10 Hints for a Happy Journey

  Everyone loves to be on journey! And there are some time tested advises from our elders to be minded while we prepare for a journey. We may hate them… but can’t just ignore them. These are some of the suggestions we often receive to make our journey HAPPY.   - List out the things which would be of your daily need. From dawn to dusk, try to remember the accessories which are needed for a hassle free day. Many of us often forget the essentials like the toothbrush or a hanky!   - `Less luggage, more comfort’ is always a keyword for an easy journey! Our bag is not a teddy bear to stuff it. More luggages can often deliver painful experiences.   - You might have to pass through the crowd to reach the plane or the train. Make sure that you are along with your team all the way. And don’t lose the trail of your kids in such situations.   - It would always help to have the list of important contact numbers with us… jotted down on a paper. That might save us from the situations where we might lose our possessions and has to stare at the dead end.   - These are the days of unknown perils and unwanted checkups. So it turns compulsory to carry an identity card with us.   - Never get involved with the strangers. A few pleasantries might not be a risk. But avoid the conversation if someone starts asking the private questions. Never accept the food from the strangers if you are alone.   - Shopping is the byproduct of a journey. You see a lot of things that feast your eyes. But think before you decide to purchase it. Consult your family members before you grab something that is huge or expensive.   - You can find food everywhere while you are on a journey. But you can never be sure of its impact on your health. Food if poisoned can be disastrous to your health, and you are away from the home. So resist your temptation to eat every chunk that attracts you.   - Your journey might be to a tourist place or to the house of a relative. Keep following the etiquette for the situation.   - And finally keep an eye on your luggage. Don't let it to be misplaced. Above all... make sure that you are back to home in a happy and healthy mood. HAPPY JOURNEY!!!   - Nirjara.

స‌హ‌నం పెరిగితే... స‌మ‌యం త‌గ్గిపోతుంది

  జ‌పాన్‌లో ఒక కుర్ర‌వాడు ఉండేవాడు. అత‌నికి క‌త్తి విద్య నేర్చుకోవాల‌ని మ‌హా స‌ర‌దా! చుట్టు ప‌క్క‌ల‌వారంద‌రినీ వాక‌బు చేయ‌గా... ద‌గ్గ‌ర్లోని ఒక ప‌ట్ట‌ణంలో క‌త్తివిద్య‌లో ఆరితేరిన ఒక యోధుడు ఉన్నాడ‌ని తేలింది. వెంట‌నే మూటాముల్లే స‌ర్దుకుని ఆ యోధుడిని క‌లుసుకునేందుకు బ‌య‌ల్దేరాడు కుర్ర‌వాడు. ప‌ట్ట‌ణానికి చేరుకున్న త‌రువాత ఆ యోధుని ఇంటి ఆన‌వాలు ప‌ట్టుకోవ‌డం ఏమంత క‌ష్టం కాలేదు. ఆ యోధుని ఎదుట నిలిచిన కుర్ర‌వాడు `అయ్యా! నాకు క‌త్తిసామంటే ప్రాణం. మీరు ద‌య‌చేసి న‌న్ను శిష్యునిగా స్వీక‌రించి, ఆ క‌ళ‌ని నేర్పండి,` అంటూ ప్రాథేయ‌ప‌డ్డాడు.   `ఓస్‌! అదెంత ప‌ని,` అన్నాడు ఆ యోధుడు. `కాక‌పోతే ఆ క‌త్తిసాము మీద ప‌ట్టు సాధించాలంటే క‌నీసం ప‌దేళ్లు ప‌డుతుంది. ఫ‌ర్వాలేదా!` అని అడిగాడు. `ప‌దేళ్లే! నా తండ్రి ఇప్పుడిప్పుడే పెద్ద‌వాడు అవుతున్నాడు. నేను త్వ‌ర‌త్వ‌ర‌గా క‌త్తిసాముని నేర్చుకుని, ఆయ‌న వ్యాపారాన్ని అందుకోవాలి. కావాలంటే రోజూ తెల్ల‌వారే మీ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి రాత్రి పొద్దుపోయేదాకా క‌త్తిసాముని నేర్చుకుంటాను. అలా అయితే ఎన్నాళ్లు ప‌డుతుంది?` అని అడిగాడు కుర్ర‌వాడు.   యోధుడు ఒక్క నిమిషం సాలోచ‌న‌గా చూసి...`నువ్వు చెప్పిన ప్ర‌కారం క‌త్తిసాములో ప‌రిణ‌తిని పొందాలంటే ముప్ఫై ఏళ్లు ప‌డుతుంది,` అన్నాడు చిరున‌వ్వుతో. `అదేంటీ... స‌మ‌యాన్ని పొడిగించారు! రోజూ ప్ర‌యాణం చేయ‌డం వ‌ల్ల అల‌సిపోతాన‌న్న‌ది మీ ఉద్దేశం కాబోలు. అలా అయితే నేను ఎక్క‌డికీ వెళ్ల‌కుండా మీ ద‌గ్గ‌రే ఉండిపోయి క‌త్తిసాముని రాత్రింబ‌గ‌లూ నేర్చుకుంటాను. అలా అయితే నాకు విద్య ఎన్నిరోజుల‌లో ప‌రిపూర్ణంగా వ‌స్తుందంటారు?` అని అడిగాడు కుర్ర‌వాడు.   యోధుడు మ‌ళ్లీ సాలోచ‌న‌గా చూసి... `నువ్వు చెబుతున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం నీకు ప‌రిపూర్ణంగా క‌త్తిసాము రావాలంటే యాభై ఏళ్లు ప‌డుతుంది,` అన్నాడు. యోధుని మాట‌ల‌కు కుర్ర‌వాడి క‌డుపు మండిపోయింది. `అయ్యా! విద్య‌ని వెతుక్కుంటూ మీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాను క‌దా అని మీరు న‌న్ను అవ‌మానిస్తున్నారు. లేక‌పోతే నేర్చుకునే స‌మ‌యం పెంచుతున్న కొద్దీ ప‌రిపూర్ణ‌తి సాధించే వ్య‌వ‌ధి ఎలా పెరుగుతుంది?` అని కోపంగా అడిగాడు కుర్ర‌వాడు.   `నాయ‌నా నువ్వే విద్య‌ని అవ‌మానిస్తున్నావు!` శాంతంగా చెప్పుకొచ్చాడు యోధుడు. `నాకు నీలో, విద్య‌ని వీలైనంత త్వ‌ర‌గా నేర్చేసుకోవాల‌న్న అస‌హ‌నం క‌నిపిస్తోంది. ఆ అస‌హ‌న‌మే నీ ఏకాగ్ర‌త‌ని దెబ్బ‌తీస్తుంది. మ‌రి క‌త్తిసాముకి కావ‌ల్సింది ఆ ఏకాగ్ర‌తే క‌దా! అదే లోపించిన‌ప్పుడు నువ్వు మ‌రింత త్వ‌ర‌గా విద్య‌ని ఎలా గ్ర‌హిస్తావు. గ్ర‌హించినా అది అర‌కొర‌గా, అసంపూర్ణంగా... నీ అస‌హ‌నంలాగానే ఉంటుంది,` అని వివ‌రించారు గురువుగారు. గురువుగారి మాట‌ల‌తో కుర్ర‌వాడు త‌న‌లోని లోప‌మేమిటో అర్థ‌మైంది. ప‌దేళ్ల‌పాటు క‌త్తిసాముని నేర్చుకునేందుకు మ‌న‌స్ఫూర్తిగా సిద్ధ‌ప‌డ్డాడు. కానీ ఆశ్చ‌ర్యం! ఐదేళ్ల‌లోనే అత‌ను ఆ విద్య‌లో ప‌రిపూర్ణ‌త‌ని సాధించేశాడు.   (ప్ర‌చారంలో ఉన్న జాన‌ప‌ద క‌థ ఆధారంగా)   - నిర్జ‌ర‌.

10 Hints about Will Power

  `If there is a will there is a way` is a famous idiom in English! And if we go by that idiom… there might also be a `Way to improve our Will’. Here is the essence of what experts advice to increase our will power….   - Psychologists suggest that `Like memory, will power can also be strengthened! ‘ which means that people who feel that they are lower in will power can improve it through constant motivation and introspection.   - Meditation would help to keep our mind calm and focussed. Researches has proved that such a stable mind would lead us to a higher degree of will power.   - Taking a few deep breaths before accepting a challenge would also help us to be determined and stay focussed.   - Sleeping less than 6 hours a day would leave us with stress and lethargy. An active brain is an active way to sustain will power. So let us not leave our body and mind in hunger.   - Physical exercises would keep our mind and body fit for a goal. Physical workouts would increase the flow of oxygen to our brain and reduce the toxins in our body. They also release a chemical called endorphin which would help us in combating physical strain and keep us in a happy mood.   - Have a goal in your mind to achieve and be clear about your ambitions. That would give a purpose to your willpower.   - Placing deadlines to achieve your goal is really important. They would warn you to be committed. People often get trapped in the vicious circle of procrastination. We postpone things and things would get tough and appear bigger! Placing deadlines would break such habit.   - If you fail once, don't get depressed. If you fail again… keep working. But if you have failed thrice... assess the reason for the continuous failures. Take the help of your near and dear if needed.   - Be positive and be confident that you could achieve any reasonable target. And the 10th hint is… to believe in yourself! Believe that you can do anything under the sun, which can be achieved by a human!!!   ..Nirjara.

