అమరావతిదే అంతిమ విజయం! 

మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రాజధాని గ్రామాల రైతులు, మహిళల నిరసనలు 500వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుంది అని ప్రభుత్వం చెప్పేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. రాజధాని రైతులు..రైతులు.. కరోనా సూచనలు పాటిస్తూ నిరసనలు చేస్తున్నారు.  అమరావతి రైతులు చేపట్టిన నిరసనలు 500వ రోజుకు చేరుకున్న సందర్భంగా వారికి విజయం దక్కాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశించారు. ఇన్ని రోజులుగా రైతులు తమ నిరసనలు తెలుపుతున్నా సీఎం జగన్ పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మూర్కపు పాలకుడిని చూడటం చరిత్రలో ఇదే మొదటిసారి చంద్రబాబు మండిపడ్డారు.  ‘‘ప్రజారాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 500 రోజులు. తన పాలనలో తాను తీసుకున్న తుగ్లక్ నిర్ణయానికి సుమారు 29 వేల మంది రైతులు బాధపడుతూ దీక్షలు చేస్తోంటే, 500 రోజులలో ఒక్కసారైనా వారిని కలిసి మాట్లాడని మూర్ఖపు పాలకుడిని చూడటం చరిత్రలో ఇదే మొదటిసారి. "కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ!" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.  "రాజధాని కోసం, తమ కుటుంబ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తోన్న మహిళలను బూటు కాళ్ళతో తన్నించినందుకే రాష్ట్రానికి ఇన్ని ఉపద్రవాలు. పాలకులు ఎంత  నిర్దయగా ప్రవర్తిస్తున్నా, ప్రజా రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు 500 రోజులుగా శాంతియుతంగా నిరాటంకంగా తమ ఆందోళనను కొనసాగిస్తోన్న రైతులు, రైతు కూలీలు, మహిళలకి అంతిమ విజయం దక్కాలని ఆశిస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

కరోనాతో సోలి సొరాబ్జీ కన్నుమూత

మాజీ అటార్నీ జనర, న్యాయ కోవిదులు  సోలి సొరాబ్జీ  కన్నుమూశారు. దిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సొరాబ్జీ రెండు సార్లు అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన వయసు 91 సంవత్సరాలు. సోలి సొరాబ్జీ మృతి విషయాన్ని తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు సంతాపాన్ని వెలిబుచ్చారు 1930లో ముంబైలో జన్మించిన సోలీ సొరాబ్జీ, 1953లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు.తొలుత బాంబే హైకోర్టులో లాయర్ గా సేవలందించిన ఆయన్ను, 1971లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఆయన్ను గుర్తించారు. ఆపై 1989 నుంచి 90 మధ్య, 1998 నుంచి 2004 వరకూ భారత అటార్నీ జనరల్ గా సేవలందించడంతో పాటు మానహ హక్కుల పరిరక్షణకు తనవంతు కృషి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 2002లో పద్మ విభూషణ్ తో సత్కరించింది.

భలే పెళ్లి పత్రిక.. 

మాకు లైవ్ లో తల్వాల్ పడ్డంకా.. ఎవరి ఇంట్ల వాళ్ళు బువ్వ ఒండుకుని తినుర్రి. కానీ పిల్ల దిక్కు, పిలగానే దిక్కు కట్నాలు సదివించేటోళ్లు మాత్రం జి పే . ఫోన్ పే చేయిర్రి, ప్రేమతో మీరు పంపే కట్నాలను కరోనా కాలం లో బువ్వ లేకుండా భాదపడుతున్న వాళ్లకు ఆర్థిక సాయంగా అందించపడుతుంది. బరాత్ ఉంది గానీ ఎవరి ఇంట్ల వాళ్ళు పాటలు పెట్టుకుని ఎగురుర్రి.. ఆ తరువాత ఆ వీడియోలను మాకు పంపండి..     జగిత్యాల జిల్లా. సచిపోయి స్వర్గం లో  ఉన్న తాత, అవ్వ జీల బాలరాజ్ , ఎల్లవ్వ దీవెనలతో లగ్నం మే 1 వ తారీకు పొద్దు పొడిచినంక 8 గంట కొట్టంగ ఇంస్టాగ్రామ్ లో మా పెద్ద పోరడు. యూట్యూబర్ అనిల్ జీల కోవిద్ నెగిటివ్ గానీ లగ్నం  సదువుల తల్లి ఆమని కోవిద్ నెగిటివ్ తో పెళ్లి. మరువకుండా మీ సెల్ ఫోన్ ల 1 జిబి ను ఆగవట్టుకొని సుట్టలు అయినోళ్లు, పిల్లా..  జెల్లా.. అయినోళ్లు.. ముసలోళ్ళు ..అందరూ ఫోన్ ల ముందు అంతర్జాలంలో ఈ పెండ్లి చూసి ఆశీర్వదించగలరు.      జగిత్యాలలో లంబాడిపల్లి మైవిలేజ్‌షో సభ్యుడు అనిల్‌ జీల మే 1న పెళ్లి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన హితులకు, బంధుగణానికి పత్రికను పంపేందుకు రూపొందించారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతుళ్ల పేర్ల పక్కన కొవిడ్‌ నెగెటివ్‌ సూచన, పెళ్లికి రాకండంటూ.. వేడుకను ఆన్‌లైన్‌లో చూడమంటూ.. అందుకోసం ఒక జీబీ డేటాను ఫోన్‌లో పెట్టుకోండన్న అభ్యర్థనలతో ప్రత్యేకంగా రూపొందించిన పెళ్లిపత్రిక ఆకట్టుకుంటోంది. కట్నాలు ఇవ్వాలనుకునే వారు గూగుల్‌పే క్యూఆర్‌ కోడ్‌ ద్వారా పంపాలని అభ్యర్థించారు. ఆ సొమ్మునంతా కరోనా వేళ ఆకలితో అలమటించే వాళ్లకు అందిస్తాననే హామీ ఇచ్చారు. ఇన్‌స్టా లైవ్‌లో పెళ్లి చూడండని.. ఏమనుకోకుండా ఎవరి ఇళ్లవద్ద వాళ్లే ఉండాలని కార్డుతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలో విన్నవిస్తున్నారు. లగ్గం జాగ, ఎవ్వరింట్ల ఆల్లు బువ్వ తినుర్రి.. ఇలా తెలంగాణ యాసలోని పదాలు పత్రికలో ప్రత్యేకతగా నిలిచాయి. అనిల్ పెళ్లి పత్రిక సోషల్ మీడియా లో వైరల్ అయింది.     

