కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం

  జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో  భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 32 బొమ్మల దుకాణాల సామగ్రి కాలి బూడిదైంది. . వ్యాపారులకు కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు తెలుస్తోంది. రాత్రి 11 గంటల సమయంలో అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు విస్తరించిన బొమ్మల దుకాణాల్లో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.  సమీపంలో జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతర కోసం వ్యాపారులు పెద్ద మొత్తంలో బొమ్మలను నిల్వ ఉంచడంతో, ఒక్కో దుకాణంలో రూ.8 నుండి రూ.10 లక్షల వరకు సరుకు ఉన్నట్టు సమాచారం.ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి.  దాదాపు 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకొని సామగ్రి కాలి బూడిదైంది.  తమ కళ్ల ముందు సర్వస్వం నష్టం కావడంతో వ్యాపారులు తీవ్ర వేదనతో విలపించారు. ఆ ప్రాంతం అంతా విషాద వాతావరణం నెలకొంది.మల్యాల, ధర్మపురి సీఐలు రవి, రాం నర్సింహారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ వల్లనే మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  

మావోయిస్టు కీలక నేతలు అనంత్, చైతు సహా 20 మంది లొంగుబాటు

నక్సల్స్ సీనియర్ నాయకుడు   చైతుతోసహా   పది మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.   వీరందరి తలపై కలిపి మొత్తం రూ.65 లక్షల రివార్డు ఉంది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు వారంతట వారే  జగదల్‌పూర్‌లోని సీనియర్ పోలీస్, సెంట్రల్ రిజర్వు పోలీస్, అధికారుల ముందు లొంగిపోయారని ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్‌రాజ్ పట్టిలింగం వెల్లడించారు. మావోయిస్టుల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చైతు అలియాస్ శ్యామ్ దాదా(63) లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమానికి తేరు కోలేని దెబ్బగా పోలీసు అధికారులు చెబుతున్నారు.  తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన చైతు అసలు పేరు గిరడ్డి పవనానందరెడ్డి. 1985లో మావోయిస్టుల్లో చేరిన చైతు  తలపై రూ. 25లక్షల రివార్డు ఉంది.   2013 లో జిరామ్ వ్యాలోలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని దాదాపు తుడిచిపెట్టేసిన దాడిలో చైతూ ప్రధాన సూత్రధారి.  చాలా సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీ  దర్భా విభాగానికి నాయకత్వం వహిస్తున్న చైతూ,  ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దులో చురుకుగా ఉన్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్లలో  ఒకడు. లొంగిపోయిన వాళ్లలో డివిజనల్ కమిటీ సభ్యురాలు  సరోజ్ అలియాస్ ఊర్మిళ , ఏరియా కమిటీ సభ్యులు  భూపేశ్ అలియాస్ సహాయక్ రామ్, ప్రకాష్, కమలేష్ అలియాస్ జిత్రు, జనని అలియాస్ రేమతి కశ్యప్, సంతోష్ అలియాస్ సన్ను మరియు నవీన్, పార్టీ సభ్యులు  రాంశీల, జయంతి కశ్యప్ ఉన్నారు.  ఆపరేషన్ కగార్ తో వరుసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లు, ఇటీవలి కాలంలో పార్టీలో అగ్రనేతల వరుస లొంగుబాట్ల నేపథ్యంలో వీరు లొంగిపోయారని  పోలీసు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారం లొంగిపోయిన వారికి పునరావాస ప్రయోజనాలు అందిస్తామన్నారు.  మరో సంఘటనలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్  స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ తన సహచరులతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఐదు రాష్ట్రాల్లో రూ. కోటి రివార్డు ఉన్న అనంత్, మరో 10 మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్రలోని గోండియా జిల్లా దారేక్ష పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయీరు. లొంగుబాటుకు గంటల ముందు ఆయన వచ్చే ఏడాది జనవరి 1న లొంగిపోతామని లేఖ విడుదల చేసిన అనంత్ అంతలోనే లొంగిపోవడం గమనార్హం.  . ఈ ఘటన ఎంఎంసీ జోన్‌లో మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా బలహీనపడిందని చెప్పవచ్చు

15 నెలలు.. 5000 కిలోమీటర్లు.. జగన్ పాదయాత్ర 2.0.. నిజమేనా?

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాభవం అనదగ్గ పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. ఆ తరువాత ఈ 16 నెలల కాలంలోనూ ఇసుమంతైనా కోలుకోలేకపోయింది. పార్టీ క్యాడర్ జారిపోయింది. నేతలు పార్టీ కార్యక్రమాలకు మొహం చాటేస్తున్నారు. గతంలో అంటే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అయిన దానికీ కానిదానికీ నోరెట్టుకు పడిపోయి ఫైర్ బ్రాండ్ నేతల్లా గుర్తింపు పొంది జగన్ మన్ననలు పొందిన నేతలు ఇప్పుడు కలికానిక్కూడా కనిపించడం లేదు. ఇప్పుడు ఇప్పుడు మాజీ మంత్రులుఅంబటి రాంబాబు, పేర్ని నాని వంటి ఇద్దరు అతి కొద్ది మంది  మాత్రమే పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. అప్పుడప్పుడు సజ్జల మీడియా ముందుకు వచ్చి అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసి మళ్లీ  మౌనం వహిస్తున్నారు. అధికారంలో ఉండగా అడ్డగోలుగా వ్యవహరించి అవినీతికి పాల్పడిన పలువురు నేతలు కేసుల భయంతో బిక్కుబిక్కుమంటుండగా, ఇంకొందరు అవినీతి కేసులలో అరెస్టై రిమాండ్ ఖైదీలుగా కటకటాల వెనుక కాలక్షేపం చేస్తున్నారు.  ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికైనా పార్టీ పుంజుకోవాలంటే.. 2019 ఎన్నికలలో తన పార్టీ విజయానికి ప్రధాన కారణంగా ఉన్న పాదయాత్రనే మళ్లీ చేపట్టక తప్పదన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారు. అప్పట్లో జగన్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర కారణంగానే ఆయన నాయకత్వంలో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి రాగలిగింది. జగన్ ముఖ్యమంత్రి కాగలిగారనడంలో సందేహం లేదు. ఇందుకు ప్రధాన కారణం అప్పట్లో పాదయాత్రతో ఆయన జనం మధ్యలో ఉండటమే. అయితే అధికారం చేజిక్కిన తరువాత జగన్ జనం ముఖం చూడటమే అరుదైపోయింది. అధవా ఎప్పుడైనా బయటకు వచ్చినా రోడ్డు కిరువైపులా పరదాలు కట్టించుకుని జనం తనకు కనబడకుండా, జనానికి తాను కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  దీంతో ఆయన జనానికి దూరం అయ్యారు. దీనికి తోడు ఐదేళ్ల పాలనా కాలంలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించడమే కాకుండా.. అంతకు ముందు ఐదేళ్లూ చంద్రబాబు పాలనలో  జరిగిన అభివృద్ధి ఆనవాలును కూడా చెరిపేయాలని ప్రయత్నించడంతో వైసీపీ ఘోర పరాజయాన్ని అందుకుంది. అందుకే 2029 ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడానికి తాను జనంలోకి వెళ్లడమొక్కటే మార్గమని జగన్ భావిస్తున్నారు. అంతే కాకుండా ఈ సారి గతం కంటే ఎక్కువ దూరం నడిచి ఎక్కువ మంది జనాలకు చేరువ కావాలని జగన్ భావిస్తున్నారు.  ఇదే విషయాన్ని జగన్ కు సన్నిహితుడూ, ఒక విధంగా చెప్పాలంటే పార్టీ అధికార ప్రతినిథిగా చెలామణి అవుతున్న  వెంకటరెడ్డి మీడియాకు చెప్పారు. ఈ సారి జగన్ పాదయాత్ర 15 నెలల పాటు సాగుతుందనీ, అలాగే గత రికార్డును బద్దలు కొడుతూ ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా 5వేల కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేస్తారనీ వెల్లడించారు.  అయితే ఇక్కడే పరిశీలకులు గతంలో పాదయాత్ర సందర్భంగా జగన్ నేలవిడిచి సాము చేసిన చందంగా హామీలు గుప్పించారనీ, అయితే అధికారపగ్గాలు చేపట్టిన తరువాత తన అహంకారపూరిత వ్యవహార శైలితో అన్ని వర్గాల ప్రజలనూ దూరం చేసుకున్నారని అంటున్నారు. ఇప్పుడు మరోసారి పాదయాత్ర అంటూ ఆయన జనం ముందుకు వచ్చినంత మాత్రాన జగన్ ను జనం నమ్మే పరిస్థితి ఉండదంటున్నారు. చూడాలి మరి జగన్ ఒక వేళ నిజంగా పాదయాత్రతో జనం ముందుకు వస్తే వారెలా రిసీవ్ చేసుకుంటారో?

కడపలో వైసీపీ కాడెపట్టే నాయకులేరీ?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పార్టీ పరిస్థితి కలవరం కలిగిస్తున్నది. పార్టీ అధినేతగా పార్టీ నేతలను, కార్యకర్తలను పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేలా చేయడంలో ఆయన విఫలమౌతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిస్థితి దయనీయంగా ఉందని అంటున్నారు. ఎప్పుడైనా ఏదో ఓదార్పు యాత్ర అనో, తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటన అనో ఆయన బయటకు వచ్చినప్పుడు వినా.. మరే సందర్భంలోనూ పార్టీ రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. ఇదే పరిస్థితి ఆయన సొంత జిల్లా కడపలోనూ కనిపిస్తోంది.  ఇటీవల జగన్ కడప జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా  జిల్లాలో కీలకంగా వ్యవహరించే పార్టీ నేతలు చాలా వరకూ జగన్ కు చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. అధినేత పర్యటనకే వారు డుమ్మా కొట్టారు. అరటి రైతుల పరామర్శ, వారితో ముఖాముఖీ ఇవన్నీ పక్కన పెడితే.. పార్టీ పరంగా ఆయన కడప పర్యటన అట్టర్ ప్లాప్ అన్న మాట సొంత పార్టీ నేతలు, శ్రేణుల నుంచే వస్తున్నది.  వాస్తవంగా జిల్లాలో  పార్టీ నాయకులు, కార్యక‌ర్త‌లను మోటివేట్ చేసి జిల్లాలో పార్టీ కార్యక్రమాలు జోరుగా సాగేలా పరిస్థితిని చక్కదిద్దాలన్నదే ఆయన పర్యటన ఉద్దేశంగా పార్టీ శ్రేణులు చెప్పాయి. అయితే పార్టీ వ్యవహారాలపై మాట్లాడేందుకు జగన్ పెద్దగా సమయం కేటాయించకపోవడం వారంతా నిరాశపడ్డారని అంటున్నారు.   జిల్లా వైసీపీలో క్యాడర్ పార్టీ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదన్నది వాస్తవం. అలాగే నేతలు కూడా చాలా వరకూ ఇన్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ విషయాన్ని జగనే స్వయంగా పలు సందర్భాలలో  చెప్పడమే కాకుండా వారిని  యాక్టివ్ కావాలని ఆదేశించినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. అయినా కూడా పార్టీ అధినేతగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చేయలేని పరిస్థితులలో జగన్ ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్వయంగా జగనే పార్ట్ టైమ్ పొలిటీషియన్ లెక్కన నెలలో ఎక్కువ రోజులు బెంగళూరు ప్యాలెస్ కే పరిమితం కావడమే ఇందుకు కారణమని అంటున్నారు.   

ఏపీ మంత్రి పిఏపై లైంగిక వేధింపుల ఆరోపణలు... సమగ్రదర్యాప్తునకు సీఎంవో ఆదేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద అనధికార వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్న సతీష్ అనే వ్యక్తిపై లెంగిక వేధింపుల ఆరోపణలు  కలకలం సృష్టించాయి.  ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ ను వెంటనే తొలగించాలని ఆదేశించడంతో పాటు వెంటనే అతడిపై కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది. సతీష్ పై ఒక మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు వాస్తవమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంవో పేర్కొంది.  దీంతో సతీష్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు.   కాగా   మన్యం జిల్లా సాలూరుకు చెందిన ఓ మహిళ, మంత్రి పీఏ సతీష్ తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం సీఎంవో దృష్టికి వెళ్లింది.   ఈ వ్యవహారంలో రెండు వైపులా విచారణ జరపాలని సీఎంవో  సూచించింది. మహిళ చేసిన ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు సమగ్ర విచారణ చేపట్టాలని పేర్కొంది. ఒకవేళ ఆమె ఆరోపణలు అవాస్తవమని విచారణలో తేలితే, ఆమెపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొంది.  ఇలా ఉండగా తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మంత్రి వద్ద పీఏగా పని చేస్తున్న సతీష్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. కుట్రపూరితంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఏనాడూ మంత్రి పేరు చెప్పుకుని లబ్ధి పొందేందుకు ప్రయత్నించలేదన్నారు. విచారణలో నిజానిజాలు నిగ్గుతేలుతాయని సతీష్ పేర్కొన్నారు. 

డబ్బుల కోసమే పైరసీ.. విచారణలో ఐబొమ్మ రవి అంగీకారం!

సైబర్ క్రైమ్ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ శనివారం (నవంంబర్ 29) మూడో రోజుకు చేరుకుంది. తొలి రెండు రోజుల విచారణలో పోలీసులు ఐబొమ్మ రవి నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.   ఎన్జిలా నెట్‌వర్క్, ఆర్థిక లావాదేవీలు, అలాగే రవికి సంబంధాలు ఉన్న అనధికారిక వెబ్‌సైట్ల గురించి పోలీసులు కీలక సమాచారం, ఆధారాలు రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఐపీ మాస్క్ చేసి పనిచేస్తున్న కొన్ని ముఠాలపై కూడా సైబర్ క్రైమ్ అధికారులు ఆధారాలు రాబట్టినట్లు సమాచారం. అదేవిధంగా రవి నిర్వహించినట్లు భావిస్తున్న యాడ్ బుల్ యాప్, గేమింగ్–బెట్టింగ్ యాప్‌ల ద్వారా భారీగా డబ్బు సంపాదించినట్లు కూడా రవి విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది.  తొలి రెండు రోజులలోనూ రవిని  పూర్తిగా   ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు,   బ్యాంకు లావాదేవీలు, నిధుల ట్రాన్సాక్షన్లపై సాగిందంటున్నారు.   కస్టడీ చివరి రోజైన శనివారం (నవంబర్ 29) మరింత లోతుగా విచారించి, సాయంత్రం రవిని నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు.  ఇలా ఉండగా సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి.. తన నేరాలను అంగీకరించినట్లు సమాచారం. కేవలం డబ్బుల కోసమే పైరసీ చేశాననీ, ఇకపై పైరసీ జోలికి పోననీ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.  విదేశీ పౌరసత్వం కారణంగా పైరసీ గుట్టు రట్టైనా, చట్టం నుంచి  తప్పించుకోవచ్చని భావించినట్లు రవి చెప్పాడని తెలుస్తోంది. అలాగే ఆరేళ్లుగా పైరసీ చేస్తున్నా పట్టుబడకపోవడంతో  తన నెట్‌వర్క్‌ను  విస్తరించినట్లు రవీ విచారణలో చెప్పాడని అంటున్నారు.  

కత్తులతో తిరగబడ్డారు.. పోలీసుల కాల్పులు జరిపారు

పెంచలయ్య హత్య కేసు నిందితుల బరితెగింపు గంజాయి మానండంటూ ప్రజలలో చైతన్యం తీసుకురావడం, గంజాయి బ్యాచ్ పై ఫిర్యాదు చేయడం అతడికి శాపంగా మారింది. విచ్చల విడిగా జరుగుతున్న గంజాయి విక్రయాలను అడ్డుకోవడానికి ప్రయత్నించడమే అతని ఉసురు తీసింది. నెల్లూరు హౌసింగ్‌ బోర్డు కాలనీలో శుక్రవారం (నవంబర్ 28) సాయంత్రం దారుణ హత్యకు గురైన పెంచలయ్య నెల్లూరులో గంజాయి విక్రయాలకు వ్యతిరేకంగా గళమెత్తారు. అదే గంజాయి బ్యాచ్ ఆగ్రహానికి కారణమైంది.   9 మంది సభ్యుల గంజాయి బ్యాచ్‌ అతడిని కిరాతకంగా హత్య చేసింది. అయితే గంజాయి బ్యాచ్ బరితెగింపు అక్కడితో ఆగలేదు. హత్య కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొమ్మది మంది సభ్యుల గంజాయి బ్యాచ్ ను గుర్తించి వారిని పట్టుకోవడానికి శుక్రవారం రాత్రి వారు దాక్కుని ఉన్న కోవూరు షుగర్​ ఫ్యాక్టరీకి వెళ్లారు. దీంతో గంజాయి బ్యాచ్ నిందితులు పోలీసులపై తిరగబడ్డారు.   కత్తులతో దాడి చేసి ఒక కానిస్టేబుల్ ను గాయపరిచారు. దీంతో పోలీసులు నిందితులపై జరిపిన కాల్పుల్లో ఒక నిందితుడు గాయపడ్డాడు. మిగిలిన నిందితులు పారిపోయారు.  పారిపోయిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా నిందితుల దాడిలో గాయపడిన కానిస్టేబుల్ ను, పోలీసు కాల్పుల్లో గాయపడిన నిందితుడిని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

బెంగళూరు విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో  భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. దీంతో ఒక్క నవంబర్ నెలలోనే బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడిన ఈ  గంజాయి విలువ 200 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.   తాజాగా బ్యాంకాక్‌ నుండి బేంగళూరుకు  వచ్చిన నలుగురు విదేశీ ప్రయాణీకుల తీరుపై అనుమానంవచ్చిన కస్టమ్స్ అధికారులు వారినిఅదుపులోనికి తీసుకుని విచారించడంతో గంజాయి స్మగ్లింగ్ బయలపడింది. గంజాయి స్మగ్లింగ్ కు వారు అనుసరించిన విధానం పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహా రాన్ని మించి ఉంది. వీరు గంజాయిని ఎనర్జీ డ్రింక్ టిన్నులలో ఎలాంటి అనుమానం కలగనితీరులో ప్యాక్ చేసి తీసుకువచ్చిన తీరు కస్టమ్స్ అధికారులనే విస్మయపరిచింది.  వీరి నుంచి 179 కిలోల విదేశీ గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. తాజాగా అరెస్టైన నలుగురు విదేశీ స్మగ్లర్లలో కలిపి నవంబర్ నెలలో మొత్తం 32 మంది స్మగ్లర్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇదే నెల మొదటివారంలో 94 కోట్ల రూపాయల విలువ చేసే గంజాయిని స్వీధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.  

ఎమ్మిగనూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

కర్నూలు జిల్లాలో శనివారం (నవంబర్ 30) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మృతులు కర్నాటకు చెందిన హోసపల్లికి చెందిన వారిగా గుర్తించారు.  రెండు కార్లూ కూడా మితిమీరిన వేగంతో వెడుతున్నాయని ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రత అధికమైందనీ అంటున్నారు. మృతులలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.   .............

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. విమానంలో క్యాబిన్ లగేజీగా ఇరుముడి

శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులు శబరిమలకు విమాన ప్రయాణంలో తమతో పాటు తమ ఇరుముడిని కూడా క్యాబిన్ లగేజీగా తీసుకువెళ్లడానికి అనుమతి ఇచ్చారు. భక్తుల మనోభావాలను, ఆచారాలను గౌరవిస్తూ పౌరవిమానయాన శాఖ ఈ వెసులుబాటు కల్పిస్తున్నదని ఆయన తెలిపారు. శుక్రవారం నుంచి అమలులోకి వచ్చిన ఈ ప్రత్యేక వెసులు బాటు జనవరి 20 వరకూ అమలులో ఉంటుందని రామ్మోహననాయుడు తెలిపారు.   ఇప్పటి వరకూ అయ్యప్ప స్వాములు విమానంలో తమతో పాటు క్యాబిన్ లగేజీగా తమ ఇరుముడిని తీసుకువెళ్లేందుకు అనుమతి లేదు. అయితే తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయ్యప్ప భక్తులకు అందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.  య్యప్ప స్వాములు శబరిమల దర్శనానికి వెళ్లే సమయంలో తమ ఇరుముడిని తమతో పాటు విమానంలోనే తీసుకెళ్లడం పట్ల ఉన్న   భక్తి భావాన్ని కేంద్ర ప్రభుత్వం గౌరవించి ఈ ప్రత్యేక సడలింపు ఇచ్చిందని పేర్కొన్నారు.   

కల్వకుంట్ల కవిత అరెస్టు

తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. బీసీలకు 42 శాతం డిమాండ్ తో కామారెడ్డిలో రైల్ రోకో చేపట్టిన కవితను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కామారెడ్డి అశోక్ నగర్ రైల్వేగేట్ వద్ద బీసీల రిజర్వేషన్ల డిమాండ్ తో కవిత పట్టాలపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడమే కాకుండా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రైల్ రోకో విరమించాలని కవితను కోరారు. ఆమె వినకపోవడంతో అదుపులోనికి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కవిత స్వల్పంగా గాయపడినట్లు సమాచారం.   కాంగ్రెస్, బీజేపీలు బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకుంటున్నాయని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు పోరాటం ఆగదని కవిత ఈ సందర్భంగా  స్పష్టం చేశారు.   ఈ సందర్భంగా కవిత సహా పలువురు జాగృతి నేతలను అదుపులోనికి తీసుకున్నారు.  

నెల్లూరులో బరితెగించిన గంజాయి బ్యాచ్..నడిరోడ్డుపై దారుణ హత్య

నెల్లూరులో గంజాయి బ్యాచ్ బరితెగించింది.  గంజాయి, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా     ప్రజలను చైతన్య పరుస్తున్న పెంచలయ్యను దారుణంగా హత్య చేసింది. నెల్లూరు  హౌసింగ్‌ బోర్డు కాలనీ సమీపంలో ఈ దారుణం జరిగింది. నెల్లూరులో గంజాయి వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడనీ, తమను అడ్డుకుంటున్నాడనీ కక్షగట్టిన గంజాయి బ్యాచ్ ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పెంచలయ్య అనే వ్యక్తిని నడిరోడ్డుపై కత్తులతో వెంటాడి మరీ హత్య చేసింది.  తన పిల్లలతో కలిసి వస్తున్న పెంచలయ్యను గంజాయి బ్యాచ్ శుక్రవారం (నవంబర్ 29) దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించడమే కాకుండా స్థానికులను భయాందోళనలకు గురి చేసింది.  ముఖానికి నల్లటి ముసుగులు వేసుకుని వచ్చిన 9మంది వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ రాజీనామా

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ నందకుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్ కు పంపారు. కాళోజీ హెల్త్ వర్సిటీలో   జవాబు పత్రాల మూల్యాంకనణలో, ఇన్ చార్జీల నియామకాలలో పెద్ద ఎత్తున   అక్రమాలు జరిగినట్లు ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సోదాలు సైతం చేపట్టారు. అలాగే కాళోజీ హెల్త వర్సిటీ వ్యవహారాలపై   సీఎం రేవంత్ రెడ్డి  పేపర్ల మూల్యాంకనంలో అక్రమాలు, ఇష్టారీతిగా ఇన్‎ఛార్జీల నియామకాలపై  ఆరా తీశారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులను వివరణ కోరారు. వర్శిటీలో ఈ పరిస్థితులకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఇటువంటి చర్యల వెనుక  ఎంతటివారున్నా ఉపేక్షించేది లేదన్నారు. ఈ నేపథ్యంలోనే కాళోజీ వర్సిటీ వీసీ  డాక్టర్ నందకుమార్ తన పదవికి రాజీనామా చేశారు.   

దీక్షా దివస్ పేరిట కేసీఆర్ కొత్త నాటకం.. టీపీసీసీ చీఫ్

దీక్షా దివస్ అంటూ  బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరో కొత్త నాటకానికి తెరతీస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఈ రోజిక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సెంటిమెంట్ ను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్న కేసీఆర్.. ఇప్పుడు మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. వాస్తవానికి ఉద్యమ కాలంలో కేసీఆర్ దీక్ష ఒక నాటకమన్న ఆయన దీక్ష ప్రారంభించిన మూడు రోజులకే ఆయన దీక్షను విరమించారనీ, అయితే విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తీవ్ర ఆగ్రహానికి భయపడి మళ్లీ మొదలెట్టారని గుర్తు చేశారు. అయినా తెలంగాణ రాష్ట్రం తన వల్లే సాధ్యమైందని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారన్న మహేష్ కుమార్ గౌడ్ వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావానికి కాంగ్రెస్, కృషి, విద్యార్థుల పోరాటమే కారణమన్నారు.  

