అమరావతి కోసం.. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలోని  గ్రామాలలో ల్యాండ్ పూలింగ్  కోసం మంగళవారం (డిసెంబర్ 2) నోటిఫికేషన్‌  విడుదల చేసింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ లో మొత్తం 16,666 ఎకరాల సమీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అమరావతి, తుళ్లూరు మండలాలలోని గ్రామాలలో ఈ ల్యాండ్ పూలింగ్ జరగనుంది.  

అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద్ద మద్దూరు, ఏండ్రాయి, కర్లపూడి, లెమల్లె గ్రామాల్లో 7,465 ఎకరాలు,  తుళ్లూరు మండలంలోని వడ్లమాను, హారిచంద్రపురం, పెద్ద పరిమి   గ్రామాలలో 9,097 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ కింద భూ సమీకరణ చేయనున్నారు.  రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌ చేపట్టాలన్న ప్రతిపాదనకు గత వారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.  

గంజాయి మత్తులో కార్లకు నిప్పంటించిన యువకులు

  హైదరాబాద్‌ నగరంలో కొంతమంది యువకులు నడిరోడ్డు మీద హంగామా సృష్టించారు. యూసుఫ్‌ గూడా రహమత్ నగర్ కార్మికనగర్‌లోని ఎస్వీఎస్‌ గ్రౌండ్‌లో గురువారం మధ్యాహ్నం సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ నిలిపి ఉంచిన పలువురు వ్యక్తులకు చెందిన కార్లు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకోవడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా అలజడి చెలరేగింది. క్షణాల్లో మంటలు ఎగసిపడుతూ వరుసగా వాహనాలను చుట్టుముట్టాయి.  ఈ మంటలో మూడు కార్లు, ఒక ఆటో పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది రెండు ఫైరిండ్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సుమారు కొన్ని గంటల ప్రయత్నాల తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చినా అప్పటికే పలువురు కార్లు ఆటో మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ప్రాథమిక విచారణలో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  గంజాయి మరియు మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువకులు నా నడిరోడ్డు మీద నాన్న హల్ చల్ సృష్టిస్తూ...అక్కడ నిలిచిన కార్లకు ఉద్దేశపూర్వకంగానే నిప్పంటించినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించిన అనంతరం నిందితులను గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన గ్రౌండ్‌లో సెక్యూరిటీ లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి కారకులైన యువకులను పట్టుకునేందుకు పోలీసులు వేట కొనసాగించారు.

ప‌ట్టులోనూ అవినీతి ప‌ట్టా వెంక‌న్నా...నీ చుట్టూ ఏం జ‌రుగుతోంది స్వామీ

  క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీవెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి చుట్టూ మ‌రీ ఇన్ని అవినీతి బాగోతాలా?  మొన్న ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారం, నిన్న ప‌ర‌కామ‌ణి ఇష్యూ.. తాజాగా ప‌ట్టు వ‌స్త్రాల అవినీతి బండారం.  పాపం ఆ వెంక‌న్న ఇంత పెద్ద నామాల‌తో క‌ళ్లు మూసుకుని ఉంటారు కాబ‌ట్టి  వీరిష్టానికి వీరు య‌ధేచ్చ‌గా దోపిడీ చేసేస్తున్నారు. ఆయ‌న నిజ నేత్ర ద‌ర్శ‌న  స‌మ‌యంలో ఈ అవినీతి బండారం ఎవ‌రో ఒక‌రి రూపంలో బ‌య‌ట ప‌డేస్తున్నారు. ఇంత‌కీ తాజా వ్య‌వ‌హారంలో ఎవ‌రూ,  ఏంట‌ని చూస్తే.. ప‌దేళ్ల కాలంలో అంటే, 2015- 25 మ‌ధ్య‌కాలంలో కేవ‌లం ప‌ట్టు కండువాల కుంభ‌కోణంలో 54 కోట్ల పై చిలుకు కొల్లగొట్టేశారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు. శ్రీవారు రాత్రింబ‌వ‌ళ్లు కాళ్లు నొప్పులు పుట్టేట‌ట్టు నిలుచుంటారు. ఇక‌ జ‌నం బాధ‌లు విని విని, చెవులు చిల్లులు ప‌డేలాంటి  ప‌రిస్థితి. వారి క‌ష్ట‌న‌ష్టాల‌న్నీ విని వారి ఆర్త‌నాదాల‌న్నీ తీర్చినందుకుగానూ కానుక‌ల రూపంలో రోజూ కోటి రూపాయ‌ల‌కు పైగా సంపాదిస్తుంటారు.  ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక దేవుడిగా అల‌రారుతుంటారు. అలాంటి దేవుడి సొమ్ము ఎలాగైనా స‌రే కాజేయాల‌న్న ఆలోచ‌న కొద్దీ.. కొంద‌రు అవినీతి ప‌రులు ప్రతి చిన్న విష‌యానికీ.. పెద్ద పెద్ద టెండ‌ర్లు వేసి శ్రీవారి  సొమ్ము  ఇదిగో ఇలా స్వాహా చేస్తున్నారు. తాజాగా శ్రీవారి సొమ్ము ఎలా కాజేశారో చూస్తే.. స్వామి వారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ప్ర‌ముఖుల‌కు ఒక శేష వ‌స్త్రం క‌ప్ప‌డం ఆచారం.  అయితే స్వామివారి స్థాయికి త‌గ్గట్టు, ఈ వ‌స్త్రం ప‌ట్టుగా ఉండాల‌ని భావించి న‌గ‌రిలోని  ఒక సంస్థ‌కు ఈ కాంట్రాక్టు అప్ప‌గించ‌గా.. ఈ సంస్థ గ‌త కొంత‌కాలంగా మూడు వంద‌లు కూడా  చేయ‌ని ప‌ట్టు వ‌స్త్రానికి  ప‌ద‌మూడు వంద‌ల‌కు పైగా  వ‌సూలు చేస్తోంది. స‌రే ఇదేమైనా ప్యూర్ మ‌ల్బ‌రీ ప‌ట్టా? అని చూస్తే.. అది  కూడా కాద‌ని తేలింది. టీటీడీ విజిలెన్స్ విభాగం ల్యాబ్ లో టెస్ట్ చేయించ‌గా.. పాలిస్ట‌ర్- పాలిస్ట‌ర్ గా రిపోర్టులొచ్చాయి. ఈ ఏడాది కూడా  ఈ వ‌స్త్రం 15 వేల ఆర్డ‌ర్లు ఇచ్చింది  టీటీడీ. ఇదెలా బ‌య‌ట ప‌డిందో చూస్తే టీటీడీ  చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఇలాంటిదే ఒక ప‌ట్టు వ‌స్త్రం కొన‌గా దాని ధ‌ర 400 వంద‌ల రూపాయ‌లు కూడా లేదు.  ఈ విష‌యం గుర్తించిన నాయుడు టీటీడీ  కొంటోన్న ప‌ట్టు పై  కండువా ఎంతుందో ప‌రిశీలిస్తే 1300 కి పైగా ఉన్న‌ట్టు తెలిసింది. దీంతో ఆశ్చ‌ర్య‌పోయిన ఆయ‌న ఈ ప‌ట్టుబండారం మొత్తం బ‌య‌ట‌కు కూలీ లాగ‌గా ఇక్క‌డ‌ కూడా యాభై కోట్లకు పైగా దోపిడీ జ‌రిగిన‌ట్టు తెలిసింది. ఇలా శ్రీవారి విష‌యంలో ప్ర‌తి చిన్న విష‌యంలోనూ ఏదో ఒక అవినీతి మ‌యంగా మార‌డం చూస్తుంటే.. ఇందుకంటూ ఒక అంతు లేద‌ని  తెలుస్తోంది. భ‌క్తులు తామేసిన డ‌బ్బు ఎలాంటి  అవినీతిప‌రుల పాల‌వుతుందో అన్న ఆందోళ‌న చెందుతున్నారు. అలాగ‌ని ఇదేం ఎక్క‌డో ఉండే బోలే బాబా వంటి న‌కిలీ నెయ్యి స‌ర‌ఫ‌రా చేసే సంస్థ కాదు.. ద‌గ్గ‌ర్లోనే  ఉండే న‌గ‌రిలోని వీఆర్ఎస్ అనే సంస్థ‌. ఈ ప్రాంతంలో స్వామి వారి ప‌ట్ల ఎన్నో భ‌య‌భ‌క్తులుంటాయి. అలాంటి వీరికి కూడా వెంక‌న్న అంటే భ‌యం భ‌క్తీ లేక పోవ‌డ‌మూ ఒక చ‌ర్చ‌నీయంశంగా త‌యారైంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు బిగ్ షాక్

  తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు చుక్కెదురైంది. రేపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అధికారి ఏసీపీ వెంకటగిరి ఎదుట ఉదయం 11 గంటల లోపు లొంగిపోవాలని పేర్కొంది. విచారణ సమయంలో ఆయనను ఎటువంటి టార్చర్ చేయవద్దంటూ సిట్ అధికారులకు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. 14 రోజులు ఆయన్ను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం పిటిషన్ వేయగా, ఇంటరాగేషన్ అంశంపై శుక్రవారం విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో  ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌పై మంగళవారం అత్యున్నత న్యాయస్థాన విచారణ జరిపింది. ఈ కేసును గురువారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై గతనెల.. నవంబర్ 18వ తేదీనే వాదనలు జరగాల్సి ఉంది. కానీ ప్రభాకర్ రావు తరఫు న్యాయవాది అందుబాటులో లేరు. దాంతో ఈ పిటిషన్‌పై విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరగా ఈ రోజు.. అంటే గురువారం ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది  

కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు

పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో  పిన్నెల్లి సోదరులు గురువారం (డిసెంబర్ 11) మాచర్ల కోర్టులో లొంగిపోయారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లకు లొంగిపోవడానికి సర్వోన్నత న్యాయస్థానం   ఇచ్చిన గడువు ముగుస్తున్న తరుణంలో మాచర్చ కోర్టుకు హాజరై సరెండర్ పిటిషన్ దాఖలు చేసి లొంగిపోయారు.  ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు జె. వెంకటేశ్వర్లు, జె. కోటేశ్వరరావు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వారు ముందస్తు బెయిల్ కోసం తొలుత ఏపీ హైకోర్టును, ఆ తరువాత సుప్రీం కోర్టునూ ఆశ్రయించారు. రెండు చోట్లా వారికి చుక్కెదురైంది.   సుప్రీం కోర్టు వారి ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టివేస్తూ రెండు వారాల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు విధించిన గడువు ముగుస్తుండటంతో వారు కోర్టులో లొంగిపోయారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  అలాగే గురజాల సబ్‌ డివిజన్‌ పరిధిలో 144 సెక్షన్‌ విధించడంతో  పాటు పోలీస్‌ యాక్ట్‌ 30ను అమలు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పలువురు వైసీపీ నాయకులకు   హౌజ్‌ అరెస్టు చేశారు.

ప‌ట్టులోనూ అవినీతి ‘ప‌ట్టు’!

