ఆ పదం వింటే వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగు దేశం పార్టీనే : పవన్ కళ్యాణ్
posted on May 27, 2025 @ 8:19PM
మహానాడు ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగు దేశం పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయిందని జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కడపలో ప్రారంభమైన మహానాడుకు తన తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏటా జరిగే మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై... కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మంత్రి నారా లోకేష్‌కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
చంద్రబాబు నాయకత్వములో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న పల్లా శ్రీనివాస్ బక్కని నరసింహులు శుభాభినందనలు.ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే పరమావధిగా జరుగుతున్న ఈ మూడు రోజుల వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. కార్యకర్తే అధినేత, యువ గళం, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయం. పసుపు వర్ణంతో ముస్తాబైన మహానాడు ప్రాంగణం శోభాయమానంగా కనువిందు చేస్తోంది. ఈ వేడుక విజయవంతంగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని అంటూ జనసేని తన ప్రకటనలో పేర్కొన్నారు.