వాయు కాలుష్యంపై పార్లమెంటులో చర్చకు రాహుల్ డిమాండ్

దేశంలోని ప్రధాన నగరాలలో వాయుకాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరడంపై లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నగరాలలో వాయుకాలుష్యంపై పార్లమెంటులో చర్చజరగాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చే నెల మొదటి తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ వేదిరగా  రాహుల్ గాంధీ  ఈ డిమాండ్ చేశారు.   వాయుకాలుష్య సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళికా లేదని దుయ్యబట్టారు.  దేశంలో  పిల్లలు వాయుకాలుష్యంతో  ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ప్రధాని మోడీ మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారని నిలదీశారు. పిల్లల భవిష్యత్, ఆరోగ్యం విషయంలో జవాబు దారీతనం ఉండాలన్న రాహుల్ గాంధీ  వాయుకాలుష్యంపై పార్లమెంటులో  చర్చించి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కఠినమైన, ఆచరణసాధ్యమైన ప్రణాళిక అవసరమని నొక్కి చెప్పారు.    

అవినీతి ‘తోపు’దుర్తి!

ఇటీవ‌ల జ‌గ‌న్ స్పెషల్ చాప‌ర్ వేసుకుని మ‌రీ ఒక పెళ్లికి హాజ‌ర‌య్యారు. రాఫ్తాడులో జ‌రిగిన ఆ పెళ్లి మ‌రెవ‌రిదో కాదు.. తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి సోద‌రుడి కుమార్తెది. ఇంత‌కీ ఈ తోపుదుర్తి ఎవ‌రు? ఆయ‌న నిర్వాక‌మేంటి? గ‌త వైసీపీ పాల‌న‌లో ఈ ప్ర‌కాశుడి అవినీతి ప్ర‌కాశం ఎంత?  అని చూస్తూ ఈ తోపుదుర్తి అవినీతి తోపు అని తెలుస్తోంది.  రాఫ్తాడులో ప‌రిటాల కుటుంబం చేతిలో నాలుగు సార్లు ఓడిపోయిన  తోపుదుర్ది  ప్రకాష్ రెడ్డి, ఈ సారి ఓడిపోతే   త‌న రాజ‌కీయ జీవిత‌మే స‌మాప్తం అవుతుంద‌ంటూ ఇంటింటికీ తిరిగి చెప్పుకుని ఓటర్ల సానుభూతి సంపాదించి 2019 ఎన్నికలలో విజయం సాధించారు. రాక  రాక వ‌చ్చిన అవ‌కాశం.. ఇక మళ్లీ రాదన్న రీతిలో తోపుదుర్తి అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి.   పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టిస్తాన‌ని కాంటాక్టు తీస్కుని రూ. 80 కోట్ల మేర దోచేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.   కోట్ల రూపాయ‌ల కాంట్రాక్టు తీసుకున్న తోపుదుర్తి ఒక్క ఇల్లు కూడా క‌ట్ట‌లేదు. దీంతో జనం     2024 ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మిని తోపుదుర్తికి రుచి చూపించారు.    వివరాల్లోకి వెడితే.. అనంత‌పురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ  నియోజకవర్గం నుంచి  2019లో  గెలిచిన తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో  చేయ‌ని అవినీతి లేద‌ంటూ విమర్శలు గుప్పిస్తున్నారు రాప్తాడు జనం. అంతే కాకుండా తన రౌడీయిజంతో నియోజకవర్గంలో భయానక పరిస్థితులు సృష్టించారని విమర్శలు గుప్పిస్తున్నారు.    2019లో రాఫ్తాడు నుంచి గెల‌వ‌గానే రాక్రీట్ అనే సంస్థ‌ను త‌న సోద‌రుడితో క‌ల‌సి  స్థాపించిన  ప్ర‌కాశ్ రెడ్డి ఆ కంపెనీకి కృష్ణా, గుంటూరు, అనంత‌పురం, పులివెందుల వంటి ప్రాంతాల్లో జ‌గ‌న‌న్న సెంటు స్థ‌లంలో క‌ట్టే  ఇళ్ల కాంటాక్టు ఇప్పించుకున్నారు. ఆ కాంట్రాక్ట్ పేరు చెప్పి  ముందుగానే 80 కోట్ల రూపాయ‌ల అడ్వాన్స్ దండుకున్నారు. ఆ తరువాత ఆ కంపెనీ అడ్రస్ లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.   జ‌గ‌న్  సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో సైతం ఒక్క ఇంటికి కూడా ఈ రాక్రీట్ సంస్థ పునాదులు వేయలేదంటే ఆ సంస్థ ఎంతకు బరితెగించిందో అర్ధం చేసుకోవచ్చు.  తోపుదుర్తి కంపెనీకి  ఇచ్చిన కాంట్రాక్టు ప్ర‌కారం దాదాపు 48 వేల ఇళ్లు క‌ట్టాల్సి ఉండ‌గా.. ఒక్క ఇల్లు కూడా క‌ట్టకుండా పోవ‌డంతో కూట‌మి  ప్ర‌భుత్వం రాక్రీట్ అరాచ‌కాల‌పై దృష్టి సారించింది. అందులో భాగంగా రెవెన్యూ రిక‌వ‌రీ చ‌ట్టం- 1890 ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకునేందుకు సమాయత్తమవ్వడంతో పాటు  క్రిమిన‌ల్ కేసులు సైతం న‌మోదు చేయాలని భావిస్తోంది.  చూడాలి మరి తోపుదుర్తిపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో?

