నకిలీ సీడ్స్ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : సీఎం రేవంత్

  తెలంగాణలో  ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూభారతి’ అనేది పేద రైతుకు చుట్టమని ముఖ్యమంత్రి అన్నారు. భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని,  ఈ చట్టాన్ని ప్రజలకు మరింత చేరువ చెయ్యాలని పేర్కొన్నారు. ఈరోజు అధికారులు, కలెక్టర్లు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా జూన్ 3వ తేదీ నుంచి 20 వరకూ మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని అధికారులకు, కలెక్టర్లకు సీఎం రేవంత్ సూచించారు. రుతుపవనాలు 15 రోజులు ముందే రావడంతో రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని మంత్రులు, కలెక్టర్లు సమీక్షలో సీఎం సూచించారు. నకిలీ సీడ్స్ అమ్మేవారి పీడీ యాక్ట్ పెట్టాలన్నారు.  గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు ప్రచారంలోకి వస్తున్నాయి. కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయి. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేశారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను తెలిపాలని ముఖ్యమంత్రి తెలిపారు. కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా ఉండాలి. వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలి. తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించండి. ఒక్క నిముషం వృధా చేయొద్దు.. నిర్లక్ష్యం వహించొద్దు. అవసరమైతే లోకల్ గోడౌన్స్ హైర్ చేయండి. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోండి. ఈసారి 29 శాతం వర్షపాతం అధికంగా ఉంది. సీజన్ ముందు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచించారు.ఇందిరమ్మ ఇండ్లు చాలా కీలకం. క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు బాగా జరిపించాల్సింది కలెక్టర్లే. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలని సీఎం అన్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.  

ఆ పదం వింటే వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగు దేశం పార్టీనే : పవన్ కళ్యాణ్

  మహానాడు ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది  తెలుగు దేశం పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయిందని జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కడపలో ప్రారంభమైన మహానాడుకు తన తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని  పవన్ కళ్యాణ్  ఒక ప్రకటన విడుదల చేశారు. ఏటా జరిగే మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై... కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు  మంత్రి నారా లోకేష్‌కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.   చంద్రబాబు  నాయకత్వములో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న పల్లా శ్రీనివాస్ బక్కని నరసింహులు శుభాభినందనలు.ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే పరమావధిగా జరుగుతున్న ఈ మూడు రోజుల వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. కార్యకర్తే అధినేత, యువ గళం, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయం. పసుపు వర్ణంతో ముస్తాబైన మహానాడు ప్రాంగణం శోభాయమానంగా కనువిందు చేస్తోంది. ఈ వేడుక విజయవంతంగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని అంటూ జనసేని తన ప్రకటనలో పేర్కొన్నారు.

సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్

  సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్ నడిపేందుకు ఇండియన్ రైల్వేశాఖ ప్లాన్ చేస్తోంది.1667కి.మీ దూరాన్ని ఈ రైలు ఒక్క రోజులోనే చేరనుంది. ఢిల్లీలో రాత్రి 8.50కు బయల్దేరే ఈ రైలు తర్వాతి రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ రానుంది. థర్డ్ AC ధర ₹3600, సెకండ్ AC ₹4800, ఫస్ట్ AC ₹6వేలు వరకూ ఉండొచ్చు. ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, ఇటార్సి, నాగ్పూర్, బల్లార్ష, కాజీపేట స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.వందే భారత్ స్లీపర్ రైలు న్యూఢిల్లీ-సికింద్రాబాద్ మార్గంలో నడుస్తున్న మూడవ ప్రీమియం రైలు.  ఈ మార్గంలో ఇప్పటికే రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ఈ రైలును రాత్రి ప్రయాణం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. తద్వారా ప్రయాణీకులు నిద్రపోతున్నప్పుడు కూడా తమ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.వందే భారత్ స్లీపర్ రైలు న్యూఢిల్లీ నుండి సికింద్రాబాద్ వరకు దాదాపు 1667 కి.మీ దూరాన్ని కేవలం 20 గంటల్లోనే చేరుకుంటుంది.

మహానాడు వేదికపై మంత్రి టీజీ భరత్ సూపర్ స్పీచ్

    ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు  మన దగ్గర ఉంటే మనకు విలువ తెలియడం లేదని  మంత్రి టీజీ భరత్ అన్నారు. బయటి దేశాల్లో ఆయన విలువ చాలా ఎక్కువ. నేను ఈ మధ్య ఇండియా టుడే కాన్క్లేవ్ కి దుబాయ్ కి వెళ్లాను. శోభ బిల్డర్స్ అధినేత చంద్రబాబుకి పరిచయం లేదు, చూసింది కలిసింది లేదు. ఓ సందర్భంలో మాట్లాడుతూ రూ.100 కోట్లు ఏపీకి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నా అన్నారు. చంద్రబాబు లాంటి లీడర్ షిప్ నాయకుడు మీకు ఉన్నాడు. ఆ రూ.100 కోట్లు ఏ విధంగా ఉపయోగించుకుంటారో వినియోగించుకోండని తెలిపారు. చంద్రబాబు ఏ విధంగా కష్టపడుతున్నారో మనందరికి తెలియాలి. కష్టపడే లీడర్ మనకు ఉన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసేటప్పుడు వారం తర్వాత పాదయాత్ర ఉండదు టీజీ భరత్  అన్నారు.  కానీ పట్టుదలతో దాదాపు 3 వేల కి.మీ. పైగా లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వారి బాధలను చూశారు. వారికన్నీళ్లు చూశారు. అధికారంలోకి వచ్చాక వారికి అండగా ఉన్నారు. నారా లోకేష్ కు ఓ మాట చెప్పమని నా స్నేహితుడు మంత్రి అన్నారు. నువ్వు మగాడ్రా బుజ్జి అని చెప్పమన్నారు. పల్లా శ్రీనివాస్ ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.   గత ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామిక వేత్తలు ఎంత బాధపడ్డారో అందరికీ తెలుసు. ఏపీలో పెట్టుబడులు పెట్టకండని ఫారెన్ కంపెనీలు మన ఏపీని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఆ విధంగా గత వైసీపీ ప్రభుత్వ పాలన సాగింది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక స్వాతంత్ర్యం వచ్చిందని కొందరు పారిశ్రామిక వేత్తలు నాతో చెప్పారని ఆయన పేర్కొన్నారు  మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలు వస్తే మనం ఎయిర్ పోర్ట్ కు వెళ్లి స్వాగతిస్తాం.. కానీ గత వైసీపీ హయాంలో పెట్టుబడిదారులను దారుణంగా అవమానించారు. గత ప్రభుత్వంలో టెక్స్ టైల్స్ పాలసీ ఇచ్చి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. గైడ్ లైన్స్ మనం అధికారంలోకి వచ్చాక ఇచ్చాం. గత ప్రభుత్వం అంత ఘోరంగా పారిశ్రామిక వేత్తలను అవమానించారు. ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డుకు వైసీపీ హయాంలో 10 మందికే పరిమితం చేశారు. 2014-19 లో 60 మందితో పనిచేశాం.  నేడు దాదాపు 50 మంది పనిచేస్తున్నారు. మన విధానాలు ప్రమోట్ చేయడంలో ఈ బోర్డు పనిచేస్తుంది. ఇప్పుడు కూడా ఒక బోర్డు జపాన్ లో పర్యటిస్తోంది. మన ప్రభుత్వం వచ్చాక అన్ని పాలసీలు, గైడ్ లైన్స్ తీసుకొచ్చాం. చంద్రబాబు  ఎప్పుడు స్పీడ్ అప్ డూయింగ్ బిజినెన్స్ పై చెబుతారు.  ఒక కంపెనీ ఏర్పాటు కావడం ఆలస్యం అయితే వడ్డీ ఎక్కువగా పెరిగిపోతుంది. ఉదాహరణకి కర్నూల్ లో ఉన్న జైరాజ్ స్టీల్స్ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో కొన్ని కోట్లు వడ్డీలే సరిపోతుంది. రూ.9.40 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ ఏడాదిలో మనం సాధించాం. రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ ఉంటే త్వరగా అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభింపజేసేలా పాలన సాగిస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే 11 ప్రారంభించాం. 39 పార్కులకు ఫౌండేషన్ వేశాం. 20 లక్షల ఉద్యోగాలు సాధించే దిశగా పనిచేస్తున్నాం. కాస్త ఓపికతో ఉండండి. కచ్చితంగా ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని మంత్రి వెల్లడించారు