When The Blind Could See… Better!

  I see the same person while I travel in the same local train day after day, month after month, selling the radium charts filled with stars and planets which glow at night. People were too busy to purchase the charts, they are either in a rush to reach their offices or in an anxiety to get back to their homes, once in a while a child gets interested in the product and looks at his parent who discourages him with a negative nod. No one seems to be in a mood to purchase and they have another reason for their disinterest, the man looked ugly with two white spots in the place of two eyes – he was blind! Whatever his past might be, it must have been painful or else you don’t choose to be a hawker as a career – life forces you to be.   A man who can’t see the sun in the broad day light was selling stars that can be seen in the darkness, but the shapes of the objects and the light emitted by them doesn't form a part of his senses. He could only interact with this world by feeling it, he can’t say whether you are white or black, but could estimate your character through your words. He could not differentiate between gold and steel, but could feel the pain of metal that trips him on his way.   That day I was traveling back on the train for the last time in my life, I was thrown out of the office not to come back. My world’s seemed to be filled in darkness at that moment as if I’ve lost everything else along with my job, and there he is in my bogie, offering people to see stars at night, not humiliated by the annoyance of the passengers, not obstructed by the stumbles he meet on his way, not feared of falling from the train…day after day, season after season moving through the crowd offering them to see stars which he can’t, but could feel the hunger of a human and desperate to satisfy it.   That day I took the chart from him and placed the money in his hands, his face glowed like the stars he sold, he conquered the life for one more day, and I said to him before I left the train – “ Thanks for showing me the stars in the darkness.”   K.L.SURYA.

పిల్లవాడిని వదిలి వెళ్తున్నారా!

  ఇంట్లో పిల్లలని ఒంటరిగా వదిలి వెళ్లాలంటే ఎవరికి మాత్రం మనసు వస్తుంది. కానీ అనుకోకుండా ఓసారి ఏదన్నా ఆఫీసు పని మీదో, ఎవరినన్నా పరామర్శించడానికో పిల్లలని ఇంట్లోనే వదిలి వెళ్లాల్సి రావచ్చు. అందులోనూ పాపో, బాబో ఒక్కరే ఉంటే ఇక చెప్పనక్కర్లేదు. బయటకు వెళ్తామన్న మాటే కానీ మనసంతా వారి క్షేమం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ అలజడిని పూర్తిగా అడ్డుకోలేకపోవచ్చు కానీ, ఇంట్లో పిల్లలను వదిలి వెళ్లేటప్పుడు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక వారి క్షేమానికి గ్యారెంటీ ఇచ్చినట్లే అంటున్నారు పెద్దలు.   అందుబాటులో ప్రాణాంతకాలు చాలా ఇళ్లల్లో కత్తెర, చాకు, లైటరు, అగ్గపెట్టె.... లాంటి వస్తువులన్నీ ఎక్కడపడితే అక్కడ పడేసి ఉంటాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వీటిని చేజిక్కించుకున్న పిల్లలకి వాటితో ఏదన్నా సాహసం చేయాలన్న సరదా పుట్టడం సహజమే! అలాంటి సాహసాలే ఒకోసారి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటకు వెళ్లే ముందు ఒకసారి అలా ఇంట్లో కలియతిరగండి. ఇలాంటి వస్తువుల ఏమన్నా ఉంటే లోపల పడేయండి. గ్యాస్ స్టవ్‌ కట్టేసి ఉందా లేదా! గీజర్‌ వంటి వస్తువులు ఏవన్నా ఆన్‌లో ఉన్నాయేమో ఓసారి చూసుకుని బయల్దేరండి.   ఫోన్‌ నెంబర్లు ఇంట్లో పిల్లలకి, తల్లిదండ్రులు ఫోన్‌ నెంబర్లు గుర్తుంచుకునేలా చేయడం చాలా అవసరం. వీటిని బట్టీ పట్టించడంలో ఏ తప్పూ లేదు సరికదా, ఒకోసారి అ నెంబర్లే పిల్లవాడని ప్రమాదం నుంచి కాపాడవచ్చు కూడా! కాబట్టి అవసరం అయినప్పుడు మీ నెంబరుకి ఫోన్‌ చేయమని పిల్లవాడికి చెప్పి ఉంచండి. చాదస్తం అనుకోకుండా పోలీస్‌, ఫైర్‌, ఆంబులెన్స్‌ వంటి సర్వీసులకు సంబంధించిన నెంబర్లను కూడా అతనికి చెప్పి ఉంచండి.   అపరిచితులకు నో ఎంట్రీ! మరీ సన్నిహితులైతే ఇంటి తలుపులను బార్లా తెరిచి ఆహ్వానించకూడదన్న జాగ్రత్త పిల్లలకు అందించాలి. గ్రిల్స్‌ మాటు నుంచో, డోర్‌ చెయిన్ వెనుక నుంచో సమాధానం చెబితే సరిపోతుంది. వచ్చినవాళ్లు మరీ తమకి కావల్సిన జవాబుల కోసం పట్టుబడితే, మీకు ఫోన్‌ చేయమని సూచించండి. ఎవరూ లేని సమయంలో మొహమాటానికి పోయి, అపరిచితులను లోనికి రానిస్తే ఉపయోగం కాదు కదా ప్రమాదానికే అవకాశాలు ఎక్కువ.   గమనించేందుకు ఎవరన్నా... పిల్లలని ఒంటరిగా వదిలి వెళ్తున్న విషయం పొరుగువారికి తెలియచేసి, అప్పుడప్పుడూ కాస్త గమనించమని అభ్యర్థించడం మంచిది. దాని వల్ల వాళ్లూ కాస్త ఇంటిని గమనిస్తూ ఉంటారు, పిల్లలకూ తాము బుద్ధిగా మసలుకోవాలన్న జాగ్రత్తా ఉంటుంది. ఒకవేళ అలా కుదరని పక్షంలో మనమే మధ్యలో ఒకసారి ఇంటికి ఫోన్‌ చేసి పిల్లవాడు ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడేమో విచారిస్తే సరి!   ఏదన్నా వ్యాపకం... పిల్లలకు ఏదన్నా వ్యాపకాన్ని అందించి వెళ్తే వాళ్ల మనసు ఇక అటూ ఇటూ చెదరదు. ఒక ప్రాజెక్టువర్కో, పుస్తకమో, పిల్లల సినిమానో... ఇలా అతని ఏకాగ్రతని ఆకర్షించే పని ఏదాన్నా కల్పించి వెళ్తే మంచిది. ఇక వీలైతే అతని స్నేహితుని కూడా పిలుచుకొమ్మని చెబితే అటు కాలక్షేపానికీ, ఇటు భద్రతకీ లోటు ఉండదు.   - నిర్జర.

లాభనష్టాలు!

  భూటాన్ దేశంలో మిమి అనే పేద రైతు ఉండేవాడు. అవడానికి పేదవాడే అయినా తనకి ఉన్నదాంతో తృప్తి చెందేవాడు మిమి. ఎప్పుడు చూసినా సంతోషంగా, సంతృప్తిగా కనిపించేవాడు. అలాంటి మిమి ఓరోజు ఎప్పటిలాగే తన పొలంలో పని చేసుకోవడం మొదలుపెట్టాడు. అక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ పొలం చివర ఉండే ఓ ఎండిపోయిన మానుని చూడగానే, మిమికి కాస్త చిరాకు కలిగింది. ఇవాళ ఈ మానుని ఎలాగైనా సరే పీకిపారేయాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన గొడ్డలితో దాని మీద ప్రతాపమంతా చూపించడం మొదలుపెట్టాడు. ఆ రోజంతా మిమి ఆ మానుని పీకిపారేయాలనే తపనతో పనిచేశాడు. సాయంత్రం వేళకి అనుకున్నది సాధించాడు. ఆ మానుని కూకటివేళ్లతో సహా పెకిలించివేశాడు. కానీ ఆ గుంతలో చూసిన మిమి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. అక్కడ అతనికి ఒక పెద్ద పగడం కనిపించింది. సంతోషంగా ఆ పగడాన్ని తీసుకుని బయల్దేరాడు మిమి.   మిమి ఆ పగడాన్ని అమ్ముకుని వద్దామని అలా పట్నం వైపుగా సాగాడో లేదో... దారిలో ఒక గుర్రాన్ని ఎక్కి వస్తున్న భూస్వామి కనిపించాడు. ‘ఏమోయ్‌ మిమి! ఇంత సాయంత్రం వేళ పట్నానికి బయల్దేరుతున్నావేంటి?’ అని అడిగాడు భూస్వామి. మిమి జరిగిందంతా చెప్పి- ‘పట్నం దాకా ఎందుకు! మీ గుర్రాన్ని కనుక నాకు ఇస్తే, బదులుగా ఈ పగడాన్ని మీకు ఇచ్చేందుకు సిద్ధం!’ అనేశాడు.   మిమి ప్రతిపాదనకు భూస్వామికి మతిపోయింది. ఇంత లాభసాటి బేరం తనకు తగుల్తుందని భూస్వామి కలలో కూడా అనుకోలేదు. వెంటనే మారుమాటాడకుండా ఈ పగడాన్ని తీసుకుని గుర్రాన్ని మిమికి అందించాడు. మిమి ఆ గుర్రాన్ని ఎక్కి ఠీవిగా ఊరిలో తిరగడం మొదలుపెట్టాడు. ఇంతలో మిమికి సాటి రైతు ఒకడు ఎద్దు తీసుకుని కనిపించాడు. ‘ఏమోయ్ మిమి! ఎప్పుడూ లేనిది గుర్రం ఎక్కి తిరుగుతున్నావే! ఏంటి విషయం?’ అని అడిగాడు సాటి రైతు. మిమి అతనికి విషయమంతా చెప్పి ‘ఈ గుర్రాన్ని తీసుకుని ఆ ఎద్దుని నాకు ఇస్తావా!’ అని అడిగాడు. సాటి రైతు మనసులో మురుసుకుంటూ ఆ ప్రతిపాదనకు ఒప్పుకున్నాడు.   మిమి ఆ ఎద్దుని తీసుకుని తన ఇంటివైపుకి దారితీశాడు. ఇంతలో ఒక పొట్టేలుని తీసుకుని వెళ్తున్న తన నేస్తం కనిపించాడు. ‘ఏమోయ్‌ మిమి! ఎద్దుని కొనుక్కొని ఇప్పుడే వస్తున్నావా!’ అని అడిగాడు నేస్తం. మిమి అతనికి గతమంతా వివరించి ‘ఈ ఎద్దుని తీసుకుని ఆ పొట్టేలుని నాకు ఇస్తావా!’ అని అడిగాడు. నేస్తం సంతోషంగా ఆ ఎద్దుని తీసుకుని తన పొట్టేలుని అప్పగించాడు.   మిమి ఆ పొట్టేలుని తీసుకుని తన ఇంట్లోకి వెళ్తుండగా పొరుగింటాయన, ఆయన కోడీ కనిపించాయి. ‘ఏమనుకోకుండా ఈ పొట్టేలుని తీసుకుని ఆ కోడిని నాకు ఇస్తారా!’ అని అడిగాడు మిమి. పొరుగింటాయన సరేనన్నాడు. ఆ కోడిని చూసుకుని మురిసిపోతూ తన పెరట్లో కూర్చున్న మిమికి ఓ అందమైన పాట వినిపించింది. ఎవరో బైరాగి ఆ రాత్రివేళ పాటపాడుకుంటూ వెళ్తున్నాడు. ఆ పాట విన్న మిమికి భలే అనిపించింది. వెంటనే ఆ బైరాగిని తన ఇంటి ఆవరణలోకి పిలిచి ‘నువ్వు కనుక ఆ పాటను నాకు నేర్పితే... బదులుగా ఈ కోడిని నీకు సమర్పించుకుంటాను’ అని అభ్యర్థించాడు. బైరాగికి ఆ కోడిని చూడగానే నోరూరింది. ఓ పావుగంటలో తను పాడుతున్న పాటని మిమికి నేర్పేసి, కోడిని చంకలో పెట్టుకుని వెళ్లిపోయాడు. మిమి ఆ పాటను పాడుకుంటూ ఉండిపోయాడు.   ఈ కథలో మిమి చివరికి నష్టపోయాడని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే అతనికి లాభనష్టాల గురించిన ఆలోచన పెద్దగా లేదు. పైగా పాటలోనే అతనికి సుఖం లభించింది. కానీ మన దృక్పథం కనుక జీవితంలో స్థిరపడటం, వ్యవహారంలో లాభపడటం అయితే మిమి ఉదంతం ఒక గుణపాఠంగా తోస్తుంది. జీవితంలోకి ఎన్ని అమూల్యమైన అవకాశాలు వచ్చినా వాటిని చేజేతులారా నష్టపోయే ప్రమాదాలను తెలియచేస్తుంది.   (భూటాన్‌ జానపద కథ ఆధారంగా)   - నిర్జర.  

మన చేతలకు ఫలితం!

  అనగనగా ఓ రాజు! అతను ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే కరుణామయుడు కాదు. పరమ కర్కోటకుడు! ఈ రాజు పీడ ఎప్పుడు ఎలా విరగడ అవుతుందా అని జనమంతా తెగ ప్రార్థనలు చేసేవారు. కానీ ఏ ఒక్క ప్రార్థనకీ ఫలితం దక్కలేదు. ఇంతలో రాజు తన సమావేశ మందిరానికి మంత్రులందరినీ పిలిపించుకున్నాడు. హఠాత్తుగా ఈ సమావేశం ఎందుకా అనుకుంటూ మంత్రులంతా బిక్కుబిక్కుమంటూ మందిరానికి చేరుకున్నారు. ఆశ్చర్యం! రాజుగారి మొహం ఆవేళ ఎంతో ప్రసన్నంగా ఉంది. ఎప్పుడూ లేనిది కాస్త దయ కూడా కనిపిస్తోంది. ‘‘నేను ఇక మీదట నా ప్రవర్తనను మార్చుకోవాలనుకుంటున్నాను. ఇక నుంచి నా ప్రజలందరి పట్లా దయతో మెలగాలనుకుంటున్నాను,’’ అన్నారు రాజుగారు చిరునవ్వుతో!   ఆ మాటలు విన్న మంత్రుల మతులు పోయాయి. తామ విన్న మాటలను నమ్మలేకపోయారు. ‘రాజు తమతో పరాచికాలు ఆడటం లేదు కదా!’ అనుకున్నారు. వాళ్ల మొహాలు చూసిన రాజుగారు ఇలా చెప్పుకొచ్చారు... ‘‘నిన్న ఉదయం నేను ఒక్కడినే మారువేషంలో వేటకి బయల్దేరాను. ఎప్పటిలాగే వేట సంతోషంగా, సవ్యంగా సాగిపోతోంది. అలాంటి సమయంలో ఒక కుక్క, కుందేలుని తరమడం గమనించాను. అది కుందేలుని పట్టుకుంటుందా లేదా అని ఆసక్తిగా వాటిని వెంబడించాను. కుక్క, ఆ కుందేలుని అందుకునే లోపల అది ఒక బొరియలోకి దూరిపోయింది. కానీ అది లోపలికి జారుకునే లోపలే దాన్ని వెంటాడుతున్న కుక్క, కుందేలు కాలుని కొరికిపారేసింది.   ‘‘అయ్యో ఇక కుందేలు తన జీవితంలో మళ్లీ సరిగా పరిగెత్తలేదు కదా!’’ అనుకుంటూ అడవిలో కాస్త ముందుకు సాగాను. ఇంతలో ఎక్కడి నుంచో అరుపులు వినిపించాయి. అటుగా వెళ్లి చూద్దును కదా! ఎవరో ఒకాయన తన గుర్రం మీద కూర్చుని అడవిగుండా పోతున్నాడు. అతడి గుర్రాన్ని చూసి ఈ కుక్క అరుస్తోంది. ఇందాక కుందేలు వెంటపడిన కుక్కే ఇది. కానీ ఈసారి దానికి మూడినట్లుంది. గుర్రం మీద ఉన్నతను సామాన్యుడిలా లేడు. తన విల్లంబులోకి ఒక బాణాన్ని తీసి, సరాసరి ఆ కుక్క కాలికి ఎక్కుపెట్టి వదిలాడు. బాణం నేరుగా కుక్క కాలిని చీల్చుకుంటూ వెళ్లిపోయింది. ‘’కథ ఇక్కడితో ముగిసిపోలేదు! కుక్క అరుపులకి భయపడిన గుర్రం అడ్డదిడ్డంగా బెదిరిపోయి గంతులేయడం మొదలుపెట్టింది. ఆ అదురుకి దాని రౌతు కిందపడ్డాడు. గుర్రపు తాపులకి అతని మోచిప్ప పగిలిపోయింది. ఇక అతణ్ని విడిపించుకుని అడ్డదిడ్డంగా పరుగులెత్తడం మొదలుపెట్టింది గుర్రం. అలా ఓ పది అడుగులు వేసిన ఆ గుర్రమూ ఓచోట కాలు ఇరుక్కుపోయి బొక్కబోర్లా పడిపోయింది.   ‘‘మన పెద్దలు కర్మ సిద్ధాంతం అనే మాటను తరచూ అంటం నేను వినేవాడిని. ఎదుటివాడికి మనం ఏం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుందని వారు చెప్పేవారు. నాకు ఆ సిద్ధాంతం మీద పెద్దగా నమ్మకం లేదు. కానీ ఏం జరిగితే మనకు బాధ కలుగుతుందో, దానిని ఇతరులకు చేయకూడదని మాత్రం అర్థమైంది. కుందేలు, కుక్క, గుర్రం జంతువుల కాబట్టి వాటికి ఈ నీతి వర్తించకపోవచ్చు. కానీ మనిషికి మంచిచెడుల విచక్షణ ఉంటుంది కాబట్టి అతను మాత్రం తన ప్రవర్తన విషయంలో ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలని తెలిసివచ్చింది,’’ అంటూ ముగించాడు రాజు. రాజుగారి మాటలు విన్న మంత్రులంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రకృతే తమ రాజుకి బుద్ధి చెప్పిందనుకుని పండుగ చేసుకున్నారు.   (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