హైదరాబాద్ కు ఐఎస్ బీ.. చంద్రబాబు పుణ్యమే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దార్శనికత గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు మేధావులు. గత నాలుగు దశాబ్దాలకు పైగా చంద్రబాబునాయుడు దేశంలోనే  అత్యంత ప్రగతిశీల, దార్శనిక నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు. అదే విషయాన్ని పలువురు విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు, అభివృద్ధి కాముకులు పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు దార్శనికత గురించి మరో ప్రముఖ విద్యావేత్త ప్రస్తుతించారు.  ఆయన చంద్రబాబు ఆప్రోచ్, విజన్, కృషి, పట్టుదలలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. ఆయన  ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తొలి డీన్ అయిన ప్రమత్ రాజ్ సిన్హా. ప్రమత్ రాజ్ సిన్హా  తాజాగా ఓ జాతీయ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హైదరాబాద్ కు ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్ ను తీసుకురావడంతో చంద్రబాబు కృషిని మరోసారి కళ్లకు కట్టారు.  అసలు ఒక దార్శనికుడిని రాజకీయ వైరంతో మరుగున పడేయడం అనేది జరిగే పని కాదు. ఆ విషయం చంద్రబాబు విషయంలో పదేపదే రుజువు అవుతోంది.  రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్ట  ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ.. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారూ   చంద్రబాబు దార్శనికతపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు.ఇండియన్ బిజినెస్ స్కూల్ గురించి ఎవరు ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు ప్రస్తావన లేకుండా ఉండదు.  ఎందుకంటే కేవలం చంద్రబాబు కృషి, దూరదృష్టి ఫలితంగానే హైదరాబాద్ కు ఇండియన్ బిజినెస్ స్కూల్ వచ్చింది. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది తిరుగులేని నిజం.  అదే విషయాన్ని ఆ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తొలి డీన్ మరోసారి చెప్పారు.  హైదరాబాద్ కు ఐఎస్ బీ క్యాంపస్ ను చంద్రబాబు హైదరాబాద్ కు ఎలా తీసుకువచ్చారో వివరించారు. వాస్తవానికి తొలుత ఐఎస్ బీ క్యాంపస్ ను ముంబైలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అయితే  బాల్ థాకరే కారణంగా ఆ ఆలోచన విరమించుకున్నారు. అప్పట్లో బాల్ థాకరే  ఐఎస్ బీ క్యాంపస్ ముంబైలో ఏర్పాటు చేయాలంటే అందులో 50శాతం సీట్లు మరాఠీ విద్యార్థులకే రిజర్వ్ చేయాలని షరతు విధించారు. అలాగే సిబ్బంది విషయంలో కూడా స్థానికులకు అంతే రాజర్వేషన్ కల్పించాలని కండీషన్ పెట్టారు. ఆ ఒత్తిడి కారణంగానే ఐఎస్ బీ క్యాంపస్ ను ముంబైలో ఏర్పాటు చేయాలన్న యోచన నుంచి మేం వెనక్కు తగ్గామని  ప్రమత్ రాజ్  చెప్పారు.  ఎందుకంటే తొలి నుంచీ కూడా విద్యాసంస్థలకు అటువంటి రిజర్వేషన్లు, కండీషన్లు ఉండకూడదన్నది మా భావన.   సరిగ్గా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మమ్మల్ని అప్రోచ్ అయ్యారని ప్రమత్ రాజ్  సిన్హా గుర్తు చేసుకున్నారు. ఐఎస్ బి క్యాంపస్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబు మమ్మల్ని ఆహ్వానించారని చెప్పిన ఆయన ఆయన ఆహ్వానం చాలా సాదరంగా ఉందనీ, కేవలం ఆయన దార్శనికత, రాష్ట్ర ప్రగతి పట్ల ఆయన తపన చూసే తాము హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉంటుంది, ఐఎస్ బి క్యాంపస్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలూ పరిశీలించేందుకు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చామన్నారు.   అప్పట్లో ఆసియాలో ఒక బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రపంచంలోని 500 కంపెనీలు ఉమ్మడి భాగస్వామ్యంతో ముందుకు వచ్చాయి. ఆ బిజినెస్ స్కూల్ ప్రమోటర్ల బృందంలో  ప్రమత్ రాజ్  సిన్హా ఒకరు. ప్రమోటర్స్ తో సంప్రదించడానికి చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా రాష్ట్ర సీఈవోగా మాదిరిగా కష్టపడ్డారు. ఆ సమయంలో మేం చంద్రబాబుకు ముఖం మీదే.. హైదరాబాద్ ఆలోచనే లేదు..మా తొలి ప్రాధాన్యత బెంగళూరే అంటూ  మేం కుండబద్దలు కొట్టినట్టు  చెప్పినా ఆయన నిరుత్సాహ పడలేదు. ప్రయత్నాలు మానలేదు. మీరు బిజినెస్ స్కూల్ ఎక్కడైనా ఏర్పాటు చేసుకోండి, ఒక్కసారి హైదరాబాద్ వచ్చి అక్కడి అవకాశాలూ పరిశీలించండంటూ ఆహ్వానించారు. ఆలా చంద్రబాబు ఆహ్వానంతో మేం హైదరాబాద్ కు వచ్చాం అని ప్రమత్ రాజ్ సిన్హా వివరించారు.  అయితే అలా వచ్చినప్పుడు కూడా  మాలో హైదరాబాద్ లో ఐబీఎస్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం ఈషాణ్మాత్రం కూడా లేదు. అయితే మా బృందం హైదరాబాద్ చేరుకోగానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు మా బృందాన్ని తేనీటి విందుకు ఆహ్వానించారు. బిజినెస్ స్కూల్ ప్రమోటర్లుగా అప్పటికే మేం ఎన్నో రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాం. కానీ ఏపీతో సంప్రదింపులు మాత్రం స్పెషల్. ఎందుకంటే అప్పటి వరకూ మా సంప్రదింపులన్నీ బ్యూరోక్రాట్లతోనే జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ముఖ్యమంత్రి  స్వయంగా మాతో సంప్రదింపులు జరిపారు అని ఆయన వివరించారు. చంద్రబాబు నివాసంలోనే తేనీటి విందు ఏర్పాటు చేసి.. ఆయనే స్వయంగా మాకు బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశారని ఆయన చెప్పారు. ఆ సమావేశంలోనే  ఐఎస్ బీ ఏర్పాటు చేస్తే తమ ప్రభుత్వం ఇచ్చే రాయతీలు, కల్పించే సౌకర్యాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రం ప్రగతి దారిలో దూసుకుపోతున్న తీరును కళ్లకు కట్టారు. ఐటీని స్మార్ట్ గవర్నెన్స్ కోసం వినియోగించుకుంటున్న తీరునూ సవివరంగా వివరించి మమ్మల్ని అబ్బురపరిచారని ఆయన గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు వ్యవహార శైలి, అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపన, ఆయన దార్శనికత మా బృందాన్ని  మెస్మరైజ్ చేశాయి. దాంతో హైదరాబాద్ లోనే బిజినస్ స్కూల్ ఏర్పాటు కార్యరూపం దాల్చిందని హైదరాబాద్ కు బిజినెస్ స్కూల్ రావడం కోసం చంద్రబాబు పడిన తపనను ప్రమత్ రాయ్ కళ్లకు కట్టినట్లు వివరించారు.  చంద్రబాబు అప్రోచ్, విజన్, అద్భుతం అని ప్రశంసించారు. అలా చంద్రబాబు కృషితో హైదరాబాద్ కు వచ్చిన ఐఎస్ బీ ఇప్పుడు అంతర్జాతీయంగా తిరుగులేని గుర్తింపు పొందిన సంస్థగా నిలిచింది. 

పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ఏ క్షణంలోనైనా అరెస్టు?

పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం (నవంబర్ 28) డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా పిన్నెల్లి బ్రదర్స్ ముందస్తు బెయిలుకు అర్హులు కారని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. గతంలో వారి అరెస్ట్‌పై విధించిన మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది. దీంతో లొంగిపోయేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. కేసు పూర్వాపరాల్లోకి వెడితే.. ఈ ఏడాది మే 24న గుండ్లపాడుకు చెందిన తెలుగుదేశం నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరై బైక్‌పై తిరిగి వస్తుండగా వెల్దుర్తి మండలం బొదిలవీడు వద్ద దారుణ హత్య కు గురయ్యారు.   వీరిని స్పార్కియో వాహనంతో గుద్ది హత్య చేసి ప్రమాదంగా సృష్టించడానికి ప్రయత్నించారు. కానీ వీరిరువురూ హత్యకు గురయ్యారంటూ  ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, మృతుల బంధువుల  ఫిర్యా దుతో పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేశారు.  ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చగా, ఏ-6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ-7గా ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఉన్నారు. ఈ కేసులో అరెస్టు భయంతో  వారు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీం కోర్టు వారి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో పిన్నెల్లి సోదరులను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందం టున్నారు. 

ఏపీ కేబినెట్ భేటీ.. ఏఏ అంశాలపై చర్చంటే?

ఆంధ్రప్రదేశ్ మంతివర్గ సమావేశం శుక్రవారం (నవంబర్ 28) మధ్యాహ్నం మూడు గంటలను జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ బేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా  విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నరిలయన్స్ డేటా సెంటర్, స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదం పొందిన కీలక ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అదే విధంగా  ఇటీవల విశాఖపట్నం వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాల అమలుపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలకు కూడా మంత్రివర్గం చర్చించే అవకాశాలు ఉన్నాయి.  అంతే కాకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశ పెట్టనున్న బిల్లులపై కూడా చర్చ జరిపి ఆమోదం తెలుపుతుందని తెలుస్తోంది.  సత్యసాయి, నంద్యాల, కడప, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.  ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో గతేడాది వరద ముంపు మరమ్మతులకు గానూ దాదాపు రూ.57.14 కోట్లు మంజూరుకు ఆమోదం తెలపనుంది.  అదే విధంగా వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది.