అందుకే స్నేహితుడు కావాలి!

అదో పెద్ద అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు. వాటిలో సహజంగానే ఓ సింహమూ, ఓ జింకా ఉన్నాయి. ఒక రోజు ఆ సింహం జింకని చూడనే చూసింది. వెంటనే దాన్ని వేటాడేందుకు వెంటపడింది. సింహం నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది. దాని నుంచి పరిగెడుతూ పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులోకి పడిపోయింది. దాన్ని తరుముతూ సింహం కూడా చెరువులోకి దూకేసింది. ఆ చెరువు నిండా నీళ్లున్నా బాగుండేది. కానీ కరువుతో చెరువు సగానికి ఎండిపోయింది. బురదతో నిండిపోయింది. ఆ బురదలో ఒక పక్క జింక, మరోపక్క సింహం మోకాళ్ల లోతు వరకు కూరుకుపోయాయి. ‘‘హహ్హా! ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు. ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి, నీ లేత మాంసాన్ని రుచిచూస్తాను,’’ అంటూ నవ్వింది సింహం.   ‘‘నా మాంసపు రుచి తర్వాత. ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు,’’ అంటూ వెక్కిరించింది జింక. జింక మాటలకి కోపంగా సింహం ముందుకు కదలబోయింది. కానీ అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది. ‘‘నిజమే నేను కదల్లేకపోతున్నాను. ఇప్పుడెలా!’’ అని బిక్కమొగం వేసింది సింహం. ‘‘నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా?’’ అని తాపీగా అడిగింది జింక.   ‘‘నేను ఈ అడవికి రాజుని. అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కానీ స్నేహితులు ఎక్కడ ఉంటారు. నాకు బానిసలు, శత్రువులే కానీ స్నేహితులు ఉండరు,’’ అని గర్వంగా చెప్పింది సింహం. ‘‘కానీ నాకైతే చాలామంది స్నేహితులు ఉన్నారు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం. నేను కనిపించకపోయేసరికి వాళ్లంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎలాగైనా నన్ను రక్షిస్తారు,’’ అని నమ్మకంగా చెప్పింది జింక. ‘‘సరే! అదీ చూద్దాం... ’’ అని ధీమాగా అంది సింహం. ఆ బురద చెరువులో కాలం చాలా భారంగా గడిచింది. ఒకో గంటా గడిచెకొద్దీ సింహంలో అసహనం పెరిగిపోయింది. కానీ జింక మాత్రం నిశ్చింతగానే ఉంది. తన స్నేహితులు వస్తారనే నమ్మకం తనలో ఇసుమంతైనా తగ్గలేదు.   సాయంత్రం అయ్యింది. నిదానంగా చీకటి పడింది. అసలే ఆకలితో ఉన్న సింహం డీలాపడిపోయింది. కానీ తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది. ఇంతలో.... చెట్ల చాటు నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. ముందు ఓ జింక పిల్ల చెరువువైపు తొంగిచూసింది. ఆ తర్వాత మరో జింక, దాని వెనుక ఇంకో జింక.... వరుస పెట్టి ఓ జింకల మంద చెరువుగట్టుకి చేరింది. వాటికి అక్కడి పరిస్థితి చిటికెలో అర్థమైపోయింది. ఎలాగొలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి. తాళ్లే పడేశాయో, చేతులే చాచాయో... మొత్తానికి ఎలాగొలా బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి తెచ్చాయి. దాన్ని తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగి వెళ్లిపోయాయి.   తన కళ్ల ముందే జరుగుతున్నది చూసిన సింహానికి మతిచెడిపోయింది. కచ్చగా తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది. అంతే! అది మరింత లోతుకి జారిపోయింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

Health Hacks!!.

Here are some simple inclusions to be made into our lifestyles to lead a healthy life! Here goes the list :   Get rid of the Soda of your diet instead opt for a glass of water. Self cooking is yet another way to sparing yourself some bucks and yet serving yourself some health on the plate. Avoid the onsumption of pre-packed food. Try shopping on full stomach, all the junk will barely end up in your shopping basket. Make time for exercise, may it be walking or bikeride atleast for 20-30 minute. If you are way too busy to make some time to sweat it out, then make it up by standing on one leg while brushing by doing so you can improve your balance and musculature of your legs. A beast of our-times is the mobile phone, turn it off from time to time. As it can induce Psychological stress and lead to many more problems beyond our understanding. Swap desserts and candies for fruits and fruit juices, and white breads for wheat or multigrain ones! Follow the age-old saying 'Early to bed, early to rise , makes the man healthy, wealthy and wise'   Rise early and meditate for about 20 minutes, doing  some deep breathing and doing Yoga can wonders for you! Take a shower with cold water after you done using warm water, cold water is good for skin, hair and overall circulation is improved greatly. Eat only when hungry and chew down slowly, it takes about 20 minutes for your brain to signal that you are full! Make it a point to wash your hand before evry meal. Never skip your meals especially your breakfast1 It is breakfast that defines your day ahead! These are some well-known facts that need to be implemented into our routines!! Stay healthy!!   SIRI

Are Men Unemotional??

Are men from Mars and Women from Venus ??.Why do they think and behave exactly the opposite way on emotions basis?? It is a classic complaint we always hear, that men accuse women of being too emotional and women accuse men of not being emotional enough. They both think that why cant this be the other way round?? Or why cant they behave a bit different?? But the basic issue lies with the brain circuitry system. The emotional processing is different in men and women. Until recently, the chasm between how men and women feel and express emotions was thought to be due to upbringing .Of course, parental upbringing dose make a difference in thought process but still we should also know that the emotional processing in the male and female brain will not be the same genetically. Research suggests that our brains have two emotional systems that work simultaneously: system or MNS (which allows us to emotionally empathize with people); and the parietal junction system or TPJ (which fires the brain's analyze-and-fix-it circuits to look for solutions to emotional problems - cognitive empathy). Males use the latter far more. This prevents their thought processes from being clouded by emotions, strengthening their ability to find practical solutions, but this obviously make them appear to be uncaring and un emotional. Male or female, when we see an emotion on someone else's face, our MNS (emotional empathy system) activates. But, for reasons scientists don't understand, the female brain stays in the sympathetic MNS longer, while the male brain, not built to wallow in anguish, switches to the practical mode. His way of showing that he cares is to try to solve your problems.  So when you see men not reacting to your emotional outburst don’t get worked up, or go bananas, just keep reminding yourself that they are men and they want results soon.  - Pushpa Bhaskar

Sofa …So good

  The word sofa a Turkish word derived from the Arabic word "suffa" for 'wool, originating in the Aramaic word sippa for 'mat'. Now that’s a little trivia about the origins of the word sofa for you, which has become an integral part of one’s home all over the world. This piece of furniture is probably the most used piece of room furniture that is not only functional but also reflects your style and taste. Since buying your new sofa can be an investment of time and money you could try these few tips to help you buy the right sofa for your home. Size of the room The obvious pointer that you need to keep in mind is the size or dimensions of your living space and the door frames for it to fit through. Once you get the right room dimensions you can choose what fits. Functionality Now this is the most important factor while purchasing a sofa. Whether it’s for the casual seating where you have people putting up their feet and kids jumping all over choosing a tough and durable sofa is the need of the hour and not a fancy high end design which could spoil you happiness. Your budget, functionality and space are the major factors to buy the right sofa. Shape of the room This is very important when it comes to choosing the lounge sofas. If you have a square room these L shaped sofas fit well, but the same would be traumatic if you have a rectangle shaped room where the center piece would not fit correctly and the sofa cannot be adjusted. Sofa Style Choose a color and pattern that will be in sync with other furniture and accessories. You can’t have a fuchsia pink sofa and blue chairs or a leather sofa and cane side tables .So check the style of your other pieces of furniture and select your  sofa accordingly.   Timeless Classic Sofa If you are not going to be changing the look of your room  in a year or two, then its best to invest in a furniture which are always in and have witnessed the test of time. There are these certain designs which are considered classics like the Club Sofa, leather couches, and the set of 3 including the single, double and three seater which can be in wood, leather or soft cushions.  

ఫోన్లో మాట్లాడేటప్పుడు...

ఒకప్పుడంటే ఫోన్లో మాట్లాడటం విలాసం. కానీ ఇప్పుడో! పక్క ఇంట్లో ఉన్న మనిషితో కూడా ఫోన్లోనే మాట్లాడేస్తున్నాం. ఇలాంటి విచ్చలవిడి వాడకంలోని లాభనష్టాల మాట అటుంచితే ఫోన్లో మాట్లాడటం కూడా కళే అంటున్నారు నిపుణులు. మనిషి ఎదురుగుండా ఉండడు కాబట్టి మొహమాటమూ, భయమూ లేకుండా ఫోన్లో చెలరేగిపోతూ ఉంటాము. అలాంటి సమయాలలో కొన్ని కనీస మర్యాదలు పాటించాలని సూచిస్తున్నారు...   ముందుగానే నిర్ణయించుకోండి ఏదన్నా విషయం గురించి మాట్లాడాలనుకునేటప్పుడు, ఓ నిమిషం సేపైనా మీరు చెప్పాలనుకున్న విషయం ఏమిటి? దానిని అవతలివారికి ఎలా తెలియచేయాలనుకుంటున్నారు? అన్న అంశం మీద దృష్టి పెట్టండి. మీ మాటలకు అవతలి వ్యక్తి ఎలా స్పందించే అవకాశం ఉంది! దానికి మీ దగ్గర తగిన జవాబు ఉందా లేదా! అన్నది తరచి చూసుకోండి. లేకపోతే సంభాషణ మధ్యలో మాటలు తడుముకోవాల్సి ఉంటుంది.   పరిచయంతో మొదలు మన జీవితంలో ఎదురుపడిన ప్రతి ఒక్కరి దగ్గరా మన ఫోన్‌ నెంబరు ఉండాలన్న నిబంధన లేదు. కానీ చాలామందికి తమను తాము పరిచయం చేసుకునేందుకు అహం అడ్డు వస్తుంది. ‘నేనే మాట్లాడుతున్నాను’, ‘ఏంటి విశేషాలు’... అంటూ నేరుగా సంభాషణలోకి దిగిపోతుంటారు. అవతలివారు సదరు మనిషిని గుర్తపట్టలేక ఇబ్బందిపడుతూ ఉంటారు, ఒకవేళ గుర్తుపట్టినా సంభాషణ మొదలయ్యే తీరు చాలా అమర్యాదగా తోస్తుంది.    కనీస మర్యాదలు ఒక వ్యక్తి ఎదురుపడినప్పుడు నమస్కారం చెప్పడం, క్షేమసమాచారాలు అడగడం కనీస మర్యాదు. ఫోన్‌ సంభాషణలకు కూడా ఇదే వర్తిస్తుంది. అంతేకాదు! అవతలి వ్యక్తి హోదాలో ఎంత చిన్నవారైనా కూడా దురుసుగా మాట్లాడటం, వేళాకోళం చేయడంతో మన గురించి చెడు అభిప్రాయాన్నే మిగులుస్తుంది. చాలామంది ఫోన్లో మాట్లాడేటప్పుడు తమకి ఉన్న హాస్య చతురతని అంతా చూపిద్దామనుకుని గీత దాటుతూ ఉంటారు. దీంతో మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.   సాఫీగా సంభాషణ ఫోన్లో మన వాదనని వినిపించేందుకు ఎంతగా ప్రాధాన్యతని ఇస్తామో, అవతలివారి మాటని వినేందుకు కూడా అంతే ప్రాధాన్యతని ఇవ్వాలి. మాటిమాటికీ అడ్డు తగలడం, హెచ్చుస్థాయిలో మాట్లాడటం వల్ల వాదన కాస్తా వివాదంగా మారిపోయే అవకాశం ఉంది. తొందరగా మాట్లాడేయాలన్న కంగారులో ఏదిపడితే అది మాట్లాడేసే ప్రమాదమూ లేకపోలేదు. ఇక ఏదన్నా ముఖ్య విషయం మాట్లాడలనుకునేటప్పుడు టీవీ, ట్రాఫిక్‌ వంటి శబ్దాలు లేని సందర్భాన్ని ఎంచుకోవడం మంచిది.   సమయం కొంతమందికి ఫోన్‌ చూస్తే చాలు పూనకం వచ్చేస్తుంది. ‘సరే అయితే!, ‘ఇక ఉంటాను’ లాంటి సూచనలు ఇస్తున్నా కూడా సంభాషణని మరింతగా పొడిగిస్తూ ఉంటారు. ఇలాంటి సంభాషణలకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. ఫోన్ సంభాషణ ఎలా మొదలుపెట్టాలి అన్నదే కాదు, ఎంతసేపట్లో ముగించాలన్నది కూడా తెలిసి ఉండాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు ఇక చాలు అన్న సూచనని ఇచ్చినప్పుడు ఆ సంభాషణని ముగించడం మేలు. - నిర్జర.

Healthy Lifestyle for Healthy Life

  All that heart-healthy advice about eating the right foods, exercising and losing weight pay off in real life for both men and women, two new studies show. The reports, both originating at Brigham and Women's Hospital in Boston and published in the July 22/29 issue of the Journal of the American Medical Association, focused on different aspects of cardiovascular risk in two large groups: the 83,882 women in the second Nurses' Health Study, and the 20,900 men in the Physicians' Health Study I. Both arrived at the same conclusion: Do the right things, and you get measurable benefits. In Men The study in men looked at the relationship between the lifetime risk of heart failure and six lifestyle factors: obesity, exercise, smoking, alcohol intake, consumption of breakfast cereals, and consumption of fruits and vegetables. That look found a straight-line relationship between adherence to healthy lifestyle factors and the risk of heart failure, the progressive loss of ability to pump blood that is often a prelude to death. The lifetime risk of heart failure in the 22-year study was about one in five in men who ignored the advice about all beneficial lifestyle factors and one in 10 for those who adhered to four or more of the factors. "The one with a huge difference was adiposity," Djousse said. "The risk of heart failure was 17 percent in men who were overweight or obese, and about 11 percent in those of normal weight." Exercise was the next most important. Heart failure occurred in 11 percent of the men who exercised five or more times a week and in 14 percent of those who did not exercise, Djousse said. Smoking played a surprisingly small role, probably because its incidence was not high among the participants. " In Women The women's study looked at the association between high blood pressure -- a significant risk factor for heart disease, stroke and other cardiovascular problems -- and six lifestyle factors: obesity, exercise, alcohol intake, use of non-narcotic painkillers, adherence to a diet designed to prevent high blood pressure and intake of supplemental folic acid. All six were found to be associated with the risk of developing high blood pressure in the 14-year study, and the association was cumulative. Women who followed advice on all six factors had an 80 percent lower incidence of high blood pressure than those who followed none of the rules. Obesity was the most important risk factor.   While the clear message of both studies is that a healthy lifestyle prevents a number of illnesses, what is often overlooked is that the choice of a healthy lifestyle is not a purely individual decision. SO make that healthy choice for a healthy Lifestyle.  

ఇంటర్వ్యూ మేడ్ ఈజీ...

చాలా మంది ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి, వాటిని ఫేస్ చేయడానికి చాలా కంగారు పడుతుంటారు. అలాంటివారు ఈ క్రింద సూచనలను పాటించినట్లయితే విజయం సాధించవచ్చు. ఇంటర్వ్యూలలో సక్సెస్ కావడానికి ఎన్నో స్కిల్స్ వున్నాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.   బయోగ్రఫీ చెప్పొద్దు... ఇంటర్వ్యూలో తరచుగా మన బయోడేటాకు సంబంధిన ప్రశ్న అడుగుతుంటారు అలాంటప్పుడు చాలామంది వెంటనే తమ బయోగ్రఫీ గురించి చెప్పుకొంటూ పోతారు. కాని అ విధంగా చెప్పడం సరైన పద్ధతికాదు. ఒక రిక్రూటర్ అభ్యర్థి మాట తీరును చూస్తాడు. అభ్యర్థికి పనిచేసే సామరథ్యం ఎంత ఉందో చూస్తాడే తప్ప ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, ఎంత కష్టపడి పైకి వచ్చిందీ చూడడు.  అందుకే ఇంటర్వూలో పర్సనల్ హిస్టరీ గురించి ఎప్పుడు చెప్పకూడదు.   స్కిల్స్ ఏమిటో స్పష్టంగా చెప్పాలి.. ఇంటర్వ్యూకి వెళ్ళిన అభ్యర్థులు ఆ జాబ్‌కు తాము ఎలా న్యాయం చేయగలమో స్పష్టంగా చెప్పాలి. అందుకు తగ్గ స్కిల్స్ తమ దగ్గర ఏమున్నాయో వివరించాలి. అలా వివరించే సమయంలో స్పష్టత తప్పనిసరి. ముందు జాబ్ కు సంబంధించిన స్కిల్స్ చెప్పాలి. అవసరమైతే ఎవిడెన్స్ రూపంలో చూపించవచ్చు.   సూటిగా చూడాలి... ఇంటర్వ్యూ చేసే వ్యక్తులను సూటిగా చూడాలి. మన కళ్ళలో సూటితనమే వారిలో వున్న ఎన్నో ప్రశ్నలకు చెప్పకుండానే సమాధానాలు చెప్పేస్తాయి.   బలహీనతలు ఒప్పుకోండి... రిక్రూటర్‌కు చెప్పే బలహీనతలు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నిజాయితీగా మన బలహీనతలు ఒప్పుకోవాలి. మీరు ఏ పనులైతే చేయలేరో, ఏయే విషయాలలో మీకు స్కిల్ లేదో స్పష్టంగా చెప్పేయాలి. లేని స్కిల్స్‌ ఉన్నాయని చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. లేని విషయాలు చెబితే వాటిని రిక్రూటర్ పట్టేస్తాడు. దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగితే దొరికిపోయే ప్రమాదం వుంది. అయినా శుభమా అంటూ ఒక ఉద్యోగంలో చేరుతూ మొదటి స్టెప్‌లోనే అబద్ధాలు చెప్పడం వల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పండీ?   సాగదీయొద్దు... సమాధానాలు చెప్పేటప్పుడు దాన్ని సాగదీయొద్దు. ఏ విషయాన్నయినా సూటిగా, స్పష్టంగా, సుత్తిలేకుండా చెప్పండి.. ఇక ఉద్యోగం మీదే.. నో డౌట్.. ఆల్ ద బెస్ట్..

ఆ ఊరిని చూసి మనం తల దించుకోవాల్సిందే!

స్వచ్ఛ భారత్‌ ఉద్యమం ఈ మధ్యకాలంలో మొదలైంది. ఈ ఉద్యమం కోసం ప్రభుత్వం ఎంత ప్రచారం చేస్తున్నా, ఎన్ని వందల కోట్లు వెచ్చిస్తున్నా... ఫలితం ఏమేరకు ఉంటుందో చెప్పడం కష్టమే! ఎందుకంటే మనకి తీరు తక్కువ. చెత్త పారేయడం దగ్గర నుంచీ, రోడ్ల మీద పశువులని వదలిపెట్టడం వరకూ ఎవరి ఇష్టారాజ్యంగా వారు వ్యవహరిస్తుంటారు. అలాంటిది ఎక్కడో ఈశాన్యంలో మూలన ఉన్న ఓ పల్లెటూరు ఆసియాలోనే అతి పరిశుభ్రమైన ఊరు అంటే నమ్మగలరా. నమ్మి తీరాల్సిందే! అది మేఘాలయ రాజధాని షిల్లాంగ్. ఆ రాజధానికి 90 కిలోమీటర్ల దూరంలో ‘మాలినాంగ్’ అనే చిన్న ఊరు. ఆ ఊరి జనాభా మొత్తం కలిపితే 600కి మించరు. కానీ ఊరిలోకి అడుగుపెట్టగానే అదేమీ సాధారణమైన పల్లె కాదని అర్థమైపోతుంది. ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుందే కానీ కాగితం ముక్క కానీ, పశువుల వ్యర్థాలు కానీ మచ్చుకైనా కనిపించవు. పైగా త్రికోణం ఆకారంలో ఎక్కడ చూసినా డస్ట్‌ బిన్స్‌ కనిపిస్తూ ఉంటాయి. వాటిలో మట్టిలో కలిసిపోయే వ్యర్థాలకి వేరుగా, కలవని వ్యర్థాలకు వేరుగా బుట్టలు ఉంటాయి.     మాలినాంగ్‌ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న తపన ఆ ఊరిలో ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. అందుకోసం ప్రతి ఇంట్లోనూ పిల్లాపాపల దగ్గర్నుంచీ ఉదయాన్నే లేచి తమ ఇంటినీ, పరిసరాలనీ శుభ్రపరిచే కార్యక్రమంలో కాసేపు నిమగ్నమైపోతారు. ఊరంతా పేరుకున్న చెత్తలో మట్టిలో కలిసే వ్యర్థాలను ఎరువు కిందరి మార్చేస్తారు. కలవని వ్యర్థాలను ఊరిబయట దూరంగా కాల్చివేస్తారు.   ఇంతకీ ఊరిని ఇలా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటే ఓ కారణం చెబుతారు. ఓ 130 ఏళ్ల క్రితం మాలినాంగ్‌ ఊరిని కలరా జాడ్యం కమ్ముకుంది. అపరిశుభ్రత కారణంగానే ఈ వ్యాధి వ్యాపిస్తుంది అని వారికి వైద్యులు చెప్పారు. అప్పటి నుంచి కూడా ఊరిని శుభ్రంగా ఉంచుకోవడాన్ని ఓ అలవాటుగా మార్చుకున్నారు ఆ ఊరి ప్రజలు.     పరిశుభ్రతతో పాటుగా మాలినాంగ్‌లోని చాలా విషయాలు మనకి ఆదర్శంగా నిలుస్తాయి. అక్కడ ఏకంగా 95 శాతం అక్షరాస్యత కనిపిస్తుంది. ఇంటింటికీ మరుగుదొడ్డి ఉంది. ఇక మాలినాంగ్‌లో మాతృస్వామ్యానిదే పైచేయిగా కనిపిస్తుంది. అక్కడి ప్రజల ఆస్తి తండ్రి నుంచి కొడుకుకి కాకుండా తల్లి నుంచి కూతురికి సంక్రమిస్తుంది. వారి ఇంటిపేరు కింద తల్లిపేరునే కొనసాగిస్తారు. ఇక గ్రామంలో పొగతాగడం, క్యారీబ్యాగ్‌లు వాడటం నిషేదం. వర్షపు నీటిని వీలైనంతగా ఒడిసిపట్టేందుకు గ్రామప్రజలు ప్రయత్నిస్తారు. తీరిక వేళల్లో పాత ప్లాస్టిక్‌ వస్తువులతో ఏదన్నా కొత్త వస్తువులని రూపొందించే ప్రయత్నం చేస్తారు.   మాలినాంగ్ ఇంత ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఎక్కడో మారుమూల ఉన్నా కూడా... ఈ గ్రామ విశిష్టత ప్రపంచానికి తెలిసిపోయింది. డిస్కవరీ పత్రిక 2003లోనే ఈ గ్రామాన్ని ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామంగా పేర్కొంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో కూడా ఈ గ్రామం గురించి ప్రస్తావించారు. మాలినాంగా మజాకా! - నిర్జర.

