బంగారం కొనేటప్పుడు మోసపోవద్దు!

  దనత్రయోదశి వచ్చిందంటే అందరికీ బంగారం మీదే దృష్టి పడుతోంది. శుభసూచకం అనో, సందర్భం వచ్చింది కదా అనో ఎంతోకొంత బంగారాన్ని కొనడం ఆనవాయితీగా మారింది. ఇక ధనత్రయోదశి తరువాత వచ్చే దీపావళి, కార్తీకమాసం, నూతన సంవత్సరం, సంక్రాంతి... ఇలా ఏదో ఒక సందర్భంలో బంగారాన్ని కొనుగోలు చేయడమూ ఎక్కువగానే ఉంది. ఇలాంటప్పుడు కేవలం సెంటిమెంటు మాత్రమే ఉంటే సరిపోదు... బంగారం కొనుగోలు విషయంలో ఎలాంటి మోసానికీ లోను కాకుండా ఉండటమే ముఖ్యం!   క్యారెట్ల విషయంలో మోసం బంగారాన్ని క్యారెట్ల విషయంలో కొలుస్తారన్న విషయం వేరే చెప్పనవసరం లేదు. 24 క్యారెట్‌ బంగారం అంటే 99 పాళ్లు స్వచ్ఛమైన బంగారం అని లెక్క. కానీ ఇంత స్వచ్ఛమైన బంగారంతో చేస్తే ఆభరణాలు త్వరగా విరిగిపోతాయి. అందుకే ఆభరణాలకు దృఢత్వాన్ని ఇచ్చేందుకు, వాటిలో రాగి వంటి లోహాలను కలుపుతారు. ఇలా ఇతర లోహాల కలయికను బట్టి 22, 21, 18 క్యారెట్ల బంగారం అంటూ పేర్కొంటారు.   22 క్యారెట్ల బంగారంలో 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మనం తరచూ వినే 916 బంగారం ఇదే! ఇక 18 క్యారెట్ల బంగారంలో కేవలం 75 శాతం మాత్రమే నిజమైన బంగారం ఉంటుంది. చాలా సందర్భాలలో బంగారు దుకాణాలు మనకి 18 క్యారెట్ల బంగారాన్ని అందించి 22 క్యారెట్ల బంగారపు విలువని వసూలు చేస్తాయి. అందుకని ఆ రోజు బంగారం రేటు ఎంత ఉంది అని తెలుసుకుంటే సరిపోదు! ఏ క్యారెట్‌ బంగారానిది ఏ రేటు అని కూడా గమనించాలి. దానికి అనుగుణంగానే ఖరీదు కట్టారో లేదో చూసుకోవాలి.   తరుగుదల, మజూరి ఆభరణం కోసం వాడిన బంగారానికి మాత్రమే కాదు... దానిని రూపొందించేందుకు అయ్యే మజూరి, రూపొందే క్రమంలో పోయిన తరుగుని కూడా బిల్లులో కలుపుతుంటారు. ఈ తరుగు, మజూరీ అనేవి ఆభరణాన్ని బట్టి, దాని రూపుని బట్టి మారిపోతుంటాయి. కాబట్టి ఒక పక్క మనసుకి నచ్చిన ఆభరణాన్ని ఎంచుకొంటూనే, మరోపక్క దానికి అయ్యే తరగు, మజూరీలు వీలైనంత తక్కువగా ఉండేలా సమతూకాన్ని పాటించాలి.   తూకం బంగారం విలువ ఎక్కువ కాబట్టి, ఒకటి రెండు గ్రాములలో తేడా వచ్చినా బిల్లులో భారీ మార్పు తప్పదు. కాబట్టి మిల్లీగ్రాములతో సహా లెక్కకట్టగలిగే తూనికలను వాడాలన్నది ప్రభుత్వ ఆదేశం. అలాంటి తూకాలు ఉన్న దుకాణాలలోనే బంగారం కొనుగోలు చేయడం ఉత్తమం. పైగా ఆభరణపు బరువులోంచి, దానికి అతికించిన రాళ్ల బరువుని తీయించడం చాలామంది మర్చిపోతుంటారు. వీటివల్ల అపారమైన నష్టం తప్పదు. బంగారాన్ని ఎక్కువ మొత్తంలో కొన్నప్పుడు, మొత్తం మీద ఒక పదిగ్రాముల తేడా వచ్చినా ముప్ఫై వేల నష్టం తేలుతుంది. ఇలాంటప్పుడు, మరోచోట ఈ తూకాన్ని సరిచూసుకోవడంలో తప్పులేదు.   హాల్‌మార్కు తప్పనిసరి హాల్‌మార్కు ఉన్న నగలకి ప్రభుత్వమే భరోసా! ఎందుకంటే ప్రభుత్వం తరఫు నుంచి సదరు నగని ఎవరు తయారుచేశారు, ఎప్పుడు తయారుచేశారు, అందులో ఉన్న బంగారం శాతం ఎంత, ఏ హాల్‌మార్కు కేంద్రంలో అది నమోదైంది తదితర వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఇలాంటి నగల విషయంలో మోసం జరిగే అవకాశం తక్కువ.   రసీదు తప్పనిసరి బంగారానికి ఎంత లెక్కకట్టారు, మేకింగ్‌ ఛార్జెస్‌కు ఎంత జోడించారు, ఎంత తరుగు పోయింది... వంటి వివరాలన్నింటితనూ రశీదు తీసుకోవడం తప్పనిసరి. మున్ముందు ఆభరణం విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తినా ఈ రశీదే మనకు ఉపయోగపడుతుంది.   అప్పు చేసి ఆభరణం వద్దు ఏదో పిల్లల పెళ్లి వంటి అత్యవసరమైన సందర్భాలకు తప్ప అప్పు చేసి మరీ బంగారాన్ని తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. బంగారం రేట్లు ఎప్పటికప్పుడు పెరిగే మాట నిజమే అయినా... మనం చెల్లించే వడ్డీకీ, సదరు పెరుగుదలకీ పొంతన ఉండదు. పైగా బంగారాన్ని లాకర్లలో పెట్టుకొనేందుకు కూడా ఒకోసారి భారీగా అద్దెలు చెల్లించుకోవాలసి ఉంటుంది. అందుకని చేతిలో మిగులు సొమ్ములు ఉంటే తప్ప బంగారాన్ని కొనుగోలు చేసే సాహసం చేయవద్దంటున్నారు.   - నిర్జర.

మీ చూపుడు వేలు చిన్నదిగా ఉందా!

మన చేతిలో వేళ్ల పొడవుని బట్టి, ఇతర వేళ్లతో వాటికి ఉండే పోలికను బట్టి పెద్దలు రకరకాల జోస్యాలు చేస్తుంటారు. వీటిలో కొన్ని వారి వారి అనుభవంతో చెప్పినవి కావచ్చు. మరికొన్ని ఊసుకోని ఊహలు కావచ్చు. కానీ వేళ్లని చూసి మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చని ఇప్పుడో పరిశోధన రుజువుచేస్తోంది. అంతేకాదు! ఒక మనిషి ఏ రంగంలో రాణించగలడో కూడా చెప్పవచ్చునంటోంది.   ఉంగరం వేలు- చూపుడు వేలు ఒక్కసారి మీ చేతి వంక చూసుకోండి. కొందరికి వారి ఉంగరం వేలు, చూపుడు వేలుకంటే పెద్దదిగా ఉంటుంది. మరికొందరికి చూపుడు వేలే ఉంగరపు వేలుకంటే పెద్దదిగా ఉంటుంది. సరే! మరికొందరికి రెండు వేళ్లూ సమానంగా ఉంటాయనుకోండి. తల్లి కడుపులో ఉన్నప్పుడు, మనకి లభించిన టెస్టోస్టెరోన్‌ అనే హార్మోనులో మార్పుల వల్లే ఇలా రెండు వేళ్లలో తేడాలు ఉంటాయని తేలింది. టెస్టోస్టెరోన్‌ ఎక్కువైతే టెస్టోస్టెరోన్‌ అనే హార్మోను పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది వారిలోని పునరుత్పత్తిని నిర్దేశిస్తుంది. స్త్రీలలో కూడా ఈ హార్మోను ఉత్పత్తి ఉంటుంది కానీ, పురుషులతో పోలిస్తే ఇది చాలా తక్కువ. తల్లి కడుపులో ఉండగానే శిశువుకి ఈ హార్మోను ఎక్కువపాళ్లలో అందితే వారి చూపుడు వేలు, ఉంగరపు వేలుకంటే చిన్నగా ఉంటుందట. అదే తగినంతగా అందకపోతే ఉంగరపు వేలే చిన్నదిగా ఉంటుందట. ఇది జ్యోతిషులు చెప్పిన మాట కాదు... శాస్త్రవేత్తలు తేల్చి చెప్పిన వాస్తవం. ప్రభావం ఉంటుంది ఇలా చిన్నప్పుడే టెస్టోస్టెరోన్ హార్మోను ఎక్కువగా పొందినవారు ఇతరులతో పోలిస్తే చాలా దృఢంగా ఉంటారని తేలింది. వీరు క్రీడలలో సమర్థంగా రాణించగలరట. ఇక దారులను గుర్తుంచుకోవడం, క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను వెతకడం వంటి ప్రతిభ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. అంతేకాదు! వీరిలో జీవితాంతమూ టెస్టోస్టెరోన్‌ ఇలా అధికమొత్తంలో విడుదల అవుతూ ఉంటుందట. అలాగని చిన్నప్పుడు టెస్టోస్టెరోన్‌ తక్కువగా పొందినవారిని (ఉంగరపు వేలు చిన్నగా ఉన్నవారు) తక్కువగా చేయడానికి వీల్లేదు. వీరు జ్ఞాన సంబంధమైన విషయాలలో ముందుంటారట. మనుషులను గుర్తుంచుకోవడం, చదివిన విషయాలను పొల్లుపోకుండా అప్పచెప్పగలగడం వంటి ప్రతిభ వీరిలో అపారంగా ఉంటుంది. జబ్బులు కూడా చూపుడు వేలు, ఉంగరపు వేళ్లని బట్టి వారి ప్రతిభను మాత్రమే కాదు... వివిధ మానసిక సమస్యలు వచ్చే అవకాశాన్ని కూడా పసిగట్టవచ్చునంటున్నారు. చూపుడు వేలు చిన్నగా ఉన్నవారు ADHD, ఆటిజం వంటి తీవ్రమైన సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంటుందట. ఇక ఉంగరపు వేలు చిన్నగా ఉన్నవారు చీటికీమాటికీ ఉద్వేగానికి లోనవ్వడం, క్రుంగుబాటు వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు.   నార్వేజియన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 42మంది మీద పరిశోధన చేసి తేల్చిన ఫలితాలివి. మన శరీర ఆకారానికీ హార్మోనులకీ మధ్య అవినాభావ సంబంధం ఉందని ఈ పరిశోధనతో తేలిపోతోంది. అయితే ఇది కేవలం ఎదుటి వ్యక్తి గురించి ఒక అంచనాను మాత్రమే అందించగలదు. ఎందుకంటే ఒక మనిషి ప్రతిభ ఏమిటన్నది అంతిమంగా అతని వ్యక్తిత్వం మీదే ఆధారపడి ఉంటుంది కదా!   - నిర్జర.

