నిర్వర్తిస్తుండగా.. ఆ కార్యాలయం నూతన భవనంలోకి మారనుంది. ఈ నేపథ్యంలోనే పేరు మార్పుపై ప్రకటన వచ్చింది. ఇప్పటికే గవర్నర్ల అధికారిక నివాసం రాజ్‌భవన్‌ను లోక్‌భవన్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. ఇక రాజ్ భవన్‌ల పేరు మార్పు ఉత్తర్వులు అందగానే వెంటనే పశ్చిమ బెంగాల్, త్రిపురా, కేరళ, తమిళనాడు, అస్సాం తదితర రాష్ట్రాలు డిసెంబర్ 1 నుంచి సైన్‌బోర్డులు, అధికారిక వెబ్‌సైట్లు, లెటర్‌హెడ్‌లు మార్చేశాయి. ఇదిలా ఉండగా.. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ మాత్రం కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. 

పవన్‌ క్షమాపణ చెప్పకపోతే సినిమాలు ఆడనివ్వం : కోమటిరెడ్డి

  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా..పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు తెలంగాణలో ఆడవు అని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు, తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోమని హెచ్చరించారు.  పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్తే తెలంగాణలో ఆయన సినిమాలు కనీసం ఒకటి రెండు రోజులైన ఆడుతాయి.. లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వమని మంత్రి తెలిపారు.  పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి. తెలంగాణ ప్రజల దిష్టి వల్ల కాదు, గత ఆంధ్ర పాలకుల వల్లే ఇక్కడి ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగారు.  ఈ విషయం తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. పవన్ సోదరుడు చిరంజీవి సూపర్ మ్యాన్‌గా అభివర్ణించిన ఆయన చాలా మంచి వ్యక్తి. కానీ, పవన్ కల్యాణ్‌కు రాజకీయ అనుభవం లేనట్లుంది. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు" అని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ ఆదాయాన్ని విశాఖ పట్నం, తిరుపతికే వాడుకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. అసలు పవన్ ఏమన్నారంటే? ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని అన్నారు. తెలంగాణ నేతల దిష్టి తగలడం వల్లే గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని ఆయన అన్నారు. ఈ కామెంట్స్‌పై తెలంగాణ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

జీడిమెట్లలో అర్ధరాత్రి యువతి హంగామా

  పీకలదాకా మద్యం సేవించిన ఓ మహిళ మాది ఆంధ్ర.. అంటూ తొడ కొడుతూ రోడ్డు మీద హంగామా సృష్టించిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న ఓ యువతి నిన్న అర్ధరాత్రి సమయంలో రహదారిపై వెళ్తున్న వాహనదారులు, పాదచారులను దుర్బాష లాడుతూ  హంగామా సృష్టించడంతో అక్కడ ఉద్రిక్తత  వాతావరణం నెలకొంది.  ఆకస్మికంగా జరిగిన ఈ పరిణామంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమీపంలో ఉన్న స్థానికులు పరిస్థితిని గమనించి వెంటనే జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆ యువతి ఇదంతా అడవి... డబ్బుంటే అన్ని ఉంటాయి. అందుకే కేసీఆర్ నేను ఉన్ననని చెప్పాడు.. కేసీఆర్, జగన్ ఇద్దరు మంచోళ్ళు... నాకు కేసీఆర్ కావాలి... ఒక నెలలో ఈ కాంగ్రెస్ పార్టీ పోయి కేసీఆర్ వస్తాడు.  కేసీఆర్ కోసం మగవాళ్ళు మాత్రమే  చేస్తారని అంటున్నారు కదా ఇప్పుడు నేను వచ్చారు.. నాది ఆంధ్ర అంటూ తొడగొడుతూ.. నేను విజయవాడ తాడేపల్లి కి చెందిన మహిళను.. మా జగన్ మామ హీరో.... ఆంధ్రాలో జగన్... తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు సూపర్... కెసిఆర్ కోసం వచ్చాను అంటూ పోలీసులతో ఏదేదో మాట్లా డుతూ నడిరోడ్డు మీద నానా రచ్చ రచ్చ చేసింది.  అంతసేపు పోలీసులు చాలా ఓపికగా ఆమెతో మాట్లా డడంతో ఆమె పరిస్థితి వారికి అర్థమైంది. ఆమె అస్వస్థత ను గమనించిన పోలీసులు, మెరుగైన వైద్యసాయం అందించేం దుకు 108 అంబులెన్స్‌కు సమాచా రమిచ్చారు.తరువాత ఆమెను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