రాజధాని స్వప్నం.. అలు పెరగని పోరాటం! అమరావతి@500 

అమ‌రావతి.. న‌వ్యాంధ్ర‌ క‌ల‌ల రాజ‌ధాని.. అది న‌గ‌రం కాదు.. భూత‌ల స్వ‌ర్గం.. చంద్ర‌బాబు స్వ‌ప్నం.. ఆంధ్రుల నిండు గౌర‌వం.. ఎవ‌రి దిష్టి త‌గిలిందో.. ఎవ‌రి క‌ళ్లు ప‌డ్డాయో.. ఆ సుంద‌ర స్వ‌ప్నం చెదిరి పోయింది.. ఆ క‌ల‌ల సౌధం కుప్ప‌కూలిపోయింది.. మూడు ముక్క‌లై.. ఓ ముక్క‌గా మూల‌న ప‌డింది..  ఒక్క ఛాన్స్ అంటూ అంద‌ల మెక్కాడు.. అమ‌రావ‌తిపై భ‌స్మాసుర హ‌స్తం మోపాడు.. ఇక అంతే.. అమ‌రావ‌తి స‌ర్వ నాశ‌నం.. త‌మ క‌లల రాజ‌ధాని.. మూడు ముక్క‌లై.. మోడు పోవ‌డంతో.. అమ‌రావ‌తి రైతులు భ‌గ్గుమ‌న్నారు.. ఉద్య‌మంతో ఉప్పెన‌లా విరుచుకుప‌డ్డారు.. దీక్ష‌ల‌తో జ‌గ‌న్‌పై దండ‌యాత్ర చేశారు..  2019 డిసెంబర్‌ 17న అసెంబ్లీలో 3 రాజధానుల ప్రతిపాదన చేశారు CM జగన్. ఆ క్షణమే అమరావతి ఉద్యమం మొదలైంది. నాటి నుంచి నేటి వరకు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు.. అమరావతి ఉద్యమంలో ప్రతిదీ ఒక చారిత్రక ఘట్టమే... వంటిపై లాఠీలు విరిగినా వెనక్కు తగ్గలేదు... వరుసగా ప్రాణాలు పోతున్నా లెక్క చేయలేదు... 29 గ్రామాల రైతులు తొలిరోజు నుంచి అదే ధైర్యంతో 500 రోజులుగా ఉద్యమిస్తూనే ఉన్నారు... పోరు మహోగ్రంగా మారుతోందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు... తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, నవులురూ.. కృష్ణాయపాలెం, తాడికొండ అడ్డరోడ్డు ఇలా 29 గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ చూసినా ఒకటే మాట.. మన రాజధాని-మన  అమరావతి..... 5 కోట్ల మంది ప్రజల గొంతుక 500 రోజులుగా ప్రతిధ్వనిస్తోంది.. రాజధాని కోసం అనేక‌ రూపాల్లో రైతులు నిరసన తెలుపుతున్నారు... జలదీక్షలు చేశారు... అర్థనగ్నంగా ప్రదర్శనలు చేశారు... మోకాళ్లపై నడిచారు... రాజధాని వీధుల్లో కదం తొక్కి ర్యాలీలూ చేశారు... దేవుళ్లకు మొక్కారు... ముడుపులు కట్టారు... అల్లానూ ప్రార్థించారు... ఏసు ఆశీస్సులనూ కోరారు... తమకు నామాలు పెట్టిన వాళ్ల బుద్ధి మారాలంటూ హోమాలు చేశారు... ఏ రీతిన తమ ఆకాంక్ష తెలియచేసినా అంతా శాంతిమంత్రమే...  అమరావతి నిర్మాణం కోసం దాదాపు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు నిరసన బాట పట్టి కేసులతో జైళ్ళకు కుడా వెళ్లారు. ఒక్క రాజధాని ప్రాంతంలోనే 600 మందికి పైగా రైతులను అరెస్టు చేసి కోర్టు బోను ఎక్కించారు. ఇది కృత్రిమ ఉద్యమం ఎంత‌మాత్రం కాదు..... ఇది పెయిడ్ ఆర్టిస్టుల పోరాటం అంతకంటే కాదు...క‌రోనా విజృంభ‌ణ‌తో.. సామూహిక దీక్షలకు బ్రేక్ పడినా.. విడతల వారీగా ప్రతిరోజూ రైతులు పరిమిత సంఖ్యలో భౌతికదూరం పాటిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అమరావతి నినాదాన్ని గొంతెత్తి చాటుతూనే ఉన్నారు. అమరావతి ఉద్యమానికి ప్రవాసాంధ్రులు కూడా సంపూర్ణ మద్దతు పలికారు. ప్రపంచంలో ఎక్కడా 3 రాజధానుల కాన్సెప్ట్ సక్సెస్ కాలేదనేది NRIల మాట‌.   తెలుగుదేశం హయాంలో 2014 సెప్టెంబర్‌ 1న కేబినెట్ తీర్మానం చేశారు. 2015 అక్టోబర్‌లో ప్రధాని చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన చేశారు. 29 గ్రామాల పరిధిలో 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నవ నగరాల నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. గ్రీన్‌ఫీల్డ్ సిటీకి ప్లాన్ సిద్ధమయ్యాక పనులు పరుగులు పెట్టాయి. ఒక్కో భవనం పైకి లేచింది. సింగపూర్ సంస్థలూ రంగంలోకి దిగాయి. వేల మంది కార్మికులు రేయింబవళ్లు పని చేస్తుంటే.. విద్యుత్ వెలుగుల్లో అమరపురి వెలిగిపోయింది.   కానీ ఇదంతా గ‌తం. ఇప్పుడు ఆ వెలుగులన్నీ ఆరిపోయాయి. YCP అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమరావతి భవిష్యత్ అగమ్య గోచరమైంది. నమ్మించి గొంతు కోశారు. అధికారంలోకి రాగానే విధ్వంసానికి తెర తీశారు. అమరావతి సాక్షిగా చేసిన చట్టాలనే రద్దు చేసి వికేంద్రీకరణ నినాదం ఎత్తుకున్నారు. 3 రాజధానుల ప్రతిపాదనకు విశాఖ, కర్నూలు వాసుల నుంచి పూర్తి మద్దతు లేకపోయినా బలవంతంగా దీన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయాలకు రంగుల పేరుతో చేసిన వృధా 2,600 కోట్లు పెడితే  అమరావతిలో పెండింగ్ నిర్మాణాలు కొలిక్కి వచ్చేవి. పాలన మరింత సమర్థంగా జరిగే వీలుండేది.  YCPసర్కారు 3 ముక్కలాటకు తెరతీసిన నాటి నుంచి 500 రోజులుగా రైతులు, రైతుకూలీలు, మహిళలు, దళితులకు కడుపు నిండా తిండిలేదు. కంటి నిండా నిద్రలేదు. రాజధానికి భూములిచ్చిన వారిలో 29 వేల 881 మంది ఉన్నారు. ఇందులో ఎకరం లోపు ఇచ్చిన చిన్నరైతులే 20 వేల మంది. వీరిలో బీసీలు, దళితులే ఎక్కువ. ఈ పేద రైతులంతా కన్నీళ్లు పెడుతున్నారు. తమను ఏడిపించి జగన్ సర్కారు ఏం సాధిస్తుందని ప్రశ్నిస్తున్నారు.   న్యాయమైన హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి అధికార పార్టీ మినహా అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. 13 జిల్లాల్లోనూ అమరావతికి మద్దతుగా దీక్షలు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో సహా లోకేష్, ఇతర రాజకీయ పార్టీలన్నీ రాజధాని రైతులకు బాసటగా నిలిచాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అధినాయకులు అమరావతి ప్రాంత రైతులను పరామర్శించి దీక్షకు మద్దతు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంత రైతుల కోసం జోలె పట్టుకుని బిక్షాటన చేశారు. ఆయన భార్య భువనేశ్వరి తన చేతి గాజులను విరాళంగా ప్రకటించడం వంటి ఘటనలు అమ‌రావ‌తి ఉద్య‌మంలో ముఖ్య ఘట్టాలు.  రాష్ట్రంలో మెజార్టీ ప్రజానీకం సందర్భం వచ్చిన ప్రతిసారీ అమరావతి వైపే నిలబడుతున్నా.. కుట్రలు, పోలీసు బలగాలతో ఉద్యమంపై జగన్‌ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. 29 గ్రామాల ప్రజలు చేసి తప్పేంటి..? ఆంధ్రులకు ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి ఉండాలని ఆకాంక్షించడం తప్పా? ల్యాండ్ పూలింగ్‌లో అడిగిన వెంటనే భూములు ఇవ్వడం నేరమా. దశల వారీగా రాజధాని నిర్మించుకోవడానికి ఇబ్బందేంటి.. వీటిలో ఏ ఒక్క ప్రశ్నకీ ఏ YCP నాయకుడి దగ్గరా సమాధానం ఉండదు. అందుకే, సీఎం జ‌గ‌న్ క‌నిపించినా, స్థానిక ఎమ్మెల్యే RK కనిపించినా.. ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఓటు వేసి గెలిపించినందుకు తమను ఎందుకు మోసం చేశారని క‌డుపుమంట‌తో ర‌గిలిపోతుంటారు రైతులు, మ‌హిళ‌లు.  రాజధానిపై సామాజిక వర్గం ముద్ర వేయడం.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేయడం.. ఖర్చు ఎక్కువంటూ ప్రచారం చేయడం.. ఇలా ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారు అధికార పార్టీ నేతలు. వీటన్నింటినీ తిప్పికొడుతూనే ఉద్యమాన్ని వినూత్న రీతుల్లో ముందుకు తీసుకెళ్లారు అమరావతివాసులు. మహిళలైతే ఉద్యమంలో మొదట్నుంచి కీలకమైన పాత్ర పోషించారు. ఈ మహిళా శక్తి దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. సాక్షాత్తూ ప్రధానే అమరావతికి శంకుస్థాపన చేశారు. చేయూత ఇస్తామన్నారు. చంద్రబాబు సారధ్యంలో మాస్టర్ ప్లాన్ మొత్తం సిద్ధమై నిర్మాణాలు చకచకా  మొదలయ్యాయి. ఓ పక్క ప్రభుత్వ కాంప్లెస్‌లు సిద్ధమవుతుంటే.. SRM, విట్ లాంటి ఎన్నో సంస్థలు తరలివచ్చాయి. విశ్వనగరానికి పునాదులు పడి వడివడిగా ముందుకు సాగుతున్న టైమ్‌లో.. అధికారమార్పిడితో మొత్తం తలకిందులైంది. అమరావతిని భ్రమరావతి అని నిరూపించాలనుకుని ప్రయత్నం చేసిన వారు.. వస్తూనే  విధ్వంసానికి తెరతీశారు. దీన్ని సరిదిద్దాలంటూ 500 రోజులుగా ఉద్యమం ఉవ్వెత్తున సాగుతూనే ఉంది. ప్రస్తుతం అమరావతిలో సాగుతున్న పోరాటం 29 గ్రామాలకు సంబంధించింది ఎంత మాత్రం కాదు. ఇది 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్‌. అందుకే.. అమరావతి నినాదం రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో తెలుగువారు ఉన్న ప్రతిచోటా మార్మోగుతోంది. కొవిడ్ కారణంగాను, కోర్టు తీర్పుల వల్లా ప్రస్తుతానికి రాజ‌ధాని తరలింపు ఆగింది. ఇది తాత్కాలికంగా ఆగడం కాదు శాశ్వతంగా అమరావతే రాజధాని అని ప్రకటించే వరకూ విశ్రమించేది లేదంటున్నారు అమ‌రావ‌తి ప్ర‌జ‌లు. అందుకే, 500 రోజులుగా ఉద్య‌మిస్తున్నారు. త‌మ పోరాటం ఇక్క‌డితో ఆగిపోదు.. ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా లక్ష్యం చేరుకునే వరకూ ఎత్తిన పిడికిలి దించేది లేదంటున్నారు. ఉద్యమమే ఊపిరైతే.. రేపటి తరాల బంగారు భవిష్యత్తే నీ లక్ష్యమైతే.. ఆ స్ఫూర్తిని ఆపేదెవరు. ఆ ఆశయానికి అడ్డు తగిలేదెవరు. నియంతల్లా మారిన పాలకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా సరే.. ఆ ఉక్కు సంకల్పం గెలిచే తీరుతుంది. ఈ తథాగతుడి సాక్షిగా.. ఆ గౌతమబుద్ధుడు బోధించిన అహింసా సిద్ధాంతమే ఆయుధంగా.. అమరావతి కోసం జరుగుతున్న పోరాటంలో అంతిమ విజయం ప్రజలదే అవుతుంది. ప్రజా ఉద్యమానికి ఎలాంటి పాలకులైనా తలవంచాల్సిందే. న్యాయం, ధర్మం గెలవాల్సిందే. అమరావతి పోరాటం విజయం సాధించాల్సిందే. ఇప్ప‌టికే రెండేళ్లుగా ఉద్య‌మిస్తున్నారు. మ‌రో మూడేళ్లైనా ఇలానే పోరాడే స‌త్తా, స‌త్తువ, సాహ‌సం ఉంది. అప్ప‌టికి మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయి. ఈసారి చంద్ర‌బాబు మ‌ళ్లీ అధికారంలోకి రాక‌పోతారా.. అమ‌రావ‌తి స్వ‌ప్నం సాకారం కాక‌పోతుందా.. అనే ఆశ‌తోనే, ప‌ట్టు వ‌ద‌ల‌ని సంక‌ల్పంతో పోరాడుతున్నారు అమ‌రావ‌తివాసులు. వారి ఆకాంక్ష త‌ప్ప‌క‌ నెర‌వేరాల‌ని కోరుకుంటూ.. జై అమరావతి.. జైజై అమరావతి.

కరోనా చికిత్సలు బంద్.. సీఎం జిల్లాలో ఘోరం

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. రోజురోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య కూడా ప్రమాదకరంగా ఉంటోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 86,035 కరోనా పరీక్షలు నిర్వహించగా 14,792 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 57 మంది కరోనాతో చనిపోయారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,831 కొత్త కేసులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో 1,829, గుంటూరు జిల్లాలో 1,760, తూర్పుగోదావరి జిల్లాలో 1,702, అనంతపురం జిల్లాలో 1,538 కేసులు వెల్లడయ్యాయి. విశాఖ, నెల్లూరు జిల్లాల్లోనూ వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల విజృంభణలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి. ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా హాస్పిటల్స్ లో కరోనా రోగులకు ఇచ్చేందుకు మందులు కూడా లేవని తెలుస్తోంది. బెడ్లు లేకపోవడంతో రోగులు హోం క్వారంటైన్ లోనే ఉంటున్నారు. పరిస్థితులు విషమించాకా హాస్పిటల్స్ కు వస్తున్నా.. సకాలంలో వైద్యం అందక చనిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సీఎం జగన్ రెడ్డి సొంత జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇప్పటికే హాస్పిటల్స్ లో బెడ్లు లేక రోగులు ఇబ్బందులు పడుతుండగా.. జగన్ సర్కార్ అధికారుల తీరుతో కరోనా బాధితులకు మరింత గండం వచ్చి పడింది. కడప నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా చికిత్సలు బంద్ అయ్యాయి. కడప ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్స్ యాజమాన్యం అందరూ కలిసికడప IMA హలులో సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులు నిబంధనల పేరుతో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని కేసులు పెట్టి జరిమాన వేసి వేధిస్తున్నారనే కారణంతో కోవిడ్ ట్రీట్మెంట్ బంద్ చేయాలని తీర్మానించుకున్నారు.  కడపలోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో  కోవిడ్ పెషేంట్ లను  జాయిన్ చేసుకోవడం లేదు.  తమ హాస్పిటల్స్ ముందు బోర్డులను పెట్టి   స్వచ్ఛందoగా మూత వేశారు యాజమాన్యాలు. దీంతో కడపలో కరోనా రోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. స్వయంగా డబ్బు పెట్టి. వైద్యం చేయించు కుందాం అన్నా బెడ్ దొరకని  పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు లేకపోవడం, ప్రైవేట్ హాస్పిటల్స్ మూ పడటంతో చికిత్స అందక నరకయాతన పడుతున్నారు.  జగన్ సర్కార్ అధికారుల తీరుతో కరోనా వస్తే కడపలో వైద్యం కరువైంది. కరోనా పెషేంట్ కడప దాటి పోతేనే వైద్యం దొరికే పరిస్థితి నెలకొంది. సీఎం సొంత గడ్డలోనే కరోనా రోగులకు చికిత్స అందని పరిస్థితులు రావడంపై జనాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.   

ఏపీలో ఎన్ని కొత్త కేసులో తెలుసా ? 

కరోనా కేసుల్లో తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఇటు తెలంగాణాలో అటు ఏపీలో శ్రీహరి కోట రాకెట్ లా దూసుకుపోతుంది  కరోనా. కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుంది. రెండు రాష్ట్రాల్లో కరోనా తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ఒకటి కాదు, రెండు కాదు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా భయంతో రెండు రాష్ట్రాల్లో ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.   గడచిన 24 గంటల్లో 86,035 కరోనా పరీక్షలు నిర్వహించగా 14,792 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,831 కొత్త కేసులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో 1,829, గుంటూరు జిల్లాలో 1,760, తూర్పుగోదావరి జిల్లాలో 1,702, అనంతపురం జిల్లాలో 1,538 కేసులు వెల్లడయ్యాయి. విశాఖ, నెల్లూరు జిల్లాల్లోనూ వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 8,188 మంది కరోనా నుంచి కోలుకోగా, 57 మంది మరణించారు. తాజా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,14,158కి పెరిగింది.

తిరుప‌తి ఎగ్జిట్ పోల్ స‌ర్వే..  గెలిచేది ఎవ‌రంటే! 