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీవెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి చుట్టూ మ‌రీ ఇన్ని అవినీతి బాగోతాలా?  మొన్న ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారం, నిన్న ప‌ర‌కామ‌ణి చోరీ అంశం.. తాజాగా ప‌ట్టు వ‌స్త్రాల అవినీతి బండారం. పాపం   వెంక‌న్న ఇంత పెద్ద నామాల‌తో క‌ళ్లు మూసుకుని ఉంటారు కాబ‌ట్టి  వీరిష్టానికి వీరు య‌ధేచ్చ‌గా దోపిడీ చేసేస్తున్నారు. ఆయ‌న నిజ నేత్ర ద‌ర్శ‌న  స‌మ‌యంలో ఈ అవినీతి బండారం ఎవ‌రో ఒక‌రి రూపంలో బ‌య‌ట ప‌డేస్తున్నారు. ఇంత‌కీ తాజా వ్య‌వ‌హారంలో  ఉన్నది ఎవ‌రు?  ఏమిట‌ని చూస్తే.. ప‌దేళ్ల కాలంలో అంటే, 2015- 25 మ‌ధ్య‌కాలంలో కేవ‌లం ప‌ట్టు కండువాల కుంభ‌కోణంలో 54 కోట్ల పై చిలుకు కొల్లగొట్టేశారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు. శ్రీవారు రాత్రింబ‌వ‌ళ్లు కాళ్లు నొప్పులు పుట్టేట‌ట్టు నిలుచుంటారు. ఇక‌ జ‌నం బాధ‌లు విని విని, చెవులు చిల్లులు ప‌డేలాంటి  ప‌రిస్థితి. వారి క‌ష్ట‌న‌ష్టాల‌న్నీ విని వారి ఆర్త‌నాదాల‌న్నీ తీర్చినందుకుగానూ కానుక‌ల రూపంలో రోజూ కోటి రూపాయ‌ల‌కు పైగా హుండీలో జమ అవుతుంటాయి. ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక దేవుడిగా తిరుమల వేంకటేశ్వ రస్వామి అలరారుతున్నారు.  అటువంటి వెంకన్న దేవుడి  సొమ్ము  స‌రే కాజేయాల‌న్న ఆలోచ‌న కొద్దీ.. కొంద‌రు అవినీతి ప‌రులు ప్రతి చిన్న విష‌యానికీ.. పెద్ద పెద్ద టెండ‌ర్లు వేసి శ్రీవారి  సొమ్ము  ఇదిగో ఇలా స్వాహా చేస్తున్నారు. తాజాగా శ్రీవారి సొమ్ము ఎలా కాజేశారో చూస్తే.. స్వామి వారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ప్ర‌ముఖుల‌కు ఒక శేష వ‌స్త్రం క‌ప్ప‌డం ఆచారం. అయితే స్వామివారి స్థాయికి త‌గ్గట్టు, ఈ వ‌స్త్రం ప‌ట్టుగా ఉండాల‌ని భావించి న‌గ‌రిలోని  ఒక సంస్థ‌కు ఈ కాంట్రాక్టు అప్ప‌గించారు. ఈ సంస్థ గ‌త కొంత‌కాలంగా మూడు వంద‌లు కూడా  చేయ‌ని ప‌ట్టు వ‌స్త్రానికి  ప‌ద‌మూడు వంద‌ల‌కు పైగా  వ‌సూలు చేస్తోంది. స‌రే ఇదేమైనా ప్యూర్ మ‌ల్బ‌రీ ప‌ట్టా? అని చూస్తే.. అది  కూడా కాద‌ని తేలింది. టీటీడీ విజిలెన్స్ విభాగం ల్యాబ్ లో టెస్ట్ చేయించ‌గా.. ఆ సంస్థ  పాలిస్టర్ పాలిస్ట‌ర్ వస్త్రాలను సరఫరా చేసినట్లు తేలింది.  ఈ ఏడాది కూడా  ఈ వ‌స్త్రం 15 వేల ఆర్డ‌ర్లు ఇచ్చింది  టీటీడీ. ఇదెలా బ‌య‌ట ప‌డిందో చూస్తే టీటీడీ  చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఇలాంటిదే ఒక ప‌ట్టు వ‌స్త్రం కొన‌గా దాని ధ‌ర 400 వంద‌ల రూపాయ‌లు కూడా లేదు.  ఈ విష‌యం గుర్తించిన ఆయన టీటీడీ  కొంటున్న ప‌ట్టు పై  కండువా ధర  ప‌రిశీలిస్తే అది 1300 రూపాయలకు పైగా ఉన్న‌ట్టు తెలిసింది. దీంతో ఆశ్చ‌ర్య‌పోయిన ఆయ‌న ఈ ప‌ట్టు బండారం మొత్తం  కూపీ లాగ‌గా ఇక్క‌డ‌ కూడా యాభై కోట్లకు పైగా దోపిడీ జ‌రిగిన‌ట్టు తెలిసింది. ఇలా శ్రీవారి విష‌యంలో ప్ర‌తి చిన్న విష‌యంలోనూ ఏదో ఒక అవినీతి మ‌యంగా మార‌డం చూస్తుంటే.. ఇందుకు  ఒక అంతు దరీ లేదా అన్న విస్మయం కలుగుతోంది.   భ‌క్తులు తాము స్వామి వారికి కానుకగా, ముడుపుగా సమర్పించిన సొమ్ము అవినీతి పరుల పాలౌతోందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అలాగ‌ని ఇదేం ఎక్క‌డో ఉండే బోలే బాబా వంటి న‌కిలీ నెయ్యి స‌ర‌ఫ‌రా చేసే సంస్థ కాదు.. ద‌గ్గ‌ర్లోనే  ఉండే న‌గ‌రిలోని వీఆర్ఎస్ అనే సంస్థ‌. ఈ ప్రాంతంలో స్వామి వారి ప‌ట్ల ఎన్నో భ‌య‌భ‌క్తులుంటాయి. అలాంటి వీరికి కూడా వెంక‌న్నదేవుడంటే  అంటే భ‌యం భ‌క్తీ, భయం లేకుండా   పోవ‌డ‌ం సంచలనంగా మారింది.  