అమరావతి కోసం.. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలోని  గ్రామాలలో ల్యాండ్ పూలింగ్  కోసం మంగళవారం (డిసెంబర్ 2) నోటిఫికేషన్‌  విడుదల చేసింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ లో మొత్తం 16,666 ఎకరాల సమీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అమరావతి, తుళ్లూరు మండలాలలోని గ్రామాలలో ఈ ల్యాండ్ పూలింగ్ జరగనుంది.   అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద్ద మద్దూరు, ఏండ్రాయి, కర్లపూడి, లెమల్లె గ్రామాల్లో 7,465 ఎకరాలు,  తుళ్లూరు మండలంలోని వడ్లమాను, హారిచంద్రపురం, పెద్ద పరిమి   గ్రామాలలో 9,097 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ కింద భూ సమీకరణ చేయనున్నారు.  రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌ చేపట్టాలన్న ప్రతిపాదనకు గత వారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.  

మొంథా తుఫాను నష్టం రూ.6352 కోట్లు...అమిత్‌షాకు నివేదిక

  మొంథా తుఫాను కారణంగా ఏపీలో రూ.6352 కోట్ల నష్టం జరిగిందని మంత్రులు లోకేష్, అనిత కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు నివేదిక అందజేశారు.  న్యూఢిల్లీలో టీడీపీ ఎంపీలతో కలిసి అమిత్‌షాతో సమావేశం అయ్యారు. మొంథా తుపాను వల్ల మొత్తం 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయని  లోకేష్ తెలిపారు. 1.92 లక్షల మందిని పునరాస శిబిరాలకు తరలించామన్నారు.  ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద 3 వేలు ఇచ్చామని తెలిపారు.కూటమి ప్రభుత్వం స్పందించి కూలిన చెట్ల తొలగింపు, తాత్కాలిక నివాస సౌకర్యాలు, నీటి సరఫరా పునరుద్ధరణ వంటి పలు చర్యలను చేపట్టింది. తక్షణ సహాయం కింద రూ.60 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది.  వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.271 కోట్లు, గృహ నష్టం రూ.7 కోట్లు, రహదారులు, మౌలిక సదుపాయాలకు రూ.4,324 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.41 కోట్లు, నీటి వనరులు, నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు రూ.1,302 కోట్లు, సామూహిక ఆస్తులకు రూ.48కోట్ల మేర నష్టం వాటిల్లింది. మొత్తం రూ.6,356 కోట్ల నష్టంలో NDRF మార్గదర్శకాల ప్రకారం రూ.902 కోట్లు తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం అర్హమైనవి మంత్రి లోకేష్ పేర్కొన్నారు.  

లింగ భైరవీ ఆలయం ఎక్కడుంది.. ఆ దేవత ప్రత్యేకత ఏంటి?

