మైనార్టీల‌కు అండ‌గా వుంటా.. సిఎం జ‌గ‌న్ భ‌రోసా

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో చ‌ర్చించి తీర్మానం
క్యాంప్ కార్యాల‌యంలో జ‌రిగిన మైనార్టీ నేత‌లు, ముస్లిం మ‌త పెద్ద‌ల‌తో సి.ఎం. భేటీ.

జాతీయ జనాభా పట్టికలో(ఎన్పీఆర్‌) ప్రతిపాదించబడ్డ కొన్ని ప్రశ్నలు రాష్ట్రంలోని మైనారిటీల్లో అభద్రతా భావాన్ని కలుగజేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఎన్పీఆర్‌పై మైనారిటీల్లో నెలకొన్న ఆందోళనకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో స్పందించారు.

ఎన్పీఆర్‌ అంశంపై తమ పార్టీలో విస్తృతమైన చర్చ జరిపామని పేర్కొన్నారు. ఎన్పీఆర్‌కు సంబంధించి 2010లోని నిబంధనలనే ఇప్పుడు కూడా పాటించాలని కేంద్రాన్ని కోరాతామని అన్నారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని వెల్లడించారు.

NPR, NRC కు సంబంధించిన అంశాలపై ప్రజా ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌ" ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డితో తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో చర్చించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ SB. అంజాద్ భాష మీడియాతో మాట్లాడారు.

Teluguone gnews banner