తిరుపతి దొంగ ఓటర్లకు కరోనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక రేపిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. పోలింగ్ రోజున పెద్ద ఎత్తున దొంగ ఓటర్లు పట్టుబడటం కలకలం రేపింది. ఇతర ప్రాంతాల నుంచి వందలాది బస్సులు, కార్లలో వచ్చిన దొంగ ఓటర్లను టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు రెడ్ హ్యాడెండ్ గానే పట్టుకున్నారు. అధికార పార్టీ నేతలు ఫేక్ ఓటరు ఐడీ కార్డులు స్పష్టించి లక్షలాదిగా దొంగ ఓట్లను వేయించుకున్నారని విపక్షాలు ఆరోపించాయి. తిరుపతి అసెంబ్లీ పరిధిలో పోలింగ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. దొంగ ఓటర్ల అంశంపై కోర్టుల్లోనూ కేసులు ఉన్నాయి.  అయితే తిరుపతి పోలింగ్ కు సంబంధించి సంచలన విషయాలు బయటపెడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో బయటి నుంచి వచ్చి దొంగ ఓట్లు వేసిన వారు కరోనా బారిన పడ్డారని చెప్పారు.  పోలింగ్ రోజున దొంగ ఓట్లు వేసి, కరోనాకు గురై ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని చెప్పారు చింతా మోహన్. పోలింగ్ రోజున విధుల్లో ఉన్న సిబ్బంది కోట్లాది రూపాయలను వైసీపీ ఇచ్చిందని రెండు రోజుల క్రితం ఆరోపించారు చింతా మోహన్.  ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాల్సిందేనని చింతా మోహన్ డిమాండ్ చేశారు. బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. తన అవినీతి ఆరోపణల కేసుల్లో నిందితులుగా ఉన్న శ్రీలక్ష్మీ సహా పలువురు ఐఏఎస్ అధికారులకు జగన్ కీలక పోస్టులు ఇచ్చారని... కీలక శాఖల బాధ్యతలను అప్పగించారని విమర్శించారు. సాక్షులను తన అధికారంతో జగన్ ప్రభావితం చేస్తున్నారని చెప్పారు. బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘిస్తుంటే కోర్టులు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. కోర్టులకు కళ్లు లేవా? అని చింతా మోహన్ నిలదీశారు.  ప్రజలు కూడా న్యాయస్థానాల చిత్తశుద్ధిని శంకిస్తున్నారని చింతామోహన్ అన్నారు. లక్ష రూపాయలు తీసుకున్నారనే కేసులో దళితనేత బంగారు లక్ష్మణ్ ను జైలుకు పంపారని... వందల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న జగన్ విషయంలో కోర్టులు కళ్లు మూసుకున్నాయని చెప్పారు. జగన్ కు ఒక న్యాయం, బంగారు లక్ష్మణ్ కు మరో న్యాయమా? అని చింతా మోహన్ అసహనం వ్యక్తం చేశారు.

చార్‌ధామ్‌ యాత్ర రద్దు.. కుంభ‌మేళా ఎఫెక్ట్‌..

ప‌విత్ర చార్‌ధామ్ యాత్ర ర‌ద్దు అయింది. ఉత్త‌రాఖండ్‌లో ఏటా జ‌రిగే చార్‌ధామ్ యాత్ర‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రద్దు చేసింది. కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తీరథ్‌ సింగ్‌ రావత్‌ ప్రకటించారు. నాలుగు ఆలయాల్లోకి భక్తులెవరినీ అనుమతించేది లేదని, కేవలం అర్చకులే పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు.    ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌,యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్‌ధామ్‌లుగా పిలుస్తారు. ఈ ఆలయాలు సంవత్సరంలో ఆరు నెలలు మంచుతో మూసుకుపోయి ఉంటాయి. వేసవి నుంచి ఆరు నెలలు మాత్రమే భక్తులు సందర్శించుకునేందుకు వీలుంటుంది. ఈ ఏడాది మే 14 నుంచి చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా దృష్ట్యా ఈ సారి యాత్రను ప్రభుత్వం రద్దు చేసింది. ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 6వేలకు పైగా కేసులు బయటపడగా.. 108 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.    ఇటీవ‌ల జ‌రిగిన కుంభ‌మేళాపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. కుంభ‌మేళా కార‌ణంగా వేలాది మంది సాధువులు, భ‌క్తులు క‌రోనా బారిన ప‌డ్డారు. కొవిడ్ సంక్షోభం స‌మ‌యంలో కుంభ‌మేళా నిర్వ‌హించ‌డంపై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో.. మ‌ళ్లీ ఈ స‌మ‌యంలో చార్‌ధామ్ యాత్ర‌కు అనుమ‌తిస్తే క‌రోనా కేసులతో పాటు విమ‌ర్శ‌లూ మ‌రింత పెరుగుతాయ‌ని భావించింది ప్ర‌భుత్వం. ఈ ఏడాదికి చార్‌ధామ్ యాత్ర‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

జర్నలిస్టులపై కరోనా పంజా.. ప్రభుత్వాలకు లేదు కరుణ! 

కరోనా మహ్మమారి జర్నిలిస్టులను బలి తీసుకుంటోంది. గత పది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో  దాదాపు 20 మంది వరకు జర్నలిస్టులు  ప్రాణాలు కోల్పోయారు. వీరిలో స్ట్రింగర్లు మాత్రమే కాదు… జిల్లా స్థాయి రిపోర్టర్లు .. సీనియర్ జర్నలిస్టులు.. డెస్క్‌లో పని చేసేవాళ్లు కూడా ఉన్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారిలో సీనియర్ జర్నలిస్టులు అమర్‌నాథ్, శ్రీనాద్ కూడా ఉన్నారు. జర్నలిస్టు ఉద్యమంలో కీలకంగా పని చేసిన అమర్ నాథ్.. కరోనాతో పది రోజుల పాటు పోరాడి నిమ్స్‌లో చనిపోయారు. మెదక్ జిల్లా ఈనాడు స్టాప్ రిపోర్టర్,  శ్రీకాకుళం ఎన్టీవీ రిపోర్టర్ , కడప జిల్లా సాక్షి రిపోర్టర్, కృష్ణా జిల్లాలో ఎన్టీవీ రిపోర్టర్, బతుకమ్మ టీవీ సీఈవో  ప్రాణాలు కోల్పోయారు. సాక్షి కడప జిల్లా స్టాఫర్ తో పాటు డెస్క్‌లో పని చేసే రామచంద్రరావు అనే సబ్ ఎడిటర్ కూడా కరోనా కారణంగా చనిపోయారు. మండల రిపోర్టర్లు వైరస్ భారీన పడి ప్రాణాలు వదిలారు. వందలాది మంది జర్నలిస్టులు కరోనా సోకి మృత్యువుతో పోరాడారు. కొందరు ఉన్న ఆస్తులన్ని అమ్మి ప్రాణాలు దక్కించుకున్నారు.ప్రతి జిల్లా, నియోజకవర్గంలోనూ పదుల సంఖ్యలో జర్నలిస్టులు మహ్మమారి భారీన పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు.  జర్నలిస్టుల కోసం సంఘాల్లో అత్యున్నత స్థాయిలో పనిచేసిన అమర్‌నాథ్ చనిపోతేనే.. పెద్దగా ఎవరూ పట్టిచుకోలేదు. ఇతర జర్నలిస్టుల గురించి ఎవరు పట్టించుకుంటారు.ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడం మానేశాయి. బతికి ఉండి.. పత్రిక కోసం పని చేస్తున్నప్పుడు మాత్రమే వారి అవసరం నేతలకు ఉంది. చనిపోయిన తర్వాత వారి గురించి పట్టించుకునే తీరిక కూడా నేతలకు లేదు. దీంతో జర్నలిస్టులు.. అంపశయ్యమీద ఉన్నట్లు అయింది. ఏపీలో జర్నలిస్టుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏపీలో జర్నలిస్ట్ లకు అక్రిడేషన్స్ లేవు.. హెల్త్ కార్డ్స్ లేవు.. ఆరోగ్య భీమా.. ప్రమాద బీమా లేవు.. గత రెండేళ్లుగా కనీసం గుర్తింపు కూడా లేదు. దీంతో ఆరోగ్య సమస్యలు వస్తే వారికి చికిత్స అందడం లేదు. అక్రిడేషన్లు లేకపోవడంతో కనీసం బస్ పాస్ కూడా ఏపీ జర్నలిస్టులకు లేకుండా పోయింది. అయినా వృత్తి పట్ల ఉన్న మక్కువ తో జర్నలిస్ట్ లు గానే బతుకు బండి సాగిస్తున్నారు. ఎలాగోలా బతుకు బండిని లాగుతున్న జర్నలిస్ట్ ల పాలిట కరోనా శాపంగా మారింది. మంత్రులు.. ముఖ్య మంత్రులు..అధికారులు.. ప్రోగ్రామ్స్ ను వారికంటే ముందుగా వెళ్లి గంటల తరబడి వేచి వుండి కవరేజ్ ఇచ్చే జర్నలిస్టులకు బతుకు కవరేజ్ కి గ్యారంటీ లేకుండా పోయింది.  ప్రాణాలు తెగించి పని చేస్తున్నా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కూడా జర్నలిస్ట్ లను గుర్తించడం లేదు. పారిశుధ్య కార్మికులకు ఇచ్చే భరోసా కూడా జర్నలిస్ట్ లకు లేదు. కనీసం కోవిడ్ వ్యాక్సిన్ ను అందించే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదంటే జర్నలిస్ట్ అంటే ఏ పాటి గౌరవం ఉందొ అర్ధం చేసుకోండి. పరుగులు పెట్టి.. పోటీ పడి న్యూస్ కవర్ చేసి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్న జర్నలిస్టులు కరోనా కాటుకు బలి అవుతున్న కనీసం స్పందన లేదు. జర్నలిస్ట్ ల కుటుంబాలకు రక్షణ.. ఆదరణ అసలే లేదు.. పాలకులారా.. మావైపు చూడండి.. ఏళ్ళ తరబడి మీకు సేవలు అందించిన జర్నలిస్ట్ లను కాపాడుకోండి అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిని విన్నవించుకుంటున్నాయి ఏపీ జర్నలిస్ట్ సంఘాలు.  తెలంగాణలోనూ అదే పరిస్థితి. హెల్త్ కార్డులు ఇచ్చినా అవి పని చేయడం లేదు. పెండింగ్ బిల్లులను సర్కార్ క్లియర్ చేయకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్లు జర్నిలిస్టు హెల్త్ కార్డులను తీసుకోవడం లేదు. కరోనా సమయంలో అసలు వాటిని చూడటం కూడా లేదు. దీంతో కరోనా సోకిన జర్నలిస్టులు చికిత్సకు డబ్బులు లేక ప్రాణాలు వదులుతున్నారు. అంతంత జీతాలతో కాలం వెళ్లదీసే జర్నలిస్టులు లక్షలాది రూపాయలతో చికిత్స ఎలా తీసుకుంటారు. కరోనాతో జర్నలిస్టులు చనిపోతున్నా.. ప్రభుత్వాలు కాని, మీడియా యాజమాన్యాలు కాని పట్టించుకోవడం లేదు. విధులకు మాత్రం పంపిస్తున్నారు. ఇంతటి పరిస్థితుల్లోనూ జర్నలిస్టులు కోవిడ్ హాస్పిటల్స్, టెస్టింగ్ సెంటర్ల దగ్గర రిపోర్టింగ్ చేస్తూ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, మీడియా యాజమాన్యాలు స్పందించి జర్నలిస్టుల బతుకులకు భరోసా కల్పించాలని సంఘాలు కోరుతున్నాయి. 

జైల్లో పెట్టినా.. చంపినా.. ప్ర‌శ్నిస్తూనే ఉంటా..

‘‘22 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నామీద తప్పుడు కేసులు పెట్టి.. నా గొంతు నొక్కలేరు. నన్ను రాజమండ్రి జైలులో పెట్టినా.. చంపినా.. ప్రశ్నిస్తూనే ఉంటాను. పోరాడుతూనే ఉంటాను’’ అంటూ టీడీపీ సీనియ‌ర్ నేత‌ దేవినేని ఉమ మండిప‌డ్డారు.  సీఎం జగన్‌ మాటల మార్ఫింగ్‌ వీడియో కేసులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సీఐడీ విచారణకు హాజరయ్యారు. తనపై తప్పుడు కేసులు బనాయించారని దేవినేని అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అక్రమ కేసులపై కోర్టుల్లో పోరాడతానని చెప్పారు.హైకోర్టు ఆదేశాల్ని గౌరవిస్తూ విచారణకు హాజరయ్యానని ఉమా అన్నారు.  ‘‘ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడ, గుంటూరు ప్రభుత్వ హాస్పిటళ్లను సందర్శించాలన్నారు ఉమా. ప్రభుత్వానికి మానవత్వం లేదు. కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే.. జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు, సినిమాలు చూస్తున్నాడు. వ్యాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉంది. వ్యాక్సిన్ వేయించలేని పరిస్థితి ఉంది. కరోనా విజృంభిస్తున్నా పట్టించుకోని సీఎం.. పాలనను గాలికొదిలేశారంటూ దుయ్యబట్టారు దేవినేని ఉమా. ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటి? అమూల్‌ కోసం సంగం డెయిరీ ఆస్తులను తాకట్టు పెట్టాలనే ప్ర‌యత్నం చేస్తున్నారు. ప్రభుత్వ మెప్పు కోసం కొందరు అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు’’ అని దేవినేని మండిపడ్డారు. 

ప్రాణాలా? ఎన్నికలా? హైకోర్టు సీరియ‌స్‌..

ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? యుద్ధం వచ్చినా.. ఆకాశం విరిగి మీదపడినా ఎన్నికలు జరగాల్సిందేనా? అధికారులు భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా? ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి లేదా? శుక్ర‌వారంతో నైట్ కర్ఫ్యూ ముగుస్తుంది.. వాట్ నెక్ట్స్‌? ఇలా.. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాన్ని, తెలంగాన ప్ర‌భుత్వాన్ని ఓ రేంజ్‌లో క‌డిగిపారేసింది హైకోర్టు. స‌ర్కారు, ఎస్ఈసీ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిప‌డింది. ఎన్నిక‌లు, కొవిడ్ క‌ట్ట‌డి విష‌యంలో ఈ రెండు వ్య‌వ‌స్థ‌లూ పూర్తిగా వైఫ‌ల్యం చెందాయ‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.  కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. తెలంగాణ‌లో జ‌రుగుతున్న మినీ పుర పోరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి లేదా అని ప్రశ్నించింది. కరోనా నియంత్రణపై ప్రభుత్వ తీరునూ తప్పుబట్టింది. రేపటితో రాత్రిపూట కర్ఫ్యూ ముగుస్తుంది.. తర్వాత చర్యలేంటని న్యాయస్థానం ప్రశ్నించగా.. పరిస్థితిని సమీక్షించి రేపు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం సమాధానమిచ్చింది. దీనిపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. ‘‘చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు? నియంత్రణ చర్యలపై దాగుడు మూతలెందుకు? కనీసం ఒకరోజు ముందు చెబితే నష్టమేంటి? కట్టడి చర్యలపై మేం ఎలాంటి సూచనలూ ఇవ్వడం లేదు. క్షేత్ర స్థాయి పరిస్థితులు చూసి నిర్ణయం తీసుకోండి’’ అని సూచించింది.  మరోవైపు, కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారని కోర్టు ఎస్‌ఈసీని ప్రశ్నించింది. కొన్ని మున్సిపాలిటీలకు ఇంకా సమయం ఉంది కదా అని హైకోర్టు అడగ్గా.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహించినట్టు ఎస్‌ఈసీ అధికారులు తెలిపారు. దీంతో  కరోనా రెండో దశ మొదలైనా నోటిఫికేషన్‌ ఎందుకు ఇచ్చారంటూ కోర్టు మండిపడింది. ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి లేదా? ఎన్నికల ప్రచారం సమయం కూడా ఎందుకు కుదించలేదంటూ అసహనం వ్యక్తంచేసింది. అధికారులు కరోనా కట్టడిని వదిలేసి ఎన్నికల పనుల్లో ఉండే పరిస్థితి ఉందంటూ మండిపడింది. ఎస్‌ఈసీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని.. అధికారులు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.  తెలంగాణ‌లో రోజుకు 10వేల‌కు పైగా పాజిటివ్ కేసులు వ‌స్తున్న త‌రుణంలో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తుండ‌టంతో కేసుల సంఖ్య మ‌రింత భారీగా పెరుగుతోంది. లాక్‌డౌన్ పెట్టాల్సిన ప‌రిస్థితుల్లో ఎన్నిక‌లు పెట్ట‌డం వ‌ల్లే.. క‌రోనా విజృంభిస్తోంద‌ని అంటున్నారు. ఇదే అంశంపై హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గ్గా.. న్యాయ‌స్థానం సైతం క‌రోనా క‌ల్లోలంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై తీవ్ర స్థాయిలో అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ.. ఘాటైన విమ‌ర్శ‌లు చేసింది. 

రిజైన్​ మోడీ హాష్​ ట్యాగ్​ బ్లాక్.. ​పొరపాటు జరిగిందన్న ఫేస్ బుక్ 

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కరోనా సోకి చికిత్స అందక జనాలు చనిపోతున్నారు. ఆక్సిజన్ కొరతతో పిట్టల్లా రాలిపోతున్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై జనాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కరోనా కట్టడిలో కేంద్ర సర్కార్ విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో  #ResignModi అంటూ హాష్ ట్యాగ్  వైరల్ గా మారింది. ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచింది. అయితే  #ResignModi హాష్ ట్యాగ్ లన్నింటినీ ఫేస్ బుక్ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. దానిపై విమర్శలు రావడంతో ఫేస్ బుక్ స్పందించింది. పొరపాటున జరిగిందంటూ ప్రకటించింది. ఆ హాష్ ట్యాగ్ లతో కూడిన పోస్టులను బ్లాక్ చేయాలంటూ భారత ప్రభుత్వం తమనేమీ అడగలేదని స్పష్టం చేసింది. కొన్ని పోస్టులు తమ కమ్యూనిటీ ప్రమాణాలకు లోబడి లేవని, అందుకే వాటిని బ్లాక్ చేశామని తెలిపింది. రిజైన్ మోదీ హ్యాష్‌ట్యాగ్‌ పొరపాటున బ్లాక్ అయిందని, అది బ్లాక్ అవడానికి కారణం ప్రభుత్వ ఆదేశాలు కాదని ఫేస్‌బుక్ పేర్కొంది. పీరియాడికల్‌గా హ్యాష్‌ట్యాగ్‌లను బ్లాక్ చేస్తామని, దీనికి చాలా కారణాలు ఉంటాయని తెలిపింది. కొన్నిటిని మానవ ప్రమేయంతో బ్లాక్ చేస్తామని, చాలావాటిని ఆటోమేటెడ్ ఇంటర్నల్ గైడ్‌లైన్స్ ఆధారంగా బ్లాక్ చేస్తామని వివరించింది. లేబుల్‌కు సంబంధించిన కంటెంట్ వల్ల ఈ పొరపాటు జరిగిందని, స్వయంగా ఆ హ్యాష్‌ట్యాగ్ అందుకు కారణం కాదని పేర్కొంది.    కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ కొందరు విమర్శిస్తున్నారు. తీవ్రమైన ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత వంటి వాటి నేపథ్యంలోనే వారు ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలంటూ హాష్ ట్యాగ్ ద్వారా డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో #ResignModi హ్యాష్ ట్యాగ్ బ్లాక్ కావడం చర్చగా మారింది. కేంద్ర సర్కార్ ఆదేశాల వల్లే ఫేస్ బుక్ అలా చేసిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే కేవలం భారత్ లో మాత్రమే వాటిని నిషేధించింది. దాదాపు 3 గంటల పాటు ఆ పోస్టులను బ్లాక్ చేసింది. ఆ తర్వాత పోస్టులను పునరుద్ధరించింది. అయితే  బ్లాక్ చేసిన ఆ కొద్ది సేపూ విదేశాల్లో ఆ పోస్టులు యథావిధిగా కనిపించాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ట్విట్టర్ కూడా పలువురి ట్వీట్లను తొలగించింది. అమెరికా ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఖాతాను కొన్ని రోజుల పాటు ఫేస్ బుక్, ట్విట్టర్ , ఇన్టాగ్రామ్ బ్లాక్ చేశాయి. ఇండియాలోనూ రైతుల ఉద్యమంపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్టులను బ్లాక్ చేశారు. మోడీ సర్కార్ ఆదేశాల వల్లే అలా జరిగిందని కొన్ని పత్రికలు వార్తలు రాశాయి. రైతుల ఉద్యమం చాటున సంఘ విద్రోహ శక్తులు చేరారనే ఆరోపణలు రావడం వల్లే కేంద్రం అలా చేసిందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా ఉప్పెనలా విరుచుకుపడుతున్న కొవిడ్ మహ్మమారి విషయంలో ప్రజలను గందరగోళంలో పడేసేలా ఉంటున్న పోస్టులను బ్లాక్ చేయాలని సోషల్ మీడియా మాద్యమాలను కేంద్ర సర్కార్ కోరి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం #ResignModi హాష్ ట్యాగ్ ను బ్లాక్ చేయడంపై మండిపడుతున్నాయి. ప్రజా వ్యతిరేకతను దాచాలని మోడీ సర్కార్ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపిస్తున్నారు.  #రిజైన్‌మోడీ హాష్ ట్యాగ్ వివాదంపై కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చింది. బ్లాక్ చేయాలని ఫేస్‌బుక్‌ను కోరలేదని  స్పష్టం చేసింది. ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రికలో ప్రచురితమైన కథనాలు దురుద్దేశంతో కూడినవని మండిపడింది.  ఫేస్‌బుక్ ఓ హ్యాష్‌ట్యాగ్‌ను తొలగించడాన్ని ప్రజల అసమ్మతిని అణచివేసేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలుగా పేర్కొంటూ ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ ప్రచురించిన కథనం యథార్థాల విషయంలో తప్పుదోవపట్టించడం, దురుద్దేశపూరితమని పేర్కొంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను తొలగించాలని కోరుతూ ఎటువంటి ఆదేశాలను ప్రభుత్వం ఇవ్వలేదని, ఈ విషయాన్ని ఫేస్‌బుక్ కూడా స్పష్టంగా చెప్పిందని తెలిపింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను పొరపాటున బ్లాక్ చేసినట్లు ఫేస్‌బుక్ ప్రకటించిందని గుర్తు చేసింది.  2021 మార్చి 5న కూడా వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ బూటకపు వార్తను ప్రచురించిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఫేస్‌బుక్‌, ట్విటర్, వాట్సాప్ ఉద్యోగులకు జైలు శిక్ష విధిస్తామని భారత ప్రభుత్వం బెదిరిస్తోందని ఓ బూటకపు వార్తను ప్రచురించిందని తెలిపింది. ఇది పూర్తిగా బూటకపు, కల్పిత వార్త అని అధికారికంగా ఆ పత్రికకు తెలియజేసినట్లు పేర్కొంది.   

టెస్ట్ కి వచ్చి.. మృతి చెందిన వ్యక్తి.. 

అది యాదాద్రి భువనగిరి జిల్లా.  చౌటుప్పల్ సామాజిక ఆరోగ్య కేంద్రం. ఉదయం సమయం పది గంటలు. ఒక  వ్యక్తి నడుచుకుంటూ  ఆసుపత్రి గేట్ లోకి ఎంటర్ అయ్యాడు. సడన్ గా ఏమైందో ఏదో ఆ వ్యక్తి కింద పడ్డాడు. ఆ తర్వాత అక్కడికి అక్కడే మృతి చెందాడు. ఒక్కసారిగా ఆసుపత్రి  ఏరియా అంతా  కలకలం రేపుతోంది. ఈరోజు ఉదయం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి నడుచుకుంటూ వస్తూ ఆకస్మాత్తుగా కిందపడిపోయి.. ఓ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అయితే చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చౌటుప్పల్ సీఐ ఎన్. శ్రీనివాస్ వెల్లడించారు. ఆ వ్యక్తి మృతి చెందడానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. కరోనా పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరిస్థితి విషమించడం వలనే ఆ వ్యక్తి మృతి చెంది ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి కరోనా పరీక్షలు కూడా నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు.       

కర్ఫ్యూని క్యాష్ చేసుకుంటున్న టీఆర్ఎస్

ఒక వైపు కరోనా మహమ్మారి దాడి. మరో వైపు  హాస్పిటల్స్ లో పేషేంట్స్ ఆర్తనాదాలు. ఇంకో వైపు ప్రజల ఆర్థిక ఇబ్బందులు. మరోవైపు శవాల గుట్టలు. ఇది ఎప్పుడు మన దేశం లో నిత్యం జరుగుతుంది. కరోనా కట్టడికోసం దేశంలో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించాయి. ఆ నైట్ కర్ఫ్యూని కూడా కొంత మంది క్యాష్ చేసుకుంటున్నారు. ఈ సమయాన్ని ఆసరా చేసుకుని పలువురు అక్రమార్కులు వ్యాపారం మొదలుపెట్టారు.  అది భీమ్‌‌గల్‌‌ పట్టణం. ఈ పట్టణ కేంద్రంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. కరోనా విజృంభన నేపథ్యంలో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కానీ, 8 తర్వాత వ్యాపారాలు, ప్రజలు రోడ్ల మీదకు రావడం లేదని స్యాండ్ మాఫీయా గ్యాంగ్ రెచ్చిపోతోంది. రాత్రి అయ్యిందంటే చాలు ఎడ్ల బండ్ల సహాయంతో ఇసుకను నింపి వేరే చోట డంప్ చేస్తున్నారు. అదే సమయంలో అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ నాయకుడి హస్తం.. అక్రమ ఇసుక రవాణా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కనుసన్నల్లో జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే ఈ తతంగం నడుస్తున్నా ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు వేడుకుంటున్నారు. కర్ఫ్యూ సమయంలోనే ఇలా చేస్తే.. సాధారణ సమయంలో పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.         

బతకలేకపోతే చావండి.. పేదలపై రెచ్చిపోయిన మంత్రి

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రజలు ప్రాణభయంతో బతుకున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు పేదలకు ఉపాధి పోతోంది. ప్రజలను ఆసరగా నిలిచేందుకు ప్రభుత్వాలు రేషన్ ను ఉచితంగా ఇస్తున్నాయి. కర్ణాటకలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతోంది.  అయితే ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సిన ఐదు కిలోల బియ్యం స్థానంలో కర్ణాటక ప్రభుత్వం గోధుమలు, జొన్నలు జోడించి బియ్యాన్ని రెండు కిలోలకు తగ్గించింది. ప్రస్తుతం అక్కడ లాక్‌డౌన్ అమల్లో ఉండడంతో రెండు కిలోల బియ్యం ఎటూ సరిపోవని, మునుపటిలానే ఐదు కేజీల బియ్యం ఇవ్వాలని గదగ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్లో ఒకరైన ఈశ్వర ఆర్య నిన్న ఆహార, పౌరసరపరాల మంత్రి ఉమేశ్ కత్తికి ఫోన్ చేసి తమ గోడు వినిపించారు.రెండు కిలోల బియ్యం తమకు ఏమాత్రం సరిపోవని, ఐదు కిలోలు ఇవ్వకుంటే తాము బతకలేమని చెప్పారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. ‘‘బతకలేకపోతే చావండి.. అదే మంచిది. మేం మాత్రం అంతే ఇస్తాం’’ అని దురుసుగా సమాధానం ఇచ్చారు.  తనకు ఫోన్ చేసిన వ్యక్తితో మంత్రి ఉమేశ్ కత్తి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. మంత్రి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజకీయ  తీవ్ర దుమారం రేపాయి. దీంతో స్పందించిన మంత్రి తాను అలా మాట్లాడిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పారు. 

లాక్ డౌన్ పెట్టేద్దాం! కేంద్రానికి ఆరోగ్య శాఖ రిపోర్ట్

దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజు రోజుకు కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. దేశంలోని 150 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 15 శాతానికి పైగా ఉండటం ఆందోళన కల్గిస్తోంది. దేశంలో కరోనా తీవ్రతపై కేంద్రానికి ఆరోగ్య శాఖ తాజాగా నివేదిక ఇచ్చిందని తెలుస్తోంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందులో సూచించారని తెలుస్తోంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 150 జిల్లాల్లో లాక్ డౌన్ పెట్టాలని ఆరోగ్య శాఖ వెల్లడించిందని సమాచారం. లాక్ డౌన్ పెడితేనే పరిస్థితులు నియంత్రణలోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ సిఫార్సు చేసిందని అంటున్నారు. లాక్ డౌన్ తో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉన్నప్పటికీ, కరోనా బాధితులకు అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో లాక్ డౌన్ విధించడం మాత్రమే మార్గమని హెల్త్ మినిస్ట్రీ ఉన్నతాధికారులు సూచించారు. అయితే లాక్ డౌన్ ను మరోమారు విధించే విషయంలో రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఇండియాలో ఏప్రిల్ 5న కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా రోజువారీ కేసుల సంఖ్య లక్షను దాటగా, ఆపై 10 రోజుల వ్యవధిలో ఏప్రిల్ 15న రెండు లక్షలకు, మరో వారం రోజుల వ్యవధిలో ఏప్రిల్ 22న 3 లక్షలకు కేసుల సంఖ్య పెరిగింది. అప్పటి నుంచి రోజుకు సరాసరిన దాదాపు మూడున్నర లక్షల కేసులు వస్తూనే ఉన్నాయి. వీటిల్లో 74 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. మహారాష్ట్రతో పాటు ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, కేరళ, కర్ణాటకల్లో కరోనా విజృంభిస్తోంది.  ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కఠిన లాక్ డౌన్ ఆంక్షలు అమలవుతున్నా, మిగతా ప్రాంతాల్లో నిబంధనల అమలు లేకపోవడంతో కేసుల సంఖ్య అనుకున్నట్టుగా తగ్గడం లేదు. లాక్ డౌన్ పెట్టాలన్న ఆలోచన చివరి అస్త్రంగా మాత్రమే ఉండాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయమని, పరిస్థితులను అంతవరకూ తీసుకుని వెళ్లకుండా చూడాలనే భావిస్తున్నామని ఉన్నతాధికారులు సూచించారు. మైక్రో కంటెయిన్ మెంట్ కు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నామని, అయితే, కేసుల సంఖ్య పెరుగుతుంటే, కొన్ని వారాల పాటు లాక్ డౌన్ తో మాత్రమే పరిస్థితి చక్కబడుతుందని హెల్త్ నిపుణులు సూచించిన మీదట ఈ సిఫార్సు చేశామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ నుంచి అందిన సిఫార్సులపై కేంద్రం ఎలా స్పందింస్తుందన్నది ఆసక్తిగా మారింది. 

లాక్ డౌన్ దిశగా తెలంగాణ! 

మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక తరహాలోనే తెలంగాణలో సంపూర్ణ లాక్ డౌన్ పెట్టబోతున్నారా? అంటే ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుండటంతో లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు. బుధవారం హోంశాఖ మంత్రి  మహా ముద్ అలీ  ఆధ్వర్యంలో లకిడికపూల్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. హోమ్ సెక్రెటరీ , డీజీపీతో పాటు పలువురు కమిషనర్లు హాజరయ్యారు. లాక్ డౌన్ పైనే ఈ సమావేశంలో చర్చ జరిగిందని తెలుస్తోంది. ఈనెల 30 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. ఆ తర్వాత ఏ క్షణమైనా తెలంగాణలో లాక్ డౌన్ పెట్టే అవకాశాలు ఉన్నాయని అధికారిక వర్గాల సమాచారం.  లాక్ డౌన్ పై  రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ ప్రభుత్వ నికి నివేదిక సమర్పించిందని చెబుతున్నారు. ఆ నివేదిక హోంశాఖకు చేరడంతో దానిపైనే ఉన్నతాధికారులతో హోంశాఖ మంత్రి చర్చించారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా కేసుల సంఖ్య పెరిగితే లాక్ డౌన్ విధించుకోవచ్చు అని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిన  నేపథ్యంలో  హోంమంత్రి సమీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది.  కరోనా కట్టడి కోసం కర్ఫ్యూ విధించినప్పటికీ అనుకున్న ఫలితాలు రాకపోవడంతో ప్రభుత్వం దశల వారీగా లాక్‌డౌన్ విధించే​దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని నిరాశ్రయులు, బిచ్చగాళ్లను నైట్ షెల్టర్లకు తరలించే ప్రక్రియను జీహెచ్ఎంసీ చేపట్టింది.గ్రేటర్‌లో లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా సిద్దంగా ఉండేలా జీహెచ్ఎంసీ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. పూర్తిగా లాక్‌డౌన్​విధిస్తే నిరాశ్రయులు, బిక్షగాళ్లపై ఎక్కువ ప్రభావం పడుతున్నట్టు గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.రోజంతా అన్ని బంద్​ ఉంటే రోడ్ల పక్కన ఉండేవారికి, నిరాశ్రయులకు ఆహారం, ఇతర అవసరాలకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి. వీటిని నివారించడంలో భాగంగా ముందుగానే వారందరిని బల్దియా నైట్​షెల్టర్లకు తరలించే ప్రక్రియను చేపట్టారు. మే నెల మొదటి వారంలోనే లాక్‌డౌన్​విధించే పరిస్థితులు ఉండటంతో ఆ లోపే వీలైనంత ఎక్కువ మందిని తమ పర్యవేక్షణలో ఉంచేలా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారని అంటున్నారు. 

కరోనాను జయించిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా మహమ్మారిని జయించారు. కరోనా సోకడంతో తన ఫామ్ హౌజ్ లో క్వారంటైన్ లో ఉన్నారు కేసీఆర్. ప్రత్యేక వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. సీఎం వ్యక్తిగత డాక్టర్ ఎంవీ రావు పర్యవేక్షణలో యశోద హాస్పిటల్ కు చెందిన డాక్టర్ల బృందం బుధవారం ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించింది. రాపిడ్ యాంటిజెన్ టెస్టులో కేసీఆర్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. ఆర్టీపీసీఆర్ రిజల్ట్ మాత్రం గురువారం రానుంది. యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ రావడంతో కేసీఆర్ కరోనాను జయించారని వైద్యులు చెప్పారు. కేసీఆర్ కు నెగిటివ్ రావడంతో టీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు ఈనెల 19న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన తన ఫాంహాజ్ లోనే క్వారంటైన్ లో ఉన్నారు.మూడు రోజుల తర్వాత యశోదకు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. సీటీ స్కాన్ రిపోర్టు నార్మల్ గానే రావడంతో ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్లు నిర్దారించారు. దీంతో మళ్లీ ఆయన ఫాంహౌజ్ కు వెళ్లిపోయారు. అక్కడే ప్రత్యేక డాక్టర్ల బృందం పర్యవేక్షణలో ఉన్నారు.  నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం ఈనెల 14న హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సభలో వేదికపై ఉన్న పార్టీ అభ్యర్థి నోముల భగత్ సహా చాలా మంది నేతలకు కరోనా వచ్చింది. దీంతో నాగార్జున సాగర్ సభలోనే ముఖ్యమంత్రికి కరోనా సోకి ఉంటుందని భావించారు. కేసీఆర్ పాజిటివ్ వచ్చిన తర్వాత కేటీఆర్ , ఎంపీ సంతోష్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. కేసీఆర్ తో పాటు సంతోష్ ఫాంహౌజ్ లో క్వారంటైన్ లో ఉండగా.. కేటీఆర్ తన నివాసంలో ఐసోలేట్ అయ్యారు.

ఒక్కరోజులో 14,669 కేసులు.. ఏపీలో క‌రోనా కాటు.. ప‌రీక్ష‌ల‌తో చేటు..

ఒక్కరోజులో 14,669 కేసులు. 2, 4, 6, 8, 10, 14.. రోజురోజుకీ ఏపీలో క‌రోనా కేసులు వేల‌ల్లో న‌మోద‌వుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్‌బారిన పడుతోన్న బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య సైతం భారీగా ఉండ‌టం బెంబేలెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 74,681 పరీక్షలు నిర్వహించారు. ఏకంగా 14,669 మందికి పాజిటివ్ వ‌చ్చింది. ఒక్క‌రోజులోనే సుమారు 15వేల మందికి క‌రోనా సోక‌డం మామూలు విష‌య‌మేమీ కాదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌రో మ‌హారాష్ట్ర‌గా మార‌బోతోందా అనే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఢిల్లీ త‌ర‌హాలో కేసులు పెరుగుతుండ‌టం ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది.  కరోనాతో బాధపడుతూ ఏపీలో ఒక్క రోజులోనే 71 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ మొత్తం 1,62,17,831 కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. 10,69,544 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  క‌రోనా కేసుల్లో దూసుకుపోతున్న ఏపీ.. కొవిడ్ కట్ట‌డి చ‌ర్య‌ల్లో మాత్రం చాలా వెన‌క‌బ‌డి ఉంది. మందుల కొర‌త‌, ఆసుప‌త్రిలో బెడ్స్ కొర‌త‌, ఆక్సిజ‌న్ కొర‌త‌, స్మ‌శానంలో శ‌వ‌ద‌హ‌నానికి ఇక్క‌ట్లు.. ఇలా అనేక స‌మ‌స్య‌లు. వీట‌న్నిటికీ సీఎం జ‌గ‌న్‌రెడ్డి చేత‌గాని త‌న‌మే కార‌ణ‌మ‌ని టీడీపీ విమ‌ర్శ‌. అస‌మ‌ర్థ ముఖ్య‌మంత్రి వ‌ల్లే రాష్ట్రం క‌రోనా కేంద్రంగా మారిందంటూ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు విమ‌ర్శించారు.  ఏపీ క‌రోనాతో అల్లాడిపోతుంటే.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి మాత్రం విద్యార్థుల భ‌విష్య‌త్తు కోస‌మే ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లంటూ వారిని మ‌రింత ప్ర‌మాదంలో నెట్టేస్తున్నారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ రాష్ట్ర ప‌రిధిలోని అంశ‌మంటూ లాజిక్కులు చెబుతున్నారు. కేంద్ర బోర్డుల‌తో పాటు, అనేక రాష్ట్రాలు ప‌ది ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు, వాయిదా వేస్తున్నా.. జ‌గ‌న్ మాత్రం ఎగ్జామ్స్ పెట్టి తీరుతామంటూ మొండి కేస్తున్నారు. రోజుకు దాదాపు 15వేల పాజిటివ్ కేసులు వ‌స్తున్న త‌రుణంలో అన్ని ల‌క్ష‌ల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యే ప‌రీక్షలు పెట్ట‌డం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో జ‌గ‌న్‌రెడ్డికి అర్థం కావ‌ట్లేదా అంటూ త‌ల్లిదండ్రులు నిల‌దీస్తున్నారు. ఇదేమి మూర్ఖ‌పు నిర్ణ‌యం, వితండ వాదం అంటూ చంద్ర‌బాబు ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం ప‌రీక్షా కేంద్రాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకుంటే స‌రిపోతుందా?  విద్యార్థుల రాక‌పోక‌ల‌ స‌మ‌యంలో క‌రోనా సోకే అవ‌కాశం ఉండ‌దా? అనేది చంద్ర‌బాబు అడుగుతున్నారు. టీడీపీ గ‌గ్గోలు పెడుతున్నా.. పేరెంట్స్ ఎగ్జామ్స్ వ‌ద్దంటూ వేడుకుంటున్నా.. స‌ర్కారులో పున‌రాలోచ‌న లేదు. ఎగ్జామ్స్ విష‌యంలో జ‌గ‌న్ మొండివైఖ‌రి వీడ‌టం లేదు.   

జ‌గ‌న్‌కు సీబీఐ కోర్టు నోటీసులు.. బెయిల్ ర‌ద్దు?

ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌న్న ర‌ఘురామ‌కృష్ణ‌రాజు పిటిష‌న్‌పై వివ‌ర‌ణ కోరుతూ సీబీఐ కోర్టు నోటీసులు ఇచ్చింది. బెయిల్ నిబంధ‌న‌ల‌ను జ‌గ‌న్ ఉల్లంఘిస్తున్నార‌ని ర‌ఘురామ పిటిష‌న్‌లో తెలిపారు. వ‌చ్చే నెల 7న సీబీఐ కోర్టు పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్ట‌నుంది.  జ‌గ‌న్‌కు రోజులు ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ట్టున్నాయ్‌. జ‌గ‌న్ బెయిర్ ర‌ద్దు పిటిష‌న్‌ను మంగ‌ళ‌వారం సీబీఐ కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. బుధ‌వారం నోటీసులు జారీ చేసింది. బ‌య‌ట ఉంటే జ‌గ‌న్ సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషిన‌ర్‌. వెంట‌నే బెయిల్ ర‌ద్దు చేసి వేగంగా విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరారు. పిటిష‌న్ త‌ర‌ఫు అభ్యర్థ‌న‌లు  విన్న న్యాయ‌స్థానం.. కేసును విచార‌ణ‌కు స్వీక‌రించింది. తాజాగా నోటీసులు జారీ చేయ‌డం రాజ‌కీయంగా ఉత్కంఠ రేపుతోంది.  నాంపల్లి సీబీఐ కోర్టులో తాను వేసిన పిటిషన్‌ మొదట్లో సాంకేతిక కారణాల వల్ల న్యాయస్థానం తిరస్కరించిందని రఘురామ తెలిపారు. ఆ తర్వాత సవరణలు చేసి తిరిగి పిటిషన్‌ వేయడంతో తాజాగా తన పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించినట్లు జడ్జి వెల్లడించారని వివరించారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారే న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వకపోతే పౌరులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే తాను ఈ పోరాటం మొదలు పెట్టానని ఆయన వెల్లడించారు.   ర‌ఘురామ‌కృష్ణంరాజు.. కొన్ని రోజులుగా సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కోసం విరామం లేకుండా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆయ‌న‌పై ప్ర‌భుత్వ ప్రోద్బంలంతో ఈడీ రైడ్స్ జరుగుతున్నా..కేసులు పెడుతున్నా.. ఏమాత్రం అద‌ర‌డం లేదు.. బెద‌ర‌డం లేదు.. వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. జ‌గ‌న్ అనుస‌రిస్తున్న‌ విధానాల‌పై, అడ్డ‌గోలు పాల‌న‌పై దాదాపు ప్ర‌తీరోజు విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ప్ర‌జ‌లను నిత్యం అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఎలాంటి పార్టీ స‌పోర్ట్ లేకున్నా.. వైసీపీ ఎంపీగా ఉంటూనే.. వ‌న్ మ్యాన్ ఆర్మీలా.. జ‌గ‌న్‌రెడ్డిపై మ‌డ‌మ తిప్ప‌ని పోరాటం చేస్తూ అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతున్నారు ర‌ఘురామ‌. తాజాగా, ఆయ‌న దాఖ‌లు చేసిన జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌ను సీబీఐ కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించ‌డం, జ‌గ‌న్‌కు నోటీసులు జారీ కావ‌డంతో ఆ ప్ర‌య‌త్నంలో తొలి విజ‌యం సాధించిన‌ట్టైంది. ర‌ఘురామ త‌లుచుకుంటున్న‌ట్టుగానే.. త్వ‌ర‌లోనే జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అవుతుందా? జ‌గ‌న్ మ‌ళ్లీ జైలుక వెళ్ల‌క త‌ప్ప‌దా? ఏమో.... ఏదైనా జ‌ర‌గొచ్చు.

ఓటేయకు.. కరోనాకు బలికాకు! 

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఏప్రిల్ 30న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కరోనా పంజా విసురుతుండటంతో పోలింగ్ ఎలా జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటేందుకు జనాలు బయటికి వస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. కరోనా భయంతో వణికిపోతున్న జనాలు పోలింగ్ కేంద్రాలకు రావడం కష్టమేనని  ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.  కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సామాజిక కార్యకర్తలు సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. వ‌రంగ‌ల్ ఎంజీఎం ప్రాంగ‌ణంలో కోట శ్యాంకుమార్ అనే వ్య‌క్తి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఓటేయ్య‌డానికి పోకు- కరోనాతో ఖతమై పోకు అంటూ  డాక్ట‌ర్ వేషాధార‌ణ‌లో ప్ల‌కార్డులు చేతబూని నిర‌స‌న వ్య‌క్తం చేశారు.  క‌రోనా అత్యంత ప్ర‌మాద‌క‌రంగా విజృంభిస్తున్న వేళ మిని మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డంపై ఆయ‌న తీవ్రంగా మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల ఆరోగ్యం, ప్రాణాల‌పై ఈ ప్రభుత్వానికి, ఎన్నిక‌ల సంఘానికి ఎంత‌మాత్రం ప‌ట్టింపులేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు శ్యాంకుమార్. బాధ్య‌త‌లేని ప్ర‌భుత్వాల‌కు 10 లక్షల మంది చనిపోయినా, ఎంత‌మాత్రం ఏం కానట్లుగా ఉంటున్నాయి.. కానీ మీ కుటుంబానికి మీరే పెద్ద దిక్కు.. మీ ప్రాణాలు మీ కుటుంబ స‌భ్యుల‌కు ఎంతో వేద‌న‌ను మిగుల్చుతాయి.. ఓటింగ్‌లో పాల్గొని క‌రోనాను అంటించుకోకండి. బాధ్య‌త‌లేని ప్ర‌భుత్వాల‌కు ఓటింగ్‌లో పాల్గొన‌కుండా నిర‌స‌న వ్య‌క్తం చేయండి అంటూ పిలుపునిస్తున్నారు కోట శ్యాంకుమార్. 

లేడీ పైలెట్ పై.. మరో పైలెట్.. 

మహిళలపై వేధింపులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మహిళా రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చిన. అవి బూడిదలో పోసిన పన్నీరుగా తయారు అయ్యాయి. మొన్నటికి మొన్న ఒక లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ తన పై అధికారి లైంగిక వేధింపులు తాళలేక. తన సర్వీస్ రివల్ వార్ తో కాల్చుకుని చనిపోయింది. ఆ ఘటన మరువక ముందే, మరో లేడీ ఫైలెట్ ఆఫీసర్ ని తన తోటి ఆఫీసర్ లైంగింకంగా వేధిస్తున్నాడంటూ హైకోర్ట్ ని ఆశ్రయించింది.     భారత వాయుసేనలో లైంగిక వేధింపుల కలకలం చెలరేగింది. తనను ఫ్లయిట్ కమాండర్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ మహిళా పైలెట్ జమ్మూకశ్మీర్ హైకోర్టును ఆశ్రయించింది. పైగా వాయుసేనలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించింది. ఆ మహిళా పైలెట్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు... భారత వాయుసేన (ఐఏఎఫ్)తో పాటు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు కూడా నోటీసులు జారీ చేసింది. మహిళా పైలెట్ ఆరోపణలపై నాలుగు వారాల్లో జవాబు ఇవ్వాలని జస్టిస్ సంజీవ్ కుమార్ ధర్మాసనం ఆదేశించింది. కాగా, మహిళా పైలెట్ పై సదరు ఫ్లయిట్ కమాండర్ పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తగిన ఆధారాలను ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, అభ్యంతరకర రీతిలో తాకడం వంటి పనులు చేశారని కోర్టుకు విన్నవించారు. తాను ఎదుర్కొంటున్న సమస్య పట్ల భారత వాయుసేనలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీకి నివేదిస్తే, అక్కడ ఆమెకు న్యాయం జరగలేదని తెలిపారు.       

కరోనా హాట్ స్పాట్లుగా టెస్టింగ్ సెంటర్లు!  

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రాష్ట్రంలోనూ పంజా విసురుతోంది. లక్షణాలు ఉన్నా లేకున్నా భయంతో జనాలు టెస్టుల కోసం పరుగులు పెడుతున్నారు. దీంతో  ప్రైవేట్ ల్యాబులు, ప్రభుత్వ కరోనా టెస్టింగ్ సెంటర్ల దగ్గర రద్దీ కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో క్యూలైన్లలో భౌతిక దూరం కూడా పాటించడం లేదు.  కరోనా సోకిన వారు.. సోకని వారు అంతా ఒకే దగ్గర గుమి గూడుతున్నారు. దీంతో టెస్టింగ్ సెంటర్లే ఇప్పుడు కరోనా హాట్ స్పాట్లుగా మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. సీటీ స్కాన్ కోసం జనాలు ఎగబడుతున్నారు. క్లోజ్డ్ రూమ్ లో చేసే సీటీ స్కాన్ సెంటర్ల ద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు.  వైద్య శాఖ అధికారులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. క‌రోనాతో ఎవ‌రూ భయపడాల్సిన అవసరం లేదని, ల‌క్ష‌ణాలు లేకున్నా భయంతో పరీక్ష చేయించుకునేందుకు ప‌రుగులు తీయొద్ద‌ని తెలంగాణ ప్ర‌జారోగ్య సంచాల‌కుడు డాక్ట‌ర్ శ్రీనివాస‌రావు సూచించారు. కొంద‌రు ల‌క్ష‌ణాలు లేకున్నా ప‌రీక్ష‌లు చేయించుకుంటుండ‌టంతో లక్షణాలు ఉన్నవారు స‌కాలంలో ప‌రీక్ష‌లు చేయించుకోలేక‌పోతున్నార‌ని అన్నారు. ల‌క్ష‌ణాలు లేని వారు టెస్టింగ్ సెంటర్ల‌ వద్దకు వెళ్లి వ్యాధి కొని తెచ్చుకోవ‌ద్ద‌ని కోరారు. కొవిడ్ లక్షణాలు కేవలం రెండు మూడు రోజులు ఉంటాయని..తగ్గకపోతేనే పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్నా టెస్టింగ్ కోసం వెళుతూ కొందరు అనవసరంగా వైరస్ భారీన పడుతున్నారని శ్రీనివాస‌రావు తెలిపారు.  క‌రోనా విజృంభిస్తున్నందున రానున్న రెండు, మూడు వారాలు చాలా కీల‌క‌మ‌ని  డాక్ట‌ర్ శ్రీనివాస‌రావు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే తెలంగాణ‌లో ప‌రిస్థితి కాస్త మెరుగ్గానే ఉంద‌ని చెప్పారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ‌లో క‌రోనా వ్యాప్తి త‌క్కువ‌గానే ఉంద‌ని అన్నారు. క‌రోనాపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెరిగింద‌ని, రాష్ట్రంలో 90 శాతం మంది మాస్కులు ధ‌రిస్తున్నార‌ని పేర్కొన్నారు. తెలిపారు. వందేళ్లకు ఒక‌సారి ఇలాంటి విపత్తులు వస్తుంటాయ‌ని అన్నారు. క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ముందుంద‌ని చెప్పారు. వ‌చ్చే నెల వివాహాలు, శుభ‌కార్యాలు జ‌రిగేందుకు అవ‌కాశం ఉన్నందున ప్రజలు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించారు. రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ వేగంగా కొన‌సాగుతుంద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు 45 లక్షల మంది పైగా వాక్సిన్ వేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు. విడతల వారిగా మిగితా వారికి సైతం వాక్సిన్ వేస్తామ‌న్నారు డాక్ట‌ర్ శ్రీనివాస‌రావు.  