ప్రముఖ నటి సమంత లింగభైరవీ దేవి ఆలయంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అసలీ లింగ భైరవీ దేవి ఎవరు? ఆమె ఆలయం ఎక్కడుంది? ఆ ఆలయ ప్రాసిస్థ్యం ఏమిటి? అని నెటిజనులు నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. అంతే కాదు అందరిలో కూడా లింగభైరవీ దేవత ఎవరు? ఆమె ఆయలం ఎక్కడుందన్న ఆసక్తి వ్యక్తం అవుతోంది.   ఆ వివరాల్లోకి వెడితే..  పురుషుల్లో పరమేశ్వర రూపమైన కాలభైరవుడు ఉన్నట్టే.. స్త్రీ రూపంలో భైరవీ దేవి కూడా ఉంది.  లింగ భైరవీ దేవి శక్తిమంతమైన రూపమే కాకుండా లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ మాతల సమ్మేళన స్వరూపంగా చెబుతారు పండితులు. తామస, రజో, సత్వ గుణాలను సైతం సూచిస్తుందని అంటారు.  దశ మహా విద్యలలో ఒకటిగా, కుండలినీ శక్తిగా.. పరమేశ్వర ప్రతిరూపమైన కాలభైరవుడి  సతీమణిగా.. లింగ భైరవీ దేవిని కొలుస్తారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్ నిర్మించిన లింగ భైరవీ దేవి ఆలయంలో ఉంది. ఆ ఆలయంలోనే సమంత పెళ్లి చేసుకున్నారు. ఈ ఆలయంలో కేవలం మహిళా పూజారులు మాత్రమే ఉంటారు.   లింగ భైరవీ దేవి ఆలయంలో సమంత భూత శుద్ధి వివాహ వేడుక చేసుకున్నారు.   ప్రాచీన యోగ శాస్త్రం నుంచి ఉద్భవించిన ఈ వేడుక భౌతిక స్థితిగతులకు అతీతంగా జరుగుతుందని అంటారు పండితులు. ఇది ఆ దంపతుల మధ్య పంచభూత శక్తులను శుద్ధి చేసి వారి మధ్య బంధాన్ని మరింత బలోపేతమవుతుందని విశ్వసిస్తారు. ఇంతకీ ఏమిటీ భూత శుద్ధి వివాహమని చూస్తే.. పంచ భూతాలను శుద్ధి పరుచుకోడానికి.. అగ్ని చుట్టూ తిరిగి ప్రదిక్షణ చేస్తారు నూతన దంపతులు. ఈ వేడుక సారాంశం.. లింగ భైరవీ దేవి శక్తిలో లీనం కావడంగా చెబుతారు ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్. దేవిని స్వయంగా ప్రతిష్టించిన సద్గురు మాటల్లో.. తీక్షణత, కరుణల కలబోత లింగ భైరవీ దేవి. ఈ స్త్రీ స్వరూపం 8 అడుగుల ఎత్తులో మూడున్నర చక్రాల శక్తితో దర్శనమిస్తారు. దేవి తన భక్తులకు సంపూర్ణ అనుగ్రహాన్ని శ్రేయస్సు ప్రసాదిస్తుంది. లింగభైరవీ మాత ఆధ్యాత్మిక ప్రగతికి సాయ పడుతుంది. ఈశా ఫౌండేషన్లో గల లింగభైరవీ దేవి ఆలయం ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకూ తిరిగి సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 8.30గంటల వరకూ తెరిచి ఉంటుంది. పౌర్ణమి, నవరాత్రుల సమయాల్లో ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.  ఈ పురాతన ప్రక్రియలో కేవలం కొత్త జంటలు మాత్రమే కాదు.. ఇప్పటికే పెళ్లయిన జంటలు కూడా  పాల్గొనవచ్చని అంటున్నారు.  ఈ పవిత్రమైన అనుభూతిని పొందాలనుకునే జంటలు vivaha@isha.org కు మెయిల్ పంపడం ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అయితే వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని అంటున్నారు ఇక్కడి వారు. ఇక లింగభైరవీ దేవి ఆలయంలో వివాహ మాడదలు చుకున్న వారు అదనపు రుసుము చెల్లిస్తే ఫోటోగ్రఫీతో పాటు, వీడియోగ్రఫీతో కలిపి లైవ్ సైతం అందిస్తామని చెబుతున్నారు.

విశాఖ పర్యాటకానికి కొత్త శోభ.. దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి!

విశాఖపట్నం కైలాసగిరిలో దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ సోమవారం (డిసెంబర్ 1) ప్రారంభమైంది. ఏడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ భరత్, మేయర్   పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు , వీఎంఆర్డీఏ ఛైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, తుఫాన్‌లు, గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా 40 ఎంఎం మందం గల జర్మన్ గ్లాస్‌తో నిర్మించిన  ఈ గాజు వంతెన దాదాపు 500 టన్నుల బరువును ఈజీగా మోయగలదు. ఈ గ్లాస్ బ్రిడ్జ్‌ పైనుంచి గాల్లో తేలియాడుతున్న అనుభూతితో ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. అదలా ఉంచితే.. దేశంలో ఇప్పటి వరకూ కేరళలో నిర్మించిన 40 మీటర్ల పొడవైన గ్లాస్ బ్రిడ్జే దేశంలో అత్యంత పొడవైన గాజు వంతెనగా రికార్డుల్లో ఉంది. ఇప్పుడు విశాఖలో నిర్మించి, ప్రారంభించిన ఈ గాజు వంతెన ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఈ బ్రిడ్జి పొడవు 50 మీటర్లు.  వీఎంఆర్‌డీఏ, ఆర్‌జే అడ్వెంచర్స్‌ సంస్థ సంయుక్తంగా  నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జి విశాఖ పర్యాటకానికి కొత్త శోభను తీసుకువస్తుందనడంలో సందేహం లేదు.  

ఐపీఎస్ పాలిటిక్స్.. సునీల్ ఆంతర్యమేంటి?

ఐపీఎస్ అధికారిగా ఉంటూ రాజకీయ కార్యకలాపాలకు సంబంధించిన కామెంట్లు చేయడం ఎంత వరకూ సమంజసం? అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.  ఈ విషయంలో.. మాజీ సీఐడీ బాస్ పీవీసునీల్ కుమార్ ఒక ప్రశ్నగా నిలుస్తున్నారు. విధినిర్వహణలో అవకతవకలు, అక్రమాల ఆరోపణలతో ఐపీఎస్ సునీల్  ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు.  ఏ అధికారైనా సరే సస్పెన్షన్ లో ఉన్న సమయంలో  తనపై ఉన్న అభియోగాలు, ఫిర్యాదులను కానీ క్లియర్ చేసుకుని సత్ప్రవర్తనను రుజువు చేసుకోవాలి. కానీ ఐపీఎస్ సునీల్ రూటే సెపరేటు. ఆయన సస్పెన్షన్ సమయంలో కూడా తన సంచలన వ్యాఖ్యలతో వివాదానికి తెరలేపారు. ఇంతకీ సునీల్ ఏం చేశారంటే.. కులాల కార్చిచ్చు రగిల్చేలా వ్యాఖ్యలు చేశారు.   కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కావాలి,   ఉప ముఖ్యమంత్రిగా దళితుడు ఉండాలి అంటూ ఐపీఎస్ సునీల్ చేసిన వ్యాఖ్యలను బట్టే ఆయన మైండ్ సెట్ ఏమిటన్నది అవగతమౌతుంది.  కాపులే సీఎంలు కావడమేంటి? దళితుడు ఎందుకు కారాదు? అని ఆయన సామాజిక వర్గం నేతలే ఇప్పుడు సునీల్ ను నిలదీస్తున్నారు.  ఇప్పటికే తమ సామాజిక వర్గానికి చెందిన హర్షకుమార్, జడశ్రవణ్, విజయ్ కుమార్ వంటి వారు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. వారిలో ఒకర్ని ఐదేళ్ల పాటు డిప్యూటీ సీఎంగా ఉండే విధంగా చూడాలన్నారు. రెండేళ్లలో దిగిపోయే ఉప ముఖ్యమంత్రితో మనకు అనవసరమని అన్నారు. అయినా ఒక ఎంపీపై కస్టోడియల్ టార్చర్ చేసిన ఐపీఎస్ సునీల్ కుమార్ ఇలాంటి కామెంట్లు కాక మరెలాంటి వ్యాఖ్యలు చేస్తారు?  అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజనులు విమర్శలు గుప్పి స్తున్నారు. దళితవాడలను పంచాయితీలను చేయాలన్న తన డిమాండ్ కోసం ఎమ్మెల్యే టికెట్టే నిరాకరించానంటూ సునీల్ ఫక్తు రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు.  జగనన్న చెప్పింది చేసినందుకు నందిగం సురేష్ లా సునీల్ ఏదైనా ఆశిస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా సివిల్ సర్వీసుల్లో ఉండి ఇలాంటి పొలిటికల్ కామెంట్లు చేయడం కరెక్టు కాదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇంటి అప్పు తీర్చిన అభయప్రదాత.. బాబు

