lady trap with party in pub

పబ్ లో పార్టీ అంటూ ఎర.. కట్ చేస్తే కిడ్నాప్.. బ్లాక్ మెయిల్!

పబ్బులో పార్టీ చేసుకుందామన్న ఓ కిలేడీ ఎరకు చిక్కుకున్నాడు.   పబ్బులో పార్టీ అనేసరికి ఆ యువకుడు ఎగిరి గంతేశాడు.. పబ్ కు రమ్మని పిలిచింది ఒక బార్లో డాన్సర్ గా పని చేసే లేడీ కావడంతో  ముందు వెనుక ఆలోచించకుండా  రాత్రి సమయంలో పబ్బుకు చేరుకున్నాడు.  అప్పటికే అక్కడ మాటు వేసిన కిలేడీకి చెందిన గ్యాంగ్  మాట్లాడుకుందామని చెప్పి పక్కకు తీసుకెళ్లి కిడ్నాప్ చేశారు. వివరాల్లోకి వెడితే..  సచిన్ దూబే  అనే వ్యక్తి  ఒక జ్యువెలరీ షాపులో పార్ట్నర్ గా ఉన్నాడు.. అతనికి డబ్బు కొదవలేదు. ఇదే అతనిని టార్గెట్ చేయడానికి కారణమైంది. పబ్ లో డ్యాన్సర్ గా పని చేసే యువతి అతడితో పరిచయం పెంచుకుని పబ్ కు ఆహ్వానించింది. ముందు వెనుకలాలోచించకుండా పబ్ కు కెళ్లిన సచిన్ దుబేని ఆ డ్యాన్సర్, ఆమె గ్యాంగ్ కిడ్నాప్ చేశారు.   అతని దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు.. ఆ తర్వాత ఒక వీడియోని చూపారు. ఒక యువతితో సచిన్ సరసాలు ఆడుతున్న సమయంలో తీసిన ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేశారు.  ఆ వీడియోను  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదరించారు. తాము అడిగిన 10 లక్షల రూపాయల డబ్బు ఇవ్వకపోతే వీడియోను సామాజిక మాధ్యమంలో  పోస్ట్ చేసి పరువు తీస్తామని బెదిరించారు  వీడియో ను  ఆసరాగా చేసుకొని ఒక బార్ లో డాన్సర్ గా పని చేస్తున్న లేడీ తో సహా పబ్బులో పనిచేసే యువకుడు, మరో ముగ్గురు కలిసి సచిన్ దూబే  కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. చివరికి విషయం పోలీసుల వద్దకు చేరడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3 లో సచిన్ దూబే  కిడ్నాప్ కేసు లో ఒక యువతి  సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.  సచిన్ దుబేను కిడ్నాప్ చేసి హింసించడంతో పాటు అతని వస్తువులను లాక్కొని డబ్బులు  డిమాండ్ చేసిన నలుగురిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.   అత్తాపూర్ ప్రాంతానికి చెందిన సచిన్ దూబే బంజారా హిల్స్ లో ఒక జ్యువెలరీ షాప్ లో భాగస్వామి. సచిన్ మత్తులో ఉన్న సమయంలో ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో ఐదుగురు సభ్యులు గల ముఠా వద్దకు చేరుకుంది.   ఈ వీడియోలు చూసిన తర్వాత గ్యాంగ్ కి సచిన్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలని ఆశ పుట్టింది.  దీంతోఅతడిని కిడ్నాప్ చేసి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్   చేశారు. సచిన్ ను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేయడంతో పాటు   డబ్బులు డిమాండ్ చేసిన కేసులో  బార్ డ్యాన్సర్ డింపుల్ తో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

ap cm cbn key announcement on nominated

పని చేసే వారికే నామినేటెడ్ పదవులు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. పార్టీ ముఖ్య నేతలతో  శుక్రవారం (ఆగస్టు 1) ఉదయం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఈ విషయం వెల్లడించారు. రాష్ట్రంలో ఈ నెలలో అంటే ఆగస్టులో రెండు కీలకమైన పథకాల అమలుకు శ్రీకారం చుట్టుబోతున్నట్లు తెలిపిన ఆయన రాష్ట్రంలో కష్టించి పని చేసే తెలుగుదేశం కార్యకర్తలకు త్వరలో నామినేటెడ్ పోస్టులు దక్కుతాయని అన్నారు. ఈ నెలలో అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పిన ఆయన ఈ రెండు పథకాల విషయంలో పార్టీ నేతలూ, క్యాడర్ చురుకుగా పాల్గొనాలని ఆదేశించారు. అన్నదాతా సుఖీభవ కార్యక్రమం శనివారం (ఆగస్టు 2) నుంచీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఈ నెల 15 నుంచీ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గత వైసీపీ హయాంలో రైతు భరోసా పేరుతో జగన్ రైతులను నిలువునా మోసం చేశారని విమర్శించారు.  అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రైతులకు కేంద్రం ఇచ్చే సొమ్ముతో కలిపి ఏడాదికి మూడు విడతలలో 20 వేల రూపాయలు అందిస్తుందని తెలిపారు.   

up cm yogiadityanath biopic release doubt

యూపీ సీఎం యోగి బయోపిక్ కు సెన్సార్ చిక్కులు.. విడుదల సందిగ్ధం?

ఉత్తర ప్రదేశ్  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా విడుదల సందిగ్ధంలో పడింది. మాజీ ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్ జీవిత కథ  ది మాంక్ హు బికమ్ చీఫ్ మినిస్టర్ అన్న పుస్తకం ఆధారంగా రవీంద్రగౌతమ్ దర్శకత్వంలో రూపొందిన  ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ మాంక్ అన్న సినిమా  రూపొందింది. ఈ సినిమా నిర్మాత రీతు మొంగి. వాస్తవానికి ఆ సినీమా శుక్రవారం ( ఆగస్టు 1)న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో విడుదలకు అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో ఈ సినిమా నిర్మాతలు ముంబై కోర్టును ఆశ్రయించారు.  నిర్మాతల పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ముంబై హై కోర్టు  సెన్సార్ బోర్డును సర్టిఫికెట్ నిరాకరణకు కారణం చెప్పాలని ఆదేశించింది. యూసీ సీఎం జీవిత కథ ఆధారంగా వచ్చిన ది మాంక్ హు బికమ్ చీఫ్ మినిస్టర్ పుస్తకం గత ఎనిమిదేళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పటికీ, ఆ పుస్తకం ఆధారంగా నిర్మించిన చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించాల్సిన అవసరమేమొచ్చిందని నిలదీసింది.  దీనిపై రెండు రోజుల్లోగా సమాధానమిస్తామని సెన్సీర్ బోర్డు కోర్టును గత వారమే కోరింది. దీంతో యోగి బయోపిక్ పై ముంబై కోర్టు శుక్రవారం (ఆగస్టు 1)న విచారించనుంది.  దీంతో యోగి బయోపిక్ శుక్రవారం (ఆగస్టు1) విడుదల విషయంలో అయోమయం నెలకొంది. 

super eix promises implimentation

సూపర్ సిక్స్ హామీల అమలులో సీబీఎన్ స్పీడ్

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో ముందడుగు వేయడానికి రెడీ అయిపోయారు.  సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ  పథకాన్ని శనివారం (ఆగస్టు 2) నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.2,342.92 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కేంద్ర వాటాతో కలిపి మొత్తం రూ.7వేలు అందిస్తామన్నారు.  అన్నదాత సుఖీభవ  అమలు సన్నద్ధతపై రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయ, జలవనరుశాఖల ఉన్నతాధికారులతో సీఎం గురువారం (జులై 31) సమీక్ష నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  ఈ సమీక్షలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి రూ.20 వేలు అందిస్తామన్న కూటమి హామీని  అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ తో నెరవేర్చినట్లయిందన్నారు. ఏడాదికి కేంద్రం ఇచ్చే రూ.6 వేల సాయంతో కలిపి, రాష్ట్రప్రభుత్వం మరో రూ.14 వేలు ఇవ్వనుంది. మొదటి, రెండో విడతల్లో రూ.ఐదేసి వేలు చొప్పున, మూడో విడత రూ.4వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. తొలివిడతలో కేంద్రం రూ.2వేలు చొప్పున రూ.831.51కోట్లు విడుదల చేయనుంది. దీంతో ఆగస్టు 2న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో రైతుకు రూ.7వేలు జమ చేస్తాయి. మరోవైపు  అన్నదాత సుభీభవ కు సంబంధించి 59,750 గ్రీవెన్సులు నమోదు కాగా... 58,464 దరఖాస్తులు పరిష్కరించడం జరిగింది. ఈ పథకంపై సందేహాల నివృత్తి కోసం 155251 టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులో  ఉంచినట్లు చంద్రబాబు చెప్పారు. రైతులకు హామీ ఇచ్చినట్టుగానే  అన్నదాత సుఖీభవ  పథకం అమలు చేసి చూపిస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామనీ,  చేసిన మంచిని ప్రజలకు చెప్పాలనీ కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. అన్నదాత సుఖీభవ అందుకునే రైతుల సెల్‌ఫోన్లకు ఒక రోజు ముందే ‘మనమిత్ర’ ద్వారా సందేశాలు వెళ్లాలని, రైతులు తమ ఖాతాలను యాక్టివేట్‌ చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని నిర్దేశించారు.  భారత్‌పై అమెరికా 25శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. బొప్పాయి ధర తగ్గుదలపై సమీక్ష చేసి రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

cbn tour jammalamadugu

జమ్మలమడుగులో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం (ఆగస్టు 1) ఉదయం కడప జిల్లా జమ్మలమడుగులో  ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ  ప్రారంభించారు.  ఈ కార్యక్రమం అనంతరం   గూడెం చెరువులో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. గండికోటలో ఒబెరాయ్ హోటల్, జార్జ్ వ్యూ పాయింట్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. అనంతరం స్థానిక  తెలుగుదేశం నేతలో సమావేశం అవుతారు. ఆ తరువాత ప్రజలతో భేటీ అవుతారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  ఇదిలా ఉండగా శుక్రవారం (ఆగస్టు 1)ఉదయం ఏడు గంటల నుంచీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పించన్ల పంపిణీ కార్యక్రమం 

hca apex councel suspends its president jaganmohanrao

హెచ్ సీఏ అధ్యక్షుడుజగన్మోహన్ రావుపై సస్పెన్షన్ వేటు

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) అధ్యక్షుడు జగన్మోహనరావుపై ఆ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సస్పెన్షన్ వేటు వేసింది. హెచ్ సీఏ అవినీతి, అక్రమాలపై సీఐడీ దర్యాప్తు సాగుతుండగా జగన్మోహనరావుపై సస్పెన్షన్ వేటు పడటం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్మోహనరావుతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ సీఏ కార్యదర్శి దేవరాజ్, ట్రెజరర్ శ్రీనివాసరావులను కూడా హెచ్ సీఏ అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది.   గత నెల 28న జరిగిన హెచ్ సీఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు గురువారం (జులై 31) ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  అపెక్స్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు.  హెచ్ సీఏ   విశ్వసనీయతను కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.  నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం, చీటింగ్ కు సంబంధించి  జగన్మోహనరావు, దేవరాజ్, శ్రీనివాసరావులపై సీఐడీ, ఈడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. వారు హెచ్ సీఏ పదవులలో కొనసాగడం భావ్యం కాదని భావించి..  హెచ్‌సీఏ నిబంధనలు 41 (6), రూల్‌ 51(4) (డి)  ప్రకారం వారిని సస్పెండ్ చేసినట్లు అపెక్స్ కౌన్సిల్ సభ్యలు తెలిపారు. హెచ్ సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రస్తుత ఉపాధ్యక్షుడు   దల్జీత్‌ సింగ్‌ తాత్కాలిక  బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు. 

tridandi china jeeyar swamy meet pm modi

ప్రధాని మోడీతో చినజీయర్ స్వామి భేటీ.. ఎందుకో తెలుసా?

ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో త్రిదండి చినజీయర్ స్వామి భేటీ అయ్యారు. ఢిల్లీలో ప్రధాని నివాసంలో త్రిదండి చినజీయర్ స్వామి గురువారం భేటీ అయ్యారు. ఈ భేటీలో మైహోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామూరావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా త్రిదండి చినజీయర్ స్వామి ప్రధాని మోడీని ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవానికి ఆహ్వానించారు. ఈ ఏడాది చివరిలో నిర్వహించే సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని చినజీయర్ స్వామి మోడీని కోరారు. ఇందుకు మోడీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.  ఈ సందర్భంగా సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో కొలువుదీరిన దేవతామూర్తులకు జరిగే నిత్య కైంకర్యాలను చినజీయర్ స్వామి మోడీకి వివరించారు. వీరి మధ్య భేటీ దాదాపు ముప్పావుగంట సాగింది.   ఈ సందర్భంగా జీయర్  ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోన్న నేత్ర విద్యాలయం, ఆయుర్వేద, హోమియో కళాశాల పురోగతి గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. - ధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల ద్వారా సమాజంలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ అభినందించారు. 

liquor scam money into Peddi Reddy  accounts

మద్యం కుంభకోణం సొమ్ము పెద్దిరెడ్డి ఖాతాల్లోకి.. లోకేష్

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం కుంభకోణంలో పెద్దారెడ్డి పెద్ద లబ్ధిదారుగా లోకేష్ ఆరోపించారు. ఈ కుంభకోణానికి సంబంధించి పక్కా ఆధారాలున్నాయని అన్నారు.  సింగపూర్ పర్యటన వివరాలను, రాష్ట్రానికి రానున్న పెట్టుబడులను వివరించేందుకు గురువారం (జులై 31)న లోకేష్ మీడియా సమావేశంలో మాట్టాడారు.  రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి వైసీపీయులు ఇప్పటికీ నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. తాము పెట్టుబడుల కోసం సింగపూర్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఏపీ నుంచి సింగపూర్ సర్కార్ కు ఓ మెయిల్ వచ్చిందనీ, ఆ మెయిల్ లో త్వరలో ఏపీలో ప్రభుత్వం మారుతుందనీ, అందుకే ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావద్దనీ ఉందన్నారు. ఇంతకీ ఆ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందని ఆరాతీస్తే అది పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలో పని చేసే వ్యక్తిగా తేలిందని లోకేష్ తెలిపారు. పెద్దిరెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్న లోకేష్.. మద్యం కుంభకోణానికి సంబంధించిన సంచలన విషయాలను వెల్లడించారు. జగన్ హయాంలో  ఓ డిస్టిలరీ నాలుగు వందల కేజీల బంగారం కొనుగోలు చేసిందన్నారు. మద్యాన్ని బంగారంతో తయారు చేయరు కదా.. మరి ఆ బంగారం ఎక్కడకు చేరిందో బయటకు రావాలని, వస్తుందని చెప్పారు.      పక్కా ఆధారాలతోనే  మద్యం కుంభకోణంపై దర్యాప్తు జరుగుతోందన్న లోకేష్.. జగన్ హయాంలో   మద్యం సరఫరా చేసిన    ఓ డిస్టిలరీ కంపెనీలు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన బంగారం కొనుగోలు చేసిందనీ.. మద్యం సొమ్ము పెద్దిరెడ్డి ఖాతాలకే మళ్లిందని ఆరోపించారు. మద్యం కుంభకోణం సొమ్మ తన ఖాతాలలోకి మళ్లలేదని పెద్దిరెడ్డి చెప్పగలరా? అని సవాల్ విసిరారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో లోకేష్ ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

why jagan always side with the accused

జగన్ బాధిత పక్షాన కాకుండా నిందితుల పక్షానే ఎందుకుంటారో తెలుసా?

జగన్ నిందితుల పక్షానే ఎందుకుంటారన్న విషయంలో   సమాధానం వెతకాలంటే ఆయన తండ్రి, అంతకన్నా ముందు ఆయన తాత హయాం నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. రాజారెడ్డి కన్నా ముందు తరం అంటే రాజారెడ్డి   తండ్రి వెంకటరెడ్డి తరం గురించి ఒక మాట చెబుతారు. వీరు ఆనాడు భూముల కోసం ఆశ పడి సొంత ధర్మాన్ని ధిక్కరించి,  ఆపై క్రిష్టియానిటీ పుచ్చుకున్నారనీ.. ఆ తర్వాత వారు పులివెందులకు వచ్చారనీ.. అక్కడి నుంచి వీరు భూ స్వాములుగా మారారనీ అంటారు. ఆపై రాజారెడ్డి ఫ్యాక్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారనీ.. ఆపై మైనింగ్ యజమానులను బెదిరించి మైనింగ్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారని చెబుతారు. ఇక్కడ ఎటు నుంచి ఎటు చూసినా.. జగన్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్. ఇక్కడ పాజిటివ్ ఎక్కడైందంటే.. రాజారెడ్డి తన కొడుకు రాజశేఖర్ రెడ్డిని ఎంబీబీఎస్ చేయించడంతో మొదలైంది. దానికి తోడు ఆయన రూపాయ డాక్టర్ కావడంతో.. మొదలైంది అసలు రాజకీయం. అప్పటి వరకూ రాజారెడ్డి అంటే రక్తసిక్త రాజకీయమే గుర్తుకొచ్చేది. అలా అలా తమకున్న రక్తపు మరకలు కడుగుతూ వచ్చిన వైయస్ ఫ్యామిలీ తర్వాతి కాలంలో మహానేత అంటూ కొత్త కలరింగులు ఇచ్చుకోవడం మొదలైంది.  అయితే జగన్ తన తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని  పాటిస్తూ వచ్చారు. అందుకే ఆయన తన పార్టీలో కూడా అలాంటి వారినే ప్రొత్సహిస్తారు. న్యూడ్ విడియోతో రచ్చకెక్కిన ఎంపీ గోరంట్ల మాధవ్, డెడ్ బాడీని డోర్  డెలివరీ  చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, రాసలీలల అంబటి, అవంతి.. ఆపై అవినీతికే దగ్గరుండి ఓనమాలు దిద్దించిన రోజా, రజని. ఇక లిక్కర్ కింగ్స్ చెవిరెడ్డి, మిధున్ రెడ్డి.. క్వార్ట్జ్ కా రాజా కాకాణి, సోదరినే విచక్షణ మరచి మరీ బూతులు తిట్టిన ప్రసన్న కుమార్ రెడ్డి. అలాగే బెట్టింగ్ రాజా అనిల్ కుమార్ యాదవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు ఒక అంతంటూ ఉండదు.  ఆయన పార్టీలోని పై  స్థాయి వారే ఇలాగుంటే ఇక తెనాలి గంజాయ్ బ్యాచ్, ఆపై పల్నాడు బెట్టింగ్ రాజులకే విగ్రహాల నిర్మాణం ఇలా ఎటు నుంచి ఎటు చూసినా నెగిటివ్ కేరెక్టర్లే ఎక్కువ కనిపిస్తాయి. అందుకేగా ఆయన పబ్లిక్ గా అంటోంది 'పిలకాయలన్నాక కొట్టుకోరా!' అని. ఆపై  రప్ప రప్ప అంటే తప్పు లేదని అనడం కూడా ఇందులో భాగమేనంటారు. మచ్చుకైనా సరే గుడ్ ఉండదు.. అంతా బ్లడ్డే అన్నది పరిశీలకుల విశ్లేషణ. అసలాయన అడుగు పెడితే తలకాయలైనా మామిడికాయలైనా ఒకటే ఆ జగనన్న రథ చక్రాల కింద కసకస నలగాల్సిందేనంటారు. ఇందుకు జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా ఆయన కారు కింద నలిగి మరణించిన సింగయ్య ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. 

Liquor scam case

ఏపీ మద్యం కేసులో సిట్ అదుపులో మరొకరు

  ఏపీ మద్యం కుంభ కోణ కేసులో మరొకరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. A48 సుజన బెహ్రాన్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని ఆమెను విజయవాడకు తరలించారు. ఇప్పటికే 48కి నిందితుల సంఖ్య చేరింది. లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు పెంచింది. అడిషనల్ ఛార్జ్‌షీట్ సిద్దం చేయనున్నట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు బుధవారం హైదరాబాద్‌లోని శంషాబాద్, కాచారం ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లో రూ. 11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని ఎస్.ఐ.టి కార్యాలయానికి తరలించిన అధికారులు, దీనికి సంబంధించిన మెమోను గురువారం ఏసీబీ కోర్టుకు సమర్పించారు.  ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప బాలాజీతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డిని అరెస్ట్ చేసి విచారించారు. వారి విచారణ ఆధారంగా బునేటి చాణక్య, వరుణ్, వినయ్ వంటి మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న కొందరు విదేశాలకు పారిపోయినట్లు సిట్ గుర్తించింది. వారిని తిరిగి దేశానికి రప్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రాథమిక దర్యాప్తులో సుమారు రూ. 3500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగిందని సిట్ అధికారులు అంచనా వేస్తున్నారు.  

YS Jagan

మహిళలను కించపరిచే వ్యక్తికి పరామర్శ సిగ్గు చేటు : ప్రశాంతి రెడ్డి

  వైసీపీ  అధినేత జగన్ నెల్లూరు పర్యటనపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు నగరం మాగుంట లే ఔట్ లోని నివాసంలో మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై  నిప్పులు చెరిగారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి నిజాయతీగా వ్యాపారాలు చేసే ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని విమర్శిస్తావా అంటూ సూటిగా ప్రశ్నించారు. మహిళలను కించపరుస్తూ సంస్కార రహిత వాఖ్యలు చేసిన ప్రసన్నలాంటి వారిని పరామర్శించి సమాజానికి ఏం సందేశమిస్తున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.  తీర్ధయాత్రలు చూసాం, జైత్రయాత్రలు, విజయయాత్రలు చూసాం, దండయాత్రలు, ఓదార్పు యాత్రలు లాంటివి కూడా చూసాం ఈ జైలు యాత్రాలేంటి ఆమె అన్నారు.మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని  జగన్ మోహన్ రెడ్డి పరామర్శించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని, చెల్లినీ వేధించడం వైసీపీ సంస్కృతిలో భాగమని ఈ సందర్భంగా ఆమె అభివర్ణించారు.  జగన్ జైలు యాత్రలు చూసి ప్రజలు అస్యహించుకుంటున్నారని పేర్కొన్నారు. తప్పు చేసిన వాళ్లని సమర్ధించడం నాయకుడి లక్షణం కాదన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడం ద్వారా వైఎస్ జగన్ తన స్థాయి దిగజార్చుకున్నారని ఆమె అన్నారు. రూ.500కోట్లతో ఫ్యాక్టరీ పెట్టి గ్రామీణ యువతకి ఉపాధి కల్పించాలన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  ఆశయానికి కొందరు నీచులు తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   వైసీపీ నేతలు అనిల్, ప్రసన్న లాంటి అచ్చోసిన ఆంబోతుల వల్లే జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందన్నారు. అందుకే ప్రజలు   11 సీట్లకి పరిమితం చేసినా, ఆ పార్టీ నేతల బుద్ధి మాత్రం మారడం లేదని వాపోయారు. మీ తల్లో, చెల్లో, ఆవిడో రాజకీయాల్లోకి వస్తే.. వాళ్లపై ప్రత్యర్థులు మీలా నోరుపారేసుకుంటే ఊరుకుంటారా? అంటూ వైసీపీ అగ్రనేతలను ఈ సందర్భంగా ప్రశాంతి రెడ్డి ప్రశ్నించారు.

Medigadda Barrage

కాళేశ్వరంపై నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన కమిషన్

  మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాల ఆరోపణలపై  పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదికను షీల్డ్ కవర్‌లో ప్రభుత్వానికి అందజేశారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. బీఆర్‌కే భవన్‌కు వెళ్లి.. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదికను అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు, అవినీతిపై 15 నెలల పాటు విచారణ జరిపారు. జస్టిస్ పీసీ ఘోష్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి పూర్తి విచారణ చేశారు.  కమిషన్ అందించిన నివేదికను రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నారు రాహుల్ బొజ్జా. కమిషన్ తన నివేదికలో ఏం పేర్కొంది.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు పలువురు నేతలు భేటీకి హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ మేడిగడ్డతో పాటు ఇతర ప్రాజెక్టులో లోపాలకు తామే కారణమని నివేదిక ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎదురుకోవాలని అంశంపై డిస్కస్ చేశారు. తాజా నివేదికలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పిదాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు నేడే, రేపో బయటకు వచ్చే అవకాశముందని సమాచారం. దీనిపై ప్రభుత్వం తరపున సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

Minister lokesh

సింగపూర్‌ పర్యటనలో రూ. 45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు : లోకేశ్

  సీఎం చంద్రబాబు బృందం సింగపూర్‌ పర్యటన విజయవంతమైందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఎన్నడు లేని విధంగా 2 వేలమంది తెలుగువారితో సమావేశమయ్యారు.  ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి తెలిపారు. తాము ఎంవోయూలు చేయట్లేదని, నేరుగా కార్యరూపంలోకి తెస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు పెట్టాలని జూమ్‌కాల్‌ ద్వారా ఆర్సెల్లార్‌ మిత్తల్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్‌, డేటా సెంటర్‌లు ఏపీలో ఏర్పాటు కాబోతున్నట్లు వెల్లడించారు.  2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను వైసీపీ అధినేత జగన్‌ నాశనం చేశారు. అమరావతిని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని సింగపూర్‌ కోరింది. ఆ దేశ ప్రభుత్వం చెప్పే మాటలు వినకుండా గత ప్రభుత్వం ఒప్పందాలను రద్దు చేసింది. పారదర్శకతలో సింగపూర్‌ అగ్రస్థానంలో ఉంటుంది. అలాంటి దేశంపై అవినీతి ముద్ర వేశారు. అమర్‌రాజా, లులు సహా పలు కంపెనీలను జగన్‌ తరిమేశారు. కానీ, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, ఏపీకి చంద్రబాబు ఉన్నారు.  ఐటీ పటంలో విశాఖను పెట్టాలని నిర్ణయించుకున్నాం. హెరిటేజ్‌కు కూడా ఇవ్వలేదు.. టీసీఎస్‌కు ఇచ్చాందేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా టీసీఎస్‌కు ఎకరా రూ.99పైసలకే భూమి కేటాయించాం. దీనిపై వైసీపీ నేతలు కోర్టుకెళ్లారు. తక్కువ ధరకు భూముల్ని మేం హెరిటేజ్‌కు కూడా ఇవ్వలేదు.. టీసీఎస్‌కు ఇచ్చాం. ఉద్యోగాలు వస్తాయని రూ.99పైసలకే భూములు ఇస్తున్నాం. అందులో తప్పేంటి? జగన్  తెచ్చిన పెట్టుబడులకంటే మా ప్రభుత్వం 14 నెలల్లో తెచ్చిన పెట్టుబడులే ఎక్కువ లోకేశ్ తెలిపారు మధ్యం కుంభకోణ కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఒక లిక్కర్‌ కంపెనీ రూ.400 కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేసిందని చెప్పారు. బంగారంతో లిక్కర్‌ తయారు చేయలేరు కదా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది.. ఎక్కడికి వెళ్లింది? అని నారా లోకేష్‌ ప్రశ్నించారు. పెద్దిరెడ్డి కంపెనీకి ఆదాన్‌ సంస్థ నుంచి డబ్బులొచ్చాయని చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఛాలెంజ్‌ చేస్తున్నా.. దమ్ముంటే కాదని ఈ వ్యాఖ్యలను ఖండించాలంటూ ఆయనకు మంత్రి నారా లోకేష్‌ సవాల్ విసిరారు

YS Jagan

జగన్ నెల్లూరు పర్యటనలో తొక్కిసలాట

  మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనలో తొక్కిసలాట చోటుచేసుకుంది.  మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు ఆంక్షలు ఉల్లంఘించి రోడ్డు పైకి భారీగా చేరుకున్నారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ మాలకొండయ్యకు గాయాలయ్యాయి.  ఓ సీఐ కిందపడిపోయారు.  కానిస్టేబుల్‌కు చేయి విరగడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వందల మందితో తన నివాసానికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రయత్నించారు. పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వైసీపీ శ్రేణులను నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులతో వాగ్వాదానికి దిగారు ప్రసన్న కుమార్ రెడ్డి. మహిళా డీఎస్పీ సింధుపై సైతం దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆర్‌ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ట్రాఫిక్‌కి ఆటంకం ఏర్పడింది.  దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు.. పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. మరోవైపు రోడ్డు ప్రయాణంలో జగన్ ఎక్కడంటే అక్కడే కాన్వాయ్ ఆపుతూ అభివాదాలు చేసుకుంటూ వెళ్లారు. శ్రీనివాసులరెడ్డి బొమ్మ సెంటర్ వద్ద జగన్‌ను చూసేందుకు వైసీపీ శ్రేణులు పోలీసులను నెట్టుకుంటూ వెళ్లారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.  

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్

  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన రెండు కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ మరియు కౌడిపల్లి పీఎస్ లో నమోదైన కేసులను కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నెల 26న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. 2021లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలు, నిరసనల సమయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ స్టేట్  చీఫ్‌గా ఉన్న సమయంలో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి.   ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ ర్యాలీలు నిర్వహించగా.. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారని, అనుమతులు లేకుండా బహిరంగ సభలు నిర్వహించారని ఫిర్యాదులు అందాయి. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 26న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ నేరుగా విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వ వాదనలతో పాటు రేవంత్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు కేసును 31వ తేదీకి వాయిదా వేయగా తగిన ఆధారాలు సమర్పించడంతో రెండు కేసులను న్యాయస్థానం నేడు కొట్టివేసింది.   

తిరుమలలో రీల్స్ మోజులో తింగరి వేషాలు.. చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరిక

తిరుమల శ్రీ‌వారి ఆల‌యం ముందు , మాడ వీధుల్లో ఇటీవ‌ల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు (రీల్స్) చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడంపై టీటీడీ సీరియస్ అయ్యింది. తిరుమలవంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర ,అసభ్యకర చర్యలు అనుచితమని పేర్కొంది. ఇటువంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయనీ, అలాగే ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయనీ పేర్కొంది. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  తిరుమలలో పుణ్యక్షేత్రంలో  కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల  మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ.. ఇటువంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

పార్లమెంట్ వద్ద సైకిల్‌పై సందడి చేసిన బాలయ్య

  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద సందడి చేశారు. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు  తీసుకొచ్చిన సైకిల్‌పై కూర్చొని కెమెరాకు పోజులిచ్చారు. సైకిల్‌ను చూసిన బాలయ్య అన్న ఎన్టీఆర్, వారి అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. తెలుగోడి ఆత్మగౌరవానికి ప్రతీకగా పార్లమెంట్‌కు రావడం అభినందనీయం అని బాలయ్య ప్రశంసించినట్టు అప్పలనాయుడు ట్వీట్ చేశారు.  కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ పార్టీ ఎంపీలతో కలిసి మర్యాదపూర్వకంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను బాలయ్య కలిశారు. అలాగే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, మనోహర్ లాల్ ఖట్టర్, హరిదీప్ సింగ్ పురీ, మన్ సుఖ్ మండవీయలను బాలకృష్ణ కలవనున్నారు. ప్రతి తెలుగోడు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆరోజు అన్న ఎన్టీఆర్ పెట్టిన టిడిపి పార్టీ గుర్తు సైకిల్ పై పార్లమెంటుకు రావడం అనేది అభినందనీయకమని బాలయ్య పేర్కొన్నారు.   అలాగే మన పార్టీ ప్రాముఖ్యతను భారతదేశం అంతా తెలిపే విధంగా మన పార్టీ సింబల్ సైకిల్ ను పార్లమెంట్ ప్రవేశ ద్వారం పక్కన  ఒక సిగ్నిఫికెన్స్ గా ఉండటం హర్షనీయమని చెబుతూ, అలాగే పక్కన ఉన్న సహచర ఎంపీ ద్వారా రోజు పార్లమెంటుకు సైకిల్ పై వస్తున్న విషయం తెలుసుకొని ఎంపీ  చేస్తున్న పనిని ప్రశంసిస్తూ, పార్లమెంట్ లో మీ గళం ద్వారా మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి అంటూ, అన్న ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పుడూ మీ పై సదా ఉంటాయని వారి అభిమానాన్ని ఎంపీ పై  చూపిస్తూ ఇకముందు కూడా ఇలాగే ముందుకు సాగండి అని వారిని అభినందించి కాసేపు సరదాగా సైకిల్ పై కూర్చుని, ఫోటోలు ఇస్తూ  సరదాగా కాసేపు ఢిల్లీ విషయాలపై సంభాషించారని ఎంపీ కలిశెట్టి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు  

ఏపీ @32 జిల్లాలు.. అధికారిక ప్రకటనే తరువాయి?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల సహిరద్దులు మార్చడంతో పాటు జిల్లాల సంఖ్య పెంచేందుకు నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసి కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయం మేరకు ప్రస్తుతం ఉన్న జిల్లాలలోని పలు నియోజకవర్గాలు వేరే జిల్లాలకువెళ్లనున్నాయి. గత వైసీపీ హయాంలో పార్లమెంట్ నియోజకవర్గాల్ని జిల్లాలుగా మారుస్తూ చేసిన మార్పును ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సవరించి, సరిదిద్దడానికి నిర్ణయించింది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 32కు పెరగనుంది.   పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, అమరావతి, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, హిందూపురం, అనంతపురం, ఆదోని, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట జిల్లా కేంద్రాలు కాబోతున్నట్లు సమాచారం. పలాస జిల్లాలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాలు,  శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, టెక్కలి, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.  అదే విధంగా  పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలు, విజయనగరం జిల్లాలో విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్ కోట, బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండనున్నాయి. ఇక పోతే విశాఖ జిల్లాలో భీమిలి, విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, గాజువాక, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయని తెలుస్తోంది. అలాగే అరకు జిల్లాలో అరకు, పాడేరు, మాడుగుల నియోజకవర్గాలు, అనకాపల్లి జిల్లాలో  అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని నియోజకవర్గాలు ఉంటాయి. ఇక కాకినాడ జిల్లాలోకి  ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, రూరల్, రామచంద్రాపురం నియోజకవర్గాలూ,  రాజమండ్రి జిల్లాలోకి అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రూరల్, కొవ్వూరు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాలు రానున్నాయి. అమలాపురం జిల్లాలో  రాజోలు, అమలాపురం, ముమ్మడివరం, పి.గన్నవరం, మండపేట, కొత్తపేట నియోజకవర్గాలు ఉంటాయి.  నరసాపురం జిల్లాలో  తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం.. అలాగే  ఏలూరు జిల్లాలో గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు నియోజకవర్గాలు ఉంటాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. మచిలీపట్నం జిల్లాలో  కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాలు, విజయవాడ జిల్లాలో తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం రానున్నాయి.  అమరావతి జిల్లా పరిధిలోకి పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ రానున్నాయి. గుంటూరు జిల్లా పరిధి లోకి తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, వెస్ట్, పొన్నూరు నియోజకవర్గాలు, బాపట్ల జిల్లా పరిధిలో రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాలు ఉంటాయని తెలుస్తోంది. అదే విధంగా నరసరావు పేట నియోజకవర్గ పరిధిలో  చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ, మార్కాపురం పరిధిలో ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, ఇక ఒంగోలు జిల్లాలోకి  ఒంగోలు పరిధి లోకి అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, కందుకూరు సీట్లు వస్తాయని విశ్వసనీయవర్గాల సమాచారం. అలాగే  నెల్లూరు జిల్లా పరిధిలో  కావలి, కోవూరు, నెల్లూరు సిటీ, రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు, గూడురు పరిధిలోకి  సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట, తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలు ఉంటాయి. ఇక చిత్తూరు జిల్లా పరిధిలో  పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం వస్తాయి. అలాగే మదనపల్లె పరిధిలో పీలేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె,  హిందూపురం పరిధిలోకి కదిరి, ధర్మవరం, పెనుకొండ, మడకశిర, హిందూపురం నియోజకవర్గాలు, అనంతపురం జిల్లాలో  రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాలు, ఆదోని జిల్లా పరిధిలో పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం,  కర్నూలు జిల్లా పరిధిలోకి నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు ఉంటాయని సమాచారం. నంద్యాల జిల్లా పరిధిలో శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాలూ, కడప జిల్లాలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప ఉంటాయనీ, రాజంపేట జిల్లా పరిధిలో బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి  అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయనీ విశ్వసనీయ సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.