మెస్సీతో ఫొటో దిగాలంటే..?

హైదరాబాద్ మహానగరం ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మానియాతో ఊగిపోతోంది. లియోనెల్ మెస్సీ ఈ నెల 13న హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్ బ్యాల్ మ్యాచ్ ఆడతారు. అలాగే అదే రోజు ఫలక్ నూమా ప్యాలెస్ లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంతకీ మెస్సీ హైదరాబాద్ ఎందుకు వస్తున్నారంటే?  గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా లెస్సీ భారత్ లోని నాలుగు ప్రధాన నగరాలలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్ రానున్నారు. ఇంతకీ గోట్ అంటే ఏమిటి అంటారా  గోట్ అంటే గ్రేటెస్ట్ ప్లేయర్ ఆప్ ఆల్ టైమ్.  అదలా ఉంచితే గోట్ నిర్వాహకురాలు స్వాతి రెడ్డి మెస్సీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. అదేంటంటే మెస్సీ ఫలక్ నూమా ప్యాలెస్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొనే సందర్భంలో అభిమానులు ఆయనతో ఫొటో దిగేందుకు అవకాశమిస్తారు. మెస్సీ అభిమానులకు ఇది నిజంగా ఎగిరి గంతేసే వార్తే. అయితే మెస్సీతో ఫొటో దిగాలంటే దాదాపు పది లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అలా చెల్లించగలిగిన వంద మందికి మెస్సీతో ఫొటో దిగే చాన్స్ లభిస్తుంది.