తిరుప‌తి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌. గెలిచేది ఎవ‌రు? నిలిచేది ఎవ‌రు? వైసీపీకి 5 ల‌క్ష‌ల మెజార్టీ వ‌స్తుందా? టీడీపీని గెలుపు వ‌రిస్తుందా? బీజేపీ-జ‌న‌సేన‌ను ఓట‌ర్లు ఆద‌రిస్తారా? ఇలా, తిరుప‌తి ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఎక్క‌డ‌లేని ఉత్కంఠ‌. ఎగ్జిట్ పోల్స్ స‌ర్వేలో పేరెన్నిక గ‌ల సంస్థ‌.. "ఆరా".. తిరుప‌తి పోస్ట్ పోల్ స‌ర్వే రిపోర్ట్ రిలీజ్ చేసింది. అందులో ఆస‌క్తిక‌ర రిజ‌ల్ట్స్‌.. గెలుపు, ఓట్ల శాతం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా వ‌చ్చింది. అందుకే, ఆరా పోస్ట్ పోల్ స‌ర్వేపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.  తిరుప‌తి బైపోల్‌ను మొద‌టి నుంచీ అన్ని పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. అధికార పార్టీ ఫిజియోథెర‌పిస్ట్ గురుమూర్తిని బ‌రిలో నిలిపింది. టీడీపీ.. సీనియ‌ర్ లీడ‌ర్‌, మాజీ ఎంపీ ప‌న‌బాక ల‌క్ష్మిని పోటీలో దించింది. ఇక అనూహ్యంగా జ‌న‌సేన‌ను ఒప్పించి తిరుప‌తి సీటును బీజేపీ ద‌క్కించుకొని.. రిటైర్డ్ ఐఏఎస్ ర‌త్న‌ప్ర‌భ‌ను రంగంలో నిలిపి అదృష్టం ప‌రీక్షించుకుంది. మూడు పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. తిరుప‌తి ఎన్నిక‌ను ఊద‌ర‌గొట్టాయి. ఫ‌లితాలూ అలానే అద‌ర‌గొడ‌తాయ‌ని ఆరా స‌ర్వే తేల్చింది. అధికార పార్టీ త‌ర‌ఫున మంత్రి పెద్దిరెడ్డి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. ప‌లువురు మంత్రులు ప్ర‌చారానికి తిరుప‌తి త‌ర‌లివ‌చ్చారు. బీజేపీ త‌ర‌ఫునా హేమాహేమీలు ప్ర‌చారం నిర్వ‌హించారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం తిరుప‌తిలో ప‌ర్య‌టించి బీజేపీకే ఓటు వేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇక‌, టీడీపీ ప్ర‌చారం ఓ రేంజ్‌లో సాగింది. మొద‌ట పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఎంట్రీ ఇచ్చి కేడ‌ర్‌లో జోష్ తీసుకొచ్చారు. ఆ త‌ర్వాత టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌చారంతో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. చంద్ర‌బాబు, లోకేశ్ నిర్వ‌హించిన ప్ర‌తీ రోడ్‌షోలు, ర్యాలీలు, ఇంటింటి ప్ర‌చారం, పాద‌యాత్ర‌లకు జ‌నం ప్రభంజ‌న‌మై క‌ద‌లివ‌చ్చారు. తిరుప‌తిలో టీడీపీ పూర్వ వైభ‌వం దిశ‌గా అడుగులు వేసింది. మ‌రి, ఆ ప్ర‌చార ప్ర‌భంజ‌నం.. ఫ‌లితాల్లో క‌నిపిస్తోందా?  తిరుప‌తి తెలుగుదేశం వ‌శం అవుతుందా? "ఆరా" స‌ర్వే ఏం చెబుతోంది? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.  ఇక‌, తిరుప‌తి పోలింగ్ హైటెన్ష‌న్ క్రియేట్ చేసింది. దొంగ ఓట్ల గొడ‌వ‌తో పోలింగ్ నాడు ర‌చ్చ ర‌చ్చ జ‌రిగింది. మంత్రులు, అధికార పార్టీ నేత‌లు.. ప‌క్క నియోజ‌క వ‌ర్గాల నుంచి మ‌నుషుల‌ను ర‌ప్పించి దొంగ ఓట్ల‌కు తెగ‌బ‌డ్డారు. వంద‌లాది బ‌స్సులు, వాహ‌నాల్లో తిరుప‌తి నిండా దొంగ ఓట‌ర్ల‌ను దింపేశారు. ఆల‌స్యంగా గుర్తించిన ప్ర‌తిప‌క్షాలు.. దొంగ ఓట‌ర్ల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. పోలీసులు అధికార పార్టీకే వ‌త్తాసు ప‌లికారు. తిరుప‌తిలో ప్ర‌జాస్వామ్యం అబాసుపాలు అయిందంటూ విప‌క్షం మండిప‌డింది. తిరుప‌తి ఉప ఎన్నిక‌ను ర‌ద్దు చేయాలంటూ పార్టీలు ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశాయి. బీజేపీ అభ్య‌ర్థి ర‌త్న‌ప్ర‌భ‌.. కోర్టును సైతం ఆశ్ర‌యించారు. ఇన్ని వివాదాల మ‌ధ్య తిరుప‌తి ఎన్నిక ముగిసింది. మ‌రి, ఈవీఎంలో భ‌ద్రంగా ఉన్న ఫ‌లితం ఎలా ఉండ‌బోతోంది?  తిరుప‌తిలో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడుతారు?  ఎవ‌రికి ఎంత శాతం ఓట్లు వ‌స్తాయి? అంటూ ఓటింగ్ త‌ర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  "ఆరా".. ఎన్నిక‌ల స‌ర్వేలు చేయ‌డంలో ఖ్యాతి గాంచిన సంస్థ‌. గ‌తంలో "ఆరా" చేసిన అనేక ఎగ్జిట్ పోల్స్ ప‌క్కాగా ఫ‌లితాల‌నిచ్చాయి. ఇప్పుడు తిరుప‌తి ఎన్నిక‌ల్లోనూ "ఆరా" స‌ర్వే నిజ‌మ‌వుతుందా? ఇంత‌కీ "ఆరా" స‌ర్వేలో ఏం తేలింది? అనేది ఆస‌క్తిక‌రం. అధికార పార్టీ చెబుతున్న‌ట్టుగానే.. వైసీపీకి అత్య‌ధిక శాతం సీట్లు వ‌స్తాయ‌ని "ఆరా" పోస్ట్ పోల్ స‌ర్వేలో తేలింది. వైఎస్సార్ కాంగ్రెస్‌.. ఏకంగా 65.85 శాతం ఓట్ల‌ను గంప గుత్త‌గా కొల్ల‌గొట్ట‌బోతోంది. వైసీపీ నేత‌లు ధీమాగా ఉన్న‌ట్టే.. ఆ పార్టీకి ల‌క్ష‌ల్లో మెజార్టీ వ‌స్తుందంటూ ఆరా స‌ర్వేలో తేలింది. దొంగ ఓట్ల ప్ర‌భావ‌మో.. లేక‌, అధికార పార్టీపై అభిమాన‌మో.. కార‌ణం ఏదైనా.. తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక‌ల్లో వైసీపీదే  విజ‌యమ‌నేది.. "ఆరా" రిపోర్ట్‌.  ఇక  ప్ర‌చారంతో ఊద‌ర‌గొట్టి.. ఉర్రూత‌లు ఊగించిన టీడీపీ.. 23.10 శాతం ఓట్ల‌తో రెండో స్థానానికి ప‌రిమితం కానుందని "ఆరా" స‌ర్వే చెబుతోంది. తిరుప‌తిలో త‌డాఖా చూపిస్తామంటూ స‌వాల్ చేసిన బీజేపీ-జ‌న‌సేన కూట‌మికి ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ అంతంత‌మాత్ర‌మేన‌ని తేలిపోయింది. "ఆరా" స‌ర్వేలో బీజేపీ అభ్య‌ర్థికి కేవ‌లం 7.34 శాతం ఓట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని తేలింది. ఇక ఇత‌రుల‌కు 3.71 శాతం ఓట్లు పోలైన‌ట్టు "ఆరా" పోస్ట్ పోల్ స‌ర్వే చెబుతోంది.   

నాగార్జున సాగర్ ఎగ్జిట్ పోల్.. సంచలన ఫలితం! 

తెలంగాణ రాజకీయాల్లో అత్యంక కీలకంగా మారిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం ఆసక్తిగా మారింది. ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకుని పోరాడటంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. పోలింగ్ కూడా రికార్డ్ స్థాయిలో నమోదైంది. నాగార్జున సాగర్ మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి ఏడుసార్లు గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సాగర్ లో టీఆర్ఎస్ జెండా ఎగిరింది. జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నోముల నర్సింహయ్య విజయం సాధించారు. అయితే గత డిసెంబర్ 1న అనారోగ్యంతో నర్సింహయ్య చనిపోయారు. దీంతో నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక జరిగింది. తెలంగాణలో ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో ఘోర ఫలితాలు చవిచూసిన కాంగ్రెస్ .. తమకు పట్టున్న నాగార్జున సాగర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జానారెడ్డిని మరోసారి బరిలోకి దింపింది. టీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే నర్సింహయ్య తనయుడు భగత్ పోటీ చేశారు. బీజేపీ మాత్రం జనరల్ సీటులో గిరిజన వ్యక్తిని బరిలోకి దింపి ప్రయోగం చేసింది. మూడు పార్టీలు తమ బలగాన్నంతా సాగర్ లోనే మోహరించి ప్రచారం చేశాయి. కరోనా వైరస్ భయపెడుతున్నా... అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. సీఎం కేసీఆర్ కూడా హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు . నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 2 లక్షల 20 వేలకు పైగా ఓటర్లు ఉండగా.. ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 88 శాతం పోలింగ్ జరిగింది. 2 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం పెరగడంతో అన్ని పార్టీలకు టెన్షన్ పట్టుకుంది. పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలం, ఎవరికి గండం అనే చర్చ సాగుతోంది. ప్రభుత్వానికి మద్దతుగానే పోలింగ్ శాతం పెరిగిందని అధికార పార్టీ ధీమాగా ఉండగా.. ప్రజా వ్యతిరేకత వల్లే ఓటర్లు కసిగా ఓటేశారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. బీజేపీ మాత్రం గెలుపు రేసులో ఉండకపోయినా గౌరవప్రదంగానే ఓట్లు సాధిస్తామని చెబుతోంది.  అయితే నాగార్జున సాగర్ పై ఆరా సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్ లో సంచలన ఫలితం కనిపిస్తోంది. ఎన్నికల్లో సర్వేల్లో ఆరా సంస్థకు మంచి పేరుంది. గతంలో ఈ సంస్థ ఇచ్చిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ దే విజయమని ఆరా సంస్థ సర్వేలో తేలింది. అయితే అందరు అనుకున్నట్లుగా కాకుండా కారు పార్టీకి సాగర్ లో భారీగానే ఓట్లు రానున్నాయి. టీఆర్ఎస్ కు 50.48 శాతం ఓట్లు వస్తాయని ఆరా సంస్థ అంచనా వేసింది. కాంగ్రెస్ కు 39.93 శాతం ఓట్లు రానున్నాయి. బీజేపీ కేవలం 6. 31 శాతం ఓట్లతో డిపాజిట్ కోల్పోనుందని ఆరా ఎగ్జిట్ పోల్ లో వెల్లడైంది. ఇతరులకు 3.28 శాతం ఓట్లు రానున్నాయి. ఆరా సంస్థ అంచనా ప్రకారం కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ కు దాదాపు 10 శాతం ఓట్లు ఎక్కువగా రానున్నాయి. అంటే దాదాపు 20 వేల ఓట్లతో నోముల భగత్ సాగర్ లో గెలవబోతున్నారని ఆరా సంస్థ సర్వేలో తేలింది. మూడు శాతం ఓట్లు అటు ఇటుగా వేసుకున్నా.. 15 వేల నుంచి 25 వేల తేడాతో నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ గెలవబోతోంది. 

