తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ పెట్టిన ముహూర్తబలం గొప్పది.. నారా లోకేష్
posted on May 27, 2025 @ 12:28PM
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ముహూర్త బలం చాలా గొప్పదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. తెలుగుదేశం మహానాడు ఈ రోజు ప్రారంభం అయిన సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం వేదికగా కార్యకర్తలు, నాయకులకు ఆహ్వానం పలికారు.
ఆ ట్వీట్ కు ఓ వీడియో కూడా షేర్ చేశారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన ముహూర్త బలం గొప్పదన్న ఆయన, పార్టీకి కార్యకర్తలే బలం, బలగం అని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు చుట్టుమట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పోరాడే తెలుగుదేశం కార్యకర్తలే తనకు నిత్యస్ఫూర్తి అని పేర్కొన్న నారా లోకేష్ పసుపు పండగ మహానాడుకు అందరికీ ఘన స్వాగతం పలికారు.