కరోనాతో జంటలలో పునరుత్పత్తి ఆగిపోతోందా?

లాక్డౌన్ సమయంలో కొత్త దంపతులు, ఇంటి పట్టున ఉంటున్న భార్యభర్తలు అనేక మంది సమయం దొరకడంతో దాంపత్య జీవితం మీదనే పూర్తి ఫోకస్ పెట్టి ఎంజాయ్ చేశారనే వార్తలు చూశాం కానీ అదే జంటలు పునరుత్పత్తి అంటే మాత్రం తెగ భయపడిపోతున్నాయట. ప్రఖ్యాతి గాంచిన జర్నల్ ఆఫ్ సైకో సొమాటిక్ రీసెర్చ్ గైనకాలజీ ఇటీవల ఇదే విషయం మీద ఒక స్టడీ నిర్వహించింది. మన దేశంతో సహా అనేక దేశాలలో జంటలు కరోనా సమయంలో తల్లిదండ్రులు కాకూడదు అనుకుంటున్నారు. గర్భం దాల్చినపుడు కరోనా సోకితే కష్టమనే భయం ఇందుకు ప్రధాన కారణం. సర్వే లో పాల్గొన్న 73 శాతం మంది ఇదే రకం అభిప్రాయం వెలిబుచ్చారట. ఇందుకు మనదేశంలోని నగరాలు కూడా మినహాయింపు కాదట. గర్భం వస్తే ప్రతి నెల చెకప్కు ఆసుప్రతికి వెళ్ళవలసి రావడం , డాక్టర్లు ఆసుపత్రులు అందుబాటులో లేకపోవడం, డాక్టర్లు కూడా ఎక్కువ మంది పేషెంట్లను డైరెక్టుగా చూడకుండా ఆన్ లైన్ లో కౌన్సలింగ్ చేస్తామనడం ఇందుకు కారణం. చాలా మంది జంటల్లో ఇంకో భయం కూడా ఉంది, కరోనా కాలంలో ఆర్థిక వ్యవస్థలు కుదేలు కావడం, ఉద్యోగాలకు గ్యారంటీ లేకపోవడం కూడా కారణమట. సర్వేలో పాల్గొన్న గైనకాలజిస్టులు కూడా తాము దంపతులకు ప్రస్తుతానికి ప్రెగెన్సీని పోస్ట్ పోన్ చేసుకోమని చెబుతున్నానమని, చాలా మంది అందుకు ఒప్పుకుంటున్నారని అంటున్నారట.    ఇదంతా ఉద్యోగాల మీద ఆధారపడ్డ జంటల సంగతి అయితే మన హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో ఇంకో నయా ట్రెండ్ నడుస్తోంది. డబ్బుల కోసం అవసరం ఉన్నా లేకపోయినా సిజేరియన్లు చేసే ఆసుపత్రులు, డాక్టర్లు మాత్రం సిజేరియన్లు చేయం అని చెప్పేస్తున్నారట. ఇందుకు డాక్టర్లలో కరోనా భయమే కారణం. సిటీలో ఒక ప్రముఖ గైనకాలజిస్టు ఏం చెప్పారంటే ఇపుడు తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎవరికైనా ఏ సర్జరీ కానీ, ఏ మెడికల్ ప్రొసీజర్ చేసే ముందు కానీ కరోనా టెస్ట్ చేయాలన్న రూల్ పెట్టలేదు.    మామూలుగా కరోనా పేషెంట్ తుమ్మినపుడో, దగ్గినపుడో కన్నా వారికి ఏదైనా సర్జరీ జరిగి శరీరాయవాలను ఓపెన్ చేసినపుడు రోగి లోపలున్న వైరల్ లోడ్ చాలా డైరెక్టుగా బయటకు ఎక్స్ పోజ్ అవుతుందట. దాంతో డాక్టర్లు, నర్సులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ అంటుకోవచ్చన్న భయం ఉందట. ఆ మధ్య కాలంలో నిమ్స్ లో డాకర్లు అనేక మంది ఒక్కసారిగా కరోనా పాజిటివ్ అయ్యారు. దానికి కారణం అక్కడ ఒకరిద్దరు పేషెంట్లకు సర్జరీ జరిగినపుడు వారికి ఆల్ రెడీ కరోనా సోకి ఉండటం, సర్జరీ అపుడు వైరల్ లోడ్ అందరికీ ఎక్స్ పోజయి కొందరు డాక్టర్లు వైరస్ బారిన పడటం జరిగింది. ఇంత భయాలున్న చోట అటు డాక్టర్లు, ఇటు జంటలు ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించకపోవడం విచిత్రం ఏమీ కాదు. ఇక నలభై యేళ్ళ లేటు వయసులో కరీనా, అంతకన్నా మరీ లేటు వయసులో సైఫ్ అలీ ఖాన్ తల్లితండ్రులం కాబోతున్నామని ప్రకటన చేశారు. వారు సెలబ్రిటీలు కాబట్టి వారికి ఏం చేసినా  నడుస్తోంది కానీ మామూలు జంటలు మాత్రం ఇపుడు ప్రెగ్నెన్సీ అంటే సుముఖంగా లేరని తెలుస్తోంది. సిటీలో ఇపుడు వెలవెలబోతున్న ఫర్టిలిటీ సెంటర్లే ఇందుకు ఉదాహరణ. 

Plan your meals for healthy Lifestyle

Studies have shown that if you’re planning to lose weight you need to discuss on what groceries you are shopping for and not deviate. Avoid friends offers of eating sweet treats and boost intake of fruit and vegetables and plan your day to day meals. Planning your meals in advance and sticking to it makes you a healthy person. Studies show that this leads to weight loss because you fill up on healthy foods and feel less tempted to eat fatty snacks. Psychologist Cristina Albuquerque Godinho, from the Lisbon University Institute in Portugal, said the key to success was planning ahead and motivation.  She added: ‘Buying food ad hoc in the supermarket is not a helpful approach. Write a list and make a deliberate intention to change behaviour or lose weight, because this is a strategy that works.’ Miss Godinho said: ‘We found that having strategies in place to deal with a range of eating situations that could undermine good intentions is very important, and helps people to regulate their daily dietary choices. She added that eating more fruit and vegetables had been proven to keep weight down partly because it replaced less healthy food. People who said they would plan in advance how to get their five-a-day or more were much more likely to succeed in eating healthily. Those who understood the health benefits of eating well also found it easier to change their habits, according to the research to be published in the British Journal of Health Psychology.  

సోదర ప్రేమకు చిహ్నాం

వేదకాలం నుంచి నేటివరకు మన జీవనవిధానంలో భాగంగా నిర్వహించే పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కుటుంబవ్యవస్థ పునాదులపై విరాజిల్లుతున్న భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ ఆత్మీయానురాగాలను పెంచేవే. సోదరప్రేమకు చిహ్నాంగా మనం జరుపుకోనే రాఖీ చరిత్ర పురాణాల నుంచే ప్రారంభమైంది. భారతీయ వారసత్వవైభవానికి ప్రతికగా నేటికీ కొనసాగుతోంది. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమిగా మన తెలుగు నాట పిలిస్తే  రక్షా మంగళ్‌, రక్షా దివస్‌, రాఖీ పూనవ్‌,  కజారి పౌర్ణమి, నారియల్ పౌర్ణమి, గ్రహ పౌర్ణమి, సలోని ఉత్సవ్‌ తదితర పేర్లతో దేశంలో వివిధ ప్రాంతాల్లో వ్యవహరిస్తారు. పేర్లు ఎన్నైనా రాఖీ మనుషుల మధ్య, ప్రకృతికి, మనిషికి మధ్య అనుబంధాన్ని గుర్తుచేసే పర్వదినం. హిందువులు, సిక్కులు, జైనులు కూడా ఈ పర్వదినాన్ని జరుపుకొంటారు. ‘రాకా’ అంటే నిండుదనం, సంపూర్ణత్వం. రాకా చంద్రుడు అంటే పున్నమి చంద్రుడు. ఈ పూర్ణిమనాడు ధరించే రక్షను రాఖీగా వ్యవహరిస్తారు. ఈ రోజు అక్కచెల్లెల్లు తమ అన్నాతమ్ముళ్లకు నుదట  తిలకం దిద్ది చేతికి రాఖీ కడితే వారికి ఎలాంటి ఆపదలు రావని నమ్ముతారు. రాఖీ కట్టించుకున్న సోదరులు తమకు అండగా ఉంటారని విశ్వసిస్తారు. పురాణాల్లో. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తిరిగి విజయం సాధించేలా అతని భార్య  శచీదేవి శ్రావణపౌర్ణమి రోజు అతని చేతికి రక్ష కట్టగా దేవతలందరూ కూడా రక్షలను తీసుకువచ్చి కట్టారట. దాంతో రెట్టింపు శక్తితో యుద్ధరంగానికి వెళ్ళిన ఇంద్రుడు విజయుడై తిరిగివచ్చాడట. శిశుపాలుడిని శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని  శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇచ్చాడట. అందుకు ప్రతిగా కౌరవసభలో ద్రౌపదీ వస్త్రాపరణంలో ఆమెకు కృష్టుడు చీరలను ఇచ్చి దుశ్సాసనుడి  దురాగతం నుండి ఆమెను కాపాడాడని చెప్తారు. చరిత్రలో.. ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న తపనతో భారతదేశం పైకి దండెత్తి వచ్చిన గ్రీకు రాజు అలెగ్జాండర్ ప్రాణాలను రాఖీ కాపాడిందన్నవిషయం చరిత్ర పుటల్లో కనిపిస్తుంది. తక్షశిల రాజు పురుషోత్తముడు  అలెగ్జాండర్ పై యుద్ధం గెలిచినా అతడిని చంపకుండా వదిలేస్తాడు. ఇందుకు కారణం అలెగ్జాండర్ భార్య  రుక్సానా తన భర్తను చంపవద్దని కోరుతూ పురుషోత్తముడికి రాఖీ పంపుతుందట. వివిధ రాష్ట్రాల్లో... ఉత్తరభారత్ లో  చాలా పెద్దఎత్తున ఈ పండుగ చేస్తారు. తమ సోదరి ఇంటికి అన్మదమ్ముళ్లు ఊరేగింపుగా వస్తారు. సోదరితో రాఖీ కట్టించుకుని ఆమెకు కానుకలు ఇస్తారు. సముద్రతీర రాష్ట్రాలైన మహారాష్ట్ర, గోవా, గుజిరాత్ లలోశ్రావణ పౌర్ణమిని నారియల్ పౌర్ణమిగా భావిస్తారు. పంటలు బాగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని వరుణదేవుడిని ప్రార్థిస్తారు. అంతేకాదు మత్యకారులు సముద్రుడిని ప్రార్థించి ఈ రోజు తమ చేపల వేటను ప్రారంభిస్తారు.  జార్ఖండ్, బీహార్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ఒడిశా రాష్ట్రంలో ఈ రోజు తమ పశుసంపదను అలంకరిస్తారు. వాటికి పూజలు చేస్తారు. కరోనా వ్యాప్తి కారణంగా ఎక్కువ మంది తమ సోదరులకు రాఖీ స్వయంగా కట్టలేకపోయినా అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియాతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

పరాజయం నేర్పే పాఠాలు

జీవితం అంటేనే ఆటుపోట్ల సమాహారం. అందులో ఎప్పుడూ విజయాలే ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఒకోసారి పరాజయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ పరాజయాలనే పరమపదసోపానాలుగా మల్చుకుంటే బతుకు కావడికుండలాగా సమంగా సాగిపోతుంది. ఇంతకీ ఆ పరాజయాలు నేర్పే పాఠాలు ఏమిటో!   డబ్బు విలువ నేర్పుతుంది చాలా పరాజయాలు ధననష్టంతోనే ముడిపడి ఉంటాయి. అప్పటి వరకూ ఈ చేతికి తెలియకుండా ఆ చేతితో ఖర్చుపెట్టేసిన బంగారుబాబులకి దరిద్రం ఎప్పుడైనా, ఎవరినైనా వరించవచ్చని తెలిసొస్తుంది. నిజంగా అవసరమైనప్పుడు మన దగ్గర డబ్బు లేకుండా పోవచ్చునని అర్థమవుతుంది. వెరసి... డబ్బు విలువ తెలిసొస్తుంది.   మనుషుల విలువ నేర్పుతుంది ‘విజయానికి బంధువులు ఎక్కువ’ అని పెద్దలు అంటూ ఉంటారు. కాస్తంత కష్టం రాగానే తుపాకీ దెబ్బకి కూడా దొరక్కుండా మన చుట్టుపక్కల జనాలంతా కనిపించకుండా పోవచ్చు. అలాంటి కష్ట సమయాల్లోనే ఎవరు మనవారో, ఎవరు కాదో అర్థమవుతుంది. ఇతరుల దృష్టిలో మన విలువ ఏమిటో తెలిసొస్తుంది. ఎవరి తత్వం ఏమిటో బోధపడుతుంది.   వినయం విలువ నేర్పుతుంది అంతాబాగున్నప్పుడు ఎగిరెగిరి పడుతూ ఉంటాము. మనంతటి వాడు లేడని మిడిసి పడుతూ ఉంటాము. ఒక్కసారి ఎదురుదెబ్బ తగిలితే కానీ మనం కూడా సాధారణ మనుషులమే అని తెలిసిరాదు. కష్టాలకీ, కన్నీళ్లకీ, పరాజయాలకీ, పరాభవాలకీ ఎవ్వరూ అతీతం కాదని తెలిసొస్తుంది. అంతేకాదు! ఇతరులని కూడా ఇక నుంచి గౌరవంగా చూడాలనీ, వినయంతో మెలగాలనీ అనిపిస్తుంది.   లక్ష్యం విలువ నేర్పుతుంది కష్టపడితే ఏదీ కాళ్లదగ్గరకి రాదు. అలా వచ్చేదానికి విలువ ఉండదు. లక్ష్యం ఎంత అసాధ్యంగా ఉంటే దాని ఛేదనలో అంత తృప్తి ఉంటుంది. ఒకటి రెండు సార్లు ఆ లక్ష్యాన్ని తప్పిపోయినప్పుడు దాని విలువ ఏమిటో తెలిసొస్తుంది. దాన్ని ఏలాగైనా ఛేదించి సాధించాలన్న పట్టుదలా పెరుగుతుంది.   జీవితం విలువ నేర్పుతుంది అప్పటివరకూ ఎడాపెడా సాగిపోయిన జీవితం పరాజయంతో ఒక్కసారిగా నిలిచిపోయినట్లు అవుతుంది. ఆ క్షణంలో మనకి కాలం, కష్టం, కరుణ, దురలవాట్లు, సంతోషం, అడ్డంకులు, ప్రణాళికలు... వంటి అనేక విషయాల గురించి అవగాహన ఏర్పడుతుంది. మన వ్యక్తిత్వం గురించీ, ఆలోచనా విధానం గురించి ఒక స్పష్టత కలుగుతుంది.   - నిర్జర.

భారతీయ స్త్రీలకి ఎక్కువవుతున్న మానసిక వత్తిడి

    సరోజ అయిదు గంటలకే లేచింది. బ్రష్ చేసుకుని కాలకృత్యాలు తీర్చుకుని కాసేపు యోగా చేసి, పిల్లల్ని లేపి, స్కూల్ కి రెడీ కమ్మని చెప్పి వంట గదిలోకి దూరింది. బ్రేక్ ఫాస్ట్ చేసింది. అందరూ ఒకటే రకం తినరు. కొంతమందికి ఇడ్లీ, చట్నీ చేసి, పాలు, సిరియల్, పళ్ళరసం, బ్రెడ్ టోస్ట్ చేసి, బట్టర్, జామ్, టేబుల్ మీద పెట్టింది. తనకి, భర్తకి కాఫీ, కలిపింది. పిల్లలకి లంచ్ బాక్స్ ల్లో ఒకరికి పరోటా, స్నాక్ కి కుక్కిస్, జ్యూస్ పెట్టింది, మరొకరికి సాండ్ విచ్, స్నాక్, చాక్లెట్ మిల్క్ పెట్టింది. కూతురు బ్రేక్ ఫాస్ట్ చేయగానే రెండు జడలు వేసింది, కూచిపూడి నేర్చుకుంటుంది కాబట్టి జుట్టు కట్ చేసుకోకుండా పెంచుకుంటుంది కాబట్టి రోజు జడలు వేయాల్సిందే. పిల్లలు రెడీ అయ్యి స్కూల్ బస్ వచ్చే టైమ్ కి పరిగెత్తారు. భర్త కూడా రెడీ అవుతున్నాడు, సరోజ తమ ఇద్దరికి లంచ్ ప్యాక్ చేసి టేబుల్ మీద పెట్టి బట్టలు మార్చుకుని రెడీ అయ్యి, బ్రేక్ ఫాస్ట్ తిన్నాననిపించింది, కాఫీ చల్లారి పోతే వేడి చేసింది, భర్త బ్రేక్ ఫాస్ట్ టి.వి.లో న్యూస్ చూస్తూ తింటున్నాడు. సరోజ కాఫీ సిప్ చేస్తూనే గిన్నెలు డిష్ వాషర్ లో పెట్టేసింది. టైమ్ కాగానే ఇద్దరూ ఇంటికి తాళం వేసి బయట పడ్డారు.   సరోజ పిల్లల స్కూల్ అయిపోయేవరకే వర్క్ చేస్తుంది. మిగిలిన పని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పనులయ్యాక రాత్రి ఒక రెండు గంటలు పని చేసుకుంటుంది. పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చి వారికి తినడానికి ఏదైనా పెట్టి ఒకరిని పియానో క్లాస్ కి, మరొకరినీ సాకర్(ఇండియాలో ఫుట్ బాల్) ప్రాక్టీస్ దగ్గర దిగబెట్టి ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత ఒకొక్కరిని పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చి వారికి హోం వర్క్ లో సాయం కావాలంటే చేస్తుంది మళ్ళీ సాయంత్రం వంట, ఇల్లు క్లీనింగ్, లేదా లాండ్రీ పనులు చేసుకుంటుంది. భర్త ఇంటికి త్వరగా వస్తే పిల్లలకి హోం వర్క్ చేయించడమో, లాండ్రీ పనో, ఎపుడైనా ఒకసారి ఇల్లు వాక్యూమ్ పని చేస్తాడు. రోజు పిల్లలకి స్కూల్ తర్వాత ఏదో ఒక క్లాస్ వుంటుంది. ఇండియన్ పిల్లలందరికి ప్రజ్ఞా క్లాస్ అనీ శ్లోకాలు అవి నేర్పిస్తారు,పాపని కూచిపూడి డ్యాన్స్ కి పంపిస్తారు, బాబుకి మృదంగం, మళ్ళీ ఇద్దరికీ కలిపి కర్ణాటక సంగీతం గాత్రం నేర్పిస్తారు. మాతృభాష తనే నేర్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు సరిగ్గా నేర్చుకోలేదు మళ్ళీ దానికి క్లాసులకి పంపించడం మొదలు పెట్టారు. ఇలా సరోజ అటూ ఉద్యోగం, ఇటు పిల్లలకి మన సంస్కృతిని మర్చిపోకుండా వుండాలంటే అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేయాలి అనుకుని చాలా సమయం పిల్లల్ని ఈ రకరకాల క్లాసులకి తీసుకెళ్ళడానికి కార్లోనే గడిపేస్తుంది. ఈ మధ్యనే తనకి థైరాయిడ్ సమస్య వచ్చింది. త్వరగా అలిసిపోతుంది. వీకెండ్స్ వస్తే ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళడమో, వారిని పిల్చి గెట్ టుగెదర్ చేసుకోవడమో చేస్తారు. కొంతమంది స్త్రీలు వలంటీర్ పని చేయడం, ఏదైనా ఇండియన్ సంస్థలో కానీ అక్కడి వలంటీర్ సంస్థల్లో వారికిష్టమయిన పనులు చేస్తుంటారు. ఒకోసారి రాత్రిపూట ఎవరైనా కాల్ చేస్తే అక్కడికి వెళ్ళి వారికి ఏ విధంగా సాయం చేయగలరో అలా చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలా ఉరుకులు పరుగుల మీద సాగుతుంటుంది సామాన్యంగా విదేశాల్లో వుండే ఏ భారతీయ స్త్రీ జీవితం అయినా. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.   ప్రపంచంలో అందరికంటే ఎక్కువ మానసిక వత్తిడి ఎదుర్కునే స్త్రీలెవరంటే, భారతీయ స్త్రీలు 87% కంటే ఎక్కువగా మానసిక వత్తిడి (Stress)కి గురవుతున్నారని నీల్ సన్(Nielsen)సర్వేలో తేలింది 2010 సంవత్సరంలో. భారతీయ స్త్రీలు ప్రతి రంగంలో అడుగిడుతున్నారు, తాము ఎవ్వరికీ తీసిపోమని నిరూపించుకుంటున్నారు, విజయాలేన్నో సాధిస్తున్నారు. అయినా ఇంకా భారతీయ కుటుంబంలో ఆడపిల్ల పుడుతుందంటే భయం, ఎందుకూ? ఆడపిల్లని చదివించాలి, మొగపిల్లలని కూడా చదివిస్తారనుకొండి, కానీ వారయితే వృద్దాప్యంలో తమని చూసుకుంటారని పున్నామ నరకం నుండి తప్పిస్తారని ఒక మూడ నమ్మకం. స్త్రీలు అత్తగారి ఇంట ముక్కు మొహం తెలియని వ్యక్తిని పెళ్ళి చేసుకుని, కొత్త మనుషులని తన మనుషులుగా అనుకుని సర్ధుకు పోవాలి, అక్కడే ఆమె ధైర్యం, తెగువ కనిపిస్తాయి. ఎక్కడకెళ్ళినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒదిగిపోయి ఆ యింటిని ఒక ఆనందనిలయంగా చేయడానికి ప్రయత్నిస్తుంది. మారుతున్న సమయంతో పాటు పరిస్థితులు మారుతున్నాయి.   కొడుకులు తమని వృద్దాప్యంలో చూసుకుంటార నుకున్నవారు, విదేశాల్లో ఉద్యోగాలు వచ్చి లేదా అక్కడ జీవితం ఇక్కడికన్నా బాగుంటుందని వెళ్ళేవారు కొందరు. అలా కొడుకులు దూరమైతే వారిని చూసుకుంటున్నది ఎవరూ? కేవలం కొడుకులున్నవారైతే స్నేహితులతో, బందువులతో, తమలా ఒంటరిగా బ్రతుకుతున్న వారిని స్నేహితులుగా చేసుకుని కాలేక్షేపం చేస్తున్నారు తల్లి తండ్రులు. అమ్మాయిలున్నవారు వారి కుటుంబంతో పాటు తల్లి తండ్రులని చూసుకుంటున్నారు. ఎవరైతే భారమవుతారనుకుంటున్నారో నేడు వారే, బాగా చదువుకుని, మంచి వుద్యోగాలు చేస్తూ తల్లి తండ్రులకి కూడా ఆసరా అవుతున్నారు.   మరో ఉదాహరణ చెప్పుకోవాలంటే.... ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు, అందులో ఇద్దరు విదేశాల్లో వున్నారు, ఇండియాలో వున్న కూతురు మంచి వుద్యోగం చేస్తుంది, తన ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఒకోసారి కొన్ని వారాలకి, నెలలకి ఇతర దేశాలకి వెళ్ళాల్సి వుంటుంది. ఇంట్లో పనులతో పాటు, పిల్లలను చూసుకుంటూ, ఒంట్లో బాగాలేని తండ్రికి అప్పాయింట్ మెంట్ కోసం ఆఫీసు నుండి టైమ్ తీసుకుని వచ్చి తీసుకెళ్ళడం, టెస్ట్ లు చేయించడం, మందులు కొని ఇంటికి తీసుకెళ్ళి వదిలిపెట్టి శనివారం, ఆదివారం వారితో గడపడానికి పిల్లలు, భర్తతో వెళ్ళి తల్లి తండ్రికి కావాల్సినవి అన్నీ అమర్చిపెడుతుంది. తల్లి ఈ మధ్యనే రిటైర్ అయ్యింది, వారం అంతా తండ్రిని చూసుకోవడంలో బిజీగా వుండే అమ్మని కాసేపు బయటికి తీసుకెళ్ళడం, రాత్రిళ్ళు ఆఫిసు పనులు ఇంటికి తెచ్చుకుని చేసుకోవడం చేస్తుంది. అత్తగారు, మామగారు వచ్చినా వారికి కావాల్సినవి అన్నీ చూసుకుంటుంది తన తల్లి తండ్రులకి చూసుకున్నట్టుగానే.   ఇప్పుడు చెప్పండి ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తున్న స్త్రీలు మానసిక వత్తిడికి లోనుకావడంలో ఆశ్చర్యం ఏమైనా వుందా! అందరికీ భర్తల సహకారం వుంటుందని లేదు అలాంటి వారు, తాము అనుకున్న పనులన్నీ చేయాలంటే వారితో వాదిస్తూ కూర్చోవడం కంటే అన్నీ పనులు తాము చేసుకుంటేనే సులువవుతుందని చేసుకుంటుంటారు.   కొంతమంది స్త్రీలకి తాము నమ్మే సిద్దాంతాల కోసం పాటు పడాలని వుంటుంది. వారు అనుకున్నది చేస్తున్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదురుకుంటూ ముందుకు సాగుతున్నారు. వుద్యోగాల్లో ఒకో మెట్టు ఎక్కుతూ ప్రమోషన్లు సంపాదిస్తూ సాగుతున్నవారు ఒకోసారి పెద్ద ప్రమోషన్లు వచ్చినపుడు ఏం చేయాలో తెలియక అవస్థ పడుతున్నారు. ప్రమోషన్ తీసుకుంటే, ఇంట్లో బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించలేమని, పిల్లలను ఎప్పుడో ఒకసారి చూసుకోవాల్సి వస్తుందని, రోజులు, వారాలు లేదా నెలలు కాన్పరెన్స్ లకో, మీటింగ్ లకో, వేరే వూళ్ళకి, దేశాలకి వెళ్ళాల్సి వస్తుందని, పిల్లలు పెరిగిపోతుంటే వారితో పాటు సమయం గడపలేకపోతున్నామనే బాధ అమ్మలని పీకుతూనే వుంటుంది. అందుకని కొంతమంది ప్రమోషన్లు వదులుకుంటున్నవారు కూడా వున్నారు. అదే గాక వర్క్ ప్లేస్ లో వివక్షతని ఎదుర్కునేవారు దాన్ని పట్టించుకోని వారు కొందరయితే, మరి కొంతమంది ధైర్యంగా వివక్షతకి, సెక్స్యువల్ హరాస్మెంట్ కి వ్యతిరేకంగా పోరాడుతూ, ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ మానసిక వత్తిడిని పెంచకపోతే మరేం చేస్తాయి? చెప్పండి.   ఈ మానసిక వత్తిడికి గురి కాకుండా వుండాలంటే, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో అందరు కుటుంబ సభ్యులని కానీ, వుద్యోగం చేసే దగ్గర కానీ ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాలనే రూల్ లేదు, అది సాధ్యం కాదు కూడా అందుకని సినిమాలోలా మంచి కోడళ్ళుగా వుండాలంటే అసాధ్యం కనుక మీకు తృప్తి కలిగే వరకు ఏదైనా పనిని చేసి వదిలి పెట్టండి, అది ప్రతి ఒక్కరికీ నచ్చుతుందా లేదా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఆ పనిని అసలు చేయడానికి ప్రయత్నం కూడా చేయరు. స్త్రీలూ మనుషులుగానే పని చేయాలి కానీ "సూపర్ మామ్స్" లా, "సూపర్ వుమెన్" లా వుండాలని, రోబోట్స్ లా ప్రతి నిముషం పని చేస్తుంటే శారీరక, మానసిక వత్తిడి ఎక్కువయి జబ్బుల పాలవుతారు. అందుకని కేవలం మీకంటూ సమయం పెట్టుకుని రిలాక్స్ కావడానికి ప్రయత్నించండి. రిలాక్స్ కావడానికి మంచి సంగీతం వినవొచ్చు, లేదా పాడుకోవచ్చు, మీకు వచ్చిన ఏవైనా కళలను(ఒక భార్యగా, అమ్మగా, కోడలిగా, వదినగా, వుద్యోగినిగా, ఇలా ఎన్నో బాధ్యతల మధ్య మీరూ మీకిష్టమైన కళని నేర్చుకున్నారనే విషయాన్ని మర్చిపోతారు చాలామంది) బయటికి తీసి వాటిని మళ్ళీ సాధన చేయడం మొదలు పెట్టండి.   యోగాసనాలు చేస్తే శరీరానికి మంచిది, మెదడుకి ప్రశాంతత లభిస్తుంది. అపుడు ఫ్రెష్ గా అన్నీ పనులు ఎక్కువ వత్తిడి లేకుండా చేసుకోవచ్చు. యోగా ఒకటే కాదు ఇపుడు ఎన్నో రకాల ఎక్సర్ సైజులు వచ్చాయి అందులో మీకు ఏది బాగా సూట్ అవుతుందో, నచ్చుతుందో అదే ఎన్నుకొని చేసుకొండి.   వుద్యోగంలో మీకు తృప్తిగా వుంటే వుండండి లేదా మీకూ, మీరు ఎంత కష్ట పడి చేసినా ఆ పనికి విలువనివ్వకపోతే మీకు మరో వుద్యోగం సంపాదించుకోగలను అనే నమ్మకం వుంటే అది వదిలేసి వీలయితే ఎన్నో కొత్త కొత్త కోర్సులు, ట్రైనింగులు, డిగ్రీలు వున్నాయి, కొత్త పనులు నేర్చుకొండి. ఎప్పుడూ ఆర్ధిక స్వాతంత్ర్యం కలిగి వుండేలా చూసుకొండి. ఎప్పటికీ భర్త మీద ఆధార పడి వుంటే ఎప్పుడూ ప్రతి దానికి చెయ్యి జాపాలి, లేదా ఇంటి జమా ఖర్చులు లెక్క తప్పకుండా చెబుతూ వుండాలి, మీకంటూ స్వతంత్రంగా ఏమీ చేసుకోలేరు బాగా కంట్రోలింగ్ భర్త వుంటే. మీ మీద మీకు నమ్మకం, ఆత్మ విశ్వాసం, ఆత్మ స్థయిర్యాన్ని పెంపెందించుకుని ధైర్యంగా వుంటే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కునే మన:స్థయిర్యం వుంటుంది. ప్రతి పనిలో పర్ఫెక్షన్ వుండాలి అనే వత్తిడిని మనమే పెట్టుకుంటే చాలా ఇబ్బందులకి గురవుతాము.   అన్ని పనుల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలనుకోవడం రాకపోతే నిరాశ చెందడానికి మనం పరీక్షల్లో పాల్గొనటం లేదు, అలా అనుకుంటే మనసు బాధ పడడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఇల్లు క్లీన్ చేసుకోకుండా వదిలేసి మీకు ఆ రోజు మంచి పుస్తకం చదవాలనిపిస్తే హాయిగా కిటికీ పక్కన కూర్చొని, వేడి ఏది పల్లీలని నముల్తూ మీ పుస్తకంలో లీనమై పొండి. దానివల్ల ఇంటికి వచ్చిన నష్టం ఏమీ లేదు, ఇల్లు అక్కడే వుంటుంది, సర్ధడానికి పనీ అక్కడే వుంటుంది. మీకు ఓపిక వున్నప్పుడు అంతా ఒకటేసారి చేసేయాలనుకోకుండా మెల్లి మెల్లిగా కొద్ది కొద్దిగా చేసుకొండి. ఇందులో కుటుంబ సభ్యుల్ని కలుపుకున్నారనుకొండి ముఖ్యంగా పిల్లల్ని వారికీ పనుల్ని నేర్పించినవారవుతారు, ప్రతి రోజు అమ్మ ఎంత కష్టపడుతుందో దాని విలువ కూడా తెలుస్తుంది. మీ పిల్లలకు ఏం నేర్పించాలి, వారికి ఏదంటే ఇష్టం కనుక్కుని మీకు వీలయిన వాటిల్లోనే జాయిన్ చేయండి. ఇతరులను చూసి వాళ్ళ పిల్లలు బోలెడన్నీ చేస్తున్నారు మన పిల్లలు కొన్నే చేస్తున్నారు అని మీరు కంగారు పడి, పిల్లల్ని హైరానా పెట్టి మీకూ, వారికి కూడా "స్ట్రెస్స్" ని ఎక్కువ చేసుకుంటున్నారు. జీవితం పరుగు పందెం కాదు, వేరే వాళ్ళు చేసే పనులన్నీ మనం చేయాలనుకుంటే పిల్లల మీద వత్తిడి పెరిగి కొన్నిట్లో కూడా సరిగ్గా చేయలేరు. అదే వారికిష్టమయిన వాటిలో చేర్పిస్తే చక్కగా మనసు పెట్టి నేర్చుకుంటారు, చూడండి.   ఉద్యోగం, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టం అనే ఆలోచన మనసులోనుండి తీసేయండి. మనసుని ముందునుండే గట్టి పరుచుకుంటే అన్నీ చేయవచ్చు. ఉదాహరణకి పిల్లలతో సమయం గడపడం లేదని బాధ పడే వారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం పిల్లలతో ఎంత సమయం గడిపామన్నది కాదు ముఖ్యం, వారితో కొద్ది సమయం కానీ ఎక్కువ సమయం కానీ ఎలా గడిపామన్నదే ముఖ్యం. పిల్లలు మీతో గడిపిన సమయాన్ని సంతోషంగా గుర్తుపెట్టుకుంటే వారు సంతోషంగా వున్నట్టే, వారికి మీ పై ఎలాంటి కంప్లయింట్లు లేవు అని అర్ధం. ఈ విషయం ఇతర కుటుంబ సభ్యులకి కూడా వర్తిస్తుంది. ఇలాగే ప్రతి విషయంలో మనం ఆ విషయాన్ని చూసే దృక్కోణం మార్చుకుంటే చాలు. అన్నీ సులువు అవుతాయి.   అన్నిటికన్నా ముఖ్యం మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకొండి, అంటే ఎవరో మీకు, మీరు ఎలా వున్నారో చెప్పడం కాదు, మీరే నిర్ణయించుకోవాలి, మీరు ఎంత బరువుండాలి, మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, మీకు మేకప్ అవసరమా లేదా, మీరు సన్నగా కమర్షియల్స్ లో వచ్చే మాడల్స్ లా సన్నగా, పీలగా, ఒక గెడ కర్రలా వుండాలో, ఆరోగ్యంగా, ఎప్పుడూ సంతోషంగా వుంటూ, నలుగురికీ మీకు చేతనయినంత సాయం చేస్తూ మీ మనసుకి నచ్చినట్టు వుండాలా లేదా నిర్ణయించుకోవల్సింది మీరు. వేరే వారికి మిమ్మల్ని ఇలా వుండాలి, అలా వుండాలి అనే హక్కు లేదు. ఒకవేళ వాళ్ళు అలా అనుకుంటే అది వారి సమస్య కానీ మీ సమస్య కాదు. ఒక విషయం గుర్తు పెట్టుకోండి ఆనందంగా వుండడం మీ చేతిలో వుంది. నాకు తెల్సు ఇది చెప్పడం చాలా తేలిక దాన్ని చేరుకోవడం చాలా కష్టం అని.   ముఖ్యంగా కట్నాలు తేలేదని హింసించే భర్త, అత్తామామలున్న సమాజంలో, ఆడపిల్ల పుడితే ఇంట్లో నుండి తరిమేయడమో, విడాకులివ్వడమో చేసే భర్తలున్న సమాజంలో, వుద్యోగానికి వెళ్ళొస్తే అనుమానించి నెల జీతం అంతా తీసుకొని కేవలం బస్ పాస్ డబ్బులిచ్చే భర్తలున్న ఈ దేశంలో, రోజంతా కష్టపడి కుటుంబం అంతా పని చేసి కనీసం ఒక్క పూటయినా అందరూ కూర్చుని సంతోషంగా తిని కంటినిండా నిద్ర పోవడానికి నోచుకోనివ్వకుండా సంపాదించిందంతా తాగుడికి తగలపెట్టి ఇంటికి వచ్చి భార్యా, పిల్లల సంపాదన కూడా లాక్కుని చితకబాదే భర్తలున్న సమాజంలో, మంచి బట్టలేసుకుని బయటికి వెళితే ఆ పిల్ల ఇంటికి తిరిగి వచ్చేదాక గుండెల్లో దడతో తల్లి తండ్రులు భయపడుతూ బ్రతుకుతున్న సమాజంలో ఇంకా ఎన్నో సమస్యల్తో, పోరాటాలతో బ్రతుకుతున్న మన దేశంలో అది సాధ్యమా అని మీరు అనుకోవచ్చు. కానీ మనం సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా వుంటేనే ఇతరులకి సాయం చేయగలుగుతాము.   అందుకని మానసిక వత్తిళ్ళకు దూరంగా వుండాలంటే మనని మనం కొద్దిగా మార్చుకోవాల్సిందే మరి! ఏమంటారు. ప్రయత్నించండి, "సాధనమున పనులు సమకూరు ధరలోన," అన్నారు వేమన గారు. గుడ్ లక్....   -కనకదుర్గ  

ఆలస్యం! అమృతం! విషం!

ఒక కుర్రవాడికి కేన్సర్‌ చివరి దశలో ఉందని తేలింది. ఆ విషయం తెలిసినప్పటి నుంచీ అతనికి ఈ ప్రపంచం ఒక దుఃఖసాగరంగా మారిపోయింది. ఎటు చూసినా, ఏది పట్టుకున్నా, ఎవరితో మాట్లాడినా తన వ్యాధే గుర్తుకు వచ్చేది. అందుకనే నిశ్శబ్దంగా తనలో తాను కుమిలిపోతూ తన గదిలో ఒంటరిగా చివరి రోజులను వెళ్లదీస్తూ ఉండేవాడు. ఒకసారి ఎందుకనో కుర్రవాడికి అలా వీధి చివరిదాకా వెళ్లి రావాలని అనిపించింది. చాలాకాలం తరువాత కుర్రవాడు వీధిలోకి అడుగుపెట్టడం చూసి అతని తల్లికి కూడా సంతోషం వేసింది. ఊరికనే అలా నాలుగడుగులు వేసి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలనుకున్నాడు కుర్రవాడు. కానీ ఇంతలో వీధి చివర కొత్తగా పెట్టిన సీడీల షాప్ చూసేసరికి అందులోకి అడుగుపెట్టాలనిపించింది. కుర్రవాడు సీడీల షాప్‌లోకి అడుగుపెట్టాడో లేదో అక్కడ కౌంటర్‌ దగ్గర ఉన్న అందమైన అమ్మాయిని చూసి మనసు చెదిరిపోయింది. ఆ అమ్మాయిని చూడటం కోసం అవసరం లేకపోయినా ప్రతిరోజూ ఆ షాపులోకి వెళ్లి ఏదో ఒక సీడీని కొనుక్కునేవాడు కుర్రవాడు. ఆ సీడీని భద్రంగా ఓ కవర్లో పెట్టి, చిరునవ్వుతో అతనికి అందించేది అమ్మాయి. ఆ అమ్మాయితో ఓసారి సరదాగా అలా షికారుకి వెళ్తే ఎంత బాగుండో అనుకునేవాడు కుర్రవాడు. కానీ తీరా కాదంటే ఆ బాధని తట్టుకునే స్థితిలో అతని మనసు లేదు. అందుకనే కనీసం ఒక్క పది నిమిషాలైనా ఆమెని చూస్తూ గడపడం కోసం రోజూ షాపుకి వెళ్లేవాడు. కానీ అలా ఎన్నాళ్లని వెళ్తాడు. నెల తిరక్కుండానే ఆ కుర్రవాడిని క్యాన్సర్‌ కబళించివేసింది.    కుర్రవాడి చావుకి తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఎలాగొలా బంధువుల సాయంతో అతని అంత్యక్రియలు పూర్తిచేసింది. అంత్యక్రియలు పూర్తయ్యాక కూడా అతని జ్ఞాపకాలని వదలలేకపోయింది తల్లి. కాసేపు అతని గదిలో కూర్చునైనా సేదతీరుదామనుకుంటూ, అతని గదిలోకి అడుగుపెట్టింది. తల్లి గదిలోకి అడుగుపెట్టేసరికి ఒక మూల గుట్టగా పేర్చి ఉన్న సీడీలు కనిపించాయి. కొన్నవి కొన్నట్లు ఆ సీడీలు అలాగే ఉన్నాయి. కనీసం వాటిని కవర్లోంచి కూడా తీయలేదు కుర్రవాడు. అతని అవసరం సీడీలు కాదు కదా! అందులో ఒక కవర్‌ని తెరిచి చూసింది తల్లి. అంతే! కవర్లో ఉన్నదాన్ని చూసి ఆమె గుండె చెదిరిపోయింది. ‘మీ నవ్వు చాలా బాగుంటుంది. ఒకసారి మీతో కాఫీ తాగాలనుంది’ అన్న చీటీ సీడీతో పాటే ఆ కవర్లో ఉంచింది ఆ అమ్మాయి. రెండో కవరు, మూడో కవరు, మరో కవరు, ఇంకో కవరు.... అన్నింటిలోనూ ఇలాంటి చీటీలే ఉన్నాయి. ఆ కవర్లని కుర్రవాడు ఒక్కసారన్నా తెరిచి చూస్తే అతని చివరి రోజులు ఎంత అందంగా గడిచేవో కదా! పోనీ తన మనసులో ఉన్న మాటనన్నా అతను చెప్పగలిగితే ఎంత బాగుండేదో! మనలో చాలామంది ఆ కుర్రవాడిలాగే ప్రవర్తిస్తుంటాం. మనకి అర్హత లేదనో, సాధ్యం కాదనో... మన లక్ష్యాలని మనసులోనే దాచేసుకుంటాం. దక్కదేమో అన్న భయంతో ఉన్న కొద్ది రోజులనీ భారంగా గడిపేస్తుంటాం. వెనక్కి తిరిగి చూసుకునే సరికి కాలం కాస్తా కరిగిపోతుంది.