ఏపీలో ప‌రీక్ష‌లు.. ప్ర‌ధాని జోక్యం!

ఏది ఏమైనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతాం అంటోంది ఏపీ స‌ర్కారు. విద్యార్థుల భ‌విష్య‌త్ కోస‌మే ఎగ్జామ్స్ అంటున్నారు సీఎం జ‌గ‌న్‌. ప‌రీక్ష‌ల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం మొండిగా ముందుకు పోతుండ‌టంతో త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న పెరిగిపోయింది. ప‌రీక్ష‌ల‌కు వెళితే.. త‌మ పిల్ల‌లు క‌రోనా బారిన ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని ఆవేద‌న చెందుతున్నారు. ప‌రీక్ష‌లకు వెళితే ఓ టెన్ష‌న్‌.. వెళ్ల‌కపోతే మ‌రో ప్రాబ్ల‌మ్‌. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈల‌తో స‌హా దేశంలోని ప‌లు రాష్ట్రాలు ప‌రీక్ష‌లు ర‌ద్దు, వాయిదా వేస్తుంటే.. ఏపీలో సీఎం జ‌గ‌న్‌రెడ్డి తీరు త‌మ పిల్ల‌ల పాలిట ముప్పుగా మారింద‌నేది పేరెంట్స్ భ‌యాందోళ‌న‌. అందుకే, ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో ప్ర‌ధాని మోదీ జోక్యం చేసుకోవాలంటూ ఆయ‌న‌కు లేఖ రాశారు న‌ర‌సాపురం ఎంపీ.  ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పరీక్షలను విద్యార్థి లోకం తీవ్రంగా పరిగణిస్తోందని, దీనిపై ఏపీలో ఒకింత అధిక ఆందోళన నెలకొని ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతోందని, విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తే లక్షల్లో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వైరస్ బారినపడే అవకాశాలున్నాయని, వారు వ్యాప్తికి కారకులు కావడమో, లేక వారే బలికావడమో జరుగుతుందని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ సర్కారుకు ఇదేమీ కనిపిస్తున్నట్టుగా లేదని, అందుకే ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేందుకు సిద్ధమైందని ఆరోపించారు. "ప్రధాని గారూ కరోనా కట్టడికి మీరు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మీరు జోక్యం చేసుకుని తీరాల్సిన అత్యంత కీలక సమయం ఇది. పరీక్షలు రద్దు చేశామనో, వాయిదా వేశామనో చెబుతూ ఎలాంటి ప్రకటన సీఎం కార్యాలయం నుంచి రావడంలేదు. ఏపీ విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మీరే ఆదేశాలు ఇవ్వండి" అని తన లేఖలో కోరారు ర‌ఘురామ‌.

గోవాలో లాక్‌డౌన్.. ముచ్చ‌ట‌గా 3 రోజులు మాత్ర‌మే..

దేశ‌మంతా క‌రోనా క‌ల్లోలం. గోవాలో మాత్రం జిల్ జిల్ జిగా. టూరిస్టుల హంగామా. అస‌లే ఎండాకాలం కావ‌డం.. కొవిడ్‌తో భ‌యం పెర‌గ‌డంతో.. సిటీలో ఉండ‌టం క‌న్నా.. గోవా అయితే బెస్ట్ అనుకుంటూ ఇప్ప‌టికీ చాలా మంది జ‌నాలు గోవా టూర్ వేస్తున్నారు. గ‌తంలో మాదిరి కాకున్నా.. ప్ర‌స్తుతం గోవాకు చెప్పుకోద‌గ్గ స్థాయిలో ప‌ర్యాట‌కులు వ‌స్తున్నారు. సాగ‌ర తీరంలో సంద‌డి చేస్తున్నారు. అయితే, వైర‌స్‌కు గోవా, హైద‌రాబాద్‌, ఢిల్లీ అనే తేడా ఉండ‌దుగా. అందుకే, అక్క‌డా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గోవాలో మంగళవారం 2,110 మందికి కరోనా సోకింది. 31 మంది చ‌నిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,591.  గోవాలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తుండ‌టంతో.. అక్క‌డి ప్ర‌భుత్వం గ‌త్యంత‌రం లేని పరిస్థితుల్లో లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. గురువారం నుంచి ఆంక్షలు అమ‌ల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 29వ తేదీ రాత్రి 7 నుంచి.. మే 3వ తేదీ ఉదయం వరకు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. అంటే, ముచ్చ‌ట‌గా మూడు రోజులు మాత్ర‌మే. అదేంటి, మ‌రీ మూడు రోజుల లాక్‌డౌన్ ఏంటి అనుకుంటున్నారా. అది అంతే. ఎంతైనా గోవా క‌దా.  అత్యవసర సేవలు, పారిశ్రామిక కార్యకలాపాలకు మాత్రం అనుమతి ఉంటుంది. ప్రజా రవాణా, క్యాసినోలు, హోటళ్లు, పబ్బులు మూసివేయ‌నున్నారు. అత్యవసర వస్తువుల రవాణా కోసం మాత్రం రాష్ట్ర సరిహద్దులు తెరిచే ఉంటాయి.  సో.. స‌మ్మ‌ర్‌లో గోవా వెళ్లాల‌నుకునే వాళ్లు.. ఓ మూడు రోజులు ఆగి టూర్ ప్లాన్ చేసుకోవ‌చ్చు. వెళ్లాక చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ప్ర‌స్తుత సెకెండ్ వేవ్ హ‌ర్ర‌ర్‌లో అస‌లు గోవాకు వెళ్ల‌కపోవ‌డం ఇంకా బెట‌ర్‌. బుద్ధిగా ఇంట్లో కూర్చొని.. కొవిడ్ నుంచి కాపాడుకోండి. బాగుంటే మ‌రోసారి గోవా వెళ్లొచ్చు కానీ, ఇప్పుడు మాత్రం వ‌ద్దు అంటున్నారు వైద్యులు.