బువ్వ తినే పైసలతో బ్రాందీ, విస్కీ తాగేస్తుండు!
గరీబోనికి సర్కారికిచ్చిన 1500 రూపాయిలు మందు తాగనీకే ఖర్చయిపోయే. గిప్పుడు రాక్షస పాలనలో ఫార్మ్హౌస్ ముఖ్యమంత్రి 5 దినాల్లో 600 కోట్ల రూపాయిల మందు తాపించి, ఇంట్లో ఆడోళ్ళ, చిన్నపిల్లల బతుకులు కూలుస్తుండు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతోంది.
మందు పేరుతో సామాజిక దూరం పోయి వైరస్ కు జనాలు బలైతే, తాగొచ్చి ఆడోళ్లను, పిల్లలలను కొడుతుంటే, బువ్వ తినే పైసలతో బ్రాందీ, విస్కీ తాగేస్తుంటే, ఆ పాపం, ఏడుపు తగిలి నీ సర్కారు త్వరలో నాశనమౌతదని మహిళలు శాపాలు పెడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి అన్ని రుగ్మతలకు కారణం మద్యం కాబట్టి దీన్ని దశలవారీగా నియంత్రణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. మద్యం షాపులకు సంబంధించిన సమాచారాన్ని టి.కాంగ్రెస్ ఆర్టీఐ ద్వారా సేకరించింది.
తెలంగాణాలో ఎన్ని బెల్టు షాపులు ఉన్నాయి అని అడగగా ఏమీ లేవు అని సర్కార్ సమాధానం ఇచ్చింది. అయితే ఎన్ని ఇల్లీగల్ కేసులు బుక్ అయ్యాయని అడగగా 22 జిల్లాల వారిగా 17952 కేసులు నమోదయ్యాయి అత్యధికంగా వికారాబాద్ జిల్లా కింద పరిగి ఎస్ హెచ్ ఓ కింద 8233 కేసులు నమోదయ్యాయి మహబూబ్ నగర్ జిల్లా 1022 జగిత్యాల కింద 783, రంగారెడ్డి కింద 784 గు వనపర్తి 492, సంగారెడ్డి 889, కరీంనగర్ 722, సిద్దిపేట్ 419 ,మహబూబాబాద్ 354 ,జనగాం 511 ,వరంగల్ 481, సికింద్రాబాద్ 153, మెదక్ 462, నిజామాబాద్ 217, కొత్తగూడెం 496, మేడ్చల్ 280, పెద్దపల్లి 1024 నమోదయ్యాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఎనిమిది కోట్ల 50 లక్షల జనాభా ఉన్న 23 జిల్లాల్లో లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం ఆర్టీఐ ద్వారా వచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి.
2008 నుంచి 2009 వరకు 4888.18, కోట్లు
2009 నుంచి 2010 వరకు 5595.07 కోట్లు
2010 నుంచి 2011 వరకు 6512 కోట్లు
2011 నుండి 2012 వరకు 7275 కోట్లు
2012 నుంచి 2013 వరకు 8575 కోట్లు
2013 నుంచి 2014 వరకు 9890 కోట్ల 63 లక్షలు అంటే లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం 26 శాతం.
తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుండి 2019 వరకు అంటే 3 కోట్ల 75 లక్షల జనాభా ఉన్న ఉమ్మడి పది జిల్లాల ఆర్టీఐ ద్వారా పొందిన ఆదాయ వివరాలు ఇలా వున్నాయి.
2014 నుంచి 2015 వరకు 10,853 కోట్లు
2015 నుంచి 2016 వరకు 12,706 కోట్లు,
2016 నుంచి 2017 వరకు 14,184 కోట్లు
2017 నుంచి 2018 వరకు 17,597 కోట్లు
2018 నుంచి 2019 వరకు 20,859 కోట్లు అంటే లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం 65 శాతం ఆదాయం పెరిగింది.
2019 ఏప్రిల్ అనగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో 1884 కోట్ల యాభై ఐదు లక్షల అమ్మకాలు జరిగినట్లుగా నమోదయింది.
2019 డిసెంబర్ 30 31 రెండు రోజుల ఆదాయం 450 కోట్లు గత సంవత్సరం డిసెంబర్ 30, 31 అమ్మకాలతో పోల్చితే నాలుగు శాతం ఎక్కువ..
ఉదాహరణకి పంజాబ్ రాష్ట్రాన్ని తీసుకుంటే 2017-18 లో లిక్కర్ మీది ఆదాయం 5,136 కోట్లు, 2018 నుంచి 2019 లో 5,450 కోట్లు నమోదయింది. అంటే 10 నుంచి 12 శాతం పెరిగినట్లు తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం వసతి లిక్కర్ నమ్మకమే అన్నట్లు 65 శాతానికి పెంచిన ఘనత ఈ రాష్ట్రం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో లో ఏ పాలసీ అయినా ఆలస్యం కావచ్చేమో కానీ లిక్కర్ పాలసీ మాత్రం ఒక రోజు కూడా అటు ఇటు కాలే దీన్నిబట్టి ఇ రాష్ట్ర ప్రజల పైన ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతుంది.
మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తూ రాష్ట్రంలో నేర ప్రవృత్తి పెరిగేందుకు కారణం అవుతుంది. రహదారులకు 500మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు నెలకొల్పాల్సి ఉండగా...రహదారికి 100 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలను నెలకొల్పేందుకు అనుమతులు ఇవ్వడం ప్రభుత్వ భాద్యతరహిత్యాన్నికి నిదర్శనంగా చెప్పొచ్చు.
దిశ ఘటన జరిగాక అయిన ప్రభుత్వం మద్య నియంత్రణ కు చర్యలు తీసుకుంటుందని ఊహించాం కానీ సర్కారు ఆదిశగా ఏమాత్రం కృషి చేయడం లేదు.అత్యాచారాలు నిత్యం జరుగుతుండటానికి గల ప్రధాన కారణమైన లిక్కర్ ను ప్రభుత్వం అదుపు చేయకపోవడమే...తక్షణమే ప్రభుత్వం మద్యం నియంత్రణకు దశల వారీగా చర్యలు తీసుకోవాలని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
గుజరాత్ రాష్ట్రంలో మద్యపాన నిషేదం ఉంది.మరి మోడి గారు దీన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయవచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నీరా పాలసి నడవాలన్న బెల్టు షాపులు బందు కావలి. అరోగ్య వంతమైన తెలంగాణ గా తీర్చి దిద్దలంటె మద్యాని నియంత్రించ వలసిన బాధ్యత ప్రభుత్వనిదే. లేనిచో ఈ మహిళా లోకాన్ని చైతన్య పరిచి ఉద్యమించడానికి తెలంగాణా పిసిసి యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటోంది.