టీటీడీలో త‌ర‌చూ వివాదాల‌కు కార‌ణం?

భార‌త‌మ్మ సైన్య‌మేనా? వీరెంత మంది వ‌ర‌కూ ఉన్నారు? టీటీడీలో రంగ ప్ర‌వేశం ఎప్పుడు జ‌రిగి ఉండొచ్చు?  తిరుమ‌ల‌లో త‌ర‌చూ   వివాదాలు జ‌ర‌గ‌టానికి గ‌ల కార‌ణ‌మేంటి?  ఈ సంస్థ‌లో అన్నమ‌య్య మ‌త‌స్తులు కాకుండా అన్య‌మ‌త‌స్తులుండ‌ట‌మే అస‌లు కార‌ణ‌మా? ఇంత‌కీ వీరి వాద‌నేంటి?  త‌ర‌చూ మ‌ద్య మాంసాల వ్య‌వ‌హారం..  ఆ త‌ర్వాత ఇదిగో టీటీడీ చైర్మ‌న్ డౌన్ డౌన్ అనే నినాదాలు చేసేవ‌ర‌కూ ఎలా కొన‌సాగుతూ వ‌స్తోంది? తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల్లో ఇటీవ‌లి కాలంలో వ‌రుస వివాదాలు న‌డుస్తున్నాయ్. ఆల‌య ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగేలా ఇవి ఉంటున్నాయ్. వీటి వెన‌క  రెండు వేల వ‌ర‌కూ ఉన్న‌ భార‌త‌మ్మ సైన్యం దాగి ఉందా? అన్న‌దొక డౌట్ ఫుల్ డిబేట్.  ఇంత‌కీ వీరెలా ఈ వ్య‌వ‌స్థ‌లో వేళ్లూనుకున్నారు? దీనంత‌టికీ కార‌ణం భూమ‌న వంటి  క్రిష్టియ‌న్లు చైర్మ‌న్ కావ‌డ‌మేనా? అన్న‌దొక అనుమానం కాగా..  తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుడంటే కేవ‌లం భూమ‌న‌కే కాదు.. వైయ‌స్ కి కూడా ఏమంత గౌర‌వం లేదని అంటారు.  ఏడు కొండ‌లు ఎందుకు?  రెండు కొండ‌లు చాలు క‌దా అన్న సీఎం వైయస్. అలాంటి వైయ‌స్ కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయారు అనుకుంటే..  ఆయ‌న  కొడుకు జ‌గ‌న్ వ‌చ్చీ రావ‌డ‌మే గొడ‌వ గొడ‌వ‌. హైంద‌వాల‌యాల్లో అన్య‌మ‌త‌స్తులు ఉండ‌కూడ‌ద‌ని ఆనాటి  సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం జీవో తేవాల‌ని భావిస్తే కొంద‌రు క్రిష్టియ‌న్ సంఘాల వారు అడ్డుకున్నారు. ఇరువురిలో ఎవ‌రికి ప్ర‌యారిటీ ఇవ్వాల‌ని చూసిన జ‌గ‌న్   క్రిష్టియ‌న్ల వైపు మొగ్గారని అంటారు. దీంతో ఎల్వీని జీఏడీకి రిపోర్ట్ చేయ‌మ‌న్నారట‌. ఈ ఆగ్ర‌హంతో ఆయ‌న ఆనాటి ప్ర‌భుత్వం నుంచి ఎల్వీ వైదొలిగారని చెబుతారు. ఆ స‌మ‌యంలో కొన్ని క్రిష్టియ‌న్ సంఘాలు కేకులు క‌ట్ చేసిన  ఫోటోలు సైతం అప్పట్లో వెలుగులోకి వ‌చ్చాయని చెబుతారు. అంతేనా కావాల‌ని తిరుమ‌ల అట‌వీ సిబ్బందికి జీతాలు పెంచ‌క వారి ద్వారా వ‌న్య‌ప్రాణుల‌ను భ‌క్తులు న‌డిచే దారుల్లోకి ర‌ప్పించి.. ఏకంగా చిన్న పిల్ల‌ల ప్రాణాలు తీసే వ‌ర‌కూ తేవ‌డం కూడా అప్ప‌ట్లో పెను దుమారం న‌డిచింది. దీని వెన‌క కూడా ఏదైనా కుట్ర దాగి ఉందా? అన్న అనుమానాలున్నాయి.  ఇక అప్ప‌ట్లో మంత్రిగా ఉన్న రోజ‌మ్మ అయితే ఏకంగా క్రీస్తు డాల‌ర్ క‌లిగిన కెమెరామెన్ తో స‌హా వ‌చ్చి చేసిన హ‌డావిడి హంగామా మాములుగా లేదని అంటారు.  అంతేనా కిరాక్ ఆర్పీ చెప్పేదాన్నిబ‌ట్టి చూస్తే 30 వేల‌కు పైగా ఆమె సిఫార్సు లెట‌ర్లు ఇచ్చార‌ని తెలుస్తోంది. దీని వెన‌క కూడా అతి పెద్ద స్కామ్ న‌డిచేద‌ని టాక్. ఇలాక్కూడా రొజ‌మ్మ వెన‌కేసిన‌ట్టుగానూ చెబుతారు.  జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోని క్రిష్టియ‌న్ లాబీ ద్వారా భారీ ఎత్తున హిందూ దేవాల‌యాల్లోకి క్రిష్టియ‌న్లు ప్ర‌వేశించి.. అప్ప‌ట్లో ఆల‌య ప్ర‌తిష్ట మంట‌గ‌ల‌పాల‌ని చూసేవార‌ని అంటారు. ఆనాటి పాపాల కార‌ణంగానే జ‌గ‌న్ అధికారం కోల్పోయినట్టు అంచ‌నా క‌డ‌తారు..  అయినా స‌రే జ‌గ‌న్ అండ్ కోకి ఇంకా బుద్ధి రావ‌డం లేద‌ని అంటున్నారు. అప్ప‌ట్లో తాము ప్ర‌వేశ పెట్టిన ఈ బీ- సైన్యాన్ని అడ్డు పెట్టుకునే.. ఇప్పుడు వి త‌ర‌చూ వాదాల‌ు రాజుకునేలా చేస్తున్నారట‌. ఈ విష‌యం ఎక్క‌డ బ‌య‌ట ప‌డుతుందోన‌ని.. భార‌త‌మ్మ అదే ప‌నిగా త‌మ ఇంట్లోనే తిరుమ‌ల సెట్ వేయించార‌నీ చెబుతారు.   లేకుంటే ఎవ‌రో ఒక భ‌క్తుడు డౌన్ డౌన్ అంటూ అరిచాడే అనుకుందాం. అత‌డి ఆలోచ‌న ఏంటంటే త‌న‌కు త్వ‌ర‌గా దైవ ద‌ర్శ‌నం ల‌భిస్తుంద‌నే భావిద్దాం... బేసిగ్గా వెంక‌న్న‌లాంటి దేవ‌దేవుడి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌పుడు.. అంతా ఆయ‌న మీదే భార‌మేసి.. ఆయ‌న ఎప్పుడు క‌నిపిస్తే అప్పుడు త‌న మొక్కులు చెల్లించుకుని రావ‌ల్సి ఉంటుంది.  గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్ల‌లో ఉన్న‌పుడు అనాల్సింది టీటీడీ చైర్మ‌న్ డౌన్ డౌన్ అని కాదు. గోవిందా గోవిందా అని. అప్పుడే పాప ప్ర‌క్షాళ‌న జ‌రిగేది. కంపార్ట్ మెంట్ల‌లో ఉన్న‌పుడు మ‌న‌కున్న స‌మ‌స్త రేడియేష‌న్ రోగాలు పోతాయ్. కార‌ణం మొబైల్ ఫోన్లు ఎప్పుడైతే బ‌య‌ట ప‌డేస్తామో,  అప్పుడు వాటి తాలూకూ ప్ర‌కంప‌న‌లు, ప్ర‌భావాల నుంచి దూర‌మ‌వుతాం. అది మ‌న శారీర‌క మాన‌సిక స్థితిగతుల‌కు ఎంతో మేలు చేస్తుంది. కాకినాడ‌కు చెందిన అచ్చారావ్ అనే ఆ భ‌క్తుడు  చేసిందే ఒక త‌ప్ప‌యితే.. దాన్ని వీడియో తీసిన వాడికి ఎంత భ‌యం లేక పోవాలి?  స‌రే ఇప్పుడున్న జ‌మానాలో సెల్ ఫోన్లు కామ‌నే కాద‌న‌డం లేదు. కానీ వెంక‌న్న లాంటి  మ‌హిమాన్విత దేవుడి విష‌యంలో న‌మ్మ‌కం వారిని ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌కుండా ఆపేస్తుంది. అలా కూడా ఒకరు న‌మ్మ‌కాన్ని అతిక్ర‌మించి బ‌య‌ట‌కొచ్చేలా చేశారంటే దాన‌ర్ధ‌మేంటంటే వెంక‌న్న అంటే భ‌యం లేద‌ని. భక్తి లేదని. ఇలాంటి వారు అయితే పొలిటిక‌ల్ బ్యాగ్రౌండ్ కి చెందిన వారు, లేదంటే అన్య‌మ‌త‌స్తులే అయి ఉంటార‌ని అంచనా వేస్తున్నారు శ్రీవారి భ‌క్తులు. 

ఇల్లు అలకగానే పండగ కాదు

క‌డ‌పలో మ‌హానాడు తో జ‌గ‌న్ పై అన్నీ సాధించేసిన‌ట్టేనా? ఆల్ హ్యాపీస్ అంటూ ఇంట్లో బ‌జ్జుంటే…. ప్రత్యర్థులకు ప్రాణం పోసినట్టే బాబు భక్తులూ ఒకసారి వెనుదిరిగి చూడండి.. కూట‌మి ప్ర‌భుత్వం గెలిచిన కొత్త‌ల్లో ప్ర‌స్తుత స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు ఒక మాట అన్న విష‌యం గుర్తుందా?  జ‌గ‌న్ ఇంకా బ‌తికే ఉన్నాడ‌ని.. నిజానికి ఇక్క‌డెవ‌రికీ జ‌గ‌న్ చావాల‌న్న‌ది కాన్సెప్ట్ కాదు. ఇవాళ జ‌గ‌న్.. అంత‌క‌న్నా ముందు వైయ‌స్ఆర్ ఆ త‌ర్వాత‌ కేసీఆర్ ఇలా.. వ‌రుస‌గా ప్ర‌త్య‌ర్ధులు మారుతుంటారు. రేపు మ‌రొక‌రు కూడా వ‌స్తూనే ఉంటారు.  ఏదో సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్ లా గెల‌వ‌డం అంటే ప్ర‌త్య‌ర్ధి మ‌ర‌ణం కాదు.. ఆ ఇజాన్ని చంప‌డం. విల‌నిజాన్ని అంతం చేయండం. ఈ విష‌యంలో మ‌న‌మెంత దూరం వ‌చ్చాం? నాలుగు పంచ్ డైలాగులు కొట్ట‌గానే స‌రిపోదు. జ‌గ‌న్ తాను అధికారంలోకి రాగానే ఎన్నో డైలాగులు కొట్టారు. సిద్ధం స‌భ‌ల‌తో ద‌ద్ద‌రిల్లేలా చేశారు. త‌ర్వాత ఏమైంది? మొత్తం తారు మారైంది. స‌రిగ్గా ఇక్క‌డే మ‌నం వ్యూహం ర‌చించాల్సి ఉంది. జ‌గ‌న్ కి వ‌చ్చింది ప‌ద‌కొండు సీట్లే కాబ‌ట్టి అత‌డి ఖేల్ ఖ‌తం అన్న భావ‌న‌లో ఉండ‌టం పూర్తిగా త‌ప్పు. ఆ సీట్ల వెన‌క 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌ట్టు ఇదే జ‌గ‌న్ జ‌ర్మ‌నీలో ఉండి ఉంటే.. ప్ర‌తిప‌క్ష నేత అయ్యి ఉండేవాడు. అది కూడా అత్యంత లాంఛ‌నంగా.. ఘ‌నంగా! నిజాలు మాట్లాడుకుందాం. జ‌గ‌న్ త‌ల్లీ చెల్లి వెళ్లిపోయారు. ఇక అత‌డు ఒంట‌రి. రేప‌టి రోజు జైలుకు కూడా పంపించేస్తాం. ఆయ‌న వెన‌క విజ‌యసాయిరెడ్డి కూడా లేడు. మోడీ నుంచి కోర్టుల వ‌ర‌కూ మొత్తం వ్య‌వ‌హారం న‌డ‌ప‌డానికి.. సాయిరెడ్డి సాయం కూడా కోల్పోయాడ‌ని అనుకూల మీడియాలు రాసే విషాద గాథ‌ల మాయ‌లో ప‌డిపోకండి(అది జ‌న్మ జ‌న్మ‌ల జైలానుబంధం)  లైట్ తీసుకోవ‌డం కూడా చేటు తెచ్చేదే.  ఎందుకంటే అది మ‌రో వ్యూహం కావ‌చ్చు. అటు నుంచి న‌రుక్కు రావ‌డం అన్న‌దొక‌టి ఇందులో దాగి ఉండొచ్చు.  ఏమో ఇప్ప‌టి దాకా మో,షాలు జ‌గ‌న్ని జైలుకు పంప‌కుండా ఉన్నారంటే అర్ధ‌మేంటి? షా ఇక్క‌డికి వ‌చ్చినపుడు జ‌గ‌న్ గురించి వాక‌బు చేసిన విష‌యం మ‌ర‌చి పోయారా?  ఆయనను అడ్డు పెట్టుకుని ఆటాడ్డానికి ఇంకా ఎన్నో ఛాన్సులుండొచ్చు.  ఎందుకంటే జ‌గ‌న్ ని  జైలుకు పంప‌డం అంటే అదేమంత‌ జోక్ కాదు.  లోకేష్ మోడీ ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. మొత్తం మేనేజ్ చేశారు. ఇక జ‌గ‌న్ ప‌ని క్లోజ్ అనుకోడానికి అస్స‌లు వీల్లేదు. కార‌ణం ఏంటంటారా? ఇదే జ‌గ‌న్ తండ్రి వైయ‌స్ త‌న క‌థ ముగిసిపోయింద‌ని ఫీలైన‌పుడు అస‌లు క‌థ మొద‌లు పెట్టారు. చంద్ర‌బాబు ముందు మ‌న‌మిక ఏమీ సాధించ‌లేమయ్యా! అంటూ త‌న ఆత్మ కేవీపీతో  అన్న మాట‌ల‌ను మ‌ర‌చి పోయారా ఏంటి? ఆ త‌ర్వాత చిన్నారెడ్డిని కెలికి.. తెలంగాణ అనే భూస్థాపిత‌మైన అంశాన్ని తిరిగి నిద్ర లేపి.. దాని ద్వారా  చంద్ర‌బాబుకు చెక్ పెట్టాల‌నుకోవ‌డంతో పాటు.. 2004 ఎన్నిక‌ల్లోనూ గెలిచేశారు. ఆ టైంలో చంద్ర‌బాబు అలిపిరి బ్లాస్టింగ్ జ‌రిగింది కూడా. ఆ సానుభూతి ప‌ని చేయాలి.. కానీ అలా జ‌ర‌గ‌లేదు. పాద‌యాత్ర సైతం చేసి ఎలాగోలా వైయ‌స్ ఆనాడు అధికారంలోకి వ‌చ్చారో  చూశారుగా.  మరి జగన్… ప్ర‌త్యేక హోదా అనే డెడ్ లైన్  పాలి.. ట్రిక్స్ బ‌య‌ట‌కు లాగి.. దాని  ద్వారా.. ఏకంగా టీడీపీని ఎన్డీయేలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేశారు. ఆ పై లోక్ స‌భ‌లో అవిశ్వాసం పెట్టి.. దానికి అధికార పార్టీ ద్వారా ఓటు వేయించిన ఘ‌నుడు జగన్. చ‌రిత్ర‌లో ఒక అధికార పార్టీ, ప్ర‌తిప‌క్ష పార్టీ పెట్టిన అవిశ్వాసానికి ఓటు వేయ‌డం అదే తొలిసారి. త‌ర్వాత ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. అంతా ముగిసిపోయింద‌ని జ‌గ‌న్ లాంటి నేత‌ను అంత తేలిగ్గా న‌మ్మ‌డానికి లేదు. ఎందుకంటే, ఆ బ్ల‌డ్ లోనే  తిరిగి కోలుకోవ‌డం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ప్ర‌తి బొట్టులోంచి పుట్టుకొచ్చే మ‌హిషాసురుడ్ని హ‌త‌మార్చిందేమోగానీ టీడీపీ దాని కూట‌మి పార్టీలు ఆ స్థాయిలో జ‌గ‌న్ రాజ‌కీయ ప‌త‌నాన్నేమీ శాసించ‌లేదు.  ఇంకా జ‌గ‌న్ త‌న టెక్నిక్స్ తాను వాడుతూనే ఉన్నారు. అందులో భాగంగా విజ‌య‌సాయిని తెలివిగా అటు వైపున‌కు పంపారు. చాలా మంది సాయిరెడ్డి కూడా లేరు అని ఓ ఫీలై పోతున్నారుగానీ.. ఆయ‌న నిజంగా ఆలాగే ఉన్నారా? ఒక లీడ‌ర్ పార్టీని వ‌దిలిన‌పుడు ఆయన హావ భావ విన్యాసాలు ఎలా ఉండేవి?  చూడ‌లేదా మీరెప్పుడూ.. అదే విజ‌య‌సాయి తాను పార్టీని వ‌దిలిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ జగన్ పై అదే సాఫ్ట్ కార్న‌ర్ చూపుతున్నారు. గ‌మ‌నించారా?  సాయిరెడ్డి ఇంకా జ‌గ‌న్ కి సాయం చేసే మూడ్ క‌మ్ మోడ్ లోనే ఉన్నారు. అందుకే పార్టీ వ‌దిలి వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న తిట్ల‌లో ఏమంత ఫ్ర‌స్టేష‌న్ లేదు. అంతా వ్యూహాత్మ‌కంగానే ఉంది. గమనించారా? ఒక్కోసారి ఆట‌గాడు.. జ‌ట్టులో ఉండాల్సిన అవ‌స‌రం కూడా లేదు. నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గానూ వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చు. ఎవ‌రు చెప్ప‌గ‌ల‌రు?  సాయిరెడ్డి సాయం అదృశ్య‌మైన‌ది కావ‌చ్చేమో.  2019లో విజ‌య‌సాయి ఆడియో కాల్ వ‌ల్లే ఆ పార్టీ గ‌ట్టెక్కింద‌ని గుర్తులేదా?  రేప‌టి రోజున బ‌య‌ట ఉండి ఇలాంటి సాయం చేయ‌రని ఎలా అనుకోగ‌లం.. ఎన్నో అవ‌కాశాలున్నాయ్.  ఇవాళ జ‌గ‌న్ తాను పార్టీ  న‌డ‌ప‌డానికి సైతం డ‌బ్బుల్లేవంటూ బీద‌రుపులు అర‌వ‌డం.. అద్దె కూడా క‌ట్ట‌లేనంటూ పార్టీ ఆఫీస్ మార్చేయ‌డం.. ఇలా చేస్తున్న‌దంతా నాట‌కం కాద‌ని ఎలా చెప్ప‌గ‌లం?  ఏమో ఏయే అవ‌స‌రాలు తీర్చ‌డానికి ఈ రాజ‌కీయాల్లో ఎవ‌రు- ఏ వైపునుంచి- ఎలా కాపు కాచి ఉన్నారో ఊహించ‌లేం కూడా ఒక్కోసారి.   ఒక రోజుకు జ‌గ‌న్.. శాండ్- వైన్- మైన్ అంటూ రోజుకు వెయ్యి(1000) కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేశారని అంటారు ఆ కాంపౌండ్లో కొన్ని క‌ళ్లారా  చూసిన‌- గుంటూరు చార్టెడ్ అకౌంటెంట్లు. కేసిరెడ్డి ద్వారా జ‌గ‌న్ చేయించింది.. నాట్ ఓన్లీ మ‌ద్యం కుంభ‌కోణం... హ‌వాలా వ్య‌వ‌హారం కూడా.  కోటి పంపి ఎన‌భై ల‌క్ష‌లు తిరిగి వ‌చ్చేలా ఒక నెట్ వ‌ర్క్ న‌డిపారంటే.. ఊహించుకోవ‌చ్చు.. ఇది ఎంత పెద్ద స్కెచ్చో. రియ‌ల్ ఎస్టేట్, న‌గ‌ల దుకాణాలు, అడ్వ‌ర్టైజింగ్ ఏజెన్సీలు, సినిమా ఇలా అన్ని మార్గాల ద్వారా ఈ సొమ్ము ఎవ‌రికి చేరిందో తెలిసిందే.  జ‌గ‌న్ ఇప్పుడు మిథున్ రెడ్డికి ఏం సంబంధం అన‌గానే ఆనాడు అందుకున్న క‌ట్ట‌ల పాములు ఊరుకుంటాయా ఏంటి? వాటి తాలుకూ  క‌స్సు బుస్సులు అడ‌వుల‌ను కూడా కొనేసేంత భారీ  స్థాయిలో.. బ‌య‌ట ప‌డుతూనే ఉంటాయ్.  అందుకే బాబు క‌డ‌ప  మ‌హానాడులో అన్న‌ది.. ప‌హల్గాం ఉగ్ర‌వాదుల‌క‌న్నా ఈ ఆర్ధిక ఉగ్ర‌వాదులు మ‌హా డేంజ‌ర‌ని. తల్లి సాయం లేదు, చెల్లి సాయం అంత‌క‌న్నా లేదు.. అనుకోడానికే వీల్లేదు. బావ అనిల్ కూడా స‌పోర్ట్ ఇవ్వ‌లేద‌ని జ‌స్ట్ లైట్ తీస్కోడానికి అంత‌క‌న్నా లేదు. ఆనాడు కేఏ పాల్ క్రిష్టియ‌న్ సంఘాల‌ను పోగేసి.. త‌ద్వారా అతి పెద్ద క్రైస్త‌వ శ‌క్తిగా ఎదుగుతున్నారని తెలిసి.. అనిల్ అనే ఒక బ్రాహ్మ‌ణ  క్రిష్టియ‌న్ని తెచ్చి.. త‌ద్వారా ఇక్క‌డ త‌న కుటుంబంలో అంటు క‌ట్టి.. ఇప్పుడా బావ‌ను అతి పెద్ద క్రిష్టిన్ గా ఎదిగాక‌.. ఆయనకు మాత్రం ఒక విజ‌య‌సాయికి ఉన్న‌ట్టు లోలోన ఓ కృత‌జ్ఞ‌తాభావం ఉండ‌క పోతుందా ఏంటి? అయిపోయింద‌నుకున్న చోట నుంచి పుట్టేదేన‌మ్మా రాజ‌కీయం. ఇది వెయ్యి త‌ల‌ల రాకాసి. అందునా రాజారెడ్డి మ‌న‌వ‌డు కూడా. ఒక‌ప్పుడు త‌న‌దైన ఫాక్ష‌నిజంతో ఒక కాపు మైనింగ్ య‌జ‌మానికి ర‌క్ష‌ణ‌గా  నిలుస్తాన‌ని మాట ఇచ్చి.. ఆ త‌ర్వాత ఆ మైన్ కే ఓన‌రైనోడి మ‌న‌వ‌డు. ఇలాంటి జుజుబీలు ఎన్ని చూసుంటారు? ఏం క‌థ‌! ఇప్పుడు జ‌గ‌న్ ని కానీ ఆయనలాంటి నాయ‌క‌త్వాన్ని కానీ ఈ భూమ్మీద లేకుండా చేయ‌డం ముఖ్యం కాదు. ఆయన చేసిన విధ్వంసం.. దాని తాలూకూ ప్ర‌భావం ఎలాంటిది? భ‌విష్య‌త్ లో దాని ద్వారా ఆంధ్రులు కోల్పోయేది ఏంట‌న్న‌ది మాత్ర‌మే మ‌నం ఫోక‌స్ చేయాలి. ఏమో పైకి కూట‌మి ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయ‌ని? అడుగుతూనే లోలోప‌ల ఏ ప్ర‌త్యేక హోదాలాంటి  డెడ్ లైన్ పాలిటిక్స్ కి తెర‌లేపుతున్నారో?  డెడ్ డెత్ అనే ప‌దాలు జగన్ కు క‌లిసి వ‌చ్చిన‌ట్టు మ‌రెవ‌రికీ క‌ల‌సి  రావు కూడా! విలేఖ‌ర్ల‌తో తెలిసీ తెలియ‌క‌ ముచ్చట్లాడుతూ.. ఏ రెడ్ లైన్ పాలిటిక్స్ కి తెర‌లేపుతున్నాడో ఏమో. ఎవ‌రికెరుక? కొన్ని సెటిల్మెంట్ లతో  అన్నీ వాటిక‌వే మాఫీ అయిపోవా??? ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌టున్నాడంటే విజ‌య‌సాయి ఉండ‌టం వ‌ల్లే కాదు.. ఇలాంటి విజ‌యాల‌ను, సాయాల‌ను వంద కొన‌గ‌ల‌డు.. (ఇందాకే అనుకున్నాంగా రోజుకు వెయ్యి కోట్ల‌ని) అలాంటోడ్ని త‌క్కువ అంచ‌నా వేసి... క‌డ‌ప‌లో జ‌రిపిన‌ మ‌హానాడుతో ఈ విజ‌యం సంపూర్ణం అనుకోడానికి అస్స‌లు వీల్లేదు. చిన్న‌పామునైనా ప‌ద్ద క‌ర్ర‌తో కొట్టాలంటారు.. అలాంటిది ఇంకా న‌ల‌భై శాతం ఓట్ షేర్ అనే ప్రాణంతో ఉన్న పామిది.. న‌ల‌భై గురూ 40.. దాన్ని మ‌ర‌చిపోవ‌ద్దు. దేవాన్ష్ తో ఢిల్లీ తాత‌య్య ఎందుకాడుకున్నాడో ఏమో.. ఒక్కోసారి  యురోపియ‌న్ సిగ్న‌ల్స్ వేరుగా ఉంటాయ్. మీకు అతి గౌర‌వం ఇస్తున్నారంటే ఎక్క‌డైనా ఎప్పుడైనా హ్యాండ్ ఇవ్వ‌డానికేనేమో.. ఎవ‌రికి తెలుసు??? కాబ‌ట్టి బాస్ మ‌నం చేయాల్సింది.. జ‌గ‌న్ని అంతం చేయ‌డం కాదు. జ‌నంలో ఉన్న అత‌డి న‌మ్మ‌కాన్ని. ఇంత‌కీ ఏంటా న‌మ్మ‌కం అంటే, ఆ ప‌ల్స్ ప‌ట్టుకోవాలి. దాని ద్వారా మొత్తం సెట్ చేయాలి. విజ‌య‌సాయి కూడా లేడు అని ఓ ఫీలై పోమాకండి. ఆయ‌న చుట్టూ ఉన్న లీడ‌ర్లంతా అయితే జైలు, లేదంటే బెయిలు, మ‌రీ మాట్లాడితే వ‌కీళ్ల‌ని వాడెవ‌డో రాసాడ‌ని రిలాక్స్ అయితే … ఇది రాజ‌కీయం. అందునా.. ఏం చేసైనా.. పై చేయి సాధించాల‌నుకునే రాజారెడ్డి మార్క్ రాజ్యాంగం. రెడ్ బుక్ ని చూసి వాళ్లంతా జ‌డుసుకుంటున్నార‌ని నీకు నువ్వ బిందాస్ అయిపోకు.. అన్న‌ది కొంద‌రు విశ్లేష‌కుల నుంచి కూట‌మినేత‌ల‌కు అందుతోన్న సూచ‌న‌. మ‌రి చూడాలి.. దీన్ని కూట‌మినేత‌లు ఎలా తీసుకుంటారో తేలాల్సి ఉంది.

హస్తం పార్టీలో అంతర్యుద్ధం.. వ్యక్తిగత రాగ ద్వేషాలపై రగులు తున్న నేతలు

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. బీఆర్ఎస్ రెబెల్ స్టార్, కల్వకుట్ల కవిత  చేసిన సంచలన వ్యాఖ్య ఇది.  ఆమె ఏ ఉద్దేశంతో ఆ మాటన్నారో  కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి ఆమె ఈ వ్యాఖ్య చేశారో లేక దేశం మొత్తంలో హస్తం పార్టీ మునిగి పోతున్నదనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్య చేశారో ఏమో కానీ..   పార్టీ పరిస్థితి దేశం అంతటా ఒకేలా ఉందన్న చర్చ కాంగ్రెస్  వర్గాల్లోనే   జరుగుతోంది.  ముఖ్యంగా..  పాకిస్థాన్ మన దేశం పై దశాబ్దాలుగా సాగిస్తున్న ఉగ్రవాద దుశ్చర్యలను శాశ్వతంగా తుదముట్టించేందుకు, ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం,  సైన్యం వ్యూహాత్మకంగా సాగిస్తున్న బహుముఖ యుద్ధం విషయంలో..  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు పార్టీ ప్రతిష్టను దిగజాజరుస్తున్నాయని సీనియర్ నాయకులు అంటున్నారు. అంతే కాదు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ  మొదలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కొందరు ముఖ్య నాయకులు చేస్తున్న పాక్ అనుకూల వ్యాఖ్యలు  పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని అంటున్నారు. ఇదే ధోరణి కొనసాగితే..  రాజకీయంగానూ పార్టీ భారీ మూల్యం చెల్లిచుకోవలసి  వస్తుందని  పార్టీ సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అంతే కాదు..  దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో..  దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి  వ్యక్తిగత రాగ ద్వేషాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే, అందుకు పార్టీ మాత్రమే కాదు.. దేశం కూడా  మూల్యం చెల్లించవలసి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.    దేశంలో పాక్ వ్యతిరేక  సెంటిమెంట్ బలంగా ఉన్న సమయంలో.. రాహుల్ గాంధీ వ్యక్తిగత రాగద్వేషాలకు అనుగుణంగా ప్రదాని మోదీ, భారత సైన్యాన్ని, చివరకు సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకులను అనుమానించడం, అవమానించడం పార్టీకీ,  దేశానికీ మంచింది కాదని సీనియర్ నాయకులు అంటున్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండే  కొదరు కీలక నేతలు  ప్రధాని మోదీకీ, దేశానికీ మధ్య ఉన్న విభజన రేఖను చెరిపేసి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ అనుకూల వైఖరి అవలంబిస్తోందనే తప్పుడు సంకేతలు పంపుతోందని  సీనియర్ నేతలు  అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా.. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ చర్యలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రపంచ దేశాల్లో సాగిస్తున్న ఎంపీల దౌత్య యాత్రలో భాగంగా..    కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్  సహా.. పార్టీలకు అతీతంగా ఎంపిక చేసిన ఎంపీల ప్రతినిధి బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్న సమయంలో, రాహుల్ గాంధీ మొదలు రేవంత్ రెడ్డి వరకు  పాకిస్థాన్ ప్రధాని సహా ప్రపంచ దేశాలన్నీ అంగీకరించిన భారత సైన్యం, భారత ఆయుధ సంపద, మన యుద్ద విమానాల సామర్ధ్యాన్ని ప్రశ్నించడం పార్టీ ప్రతిష్టను పలచన చేస్తోందని హస్తం పార్టీ నేతలు అంటున్నారు.  స్వయంగా పాకిస్థాన్ ప్రధాని తమ సైన్యం కళ్ళు తెరిచే ముందే భారత  వైమానిక దళం  తమ దేశంలోని 11  వైమానిక స్థావరాలను ద్వంస  చేసిందని బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వంటి  ఆయన అనుచరులు  ఇంకా.. పాకిస్థాన్ కూల్చిన యుద్ధవిమానాల లెక్కలు చెప్పాలని డిమాండ్ చేయడం  దేశ  ప్రజల మనో ధైర్యాన్ని దేబ్బతీసే చర్యగా పేర్కొంటున్నారు.  మరో వంక  మన ఎంపీల బృందానికి సారధ్యం వహిస్తున్న శశిథరూర్ పార్టీ  లక్ష్మణరేఖ  దాటారని  కోటరి నేతలు ఆయనపై విరుచుకుపడడం పార్టీ ఇమేజ్ ని తీసిందనే అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఒక్క రాహుల్ గాంధీ ముచ్చట తీర్చేందుకు, దేశం తరపున దౌత్యపర్యటనలో ఉన్న పార్టీ ఎంపీ, శశిథరూర్’ను టార్గెట్ చేస్తూ కొందరు నాయకులు  చేస్తున్న విమర్శలు పార్టీ ప్రతిష్టనే కాదు, దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయని సీనియర్ నేతలు విచారం వ్యక్తపరుస్తున్నారు.   ఈ నేపధ్యంలో.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎంపీ సల్మాన్ ఖుర్షీద్ మరో  బాంబు పేల్చారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని స్వాగతించారు. నిజానికి కాంగ్రెస్ ఆర్టికల్ 370ని రద్దుని వ్యతిరేకించడమే కాదు..  కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దానిని పునరుద్దరిస్తామని ప్రకటించింది. అయితే ఇప్పడు.. ఖుర్షీద్  ఆర్టికల్ రద్దుకు  ఆ రాష్ట్ర ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, ఆ క్రమంలో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 65శాతం మేర పోలింగ్ నమోదయిందని గుర్తు చేశారు. దీంతో రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పాటైందని వివరించారు. ఇండినేషియా పర్యటనలో భాగంగా అక్కడి మేథావులు, విద్యా సంస్థల ప్రతినిధులతో విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలా సీనియర్ నాయకులు ఒకరొకరుగా రాహుల్ బృందం భాషలో లక్ష్మణ రేఖను దాటుతున్నారు. అందుకే కావచ్చును కవిత, కాంగ్రెస్ మునుగుతున్న నావ అన్నారు.నిజమే కావచ్చును.

శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ  శ్రీ వెంగమాంబ  దేవస్థానంలో జూన్ 15వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను   ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్   ఆవిష్కరించారు.   అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూల నుంచీ భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.   భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నట్లు కాకర్ల సరేష్ చెప్పారు.  పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై చర్చించారు.  పారిపారిశుద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.   

మహానాడుకు బాలయ్య గైర్హాజరుపై అనవసర రచ్చ

తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో అట్టహాసంగా జరిగింది. ఎన్టీఆర్ జయంతి వేడుకలు, పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికతో సందడి నెలకొంది. అయితే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మహానాడుకు హాజరు కాలేదు. దీంతో ఆయన ఎందుకు రాలేదనే చర్చ జరుగుతోంది. బాలయ్య రాకపోవడంపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  రాయలసీమ గడ్డపై నిర్వహించిన మహానాడులో పార్టీ నేతలు, కార్యకర్తల సందడి కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు మహానాడుకు హాజరయ్యారు మహానాడు వేదికగా  నిర్వహించిన కార్యక్రమంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు..  ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. చంద్రబాబును పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. చివరి రోజు భారీ బహిరంగసభ నిర్వహించారు. కడప వేదికగా జరుగుతున్న మహానాడులో  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కనిపించలేదు. దీంతో ఆయన ఎందుకు రాలేదనే చర్చ జరుగుతోంది. కడప మహానాడులో నందమూరి వారసులు కనిపించని లోటు స్పష్టంగా కనిపించిందని తెలుగు తమ్ముళ్లు సైతం చర్చించుకుంటున్నారు. తొలిసారిగా కడప జిల్లాలో నిర్వహించిన మహానాడులో బాలకృష్ణ సందడి కనిపించకపోవడం పెద్ద లోటే అంటున్నారు. చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన తొలి మహానాడు గ్రాండ్ సక్సెస్‌ అయింది. దిగ్విజయంగా మహానాడు జరిగితే బాలయ్య ఎక్కడ అని ప్రాంగణంలో టీడీపీ శ్రేణులు వెతుక్కోవడం కనిపించింది. ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా కొనసాగుతున్న బాలయ్య హిందూపురంలో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఎన్టీఆర్‌కి వారసులుగా హరికృష్ణ, బాలయ్య రాజకీయాల్లో ఉన్నారు. ఆ నందమూరి వారసులు  ఇద్దరూ దాదాపు ప్రతి మహానాడులో పాల్గొన్నారు. హరికృష్ణ మరణించిన తర్వాత బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో యాక్టివ్‌ రోల్ పోషిస్తున్నారు. ఇక హరికృష్ణ తనయులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు ఎప్పటి నుంచో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీ నిర్వహించే మహానాడు పార్టీ శ్రేణులకు పెద్ద పండుగలాంటిది. మూడురోజులపాటు పండగలా నిర్వహించే కార్యక్రమంలో బాలకృష్ణలో ఎప్పుడు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఉండేవారు.  ఎన్టీఆర్ కి కుమారుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి వియ్యంకుడిగా లోకేష్‌కి మామగా ఉన్న బాలయ్య అంతటి ప్రాధాన్యత కలిగిన మహానాడుకు హాజరు కాకపోవడం టీడీపీ వర్గాలను తీవ్రంగా నిరాశపరిచిందంట. అంతే కాదు బాలయ్య హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. దాంతో బాలయ్య ఎక్కడ ఉన్నారు ఏమి చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఆయన విదేశాలలో షూటింగ్ నిమిత్తం ఉండడంవల్లే మహానాడుకు హాజరుకాలేదు.  బాలయ్య అఖండ 2 మూవీ షూటింగ్‌ కోసం జార్జియా వెళ్లారని.. అక్కడ బిజీ షెడ్యూల్ కారణంగానే మహానాడుకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. ముందుగా ఫిక్స్‌ అయిన షెడ్యూల్‌ కారణంగానే బాలకృష్ణ సినిమా షూట్‌లో పాల్గొనాల్సి వచ్చిందనేది సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. విదేశాల్లో షూటింగ్‌ పనుల వల్లనే మహానాడుకు దూరం ఉండాల్సి వచ్చింది తప్ప...  వేరే కారణాలు లేవని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో అఖండ 2 : తాండవం మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కారణంగా బాలయ్య బిజీగా ఉన్నారంట. సమయం దొరికినప్పుడు హిందూపురం నియోజకవర్గానికి వెళుతున్నారు. అంతేకాదు నందమూరి బాలకృష్ణకు ఇటీవల పద్మభూషణ్ అవార్డు వచ్చింది.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అనంతరం హిందూపురంలో భారీ పౌర సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఆ తర్వాత బాలయ్య మూవీ షూటింగ్ కోసం జార్జియా వెళ్లారు. అక్కడ షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా మహానాడుకు రాలేకపోయారు.  దీనిపై వైసీపీ నేతలు అనవరంగా రచ్చ చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటం, వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శనివారం (మే 31) ఉదయం శ్రీవారి దర్శనం కోసం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం  71 వేల 721 మంది దర్శించుకున్నారు. వారిలో 36 వేల 11 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 47 లక్షల రూపాయలు వచ్చింది.  ఇలా ఉండగా శుక్రవారం అర్ధరాత్రి సమయంలో శ్రీవారి సర్వదర్శనం కోసం క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులు సౌకర్యాలు కరవయ్యాయంటూ ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు రావాలి, భక్తులకు సౌకర్యాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి భక్తల వద్దకు వచ్చి వారి సమస్యలు అడిగి తెలుసుకుని నచ్చ చెప్పి వారడిగిన సౌకర్యాలు కల్పించారు. విపరీతమైన రద్దీ, గంటల తరబడి క్యూలో నిలుచోవలసి రావడంతోనే భక్తులలో అసహనం పెరిగి ఆందోళనకు దిగారు. 

ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు

  నైరుతి రుతుపవన ప్రభావంతో ఏపీలో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొన్నాది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. వివరాల్లోకి వెళితే, ముఖ్యంగా శనివారం నాడు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో కూడా ఇలాంటి వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అడపాదడపా వర్షపు జల్లులు కురిసే పరిస్థితులు కొనసాగుతాయని తెలుస్తోంది. ఈ మార్పుతో వాతావరణం కొంత చల్లబడే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.రెండు రోజులపాటు భారీ వర్షాలతోపాటు.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

హైదరాబాద్‌లో రూ.150 కోట్ల భారీ మోసం

  హైదరాబాద్ శివారు జీడిమెట్లలో మరో భారీ మోసం వెలుగు చూసింది. స్టాక్‌మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఓ సంస్థ రూ.150 కోట్ల కుచ్చు టోపీ పెట్టింది. ది పెంగ్విన్ సెక్యూరిటీస్' అనే పేరుతో కొందరు మోసగాళ్లు ఒక సంస్థను ఏర్పాటు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే మంచి రాబడి వస్తుందని ఆకర్షణీయమైన పథకాలతో ప్రచారం చేసి రూ. లక్షకు రూ. లక్ష లాభం ఇస్తామని ప్రజలను నమ్మించారు.  వీరి మాయమాటలు నమ్మిన సుమారు 1,500 మంది అమాయకులు తమ కష్టార్జితాన్ని ఈ సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు. ఈ విధంగా మదుపర్ల నుంచి దాదాపు రూ.150 కోట్ల వరకు నిధులు సేకరించారు. వీరిని నమ్మి రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు బాండ్ల రూపంలో 1,500 మంది ఈ సంస్ధలో పెట్టుబడులు పెట్టారు. మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పెద్ద ఎత్తున శుక్రవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బీఆర్ఎస్ ప‌దేండ్ల‌లో రూ. 3.5 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు : కేటీఆర్

  తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్   ప‌దేండ్ల‌లో 8 వేల‌కు పైగా అనుమ‌తులు, రూ. 3.5 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. లండన్‌లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఐటీ కంపెనీలను తీసుకొచ్చి 10 లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌గా నిలిచింద‌ని కేటీఆర్ తెలిపారు. హైద‌రాబాద్‌లో టాప్ 5 మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీల అతిపెద్ద క్యాంప‌స్‌లు నెల‌కొల్పాయి.  టీఎస్ ఐపాస్‌తో సెల్ఫ్ స‌ర్టిఫికేష‌న్ విధానం ప్ర‌వేశ‌పెట్టామని కేటీఆర్ పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్‌తో సెల్ఫ్ స‌ర్టిఫికేష‌న్ విధానం ప్ర‌వేశ‌పెట్టామని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి విప్లవాత్మ‌క విధానం లేదు. ప‌దేండ్ల‌లో 8 వేల‌కు పైగా అనుమ‌తులు, రూ. 3.5 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి. తెలంగాణకు ఐటీ కంపెనీలు తీసుకువచ్చి 10 లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాము. మినిమ‌మ్ గ‌వ‌ర్న‌మెంట్‌.. మ్యాగ్జిమ‌మ్ గ‌వర్నెన్స్ మా విధానం. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టండి. తెలంగాణ‌లో ప్ర‌తి ఇంటికి సుర‌క్షిత మంచినీరు అందించామ‌ని ఆయన తెలిపారు.

దేశంలోనే బెస్ట్ సిటీగా అమరావతిని నిర్మిస్తాం : సీఎం చంద్రబాబు

  దేవుడు నాకు మరో నగర నిర్మాణం చేసే అవకాశం ఇచ్చాడని. అమరావతిని దేశంలోనే ఒక బెస్ట్ సిటీగా ప్లాన్ చేస్తున్నామని  ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలు,  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. మీ సిఐఐని మొదటి నుంచి నేను ప్రోత్సహించాను, మీ తరుపున మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేయాలని కోరుతున్నాని చంద్రబాబు తెలిపారు .1995లో దావోస్ వెళ్తున్నా అంటే, అప్పట్లో నన్ను వెళ్లొద్దు అనే వారు. పారిశ్రామికవేత్తలతో భేటీలు అయితే, ఓట్లు పోతాయని బెదిరించే వారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని.. సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని  సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చేశాయన్నారు. 1990లోనే ఇంటర్‌నెట్‌ విప్లవం వచ్చిందని గుర్తుచేశారు. దావోస్‌లో ఏటా పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుందని తెలిపారు. భారత్‌కు మోదీ నాయకత్వం ప్రధాన బలమని కొనియాడారు.  చైనా ఆర్థిక వ్యవస్థ భారత్‌కు నాలుగున్నర రెట్లు.. అమెరికా ఆర్థిక వ్యవస్థ భారత్‌ కంటే ఏడు రెట్లు ఎక్కువ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు హైదరాబాద్‌ బ్రౌన్‌ ఫీల్డ్‌ సిటీ.. అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీ అని అభివర్ణించారు. ఐటీ పరిశ్రమల వల్లే హైదరాబాద్‌కు లబ్ధి జరిగిందని తెలిపారు. 2047 విజన్‌ లక్ష్యంగా భారత్‌ సాగుతోందని చెప్పారు. సాంకేతిక విప్లవంలో చాలా మార్పులు వచ్చాయని ముఖ్యమంత్రి అన్నారు . ఏపీలో 15 శాతం వృద్ధి రేటు తన లక్ష్యమని అన్నారు.  అమరావతిలో దేశంలోనే తొలిసారి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. విశాఖపట్నానికి టీసీఎస్, గూగుల్‌, మిట్టల్‌ పరిశ్రమలు వచ్చాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు 

ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారు : టీపీసీసీ చీఫ్

  మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారని  టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల తర్వాత హరీష్ రావు,  ఈటెల సమావేశమయ్యారని, ఈ భేటీలో ఈ భేటీ లో కేసీఆర్ తో ఈటెల ఫోన్ లో మాట్లాడారంటూ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఈటెల బీజేపీలో ఉన్నారా? బీఆర్‌ఎస్‌లో ఉన్నారా అని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాన్ని  ఎమ్మెల్సీ కవిత బహిర్గతం చేశారని ఆయన అన్నారు.  దోస్తీకి అడ్డుగా ఉన్నందుకే బండి సంజయ్‌ను బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుంచి తొలిగించారని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు  భయపడే భారత్.. మధ్యలో యుద్ధాన్ని ఆపేశారాని మహేష్ గౌడ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై యుద్ధానికి దిగిన భారత్.. మధ్యలో యుద్ధాన్ని ఆపడానికి కారణాన్ని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సమాధనం చెప్పాలని ఆయన తెలిపారు. యుద్ధం అంటే ఇంధిరా గాంధీ గుర్తుకు వస్తారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇంధిరా గాంధీ హాయాంలో జరిగాయి... కానీ ఎప్పుడూ రాజకీయం చేయలేదు’ అని పీసీసీ చీఫ్ వెల్లడించారు.  

తెలంగాణ కేబినెట్ విస్తరణ... మరో వాయిదా?

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది.   తాజాగా మరో మారు రేవంత్ కేబినెట్ విస్తరణ అంశం తెరమీదకు వచ్చినట్లే వచ్చి మళ్లీ తెర వెనక్కు వెళ్లింది.  రేవంత్ సర్కార్ కొలువుదీరి ఏడాదిన్నర కావస్తోంది. ఈ ఏడాదిన్నరగా మంత్రివర్గ విస్తరణ అందని ద్రాక్ష పుల్లన అన్న చందాన ఆశావహుల్లో నిరాశ నింపుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 లోగా మంత్రివర్గ విస్తరణ ఖాయమంటూ పార్టీ అధిష్ఠానం నుంచి  స్పష్టమైన సంకేతాలు వచ్చాయి.  పనిలో పనిగా పీసీపీ, కార్పొరేషన్ పదవుల భర్తీ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ముఖ్యమంత్రికి హస్తిన పిలుపు కూడా వచ్చింది. అయితే అంతలో ఏమైందో ఏమో కానీ.. మళ్లీ ముహూర్తం ముడిపడలేదనీ, ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణకు అవకాశం లేదనీ హస్తిన వర్గాలు అంటున్నాయి.  గతంలో గవర్నర్‌తో మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు కూడా ఖరారు అయి అర్ధాంతరంగా రద్దైప సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దాదాపు అంతదాకా వచ్చి విస్తరణ ముహూర్తం వాయిదా పడటంతో అసలేం జరుగుతోంది? అధిష్ఠానం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ విషయంలో ఆశావహులను ఊరించి ఉసూరుమనిపిస్తోంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ మధ్య మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిగాయి. ఇందు కోసం దాదాపు మూడు రోజుల పాటు సీఎం హస్తినలోనే మకాం వేశారు కూడా. అయినా కూడా చర్చలు ఒక కొలిక్కి రాలేదు. ఈ నెల 30న మరో సారి చర్చలు జరుపుదాం రండి అని అధిష్ఠానం సీఎంకు చెప్పింది. దీంతో ఆయన శుక్రవారం (జూన్ 30) హస్తిన పర్యటనకు రెడీ అయిపోయారు కూడా. అయితే.. చావు కబురు చల్లగా అన్నట్లు హైకమాండ్ ఇప్పుడు కాదు తరువాత చూద్దాం అంటూ సమాచారం పంపడంతో రేవంత్ రెడ్డి తన హస్తిన పర్యటనను వాయిదా వేసుకున్నారు. దీంతో రాష్ట్ర కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా పడిందని స్పష్టమైంది. అదే విధంగా పీసీసీ కార్యవర్గం విషయంలో కూడా అధిష్ఠానం ఒక నిర్ణయానికి రాలేదని అంటున్నారు. ముఖ్యంగా మంతివర్గ విస్తరణలో ఎస్పీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నది హైక మాండ్ యోచనగా చెబుతున్నారు.   ఇక ఇప్పుడు మరో చర్చ తెరపైకి వచ్చింది. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల తరువాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, మంత్రిపదవుల ఆశతో నేతలు పార్టీ విజయం కోసం కష్టపడి పని చేస్తారని అధిష్ఠానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.    

కశ్మీర్ పూంచ్ బాధితులకు అమిత్ షా పరామర్శ

  కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూంచ్ జిల్లాను సందర్శించి పాకిస్తాన్ దాడుల బారినపడిన బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. బాధిత కుటుంబాల్లోని యువకులకు అమిత్ షా ఉద్యోగ నియామక పత్రాలను  అందించారు. దాడుల సమయంలో పూంచ్ పౌరులు, అధికారులు చూపిన ధైర్యం, జమ్ముకశ్మీర్ ప్రజల దేశభక్తి దేశానికి మరింత బలాన్నిచ్చాయని అమిత్‌ షా పేర్కొన్నారు. మనం చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌తో పాక్‌లో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయిని షా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.  కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించారు. ‘మతపరమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని, పాకిస్తాన్ దాడులకు తెగబడుతోందని ఆయన పేర్కొన్నారు. ఇది పిరికితనంతో కూడిన చర్య. పాక్‌ దాడులలో పలువురు భారత పౌరులు గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి, ఉద్యోగ  అవకాశాలు కల్పిస్తోంది. వారికి సంఘీభావం ప్రకటిస్తోంది’ అని హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.పూంచ్ పౌరులు, అధికారులు చూపించిన సాహసం, దేశభక్తి యవద్దేశానికి స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు.  పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పిరికిపందల చర్య అని, ఏ ఒక్క ఉగ్రవాద చర్యను ఉపేక్షించరాదన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధాన నిర్ణయమని చెప్పారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని, ప్రజలు బలంగా కోరుకోవడం, ప్రధానమంత్రి నిర్ణయాత్మక నాయకత్వం, విలువైన ఇంటెలిజెన్స్ సమాచారం, భారత సాయుధ బలగాల అసమాన ప్రతిభ వల్లే అత్యంత భీకర దాడులు జరపగలిగామని అమిత్‌షా అన్నారు. వందలాది మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామని, తమపై దాడులు జరిపినట్టు పాక్ చెప్పుకుంటున్నప్పటికీ మన మిలటరీ కేవలం టెర్రరిస్టు శిబిరాలనే టార్గెట్ చేసిందని వివరించారు. ఒక్క ఇండియన్ ఆర్మీ పోస్ట్ కూడా దెబ్బతినలేదని, పాకిస్థాన్ పౌరులెవరికీ నష్టం జరగలేదని చెప్పారు. టెర్రరిస్టు శిబిరాలను మాత్రమే ధ్వంసం చేశామని  అమిత్ షా  తెలిపారు.  

ఢిల్లీలో సీఎం చంద్రబాబును కలిసిన మంద కృష్ణ

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఢిల్లీలో కలిశారు. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అవార్డును అందుకున్న మందకృష్ణ  సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణను ముఖ్యమంత్రి అభినందించారు. వర్గీకరణ ఉద్యమ ప్రస్థానాన్ని గురించి ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. సామాజిక న్యాయం కోసం మందకృష్ణ మాదిగ చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రస్తావించారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ఉద్యమంలోని కీలక ఘట్టాలను, ఎదురైన సవాళ్లను, గత అనుభవాలను వారు గుర్తు చేసుకున్నారు. వర్గీకరణ సాధన కోసం జరిగిన పోరాటాలు, ఆనాటి పరిస్థితులపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు.

తిరుమల భద్రంగా లేదా.. మరింత అలర్ట్ గా ఉండాలన్న డీజీపీ ఆదేశాల అర్దం అదేనా?

తిరుమల తిరుపతి భద్రతకు ముప్పు పొంచి ఉందా? అన్న ప్రశ్నకు పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్న హరీష్ కుమార్ గుప్తా.. దర్శనానంతరం తిరమల భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు, టీటీడీ ఈవో జే.శ్యామలరావు, సీవీఎస్ వో తదితరులతో ఆయన నిర్వహించిన సమావేశంలో తిరుమల భద్రత విషయంలో మరింత అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులనను దృష్టిలో పెట్టుకుని తిరుమలలో భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు.  భక్తుల రక్షణ, ఆలయ భద్రత విషయంలో   స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని ఆదేశించారు.   తిరుమల  హై సెక్యూరిటీ జోన్ లో ఉంది. ఐదంచెల భద్రతా వ్యవస్థ 224 గంటలూ అప్రమత్తంగా ఉంటుంది.  రిజర్వు బెటాలియన్, ఏపీఎస్పీదళాలు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ , ఆ తరువాత ఎలాంటి పరిస్థితిని అయినా సరే ధీటుగా ఎదుర్కొని, క్షణాల్లో అదుపుచేసే శక్తిసామర్థ్యాలు ఉన్న అక్టోపస్ దళాలు ఎల్లవేళలా తిరుమలలో సిద్ధంగా ఉంటాయి. అయినా కూడా భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలంటూ డీజీపీ హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుమలలో భద్రత విషయంలో సమావేశంలో తిరుపతి   టీటీడీ ఇన్ చార్జ్  సీవీఎస్ ఓ హర్షవర్ధన్ రాజు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తిరుమల భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై ఆయన డీజీపీకి వివరించారు.   

పెద్దల సభకు భారతీయుడు !

  రాజకీయ, సినిమా రంగాల సంబంధ బాంధవ్యాల గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా తమిళనాడులో రాజకీయ, సినిమా రంగాలు పాలు నీళ్ళలా కలిసి పోయాయి. తమిళ రాజకీయాలు అనగానే తెరఫై కొచ్చే, మాజీ ముఖ్యమంత్రులు ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత మొదలు ద్రవిడ పార్టీల ముఖ్య నాయకులు చాలావరకు, సిల్వర్ స్క్రీన్’ తో ఓ వెలుగు వెలిగినవారో, వెలుగుతున్నవారో అవుతారు. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి, డిఎంకే అధినేత స్టాలిన్’ రాజకీయ స్టేజిపైనే కానీ, సిల్వర్ స్క్రీన్ పై నటించిన అనుభవం ఉండకపోవచ్చును.  కానీ,ఆయన తండ్రి మాజీ ముఖ్యమత్రి కరుణానిధి,కుమారుడు,ఉప ముఖ్యమంత్రి ఉదయ నిధి స్టాలిన్ ఇద్దరూ, వెండి తెర వెలుగులే... ముఖ్యమంత్రి  స్టాలిన్’ కు కూడా సినిమా రంగంతో డైరెక్ట్ లింక్స్ లేక పోవచ్చేమో కానీ, పరోక్ష బంధాలు లేకుండా ఉండవు. అదలా ఉంటే, ఇప్పడు తమిళనాడు నుంఛి మరో ప్రముఖ నటుడు,రాజకీయ చిత్రం ‘భారతీయుడు’ సినిమా ఫ్రేమ్’  కమల్ హసన్’ అధికార డిఎంకే మద్దతుతో రాజ్యసభలో అడుగుపెడుతున్నారు. కమల హసన్’ తమిళ సినిమా ద్వారా బాల నటుడిగా పరిచయం అయినా, ఆ తర్వాత  తెలుగు’, హిందీ, కనడ భాషలు సహా అనేక భాషా చిత్రాల్లో నటించారు. బహు బాషా నటుడిగా గుర్తింపు, గౌరవం పొందారు. పురస్కారాలు అందుకున్నారు.కమల్ హసన్ వ్యక్తిగత జీవితంలో కొన్ని మచ్చలు, మరకలు ఉన్నా, సినిమా నటుడిగా మాత్రం ఆయన అద్భుత ప్రతిభను చూపారు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ హసన్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు అందుకున్నారు. 2014లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.ఇక కమల్ హసన్ రాజకీయాల విషయానికి వస్తే, 2018లో అనూహ్యంగా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. నిజానికి, ఆ సమయంలో మరో ప్రముఖ తమిళ హీరో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్న ముమ్మర ప్రచారం జరుగతున్న సమయంలో ఆయన ఎందుకో వెనక్కు తగ్గారు. ఆ సమయంలో కమల్ హసన్’ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి నుంచి వామ పక్ష భావాలున్న వ్యక్తిగా, కూడా కమల్ హాసన్’  అదే అదే ఐడియాలజీతో సొంత పార్టీని తెరపైకి తెచ్చారు. రాష్ట్ర రాజకీయాలలోనే కాదు, జాతీయ రాజకీయాలలో మార్పు కోసం, ‘మార్పే’ లక్ష్యంగా., మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీని స్థాపించారు. అయితే,పార్టీ పెట్టినప్పటి నుంచి పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ ఎంఎన్ఎం పోటీచేసింది. పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ ఓడిపోయింది. కనీసం, ఓ చిన్న గెలుపు కూడా దక్కలేదు. హిట్’ అన్నదే లేకుండా ప్రతి ఎన్నికల్లోనూ హీరో పార్టీ జీరోగా మిగిలింది.  చివరకు, అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆశయంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హసన్’ స్వయంగా కోయంబత్తూరు సౌత్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. అయితే అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఆయన పరాజయం చవిచూశారు. అక్కడితో ఆయనకు, సినిమా, రాజకీయం ఒకటి కాదనే తత్త్వం బోధపడింది. ఇక చేసేది లేక చివరకు 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు  ఇండియా కూటమిలో చేరారు. ఎన్నికలలో పోటీ  చేయలేదు కానీ, డిఎంకేకు మద్దతు ఇచ్చారు. డిఎంకే అభ్యర్ధుల తరపున ప్రచారం చేశారు.అందుకు పారితోషికంగా కాదంటే ప్రతిఫలంగా ఆయన్ని రాజ్య సభకు పంపేందుకు అధికార డీఎంకే పార్టీ నిర్ణయించింది.తమిళనాడులో జులై 2025లో ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ సీట్లలో నాలుగు డీఎంకే కూటమికి, రెండు అన్నాడీఎంకే కూటమికి దక్కే అవకాశం ఉంది. డీఎంకే తమ నాలుగు సీట్లలో ఒకదాన్ని కమల్ హాసన్‌కు కేటాయించింది. సో.. చివరాఖరుకు చట్ట సభలో కాలు పెట్టాలన్న భారతీయుడదు, కమల హసన్ కల,ఈ విధంగా నెరవేరుతోంది.  రాజ్యసభ ఎన్నికలు జూన్ 19, జరగనున్నాయి.నామినేషన్ల ప్రక్రియ జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. అదలా ఉంటే, ఈ మధ్యనే రాజకీయ అరంగేట్రం చేసిన మరో తమిళ హీరో, టీవీకే పార్టీ విజయన్’కు బీజేపీ వల విసిరింది. డిఎంకే అవినీతి పాలనను అంతమొందిచడమే ఇరు పార్టీల లక్ష్యం కాబట్టి,విజయన్ ఎన్డీఎలో చేరాలని, తమిళనాడు బీజేపే అధ్యక్షుడు, నయినార్‌ నాగేంద్రన్‌ .. విజయన్ను  ఆహ్వానించారు. హీరోగారూ అవినీతి డిఎంకే పార్టీని ఓడిద్దాం,మా కూటమిలోకి రండి,, అంటూ బహిరంగ ఆహ్వానం పలికారు. అయితే, విజయన్ పార్టీ పెట్టింది మొదలు, బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. సో .. ఇప్పడు ఆయన తమ స్టాండ్ మార్చుకుని బీజేపీతో జట్టు కడతారా? ఎన్డీఎ కూటమిలో చేరతారా? అనేది తేలవలసి వుంది. కాగా, విజయన్’ను ఎన్డీఎ కుతమిలోకి తెచ్చేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్’తో పాటుగా, తెలుగు దేశం పార్టీతో సంనిహతంగా ఉండే మరి కొందరు సినిమా ప్రముఖులు ప్రయత్నాలు చేస్తునట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌ని కలవాలని చాలా ప్రయత్నించాను..కలవలేకపోయాను : ఎమ్మెల్సీ కవిత

  పెద్దపల్లి జిల్లా మంచిర్యాల పర్యటనలో మరోసారి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు సొంత అజెండా ఏమీ లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దన్నదే నా వాదన అని ఆమె అన్నారు. కమలం పార్టీతో పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని కవిత పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధినేత  కేసీఆర్‌ని కలవాలని చాలా ప్రయత్నించాను  కలిసే అవకాశం వచ్చింది.. కానీ, కలవలేకపోయాను అని ఆమె అన్నారు. తాను రాసిన లేఖ ఎలా బహిర్గతమైందో, దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. "నాకంటూ ప్రత్యేక జెండా గానీ, అజెండా గానీ లేవు. బీఆర్ఎస్ నా పార్టీ, కేసీఆరే నా నాయకుడు" అని కవిత మరోసారి తేల్చిచెప్పారు. పార్టీని కాపాడుకోవడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరెవరి నాయకత్వాన్ని తాను అంగీకరించే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు.  బీజేపీతో పొత్తుల అంశంపైనా కవిత ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వైపు చూడకూడదని...  బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామంటే అస్సలు ఒప్పుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు. గులాబీ పార్టీలో నెలకొన్న సమస్యలు, పుట్టుకొస్తున్న కోవర్టుల గురించే తాను కేసీఆర్‌కు లేఖ రాశానని, ఇందులో తప్పేముందని ఆమె ప్రశ్నించారు. ముందు నా మీద దృష్టి తగ్గించి, ముందు ఆఉత్తరాన్ని లీక్ చేసిన వారిని పట్టుకోండి అని పార్టీ అధిష్ఠానానికి ఆమె హితవు పలికారు. ఆపరేషన్ కగార్‌ను ఆపాలని కోరిన బీజేపీ ప్రభుత్వం మారణకాండ కొనసాగించిందని కవిత అన్నారు. అంతిమ సంస్కారాల కోసం మవోయిస్టు నంబాల మృతదేహాన్ని కుటుంబానికి ఇవ్వాలన్న కనీస సంస్కారం లేని పార్టీ బీజేపీ అని ఆమె ధ్వజమెత్తారు.  

పాక్ లోయ‌ధేచ్చ‌గా తిరుగుతున్న ప‌హల్గాం ఉగ్రదాడి సూత్ర‌ధారి!

అది పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్. అక్క‌డ పీఎంఎంఎల్ అంటే పాకిస్తాన్ మ‌ర్క‌జీ ముస్లిం లీగ్ అనే ఒక రాజ‌కీయ పార్టీ ర్యాలీ నిర్వ‌హిస్తే అందులో ఒక‌డు క‌నిపించాడు. ఈ మ‌ధ్య అంటే, మే 28న అత‌డిని అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ముద్ర వేసింది ఐక్య  రాజ్య‌స‌మితి. అందుకు అత‌డ‌న్న మాట నేనిపుడు వ‌ర‌ల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాను అని. ఇంత‌కీ అత‌డు చేసిన ఘ‌న‌కార్యం ఏంట‌ని చూస్తే ప‌హెల్గాం దాడి ద్వారా 26 మంది భార‌తీయుల‌ ప్రాణాలు పోయేలా చేయ‌డం. (వీరిలో అత్య‌ధికులు హిందు పురుషులు) అతడి పేరు సైఫుల్లా కసూరి. ఇత‌డి వ్యూహ‌ర‌చ‌న కార‌ణంగా భార‌త్- పాక్ రెండు దేశాల మ‌ధ్య యుద్ధం వ‌చ్చి.. భారీ ఎత్తున ప్రాణ  న‌ష్టం ఆస్తి న‌ష్టం జ‌రిగింది. అకార‌ణంగా కొంద‌రు చ‌నిపోయారు. ఒక స‌మ‌యంలో కిరానా కొండ‌ల్లోని పాక్ అణు నిల్వ‌లు కానీ లీక్ అయి ఉంటే, ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. పాకిస్థానే ప్ర‌పంచ చిత్ర‌ప‌టంలో లేకుండా  పోయేది.. కానీ ఇత‌డికి కించ‌త్ కూడా జాలి- ద‌యా- క‌రుణ లేకుండా విచ్చ‌ల‌విడిగా పాకిస్తాన్ బాహ్య ప్ర‌దేశాల్లో  తిరుగుతూ.. కాల‌ర్ ఎగ‌రేస్తున్నాడు. ఇదే ర్యాలీలో ల‌ష్క‌రే తోయిబా చీఫ్ కొడుకు త‌ల్హా స‌యీద్, మ‌రో యూఎన్ ఉగ్ర‌వాది అమీర్ హంజా కూడా పాల్గొన్నారు.  త‌ల్హా స‌యీద్ అయితే పీఎంఎంఎల్ ద్వారా లాహోర్  నుంచి పార్ల‌మెంటుకు పోటీ చేసి.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టాలని విఫ‌ల‌య‌త్నం చేశాడు. ఎందుక‌నో అది సాధ్యం కాలేదు. ఇత‌డు భార‌త్ కి కావ‌ల్సిన మోస్ట్  వాంటెడ్ టెర్ర‌రిస్టుల్లో 32వ వాడు. ఇత‌డు ఈ ర్యాలీ ద్వారా త‌న తండ్రి హ‌ఫీజ్ స‌యిద్ ని విడిపించాల‌ని డిమాండ్ చేశాడు, భార‌త్ సింధూ జ‌లాల ఒప్పందం ర‌ద్దును పునః స‌మీక్షించాల‌ని కూడా డిమాండ్ చేస్తున్నాడు.  ఇప్ప‌టికే ఈ ఉగ్ర సంస్థ‌కు చిన్న‌పాటి సైన్యం, విశ్వ  విద్యాల‌యం, రాజ‌కీయ పార్టీ ఉన్నాయి. వీటి ద్వారా వీరు భార‌త్ వ్య‌తిరేక‌త నూరి పోసి.. పాక్ ప్ర‌జ‌లను ఆక‌ర్షించి.. పాక్ పార్ల‌మెంటులో అడుగు పెట్టి త‌ద్వారా పాకిస్థాన్ని ఏలాల‌న్న‌ది వీరి ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఈ ఉగ్ర‌మూక‌ల కార‌ణంగా పాకిస్తాన్ నీటి క‌ట‌క‌ట‌ను ఎదుర్కుంటోంది.  మొన్న నీటి కొర‌త కార‌ణంగా సింధ్ ప్ర‌జ‌లు త‌మ‌ హోం మంత్రి ఇంటిని త‌గ‌ల‌బెట్టారు. తాజాగా పాక్ న‌టి హీనా బ‌య‌త్ క‌రాచీ వంటి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టులో నీళ్లు రావ‌డం లేద‌ని ఇన్ స్టా పోస్టు పెట్టింది. దీనంత‌టికీ  కార‌ణం ఎవ‌రు? య‌ధేచ్చ‌గా తిరుగుతున్న ఈ ల‌ష్క‌రే, జైషే ఉగ్ర‌వాదులు కారా? అదేంటో మ‌న భార‌త‌దేశంలో సోష‌ల్ మీడియా గ్రూపులైన ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్స‌ప్, టెలిగ్రామ్ లో ఒక చిన్న షేర్ కొట్టినందుకే మ‌న‌కు వార్నింగులు ఇస్తాయి. అదే పాకిస్తాన్ లో ఈ ప్లాట్స్ ఫామ్స్ మీద నుంచి జైషే అనే ఉగ్ర సంస్థ ఏకంగా ఉగ్ర‌వాద ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది. విరాళాలు కావాలంటూ అభ్య‌ర్ధ‌న‌లు చేస్తోంది. కొత్త ర‌క్తం ఎక్కించ‌డానికి పాక్ యువ‌త‌కు వ‌ల వేస్తోంది. డిజిట‌ల్ ప్లాట్ ఫామ్స్ వేదిక‌గా.. పెద్ద పెద్ద ఉగ్ర‌వాద‌ చానెళ్ల‌ను న‌డిపేస్తోంది. ఇక్క‌డ ఉగ్ర‌వాదం ఎంత బ‌హిర్గ‌త‌మో చెప్పేలా ఏకంగా బాహావ‌ల్పూర్ వీధుల్లో ఆగ‌స్ట్ 25న జిహాదీ క‌విత్వం విన‌డానికి ర‌మ్మంటూ ఆహ్వాన ప‌త్రిక‌ల‌తో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీల్లో మొన్న భార‌త్ దాడుల్లో చ‌నిపోయిన ఉగ్ర‌వాదుల చిత్ర‌ప‌టాలు వేసి మ‌రీ మ‌సూద్ అజ‌ర్ పేరిట పోస్ట‌ర్లు వేసి మ‌రీ పిలుస్తున్నారు. ఇదే మ‌సూద్ అజ‌ర్ కి 14 కోట్ల రూపాయ‌ల నిధులు మంజూరు చేసింది పాకిస్థాన్. ఇతడు ఎంత‌టి భార‌త వ్యతిరేక ఉగ్ర‌వాదో చెప్ప‌న‌ల‌వి కాదు. మ‌న భార‌త భూభాగానికి అనేక సార్లు ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటించిన ఉగ్రవాది. అలాంటి వాడికి నిధులిస్తూ ఆ దేశ ప్ర‌ధాని హెహ‌బాజ్ ష‌రీఫ్ భార‌త్ తో శాంతి చ‌ర్చ‌ల‌కు తాము సిద్ధ‌మేన‌ని పిలుపునిస్తాడు. ఇలాంటి పాకిస్థాన్ కి ఐఎంఎఫ్, వ‌ర‌ల్డ్ బ్యాంకులు సుమారు 25 బిలియ‌న్ డాల‌ర్లు ఇస్తోంది. మ‌రి ఇదే అంత‌ర్జాతీయ సంస్థ అయిన ఐక్య‌రాజ్య‌స‌మితి క‌సూరీ వంటి వారిని ఉగ్ర‌వాద ముద్ర వేయ‌డ‌మేంటి? ఇలాంటి వాళ్ల‌కు పాకిస్థాన్ త‌న‌కొచ్చే ఐఎంఎఫ్ ఇత‌ర నిధుల నుంచి కొంత మొత్తం కేటాయించి వారిని ఎంక‌రేజ్ చేయ‌డమేంటి?  ఉగ్ర‌వాదులు త‌మ దేశంలో ఇంత బాహ‌టంగా తిరుగుతుంటే.. భార‌త్ తో శాంతి చ‌ర్చ‌ల‌కు ఈ దేశం మ‌ళ్లి మ‌ళ్లీ పిల‌వ‌డ‌మేంటి???  ఈ యుద్ధం ఇక్క‌డితో ముగియ‌లేదు. దీనికి ఎక్క‌డో ఒక చోట భార‌త్ ఫుల్ స్టాప్ పెట్టి తీరాల్సిందే. ఈ దిశ‌గా అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై పాక్ పీచ‌మ‌ణ‌చాల్సిందే. తాజాగా ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ పీవోజేకే(పాక్ ఆక్ర‌మిత జ‌మ్మూ కాశ్మీర్) వారే  తిరిగి భార‌త్ లో క‌లుస్తామ‌ని అడ‌గ‌టానికి ఎన్నో రోజులు లేవ‌ని అంటున్నారు. ఈ దిశ‌గా భార‌త్ పాకిస్థాన్ నుంచి పీవోజేకేని లాగేసుకోవ‌డంతో పాటు బ‌లూచిస్తాన్ కి కూడా స‌పోర్టు చేయాలి. ఇలా పాక్ ఎకో సిస్ట‌మ్ ని దారుణంగా దెబ్బ తీసి ఆ దేశంలో ఉగ్ర‌వాదం  అన‌డానికే ఒణికి చావాలి. భార‌త్ పై ఈ సారి దాడి చేయ‌డానికే సాహ‌సించే య‌త్నం చేయ‌కుండా క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరుకుందాం. జైహింద్!