చంద్ర‌బాబు ఫించ‌న్ పంపీణీ   కార్య‌క్ర‌మంతో స్వయంగా పాలుపంచుకుని లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి అందజేస్తున్న చంద్రబాబు.. ఆ సందర్భంగా వారి కష్టాలను వింటున్నారు. వాటిని తీర్చడానికి తన వంతు సహాయం చేయడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు.   ఆయ‌న ఏ ఇంటికి ఆ ఒక‌టో తారీఖున వెళ్తారో ఆ ఇంటి వారికి ఉన్న సమస్యలన్నీ పరిష్కారమైపోయినట్లే అనడంలో సందేహం లేదు.  కొండకొచో వారి జీవిత కాల సమస్యలకు కూడా చిటికెలో పరిష్కరించేస్తున్నారు.  గతంలో అంటే వైసీపీ హయాంలో వాలంటీర్లు తెల్లవారకుండానే తలుపుతట్టి మరీ పింఛన్లు అందజేసేవారిని జగన్ సర్కార్ గప్పాలు కొట్టుకునేది.  అది ఏ మేరకు వాస్తవమో తెలియదు కానీ, పింఛన్లలోనూ ముడుపులు దండుకునే వారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సరే అది పక్కన పెడితే అప్పటి ముఖ్యమంత్రి జగన్ జనానికి ముఖం చూపిన సందర్భాలు చాలా చాలా తక్కువ. ఏ బటన్ నొక్కుడు కార్యక్రమానికో రోడ్డు కిరువైపులా పరదాలు కట్టి సభా స్థలికి వచ్చే ఆయన ప్రసంగాలు చేసే వారే కానీ ప్రజల వినతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే చంద్రబాబు మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఆయన నిత్యం ప్రజలతో మమేకమౌతున్నారు. వారి సమస్యలు వింటున్నారు. పరిష్కరిస్తున్నారు. స్వయంగా ఆయన ఒక లబ్ధిదారు ఇంటికి వెళ్లి మరీ పింఛను అందిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం (డిసెంబర్ 1) ఏలూరు జిల్లా గోపీనాథపట్నంలో నాగలక్ష్మి అనే లబ్ధిదారు ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆమెకు పింఛను అందజేశారు. వారి యోగక్షేమాలు విచారించారు. సమస్యలను అడిగి మరీ తెలుసుకున్నారు.  ఆ ఇంట్లో చ‌దువుకుంటున్న యువ‌కుడు, చ‌దువు మ‌ధ్య‌లోనే ఆపేసిన యువ‌తికి సంబందించిన వివ‌రాలను తెలుసుకుని,  ఆ యువ‌కుడికి టీసీఎస్ లో జాబ్ కోసం సిఫారసు చేస్తానన్నారు. అలాగే  చ‌దువు ఆపేసిన  యువ‌తిని హైబ్రిడ్ ప‌ద్ధ‌తిలో తిరిగి ఎలా చ‌దువుకోవాలో సూచించారు. ఇక ల‌బ్దిదారు నాగ‌ల‌క్ష్మికి సంజీవ‌నీ ప‌థ‌కం ద్వారా ఎలాంటి ఆహారం అందించాలో సూచించారు. అక్కడితో ఆగలేదు.. నాగలక్ష్మి ఇంటి నిర్మాణం కోసం ఎంత ఖర్చు అవుతుందో ఆరా తీసి.. వారికి ఉన్న అప్పు ఎంతో తెలుసుకుని ఆ మొత్తాన్ని తీర్చే ఏర్పాట్లు చేయాల్సిందిగా అక్కడికక్కడే కలెక్టర్ ను ఆదేశించారు. దీంతో నాగలక్ష్మి కుటుంబం అప్పు మొత్తం తీరిపోయింది. సమస్యలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో, ప్రజా నాయకుడు ఎలా ఉండాలో చంద్రబాబు ఆచరణలో చూపుతున్నారంటూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

పొగాకు, పాన్ మసాలా ఉత్పత్తులకు కేంద్రం షాక్

  దేశంలో పెద్దగా నియంత్రణ లేని గుట్కా, పాన్ మసాలా పరిశ్రమను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక చట్టాన్ని తీసుకురాబోతోంది. ‘హెల్త్ సెక్యూరిటీ టు నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్, 2025’ పేరుతో రూపొందించిన ఈ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ కొత్త చట్టం ప్రకారం, గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులపై పన్ను విధించే విధానం పూర్తిగా మారనుంది. ఇప్పటివరకు తుది ఉత్పత్తి ఆధారంగా పన్ను విధిస్తుండగా, ఇకపై వాటి తయారీకి ఉపయోగించే యంత్రాల ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా ప్రత్యేక సెస్సు విధించనున్నారు. చేతితో తయారుచేసే యూనిట్లకు కూడా ప్రతినెలా తప్పనిసరిగా నిర్దిష్ట మొత్తంలో సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలు కఠినతరం ఈ కొత్త విధానంలో, ఉత్పత్తి ఎంత జరిగిందనే దానితో సంబంధం లేకుండా ప్రతి నెలా తయారీదారులు సెస్సు చెల్లించాలి. ఒకవేళ యంత్రాలు లేదా యూనిట్ 15 రోజులకు మించి పనిచేయకపోతే మాత్రమే మినహాయింపు లభిస్తుంది. ప్రతి తయారీదారు తప్పనిసరిగా ప్రభుత్వంతో రిజిస్టర్ చేసుకోవాలి, నెలవారీ రిటర్న్స్ దాఖలు చేయాలి. అధికారులు ఎప్పుడైనా తనిఖీలు, విచారణ, ఆడిట్ చేసేందుకు వీలు కల్పించాలి. ఈ నిబంధనల ఉల్లంఘనకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించేలా బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి. అవసరమైతే సెస్సును రెట్టింపు చేసే అధికారాన్ని కూడా ప్రభుత్వం తన వద్దే ఉంచుకోనుంది. ధరలపై ప్రభావం ఉండదు మరోవైపు, సిగరెట్లపై ఉన్న జీఎస్టీ పరిహార సెస్సును కూడా కేంద్ర ఎక్సైజ్ చట్టం పరిధిలోకి మారుస్తూ మరో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అయితే, ఈ మార్పుల వల్ల గుట్కా, పాన్ మసాలా లేదా సిగరెట్ల ధరలపై వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పన్ను రేట్లలో ఎటువంటి మార్పు ఉండదని, కేవలం పన్నుల వసూలు విధానాన్ని క్రమబద్ధీకరించి, పారదర్శకత పెంచడమే లక్ష్యమని వివరించారు

ఏపీలో కొత్త పురుగు వ్యాధి కలకలం...మహిళ మృతి

  విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న రాజేశ్వరి(36) అనే మహిళ, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, స్క్రబ్ టైఫస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందిన రాజేశ్వరి..ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి రాష్ట్రంలో అన్ని జిల్లాలో వ్యాపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిత్తూరులో 379, కాకినాడలో 141, విశాఖపట్నంలో 123, వైఎస్సార్ కడపలో 94, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులో 86, అనంతపురంలో 68, తిరుపతిలో 64, విజయనగరంలో 59, కర్నూలులో 42, అనకాపల్లిలో 41, శ్రీకాకుళంలో 34, అన్నమయ్యలో 32, గుంటూరులో 31, నంద్యాలలో 30 కేసులు నమోదైనట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. వ్యాధి నిర్ధారణ జరిగితే సాధారణ యాంటిబయాటిక్స్ తో ఈ వ్యాధి నయం అవుతుందని, అస్వస్థతకు గురవ్వగానే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.