మెగా ఆక్షన్‌తో మారనున్న ఐపీఎల్ రూపురేఖలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2026 మెగా ఆక్షన్ వచ్చే వారమే మొదలు కానుంది.  ఈసారి ఏ ప్లేయర్, ఏ టీమ్‌లోకి వెళతాడు, ఎలాంటి మార్పులు కనిపించబోతున్నాయ్? ఫ్రాంచైజీలు ఎవరెవరిని అట్టిపెట్టుకుంటాయ్? అనే ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. అయితే.. అంతకంటే ముందు తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. ఈసారి కొత్త జట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయ్. పాపులర్ ఫ్రాంచైజీలు.. చేతులు మారనున్నాయ్. అసలు.. ఐపీఎల్ స్వరూపమే మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే.. జరుగుతున్న పరిణామాలు, కనిపిస్తున్న పరిస్థితులు అలా ఉన్నాయ్. ఐపీఎల్ 2026 సీజన్‌కి ముందే.. ఈ నెలలో మెగా ఆక్షన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. 350 మంది ప్లేయర్లు.. వేలంలోకి రానున్నారు. ఇప్పటికే.. ఆక్షన్ కోసం నమోదు చేసుకున్న ప్లేయర్ల జాబితా నుంచి బీసీసీఐ.. ఎవరూ ఊహించని విధంగా 1005 మంది పేర్లను తొలగించింది. అదేవిధంగా.. 35 మంది కొత్త ప్లేయర్ల పేర్లను వేలంలోకి చేర్చింది. 350 మంది ఆటగాళ్లకు సంబంధించిన ఆక్షన్‌.. డిసెంబర్‌ 16న.. అబుదాబీలో జరుగుతుంది. ఈ మేరకు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు  బీసీసీఐ మెయిల్స్ కూడా పంపింది.  బిడ్డింగ్ ప్రాసెస్.. బ్యాటర్లు, ఆల్‌ రౌండర్లు, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు అనే విభాగాల వారీగా.. క్యాప్డ్ ప్లేయర్లతో మొదలవుతుంది. తర్వాత.. అన్‌క్యాప్ట్ ఆటగాళ్ల వేలం మొదలవుతుంది. ఈ 350 మంది ప్లేయర్లలో.. ఎవరు ఏ టీమ్‌లోకి వెళ్తారు.. ఏ జట్టు నుంచి.. ఏ ఫ్రాంచైజీకి షిప్ట్ అవుతారనే దానిపై  ఉత్కంఠ నెలకొంది. ఇక.. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కొన్ని ఫ్రాంచైజీలు కొత్తగా కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే.. ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని అమ్మకానికి పెట్టిన న్యూస్ క్రికెట్ వరల్డ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు.. రాజస్థాన్ రాయల్స్ టీమ్ కూడా చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టీమ్స్‌ని దక్కించుకునేందుకు.. నలుగురైదుగురు బయ్యర్లు రేసులో ఉన్నారు. వారిలో.. ఈ ఫ్రాంచైజీలు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తిగా మారింది. పుణె, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, అమెరికా సహా.. కొత్త ఓనర్లు ఎక్కడి నుంచి వస్తారన్నది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం.. రాజస్థాన్ రాయల్స్ టీమ్.. రాయల్ స్పోర్ట్స్ గ్రూప్ చేతుల్లో ఉంది. ఈ కంపెనీకి.. ఫ్రాంచైజీలో 65 శాతం వాటా ఉంది. దాంతో.. రాజస్థాన్ రాయల్స్ మెజారిటీ వాటా అమ్మాలని చూస్తోంది. తమ టీమ్ విలువ.. బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా అంచనా వేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్.. తమ టీమ్‌లో వాటా అమ్మడానికి ప్రధాన కారణం.. ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ విపరీతంగా పెరగడమే. ఈ అధిక విలువని నగదు రూపంలోకి మార్చుకోవాలని.. ఇప్పుడున్న ఓనర్లు భావిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఓనర్ మనోజ్ బదాలే నేతృత్వంలోని ఓనర్లంతా.. తమ మెజారిటీ వాటాని  లేదా, పూర్తిగా ఫ్రాంచైజీని అమ్మడానికి  చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. గేమింగ్ దిగ్గజం క్రాఫ్టన్ ఇండియా, అదానీ గ్రూప్ లాంటి పెద్ద కంపెనీలతో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్. ఇటీవలే.. ఆర్సీబీ ఓనర్ అయిన డియాజియో కంపెనీ కూడా.. ఫ్రాంచైజీ సేల్ ప్రాసెస్‌ని మొదలుపెట్టింది. ఈ మేరకు బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు సమాచారం ఇచ్చింది. ఆర్సీబీ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టే వారి కోసం చూస్తున్నామని, వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆ సంస్థ తెలిపింది. అయితే.. లేటెస్ట్ డేటా ప్రకారం.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఈ ఏడాది 20 శాతం తగ్గింది. గత ఏడాది 12 బిలియన్ డాలర్లుగా ఉన్న ఐపీఎల్ వాల్యూ.. ఇప్పుడు 9.6 బిలియన్లకు చేరింది. దేశంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మెగా వేలం చుట్టూ ఉన్న అనిశ్చితుల కారణంగానే.. ఐపీఎల్ విలువ తగ్గిందన్న చర్చ జరుగుతోంది. భారత్-పాక్ వివాదం, భద్రతా సమస్యల కారణంగా.. ఈ ఏడాది వారం పాటు ఐపీఎల్‌ని నిలిపేయాల్సి వచ్చింది.  కోవిడ్ మహమ్మారి బారిన పడిన 2020 సీజన్ కాకుండా.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ భారీగా పడిపోయిన ఏకైక సంవత్సరం ఇదే. ఇప్పటికే.. లీగా వాల్యుయేషన్‌లో.. రెండేళ్లు క్షీణించింది. ఓ రిపోర్ట్ ప్రకారం.. 2023లో.. ఐపీఎల్ వాల్యూ 92 వేల 500 కోట్లుగా ఉంది. అదే.. 2024కి వచ్చేసరికి.. 82 వేల 700 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది.. ఐపీఎల్ వాల్యూ మరింత పడిపోయింది. ఇప్పుడు.. ఐపీఎల్ విలువ కేవలం 76 వేల 100 కోట్లుగా ఉంది. రియల్ మనీ గేమింగ్ స్పాన్సర్‌షిప్‌లపై ప్రభుత్వం విధించిన నిషేధం వల్లే.. ఐపీఎల్ గ్రోత్ తగ్గడానికి కారణమంటున్నారు.  ఒక్క.. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూ మాత్రమే పెరిగింది. ముంబై ఇండియన్స్ అత్యంత విలువైన ఫ్రాంచైజీగా.. 108 మిలియన్ డాలర్లతో తమ స్థానాన్ని నిలుపుకుంది. అయినప్పటికీ.. ఎంఐ టీమ్ బ్రాండ్ వాల్యూ కూడా 9 శాతం తగ్గింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ సీజన్‌లో తమ తొలి టైటిల్ సాధించినప్పటికీ.. 10 శాతం వాల్యూ తగ్గిపోయింది. ప్రస్తుతం.. 105 మిలియన్ డాలర్ల వాల్యూతో.. రెండో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ వాల్యూ కూడా 24 శాతం తగ్గి.. 93 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 33% తగ్గి 73 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది.. ఎంతో కొంత వృద్ధిని నమోదు చేసిన ఏకైక ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ మాత్రమే. ఆ టీమ్ బ్రాండ్ విలువ 2% పెరిగి 70 మిలియన్ డాలర్లకు చేరుకుంది. పంజాబ్ కింగ్స్ 3 శాతం, లక్నో టీమ్ 2 శాతం, ఢిల్లీ క్యాపిటల్స్ 26 శాతం, సన్‌రైజర్స్ హైదరాబాద్ 34 శాతం,  రాజస్థాన్ రాయల్స్ వాల్యుయేషన్  35శాతం పడిపోయాయి.