కమలంలో కారు విలీనం?.. తెర పైకి కొత్త చర్చ!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత మరో సంచలనానికి తెర తీశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగున్నాయని  మీడియా చిట్ చాట్ లో చెప్పారు. నిజానికి మై డియర్ డాడీ  అంటూ కేసేఅర్ కు రాసిన, లేఖలోనూ కవిత, బీజేపీ, బీఆర్ఎస్ సంబంధాలని ప్రస్తావించారు. వరంగల్ రజతోత్సవ సభలో  కేసీఆర్ బీజేపీ పట్ల కొంత మెతక వైఖరి అవలంబించారనే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.  బీజేపీని గట్టిగా తిట్టకపోతే.. బీజేపీ, బీఆర్ఎస్ కలుస్తాయనే తప్పుడుసంకేతాలు ప్రజల్లోకి వెళతాయని అంటూ..  కేసీఆర్ తమ ప్రసంగంలో కేవలం రెండు నిముషాలు మాత్రమే బీజేపీని టార్గెట్ చేయడాన్ని నెగటివ్ పాయింట్స్ లో  చేర్చారు.  ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న  కొత్త చర్చను తెర పైకి తెచ్చారు. అయితే..  కవిత లేఖలో పేర్కొన్న అంశాలలో కొంత నిజం ఉన్నా..  బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ఎలా చూసిన అయ్యే పని కాదని పరిశీలకులు అంటున్నారు. నిజానికి  కేసీఆర్ బీఆర్ఎస్ ను బీజేపీలోనే కాదు, కాంగ్రెస్ సహా మరే పార్టీలోనూ విలీనం చేయరని..  ఒక్క ఏన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ అస్తిత్వాన్ని చంపుకునే తప్పు కేసీఆర్ చేయరని ఆయన సన్నిహితులు అంటున్నారు.  నిజానికి.. గతంలో ఉద్యమ సమయంలోనూ కేసీఆర్  తెలంగాణ సాధించుకునే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్  ముందు విలీనం ప్రతిపాదనను ఉంచారని..  ఒక పావుగా మాత్రమే విలీనం ప్రతిపాదన  చేశారని  కేసీఆర్ మాజీ మిత్రులు అంటున్నారు.  అయితే..  బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలను మాత్రం కొట్టి వేయలేమని మాజీ మిత్రులతోపాటుగా,  ప్రస్తుత పరిణామాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. నిజానికి..  ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల పొత్తు ఉభయ తారకంగా రెండు పార్టీలకూ లాభ దాయకంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులతో పాటుగా  ఉభయ పార్టీలలో ఒక వర్గం గట్టిగా భావిస్తోంది. అయితే..  అదే సమయంలో రెండు పార్టీలలోనూ కూడా పొత్తు వద్దనే వాదన కూడ అంతే బలంగా వినిపిస్తోందని అంటున్నారు.    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలను, ఉభయ పార్టీల ఓటు షేర్ లో వస్తున్న మార్పును గమనిస్తే..  బీఆర్ఎస్, బీజేపీ ఓటు పరస్పరం బదిలీ అవుతున్న వైనం కనిపిస్తుందని  విశ్లేషకులు అంటున్నారు.  ఉదాహరణకు 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. బీజేపీకి వచ్చిన ఓటు షేర్  జస్ట్ 7 శాతం. అసెంబ్లీలో కమలానికి దక్కింది ఒక్కటే సీటు..  కానీ, ఆతర్వాత కొద్ది నెలలకే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు షేర్  ఏకంగా 20 శాతానికి పెరిగింది. ఆ మేరకు బీఆర్ఎస్ ఓటు షేర్ తగ్గింది.  అలాగే..  2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14 శాతం ఓట్లు 8 సీట్లు వచ్చాయి.  కానీ.. 2024లోక్ సభ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి బీజేపీ ఓటు షేర్ ఏకంగా 35 శాతానికి చేరింది.  అసెంబ్లీ స్థానాలతో సమానంగా  8 లోక్ సభ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. మరోవంక అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓటు షేర్ సొంతం చేసుకున్న బీఆర్ఎస్ ఓటు షేర్ లోక్ సభ ఎన్నికల్లో  17 శాతానికి పడిపోయింది. అంటే, అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసిన ఓటర్లలో 20 శాతం మంది లోక్ సభ ఎన్నికల్లో కమలానికి ఓటు వేశారు. ఇక్కడ గమనించవలసిన మరో ముఖ్య విషయం ఏమిటంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు షేర్ లో మార్పు అంతగా లేదు.  అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం ఓటుతో 65 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, అదే 40 శాతం ఓటుతో లోక్ సభ ఎన్నికలలో 8 సీట్లు తెచ్చుకుంది. సో.. కళ్ళ ముందున్న ఓటు షేర్ లెక్కలు.  ఓటు ట్రాన్స్ఫర్  ప్యాట్రన్  ను గమనిస్తే..  బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉభయతారకంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అంతే కాకుండా, జాతీయ పార్టీగా బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో గెలుపు, కేంద్రంలో అధికారం కీలకం. అదే విధంగా ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్  కు అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు, రాష్టంలో అధికారం కీలకం అవుతుంది. సో.. పొత్తుకు ఉభయ పార్టీలు ఒకే చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.  అయితే.. నడుస్తున్న చరిత్రను గమనిస్తే, గడచిన పాతికేళ్ళ ప్రస్థానంలో బీఆర్ఎస్  కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు సహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది. కానీ, బీజేపీతో మాత్రం ఏనాడూ పొత్తు పెట్టుకోలేదు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాల లేదు. మరో వంక   కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. కేంద్రంలో, రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాలలో కలిసి పనిచేసింది. ఉభయ పార్టీలూ చెట్టపట్టాల వేసుకుని పనిచేయడమే కాదు, ఎమ్మెల్యేలను ఇచ్చిపుచ్చుకోవడాల విషయంలో కూడా రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని, బీఆర్ఎస్ తో పొత్తు వద్దకునే బీజేపీ నాయకులు చరిత్రను తిరగేస్తున్నారు. అలాగే, కమలంతో పొత్తు వద్దనుకునే  బీఆర్ఎస్ నాయకులు, డీఎన్ఎలు కలవని బీజేపీతో పొత్తు వలన దీర్ఘ కాలంలో ప్రమాదమే  పేస్ చేయవలసి ఉంటుందని అంటున్నారు.  సో .. కవిత చెప్పిన విలీనం ఉండక పోవచ్చిని, అయితే గియితే కారు కమలం మధ్య తొలి  ‘పొత్తు’ పొడిచే అవకాశం లేక పోలేదని అంటున్నారు.