మాయ చెట్టు

  ఆ వడ్రంగికి ఆ రోజు పెద్ద బేరం తగిలింది. తన పాత ఇంటికి అవసరమయ్యే చిన్నచితకా మరమ్మత్తులను చేసిపెట్టమంటూ ఒక పెద్దాయన వడ్రింగిని పిలిపించాడు. చాలా రోజుల తరువాత మంచి పని దొరికింది కదా అనుకుని ఉత్సాహంగా బయల్దేరాడు వడ్రంగి. కానీ పని మొదలు పెట్టిన దగ్గర్నుంచీ ఏదీ అతనికి అనుకూలంగా సాగలేదు. రంపం మధ్యలోకి విరిగిపోయింది. డ్రిల్లింగ్‌ చేయబోతే ఫ్యూజులు కాస్తా ఎగిరిపోయాయి. నేల మీద పడి ఉన్న పాతమేకు ఒకటి కాల్లోకి దిగబడిపోయింది. ఇలా ఏదో ఒక అవాంతరం అడుగడుగునా ఎదురుపడుతూనే ఉంది.   ఒకదాని తరువాత ఒకటిగా వచ్చిన సమస్యలని చూసి వడ్రంగికి చిరాకెత్తిపోయింది. చీకటిపడే వేళకి జరగాల్సిన పనిలో మూడో వంతు కూడా పూర్తికానేలేదు. తీరా ఇంటికి వెళ్దామని బయల్దేరబోతుంటే అతని బండి కూడా మొరాయించింది. ‘‘ఈ బండిని ఇక్కడే వదిలెయ్యి! ఇవాల్టికి నేను నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతానులే!’’ అన్నాడు ఆ ఇంటి యజమాని. అలా ఆ పెద్దాయనతో కలసి తన ఇంటికి వెళ్లాడు వడ్రంగి. తన ఇల్లు చేరుకోగానే ‘‘ఎలాగూ ఇక్కడిదాకా వచ్చారు. కాస్త లోపలకి వచ్చి టీ తాగి వెళ్దురు,’’ అని అభ్యర్థించాడు వడ్రంగి. వడ్రంగి మాటను కాదనలేకపోయాడు పెద్దాయన. ఇద్దరూ కలిసి ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టారు.   వడ్రంగి ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెడుతూనే నేరుగా ఒక చిన్న మొక్క దగ్గరకి వెళ్లాడు. దాని లేత కొమ్మలను ఒకసారి తన వేళ్లతో తాకి ఇంట్లోకి అడుగుపెట్టాడు. అంతే! అప్పటివరకూ చిరాకుగా ఉన్న అతనిలో చిత్రమైన మార్పు కనిపించింది పెద్దాయనకు. మొహంలో చిరాకు స్థానాన్ని చిరునవ్వు ఆక్రమించింది. అతణ్ని చూడగానే పరుగులెత్తుకుంటూ వచ్చిన ఇద్దరు పిల్లలనూ ఒక్కసారిగా గుండెలకు హత్తుకున్నాడు. భార్యను పిలిచి యజమాని గురించి గౌరవంగా నాలుగు మాటలు చెప్పాడు. ఆమె యజమాని కోసం ఫలహారం చేయడంలో సాయపడ్డాడు.   ఏదో మాయ జరిగినట్లుగా వడ్రంగిలో ఒక్కసారిగా వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యం వేసింది పెద్దాయనకు. అందుకే తిరిగివెళ్తూ- ‘‘నువ్వు ఈ చెట్టు దగ్గరకి వచ్చి దాన్ని ముట్టుకున్నప్పటి నుంచీ నీలో నాకు భలే మార్పు కనిపించింది. దీని వెనుక కారణం ఏమన్నా ఉందా!’’ అని అడిగాడు ఆసక్తిగా.   పెద్దాయన ప్రశ్నకి వడ్రంగి చిరునవ్వుతో ‘‘మరేం లేదండీ! పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్తూ తమ ఆయుధాలను ఎలాగైతే జమ్మి చెట్టు మీద ఉంచి వెళ్లారో... అలా నాకు ఉద్యోగంలో ఎదురయ్యే చిరాకులన్నింటినీ సాయంవేళకి ఈ చెట్టు మీద తగిలించేస్తాను. ఆ తరువాత ఒక ఉద్యోగిలా కాకుండా... ఒక భర్తలాగా, ఒక తండ్రిలాగా ఈ ఇంట్లోకి ప్రవేశిస్తాను. మర్నాడు ఉదయం తిరిగి పనిలోకి వెళ్లేముందు తిరిగి ఆ చిరాకులని చెట్టు మీద నుంచి తిరిగి తీసుకుంటాను. కానీ అదేం చిత్రమో కానీ, ఆ చిరాకులు ముందు రోజు సాయంత్రం ఉన్నంత భారంగా మర్నాటికి అనిపించవు,’’ అంటూ బదులిచ్చాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)     - నిర్జర.

వివక్షను నిరూపించిన ప్రయోగం

అది 1968 సంవత్సరం, ఏప్రిల్‌ 4. అమెరికాలో నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడుతున్న ‘మర్టిన్‌ లూథర్‌ కింగ్’ అనే నాయకుని, శ్వేతజాతీయులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటనతో అమెరికా అంతా అట్టుడికిపోయింది. అమెరికాలో ఉన్న నల్ల జాతీయుల మీద అకృత్యాలు పెరిగిపోతున్నాయంటూ మేధావులు గగ్గోల పెట్టేశారు. ఆ దేశంలోని వివిధ జాతుల మధ్య సఖ్యత కుదిరేది ఎలాగా అంటూ నేతలు మధనపడిపోయారు. ఇదే సమయంలో ‘జేన్‌ ఎలియట్‌’ అనే ఉపాధ్యాయురాలు మరో విధంగా ఆలోచించడం మొదలుపెట్టింది.   వివక్ష మూలాలు జేన్‌ ఎలియట్‌ అమెరికాలోని లోవా నగరంలోని ఓ పాఠశాలలో మూడో తరగతి పిల్లలకు పాఠాలు చెబుతూ ఉండేది. లూథర్‌ కింగ్‌ హత్య జరిగిన తరువాత ఆమె తన విద్యార్థులని వివక్ష గురించి రకరకాల ప్రశ్నలు అడిగింది. అందులో శ్వేతజాతీయులైన పిల్లలు తాము నల్లజాతీయుల పిల్లలు పనికిరానివారిగా భావిస్తూ ఉంటామనీ, వారిని నిగ్గర్లని పిలుస్తూ అవమానిస్తూ ఉంటామనీ చెప్పారు. నల్లజాతి పిల్లలేమో తాము వివక్షకు గురవుతున్న విషయం తమ మనసుకి తెలుస్తూనే ఉందని తేల్చి చెప్పారు.     ఒక వింత ప్రయోగం పిల్లలలో వివక్ష ఎలా మొదలవుతుంది? దాని కారణంగా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? వివక్షకి సంబంధించిన దృక్పథం వారి చదువు మీద ఎలా పడుతుంది?... వంటి ప్రశ్నలకు పిల్లలే జవాబులు కనుక్కునేలా చేయాలని ఎలియట్‌ భావించారు. ఇందుకోసం ఆమె రెండు రోజుల పాటు తన తరగతిలో ‘A Class Divided’ అనే ఓ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మొదటి రోజున నీలం కళ్లు ఉన్నవారు నల్లటి కళ్లున్నవారికంటే చాలా అధికులని పిల్లలని నమ్మించారు ఎలియట్‌. నల్లటి కళ్లున్నవారు తెలివితక్కువవారనీ, సంస్కారం లేనివారనీ, మాట వినరనీ చెప్పుకొచ్చారు. వారితో ఆడకూడదంటూ నీలం కళ్లున్నవారికి సూచించారు. పైగా తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు నీలం కళ్లున్నవారు ప్రత్యకమైన కాలర్‌ ధరించవచ్చని చెప్పారు.   ఫలితం అనూహ్యం శ్వేత జాతీయులు, నల్ల జాతీయులు అన్న తేడా లేకుండా నీలం కళ్లు ఉన్నవారు ఎలియట్ మాటలకి చెలరేగిపోయారు. ఒక్క పూటలోనే వారి ప్రవర్తన మారిపోయింది. నల్లని కళ్లున్నవారిని నీచంగా చూడటం, వారిని ఏడిపించడం, ఇంకా మాట్లాడితే కొట్టడం చేయసాగారు. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల పిల్లలు కాస్తా రాక్షసంగా మారిపోయారు. వారిలో అన్ని రంగాలలో ఆధిక్యత కనిపించింది. చదువులో కూడా నల్లరంగు పిల్లలకంటే మెరుగైన ఫలితాలు సాధించారు.     ప్రయోగంలో మార్పు! మర్నాడు ఎలియట్‌ పిల్లల ముందు మరో ప్రతిపాదన చేశారు. తాను నిన్న నీలం రంగు పిల్లలు అధికులని చెప్పాననీ, నిజానికి నల్లకళ్లున్న పిల్లలే గొప్పవారనీ... వారే అధికులనీ తేల్చి చెప్పారు. నల్ల కళ్లున్న పిల్లల నీలం రంగు కళ్లున్న పిల్లలని దూరంగా పెట్టాలని సూచించారు. అనూహ్యంగా అంతకు ముందు రోజు నీలం రంగు కళ్లున్న పిల్లలు ఎలా ప్రవర్తించారో, మర్నాడు నల్లకళ్ల పిల్లలూ అలాగే ప్రవర్తించారు. ఆవేళ చదువులో వారిదే పైచేయిగా సాగింది.   విశ్లేషణ ఫలానా జాతివాళ్లు, రంగువాళ్లు, కులంవాళ్లు గొప్పవారు అనే భావన మనిషి మనస్తత్వం మీద ఎలా ప్రభావం చూపుతుందో తెలియచేసే గొప్ప ప్రయోగం ఇది. తరువాత కాలంలో ఎలియట్‌ ఇదే ప్రయోగాన్ని పెద్దవారి మీద ప్రయోగించి ఇదే తరహా ఫలితాలను పొందారు. నిజానికి ఎవరూ ఉన్నతులు కారనీ, తాము ఉన్నతులం అనుకునే దృక్పథమే వారి ప్రవర్తనను ప్రభావితం చేస్తుందని ఎలియట్‌ తేల్చి చెప్పారు. అంతేకాదు! ఇలాంటి వివక్షతో కూడిన వాతావరణం పిల్లల నేర్పు మీద తప్పకుండా ప్రభావం చూపుతుందని తేల్చారు.   ఇప్పటికీ చాలామంది నల్లజాతీయుల పిల్లలు తెలివితక్కువవారని భావిస్తుంటారు. దానికి సంబంధించిన గణాంకాలను కూడా చూపిస్తుంటారు. నిజానికి సదరు పిల్లలు వెనుకబడి ఉండటానికి వారి చుట్టూ కల్పించిన అవిశ్వాసపు వాతావరణమే అంటున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి వివక్షపు అడ్డుగోడలను కూల్చివేసిన రోజున, తరతరాలుగా పేరుకున్నా తప్పుడు అభిప్రాయాలను మార్చుకున్న రోజున... అందరూ సమానంగా జీవించగలరని ఈ ప్రయోగం తేల్చిచెబుతోంది.     - నిర్జర.

10 Tips to avoid computer virus

  We may not have enough expertise to differentiate between Viruses, Worms, Trojan horses and Spyware. But we all knew they are the kinds of Malware that could harm our computers! We can of course carry on our regular work on the computers despite being the drives being infested. But it isn’t certainly a pleasant experience to watch the screen filled with those nasty files and messages created by the virus. These are a few time tested tips that could prevent our computers being flooded with virus. 1- Never click on any e-mail attachments or links without being sure of its content. Never click on a pop up window even if it assures the best gifts in the world. 2- Don’t think much about the cost to be spent on an anti-virus. An effective and up-to-date antivirus could certainly save you from a huge trouble that can’t be estimated in the terms of money. Antivirus is just like a health insurance. You never know when it could save you! 3. Disabling the `Auto run’ feature can protect our system from the virus files that automatically gets executed whenever an infested CD or Pen drive is inserted. 4. Don’t click on the buttons that ask you to download certain software in order to watch a movie or enter a website. They can certainly be a menace in future.   5. Never leave your Wi-Fi open to public. Lock with a password and keep it private. Don’t use a free Wi-Fi on a devise where you have stored your personal information. 6. Now a day, external storage devices are not as costly as they used to be. So it’s always a great option to backup your data periodically. This would let you to format your computer when it is infested with virus. Further it would prevent your data being corrupted by the virus. 7. Pen drives are the easiest ways for the virus to enter the system. So don’t push every USB of your friend into your system. And don’t use your USB on a system which has no active antivirus. 8. When you are working on a system that is connected to a network... it is always recommended to turn on the FIREWALL option on windows.     9. Update your browser regularly so that you can take advantage of their advanced options such as pop-up blocking. 10. Some applications request to have access to your mail as well as `manage your contacts’. Be sure whether to share your privacy with such website or not! - Nirjara

మహత్యం ఎంతకి దొరుకుతుంది

  ఎవరో ఏడుస్తున్న శబ్దం విన్న హరితకి హఠాత్తుగా మెలకువ వచ్చింది. గోడ మీద ఉన్న గడియారం వంక చూస్తే సమయం రాత్రి మూడయ్యింది. ఇంతలో పక్క గదిలోంచి మరోసారి ఎవరో వెక్కివెక్కి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ వెక్కిళ్ల మధ్య ‘అంటే పిల్లవాడు మనకి దక్కడంటారా!’ అన్న తల్లి మాటలు వినిపించాయి.   ‘మెదడుకి ఆపరేషన్‌ అంటే మాటలా!’ ఇప్పటికిప్పుడు లక్షలకి లక్షలు కావాలి. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది. అమ్ముకోవడానికి ఇల్లు లేదు. అప్పు చేయడానికి పరపతి లేదు. నెలనెలా వచ్చే జీతం బొటాబొటీగా మన ఇల్లు గడిచేందుకే సరిపోతోంది. ఏదో ఒక మహత్యం మన జీవితాల్లో ప్రవేశిస్తే తప్ప వాడు బతికేలా లేడు..’ గద్గదమైన స్వరంతో అనునయిస్తున్నాడు తన తండ్రి.   తమ్ముడికి వచ్చిన అనారోగ్యం గురించే తన తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారన్న విషయం హరితకి అర్థమైంది. కానీ ఆ ఎనిమిదేళ్ల పాపకి మహత్యం అన్న మాటకి మాత్రం అర్థం బోధపడలేదు. కాకపోతే మహత్యం ఉంటే తన తమ్ముడి అనారోగ్యం నమయవుతుందని మాత్రం తెలుసుకొంది. దాంతో తెల్లవారిన వెంటనే సందు చివర ఉన్న మందుల షాపుకి వెళ్లి మహత్యం కొని తీసుకురావాలని మాత్రం నిర్ణయించుకుంది.   ఆ రాత్రి హరితకి నిద్రపట్టలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా! ఎప్పుడు తన తమ్ముడి కోసం మహత్యాన్ని కొనుక్కువద్దామా అని ఎదురుచూడటమే సరిపోయింది. ఇంతలో భళ్లున తెల్లవారింది. ఎన్నో రోజుల నుంచి తను పైసాపైసా పోగేసుకుంటూ వచ్చిన డబ్బుల్ని చూసుకుంది. మొత్తం 69 రూపాయల లెక్క తేలింది. ఆ డబ్బులన్నీ ఒక చిన్న మూట కట్టుకుని మందుల షాపు దగ్గరకు చేరుకుంది.   మందుల షాపు ఖాళీగానే ఉంది. కానీ ఆ షాపు యజమాని మాత్రం ఎవరో పెద్దాయనతో ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించాడు. అతనిలో మాట్లాడే హడావుడిలో షాపులోకి వచ్చిన హరితని గమనించనేలేదు. ‘అంకుల్‌!’ పిలిచింది హరిత. మందులషాపు యజమాని ఆ మాటలకి ఉలకలేదు, పలకలేదు. హరితకి ఒక్కసారిగా తన తమ్ముడు గుర్తుకువచ్చి ఏడుపు ముంచుకువచ్చింది. ‘‘అంకుల్‌! నా తమ్ముడికి ఒంట్లో బాగోలేదు. వాడి కోసం అర్జంటుగా ఒక మహత్యం కావాలి!’’ అంటూ గట్టిగా అరిచింది.   హరిత మాటలు విన్న ఆ ఇద్దరూ ఒక్కసారి ఆమె వంక చూశారు. హరిత కళ్లలో నీరు. షాపతనితో మాట్లాడుతున్నతను ఒక్కసారి హరితను దగ్గరకు తీసుకుని ‘‘మీ తమ్ముడికి ఏం జరిగిందమ్మా!’’ అంటూ అనునయంగా అడిగాడు. ‘‘వాడికి మెదడులో ఏదో తేడా చేసిందట. అది నయం కావాలంటే ఏదో మహత్యం కావాలంట,’’ అంటూ ఏడుస్తూ చెప్పింది హరిత. ఆ పెద్దాయన ఏదో కాసేపు ఆలోచించాడు. ఆ తరువాత ‘‘పద! ఓసారి మీ ఇంటికి వెళ్లి మీ అమ్మానాన్నలతో మాట్లాడదాం,’’ అంటూ హరితను బయల్దేరదీశాడు.   ఇంతకీ ఆ పెద్దాయన ఓ పేరు మోసిన వైద్యుడు. తన బంధువుని ఓసారి పలకరించి పోయేందుకని మందుల షాపుకి వచ్చాడు. అక్కడ అనుకోకుండా ఆయనకు హరిత తారసపడింది. హరిత ఇంటికి చేరుకున్న ఆ వైద్యుడికి వారి పరిస్థితి బోధపడింది. వెంటనే పైసా తీసుకోకుండా తన ఆసుపత్రిలో అతని ఆపరేషన్‌కు ఏర్పాటు చేశాడు. ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయ్యింది. ‘‘నిజంగా ఇలాంటి ఆపరేషన్‌ చేయించాలంటే మన స్తోమత సరిపోయేది కాదు కదా,’’ అన్నాడు ఆసుపత్రి బయట నిల్చొన్న తన భార్యని చూస్తూ.  ‘‘నిజమే! కానీ స్తోమత లేకపోతేనేం. తన తమ్ముడిని ఎలాగైనా బతికించుకోవాలనుకునే హరిత వాడికి తోడుగా ఉంది కదా! అలాంటి మంచి మనసు ఉన్న పిల్ల చాలు. మన కుటుంబం ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలదు,’’ అని బదులిచ్చింది హరిత తల్లి. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   ..Nirjara

`I and Me’ theory

  Humans might have reached advanced stages in the field of science, but the world hidden in their mind is still a Pandora’s Box. The questions like- How does a man think about himself? How does he form his character? What really influences his personality? Has always been a source of numerous theories. One such theory is put forward by an American Philosopher named George Herbert Mead.   The Founder Mead is thought to be one of the founders of Social Psychology. Social Psychology deals with the influence of society over the thoughts and behaviour of an individual. Mead have contributed various aspects in such Social Psychology and thus regarded as one of the significant psychologist in the lineage of Freud. The `I and Me’ theory proposed by Mead is thought to be the most path breaking theory in his life.   The Influence There is no doubt that a man is a social animal. Though he seems to have a unique character of his own, such character is obviously influenced by the society. Right from our birth, we are sub consciously influenced by a lot of factors like the culture we are born and by the behaviour of our parents. As we grow up, we get influenced by our surroundings, our friends and our teachers. Thus in every stage of our life, we are being influenced by some factor or the other.   The Theory Mead proposes that we have two identities within us. One is the `Me’ and the other one is the `I’. `Me’ is the set of influence that society has made on us. It is the set of attitudes and beliefs formed through the society. `I’ is the individual impulse. `I’ is the seeker and the knower. When `I’ receives some response from the society and accepts it, it would then become a part of `Me’. On the other hand `Me’ tries to mould `I’ according to the society. So both `I’ and `Me’ together would form a person.   Practical purpose The `I and Me’ theory helps to pinpoint the affect of society over individual. On the other hand it helps to access the psychology of a person. People can be either be dominated by their `I’ part of the individuality or the `Me’ part. A person who relies mostly on reasoning and tries to act independently is the one who has a stronger `I’. He is the one who differs from the norms of the society and may try to shape his own character. On the other hand, a person who goes along with the society without any questioning is the one who has a dominant `Me’. He follows the rest of the mankind and thinks in the same manner as his neighbour thinks. So what do you think about yourself! Do you have a dominant `Me’ or a dominant `I’?   - Nirjara.  

చనిపోయేలోగా ఏం చేయాలనుకుంటున్నారు!