వైఎస్ వివేకా హత్య కేసు.. తదుపరి దర్యాప్తునకు ఆదేశాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పాక్షికంగా తదుపరి దర్యాప్తునకు ఆదేశాలిస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ  చేసింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి, 2014 ఎన్నికలకు ముందు ఆయన స్వగృహంలోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన హత్య కేసు విచారణ అప్పటి నుంచీ కొనసాగుతూనే ఉంది. వైఎస్ వివేకా కుమార్తె అలుపెరుగని న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కోరుతూ సునీత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. తదుపరి దర్యాప్తునకు బుధవారం (డిసెంబర్ 10) ఆదేశాలిచ్చింది.   ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందనీ, లేకుంటే  అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని సునీత తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. అయితే, దర్యాప్తు ఇప్పటికే ముగిసిందని, మళ్లీ విచారణకు అవకాశం లేదని నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు పాక్షికంగా తదుపరి దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపై దృష్టి సారించాలనీ, అందుకు సంబంధించిన వివరాలపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది.  

ఉప్పల్ స్టేడియంలో రేవంత్ వర్సెస్ మెస్సీ.. ఎప్పుడంటే?

సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నెల 13న స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడేందుకు ప్రాక్టీస్ ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. “తెలంగాణ రైజింగ్ - 2047” విజన్‌ను క్రీడా వేదిక నుంచి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలనే వ్యూహంతో తానే స్వయంగా గ్రౌండ్‌లోకి దిగుతున్నట్లు తెలిపారు.  తెలంగాణలో స్పోర్ట్స్ స్పిరిట్‌ను నలుమూలలా చాటి చెప్పడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. స్వయంగా ఫుట్‌బాల్ ఆటగాడైన రేవంత్..  తన బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా సమయం చిక్కినప్పుడల్లా ఫుట్ బాల్ మైదానంలో   పరుగులు తీస్తూ, గోల్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. గత పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే, మే 12న హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి సీఎం ఫుట్‌బాల్ ఆడారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆట మధ్యలో షూ పాడైపోయినప్పటికీ, ఆయన ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.. షూ లేకుండానే తన ఆటను కొనసాగించారు. ఈ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఫహీం ఖురేషి, హెచ్‌సీయూ విద్యార్థులు పాల్గొన్నారు.  ఇక ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ తన ఇండియా పర్యటనలో భాగంగా భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా, హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీమ్‌తో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ మ్యాచ్ ఆడనుంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు సీఎం సన్నద్ధమౌతున్నారు.   రోజంతా అధికారిక కార్యక్రమాలతో అలసిపోయినా, కూడా విశ్రాంతి అన్న మాటే మదిలోకి రానీయకుండా  ఫుట్‌బాల్ ఆటగాళ్లతో కలిసి సీఎం  ఆదివారం రాత్రి గ్రౌండ్‌లోకి దిగారు. యువతతో కలిసి ఆయన ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆడారు.   దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో   వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా రాష్ట్రంలో క్రీడా రంగాన్ని కూడా బలోపేతం చేసేందుకు, ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మెస్సీతో మ్యాచ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు తిప్పుకోవడానికి, రాష్ట్రంలో క్రీడలకు ఉన్న ప్రాధాన్యతను అంతర్జాతీయ స్థాయిలో తెలియజేయడానికి ఈ మ్యాచ్ దోహదపడుతుందని భావిస్తున్నారు. గోట్ టూర్​లో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్‌కు వస్తున్న మెస్సీ టీంతో రేవంత్‌రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్‌లో తలపడనున్నారు. 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే  ఈ ఫ్రెండ్లీ ఫ్లెండ్లీ మ్యాచ్ లో  రేవంత్‌.. 9వ నెంబర్‌ జెర్సీని.. మెస్సీ.. 10వ నెంబర్‌ జెర్సీ ధరించి గ్రౌండ్‌లోకి దిగుతారు. ఒక ముఖ్యమంత్రి.. ప్రముఖ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ గ్రౌండ్‌లో తలపడనుండటం క్రేజ్‌తోపాటు ఆసక్తిని రేపుతోంది.

స్టార్టప్ ల కోసం వెయ్యి కోట్లతో ప్రత్యేక నిథి.. సీఎం రేవంత్

తెలంగాణలో స్టార్టప్ లకు భారీ ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో స్టార్టప్ ల అభివృద్ధి కోసం వెయ్యి కోట్లతో నిధి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్  లో గూగూల్ ఫర్ స్టార్టప్ హబ్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా స్టార్టప్ లకు భారీ ప్రోత్సహకాలను ప్రకటించారు. ప్రభుత్వ ప్రోత్సహకాలను వినియోగించుకుని స్టార్టప్ లు భవిష్యత్ లో గూగుల్ వంటి సంస్థలుగా విస్తరించాలని పిలుపునిచ్చారు.   రాష్ట్రంలో స్టార్టప్‌ల వృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన గూగుల్ ఒక స్టార్టప్ గా ఆరంభమై ప్రపంచ దిగ్గజంగా ఎదిగిన విషయాన్ని   అదే స్ఫూర్తితో మన స్టార్టప్‌లు కూడా ఎదగాలన్నారు. గూగుల్, యాపిల్, అమెజాన్ వంటి సంస్థలు 20 ఏళ్ల క్రితం చిన్న స్టార్టప్‌లుగా మొదలైనవేనన్న ఆయన, ఇప్పుడవి  బిలియన్ డాలర్ల కంపెనీలుగా మారాయన్నారు. "హైదరాబాద్ కేవలం స్టార్టప్ హబ్‌గా మిగిలిపోకుండా ఇక్కడి స్టార్టప్ లు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని ఆకాం క్షించారు. 2034 నాటికి తెలంగాణను   ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషించాలన్నారు.