ఆడ‌పిల్ల‌ల మ‌న‌సు మ‌రింత జాగ్ర‌త్త!

21వ శ‌తాబ్దం వ‌చ్చేసింది. ప్ర‌పంచీక‌ర‌ణ పుణ్య‌మా అని అంద‌రికీ అన్ని సౌక‌ర్యాలూ అందుబాటులో ఉంటున్నాయి. ఆరోగ్య‌ప‌రంగానూ, సాంకేతికంగానూ మున్ముందుకి అడుగులు వేస్తున్నాం. అన్నింటికీ మించి ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల వివ‌క్ష‌త త‌గ్గింద‌న్న అంచ‌నాలూ ఉన్నాయి. నిజానికి ఆడ‌పిల్లల జీవితాలు ఏమాత్రం మార‌లేదంటూ ఓ ప‌రిశోధ‌న వెలువ‌డింది. ఇంగ్లండులోని లివ‌ర్‌పూల్ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ప‌రిశోధ‌కులు ఆడ‌పిల్ల‌ల మ‌న‌స్థితి మీద ఒక అధ్య‌య‌నం చేశారు. ఒక‌టీ రెండూ కాదు... ఏకంగా 14 ఏళ్ల పాటు గ‌ణాంకాల‌ను సేక‌రించారు. ఇందుకోసం 2000-2001లో జ‌న్మించిన దాదాపు ప‌దివేల మంది పిల్ల‌ల‌ను నిశితంగా గ‌మ‌నించారు. 3, 5, 7, 1, 14 ఏళ్ల‌లో వారి మ‌న‌స్త‌త్వం ఎలా ఉందో అంచ‌నా వేసే ప్ర‌య‌త్నం చేశారు. అనేక ప్ర‌శ్నాప‌త్రాల ద్వారా పిల్ల‌ల మ‌న‌స్థితిని గ‌మ‌నించారు. మ‌గ‌పిల్ల‌లైనా, ఆడ‌పిల్ల‌లైనా చిన్న‌ప్పుడు అంతా సంతోషంగానే క‌నిపించారు. వారి మ‌న‌సుల్లో పెద్ద‌గా క‌ల‌త క‌నిపించ‌లేదు. కానీ వ‌య‌సు పెరుగుతున్నకొద్దీ... ఆడ‌పిల్ల‌ల మ‌న‌సు కుంగిపోవ‌డాన్ని గ‌మ‌నించారు. ఇలా కాస్తోకూస్తో కాదు... ప‌ధ్నాలుగో ఏడు వ‌చ్చేసరికి దాదాపు నాలుగోవంతు మంది ఆడ‌పిల్ల‌లలో డిప్రెష‌న్ తాలూకు ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. అదే మగ‌పిల్ల‌లో అయితే కేవ‌లం ప‌దిశాతం లోపుమంది పిల్ల‌ల‌లోనే డిప్రెష‌న్ సూచ‌న‌లు క‌నిపించాయి. కుటుంబ ఆర్థిక‌ప‌రిస్థితులు క‌నుక బాగోలేక‌పోతే.... డిప్రెష‌న్‌కు లోన‌య్యే ప్ర‌మాదం మ‌రింత తీవ్రంగా ఉండ‌టం మ‌రో విషాదం. సాధార‌ణంగా పిల్ల‌లు త‌మ మ‌న‌సులోని దుగ్ధ‌ను స్ప‌ష్టంగా చెప్పుకోలేరు. కుటుంబంలోని పెద్ద‌లే, పిల్ల‌ల మ‌న‌సులోని విచారాన్ని ఊహించే ప్ర‌య‌త్నం చేయాలి. దుర‌దృష్ట‌వ‌శాత్తూ మ‌గ‌పిల్ల‌లని మ‌న‌సుని ప‌సిగ‌ట్టేసే పెద్ద‌లు, ఆడ‌పిల్ల‌ల మ‌న‌సులో ఏం మెదులుతోందో ఏమాత్రం ఊహించలేక‌పోతున్నార‌ట‌. దాంతో ఆడ‌పిల్ల‌ల మ‌న‌సుని సాంత్వ‌న ప‌రిచే ప‌రిస్థితులు లేక‌, వారు మ‌రింత‌గా డిప్రెష‌న్‌లోకి కూరుకుపోతున్నారు. పైగా మ‌గ‌పిల్ల‌ల‌తో పోలిస్తే ఆడ‌పిల్ల‌లు ఎదుర్కొనే ప‌రిస్థితులు విభిన్నంగా ఉంటాయి. శారీరికంగానూ, మాన‌సికంగానూ వారు ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఎదిగేకొద్దీ ఏదో ఒక రూపంగా వారికి వివ‌క్ష ఎదుర‌వుతూనే ఉంటుంది. ఇవ‌న్నీ కూడా వారి మ‌న‌సుల మీద చెర‌గ‌ని గాయం చేస్తాయి. మ‌గ‌పిల్ల‌లతో పోలిస్తే, ఆడ‌పిల్ల‌ల‌ని మ‌రింత కంటికిరెప్ప‌లా కాపాడుకోవాల్సిన అవ‌స‌రాన్ని ఈ ప‌రిశోధ‌న గుర్తుచేస్తోంది. దీనిని త‌ల్లిదండ్రులు ఓసారి జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే... ఆడ‌పిల్ల‌ల భ‌విష్య‌త్తు మ‌రింగ బాగుంటుందేమో! - నిర్జ‌ర‌.  

డబ్బుతో కొనలేనిది

అతనో పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగి. సంస్థ కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేయడంలోనే అతనికి అంతులేని తృప్తి ఉండేది. అలా పనిచేసని ప్రతిసారీ అతనికి పై అధికారుల నుంచి అభినందనలో, పదోన్నతలో లభించేసరికి... తను ఆ సంస్థకి ఉన్నతికి ఎంతగా అవసరమో తెలిసొచ్చేది. అలాంటి ఉద్యోగి ఓ అర్ధరాత్రి వేళ తన ఇంటికి చేరుకునేసరికి, అక్కడ తన పదేళ్ల కొడుకు ఇంకా మేలుకునే కనిపించాడు. ‘‘ఇంత రాత్రయ్యింది ఇంకా పడుకోలేదా’’ అంటూ చిరాగ్గా కొడుకుని అడిగాడు ఉద్యోగి. అతని మనసులో ఇంకా ఉద్యోగం తాలూకు చిరాకు అలానే ఉంది. ‘‘లేదు! నీతో కలిసి తిందామని ఎదురుచూస్తున్నాను’’ అన్నాడు కొడుకు దీనంగా. ‘‘నాతో నీకు పోటీ ఏమిటి! సమయానికి తిని, చదువుకొని, పడుకోక..’’ అంటూ విసుగ్గా భోజనాల బల్ల దగ్గరకి చేరుకున్నాడు తండ్రి. కొడుకు ఏమీ మాట్లాడకుండా ఒకో ముద్దా నిదానంగా తింటున్నాడు. అలా తింటూనే తండ్రి వంక చూస్తున్నాడు. తండ్రి ఇంకా తన ఆఫీసు వ్యవహారాల నుంచి బయటపడలేదు. తన ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ, ఏవో మెయిల్స్ చూసుకుంటూ అన్యమనస్కంగా భోజనం చేస్తున్నాడు. ‘‘నాన్నా! నువ్వు రోజుకెంత సంపాదిస్తావు?’’ అని హఠాత్తుగా అడిగాడు కొడుకు. ఆ మాటలకి తండ్రికి ఒక్కసారిగా కోపం వచ్చింది. ‘‘నీకసలు బుద్ధుందా! పెద్దవాళ్లను ఇలాంటి ప్రశ్నలు అడగకూడదని తెలియదా! అయినా అడిగావు కాబట్టి చెబుతున్నా విను. నా జీతం రోజుకి రెండువేలు. నా తోటివారందరికంటే అది రెట్టింపు. ఎంత కష్టపడితనే నేను ఈ స్థాయికి చేరుకున్నానో తెలుసా!’’ అన్నాడు తండ్రి. అతని మాటలలో తెలియని గర్వమేదో తొణికిసలాడింది. కొడుకు కాసేపు ఏం మాట్లాడలేదు. అటు తరువాత బిక్కుబిక్కుమంటూ ‘‘నాన్నా! నాకు ఓ వేయి రూపాయలు ఇవ్వగలవా!’’ అంటూ అడిగాడు.   ఆ మాటలతో తండ్రిలోని కోపం నషాళానికంటింది. ‘‘ఇందాకేమో! నీ జీతం ఎంత అని అడిగావు. ఇప్పుడేమో ఓ వేయి రూపాయలు ఇమ్మంటున్నావు. ఇలా నన్ను విసిగించడానికేనా ఇంత రాత్రివేళ మెలకువగా ఉన్నది. అయినా అంత డబ్బుతో నీకేం పని...’’ అంటూ నానా తిట్లూ తిట్టి చివరికి ఓ వేయి రూపాయల నోటు కొడుకు మొహం మీద విసిరికొట్టాడు. కొడుకు కళ్లమ్మట నీళ్లు తిరుగుతుండగా నిదానంగా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. తండ్రి భోజనం పూర్తయ్యింది. ఇక పడుకుందామనుకుంటూ ఉండగా కొడుకు గుర్తుకువచ్చాడు. ‘పాపం తెలిసీతెలియని వయసు. వాడిని మరీ ఎక్కువగా తిట్టాను. ఆఫీసులో కోపమంతా వాడిమీదే చూపించాను,’ అని జాలిపడుతూ ఓసారి కొడుకు గదిలోకి తొంగిచూశాడు. కొడుకు ఇంకా మెలకువగానే ఉన్నాడు. వాడి ముందు బోలేడు చిల్లర ఉంది. ‘వాడేదో కొనుక్కోవాలనుకొని డబ్బులు పోగేసినట్లున్నాడు. దానికి తక్కువ కావడంతో నన్ను అడిగాడు పిచ్చివెధవ’ అనుకున్నాడు. కొడుకు భుజం మీద చేయివేసి- ‘ఏం నాన్నా! ఏం కొనుక్కోవాలనుకుంటున్నావు. నేను ఇచ్చిన డబ్బుతో లెక్క సరిపోతుందా’ అని అనునయంగా అడిగాడు. కొడుకు బెరుకుగా- ‘‘నాన్నా వచ్చే సోమవారం నా పుట్టినరోజు. ఆ రోజు నువ్వు నాతోపాటు ఇంట్లోనే ఉంటావా!’’ అని అడిగాడు. ‘‘అబ్బే సోమవారమా! ఇంకేమన్నా ఉందా. అయినా మరీ అత్యవసరం అయితే తప్ప నేను సెలవు పెట్టనని నీకు తెలుసు కదా..’’ అన్నాడు తండ్రి తడుముకోకుండా.   కొడుకు మరేం మాట్లాడకుండా తన చేతిలో ఉన్న చిల్లరనంతా తండ్రి దగ్గరకి జరిపాడు. దాని మీద ఇందాక తండ్రి ఇచ్చిన వేయి రూపాయలు కూడా పెట్టాడు. ‘‘నాన్నా నీ రోజు జీతం రెండు వేలన్నావు కదా! ఇవిగో రెండువేలు. ఇవి తీసుకునన్నా నాతో ఒక్కరోజు గడపవా ప్లీజ్. నేను ఆర్నెళ్ల నుంచి దాచుకున్న డబ్బంతా కలిపి వేయి రూపాయలయ్యింది. దానికి నువ్వు ఇందాక ఇచ్చిన వేయి రూపాయలు కలిపితే రెండేవేలవుతాయి. ఇవి తీసుకుని నా పుట్టినరోజు నాతోనే గడుపు ప్లీజ్‌!’’ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. తండ్రికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తాను ఎదుగుతున్నాడని సంబరపడ్డాడే కానీ, ఆ ఎదిగే క్రమంలో ఏ లోతుల్లోకి జారిపోతున్నాడో ఇన్నాళ్లూ అతను గ్రహించలేకపోయాడు. ఎదుగుదల అందరికీ అవసరమే! కానీ దానికోసం దేన్ని ఎంతవరకు వదులుకోవాలి అన్నదే ప్రశ్న. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.  

అందమైన దాంపత్యం

అనగా అనగా ఒక అన్యోన్యమైన జంట. వాళ్లిద్దరినీ చూసి చుట్టుపక్కల వాళ్లందరికీ ముచ్చటగా ఉండేది. అలాగని వారు అందరికంటే అందంగా ఉండేవారని కాదు! ఎప్పుడూ కొట్టుకోకుండా ఉండేవారనీ కాదు! కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినా కలిసిమెలిసి ఉండేవారు. అలాంటి వారిద్దరి మధ్యా ఒక కథ నడిచింది...   ఒక రోజు భర్త ఇంటికి వస్తూనే ‘నేను ఇవాళ దాంపత్యం గురించి ఒక అద్భుతమైన ఉపన్యాసం విని వస్తున్నాను’ అన్నాడు. ఏం చెప్పారేంటి ఆ ఉపన్యాసంలో!’ అంటూ ఆసక్తిగా అడిగింది భార్య. ‘భార్యాభర్తల మధ్య ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకూడదంట. అందుకోసం ఒకరిలో ఒకరికి నచ్చని విషయాలు ఏమన్నా ఉంటే, వాటి గురించి ముందుగానే చర్చించుకుని తేల్చుకోవాలంట!’ అంటూ చెప్పుకొచ్చాడు భర్త. భార్య ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంది. ‘ఈ ఉపన్యాసం విన్న తరువాత నాకు ఓ ఉపాయం తట్టింది. ఇవాళంతా కూర్చుని నీలో నచ్చని విషయాలు ఏమున్నాయో, ఒక కాగితం మీద రాస్తాను. నువ్వు కూడా నాలో నచ్చని విషయాలు ఏమేం ఉన్నాయో ఒక కాగితం మీద రాసి ఉంచు. అలా కాగితాలలో రాసుకున్న లోపాల గురించి రేపు చర్చించుకుందాం’ అంటూ హడావుడిగా గదిలోకి వెళ్లి ఒక పెన్నూ, కాగితం పట్టుకున్నాడు.   మరుసటి రోజు ఉదయం వేళకి భర్త వంటింట్లోకి ఒక మూడు కాగితాలు తీసుకువచ్చాడు. ‘నీలో నాకు నచ్చని విషయాల జాబితా ఒకటి తయారుచేశాను. అవన్నీ చదువుతాను విను’ అంటూ బడబడా ఆ మూడు కాగితాలలో రాసిన ‘భార్యలోని లోపాలను’ చదవసాగాడు. జాబితాని చదవడం పూర్తయిన తరువాత హుషారుగా ‘ఇప్పుడు నీ జాబితాని కూడా చదువు. తరువాత వాటిలో విషయాల గురించి చర్చించుకుందాం.’ అన్నాడు భర్త. భార్య మాత్రం నిశ్శబ్దంగా ఒక కాగితాన్ని తీసుకుని భర్త చేతిలో పెట్టింది. ఆశ్చర్యం! అది ఖాళీగా ఉంది. ‘అదేంటీ నువ్వు రాసేందుకు నాలో ఒక్క లోపం కూడా కనిపించలేదా!’ అని అడిగాడు భర్త.   ‘నేను కూడా మీలో లోపాలని రాద్దామనే కూర్చున్నాను. కానీ మన బంధాన్ని నాశనం చేసేంతటి లోపాలు ఏవీ మీలో కనిపించలేదు. ఒకవేళ ఏదన్నా చిన్న లోపం కనిపించినా, ఒకోసారి దాని వల్ల ఉపయోగం కూడా కనిపించేది. పోనీ మీలో నాకు నచ్చని విషయాలను రాద్దామా అంటే... నాకు నచ్చనంత మాత్రాన వాటిని లోపాలుగా ఎలా అనుకోగలను. మీరు మీలాగా ఉంటే చాలు అనిపించింది. ఎప్పటిలాగే ప్రేమని పంచుతూ, బాధ్యతగా చూసుకుంటే ఉంటే చాలనిపించింది,’ అంది భార్య. భర్తకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ కళ్ల నుంచి నీరు ఆగలేదు. అంత ఉద్వేగంలో కూడా, తన చేతిలో ఉన్న కాగితాలను చించడం మాత్రం మర్చిపోలేదు.   (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

రాజీ పడితే జీవితం అంతే!

ఆమధ్యన ఒక శాస్త్రవేత్త చిన్నపాటి ప్రయోగం ఒకటి చేశాడట. కొన్ని పురుగులని పట్టి ఒక గాజు సీసాలో ఉంచాడు. సీసాలో వేయగానే ఒక్కసారిగా ఆ పురుగులన్నీ బయటకి ఎగిరేందుకు ప్రయత్నించాయి. అవి అలా పైకి ఎగురుతుండగానే.... సీసాకి ఓ మూతని బిగించేశారు. అంతే! ఆ పురుగులన్నీ శక్తి కొద్దీ వెళ్లి ఆ మూతకి తగులుతూ కిందకి పడిపోవడం మొదలుపెట్టాయి. అలా కాసేపు జరిగిన తర్వాత ఇక ఆ సీసాను దాటుకుని వెళ్లడం అసాధ్యమన్న విషయానికి అవి అలవాటుపడిపోయాయి. దాంతో ఇక మూతని తాకకుండా అక్కడక్కడే ఎగరడం మొదలుపెట్టాయి. కొంతసేపటి తర్వాత సీసా మూతని తీసేసినా కూడా పురుగులు అందులోంచి బయటపడేందుకు ప్రయత్నించలేదు. అడ్డుగా ఉన్న మూతని దాటుకుని వెళ్లడం అసాధన్యమన్న భ్రమలోనే అవి ఉండిపోయాయి.   ఇంటర్నెట్‌లో ‘flear in a jar’ అని టైప్ చేస్తే ఈ వీడియో కనిపిస్తుంది. ఈ వీడియోలో కనిపించేదంతా నిజమో కాదా అన్నదాని మీద పెద్ద వివాదమే ఉంది. కానీ చాలా సందర్భాలలో జీవుల ప్రవర్తనను ఇలా ప్రభావితం చేసేయవచ్చని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. జంతువులలో కనిపించే ఇలాంటి ప్రవర్తనని conditioning అంటారు. ఈ conditioning ద్వారానే వాటిని ఒకోసారి మనకి అనుకూలంగా మలుచుకుంటూ ఉంటాము కూడా!   వీడియోలో కనిపించేంది నిజమా కాదా అన్నది పక్కన పెడితే, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుందన్నది సైకాలజిస్టుల మాట. మనుషులు కూడా తమ చుట్టూ ఉండే పరిస్థితులకి ఇలాగే లోబడిపోతుంటారని తెలిసిందే! ‘నేను ఎందుకూ పనికిరానివాడిని,’ ‘నా లోపాలను మించి నేను ఎదగలేను’, ‘ఈ సమస్యలను దాటడం నా వల్ల కాదు’... లాంటి సవాలక్ష నమ్మకాలతో మనల్ని మనమే conditioning చేసుకుంటూ ఉంటాము.   ఎప్పుడో ఒకసారి మనకి ఎదురుపడిన పరాజయం మన అనుమానాలు నిజమేనన్న బలాన్ని కలిగిస్తాయి. పైకి ఎదిగేందుకు అడ్డుగా నిలుస్తాయి. మన నమ్మకాలు నిజమో కాదో మరోసారి పరీక్షించకుండానే, వాటని మన లోపాలుగా మార్చేసుకుంటూ ఉంటాము. అందుకే! పరాజయపు మాట పక్కన పెట్టి మరోసారి ప్రయత్నించి చూడమని ఈ పరిశోధన చెబుతోంది. ఎగిరేందుకు ప్రయత్నిస్తేనే కదా.... మనకి హద్దు, అదుపు ఉన్నాయో లేదో తెలిసేది! - నిర్జర.