ప్రపంచంలో అత్యంత ఖరీదైన 5 పడవలు

భూమిపై మూడువంతుల నీరు, ఒక వంతు భూమి ఉందన్న విషయం మనందరికీ తెలుసు. అందుకే మన పూర్వీకులు జల ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు. చిన్నచిన్న పడవల నుంచి టన్నుల కొద్ది సరుకులను దేశవిదేశాలకు ఎగుమతిదిగుమతి చేయడంలో జల రవాణా సాధనాల ప్రాముఖ్యత ఎంతో ఉంది. రామాయణంలో వనవాసానికి బయలుదేరిన రాముడు సీత, లక్ష్మణుడు పడవ ప్రయాణం ద్వారానే అయోధ్యను దాటారు. వాస్కోడిగామా పడవ ప్రయాణం చేస్తూనే కొత్తదేశాల ఆనవాళ్లు తెలుసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పడవల చరిత్ర చాలానే ఉంది. అయితే ప్రస్తుతం రవాణాసాధనాల తీరు మారింది. భూ, జల మార్గాలే కాదు వాయుమార్గం కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పడవలు కేవలం రవాణా సాధనాలుగానే కాదు వారివారి సంపదకు చిహ్నాలుగా మారాయి. ప్రపంచంలోని సంపన్న బిలియనీర్లకు ఖరీదైన కార్లు, విమానాలే కాదు ఆధునిక వసతులతో  పడవలు కూడా ఉన్నాయి. అత్యంత విలాసవంతమైన పడవల్లో హెలిప్యాడ్‌లు, థియేటర్లు, కచేరీ హాళ్లు,  స్విమ్మింగ్ పూల్ లు, ఆవిరి స్నానాలు, హాట్ టబ్‌లు వంటి అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. మరి వాటి వివరాలు ఎంటో తెలుసుకుందామా.. 1. హిస్టరీ సుప్రీం (HISTORY SUPREME) ఖరీదు -  4.8 బిలియన్( 35,54,43,12,000 రూపాయలు) హిస్టరీ  సుప్రీం పడవ ఖరీదు 4.8 బిలియన్ డాలర్లు. ఇంత ఖరీదు ఎందుకు అనుకుంటున్నారు కదా.. ఈ పడవ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడినది. అంతే ప్రపంచంలోనే  అత్యంత ఖరీదైన పడవగా రికార్డు సృష్టించింది. ఈ నౌక  మలేషియా కు చెందిన సంపన్నుడు  రాబర్ట్ నోక్ సొంతం. ఈ ఓడ తయారీలో పది వేల కిలోల  బంగారం,  ప్లాటినం ఉపయోగించారట.  100 అడుగుల పొడవైన ఈ పడవ నిర్మించడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టిందట. దీనిని UK కు చెందిన  ప్రఖ్యాత లగ్జరీ డిజైనర్ స్టువర్ట్ హ్యూస్ రూపొందించారు. బంగారం , ప్లాటినం లోహాలతో పడవను దాని బేస్ నుండి భోజన ప్రాంతం, డెక్, మెట్లు తదితర భాగాలను  అలంకరించారు. ఈ లగ్జరీ ఓడతో అత్యధికంగా ఆకర్షించేది మాస్టర్ బెడ్ రూమ్.  ఇది మెటోరైట్ రాక్ నుండి తయారు చేయబడిన గోడ. అంతేకాదు టైరన్నోసారస్ రెక్స్ ఎముకలతో తయారు చేసిన విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. 2. ఎక్లిప్స్  (ECLIPSE) ఖరీదు -  1.5 బిలియన్ డాలర్లు( 11,10,75,97,500 రూపాయలు) ప్రపంచంలో రెండవ అతిపెద్ద పడవ ఎక్లిప్స్. ఇది రష్యన్ బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్ సొంతం. ఈ పడవతో డిటెక్షన్ సిస్టమ్ ద్వారా క్షిపణి గుర్తింపు వ్యవస్థ ఉంటుంది. అంతేకాదు 2 హెలిప్యాడ్‌లు, 24 గెస్ట్ క్యాబిన్లు, డిస్కో హాల్, రెండు స్విమ్మింగ్ పూల్ లు, హాట్ టబ్‌లు ఉన్నాయి. దీనిని జర్మనీకి చెందిన బ్లోమ్ , వోస్ నిర్మించారు. 533 అడుగుల పొడవైన పడవలో మినీ జలాంతర్గామి కూడా ఉంది, ఇది నీటిలో 50 మీటర్ల వరకు మునిగిపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మాస్టర్ బెడ్ రూమ్ కిటికిలు  బుల్లెట్ ప్రూఫ్. 3. ది అజ్జామ్ ( THE AZZAM) ఖరీదు -  600 మిలియన్ డాలర్లు ( 44,42,49,90,000రూపాయలు) 590 అడుగుల పొడవైన పడవ 35 కిలోమీటర్ల వేగంతో నీటిపై దూసుకుపోతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన  పడవ ఇది.  యుఎఇ  రాజకుటుంబ సభ్యుడు అజ్జామ్ యాజమాన్యంలో ఉందని వినికిడి. దీని తయారీదారుల ప్రకారం, ఇప్పటివరకు తయారు చేయబడిన అత్యంత క్లిష్టమైన పడవ ఇది.ఫ్రెంచ్ ఇంటీరియర్ డెకరేటర్ క్రిస్టోఫ్ లియోని అధునాతన ఇంటీరియర్‌లను డిజైన్ చేయగా, దాని వెలుపలి భాగాలను నౌటా యాచ్ రూపొందించారు. ఇది మొత్తం 35048 కిలోవాట్ల శక్తితో రెండు గ్యాస్ టర్బైన్లు ,రెండు డీజిల్ ఇంజన్లు ఉంటాయి. 4. మోటర్ యాచ్ ఎ (MOTOR YACHT A ) ఖరీదు - 440 మిలియన్ డాలర్లు (32,58,97,00,000) మోటారు యాచ్ ఎ  రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రీ మెల్నిచెంకోకు చెందినది. ఇందులో 14 మంది అతిథులు ,  42 మంది సిబ్బందిని ఉండవచ్చు. 400 అడుగుల పొడవైన పడవ ఇంటీరియర్స్ 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 2,500 చదరపు అడుగుల మాస్టర్ బెడ్‌రూమ్ , డిస్కోతో పాటు ఆరు అతిథి సూట్‌లు ఉన్నాయి. వీటిని నాలుగు పెద్ద స్టేటర్‌ రూమ్‌లుగా మార్చడానికి అనువుగా మూవబుల్ వాల్స్ ఉంటాయి. ఇంటీరియర్స్ , ఫర్నిచర్, గ్లాస్ వేర్,  ఫ్రెంచ్ క్రిస్టల్‌తో తయారు చేసిన టేబుల్‌వేర్లను అలంకరించిన అద్దాలు పడవ విలాసవంతమైన  లుక్ ను మరింత పెంచుతాయి. ఇందులో హెలిప్యాడ్,  30 అడుగుల స్పీడ్ బోట్ ఉంటాయి. ఈ పడవలో మూడు స్విమ్మింగ్ పూల్స్  ఉన్నాయి.  వాటిలో ఒకటి గ్లాస్ బాటమ్తో, మరోకటి డిస్కో పై ఉంటుంది. ఈ విలాసవంతమైన పడవను ఆర్కిటెక్ట్ మార్టిన్ ఫ్రాన్సిస్,  ఫిలిప్ స్టార్క్ రూపొందించారు. ఇది చాలా సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ,  సూపర్ లగ్జరీ సదుపాయాలు ఇందులో ఉన్నాయి. 5. దుబాయ్ (DUBAI) ఖరీదు -  400 మిలియన్ డాలర్లు(29,63,98,00,000) ఈ పడవ యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సొంతం.  531 అడుగుల పొడవు ఉన్న దుబాయ్ పడవను బ్లోమ్,  వోస్ నిర్మించారు.  దాని వెలుపలి భాగాలను ఆండ్రూ వించ్ రూపొందించారు. అత్యంత ఖరీదైన ధరతో పాటు  గొప్ప నాణ్యత,  సృజనాత్మకత కనిపిస్తాయి. అదేవిధంగా ఇందులో మొజాయిక్ స్విమ్మింగ్ పూల్, వృత్తాకార మెట్లు, హెలిప్యాడ్ కలిగి ఉంది. ఈ బ్రహ్మాండమైన సూపర్‌యాచ్‌లో సిబ్బందితో సహా 155 మంది అతిథులు ఉండేలా సదుపాయాలు ఉంటాయి.  దాని ఔట్ లుక్ తో పాటు  లోపలి భాగం చాలా దృఢంగా  ఉంటుంది.  పడవ  ఇంటీరియర్స్  రంగులతో ఆధిపత్యం చెలాయిస్తుండగా, దాని డెక్‌లో స్ప్లిట్-లెవల్ యజమాని డెక్, లాంజ్, అనేక విఐపి ప్రాంతాలు , అతిథుల సూట్‌లు ఉంటాయి. ఈ పడవలో సెలవురోజుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అలా అలా సముద్రయానం చేయవచ్చు.

ప్రపంచంలో అతి ఖరీదైన హోటల్స్

లవర్స్ డీప్ లగ్జరీ సబ్మెరైన్ హోటల్ 1,50,000 డాలర్లు(1,10,73,367రూపాయలు) ప్రపంచంలోనే అతి ఖరీదైన హోటల్. ఇందులో ఒకరోజు  గడిపే అనుభవం జీవితంలో మర్చిపోలేనిది. అండర్ వాటర్ సబ్ మెరిన్ లో ఏర్పాటు చేసిన ఈ హోటల్లో గడిపే క్షణాలు మధురమైన అనుభూతినిస్తాయి. ఫైవ్ స్టార్ సదుపాయాలతో కూడిన ఈ హోటల్లో బస చేయడం అద్బుతమైన జ్ఞాపకంగా ఉండిపోతుంది. 1.  సబ్మెరైన్ కం హోటల్ చుట్టూ సముద్రంలో గ్లాసు కిటికి ల నుంచి సముద్రజీవులను కదలికల సుందరమైన దృశ్యాలను చూసే అవకాశం ఉంటుంది. ఫైవ్ స్టార్ సదుపాయాలతో ఉండే హోటల్ క్యాప్టెన్ బట్లర్ ప్రైవేట్ స్పీడ్ బోట్ ఫెసిలిటీస్ తో ఉంటుంది. అంతేకాదు అడిషనల్ ఆఫీస్ లు  కూడా ఉన్నాయి హెలికాప్టర్ సదుపాయం,  ట్రాన్స్ ఫా ర్మర్స్ బీచ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ మరిన్ని మెరుగైన సదుపాయాలు ఇక్కడ అందుకోవచ్చు. సబ్ మెరిన్ మొత్తం కూడా అల్టిమేట్ లగ్జరీ తో ఉంటుంది. ఇందులో ప్రతి అంగుళం , ప్రతి గది ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. మరో మెరుగైన సదుపాయం ఏంటంటే మీకు నచ్చిన రీతిగా మీరు దీన్ని డిజైన్ చేసుకోవచ్చు.  లొకేషన్ లోనే కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ హోటల్లో ఉండడం అనేది ప్రపంచంలోనే అద్భుతమైన ఒక అనుభూతిగా మిగిలిపోతుంది. 2.ఎంపతి, సూట్ ఫామ్స్ లక్ష డాలర్లు (73,82,245 రూపాయలు) ఈ హోటల్ మొత్తాన్ని రిలీజ్ డిజైన్ చేశారు . డామియన్ హర్స్ ట్ పూర్తిగా రూపకల్పన చేసిన హోటల్ ఇది.  పాత స్కై విల్లా సూట్ ను రీడిజైన్ చేసి అందమైన హోటల్ గా తీర్చిదిద్దారు. ఈ హోటల్ లో మీకు రెండు మాస్టర్ బెడ్ రూములు,  మసాజ్ టేబుల్స్తతో పాటు ఆధునిక వసతి సదుపాయాలు కల్పిస్తారు. ఈ హోటల్ ప్రత్యేకంగా ఆర్ట్ లవర్స్ కోసం డిజైన్ చేయబడింది. ఇక్కడ అద్భుతమైన ఆర్ట్ కలెక్షన్ చూడవచ్చు. ఈ హోటల్ సూట్ నిజంగా కళా ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ స్థలంలో ఆరు డెమైన్ హస్ట్ ఆర్జినల్స్ ఉన్నాయి.  ఇందులో కస్టమ్ ఫర్నిచర్ కూడా ఉంది,  ఈ హోటల్ డామియన్ హర్స్ట్ అభిమానులందరికీ నిజమైన ట్రీట్. 3. రాయల్ పెంట్ హౌస్ హోటల్ విల్సన్ 80,000 డాలర్లు(59,05,804 రూపాయలు) ఈ హోటల్ ప్రెసిడెంట్ విల్సన్ లోని రాయల్ పెంట్ హౌస్.  హోటల్ మొత్తం 8 వ అంతస్తులో ఉంది. ఇది 12 బెడ్ రూములు, 12 బాత్‌రూమ్‌లు ఉంటాయి. అంతేకాదు ఇక్కడి నుంచి చూస్తే  జెనీవా సరస్సు , మాంట్ బ్లాంక్  విస్తృత దృశ్యం సాక్షాత్కరిస్తుంది. విలాసవంతమైన అలంకరణలు దర్శనమిస్తాయి. అంతేకాదు ఈ హోటల్ లో మీకు  24/7 వ్యక్తిగత సహాయకుడు, ప్రైవేట్ చెఫ్ , బట్లర్ అందుబాటులో ఉంటారు.  భద్రత విషయంలో పూర్తిగా సురక్షితం ఈ హోటల్. ఇది సురక్షితమైన హోటళ్లలో ఒకటి కాబట్టి మీరు ఉండవలసిన ప్రదేశం ఇది. ఇది బుల్లెట్ రూఫ్డ్ గ్లాస్, 24/7 సెక్యూరిటీ, సెక్యూరిటీ కెమెరా సిస్టమ్, మీ విలువైన వస్తువులను నిల్వ చేయడానికి అవసరమైన సేఫ్ లాకర్స్ ఉంటాయి. ఇందులో 1930 బ్రున్స్ విక్ బిలియర్డ్ టేబుల్, స్టీన్వే గ్రాండ్ పియానో , బ్యాంగ్ & ఓలుఫ్సేన్  బీవిజన్ 4-103 హోమ్ సినిమా వ్యవస్థ కూడా ఉన్నాయి. మీరు దీన్ని యాక్సెస్ చేయాలనుకుంటే, మీరు మీ స్వంత ప్రైవేట్ ఎలివేటర్‌తో పొందవచ్చు. 4. మార్క్ పెంట్ హౌస్ మార్క్ హోటల్ 75000 డాలర్లు(55,36,687) ఇది యునైటెడ్ స్టేట్స్లో అతిపెద్ద హోటల్ సూట్ పెంట్ హౌస్. ఇది 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ హోటల్ లో మీరు పై అంతస్తులలో విస్తరించి ఉన్న విశాలమైన పెంట్ హౌస్ ను పొందవచ్చు. మీకు 5 బెడ్‌రూమ్‌లు 6 బాత్‌రూమ్‌లు 4 ఫైర్ ప్లేస్‌లు, రెండు వెట్ బార్‌లతో పాటు పెద్ద ఓపెన్ ప్లాన్ లివింగ్ రూమ్ లభిస్తుంది. 26 అడుగుల పైకప్పులతో పూర్తి పరిమాణ బంతి గదిగా మార్చగల సామర్థ్యం ఉంటుంది.  దాని స్వంత పార్టీ ట్రిక్ ఉంది. ఈ పెంట్ హౌస్ సూట్  చక్కని లక్షణాలు ఏమిటంటే ఇది 250 చదరపు మీటర్ల టెర్రస్ ను అందిస్తుంది, విస్తృత దృశ్యాలతో న్యూయర్స్ లోని  సెంట్రల్ పార్క్ , మిడ్ పార్క్ చూడవచ్చు.  న్యూయార్క్ రాణిని పాత్ర పోషించాలనుకుంటే ఈ హోటల్‌లో సూట్ బుక్ చేసుకోవడం మాత్రం తప్పనిసరి. 5. టై వార్నర్ పెంట్ హౌస్ నాలుగు సీజన్లు 60,000 డాలర్లు ఈ లగ్జరీ హోటల్ సూట్ కు టై యజమాని వార్నర్ పేరు పెట్టారు. ఇది భవనం 52 వ అంతస్తులో ఉంది, ఇది చాలా ఎత్తులో  ఉంటుంది. ఈ 400 చదరపు మీటర్ల సూట్ పూర్తి చేయడానికి సుమారు 50 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. ఇది నగరాన్ని  360 డిగ్రీల  వ్యూ చూడవచ్చు. 4 గ్లాస్ బాల్కనీల నుంచి నగరం అందాలను వీక్షించవచ్చు. పెంట్ హౌస్ నుంచి చూసినప్పుడు  అప్‌టౌన్, మిడ్‌టౌన్ మాత్రమే కాదు న్యూయార్క్ డౌన్ సిటీ అద్భుతదృష్యాలను కనువిందు చేస్తుంది.  ఈ సూట్‌తో కేవలం ఒక బాత్రూమ్‌ ఉంటుంది. . అంతేకాదు ఈ హోటల్ లో  స్పా కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఎన్నిసార్లు అయినా మసాజ్‌లు చేయించుకోవచ్చు.

తెల్ల కాగితం- నల్ల చుక్క

‘‘ఇవాళ మీకో పరీక్ష పెట్టబోతున్నాను’’ క్లాసులోకి అడుగుపెడుతూనే చెప్పారు ప్రొఫెసర్‌. అకస్మాత్తుగా ఈ పరీక్ష ఏమిటా అని విద్యార్థులంతా తలపట్టుకుని కూర్చున్నారు. కానీ ప్రొఫెసర్‌ మాటని ఎవరు కాదనగలరు. ఎలాగొలా పరీక్షని పూర్తిచేసేందుకు అంతా సిద్ధపడ్డారు. అందరికీ తలా ఒక ప్రశ్నాపత్రాన్నీ ఇచ్చారు ప్రొఫెసర్‌. ‘‘ఈ ప్రశ్నాపత్రం వెనుకనే మీ జవాబులు రాసి ఇవ్వండి. మీకు ఒక్క అరగంటే సమయం ఉంది,’’ అంటూ పరీక్షని మొదలుపెట్టేశారు.   విద్యార్థులంతా ప్రశ్నాపత్రాలని తెరిచి చూస్తే ఏముంది. కాగితం మధ్యలో ఒక చిన్న చుక్క కనిపించింది అంతే! ప్రొఫెసర్‌గారు తమ తెలివితేటల్ని పరీక్షించేందుకే హఠాత్తుగా ఈ పరీక్షని పెట్టారన్న విషయం విద్యార్థులకి అర్థమైపోయింది. కాబట్టి అంతా ఆ చుక్కని చూసి తమకి తోచిన జవాబుని ఏదో ప్రశ్నాపత్రం వెనకాల రాయడం మొదలుపెట్టారు.   అరగంట గడిచిపోయింది, ఒకో విద్యార్థీ వచ్చి తను పూర్తిచేసి ప్రశ్నాపత్రాన్ని ప్రొఫెసర్‌గారి బల్లమీద ఉంచి వెళ్లారు. ప్రొఫెసరుగారు ఆ ప్రశ్నాపత్రాలన్నింటినీ తీసుకుని వాటిలోంచి ఒక్కో విద్యార్థీ రాసిన జవాబుని చదవడం మొదలుపెట్టారు. ప్రశ్నాపత్రంలో ఉన్న చుక్కని చూసి విద్యార్థులు రకరకాల జవాబులు రాశారు. కొంతమంది ఆ చుక్క ఆకారాన్నీ, రంగునీ వర్ణించారు. మరికొందరు కాగితంలో దాని స్థానం గురించి కొలతలు వేశారు. ఇంకొందరు మరో అడుగు ముందుకు వేసి ‘జీవితం ఓ చుక్కలాంటిది...’ అంటూ కవితలల్లారు. కొందరైతే అసలు ఏ జవాబూ లేకుండా కాగితాన్ని అలాగే వదిలివేశారు.   ప్రశ్నాపత్రాలన్నింటినీ చదివిన తరువాత ప్రొఫెసరుగారు తన అభిప్రాయాన్ని చెప్పడం మొదలుపెట్టారు- ‘‘మీకు ఓ నల్ల చుక్క ఉన్న పత్రాన్ని ఇచ్చి మీకు తోచింది రాయమని అడగ్గానే, అంతా కాగితం మధ్యలో ఉన్న నల్లని చుక్క గురించే రాశారు. ఎవ్వరూ కూడా మనం చెప్పుకునే సబ్జెక్టు గురించి కానీ, మీ లక్ష్యాల గురించి కానీ, జీవితం మీద మీకు ఉన్న అభిప్రాయాల గురించి కానీ... ఆఖరికి మీ గురించి కానీ ఒక్క ముక్క కూడా రాయలేదు. మన జీవితం కూడా మీకిచ్చిన తెల్లకాగితం లాంటిదే! దాని మీద అనారోగ్యం, పేదరికం, అసంతృప్తి, కుటుంబ కలహాలు లాంటి చిన్న చిన్న మరకలు కనిపిస్తూ ఉంటాయి. మనమంతా విలువైన జీవితాన్ని మర్చిపోయి ఎంతసేపూ ఆ మరకల మీదే మన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటాము. వాటి గురించే మన మనసునీ కాలాన్నీ వెచ్చిస్తూ ఉంటాము. అంతేకానీ, చేతిలో ఉన్న తెల్లటి కాగితం మీద ఎంత అందమైన జవాబుని రాయవచ్చో, ఎంత అద్భుతమైన చిత్రాలని గీయవచ్చో మర్చిపోతూ ఉంటాము. నేను మీకు ఈ పరీక్ష పెట్టింది మీకు మార్కులు ఇవ్వడానికి కాదు, మీకు జీవితం విలువ నేర్పడానికి,’’ అంటూ ముగించారు ప్రొఫెసరుగారు. ఆయన మాటలు విన్న తరువాత విద్యార్థులకి తమ జీవితాల్లో అత్యంత ఉపయోగపడే పాఠం అదే అనిపించింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   ..Nirjara

మనకోసం మరో మూడు గ్రహాలు

భూమి ఓ అసాధారణమైన గ్రహం. అదృష్టమో, ప్రకృతి వరమో కానీ ఇక్కడ జీవం మనుగడ సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయి. అనువైన ఉష్ణోగ్రతలు, సూర్యుడి నుంచి తగినంత దూరం, అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ పొర, నీటి సౌలభ్యం, రాతి నేల, గురుత్వాకర్షణ శక్తి, భూమి మీదకు ఉల్కలు దూసుకురాకుండా కాపాడే గురుగ్రహం.... ఇలా చెప్పుకొంటూపోతే అద్భుతం అనదగ్గ సానుకూలతలు ఎన్నో భూమికి సొంతం. అందుకనే భూమిలాగా జీవానికి సహకరించే ప్రాంతం ఈ విశ్వంలో ఉండే అవకాశం లేదని నమ్ముతుంటారు శాస్త్రవేత్తలు. ఎక్కడో శనిగ్రహం చుట్టూ తిరిగే టైటాన్ వంటి అతికొద్ది ఉపగ్రహాల మీద మాత్రమే జీవం మనుగడ సాగించే సావకాశం ఉందని భావిస్తుంటారు. మరి ఇప్పుడో... భూమికి కేవలం 39 కాంతిసంవత్సరాల దూరంలో సౌరకుటుంబాన్ని పోలిన ఓ వ్యవస్థ ఉన్నట్లు నాసా ప్రకటించింది. ఏడాదిలో కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో అది ఓ కాంతి సంవత్సరం అన్న విషయం తెలిసిందే! వినడానికి ఈ దూరం కాస్త ఎక్కువే అనిపించినా, ఈ అనంత విశ్వంలో ఇది ఇంచుమించు పక్కింటితో సమానం. కుంభరాశిలో భాగంగా ఉన్న ఈ వ్యవస్థలోని నక్షత్రానికి ట్రాపిస్ట్‌ 1 అని పేరు పెట్టారు. ఈ ట్రాపిస్ట్‌ 1 నక్షత్రం చుట్టూ ఏడు గ్రహాలు తిరుగుతున్నట్లు గమనించారు. ఈ గ్రహాలన్నీ కూడా సదరు నక్షత్రానికి చాలా చేరువలో ఉన్నాయట. ఒక గ్రహం మీద నిలబడి చూస్తే మిగతా ఆరు గ్రహాలన్నీ కూడా కనిపించేంత దగ్గరదగ్గరగా ఇవి ఉన్నాయి. సూర్యుడితో పోలిస్తే ఈ ట్రాపిస్ట్‌ నక్షత్రం దాదాపు పదోవంతు మాత్రమే ఉంటుంది. పైగా దీని నుంచి వచ్చే కాంతి మన సూర్యకాంతికంటే 200 రెట్లు తక్కువట. అయితే నక్షత్రానికి బాగా దగ్గరగా ఉండటం వల్ల దీని చుట్టూ తిరిగే గ్రహాల మీద ఉష్ణోగ్రతలు 0- 100 మధ్యలోనే ఉంటాయని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా 4,5,6 గ్రహాలు జీవానికి మరింత అనువుగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ట్రాపిస్ట్‌ 1 గురించి అందిన సమాచారమంతా వాటి మీద మనిషి మనుగడకి సంబంధించి కొత్త ఆశలను కల్పించేట్లుగానే ఉంది. అయితే అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఆ గ్రహాల మీద నీటి లభ్యత ఎంత, వాటి మీద లభించే ఖనిజాల ఏమిటి... లాంటి పరిశోధనల ఇంకా జరగాల్సి ఉంది. అప్పుడు మాత్రమే వాటి మీద మనుషులు జీవించే అవకాశం ఉందో లేదో నిర్ధారించగలం. అసలు ఇప్పటికే వాటి మీద కొన్ని జీవులు బతికేస్తున్నాయేమో అన్న అనుమానాలు కూడా మొదలైపోయాయి. ఏది ఏమైనా ఇన్నాళ్లకి భూమిని పోలిన గ్రహాలు కొన్ని శాస్త్రవేత్తలకు కొత్త ఆశలను కల్పిస్తున్నాయి.   - నిర్జర.

అతి సాధారణ జీవితాన్ని గడుపుతున్న బిలియనీర్లు

ప్రపంచంలోనే సంపన్నుల జాబితాలో వారి పేర్లు నమోదు అయ్యాయి.. అయినా వారి జీవనశైలీ అతి సాధారణంగా ఉంటుంది. వందలాది కోట్ల రూపాయలకు అధిపతులు అయ్యినప్పటికీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించని వారెన్ బఫెట్ లాంటి వ్యాపారదిగ్గజాలు ఉన్నారు. 1. వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్‌వే ఛైర్మన్,  సి.ఏ.ఓ వారెన్ బఫెట్.  అయినప్పటికీ, అతను పాత ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ ఇంటిని అతను 1958 లో 31,500  డాలర్లకు కొన్నాడు. అతన్ని ఒరాహా ఆఫ్ ఒరాకిల్ అని కూడా పిలుస్తారు. చాలా సున్నితమైన వ్యాపారవేత్తగా ప్రసిద్ది చెందాడు. ఇప్పటికీ అతని వద్ద, స్మార్ట్ ఫోన్‌ ఉండదు. డెస్క్ పైన కనీసం కంప్యూటర్ లేదు. అతను ఎప్పుడు చెప్పే మాట  స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ వంటి ఆధునిక పరికరాలు ఉంటే నా జీవితం సంతోషంగా ఉండదు. నిజానికి, నాకు ఆరు లేదా ఎనిమిది ఇళ్ళు గానీ ఉండి ఉంటే మరింత దారుణంగా నా పరిస్థితి ఉండేది. ప్రస్తుతం నాకు అవసరం ఉన్న ప్రతిదీ నా దగ్గర ఉంది, నాకు ఇంకేమీ అవసరం లేదు. ఎందుకంటే  దీని తర్వాత పెద్దగా తేడా ఏం ఉండదు కాబట్టి. 2. మార్క్ జుకర్‌బర్గ్. అతను  ఫేస్బుక్ స్థాపకుడు. ఆ సంస్థకు   సిఇవో కూడా అయిన అతను ఇప్పటికి వోక్స యాగన్ హ్యాచ్ బ్యాక్ను నడుపుతాడు. తను ఈ భూమి మీద ఉన్న అత్యంత ధనవంతుడైన టెక్ మొగల్స్‌లో ఒకరు అయినప్పటికీ తన భార్య, కుమార్తెతో కలిసి చాలా సాధారణం జీవితాన్ని గడుపుతున్నాడు.  ఒక మాములు టీ-షర్టు, హూడీ జీన్స్ మాత్రమే ధరిస్తూ ఉంటాడు.  'నేను నా జీవితం గురించి స్పష్టం చేయాలనుకుంటున్నాను, సాధ్యమైనంత తక్కువ నిర్ణయాలు తీసుకోని తద్వారా ఈ సమాజానికి ఎలా ఉత్తమంగా సేవ చేయాలనే దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను అంటాడు  జుకర్‌బర్గ్. 3. కార్లోస్ స్లిమ్ హెలు. తను గ్రూపో కార్సో స్థాపకుడు. గత  40 సంవత్సరాలుగా A 6 బెడ్ రూమ్ ఇంటిలోనే నివసిస్తున్నాడు. మెక్సికోలో ఇప్పటికీ అత్యంత ధనవంతుడు ఇతనే. అయితే ఇతర సంపన్నుల మాదిరిగా ప్రయివేటు  విమానాలు, పడవలు ఆయనకు లేవు. ఇప్పటికీ పాత మెర్సిడెజ్ లోనే తిరుగుతూ ఉంటాడు. తన కంపెనీని కూడా చాలా పొదుపుగా నడుపుతూ ఉన్నాడు. అతను తన స్టాఫ్ హ్యాండ్‌బుక్స్‌లో 'సంపన్న సమయాల్లో కూడా కాఠిన్యాన్ని కొనసాగించమని రాశాడు. 4. చార్లీ ఎర్గెన్ అతను డిష్ నెట్‌వర్క్ చైర్మన్ అయినా కూడా ఇప్పటికీ ప్రతిరోజూ బ్రౌన్ పేపర్ బ్యాగ్ లో లంచ్ బాక్స్ ప్యాక్ చేసికొని తీసుకెళుతు ఉంటాడు. అతను వ్యాపారంలో  ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొన్నారు. తన నిజ జీవితంలో విలువైన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. అతని పొదుపు లక్షణాలు బాల్యంలో అతని తల్లి నుండి వచ్చాయి. కఠినమైన సమయాల్లో పెరిగినప్పుడు అతనికి జీవితం చాలా నేర్పింది. కార్లోస్ తన సహచరులతో కలిసి ప్రయాణించేటప్పుడు హోటల్ గదులను కూడా  తన వారితో కలిసి షేర్ చేసుకుంటారు. 5. అమన్సియో  ఒర్టెగా. అతను  ఇండిటెక్స్ స్థాపకుడు; ప్రతి రోజు భోజనాన్ని తన ఉద్యోగులతో కలిసే కేఫ్ టెరియాలో చేస్తాడు. చాలా నిశ్శబ్ద జీవితాన్ని గడిపే అతను, తరచూ అదే కాఫీ షాప్‌కు వెళ్తూ ఉంటాడు. అతను పరిచయం అవసరం లేని జారా అనే బ్రాండ్ స్థాపకుడు. ఇటీవల భూమిపై రెండవ ధనవంతుడిగా పేరు పొందాడు. అతి సాధారణ వ్యక్తి మాదిరిగానే జీవితాన్ని గడుపుతార ఈ జాబితాలోని మరొక బిలియనీర్ జుకర్‌బర్గ్ మాదిరిగానే  ప్రతిరోజూ  బ్లూ బ్లేజర్, వైట్ షర్ట్ , యాష్ కలర్  ప్యాంటు ధరిస్తారు.

పంచుకుంటే నష్టపోయేది లేదు!

అది హిమాలయాలకు దగ్గరలోని ఒక పల్లెటూరు. ఆ ఊరిచివర ఒక ఆశ్రమం ఉండేది. ఒక రోజు ఊరిలోని రైతు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. నేరుగా అక్కడ ఓ చెట్టు కింద ధ్యానం చేసుకుంటున్న సాధువు దగ్గరకి వెళ్లాడు. కళ్లు తెరిచి చూసిన సాధువుకి రైతు, రైతు చేతిలో యాపిల్‌ పళ్లు కనిపించాయి.   ‘స్వామీ నేను ఎప్పుడు ఈ ఆశ్రమంలోకి అడుగుపెట్టినా మీరు నన్ను ఆదరంగా చూసేవారు. నా సమస్యలని విని సానుకూలమైన పరిష్కరాలు చెప్పేవారు. పంటలు సరిగా పండక నాకు నష్టం వచ్చినప్పుడు నా ఆకలిని తీర్చేవారు. నేను నాటిన యాపిల్‌ చెట్లు ఈసారి విరగకాశాయి. మీరు నా పట్ల చూపించిన అభిమానానికి కృతజ్ఞతగా వాటి పళ్లను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. కాదనకండి!’ అంటూ సాధువు చేతిలో పళ్లని ఉంచి వెళ్లిపోయాడు.   రైతు తన పట్ల చూపిన కృతజ్ఞతకి సాధువు మురిసిపోయాడు. ‘తన గురువుగారు చూపిన సన్మార్గంలో నడవడం వల్లనే కదా, ఇలాంటి జనానికి తన పట్ల గౌరవం ఏర్పడింది!’ అనుకున్నాడు. వెంటనే తన దగ్గర ఉన్న పళ్లను గురువుగారికి ఇవ్వాలని అనిపించింది. గురువుగారి గదిలోకి ప్రవేశించి ఆయన పాదాల దగ్గర యాపిల్‌ పళ్లను ఉంచి జరిగిందంతా చెప్పాడు. తన శిష్యుడు ప్రయోజకుడు కావడం చూసి గురువుగారికి ముచ్చట వేసింది. అంతకుమించి, అతనికి లభించిన బహుమతిని తన పాదాల దగ్గర ఉంచడం చూసి సంతోషం కలిగింది.   అంతలో గురువుగారికి ఆశ్రమంలోని ఇతర శిష్యులు కూడా గుర్తుకువచ్చారు. వారిలో ఒక శిష్యుడు పాపం వారం రోజుల నుంచీ విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాడు. వెంటనే ఆ శిష్యుని గదిలోకి ప్రవేశించారు గురువుగారు. గురువుగారి రాకతో శిష్యుడు పరమానందభరితుడయ్యాడు. ఆయన పరామర్శనీ, దాంతోపాటుగా అందించిన యాపిల్‌ పళ్లనీ చూసేసరికి అతని రోగం సగం తగ్గిపోయినంత ఓపిక వచ్చేసింది.   ఆ యాపిల్ పళ్లని చూస్తూ కూర్చున్న శిష్యుడికి రోజూ తన బాగోగులు చూసుకునే వంటవాడు గుర్తుకువచ్చాడు. పాపం ఆ వంటవాడు తనకి ఏ ఆహారం సరిపడుతుంది, ఎలాంటి పథ్యం చేయాలి అన్న విషయాలను చాలా శ్రద్ధగా గమనించేవాడు. శ్రమ అనుకోకుండా తనకి రోజూ ప్రత్యేకంగా వంట చేసేవాడు. వెంటనే తన కృతజ్ఞతకి గుర్తుగా శిష్యుడు వంటగదిలోకి వెళ్లి వంటవాడి చేతిలో యాపిల్ పళ్లని ఉంచాడు. యాపిల్‌ పళ్లని చూసిన వంటవాడికి నోట మాట రాలేదు. ఏదో ఆశ్రమంలో ఉంటూ నలుగురితో పాటుగా పొట్ట నింపుకుందామని అనుకున్నాడు కానీ, వారు తనని ఇంత గౌరవంగా చూసుకుంటారని అనుకోలేదు. యాపిల్ పళ్లదేముంది! తాను ఎప్పుడూ తినేవే! కానీ ఈసారి చేతికి వచ్చిన పళ్లు చాలా అపురూపమైనవి. అవి తన పట్ల ఓ సాధువు చూపిన అభిమానానికి గుర్తు. అందుకనే వాటిని తన ఇంటికి తీసుకువెళ్లి కొడుకు చేతిలో పెట్టాడు. రోగంతో బాధపడిన శిష్యుడికి తను చేసిన సేవ గురించి చెబుతూ ‘నువ్వు కూడా నాలాగా ఇతరుకు సాయపడే గుణాన్ని అలవర్చుకోవాలి’ అంటూ భుజం తట్టాడు.   ‘తండ్రి చెప్పింది నిజమే కదా!’ అనిపించింది కొడుకుకి. ఒకసారి తమ గతాన్నంతా అతను నెమరువేసుకున్నాడు. ఏడాది క్రితం తమ కుటుంబం కటిక దరిద్రంలో ఉండేది. వంటవాడి ఇంట్లో వండుకునేందుకు గింజలే లేవయ్యే! అలాంటి పరిస్థితుల్లో తమ ఇంటికి వచ్చిన ఓ సాధువు తన తండ్రిని తీసుకువెళ్లి వాళ్ల ఆశ్రమంలో చేర్పించాడు. ‘ఈ రోజున తను వేళకి ఇంత తినగలుగుతున్నాడంటే ఆ ఆశ్రమం చలవే!’ అనుకున్నాడు కొడుకు. వెంటనే ఆశ్రమం వైపు బయల్దేరాడు. అక్కడ పదులకొద్దీ సాధువులు తిరుగుతున్నారు. కానీ ఆ రోజు తన తండ్రికి సాయం చేసిన వ్యక్తిని మాత్రం స్పష్టంగా గుర్తుపట్టాడు కొడుకు. పరుగెత్తుకుంటూ వెళ్లి పళ్లని అతని చేతిలో పెట్టాడు. ఆ సాధువు ఎవరో కాదు.... పళ్లని గురువుగారి పాదాల చెంత ఉంచినవాడే! సంతోషాన్ని ఒకరితో పంచుకోవాలనుకుంటే, అది తిరిగి ఎలా తన దగ్గరకే వస్తుందో సాధువుకి అర్థమైపోయింది. పంచుకునే గుణంలో ప్రతి ఒక్కరి మనసూ తృప్తి చెందుతుందని తెలిసిపోయింది. - నిర్జర.

దుబాయ్‌లోని 8 మంది ధనవంతులు...!!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఒకటైన దుబాయ్  చిన్నదేశమే అయినా సంపన్న దేశంగా గుర్తింపు పొందింది. దుబాయ్ లో వలసవాసులుగా భారతీయులు అందులో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. ఈ దేశంలో ఉన్న సంపన్నుల జాబితాలో ఉన్నవారిలో భారతీయుులు, భారతీయ సంతతికి చెందిన వారి సంఖ్య  ఎక్కు వే ఉంది. 1. ఉస్సేన్ సేజ్వాని (Hussain Sajwani) అతని మొత్తం ఆస్తుల విలువ. 2.1 బిలియన్ డాలర్లు. సేజ్వాని, 2002 లో 'డమాక్ ప్రాపర్టీస్' అనే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ  స్థాపించాడు. అప్పటి నుండి ఇది యూరోప్ లో తన వ్యాపారాన్ని విస్తరించి ప్రముఖ సంస్థగా ఎదిగింది. సేజ్వాని రియల్ ఎస్టేట్ రంగంలో సాధించిన ప్రగతికి గాను అతన్ని అరేబియా బిజినెస్ రియల్ ఎస్టేట్ అవార్డులతో, అలాగే రియల్ ఎస్టేట్ లెజెండ్ బిరుదుతో సత్కరించారు. అలాగే 2018 సంవత్సరంలో గల్ఫ్  బిజినెస్ అవార్డులతో పాటు ఆ సంవత్సరపు రియల్ ఎస్టేట్ బిజినెస్ లీడర్ గా ఎన్నికైనాడు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి జాబితాలో అతని స్థానం 962. 2. సన్నీ వర్కీ.(Sunny Varkey) ఇతని మొత్తం ఆస్తుల విలువ 2.6 బిలియన్ డాలర్లు. భారతీయుడైన సన్నీ బిలియనీర్ల జాబితాలో  స్థానాన్ని సంపాదించుకున్నాడు. జేమ్స్  విద్యా సంస్థలకు అధిపతిగా ఉన్న ఆయన ప్రపంచవ్యాప్తంగా 250 పాఠశాలలను నిర్వహిస్తున్నాడు. అలాగే  ప్రపంచంలోని అతిపెద్ద k-12 పాఠశాలలను నడుపుతున్నాడు.   అతన్ని 2007 సంవత్సరపు అత్యుత్తమ ఆసియా వ్యాపారవేత్త తో సహా అనేక అవార్డులతో సత్కరించారు. అలాగే 2012లో మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్  సీఈవో గా ఎడ్యుకేషన్ బిజినెస్ లీడర్ గా అవార్డులు సొంతం చేసుకున్నాడు. విద్యా రంగంలో చేసిన కృషికి ఆయనకు అవార్డులు లభించాయి. 3. అబ్దుల్ బిన్ అహ్మద్ అల్ ఘురైర్(Abdulla Bin Ahmad Al Ghurair)  ఇతని మొత్తం ఆస్తుల విలువ 4.9 బిలియన్ డాలర్లు.  మాష్రేక్‌బ్యాంక్‌ను స్థాపించాడు. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రముఖ బ్యాంకులలో ఒకటి.  దుబాయ్ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. 4. బి.ఆర్. షెట్టి.  (B.R.Shetty) ఇతని ఆస్తుల విలువ 2.6 బిలియన్ డాలర్లు. భారతీయ మూలాల కలిగిన దుబాయ్ వ్యాపారవేత్త. దుబాయ్ లో అనేక వ్యాపారాలను సొంతం చేసుకున్నాడు.  ఆరోగ్య సంరక్షణ , ఆర్థిక సేవల సామ్రాజ్యానికి అధిపతి అయిన ఇతనికి బి.ఆర్. లైఫ్, ఎన్ఎంసి హెల్త్ కేర్, ఫైనాబీఆర్ హోల్డిగ్ వంటి కంపెనీలు ఉన్నాయి.  తన సంపదలో సగం సేవా కార్యకలాపాలను విరాళంగా ఇచ్చే విషయంపై 2018లో అతను సంతకాలు చేసి తనలో నిజమైన మానవత్వం ఉందని నిరూపించుకున్నాడు.  5. సైఫ్ అల్ ఘురైర్ (Saif Al Ghurair) ఇతని  ఆస్తుల నికర విలువ 1.7 బిలియన్.  ప్రపంచంలోని టాప్ 500 ధనవంతులలో తన పేరును నమోదు చేసుకున్నాడు. అతను యుఎఇలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్,  ప్రొడక్షన్  సంస్థలలో ఒకటైన అల్ ఘురైర్ గ్రూపుకు అధిపతి.  యాష్రెడ్‌లో కొన్ని పెట్టుబడులను కలిగి ఉన్నాడు, ఇది యుఎఇలో ప్రైవేటు ఆధీనంలో ఉన్న పురాతన బ్యాంకు. 6. మిక్కీ జగ్టియాని.(Micky jagtiani) ఇతని ఆస్తుల విలువ 3.1 బిలియన్ డాలర్లు. ఈ స్థాయికి చేరుకోవడానికి అతను ఎన్నో కష్టనష్టాలను అనుభవించాడు. అట్టడుగు నుండి అత్యున్నత స్థానం వరకు సాగింది అతని ప్రస్థానం. లండన్ లో టాక్సీ డ్రైవర్‌గా తన క్యారియర్‌ను ప్రారంభించిన అతను 1973 సంవత్సరంలో యుఎఇకి వచ్చాడు. బహ్రెయిన్‌లో 10 సంవత్సరాలు బేబీ ప్రొడక్ట్ షాపును నడిపి, తరువాత దానిని మరింత విస్తరించాలని నిర్ణయించుకొని ఆ వ్యాపారాన్ని 6 షాపుల వరకు విస్తరించాడు. గల్ఫ్  యుద్ధం ప్రారంభమైన తరువాత, అతను ప్రస్థానం కొనసాగింది. ల్యాండ్‌మార్క్ గ్రూప్ అనే కార్పొరేషన్‌ను స్థాపించాడు . అది కాస్త  ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ , ఫర్నిచర్ వంటి ఇతర వ్యాపారాలను విస్తరించింది. దాంతో మిక్కీ  సంపన్నుల జాబితాలో చేరాడు.   ఫోర్బ్స్  జాబితా ప్రకారం ప్రపంచంలోని ధనవంతుల్లో ఇతను 478 వ స్థానంలో ఉన్నాడు. 7. ఎం.ఏ.యూసుఫ్ అలీ(M.A.Yusuff Ali) ఇతని ఆస్తుల విలువ 3.7 బిలియన్ డాలర్లు. అతను లులు గ్రూప్ ఇంటర్నేషనల్ అధిపతి. భారతదేశంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టిన వ్యాపారవేత్త. తన వాణిజ్యవ్యాపారాలను అంతకంతకు పెంచుకుంటూ సంపన్నుల జాబితాలో చేరాడు. 8. రవి పిళ్ళై. (Ravi Pillai) ఇతని ఆస్తుల విలువ 4.2 బిలియన్ డాలర్లు. ఇతను కేరళకు చెందిన వ్యక్తి. దురదృష్టవశాత్తు అతని వ్యాపారం క్షిణించడంతో  దుబాయికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి స్థానిక భాగస్వామి సహాయంతో ఒక చిన్న వాణిజ్య వ్యాపారాన్ని ప్రారంభించాడు. రెండు సంవత్సరాలల్లో అతని వ్యాపారం అపారంగా పెరిగింది. రవి పిళ్ళై  కొత్తగా నాజర్ ఎస్.హాల్.హజారే కార్పొరేషన్ (NSH) ను స్థాపించాడు. దుబాయ్ లోని ధనవంతుల జాబితాలో చేరాడు.   

రతన్ టాటా జీవనశైలి..

రతన్ టాటా.. పరిచయం అక్కరలేని పేరు. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసిన గొప్ప వ్యాపారవేత్త. టాటా గ్రూప్ సంస్థలను కార్పొరేట్ స్థాయిలో కొనసాగిస్తూ అనేక నూతన ప్రాజెక్ట్ లకు రూపకల్పన చేశారు. నానో కారు ఆయన ఆలోచనే. దేశభక్తి, ఉద్యోగుల పట్ల అనురక్తి, వ్యాపారవిస్తరణలో యుక్తి ఆయన సొంతం. ఆయన జీవనశైలిని గమనిస్తే స్పూర్తిదాయకమైన వ్యక్తిత్వం కనిపిస్తుంది..   రతన్ టాటా తండ్రి నావెల్ టాటా దత్తత వచ్చారు.  తండ్రి మాదిరిగానే రతన్ టాటా బాల్యంలో చాలా కష్టాలు అనుభవించారు. అతని పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోవడంతో బామ్మ వద్ద పెరిగారు.  ఐబిఎంలో వచ్చిన ఉద్యోగాన్ని వద్దనుకున్నారు. ఒకవేళ ఆయన ఆ ఉద్యోగాన్ని వదిలి ఉండకపోతే ఈ రోజు ఇంత పేరుప్రఖ్యాతులు దక్కేవి కావు. అధికారం, హోదా ఉన్నప్పటికీ రతన్ టాటా సాధారణ జీవితాన్నే ఇష్టపడతారు.   రతన్ టాటా  ఆర్కిటెక్చర్ డిగ్రీని  పూర్తి చేసిన తర్వాత  హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఏ మాత్రం ఖాళీ సమయం ఉన్న తనకు ఎంతో ఇష్టమైన ఫెరారీ కారు నడపడాన్ని ఇష్టపడతారు. అంతేకాదు అతని వద్ద అద్భుతమైన కార్ల కలెక్షన్ ఉంటుంది. ఫెరారీ కాలిఫోర్నియాతో పాటుగా కాడిలాక్ ఎక్స్‌ఎల్‌ఆర్, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్, క్రిస్లర్ సెబ్రింగ్, హోండా సివిక్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, మసెరటి క్వాట్రోపోర్ట్, మెర్సిడెస్ బెంజ్ 500 ఎస్ఎల్, జాగ్వార్ ఎఫ్ టైప్, జాగ్వార్ ఎక్స్‌ఎఫ్-ఆర్ తదితర కార్లు ఉన్నాయి.   రతన్ టాటా పద్మ విభూషణ్, పద్మ భూషణ్ పురస్కారాలు,  బ్రిటిష్ ఎంపైర్ కైట్స్ గ్రాండ్ క్రాస్ అందుకున్నారు. పైలట్ లైసెన్స్ పొందిన అతను టాటా గ్రూప్ ఎయిర్ క్రాఫ్ట్ నడిపారు. 17ఏళ్ల వయసులోనే  మొదటిసారి సోలోగా ఫ్లైట్ నడిపిన ఆయన ఒక ఫ్లైట్ ను కూడా సొంతం చేసుకున్నారు. ఎఫ్ - 16 ఫైటర్ జెట్ ను ఎయిర్ షోలో నడిపిన మొదటి భారతీయ వ్యక్తి రతన్ టాటానే.   జాగ్యార్, కోరస్, ల్యాండ్ రోవర్, టెట్లీలను సంపాదించిన అతను భారతీయ కంపెనీని అంతర్జాతీయ స్థాయికి  చేర్చారు. అతను మిత్సుబిషి కార్పొరేషన్, బూజ్ అలెన్ హామిల్టన్, ఏఐజి అండ్ జెపి, మోర్గాన్ చేజ్ సంస్థల  సలహా బోర్డు సభ్యునిగా ఉన్నారు. నానో కార్లు రతన్ ప్రియమైన ప్రొజెక్ట్. మధ్యతరగతివారికి లక్షరూపాయలకే సొంతకారు కొనుక్కొనే అవకాశం కల్పించారు.   వ్యాపార రంగంలో బిజిగా ఉండే అతనికి పెంపుడు కుక్కలన్నా చాలా ఇష్టం. తన రెండు పెంపుడు కుక్కలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. రతన్ టాటా నిస్వార్థపరుడు, అద్భుతాలను సృష్టించడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. తమ సంస్థ ఏర్పాటుచేసిన సంక్షేమ ట్రస్ట్ ఇప్పటికే ఎంతోమందిని ఆదుకుంటుంది.   రతన్ టాటా బిలియనీర్ల జాబితాలో చేర్చబడలేదు, ఎందుకంటే సంపదను దాచకుండా పంచుకోవడమే అతనికి ఇష్టం.తన కోసం కన్నా ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. అతని వినయంతో కూడిన జీవనశైలి డబ్బు కన్నా మనుషులకు ఎక్కువ విలువ ఇస్తారని స్పష్టం చేస్తుంది. ఇతరుల పట్ల ఆయన చూపించే ప్రేమ అతనికి ఎంతో గౌరవాన్ని తెచ్చింది. తన హోదాను ప్రదర్శించుకోవాలన్న ప్రయత్నం ఎప్పుడు రతన్ టాటా చేయరు.   రతన్ టాటా పెద్ద వ్యాపార వేత్త అయినప్పటికీ అవసరమైనప్పుడు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తారు. డాబు దర్పం ప్రదర్శించాలన్నఆలోచన లేదు.  రతన్ సేవలు వెలకట్టలేనివి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయచర్యలకు రిలీఫ్ ఫండ్ అందించడంలో రతన్ టాటా పేరు ఎప్పుడు ముందే ఉంటుంది.   అందరినీ సమానత్వంతో చూసుకోవడమే చాలా మందికి స్ఫూర్తినిస్తుందని నమ్మే దార్శనికుడు రతన్ టాటా.  ఆయన టాటా గ్రూప్ ఛైర్మన్ నే కాకుండా సామాజిక కార్యకర్త , గొప్ప నాయకుడు అని చెప్పవచ్చు. అందుకు కారణం వినయం, నిస్వార్థంతో కూడిన అతని జీవనశైలి.  వందలాది కోట్లకు అధిపతి అయినా అందరితో కలిసిపోయే తత్త్వం ఆయన సొంతం. ఆ వ్యక్తిత్వమే ఆయనను గొప్పవ్యక్తిగా దేశమే కాదు ప్రపంచం గుర్తించేలా చేసింది.

ఎవరి జీవితమూ వృథా కాదు

  అది ఒక కొండ మీద ఉన్న గ్రామం. ఆ గ్రామంలో నీరు కరువుగా ఉండేది. గ్రామంలో ఉన్న పేదలు కాస్తోకూస్తో ఉన్న నీటితో సరిపెట్టుకుంటుంటే, ధనికులు మాత్రం కొండ దిగువన ఉన్న చెరువు నుంచి నీటిని కావడితో తెప్పించుకునేవారు. అలా ఓ పెద్దాయన తన యజమాని కోసం రోజూ కావడితో నీటిని మోసుకు వెళ్లేవాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా...  ఒకరోజు కావడిలో ఉన్న రెండు కుండలలో ఒకదానికి పగులు వచ్చింది. కానీ దాన్ని పెద్దాయన అవతలికి పడేయకుండా, ఎప్పటిలాగా దానిలో నీటిని నింపి కొండమీదకు తీసుకువెళ్లసాగాడు. రోజూ ఆ కుండ నిండా నీటిని నింపడం, కొండ మీద ఉన్న యజమాని ఇంటికి చేరుకునేసరికి దానిలో ఉన్న సగం నీరు వృథాగా నేలపాలవడం జరుగుతూనే ఉండేది.   ‘నీ వల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ!’ అని ఒక రోజు పగులు ఉన్న కుండని ఆడిపోసుకుంది మంచి కుండ. దానికి ఏం సమాధానం చెప్పాలో పగిలిన కుండకి అర్థం కాలేదు. ‘నిజంగానే తనకి ఉన్న పగులు వల్ల ఆ పెద్దాయన శ్రమంతా వృధా అయిపోతోంది కదా’ అనుకుంది. ఆ రోజు మొదలు- మంచి కుండ, పగులు ఉన్న కుండని రోజూ దెప్పిపొడవడం.. పగులు ఉన్న కుండ మారుమాట్లాడలేక దిగాలుగా ఉండిపోవడం జరుగుతూనే వస్తోంది.   ‘నన్ను అవతల పడేయండి. నా వల్ల మీ శ్రమంతా వృథా అయిపోతోంది. యజమానికి తగినంత నీరుని కూడా ఇవ్వలేకపోతున్నారు,’ అంటూ తనని మోస్తున్న పెద్దాయనతో ఒక రోజు మొరపెట్టుకొంది పగులు ఉన్న కుండ. కుండ నేరుగా తనతో మాట్లాడటం చూసి పెద్దాయన ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. అటు మీదట చిరునవ్వుతో... ‘నిన్ను అవతల పడేయటం మాట అటుంచు. ముందు నీ దిగులుని పోగొట్టే ఉపాయం ఒకటి చెబుతా విను. ఇవాళ కొండ మీదకి ఎక్కే దారిలో అటూఇటూ విరగబూసిన పూలను కాస్త గమనించు. వాటి అందం చూసి నీ మనసులో ఉన్న ఆందోళన అంతా మాయమైపోవడం ఖాయం!’ అన్నాడు.   పగులు ఉన్న కుండ ఆ రోజు నిజంగానే దారికి ఇరువైపులా ఉన్నా పూలబాటను గమనించింది. నిజంగానే ఆ అందమైన రంగురంగుల పూలని చూసి దాని మనసులో దిగులు మాయమైంది. సాయంత్రం కాగానే పెద్దాయన పగిలిన కుండతో- ‘నేను చెప్పినట్లుగా దారిలో ఉన్న పూల చెట్లను గమనించావా?’ అని అడిగాడు. దానికి పగిలిన కుండ - ‘ఓ! గమనించాను. కానీ నా సంగతేంటి? మీరు నన్ను ఎప్పుడు అవతల పడేస్తున్నారు?’ అని అడిగింది.   ‘నిన్ను అవతల పడేసే ప్రశ్నే లేదు! ఎందుకంటే ఆ దారిలో ఉన్న పూలచెట్లన్నీ నీ చలవే. కాస్త కాస్తగా నీ నుంచి జారే నీటితో ఆ దారంతా అందమైన పూల మొక్కలు పెరిగాయి. అవి ఇప్పుడు ఆ బాటన పోయే ప్రతివారికీ సంతోషాన్ని కలిగిస్తున్నాయి. మరి ముందు ముందు కూడా ఆ మొక్కలకి నీళ్లు అవసరం కదా! నిన్నెలా వదులుకోగలను. పొద్దుగూకులా కష్టపడే నా మనసుకి తృప్తిని అందించేంది ఆ పూల మొక్కలే సుమా!’ అంటూ చెప్పుకొచ్చాడు పెద్దాయన. ఆ మాటలకి పగిలిన కుండ మనసులో ఉన్న కాస్తో కూస్తో దిగులు కాస్తా ఆవిరైపోయింది. ప్రపంచంలో ఎవరి జీవితమూ నిరుపయోగం కాదనీ, తమ లోటుపాట్లను గుర్తించినట్లే సామర్థ్యాలను కూడా గుర్తుంచుకోవాలనీ తెలిసివచ్చింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) ..Nirjara

కళ్లు చెప్పే మాటలు

మనిషిని ఇతర జీవుల నుంచి వేరు చేసే ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. సామాజిక జీవితం వాటిలో ముఖ్యమైనది. సమాజంలో మెలిగేందుకు, సంఘజీవిగా నిలదొక్కుకునేందుకు భాష, భావం... ఈ రెండూ చాలా అవసరం. భావాన్ని వ్యక్తీకరించడంలో మన కళ్లు చూపే ప్రతిభ అసాధారణం. మనిషి కళ్లలో ఉండే స్క్లెరా అనే తెల్లటి పదార్థం వల్ల మనిషి కనుగుడ్లు చిత్రవిచిత్రమైన భావాలను పలికించగలవు. అతని కనుగుడ్లలో మార్పులు, కదలికలను బట్టి.... అతను ఎటు చూస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అన్నది పసిగట్టేయవచ్చు. దీని గురించి ప్రత్యేకమైన శిక్షణ ఏమీ అవసరం లేదు. అలా తెలిసిపోతుందంతే! కాకపోతే మనకి తెలియకుండానే మన కళ్లు చేసే మాయ గురించి కాస్త అవగాహనను ఏర్పరచుకుంటే, కాస్త జాగ్రత్తగా మసులుకునే అవకాశం ఉంటుంది. - మనలో ఎంత విశ్వాసం ఉన్నాగానీ, అవతలి మనిషి కళ్లలోకి అదేపనిగా గుచ్చిగుచ్చి చూస్తూ ఉంటే... ఎదుటివారికి వ్యతిరేక భావం కలుగుతుంది. ఎంతటి దగ్గరవారైనా కానీ మాట్లాడే సమయంలో 70 శాతం మించి సమయాన్ని కళ్లలో కళ్లు పెట్టి చూడకూడదంటున్నారు బాడీలాంగ్వేజ్‌ నిపుణులు.   - అదేపనిగా చూస్తే బాగోదు అంటూ ఒక పక్క సంభాషణ జరుగుతూ ఉన్నా కూడా దిక్కులు చూస్తూ ఉంటే అసలుకే మోసం వస్తుంది. మీలో ఏదో అపరాధ భావం ఉందనో, అవతలి మనిషంటే లెక్కలేదనో... చూపులతోనే చెప్పినట్లవుతుంది. - కొంతమంది ఒకరితో మాట్లాడుతూ ఉంటారు. పక్కచూపులతో వేరొకరిని చూస్తూ ఉంటారు. ఇది కూడా అవతలి మనిషిలో చిరాకు కలిగించే అంశమే! మాట్లాడే వ్యక్తికి సదరు పక్క వ్యక్తి అంటే అనుమానమో, ఆసక్తో ఉంటే ఇలా జరుగుతూ ఉంటుంది.     - సంభాషణ మధ్యలో అవతలివాడు కను రెప్పలను చాలా నిదానంగా మూసి, ఒక్క క్షణం అలా మూసే ఉంచుతున్నాడంటే... అతను నిరాసక్తిగా ఉన్నట్లే! ఒక రకంగా చెప్పాలంటే అవతలి మనిషిని కాసేపు మర్చిపోవడానికి కళ్లు మూసుకున్నాడని అనుకోవచ్చు. ఇక దానికి తోడు సుదీర్ఘమైన నిట్టూర్పు కూడా వచ్చిందంటే అతని మీద జాలి పడక తప్పదు. అలా కాకుండా అవతలి వ్యక్తి మాట్లాడుతూ మాట్లాడుతూ తెగ కళ్లని ఆర్పుతున్నాడంటే... అతను ఏదో ఉద్వేగంలో ఉన్నట్లు లెక్క. - సంభాషణలో మనం ఎదుటివారి వంక చూస్తున్నప్పుడు ముఖ్యంగా రెండు రకాలుగా మన చూపుని వారి మీద కేంద్రీకృతం చేస్తాము. ఒకటి ఎదుటివారి కళ్లలోకి, ఆ తరువాత అతని నుదుటి మధ్యలోకి... అంటే ఒక త్రిభుజాకారంలో వారిని గమనిస్తాము. లేదా ఎదుటివారి కళ్లలోకి, ఆ తరువాత వారి నోటి వైపుకీ... అంటే తలకిందులుగా ఉన్న త్రిభుజాకారంలో చూస్తాము. మొదటి పద్ధతిలో ఎదుటి వారి మీద మనం ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నామన్న హెచ్చరికను అందచేస్తుంది. పై అధికారులు, ఇంటర్వూ చేసేవారు ఇలాంటి చూపులు చూస్తుంటారు. ఇక రెండో పద్ధతిలో అవతలివారితో స్నేహపర్వకంగా మెలుగుతున్న సూచనను తెలియచేస్తుంది.       - కేవలం సంభాషణలోనే కాదు. ఒక మనిషి ఒంటరిగా ఉన్నా కూడా అతని కళ్లు ఏం చేస్తున్నాయదన్నదాటి బట్టి అతని మనస్థితిని గ్రహించవచ్చు. ఎదో గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడా, వైరాగ్యంలో ఉన్నాడా, తనలో తాను మాట్లాడుకుంటున్నాడా అన్నది అతని కళ్లని బట్టి తేలిపోతుంది. అదెలాగంటారా! మీరే ఆ భావాలను అనుకరించడానికి ప్రయత్నించండి! ఆ సమయంలో మీ కళ్లు అసంకల్పితంగానే మీ స్థితికి అనుగుణంగా కదలడాన్ని గమనిస్తారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కళ్లు ఈ లోకాన్ని చూడటానికే కాదు, మీ భావాలను అవతలివారితో పంచుకోవడంలో కూడా ముఖ్యపాత్రని వహిస్తాయి. అందుకే శరీరభాష (బాడీలాంగ్వేజ్‌)లో కళ్లకి ఉన్న ప్రాధాన్యత అసాధారణం. మీ ఆసక్తి, ఓపికలని బట్టి కంటి భాష గురించి ఎన్ని వివరాలనైనా సేకరించుకోవచ్చు. - నిర్జర.  

అందమైన డ్రాయింగ్ రూం కోసం

  ఇంట్లోకి అడుగుపెట్టినవారు ఒక్క నిమిషం మీ డ్రాయింగ్‌ రూంని చూస్తూ ఉండిపోవాలనీ, వారి కళ్లో మీ అభిరుచి పట్ల అభినందన కనిపించాలనీ ఎవరికి మాత్రం అనిపించదు. అతిథుల సంగతి పక్కన పెడితే మనది అనుకునే ఇల్లు అందంగా కనిపించాలన్న ఆశ ఎవరికి మాత్రం ఉండదు. కాకపోతే ఇందుకు చాలానే అవాంతరాలు కనిపిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడం ఇష్టం లేకపోవడం, ఇరుకైన గదులు, అద్దె ఇల్లులాంటి సమస్యలతో అనుకున్నా ఇంటిని అలంకరించుకోలేకపోతుంటారు. అందుకోసమే ఈ చిన్న చిట్కాలు...     మామూలు వస్తువులతోనే అలంకరణకు ఎక్కువ అవకాశం లేనప్పుడు నిత్యం వాడుకునే వస్తువులనే మరింత కళాత్మకంగా కనిపించేవి ఎన్నుకొంటే సరి. బట్టలు తగించే కొక్కేలు, కర్టెన్ రాడ్స్, పెన్‌స్టాండులు, గడియారాలు, నైట్‌ ల్యాంప్స్ వంటివి కొంచెం విభిన్నమైనవి ఎంచుకొని చూడండి.     వాల్‌ స్టికర్స్‌ ఆన్‌లైన్‌ షాపింగ్ పుణ్యమా అని ఇప్పుడు వాల్‌స్టికర్స్‌ అందరికీ అందుబాటులోనే దొరుకుతున్నాయి. వీటి ధరలు కూడా మరీ అంత ఎక్కువగా ఉండవు. కాకపోతే ఎలాంటి బొమ్మని ఎంచుకోవాలి? అది ఎంత పరిమాణంలో ఉండాలి? అన్న విషయాలను ఒకటికి రెండుసార్లు తరచి చూసుకోవాలి. గోడ రంగుని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనం ఆర్డర్‌ చేసిన వాల్ స్టికర్‌ ఒకే షీట్‌ మీద వస్తోందా లేకపోతే వేర్వేరు స్టికర్స్‌ని అసెంబుల్‌ చేసుకోవాలా అన్న విషయాన్ని కూడా గమనించుకోవాలి.     చిన్న చిన్న బొమ్మలతో ఇంట్లో చిన్న బొమ్మలు చాలానే పేరుకుంటాయి. చాక్లెట్లతో పాటుగా వచ్చినవో, చైనా బజార్లలో కొనుక్కున్నవో, కీచెయిన్లు ఊడిపోయినవో మిగిలిపోయిన బొమ్మలను అక్కడక్కడా అతికించవచ్చు. ఫ్రిజ్‌ తలుపులకీ, కిటికీ చెక్కలకీ, స్విచ్‌ బోర్డులకీ డబల్ స్టికర్‌తో అంటించి ఎప్పుడు కావాలంటే అప్పుడు తొలగించవచ్చు.     పోస్టర్స్‌ గృహాలంకరణకు సంబంధించి అతి చవకగా లభించేవి వాల్‌ పోస్టర్లే. కాకపోతే చవగ్గా దొరుకుతోంది కదా అని ఇల్లంతా నింపితే మాత్రం వీటితో అసలుకే మోసం వస్తుంది. మరీ భారీ పరిమాణంలో ఉండే పోస్టర్లు ఒకోసారి ఇల్లు ఇరుకుగా ఉన్న భావన కలిగిస్తాయి. కాబట్టి కంటికి నదురుగా, మరీ ఆడంబరంగా తోచని పోస్టర్లని ఎన్నుకోవాలి. వీటిని సెలోఫిన్‌ టేప్‌తో అతికిస్తే త్వరగా ఊడిపోవడమే కాకుండా, గోడ మీద కూడా మరకని మిగులుస్తాయి. ఇలాంటి సందర్భాలలో మెడికల్‌ షాపుల్లో దొరికే తెల్లటి సర్జికల్‌ టేపుని ఉపయోగిస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇటు గోడకీ, అటు పోస్టరుకీ నష్టం కలగకుండా తీసివేయవచ్చు.     ఉపాయం ఉంటే ఇల్లు మనది కాకపోవచ్చు, మేకులు కొట్టడం ఇష్టం లేకపోవచ్చు, గోడకి ఏదన్నా అంటించడానికీ మనస్కరించకపోవచ్చు... అయినా కూడా కాస్త శ్రద్ధ పెడితే గదిని అలంకరించేందుకు చాలా ఉపాయాలు తడతాయి. ఫ్రిజ్‌ మీద ఒక బొమ్మల కొలువు తీరుతుంది, బెడ్‌ల్యాంప్‌ నుంచి ఒక అందమైన బొమ్మ వేళ్లాడుతుంది, టీవీ కింద ఉన్న కేబుల్ బాక్స్‌ మీద ఒక టెడ్డీ బేర్‌ కూర్చుంటుంది... కాస్తంత ఉపాయం ఉంటే గది మొత్తం అందంగా మారిపోతుంది. కావాలంటే ఒక్కసారి మీ డ్రాయింగ్ రూమ్‌ని పరిశీలించి చూడండి. - నిర్జర.

వినడం కూడా ఒక కళే!

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నానారకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను వేరొకరికి చెప్పుకుంటే చాలు, సగం తీరిపోతాయని వారి నమ్మకం. ఆఖరికి వైద్యుడి దగ్గరకు వెళ్లిన రోగి కూడా, తన మనసులో ఉన్న బాధని వైద్యునితో చెప్పుకునే అవకాశం వస్తే... సగం రోగం నుంచి ఉపశమనం పొందినంతగా తృప్తి చెందుతాడు. కానీ ఇతరుల బాధని పట్టించుకునే నాథుడు ఎవడు! అంత తీరికా, ఓపికా ఈ ప్రపంచంలో ఎవరికి ఉన్నాయి. అందుకనే అందరూ మాట్లాడటానికి ఇచ్చిన ప్రాముఖ్యతని, వినడానికి ఇవ్వడం లేదు. ఇతరుల మనసుని గెలవాలన్నా, సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్నా... వినడం అనే కళలో ఆరితేరాలంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. అందుకోసం వారు కొన్ని చిట్కాలను కూడా అందిస్తున్నారు. అవేమిటంటే...     తగిన వాతావరణాన్ని కల్పించండి చాలామంది ఇళ్లలోకి వెళ్లినప్పుడు... వాళ్లు ఒకపక్క మనతో మాట్లాడుతూనే ఉంటారు, మరో పక్క టీవీనో దినపత్రికో చూస్తూనే ఉంటారు. ఇలాంటి సందర్భాలు చాలా చికాకుని కలిగిస్తాయి. ఒక వ్యక్తి చెప్పే మాటలని వినాలీ అంటే దానికి తగిన వాతావరణాన్ని సృష్టించాలి. రణగొణధ్వనుల మధ్యా, టీవీ శబ్దాల మధ్యా, నలుగురూ మెసిలే చోటా సంభాషణ సీదాసాదాగా సాగిపోతుందే కానీ మనసులో ఉన్న మాటలు నిస్సంకోచంగా వెల్లడి కావు.     శరీర భాష వినడం అంటే శూన్యంలో చూస్తూ ఉండిపోవడం కాదు. మాట్లాడే వ్యక్తికి మీరు ఆసక్తిగా వింటున్నారన్న భావన కలగాలి. అతని కళ్లలోకి సూటిగా చూస్తూ ఉండటం. మధ్యమధ్యలో తలని ఆడిస్తూ ఉంటడం, మెడని కాస్త ముందుకి వంచడం... వంటి సంకేతాల ద్వారా మీరు అవతలి వ్యక్తిని ఆలకిస్తున్నారన్న భావనని కల్పించగలగాలి.     ప్రోత్సహించండి మీ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోతే అవతలివారు మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. కాబట్టి మధ్యమధ్యలో వారి నుంచి మరింత సమాచారాన్నీ, మరింత స్పష్టతనీ రాబట్టేందుకు ప్రయత్నించండి. అవునా, అలాగా, నిజమే వంటి పదాలను వాడటం ద్వారా ‘నీ ఉద్దేశం ఏమిటి?’, ‘నువ్వేం చేద్దామని అనుకుంటున్నావు?’ వంటి ప్రశ్నల ద్వారా అవతలి వ్యక్తి తన మనసులో ఉన్న భావాలను పూర్తిగా వెల్లడించేందుకు అవకాశాన్ని ఇవ్వండి.   అడ్డుకోవద్దు ఇతరులు చెబుతున్న విషయం మీద మనకు విరుద్ధమైన అభిప్రాయాలు ఉండవచ్చు. అవతలి మనిషి చెప్పే విషయం మీద మనకే ఎక్కువ అవగాహన, తెలివి ఉన్నాయి అనిపించడమూ సహజమే! కానీ ఎదుటివారికి తన మనసులోని మాటని పూర్తిగా చెప్పే అవకాశాన్ని కల్పించాలి. అలా కాకుండా చీటికీమాటికీ అడ్డుకోవడం వల్ల మీకు అతని అభిప్రాయాల పట్ల ఏమాత్రం గౌరవం లేదన్న విషయం తేలిపోతుంది. ‘వినడం’ అన్న స్థానంలో ‘వాదన’ చోటుచేసుకుంటుంది.   కేవలం వినండి ఎదుటి వ్యక్తి మాటలను వింటూనే, మనం వాటి గురించి అప్పటికప్పుడు ఏదో ఒక అభిప్రాయానికి వచ్చేస్తూ ఉంటాము. అంటే వినడమూ, విశ్లేషణా ఏకకాలంలో జరిగిపోతూ ఉంటాయి. కొంతసేపటి తరువాత మనం ఏర్పరుచుకున్న అభిప్రాయానికి అనుగుణంగానే అతని పట్ల మన దృక్పథమూ మారిపోతుంది. ఇది నిజంగా తొందరపాటే అవుతుంది. అందుకే ముందు కాస్త స్థిమితంగా అవతలి వ్యక్తి చెప్పే మాటలన్నీ వినాలి, ఆ తరువాత వాటిని విశ్లేషించుకుకోవాలి, చివరికి ఒకటికి రెండుసార్లు ఆలోచించి అతను చెప్పిన విషయం మీద ఒక అవగాహనకు రావాలి.   అన్నింటికీ మించి ఎదుటి వ్యక్తికి కూడా మనలాగే భిన్నమైన వ్యక్తిత్వం, విభిన్నమైన అభిప్రాయాలు ఉండే అర్హత ఉందని భావించిననాడు... ఒక సాటి మనిషిగా అతని విలువని గుర్తించినప్పుడు, అతని మాటలను కూడా శ్రద్ధగా ఆలకించాలని అనిపిస్తుంది. మన ఆలోచనే గొప్ప, మన వ్యక్తిత్వమే ఉన్నతం అనుకునే అహంకారంలో ఎవ్వరి మాటలూ వినిపించవు. వినిపించినా మనసులోకి చేరవు.   - నిర్జర.

సమయస్ఫూర్తి

  ఇది అన‌గా అన‌గానాటి మాట. అప్పట్లో ఓ మారుమూల గ్రామంలో... పార్వత‌మ్మ అనే ముస‌ల‌మ్మ ఉండేది.  ఆమెకి పాపం రానురానూ క‌ళ్లు మ‌స‌క‌బారిపోయాయి. ఓ రోజు త‌న గ్రామంలోకి ఒక వైద్యుడు వ‌చ్చాడ‌నీ, ఆయ‌న హ‌స్తవాసి చాలా మంచిద‌నీ పార్వత‌మ్మ విన్నది. ఆ వైద్యుడి వ‌ల్ల త‌న క‌ళ్లు బాగుప‌డి తిరిగి ఈ అంద‌మైన లోకాన్ని చూసే భాగ్యం క‌లిగితే బాగుండు అనుకుంది. అనుకున్నదే త‌డువుగా, త‌న‌ పక్కింటి కుర్రవాడిని బ‌తిమాలుకుని, అత‌ని చేయిప‌ట్టుకుని ఆ వైద్యుని వద్దకు చేరుకుంది.   ‘బాబూ నాకు నా ఇంటినీ, ఆ ఇంటి చుట్టూ ఉండే తోట‌నీ, ఆ తోట‌లో పూల‌నీ, వాటిపై వాలే సీతాకోక‌చిలుక‌ల్నీ... తిరిగి ఈ క‌ళ్లతో చూడాల‌ని ఆశ‌. అందుకోసం నా ద‌గ్గర దాచుకున్న డ‌బ్బంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలాగైనా నా చూపును తిరిగి ర‌ప్పించు,’ అని బ‌తిమాలింది.   వైద్యుడు నిజంగా మంచి హ‌స్తవాసి క‌లిగిన‌వాడే. కానీ దాచుకున్న డ‌బ్బునంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని పార్వత‌మ్మ అనేస‌రికి అత‌నిలో అత్యాశ మొద‌లైంది. ‘స‌రే మామ్మగారూ! నేను చేయ‌గ‌లిగిన‌దంతా చేస్తాను. కాక‌పోతే అందుకోసం ఖ‌రీదైన మందుల్ని వాడాల్సి ఉంటుంది. మీకు క‌నుక తిరిగి చూపు వ‌స్తే నాకు ప‌దివేల వ‌ర‌హాలు ఇవ్వాలి మ‌రి,’ అన్నాడు వైద్యుడు.   ప‌దివేల వ‌ర‌హాలంటే మాట‌లా! ముస‌ల‌మ్మ తన జీవితాంతం క‌డుపుకాల్చుకుని కూడ‌పెట్టుకున్నదంతా క‌లిపితే అంత అవుతుంది. అయినా ముస‌ల‌మ్మ త‌న చూపు కోసం అంత డ‌బ్బునీ ఇవ్వడానికి సిద్ధప‌డింది. కానీ వైద్యుని అత్యాశ‌ని గ‌మ‌నించి ముందుజాగ్రత్తగా ఒక ష‌ర‌తుని విధించింది. `నువ్వు ఇవ్వమ‌న్న డ‌బ్బుని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నా చూపు తిరిగి బాగుప‌డితేనే సుమా!’ అంది పార్వత‌మ్మ. దానికి వైద్యుడు స‌రేన‌న్నాడు.   ఆనాటి నుంచీ ప్రతిరోజూ ఉద‌యాన్నే వైద్యుడు ఠంచ‌నుగా పార్వత‌మ్మ ఇంటికి చేరుకునేవాడు. తాను త‌యారుచేసిన‌, లేపనాల‌నీ, లేహ్యాల‌నీ, భస్మాల‌నీ ఆమెకు అందిచేవాడు. అయితే వైద్యుడికి ఆశ ఎక్కువ క‌దా! ముస‌ల‌మ్మ ఇంటికి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా, ఆ ఇంట్లో ఉండే ఇత్తడీ, రాగి సామాన్లని చూసి అత‌నికి ఆశ పుట్టేది.   ‘ఈ ముస‌ల‌మ్మకి ఎలాగూ క‌నిపించ‌దు! వీటిలో కొన్నింటిని తీసుకుంటే ఏం పోయింది. ఒక‌వేళ ఆవిడ‌కి చూపు రాక‌పోతే, ఇన్నాళ్లూ నేను చేసిన వైద్యానికి ఖ‌ర్చులుగా అన్నా ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి’ అన్న ఆలోచ‌న అత‌నిలో మొద‌లైంది. ‘ఒక‌వేళ ఆవిడ‌కి చూపు తిరిగి వ‌చ్చినా ఎప్పుడో ఇంటి మారుమూల ఉంచుకున్న వ‌స్తువుల ఏం గుర్తుంటాయి’ అనుకున్నాడు. దురాశ మొద‌లైందే త‌డువు, పార్వత‌మ్మ వైద్యం కోసం వ‌చ్చే ప్రతిసారీ.... అందుబాటులో ఉన్న చిన్నాచిత‌కా సామానుని త‌న సంచీలో కుక్కుకుని బ‌య‌ల్దేరేవాడు.   పార్వత‌మ్మ న‌మ్మకం చేత‌నో, లేకి నిజంగానే వైద్యుని హ‌స్తవాసి ఫ‌లించ‌డం చేత‌నో.... ఆరు మాసాలు తిరిగేస‌రిక‌ల్లా ఆమెకు స్పష్టంగా చూపు తిరిగి వ‌చ్చేసింది. కానీ పార్వత‌మ్మ సామ‌న్యురాలా! త‌న ఇంట్లో చాలా వ‌స్తువులు మాయ‌మవ్వడం ఆమె గ్రహించింది.   పార్వత‌మ్మకు చూపురాగానే, చేసుకున్న ఒప్పందం ప్రకారం... త‌న‌కి ఇవ్వవ‌ల‌సి ప‌దివేల వ‌ర‌హాల‌ను ఇవ్వమ‌ని వైద్యుడు అడిగాడు. దానికి పార్మత‌మ్మ స‌సేమీరా అంది. విష‌యం గ్రామాధికారి వ‌ర‌కూ చేరింది.   ``ఏవ‌మ్మా! పెద్దదానివై ఉండీ ఇలా మాట త‌ప్పడం నీకు గౌర‌వ‌మేనా. చూపు తిరిగి వ‌స్తే ప‌దివేల వ‌ర‌హాలు చెల్లిస్తాన్న ష‌ర‌తుకి ఒప్పుకున్నావా లేదా?’’ అని నిల‌దీశాడు గ్రామాధికారి. ``ఆ ష‌రతుకి నేను లోబ‌డి ఉన్న మాట నిజ‌మేన‌య్యా! కానీ ఈయ‌న వైద్యంలో ఏదో లోపం జ‌రిగింది. లేకపోతే, ఆయ‌న మా ఇంటికి రాక ముందు ఉండాల్సిన సామానుల‌న్నీ, ఇప్పుడు నాకు క‌నిపించ‌కుండా పోవ‌డ‌మేంటి? అందుక‌నే ఆ మొత్తాన్నీ నేను చెల్లించ‌లేదు’’ అని బ‌దులిచ్చింది పార్వత‌మ్మ.   పార్వత‌మ్మ మాట‌ల‌కు గ‌తుక్కుమ‌న్నాడు వైద్యుడు. అక్కడికి చేరుకున్నవారంద‌రికీ కూడా పార్వత‌మ్మ మాట‌ల్లోని ఆంత‌ర్యం బోధ‌ప‌డి, ముసిముసిన‌వ్వులు న‌వ్వుకుంటూ ఎవ‌రి ఇళ్లకు వారు బ‌య‌ల్దేరారు.   చేసిన దొంగ‌త‌నం అలా బ‌య‌ట‌ప‌డిపోవ‌డంతో, గ్రామాధికారి ద‌గ్గర చీవాట్లు తిని, ఇక నుంచి బుద్ధిగా మ‌సులుకుంటాన‌ని మాట ఇచ్చి, వ‌డివ‌డిగా త‌న ఇంటికి వెళ్లిపోయాడు వైద్యుడు.   అలా ముస‌లామె, వైద్యుడి అత్యాశ‌ని తీర్చేందుకు ప‌దివేల వ‌ర‌హాల రుసుముని త‌ప్పించుకోవ‌డ‌మే కాదు. అత‌ని దొంగబుద్ధి గురించి గ్రామం మొత్తానికీ తెలియ‌చేసిన‌ట్లయింది.  దాంతో పాటుగా త‌న అంద‌మైన తోట‌ని తిరిగి చూడాల‌న్న కోరికా నెర‌వేరింది.   (ఏసోప్‌ కథల ఆధారంగా)   -నిర్జర

మనసు చెప్పేది వింటే!

అనగనగా ఇద్దరు అన్నదమ్ములు. ఓ పండుగ రోజున వాళ్లిద్దరికీ వాళ్ల నాన్న ఓ రెండు బహుమతులు తీసుకువచ్చాడు. అన్నయ్యకు ఇచ్చిన బహుమతిలో ఒక పెట్టె నిండా గోళీలు ఉన్నాయి. తమ్ముడికి ఇచ్చిన బహుమతిలో ఒక పెట్టె నిండా చాక్లెట్లు ఉన్నాయి. ఆ బహుమతులను చూసి అన్నాదమ్ములు ఇద్దరూ తెగ సంతోషపడియారు. ‘నేను రేపటి నుంచి రోజుకొక చాక్లెట్‌ చొప్పున తింటాను’ అంటూ లొట్టలేశాడు తమ్ముడు. ‘నేను రేపటి నుంచి ఈ గోళీలను బడికి తీసుకువెళ్లి ఆడుకుంటాను’ అంటూ ఊరించాడు అన్నయ్య. కానీ సమయం గడిచేకొద్దీ ఇద్దరికీ చాలా భారంగా ఉంది. తమ్ముడి తపనంతా అన్నయ్య దగ్గర ఉన్న గోళీల గురించే. అన్నయ్య ఆత్రమేమో తమ్ముడి దగ్గర ఉన్న చాక్లెట్ల గురించే! అలాగని చెరిసగం పంచుకునేందుకు అన్నయ్య ఒప్పుకోలేదు.   మధ్యాహ్నం దాటాక తమ్ముడు నిదానంగా అన్నయ్య దగ్గరకు చేరుకున్నాడు. ‘అన్నయ్యా! ఓ పని చేస్తే ఎలా ఉంటుంది? డాక్టరు ఎలాగూ నన్ను చాక్లెట్లు ఎక్కువ తినొద్దన్నాడు కదా! కాబట్టి నేను నీ గోళీలను తీసుకోనా. బదులుగా నా చాక్లెట్లన్నీ ఇచ్చేస్తాను,’ అన్నాడు. అన్నయ్యకు ఈ ప్రతిపాదన ఏదో బాగానే ఉన్నట్లు తోచింది. పైగా తనూ పెద్దవాడవుతున్నాడు. ఇప్పుడు గోళీలు ఆడితే చూసేవారు నవ్వుతారేమో అన్న అనుమానం తొలుస్తోంది. అదే చాక్లెట్లంటే ఎవరితోనూ పంచుకోకుండా చాటుగా గుటుక్కుమనిపించేయవచ్చు. ఇలా ఒక్క క్షణంలోనే రకరకాలుగా ఆలోచించేశాడు అన్నయ్య. చివరికి ‘సరే నీ ఇష్టం! అనేశాడు. అనుకోవడం ఆలస్యం. ఇద్దరూ తమ బహుమతులను చిటికెలో మార్చేసుకున్నారు. ఆ రోజు చీకటి పడింది. ఇంట్లో అంతా పడుకుండిపోయారు.   కానీ అన్నయ్యకి మాత్రం నిద్రపట్టలేదు. చీటికీమాటికీ తన జేబుని తడుముకుంటున్నాడు. అటూఇటూ కదిలి ఇంట్లోవారి వంక చూస్తున్నాడు. ఒంటిగంట, రెండు, మూడు... గడియారం పరుగులు తీస్తోంది. ఆ పిల్లవాడు తన జీవితంలో ఎన్నడూ అంతసేపు మేలుకుని ఉండలేదేమో! తెల్లారేసరికి అతని కళ్లు చింతనిప్పుల్లాగా మండుతున్నాయి. ఇక ఆ రోజు బడికి వెళ్లలేనంటూ మంచం దిగలేదు అన్నయ్య. పిల్లవాడి పరిస్థితి చూసి ఏం జరిగిందా అనుకుని కంగారుపడింది తల్లి. నిదానంగా వాడి మంచం దగ్గరకి వెళ్లి ‘ఎందుకలా ఉన్నావు! ఒంట్లో బాగోలేదా. నిద్ర ఎందుకు పట్టలేదు?’ అంటూ అడిగింది. పిల్లవాడు ఏం మాట్లాడకుండా తన జేబులోంచి ఒక గోళీ తీసి తల్లి చేతిలో పెట్టాడు. ‘ఎలాగూ నా దగ్గర ఉన్న గోళీలన్నీ ఇచ్చేస్తున్నాను కదా! ఒకటి వాడికి తెలియకుండా దాచుకుంటే ఏముంది అనుకున్నాను. వాడు కూడా ఓ చాక్లెట్‌ నాకు తెలియకుండా తిని ఉండకపోడా అనుకున్నాను. కానీ ఎందుకనో రాత్రంతా ఇదే గుర్తుకువచ్చింది. నిద్రే పట్టలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు నీరసంగా.   పిల్లవాడి మాటలకు తల్లి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. ఆ తరువాత ‘ఈ ప్రవర్తన నీకు కొత్తకాదు కాబట్టి నీకు నిద్రపట్టడం లేదు కన్నా! కానీ మా పెద్దవాళ్లం ప్రతి సందర్భంలోనూ ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాము. మొదట పంచుకునే అవకాశం వచ్చినా ఒప్పుకోము. ఆ తరువాత ఇచ్చిపుచ్చుకునే అవకాశం వచ్చినా అందులో ఎలాగొలా మనమే లాభం పొందాలనే అనుకుంటాం. ఆ తొందరపాటులో ఏదో మోసం చేస్తాము. పదిపైసలు లాభపడ్డామని అనిపించినా తెగ సంతోషపడిపోతాము. కానీ ఆ సంతోషం కొద్దిసేపటిలోనే తేలిపోతుంది. దాని స్థానంలో పశ్చాత్తాపం మొదలవుతుంది. కానీ అదే తప్పుని మళ్లీ మళ్లీ చేస్తుంటాము. నిదానంగా మా మనసులని మోసానికి అలవాటు చేసుకుంటాము. నువ్వు కూడా అలా మోసం చేసేందుకే అలవాటు పడతావో లేకపోతే నీ మనసుని నిర్మలంగా ఉంచుకుంటావో నిర్ణయించుకో!’ అనేసి వెళ్లిపోయింది. పిల్లవాడు కాసేపు ఆలోచించాడు. ఆపై తన తమ్ముడికి క్షమాపణ చెప్పేందుకు సిద్ధపడ్డాడు! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)  - నిర్జర.

లైట్లకింద పనిచేస్తే కేన్సర్?

రాత్రిళ్లు నిద్రపోకుండా ఉద్యోగాలు చేసే పురుషులకు రకరకాల కేన్సర్లొచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాల్లో తేలింది. రాత్రిళ్లు ఉద్యోగాలకు వెళ్లే పురుషులపై వైద్య పరిశోధనలు జరిపినప్పుడు వాళ్లకి ప్రొస్టేట్. పెద్దపేగు, ఊపిరి తిత్తులు, మూత్రకోశ, పురీషనాళ, క్లో కేన్సర్, నాన్ హడ్గ్కిన్స్ కణతి లాంటి కేన్సర్లొచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తేలింది. రాత్రివేళల్లో కరెంట్ లైట్ల కింద పనిచేయడంవల్ల నిద్రకి ఉపకరించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి బాగా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ హార్మోన్ రోగ నిరోధక వ్యవస్థని పటిష్టం చేయడానికి కూడా పనికొస్తుందని ధృవీకరించారు కూడా.. నిద్రలేమివల్ల కేన్సర్లు మాత్రమే కాక రకరకాలైన మానసిక జబ్బులొచ్చే అవకాశంకూడా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Let go is the Mantra

Life is full of experiences combining good and bad. Few experiences are painful, for example a child who has to leave home to join hostel, that is the toughest moment of life. Not scoring marks and grades as expected, not receiving the increments as anticipated, not able to settle down in the dream jobs or jobs of choice and love failures all these are problems which will make you feel that your world is not yours. However,  human beings are so blessed that we have a habit of forgetting things and issues and move forward in life. As long as you take life as it comes, you will have contentment to larger extent. But there are few people who can't forget the past and cling to that through out and make the present moment also miserable. If you are unable to move on in life and thinking about the problems you have in life, these negative thoughts attract more negativity in life and eventually your life will be spoiled. Being in this negative state for long will lead to depression and it will spoil relationships, the biggest asset of anybody.   We see some students, who aim for professional courses but don't get in there will loose focus on studies and suddenly seem last in achieving their goal. People who fail in love will either get in to shell or become aggressive as both are not good signs. There are mothers who suffer from post natal depression, will suffer a lot and make their kids and family to suffer from these syndromes. Depression can worsen the relationship with spouse which may become irreparable at a later stage. A study say that , 16% average men on this planet will under go this stage of depression where as 35%  women face this phase. This variation is  because of their harmones and the social responsibilities women have in the system. The wise is the one who observe and understand the changes coming in body and mind of self and also the people around and extend help to come out.  When you think you have too much negativity in you and around, pause for a while and recollect the positive things/ events happened to you. If you can catch hold of one such positive thought you will be attracting more good things in life. Remember, life is journey and every moment is precious. When you can't get back the time you lost in this voyage of life then why to stick to the past and ruin your present and future. Just let go.. That helps you to move forward and fly high. -Bhavana

స్వేచ్ఛకి సాటేది!

అనగనగా ఓ అందమైన చిలుక! అడవిలో తన నేస్తాలతో కలసి ఆడుతూ పాడుతూ ఉండే ఆ చిలుక కాస్తా ఆ దారిన పోతున్న ఓ వర్తకుడి కంట్లో పడింది. అంతే! అదను చూసి దాన్ని తన సంచిలో వేసుకుని ఇంటికి పట్టుకుపోయాడు ఆ వర్తకుడు. వర్తకుడి ఇంట్లో చిలుకకి అన్నీ ఉండేవి… ఒక్క స్వేచ్ఛ తప్ప! వెండి పంజరంలో దాన్ని బంధించి, బంగారు పళ్లెంతో దానికి ఆహారాన్ని అందించేవాడు వర్తకుడు. అయినా చిలుక మనసంతా అడవి మీదే ఉండేది. ఇదిలా ఉండగా ఆ వర్తకుడు వ్యాపారం చేసేందుకు మళ్లీ బయల్దేరాల్సిన సమయం ఆసన్నమైంది. ‘చూడూ! నేను మళ్లీ నీ కుటుంబం ఉండే అడవిగుండానే వెళ్తున్నాను. అక్కడ నీ నేస్తాలతో ఏదన్నా సందేశాన్ని అందించాల్సి ఉంటే చెప్పు!’ అన్నాడు వర్తకుడు. ‘సరే! నా కుటుంబం ఉండే ఆ మామిడి చెట్టు మీకు గుర్తే కదా! అక్కడికి వెళ్లి మీ తోటి చిలుక చాలా బాధలో ఉంది అని చెప్పండి. ఏదో తిండీ తిప్పలూ వెల్లమారిపోతున్నాయే కానీ స్వేచ్ఛ కరువైందని చెప్పండి. తను ఎక్కడున్నా తన మనసు మీతోనే ఉంటుందనీ, మిమ్మల్ని కలిసే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటుందనీ చెప్పండి.’ అంది చిలుక. చిలుక చెప్పిన సందేశాన్ని తీసుకుని వర్తకుడు అడవిగుండా ప్రయాణాన్ని సాగించాడు. అక్కడ అతనికి చిలుక కుటుంబం నివసించే మామిడి చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద నిలబడి వర్తకుడు ‘మీ తోటి చిలుక నా దగ్గరే ఉంది. అది మీ అందరి తోడునీ, ఈ అడవిలోని స్వేచ్ఛనీ కోరుకుంటోంది. కానీ ఏం చేసేది! నాకు ఆ చిలుక అంటే ప్రాణం. అందుకనే దాన్ని వదిలిపెట్టలేను. అందుకే కేవలం దాని సందేశాన్ని మాత్రమే తీసుకువచ్చాను. ఇప్పడు మీ సందేశం ఏదన్నా ఉంటే చెప్పంది. నేను తనకి అందిస్తాను’ అన్నాడు. వర్తకుడి మాటలు వింటూనే ఓ చిలుక చెట్టు మీద నుంచి ఢామ్మని పడిపోయింది. జరిగిన దానికి వర్తకుడు కంగారుపడిపోయి మారుమాట్లాడకుండా ముందుకు సాగిపోయాడు. వ్యాపారాన్ని ముగించుకున్న వర్తకుడు ఇంటికి తిరిగి రానే వచ్చాడు. ‘ఏం జరిగింది! నా సందేశాన్ని మా కుటుంబానికి అందించారా? వారు ఏమన్నారు?’ అని అడిగింది చిలుక. ‘ఆ నీ సందేశాన్ని అందిచాను. కానీ… కానీ… నా మాటలు వినగానే ఓ చిలుక ఢామ్మని చెట్టు మీద నుంచి కిందకి పడిపోయింది’ అన్నాడు వర్తకుడు. ఆ మాటలు వింటూనే పంజరంలోని చిలుక కూడా ఒక్క పెట్టున కుప్పకూలిపోయింది. ‘అరెరే! అక్కడ జరిగిందే నాకు అర్థం కావడం లేదంటే, ఇదేంటి….’ అనుకుంటూ లబోదిబోమంటూ వర్తకుడు పంజరాన్ని తెరిచి ఆ చిలుకను చేతిలోకి తీసుకున్నాడు. వర్తకుడు అలా చిలుకను చేతిలోకి తీసుకున్నాడో లేదో ఒక్క ఉదుటున ఆ చిలుక ఎగిరిపోయి తలుపు దగ్గరకి చేరుకుంది. ‘నా నేస్తాలు నాకందించిన సందేశం ఇదే! ఎవరైనా మమ్మల్ని బంధిస్తే ఇలా తప్పించుకోవాలని మా పెద్దలు చెప్పేవారు. నేను ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పడు మళ్లీ నాకు ఆ ఉపాయాన్ని గుర్తుచేశారుగా. ఇక బయల్దేరతాను.’ అంది చిలుక. ‘మరి నా సంగతో! నేను నిన్ను ఇంతగా ప్రేమించాను. నీకోసం వెండి, బంగారాలు అందించాను. మూడుపూటలా నచ్చిన ఆహారాన్ని ఇచ్చాను. ఇవన్నీ వదులుకుని నువ్వు వెళ్లిపోతావా!’ అంటూ బేలగా అడిగాడు వర్తకుడు. ‘ప్రపంచంలో ఏ జీవికైనా బానిసత్వాన్ని మించిన దౌర్భాగ్యం ఉండదు. స్వేచ్ఛే కనుక లేకపోతే కడుపు నిండినా తృప్తిగా ఉండదు. బంగారంతో చేసినా కానీ పంజరం పంజరమే! అది నాకు వద్దు. దాని బదులు ఎండిన చెట్టు మీద ఖాళీ కడుపుతో కూర్చున్నా బతికున్నాననీ, నా జీవితం నే చేతిలోనే ఉందనీ తృప్తిగా ఉంటుంది. సెలవ్‌!’ అంటూ తుర్రుమంది చిలుక.

తిరిగివచ్చిన జీవితం

ఆ రోజు ఎలాగైనా తన మనసులో మాటని భార్య చెప్పాలనుకుని గుండెను రాయి చేసుకుని ఇంటికి బయల్దేరాడు. తన జీవితంలోకి వేరే అమ్మాయి ప్రవేశించిందనీ... అందుకోసం విడాకులు కావలన్న విషయాన్ని తన భార్యకు చెప్పేందుకు బయల్దేరాడు. విడాకులు కావాలన్న నిర్ణయాన్ని వినగానే ఆమె ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె బాధని చూసిన అతను తనకి విడాకులు ఎందుకు కావాలన్న విషయాన్ని మాత్రం చెప్పలేకోపోయాడు. అంతగా ప్రేమించే భార్యని విడిచి తను ఇంకొకరిని ప్రేమిస్తున్నానన్న విషయాన్ని ఎలా చెప్పగలడు! కాకపోతే వివాహం తరువాత కూడా ఆమెను లోటు రాకుండా చూసుకుంటానని మాట ఇచ్చాడు. పెళ్లైన తరువాత తాము ఎన్నో కలలతో నిర్మించుకున్న ఇంటితో పాటుగా, నెలనెలా తన జీతంలో కొంతభాగాన్ని ఆమెకు ఇస్తానని చెప్పాడు. కానీ విడాకులు మాత్రం ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టాడు.   ఆ రాత్రంతా తన భార్య మెలకువగానే ఉండటాన్ని గమనించాడు. మర్నాడు ఉదయం అతను ఆఫీసుకి బయల్దేరుతుండగా- ‘‘నేను విడాకులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. అందుకు బదులుగా నాకేమీ డబ్బు, ఆస్తి అక్కర్లేదు. కానీ ఒక్క చిన్న షరతు...’’ అంది భార్య. భార్య విడాకులకు ఒప్పుకోగానే అతను ఎగిరి గంతేసినంత పనిచేశాడు. ‘‘నీ షరతు ఏమిటో చెప్పు! దాన్ని నా తల తాకట్టు పెట్టయినా నెరవేరుస్తాను,’’ అన్నాడు.   ‘‘మనం ఎంత కష్టపడి, ఎన్ని కలలు కని ఈ ఇంటిని కట్టుకున్నామో మీకు తెలుసు. ఇల్లు కట్టుకున్న మొదట్లో రోజూ సాయంత్రం కాసేపు పెరట్లో కూర్చుని, అక్కడే కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేసేవారం గుర్తుందా!’’ అని అడిగింది భార్య. ‘‘ఓ గుర్తులేకే!’’ అన్నాడు భర్త ఉత్సాహంగా. ఈ మధ్య కాలంలో అతని ఉద్యోగపు బాధ్యతల్లో పడి ఎప్పుడో చీకటి పడేవేళకు వస్తున్నాడతను. ‘‘అలా ఒక నెల రోజుల పాటు మనం తిరిగి ఈ పెరట్లోనే మన సాయంత్రపు వేళలను గడపాలి. రాత్రిళ్లు ఇక్కడే భోజనం చేయాలి. ఇదే నా షరతు!’’ అంది భార్య. ‘ఓస్‌ ఇంతేనా!’ అనుకున్నాడు భర్త. కళ్లుమూసి తెరిచేలోగా ఆ నెలరోజులూ గడిచిపోతాయని అతనికి తెలుసు. ఆ నెల రోజులూ తన పనిని త్వరగా ముగించుకుని ఇంటికి రావడం ఏమంత కష్టం కాదు కూడా! *** మొదటిరోజు ఏదో తప్పనిసరి తద్దినంగా ఆఫీసునుంచి త్వరగా వచ్చి పెరట్లో కూర్చున్నాడు భర్త. తన భార్య విడాకుల గురించి ఏదో ఒక క్లాసు పీకుతుందని అతను సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆశ్చర్యం! ఆవిడ విడాకుల గురించి కానీ, తమ మధ్య ఉన్న గొడవల గురించి కానీ ఒక ముక్క కూడా మాట్లాడలేదు. పైగా వారిమధ్య ఏమీ జరగనట్లుగా సరదా సరదా కబుర్లన్నీ మొదలుపెట్టింది.   తన భార్య సందడిగా మాట్లాడుతుంటే భర్త ఆమెను గమనిస్తూ ఉండిపోయాడు. ఆమెను అతను అలా దగ్గరగా చూసి ఎన్నాళ్లయ్యిందో! ఆమె మొహంలో సంసారం కోసం పడిన తపన కనిపిస్తోంది. ఆ తపన కోసం పడ్డ కష్టం కనిపిస్తోంది. ఆ కష్టంతో వచ్చిన అలసట కనిపిస్తోంది. కానీ అవేవీ పట్టించుకోకుండా ఆమె నిరంతరం ఈ ఇంటి కోసమే బతకడం కనిపిస్తోంది. ఇంతలో వాళ్ల పిల్లవాడు కూడా ట్యూషన్‌ నుంచి అక్కడికి వచ్చాడు. వాడికి తన తండ్రి అంత త్వరగా ఇంటికి రావడం చూసి భలే ఆశ్చర్యం వేసింది. స్కూల్‌ బ్యాగ్ ఒక్కసారిగా విసిరేసి తండ్రిని చుట్టుకుపోయాడు. మొదటి రోజు అలా గడిచింది. రెండో రోజు కూడా అతను ఆఫీసు నుంచి ఇంటికి త్వరగా రావడం, అతని భార్య ఏమీ జరగనట్లు హాయిగా మాట్లాడటం, అతను విస్తుపోయి చూస్తుండటం, కొడుకు తండ్రిని చూసి సంబరపడిపోవడం... అంతా యథాతథంగా జరిగిపోయాయి. కానీ మూడో రోజు నుంచి అతని పరిస్థితిలో మార్పు రాసాగింది. ‘ఎలాగూ విడికులిస్తున్నాను కదా! ఈ నెల రోజులూ వీరితో హాయిగా గడిపితే ఏం?’ అన్న ఆలోచన అతనిలో మొదలైంది. పైగా భార్యాపిల్లలతో అలా గడపడం అతనికి మంచి కాలక్షేపంగా తోచింది.   రోజులు కాస్తా వారాలుగా మారాయి. ఒక్క రెండు వారాలు గడిచాయో లేదో... ఆపీసులో కూర్చున్నంతసేపూ ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఆత్రుత పడసాగాడు. ఒకప్పుడు సాయంత్రం మిత్రులతో కలిసి ఎంత తాగినా పొందలేని సంతోషం ఇప్పుడు రాత్రివేళ కలిసి చేసే భోజనంలో కలుగుతోంది. తన పిల్లవాడి మొహంలో కనిపించే ఆనందం ముందు తన ఉద్యోగం కూడా చిన్నదిగా కనిపిస్తోంది. ఇక బంగారంలాంటి భార్యని కాదని తను వేరే మనిషి ప్రేమలో ఎలా పడ్డాడో అతనికే అర్థం కాకుంది. మరో వారం గడిచిందో లేదో... ఇక అతనివల్ల కాలేదు. ఒక రోజు సాయంత్రం ఇంటికి తిరిగివచ్చి విడాకుల పత్రాన్ని కాస్తా ముక్కుముక్కలుగా చించేశాడు. ఆపై భార్య చేతులు పట్టుకుని భోరున ఏడ్చేశాడు. అతనిలో ఈ మార్పు వస్తుందని ఆమెకు ముందే తెలుసనుకుంట! ఒక్క చిరునవ్వు ఆమె మొహంలో విరిసింది!!! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

Sorry..!!??

Everybody was extremely excited!! It was their farewell. Four years of fun, hardniversity. Carla and Jen were childhood besties and the most popular girls. Jen was the hyper-active one, work and competition had finally come to an end. Lots of memories were created in Crayford Ualways ahead in all the cultural activities, very expressive and made friends instantly. Carla was rather a calm one who excelled in academics. She was reserved, but you can hear her name on top of the list of rankers in any quiz or test. As they say opposite poles attract, these both became friends immediately. They got ready for the farewell. Both of them looked as ravishing as ever. They reached the party and found dj booming out of a corner. There were games and snacks. It was a perfect party. Little did they know that it would be a not so perfect day in their lives. Jen was having fun. She laughed and danced and talked with all her other friends. While Carla , though she liked the atmosphere, felt a little lonely. As she was sipping her drink, she saw Jen talking to somebody and she heard her name a couple of times. She wondered why would Jen talk about her with somebody who looked like….. Omg is that her enemy.. Sure it was. It was Paris. Her “all time favourite” enemy. But why was Jen talking to her. She had told Jen to stay away from Paris. What was she doing? Anger raged inside her. She wanted to know everything. Curiosity ate her up. Carla went towards Jen who was now talking to somebody else. That’s when she heard Paris calling her a shy ass. Carla controlled her fumes. Then she started calling her a puppet in Jen’s hand. Paris also said that Jen always protected her and that she will never know what Jen talks behind her. That’s when it struck Carla. Was it Jen who told Paris all this? Did she really mean it? There were tears in her eyes. She felt defeated. She fled towards the door. Few minutes later, jen came behind her and asked what had happened? Without even trying to act calm Carla burst out, “What do you think you are doing Jen? I am not a puppet in your hand. I don’t need your protection. I can deal with my own life. To hell with you .”, and she left Jen found it all hard to comprehend. She didn’t understand a word Carla blurted out. What was she even talking about. She had come out behind Carla when she saw her running towards the door. And now she is acting way too weird for her to understand and act accordingly. But Jen, being the egoist she was, Didn’t bother to run after Carla, not after what she said.   That night after the party Jen tried to recall all the incidents that happened. Paris trying to have a conversation with her, telling her she wanted to know more about Carla, so that they can mend their relationship. But she just told her that Carla was a bit sensitive, but very sensible. She also told her that Carla would definitely accept her apology. Then she remembered her best friend yelling at her frantically and fleeing away. Jen thought she had acted foolish. She was a bit mad at her. She waited for Carla to make the next move herself. After a few days, she met Carla at a supermarket. Carla’s anger had subdued, but not Jen’s. It actually grew as Carla had not even tried to call her after the incident. She ignored her. Carla went behind her and asked what the matter with her was? This threw off Jen. She shouted back, “What is the matter with you Carla. You get angry, you yell at me. You leave the party. You don’t call me back and you are asking me what is the matter with me. I pity you. You have no control over your emotions. Yes!! Paris was right. You let people puppet you. You are fragile Carla. ” Carla didn’t find words to say. She found herself saying, ‘I don’t want to talk to you anymore. I thought you were my friend. I thought you could understand me. Did you ever ask how lonely I felt when you left me alone and enjoyed with your other friends? You will never understand. That is because you are a self-obsessed freak.” “ You know what, I told Paris, you were a puppet in my hand”, was all Jen said. Carla had been sure all this while that Paris had just exaggerated and Jen would never say such a thing. But hearing what Jen said, she couldn’t believe her ears. Same was with Jen. With every passing minute, she felt all the more terrible for lying to her only best friend. All the classes came to an end. But Jen and Carla still couldn’t overcome their fear or as I call it their ego to confront each other and mend their mistakes. What had been a terrible misunderstanding turned to be a scar in both their lives. Now who is wrong? Jen or Carla? I would say both of them. . Creating misunderstandings are the terrible talents we teenagers especially have. Why can’t we ever get our words straight? We think of saying one thing and come out saying something else altogether Why is that we feel our parents don’t understand us? Are they right? Are we unbelievably stupid? Do we really need to grow up and act our age as they say it? Well I might not have an answer for all these questions but one thing I can say for sure. SORRY is that one small word that can bring two worlds together. It can heal the deepest of the deepest wounds. Saying sorry doesn’t make a person insignificant, instead he grows as a proper human being. Same is the case with silence. As they say silence is gold. When you are silent you will make an effort to understand the other person’s agony. You will understand his point of view. “Most of the problems of the world stem from linguistic mistakes and simple misunderstandings. Don’t ever take words at face value. when you step into the zone of love ,language as we know it becomes obsolete. That which cannot be put into words, can only be grasped through silence” –The Forty Rules of Love.   Kunde Sanjana