హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి చంద్రబాబు!
posted on Aug 10, 2024 @ 11:34AM
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‍కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం (10-8-24) రానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు ట్రస్ట్ భవన్‍కు రావడం ఇది రెండో సారి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సాయంత్రం 4 గంటలకి ఆయన తెలంగాణ తెలుగుదేశం నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
తెలంగాణ తెలుగుదేశం నూతన అధ్యక్షుడు నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై తెలంగాణ నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. శుక్రవారం మంగళగిరిలో కేంద్ర పార్టీ కార్యాలయంలో పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడి ఎంపిక, సభ్యత్వ నమోదు అంశం చర్చకు వచ్చాయి.
శనివారం (ఆగస్టు 10) హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగే తెలంగాణ తెలుగుదేశం ముఖ్య నేతల సమావేశంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడి ఎంపిక ఒక కొలిక్కి వచ్చే అవకాశం వుంది. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడి నియామకం తరువాత పూర్తిస్థాయిలో తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది.