జగన్ ప్రభుత్వ రికార్డుల ధ్వంసం జరుగుతోంది

ఆమధ్య తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన రోజున, ఆ ప్రభుత్వం చేయించిన ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన హార్డ్ డిస్క్లులు, ఆధారాలు ధ్వంసం చేయడం జరిగింది కదా.. అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ‘ధ్వంసం’ కార్యక్రమం ‘ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్’ రూపంలో జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ‘ఈ-ఆఫీస్’ని మూసేశారు. మే 17 నుంచి 25 వరకు  ‘అప్‌గ్రేడ్’ చేసే నెపంతో ఈ-ఆఫీస్‌ని మూశారు. ఈ వ్యవహారంపై తెలుగుదేశం అధినేత  చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కి చంద్రబాబు లేఖ రాశారు. త్వరలో కొత్త ప్రభుత్వం వస్తున్నందున, ఆ అప్ గ్రేడ్ వ్యవహారాన్ని కొత్త ప్రభుత్వం చూసుకుంటుందని, ఈ ప్రభుత్వమే అప్‌గ్రేడ్ చేయడం వల్ల అక్రమాలు జరిగే అవకాశం వుందని చంద్రబాబు ఆ లేఖలో రాశారు. ఇలా ఈ-ఆఫీస్‌ని అప్‌గ్రేడ్ చేయడం వల్ల జగన్ ప్రభుత్వం చేసిన అక్రమాలు సమాధి అయ్యే ప్రమాదం వుంది.

ఐప్యాక్ ఆఫీసుకి జగన్.. మతలబేంటి?

ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్ తనకు సహకారం అందిస్తున్న ఐప్యాక్ సంస్థ కార్యాలయానికి వెళ్ళే ఛాన్సే లేదు. ఓటమి కన్ఫమ్ అయిన బాధ ఒక వైపు, యూరప్ వెళ్ళడానికి తట్టాబుట్టా సర్దుకునే బిజీ మరో వైపు. అయినప్పటికీ, జగన్ తీరిక చేసుకుని మరీ ఐప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) కార్యాలయానికి ఎందుకు వెళ్ళారా అనే సందేహాలు కలగటం సహజం. విజయవాడలో వున్న ఐప్యాక్ కార్యాలయానికి జగన్ వెళ్ళడం అనేది హండ్రెడ్ పర్సెంట్ అనధికార పర్యటన అయినప్పటికీ, అన్ని రకాల అధికారిక ఖర్చులతో ఆయన అక్కడకి వెళ్ళారు. ఐప్యాక్ కార్యాలయంలో జగన్ రాకకోసం ఎదురుచూస్తున్న వందలాది మంది ఐప్యాక్ ఉద్యోగులు జగన్‌ని చూసి ఉత్సాహంతో ఉరకలు వేశారు. షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. సెల్ఫీలు దిగారు. అన్నికంటే వింత ఏమిటంలే, జగనే స్వయంగా ఒక సెల్ఫీ క్లిక్ చేశారు. తర్వాత ఐ ప్యాక్ సభ్యులు మీరు మళ్ళీ ఘన విజయం సాధిస్తారు అని ముక్తకంఠంతో అరిచారు. జగన్ కూడా, అంతకు ముందుకంటే భారీ విజయం సాధిస్తాను అని చెప్పారు. అది విని అందరూ ఆనందంగా చప్పట్లు చరిచారు... సీఎం.. సీఎం అని అరిచారు.. ఈ ప్రహసనం అయిపోగానే జగన్ తిరిగి తాడేపల్లి ప్యాలెస్‌కి చేరుకున్నారు. అసలింతకీ జగన్ ఐ ప్యాక్ కార్యాలయానికి ఎందుకు వెళ్ళినట్టు? ఎందుకంటే, గత ఎన్నికల తర్వాత జగన్ ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్ళారు. వాళ్ళకి థాంక్స్ చెప్పారు. ఇప్పుడు వెళ్ళాలన్న ఉద్దేశం లేకపోయినా, వెళ్ళక తప్పని పరిస్థితి.. ఎందుకంటే, ఇప్పటికే జగన్ ప్రభుత్వం చాపచుట్టేసినట్టే అనే పాయింట్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు కనుక జగన్ గత ఎన్నికల తరహాలో కాకుండా, ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్ళకుండా ఊరుకుంటే, జగన్ కూడా చేతులు ఎత్తేశాడనే మెసేజ్ వెళ్ళే అవకాశం వుంది కాబట్టి ఆయనకి వెళ్ళక తప్పలేదు. ఐపాక్‌తో గత ఎన్నికల వరకు అనుబంధం వున్న ప్రశాంత్ కిషోర్ దానిని కొంతకాలం క్రితం తెంచుకున్నారు. ఈమధ్య జర్నలిస్టు రవిప్రకాష్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్‌ని ప్రశాంత్ కిషోర్ భారీగా విమర్శించారు. చేసిన మేలును మరచిపోవడం కంటే పెద్ద పాపం మరొకటి వుండదని భగవద్గీతలో చెప్పారని, జగన్ తాను చేసిన మేలును మరచిపోయారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ నేపథ్యంలో, ఐప్యాక్ సంస్థకి వెళ్లి మరీ థాంక్స్ చెప్పాల్సిన పరిస్థితి జగన్‌ది. ఒకవేళ జగన్ వెళ్ళకపోతే, చూశారా.. జగన్ ఈసారి ఐప్యాక్ ఆఫీసుకు వెళ్ళలేదు. జగన్‌కి కృతజ్ఞత లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాట నిజమే అనే లోకనింద వస్తుందని భయపడి జగన్ ఆ సంస్థ కార్యాలయానికి వెళ్ళారు. ఓ పనైపోయింది బాబూ అనిపించుకున్నారు.

 తెలంగాణలో మళ్లీ భారీవర్షం 

తెలంగాణలో చాలావరకు వేడి తగ్గింది. వాతావరణం చల్లబడింది. ఈనెల మొదటి వారంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని చోట్ల 47 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. వాతావరణం చల్లబడటంతో 40 డిగ్రీలకు పడిపోయింది. ఉపరితల ఆవర్తనమే కారణమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అవర్తనం ఏర్పడమే దీనికి కారణం. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు కురవనున్నాయి.పిడుగులు పడే అవకాశం రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మే 17 వరకు తేలిక నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవనున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణ పేట జిల్లాల్లో బుధవారం రోజు వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో వర్షం పడే అవకాశం ఉంది.ఉదయం ఎండ ఉన్నప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుందని అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతల విషయానికి వస్తే 38 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్యలో నమోదవుతుందని, ఉరుములు, మెరుపులతో పాటు పిడిగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ మరికొన్ని జిల్లాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. ఇలా రాష్ట్రమంతా భిన్నమైన వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. వేడి ఉన్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎండవేడిమికి ముఖ్యమైన పనులుంటే ఉదయం సమయంలోనే పూర్తిచేసుకోవాలని, ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటలకు బయటకు వెళ్లొద్దని, ఒకవేళ వెళ్లినా గొడుగు తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు.

విశాఖ చెవిలో చెవిరెడ్డి వెయ్యి కోట్ల పువ్వు!!

ఎక్కడ రాయలసీమలోని చంద్రగిరి.. ఎక్కడ విశాఖపట్నం. చంద్రగిరి నుంచి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విశాఖపట్నంలో వెయ్యి కోట్ల స్కామ్ చేశాడు. అక్రమ మైనింగ్‌తో  అందినంత దండుకున్నాడు. జగన్ ఆశీస్సులతో రాష్ట్రమంతటా రెచ్చిపోతున్న దండుపాళెం బ్యాచ్‌లో ముఖ్య సభ్యుడైన చెవిరెడ్డి, అడ్డగోలుగా సంపాదించడంలో ఆరితేరాడు. తనకెవరైనాఅడ్డు వస్తే భౌతికంగా అడ్డు తొలగించుకోవడానికి కూడా వెనుకాడడు. నిన్నగాక మొన్న చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిని హత్య చేయడానికి చెవిరెడ్డి చేసినప్రయత్నాలు చూశాం. ఇప్పుడు వైజాగ్‌లో చట్టాలు, నిబంధనల చెవుల్లో పూలు పెట్టి, ఆయనగారు  చేసిన వెయ్యి కోట్ల స్కామ్ వివరాలేంటో చూద్దాం.  చెవిరెడ్డి చేసేవన్నీ నేరాలు, మోసాలు. పైకి బిల్డప్పు మాత్రం పరమభక్త శిఖామణిలా వుంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దండుపాళెం బ్యాచ్‌లో కీలక మెంబర్ అనే విషయం ఆల్రెడీ చెప్పుకున్నాం. తనకు ఎంతమాత్రం సంబంధంలేని విశాఖలో మకాం వేసి ఏకంగా వెయ్యికోట్లకు పైగా నొక్కేశాడు. క్రైస్తవుడైన ముఖ్యమంత్రి  వైయస్ జగన్‌ను హిందువులు వ్యతిరేకించకుండా చెవిరెడ్డి మంచి ప్లాన్ వేశారు. ఆయన ఇంట్లో గోశాల ఏర్పాటు చేసి, దేవాలయ సెట్లు నిర్మించి ఆ పలుకుబడితో విశాఖలో భారీ స్కాములు చేసేశారు.  ఋషికొండ విధ్వంసకారుడు చెవిరెడ్డి బినామీలతో  ఋషికొండను విధ్వంసం చేయించిన చెవిరెడ్డి వేల లారీల గ్రావెల్‌తో  వందల కోట్లు సంపాదించారు. ఋషికొండను తవ్వగా వచ్చిన గ్రావెల్ రాళ్లను నిబంధనలకు విరుద్ధంగా సముద్రం ఒడ్డున సి.ఆర్.జెడ్. ప్రాంతంలో డంప్ చేయించిన చెవిరెడ్డి అక్కడి ఎర్ర మట్టిని మాత్రం విశాఖ పోర్టుకు తరలించి భారీగా లబ్ధి పొందారు. ముఖ్యమంత్రి జగన్‌కి గంగవరం పోర్టు అధినేత సన్నిహితులు కావడంతో, పోర్ట్.లోని మట్టిని విక్రయించడానికి చెవిరెడ్డి కాంట్రాక్ట్ తెచ్చుకున్నారు. ఆ కారణంగానే ఋషికొండపై అవసరం లేని చోట, నిర్మాణాలు లేని చోట కూడా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి  అమ్ముకున్నారు. విశాఖ పోర్ట్ ట్రస్టులో అదానీ నిర్మిస్తున్న బెర్తులు, ఇతర అవసరాల కోసం వందల కోట్ల విలువైన ఈ మట్టిని తరలించి అమ్ముకొని సొమ్ముచేసుకున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో భారీ స్కాం పెందుర్తి నియోజకవర్గం గుర్రంపాలెంలో 200 ఎకరాల్లో క్వారియింగ్ చేసి వందల కోట్లు చెవిరెడ్డి సంపాదించారు. ప్రభుత్వం పరిశ్రమలకని కేటాయించిన ఈ భూమిలో చాలా తెలివిగా మైనింగ్ చేశారు. ఈ ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం కాదని ప్రభుత్వ అధికారులతోనే సర్టిఫై చేయించి తన మైనింగ్ అవసరాలకు వాడుకున్నారు. కేవలం మైనింగ్ చేసేందుకే ఈ భూమిని పరిశ్రమలకు పనికి రాదని పలుకుబడితో సర్టిఫై చేయించారు. ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి రోజా ఏపీఐఐసీ చైర్మన్‌గా ఉండగా ఈ భూములకు నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అనే సర్టిఫికెట్ మంజూరు చేయించి దాని ఆధారంగా ఆ భూముల్లో మైనింగ్ చేసి  సొమ్ము చేసుకున్నారు. బక్కన్నపాలెంలో 208 కోట్ల టిడిఆర్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో  తాను చేస్తున్న సర్వేలకు డబ్బు కావాలంటూ మధురవాడ సమీపంలోని బక్కన్నపాలెం సర్వే నెంబర్ 2లో 208 కోట్ల టిడిఆర్ బాండ్లను తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడితో దక్కించుకున్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం చెవిరెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు టి.డి.ఆర్ బాండ్లు మంజూరు చేశారు. ఇది అక్రమమంటూ ఫిర్యాదుల వెళ్లినా, తమకూ తెలిసినా తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడికి తలొగ్గారు.  ఫార్మాసిటీలో డంపుల వ్యాపారం పరవాడలోని ఫార్మాసిటీలో పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించి, భయపెట్టి రసాయన వ్యర్ధాల డంపులను చెవిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జిగా పనిచేసిన రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి ద్వారా ఈ డంపులతో ఎంచక్కా వ్యాపారం చేసుకొంటున్నారు. ఈ కారణంగానే  ఫార్మీ సిటీలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు ధైర్యంగా ఎవరిపైనా చర్యలు తీసుకోలేక పోతున్నారు. ఒక 20 రోజుల ఆగితే, ఎన్డీయే గవర్నమెంట్ వచ్చాక చెవిరెడ్డికి భారీ సత్కారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగుదేశం మహానాడు వాయిదా!

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ సరళిని బట్టి తెలుగుదేశం భారీ విజయం సాధించడం ఖాయమన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా స్వయంగా నిర్వమించుకున్న పోస్ట్ పోల్ సర్వే ఫలితం కూడా భారీ విజయాన్ని ఖరారు చేసిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమేన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి.  తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించుకుందామని చంద్రబాబు పార్టీ శ్రేణులకు చెప్పారు.  పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని  ఏటా మే 27, 28 తేదీలలో  పార్టీ మహానాడు జరుగుతుంది. అయితే ఆ మహానాడును వాయిదా వేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.  జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో  ప్రభుత్వ ఏర్పాటు, ఎన్నికల ఫలితాలకు ముందు  ఓట్ల లెక్కింపు ముందు చేప్టటాల్సిన కార్యక్రమాలు, ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించాల్సి ఉన్న నేపథ్యంలో మహానాడును వాయిదా వేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు.   ఈ విషయాన్ని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రకటించారు. అయితే  ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఎన్టీఆర్ కు నివాళులర్పించడం, పార్టీ జెండా ఆవిష్కరించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు.   ఇక మహానాడు ఎప్పుడు నిర్వహించాలన్నది ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ప్రకటించనున్నట్లు తెలిపారు.   

పవన్ కళ్యాణ్ సెక్యురిటీ గార్డ్ ఇంటిపై దాడి 

ఎపిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ మామూలుగా లేదు. ఈ సారి పిఠాపురం లోకసభ స్థానం నుంచి పోటీ  చేస్తున్న పవన్ కళ్యాణ్ టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. ఆయన సెక్యురిటీ గార్డ్ ఇంటిపై దాడి జరగడం చర్చనీయాంశమైంది.  హైదరాబాద్ మీర్‌పేట్‌లోని లెనిన్ నగర్‌లో జ‌న‌సేనాని పవన్ కల్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ వెంకట్ ఇంటిపై కొంద‌రు దాడికి పాల్ప‌డ్డారు. ఇంటిపైన రాళ్లు, రాడ్లు, కత్తులతో దాడి చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. పాత కక్షలతోనే రాజు అనే వ్యక్తి వెంకట్ ఇంటి ముందు ఉన్న ద్విచ‌క్ర‌వాహ‌నానికి నిప్పుపెట్టి ఇంటిపై రాళ్లతో దాడి చేసిన‌ట్లు స‌మాచారం. బైక్‌ను ధ్వంసం చేసి వెంక‌ట్‌పై కూడా దాడి చేయడానికి ప్రయత్నించ‌డంతో స్థానికులు అడ్డుకున్నారు.  వెంకట్ తన భార్య సరిత, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో కలసి ఐదేళ్లుగా లెనిన్ నగర్‌లోనే నివాసం ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో ఇంటి ఎదురుగా ఉండే రాజు వారి బంధువులు పాత గొడవల నేపథ్యంలో ఈ నెల 15న‌ రాత్రి ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఇంటి ప‌క్క‌న‌ ఉండే అబ్బాయి వెంకట్ కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో వెంకట్ భార్య సరిత అబ్బాయిని కొట్టడంతో వివాదం మొదలైంది.   మే 15న వెంకట్ ఇంటిపై కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో దాడి చేసి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వెంకట్ కుటుంబ సభ్యులపై దాడికి పాల్ప‌పడ్డారు. దీంతో వెంక‌ట్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మీర్‌పేట్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ వివాదంపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చెంపదెబ్బ ఘటనపై శివకుమార్ కొత్త స్క్రీన్ ప్లే!

తెనాలి ప్రస్తుత ఎమ్మెల్యే, ఘోర పరాజయం పాలవబోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కేవలం ఫైట్ మాస్టరే అని ఇప్పటి వరకూ అనుకుంటూ వచ్చాం కదా.. ఆయన కేవలం ఫైట్ మాస్టర్ మాత్రమే కాదు.. కథ, స్క్రీన్ ప్లే, మాటల రచయితగా కూడా మంచి టాలెండెడ్ అని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది.  గొట్టిముక్కల సుధాకర్ అనే తెనాలి ఓటర్ కొట్టిన గాఠ్ఠి చెంపదెబ్బ నుంచి కాస్త కోలుకున్న అన్నాబత్తుని శివకుమార్ ఇప్పుడు కొత్త స్క్రీన్ ప్లేతో జనం ముందుకు వచ్చారు. వాస్తవానికి పోలింగ్ రోజు జరిగిందేమిటంటే, తెనాలి ఐతానగర్లో వున్న పోలింగ్ స్టేషన్‌కి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తన భార్యతో కలసి ఓటు వేయడానికి వచ్చారు. డైరెక్ట్.గా పోలింగ్ బూత్ దగ్గరకి వెళ్ళబోయారు.  అప్పటికే క్యూలో నిరీక్షిస్తున్న గొట్టిముక్కల సుధాకర్ మీరెలా డైరెక్ట్.గా  బూత్ దగ్గరకి వెళ్తారు. మీరు కూడా క్యూలో రావాలి అన్నారు. అంతే, శివకుమార్ శివాలెత్తిపోయారు. గొట్టిముక్కల సుధాకర్ దగరకి వెళ్ళి ఆయన చెంప మీద కొట్టారు. దాంతో గొట్టిముక్కల సుధాకర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. శివకుమార్ కొట్టినదానికంటే డబుల్ కోటాలో రివర్స్ గిఫ్ట్.గా చెంప ఛెళ్ళుమనిపించారు. దాంతో శివకుమార్ అనుచరులు సుధాకర్ మీదపడి చావగొట్టారు. ఆ తర్వాత పోలీసులు సుధాకర్ మీద కేసు పెట్టారు. ఎన్నికల కమిషన్ జోక్యంతో శివకుమార్‌ని హౌస్ అరెస్టు చేశారు. సుధాకర్‌ని శివకుమార్ చెంపదెబ్బ కొట్టిన సంగతేమోగానీ, శివకుమార్‌ని సుధాకర్ లాగిపెట్టి కొట్టడం హైలైట్ అయింది. ఓటర్ని కొట్టినందుకు శివకుమార్‌కి తిక్క కుదిరిందన్న అభిప్రాయం అంతటా వ్యాపించింది. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఈ వార్త దావానలంలా వ్యాపించి, ఓటింగ్ మీద తీవ్ర ప్రభావం చూపించింది. అసలే ఓటమి బాటలో వున్న శివకుమార్ ఈ ఘటన పుణ్యమా అని ఓటమి కన్ఫమ్ చేసుకున్నారు. ఓటర్ని కొట్టి, ఓటర్ చేత కొట్టించుకున్న ఘటనలో పరువు పూర్తిగా పోగొట్టుకున్న శివకుమార్ ఇప్పుడు సరికొత్త స్క్రీన్ ప్లేతో రిపేరింగ్ వర్క్ మొదలుపెట్టారు. ‘‘నేను, నా భార్య ఓటు వేయడానికి వెళ్ళాం. అక్కడ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి నన్ను దూషించడం మొదలుపెట్టాడు. ఎమ్మెల్యేగా మాల, మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ నన్ను దుర్భాషలాడాడు. వైసీపీపై ద్వేషంతో రగిలిపోయాడు. నా భార్య ముందే నన్ను తిట్టాడు. నేను పోలింగ్ బూత్‌లోకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు తిడుతూనే వున్నాడు. తాను కూడా నా సామాజిక వర్గం వాడే అయినప్పటికీ, నువ్వు మన సామాజిక వర్గం వాడినేనా అని తిట్టాడు. పోలింగ్ బూత్ దగ్గర మద్యం మత్తులో అతను చాలామందితో దురుసుగా ప్రవర్తించాడు. ఇదంతా అక్కడున్న ఓటర్లే చెప్పారు’’ అని కొత్త స్టోరీ అల్లి చెబుతున్నారు. తన అహంకారంతో జరిగిన సంఘటన మధ్యలోకి శివకుమార్ కులాలని కూడా లాక్కొచ్చారు. తన భార్యని కూడా ఇన్వాల్వ్ చేశారు. మిస్టర్ శివకుమార్.. ఓటర్ని కొట్టి నువ్వు చేసింది పెద్ద తప్పు. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం కోసం కొత్త స్క్రీన్ ప్లే క్రియేట్ చేయడం, కులాలని, మీ భార్యని ఈ ఇష్యూలోకి లాగడం ఇంకా పెద్ద తప్పు. అర్థమవుతోందా?

అర్భన్ ఓటింగ్ భారీగా పెరిగింది.. సంకేతమేంటి?

సాధారణంగా ఓట్ల పండుగ పట్ల అర్బన్ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపరు. ఇన్నేళ్లుగా మనం చూస్తున్న ట్రెండ్ అదే. అయితే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి అర్బన్ ఓటింగ్ భారీగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 81.80 శాతం పోలింగ్ నమోదైంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఇది రెండు శాతం అధికం. ఇక అర్బన్ ఓటింగ్ లో   పెరుగుదల  విస్మయం గొలిపే విధంగా ఉంది. విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో అర్బన్ ఓటింగ్  అత్యధికంగా అత్యధికంగా 11.59శాతం పెరిగింది. అలాగే  విజయవాడ సెంట్రల్ లో 7.18శాతం, నెల్లూరు సిటీలో 6.3శాతం, కాకినాడ సిటీలో 5.78శాతం, విజయవాడ ఈస్ట్ లో 5.21శాతం ఇక గాజువాకలో 4.5శాతం చొప్పున ఓటింగ్ అధికంగా నమోదైంది. మొత్తం మీద రాష్ట్రంలో 35 అర్బన్ నియోజకవర్గాలు ఉంటే వాటిలో పాతికపైన నియోజకవర్గాలలో ఓటింగ్ శాతం పెరిగింది. అర్బన్ ఓట్లలో పెరుగుదల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఈ సారి ఒక కొత్త రికార్డు నమోదు చేసిందని చెప్పవచ్చు. ఇక ఓవరాల్ పోలింగ్ విషయంలో కూడా సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన నాలుగు దశలలో దేశం మొత్తంలోనే ఓటింగ్ శాతంలో ఏపీ నంబర్ వన్ గా నిలిచింది. అదొకటి అలా ఉంచితే అనూహ్యంగా అర్బన్ ఓటింగ్ పెరగడం పరిశీలకులనే విస్మయపరిచింది.  జగన్ సర్కార్ పై తీవ్ర ప్రజా వ్యతిరేకత కారణంగా ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశాలున్నాయని ముందునుంచీ అందరూ ఊహించిందే అయినా అర్బన్ ఓటింగ్ పెరుగుదల మాత్రం ఎవరి ఊహలకూ అందలేదనే చెప్పాలి.  ఎందుకంటే అర్భన్ ఓటర్లలో అత్యధికులు ఉద్యోగులు, వ్యాపారులు ఉంటారు. వారు సాధారణంగా పోలింగ్ బూత్ లకు వచ్చి క్యూలైన్ లో నిలుచుని ఓటు వేయడానికి పెద్దగా ఉత్సాహం చూపరు. కానీ ఈ సారి మాత్రం పొద్దుటే పోలింగ్ బూత్ లకు తరలివచ్చి గంటల తరబడి క్యూలైన్ లో తమ వంతు వచ్చే వరకూ ఓపికగా వెయిట్ చేసి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అన్న ప్రశ్నకు పట్టణ ప్రజలలో జగన్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తం కావడం వల్లనేనని పరిశీలకులు బదులిస్తున్నారు. అర్బన్ ఓటర్లలో అత్యధికులు వ్యాపారాలు చేసుకునే వారు, ఉద్యోగులు, యువత ఉంటారు. వీళ్లందరిలో వైసీపీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, విద్యుత్, పెట్రోల్ చార్జీల పెరుగుదల, అలవిమాలిన పన్నులు ఇవన్నీ పట్ణణ ప్రాంత ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను ప్రోది చేశారు. దీంతో వారు ఎలాగైనా జగన్ ను ఓడించాలన్న కంకణం కట్టుకున్నారు. దీంతో గతానికి భిన్నంగా వారు పట్టుదలగా బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  సాధారణంగా ఓటింగ్ శాతంలో పెరుగుదల  ప్రజలలో తీవ్రంగా ఉన్న ప్రజా వ్యతిరేకతను సూచిస్తుంది. ఏపీలో కూడా అదే జరిగింది.  

పల్నాడుజిల్లాలో పెట్రో బాంబుల కలకలం 

ఎపి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోజరిగిన శాంతిభద్రతల సమస్యలు ఇప్పట్లో సమసే అవకాశం  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో వైసీపీ, టీడీపీ నేతలు కార్యకర్తల మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే, ఇరు పార్టీల నేతల ఫిర్యాదుతో గొడవకు కారణమైన నాయకులను అరెస్టు చేసేందుకు గ్రామంలో గురువారం సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీ నేతల ఇళ్లల్లో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు బయటపడడంతో పోలీసులు నివ్వెరపోయారు. పెద్ద సంఖ్యలో ఉన్న ఆ బాంబులను కనుక పోలింగ్ రోజు ఉపయోగించి ఉంటే గ్రామంలో భారీ విధ్వంసం జరిగేదని తెలిపారు.  మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామం అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతమని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రామంలో గొడవలు పెరిగాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య తరచూ ఘర్షణలు మొదలయ్యాయి. టీడీపీ నేతలపై దాడులు పెరిగాయి. పోలీసులు కూడా రక్షణ కల్పించలేక పోవడడంతో టీడీపీ నేతలు పలువురు గ్రామంలో ఉండలేక హైదరాబాద్, గుంటూరు వెళ్లిపోయారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో పోలీసులు రక్షణ కల్పించాక టీడీపీ నేతలు గ్రామానికి తిరిగి వచ్చారు.

హిందూపురంలో తక్కువ ఓటింగ్.. కారణమేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసి మూడు రోజులైంది. రాష్ట్రంలో పోలింగ్ శాతం ఎంతన్నది అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 81.86శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2019 ఎన్నికలలో నమోదైన పోలింగ్ కంటే రెండు శాతం ఎక్కువ. సాధారణంగా అధిక ఓటింగ్ యాంటీఇంకంబెన్సీకి తార్కానమని రాజకీయ పండితులు చెబుతారు. ఫలితాలు కూడా అలాగే వస్తుంటాయి. ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర సగటు ఓటింగ్ కంటే కీలక నియోజకవర్గాలలో అధిక పోలింగ్ జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే తెలుగుదేశం అధినేత పోటీ చేసిన కుప్పంలో, వైసీపీ అధినేత పోటీ చేసిన పులివెందులలో, అలాగే జనసేనాని పోటీలో ఉన్న పిఠాపురంలో, తెలుగుదేశం జాతీయ కార్యదర్శి పోటీలో ఉన్న మంగళగిరిలో రాష్ట్ర సగటు కంటే అధిక పోలింగ్ నమోదైంది.  అయితే ఆశ్చర్యకరంగా నందమూరి బాలకృష్ణ పోటీ చేసిన హిందుపూర్ నియోజకవర్గంలో మాత్రం ఓటింగ్ తగ్గింది. హిందూపూర్ లో ఈ సారి 77.82 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2019 ఎన్నికలలో నమోదైన పోలంగ్ కంటే కూడా స్వల్పంగా తక్కువ. దీంతో హిందూపూర్ లో తక్కువ ఓటింగ్ నమోదు కావడానికి కారణాలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇక్కడ నుంచి 2014, 2019 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి బాలకృష్ణ విజయం సాధించారు. ఈ సారి ముచ్చటగా మూడో సారి కూడా విజయకేతం ఎగురవేసి హ్యాట్రిక్ కొట్టాలన్న ఉత్సాహంతో ఉన్నారు. అయితే హిందూపూర్ లో రాష్ట్ర సగటు కంటే పోలింగ్ తక్కువ నమోదు కావడానికి కారణం ఏమిటి? ఇక్కడ పరిస్థితి వైసీపీకి అనుకూలంగా ఏమైనా ఉందా అన్న సందేహాలు కొందరిలో వ్యక్తం అయ్యాయి. అయితే హిందూపుర్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ ఇక్కడ ఆ పార్టీ ఓడిపోయిన పరిస్థితి లేదు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన హిందూపూర్ నుంచి 2014, 2019 ఎన్నికలలో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి వీచిన 2019 ఎన్నికలలో కూడా ఆయన ఘన విజయం సాధించారు. అంతే కాదు 2014 ఎన్నికలలో సాధించిన మెజారిటీ కంటే ఎక్కువ సాధించారు. ఆ ఎన్నికలలో రాయలసీమ మొత్తంలో తెలుగుదేశం కేవలం మూడంటే మూడు స్థానాలలోనే విజయం సాధించింది. అంతే కాదు ఆ ఎన్నికలలో చంద్రబాబు మెజారిటీ కూడా భారీగా తగ్గింది. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా బాలకృష్ణకు హిందుపూర్ ఓటర్లు బ్రహ్మరథం పట్టారు.  మరి అటువంటిది అంతా సానుకూలంగా ఉన్న ఈ సమయంలో హిందుపూర్ లో ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావడమేమిటన్న ప్రశ్నకు పరిశీలకులు హేతుబద్ధంగా ఇస్తున్న విశ్లేషణ ఏమిటంటే.. హిందుపూర్ లో వైసీపీ ప్రచారం సమయంలోనే కాడె వదిలేసింది. ఈ నియోజకవర్గంలో విజయంపై వైసీపీకి ఆశల్లేకపోవడంతో ఆ పార్టీ ప్రచారం కూడా పేలవంగా సాగింది.  ఇక్కడ బాలకృష్ణ ప్రత్యర్థిగా దీపిక నిలబడ్డారు. నియోజకవర్గంలో ఆమె ప్రచారం అత్యంత పేలవంగా ఉంది. అంతే కాకుండా హిందుపూర్ నియోజకవర్గ వైసీపీలో గ్రూపు విబేదాలు తీవ్రంగా ఉన్నాయి. ఆ పార్టీ నేతల మధ్య ఐక్యత లేదు. తన విజయం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్న బాలకృష్ణ హిందూపూర్ తో పాటు కూటమి అభ్యర్థుల విజయానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు.  ఇక షెడ్యూల్ ప్రకటనకు ముందు వెలువడిన దాదాపు డజనుకు పైగా సర్వేలన్నీ కూడా హిందూపూర్ లో బాలకృష్ణ విజయం నల్లేరు మీద బండినడకేనని పేర్కొన్నాయి.   ఇక పోల్ మేనేజ్ మెంట్ విషయంలో కూడా హిందుపూర్ లో వైసీపీ ఘోరంగా విఫలమైంది. ఓటర్లను పోలింగ్ బూత్ లకు తీసుకువచ్చే ప్రయత్నం కూడా ఆ పార్టీ చేయలేదు.  ఇక పోలింగ్ శాతం తక్కువగా ఉండడానికి హిందూపురం అర్బన్ ఓటర్లు పోలింగ్ బూత్ లకు రాలేదనీ, అలాగే ఇక్కడ నుంచి వలస వెళ్లిన వారికి ఓటింగ్ కు వచ్చేలా చేయడానికి పెద్దగా ప్రయత్నాలు జరగలేదనీ అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే విజయంపై ధీమా ఉండటంతో తెలుగుదేశం పార్టీ కూడా వలస వెళ్లిన వారిని రప్పించేందుకు పెద్దగా కృషి చేయలేదని అంటున్నారు.  హిందుపూర్ లో బాలయ్య పై ఎలాంటి వ్యతిరేకతా లేకపోవడం వల్లనే ఓటింగ్ శాతం పెరగలేదనీ, పడిన ఓటంతా సానుకూల ఓటేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఎపిలో నలుగురు ఎస్ పీలపై వేటు? 

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై ఈసీ సీరియస్ అయ్యింది. తిరుపతిలో టిడిపి నేత పులివర్తినానిపై దాడి, తాడిపత్రిలో హింసాత్మక సంఘటనలు, పల్నాడులో చెలరేగిన హింస ఎన్నికల కమిషన్కు  చెడ్డ పేరు తీసుకొచ్చింది. వైసీపీ అధికార యంత్రాంగమంతా ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది. ఈ కారణంగా ఎన్నికల కమిషన్ ఇబ్బందుల్లో పడింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా నలుగురు ఎస్ పిలను ఏరివేయడానికి సిద్దమైంది.   ఎపిలో పోలింగ్ పూర్తయింది.  కౌంటిగ్ కు  మాత్రం వచ్చే నెల నాలుగో తేదీన ఉండటంతో అప్పటి వరకు రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే ఉద్దేశ్యంతో ఎన్నికల కమిషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో మరో నలుగురు ఎస్పీలపై ఎన్నికల సంఘం కత్తి వేలాడుతోంది. ఎన్నికల విధుల్లో వైఫల్యం.. హింసను కట్టడి చేయలేక పోవడంపై చర్యలు తీసుకోబోతోంది. బుధవారం రాత్రి పోలీసు ఉన్నత స్థాయి అధికారులకు అందిన సమాచారం మేరకు గురువారం రాయలసీమలో ముగ్గురు, పల్నాడులో ఒకరిపై వేటుపడే అవకాశం ఉంది. పోలింగ్‌ సందర్భంగా జరిగిన హింసపై సీరియస్‌ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్‌... ఆ తర్వాతా కొనసాగడాన్ని క్షమించలేక పోతోంది. ఎప్పుడూ గొడవలు జరిగే పల్నాడు జిల్లాలో విధ్వంసాన్ని ఉపేక్షించే ప్రసక్తేలేదని ఢిల్లీ ఈసీ వర్గాలు రాష్ట్ర పోలీసు పెద్దలకు హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది.

విశాఖ ఎంపీగా కె.ఎ.పాల్ ఘన విజయం!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలతోపాటు అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా  హోరాహోరీగా పోటీ నెలకొంది.. ఒక్క విశాఖపట్నం స్థానంలో తప్ప. ఎందుకంటే, ఈ స్థానం నుంచి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ పోటీలో వున్నారు. దాంతో ఇక్కడ వార్ వన్‌సైడ్ అయిపోయింది. విశాఖ ఓటర్లు తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్న మతుకుమిల్లి భరత్‌ని, వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీరాణిని ఎంతమాత్రం పట్టించుకోలేదు. కాంగ్రెస్ లాంటి మిగతా పార్టీల అభ్యర్థులను గానీ, ఇండిపెండెంట్లను గానీ ఎంతమాత్రం లెక్కచేయలేదు. విశాఖ ఓటర్లందరూ గంపగుత్తగా కేఏ పాల్‌కి ఓటేశారు. ఈవీఎంలలో సీరియల్ నంబర్ 14, కుండ గుర్తు పక్కనే వున్న బటన్ నొక్కేశారు. ఈ నేపథ్యంలో విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా కేఏ పాల్ విజయం కన్ఫమ్ అయిపోయింది. ఇక ఓట్ల లెక్కింపు, రిజల్ట్ ప్రకటన లాంటి ఫార్మాల్టీస్ మాత్రమే మిగిలి వున్నాయి. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో కేఏ పాల్ చేసిన ప్రచారం ఓటర్ల మీద బాగా ప్రభావం చూపింది. తన సింబల్ కుండని పట్టుకుని రోడ్ల వెంట తిరగడం, సముద్రంలో వల వేసి చేపలు పట్టడం, అవసరమైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కొనేసి ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం, విశాఖలో సముద్ర తీరం వెంట బోలెడన్ని మినీ హార్బర్లు కట్టిస్తానని చెప్పడం, అందరికీ ఉద్యోగాలు, ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇస్తానని చెప్పడం, ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా కామెడీ పనులు చేసి ఓటర్లని కడుపారా నవ్వించడం.. ఇవన్నీ ఓటర్లను ఆకర్షించాయి. ఓట్ల లెక్కింపు జరగడానికి ఇంకా 20 రోజుల టైమ్ వుంది. అప్పటి వరకూ వెయిట్ చేయడం ఎందుకని, ఎలాగూ తన విక్టరీ కన్ఫమ్ అయిపోయింది కాబట్టి, విశాఖ పార్లమెంట్ సభ్యుడి హోదాలో నియోజకవర్గ వ్యాప్తంగా రకరకాల అధికారిక కార్యక్రమాలు చేపట్టడానికి కేఏ పాల్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎంపీగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నా విజయం ఖాయమైపోయింది. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 14 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లలో మొత్తం పది లక్షల ఓట్లు నాకు పడ్డాయి. మా పార్టీ చేసిన ఇంటర్నల్ సర్వేల్లో నేను 10 లక్షల మెజారిటీతో గెలవబోతున్నట్టు తెలిసిపోయింది. నియోజకవర్గంలో వున్న నాలుగు లక్షల క్రిస్టియన్ల ఓట్లు, రెండు లక్షల మంది యూత్ ఓట్లు, స్టీల్ ప్లాంట్ కొంటానని అన్నా కాబట్టి... రెండు లక్షల నిరుద్యోగుల ఓట్లు, ఇంకా రెండు లక్షల బలహీన వర్గాల ఓట్లు నాకు పడ్డాయి. విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాను అనే ధైర్యంతో ఈరోజే నేను విశాఖ అభివృద్ఢి కోసం ప్రణాళికలు రచిస్తున్నాను. రేపటి నుంచి నేను నియోజకవర్గంలో ఏం చేయాలనేది ప్లాన్ చేస్తున్నా. 100 రోజుల్లో విశాఖను అభివృద్ధి  చేసేస్తాను. ఉద్యోగాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని అమలు చేసేస్తాను.  నా బర్త్ డే సెప్టెంబర్ 25. ఈలోగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి చూసి అందరూ షాకైపోతారు’’ అని కె.ఎ.పాల్ చెప్పారు. కె.ఎ.పాల్ లాంటి వ్యక్తి విశాఖ ఎంపీగా గెలవటం విశాఖ ప్రజల అదృష్టం.  (రచన: మతిలేని మంగపతి, (ఎక్స్ వార్డ్ మేట్ టు కె.ఎ.పాల్), వార్డు నంబర్ 14, ప్రభుత్వ మెంటల్ హాస్పిటల్, విశాఖపట్నం)

శ్రీశైలంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శంకర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేనుకున్నారు. మృతుడు శంకర్ శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ విశ్రాంతి గదిలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ ప్రసాద్ రావు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు స్పందిస్తూ... శ్రీశైలంకు వెళ్తున్నానని, అక్కడకు వెళ్లిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. శంకర్ సూసైడ్ తో అక్కడ విషాదకర వాతావరణం నెలకొంది.  మృతుడు రక్తపుమడుగులో పడి ఉన్న ఘటనను పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలయలేదు. సమాచారం అందుకున్న సీఐ ప్రసాద్‌రావు అక్కడికి చేరుకొని ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం విచారణ చేస్తున్నారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు శ్రీశైలం చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 

మౌనమేలనోయి.. జగన్ ను నిలదీస్తున్న వైసీపీ క్యాడర్

ఏపీలో పోలింగ్ పూర్తయ్యింది. ఓటరు తీర్పు సురక్షితంగా ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలు మరింత భద్రంగా స్ట్రాంగ్ రూమ్ లలో ఉన్నాయి. పోలింగ్ పూర్తై మూడు రోజులు గడిచినా రాష్ట్రంలో మాత్రం ఇంకా హై టెన్షన్ వాతావరణం అలాగే ఉంది. రాష్ట్రంలోని పల్నాడు, రాయలసీమలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాడులు, ప్రతి దాడులతో రగిలిపోతున్నాయి. సాధారణంగా పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తతలు నెలకొనడం ఆ తరువాత చల్లారిపోవడం సహజమే. అయితే ఈ సారి మాత్రం పోస్ట్ పోల్ హింస పెచ్చరిల్లుతోంది.  గత ఎన్నికల కంటే రెండు శాతానికి మించి అధికంగా పోలింగ్ జరగడం అధికార వైసీపీలో ఆందోళనకు కారణమైంది. అందుకే ఉదయం చెదురుమదురు సంఘటనలు వినా ప్రశాంతంగా సాగిన పోలింగ్ మధ్యాహ్నానికి వైసీపీ మూకలు చెలరేగిపోవడంతో  హింసాత్మకంగా మారింది. పోలింగ్ సరళిని బట్టి ఆందోళనకు గురైన వైసీపీ అధినాయకత్వం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలతోనే వైసీపీ మూకలు పోలింగ్ సజావుగా జరగకుండా, ఓటర్లు ధైర్యంగా క్యూలలో నిలబడి ఓటు వేసే పరిస్థితి లేకుండా చేయడానికి ప్రయత్నించాయన్నది పరిశీలకులు విశ్లేషణ. సరే మళ్లీ అదే పరిశీలకులు హింసాకాండకు బెదరకుండా ఓటర్లు ధైర్యంగా, ఓపికగా క్యూలైన్లలో వేచి ఉండి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారనీ, ఇదే వారిలో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత తీవ్ర స్థాయిలో ఉందో తెలియజేస్తోందని కూడా చెప్పారు. . అదే పోలింగ్ సరళి తెలుగుదేశం శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసిం ది. ఇక అధికార పార్టీ ఆగడాలను మౌనంగా భరించనవసరం లేదన్న ధైర్యాన్ని నింపింది. పోలింగ్ తరువాత పల్నాడు, రాయల సీమలో  వైసీపీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కోవడంలో తెలుగుదేశం శ్రేణులు నిర్భీతిగా ముందుకు కదలడానికి అదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అదే సమయంలో పోలింగ్ తమకు వ్యతిరేకంగా జరిగిందని వైసీపీ కీలక నేతలు, కొందరు అభ్యర్థులూ మీడియా ముందు అంగీకరిస్తున్నారు. పోలీసులు తెలుగుదేశం కూటమికి అన్నివిధాలుగా మద్దతుగా నిలిచారనీ, తమను మాత్రం ఎక్కడికక్కడ నియంత్రించారనీ అంబటి, సజ్జల వంటి వారు ఆరోపణలు గుప్పించారు. సజ్జల అయితే ఒక అడుగు ముందుకు వేసి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం పని చేసిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మాటలన్నీ వైసీపీలోని ఓటమి భయాన్ని ప్రస్ఫుటంగా ఎత్తి చూపుతున్నాయి. అలాగే వైసీపీ అడ్డాలుగా చెప్పబడే ప్రాంతాలలో పోలింగ్ అనంతర హింసాకాండను నిలువరించడంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినా తెలుగుదేశం కేడర్ ధైర్యంగా నిలబడి అడ్డుకోవడం ఆయా ప్రాంతాలలో మారిన రాజకీయ పరిస్థితికి అద్దం పడుతోంది. వైసీపీ కంచుకోటలను ఓటర్లు బీటలు వారేగా చేశాయనడానికి ఇదే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక ఎన్నికల తరువాత ఆ పార్టీ అధినేత జగన్ తీరు క్యాడర్ లో ఉత్సాహాన్ని చంపేసింది. ఆయన పూర్తిగా మౌనముద్రలోకి వెళ్లిపోవడం, రేపో మాపో విదేశీ పర్యటనకు రెడీ అయిపోవడంతో క్యాడర్ లో విశ్వాసం సన్నిగిల్లింది.  ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో హింసాకాండను ఖండించాల్సిన బాధ్యత కలిగిన హోదాలో ఉన్నారు. అయినా ఆయన నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. ఎందుకీ మౌనం అంటూ జగన్ ను వైసీపీ క్యాడర్ నిలదీస్తోంది. ఎన్నికల సమయంలో కష్టపడి పని చేసిన క్యాడర్ కు ఓదార్పు కలిగేలా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడమేమిటన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది.  మరోవైపు విపక్ష నేత చంద్రబాబు ఎన్నికల హింసను ఖండిస్తూ.. సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఎన్నిలక సంఘానికి లేఖ రాశారు. కానీ జగన్ వైపు నుంచి అటువంటిదేమీ లేదు.  ఇదే ఆయనలోని నైరాశ్యానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కనీసం క్యాడర్ లో ధైర్యాన్ని, స్థైర్యాన్నీ నింపడానికైనా విజయం మనదే అన్న భరోసా ఇవ్వడానికి కూడా జగన్ ముందుకు రాలేదంటే ఫలితంపై ఆయన అభిప్రాయం ఏమిటన్నది అవగతమైపోతోందంటున్నారు.  ఇక జగన్ మౌత్ పీస్ లాంటి సజ్జల బెట్టింగులకు పాల్పడి ఆర్థికంగా నష్టపోకండి అంటూ వైసీపీ క్యాడర్ కు  సలహాలిస్తూ మన సీన్ అయిపోయిందన్న సంకేతాలిస్తున్నారు. 

కొనకళ్ల నారాయణరావుకు గుండెపోటు

 ఎపిలో సార్వత్రిక ఎన్నికల్లో భారీగా పోలింగ్ జరగడంతో వైసీపీ శ్రేణుల్లో నిరాశ, నిస్పృహ నెలకొంది.      ప్రభుత్వ వ్యతిరేక ఓటు టిడిపికి పడినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్న నేపథ్యంలో కృష్ణ జిల్లా టిడిపి శ్రేణులకు చేదు వార్త ఇది.  కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో... కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు తెలిపారు. కొనకళ్ల గుండెపోటుకు గురయ్యారన్న వార్తతో ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ ఆరా తీసినట్టు సమాచారం. 2009, 2014లో మచిలీపట్నం నుంచి టీడీపీ తరపున కొనకళ్ల ఎంపీగా రెండు సార్లు గెలుపొందారు. 2019లో అక్కడి నుంచే పోటీ చేసి వైసీపీ అభ్యర్థి బాలశౌరి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కొనకళ్లకు టికెట్ దక్కలేదు. వైసీపీని వీడి జనసేనలో చేరిన బాలశౌరి కూటమి తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బాలశౌరితో పాటు కూటమి అభ్యర్థుల తరపున కొనకళ్ల పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ నలుగురికీ సీన్ అర్ధమైపోయిందా?

వైసీపీలో  నైరాశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపుపై ఆశలు ఇసుమంతైనా కనిపించడం లేదు. పార్టీ అధినేత జగన్ నుంచి, ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల వరకూ అందరూ మౌనముద్రలోకి వెళ్లిపోయారు. అంబటి వంటి ఒకరిద్దరూ, ఇంత కాలం పార్టీకీ, ప్రభుత్వానికీ  సలహాలిచ్చిన సజ్జల మాత్రం ఎన్నికల సంఘంపైనా, పోలీసులపైనా విమర్శలు గుప్పిస్తూ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారు. ఇక  అవసరమున్నా లేకున్నా విపక్షంపై నోరేసుకు పడిపోయే రోజా, కొడాలి వంటి వారు ఆశ్చర్యకరంగా మౌనముద్రలోకి వెళ్లిపోయారు. పోలింగ్ రోజున తనకు సొంత పార్టీ వారే వ్యతిరేకంగా పని చేశారంటూ ఆరోపణలకు గుప్పించిన రోజా ఆ తరువాత మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. ఇక కొడాలి నాని అయితే పోలింగ్ రోజున తీరిగ్గా ఎప్పుడో సాయంత్రం వచ్చి కుటుంబంతో సహా ఓటేసి వెళ్లిపోయారు. ఎక్కడా ఎన్నికల తీరు గురించి మాట్లాడలేదు. తన విజయంపై ధీమా వ్యక్తం చేయలేదు. ఇక గన్నవరం ఎమ్మెల్యే వంశీ అయితే పోలింగ్ రోజున ఏదో హల్ చల్ చేయాలని ప్రయత్నించి భగంపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినా ఆయనైతే పోలింగ్ కు ముందే ఇవే తన చివరి ఎన్నికలు, వచ్చే ఎన్నికలలో పోటీ చేయను అని ప్రకటించేసి ముందుగానే గెలుపు ఆశలు వదిలేసుకున్నారు.  దీంతో ఇప్పుడు రాష్ట్ర మంతటా వైసీపీ ఫైర్ బ్రాండ్ బ్యాచ్ గా పేరుపడ్డ ఈ నలుగురిపైనే చర్చ జరుగుతోంది. వీరి పరిస్థితి ఏమిటి? గెలుపా? ఓటమా? అన్న ఆసక్తి వ్యక్తం అవుతోంది.  ఆ ఫైర్ బ్రాండ్ బ్యాచే  కొడాలి నాని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ. అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు కూడా ఉన్నప్పటికీ, పార్టీ అధినేతే వారి గెలుపు చీటీ చింపేసి నియోజకవర్గం మార్చేశారు కనుక అటువంటి వారిపై పెద్దగా చర్చ జరగడం లేదు.   తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వీరు వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డారు. జగన్ మీద ఈగ వాలితే ఆ ఈగను కూడా చంద్రబాబే పంపించారు అనే స్థాయిలో విరుచుకుపడేవారు. అటువంటి ఈ నలుగురూ ఈ సారి తమతమ నియోజకవర్గాలలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  ముందుగా కొడాలి నాని విషయానికి వస్తే ఆయన గుడివాడ నియోజకవర్గం నుంచి 2004నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. మొదటి రెండు సార్లే తెలుగుదేశం అభ్యర్థిగా, ఆ తరువాత రెండు సార్లూ వైసీపీ అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు.  జగన్  తొలి క్యాబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. అటువంటి నాని ఈ సారి గుడివాడలో విజయం సాధించే అవకాశాలు దాదాపు మృగ్యమనే చర్చ వైసీపీ లోనే జరుగుతోంది.  ప్రభుత్వ వ్యతిరేకతకు, నాని వ్యవహారశైలి, ఆయన అనుచిత భాషా ప్రావీణ్యంతోడైందనీ, అందుకే ఆయనకు నియోజకవర్గంలో గడ్డు పరిస్థితి ఎదురైందని అంటున్నారు.  ఇక రోజా విసయానికి వస్తే ఆమె నగరి నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికలలో విజయం సాధించారు. జగన్ మలి క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు.   అయితే ఈ సారి మాత్రం ఆమె విజయం అంత సులువు కాదని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఆమె వ్యవహారశైలి కారణంగా సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆమె విజయానికి పార్టీ పరంగా నగరిలో సహకారం కరవైందని అంటున్నారు. అంతే కాకుండా సొంత పార్టీ నేతలే తెలుగుదేశంకు అనుకూలంగా పని చేశారని అంటున్నారు. వేరే ఎవరో అనడం కాదు, పోలింగ్ రోజున స్వయంగా రోజాయే ఆ విషయం చెప్పి తన ఓటమిని పరోక్షంగానైనా ముందే అంగీకరించేశారు.   ఇక అంబటి రాంబాబు విషయానికి వస్తే సత్తెన పల్లిలో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ఆయన వ్యవహారశైలి, ఇష్టారీతిగా నోరు పారేసుకునే విధానం కారణంగా సొంత పార్టీలోనే ఆయన పట్ల అసంతృప్తి వ్యక్తం అయ్యిందంటున్నారు. ఇక ఆయన కూడా పోలీసులు, ఈసీ తెలుగుదేశం కూటమికి అనుకూలంగా పని చేశాయని ఆరోపణలు గుప్పించి, తన ఓటమిని తానే చాటుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక చివరిగా గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ విషయానికి వస్తే... తెలుగుదేశం అభ్యర్థిగా 2019లో విజయం సాధించిన వంశీ ఆ తరువాత వైసీపీ గూటికి చేరిపోయారు. చేరి ఊరుకోకుండా గన్నవరం తెలుగుదేశం శ్రేణులపై వేధింపులకు పాల్పడ్డారు. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఈ సారి ఎన్నికల నామినేషన్ సందర్భంగానే వంశీ పట్ల నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత ఏమిటన్నది గోచరమైంది. ఆయన నామినేషన్ ర్యాలీ నామ్ కే వాస్తేగా జరిగింది. పార్టీ శ్రేణులు కూడా దాదాపు ముఖం చాటేశాయని అప్పట్లో గట్టిగా వినిపించింది. మొత్తం మీద ఈ సారి వంశీ గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయమే వ్యక్తం అవుతోంది. 

సజ్జల చెప్పేస్తున్నారుగా?

సజ్జల రామకృష్ణారెడ్డి వాస్తవాలు చెప్పేస్తున్నారు. సూటిగా కాకున్నా సూచనలు, సలహాలంటూ రాష్ట్రంలో వైసీపీ మరో సారి అధికారం చేపట్టే అవకాశం లేదని పార్టీ క్యాడర్ ను ముందుగానే ప్రిపేర్ చేస్తున్నారు. గెలుపు ఓటములపై బెట్టింగులకు పాల్పడి నష్టపోవద్దంటూ పార్టీ కార్యకర్తలకు సూచలను ఇస్తున్నారు. సలహాలు చెబుతున్నారు. తద్వారా వైసీపీ గెలిచే అవకాశాలు మృగ్యమని వారికి సంకేతాలు పంపిస్తున్నారు. అదే సమయంలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగలేదనీ, పోలీసులు తెలుగుదేశం కూటమికి కొమ్ము కాశారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. సాధారణంగా పోలీసులు అధికారంలో ఉన్న తమకు కాకుండా విపక్ష కూటమికి కొమ్ము కాసారని చెప్పడం అంటే తమకు ఓట్లు పడలేదని అంగీకరించడమేనని, ఇలాంటి మాటలన్నీ సాధారణంగా ఓడిపోయే పాటి.. సాకులు వెతుక్కునే ప్రయత్నంగా చెబుతుందనీ రాజకీయ పండితులు అంటున్నారు.  అయితే సజ్జల అక్కడితో ఊరుకోకుండా పరిస్థితులను చూస్తుంటే ఓట్ల లెక్కింపు కూడా సక్రమంగా జరుగుతుందని అనిపించడం లేదంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మాటలు చెప్పడానికి ముందు వరకూ, అంటే పోలింగ్ కు ముందు వరకూ కూడా ఎన్నికల ప్రక్రియ అంతా తమ గుప్పెట్లో ఉంచుకోవడానికి సజ్జల, వైసీపీ చేయని ప్రయత్నాలు లేవు. అవి ఫలించలేదని పోలింగ్ ప్రక్రియను గమనించిన వారికి స్పష్టంగానే అర్ధమైపోతోంది. ఇంకా అర్ధం కాని వారు ఎవరైనా ఉంటే వారికి అర్ధమయ్యేలా సజ్జల చెబుతున్నారు.  ఇన్ని ఆరోపణలు, నిష్టూరాలూ వేస్తూ ఎన్నికల ప్రక్రియ సరిగా జరగలేదనీ, ఎన్నికల సంఘం, పోలీసులు విపక్ష తెలుగుదేశం కూటమికి వత్తాసు పలికారనీ ఆరోపణలు గుప్పిస్తున్న సజ్జల చాలా జిల్లాల్లో అధికారులు చాలా వరకూ వైసీపీకే కొమ్ముకాసిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. అయినా  అధికార పార్టీ అయి ఉండీ దాడులకు వైసీపీ తెగపడిందంటేనే ఆ పార్టీకి గెలిచే అవకాశం లేదన్న విషయం పోలింగ్ రోజే స్పష్టమైపోయిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ఓటమికి సాకులు వెతుక్కునే క్రమంలో ఎన్నికల సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాలను ఎన్నికల సంఘం అమలు చేసిందనీ, ఆ పార్టీ ఎలా చెబితే అలా వ్యవహరించిందనీ ఆరోపిస్తున్నారు.  ఓటమిని అంగీకరించడానికి ఇంత కన్నా ఇంకా చెప్పాల్సింది ఏముందని పరిశీలకులు అనడమే కాదు. వైసీపీ క్యాడర్ కూడా ఇదే విషయాన్ని చర్చించుకుంటోంది. ఎన్నికల్లో ఓడిపోతున్నామని చెప్పడానికి ఇంత కన్నా పెద్ద సాక్ష్యం ఏముంటుందని వైసీపీ నేతలు కూడా గుసగుసలాడుకుంటున్నారు.  

ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ లో పలు జల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ  శాఖ పేర్కొంది. మే 19 నుంచి మూడు రోజుల పాటు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలకు కురుస్తాయనీ, గంటకు 50 కిలో మీట్లర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో దక్షిణ కోస్లా, రాయలసీమలలో ఓ మోస్తరు వానలు పడతాయని పేర్కొంది.  ఇలా ఉండగా నైరుతి రుతుపవనాలు ఒక రోజు ముందే అంటే మే 31 నాటికే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ఏడాది దేశంలో ఎల్ నినో పరిస్థితులు ఉండవనీ, సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయనీ పేర్కొంది.