బెంగాల్ లో మమతదే విజయం! 

దేశ వ్యాప్తంగా రాజకీయ మంటలు రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ గెలవబోతున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెంగాల్ లో హ్యాట్రిక్ విజయానికి తృణామూల్ కాంగ్రెస్ , పాగా వేసేందుకు బీజేపీ హోరాహోరీగా పోరాడాయి. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేపీ మధ్య యుద్దమే సాగింది. ఎనిమిది విడతలుగా జరిగిన పోలింగ్... గతంలో ఎప్పుడు లేనంతగా ఉద్రిక్తంగా సాగింది. ప్రతి దశలోనూ గొడవలు జరిగాయి. పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలు కూడా జరిగాయి. అన్ని దశల్లోనూ హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం కూడా భారీగా నమోదైంది. గురువారం చివరి దశ పోలింగ్ ముగియడంతో బెంగాల్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. పోలింగ్ సరళిని అంచనా వేసిన బీజేపీ .. బెంగాల్ లో పాగా వేస్తామని ధీమాలో ఉండగా... ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం మళ్లీ టీఎంసీదే అధికారమని తెలుస్తోంది. గ్రౌండ్ జీరో రీసెర్చ్ సంస్థ సర్వేలో మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని తేలింది. పశ్చిమ బెంగాల్ లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. పోటీలో ఉన్న అభ్యర్థులు చనిపోవడంతో 292 స్థానాలకే పోలింగ్ జరిగింది. అయితే 292లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఎంసీ 170 (ప్లస్ ఆర్ మైనస్ 16 ), బీజేపీకి 110 ( ప్లస్ ఆర్ మైనస్ 14). కాంగ్రెస్ కూటమికి 10 (ప్లస్ ఆర్ మైనస్ 4) సీట్లు వస్తాయని ఎగ్టిట్ పోల్ సర్వేలో తేలింది. టీఎంసీకి 157 నుంచి 185 సీట్లు, బీజేపీకి 96 నుంచి 125 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 8 నుంచి 14 సీట్లు వస్తాయని గ్రౌండ్ జీరో రీసెర్చ్ సర్వేలో వెల్లడైంది.  బెంగాల్ లో ప్రాంతాల వారీగా చూస్తే.. నార్త్ బెంగాల్ లో బీజేపీ హవా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం ఇక్కడ బీజేపీకి 26 నుంచి 32 సీట్లు రానుండగా.. టీఎంసీకి 18 నుంచి 25 సీట్లు రానున్నాయి. కాంగ్రెస్ కూటమికి కేవలం 3 నుంచి 4 సీట్లు నార్త్ బెంగాల్ లో రానున్నాయి. సెంట్రల్ బెంగాల్ లో టీఎంసీకి లీడ్ రాబోతోంది. ఇక్కడ టీఎంసీకి 38-45, బీజేపీకి 24-29, కాంగ్రెస్ కూటమికి 4-7 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. గ్రేటర్ కోల్ కతా రీజియన్ లో మాత్రం బీజేపీ పత్తా లేకుండా పోయింది. ఇక్కడ టీఎంసీకి ఏకపక్ష ఫలితాలు వస్తాయని గ్రౌండ్ జీరో రీసెర్చ్ ఎగ్జిట్ పోల్ చెబుతోంది. గ్రేటర్ కోల్ కతాలో టీఎంసీకి ఏకంగా 80 నుంచి 91 సీట్లు రానుండగా.. బీజేపీకి కేవలం 17 నుంచి 26 సీట్లకే పరిమితం కాబోతోంది.  ఇక బెంగాల్ పోలింగ్ కు తీవ్ర ఉద్రిక్తతలు స్పష్టించిన జంగల్ మహాల్, మిడ్నాపూర్ ఏరియాలో మాత్రం బీజేపీ సత్తా చాటనుందని తెలుస్తోంది. ఇక్కడ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది.  జంగల్ మహాల్, మిడ్నాపూర్ ఏరియాలో బీజేపీకి 31-37 అసెంబ్లీ సీట్లు గెలవనుండగా.. టీఎంసీ కేవలం 18-24 స్థానాలకే ఆగిపోనుందని సర్వే చెబుతోంది. మమతా బెనర్జీ పోటీ చేసిన నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం ఈ ఏరియాలోనే ఉంది. ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికార ఈసారి కూడా నందిగ్రామ్ ఏరియాలో తన పట్టు నిలుపుకున్నారని గ్రౌండ్ జీరో రీసెర్చ్ ఎగ్జిట్ పోల్స్ ను బట్టి అంచనా వేస్తున్నారు. దీంతో నందిగ్రామ్ లో మమతా బెనర్జీ పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా మారింది. నందిగ్రామ్ లో తాము తప్పకుండా గెలుస్తామని బీజేపీ ధీమాగా చెబుతోంది.  కుచ్ బీహార్ , అలిపూర్దూర్..జల్ పాయ్ గురి, డార్జిలింగ్ . దక్షిణ్ దినాజ్ పూర్ , మాల్దా, నదియా జిల్లాలో బీజేపీకి లీడ్ కనిపిస్తోంది. హుగ్లి, మిడ్నాపూర్,  పూరిలియా, బంకూరా జిల్లాలో హోరాహోరీ పోరు సాగినా.. కమలానికి ఆధిక్యత కనిపిస్తోంది. కోల్ కతాలో మాత్రం టీఎంసీ స్వీప్ చేసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. హౌరా జిల్లాలోనూ టీఎంసీ హవా ఉందని గ్రౌండ్ జీరో రీసెర్చ్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడిస్తోంది.

పరీక్షలపై పోరు.. కేఏ పాల్‌ దీక్ష

విద్యార్థుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని ప‌రీక్షలు వాయిదా వేయాలి. కరోనా విజృంభిస్తోన్న సమయంలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు పెట్టడం సరికాదు. అందుకే, ఎగ్జామ్స్ ర‌ద్దు కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ‌లో దీక్ష చేప‌ట్టారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని పాల్‌ స్పష్టం చేశారు.   ప‌రీక్షలు ర‌ద్దు చేయాలంటూ తాను వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టులో అడ్మిట్‌ చేశార‌ని చెప్పారు కేఏ పాల్‌. . శుక్ర‌వారం వాదనలు జరుగుతాయని.. 35 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగే వరకు త‌న‌ దీక్ష కొనసాగుతుందన్నారు. "నా పిల్లల్ని పరీక్షలకు పంపడం లేదు. పరీక్షలు రద్దు చేయమని, పాస్‌ చేయమని అడగట్లేదు. రెండు నెలలు వాయిదా వేయమని కోరుతున్నా. పరీక్షలు వాయిదా పడే వరకు దీక్ష కొనసాగిస్తా. నా దీక్ష దగ్గరకు ఎవరూ రావొద్దు’’ అని కేఏ పాల్‌ అన్నారు.   ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ వీరవిహారం చేస్తోంది. ఈ నేపథ్యంలో.. టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మే-05 నుంచి ఇంటర్ పరీక్షలు, జూన్ తొలి వారంలో ప‌ది ప‌రీక్ష‌లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల‌ను ఆన్‌లైన్ క్లాసెస్‌కు అందుబాటులో ఉండాల‌ని మంత్రి కోరారు. పాజిటివ్ వ‌చ్చిన విద్యార్థుల‌ను ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తించ‌బోమ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 

ముక్కులో నిమ్మరసం.. టీచర్ మృతి.. 