  చావు ఎవరికైనా భయాన్ని కలిగించేందే! మనం ఈ లోకం నుంచి శాశ్వతంగా, హఠాత్తుగా సెలవు తీసుకునే సందర్భాన్ని ఊహించడానికే బాధగా ఉంటుంది. అందుకే జనం తాము చనిపోతామనే భావనని వీలైనంతగా మనసు లోలోతుల్లో మరుగున పెట్టేస్తూ ఉంటారు. కానీ చావు ఉంటేనే కదా జీవితానికి విలువ ఉండేది. మృత్యవు ఒకటి ఉందన్న భావన ఉన్నప్పుడే కదా, చేతిలో ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న తపన కలిగేది. అందుకనే అమెరికాకు చెందిన ‘క్యాండీ చాంగ్‌’ అనే యువతి ఒక ప్రాజెక్టుని ప్రారంభించింది. అదే- Before I Die.     తోటివారిని కోల్పోవడంతో క్యాండీ చాంగ్‌ అమెరికాలో స్థిరపడిని ఒక తైవాన్‌ చిత్రకారిణి. వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ ఆమె జీవితం సాఫీగానే సాగిపోతూ ఉండేది. కానీ కొన్నాళ్ల క్రితం ఆమె మనసుకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి ఒకరు హఠాత్తుగా కాలేయం దెబ్బతినడంతో చనిపోయారు. చావు సహజమే అయినప్పటికీ, ఎన్ని రోజులు గడిచినా దానికి సంబంధించిన ఆలోచనల నుంచి బయటపడలేకపోయింది క్యాండీ. ‘మనుషులు బతుకుతున్నారు, చనిపోతున్నారు... మరి చనిపోయేలోపల తాము ఏం చేయాలో వారికి ఏమన్నా లక్ష్యం ఉందా?’ అన్న ఆలోచన వచ్చింది క్యాండీకి. ఆలోచన వచ్చిందే తడువుగా దాన్ని ఇతరులతో పంచుకోవాలని అనుకుంది.     పాడుబడ్డ గోడ మీద క్యాండీ అమెరికాలోని ‘న్యూ ఆర్లియన్స్’ నగరంలో నివసిస్తోంది. తనకు వచ్చిన ఆలోచనకి ఒక రూపం ఇచ్చేందుకు ఆమె తన ఇంటి పక్కనే ఉన్న ఒక పాడుపడిన ఇంటిని ఎంచుకొంది. ఆ గోడ మీద "Before I die I want to ________" అంటూ రాసి ఉంచింది. దాని మీద దారిన పోయేవారు తమతమ అభిప్రాయాలను వెల్లడించవచ్చన్నమాట. క్యాండీ చేసిన ఈ ప్రయోగం ఊహించని ఫలితాలను ఇచ్చింది. అటుగా వెళ్లేవారంతా ఆగి ఆ ప్రశ్నని చూసి కాసేపు తమలో తాము మధనపడి, మనసు లోతుల్లోంచి రాసిన వాక్యాలన్నీ చూసి క్యాండీ ఆశ్చర్యపోయింది.   మనిషిలో కోరిక ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన రావడంతో క్యాండీ ఇతర చోట్ల కూడా ఇలాంటి ప్రయోగమే చేసింది. క్యాండీ ప్రయోగాన్ని చూసి... ప్రపంచంలో ఎందరో ఆమెను అనుకరించడం మొదలుపెట్టారు. అలా ఇప్పటివరకూ 70కి పైగా దేశాలలో, 35కి పైగా భాషలలో వేయికి పైగా గోడల మీద ‘నేను చనిపోయేలోగా ఏం చేయాలనుకుంటున్నానంటే ______’ అంటూ ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అందులో ప్రతి ఒక్క కోరికా భిన్నమైనదే. ‘నా తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని అనుకుంటున్నాను’ అని ఒకరంటే ‘నా కూతురు చదువు పూర్తిచేయడాన్ని చూడాలి’ అని ఇంకొకరు కోరుకున్నారు. ‘సమసమాజాన్ని చూడాలని’ ఒకరు ఆశిస్తే ‘కాలినడకన ప్రపంచాన్ని చుట్టాలని’ మరొకరు భావించారు. ఒకటా రెండా వేలకొద్దీ రాసిన రాతల మీద ప్రతి భావమూ భిన్నమైనదే!   ఉపయోగం ఎందుకు జీవిస్తున్నామో కూడా తెలియనంత అయోమయంలో పరుగులెత్తుతున్న మనిషి ఒక్కసారి ఆగి, తన గురించి తాను ఆలోచించుకునే అవకాశమే ఈ Before I Die ప్రశ్న. పైగా ఒకోసారి చావు గురించిన ఆలోచన జీవితపు విలువను గుర్తుచేస్తుంది. తన లక్ష్యాలు ఏమిటి, ప్రాధాన్యతలు ఏమిటి అని నిర్ణయించుకోవాల్సిన హెచ్చరికను అందిస్తుంది. అలాంటి అవకాశం ఈ ప్రశ్న కల్పిస్తుంది. ఇంతకీ ఈ ప్రశ్నకు మీరిచ్చే జవాబు ఏమిటి???   - నిర్జర.

మీ మాట నెగ్గించుకునే- FITD టెక్నిక్

మనిషి సంఘజీవి. ఉదయం లేచిన దగ్గర్నుంచీ అతనికి పదిమందితోనూ అవసరం తప్పదు. అదే ఏ మార్కెటింగ్‌ రంగంలో అన్నా ఉంటే ఇక అవతలివారు కొనుగోలు చేసే నిర్ణయాల మీదే మన అభివృద్ధి ఆధారపడి ఉంటుందయ్యే! అందుకోసం రకరకాల చిట్కాలు ఉండనే ఉన్నాయి. వీటిలో కొన్ని వాక్చాతుర్యంతో సాధించేవి అయితే, మరికొన్ని మనస్తత్వ శాస్త్రం ఆధారంగా రూపొందించినవి. అలాంటి ఒక చిట్కానే Foot-in-the-door technique (FITD)! ముందుగా కాలుపెట్టండి ‘నాన్నా ఇవాళ మహేష్‌తో కలిసి సినిమాకి వెళ్లనా!’ అని అడిగతే నాన్నగారు దానికి ఒప్పుకుంటారో లేదో కష్టం. కానీ ముందుగా ‘నాన్నా, ఇవాళ సాయంత్రం మహేష్‌ వాళ్లింటికి వెళ్లనా!’ అని అడిగారనుకోండి... అదేమంత పెద్ద విషయం కాదు కాబట్టి నాన్నగారు దానికి ఒప్పుకోవచ్చు. కానీ ఆ తరువాత ‘మహేష్‌ వాళ్లింటికి వెళ్లాక, అక్కడి నుంచి వీలైతే సినిమాకు వెళ్లొచ్చా!’ అని అడిగారనుకోండి... నాన్నగారు ఒప్పుకునే అవకాశాలే ఎక్కువ! ఇది కొంటె కుర్రాళ్ల మంత్రం కాదు శాస్త్రవేత్తల మాటే. ముందుగా ఎదుటివారు కాదనలేని ఒక చిన్న అభ్యర్థన ద్వారా ఈ టెక్నిక్‌ను మొదలుపెట్టాలి. ఆ తరువాత దానికి కొనసాగింపుగా అసలైన అభ్యర్థనని వారి ముందు ఉంచండి. దాని వల్ల ‘ఇంతకు ముందు అభ్యర్థనని నేను ఒప్పుకున్నాను కదా! ఇప్పుడు దీనిని కూడా ఒప్పుకుంటే పోయేదేముంది’ అన్న అభిప్రాయం అవతలివారిలో ఏర్పడుతుంది. ఉపయోగాలు ఒక చిన్న అంగీకారంతో మరో పెద్ద అంగీకారానికి దారి తీయించడమే ఈ టెక్నిక్‌లోని రహస్యం. మొదటి అంగీకారంతో అవతలి వ్యక్తి ఒక తెలియని ఒప్పందంలోకి వచ్చేస్తాడనీ, తరువాత ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండాలన్న మర్యాదని పాటిస్తాడని నిపుణులు అంటున్నారు. అయితే ఒకే వ్యక్తి నుంచి ఈ అభ్యర్థనలు ఉండాలనీ, రెండు అభ్యర్థలనకూ మధ్య పొంతన ఉండాలనీన సూచిస్తున్నారు. మార్కెంటింగ్‌లో ఉన్న వ్యక్తులకి ఈ టెక్నిక్‌ బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ముందుగా మీ మాటలు వినేందుకో, మీ ఉత్పత్తి పనితీరుని గమనించేందుకో, కొన్నాళ్లపాటు వాడిచేసేందుకో... అవతలి వ్యక్తులను ఒప్పించగలిగితే, మీ పని మరింత సులువవుతుందని చెబుతున్నారు. స్వచ్చంద సంస్థలలో పనిచేసేవారు కూడా ఈ పద్ధతిని శుభ్రంగా పాటించవచ్చని చెబుతున్నారు. ‘మా సంస్థకి ఒక్క వందరూపాయల విరాళం ఇవ్వండి మాస్టారూ!’ అని అడిగి ఒప్పించిన తరువాత ‘నెలనెలా వంద రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి మాస్టారూ!’ అని చెబితే అవతలివారు తిరస్కరించడం కష్టమే కదా! రివర్స్‌ టెక్నిక్‌ FITD టెక్నిక్ సరిగా పనిచేయకపోతే కంగారుపడవద్దంటున్నారు. ఈసారి Door-in-the-face (DITF) టెక్నిక్‌ని వాడి చూడమంటున్నారు. ఇందులో భాగంగా మొదటిసారే పెద్ద అభ్యర్థన చేసి చూడాలి. దానికి అవతలివారు ఒప్పుకోనప్పుడు, చిన్న అభ్యర్థనను చేసి చూడాలి. ఎలాగూ మొదటి అభ్యర్థనను తిరస్కరించాం కదా అన్న జాలితో, అవతలివారు రెండోదానికి అంగీకారం తెలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ‘ఈ పుస్తకం ధర వెయ్యి రూపాయలండీ కొనుక్కోరాదూ!’ అని అడిగితే... అవతలి వ్యక్తి దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించవచ్చు. కానీ మరో చిన్న పుస్తకాన్ని చూపించి ‘ఈ పుస్తకం అయితే పాతిక రూపాయలే! ఇదన్నా తీసుకోండి’ అని అడిగితే... అవతలి వ్యక్తి మారుమాట్లాడకుండా దాన్ని కొనుగోలు చేయవచ్చు. ఏదో ఒకటి రెండు ఉదాహరణలతో సరిపెట్టుకున్నాం కానీ, ఈ రెండు టెక్నిక్‌లనూ రోజువారీ జీవితంలో అనేక సందర్భాలలో వాడి చూడవచ్చు. కాకపోతే మన కుటుంబజీవితంలో మాత్రం ఎప్పుడో ఒకసారి తప్ప, నిరంతరం ఇలాంటి చిట్కాలను వాడుతుంటే... మన బంధాలు కాస్తా కృతకంగా మారిపోయే ప్రమాదం లేకపోలేదు.   - నిర్జర.  

ఆలోచించండి బాబూ..ఆలోచించండి..!

మనిషికి దేవుడు ఇచ్చిన గొప్పవరం మెదడు..ఇది మన శరీరంలోని అత్యంత నిగూడమైన అవయవం..ఇప్పటికీ మన మెదడు గురించి మనకు తెలిసింది సముద్రంలో ఇసుక రేణువంత. మన మెదడును మన భావాలను సజీవంగా ఉంచటం మరియు అవయవాలను కదిలేలా చేస్తుంది. మన మెదడు కొన్ని కోట్ల సూపర్‌ కంప్యూటర్లతో సమానం..కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు లేనికాలంలో ఎంతటి సంక్లిష్టమైన సమస్యనైనా మన మస్తిష్కం పూర్తి చేసేది. ఎంత పెద్ద లెక్కయినా టక్కున నోటితోనే చెప్పేసేవారు. కానీ ఇప్పుడు దుకాణానికి వెళ్లి రెండు వస్తువులు కొంటే మొత్తం ఎంతయిందో క్యాలిక్యులేటర్ ఉంటే కానీ చెప్పలేం.  అంతేందుకు మొబైల్ ఫోన్లు ఇంతగా లేనపుడు ప్రతి ఒక్కరి కి వందల కొద్దీ ఫోన్ నెంబర్లు అలా తలచుకుంటే ఇలా కళ్ల ముందు మెదిలేవి. కానీ ఇప్పుడు మొబైల్ కాంటాక్ట్ లిస్ట్‌లో పేరు పెట్టి వెతికితే కానీ నంబర్ తెలియదు..అసలు ఇంతకీ మన మెదడుకి ఎమైంది. మారుతున్న జీవనశైలి మెదడును మొద్దు బారుస్తోంది..ఉద్యోగాలు, పనులన్నీ కంప్యూటర్లలోనూ, ఆన్‌లైన్లోనే అయిపోతున్నాయి. నెట్ బ్యాంకింగ్ వివిధ రకాల యాప్‌లతో బ్యాంకులకు వెళ్లే పని, దుకాణాలకు వెళ్లే పని, చివరికి హోటళ్లకు వెళ్లే పనీ తప్పిపోతోంది.. అపరిమితమైన సమాచారాన్ని తనలో నిక్షిప్తం చేసుకోగలిగే సత్తా ఉన్న మస్తిష్కాలను అంతులేని సంగతులు చెప్పే ఇంటర్నెట్ బలహీనం చేస్తోంది. బోలెడన్ని యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు, సీక్రెట్ కోడ్‌లు పెట్టినా అవి కూడా గుర్తు రాక నానాతంటాలు పడుతున్నారు. కొందరైతే ఇవి సమయానికి గుర్తురాక మతిమరుపు వచ్చేసిందేమోనని భయపడుతున్నారు.   కారణాలు: నేటి ఆధునిక జీవిన విధానంలో ఇంటర్నెట్ రాక..మనిషి గమనాన్ని పూర్తిగా మార్చేసింది. తినాలన్నా...పడుకోవాలన్నా..మేల్కొనాలనే అంతా టెక్నాలజీయే..ఇప్పటి తరం ఏ సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్‌లో వెతుకుతున్నారే కానీ గుర్తుంచుకోవడం లేదు..అరచేతిలో సమస్తం దొరుకుతున్నపుడు కావాల్సినపుడు తెలుసుకోవచ్చులే అని దేనిని మెదడులోకి ఎక్కించడం లేదు. చాలా మంది రోజుకు గంట నుంచి మూడు గంటల దాకా ఫోన్‌లో నెట్ వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఖాళీ దొరికితే చాలు ఇంటర్నెట్‌లో మునిగిపోతుండటంతో..అవసరమైనది, లేనిదీ కనిపిస్తుండటంతో మెదడు షార్ట్ టెర్మ్ మెమొరీకి సవాలుగా మారుతోంది..ఒకదానికొకటి సంబంధం లేని అనేక అంశాలను తక్కువ కాలవ్యవధిలో వీక్షిస్తుండటంతో మెదడుపై భారం పడుతోంది. ఇవన్నీ కలగలిసి ధీర్ఘకాలంలో మెదడుపై దుష్ప్భ్రభావాన్ని చూపుతున్నాయి.   సమస్యలు: పనిచేస్తుంటేనే మన కండరాలు బలపడతాయి. ఎప్పటికప్పుడు కొత్త శక్తిని సంతరించుకుంటాయి. మెదడు కూడా అంతే. ప్రతీ పనికీ ఏదో ఒక సాధనం మీద ఆధారపడుతూ మెదడును వాడటం తగ్గించేస్తున్నాం. దీని వల్ల మెదడు త్వరగా వృద్ధాప్యం బారిన పడుతోంది. ఫలితంగా డిమెన్షియా, అల్జీమర్స్ వంటి తీవ్ర మతిమరుపు వ్యాధుల ముప్పూ పెరుగుతోంది. 2015 నాటి ప్రపంచ అల్జీమర్స్ నివేదిక ప్రకారం..మనదేశంలో 41 లక్షల మంది అల్జీమర్స్‌తోనే బాధపడుతున్నారు. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియాతో బాధపడేవారిలో సగం మంది ఆసియాలోనే ఉండొచ్చనీ నివేదిక హెచ్చరించింది.    నివారణ: మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవటం మన చేతుల్లోనే ఉంది. మెదడుకు పదును పెట్టే పజిల్స్, సుడోకులు వంటి ఆటలు ఆడుతుండాలి. నిరంతరం కొత్తకొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండటం ద్వారా మనం మెదడు పదును తగ్గకుండా చూసుకోవచ్చు. కొత్త భాష, సంగీతం, వంటలు ఇలా ఏవైనా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం మంచిది. కంటి నిద్రపోవటం వల్ల జ్ఞాపకాలు స్థిరపడతాయి. ఏకాగ్రత కుదురుతుంది, మెదడు చురుకుగా పని చేస్తుంది.    ఆహారం: మెదడు సమర్థంగా పని చెయ్యటానికి కొన్ని పోషకాలు చాలా అవసరం. శరీరంలోని మిగతా అవయవాల మాదిరిగానే శక్తి లేకపోతే మెదడు కూడా పనిచేయలేదు. అందువల్ల దంపుడు బియ్యం, రాగులు, సజ్జలు, జొన్నలు, చేపలు, టమోటాలు, ఆకుకూరలు, చికెన్, గుడ్లు, అరటి, బ్రకోలీ వంటివి తీసుకోవటం మంచిది.

దసరా చెప్పే కబుర్లు..

భారతీయ జీవనంలో పండుగలు ముఖ్యమైన భూమికలు. అవి మన జీవితాల్లో సందడిని మాత్రమే కాదు. మనసుల్లోకి వెలుగుని కూడా తీసుకువస్తాయి. అలా దసరా నేర్పే కొన్ని మంచి విషయాలు…   దశహర: రావణాసురుడిని రాముడు దసరా రోజునే సంహరించాడట. దశ కంఠుని హరించాడు కాబట్టి `దశ హర` అనే పేరుమీదుగా దసరా వచ్చిందని కూడా ఓ నమ్మకం. ఇంతకీ రావణాసురునికి పదితలకాయల వెనుక ఏదన్నా అంతరార్థం ఉందా అంటే ఒక్కొక్కరూ తమకి తోచిన జవాబుని చెబుతారు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల (మొత్తం కలిపి 10) మీదా అదుపులేనివాడు అన్న సూచనే పది తలలు అని కొందరు; అరిషడ్వర్గాలతో పాటు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలకి పది తలలు ప్రతీక అని మరి కొందరు అంటారు. ఎవరు ఎలా నిర్వచించినా రావణాసురుడు విపరీతమైన అహంకారానికి ప్రతీక అన్నది మాత్రం అందరూ ఒప్పుకునేదే! అలాంటి విపరీతమైన అహంకారం మన పీకలమీదకి వస్తుందనీ, ఆ అహంకారాన్ని జయించిన ప్రతివాడూ దైవసమానుడనీ తెలియచేస్తుంది దసరా!   మహిషాసురుడు: ఒకరిలో చలనం లేకపోతే `దున్నపోతు మీద వానపడినట్లు` అంటాము. ఒకరిలో సంస్కారం లేకపోతే `మనిషా దున్నపోతా!` అని తిట్టుకుంటాం. మొత్తానికి మందకొడితనం, అజ్ఞానం, విచక్షణ లేకపోవడానికి మనం దున్నపోతునే ఉదాహరణగా తీసుకుంటాం. అలాంటి మహిషంతో అమ్మవారు తలపడిన రోజులే ఈ నవరాత్రులు. మన జీవితాల్లోనూ మహిషానికి ప్రతిరూపాలైన లక్షణాలను తరిమికొట్టాలని ఈ పండుగ చెబుతోంది. స్పందించే గుణం, వివేకం లేకపోతే మన జీవితాలు వృథాగా వెల్లమారిపోతాయి కదా!     అజ్ఞాతవాసం: మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసాన్ని మరో ఏడు అజ్ఞాతవాసాన్నీ గడిపారు. ఎవరికీ అనుమానం రాకుండా అజ్ఞాతంలో గడపడం కోసం విరాటరాజు కొలువులో, అత్యంత దీనమైన జీవితాలను గడిపారు పాండవులు. దసరా నాడే వారి అజ్ఞాతవాసం ముగిసిపోయింది. అదే సమయంలో విరాటనగరం మీదకి దండెత్తి వచ్చిన కౌరవులను ఎదుర్కొనేందుకు జమ్మిచెట్టు మీద దాచుకున్న తమ ఆయుధాలను బయటకు తీశారు. ఈ సందర్భాన్ని స్మరించుకుంటూ ఆయుధపూజను చేయడం పరిపాటి. ఎంతటివారికైనా కష్టాలు రాక మానవు. వాటిని అధిగమించి తిరిగి తమతమ శక్తులను కూడగట్టుకోవాలన్నది ఆయుధపూజ చెబుతున్న మాట!     దసర/సరద: తెలుగులోని పదాలకు దీర్ఘాలు, ఒత్తులు ఉండటం వల్ల వాటిని`జంబిల్‌` చేసే అవకాశం తక్కువ. కానీ దసర అన్న పదాన్ని జంబిల్‌ చేస్తే సరద అని వస్తుంది. దసరా అంటేనే లోకం మొత్తానికీ సరదా కదా! అటు వానాకాలం, ఇటు చలికాలం కాకుండా ప్రకృతి మొత్తం ఆహ్లాదంగా ఉంటుంది. పండుగకి పుట్టిళ్లు చేరుకున్న ఆడపడుచులతో గడపలన్నీ కళకళలాడతాయి. ప్రతీ ప్రాంతం వాళ్లూ తమకి తోచిన రీతిలో పండుగను జరుపుకొంటారు. తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు, విజయనగరంలో సిరిమాను సంబరాలు, కృష్ణాజిల్లాలో శక్తిపటాలు, బెంగాల్లో అమ్మవారి పందిళ్లు, తమిళనాడులో బొమ్మల కొలువులు… ఇలా పదిరోజుల పండుగని ధూంధాంగా చేసుకుంటారు జనం. ఆ పండుగ సందడి కలకాలం నిలవాలనీ, జీవితం సరదా సరదాగా గడిచిపోవాలనీ కోరుకుంటోంది దసర!   - నిర్జర.

పిల్లలు టీవీ చూస్తే ఫర్వాలేదా!

  ఒక రెండు దశాబ్దాల క్రితం మన ఇళ్లలో టీవీ పాత్ర చాలా తక్కువగా ఉండేది. అప్పట్లో టీవీ అంటే దూరదర్శనే. కానీ ఇప్పుడో! వందలకొద్దీ ఛానెల్స్‌ వచ్చేసాయి. రోజంతా చూసినా తనివితీరనన్ని కార్యక్రమాలు వాటిలో ప్రసారంఅవుతున్నాయి. అందుకనే ఇప్పుడు టీవీ మన జీవితాలని శాసించేంత స్థాయికి చేరుకుంది. పెద్దవారంటే తమ విచక్షణని అనుసరించి టీవీ చూస్తారు. కానీ అభం శుభం తెలియని పిల్లల సంగతో! అందుకే వారి విషయంలో టీవీ ప్రభావాన్ని తగ్గించేందుకు మనం గట్టి ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది.   కారణం ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక కార్యక్రమం వస్తూ ఉండటమో, పిల్లలని ఆడించేంత ఓపిక పెద్దవారికి లేకపోవడమో, తల్లిందండ్రులిద్దరూ ఉద్యోగ బాధ్యతలలో మునిగిపోవడమో... ఇలా కారణం ఏదైతేనేం పిల్లలు టీవీలకు అతుక్కుపోతున్నారు. నిజానికి రెండేళ్లలోపు పిల్లలు అసలు టీవీ జోలికే పోకూడదనీ, రెండేళ్లు దాటిన పిల్లలు రెండుగంటలకు మించి టీవీ చూడకూడదనీ నిపుణులు సూచిస్తున్నారు. అది వారిలో అనారోగ్య సమస్యలని సృష్టించడమే కాకుండా శారీరిక, మానసిక ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఇవీ సమస్యలు!     - నిరంతరం టీవీ ముందు కూర్చునే పిల్లలు తమకు తెలియకుండానే ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఇలా కదలకుండా మెదలకుండా పై నుంచి ఏదో చిరుతిండిని ఆరగిస్తూ ఉండటం వల్ల వారు ఊబకాయం బారిన పడతారు.   - టీవీలో పాత్రలని అనుసరించడం వల్ల వారిలో హింసాత్మక ధోరణులు పెరిగే ప్రమాదం ఉంది. ఆఖరికి టామ్ అండ్‌ జెర్రీలోని పిల్లీ, ఎలుకా కొట్టుకునే సన్నివేశాలు కూడా వారి మీద ప్రతికూల ప్రభావం చూపుతాయి.   - తాము టీవీలో చూస్తున్నదానిలో ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ వారికి ఉండదు. సిగిరెట్లు తాగడం, బాణాలు వేసుకోవడం, గోడ మీద నుంచి దూకడం, అత్యాచారం చేయడం వంటి పనులలో ఉండే నైతికతనీ, ప్రమాదాన్నీ బేరీజు వేసుకోకుండానే వాటిని అనుసరించే ప్రమాదం ఉంది.   - టీవీ ప్రకటనలు పిల్లల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. పనికిమాలిన చిరుతిళ్లను ఆకర్షణీయంగా, ఉపయోగం లేని వస్తువులను అవసరంగా చిత్రీకరించి పిల్లలను ఆకర్షిస్తాయి. పిల్లలు అలాంటి వస్తువులను కొనాలని మారం చేయడం, వాటికి అలవాటుపడిపోవడం మనం తరచూ చూసేదే!     ఇవీ పరిష్కరాలు! - పిల్లలలో ఆసక్తినీ, విజ్ఞానాన్నీ పెంచేలా ఏదన్నా వ్యాపకాన్ని అలవాటు చేసే ప్రయత్నం చేయడం.   - పిల్లలు మనల్ని అనుసరిస్తారు కాబట్టి వారి ముందు అనవసరంగా టీవీ చూస్తూనో, అభ్యంతరకరమైన కార్యక్రమాలు చూస్తూనో కాలం గడపకూడదు. అలా పిల్లలకి ఒక మంచి ఉదాహరణగా మనమే నిలవాల్సి ఉంటుంది.   - పిల్లలు తరచూ ఎలాంటి కార్యక్రమాలు చూస్తున్నారు. అవి వారి వయసుకి, ఆలోచనకీ తగినవా కాదా అని గమనించుకోవడం.   - పిల్లలు టీవీకి తగినంత దూరంగా కూర్చుంటున్నారా, మధ్యమధ్యలో తగినంత విరామం ఇస్తున్నారా అన్న విషయాలను గుర్తించాలి.   - రోజు మొత్తంలో ఇంతసేపు మాత్రమే టీవీ చూడాలి అన్న నిబంధనను వారికి స్పష్టం చేయడంతో వారు ఆ కాస్త సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాలి.   - హోంవర్కు చేసిన తరువాతనే, అన్నం తిన్న తరువాతనే... వంటి మాటలతో టీవీ వారి దినచర్యని అడ్డుకోకుండా చూడాలి.   - పిల్లవాడికి టీవీ ఒక వ్యసనంగా మారిపోతే ఆ పరిస్థితిని తేలికగా తీసుకోకూడదు. అతిగా టీవీ చూడటం వల్ల వచ్చే అనర్థాలను వివరించి....  నయానో భయానో అతని అలవాటు అదుపులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి.   టీవీ ఒక తప్పించుకోలేని సౌకర్యం. అలవాటు కనుక అదుపులో ఉంటే పిల్లల వినోదానికీ, విజ్ఞానానికీ, లోకజ్ఞానానికీ... టీవీని మించిన చవకబారు సాధనం కనిపించదు. లేకపోతే మాత్రం వారి జీవితాంతం వేధించే దుష్ఫ్రభావాలు తప్పవు. ఫలితం ఎలా ఉండాలన్నది మన చేతుల్లోనే ఉంది!   - నిర్జర.

మనిషిని జైల్లో ఉంచితే

మనిషి ఈ విశ్వంలోని రహస్యాలు ఎన్నింటినో ఛేదించి ఉండవచ్చు. కానీ అతని మనసులో ఉన్న మర్మం మాత్రం ఎప్పటికప్పుడు కొత్త విషయాలను వెల్లడిస్తూనే ఉంది. మనిషి మనసులోని ఈ లోతులను గమనించేందుకు ఎన్నో పరిశోధనలు సాగాయి. వాటిలో అత్యంత ఆసక్తికరమైనదీ, వివాదాస్పదమైనదీ ‘The Stanford Prison Experiment’. 1971లో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ‘ఫిలిప్ జింబార్డో’ రూపొందించిన ఈ పరిశోధన ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. మనస్తత్వ శాస్త్రం గురించి రాసే ప్రతి పాఠ్యపుస్తకంలోనూ దీని ప్రస్తావన తప్పక కనిపిస్తుంది. తమ చుట్టూ ఉన్న పరిస్థితుల ఆధారంగా మనుషుల ప్రవర్తనలో మార్పులు వస్తాయా? అధికారం తలకెక్కితే మనిషి ఎలా ప్రవర్తిస్తాడు? అన్న ప్రశ్నలకు జవాబులను వెతికేందుకు ఈ పరిశోధనను నిర్వహించారు. ఇందుకోసం జింబార్డో ఒక 24 మంది అభ్యర్ధులను ఎన్నుకొన్నారు. వీరిలో 12 మంది జైలు అధికారులుగానూ, మరో 12 మంది ఖైదీలు గానూ కొన్నాళ్లపాటు ఉండాలని నిర్దేశించారు. వీరంతా తమ పాత్రలను నిర్వహించేందుకు నిజంగానే జైలుని తలపించేలా స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని ఒక భవనం కింద ఓ తాత్కాలిక జైలుని ఏర్పాటుచేశారు. ఏర్పాట్లన్నీ తాత్కాలికంగానే జరిగినా నిజంగానే అక్కడి వాతావరణం అంతా జైలుని తలపించేలా చర్యలు తీసుకున్నారు. జైలు అధికారులుగా ఉన్నవారికి యూనిఫాం, సన్గ్లాసెస్, లాఠీలను అందించారు. ఇక ఖైదీలుగా ఎన్నుకొన్నవారిని వారి ఇంటి దగ్గరే అరెస్టు చేసి, వారి మీద అభియోగాలు మోపినట్లు పత్రాలను చూపించారు. విశ్వవిద్యాలయంలో ఉన్న ‘జైలు’ గదుల్లో వారిని బంధించి ఒక సంఖ్యని కూడా కేటాయించారు. దీంతో పూర్తిగా జైలు వాతావరణం సిద్ధమైపోయింది. ఇక అక్కడ ఉండేవారు ఎలా ప్రవర్తిస్తారు అని గమనించడమే తరువాయి. జైలు అధికారులను పర్యవేక్షించే సూపరింటెండెంటుగా స్వయంగా జింబార్డోనే రంగంలోకి దిగారు. అప్పటి నుంచీ అసలు కథ మొదలైంది... జైల్లో ఉండే ఖైదీల మీద చేయి చేసుకోకూడదని మొదట్లోనే జైలు అధికారులందరికీ సూచనలను అందించారు. కానీ తాము అధికారులు, ఖైదీలుగా ఉన్నవారు బలహీనులు అనే అభిప్రాయాన్ని తెచ్చేందుకు ప్రయత్నించవచ్చునని చెప్పారు. ఇలా ఓ రెండువారాల పాటు ఈ పరిశోధనన నిర్వహించాలని అనుకున్నారు. కానీ పరిశోధన మొదలైన రెండోరోజునే పరిస్థితులు విషమించసాగాయి. ‘జైలు’లో ఉన్న ఖైదీలు ‘తిరుగుబాటు’ చేయడం మొదలుపెట్టారు. దానికి స్పందించిన జైలు ‘అధికారులు’ నిప్పుని ఆర్పే గ్యాస్ని వారి మీదకి వదిలి ఆ తిరుగుబాటుని అణిచివేశారు. రోజులు గడిచేకొద్దీ జైలులో ఉన్నవారంతా నటించడం మానేసి జీవించడం మొదలుపెట్టారు. రోజురోజుకీ గార్డులు అతి క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. మలమూత్రాలను సరిగా శుభ్రం చేయించకుండా అలాగే ఖైదీల గదిలో ఉంచేయడం, మంచాలను ఎత్తించేసి నేల మీదే పడుకునేలా చేయడం, ఒంటరిగా చీకటి గదులలో బంధించడం, నగ్నంగా ఉంచడం వంటి నానావిధాల హింసలను మొదలుపెట్టారు. ఈ అకృత్యాలను కొందరు ఖైదీలు నిశ్శబ్దంగా భరించగా, మరికొందరు తిరగబడేవారు. తిరగబడినవారికి మరిన్ని శిక్షలే దక్కేవి! విచిత్రం ఏమిటంటే పరిశోధనను రూపకల్పన చేసిన జింబార్డో కూడా నిజమైన జైలు అధికారిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఒక ఆరు రోజులు గడిచేసరికి ఇక ఈ పరిశోధనని సాగించడం ప్రమాదకరం అని తేలిపోయింది. పరిశోధనని గమనించేందుకు బయట నుంచి వచ్చిన ఒక విద్యార్థిని పరిస్థితులు విషమిస్తున్నాయంటూ జింబార్డోకి తలంటడంతో అర్ధంతరంగా దీనిని విరమించారు. తామంతా ఒక పరిశోధనలో భాగంగా ఉన్నామనీ, తమ చర్యలను వీడియో తీస్తున్నారనీ తెలిసినా కూడా జైలులో ఉన్నవారి ప్రవర్తన అదుపుతప్పడం పలు పాఠాలను నేర్పింది. మనిషి తన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తన ప్రవర్తనను మలుచుకుంటాడనీ, అధికారం అతడిని రాతిగుండెగా మార్చివేస్తుందనీ ఈ పరిశోధనతో తేలిపోయింది. స్టాన్ఫోర్డ్ పరిశోధన ఆధారంగా పలు నివేదికలు రూపొందాయి, పలు డాక్యుమెంటరీలు రూపొందాయి. గత ఏడాది ఒక హాలీవుడ్ చిత్రం కూడా విడుదలైంది. ఈ పరిశోధన ఆధారంగా అమెరికాలో ఖైదీలను విచారించే తీరులోనూ, వారిని జైల్లో ఉంచే పద్ధతులలోనూ పలు మార్పులను తీసుకువచ్చారు. కానీ అధికారులు కఠినాతికఠినంగా ప్రవర్తించే ప్రతిసారీ ఈ పరిశోధన గుర్తుకురాక మానదు.   - నిర్జర.

The Boiling Frog Theory

  From centuries together, many theories have been put forward to evaluate human psychology. And the Theory of Boiling Frog is one such experiment. Some people call it as mere metaphor and some believe in it... but everyone feels that there is an important message to be learnt from the story.   The Theory If you keep a frog in the boiling water, it would immediately jump out of the water. But if you keep in cold water and start boiling, the frog would not notice the danger. By the time it realises the danger, it gets succumbed by the heat. Several experiments have been done to decide the truth in this theory. In one such experiment, when the temperature was raised slowly at the rate of 0.002°C per second... the frog was found dead after 2½ hours.   The Reason Humans try to maintain constant temperature irrespective of their surroundings. But frogs have the ability of changing their body temperatures according to the atmosphere around them. So, by the time frog realises that it is too hot to adapt to the boiling water, enough damage would be done to its reflexes which disable it to get out.   The Truth Scientists in the past claimed to have proved the theory to be perfect. But modern naturalists have several objections to such claims. From temperatures to the behaviour of the frog... experts now have many doubts over the validity of the theory. Some conversationalists also allege that this theory would mislead people about nature.   The Lessons The frog might jump out of the gradually boiling water or it might won’t. But this theory has some important lessons for us.   - The circumstances around us may not seem to be threatening, but we have to be watchful about the slightest of the changes.   - Any decision that is not taken in time might sometimes close the door forever.   - Most of our weaknesses are like the gradually boiling water. We may not feel the loss initially, and by the time we realise our mistake... we find ourselves neck deep in the trouble.   - We live in a complex society. And we have to decide when to adjust, when to adopt and when to quit? Such decisions guide the course of our lives.   - Some people around us are like boiling water. They keep exploiting us unless our strength gets drained off without our awareness. We have to be vigilant about such people.     - Nirjara.

Why should we save WATER

  Water is the only substance on earth found in all three states i.e., solid, liquid and gas. And it is often described as the nector of life. But people often ignore the importance of water unless they feel the heat of its scarcity. Here are some of the facts about the role of water in our daily lives and the ways to save it   - 60% of our body constitutes water. Water helps to regulate out body temperature; lubricate the joints; moisture the tissues; carry nutrients through blood and digest the food. In short... we can’t imagine humans without water.   - Though we gain some water through meals and fruits, at least 2 litres of additional water is said to be needed to stay healthy. This means that we should be drinking atleast 8 glasses of water... especially in the summer.   - Water constitutes over 70 percent of the earth; much of it can't serve the purpose of humans. 90% of water is either in the form of salt water which we can't drink or in the form of glaciers which we can't utilise.   - With the rapid increase in the population and industries, the resources of drinking water are getting scant. We are failing in tapping the rain water, reusing the drain and avoiding the wastage. In short, we haven’t yet mastered of water management. By now it might be clear that if we waste the limited water resources, our own future would be in chaos. The following precautions would certainly save gallons of water every year...   - Take bath with a mug instead of a shower. This alone could save at least 10 litres of water per day! And if you are addicted to shower baths, use such showers which consume less water.   - Don't leave the water running from the faucet while you are brushing or washing your hands.   - If you find a leak, how tiny it might be... get it fixed. A drip of leak every second is in fact a few litres per day!   - If you love to water your garden, do it with a device that consumes least amount of water. Further, devices such as sprinklers could save a lot of water without harming the purpose.   - Never spill the water left in your glass or buckets. Let it be used for some other purpose.   - People often use water to clean the sheds and the corridors. This could involve a lot of water which can be substituted by just a... broom!   - We might get a lot of waste water from the water purifiers. Such water can be used for watering the plants or flushing the toilets.   These are just a few ways to save water. But the list can be extended forever. In every manner you utilise the water, there is a way to save a part of it.   - Nirjara.

ఏ బహుమతి ఇవ్వాలి?

  తమ ఆప్యాయతనీ, అభినందలనీ తెలియచేసేందుకు చాలామంది బహుమతులనే మార్గంగా ఎంచుకొంటారు. కానీ ఎలాంటి బహుమతిని అందచేయాలన్నది ఎప్పుడూ ఒక సమస్యగానే తోస్తుంటుంది. ఫలితం! డబ్బులు ఖర్చుపెట్టి, సమయాన్ని వెచ్చింది ఏదో ఒక బహుమతిని కొనేస్తుంటారు. దాంతో ఇటు బహుమతిని ఇచ్చేవారికీ, పుచ్చుకునేవారికీ కూడా అసంతృప్తే మిగులుతుంది. అందుకే పెద్దలు చెప్పే కొన్ని సూత్రాలను పాటిస్తే బహుమతి ఇవ్వడం కూడా మంచి అనుభవంగా మిగిలిపోతుంది...   అభిరుచిని అనుసరించి కొందరికి పుస్తకాలంటే ఇష్టం, కొందరికి పెర్‌ఫ్యూమ్‌ బాటిల్స్ అంటే ప్రాణం. బొమ్మలను సేకరించేవారు కొందరైతే పాటలంటే చెవి కోసుకునేవారు మరికొందరు. ఇలాంటివారికి వారి అభిరుచిని తగిన బహుమతిని ఇస్తే చాలా సంతోషిస్తారు. ఒకవేళ అలా కుదరకపోయినా, అభిరుచికి పూర్తి విరుద్ధమైన బహుమతులను ఇవ్వడం కంటే ఒక గులాబీ పువ్వుని చేతిలో పెట్టడం మేలు.   సందర్భాన్ని బట్టి మనం ఏ సందర్భానికి బహుమతిని అందించాలనుకుంటున్నాం అనేది మన నిర్ణయాన్ని ప్రభావితం చేయవలసిన అంశం. కొత్త సంవత్సరం వేడుకల దగ్గర్నుంచీ పెళ్లిరోజుల వరకూ సందర్భాన్ని బట్టి బహుమతిని ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా న్యూ ఇయర్‌ రోజున పాల పీకనీ, పెళ్లిరోజున యాపిల్‌ పళ్లనీ ఇస్తే అవతలివారిని వేళాకోళం చేసినట్లే అవుతుంది. ఒకోసారి పుష్టగుచ్ఛం ఇస్తే సరిపోవచ్చు, ఒకోసారి బంగారు గొలుసు ఇస్తే బాగుండు అనిపించవచ్చు. ఎప్పుడు ఎలాంటి బహుమతి ఇవ్వాలి అన్నది ఆయా సందర్భాల మీద ఆధారపడి ఉంటుంది.   బడ్జట్‌ని దృష్టిలో ఉంచుకొని అవతలివారి దగ్గర ప్రశంసలు పొందడం కోసం భారీబడ్జట్‌ బహుమతులు అందించి చాలామంది చేతులు కాల్చుకుంటూ ఉంటారు. ఖరీదైన బహుమతికంటే మంచి బహుమతి ఇవ్వడం మేలన్న విషయం వారికి బోధపడదు. పైగా ఉన్నతాధికారులు, ధనవంతుల మెప్పు కోసం ఇచ్చే భారీబహుమతులు వారి కంటికి ఎలాగూ ఆనవు. కాబట్టి బహుమతిని కొనేటప్పుడు మన స్తోమతను దృష్టిలో ఉంచుకోవాలి. అది మన సృజనను ప్రతిబించేలా, అవతలి వారికి ఉపయోగపడేలా ఉండాలి. అంతేకానీ ఆర్భాటానికి చిహ్నంగా మిగిలిపోకూడదు.   మొక్కుబడులు వద్దు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి కదా అని చాలామంది ఇంట్లో చేతికందిన వస్తువుని చుట్టచుట్టి ఇచ్చేస్తూ ఉంటారు. మరికొందరు తమ దగ్గర పోగైన బహుమతులనే చేతులు మారుస్తూ ఉంటారు. బహుమతి అనేది తప్పనిసరి తతంగంగానో, వస్తువులను వదిలించుకునే తంతుగానో సాగితే ఎవరికీ ఉపయోగం ఉండదు. దానివల్ల అవతలివారి మనసులో మన పట్ల వ్యతిరేక అభిప్రాయం ఏర్పడే ప్రమాదమూ లేకపోదు.   ఏదీ తోచకపోతే! కొన్ని సందర్భాలలో ఏ బహుమతి తీసుకోవాలో ఎంతకీ స్ఫురించకపోవచ్చు. అవతలివారితో అంతగా పరిచయం లేకపోవడమో, వారి అభిరుచులు తెలియకపోవడమో దీనికి కారణం కావచ్చు. అలాంటప్పుడు వారి వయసుకి తగిన వస్తువుని బహుకరించేయవచ్చు. అదీ కాదంటే అందరికీ ఉపయోగపడేలాంటి వస్తువునీ కొనిపెట్టవచ్చు. ఇక ఏదీ తోచని పక్షంలో మన బడ్జెట్‌కు తగిన డబ్బుని ఓ కవర్లో పెట్టి ఇవ్వడమే ఉత్తమమైన మార్గంగా మిగిలిపోతుంది.   - నిర్జర. 

For a Faster Computer

How often we click the refresh command to let our computers work faster. But do you know that, refreshing the computer has nothing to do with refreshing its memory? The refresh command would only rearrange the desktop to include the latest changes. It’s funny to watch even the learned computer techies constantly pressing the F5 button to refresh the system. Here are a few practical solutions that might fasten your system…. And using the `Refresh` command is not included among them!   RAM: RAM as you are aware is the temporary memory of a system. In cases like browsing the net, the capacity of RAM certainly affects the speed of our work. Most of the motherboards contain the slot for an additional RAM. Including an additional RAM might certainly boost the working of a system. And it won’t cost much! A RAM of 512 MB might have been a better option a decade ago… but with the changing needs and the updated versions of the browsers, a RAM above 2 GB is desirable.   Antivirus: The Antivirus though is an effective way to combat the malware that attacks our computers… might slow our computers. Apart from taking a lot of memory to store the definitions of viruses, they need regular updates to be effective. Programs related to antivirus might often start up along with the computer and keep running. So if you find your antivirus as a culprit in slowing down your system, try to change its settings. Even if that doesn’t work, better install a different antivirus.   Defragmentation:     The data stored on our hard disk might be scattered throughout the disk. Disk defragmentation would reassemble it in order. Such a procedure would speed up the performance to a certain extent, particularly in cases where there are numerous folders in our computer. But running Disk defragmentation quite often might shorten the life of our hard disk. In some cases it might even damage some files permanently.  So opt for the defragmentation once a while when you are sure that there aren’t any important files on your hard disk.   Disc cleanup:     Disc clean up is a better option than Defragmentation. It would delete the unnecessary files such as internet cache, temporary files etc. You can find the option among the system tools folder in the windows o/s. However a few softwares like CC cleaner are available on net for free download, which are much effective. But beware of choosing the options while running a cleaner. It’s always a safe choice not to go for a change in the registry of the computer.   Unused files and programs: We often dump our hard disk with numerous files and never care to review them. Too much of data on desktop and internal disks can certainly be time consuming for the processor. Likewise programs that are useless should better be uninstalled. We even ignore that too much data dumped in the `Recycle bin` would also affect our storage. So, better empty our recycle bin often. Deleting the temporary files would also save some space for us. Press the windows button and ‘R’ button to start the command prompt. Type `%temp%` in the command space and click OK to see a bunch of temporary files resting in idle. You can safely and certainly delete them.   These are few measures that might certainly boost up the speed of our computer. However when you are about to perform a task that needs much speed, it’s better to restart your computer. That would certainly refresh your RAM (not the F5 button!).  If your system seems to be dumped with too much of data and updates, formatting it after having a backup of the data would rejuvenate your processor and hard disk.   --Nirjara

గాంధీ మెచ్చిన సుబ్బులక్ష్మి స్వరం

  ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి జీవితాన్ని పరిచయం చేయాలనే ప్రయత్నం, సాగరాన్ని గుప్పిట్లో బంధించడంలాంటిది. కర్ణాటక సంగీతానికి పర్యాయపదంగా, భక్తి సంగీతానికి నిర్వచనంగా నిలిచిన ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి శతజయంతి సందర్భంగా ఆమె ప్రతిభను చాటే ఒక ఉదంతాన్ని తెలుసుకోవడం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది.   ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి తన పదకొండవ ఏట నుంచే సంగీత ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆమె చేసే ఒకో సంగీత కచేరీతో ఆమె గాత్ర మాధుర్యం లోకమంతా విస్తరించడం మొదలైంది. ఇక 1947లో హిందీలో వచ్చిన మీరాబాయి చిత్రంలో ఆమె పాడిన భజనలతో ఎమ్మెస్‌ దేశవ్యాప్తంగా సంగీతసంచలనంగా మారిపోయారు. ఆ చిత్రంలో ఎమ్మెస్‌ పాడిన పాటలకు ముగ్ధులైపోయిన జవహర్‌లాల్‌ నెహ్రూ ‘నేను కేవలం ఒక ప్రధానమంత్రిని మాత్రమే! సంగీతానికి రాణి అయిన ఆమె ముందు నేనెంత?’ అనేశారు.   ఇంచుమించు అదే సమయంలో సుబ్బులక్ష్మి భర్త సదాశివంగారికి గాంధీగారి నుంచి ఒక ఫోన్‌ వచ్చింది. బహుశా గాంధీగారు మీరాబాయి చిత్రంలోని పాటలను విన్నారో ఏమో... తనకు ఇష్టమైన ఒక మీరాబాయి భజనను ఎమ్మెస్‌ గాత్రంలో వినాలని ఉందని ఆయన కోరారు. అయితే ఎమ్మెస్‌ ఆ కోరికను సున్నితంగా తిరస్కరించారు. గాంధీగారు కోరుకుంటున్న ఆ భజన తనకు అంతగా పరిచయం లేదనీ, దానికి తాను న్యాయం చేయలేననీ ఎమ్మెస్ భయం. అయితే ఆ సాయంత్రం నేరుగా గాంధీగారి నుంచే మరో ఫోను వచ్చింది. ఎమ్మెస్ ఆ భజనను పాడాల్సిన అవసరం లేదనీ, కనీసం ఆమె దానిని చదివినా తనకు తృప్తిగా ఉంటుందనీ ఆయన అన్నారు. గాంధీగారు అంతగా కోరుకోవడంతో, రాత్రికిరాత్రే ఎమ్మెస్‌ ఆ భజనను రికార్డు చేసి దిల్లీకి పంపారు.   ఈ ఘటన జరిగిన కొద్ది నెలల తరువాత ఎమ్మెస్ ఒక రోజు రేడియోలో వార్తలను వింటున్నారు. ఆ రోజు 1948 జనవరి 30. గాంధీని అత్యంత దారుణంగా కాల్చి చంపిన రోజు. రేడియోలో ఆ వార్తని వింటూనే ఎమ్మెస్ మ్రాన్పడిపోయారు. ఆ వార్తని వినిపించిన వెంటనే రేడియోలో తాను గాంధిగారి కోసమని పాడిన మీరా భజన ప్రసారం అయ్యింది. ఆ భజన వినడంతోనే ఎమ్మెస్ స్పృహ కోల్పోయారు. ఆ తరువాత కాలంలో ఎమ్మెస్‌ తరచూ ఈ సంఘటనలన్నింటినీ కన్నీటితో గుర్తుచేసుకునేవారట.   గాంధీ అంతటివారు అంతగా కోరి పాడించుకున్న ఆ భజన ‘హరి తుమ్‌ హరో’ (hari tum haro). యూట్యూబ్‌లో ఆ భజనని ఎవరైనా వినవచ్చు. దేశాన్ని నడిపించే నేతలైనా, ప్రపంచాన్ని నడిపించే నాయకులైనా... కళలకు కరిగిపోక తప్పదని ఈ ఉదంతం నిరూపిస్తుంది. ఎవరితోనైనా చివరివరకూ తోడుగా నిలిచేది ఆ కళే అని చాటి చెబుతోంది.   - నిర్జర.

రక్తాన్ని బట్టి మనస్తత్వం చెప్పేస్తారు

  తెలుగు హీరోలు తరచూ తమ రక్తానికి ఉన్న మహిమ గురించి పుంఖానుపుంఖాలుగా డైలాగులు చెబుతూ ఉంటారు. అసలు రక్తాన్ని బట్టి పౌరుషం ఉంటుందా? ఒక మనిషి రక్తాన్ని బట్టి అతని గుణగణాలను అంచనా వేయవచ్చా అని ప్రేక్షకులు తల బాదుకోవచ్చుగాక! కానీ జపాన్‌, కొరియా, తైవాన్ వంటి కొన్న దేశాలలలో ఇలాంటి నమ్మకాలు చాలా విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి.   90 ఏళ్ల నమ్మకం మనిషి రక్తాన్ని A,B,O అనే మూడు రకాలుగా విభజించి వందేళ్లకు పైనే గడుస్తోంది. ఈ విభాగాలను చూసిన ‘టకేజీ ఫురుకవ’ అనే జపాను ప్రొఫెసరుగారికి ఓ వింత ఆలోచన వచ్చింది. వేర్వేరు మనుషులు వేర్వేరు బ్లడ్‌ గ్రూపులు ఉన్నట్లే, వేర్వేరు బ్లడ్‌ గ్రూపులు ఉన్నవారి గుణాలను కూడా అంచనా వేయవచ్చు కదా అన్నదే ఆ ఆలోచన. అనుకున్నదే తడవుగా టేకీజీగారు 1927లో ఓ పరిశోధనను వెలువరించారు.   పిచ్చిపిచ్చిగా నమ్మేశారు టకేజీగారి సిద్ధాంతాలని జపాను జనం మారు ప్రశ్నించకుండా నమ్మేశారు. అప్పటి జపాన్‌ ప్రభుత్వం ఈ బ్లడ్‌గ్రూపులను అనుసరించి సైనికులను నియమించడం వరకూ ఈ నమ్మకం ఎదిగిపోయింది. తరువాత కాలంలో ఈ నమ్మకం కొంత పలచబడింది. కానీ 1970వ దశకంలో ‘మసాహికో నోమి’ అనే ఓ జర్నలిస్టు ఈ సిద్ధాంతాన్ని బలపరుస్తూ ఏకంగా ఏడు పుస్తకాలు రాయడంతో మళ్లీ రక్త చరిత్ర మొదలైంది.   ఇవీ గుణాలు జపానువారి బ్లడ్‌గ్రూప్‌ సైకాలజీ ప్రకారం వివిధ బ్లడ్‌గ్రూపుల స్వభావం ఇలా చెప్పుకోవచ్చు... A – ఇది ఒక రైతుకి సరిపడే స్వభావాన్ని పోలి ఉంటుంది. ఈ బ్లడ్‌గ్రూపు ఉన్నవారు శాంతము, సహనము, బాధ్యత, నిజాయితీ, పట్టుదల కలిగి ఉంటారు. B – ఇది ఒక వేటగాడిని గుర్తుకుతెస్తుంది. ఈ తరహా బ్లడ్‌గ్రూప్‌ ఉన్నవారు బలంగా, సృజనాత్మకంగా, నిర్దాక్షిణ్యంగా, సమాజపు కట్టుబాట్లను ధిక్కరించేలా, ఆశావహంగా ఉంటారు. AB- ఇది ఒక మానవతావాదిని ప్రతిబింబిస్తుంది. AB బ్లడ్‌గ్రూపు ఉన్నవారు సమన్వయంగా, తార్కికంగా, నలుగురిలో కలిసిపోయేలా ప్రవర్తిస్తారు. కానీ వీరు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉండే అవకాశం లేకపోలేదు. O -  ఈ బ్లడ్‌గ్రూప్ లక్షణాలు ఒక యోధుని గుర్తుకుతెస్తాయి. ఆత్వవిశ్వాసం, స్వతంత్ర భావాలు కలిగి ఉండటం, ఉద్రేకం, ఏదన్నా సాధించాలనే తపన, స్వార్ధం, అనుమానం వీరి లక్షణాలు.   ఆధారాలు లేకపోయినా బ్లడ్‌గ్రూప్‌ ఆధారంగా ఒక వ్యక్తి మనస్తత్వాన్ని నిర్వచించేందుకు వందలాది పరిశోధనలు జరిగాయి. కానీ ఇప్పటివరకూ ఎవ్వరూ ఖచ్చితమైన ఆధారాలను చూపలేకపోయారు. కానీ మన దేశంలో రాశిఫలాలను ఎలా నమ్ముతారో జపాన్‌లో బ్లడ్‌గ్రూప్‌ ఆధారిత నమ్మకాలకు అంత ఆదరణ ఉంది. జపాన్‌లో ఎదుటివారి మనస్తత్వాన్ని అంచనా వేసేందుకు ‘మీ బ్లడ్‌గ్రూప్‌ ఏమిటి?’ అని అడగటం సర్వసాధారణం. పెళ్లిళ్లు చేసుకునేటప్పుడు, ఉద్యోగులను నియమించేటప్పుడు కూడా వారు బ్లడ్‌గ్రూప్ మీదే ఆధారపడతారు. బ్లడ్‌గ్రూప్‌ ఆధారంగా కొందరిని లోకువగా చూడటం, ఏడిపించడం వంటి సంఘటనలు కూడా వెలుగులోకి వస్తుంటాయి.    ఇదీ జపానువారి రక్తచరిత్ర! నిజంగా ఒకో బ్లడ్‌గ్రూపునకూ ఒకో స్వభావం ఉంటుందో లేదో తెలియదు కానీ... మీది ఫలానా బ్లడ్‌గ్రూప్‌ కాబట్టి ఫలానా లక్షణాలు ఉంటాయని ఎవరన్నా చెబితే, అది మన మనస్తత్వం మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. అంటే.. బ్లడ్‌గ్రూప్‌ సైకాలజీ నిజమైనా కాకపోయినా, దాన్ని నమ్మినవారు మాత్రం అలాగే ప్రవర్తిస్తారన్నమాట. ఇదో సైకాలజీ మరి!   - నిర్జర.