కడప నగరం పసుపుమయం

  కడప నగర శివారుల్లోని పబ్బాపురం లే ఔట్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహానాడుకు భారీ సంఖ్యలో తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. పూర్తిగా మహానాడు పసుపుమయం అయ్యింది. కళాకారులు, సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళ వాయిద్యాలతో స్వాగతాలు పలికారు.  మహానాడు కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మంగళవారం నిర్వహించిన ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సభకు ప్రతినిధులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. కడప నగరంలో దాదాపుగా 36 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు వుంది. ఈ రింగ్ రోడ్డు గుండా రాయచోటి, కమలాపురం, పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాలకు రాక పోకలు సాగతుంటాయి. ఈ రింగ్ రోడ్డులో ఎక్కడ చూసిన వాహనాలు బారులు తీరాయి. ప్రజలతో కిట కిటలాడాయి.  ప్రాంగాణానికి చేరుకొనేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించి పోవడంతో పోలీసులు కష్టపడి ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తూ వచ్చారు. ఎలాంటి  ప్రమాదాలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలు చేపట్టారు. *వర్షం రాక పోవడంతో ఊపిరి  రుతు పవనాల ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా  గత రెండు రోజులుగా అడపదడపా వర్షాలు కురుస్తున్నాయి. కడప నగరంలో కూడ వర్షాలు కురవడంతో మహానాడు ప్రాంగాణం బురదమయం అయ్యింది. మహానాడు నిర్వహకులు బురదమయం అయిన ప్రాంతాల్లో గ్రావెల్ పరచడంతో రాక పోకలు సాగించారు. ఈనెల 26 నుంచి 29 వరకు వాతావరణ శాఖ వర్షాలు కురుస్తాయని ప్రకటించడంతో నిర్వహకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి.  అయితే మంగళవారం ఉదయం నుండి ఎటువంటి వర్షాలు కురవక పోగా వాతావరణం చల్లగా మారింది. దీంతో నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి ఏటా వేసవిలో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తుంటామని, తీవ్ర ఉక్కపోతలకు గురయ్యే వారమన్నారు. అయితే సారి చల్లటి వాతావరణంలో మహానాడు నిర్వహించు కోవడం ఆనందంగా వుందన్నారు.  *భోజనాలు  తెలుగుదేశంపార్టీ ఆహ్వానం మేరకు నలుమూలల నుంచి పార్టీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. వారికి ఆంధ్ర, రాయసీమ, తెలంగాణలకు చెందిన 30 రకాల  ప్రత్యేక వంటకాలను తయారు చేసి వడ్డించారు. చాలా కాలం తర్వాత మహానాడులో మాంసాహరం కూడ వడ్డించారు. మొదటి రోజు దాదాపుగా 30 వేల మందికి వడ్డించారు.  ఉదయం అల్పాహారం, మధ్యాహ్నాం భోజనం,  సాయత్రం స్నాక్స్ అందించారు.  1,700 మంది వంటవారు, మరో 88 మందిని వడ్డింపునకు వినియోగించారు. ఇక స్వీట్స్ లో  తాపేశ్వరం కాజా, అల్లూరయ్య మైసూర్ పాక్, చక్కెర పొంగలి, ఫ్రూట్ హల్వా   తదితర స్వీట్స్ పెట్టారు.  భోజనాల వద్ద ఇబ్బందులకు గురయ్యారు.  *అంగరంగ వైభవంగా  మాహానాడు  అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.  పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు మహానాడు ప్రాంగణంలోని చిత్తూరు పార్లమెంట్ ప్రతినిధుల నమోదు కేంద్రంలో పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఫోటో ప్రదర్శనను తిలకించారు.  ఎన్టీఆర్ విగ్రహానికి  నివాళి అర్పించారు. ముఖ్యనాయకులను ఆహ్వానించి చంద్రబాబు పార్టీ జెండా ఆవిష్కరించారు. వేదిక పై మా తెలుగుతల్లికి గీతాలాపన చేశారు. మృతి చెందిన పార్టీ  నాయకులకు, కార్యకర్తలకు, నేతలకు, మహానాడు వేదికగా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో 1,033 మంది చనిపోయినట్లు పార్టీ  నాయకుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.  అలాగే  పహల్గం ఉగ్రదాడిలో మరణించిన వారికి మహానాడులో సంతాపం తెలిపారు.  *మహానాడు తీర్మాణాలు ఆమోదం మొదటి రోజు మంగళవారం ప్రతినిధుల నమోదుతో సమావేశం ప్రారంభమైంది. తొలి ఏడాదిలో ప్రభుత్వ ఘన విజయాలు,  శరవేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రజా రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణకు అడుగుల పై పలువురు పార్టీ నాయకులు తీర్మాణాలు ప్రవేశపెట్టడంతో నాయకులు ఆమోదం వ్యక్తం చేశారు.  అలాగే శాంతిభద్రతల  పరిరక్షణకు పటిష్ట చర్యలు పై చర్చ,  చంద్ర విజన్ తో సంక్షేమ కార్యక్రమం తీర్మాణం పై చర్చించి ఆమోదించారు.

ఉరసా ఎకరం 99 పైసలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం..లోకేశ్ సవాల్

  ఊరాసాకు ఎకరం 99 పైసలకే ఇచ్చినట్టు నిలిపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేశ్  సవాల్ విసిరారు. కడప నగరంలో పబ్బాపురం లే ఔట్ లో నిర్వహించిన మహానాడు మొదటి రోజు కార్యక్రమంలో  మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అనంతరం లోకేష్ మహానాడు ప్రాంగాణంలోని  మీడియా పాయింట్ లో విలేకరులతో చిట్ లో పాల్గొన్నారు. . తదుపరి సీఎం మీరే గా అన్న మీడియా ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముందన్నారు. చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకులు, ఆయన ఇంకా యువ నాయకుడే అన్నారు.  దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదన్నారు. అధికారంలోకి వచ్చాం కాబట్టి అంతా బాగుందనే భావన సరికాదన్నారు.  క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తేనే  వాస్తవాలు తెలుస్తాయన్నారు. దివంగత టీడీపీ నేత వీరయ్య చౌదరికి నివాళులర్పించేందుకు వెలితే  పోగాకు రైతుల సమస్యలు తెలిశాయని, వెంటనే అధికారులకు మంత్రుల బృందానికి అప్రమత్తం చేశామన్నారు. పార్టీకి నిరంతరం ఫీడ్ బ్యాక్ అవసరం అనటానికి ఇదో ఉదాహరణ అన్నారు. క్రింది స్థాయి అభిప్రాయాల పై నిరంతర చర్చ జరగాలని, పార్టీ బలంగా వుండాలని, సంస్థాగతంగా  బాగుండాలని లోకేష్ విలేకరులతో నిర్వహించిన చిట్ చాట్ లో పేర్కొన్నారు. ఉరసా సంస్థకు 99 పైసలకుఎకరా భూమి ఇచ్చినట్లు వైసీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా వున్నానని  నారా లోకేష్ సవాల్ చేశారు. కడప నగరంలో నిర్వహించిన  మహానాడు సందర్భంగా విలేకరులతో చిట్ చాట్ గా మాట్లాడుతూ టీసీఎస్ కు 99 పైసలకు ఇచ్చామని, ఉరసాకు మార్కెట్ ధరకే  భూములు ఇచ్చామన్నారు.  విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఇక విశాఖ నగరాన్ని అందుకోలేమన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తోందన్నారు. మద్యం కుంభకోణంలో జగన్ వైఖరి దొంగే  ... దొంగ దొంగ అనట్లు వుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి  పరిశ్రమలు వస్తాయే కానీ ఒక్కటి కూడ బయటకు పోదని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోవడానికి రాష్ట్రంలో ఇప్పుడు జగన్ ప్రభుత్వం లేదన్నారు. పార్టీ తరపున  బాధ్యత అప్పగించినా  నిర్వహిస్తానని తెలిపారు.  పార్టీ కోసం కష్టపడిన అందరికీ పదవులు వస్తాయని, పదవులు రాలేదని నేతలు అలకబూనడం మానేయాలని హితవు పలికారు. తాను విద్యాశాఖ మంత్రి అయ్యాక రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడ మూత వేయలేదన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని వైసీపీ నాయకులు కళ్లు తెరిచి చూడాలన్నారు.

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగింపు

  ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ కూటమి ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నవంబర్ వరుకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ జీవో ఆర్టీ నంబర్ 1028ను జారీ చేశారు. ప్రభుత్వ సొమ్మును ఖర్చుచేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసులో సంజయ్‌ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సర్వీసులలో డీజీగా ఉన్నప్పుడు నిధులను దుర్వినియోగం చేసినందుకు సస్పెన్షన్‌ను పొడిగించారు.  ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణ పేరిట నిధులు దుర్వినియోగం అయినట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం మరోసారి పేర్కొంది. సంజయ్ సస్పెన్షన్‌ను మరో 180 రోజులు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అగ్నిమాపక డీజీగా ఉన్న సమయంలో అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని రూ. కోటి దుర్వనియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తేల్చింది. సీఎం చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఈయన వరుస మీడియా సమావేశలు నిర్వహించారు.

జూన్ 2న కవిత కొత్త పార్టీ.. రఘునందనరావు జోస్యం నిజమయ్యేనా?

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత, సొంత తండ్రి అయిన   కేసీఆర్ కు రాసిన   లేఖ సృష్టించిన, సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపణలు ఇప్పటిలో ఆగేలా లేవు. కవిత లేఖపై బీఆర్ఎస్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. చివరాఖరికి కేసీఆర్ కూడా కవిత లేఖపై స్పందించడం అటుంచి, కన్న బిడ్డను ఆ లేఖ ఎందుకు రాశావు? ఏమైనా ఉంటే నేరుగా నాకే చెప్పొచ్చుగా అని మందలించిన పాపాన కూడా పోలేదు. లేఖ వెలుగులోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ కుమార్తెతో ఆయన భేటీ అయినదే లేదు. అన్నిటికీ ఒకే మందు అన్నట్లుగా మౌనాన్నే ఆశ్రయించారు. అటు కవిత కూడా తగ్గేదే లే అన్నట్లుగా తండ్రితో భేటీకి అసలు ప్రయత్నమే చేయలేదని తెలుస్తోంది. పైపెచ్చు ఆమె తన సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ఆమె చర్యల ద్వారా తెలుస్తోంది. తాజాగా ఆమె మంగళవారం (మే 27)  జాగృతి సంస్థ ప్రతినిధులతో  సమావేశమై సామాజిక తెలంగాణ సహా పలు అంశాలపై చర్చించారు. జాగృతి సంస్థ ద్వారా భవిష్యత్ లో చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.   ఇక కవిత లేఖ వెలుగు చూసి రోజులు గడిచిపోతున్నా కాంగ్రెస్, బీజేపీలు అదే లేఖ ఆధారంగా బీఆర్ఎ స్ పై విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ రఘునందనరావు ఏకంగా కవిత కొత్త పార్టీ ప్రారంభించబోతున్నారని చెబుతూ, ఆ పార్టీ ఆవిర్భావ తేదీ కూడా వెల్లడించేశారు.  కవిత నేతృత్వంలో తెలంగాణలో జూన్ 2న మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందంటూ జోస్యం చెప్పేశారు.  సొంత పార్టీ పెట్టడమే కాకుండా కవిత రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేయనున్నారని రఘునందనరావు అన్నారు.   రఘునందనరావు వ్యాఖ్యలతో మరో సారి కవిత భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్న చర్చ మరో సారి జోరుగా సాగుతోంది. రఘఉనందనరావు చెప్పినట్లు కవిత కన్న తండ్రికి వ్యతిరేకంగా సొంత కుంపటి పెట్టుకుని రాజకీయ క్షేత్రంలో ఆయనతో తలపడటానికి రెడీ అయిపోయారా?  కొత్త పార్టీ పేరు ఏమిటి?  అన్న చర్చ జోరుగా సాగుతోంది. 

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్

  తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే భద్రతకు కీలకమైన "కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే పరిశోధన సంస్థను ఏర్పాటు చేయడానికి రూ.265 కోట్లు మంజూరు చేసింది. ఈ సెంటర్ ఇండియన్ రైల్వేలో రైళ్ల భద్రతను మెరుగుపరిచేందుకు "కవచ్" అనే స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. కవచ్ అంటే ఒక ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఇది రైళ్లు ఢీకొనకుండా, సిగ్నల్‌లను దాటకుండా, డ్రైవర్ పొరపాటు చేసినా ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వేసేలా చేస్తుంది.  ఈ సెంటర్ ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్‌లోని ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌లో పని మొదలు పెట్టింది. ఇండియన్ రైల్వే భద్రత విషయంలో ప్రపంచ స్థాయి టెక్నాలజీని అభివృద్ధి చేయడం, 5G టెక్నాలజీని పరీక్ష నెపుణ్య  అభివృద్ధి, స్మార్ట్ రైలు వ్యవస్థలను రూపొందించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఐఐటీ మద్రాస్‌తో కలిసి ఈ సెంటర్ పనిచేయనుంది.

కరకట్ట కమల్ హసన్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే పై కేసు నమోదు

కరకట్ట కమల్ హసన్ ఆర్కేపై కేసు నమోదైంది. మంగళగిరిలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.  వైసీపీ హయాంలో 2021 అక్టోబర్ లో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. అప్పట్లో  ఈ దాడిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అయితే తెలుగుదేశం కూటమి సర్కార్ అధికారపగ్గాలు చేపసట్టిన తరువాత ఈ కేసును సీఐడీకి అప్పగించింది. దీంతో మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసు నమోదు చేసిన సీఐడీ, ఆ కేసులో అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ను ఏ127గా చేర్చింది.  వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, అప్పటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాశ్‌ ఆధ్వర్యంలోని వైసీపీ ముఖ్యనేతల ఆదేశాలతో ఈ దాడికి పథక రచన జరిగినట్లు సీఐడీ దర్యాప్తులో నిర్దారణ అయినట్లు సమాచారం.   టీడీపీ కార్యాలయం ప్రధాన గేటును కూల్చి లోపలకి ప్రవేశించిన అల్లరి మూకలు కార్యాలయ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు.  అప్పట్లో ఈ దాడికి సంబంధించి ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదు.  

జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత సమావేశం.. ఎందుకంటే?

  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు జాగృతి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న ఆమె నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ మీటింగ్‌లో ముఖ్యంగా సింగరేణి ప్రాంతానికి చెందిన తెలంగాణ జాగృతి నాయకులు హాజరయ్యారు. ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిణామాలతో పాటు, తెలంగాణ జాగృతి సంస్థ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.  సంస్థ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడం, ప్రజలకు చేరువయ్యే నూతన కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాలపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది. సింగరేణిలోని 11 ఏరియాలను ఆమె సమన్వయకర్తలను నియమించారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందని ఆమె ఈ సందర్బంగా వెల్లడించారు. టీబీజీకేఎస్‌తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తామన్నారు. బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేశామని ప్రకటించారు. 

పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలం : చంద్రబాబు

  తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ కడప మహానాడు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కడపలో మహానాడు వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పార్టీ కోసం నిస్వార్థంగా, అంకితభావంతో పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలమని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి వేధించినా ఎత్తిన జెండా దించలేదని కార్యకర్తలకు కితాబిచ్చారు. టీడీపీ కార్యకర్తలు అందరికీ ఈ మహానాడు వేదికగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో పదింటికి 7 స్థానాలు గెలిచాం. ఈసారి ఇంకొంచెం కష్టపడి పదికి పది గెలవాలని చంద్రబాబు క్యాడర్‌కి పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93 శాతం స్ట్రైక్‌రేట్‌ సాధించి అద్భుత విజయం సాధించామని తెలిపారు. ‘‘నేనో సైనికుడిని.. నిరంతరం పోరాటం చేస్తా. నా శక్తి, నా ఆయుధాలు మీరే.. మీరు నేను కలిస్తే మనకు ఆకాశమే హద్దు. మనం ఏ పనైనా చేయగలం. దీనికి మీరు సిద్ధమేనా’’ అని కార్యకర్తలను చంద్రబాబు ప్రశ్నించారు. నీతి నిజాయితీ రాజకీయాలు, విజన్ తో ముందుకు వెళ్లే రాజకీయాలకు టీడీపీ బ్రాండ్ అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అవినీతిపై పోరాడామని, అధికారంలో ఉన్నప్పుడు అవినీతి రహిత పాలన అందించామని వెల్లడించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో చూసినా కూడా టీడీపీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారని చంద్రబాబు గుర్తుచేశారు. టీడీపీ చరిత్ర చింపేస్తే చిరిగేది కాదు, చెరిపేస్తే చెరిగేది కాదని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్లకు.. వాళ్ల పనే అయిపోయింది. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలను ఎదుర్కొన్నాం. పాలనంటే హత్యా రాజకీయాలు, కక్షసాధింపులుగా గత ప్రభుత్వం మార్చేసింది.   జగన్ విధ్వంస పాలనతో ఏపీన్ని సర్వ నాశనం చేసింది. దీన్ని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలు, నాయకుల ప్రాణాలు తీశారు. వేటాడారు, వెంటాడారు.. అక్రమ కేసులు పెట్టారు. కానీ ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని అభినందిస్తున్నా. మన పసుపు సింహం, కార్యకర్త చంద్రయ్యను పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. ఆయనే మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తే పార్టీని నడిపిస్తుంది’’ అని చంద్రబాబు అన్నారు. దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. డిజిటల్ కరెన్సీ వచ్చా నోట్లు అవసరం లేదని పేర్కొన్నారు. దీని వల్ల అవినీతి తగ్గిపోతుందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం డీమానిటైజేషన్ రద్దు చేసే సమయంలో తాను ప్రధాని మోదీకి ఒక సలహా ఇచ్చానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఆ టైమ్ లో డిజిటల్ కరెన్సీపై తాను ఒక రిపోర్ట్ ని ప్రధానికి ఇచ్చానన్నారు.  500 రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేసి, కొత్తగా 2వేల నోట్లు తీసుకొచ్చిన సమయంలో తాను ఓ కీలక సూచన చేసినట్టు చెప్పారు. 500 రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లతోపాటు కొత్తగా తెచ్చిన 2వేల నోట్లు కూడా రద్దు చేయాలని, అన్ని పెద్ద నోట్లు రద్దు చేసేయాలని తాను ప్రధానికి సూచించానన్నారు. అలా నోట్లు రద్దు చేస్తే డిజిటల్ కరెన్సీతో అవినీతికి చెక్ పెట్టినట్టవుతుందని చెప్పారు చంద్రబాబు.అవినీతి పూర్తిగా తగ్గించేందుకే ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక్క వాట్సప్ మెసేజ్ తో పనిజరుగుతోందని, అధికారులు కూడా పారదర్శకంగా రిపోర్ట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక విధానంలో కూడా పారదర్శకత అవసరం అన్నారు.  

కడపలో తెలుగుదేశం మహానాడు.. అసలీ ఆలోచన ఎవరిదో తెలుసా?

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత తొలిసారిగా ఆ పార్టీ పెద్ద పండుగ మహానాడును కడపలో నిర్వహిస్తున్నారు. మంగళవారం (మే 27)న ప్రారంభమైన మహానాడు గురువారం (మే 28) వరకూ సాగుతుంది. కడప అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. దశాబ్దాలుగా కడప వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా నిలుస్తోంది. పార్టీలూ, హవాలతో సంబంధం లేకుండా కడప వైఎస్ కు అండగా నిలుస్తూ వస్తున్నది. వైఎస్ మరణానంతరం కడప జగన్ కు కంచుకోటగా నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, విభజిత రాష్ట్రంలో కూడా గత ఏడాది జరిగిన ఎన్నికల వరకూ కడపలో వైఎస్ కుటుంబానిదే ఆధిపత్యం. అయితే ఆ అధిపత్యానికి 2024 ఎన్నికలలో గండి పడింది. కడపలోని పది నియోజకవర్గాలకు గాను ఏడింటిలో తెలుగుదేశం కూటమి విజయఢంకా మోగించింది. వైసీపీ కేవలం మూడంటే మూడు స్థానాలకు పడిపోయింది. అయితే ఇంత కంటే ముందే కడపలో జగన్ కోటకు బీటలు వారడం మొదలైంది. అందకు బీజం లోకేష్ పాదయాత్రతో పడిందని చెప్పవచ్చు. నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో భాగంగా  రాయలసీమ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఆ సందర్భంగానే జగన్ కడపకోటను బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నారు. 2024 ఎన్నికలలో నభూతో అన్న స్థాయిలో విజయాన్ని అందుకున్న తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టంది. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ కడపలో తెలుగుదేశం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా లోకేష్ అడుగులు వేశారు. వేస్తున్నారు. అందులో భాగంగానే రాయలసీమ ప్రాంతంలో ఇంధన, ఆటోమొబైల్ ప్రాజెక్టుల స్థాపన కేసం విశేష కృషి చేసి సాధించారు. వీటికి అదనంగా సాగునీటి ప్రాజెక్టులూ చేపట్టారు. దీంతో సీమ జీవన ముఖ చిత్రం మొత్తం మారిపోయే పరిస్థితికి వచ్చింది. జరుగుతున్న అభివృద్ధి, పెరుగుతున్న ఉపాధి అవకాశాల కారణంగా జనం తెలుగుదేశం పార్టీపై అభిమానం పెంచుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వ్యూహాత్మకంగా పార్టీ మెగా ఈవెంట్ గా చెప్పబడే మహానాడును కడపలో నిర్వహించాలని నారా లోకేష్ ప్రతిపాదించారు. నారా లోకేష్ ప్రతిపాదనకు పార్టీ అధినేత చంద్రబాబు సహా మొత్తం క్యాడర్, లీడర్ ఆమోదముద్ర వేసింది. మహానాడు నిర్వహణతో కడప జిల్లాలో తెలుగుదేశం పట్టు పెంచుకుని బలోపేతం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని లోకేష్ గట్టిగా వాదించారు. కడపలో మహానాడు నిర్వహణ విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయం లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు కడపలో మహానాడు నిర్వహణతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందన్న విశ్వాసం పార్టీ వర్గాల్లో మెండుగా ఉంది. లోకేష్ ముందు చూపునూ, వైసీపీ కంచుకోటనే ఢీ కొని బీటలు వారేలా చేయడంలో ఆయన చూపిన ధైర్యం ఇప్పుడు కార్యకర్తల మన్ననలు అందుకుంటోంది. 

తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ : నారా లోకేశ్

    తెలుగు జాతి కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కడపలో నిర్వహించిన మహానాడులో ఆయన మాట్లాడుతూ టీడీపీ అంటే పేదల పార్టీ అని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ  స్థాపించిన ముహుర్తం బలమైనదని ఈ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేసిందన్నారు. 40 ఏళ్లలో ఎన్నో ఒడుదోడుకులు ఎదుర్కొందని లోకేశ్ తెలిపారు. కార్యకర్తలు పసుపు జెండాను దించకుండా మోశారని వారందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని ఆయన అన్నారు.  రాబోయే 40 సంవత్సరాల పాటు పార్టీని విజయవంతంగా నడిపించడానికి అవసరమైన అంశాలపై ఈ మహానాడు వేదికగా సమగ్రంగా చర్చించాలని పిలుపునిచ్చారు. "తెలుగు వారి కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి, అన్నదాతకు అండగా నిలిచిన పార్టీ మనది. ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన ముహూర్త గట్టిదన్నారు. ప్రస్తుత పార్టీలో 58 మంది తొలిసారిగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 మంది నూతన ఉపాధ్యాయులను నియమించబోతున్నామని ఆయన వెల్లడించారు.  గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారని, సొంత తల్లి, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేశారని ఆయన అన్నారు. మాజీ మంత్రి రోజా నాకు చీర, గాజులు పంపిస్తాన్నారు.. పంపించమని చెప్పాను రోజా పంపించే చీర, గాజులను మా అక్కచెల్లెళ్లకు పెట్టు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పాను లోకేశ్ తెలిపారు. మనకు ప్రతిపక్షం కొత్తకాదు.. అధికారం కొత్త కాదు. భవిష్యత్తు కోసం ఆరు శాసనాలను ప్రతిపాదిస్తున్నా. అవి 1. తెలుగుజాతి విశ్వఖ్యాతి, 2. యువగళం, 3. స్త్రీశక్తి, 4. పేదల సేవల్లో సోషల్‌ రీఇంజినీరింగ్‌, 5. అన్నదాతకు అండగా, 6. కార్యకర్తలే అధినేత. అన్ని రంగాల్లో మన తెలుగువారు ప్రపంచంలోనే ముందుండాలి. పని చేసేవారిని ప్రోత్సహిస్తామని యువనేత తెలిపారు.  

వరుస అరెస్టులతో వైసీపీ నేతల్లో టెన్షన్.. టెన్షన్

ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిపై కేసులు నమోదవుతాయో.. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో.. ఊహకు కూడా అందని పరిస్థితి నెలకొంది. దానికి తాజా పరిస్థితులే ప్రత్యక్ష ఉదాహారణ. ప్రస్తుతం ఫ్యాన్ పార్టీ లీడర్లను కేసులు వెంటాడుతున్నాయి. వెంటాడుతున్నాయి అనేకంటే.. వేటాడుతున్నాయనే చెప్పాలి. తాజాగా కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్‌తో మరోసారి వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇదే సమయంలో పిన్నెళ్లి సోదరులపై మరో హత్యాయత్నం కేసు నమోదైంది.  ఇప్పటికే అనేక మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. వల్లభనేని వంశీ గతంలో చేసిన అనేక అక్రమాల కారణంగా జైళ్లో ఊచలు లెక్కిస్తూ బెయిలు కోసం కోర్టుల చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. మరోవైపు అనేక మంది వైసీపీ నేతలు   ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించారు. బెయిల్ దొరకని వారు పరారీలో ఉన్నారు. ఇలా పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు.  క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం.. అడ్డుకున్న వారిని బెదిరించడం.. ఇలా అనేక ఆరోపణలపై కాకాణిపై కేసు నమోదైంది. అనేక సార్లు నోటీసులు ఇచ్చారు. కానీ ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత బెంగళూరులోని ఓ ప్రాంతానికి వెళ్లిపోయారు. కానీ పోలీసులు ఆయన లోకేషన్‌ను గుర్తించి.. ఏపీకి పట్టుకొచ్చారు. కోర్టు ముందు హాజరుపరిచారు.  కాకాణిపై ఇవి మాత్రమే కాదు..  పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో అక్రమ మైనింగ్  కేసుతో పాటు ఎ స్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదైంది. వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకం ఫోర్జరీ చేశారని ఓ కేసు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై మరో కేసు ఉంది. ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు, కావలిలో పోలీసులపై అసభ్యపదజాలంతో‌ అవమానకరంగా మాట్లాడంతో మరో కేసు, సోమిరెడ్డికి విదేశాల్లో 1000 కోట్లు ఉన్నట్లు నకిలి పత్రాలు సృష్టించిన విషయంలో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు. ఇలా అనేక కేసులు కాకాణిపై నమోదయ్యాయి.  ఇక పిన్నెళ్లి సోదరులది మరో కథ. ఓ డబుల్ మర్డర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి. పల్నాడు జిల్లా బొదిలవీడులలో వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అనే ఇద్దరిని కారుతో ఢీకొట్టి హత్య చేసిన కేసులో ఇద్దరు సోదురులపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ పరారీలో ఉన్నారు.  ఇవి మాత్రమేనా ఈ వివాదస్పద సోదరులపై మాచర్ల నియోజకవర్గంలో లెక్కలేనన్ని ఆరోపణలతో పాటు.. అనేక కేసులున్నాయి.  వీరు మాత్రమే కాదు.. ఇప్పటికే వల్లభనేని వంశీ, పేర్ని నాని, సజ్జల భార్గవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇలా ఎంతో మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. కింది స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి నేతల వరకు గత ఐదేళ్లలో చేసిన అక్రమాలు, అరాచకాలపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేతలంతా లీగల్‌ టీమ్‌ను రెడీగా ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే ఇక్కడ అధికార పార్టీ ఆవేశంగా కాకుండా ఆలోచనతో ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది.  రాత్రికి రాత్రి అరెస్టులు చేయడం లేదు.. న్యాయపరంగా అన్ని అవకాశాలు ఇస్తున్నారు. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశాలు ఇస్తున్నారు.  అంతే కాదు గతంలో వారు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలు, ఆధారాలు ముందే బయటికి వస్తున్నాయి. ఇలా పక్కగా నేతలను లాక్ చేస్తున్నారు. ఇప్పటికే కాకాణి, పిన్నెళ్లి సోదరులకు ఉచ్చు బిగిసింది. ఇకపై కేసుల ఉచ్చులో చిక్కుకోబోయేది ఎవరన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

మోదీ పాలనకు పదకొండేళ్లు!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన 11 ఏళ్ళు పూర్తిచేసుకుని,12 వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. అవును.. 2014 మే 26న  నరేంద్ర మోదీ ప్రప్రథమంగా భారత ప్రధాని మంత్రిగా  ప్రమాణ స్వీకారం చేశారు. మరో వంక మరో వారం పది రోజుల్లో.. అంటే  జూన్ 9 న మోదీ 3.0 ప్రభుత్వం  తొలి వార్షికోత్సవం జరుపుకునేందుకు సిద్దమవుతోంది.  గత ఏడాది  జూన్ 9 న నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన తొలి ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. అలాగే..  నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక కాలం ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధనిగానూ మోదీ చరిత్ర  సృష్టించారు.  అదలా ఉంటే.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రధాని నరేంద్ర మోదీ  11 ఏళ్ల పాలనను అప్రకటిత అత్యవసర పాలనగా అభివర్ణించారు.  అలాగే  ఈ పదకొండేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించింది శూన్యమని తేల్చేశారు. మోదీ సర్కార్ కు ఖర్గే  జీరో మార్కులు వేశారు.  మరో  వంక బీజేపీ, ఎన్డీఎ భాగసామ్య పార్టీలు మోదీ పాలన భేష్  అని  మెచ్చుకుంటున్నాయి.  ఈ 11 ఏళ్లలో సాధించిన ఆర్థిక ప్రగతిని, ఇతర విజయాలను ఏకరవు పెడుతున్నాయి. నూటికి 200 మార్కులు ఇచ్చినా ఇవ్వవచ్చు అన్నట్లుగా  మోదీ పాలను ప్రశంసల వర్షంలో ముంచెత్తుతున్నాయి.   అయితే.. రాజకీయ విమర్శలను, రాజకీయ ప్రశంసలను పక్కన పెడితే..  మోదీ  ఈ 11 ఏళ్ల పాలనలో మెరుపులూ, మరకలూ రెండూ ఉన్నాయి.  అయితే.. గతంతో పోల్చుకుంటే మోదీ పాలన భిన్నంగా సాగింది అనేది మాత్రం కాదన లేని నిజం.  నరేంద్ర మోదీ 2014 మే 26.. సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు భారత దేశ ప్రధాన మంత్రిగా తొలిసారి  ప్రమాణాస్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మోదీ పాలన నిరాంటంకంగా కొనసాగుతోంది. వరసగా 2014, 2019, 2024 మూడు పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కూడా మోడీ సారధ్యంలో బీజేపీ, ఎన్డీఎ  కూటమి అఖండ విజయం సాదించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశంలో సుస్థిర పాలన సాగుతోంది. నిజానికి మోదీ   పాలనకు  సుస్తిరత్వమే పునాది రాయి. సుస్థిర పాలనతోనే మోదీ ప్రభుత్వం సుస్థిర అభివృద్ధికి బాటలు వేసింది.    సుస్థిర ప్రభుత్వం పునాదుల పైనే మోదీ ప్రభుత్వం తడబాట్లు సంకెళ్ళు లేకుండా..  దీర్ఘ కాలిక ప్రయోజనాలు లక్ష్యంగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. నిజమే..  మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు అన్నీ సంపూర్ణ విజయాన్ని సాధించలేదు. వ్యవసాయ చట్టాల వంటి  కొన్ని కీలక నిర్ణయాలను అనివార్యంగా వెనక్కి తీసుకోవలసి వచ్చింది. అదే సమయంలో   కోవిడ్ వంటి వైపరీత్యాలను ఎదుర్కుంటూ కూడా ఆర్థిక ప్రగతిలో లక్ష్యాలను చేరుకుంది. మోదీ తొలి ప్రమాణ స్వీకారం (2014) నాటికి 11 స్థానంలో దేశ ఉన్న ఆర్థిక వ్యవస్థ..  ఈ11 ఏళ్లలో నాలుగో  స్థానానికి చేరుకుంది. అవును.. భారత ఆర్థిక వ్యవస్థ జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.  అమెరికా, చైనా, జర్మనీ తర్వాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా  అవతరించింది. నిజానికి ఇది సామాన్య విజయం కాదు.. ప్రతి భారతీయుడూ  గర్వించదగిన విజయంగా ప్రపంచ ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాదు.. త్వరలోనే భారత దేశం మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, మన కంటే ఎక్కవగా ప్రపంచ దేశాల ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. మరో వంక, మోదీ  ప్రభుత్వం పేదరిక నిర్మూలన లక్ష్యంగా అమలు చేసిన సంక్షేమ, ఆర్థిక  చేయూత పథకాలు, ఒకటొకటి వెలుగు లోకి వస్తునాయి.  నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం.. మోదీ ప్రభుత్వం అమలు చేసిన పేదరిక నిర్మూలన పథకాల ద్వారా, దేశంలో ఇంతవరకు  దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు.  అలాగే మౌలిక సదుపాయాలరంగం,సాంకేతిక ఆవిష్కరణలు, అంతరిక్ష పరిశోధనలు, ముఖ్యంగా చంద్రయాన్ -3 మన దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది.  అయుష్మాన్ భారత్ వంటి, ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య పథకాలతో అత్యుత్త వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఒకటని కాదు.. ప్రతి ర్రంగంలోనూ   ప్రపంచ స్థాయిని మించిన స్థాయిని చేరుకుందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ విశ్వాసంతో అడుగులు వేస్తోంది. మెరుగైన ఫ తాలు సాధిస్తూ,  విశ్వగురు స్థానాన్ని చేరుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.  ఇక దేశ భద్రత విషయానికి వస్తే..  ఆపరేషన్ సిందూర్అందుకు  తిరుగులేని  ప్రత్యక్ష సాక్ష్యం. నిజానికి, 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, 2019లో జరిగిన బాలకోట్ వైమానిక దాడి సందర్భంగా మన సైనిక శక్తి సామర్ధ్యాలు ప్రపంచానికి తెలిసి వచ్చాయి.ఇక ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడికి  ప్రతిగా పాకిస్థాన్ కు బుద్ది చెప్పేందుకు  చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రపంచం కళ్ళు తెరిపించింది.  మోదీ  నాయకత్వంలో నిర్మాణ మవుతున్న నయా భారత్, స్వశక్తి సామర్ధ్యం ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోని   ఉగ్రస్థావరాలను, మట్టు పెట్టడంతో పాటుగా, పాక్ కవ్వింపు చర్యలకు జవాబుగా.. ఆ దేశంలో లోని 11 వైమానిక స్థావరాలను కూల్చివేయడం వరకూ మన సేనలు సాగించిన సాహసోపేతమైన చర్యలు భారతదేశ ప్రతిష్టను పెంచాయి.  నిజమే.. మోదీ  ప్రభుత్వం ఎన్నో విజయాలను సాధించింది.  స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎన్నో దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి. కానీ, మోదీ ఒక విషయంలో మాత్రం ఓడిపోతూనే ఉన్నారు. విపక్షాల నుంచి ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నుంచి ఏ ఒక్క విషయంలోనూ మెప్పును అయితే పొందలేక పోయారు. ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి, దేశ  ప్రజలు వరసగా మూడు సార్లు గెలిపించడం ద్వారా, మోదీని మెచ్చుకున్నారు. చివరకు చిదంబరం,శశి థరూర్ వంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం కొన్ని కొన్ని విషయాల్లో మోదీ భేష్ అంటున్నారు. కానీ, కాంగ్రస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం మోదీ పాలనలో మెచ్చుకో దగిన అంశం ఏదీ లేదని, 11 మోడీ పలాన్ టోటల్ ఫెయిల్యూర్, సంపూర్ణ వైఫల్యం అంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ పెట్టిన ముహూర్తబలం గొప్పది.. నారా లోకేష్

ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ముహూర్త బలం చాలా గొప్పదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. తెలుగుదేశం మహానాడు ఈ రోజు ప్రారంభం అయిన సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం వేదికగా కార్యకర్తలు, నాయకులకు ఆహ్వానం పలికారు. ఆ ట్వీట్ కు ఓ వీడియో కూడా షేర్ చేశారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన ముహూర్త బలం గొప్పదన్న ఆయన, పార్టీకి కార్యకర్తలే బలం, బలగం అని పేర్కొన్నారు.  ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు చుట్టుమట్టినా  ఎత్తిన పసుపు జెండా దించకుండా పోరాడే  తెలుగుదేశం కార్యకర్తలే తనకు నిత్యస్ఫూర్తి అని పేర్కొన్న నారా లోకేష్   పసుపు పండగ మహానాడుకు అందరికీ ఘన స్వాగతం పలికారు. 

మహానాడు మెనూ చూస్తే నోరూరాల్సిందే!

తెలుగుదేశం పెద్ద పండుగ మహానాడు మంగళవారం (మే 27) ప్రారంభమైంది. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత కడపలో తొలిసారిగా  మహానాడు జరుగుతోంది. ఎన్ని విధాలుగా ఇది తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన విషయం. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సారి మహానాడును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని ప్రత్యేకతలతో పాటు మహానాడు సందర్భంంగా ఈ సారి భోజనాల ఏర్పట్లు కూడా అత్యంత ఘనంగా ప్రత్యేకంగా చేస్తున్నారు. మహానాడుకు హాజరయ్యే ప్రతినిథులకు నోరూరించే విందు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడు జరిగే మూడు రోజులూ ప్రత్యేక వంటకాలతో రుచికరమైన విందు ఏర్పాట్లకు సర్వం సిద్ధమైంది.  చాలా కాలం తరువాత  ఈసారి మహానాడులో మాంసాహార వంటకాలను కూడా వండి వడ్డిస్తారు.   మహానాడు జరిగే మూడు రోజులూ కూడా రోజుకు 30 రకాల ప్రత్యేక వంటకాలతో మెనూ సిద్ధమైంది. వీటిలో మచ్చుకు కొన్ని చెప్పుకోవాలంటే.. ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా, బందరు లడ్డూ, అలాగే పప్పు, దప్పళం, ఉలవచారు, పాలతాలికలు, చక్కెర పొంగలి, ఇంకా   ఆపిల్ హల్వా, వెజ్ జైపూరి, కడాయి వెజిటబుల్ కుర్మా ఇలా..  ప్రతిరోజూ దాదాపు 30 రకాల వంటకాలతో అతిథులకు పసందైన భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  అసలీ మెనూ చూస్తేనే ఎవరికైనా నోరూరడం ఖాయం అన్నట్లుగా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచీ వేలాదిగా తరలి వచ్చే ప్రతినిథులకు పసందైన విందు భోజనం ఏర్పాటు చేయడం కోసం రాష్ట్రంలోని దాదాపు వంద మంది ప్రావీణ్యత ఉన్న వంట వాళ్లు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.   మహానాడు మెనూ చూస్తేనే మాయా బజార్ లోని వివాహ భోజనంబు పాట గుర్తుకురాక మానదు. అయితే తెలుగుతమ్ముళ్లు మాత్రం వహానాడు భోజనంబు అని మార్చి పాడుకుంటున్నారు.   ఇక భోజనాల కోసం ప్రత్యేకంగా ఐదు భారీ షెడ్లను ఏర్పాటు చేశారు. వీటిలో రెండింటిని పూర్తిగా నాయకులు, కార్యకర్తల కోసం కేటాయించగా, ఒకటి మంత్రులు, ఎమ్మెల్యేల కోసం, మరోటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతల కోసం, ఇంకోటి మహానాడుకు హాజరయ్యే  ప్రముఖులు, జీవితకాల సభ్యత్వం తీసుకున్న వారికి కేటాయించారు. ఒక్కో షెడ్డులో ఒకే సారి 3500 మంది భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు.  ప్రతి రోజూ కనీసం 30 వేల మందికి సరిపడా వంటకాలను తయారు చేయిస్తున్నారు. ఇక మహానాడు చివరి రోజున దాదాపు 3లక్షల మందికి భోజనం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఉరకలేసే యువత, ఉత్సాహం నిండిన కార్యకర్తలే తెలుగుదేశం శక్తి, ఆస్తి.. చంద్రబాబు

తెలుగుదేశం పెద్ద పండుగ మహానాడు సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉరకలేసే ఉత్సాహం. ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే  యువశక్తి  తెలుగుదేశం ఆస్తి అని పేర్కొన్న ఆయన  తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం తెలుగుదేశం కర్తవ్యమన్నారు. ప్రపంచ దేశాలలో తెలుగువారు ఎక్కడ ఉన్నా నంబర్ వన్ గా, వారు ఉన్న దేశానికే తలమానికంగా మారాలన్నదే మన సంకల్పమని, అందుకోసమే నిరంతరం శ్రమస్తున్నామనీ పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు, అవరోధాలు, అడ్డంకులూ ఎదురైనా తెలుగుదేశం ముందడుగు వేస్తూనే ఉందనీ, ప్రతి పరీక్షా సమయంలోనూ వజేతగానే తెలుగుదేశం పార్టీ నిలిచిందని చెప్పిన చంద్రబాబు అందుకు కార్యకర్తల దీక్షాదక్షతలు కారణమన్నారు. ముఖ్యంగా గత ఏడాది జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.   తెలుగుదేశం ఆవిర్భావం తరువాత తొలి సారిగా కడపలో మహానాడు నిర్వహించుకుంటున్నామని చంద్రబాబు అన్నారు.  మహానాడు సందర్భంగా ప్రజాసేవకు పునరంకితం అవుతూ, యువగళానికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. అలాగు అన్నదాతకు అండగా నిలుస్తూ, స్త్రీశక్తికి పెద్ద పీట వేయాలని, పేదల సేవకు నిరంతరం శ్రమించాలని, తెలుగు జాతి విశ్వఖ్యాతి లక్ష్య సాధన దిశగా కార్యాచరణ ఉండాలని చంద్రబాబు ఉద్భోదించారు.