అతని పేరు బసవరాజ్.  వయసు 43 ఏళ్ళు. ఆయన ఓ  పతులు. పంతులు అంటే గుడిలో మంత్రాలు చదివే పంతులు కాదు. బడిలో పాఠాలు చెప్పే పంతులు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో  రకరకాల ఫేక్ న్యూస్ లు వస్తున్నాయి. కొబ్బరి నూనెతో కరోనా తగ్గుతుందని. నిమ్మ రసం ముక్కులో వేసుకుంటే కరోనా ధరకిరాదని. చేతిలో ఫోన్ ఉండి, అందులో డేటా ఉన్నోడు ప్రతి ఒక్కడు, సర్టిఫికెట్ లేకుండానే వైద్యుడు అయిపోతున్నారు. అవ్వని ప్రజా ఆరోగ్యం కోసం చేయడం లేదు. సమాజ ఉద్దరణ కోసం చేయడం లేదని. యూట్యూబ్ లో ఇచ్చే డబ్బుల కోసమో, లేక నాకు తెలివి ఉందని అందరు అనికోవాలని చేస్తున్నారని ఆ టీచర్ గ్రహించలేకపోయాడు. అందుకే ఆ ఫేక్ న్యూస్ లు నమ్మి తన ప్రాణాలు తీసుకున్నాడు ఆ బడి పంతులు.  రాయచూరు జిల్లాలో నివసించే బసవరాజ్ ముక్కులో  నిమ్మరసం పిండుకోవడం గురించి తెలుసుకుని, తాను కూడా అలాగే చేశాడు.నిమ్మరసం ముక్కులో పిండుకుంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు దరిచేరవని, తద్వారా కరోనా రాకుండా ఉంటుందని నమ్మాడు. కానీ విషాదకర రీతిలో ముక్కులో నిమ్మరసం పిండుకున్న తర్వాత బసవరాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చివరికి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో అతడి కుటుంబంలో విషాదం అలముకుంది.    దెబ్బ తగిలితే అదే చోట మందు రాయాలి. అది వాస్తవం కానీ దానివల్ల ఏదైనా ప్రమాదం ఉందొ లేదో తెలుసుకోకుండా.. తొందర పడి ఫేక్ న్యూస్  లు విని ప్రాణాల మీదికి తెచ్చుకోకండి.                                      

రెండు డోసులు తీసుకుంటే సేఫ్.. 

అది భూకంపం కంటే భయంకరమైనది. తుపాన్ కంటే ప్రమాదకరమైంది. టెర్రరిస్టుల చేతిలో ఉన్న బాంబ్ కంటే బలమైంది...అది ఏంటని అనుకుంటున్నారా..? అదే కరోనా మృతువు. కరోనా వస్తే కనికరం ఉండదు. బంధాలు, అనుబంధాలు, బంధువులుండవ్.. అన్నీ అనాధశవాలే.  ఒక రోజు కాదు. రెండు రోజులు కాదు. సరిగ్గా సంవత్సరం నుండి ప్రపంచదేశాలను వణికిస్తోంది. సినిమాలో దెయ్యం లా దేశాలను పట్టి పీడిస్తుంది. ఇప్పుడు ప్రపంచదేశాలు ఆ మహమ్మారికి మరణ ముహూర్తం పెట్టడానికి ట్రై చేస్తున్నారు. భారత దేశం లో కరోనా బ్రేక్ లేని ఆర్టీసీ బస్సు లా దూసుకుపోతుంది. నిర్లక్ష్యం తో వుంటే అంతే,  కరోనా ఒక్కసారి ఎటాక్ చేసిందంటే డైరెక్ట్ టికెట్ స్వర్గపురికే. కరోనా ముదిరాక తప్పకుండ బకెట్ తన్నాల్సిందే. అందుకే  దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్ ని రంగంలోకి దించింది.. కరోనాకు వ్యాక్సిన్ రూపం లో బ్రేక్ వేస్తుంది. దేశం లో ఉన్న ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండ వ్యాక్సిన్ వేసుకోవాలి.   అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఆసక్తికర వివరాలు వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టయితే, పాజిటివ్ వచ్చినా ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్రత ఉండదని సీడీసీ తెలిపింది. మరణం నుంచి తప్పించుకోవచ్చని తెలిపింది. 65 ఏళ్లకు పైబడిన వారు రెండు డోసులు తీసుకున్న అనంతరం, వారికి 94 శాతం రక్షణ ఉంటుందని చెప్పింది. ఒక డోసు తీసుకుంటే 64 శాతం రక్షణ కలుగుతుందని వెల్లడించింది. టీకా తీసుకున్న వారు కరోనా వైరస్ ను సాధారణ జలుబులాగానే ఎదుర్కొంటారని సీడీసీ వివరించింది.  ఈ అధ్యయనం కోసం సీడీసీ నిపుణులు అమెరికాలోని 417 మంది కరోనా రోగుల సమాచారాన్ని, 187 మంది వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల ఆరోగ్యపరిస్థితితో పోల్చి చూశారు. అమెరికాలో ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. సీడీసీ తాజా అధ్యయనంతో ఈ రెండు వ్యాక్సిన్ల సమర్థతపై మరింత సానుకూలత బలపడింది. దీనిపై సీడీసీ డైరెక్టర్ రోషెల్లే వాలెన్ స్కై స్పందిస్తూ.... వ్యాక్సినేషన్ వల్ల కరోనా రోగులు ఆసుపత్రుల పాలయ్యే ముప్పు తప్పుతుందని, తద్వారా ఆసుపత్రులు నిండిపోయే అవకాశం ఉండదని వివరించారు. ఈ నేపథ్యంలో, సాధ్యమైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అటు, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాలు కూడా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో అధ్యయనం చేపట్టాయి. ఇజ్రాయెల్ లో వృద్ధులకు వ్యాక్సిన్లు పూర్తి రక్షణ కల్పిస్తున్నాయని తేలింది. అటు, బ్రిటన్ లో కరోనా టీకా ఒక డోసు వేసుకున్నా 50 శాతం రక్షణ కలిగిస్తున్నట్టు గుర్తించారు.

సింగల్ డోస్ వ్యాక్సిన్ లాభాలు.. 

సింగల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కోవిడ్ వ్యాప్తి  సగానికి సగం తగ్గిందని అధ్యనం వెల్లడించింది. ఎవరైతే మొదటి డోస్ తీసుకున్నారో లేదా రెండవ డోస్ తీసుకున్నారో ఎన్ హెచ్ ఎస్ అధ్యనం చేసింది. కోవిడ్ సార్క్ వచ్చిన వారినీ పరిశీలించగా మూడు వారాల తరువాత 38% - 49%  వార్స్ వారిలో వచ్చిపోయిందని తేల్చారు. ఒక సింగల్ డోస్ ఆస్ట్రా జనికా లేదా ఫైజేర్ వ్యాక్సిన్  కోవిడ్ 19 తగ్గినట్లు కనుగొన్నారు . కరోనా వ్యాప్తి సగానికి సగం తగ్గిందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యాపించదని తేల్చారు. వ్యాక్సిన్ వేసిన14 రోజుల తరువాత అన్ని వయస్సుల వారు సంరక్షించ బడి నట్లు అధ్యనం వెల్లడి చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికుటుంబాలలో కోవిడ్ వ్యాప్తి5౦% తగ్గిస్తుందని వ్యాక్సిన్ మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళని సంరక్షిస్తుందని అని చెప్పడానికి ఇది సజీవ సాక్ష్యమని ఎన్ హెచ్ ఎస్ పేర్కొంది.ఈ మేరకు57౦౦౦ మంది పై ఒక ల్యాబ్ లో పరీక్షలు నిర్వ హించినట్లువివరించారు.దాదాపు ఒక మిలియన్ ప్రజలు కరోన వచ్చిన వారు వ్యాక్సిన్ తీసుకొని వారని తేల్చారు. వ్యాక్సిన్ కు ముందు5౦%6౦ % ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ నాలుగు వారాల తరు వాత వ్యాక్సిన్ తీసున్న తరు వాత సాధారణ స్థితి కి చేరుకున్నారని అంటే వ్యాక్సిన్ సహకరిస్తుందని ఆ అధ్యయనం వెల్లడించింది. వ్యాక్సిన్ వ్యాధి తీవ్రత తగ్గు తుందని ప్రతి రోజూ మరణాల సంఖ్య తగ్గు ముఖం పట్టిందని అధ్యయనం లో పేర్కొన్నారు. పి హెచ్ ఇ కి చెందిన ఇమ్యునైజేషన్ విభాజం హెడ్ డాక్టర్ మేరీ రంసేయ్ అన్నారు.వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యల పై ప్రభా వం చూపబోదని , అయితే ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోడంలో జాప్యం చేస్తే మీశరీరం లో కోత్హ వేరియంట్స్ వస్తాయని అన్నారు. కరోనా నుండి రక్షణ పొందాలంటే వ్యాక్సిన్ తప్పని సరి అని అధ్యనం వెల్లడిస్తోంది.                   

ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చిన కోవిడ్19 

కోవిడ్19 ప్యాండమిక్  సహజంగా ఉండే వాతావరణం పై తీవ్ర ప్రభావం చూపింది. జాతీయ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విధించిన  లాక్ డౌన్ కొందరికి అనుకూల మరికొందరికి ప్రతి కూల ప్రభావం చూపింది.కొన్ని సమస్యలకుప్రశ్నలకు జవాబులు దొరకవు. ఖగోళ్ళాన్ని, జయించిన మనం అంగారకుడి ఉనికిని కనిపెట్టి చంద్ర మండలంలో నివసించడానికి ఏర్పాట్లు చేసుకునే సామర్ధ్యాన్ని సైన్సును అభి వృద్ధి చేసుకున్నమనం ప్రకృతికి మాత్రం భయపడక తప్పని పరిస్థితి. మానవుడి ముందు ప్యాండమిక్ కు సంబందించిన వార్తలు కొంత వరకు వ్యతిరేకం కావచ్చు. అయినప్పటికీ కోవిడ్19 ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల ప్రజల ప్రాణాలను హరించింది. ఇంకా ఇప్పటికీ మానవుల కు మరిన్ని సవాళ్లు ఎదుర్కోక తప్పదని స్పష్ట మౌతోంది భవిష్యత్తు ప్రస్నార్ధకం అయ్యింది. జీవన శైలి మారింది మానవీయ సంబందాలు దూరం చేసాయిఆయా దేశాలలో ప్రజా ఆరోగ్యం పై తీవ్ర ప్రభ్హవం చూపింది. అసలు పరి ణామాన్ని అధ్యనం చేయడం మనవ తప్పిదం వల్ల చోటు చేసుకున్న ఈ పరిణామాల పై ఒక హెచ్చరిక చ్చేసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండవ విడత కోవిడ్ తీవ్రతను అంచనా వేయడం లో పూర్తిగా విఫల మయ్యా మని, రోజు రోజుకు కొమ్మి దేశాలలో మరణాల రేటు పెరగడాన్ని మరింత బాధని పాలకుల నిర్లక్ష్యాన్ని బాధ్యత రాహిత్యానికి సామాన్యులు బాలి అయ్యారనేది వాస్తవం వెళ్తున్న ప్రతి దారి కోవిడ్ మరణాల కెనా అన్నట్లుగా కనిపిస్తోంది.కోవిడ్ ప్యాండమిక్ లో ఉజ్జాయింపుగా 16 ట్రిలియన్ల అంటే జీడిపి లో 9౦% అని తేల్చారు.   ఇది కేవలం ఒక పేపర్ పై సంఖ్య మాత్రమే అంటే ప్రపంచ వ్యాప్తం గా అయాదేసాలు ఆర్ధికంగా దేబ్బతిన్నాయో. పోర్తిసమాచారం డేటా అనడంలేదు. అయితే ఆ నష్టంఎప్పటికి పూడ్చుకోగల మన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న?గతంలో లాగా ఇతర దేశాలతో పూర్తి స్నేహ సంబందాలు నేలకోల్పడం పేఅస్పర ఆర్ధిక సహకారం అందించుకోడం సాధ్యమా? అన్నది మరో ప్రశ్న ఇలా వాణిజ్యం, పరిశ్రమ పెట్టుబడులు. ఇలా అన్ని రంగాల పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఒక వాస్తవ విషయాన్ని చెప్పాలంటే సహజమైన ప్రకృతి కి కాస్త విరామం లభించినట్లయ్యింది. అందుకే కొన్ని సంవత్సరాల తరువాత కాలుష్య కోరల్లో కొట్టు మిట్టాడిన ప్రకృతి పరవసించిపోయింది.ఆ ప్రకృతి పై ఆధార పడే జీవజాలం పండగ చేసుకుంది. ఓజోన్ పోర మామూలు స్థాయికి వచ్చింది సమయానికి వర్షాలు కురిసాయి సముద్రాలు నదులలో నీరు స్వచ్చంగా మారింది మానవుడి ముఖ చిత్రాని ఆనీతిలో చాలా స్పష్టంగా కనపడింది అంటే ప్రకృతిని కాలుష్యపు కోరల్లో చిక్కుకుందో అంచనా వేయచ్చని శాస్త్రజ్ఞులు అంటున్నారు. మానవుడు ఎంతగా సంలేతికఅభివృధి సాధించినా. ప్రకృతి ఒడిలో సేదదీరే ప్రకృతి ప్రేమికులకు  ఇతర దేశాలలో ఉన్న అందాలను ఆస్వాదించాలన్న కోరిక ఉన్న ఒక ప్రాంతం నుంది మారో ప్రాంతానికి వెళ్ళడం వల్ల కొంత పరిసోదించే అవకాశం కోవిడ్19 లేకుండా చేసిందని.వాటికి బ్రేక్ వేయక తప్పని స్థితి ఏది ఏమైనా కోవిడ్19 ప్రకృతికి కొంచం ఉపసమనం. ప్రకృతి పై ఆధారపడ్డ సహజ జంతు సంపద లాభం పొందింది అనేది నిజం.రెండవ విడత మూడవ విడత కోవిడ్ ప్రభావం తీవ్రత ఇంకా ప్రపంచ ముఖ చిత్రం ఎలా ఉంటుందో అంచనా వేయడం ఆసాధ్యం అని అంటున్నారు శాస్త్రజ్ఞులు.                                                          

టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి.. 

అది కృష్ణా జిల్లా. ఆయన పేరు కాగితపు వెంకట్రావ్. పెడన మాజీ ఎమ్మెల్యే. బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన నాయకుడు. ఆయన మరణం టీడీపీ ఒక లోటు.. మొన్నటికి మొన్న వెస్ట్ గోదావరి జిల్లా యువజన నాయకుడు మరణించాడు. అది మారిపోక ముందే కాగిత వెంకట్రావు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. గత కొన్నిరోజులుగా కాగిత వెంకట్రావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మచిలీపట్నంలో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుకు గురయ్యారు. కాగిత వెంకట్రావు స్వగ్రామం నాగేశ్వరరావు పేట. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ రాజకీయ వారసత్వం అందుకోగా, కుమార్తె వైద్య నిపుణురాలు. కాగిత వెంకట్రావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగితపు వెంకట్రావ్ బీసీల  అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని. వెంకట్రావు మరణం పార్టీకి తీరని లోటు అని, ఆయన కుటుంబ సభ్యులకు తమ  ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని  చంద్రబాబు అన్నారు. లోకేశ్ స్పందిస్తూ.... కాగిత వెంకట్రావు టీటీడీ మాజీ చైర్మన్ గానూ విశేష సేవలందించారని, తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలా నిలిచారని కొనియాడారు. వెనుకబడిన తరగతులకు చెందిన నేతగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చిరస్మరణీయం అని కీర్తించారు. కాగితపు వెంకట్రామ్ మృతి పట్ల కృష్ణ జిల్లా నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. 

రంగంలోకి ఆర్మీ.. మోదీ రివ్యూ..

ఇండియ‌న్ ఆర్మీ. స‌రిహ‌ద్దుల్లో చెల‌రేగే సోల్జ‌ర్స్‌. వారికి దేశ భ‌ద్ర‌త ఎంత ముఖ్య‌మో.. దేశంలోని ప్ర‌జ‌ల‌ భ‌ద్రతకూ అంతే ప్రాముఖ్యం ఇస్తారు. అందుకే, ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోల ప‌రిస్థితుల్లో మేముసైత‌మంటూ ప్ర‌జాసేవ‌కు సిద్ధంగా ఉన్నారు. గ‌తంలో తుఫానులు, వ‌ర‌ద‌లు, భూకంపాల స‌మ‌యంలో సైన్యం త‌మ వంతు సాయం చేసింది. ఇప్పుడు వైర‌స్ విప‌త్తులోనూ రోగుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌స్తోంది.  కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో ప్రజలకు సేవలందించడానికి సైన్యం సన్నద్ధతను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ పరిస్థితుల్లో సైన్యం చేపడుతున్న చర్యలను పరిశీలించారు. కొవిడ్ రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరత దేశాన్ని వేధిస్తున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనేతో మోదీ సమావేశమయ్యారు.  కొవిడ్ మేనేజ్‌మెంట్‌లో సైన్యం చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై చర్చించారు. సైన్యంలోని వైద్య సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉంచినట్లు జనరల్ నరవనే తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక ఆసుపత్రులను సైన్యం నిర్మిస్తోందని చెప్పారు. సాధ్యమైన చోట ప్రజల కోసం ఆసుపత్రులను నిర్మించేందుకు సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. సమీపంలోని సైనిక ఆసుపత్రులను సందర్శించి, వైద్య సేవలు పొందాలని ప్రజలను కోరారు. దిగుమతి చేసుకున్న ఆక్సిజ‌న్‌ ట్యాంకర్ల కోసం అవసరమైన సిబ్బందిని పంపించినట్లు తెలిపారు. వాటిని నిర్వహించేందుకు ప్రత్యేక నైపుణ్యం ఉన్న‌ వారిని కేటాయిస్తున్న‌ట్టు ప్ర‌ధాని మోదీతో చెప్పారు ఆర్మీ చీఫ్‌. అవ‌స‌ర‌మైతే ఎలాంటి సేవ‌కైనా సైన్యం అన్ని వేళ‌లా సిద్ధంగా ఉంద‌న్నారు.

షాకింగ్.. మే1 నుంచి వ్యాక్సినేషన్ లేదు! 

కొవిడ్ టీకా కోసం ఎదురు చూస్తున్నారా? కొవిన్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? అయినా మీకు టీకా ఇప్పట్లో అందదు. కొవిడ్ టీకాల కొరతే ఇందుకు కారణం. దేశంలో అవసరానికి సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో మే1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్ అమలుపై రాష్ట్రాలు చేతులెత్తేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా మే నెల 1వ తేదీ నుంచి తెలంగాణలో 18-44 వయసు వారికి  కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వలేమని  వైద్య మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్ర జనాభా అవసరాలకు సుమారు మూడున్నర కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమని, దానిపై స్పష్టత లేకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేయలేమన్నారు. కేంద్రం నుంచి ఎంత కోటా వస్తుందో కూడా అంచనా లేదన్నారు. అక్కడి నుంచి అందే వ్యాక్సిన్ డోసులకు అనుగుణంగా తెలంగాణలో అమలు ఆధారపడి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా మే1  నుంచి 18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడం లేదని ప్రకటించింది.  రాష్ట్రాలకు సహకారం అందించాల్సిన బాధ్యతను తుంగలో తొక్కి పెత్తనం చేయడం, నియంత్రించడంపైనే దృష్టి పెట్టిందన్నారు. కరోనా కట్టడిలో రాష్ట్రాలకు కేంద్రం నుంచి పెద్దగా ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రాల విజ్ఞప్తులకు కేంద్రం నుంచి ఆశించిన స్పందన రావడంలేదన్నారు.కరోనా సెకండ్ వేవ్‌ను అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రాలను అప్రమత్తం చేయలేదని ఆరోపించారు. దానికి నిదర్శనమే ఎన్నికలు, కుంభమేళా లాంటి నిర్వహణ అని ఉదహరించారు. సచివాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.తీవ్రతను అంచనా వేయడంలో కేంద్రం విఫలమైనందువల్లనే ఆక్సిజన్, రెమిడెసివిర్, వ్యాక్సిన్ తదితరాలకు కొరత ఏర్పడిందని వ్యాఖ్యానించారు. మూడు వేల రూపాయలకు అమ్మాల్సిన రెమిడెసివిర్ ఇప్పుడు మార్కెట్‌లో రూ. 30 వేలకు అమ్మే పరిస్థితిని చూస్తున్నామని, ఎక్కువ ధరకు అమ్మేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. ముందుగానే సెకండ్ వేవ్ తీవ్రతను, దాని ప్రభావాన్ని అంచనా వేసి రాష్ట్రాలను అప్రమత్తం చేసి ఉంటే ఇప్పుడున్న పరిస్థితిని చూసేవారం కాదని, తగిన జాగ్రత్తలు తీసుకోడానికి దోహదపడి ఉండేదన్నారు. రాష్ట్రాలకు ’ఫ్రీ హాండ్’ ఇవ్వకుండా కేంద్రం అన్నింటినీ తన ఆధీనంలో పెట్టుకుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆక్సిజన్ కొరత ఏర్పడిందని, ప్రాణవాయువు అందని కారణంగా వందలాది మంది చనిపోతున్నారని గుర్తుచేశారు. వ్యాక్సిన్ కోసం భారత్ బయోటెక్, రెడ్డీస్ లాబ్ సంస్థల ప్రతినిధులతో ప్రధాన కార్యదర్శి చర్చలు జరిపారని ఈటల చెప్పారు. 

ఆక్సిజ‌న్ లేక చ‌నిపోవ‌డం అవ‌మాన‌క‌రం! 

కొవిడ్ వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరా, రెమ్‌డెసివివ‌ర్ మందుల కేటాయింపులో కేంద్ర  ప్రభుత్వానికి సరైన ప్రణాళికే లేదన్నారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్. కేంద్రంతో పాటు తెలంగాణ‌ బీజేపీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. బీజేపీ నేత‌లు బాధ్య‌తారాహిత్యంగా మాట్లాడుతున్నారని,  అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ట్రాలపై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో ప‌రిశీలించి మాట్లాడితే బాగుంటుందని బీజేపీ నేతలకు సూచించారు రాజేందర్.  తెలంగాణ‌లో 4 రాష్ట్రాలకు  చెందిన రోగుల‌కు చికిత్స అందిస్తున్నామ‌ని ఈటల తెలిపారు. క‌రోనా క‌ట్ట‌డిలో దేశంలోనే స‌మ‌ర్థంగా వ్య‌వ‌హ‌రిస్తున్న రాష్ర్టం తెలంగాణ అని స్ప‌ష్టం చేశారు. సాయం చేసే స్థితి నుంచి చిన్న దేశాల సాయం పొందే ప‌రిస్థితి భార‌త్‌కు వ‌చ్చింద‌ని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. క‌రోనా రోగులు స‌రిపడా ఆక్సిజ‌న్ లేక చ‌నిపోవ‌డం దేశానికి అవ‌మాన‌క‌రం అని మంత్రి ఈట‌ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు విశ్వాసం కోల్పోయే అవ‌కాశం ఉంటుందన్నారు. అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్‌ను కేంద్రం యుద్ధ ప్ర‌తిపాదిక‌న స‌ర‌ఫ‌రా చేయాల‌న్నారు. తెలంగాణ‌కు 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజ‌న్ కావాల‌ని కోరితే.. కేవలం 306 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను మాత్ర‌మే కేటాయించిందని చెప్పారు.  ద‌గ్గ‌ర ప్రాంతాల నుంచి ఆక్సిజ‌న్ ఇవ్వాల‌ని కోరిన‌ప్ప‌టికీ వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ప్రాంతాల నుంచి ఆక్సిజ‌న్ ను కేటాయించడం ఏంటని ఈటల ప్రశ్నించారు.  కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని మంత్రి ఈట‌ల డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ డోసుల ఉత్ప‌త్తి యుద్ధ ప్రతిపాదిక‌న పెర‌గాలన్నారు.వ్యాక్సిన్ లేక‌పోతే గంద‌రగోళ‌మ‌వుతుంద‌ని అధికారులు చెప్తున్నారు. రాష్ర్టంలో 18-44 ఏండ్ల మ‌ధ్య వారికి 3.5 కోట్ల టీకాలు కావాలి. రెండు కంపెనీల ఉత్ప‌త్తి 6 కోట్లే అంటున్నారు. వ్యాక్సిన్ విష‌యంలో కేంద్రం స్ప‌ష్ట‌మైన‌ ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించాలి అని ఈట‌ల డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు తప్ప‌ుబ‌డుతున్న కేంద్రం ఏం చేసిందని ఈటల ప్రశ్నించారు. రెమ్‌డెసివివ‌ర్ త‌క్కువ‌కు త‌యారు చేసి ఎక్కువ‌కు అమ్ముతున్నా కేంద్రం నియంత్రించడం లేదన్నారు. ఔష‌ధాలు బ్లాక్ మార్కెట్‌కు పోకుండా చూడాల‌న్నారు. క‌రోనా టెస్టింగ్ కిట్ల ధ‌ర‌లు కూడా పెంచారని, కేంద్రానికి అన్నింటిపైనా నియంత్ర‌ణ ఉండాలన్నారు.  మూడున్నర కోట్ల టీకాలు 3 నెల‌ల్లో ఇవ్వాల‌ని అనుకుంటున్నాం.. దిగుమ‌తి చేసుకునేందుకు కేంద్రం అనుమ‌తి ఇస్తుందా? అని ఈటల అడిగారు. జాతీయ విప‌త్తు స‌మ‌యంలో కేంద్రం అన్నింటినీ నియంత్ర‌ణ చేయ‌లేదా? అని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

హైదరాబాద్ లో ఫైరింగ్.. ఇద్దరికి సీరియస్ 

హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. కూకట్ పల్లిలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కూకట్ పల్లి హెచ్ డీఎఫ్ సీ ఏటీఎం వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా కాల్పులు జరిగాయి. సెక్యూరిటీ గార్డుతో పాటు ఏటీఎంలో డబ్బులు పెడుతున్న ఉద్యోగి టార్గెట్ గా కాల్పులు జరిపారు దుండుగులు. సెక్యూరిటీ గార్డుతో పాటు ఉద్యోగి తీవ్రంగా గాయపడి అక్కడే పడిపోయారు. దీంతో ఏటీఎంలో పెట్టేందుకు తీసుకొచ్చిన నగదు తీసుకుని దుండగులు పరారయ్యారు. కూకట్ పల్లిలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనాస్థిలికి చేరుకున్న పోలీసులు.. కాల్పుల్లో గాయపడిన ఇద్దరిని హాస్పిటల్ కు తరలించారు. డబ్బులతో పరారైన దుండగుల కోసం గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.