The Perfect Pen Drive

  Pen drive is no more a fashion... nor is an accessory. With the growing demand for the capacity, Pen Drives have become a part of our lives. But very few of us seem to use them carefully and derive their ultimate benefits. Here are few tips that lead to perfect utilisation of them.   Virus:  Pen Drive and Virus go together. You may be utmost careful in keeping your computers updated. But we can’t expect that with every system to which we attach our pen drives. The Auto Run feature in windows is normally a culprit to let unwanted files into a pen drive. So it’s better to enable your pen drive with antivirus software. We have numerous free applications such as `Panda USB vaccine’ that could save our pen drive, wherever it goes.   Hard Disk for Media:  Don’t worry if your Desktop is filled with those classic movies, songs and e-books. Just opt for a pen drive that could act as a hard disk to store such `not so necessary` files. A 32 GB pen drive would worth about 700 Rs. and could take care of your media. So! Let’s a pen drive be your media storage so that you can not only keep your drives clean but can also attach to any source such as a TV.   Your wallet of secrets:  A pen drive is small and portable. It can comfortable be placed at a corner of your purse or even hang around to your neck. There are numerous applications available that can turn a pen drive into a secret wallet. Companies like San Disk were also providing embedded programs such as `Sandisk Secure Access’ to instil some privacy in the pen drives.   Software:  A pen drive can be a hub for numerous applications. Whole lot of softwares can be run through pen drives. One can even install an Operating System through a pen drive. So a pen drive is nothing less than a Swiss knife for the one who knows how to use it.   Tricks and Stunts:  Techies can do weird things by using a simple pen drive. They can turn it into a ram, speedup your windows or even use as a key to start the computer. But such tricks do require a lot of vigilance and need some supporting applications. Meanwhile we can try a few tips like increasing the transfer speed of data by altering the properties.   - Nirjara.

జీవితమే ఒక ఇల్లయితే!

  ఒకానొక పట్టణంలో ఒక అద్భుతమైన వడ్రంగి ఉండేవాడు.  కేవలం చెక్కతోనే అతను అందమైన ఇంటిని కట్టిపారేసేవాడు. అతను కట్టిన ఇంటిని చూసిన వారెవ్వరికైనా, ఉంటే అలాంటి ఇంట్లోనే ఉండాలనిపించేంది. ఒక ఇంటికీ మరో ఇంటికీ పొంతన లేకుండా, అతను నిర్మించిన ప్రతి ఇల్లూ ఓ కళాఖండంగా తోచేది. వడ్రంగి గురించి ఆ నోటా ఆ నోటా విన్న ఒక వ్యాపారస్తుడు అతని దగ్గరకు వచ్చాడు.   ‘నేను ఇళ్ల వ్యాపారం చేస్తుంటాను. నాకు అవసరమైనప్పుడల్లా ఒక ఇంటిని నిర్మించి ఇవ్వగలవా!’ అని అడిగాడు వ్యాపారస్తుడు. వడ్రంగికి అంతకంటే కావల్సింది ఏముంది. ‘చేతి నిండా పని, పూట గడిచిపోయే డబ్బు... అది చాలు’ అనుకున్నాడు. వెంటనే పనిలోకి చేరిపోయాడు. వడ్రంగి ఏమాత్రం ఒళ్లు దాచుకునేవాడుకాదు. ఎప్పటిలాగే తన ప్రతిభనంతా చూపించేవాడు. చెక్కా, శిల్పమా అన్నంత అందంగా ఇంటిపని చేసేవాడు. అతను వచ్చిన దగ్గర్నుంచీ వ్యాపారస్తునికి కూడా విపరీతంగా కలిసి వచ్చింది. లక్షలకు లక్షలు లాభంతో బోలెడు చెక్క ఇళ్లను అమ్మాడు.   ఇలా ఒకటి కాదు రెండు కాదు... చాలా సంవత్సరాలే గడిచిపోయాయి. రానురానూ వడ్రంగి ఒంట్లో సత్తువ తగ్గిపోసాగింది. ఇక ఈ పని చేయడం తన వల్ల కాదనుకున్నాడు. అందుకనే ఒక రోజు వ్యాపారస్తుని దగ్గరకు వెళ్లి తన నిర్ణయాన్ని చెప్పేశాడు. ‘వడ్రంగి వల్ల తనకు విపరీతమైన లాభాలు వచ్చిన మాట నిజమే! కానీ అతడి పరిస్థితి చూస్తే ఇక మీదట విశ్రాంతి అవసరం,’ అని వ్యాపారస్తునికి కూడా అనిపించింది.   ``నీ మాటను కాదనలేకపోతున్నాను. కానీ చివ్వరగా ఒకే ఒక్క ఇంటిని కట్టిపెట్టవా!’’ అని అర్థించాడు వ్యాపారస్తుడు. వ్యాపారస్తుని మాటలు విన్న వడ్రంగి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మరో ఇంటిని కట్టిపెట్టడానికి ఒప్పుకున్నాడు. కానీ అప్పటికే అతని మనసులో వడ్రంగి పని మీద విరక్తి ఏర్పడిపోయింది. పైగా ఇక తన నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం కూడా లేదనిపించింది. అన్నింటికీ మించి, అతనికి మరో ఇంటిని కట్టడం అంటే ఏమాత్రం ఆసక్తి లేదు. అయినా తప్పదు కనుక బలవంతంగా పనిని మొదలుపెట్టాడు.   వడ్రంగి తన జీవితంలో చివరగా కడుతున్న ఇల్లు చాలా నాసిరకంగా సాగింది. ఎప్పటిలాగా ఇది మంచి చెక్కా కాదా! అని వడ్రంగి బేరీజు వేసుకోలేదు. ఫలానా చెక్క గాడిలో కుదురుకుందా లేదా అని పట్టించుకోలేదు. రంగు వేసేముందు తగినంతగా నగిషీ చేశానా లేదా అని పట్టించుకోలేదు. ఫలితం! అతని జీవితంలోనే అత్యంత చవకబారు నిర్మాణాన్ని అతను పూర్తిచేశాడు.   `మీరు చెప్పినట్లుగానే ఇంటిని పూర్తిచేశాను. ఇక సెలవు తీసుకుంటాను!’ అంటూ వ్యాపారస్తుని దగ్గరకు వెళ్లి నిల్చొన్నాడు వడ్రంగి.‘భలేవాడివే! ఆ ఇంటిని నీ కోసమే నిర్మించమని అడిగాను. నీ వల్ల నేను చాలా లాభపడ్డాను, మరి నీ కోసం ఒక ఇంటిని నిర్మించలేకపోతే ఇక నేనెందుకు?’ అన్నాడు వ్యాపారస్తుడు చిరునవ్వుతో.   వడ్రంగికి నోట మాట రాలేదు. తన ఇల్లు అని తెలిసి ఉంటే కనుక దానికి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకునేవాడో కదా! చాలామంది వ్యక్తిత్వం ఇలాగే ఉంటుంది. తమ కోసం నిర్మించుకునే జీవితాన్ని ఏమాత్రం ఆసక్తి లేకుండా, ఏమరపాటుగా... తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. వెనక్కి తిరిగి చూసుకున్నాక అయ్యో కాస్త విచక్షణతో ప్రవర్తించి ఉంటే బాగుండేదే అని పశ్చాత్తాపపడతారు. కానీ ఏం లాభం! ఆ ఫలితంతోనే వారు మున్ముందు గడపాల్సి ఉంటుంది.   - నిర్జర.

Body Language in Interviews

We behave as if body language doesn’t exist for us. But we all get influenced by it. The way our body acts would reveal our psychology and our intentions... and at the same time, it forms an impression on others. So! It might be needless to reiterate to be careful about our body language while we attend an interview. Here are a few tips... Eye contact Most of the lessons in Body language stress the importance of the eye contact. It’s always advised to make a long eye contact with the interviewer. But it should not be too long to make him uncomfortable. So lock it and break it... and lock it and break it... and Hands Folded hands would always give an impression that either you are rigid or you are hiding something. So it’s better to use them while talking. But use them only for expressing your words but not your ego. Instances such as pointing fingers at the interviewer, throwing them in air... might spoil the sport. So! Use your hands, but use reasonably. Comfortable posture Most of the candidates would often sit on the edge of the chair to show their respect. But it won’t do! Sitting all the way back into the chair with a straight spine is recommended to reveal your confidence. Some people tend to swing involuntarily while they speak, which can of course create a negative opinion upon them. The nervous symptoms An interview is a situation that certainly makes us tense. And many tend to deal with their nerves through crazy habits. Biting nails, curling hair, twisting the tie... may pacify our nerves, but not the ones of the interviewer. Any interviewer looking at such habits won’t be ready to work with your nerves in future. Genuine expressions Sometimes we mismatch our expressions with our words. And we try to fake an appeasing expression. But every human is intelligent enough to sort out a fake expression from the original one. So let us be genuine before the interviewer. Too much of nodding and smiling to soothe the examiner wouldn’t also do any good. The entry and exit Our entry into the room of the interviewer and our leaving the room would also form an importance opinion. While the entry gives them the first impression, our exit would confirm it. So gloomy face, sullen shoulders, dragged legs and tense looks won’t do any good for us. - Nirjara.  

TRUE VICTORY

“Baldy” I yelled at my neighbourhood boy, but he didn’t respond though I was sure that he heard me. “Hey baldy boy” I yelled again indicating that I'm not going to leave him till he reacts to me. He turned at me in response though he said nothing, but his face revealed it all! He felt insulted and thus I scored a point over him. I'm a teenager searching for troubles, I want some action in my life so I provoked and insulted other boys of my age.  I used my creativity in calling names, missing school and collecting cigarettes.     So when I spotted this lean boy with a shaved head in my neighbourhood, I instantly tried to pickup a fight with him, but he didn’t respond to my challenge.  Whenever I called him ‘baldy’ he sadly looked at me and moved away.  I knew that he was hurt, but that’s what my aim was! One day I spotted him before my house and cried in excitement “Hey baldy! Are you going for a haircut?” he said nothing as usual and moved on with dampened eyes.  As I entered my house proud with my little victory in insulting the boy, I saw my mother standing at the main door, ‘she probably heard my squeals and would scold me for my bad manners’ – I thought, but rather she asked me with a grim face “Do you know why his hair is removed?” “Why not! He might have been to a pilgrimage” I answered rudely. “No!” mother shouted with anguish “he is undergoing chemotherapy, he is in the final stages of cancer” I was shocked to hear those words, I'm not an adult but still knew what they meant; cancer, pain, chemotherapy, advanced stages, death…I felt so guilty at my behaviour that I've decided to apologise that boy, the next time I see him. It’s been a week since I've seen him and was desperate to meet him and make him my friend, but he's no where in the sight.  Their house was locked and his cycle was chained to the bars. “He’s dead” mother said at the breakfast that day “he’s dead last night after a week long struggle in the ICU” Tears rolled from my eyes with guilt and compassion, I remembered the last time I’ve seen him; I’ve insulted him in front of my house! I remembered his gloomy face hurt with my comments and eyes dampened with the insult. I couldn’t have saved him from his inevitable death but could have brightened his short life by invoking some joy and hope. I've realised thereafter that true victory lies in winning hearts rather than defeating people.   - K.L.Surya.  

To be a great teacher

Most of us might have played the role of a student in our lives. But very few are lucky enough to be a teacher. Lives might have changed and world might have got sophisticated, but the position of a teacher is still revered. Here are a few qualities that would often make difference between a teacher and THE BEST teacher... Be an example A teacher should be the role model to his students. The way he dresses, they way he behaves would always form an impression on his students. He has to be careful even while choosing his words. And his character too would of course influence his students. He has to be soft with them, yet firm. He has to be jovial, yet professional. In one word, he has to be the one they love to be when they grow up- A matured human being! Gives some space Some teachers get so close to their students, and yet they know their limits. They are like a father who knows when to pamper his children and when to control them. This would give scope to their students to seek the knowledge without fear. This would give them an opportunity to raise any question and clarify any doubt... even at the personal level. Clear in objectives A teacher should be sure of the goals he wishes to achieve. He is fully aware that his job is not just to deliver a lecture. He knew that the role of a teacher is much more than that in the lives of his students. They have to learn things; they have to share their thoughts; they should get creative; they have to gain good results in academics; they have to polish their character. And the teacher should have a clear idea of what to do and what to achieve with his students. Interested in each student Every person is unique in his character and the truth suits to the students as well. Every student has his own way of learning things, facing problems and solving them. Some might be tough in behaviour and some might be tough to teach. Thus a good teacher should be expert in multi tasking. He should consider the students as a group AND as different entities at the same time. Knowledge should be useful The primary task of a teacher is to impart knowledge to his students. But he would be successful only if it looks as fun while teaching and important while learning. A lecture full of real life examples and anecdotes would serve that goal. A teacher can associate the subject to the lives of the students ONLY if he loves the subject and has command over it. - Nirjara.

పోకెమాన్‌తో ప్రమాదం!

  ఒక చిత్రమైన జంతువు మన కళ్ల ముందే గంతులు వేస్తూ కవ్విస్తూ ఉంటుంది. అలాంటి జంతువులను ఎన్ని పట్టుకుంటే అన్ని పాయింట్లు. ఇప్పుడు ప్రపంచమంతా ఇదే ఆట గురించిన చర్చ. ఎక్కడ చూసినా ‘పోకెమాన్‌ గో’ గురించే రచ్చ. ఇప్పటివరకూ వీడియో గేమ్స్ అంటే నాలుగు గోడల మధ్యా, ఓ చిన్న తెర మీద ఆడే ఆటలుగా సాగేవి. కానీ ఇప్పుడు ‘పోకెమాన్‌ గో’తో అవి నిజజీవితంలోకి చొచ్చుకువచ్చేశాయి. అయితే పిల్లల్నీ, యువతనీ ఇంతగా ఆకట్లుకుంటున్న పోకెమాన్‌ గోను చూసి పెద్దలు మాత్రం తెగ విసుక్కొంటున్నారు. వారి చిరాకుకి కారణం లేకపోలేదు మరి...   - నట్టింట్లో కాకుండా నడుచుకుంటూ ఆడే ఈ ఆటతో జనం ఎక్కడికి వెళ్తున్నామో చూసుకోవడం లేదన్నది ప్రధానమైన ఆరోపణ. ఆటని రిలీజ్‌ చేసి పట్టుమని పది రోజులైనా కాకముందే దీని వల్ల ప్రమాదాలబారిన పడ్డ వారి సంఖ్య వందల్లోకి చేరుకుంది. ఇక ఈ ఆటని ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండే మన దేశంలో కనుక విడుదల చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవడానికే భయంగా ఉంది.   - పోకెమాన్‌ కోసం వెతుకుతూ జనం ఎవరి ఇంట్లోకి వెళ్తున్నామో, ఏ హద్దులు దాటుతున్నామో కూడా గమనించుకోవడం లేదట. ముఖ్యంగా పిల్లలు కనుక ఇలా అపరిచితుల ఇళ్లలోకి ప్రవేశిస్తే, వారి రక్షణకు ఎవరు బాధ్యులు? అంటూ ప్రశ్నిస్తున్నారు నిపుణులు. ఈ విషయం మీద సాక్షాత్తూ న్యూయార్కు పోలీసు కమీషనర్‌గారు ప్రెస్‌ కాన్ఫరెన్సు పెట్టి మరీ రేవు పెట్టారు.   - పోకెమాన్‌ గో ఆడుతూ రోడ్డు మీదకు వచ్చినవారు, ఎదురుగుండా ఎవరు కనిపించినా.. వారిని కూడా తమ ఆటలో కలుపుకోవచ్చు. దారి దోపిడీగాళ్లు, లైంగిక నేర చరిత్ర కలిగిన వారు ఈ అంశాన్ని సాకుగా తీసుకుని అమాయకులను మోసం చేసిన కేసులు కూడా ఈపాటికే నమోదవుతున్నాయి.   - పోకెమాన్ గోతో మన వ్యక్తిగత భద్రత కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. ఈ ఆట ద్వారా ఎవరైనా వైరస్‌ను చొప్పించి మన వ్యక్తిగత సమాచారాన్నీ, కదలికలనీ పసిగట్టేయవచ్చు. మరీ మాట్లాడితే తమకు తోచిన చోటకి మనల్ని రప్పించుకోవచ్చు.   - తీవ్రవాదులకు కూడా ఈ ఆటను ఒక సాకుగా మార్చుకునే అవకాశం లేకపోలేదు. పోకెమాన్‌ను వేటాడుతున్నామని చెప్పి ఎక్కడికి పడితే అక్కడికి ప్రవేశించేయడం, రహస్య స్థావరాలను ఫొటోలు తీయడం సాధ్యమే అంటున్నారు.   - పోకెమాన్‌ గోతో మానవ సంబంధాలకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని సైకాలజిస్టులు భావిస్తున్నారు. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న బంధాలు ఈ ఆట మత్తులో మరింత మసకబారిపోతాయని హెచ్చరిస్తున్నారు. మొన్నటికి మొన్న తన భార్య పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటే పోకెమాన్ గో ఆడుతూ కూర్చున్న ఒక ప్రబుద్ధుడి ఉదంతం సోషల్‌ మీడియాలో బయటపడింది. పోకెమాన్‌ గో ధ్యాసలో పడితే తల్లిదండ్రులు, తోటివారు అన్న పట్టింపులేమీ ఇక మిగలకపోవచ్చు. చుట్టూ జనం పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోకపోవచ్చు!   ఇదంతా చూస్తుంటే ‘పోకెమాన్‌ ఆడేవారు తాగుబోతుల్లా ప్రవర్తిస్తున్నారు’ అని బాధపడుతున్న ఓ అరబ్ అధికారి మాటలు గుర్తుకురాక మానవు. నిజానికి పోకెమాన్‌ గోని మన దేశంలో ఇంకా విడుదల చేయలేదు. కానీ అనధికారికంగా మాత్రం ఇది ఈపాటికే మన యువత చేతుల్లోకి చేరిపోయింది. మరి మనవారు ఈ పోకెమాన్‌ మోజులో ఎలా ప్రవర్తిస్తారో చూడాలి. ఆటని ఆటగానే చూస్తారా లేకపోతే జీవితాన్నే ఓ ఆటగా మార్చేసుకుంటారా అన్నది గమనించాలి.   - నిర్జర.

Transformation

  “What nonsense are you doing there” grandpa yelled at me in the garden. ‘This old man pesters me a lot’ I thought as I shouted back “can’t you see that I’m destroying the caterpillars!” and continued my work trying to ignore the desperate words of my grandpa discouraging me from my work.  I took each one of the caterpillar with a forceps and dropped them in a small bucket filled with phenyl water.  It’s not all a work that I could enjoy; the pungent smell of the phenyl and the twisting of the caterpillars in pain made me feel sick, but I’ve decided to eradicate all the caterpillars in my garden.  I could’ve ignored them if they were few, but they were everywhere in the garden, they came along with the monsoon as if they were dropped from the clouds, but then grew rapidly in no time feeding on every green piece in the garden – It’s an invasion.   We had to be very careful not to touch them as their tiny thorns would make us itchy.  The whole garden smelled of their bodies and no plant could escape from their assault, so one day I took the decision of destroying them all and here I am, doing what I've decided! *****   It’s been a month since I've performed ‘operation caterpillar’ and I was sitting in the garden along with my grandpa, we both were enjoying our evening tea when I suddenly screamed “grandpa! Look how beautiful that butterfly is” pointing at a  butterfly resting on a stem, it was so colourful as if a small garland is made out of a few different flowers, it has two big eyes on its wings as if to admire its own beauty! I looked at my grandpa hoping him to add a few more praises to my comments, but he looked as if he’s hurt with my comments, his face turned red and his eyes dampened as he slowly picked up some words   “Do you realise from where that butterfly came from? That was probably one of those caterpillars that escaped from you, now imagine how many butterflies would have been there in this garden if you haven’t killed all those caterpillars, you mercilessly kill them and now show off your aesthetic sense when one of them escaped from you and turned into a butterfly!” “But what can I do? You know that they were such a nuisance!” I protested though I felt guilty of what I’ve done.   “Nuisance! Have you ever spared some thought to find out what’s going on in the nature right in front of your eyes before you call it a nuisance?” “What’s the big deal in it” I shrugged my shoulders confused by my grandpa’s anger.   “Son! A man can either behave foolishly or selfishly, but there’s always a cause behind the moments of every other organism in this world; the flowers of a plant, the song of a bird, the dance of a peacock… everything has a reason behind it.  Look at those caterpillars for instance; the thorns over their body would protect their delicate bodies from their predators, they eat a lot so that they can have enough strength for hibernation, they build a nest by shedding their thorns and come out of it in flying colours, even without the thorns they have their own way of self protection, the colours on their wings would confuse their predators with the flowers and the eyes on their wings would make them appear like strange animals, even if some predator tries to catch it, the butterfly can escape swiftly as its wings are coated with fine particles which might be the reason why we call it a butterfly.    Plants attract these butterflies through flowers and honey for the purpose of pollination, you see! The whole process of nature is going on before out eyes as smoothly as a butterfly landing on a flower.” “My God!” I said surprised at the analysis “I've read every bit of what you’ve said, but never looked at it in depth!”   “You have not yet seen the depth my son, what I've told you now is just a fact, you haven’t learnt the message yet. Like a caterpillar you should shed off your negative attitude (the thorns), evaluate yourselves in solitude (hibernation), and come out with a beautiful character (the butterfly). Defend yourselves though you are not dangerous (the eyes on the wings), don’t get caught easily in risky situations (slippery wings) and finally extract the honey out of life. Hope you had enough lessons to learn from a single butterfly!”   As grandpa stood up with a smile proud of his victory over my ignorance, I looked at a butterfly over a rose; I've seen it many times before but now… -K.L.Surya

Have you heard about Holland Codes?

 No two people on earth can be similar. Because, everyone on this planet has a unique character of his own! But people can certainly be bifurcated into different categories based on their traits. An American psychologist named John Holland has moved further ahead. He suggested that people of some traits are more suitable to certain occupations. Holland divided people into six different categories for this purpose. And he used the acronym RIASEC to let those divisions be remembered. R for Realistic People falling under this category are `Doers’. They are practical and realistic and do not live in an imaginary world. They are hard working and love to work even on outdoors. They are interested in things rather than ideas. Driving, Agriculture, Carpentry are some of the categories that suit such personalities. I for Investigative Such people are curious in nature and logical in thinking. They love to explore and investigate. They like to research and experiment. Biology, Computer Programming, Mathematics are some of the examples for the fields in which Investigative people can excel. A for Artistic These are the ones who love to create something. They prefer imagination and creativity. They love to change the existing circumstance or create a new one. They are spontaneous in thought and aesthetic in sense. There need not be much hustle to determine the fields in which such people are well suited. Creative fields such as Writing, Editing, Dancing, Music composing etc are well suited for such people. S for Social People who fall under this category either excel or dominate in a social environment. They are philanthropic in nature and have a caring attitude. They are generous and service oriented. They are more suitable in social organisations such as hospitals (as nurse), schools (as teachers or caretakers). These are the people best suited for voluntary or non government organisations. E for Enterprising As the name indicates, these people are the ones who love to lead, motivate and persuade others to do things. They are energetic in nature and dominant over others. They are ambitious in their pursuits and brave in their decisions. Marketing agents, Managers, Investors, Bankers, Businessmen... would be the positions suitable for people with an `Enterprising’ character. C for Conventional These are the ones who love to follow the rules. They want the things to be in order as per set rules. They are organised and strive to keep their environment in a structured pattern. They are in one word... the `Organisers’. Such people are highly needed for the smooth functioning of an organisation. Clerks, Accountants, Secretaries, Office Assistants... would all fall under the category suitable for conventional people.  Well! These Holland Codes need not affect our judgement while choosing a career. But they are certainly helpful in forming one. Various Educational institutions and Government departments in Europe keep the RIASEC in mind while training their students and employees. - Nirjara  

అందమైన జీవితం కోసం- మినిమలిజం!

  మనిషి బతకడానికి ఎన్ని వస్తువులు కావాలి? ఈ ప్రశ్నకు బదులుగా ఒక జాబితాను రూపొందించడం మొదలుపెడితే ఒక వంద వస్తువులు మించి కనిపించవేమో! కానీ మన చుట్టూ ఎన్ని వేల, లక్షల వస్తువులను పోగేసుకుంటున్నామో కదా! రెండు ఫోన్లు, నాలుగు వాచీలు, ఇరవై జతల బట్టలు, వేల బొమ్మలు... ఇలా మన చుట్టూ ఉన్న వస్తువులను ఒక్కసారి లెక్కపెట్టుకుంటే ఆశ్చర్యం వేయక మానదు. ఆ తరువాత ఇవన్నీ మన జీవితానికి అవసరమా అన్న ఆలోచనా కలగక మానదు. ఆ ఆలోచన నుంచి పుట్టిన ఒక జీవన విధానమే ‘మినిమలిజం’!     మినిమలిజం అనే ఆలోచనాధోరణి జెన్‌ తరహా జీవన విధానం నుంచి మొదలైంది. బుద్ధుని బోధనల్లో ముఖ్యమైనది ‘కోరికలను త్యజించాలి’ అన్న సూత్రమే కదా! ఎందుకంటే మనసులో కోరిక అనేది ఉంటే... దాన్ని పొందాలనుకునే తపనలో దుఃఖం ఉంటుంది; ఆ కోరికను సాధించలేకపోయినా దుఃఖం ఉంటుంది; ఇక కోరికను సాధించిన తరువాత, అది అనుకున్నంత సుఖంగా లేదనో... అంతకంటే ఉన్నతమైనది సాధించలేకపోయామనో దుఃఖం సిద్ధంగా ఉంటుంది. మనలోని కోరికలను నిరంతరం రెచ్చగొట్టే ఈ ప్రపంచీకరణలో బుద్ధుడు చెప్పిన ఈ సూత్రం మరింత ప్రభావవంతంగా పనిచేస్తోంది. ఒక ఫోన్‌ కొన్నవెంటనే మరో కొత్త మోడల్‌ సిద్ధం! ఒక టీవీ కొనాలని వెళ్తే లక్షరూపాయలు విలువ చేసే టీవీలు కూడా ఊరించడం ఖాయం! అందుకే రోజురోజుకీ మినిమలిజం ప్రాముఖ్యత పెరుగుతోంది.     వస్తువులను వెంటాడి, వాటిని పోగేసుకుని తృప్తిపడిపోయే ధోరణికి ఈ మినిమలిజం అడ్డుకట్ట వేస్తుంది. ఎందుకంటే మన జీవితం భౌతికమైన వస్తువులకంటే విలువైనదనీ మినిమలిస్టులు నమ్ముతారు. వస్తువులలో మన వ్యక్తిత్వాన్నీ, వస్తుసంపదలోనే విజయాలనీ చూసుకోవద్దని హెచ్చరిస్తుంటారు. ఈ మినిమలిజం ధోరణ ఈనాటిది కాదు. హిందూ, బౌద్ధ సూత్రాలలో ఇది అంతర్గతంగానే దాగి ఉంది. గాంధీ మొదలుకొని స్టీవ్‌జాబ్స్ వరకూ చాలామంది ప్రముఖులు ఇలాంటి జీవనవిధానాన్ని అనుసరిస్తూనే వచ్చారు. కానీ మన జీవితాలను శరవేగంగా ముంచెత్తుతున్న ఉత్పత్తుల నేపథ్యంలో... మినిమలిజంను ఒక భావజాలంగా, ఒక జీవన విధానంగా ఎంచుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. జపాన్లో ఇప్పటికే మొదలైన ఈ విప్లవం ఇప్పుడు ఐరోపావాసులలోనూ ఆసక్తిని రేపుతోంది.   మినిమలిజం వల్ల వస్తువులే జీవితం అనే భ్రమ ఎలాగూ దూరమవుతుంది. దానికి తోడుగా జీవితంలో నిజంగా అమూల్యమైన విషయాలు ఏవి? మన ప్రాధాన్యతలు ఏవి? వేటి కోసం మన జీవితాన్ని వెచ్చించాలి? మన కాలాన్ని, శ్రమని వేటికి అంకితం చేయాలి? వంటి ప్రశ్నలకు జవాబులు దొరికే అవకాశం ఉంటుంది. కృత్రిమమైన, మోహపూరితమైన వస్తువుల బదులు వ్యక్తులకూ, బంధాలకూ, ఆరోగ్యానికీ ప్రాధాన్యత ఇవ్వడం మొదలవుతుంది.   - నిర్జర.

The Art of Conversation

  Conversation has made a man, a civilised person. It is only through conversation that we could express our feelings directly. It is only through conversation that we know about the opinions and objections of whom we are speaking to. But, many ignore the fact that conversation is just like any other art. We excel in it if we follow some basic tricks...   Listen more: Good listeners are often praised as good speakers. Because... in the course of conversation... listening is as important as speaking. People often try to dominate the conversation by explaining much about themselves and their views. Such a takeover would often leave the other person feel inferior and embarrassing.   No Debates:  People often start with a pleasant conversation and end up with fumed debates. It’s always safe not to enter into controversial issues while speaking. Varied people may have varied opinions about varied things... and you need not try contradicting each one of their views, especially when you are involved in an informal talk.   Be Clear and confident:  People keep mumbling and stammering during their conversation. Being clear and confident would always yield the best opinions for us. We might not be great orators to win every speech in our lives, but we can always excel in the little conversations of our daily life. We should be clear in delivering our opinion, our sentence formation... and it is only through confidence and practice that we could achieve such clarity.   The subject of conversation:  Every person is unique in his character. But two people in conversation can always have common subject that’s interesting to both of them. So, if you wish to come out as a winner out of conversation, choose to talk about a subject that is of mutual interest.   Honour the partner:  People often wish to evolve as a hero out of their conversations. They spend much time in expressing their opinions and elevating their character. They won’t let others speak and would often interrupt in between. Such a conversation could only satisfy the ego of the dominant speaker but would hurt their partner in conversation. Let others speak, let him say much about himself, compliment him for his abilities, react to his humour... let him feel your recognition. And you will be the winner of the conversation and his heart.   - Nirjara.

అసలైన వైద్యుడు- బిధాన్‌ చంద్ర

  మదర్స్ డే, ఫాదర్స్‌ డే నుంచి టైలర్స్ డే వరకూ చాలా రోజుల గురించి విన్నాం. పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయిన ఈ సంప్రదాయాలను సుబ్బరంగా మనమూ ఆచరించేస్తున్నాము. కానీ మన దేశంలో వైద్యులకి ప్రత్యేకించి ఒక రోజు ఉందని తెలుసుకోవడం, దాని వెనుక ఉన్న మహానుభావుడి గురించి చదువుకోవడం ఒక కొత్త అనుభవం!   బిధాన్‌చంద్ర రాయ్: స్వాతంత్ర్య సమరయోధునిగా, పశ్చిమబెంగాల్‌ రెండో ముఖ్యమంత్రిగా... అన్నింటికీ మించి అద్భుతమైన వైద్యునిగా బిధాన్‌చంద్ర రాయ్‌ది మన దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. జులై 1,1882న జన్మించిన రాయ్‌, 1962లో అదే జులై 1వ తేదీన పరమపదించారు. ఆయన గౌరవార్థమే భారతీయులు జులై1ని వైద్యుల దినోత్సవంగా జరుపుకొంటున్నారు. బీహార్లోని పాట్నాలో జన్మించిన బిధాన్‌చంద్ర బాల్యం ఏమంత రంగులమయం కాదు. ఐదుగురు సంతానంలో బిధాన్‌చంద్ర ఆఖరివాడు. పైగా అతనికి 14 ఏళ్లే వచ్చేసరికి తల్లి కూడా చనిపోయింది. ఇక వైద్య శాస్త్రంలో ఉన్నతచదువులు చదువుదామని కలకత్తాకి చేరుకున్నాడో లేదో, తండ్రిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇంటి నుంచి పైసా డబ్బు రాకపోవడంతో బిపిన్‌ ఉపకారవేతనాల మీద ఆకలిని తీర్చుకుంటూ, లైబ్రరీలోని పుస్తకాలను చదువుకుంటూనే వైద్యపట్టాని సాధించాడు.   లండన్‌లోనూ తప్పని కష్టాలు:   కలకత్తాలో వైద్యవిద్యని ముగించుకున్నాక బిధాన్‌చంద్ర అతి తక్కువ ఫీజులతో రోగులకు సేవ చేయడం మొదలుపెట్టాడు. ఆ తరువాత కొన్నాళ్లకి లండన్‌కి వెళ్లి వైద్యంలో F.R.C.S పట్టాని పొందుదామని బయల్దేరాడు. కానీ భారతీయుడు అన్న ఒకే ఒక్క కారణంగా అతడిని పదే పదే ఛీకొట్టారు లండన్‌లోని అధికారులు. అయినా పట్టువిడవకుండా F.R.C.Sని పూర్తిచేసుకుని మాతృదేశానికి తిరిగివచ్చాడు. ఇక అప్పటి నుంచి అతనిలోని వైద్యుడు విజృంభించాడు. టి.బి రోగుల కోసం, కేన్సర్‌ బాధితుల కోసం, ఆడవారి కోసం ప్రత్యేకమైన ఆసుపత్రులను ప్రారంభించాడు. ఒక పక్క వైద్యం, మరో పక్క విద్యార్థులకి ఉపన్యాసాలతో జీవితాన్ని కొనసాగించాడు.   స్వాతంత్ర పోరాటంలో... వైద్య వృత్తిలో క్షణం తీరిక లేనప్పటికీ, తన సామాజిక బాధ్యతను మర్చిపోలేదు బిధాన్‌. కాంగ్రెస్‌లో చేరి సహాయ నిరాకరణ వంటి అనేక ఉద్యమాలలో పాల్గొన్నాడు. ఫలితంగా కొన్నాళ్లు జైలుశిక్షను కూడా అనుభవించాడు. జైలు నుంచి వచ్చిన తరువాత కూడా రాజకీయాలలో చురుగ్గా పాల్గొనేవారు. అలా కలకత్తాకు మేయర్‌గా సైతం ఎన్నికయ్యారు బిధాన్‌. ఆ సమయంలోనే కలకత్తావాసులకు ఉచిత విద్య, వైద్యం వంటి మౌలిక వసతులను అందించేందుకు కృషి చేశారు. ఒకానొక సందర్భంలో గాంధీకి సైతం వ్యక్తిగత వైద్యునిగా బాధ్యతలు నిర్వహించారు.   బెంగాల్ ముఖ్యమంత్రిగా: 1948లో గాంధీజీ అభ్యర్థన మేరకు బెంగాల్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు బిధాన్‌చంద్ర. ఆ తరువాత తన మరణం వరకూ అంటే 1962 వరకూ 14 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని అధ్బుతంగా పాలించారు. బెంగాల్‌ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోవడం, నిరుద్యోగం, పేదరికం, మతఘర్షణలు వంటి అనేక సమస్యలు సద్దుమణిగిపోయేలా చేశారు. బెంగాల్‌ ఆర్థికరంగంలో దూసుకుపోయేలా దుర్గాపూర్, కళ్యాణి వంటి ఆధునిక నగరాలను నిర్మించారు.   ముఖ్యమంత్రిగా ఎంత తీరికలేకుండా ఉన్నప్పటికీ తాను ఒక వైద్యుడినన్న విషయాన్ని మాత్రం బిధాన్‌ మర్చిపోలేదు. వైద్యానికి సంబంధించి స్మారకోపన్యాసాలు ఇచ్చేవారు. పేదలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకునేవారు. ఆఖరికి తన మరణం తరువాత, తన ఇంటిని కూడా ఒక వైద్యశాలగా తీర్చిదిద్దమని వీలునామా రాశారు. తన అపారప్రతిభకు, కార్యదక్షతకు గుర్తింపుగా 1961లో భారతరత్నని సాధించారు బిధాన్‌. మరి అలాంటి వ్యక్తి జీవితమే ఆదర్శంగా ‘వైద్యుల దినోత్సవం’ జరుపుకోవడంలో తప్పేముంది!   - నిర్జర.

వజ్రాల కోసమని వెళ్తే!

  చాలా రోజుల క్రితం ఆఫ్రికాలో ఒక రైతు ఉండేవాడు. అతని ఇల్లు ఓ కొండ కొసన ఉండేది. అక్కడి నుంచి చూస్తే ప్రకృతి అంతా తన పాదాక్రాంతమన్నంత దగ్గరగా కనిపించేది. ఆ ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న సెలయేరుతో రైతుకి కావల్సినంత నీరు కూడా లభించేది. రైతు తన పెరట్లో కావల్సినన్ని కూరలను పండించుకుంటూ, అవసరానికి మించినవాటిని ఊళ్లో అమ్ముకుంటూ హాయిగా గడిపేసేవాడు. ఓసారి ఆ రైతుని పలకరించి వెళ్లేందుకు ఓ చుట్టం వచ్చాడు. వచ్చిన చుట్టం వచ్చినట్లు ఉండలేదు.   ‘ప్రపంచమంతా ముందుకు సాగిపోతుంటే, నువ్వు మాత్రం కొండ అంచుకి వేళ్లాడుతున్నావా. ఇప్పుడు జనమంతా వజ్రాల వేటలో పడ్డారు. ఆ కింద కనిపిస్తున్న లోయలో వెతికితే బోలెడు వజ్రాలు కనిపిస్తున్నాయంట! ఇలాంటి పనికిరాని జీవితాన్ని గడిపేసే బదులు నువ్వు కూడా వాటి కోసం వెతకవచ్చు కదా! ఒక్క వజ్రాన్ని సంపాదించావంటే నీ జీవితమే మారిపోతుంది’ అంటూ ఊదరగొట్టాడు బంధువు.   బంధువు మాటలకు నవ్వేసి ఊరుకున్నాడే కానీ, రైతు మనసు మాత్రం వాటినే పట్టుకుని వేళ్లాడసాగింది. ఆ బంధువు చెప్పినట్లు నిజంగానే తనకి ఓ వజ్రం దొరికితే ఎంత బాగుండు అన్న ఆశ మొదలైంది. వెంటనే మూటాముల్లే తీసుకుని లోయలోకి దిగాడు. ఊహూ! లోయలో ఎంత వెతికినా వజ్రాలు కనిపించనేలేదు. ఎవర్నో అడిగితే ‘ఇక్కడ కాదు, మరికాస్త దూరంలో వజ్రాల కనిపిస్తాయని చెప్పారు’. మరికాస్త దూరం వెళ్తే, అక్కడ ఉన్నవారు మరోచోటకి దారి చూపారు. అలా ఏళ్ల తరబడి రైతు దేశాలు పట్టుకుని తిరిగాడే కానీ వజ్రం దక్కలేదు. చివరికి ఇక అతని ఒంట్లో ఓపిక నశించింది. మనసులోని ఆశ అడుగంటింది. తిరిగి తన ఇంటికి ప్రయాణం కట్టాడు.   రైతు తన ఇంటికి చేరుకునేసరికి కనిపించిన దృశ్యంతో అతని కళ్లు చెదిరిపోయాయి. తన పాత ఇంటి స్థానంలో ఒక తళతళలాడిపోయే భవంతి ఉందక్కడ. నిదానంగా ఆ ఇంట్లోకి ప్రవేశించిన రైతుకి అక్కడ ఓ ఆసామి పడకకుర్చీలో కూర్చుని కనిపించాడు. అతని దగ్గరకి బిక్కుబిక్కుమంటూ వెళ్లి తనని పరిచయం చేసుకున్నాడు రైతు. రైతు గురించి విన్న ఆసామి కంగారుపడలేదు సరికదా ఆప్యాయంగా కౌగలించుకుని ఎదురుగా కూర్చోపెట్టుకున్నాడు.   ‘సోదరా! నేను ఏదో ఒక వ్యాపకం కోసమని వెతుక్కుంటూ వెతుక్కుంటూ నీ ఇంటికి చేరుకున్నాను. ఇంట్లో ఎవ్వరూ కనిపించకపోయేసరికి నిదానంగా ఇక్కడే ఉండిపోయాను. కాయగూరల్ని పండించుకుంటూ, మేకలని కాచుకుంటూ రోజులు గడపడం మొదలుపెట్టాను. కానీ ఒక రోజు ఏం జరిగిందనుకున్నావ్! ఆ సెలయేట్లోకి దిగి స్నానం చేస్తుండగా ఓ తళతళలాడే రాయి కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తే... అది రాయి కాదు, వజ్రమని తేలింది! ఆ సెలయేట్లోనే మరికాస్త శోధించాక అలాంటి రాళ్లు అనేకం కనిపించాయి. ఇదిగో ఆ వజ్రాలను అమ్మి నేను ఈ భవంతిని కట్టుకున్నాను. కావాలంటే నువ్వు కూడా ఇందులోనే ఉండవచ్చు,’ అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు.   ఇంటి యజమాని మాటలు విన్న రైతుకి దుఃఖం ఆగలేదు. అత్యాశకి పోయి చేతిలో ఉన్న వనరులను తరచి చూసుకోకుండా ఊళ్ల మీద పడి తిరిగానే అనుకుంటూ కూలబడిపోయాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.